AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

Students get through AP Inter 1st Year Chemistry Important Questions 10th Lesson P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ which are most likely to be asked in the exam.

AP Inter 1st Year Chemistry Important Questions 10th Lesson P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
బోరాన్, థాలియం ఆక్సిడేషన్ స్థితుల మార్పు విధానాన్ని చర్చించండి.
జవాబు:
IIIA గ్రూపు మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns²np¹. కావున ఈ మూలకాలన్నీ +3 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తాయి. బోరాన్ మరియు అల్యూమినియం తప్ప మిగతా మూలకాలన్ని +3 మరియు +1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తాయి. బోరాన్ నుండి థాలియం వరకు +3 ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం తగ్గుతుంది. అలాగే +1 ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం బోరాన్ నుండి థాలియం వరకు పెరుగుతుంది. దీనికి కారణం జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావము.

ప్రశ్న 2.
TlCl3 అధిక స్థిరత్వాన్ని ఎట్లా వివరిస్తారు?
జవాబు:
థాలియంలో బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్ల యొక్క అంతర కక్ష్యలో గల ఎలక్ట్రాన్లపై పరిరక్షక ప్రభావం ఎక్కువ ఉండుట కారణంగా T/C/3.అధిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నది.

ప్రశ్న 3.
BF3 లూయీ ఆమ్లంగా ఎందుకు ప్రవర్తిస్తుంది. [AP 22][Imp.Q]
జవాబు:
BF3 ఎలక్ట్రాన్ కొరత సమ్మేళనం. దీనికి ఎలక్ట్రాన్ జంటను స్వీకరించే స్వభావం కలదు. ఎలక్ట్రాన్ జంటల స్వీకర్తలను లూయీ ఆమ్లాలు అంటారు. కావున BF3 లూయీ ఆమ్లం.

ప్రశ్న 4.
బోరిక్ ఆమ్లం ప్రోటాన్ ఇచ్చే ఆమ్లమా? వివరించండి. [Imp.Q]
జవాబు:
బోరిక్ ఆమ్లం ఒక బలహీన ఏకక్షార ఆమ్లం. బోరిక్ ఆమ్లంలో సమతలం BO3 యూనిట్లు హైడ్రోజన్ బంధాలతో కలుపబడతాయి. కావున ఇది ప్రోటాన్ నిచ్చే ఆమ్లం కాదు.

ప్రశ్న 5.
బోరిక్ ఆమ్లాన్ని వేడిచేస్తే ఏమవుతుంది? [Imp.Q]
జవాబు:
బోరిక్ ఆమ్లాన్ని 370K పైన వేడి చేసినపుడు మెటాబోరిక్ ఆమ్లం ఏర్పడును. దీనిని వేడి చేయగా బోరిక్ ఆక్సైడ్ ఏర్పడును.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 1

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

ప్రశ్న 6.
BF3, BH4 ల ఆకారాలను వర్ణించండి. ఈ కణాలలో బోరాన్ సంకరీకరణం రాయండి. [Imp.Q]
జవాబు:
BF3 అణువు ఆకృతి సమతల త్రిభుజకారం. BF3 లో ‘B’ సంకరీకరణం sp²
BH4 అణువు ఆకృతి టెట్రాహెడ్రల్ ఆకృతి. BH4 లో ‘B’ సంకరీకరణం sp³

ప్రశ్న 7.
Ga పరమాణు వ్యాసార్థం ‘Al’ కంటే ఎందుకు తక్కువ ఉంటుంది. వివరించండి. [AP 22]
జవాబు:
గాలియంలో ఉపాంత్య కర్పరంలో 10-ఎలక్ట్రాన్లు కలవు. ఈ ఎలక్ట్రాన్ల వల్ల పరిరక్షక ప్రభావం తక్కువగా ఉంటుంది. కావున గాలియంలో కేంద్రక ఆవేశం పెరుగును. కావున ‘Ga’ యొక్క పరమాణు వ్యాసార్థం ‘Al’ కంటే తక్కువగా ఉండును.

ప్రశ్న 8.
జడజంట ప్రభావాన్ని వివరించండి. [TS 17]
జవాబు:
బంధ నిర్మాణంలో పాల్గొనడానికి ‘ns’ ఎలక్ట్రాన్లు వ్యతిరేకతను చూపడాన్ని “జడ జంట ప్రభావం” అంటారు.
ఉదా: ఈ ప్రభావం వలననే ‘థాలియం’ ‘+1′ ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది.

ప్రశ్న 9.
బోరజీన్ సాంకేతికాన్ని రాయండి. దాని సాధారణ నామం ఏమిటి? [TS 17][Imp.Q]
జవాబు:
బోరజీన్ అణుఫార్ములా B2N3H6.
దీని సాధారణ నామం “ఇనార్గానిక్ బెంజీన్” ఎందుకనగా ఇది బెంజీన్ వంటి నిర్మాణం కలిగియుండును.

ప్రశ్న 10.
a) బొరాక్స్ b) కోలిమనైట్ సాంకేతికాలు ఇవ్వండి.
జవాబు:
a) బొరాక్స్ ఫార్ములా Na2B4O7.10H2O
b) కొలేమనైట్ ఫార్ములా Ca2B6O11.5H2O

ప్రశ్న 11.
అల్యూమినియం ఉపయోగాలు రెండు రాయండి. [Imp.Q]
జవాబు:
అల్యూమినియం ఉపయోగాలు:

  1. దీనిని ట్యూబులు, రాడ్లు, విద్యుత్ తీగల తయారీలో ఉపయోగిస్తారు.
  2. దీనిని విమాన తయారీలో, రవాణా పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు.
  3. దీనిని మిశ్రమ లోహాల తయారీలో ఉపయోగిస్తారు.
  4. దీనిని ధర్మైట్ వెల్డింగ్లో క్షయకరిణిగా ఉపయోగిస్తారు.

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

ప్రశ్న 12.
కింది చర్యల్లో ఏమి జరుగుతుంది? a) LiAlH4 BCl3 మిశ్రమాన్ని అనార్ధ్ర ఈథర్ వెచ్చబెట్టినప్పుడు b) బోరాక్స్ న్ను H2SO4 తో వేడి చేసినప్పుడు?
జవాబు:
a) LiAlH4, BCl3 లను పొడి ఈథర్లో కరిగించి, వేడిచేస్తే డైబోరేన్ తయారగును.
4BF3 + 3LiAlH4 → 2B2H6 + 3LiF + 3AlF3

b) బోరాక్స్న H2SO4 తో వేడి చేసినప్పుడు బోరిక్ ఆమ్లం ఏర్పడును.
Na2B4O7 + H2SO4 + 5H2O → Na2SO4 + 4H3BO3

ప్రశ్న 13.
ఆర్థోబోరిక్ ఆమ్ల నిర్మాణాన్ని గీయండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 2

ప్రశ్న 14.
AlCl3 ద్విఅణుక నిర్మాణాన్ని గీయండి. [Imp.Q]
జవాబు:
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 3

ప్రశ్న 15.
లోహ బోరైడ్లను (10B) రక్షణ కవచాలుగా వాడతారు. ఎందుకు?
జవాబు:
బోరాన్ – 10 (10B) కి న్యూట్రాన్లను శోషించుకొనే సామర్థ్యం కలదు. కావున లోహబోరైడ్లు (10Bకలిగినవై )ను న్యూక్లియర్ పరిశ్రమలలో రక్షణ కవచాలుగా ఉపయోగిస్తారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
డై బోరేన్ (B,H.) నిర్మాణాన్ని వివరించండి? [TS 15,16,18,19][AP 15,16,17,19]
జవాబు:
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 4
డైబోరేన్ నిర్మాణం:

  1. ఎలక్ట్రాన్ వివర్తన అధ్యయనం ప్రకారం డైబోరేన్లో రెండు సమతల BH2 సమూహాలు వుంటాయి.
  2. BH2 గ్రూపులలో వున్న నాలుగు హైడ్రోజన్ పరమాణువులను అంత్య హైడ్రోజన్లు (H1) అంటారు.
  3. మిగిలిన రెండు హైడ్రోజన్ పరమాణువులను వారధి హైడ్రోజన్ (Hb) లు అంటారు. (కారణం అవి అణువులోని రెండు BH2 గ్రూపులను కలుపుతాయి).
  4. ఈ రెండు వారధి హైడ్రోజన్లు BH2 గ్రూపుల తలాలకు లంబతలంలో వుంటాయి.
  5. ఒక వారధి హైడ్రోజన్ BH2 తలానికి పైన, మరొకటి BH2 తలానికి క్రింద వుంటాయి.
  6. డైబోరేన్, బోరాన్ పరమాణువు SP³ సంకరీకరణంలో పాల్గొని నాలుగు SP³ సంకర ఆర్బిటాళ్ళను ఏర్పరచును.
  7. ఇందులో మూడు ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున వుండి, నాలుగవ సంకర ఆర్బిటాల్ ఖాళీగా వుంటుంది.
  8. ప్రతి బోరాన్ పరమాణువులోని రెండు SP³ సంకర ఆర్బిటాళ్ళు, రెండు హైడ్రోజన్ పరమాణువులతో రెండు సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి.
  9. ఒక బోరాన్ పరమాణువులోని ఖాళీ SP³ సంకర ఆర్బిటాల్, ఒక వంతెన హైడ్రోజన్ యొక్క 1S ఆర్బిటాల్ మరియు రెండో బోరాన్ పరమాణువులోని ఒక ఎలక్ట్రానన్ను కలిగిన Sp³ ఆర్బిటాల్తో ఒకేసారి ఒకదానితో ఒకటి అతిపాతం చెందటం వలన రెండు బోరాన్ పరమాణువుల మధ్య వారధి ఏర్పడుతుంది.
  10. ఈ హైడ్రోజన్ వారధిని ‘త్రికేంద్రక ద్వి ఎలక్ట్రాన్ బంధం’ (లేదా) ‘బనానా బంధం’ (లేదా) ‘టౌ బంధం’ అని అంటారు.
    AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 5

ప్రశ్న 2.
డై బోరేన్ను తయారుచేయడం, దాని రసాయన ధర్మాలను గురించి వ్యాసం రాయండి? [IPE ’14][AP 17,18]
జవాబు:
డై బోరేన్ ను తయారుచేయు పద్ధతులు :
1. పారిశ్రామిక పద్ధతి:బోరాన్ ట్రై ఫ్లోరైడ్ను లిథియం హైడ్రైడ్తో 450K వద్ద క్షయీకరించడం వలన డైబోరేన్ వచ్చును.
2BF3 +6LiH → B2H6 + 6LiF

2. ప్రయోగశాల పద్ధతి :
a) బోరాన్ ట్రై క్లోరైడ్ను లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో ఈథర్లో క్షయకరణం చేయడం.
దీనిలో దిగుబడి 99.4% B2H6.
4BCl3 + 3LiAlH4 → 2B2H6 + 3LiCl + 3AlCl3

b) బోరాన్ ట్రై క్లోరైడ్, హైడ్రోజన్ మిశ్రమంలో నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గం జరిపితే డై బోరేన్ తయారవుతుంది.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 6

రసాయన ధర్మాలు :
i) H2O లేదా క్షారాలతో B2H6 చర్య జరిపి బోరికామ్లాన్ని ఇస్తుంది.
B2H6 + 6H2O → 2H3BO3 + 6H2

ii) డైబోరేన్ ఆక్సిజన్తో మండిస్తే అధిక పరిమాణంలో ఉష్ణం వెలువడుతుంది.
B2H6 + 3O2 → B2O3 + 3H2O, ∆H = -2006.4 kjmol-1

iii) 120°C వద్ద డైబోరేన్ అమ్మోనియాతో చర్య జరిపి డై అమ్మోనియేట్ ఆఫ్ డై బోరేని నిస్తుంది. 200°C వద్ద వేడిచేసినపుడు బోరజోల్ ఏర్పడుతుంది.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 7

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

ప్రశ్న 3.
డైబోరేన్ ఈ కిందివాటితో ఏ విధంగా చర్య జరుపుతుంది. a. H2O b. CO c. N(CH3)3?
జవాబు:
a) డైబోరేన్ నీటితో చర్య జరిపి బోరికామ్లాన్ని ఇస్తుంది. హైడ్రోజన్ వెలువడుతుంది.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 8
b) 1000°C ఉష్ణోగ్రత మరియు 20 ఆట్మా పీడనం వద్ద డైబోరేన్ CO తో చర్య జరిపి బోరేన్ కార్బోనైల్ను ఇస్తుంది.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 9
c) డైబోరేన్ N(CH3)3 తో చర్య జరిపి అడక్ట్ (సంకలన సమ్మేళనం) ను ఏర్పరచును.
B2H6 + 2N(CH3)3 → 2BH3.N(CH3)3

ప్రశ్న 4.
ఏమి జరుగుతుంది.
(a) బోరాక్స్న ప్రబలంగా వేడిచేస్తే
(b) బోరిక్ ఆమ్లాన్ని నీటికి కలిపితే [AP 19]
(c) అల్యూమినియాన్ని సజల NaOH తో వేడిచేస్తే
(d) అమ్మోనియాతో BF3 చర్య జరిపినప్పుడు
(e) ఆర్ద్ర అల్యూమినాను సజల NaOH ద్రావణంతో చర్య జరిపినప్పుడు.
జవాబు:
(a) బోరాక్స్న ప్రబలంగా వేడిచేస్తే చివరగా గాజువంటి పదార్థం ఏర్పడును.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 10

(b) బోరిక్ ఆమ్లంనకు నీటిని కలిపితే బోరిక్ ఆమ్లం నీటి నుండి అయాన్ను స్వీకరిస్తుంది.
B(OH)3 + 2H2O → [B(OH)4]+ H3O+

(c) Al ను సజల NaOHతో చర్య జరిపితే సోడియం మెటాల్యుమినేట్ ఏర్పడి హైడ్రోజన్ వాయువు వెలువడును.
2Al + 2NaOH → 2NaAlO2 + H2

(d) BF3 ని NH3తో చర్య జరిపినపుడు BF3. NH3 సమ్మేళనం ఏర్పడును.
BF3 + NH3 → [BF3 ← NH3] → [BF3.NH3]

(e) ఆర్థ అల్యూమినాను సజల NaOH ద్రావణంతో చర్య జరిపితే సోడియం మెటాల్యుమినేట్ ఏర్పడును.
Al2O3.2H2O + 2NaOH(aq) → 2NaAlO2(aq) + 3H2O

ప్రశ్న 5.
కారణాలు తెలపండి.
a. అల్యూమినియం పాత్రలలో గాఢ HNO3 రవాణా చేయవచ్చు.
b. సజల NaOH అల్యూమినియం ముక్కల మిశ్రమాన్ని మురుగు కాలువను తెరవడానికి వాడతారు.
c. అల్యూమినియం మిశ్రమలోహాన్ని విమానాలను తయారుచేయడానికి వాడతారు.
d. అల్యూమినియం పాత్రలను రాత్రంతా నీళ్ళలో పెట్టకూడదు.
e. అల్యూమినియం తీగలను ప్రసార కేబుల్ తయారీకి వాడతారు.
జవాబు:
a) అల్యూమినియం గాఢ HNO3 మధ్య చర్యరాహిత్యం కలదు. దీనికి కారణం వాహ ఉపరితలంపై ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది. కావున అల్యూమినియం పాత్రలో HNO3 ను రవాణ చేయవచ్చు.

b) సజల NaOH అల్యూమినియం ముక్కల మిశ్రమం నవజాత హైడ్రోజన్ ను విడుదల చేయుట కారణంగా దీనిని మురుగు కాలువను తెరవాడానికి వాడతారు.

c) అల్యూమినియం తేలికయిన, బలమైన లోహం. గాలిలో క్షయం చెందదు. మంచి విద్యుద్వాహకం కాబట్టి దీనిని విమాన విడిభాగాలను తయారుచేయడానికి వాడతారు.

d) అల్యూమినియం పాత్రలను రాత్రంతా నీటిలో పెట్టకూడదు. అల్యూమినియం నీటితో చర్య జరిపి ఉష్ణాన్నివిడుదల చేయును. దీని వలన రంగు పోతుంది. కొన్ని సందర్భాలలో అల్యూమినియం సమ్మేళనాలు విషపూరితమైనవి.
2Al + O2 + H2O → Al2O3 + H2

e) అల్యూమినియం తీగలను ప్రసార కేబుల్ తయారీకి వాడతారు. దీనికి కారణం దాని యొక్క మంచి విద్యుద్వాహకత మరియు వాతావరణంలో లోహక్షమత్వం జరుగదు.

ప్రశ్న 6.
సరైన ఉదాహరణతో బోరాక్స్ పూస పరీక్షను వివరించండి. [AP 18,20][Mar’13][TS 16,17,19,20]
జవాబు:
బోరాక్స్ పూస పరీక్ష:
ఈ పరీక్షను గుణాత్మక విశ్లేషణలో కాటయాన్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. బోరాక్స్న వేడి చేయడం వల్ల అది ఉబ్బి, కాంతి నిరోధక పదార్థం, అనార్ధ్ర సోడియమ్ టెట్రా బోరేట్ అవుతుంది. దాన్ని గలనం బొరాక్స్ గ్లాస్ ఏర్పడుతుంది. అందులో సోడియమ్ మెటాబోరేట్, B2O3 లు ఉంటాయి. బోరిక్ ఎన్ హైడ్రైడ్, B2O3, లోహపు ఆక్సైడ్లతో కలిసి మెటాబోరేట్లను రంగు గల పూసలుగా ఏర్పడుతుంది. దీనిలో చర్యలు క్రింది విధంగా జరుగుతాయి.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 11

ప్రశ్న 7.
BF3 BF4 లో B-F బంధ దూరాలు వరుసగా 130pm, 143 pm ఎందుకు వేరువేరుగా ఉన్నాయో కారణాలు సూచించండి.
జవాబు:
BF3 పరమాణువులో ‘B’ పరమాణువు sp² సంకరీకరణం చెందును. BF3 ఆకృతి సమతల త్రిభుజకారం.
BF4 అయాన్ లో ‘B’ పరమాణువు sp³ సంకరీకరణం చెందును. BF4, ఆకృతి టెట్రాహెడ్రల్.
BF3, BF4 లో బోరాన్ వేరు వేరు సంకరీకరణాలు కలిగి ఉండుట కారణం చేత బంధ దైర్ఘ్యాలు వేరువేరుగా ఉన్నవి.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 12

Textual Solved Problems (సాధించిన సమస్యలు)

ప్రశ్న 1.
ఈ కింది సమీకరణాలను తుల్యం చేసి రాయండి.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 13
జవాబు:
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 14

ప్రశ్న 2.
బోరిక్ ఆమ్లం బహ్వాణుకగా ఎందుకు ఉంటుంది?
జవాబు:
బోరిక్ ఆమ్లం పొరలువంటి జాలకం కలిగియుండును. ఈ నిర్మాణంలో BO3 యూనిట్లు హైడ్రోజన్ బంధాలతో కలుపబడి పాలిమర్ (బహ్వుణుక)గా ఏర్పడును.

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

ప్రశ్న 3.
డైబోరేన్, బోరజీన్లలో బోరాన్ సంకరీకరణం ఏమిటి?
జవాబు:
a) డైబోరేన్ (B2H6), B సంకరీకరణం sp³.
b) బోరజీన్ (B3N3H6), B సంకరీకరణం sp².

ప్రశ్న 4.
13 గ్రూప్ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి.
జవాబు:
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 15

ప్రశ్న 5.
బోరజోల్ (బోరజీన్) యొక్క ఆకృతిని మరియు ఫార్ములాను వ్రాయండి?
జవాబు:
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 16
బోరజోల్ యొక్క ఫార్ములా = B3N3H6
బోరజోల్ “హెక్సాగోనల్ వలయాకృతి”ని కలిగి ఉంటుంది.

ప్రశ్న 6.
బనానా బంధం అనగానేమి?
జవాబు:
డై బోరేన్లో వున్న B – H – B వంతెనలు మూడు కేంద్రక, రెండు ఎలక్ట్రాన్ బంధాలు కలిగి వుండటాన్నే ‘బనానా బంధం’ (లేదా) ‘టౌ బంధం’ అని అంటారు.

ప్రశ్న 7.
బోరాన్ మిగిలిన గ్రూపు మూలకాలతో ఏ విధంగా విభేదిస్తుంది. వివరించండి?
జవాబు:
బోరాన్ మిగిలిన గ్రూపు మూలకాలతో క్రింది విధంగా విబేధిస్తుంది.

  1. బోరాన్ అలోహం. మిగిలినవన్నీ లోహాలు మరియు అర్ధలోహాలు.
  2. బోరాన్ సంయోజనీయ సమ్మేళనాలను ఏర్పరుచును. మిగిలినవి అయానిక సమ్మేళనాలను ఏర్పరుస్తాయి.
  3. బోరాన్, ఆమ్లాల నుంచి H2 ను స్థానభ్రంశం చెందించదు. కాని మిగిలినవి ఆమ్లాల నుంచి H2 ను స్థానభ్రంశం చెందిస్తాయి.
  4. బోరాన్ గరిష్ట సంయోజకత 4. కాని మిగిలిన మూలకాల గరిష్ట సంయోజకత 6.

ప్రశ్న 8.
బోరాక్స్ ఉపయోగాలను తెల్పుము?
జవాబు:

  1. బోరాక్స్ పూసపరీక్షను క్షార ప్రాతిపదికలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
  2. బోరాక్స్న కాంతీయ అద్దాలు మరియు పైరెక్స్ గ్లాసులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
  3. బొరాక్స్న తోళ్ళ పరిశ్రమలో తోళ్ళను (చర్మాలను) శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.
  4. బొరాక్స్ను ఆహార పరిరక్షకంగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 9.
ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలంటే ఏమిటి? BCl3 ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనమా? వివరించండి. [TS 22]
జవాబు:
ఎలక్ట్రాన్ కొరత అణువులు:
ఈ అణువులో అన్నీ కోవలెంట్ బంధాలు ఏర్పడటానికి అవసరమయిన ఎలక్ట్రాన్లు అందుబాటులో ఉండవు. కాబట్టి ఒక వింతయిన సందర్భం ఏర్పడుతుంది.

BCl3 ఎలక్ట్రాన్ కొరత సమ్మేళనం. BCl3 ‘B’ లో 8 ఎలక్ట్రాన్లకు బదులుగా 6 ఎలక్ట్రాన్లను కలిగి ఉండును. ఇది ఎలక్ట్రాన్ జంటను స్వీకరిస్తుంది. కావున BCl3 లూయీ ఆమ్లం.
ఉదా: BCl3, NH3 నుంచి ఒంటరి జంట ఎలక్ట్రాన్లను తేలికగా స్వీకరించి BCl3. NH3ను ఏర్పరుస్తుంది.
AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ 17

AP Inter 1st Year Chemistry Important Questions Chapter 10 P బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

ప్రశ్న 10.
అల్యూమినియం సజల HNO3 చర్య జరుపుతుంది. కాని గాఢ HNO3 తో చర్య జరపదు. వివరించండి.
జవాబు:
సజల HNO3 అల్యూమినియంతో నెమ్మదిగా చర్య జరిపి అల్యూమినియం నైట్రేట్ మరియు అమ్మోనియం నైట్రేటును ఏర్పరుస్తుంది.
8Al + 3OHNO3 → 8Al(NO3)3 + 3NH4NO3 + 9H2O
అల్యూమినియం గాఢ HNO3 తో చర్య జరపదు.

కారణాలు:
గాఢ HNO3తో Al క్రియారహితం అవుతుంది. ఇది లోహపు తలంపై ఆక్సైడ్ పొర ఏర్పడటం వల్ల క్రియా రాహిత్యం వస్తుంది. కావున గాఢ HNO3 రవాణాకి అల్యూమినియం పాత్రలు ఉపయోగిస్తారు.

Leave a Comment