AP 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

These AP 9th Class Telugu Important Questions 10th Lesson బతుకు పుస్తకం will help students prepare well for the exams.

AP State Syllabus 9th Class Telugu 10th Lesson Important Questions and Answers బతుకు పుస్తకం

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది పరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. “తాతగారూ మీరసలు దేవుణ్ణి చూశారా?” అని అడిగిన పసివాడైన మనవణ్ణి కసరకుండా ఎంతో హాయిగా ‘నేను చూడలేదురా? ఉన్నాడో లేడో చెప్పలేను. కష్టాలు పంచుకొనే వాడొకడున్నాడనుకుంటే బావుంటుంది కదా ! అందుకని ప్రార్థిస్తున్నాను.” అన్నారట. అదీ శిశువు ముందు శిరసొర్లే నిరహంకారమంటే !
ప్రశ్నలు:
1. ఇక్కడ సంభాషణ ఎవరి మధ్య జరిగింది?
2. పసివాడు ఏమని అడిగాడు?
3. దేవుణ్ణి ప్రార్థించటం దేనికోసం?
4. “అదీ శిశువు ముందు శిరసొగ్గే నిరహంకారమంటే” దీని భావం ఏమిటి?
జవాబులు:
1. తాత-మనవడు
2. మీరసలు దేవుణ్ణి చూశారా?
3. ఆత్మ సంతృప్తి కోసం
4. సరైన జవాబు ఇవ్వలేకపోతున్నా అని, వినయంగా / నిజాయితీగా చెప్పడం

2. మెల్లీని లక్ష్మణరావుగారు మొదట చూసింది కరుణగల విజ్ఞానిగానే ! మెడిసిన్ చదివే ఆ ఇరవై నాలుగేళ్ళ యువతి పాలమీగడ లాంటి తెల్లని ఫ్రాకులో విందుకు వెళ్తూ దారిలో పెంటబండిని ఈడ్వలేకపోతున్న వృద్ధుని అగచాట్లు చూసి సహించలేక బండిని వెనక నుంచి తోసి సహాయపడి విందుకు ఆ నల్లని మరకలతోనే ఆలస్యంగా వెళ్తూ నిస్సంకోచంగా పాల్గొనడం ఆ దారినే ఆ విందుకే వెళ్ళిన లక్ష్మణరావుగారు చూడడం జరిగింది.
ప్రశ్నలు – జవాబులు:
1. ఇక్కడ మెడిసిన్ చదువుతున్నదెవరు?
జవాబు:
మెల్లీ

2. అగచాట్లు పడుతున్నదెవరు?
జవాబు:
వృద్ధుడు

3. విందుకు ఎవరెవరు వెళ్ళారు?
జవాబు:
మెల్లీ, లక్ష్మణరావు

4. ఇక్కడ ఎవరూ సహజంగా చేయలేని పనులు ఏవి?
జవాబు:
పెంటబండిని తోయడానికి వెళ్ళడం (ఫంక్షన్ కు వెళ్తూ కూడా), మరకలతోనే నిస్సంకోచంగా (బిడియపడకుండా) విందుకెళ్ళడం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

3. బెజవాడ సిమెంట్ కంపెనీ కొత్త మేనేజింగ్ డైరెక్టరు నారాయణ గణపతిరాజు గారొకసారి లక్ష్మణరావుగారు తయారు చేసి తెచ్చిన స్టాకిస్టుల జాబితాలో తనకిష్టులైన వారికి హెచ్చుకోటాలు పడలేదనే కోపంతో కాగితాన్ని కింద పడేస్తే “అయ్యా ! దాన్ని ముందు తీసి బల్లమీద పెడతారా? నన్నిప్పుడే రాజీనామా ఇచ్చి పొమ్మంటారా?” అని అడిగారట.
ప్రశ్నలు:
1. ఈ పేరాలోని వ్యక్తుల పేర్లేమిటి?
2. డైరెక్టరుకు ఎందుకు కోపం వచ్చింది?
3. దానికి రెండవ వ్యక్తి ఏమన్నాడు?
4. ఇక్కడ ఏ కంపెనీ పేరు ఉంది?
జవాబులు:
1. నారాయణ గణపతిరాజు, లక్ష్మణరావు
2. స్టాకిస్టు జాబితాలో తన వారికి హెచ్చుకోటా పడలేదని
3. అయ్యా ! దాన్ని ముందు తీసి బల్ల మీద పెడతారా? నన్నిప్పుడే రాజీనామా ఇచ్చి పొమ్మంటారా?
4. బెజవాడ సిమెంట్,

4. నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికానికి బాధ్యతనీ, అజ్ఞానికైనా జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్ని, తగు మాత్రపు ఆర్ధతనూ, తప్పక అందించగలగాలి పుస్తకం. అమ్మో ! మనకెక్కడ అర్థమవుతుంది అనిపించకుండ ఒక డైరీలా, ఒక నేస్తం రాసిన ఉత్తరంలా సన్నిహితంగా ఉండాలి. నాకోసమే ఇంత శ్రమ పడి ఇంత రాసేడు ఓపిక తెచ్చుకుని అనిపించాలి. తన బాధేదో దాచుకోకుండా చెప్తున్నాడు విందాం! అనిపించేంత నిరహంకారంగా, ఆత్మీయంగా ఉండాలి. చదువుతున్నంత సేపు ఎంత చక్కని విషయాలు తెలుసుకుంటున్నామో అనే హాయి కలగాలి. చదివిన తర్వాత ‘నయం’ ‘ఇన్నాళ్ళకైనా దీన్ని చదవగలిగాను’ అనిపించాలి. విషయం క్లిష్టమైనా వివరణ స్పష్టంగా ఉండాలి.
ప్రశ్నలు – జవాబులు:
1. పుస్తకం ఎలా ఉండాలి?
జవాబు:
ఒక డైరీలా, ఒక నేస్తం రాసిన ఉత్తరంలా

2. పుస్తకం ఏమేమి అందించగలగాలి?
జవాబు:
ఉత్సాహం, బాధ్యత, విజ్ఞానం, అర్ధత అందించాలి.

3. స్పష్టంగా ఉండవలసినదేది?
జవాబు:
వివరణ

4. పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
చదివిన తర్వాత ఏమని అనిపించాలి?

5. శబ్దాలకు అర్థాలను తెలిపే గ్రంథాలను నిఘంటువు అంటారు. అనుశాసనం, అభిధానము, కోశము అనేవి దీనికి పర్యాయపదాలు. వీటిల్లో నిఘంటు పదమే అతి ప్రాచీనంగా కనిపిస్తుంది. ఈ పదాలన్నింటిని ఒకచోట కూర్చి పర్యాయములను చూపి, అర్థములను వివరించేవే గ్రంథాలు. భాషకు నిశ్చయముగాను, లెస్సగాను శబ్ద స్వరూపములను, అర్థ విశేషమును తెలుపునది అని వ్యుత్పత్త్యర్ధము.
ప్రశ్నలు:
1. నిఘంటువు అనగా అర్థం?
2. నిఘంటువుకు ఉన్న పర్యాయపదాలేవి?
3. నిఘంటువుకు ఉన్న వ్యుత్పత్త్యమేమి?
4. ‘గ్రంథాలు’ విడదీయుము.
జవాబులు:
1. శబ్దాలకు అర్థాలను తెలుపు గ్రంథం.
2. అనుశాసనం, అభిధానం, కోశం
3. భాషకు నిశ్చయముగాను, లెస్సగాను శబ్ద స్వరూపములను అర్థ విశేషాలను తెలుపునది.
4. గ్రంథ + ఆలు

6. సంక్రాంతి కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద పండుగ. వాస్తవానికి ఇదీ పంటల పండుగ. పల్లెటూళ్ళలో అప్పుడు పంటలు ఇంటికి చేరి, ప్రతి ఇల్లు ధాన్యలక్ష్మితో కళకళలాడుతూ ఉంటుంది. రైతులు ఉత్సాహంగా || ఉంటారు. సంక్రాంతి అంటే సంక్రమణం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడాన్ని సంక్రమణం అంటారు. సంక్రాంతి నుండి సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. కనుకనే ‘మకర సంక్రాంతి’ అని పేరు వచ్చింది. ఆనాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా రోజూ కొందరు సంకల్పం చెప్పుకుంటారు. ఎండాకాలం సమీపిస్తుందని
సంక్రాంతి హెచ్చరిస్తుంది. అందరూ కొత్త బట్టలు ధరించడం ఒక ఆచారం.
ప్రశ్నలు – జవాబులు:
1. కొత్త సంవత్సరంలో తొలి పెద్ద పండుగ ?
జవాబు:
సంక్రాంతి

2. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని ఏమంటారు?
జవాబు:
సంక్రమణం

3. సంక్రాంతి ఏమని హెచ్చరిస్తుంది?
జవాబు:
ఎండాకాలం సమీపిస్తుందని

4. ఈ పండుగ ఏ పుణ్యకాలాన్ని తెలుపుతుంది?
జవాబు:
ఉత్తరాయణ పుణ్యకాలం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

ఈ కింది సమీక్ష చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2018-19)

7. వాల్మీకి రామాయణం ప్రాతిపదికగా తెలుగులో ఎన్నో రామాయణాలు వచ్చాయి. ఆ పరంపరలోనిదే టంగుటూరి మహలక్ష్మి రచించిన సుమధుర రామాయణం. పద్నాలుగు వందల తేటగీతులలో తేట తెలుగులో శబ్దశక్తి, అర్థయుక్తితో సరళసుందరంగా ఆవిష్కరించారు. పఠనయోగ్యత, కల్పనాచాతుర్యం ఈ గ్రంథం ప్రత్యేకతలు.
సుమధుర రామాయణం రచన – టంగుటూరి మహలక్ష్మి
పేజీలు – 248, వెల రూ. 180 సమీక్షకులు డా. విద్వత్ శ్రీనిధి.
ప్రశ్నలు:
1. సుమధుర రామాయణాన్ని సమీక్షించింది ఎవరు?
2. రచయిత్రి రామాయణాన్ని ఏ ఛందస్సులో రాశారు?
3. ఈ గ్రంథం ప్రత్యేకత ఏమిటి?
4. పై సమీక్ష ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబులు:
1. డా|| విద్వత్ శ్రీనిధి
2. తేటగీతి
3. పఠనయోగ్యత, కల్పనాచాతుర్యం
4. సుమధుర రామాయణంలోని పద్యాల సంఖ్య ఎంత?

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
లక్ష్మణరావుగారు తను రాసిన పుస్తకాన్ని వాళ్ళమ్మగారికి ఇచ్చినపుడు ఆమె చెప్పిన మాటలేమిటి?
జవాబు:
లక్ష్మణరావుగారు తొలుత రాసిన ‘అతడు – ఆమె’ పుస్తకంగా ప్రచురిస్తూ బైండు చేయించడానికి ముందు అచ్చుప్రతిని వాళ్ళమ్మగారికి, పిన్నులకు ఇచ్చారు. అది చదివిన వాళ్ళమ్మగారు మొగుడూ – పెళ్ళాల కీచులాట ఏమీ బాగాలేదు. దేశంలో స్వాతంత్ర్యం యజ్ఞం జరుగుతోంది. ఈ మహా సంగ్రామం పూర్వరంగంగా మలి నవల చిత్రించి ఉంటే బాగుండేది. నవలకు కొంత విలువ ఉండేది. ఇప్పటి రూపంలో నవల అతి సామాన్యంగా ఉంది” అన్నారు.

ప్రశ్న 2.
“సహృదయుడైన రచయిత అంటే లక్ష్మణరావులా ఉండాలి” – దీనిపై మీ అభిప్రాయం.
జవాబు:
నూటికి నూరుపాళ్ళు ఈ మాటతో నేను ఏకీభవిస్తాను. ‘సామాన్యంగా ఉంది నవల’ అని విమర్శించిన తల్లి మాటను గౌరవిస్తూ, ప్రచురణ ఆపు చేయించి, మళ్ళీ కొత్తగా వాళ్ళమ్మ గారి విమర్శను దృష్టిలో ఉంచుకొని అనేక చోట్ల బాగా మార్చి తిరగరాసిన లక్ష్మణరావు నిజంగా సహృదయుడైన రచయిత అని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
“అతడు ఆమె”, “బతుకు పుస్తకం” రచనలు సావిత్రిలో ఎలాంటి భావాలు కల్గించాయి?
జవాబు:
సమాజానికి ఉప్పల లక్ష్మణరావుగారి వంటి నిజాయితీ గల సాహితీమూర్తుల ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం అనే చెప్పాలి. వారి “అతడు – ఆమె” చదివినప్పుడు దశాబ్దాలుగా నాలో ఉన్న నీరసం పటా పంచలై ఎక్కడాలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. తనతో సమంగా ప్రతి ఒక్కరూ జీవించాలనే సదాశయం గల వ్యక్తి తప్పించి మరొకరు రాయలేరు ఆ పుస్తకం అన్పించింది. ‘బతుకు పుస్తకం’ నా ఆశ నిజమేనని నిరూపించింది. ‘అతడు – ఆమె’ వంటి పుస్తకం రాయగలిగే అర్హత వారికే ఉన్నదని నిరూపించింది ఈ బతుకు పుస్తకం. అని సావిత్రి తనలోని భావాలు ఇలా పంచుకొంది.

ప్రశ్న 4.
ఉప్పల లక్ష్మణరావు గారి గూర్చి రాయండి.
జవాబు:
రచయితగా ‘అతడు – ఆమె’ నవలతో ప్రసిద్ధులైన ఉప్పల లక్ష్మణరావుగారు 1898 ఆగస్టు 11న బరంపురంలో జన్మించారు. కలకత్తాలో బి.ఎస్.సి. వృక్షశాస్త్రం చదివి, పై చదువుల కోసం ఎడిన్‌బరోకు, జర్మనీకి వెళ్ళి వృక్షశాస్త్ర పరిశోధనలో డాక్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసారు. కాకినాడ కళాశాలలో, ఆలీఘడ్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేసారు. “ప్రాచీన భారతంలో బానిసలు” అనే రచనను జర్మనీ నుండి తెలుగులోకి అనువదించారు. ‘అతడు – ఆమె’ నవలతో ప్రసిద్ధులయ్యారు. ‘బతుకు పుస్తకం’ వీరి ఆత్మకథ. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా వెలువడినప్పుడే ఇది ఎందరినో ఆకర్షించింది. రాసిన రెండు పుస్తకాలతోనే సాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. సాంఘిక, రాజకీయ, విద్యా, పారిశ్రామిక రంగాలలోనూ సేవ చేసారు.

ప్రశ్న 5.
‘పుస్తక పరిచయం’ ప్రక్రియ గూర్చి రాయండి. ఈ (S.A.II 2018-19)
జవాబు:
ఏదైనా ఒక పుస్తకాన్ని సమగ్రంగా చదివి అందులోని విషయాల్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ, గుణదోషాల్ని తెలియజేయడమే పుస్తక పరిచయం. ఇది చదవగానే ఆ పుస్తకం మీద ప్రాథమిక అవగాహన, చదవాలనే ఆసక్తి కల్గుతాయి. దీనికే ముందుమాట, పీఠిక, తొలిపలుకు, మున్నుడి, అవతారిక అను నామాంతరాలు.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1: పర్యాయపదాలు :

కరుణ : దయ, జాలి
నిదర్శనం : దృష్టాంతం, ఉదాహరణ
ఏకీభవించు : ఒక్కటియగు, కలిసిపోవు
సన్నిహితం : చేరువ, సమీపం
స్వస్తిచెప్పు : చాలించు, ముగించు
ఇల్లాలు : భార్య, అర్ధాంగి
నేస్తం : స్నేహితుడు, మిత్రుడు
అబ్దం : సంవత్సరం, ఏడాది
దాస్యం : సేవ, బానిసం
యజ్ఞం : యాగం, హోమం
సౌజన్యం : సుజనత్వం, మంచితనం
జైలు : చెరసాల, కారాగారం

2. నానార్థాలు :

ఆశ్రమం : పర్ణశాల, మునిపల్లె, మఠం, గుడిసె
విమర్శ : పరామర్శ, తిట్టు
వృద్ధుడు : ముసలివాడు, తెలిసినవాడు
అర్థం : శబ్దార్థం, కారణం, ధనం
స్వస్తి : శుభం, ముగింపు
అబ్దం : సంవత్సరం, అద్దం, మేఘం

3. ప్రకృతి – వికృతులు :

పుస్తకం – పొత్తం
స్త్రీ – ఇంతి
ఉత్తరం – ఉత్తరువు (జవాబు)
శ్రమ – చెమట, సొమ్ము
యజ్ఞం – జన్నం
సౌందర్యం – చందు
స్నేహం – నేస్తం, నెయ్యం
విజ్ఞానం – విన్నాణం
ప్రజా – పజ
మూర్ఖ – మంకు
అమావాస్య – అమవస, అమాస
రాత్రి – రాతిరి, రేయి, రేతిరి
ఆశ – ఆస

4. సంధులు :

సత్ + ఆశయం = సదాశయం – జత్త్వసంధి
దశ + అబాలు = దశాబ్దాలు – సవర్ణదీర్ఘ సంధి
స్వాతంత్ర్య + ఉద్యమం = స్వాతంత్ర్యోద్యమం – గుణసంధి
నిః + అహంకారం = నిరహంకారం – విసర్జరేఫాదేశ సంధి
అభి + అంతరం = అభ్యంతరం – యణాదేశ సంధి
అతి + అంత = అత్యంత – యణాదేశ సంధి
అభి + ఉదయం = అభ్యుదయం – యణాదేశ సంధి
ని + సంకోచం = నిస్సంకోచం – విసర్గసంధి
నిః + శబ్దం = నిశ్శబ్దం – విసర్గ సంధి
శత + అబ్దం = శతాబ్దం – సవర్ణదీర్ఘ సంధి
శ్రమము + పడి = శ్రమపడి – పడ్వాదిసంధి
దుసు + సాహసం = దుస్సాహసం – విసర్గ సంధి
ఇష్టులు + ఐన = ఇష్టులైన – ఉత్వసంధి
శిరసు + ఒగై = శిరసొగ్గా – ఉత్వసంధి
సు + అస్తి = స్వస్తి – యణాదేశ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

5. సమాసాలు :

దశాబ్దం = దశ సంఖ్య గల అబ్దం – ద్విగు సమాసం
శతాబ్దం = శత సంఖ్య గల అబ్దం – ద్విగు సమాసం
సదాశయం = మంచిదైన ఆశయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దాస్య శృంఖాలు = దాస్యమనెడి శృంఖలాలు – రూపక సమాసం
మహాగ్రంథం = గొప్పదైన గ్రంథం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
రెండురోజులు = రెండు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం
మెగుడు పెళ్ళాలు = మెగుడు మరియు పెళ్ళాము – ద్వంద్వ సమాసం
ప్రతిరోజు = రోజూ, రోజూ – అవ్యయీభావ సమాసం
స్త్రీల అభ్యుదయం = స్త్రీల యొక్క అభ్యుదయం – షష్ఠీ తత్పురుష సమాసం
వృద్ధుని అగచాట్లు = వృద్ధుని యొక్క అగచాట్లు – షష్ఠీ తత్పురుష సమాసం
సబర్మతి ఆశ్రమం = సబర్మతి అను పేరుగల ఆశ్రమం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
దేశచరిత్ర = దేశము యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసం

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం 1 Mark Bits

1. రమేశ్ నిన్న చదివాడు (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) రమేశ్ రేపు చదవడు
బి) రమేశ్ నిన్నట్నుంచీ చదువుతున్నాడు
సి) రమేశ్ నిన్న చదవలేదు.
డి) రమేశ్ నేడు చదవలేదు.
జవాబు:
సి) రమేశ్ నిన్న చదవలేదు.

2. రాము ఎక్కడ ఉన్నాడు ? (ఇది ఏ రకమైన వాక్యం) (S.A.I-2018-19)
ఎ) హేత్వర్థక వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) ఆశ్చర్యార్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
డి) ప్రశ్నార్థక వాక్యం

3. కింది వానిలో ప్రశ్నార్థకం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) మోహన్ వస్తాడా?
బి) మోహన్ వస్తాడో ! రాడో !
సి) మోహన్ రావచ్చు.
డి) మోహన్ రావద్దు.
జవాబు:
ఎ) మోహన్ వస్తాడా?

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

4. ఆమె రాత్రి వేళ గేటు దూకి, గస్తీ కాసింది. (ఈ సంక్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మార్చినది గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఆమె రాత్రి వేళ గేటు దూకి, గస్తీ కాయలేదు.
బి) ఆమె రాత్రి వేళ గేటు దూకలేదు, గస్తీ కాయలేదు.
సి) ఆమె రాత్రి వేళ గేటు దూకినా, గస్తీ కాయలేదు.
డి) ఆమె రాత్రి వేళ గేటు దూకింది, ఆమె రాత్రి వేళ గస్తీ కాసింది.
జవాబు:
డి) ఆమె రాత్రి వేళ గేటు దూకింది, ఆమె రాత్రి వేళ గస్తీ కాసింది.

భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)

1. అర్థాలు :

5. మహాత్ముల ఆవిర్భావం సమాజ శ్రేయస్సు కొరకు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కలయిక
B) పుట్టుక
C) నడక
D) ప్రయాణం
జవాబు:
B) పుట్టుక

6. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) స్త్రీ
B) మహిళ
C) భార్య
D) యువతి
జవాబు:
C) భార్య

7. నాకు డైరీ రాసే అలవాటు ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పుస్తకం
B) పేపరు
C) రోజు
D) దినచర్య
జవాబు:
D) దినచర్య

8. అనాలోచితమైన పనులు అగచాట్లు పాలు చేస్తాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఆపదలు
B) ఆకలి
C) ఆనందం
D) కోపం
జవాబు:
A) ఆపదలు

9. దేశ సరిహద్దుల్లో సిపాయిలు ప్రాణాలు పణంగా పెట్టి గస్తీ తిరుగుతారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కాలక్షేపం
B) కాపలా
C) కులాసా
D) నిర్లక్ష్యం
జవాబు:
B) కాపలా

10. పుస్తకం, నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికామికి బాధ్యతనీ అందించగలగాలి – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) చురుకైన
B) పనిలేనివాడు
C) తెలివైనవాడు
D) అజ్ఞాని
జవాబు:
B) పనిలేనివాడు

11. నాలో పేరుకుపోయిన నీరసం పటాపంచలై పోయింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఎక్కువ
B) తక్కువ
C) చెల్లాచెదురు
D) ముక్కముక్కలు
జవాబు:
C) చెల్లాచెదురు

12. లక్ష్మణరావు గారు బోటనీ పరిశోధనలకు స్వస్తి చెప్పారు – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) మంగళము
B) శుభము
C) ముగింపు
D) కొనసాగించు
జవాబు:
C) ముగింపు

2. పర్యాయపదాలు :

13. చదువును యజ్ఞంలా భావించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఆగం, యాగం
B) హోమం, యాగం
C) హోమం, హూనం
D) యూపం, పాపం
జవాబు:
B) హోమం, యాగం

14. భరతమాత దాస్య శృంఖలాలు మహాత్ముల త్యాగాలతో తొలగాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ధనిక, పేద
B) పరిచర్య, పని
C) సేవ, బానిసత్వం
D) సాయం, పని
జవాబు:
C) సేవ, బానిసత్వం

15. చెడు అలవాట్లకు స్వస్తి పలకాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ముగింపు, చాలించు
B) ఆపు, మొదలు
C) తొలి, మలి
D) శుభం, జైహింద్
జవాబు:
A) ముగింపు, చాలించు

16. మా ఊరిలో నేను మిత్రుల సౌజన్యంతో కిరాణాషాపు పెట్టాను – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) స్నేహం, మిత్రుడు
B) చుట్టం, బంధువు
C) మంచి, చెడు
D) మంచితనం, సుజనత్వం
జవాబు:
D) మంచితనం, సుజనత్వం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

17. దేశద్రోహులను పట్టి, జైలులో బంధించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఇల్లు, నివాసం
B) చెరసాల, కారాగారం
C) బందిఖానా, గృహం
D) నిలయం, ఆవాసం
జవాబు:
B) చెరసాల, కారాగారం

14. భగవంతుని సృష్టి గొప్పదని చెప్పడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కారణం, హేతువు
B) లక్ష్యం, గమ్యం
C) దృష్టాంతం, ఉదాహరణ
D) ఋజువు, మూలం
జవాబు:
C) దృష్టాంతం, ఉదాహరణ

18. మెల్లీ స్విట్జర్లాండు మహిళ. ఈమె లక్ష్మణరావు గారి ఇల్లాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) స్త్రీ, యువతి
B) నారి, వనిత
C) పడతి, ఇల్లాలు
D) ఉవిద, విజ్ఞాని
జవాబు:
B) నారి, వనిత

19. లక్ష్మణరావుగారి తల్లి మంచి విమర్శకురాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అమ్మ, మాత
B) జనని, తండ్రి
C) మహిళ, యువతి
D) జనయిత్రి, స్త్రీ
జవాబు:
A) అమ్మ, మాత

20. పుస్తకం జిజ్ఞాసువుకు విజ్ఞానాన్ని అందివ్వాలి – గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది?
A) జ్ఞాని
B) విజ్ఞాని
C) తెలిసికోగోరువాడు
D) అజ్ఞాని
జవాబు:
C) తెలిసికోగోరువాడు

3. నానార్థాలు :

21. పూర్వం మునులు ఆశ్రమ ధర్మాలు పాటించి, ధర్మాన్ని నిలిపారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పర్ణశాల, మఠం
B) గుడిసె, పూరిల్లు
C) మదం, ముదం
D) కుటీరం, ఇల్లు
జవాబు:
A) పర్ణశాల, మఠం

22. బాధ్యతగా పని చేసేటప్పుడు విమర్శలు సహజం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తిట్టు, పొగడ్త
B) పరామర్శ, తిట్టు
C) పరామర్శ, విసుగు
D) దూషణ, భీషణ
జవాబు:
B) పరామర్శ, తిట్టు

23. వయసు పెరిగినవాడు వృద్ధుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ముదుసలి, తాత
B) పెద్ద, చిన్న
C) ముసలివాడు, తెలిసినవాడు
D) తెలిసినవాడు, కుర్రాడు
జవాబు:
C) ముసలివాడు, తెలిసినవాడు

24. పరీక్షల సమయంలో ఆటలకు స్వస్తి పలకాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ప్రారంభం, ముగింపు
B) మొదలు, చివర
C) శుభం, అశుభం
D) శుభం, ముగింపు
జవాబు:
D) శుభం, ముగింపు

25. మనం మాట్లాడే మాటకు అర్థం ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ధనం, సంపద
B) శబ్దార్ధం, కారణము
C) కారణం, హేతువు
D) శబ్దార్ధం, భావం
జవాబు:
B) శబ్దార్ధం, కారణము

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

26. నారీమణులను విస్మరించకూడదు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పట్టణం, ఇల్లు
B) స్త్రీ, వింటి త్రాడు
C) స్వేచ్ఛ, భిన్నం
D) కలశం, కమలం
జవాబు:
B) స్త్రీ, వింటి త్రాడు

4. ప్రకృతి – వికృతులు :

27. ఆశ్వియుజ అమావాస్య నాడు దీపావళి పండుగ – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆమాసా
B) అమావాస
C) అమవస
D) అవమస
జవాబు:
C) అమవస

28. శ్రమను నమ్మి బ్రతికేవారు శ్రామికులు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సొమ్మ
B) శమ
C) సమ
D) ప్రేమ
జవాబు:
A) సొమ్మ

29. మూర్ఖుల మనసును రంజింపలేము – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) మూడుడు
B) మంకు
C) మూర్కు
D) మెట్ట
జవాబు:
B) మంకు

30. పుస్తకం హస్త భూషణం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) పుసకం
B) పుసతకం
C) పుస్కం
D) పొత్తం
జవాబు:
D) పొత్తం

31. యజ్ఞ యాగాదులు దేవతల ప్రీతికై చేస్తారు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) జతనం
B) జన్నం
C) మగ్గం
D) యెగ్గం
జవాబు:
B) జన్నం

32. ఇంతుల అందాలు మేలు బంతులు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) స్త్రీ
B) యువతి
C) కన్య
D) మహిళ
జవాబు:
A) స్త్రీ

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

33. దాస్య శృంఖలములను ట్రెంచడానికి స్వాతంత్ర్యోద్యమం సాగింది – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) సంకెల
B) సంఖల
C) జంకులు
D) గొలుసు
జవాబు:
A) సంకెల

5. సంధులు :

34. సదాశయాలతో నాయకులు దేశాన్ని ముందుకు నడిపించాలి – గీత గీసిన పదాన్ని విడదీయుము.
A) సద + ఆశయం
B) సత్ + ఆశయం
C) సదా + అశయం
D) సత్ + ఆశయం
జవాబు:
B) సత్ + ఆశయం

35. ‘నిః + అహంకారం’ – పదాన్ని కలపండి.
A) నిహహంకారం
B) ని అహంకారం
C) నిరహంకారం
D) నీ అహంకారం
జవాబు:
C) నిరహంకారం

36. ‘అత్యంత’ – సంధి పేరేమిటి?
A) యణాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గుణసంధి
D) త్రికసంధి
జవాబు:
A) యణాదేశ సంధి

37. ‘నిశ్శబ్దం’ – పదాన్ని విడదీయండి.
A) నిర్ + శబ్దం
B) ని + శబ్దం
C) అన్ + శబ్దం
D) నిః + శబ్దం
జవాబు:
D) నిః + శబ్దం

38. ‘స్వస్తి’ – పదాన్ని విడదీయండి.
A) స్వ + అస్తి
B) సు + అస్తి
C) సస్ + అస్తి
D) స్వస్ + అస్తి
జవాబు:
B) సు + అస్తి

39. శ్రమము + పడి – సంధి పేరేమిటి?
A) పుంప్వాదేశ సంధి
B) ఆమేడిత సంధి
C) పడ్వాది సంధి
D) ప్రాతాదిసంధి
జవాబు:
C) పడ్వాది సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

40. ‘దుష్టులైన’ – సంధి పేరేమిటి?
A) ఉత్వసంధి
B) ఇత్వసంధి
C) అత్వసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) ఉత్వసంధి

41. ‘శతాబ్దం’ – విడదీసి రాయండి.
A) శత్ + అబ్దం
B) శత + బ్దం
C) శః + అబ్దం
D) శత + అబ్దం
జవాబు:
D) శత + అబ్దం

42. మెల్లి స్విట్జర్లాండు దేశస్థురాలు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
A) దేశస్థు + రాదు
B) దేశస్థ + రాలు
C) దేశస్థ + ఆలు
D) దేశస్థు + ఆలు
జవాబు:
A) దేశస్థు + రాదు

43. ‘దేశపు దాస్యము’ లో గల సంధి ఏది?
A) రుగాగమ సంధి
B) పుంప్వాదేశ సంధి
C) టుగాగమ సంధి
D) ఇత్వ సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

44. ‘దుడుకు + దుడుకు’ – సంధి కలిపిన పదాన్ని గుర్తించండి.
A) దుడుకుదుడుకు
B) దుందుడుకు
C) తుందుడుకు
D) దుడుస్టుడుకు
జవాబు:
B) దుందుడుకు

45. ‘అభ్యుదయము’ సంధి పదాన్ని విడదీయండి.
A) అభ్యు + దయము
B) అభి + యుదయము
C) అభి + ఉదయము
D) అభ్యుద + యము
జవాబు:
C) అభి + ఉదయము

6. సమాసాలు :

46. దశాబ్దాల నుండి పేదవాడు పేదవానిగానే ఉన్నాడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
A) దశమైన అబ్దం
B) దశ సంఖ్యగల అబ్దం
C) దశమనెడి అబ్దం
D) దశము, అర్ధము
జవాబు:
B) దశ సంఖ్యగల అబ్దం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

47. ‘దాస్య శృంఖలాలు’ – విగ్రహవాక్యంలోని పదాన్ని గుర్తించండి.
A) యొక్క
B) కొఱకు
C) అనెడి
D) వలన
జవాబు:
C) అనెడి

48. ‘రోజూ, రోజూ’ సమాస పదం గుర్తించండి.
A) ప్రతిరోజు
B) రోరోజూ
C) రోజూ రోజూ
D) అన్ని రోజు
జవాబు:
A) ప్రతిరోజు

49. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ గుర్తించండి.
A) మహాగ్రంథం
B) సదాశయం
C) శతాబ్దం
D) సబర్మతి ఆశ్రమం
జవాబు:
D) సబర్మతి ఆశ్రమం

50. ‘మొగుడు పెళ్ళాలు’ – సమాసం పేరేమిటి?
A) ద్విగు
B) ద్వంద్వం
C) రూపకం
D) బహువ్రీహి
జవాబు:
B) ద్వంద్వం

51. ‘స్త్రీల అభ్యుదయం’ – విగ్రహవాక్యంలోని విభక్తిని గుర్తించండి.
A) గూర్చి
B) వలన
C) యొక్క
D) అందు
జవాబు:
C) యొక్క

52. “దాస్యమనెడి శృంఖలాలు’ – సమాస పదంగా కూర్చండి.
A) దాస్య శృంఖలాలు
B) దాస్యం శృంఖలాలు
C) దాస్యపు శృంఖలాలు
D) శృంఖలా దాస్యం
జవాబు:
A) దాస్య శృంఖలాలు

53. ‘స్వాతంత్ర్య యజ్ఞము’ – దీని విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) స్వాతంత్ర్యము కొఱకు యజ్ఞము
B) స్వాతంత్ర్యము యొక్క యజ్ఞము
C) స్వాతంత్ర్యమనే యజ్ఞము
D) స్వాతంత్ర్యమును, యజ్ఞమును
జవాబు:
C) స్వాతంత్ర్యమనే యజ్ఞము

54. ‘స్త్రీల పత్రికలు’ – ఇది ఏ సమాసమో గుర్తించండి.
A) తృతీయా తత్పురుష
B) బహు బీహి
C) ద్వంద్వ
D) చతుర్థి తత్పురుషము
జవాబు:
D) చతుర్థి తత్పురుషము

7. గణాలు :

55. మ, స, జ, స, త, త, గ గణాలు గల వృత్తము ఏది?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) శార్దూలము
D) తేటగీతి
జవాబు:
C) శార్దూలము

56. ఉపమానోపమేయములకు భేదం లేనట్లు చెప్పే అలంకారము ఏది?
A) ఉపమా
B) రూపకము
C) ఉత్ప్రేక్ష
D) శ్లేష
జవాబు:
B) రూపకము

8. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

57. ‘ఈతరాని కప్ప యే దేశమందైన నుండునా ?’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఈతరాని కప్ప ఏ దేశంలోనూ ఉండదు
B) ఈతరాని కప్ప ఎక్కడేనా ఉంటుందా?
C) ఈతరాని కప్ప ఏ దేశము నందూ ఉండదు
D) ఈతరాని కప్ప ఎక్కడా ఉండదు కదా !
జవాబు:
B) ఈతరాని కప్ప ఎక్కడేనా ఉంటుందా?

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

58. ‘ఏమి గతిందలంచినం పగకు మేలిమి లేమి ధ్రువంబు’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఏ విధంగా తలచినా పగ మంచిది కాదు
B) ఏ విధంగా చూసినా పగ నిశ్చయంగా మంచిది
C) ఏమి గతిని చూచినా నిశ్చితంగా శత్రుత్వము మంచిది కాదు
D) ఏమి గతి తలచినా ధ్రువముగా పగ మంచి కాదు
జవాబు:
B) ఏ విధంగా చూసినా పగ నిశ్చయంగా మంచిది

9. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం:

59. లక్ష్మణరావు బతుకు పుస్తకం రాసారు – కర్మణి వాక్యం గుర్తించండి.
A) లక్ష్మణరావుచే బతుకు పుస్తకం రాయబడింది
B) లక్ష్మణరావుచే రాయబడింది
C) లక్ష్మణరావు బతుకు పుస్తకం రాస్తారు
D) లక్ష్మణరావు బతుకు పుస్తకం రాస్తున్నారు
జవాబు:
A) లక్ష్మణరావుచే బతుకు పుస్తకం రాయబడింది

60. మెల్లీ లక్ష్మణరావుచే చూడబడింది – కర్తరి వాక్యం?
A) మెల్లీ లక్ష్మణరావును చూసింది.
B) లక్ష్మణరావును చూసింది మెల్లీ.
C) మెల్లీని లక్ష్మణరావు చూశారు కాదు
D) లక్ష్మణరావుచే మెల్లీ చూడబడింది
జవాబు:
A) మెల్లీ లక్ష్మణరావును చూసింది.

61. ‘రమేష్ భారతాన్ని చదివాడు’ – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) రమేష్ చే భారతం చదవబడింది
B) రమేష్ చే భారతాన్ని చదువుతాడు
C) రమేష్ భారతాన్ని చదువుతాడు
D) రమేష్ భారతం చదువగలడు
జవాబు:
A) రమేష్ చే భారతం చదవబడింది

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

62. ‘వారిచే విషయం గమనింపబడుతుంది’ – ఈ వాక్యానికి కర్తరి వాక్యాన్ని గుర్తించండి.
A) వారు విషయం గమనిస్తారు
B) వారు విషయాన్ని గమనిస్తారు
C) వారివల్ల విషయము గమనింపబడుతుంది
D) వారు తప్పక విషయం చూస్తారు
జవాబు:
B) వారు విషయాన్ని గమనిస్తారు

3. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం :

63. ‘ఇది అంతర్జాతీయ సమస్య అవుతుంది’ అని మెల్లీ బెదిరించింది – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) ఇది అంతర్జాతీయ సమస్య అవుతుందని మెల్లీ బెదిరించింది
B) అది అంతర్జాతీయ సమస్య కాగలదు
C) అది అంతర్జాతీయ సమస్య అవుతుందని మెల్లీ బెదిరించింది
D) అది అంతర్జాతీయ సమస్య అని మెల్లీ చెప్పింది
జవాబు:
C) అది అంతర్జాతీయ సమస్య అవుతుందని మెల్లీ బెదిరించింది

4. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

64. ఆయన ఆవేదన పడలేదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) ఆవేదన పడ్డారు
B) ఆయన పడ్డారు
C) ఆయన ఆవేదన పడ్డారు
D) పడిరి
జవాబు:
C) ఆయన ఆవేదన పడ్డారు

65. ఆమె బెదిరించింది – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) బెదిరించలేదు
B) ఆమె బెదిరించలేదు
C) అతణ్ణి బెదిరంచలేదు
D) లేదు
జవాబు:
B) ఆమె బెదిరించలేదు

66. మనశ్శాంతి కలిగించాలి – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మనశ్శాంతి కలిగించకూడదు
B) మనశ్శాంతి లేదు
C) మనశాంతి రాదు
D) కల్గించకూడదు
జవాబు:
A) మనశ్శాంతి కలిగించకూడదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

67. ‘ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడలేదు’ – దీని వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి.
A) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది
B) ఒక్క పలుకే ఆయన నోటి నుండి వెలువరించాడు
C) ఒక్క పలుకు ఆయన నోట వచ్చింది
D) ఒక్క పలుకు ఆయన వెలువరించాడు
జవాబు:
A) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది

5. వాక్య రకాలను గుర్తించడం :

68. ‘మానసికంగా ఎదిగినట్లైతే’ విజయం కల్గుతుంది – గీత గీసిన వాక్యం ఏ రకమైన వాక్యం?
A) క్వార్థకము
B) శత్రర్థకము
C) చేదర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
C) చేదర్థకం

69. ‘అతడి దైన్య స్థితిని చూశారా?’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) ఆశీరర్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
C) ప్రశ్నార్థకం

Leave a Comment