AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 4 సౌందర్యం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 4th Lesson సౌందర్యం Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 4th Lesson సౌందర్యం

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
రేఖ పాత్ర ఆలోచనా విధానాన్ని విశ్లేషించండి.
జవాబు:
రేఖ అందమైన స్త్రీ, నాజూకుగా ఉంటుంది. తెల్లగా సన్నగా ఉండే రేఖ భర్త సుందర్రావు నల్లగా, బట్టతల. రేఖ బడి పంతులు కూతురు. ఒక్కతే కూతురు. పదవ తరగతి పాసయ్యింది. తనకు ఇద్దరు అన్నయ్యలు. వారి కోసం సుందరం వస్తూ ఉండేవాడు దూరపు బంధువు. తండ్రి రేఖ వివాహాన్ని ప్రస్తావిస్తూ సుందరాన్ని ఇచ్చి పెళ్ళి చేద్దామన్నప్పుడు రేఖ ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు.

వివాహాన్ని గురించి ప్రత్యేకమైన ఆలోచనలు లేవు కలలు గనడాలు లేవు. సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం. రేఖ పెళ్ళి అయి పది సంవత్సరాలు అయింది. వారికి ఐదేళ్ళ కొడుకు ఉన్నాడు. అమ్మమ్మగారింట్లో ఉన్నాడు. కొడుకును పబ్లిక్ స్కూల్లో చేర్పించాలనుకొని రేఖ పుట్టింటికి బయలుదేరుతుంది. ముందు సమయం, లేదన్న సుందర్రావు ఆఖరి నిముషంలో బయలుదేరాడు.

బస్సులో రేఖ కిటికీ ప్రక్కన కూర్చొని ఉంది అది ముగ్గురు కూర్చొనే సీటు. . , ప్రక్కనే భర్త సుందర్రావు మూడవ వ్యక్తి చంద్రం వస్తాడు. కాస్త సర్దుకొని కూర్చుంటారు , భార్యా భర్తలు. బస్సు బయలదేరగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు సుందర్రావు. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్న సుందర్రావును రేఖ విసుగ్గా చూస్తుంది.

బస్సులో వాళ్ళందరూ ముఖ్యంగా ప్రక్కనే ఉన్న అబ్బాయి ఏమనుకుంటున్నాడోనని ఇబ్బంది పడింది రేఖ. ముందు సీటులో ఐదేళ్ళ పిల్లవాడు సుందరాన్ని చూస్తూ నిలుచున్నాడు. జూలో జంతువును చూసినట్లు చూస్తున్నాడని భావించింది. కాసేపటికి సుందర్రావు తల చంద్రానికి తగలగానే ‘సారీ’ అంటూ సర్దుకున్నాడు సుందర్రావు.

చంద్రం చిరునవ్వుతో రేఖ మొహంలోకి చూసాడు. రేఖ భర్తను కిటికీ ప్రక్కన కూర్చొమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు తన భర్త ప్రక్కనున్న చంద్రం అని అనుకుంటారని అనుకున్నది. ఆ ఆలోచనే తప్పుగా అనిపించింది అంతలోనే రేఖకు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 4 సౌందర్యం

నార్కేటుపల్లిలో అరటి పళ్ళు కొన్నాడు సుందర్రావు. రేఖను తింటావా అని అడిగాడు. వద్దంది రేఖ. సూర్యాపేటలో కాఫీ, ఇడ్లీ తెచ్చిన భర్తను విసుక్కుంది రేఖ. బస్సులో ముందు సీటులో ఒకామె భర్తను కాఫీ, ఒక తలనొప్పి మాత్ర తెమ్మంటుంది. ఆమె భర్త క్రూరంగా నవ్వి నీకోసం కాఫీలు మోసుకొని రమ్మంటావా? ఇంకొక రెండు గంటల్లో ఇంటికెళ్ళి త్రాగవచ్చని అంటాడు. రేఖ భర్త తెచ్చిన కాఫీ, టిఫిన్ నిరాకరిస్తుంది.

ముందు సీట్లో ఆమె నీవు చాల అదృష్టవంతురాలివి అని ప్రేమించే భర్త దొరకటం నీ భాగ్యం అని అంటుంది. రేఖ. తన భర్తను చూస్తుంది. చిన్నబుచ్చుకున్న ముఖంతో అమాయకంగా కనబడతాడు. తనకోసం బిడ్డకోసం ఎంత కష్టపడతాడు, ఎవరి కోసం అంత కష్టం అని ఆలోచిస్తుంది. ఏనాడూ తనను నొప్పించేలా ప్రవర్తించలేదని అమృత హృదయుడు, అమాయకుడు తన భర్త అని అర్ధం చేసుకొంటుంది.

హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం చాల వికృతంగా ఉంటుందని పించింది రేఖకు. దగ్గరగా వస్తున్న సుందర్రావును చూస్తే జాలి వేసింది. ఒక సోడా, పల్లీలు తెమ్మని భర్తతో చెప్పింది. బస్సు బయలుదేరింది. సుందర్రావు మళ్ళీ గురక పెడుతున్నా ఇప్పుడు రేఖకు అంత సిగ్గుగా అనిపించలేదు. కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.

ప్రశ్న 2.
‘సౌందర్యం’ కథ ద్వారా మనుషుల స్వభావాలను విశ్లేషించండి.
జవాబు:
బస్సులో పుట్టింటికి ప్రయాణమౌతుంది రేఖ భర్తతో సహ, ‘తన ఐదేళ్ళ కొడుకుని తీసుకొద్దామని బస్సులో ముగ్గురు కూర్చొనే సీటులో రేఖ తన భర్త సుందర్రావు ఉండగా చంద్రం అనే వ్యక్తి ఆ సీటులోకి వస్తాడు. సుందర్రావు రేఖ సర్దుకుంటారు. చంద్రం కూర్చుంటాడు. బస్సు బయలుదేరగానే నిద్రలోకి జారుకుంటాడు సుందర్రావు.

నిద్రపట్టగానే తెలియకుండానే గురక పెడతాడు. బస్సులో అది అందరికి ఇబ్బందిగా ఉంటుందేమోనని రేఖ సిగ్గు పడుతుంది. బస్సు ఎక్కగానే ఈ నిద్ర ఏమిటి ? అంటుంది. ప్రక్కనే ఉన్న చంద్రాన్ని చూసి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడో నని ఆలోచిస్తుంది. ఇది సాధారణంగా అందరిలో ఉండే సహజగుణమే. తమను చూసి ఎదుటివారు ఏమనుకుంటారోనని మన సహజత్వాన్ని దాచిపెట్టి కృత్రిమ స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. ‘చాల మందిలో ఈ రకమైన స్వభావమే ఉంటుంది.

ఈ కథలో రేఖ తన భర్తని చూసి చంద్రం ఏమనుకుంటాడోనని ఆలోచిస్తుంది. అలాగే భర్తను కిటికీ వైపు కూర్చోమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు ఎవరైనా చూసినా ప్రక్కనున్న చంద్రం భార్య అనుకుంటారని తృప్తిపడుతుంది. దీనిని బట్టి భర్త అందంగా లేడని బాధ పడే మనుషులు ఈ సమాజంలో ఉన్నారని రచయిత్రి అభిప్రాయం.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 4 సౌందర్యం

పెళ్ళి సమయానికి సుందర్రావుకు బట్టతల లేదు. తర్వాత సంపాదన కోసం ఎండనక వాననక కష్టపడి నల్లగా లావుగా. బట్టతలతో మార్పులు వస్తాయి. ఆ మార్పుని కూడా అంగీకరించలేని మనుషులు చాలా మంది ఉంటారని ఈ కథ ద్వారా అర్థం అవుతుంది.

బస్సులో నిద్రపోయే సుందర్రావును విసుక్కుంటుంది రేఖ. గురక పెట్టే వ్యక్తిని’ సహించలేకపోతుంది. బయటకు వచ్చినప్పుడు ఇలా తన మానసిక భావాలతో సంఘర్షణ పడుతుంది. బస్సులో అరటి పళ్ళు తినడం పాన్ వేసుకోవడాన్ని ఇష్టపడదు. అది ఒక అనాగరికుల అలవాటు అనుకునే వారు ఉంటారు.

ఎవరికి నచ్చినట్లు వారు తినడం కూడ నచ్చదు. అరటి పళ్ళన్నీ తిన్న సుందర్రావును చూసిన రేఖ అసహ్యించుకుంటుంది. నిద్రపోతూ గురక పెట్టిన భర్త ఎలుగు బంటిలా కనబడతాడు. ముందు సీట్లో చిన్న పిల్లవాడు సుందర్రావును చూసినప్పుడు జూలో జంతువులను చూసిన కొడుకును గుర్తుచేసుకుంటుంది. రేఖ అవస్తను గ్రహిస్తూ ఉంటాడు చంద్రం.

బస్సులో ముందు సీటులో భార్య భర్త 5 ఏళ్ళ ఒక పిల్లవాడు కూర్చుంటారు. ఆ భర్త అందంగానే ఉన్నాడు. భార్య ఓ మోస్తరుగా ఉంటుంది. ఆమెను బస్సు ఎక్కినప్పటి నుండి సతాయిస్తూనే ఉంటాడు. ఆమె తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఒక యాస్ప్రిన్ మాత్ర తెమ్మంటే క్రూరంగా నవ్వి నీకు కాఫీలు మోయాలా ? ఇంటికెళ్ళాక తాగవచ్చులే అని అంటాడు. ఇదంతా గమనిస్తూ ఉంటుంది రేఖ.

రేఖ భర్త కాఫీ, టిఫెన్ తెచి తినమని ప్రాధేయపడితే విసుక్కుంటుంది. అప్పుడు ముందు సీటులో ఉన్న ఆమె రేఖను చూసి నీవు చాలా అదృష్టవంతురాలవి. “తినమని చెప్పే భర్తలు ఎంతమండి . దొరుకుతారు ? భార్యను ప్రేమగా చూసే భర్త దొరకడం నీ అదృష్టం అని అంటుంది. దూరంగా చిన్న బుచ్చుకున్న మొహంతో వస్తున్న సుందర్రావుని చూసి జాలి పడుతుంది, తన భర్త ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు.

అమృత హృదయుడు అమాయకుడు ఇటువంటి భర్తను అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపపడుతుంది రేఖ. హృదయ. సౌందర్యం లేని బాహ్య సౌందర్యం వికృతంగా అనిపించింది రేఖకు. భార్య ప్రశాంతంగా ఉండటం చూసి సంతోషించాడు సుందర్రావు. ఇప్పుడు సుందర్రావు గురక అసహ్య మనిపించలేదు రేఖకు.

దీనిని బట్టి బట్టతల నల్లగా ఉన్న వ్యక్తి పది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా భర్త అందంగా లేడని బస్సులో నిద్రపోతాడని ఆ నిద్రలో గురక పెడుతుండడం వల్ల చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అని ఆలోచించే వాళ్ళు చాల మందే ఉంటారు.

రచయిది పరిచయం

1. ‘సౌందర్యం’ పాఠ్యభాగ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి.

2. ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో 15-12-1933వ తేదీన జన్మించారు. రంగనాయకమ్మ, రాఘవయ్య వీరి తల్లిదండ్రులు.

3. వాసిరెడ్డి సీతాదేవి 100కి పైగా కథలు. 40 వరకు నవలలు రచించారు. ‘సాంబయ్య పెళ్ళి’ వీరి తొలి కథ ‘జీవితమంటే’ తొలి నవల.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 4 సౌందర్యం

4. ఆధునిక తెలుగు కథను నవలను ఒక మెట్టు పైకెక్కించిన రచయిత్రి సీతాదేవి. ఈమె ‘ రచనలన్నీ ప్రధానంగా స్త్రీ జీవితం చుట్టు తిరుగుతాయి.

5. స్త్రీల పురోగమనాన్ని, చైతన్యాన్ని, విముక్తిని ఆశిస్తాయి. వీరి రచనా పాటవాన్ని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం 1996లో విశిష్ట పురస్కారాన్ని ప్రధానం చేసింది.

6. ఇటువంటి గౌరవాన్ని పొందిన సీతాదేవి ప్రప్రథమ రచయితగా చరిత్ర కెక్కారు.

7. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 5 సార్లు పొందిన రచయిత్రిగా ఖ్యాతికెక్కారు.

8. కల్పనా సాహిత్యంపై తనదైన ముద్రవేసి 13-4-2004లో జీవితాన్ని చాలించారు.

9. ప్రస్తుత పాఠ్యభాగం ‘సౌందర్యం’ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం – 3 కథల సంపుటి నుండి గ్రహించబడింది.

పాత్రల పరిచయం

1. చంద్రం :
అందమైన యువకుడు. బస్సులో తన ప్రక్కనే కూర్చున్న సుందర్రావు, రేఖలతో పరిచయమౌతుంది. రేఖ తన భర్త తీరును గూర్చి ఆలోచిస్తున్న విధానానికి జాలిపడతాడు చంద్రం.

2. సుందర్రావు :
రేఖ భర్త అహర్నిశలు కష్టపడి సంపాదిస్తాడు. వివాహమైన పదేళ్ళకే బట్టతల వచ్చేస్తుంది. నల్లగా లావుగా ఉంటాడు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో నిద్రపోయే అలవాటు ఉంటుంది. నిద్ర పట్టగానే గురక పెడతాడు. ప్రక్కనున్న వారికి ఇబ్బంది అనే విషయాన్ని తెలిసినా తన అలవాటును మార్చుకోలేనివాడు. మనిషి మంచివాడే కాని గురక అతని బలహీనత. భార్య అంటే ప్రాణం.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 4 సౌందర్యం

3. రేఖ :
సుందర్రావు భార్య. పెళ్ళికి ప్రత్యేకమైన ఆలోచనలు లేని సహజమైన స్త్రీ. తండ్రి ఇష్టప్రకారం సుందర్రావును పెళ్ళి చేసుకుంటుంది. పదవ తరగతి వరకు చదువుకున్నది. కొడుకుని పబ్లిక్ స్కూల్లో జేర్పించాలనుకుంటారు రేఖ సుందర్రావులు. రేఖ కొడుకు ఐదేళ్ళ వాడు అమ్మమ్మగారింట్లో ఉంటాడు. ఆ పిల్ల వాడిని చూడటానికి బయలుదేరు తుంది రేఖ. ఆఖరి నిముషంలో భర్త కూడ వస్తాడు.

బస్సులో భర్త గురక ఆమెకు చిన్నతనంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రక్కనే అందమైన యువకుని చూసి తన భర్తను తక్కువగా ఆలోచిస్తుంది. ప్రేమగా భర్త టిఫెను, కాఫీ తెచ్చినా తిరస్కరిస్తుంది. బస్సులో ముందు సీట్లో ఉన్న స్త్రీని చూసి జాలిపడుతుంది. ఆమె రేఖను అదృష్టవంతురాలని అన్నప్పుడు రేఖ పశ్చాత్తాపపడుతుంది.

హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం వికృతం అని తలుస్తుంది. హృదయ సౌందర్యం గల సుందర్రావును అర్ధం చేసుకుంటుంది. భర్త మొహంలో అమాయకత్వం, ప్రేమను చూసి తృప్తిపడుతుంది. అమృత హృదయునిగా తలుస్తుంది.

4. యువతి :
బస్సులో ముందు సీట్లో ఉంటుంది. రేఖ భర్త మీద విసుక్కోవడం చూస్తుంది. ప్రేమగా తినమని చెప్పే భర్తను ఎందుకు విసుక్కుంటావు ? నీవు చాలా అదృష్టవంతురాలివి. ప్రేమించే భర్త దొరకటం నీ పూర్వ పుణ్యం అంటుంది. ఆమె మాటలు రేఖలో కనువిప్పు కలిగించాయి. హృదయ సౌందర్యం లేని ఆమె భర్త రేఖకు ఇప్పుడు కొండచిలువలా కనిపించాడు.

పాఠ్యభాగ సారాంశం

బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళే ఎక్స్ ప్రెస్. చంద్రం ఆదరాబాదరా బస్సు ఎక్కాడు. బస్సంతా ఫుల్ గా ఉంది. జేబులోంచి టిక్కెట్టు తీసి తన సీటు నెంబరు ఎక్కడ ఉందో చూసుకున్నాడు. ముగ్గురు కూర్చునే సీటులో తన సీటు ఉంది. వెళ్ళి సీటు దగ్గర నిల్చున్నాడు. అంతకు ముందే ఇద్దరు వ్యక్తులు సీటు మొత్తం కూర్చోని ఉన్నారు.

చంద్రాన్ని చూసి కాస్త సర్దుకున్నారు. కిటికీ దగ్గర కూర్చొని ఉంది రేఖ ఆమె భర్త సుందరం. రేఖ అందమైనదే, తెల్లగా సన్నగా ఉంది. ఆమె భర్త సుందరం నల్లగా బట్టతలతో ఉన్నాడు. వారికి ఐదేళ్ళ కొడుకు అమ్మమ్మ గారింట్లో ఉన్నాడు. సుందర్రావు వివాహానికి బాగానే ఉన్నాడు కాని ఎండనక వాననక స్వయంగా కాంట్రాక్టు పనులు చేయిస్తాడు. బాగానే సంపాదించాడు. ఈ మధ్య కాలంలోనే మనిషి లావుగా బట్టతలతో మార్పు వచ్చింది. అయినా రేఖ ఎప్పుడూ భర్త అందాన్ని గురించి ఆలోచించలేదు.

బస్సు బయలుదేరగానే నిద్రలోకి జారుకొని గురక పెట్టడం మొదలుపెట్టాడు. రేఖ అసహనంగా చూసింది భర్త వైపు. చంద్రం అతని – – తల తగలకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాడు. సరిగ్గా కూర్చోండి అంటూ . రేఖ సుందర్రావును హెచ్చరించింది. రేఖ కిటికీలో నుండి బయటకు చూస్తోంది. రేఖ ఒక్కర్తె కూతురు. ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి బడి పంతులు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 4 సౌందర్యం

పదవ తరగతి వరకే చదివింది రేఖ. సుందర్రావు దూరపు బంధువు. ఆమెకు వివాహానికి ప్రత్యేక ఆలోచనలు లేవు. తండ్రి సుందర్రావుని చేసుకో అంటే, ఎవరినో ఒకర్ని పెళ్ళి చేసుకోవాలి కదా అన్నట్లు చేసుకుంది. సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం. బస్సు సిటీ లిమిట్స్ దాటింది. మళ్ళీ సుందర్రావు నిద్రలో పడ్డాడు. రేఖ అసహనంగా చూసింది. చంద్రం ఇబ్బందిగా రేఖ మొహంలోని చూసాడు.

నోరు తెరచి గురక పెడుతున్న సుందర్రావు రేఖకి ఎలుగుబంటిలా కనబడ్డాడు. చంద్రానికి సుందర్రావు తల తగిలి ఉలిక్కిపడి లేచాడు. ‘సారీ’ అన్నాడు. రేఖ భర్తను కిటికీ వైపు కూర్చోమని చెప్పి తను మధ్యలో కూర్చుంది. చంద్రం కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

నార్కేటు పల్లిలో బస్సు ఆగింది. సుందర్రావు అరడజను అరటి పళ్ళు కొన్నాడు. . రేఖను తినమంటే వద్దంది చంద్రానికి రెండు పళ్ళు ఇవ్వగా ఒకటి తీసుకున్నాడు. – మిగిలిన పళ్ళన్నీ సుందర్రావు తింటూ ఉంటే రేఖకు కడుపులో దేవినట్లు అయ్యింది. రేఖ ఆ యువకుని ప్రక్కన కూర్చొని ఆలోచిస్తున్నది. బస్సులో చూసేవాళ్ళు ఆ యువకుడే రేఖ భర్త అనుకుంటారని తలచింది. ఆంతలోనే ‘ఛ, ఛ’ ‘తప్పు అని మనసు హెచ్చ రించింది.

చంద్రం, సుందర్రావు ఒకరినొక ను పరిచయం చేసుకొని మాట్లాడుకుంటారు. మళ్ళీ రేఖ’ కిటికీ దగ్గర సీట్లో కూర్చుంటుంది. నెలలో 20 రోజులు ప్రయాణాలు అవటం వల్ల బస్సులో గాని, కారులో గాని ఎక్కగానే నిద్ర అలవాటైపోయిందని అంటాడు సుందరం. డబ్బాలోంచి పాన్ తీసి వేసుకుంటాడు.

చంద్రానికి ఒకటి ఇస్తాడు. పాన్ నమిలి ఉమ్మినప్పుడు రేఖకు అసహ్యం వేస్తుంది. రేఖ భావాలను అర్ధం చేసుకున్న, చంద్రం జాలిగా చూస్తాడు రేఖను. భర్త మీద రేఖకు కోపం వస్తోంది. రేఖ ఇబ్బందిని గమనించి సూర్యాపేటలో కాఫీ తాగుదాం అంటాడు సుందర్రావు. మళ్ళీ నిద్రలోకి ‘ వెళ్ళిపోతాడు.

ముందు సీటులో ఓ బాబు సుందర్రావుని జూలో వింత జంతువును చూసినట్లు చూస్తాడు. తను పది సంవత్సరాలు ఇటువంటి భర్తతో కాపురం చేసినందుకు సిగ్గుతో ముడుచుకొనిపోయింది. బస్సులో అందరూ తన భర్తను చూసి ఏమను కుంటున్నారో అని ఆలోచించింది. ముఖ్యంగా ప్రక్కనే ఉన్న యువకుడు ఏమనుకుంటున్నాడో అని అనుకున్నది.

బస్సు సూర్యాపేటలో ఆగింది. సుందర్రావు దిగి ఇడ్లీ, కాఫీ తెచ్చాడు. రేఖ విసుగ్గా వద్దని చెప్పింది. దూరంగా సిగరెట్ కాలుస్తూ చంద్రం రేఖను గమనించటం చూసి ముఖం తిప్పుకుంది. ముందు సీట్లో భార్య, భర్త. భర్త అందంగానే ఉన్నాడు. భార్య ఓ మోస్తరుగా ఉంది.

ఎందుకండీ బస్సులో కూడా సతాయిస్తారు ? అంటూ ఏడుపును దిగమింగుతోంది ఆమె. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం అంటూ భర్త విసుక్కున్నాడు. తలనొప్పిగా ఉంది ఒక యాసిన్, ఒక కప్పు కాఫీ ఇప్పించండి అనగానే క్రూరంగా నవ్వాడు ఆ భర్త. అతడు కొడుకుని తీసుకుని బస్సు దిగాడు. కానీ నీ మొహానికి కాఫీ మోసుకొని రావాలా అంటూ విసుక్కున్నాడు. సుందర్రావు ఇడ్లీ, కాఫీ తెచ్చి ఇస్తే వద్దంటే వినిపించలేదా ? అని రేఖ విసుక్కున్నది.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 4 సౌందర్యం

ముందు సీట్లో ఆమె “అదేమిటమ్మా నీవు చాల అదృష్టవంతురాలివి. ప్రేమగా మీ ఆయన తినమంటూ తెచ్చాడు. అటువంటి భర్త ఎంతమందికి దొరుకుతాడు” అని అనగానే రేఖ ఆమె ముఖంలోకి చూసింది. ఆమెను చూస్తే రేఖకు జాలి వేసింది. ముందు సీట్లో ఆమె భర్త కొండచిలువలా కనిపించాడు రేఖ కళ్ళకు. ఇలాంటి వాళ్ళతో ఒక్కరోజు కాపురం చేయలేమనుకున్నది రేఖ. దూరంగా వస్తున్న సుందర్రావును చూసింది. చిన్నబుచ్చుకున్న మొగంతో వస్తున్నాడు. బాగా అలసటగా ఉన్నాడు. పాపం అనిపించింది రేఖకు.

రాత్రింబవళ్ళు ఎవరి కోసం కష్టపడి సంపాదిస్తున్నాడు. భార్య, బిడ్డ కోసమే కదా ! అటువంటి అమృత హృదయాన్ని అర్ధం చేసుకోకుండా అనవసరంగా బాధపెట్టానని పశ్చాత్తాప పడింది రేఖ. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం ఎందుకు అని అనిపించింది రేఖకు.

కఠిన పదాలకు అర్ధాలు

ఆదరాబాదరా = గబగబ
నాజూకు = అందంగా
స్థూలకాయుడు = లావుగా ఉన్న శరీరం గలవాడు
గురక = నిద్రలో వచ్చే శబ్దం
పరికించి = పరిశీలించి

Leave a Comment