Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Intermediate 1st Year Telugu Grammar పదదోషాలు Questions and Answers.
AP Intermediate 1st Year Telugu Grammar పదదోషాలు
భాషా నైపుణ్యాలు నాలుగు.
- శ్రవణం
- భాషణం
- పఠనం
- లేఖనం.
భాషా, నైపుణ్యాలలో చివరది క్లిష్టమైంది లేఖనం. రాసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. పదదోషాలు లేకుండా రాయాలి. రాసేటప్పుడు అచ్చులకు బదులు హల్లులు, హల్లులకు బదులు అచ్చులు రాయడం సహజంగా కనిపిస్తుంది. అలాగే మహాప్రాణాలకు బదులు అల్పప్రాణాలు, అల్పప్రాణాలకు బదులు మహాప్రాణాలు రాయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అర్థంలో మార్పు వస్తుందని గ్రహించాలి.
శ, ష, స లను తారుమారుచేసి రాయడం, వట్రుసుడికి బదులు, ‘రు’ రాయడం, ‘రు’కి బదులు వట్రుసుడి రాయడం వంటి దోషాలు ఎక్కువగా లేఖనంలో కన్పిస్తున్నాయి. కొన్నింటిని పరిశీలిద్దాం.
1. అచ్చుకి బదులు హల్లులు రాయడం :
అసాధు రూపాలు (తప్పులు) – సాధు రూపాలు (ఒప్పులు)
వుడుత – ఉడుత
వూరు – ఊరు
యెలుక – ఎలుక
వున్నది – ఉన్నది
2. హల్లులకి బదులు అచ్చులు రాయడం :
అసాధు రూపాలు (తప్పులు) – సాధు రూపాలు (ఒప్పులు)
ఎంకమ్మ – వెంకమ్మ
ఎనక – వెనక
ఇనాయక – వినాయక
3. మహాప్రాణులకు బదులు అల్పప్రాణాలు రాయడం :
మహాప్రాణాలు : వర్గాక్షరాలలో, ద్వితీయాక్షరాలైన ఖ ఛ ఠ థ ఫ లూ, చతుర్ధాక్షరాలైన ఘ ఝ ఢ ధ భలూ మహాప్రాణాలు
అల్పప్రాణాలు : వర్గాక్షరాలలో ప్రథమాక్షరాలైన క చ ట త ప లూ, తృతీయాక్షరాలైన గ జ డ ద బ లూ అల్పప్రాణాలు
అసాధు రూపాలు (తప్పులు) – సాధు రూపాలు (ఒప్పులు)
బోదన – బోధన
బేదం – భేదం
ప్రబందం – ప్రబంధం
బాష – భాష
4. అ ల్పప్రాణాలకు బదులు మహాప్రాణాలు రావడం :
అసాధు రూపాలు (తప్పులు) – సాధు రూపాలు (ఒప్పులు)
భాధ – బాధ
ఉచ్ఛారణ – ఉచ్చారణ
జంభుకం – జంబుకం
శబ్దం – శబ్దం
5. శ, ష, స, ల తారుమారు :
అసాధు రూపాలు (తప్పులు) – సాధు రూపాలు (ఒప్పులు)
సివుడు – శివుడు
స్మశానం – శ్మశానం
సనివారం – శనివారం
6. వట్రుసుడికి (ఎ) బదులు ‘రు’ రాయడం :
అసాధు రూపాలు (తప్పులు) – సాధు రూపాలు (ఒప్పులు)
ద్రుశ్యం – దృశ్యం
క్రుష్ణుడు – కృష్ణుడు
7. ‘రు’ కి బదులు వట్రుసుడిని రాయడం :
అసాధు రూపాలు (తప్పులు) – సాధు రూపాలు (ఒప్పులు)
దృతం – ద్రుతం
కూరుడు – క్రూరుడు