AP Inter 1st Year English Study Material Poem 2 This is My Prayer to Thee, My Lord!

Andhra Pradesh BIEAP AP Inter 1st Year English Study Material Poetry 2nd Poem This is My Prayer to Thee, My Lord! Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year English Study Material 2nd Poem This is My Prayer to Thee, My Lord!

Questions & Answers

Question 1.
How unique is Tagore’s prayer to God ?
Answer:
Rabindranath Tagore was a poet, dramatist1 and a philosopher2. He was a Nobel laureate3 for the book Gitanjali. In the 36th song of Gitanjali, Tagore submits himself to God. He prays to God to help him by means of striking at the depths4 of his heart. This prayer is aimed at getting the strength to serve the poor. His thoughts should be at the higher level. He should submit himself to God wholeheartedly5. Thus this small poem extends6 the aim of love and service. Both joys and sorrows should be taken equally. Thus the prayer is filled with unique7 ideas.

1. నాటక రచయిత
2. వేదాంతి
3. నోబెల్ గ్రహీత
4. లోతులు
5. హృదయమంతటితో
6. చెప్పుచున్నది
7. ప్రత్యేకమైన

రవీంద్రనాథ ఠాగూర్ గారు ఒక కవి, నాటకకర్త మరియు ఒక వేదాంతి. ‘గీతాంజలి’ అను పుస్తకమునకు ఆయన నోబెల్ బహుమతి గ్రహీత అయినారు. 36వ పద్యంలో రాగూరు గారు తనను తాను భగవంతునికి సమర్పించుకున్నారు. తన హృదయపు లోతులలోనికి వెళ్ళి ఆయనను మార్చవలెనని, అట్టి సహాయము కొరకు వేడుకొన్నారు. బీదవారికి సహాయము చేయుటకు కావలసిన శక్తిని ప్రసాదించుటకు ఈ ప్రార్థన ఉద్దేశించబడినది. ఆయన ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉండాలి. అతడు హృదయపూర్వకంగా భగవంతునికి అర్పించుకొనాలి. ఈ విధంగా ఈ చిన్న పుస్తకము ప్రేమ మరియు సేవ అనే విషయాలను చూపుతున్నది. కష్టములు మరియు ఆనందము ఒకటిగా (సమానంగా) తీసుకొనాలి. ఈ విధంగా ఈ పద్యము ప్రత్యేకత కలిగియున్నది.

Question 2.
What kind of strength does Tagore seek and why?
Answer:
Rabindranath Tagore was a poet, dramatist and a philosopher. He was a nobel laureate fot the book Gitanjali. In the 36th song of Gitanjali, Tagore submits a prayer to God. He prays to God to strike him at the penury1 of heart. He needs strength to love the poor and the needy2. He should bear the difficulties and enjoy the happy occasions. There are so many trifles3 in the life of a man. He should not think of these problems in the journey of life. He should have a heaven on Earth. He should get the divine4 qualities. He should build India on the base5 of qualities like kindness and love. His love should not be selfish. He should have real service towards the needy. Thus an individual seeks the strength to beat and he wants it because he likes it.

1. బీదరికము
2. అవసరములలో ఉన్నవారు
3. చాలా చిన్న విషయములు
4. దైవికమైన
5. మూలము

రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కవి, నాటకకర్త మరియు వేదాంతి అయి ఉన్నారు. ‘గీతాంజలి’ అనే పుస్తకము ద్వారా ఆయన నోబెల్ బహుమతి పురస్కార గ్రహీత అయ్యారు. గీతాంజలిలోని 36వ పద్యంలో, రాగూర్ గారు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఆయన తన హృదయంలోని లేమిని కొట్టాలి అని అడిగారు. ఆయనకు బీదవారు, అవసరములలో ఉన్నవారికి ప్రేమ చూపుటకు కావలసిన శక్తిని కోరుచున్నారు. అతడు కష్టాలను సహించాలి మరియు సంతోష సమయాలను ఆనందంగా తీసుకొనాలి. ఒక మనిషి జీవితంలో అనేక చిన్న చిన్న విషయాలుంటాయి. జీవితయానంలో వచ్చే ఈ సమస్యలను గురించి ఆలోచించరాదు. భూమిమీద స్వర్గాన్ని కోరుతున్నాడు. అతనికి దైవిక లక్షణాలుండాలి. దయ, ప్రేమ అను లక్షణాల మీద ఆధారపడి భారతదేశాన్ని కట్టాలి. అతని ప్రేమ, స్వార్థపూరితంగా ఉండరాదు. అవసరములలో ఉన్న వారికి నిజమైన సేవ చేయాలి. ఈ విధంగా ఒక వ్యక్తి శక్తి కలిగి ఉండాలి. అది ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే అది ఆయనకు ఇష్టము.

AP Inter 1st Year English Study Material Poem 2 This is My Prayer to Thee, My Lord!

Question 3.
What are Tagore’s views on equanimity ?
Answer:
Rabindranath Tagore was a poet, dramatist and a philosopher. He was a Nobel laureate for his book Gitanjali. In the 36th song of this poem, Tagore submits a prayer to God. He prays to God to strike him at the penury of heart. The concept of equanimity1 is suggested by Tagore in the poem. There are difficulties as well as joys in the life of an individual. He prays to his God to bestlow2 his lovely by keeping him equal at both the experiences. He should love the poor and the needy. He should rise to the occasion when there were trifles. To have the same experience at both the occasions is expected by Tagore. He should be faithful in his service at both the circumstances. Equanimity is a virtue3 of life.

1. స్థిత ప్రజ్ఞత, అన్ని యెడల సమాన భావము
2. అనుగ్రహించుట
3. మంచి లక్షణము

రవీంద్రనాథ ఠాగూర్ గారు ఒక కవి, నాటకకర్త మరియు వేదాంతి అయి ఉన్నారు. ‘గీతాంజలి’ అను పుస్తకమునకు ఆయన నోబెల్ బహుమతి పొందారు. దీనిలోని 36వ పద్యంలో ఠాగూర్ గారు దేవునికి ఒక ప్రార్థన చేశారు. హృదయంలోని పేదరికపు స్థితిలోని ఆలోచనలను కొట్టాలని దేవుణ్ణి ప్రార్థించారు. ‘స్థిత ప్రజ్ఞత’ అనే లక్షణమును రాగూర్ తన పద్యంలో పొందుపరచారు. ఒక వ్యక్తి జీవితంలో కష్టాలు మరియు సుఖాలు ఉంటాయి. అట్టి రెండు రకాల అనుభవాలతో ఒకే రకమైన స్థితిలో నుంచుటకు ప్రేమ చూపవలసినదిగా ఆయన కోరుచున్నారు. ఆయన బీదవారిని, అవసరములలో ఉన్న వారిని ప్రేమించాలి, ఇబ్బందులున్నప్పుడు తగిన శక్తి పొందాలి అనే ఈ రెండు రకాల పరిస్థితులలోను విశ్వాసపాత్రంగా ఉండాలి అని తెలిపారు. స్థిత ప్రజ్ఞత అనేది జీవితపు విలువైయున్నది.

Annotations

Question 1.
Strike, strike at the root of penury in my heart.
Answer:
Poem and Poet : This is an important line in the poem “This is my prayer to thee my Lord’ written by Rabindranath Tagore. It is an extract from the book ‘Gitanjali’. Rabindranath Tagore prays to God, from the depths of his heart.

Context and Meaning : The prayer taken from the book Gitanjali, is a common prayer of the poet. He prays to God to give him the strength to strike at the penury1 of heart. He thinks that he has no strength at the heart of hearts2. He prays to God to fill his heart with love and selflessness3. He should with stand the sorrow in life. At the same time he should enjoy occasions4 of joy. He should show equal behaviour at both the experiences. He suggests at the inhuman5 treatment of the British and wants to destroy it.

General relevance : Here the prayer is a universal appeal to God. ‘Hit at the penury of heart’ suggests that the heart should be filled with love and selflessness. He had such a great mind, for the people of India.

1. లేమి
2. హృదయాంతరాళాలలో
3. నిస్వార్థమైన
4. సందర్భములు
5. క్రూరమైన

సందర్భము : రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన “This is my prayer to thee my Lord” అనే ఈ పద్యంలో ఇది ముఖ్యమైన లైను అయి ఉన్నది. అది గీతాంజలి పుస్తకం నుండి గ్రహింపబడినది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన హృదయపు లోతులలో నుండి ఈ ప్రార్ధనను దేవుని ముందు పెడుతున్నారు.

వివరణ : ఇది గీతాంజలి పుస్తకం నుండి తీసుకొనబడిన సామాన్య ప్రార్థన అయి ఉన్నది. ఆయన తన హృదయపు లోతులలోని లేమిని కొట్టవలసినదిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తన హృదయపు అంతరంగాల్లో ఉండవలసిన శక్తి లేదు అని ఆయన అనుకొంటున్నారు. అతడు తన హృదయాన్ని ప్రేమ మరియు నిస్వార్థపరతలతో నింపమని అడుగుతున్నారు. జీవితంలో కష్టాలను ఓర్చుకొనాలి అంటున్నారు. అదే విధంగా సంతోష సమయాలలో ఆనందించాలి. ఒకే రకమైన ప్రవర్తన చూపాలని ఆయన అంటున్నారు. ఆయన అమానుషమైన బ్రిటీషువారి ప్రవర్తనను తీసుకొని అది నాశనం కావాలి అని కోరారు.

సాధారణ భావన : ఇక్కడ ఈ ప్రార్థన విశ్వజనీయమైన విన్నపము కలిగి ఉన్నది. హృదయంలోని లేమిని కొట్టండి అంటే హృదయం ప్రేమ, స్వార్థలేమితో నింపబడాలి అని సందేశము. భారత ప్రజలకు ఆయన అట్టి గొప్ప మనస్సును అందిస్తున్నారు.

AP Inter 1st Year English Study Material Poem 2 This is My Prayer to Thee, My Lord!

Question 2.
Give me strength to raise my mind
high above daily trifles”.
Answer:
Context : These lines are extracted from the poem “This is my Prayer to thee my Lord” written by Rabindranath Tagore. He was a Nobel laureate and his poems are filled with philosophy. Here this small poem is a prayer to God to make him a real follower.

Explanation : In this prayer, he aspires1 to have so many things. He prays to God to go deep into the heart and strike the penury. He wants to have a mind with belief2 in love. He wants to love the poor and the needy. He should strive to have a widening thought in his mind. Tagore wants to drive away the trifles and to raise his deeds, to the supreme3 level.

General relevance : Tagore’s intention is to rise to the supreme heights of character. One should think of the aspirations in making one’s deeds successful. Transparency4 of thought and word, should be there, to make the life, successful.

1. కోరుకొనును
2. నమ్మకము
3. ఉన్నతోన్నతమైన
4. విశాలదృష్టి

సందర్భము : ఈ వాక్యాలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన ‘This is my Prayer to thee my Lord’ అనే ఈ పద్యం నుండి తీసుకొనబడినవి. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత మరియు ఆయన పద్యములు వేదాంతముతో నింపబడినవి. ఈ చిన్న పద్యము, నిజమైన follower గా దేవునికి ప్రార్థించే విధానము అయి ఉన్నది.

వివరణ : ప్రార్థనలో ఆయన అనేక విషయాలను ఆశిస్తున్నారు. హృదయపు లోతులలోనికి వెళ్ళి అక్కడ లేమిని కొట్టాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రేమపట్ల విశ్వాసము గల మనసు కోరుతున్నారు. బీదవారిని, అవుసరతలలో ఉన్నవారిని ప్రేమించాలని తలచుచున్నారు. తన మనస్సులో విశాలమైన ఆలోచన కావాలి అని ఠాగూరు గారు తనలోని తేలిక భావనలను తోసివేసి ఉన్నతమైన స్థాయిలో ఉన్న కార్యక్రమముల వైపుకు తనను మేల్కొల్పాలి అని అంటున్నారు.

సాధారణ భావన : వ్యక్తి ప్రవర్తలోని ఉన్నత విలువలకు చేరాలి అనేది రాగూరు గారి అభిప్రాయము. ప్రతి మనిషి తన పనులను విజయవంతం చేయడానికి ఆశ కలిగి ఆలోచించాలి. ఆలోచనలో మరియు మాటలలో విశాలత ఉండాలి. తద్వారా జీవితం విజయవంతం కావాలి.

Question 3.
Give me the strength
never to disown the poor.
Answer:
Context : These lines are extracted from the poem “This is my Prayer to thee my Lord” written by Rabindranath Tagore. He was a Nobel laureate and his poems are filled with philosophy. Here this small poem is a prayer to God to make him a real follower.

Explanation : Rabindranath Tagore’s prayer is honest. He prays to the God Almighty1 to make him successful in his deeds of love. He wants to have equanimity both at happinesss and at difficulties. He wants to show affection2 towards the poor and the needy. His mind should rise to the supreme level of showing love at others without selfishness. He wants to utilise3 his strength for the good of the people.

General relevance : The prayer is a universal4 appeal. It pertains to the world of truth, love and service. It is a general ambition that the righteous5 people aim at.

1. సర్వ శక్తిమంతుడు
2. ప్రేమ
3. ఉపయోగించుకొనుట
4. విశ్వజనీయమైన
5. నీతిగల, సత్యవంతులైన

సందర్భము : ఈ వాక్యాలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన ‘This is my Prayer to thee my Lord’ అనే ఈ పద్యం నుండి తీసుకొనబడినవి. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత మరియు ఆయన పద్యములు వేదాంతముతో నింపబడినవి. ఈ చిన్న పద్యము, నిజమైన follower గా దేవునికి ప్రార్థించే విధానము అయి ఉన్నది.

వివరణ : రవీంద్రనాథ ఠాగూర్ గారు పద్యంలో చాలా మంచి వివరణలు ఇచ్చారు. ఆయన తన జీవితంలో స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. ఈ పద్యంలో చెప్పబడిన స్థితప్రజ్ఞత అనే నీతి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఈ రెండు విషయాలలో సమతౌల్యం ఉండాలి. సంతోషంలో మరియు విచారంలో హృదయం పాడుచేయబడరాదు. మిగతా చిన్న చిన్న విషయాలన్నింటిని అధిగమించి, ఉన్నతమైన భావాలతో నిండిన మనస్సును కోరుతున్నారు.

సాధారణ భావన : ఠాగూరు గారి ప్రార్థన గొప్ప కోరికలతో నిండియున్నది. బీదవారికి, అవుసరలతో ఉన్న వారికి ప్రేమ, అనురాగము చూపాలి. అట్టివారి పట్ల విజయవంతమైన ప్రేమను ఆశిస్తున్నారు.

Question 4.
Give me strength
to make my love fruitful in service.
Answer:
Context : These lines are extracted from the poem “This is my Prayer to thee my Lord” written by Rabindranath Tagore. He was a Nobel laureate and his poems are filled with philosophy. Here this small poem is a prayer to God to make him a real follower.

Explanation : Rabindranath Tagore gave interesting explanations in the poem. He prays to God that he should have equinimity1 in his life. The moral from the poem in maintaining equanimity is very important, in one’s life. There should be a balance2 between the two things. At the times of happiness and at the time of sorrow, his heart should not be disturbed3. He aims at a mind that is high above all the “other trifling things”.

General relevance : The prayer of Tagore is filled with the best ambitions. He wants to show love and affection to the poor and needy people. He aims at a successful love.

1. స్థిత ప్రజ్ఞత, అన్ని సమయాలలో ఏకదృష్టి కలిగియుండుట
2. సమతౌల్యము
3. పాడుచేయబడుట

సందర్భము : ఈ వాక్యాలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన ‘This is my Prayer to thee my Lord’ అనే ఈ పద్యం నుండి తీసుకొనబడినవి. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత మరియు ఆయన పద్యములు వేదాంతంతో నింపబడినవి. ఈ చిన్న పద్యము, నిజమైన follower గా దేవునికి ప్రార్థించే విధానము అయి ఉన్నది.

వివరణ : రవీంద్రనాథ ఠాగూర్ గారి ప్రార్థనలో నిజాయితీ ఉంది. శక్తివంతమైన దేవుడికి, తనను ప్రేమ విషయాలలో విజయవంతం చేయమని అడుగుతున్నారు. సంతోషం మరియు ఇబ్బందులలో స్థిత ప్రజ్ఞతను కోరుతున్నారు. బీదలు మరియు అవసరములలో ఉన్నవారి పట్ల ప్రేమ చూపాలని కోరుతున్నారు. స్వార్థం లేని ప్రేమను ఇతరుల పట్ల చూపగల ఉన్నతమైన మనస్సును పొందడానికి సహాయం చేయాలి. తన శక్తిని ఇతరుల మంచి కొరకు ఉపయోగించాలనుకొంటున్నారు.

సాధారణ భావన : ఈ ప్రార్థన విశ్వజనీయమైనది. అది సత్యము, ప్రేమ మరియు సేవ అను ప్రపంచమునకు సంబంధించినది. అది మంచివారు నిజాయితీపరులు ఆశించే సహజమైన కోరికయైయున్నది.

Comprehension
I. Read the following passage given below and answer the questions.

Rabindranath Tagore’s family’s outlook on religion and life was influenced by the Upanishads and the Bhagavadgita. When Rabindranath was twelve and went to the Himalayas with his father, they chanted the Upanishads together. His father insisted that he should know the verses by heart. Rabindranath Tagore’s writings are full of references to the Upanishads.

The Upanishads are a collection of writings that were originally orally transmitted. Upanishad literally means ‘sitting close to”, and implies listening closely to the mystic doctrines of a gun. It has also been translated as “secret wisdom” that include philosophical discussions of concepts such as : Salvation (moksha / mukti), ultimate reality (brahman), the individual soul (atman), such as : religion, duty, essence (dharma). The Upanishads build the foundation of what is called Vedanta (which means “the end of the Veda” – goal, conclusion, highest aim).

Questions & Answers

Question 1.
What influenced Tagore’s religion and life ?
Answer:
Upanishads and the Bhagavadgita.

Question 2.
With whom did Tagore go to the Himalayas ?
Answer:
With his father.

AP Inter 1st Year English Study Material Poem 2 This is My Prayer to Thee, My Lord!

Question 3.
What does ‘Upanishads’ literally mean?
Answer:
Sitting close to.

Question 4.
Pick out the translated word for ‘Upanishads’.
Answer:
Secret wisdom.

Question 5.
What part of speech is the word ‘highest’.
Answer:
Adjective.

II. Read the following passage carefully and answer the questions that follow.

Tagore insisted that education should be imparted in an atmosphere of nature with all its beauty, colours, sounds, forms and such other manifestations. In his opinion, education, in natural surroundings, develops intimacy with the world and the power of communication with nature. Nature, according to him, was maniscript of God. So he emphasized that education must enable a person to realize his immediate relationship with nature.

It should take the child nearer nature and, therefore, in close proximity of God. It should help him to learn freely and spontaneously from the book of Nature. Since nature never betrays the heart that loves her, she will provide the child with spontaneous development and natural growth.

Questions & Answers

Question 1.
What according to Tagore develops intimacy with the world ?
Answer:
Education in natural surroundings.

Question 2.
What was considered as the manuscript of God ?
Answer:
Nature.

Question 3.
“It should take the child nearer nature”, ‘it’ refers to what ?
Answer:
The immediate relationship with nature.

Question 4.
Name the two things that are provided by Nature.
Answer:
She will provide the child with spontaneous development and natural growth.

AP Inter 1st Year English Study Material Poem 2 This is My Prayer to Thee, My Lord!

Question 5.
Write the present tense form of ’emphasized’.
Answer:
Emphasize.

This is My Prayer to Thee, My Lord! Poem Summary in English

Rabindranath Tagore was a poet1, dramatisť2and a philosopher3. He got the Nobel Prize for his Gitanjali. He produced4 a lot of literature which made him world famous5. This is my prayer to thee my Lord’ is taken from the 36th song of Gitanjali.

All the poems in Gitanjali have got a universal6 appeal. All the poems show his inner most feelings of regard at God. His poems express true love and selfless7 service to God. This poem starts with the words “This is my prayer to thee my Lord”. The poem is a universal appeal to God. He wants to get spiritual8 strength by means of his prayer. The poet asks God to strengthen him to withstand the sorrows in his life. His heart is with penury9 of thoughts. His love should become fruitful at each level. He wants to give respect to the poor and the needy. He also wants to drive his mind towards great things. Finally, the poet surrenders10 himself to the will of God. He would never leave the strength. He keeps the people nearer to the will of God. He wants to surrender himself to the God Almighty.

He wishes that people should have kind heartedness11 and concern12 towards the poor and the needy. Tagore’s poem has got a concern towards the British. They were cruel towards the Indians. Tagore prays to God that he would submit himself to the strength of God. It is a prayer from the depths13 of his heart.

1. కవి
2. నాటక రచయిత
3. వేదాంతి
4. వ్రాసెను
5. ప్రపంచ ప్రసిద్ధి
6. విశ్వజనీయమైన
7. స్వార్థలేమి
8. ఆత్మీయమైన
9. లేమి
10. లోబరుచును.
11. దయగల హృదయస్థితి
12. సంబంధించిన విషయము
13. లోతులు

This is My Prayer to Thee, My Lord! Poem Summary in Telugu

రవీంద్రనాథ ఠాగూర్ గారు కవి, నాటకకర్త మరియు వేదాంతియైయున్నారు. గీతాంజలి అను పుస్తకమునకు ఆయన నోబెల్ బహుమతి పొందారు. అతడు వ్రాసిన సాహిత్యము ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చి పెట్టింది. This is my Prayer to thee My Lord’ అనేది గీతాంజలిలో 36వ పద్యము అయి ఉన్నది.

గీతాంజలిలోని అన్ని పద్యములు సార్వజనీనంగా ఉంటాయి. దేవుడి పట్ల ఆయనకు అంతరంగ భావాలను అన్ని పద్యములు బహిర్గతం చేస్తున్నాయి. ఆయన పద్యములలో నిజమైన ప్రేమ మరియు దేవునికి నిస్వార్థ సేవ ఉన్నాయి. ఈ పద్యం “This is my Prayer to thee My Lord” అనే మాటలతో ప్రారంభమయినది. అది విశ్వజనీయత కలిగియున్నది. ఆయన తన ప్రార్థనతో ఆత్మీయ బలమును పొందాలనుకుంటున్నారు. జీవితంలో విచారాలను తట్టుకొనే శక్తిని ఇవ్వమని ఆయన కోరుతున్నారు. ఆయన హృదయంలో ఆలోచనల లేమియున్నది. ఆయన ప్రేమ ప్రతి స్థాయిలో విజయవంతం కావాలి. బీదలకు, అవసరములో ఉన్న వారికి గౌరవం ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన తన మనస్సు గొప్ప విషయముల వైపు త్రిప్పాలని అభిప్రాయపడుతున్నారు. చివరగా ఆయన తనను తాను దేవునికి అప్పగించుకొంటున్నారు. అతడు తన శక్తిని ఎన్నడూ విడువరు. దేవుని చిత్తమునకు దగ్గరగా ప్రజలను ఉంచాలి. ఆయన సర్వశక్తి గల దేవునికి తనని తాను అప్పగించుకుంటున్నారు.

ప్రజలు దయగల వారుగా ఉండాలని కాంక్షిస్తున్నాడు. బీదలు మరియు అవసరములో ఉన్న వారి పట్ల మనసు కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఈ పద్యంలో బ్రిటీషు వారిని గూర్చి కూడా ఉన్నది. వారు భారతీయుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తనను తాను దేవుని శక్తికి లోబరుచుకోవాలని ఠాగూర్ గారు ప్రార్థిస్తున్నారు. అది హృదయాంతరాళాలలో నుండి వచ్చిన ప్రాన.

This is My Prayer to Thee, My Lord! Poem Glossary

Textual Glossary

1. thee (pro) : /ði :/
: a word meaning ‘you’, used when talking to only one person who is the object of the verb; నిన్ను, నీవు యొక్క ‘కర్మణి’ రూపం. e.g. : We beseech thee, O Lord.

2. strike (v) : /straık/
: to hit somebody / something hard or with force; దెబ్బవేయు, కొట్టు, తట్టు.
e.g. : The ball bounced when he tried to strike it hard.

AP Inter 1st Year English Study Material Poem 2 This is My Prayer to Thee, My Lord!

3. penury (n) : /’penjəri/
: the state of being very poor; దారిద్ర్యం , లేమి.
e.g. : She asked his help at a time when he was in utter penry.

4. fruitful (adj) : /’fru:tfl/
: producing many useful results; సఫలమైన, సృజనాత్మకమైన.
e.g. : It was a fruitful debate.

5. disown (v) : /’dls’ə\(U\)n/
: to decide that you no longer want to be connected with or responsible for somebody/something; విడిపోవు.
e.g. ; He was disowned by his parents for his mis – deeds.

6. insolent (adj): /’ınsələnt/
: extremely rude and showing a lack of respect; అహంకారియైన, అమర్యాదగా నడుచుకొను.
e.g. : He was an insolent child and never obeyed elders.

7. might (n) : /maIt/
: great and impressive power or strength; అద్భుత సామర్థ్య మైన
e.g. : He fought with his full might.

8. trifle (n) : /traıfl/
: something that is not valuable or importantl; అల్పమైనది, పరిగణింప అవసరము లేనిది.
e.g. : Don’t worry about the trifles.

9. surrender : (v): /sə’rendər/
: to submit or yield; లొంగిపోవు, అధీనుడైపోవు
e.g. : The enemy surrendered at last.

10. will (n) : /wıl/
: determination to do something; సంకల్పం, ఇష్టం
e.g. : He displayed a tremendous will power

Additional Glossary

11. dramatist (n) : pertaining to the drama; నాటకాలు రాసిన కవి

12. philosopher (n) : a lover of wisdom; జ్ఞాని తత్వజ్ఞుడు

13. Nobel laureate : Nobel prize winner as a symbol of honour; నోబెల్ గ్రహీత

14. depths (n) : deepness; లోతు, నిమ్నత

15. wholeheartedly (n) : with complete heart or entire heart; హృదయమంతటితో

16. extends (vt) : to expand or stretch for a particular area : వ్యాపింపజేయు, విస్తరింపజేయు

17. unique (adj.) : being the only one of its kind; అద్వితీయమైన, విశిష్టమైన.

18. needy (adj.) : a state of poverty; నిరుపేదైన

19. divine (adj.,) : of or belonging to God ; దైవికమైన

20. base (adj.) : foundation, support ; ఆధారం, మూలం

21. equanimity (n) : being alike in all situations; సమచిత్తత, స్థిత ప్రజ్ఞత

22. bestow (vt) : to give or present as a gift; ఇచ్చు, దయచేయు

23. virtue (n) : good quality; మంచి లక్షణము

Leave a Comment