AP Inter 1st Year Telugu Grammar అనువాదం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Intermediate 1st Year Telugu Grammar అనువాదం Questions and Answers.

AP Intermediate 1st Year Telugu Grammar అనువాదం

అనువాదం అంటే కేవలం భాషాంతరీకరణ మాత్రమే కాదు. ఆంగ్లం నుండి ” తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు మూలాన్ని అర్థం చేసుకోవడానికి తగినంత ఆంగ్ల భాషా పరిజ్ఞానం అవసరం. తర్వాత మూలంలో ఉండే భావాన్ని తెలుగులోకి మార్చాలంటే తెలుగు భాషలో చక్కని పరిచయం ఉండాలి. అప్పుడే అనువాదం సహజంగా ఉంటుంది. అనువాదం విషయంలో విద్యార్థులు కొన్ని సూచనలు పాటించాలి.

  1. ఆంగ్ల మూలాన్ని కనీసం రెండు మూడుసార్లు శ్రద్ధగా చదివి, అందులోని విషయాన్ని అర్థం చేసుకోవాలి.
  2. మూలంలోని కఠిన పదాలకు తెలుగులో అర్థాన్ని నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఏదైనా ఆంగ్ల పదానికి అర్థం తెలియకపోతే ఆ పదానికి ముందు, తరువాత ఉన్న పదాల ఆధారంగా సంబంధిత వాక్యం యొక్క అర్థాన్ని ఊహించాలి.
  3. ఆంగ్ల మూలాన్ని అర్థం చేసుకొన్న తరువాత అనువాదం చేయడానికి ప్రయత్నించాలి. మూలంలో ఎన్ని పదాలు, వాక్యాలు ఉన్నాయో, అన్నే వాక్యాలు తెలుగులో ఉండాలనే నియమం లేదు.
  4. ఆంగ్లంలోని భావానికి అనుగుణంగా చక్కని తెలుగు వాక్య నిర్మాణంతో, నుడికారాలకు అనుగుణంగా అనువాదం చేయాలి.

AP Inter 1st Year Telugu Grammar అనువాదం

అభ్యాసానికి కొన్ని ఆంగ్ల వాక్యాలు :

1. Health is wealth.
ఆరోగ్యమే మహాభాగ్యం.

2. Speak kind and sweet words. .
మృదువుగా, తీయగా మాట్లాడు.

3. Indian Constitution was written by Dr.B.R. Ambedker.
డా|| బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారు.

4. New Delhi is the capital of India.
భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ.

5. Sardar Vallabhai Patel is the first Home – Minister of India.
భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి గృహ మంత్రి.

6. Smt. M.S. Subbalakshmi is a great musician.
శ్రీమతి యమ్.ఎస్. సుబ్బలక్ష్మి గొప్ప సంగీత విద్వాంసురాలు.

7. The train had left before I reached the station.
నేను స్టేషన్ కు చేరుకునే లోపలే రైలు వెళ్ళిపోయింది.

8. He speaks Telugu as well as English.
అతను తెలుగుతో పాటు ఆంగ్లం కూడా బాగా మాట్లాడతాడు.

9. C.P. Brown Library is located at Kadapa.
సి.పి. బ్రౌన్ గ్రంథాలయం కడపలో ఉంది.

AP Inter 1st Year Telugu Grammar అనువాదం

10. Ramayana was written by Valmiki.
రామాయణాన్ని వాల్మీకి రచించారు.

11. Honesty is the best policy.
నిజాయితీ చాలా ఉత్తమమైన గుణం.

12. A friend in need is a friend indeed. .
కష్టాలలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు.

13. The Peacock is our National bird.
నెమలి మన జాతీయ పక్షి.

14. White revolution has increased the milk production.
శ్వేత విప్లవం పాల ఉత్పత్తిని పెంచింది.

15. Mount Everest is the highest peak in the World.
ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోకెల్లా ఎత్తైనది.

16. Dams are built to reserve water.
నీటిని నిలువ చేయటానికి ఆనకట్టలను నిర్మిస్తారు.

17. The Constitution of India is the longest written Constitution in the World.
భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం.

18. The Earth revolves around the Sun.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.

AP Inter 1st Year Telugu Grammar అనువాదం

19. Amaravathi is the Capital of Andhra Pradesh.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని.

20. All that glitters is not gold.
మెరిసేదంతా బంగారం కాదు.

Leave a Comment