AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకుంది? (AS1)
జవాబు:
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొనటానికి గల కారణం :

  1. దేశం పారిశ్రామికీకరణ చెందాలంటే, వివిధ రకాల కర్మాగారాలు పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలు వంటి కొన్ని మౌలిక సౌకర్యాలు అవసరం.
  2. ఈ అవసరమైన సరుకులను – యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలంటారు.
  3. అనేక కర్మాగారాలకు అవసరమయ్యే మౌలిక సరుకులను ఈ మౌలిక పరిశ్రమలు అందిస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ పరిశ్రమలను స్థాపించటానికి బాధ్యత తీసుకుంది.

ప్రశ్న 2.
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలోనే పరిశ్రమలు ఎందుకు నెలకొల్పబడ్డాయి? (AS1)
జవాబు:
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పబడడానికి కారణాలు :

  1. ముడి సరుకుల లభ్యత
  2. కూలీల అందుబాటు
  3. పెట్టుబడి
  4. విద్యుత్
  5. మార్కెట్ వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని పరిశ్రమలను స్థాపించుతారు.
  6. అందువల్లనే పరిశ్రమలు అన్ని అంశాలు అనువుగా అందుబాటులో ఉండే ప్రదేశాల్లో లేదా తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల ప్రదేశాల్లో నెలకొల్పుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
మౌలిక సరుకుల పరిశ్రమలు ఏవి? వినియోగ వస్తువుల పరిశ్రమలకూ వీటికీ తేడా ఏమిటి? (AS1)
జవాబు:
యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు ప్రజలు ఉపయోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలను వినియోగ వస్తువుల పరిశ్రమలంటారు.

మౌలిక సరుకుల పరిశ్రమలు వినియోగ వస్తువుల పరిశ్రమలు
1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోలేరు. 1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోగలరు.
2. వీటిని ఉపయోగించి వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయవచ్చును. 2. వీటిని ప్రజలు తమ అవసరాల కొరకు ఉపయోగించుకొంటారు.

ప్రశ్న 4.
ఖనిజ వనరులు ఉన్న పట్టణాలు / ప్రాంతాల పేర్లు విద్యార్థులచే గుర్తింపజేసి, అక్కడ ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చో వాళ్లని రాయమనండి. (AS1)
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 1
జవాబు:

ప్రశ్న 5.
అంతకుముందు ప్రభుత్వ రంగానికే పరిమితమైన అనేక పరిశ్రమలలోకి 1990లలో ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? (AS4)
జవాబు:

  1. కర్మాగారాలలో తయారైన వినియోగ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం చట్టాలను సడలించింది.
  2. భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను ప్రత్యేకించి కొత్త వాణిజ్యవేత్తలను ప్రోత్సహించటానికి ప్రభుత్వ నియమాలను సరళీకృతం చేశారు.
  3. ప్రభుత్వ ఆధీనంలోని పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచటానికి వాటిలో కొన్నింటిని అమ్మేశారు.
  4. ఈ పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించే నిధులను కూడా తగ్గించేశారు.
  5. ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోటానికి ఈ కంపెనీలను అనుమతించసాగారు.
  6. కొత్త సాంకేతిక విజ్ఞానం దేశంలోకి వచ్చేలా, ఉత్పత్తి చేసిన సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడానికి విదేశీ, ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలను భారతదేశంలో పరిశ్రమలు స్థాపించటానికి ప్రోత్సహించసాగారు.

ప్రశ్న 6.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:

  1. పారిశ్రామిక సంస్థల సంఖ్య పెరిగింది. కానీ ఉపాధి ఆశించినంతగా పెరగలేదు. ఎక్కువగా చిన్న చిన్న ఉద్యోగాలే కల్పించబడ్డాయి.
  2. ప్రస్తుతం భారతదేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించే రెండు లక్షల పెద్ద కర్మాగారాలున్నాయి.
  3. అసంఘటిత రంగంగా పేర్కొనే 3 కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలున్నాయి.
  4. ఇవన్నీ కలిపి దేశంలోని 46 కోట్ల కార్మికవర్గంలో అయిదింట ఒక వంతుకు ఉపాధి కల్పిస్తున్నాయి.
  5. కర్మాగారాలలో ఉపాధి పొందే కార్మికుల శాతాన్ని ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు.
  6. కార్మికులకు మెరుగైన జీతాలు, మెరుగైనని సురక్షిత పని పరిస్థితులు, ఆరోగ్య వైద్య సదుపాయాలను పరిశ్రమల యాజమాన్యాలు కల్పించేలా భారతదేశంలో అనేక చట్టాలను చేశారు.
  7. అనేక కొత్త పరిశ్రమలు ఏర్పడతాయని, కాలక్రమంలో కార్మికులలో అధిక శాతం సంపాదన పెరుగుతుందని ఆశించారు.
  8. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికి పరిశ్రమలలో ఉపాధి శాతం ఆశించినంతగా పెరగలేదు.
  9. అంతేగాకుండా కార్మికులలో చాలామంది చిన్న పారిశ్రామిక కేంద్రాలలో ఉపాధి పొందుతున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 7.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ప్రభావితమైన విధానం :

  1. ప్రభుత్వ పారిశ్రామిక రంగాల విషయంలో పరిశ్రమల నిర్వహణకు ప్రతి సంవత్సరం కొన్ని నిధులు కేటాయించేవారు.
  2. కాలక్రమంలో ఇవి స్వతంత్రమైనా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తాయని భావించేవారు.
  3. అనేక ప్రభుత్వ రంగ కర్మాగారాలలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉండేది. వీటికి ప్రభుత్వం సహాయం నిరంతరం అవసరం అవుతూ ఉండేది.
  4. వీటి నిర్వహణలో ప్రభుత్వ జోక్యం కొనసాగుతూ ఉండేది. ఆశించిన దానికంటే వాటి పని చాలా నిరాశాజనకంగా ఉండేది.
  5. అందువల్ల అలాంటి వాటిని ప్రైవేటు పరం చేసి నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అత్యుత్తమ లాభాలు పొందుతున్న సంస్థలను మాత్రమే దాని నియంత్రణలో ఉంచింది.

ప్రశ్న 8.
“పరిశ్రమల వల్ల పర్యావరణ సమస్యలు పెరుగుతాయి” చర్చించండి. (AS4)
జవాబు:

  1. పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలో విద్యుత్, వివిధ రసాయనికాలు అవసరం అవుతాయి.
  2. ఉత్పత్తి క్రమంలో ఈ పరిశ్రమలు అనేక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
  3. పారిశ్రామిక ప్రాంతాలలో ఇవి కాలుష్యానికి దారితీస్తున్నాయి.

ప్రశ్న 9.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని నినాదాలు రాయండి. (AS6)
(లేదా)
“పర్యావరణ కాలుష్య నివారణకై” ఏవైనా రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. వృక్షో రక్షతి రక్షితః
  2. పర్యావరణ పరిరక్షణ – మనందరి బాధ్యత.
  3. మనిషికి ఆయువు పెరగాలి – అందుకే చెట్లను పెంచాలి.
  4. కాలుష్యాన్ని నివారించండి – పర్యావరణాన్ని కాపాడండి.
  5. సహజ ఎరువులను వాడండి – పుడమితల్లిని కాపాడండి.
  6. ప్రకృతి రక్షణే జీవాధారం – చెట్లే ప్రగతికి ప్రాణాధారం.
  7. హద్దులు లేని అనుబంధానికి అమ్మే ఒక అందం
    అంతులేని ఆనందానికి ప్రకృతితోనే బంధం.
  8. పరిసరమే మన చుట్టూ ఉండే చక్కని నేస్తం
    పర్యావరణం కాపాడటమే మన అందరి కర్తవ్యం.
  9. చెట్లు లేనిది బ్రతుకే లేదు
    మానవ జాతికి మెతుకే లేదు.
  10. గాలీ, నేలా, నీరు, నింగి జీవుల మనుగడకి ఆధారం.
    అడవులు నరికి పెంచే కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలే మానవునికి దుఃఖకారణం.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పేజీ నెం. 83లోని రెండవ పేరాను (రేడియోసెట్ల నుంచి ……….. కీలకమవుతుంది) చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
సమాచార సాంకేతిక విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ భారతదేశాన్ని ఆసియా. ఖండంలో ప్రధమురాలిగా నిలబెట్టాయి. భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా బెంగళూర్ ఎదిగింది. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, పుణె, చెన్నై, కోల్ కత, లక్నో, కోయంబత్తూరు వంటి నగరాలు సమాచార విప్లవంలో దూసుకుపోతున్నాయి.

రేడియో సెట్ల నుండి టెలివిజన్ వరకు, టెలిఫోన్లు, చరవాణీలు, పేజర్లు, కంప్యూటర్లతో దేశం దూసుకుపోతోంది. ఈ ‘ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో 30% వరకు మహిళలు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలలో ప్రగతి కొనసాగి, విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం ఈ రంగం ఆర్జిస్తుంది.

ప్రశ్న 11.
పేజీ నెం. 95లోని పటాన్ని పరిశీలించి, భారతదేశ అవుట్ లైన్ పటంలో మన దేశంలోని ఇనుము – ఉక్కు కర్మాగారాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 2

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.76

ప్రశ్న 1.
ఇతర కర్మాగారాలు ముడి సరుకులుగా ఉపయోగించుకొనే వస్తువులను తయారు చేసే కర్మాగారాల జాబితా రాయండి.
జవాబు:
యంత్రాల పరిశ్రమ, విద్యుత్ పరిశ్రమ, ఖనిజాల పరిశ్రమ, ముడి లోహాలను శుద్ధి చేసే పరిశ్రమ రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలు.

ప్రశ్న 2.
ఇతర కర్మాగారాల కోసం ఉత్పత్తి చేసే అనేక వస్తువులకు ఇనుము మౌలిక అవసరం. మీ చుట్టు పక్కల కనిపించే ఉదాహరణలతో దీనిని వివరించండి.
జవాబు:
ఇనుము మౌలిక అవసరం.
ఉదా : నేలను త్రవ్వే పలుగు, పార, కోయడానికి ఉపయోగించే కత్తులు, కొడవళ్లు, చాకులు బరిసెలు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ” ఇనుపచువ్వలు.

వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే మేకులు, వివిధ రకాలైన ఫ్రేములు మొ||నవి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మీరు చూశారా? వివిధ రకాల యంత్రాల చిత్రాలను సేకరించండి.
జవాబు:
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మేము చూశాము. అవి :
బియ్యం మిల్లు, పత్తి మిల్లు, కారం పట్టేవి, పిండి పట్టేవి, నీరు లాగేవి మొ||నవి.

ప్రశ్న 4.
అనేక వస్తువుల ఉత్పత్తిలో పెట్రోలియం మౌలిక అవసరం ఎలా అవుతుందో తెలియజేసే చార్టుని తయారు చేయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 3

ప్రశ్న 5.
‘మౌలిక’ అనే పదం అంటే ఏమిటో చర్చించండి. పరిశ్రమలకు మౌలిక అవసరాలు ఏమిటి?
జవాబు:
మౌలిక అంటే ముఖ్యమైనవి, ప్రధానమైనవి, ప్రాథమికమైనవి అనే అర్థాలు వస్తాయి. పరిశ్రమకు మౌలిక అవసరాలు ఏమిటనగా యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలు వంటివి. ”

ప్రశ్న 6.
స్వాతంత్ర్య కాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం ఏ లక్ష్యాలను సాధించాలని కోరుకున్నాం?
జవాబు:
స్వాతంత్ర్యకాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం సాధించాలని అనుకున్న లక్ష్యాలు :

  1. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలైతే పట్టణీకరణ మొదలవుతుంది.
  2. పట్టణాలలో మాత్రమే పట్టణ సమీప ప్రాంతాలలో పరిశ్రమలను స్థాపించి వాటిని అభివృద్ధి చేయడం.
  3. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ జంటగా పురోగమిస్తాయి.
  4. పట్టణాలు సరుకులకు మార్కెట్ గా ఉండటమేగాక బ్యాంకింగ్, బీమా, రవాణా కార్మికులు, సలహాదారుల, ఆర్థిక సలహాలు వంటి సేవలను కూడా అందిస్తాయి.
  5. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించాలి.
  6. భారతదేశ జనాభా ప్రధానంగా గ్రామీణ జనాభా కావడం వలన గ్రామాలలో పరిశ్రమలను స్థాపించవలసిన అవసరం ఉన్నదని భావించడం.

9th Class Social Textbook Page No.77

ప్రశ్న 7.
టీ పొడి, టూత్ పేస్టు కవర్లు (Wrappers) సేకరించండి. వాటిమీద ఉన్న విషయాన్ని చదివి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
………………. ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
………………. ని ఖనిజ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
జవాబు:
టీ పొడి, టూత్ పేస్ట్.

ప్రశ్న 8.
టూత్ పేస్ట్ కు ముడిసరుకులైన …………………….., ………………… లను మరో పరిశ్రమలో ఉత్పత్తి చేస్తారు. దానిని మౌలిక లేదా కీలక పరిశ్రమ అంటారు. ఇందుకు భిన్నంగా టూత్ పేస్ట్ వినియోగదారీ సరుకు కావడం వల్ల ఈ పరిశ్రమ వినియోగదారీ వస్తు పరిశ్రమ అంటారు.
జవాబు:
అల్యూమినియం ట్యూబు, కాల్షియం.

ప్రశ్న 9.
పరిశ్రమల యాజమానులు వ్యక్తులు కావచ్చు, వ్యక్తుల బృందం కావచ్చు. ఉదా : టీ ప్యాకెట్ల తయారీ యజమానులు …………….. కాగా టూత్ పేస్టు …………… ఇలాంటి పరిశ్రమను ప్రైవేటు రంగ పరిశ్రమ అంటారు. యాజమాన్యం ప్రభుత్వానికి చెందినట్లయితే దానిని, ప్రభుత్వరంగ పరిశ్రమ అంటారు. అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలకు రెండు ఉదాహరణలు …………..
జవాబు:
ప్రయివేటు వ్యక్తులు, పేస్ట్ తయారీ ;

  1. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
  2. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పెద్ద సంఖ్యలో వ్యక్తులు కొన్ని పరిశ్రమలను పాలు, చెరకు, కొబ్బరి పీచు మొదలైన ముడి సరుకులను, వనరులను సమీకరించుకొని నిర్వహిస్తారు. ఇటువంటి పరిశ్రమలను ………… అంటారు.
జవాబు:
సహకార పరిశ్రమలు

9th Class Social Textbook Page No.78

ప్రశ్న 11.
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ఎందుకు ప్రాధాన్యత నిచ్చారు?
జవాబు:
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం :

  1. మన దేశంలో ప్రాచీనమైన, అతి పెద్ద పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ.
  2. ఎక్కువమందికి జీవనోపాధి కల్పించే పరిశ్రమ నూలు పరిశ్రమ.
  3. అందరికి అవసరమైన వస్తువు బట్టలు. అందువల్ల ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం యంత్రాలపై – నేయబడిన వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.
  4. కావున చేనేత కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ, మనకు కావలసిన వస్త్రాన్ని మనమే తయారు చేసుకుంటూ, వ్యాపార నిమిత్తం భారత దేశానికి వచ్చిన బ్రిటిష్ వారికి లాభం లేకుండా చేయడం వలన వారు మనదేశం నుండి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పించగలము అనే నమ్మకంతో గాంధీగారు అలాంటి విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

9th Class Social Textbook Page No.80

ప్రశ్న 12.
పంచదార, బెల్లం పరిశ్రమలను ఎక్కడ స్థాపించాలి?
జవాబు:

  1. పంచదార, బెల్లం పరిశ్రమలు చెరకు పండే ప్రాంతాలలోనే స్థాపించాలి. కారణం చెరకు నరికిన తరువాత ఎక్కువ కాలం నిల్వ ఉంటే సుక్రోజ్ శాతం తగ్గిపోతుంది.
  2. అందువల్ల చెరకు నరికిన వెంటనే పరిశ్రమకు తరలించవలసి ఉంటుంది.
  3. కావున చెరకు పండే ప్రాంతాలలోనే. పంచదార, బెల్లం పరిశ్రమలను స్థాపించవలసి ఉంటుంది.

ప్రశ్న 13.
భారతదేశంలో తలసరి ఉక్కు వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:

  1. ఇనుము – ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు ఇతర భారీ, మధ్యతరహా, తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావలసిన యంత్రాలకు వీటిపై ఆధారపడి ఉన్నాయి.
  2. అనేక రకాల ఇంజనీరింగ్ వస్తువులు, భవననిర్మాణ సామగ్రి, రక్షణ, వైద్య, దూరవాణి, శాస్త్రీయ పరికరాలు, అనేక వినియోగదారీ వస్తువుల వంటి వాటికి ఉక్కు అవసరం.
  3. కాని పైన పేర్కొనబడిన పరిశ్రమలు భారతదేశంలో చెప్పుకోదగినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు.
    అందువల్ల తలసరి ఉక్కు వినియోగ తక్కువగా ఉంది.

9th Class Social Textbook Page No.82

ప్రశ్న 14.
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను ఎక్కడ స్థాపించటం ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది?
జవాబు:
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను స్థాపించవలసిన ప్రదేశాలు :

  1. ప్రధాన ముడిపదార్థాలైన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలు ఎక్కడ లభిస్తాయో సాధారణంగా సిమెంట్ పరిశ్రమలు అక్కడ స్థాపించవలసి ఉంటుంది.
  2. సిమెంట్ పరిశ్రమకు రైలు వంటి రవాణా సౌకర్యాలతో పాటు బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం కూడా కావాలి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 15.
గల్ఫ్ దేశాల మార్కెటుకి దగ్గరగా గుజరాత్ లో సిమెంట్ కర్మాగారాలు కొన్ని నెలకొని ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సిమెంట్ కర్మాగారాలు ఎక్కడ నెలకొని ఉన్నాయో తెలుసుకోండి. ఆ కర్మాగారాల పేర్లు తెలుసుకోండి.
జవాబు:

  1. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో నిర్మించారు.
  2. 1989లో ధర, పంపిణీలలో నియంత్రణలను తీసివేయటం, ఇతర విధానాలలో సంస్కరణల వల్ల సామర్థ్యం, ప్రక్రియ, సాంకేతిక విజ్ఞానం, ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించింది.
  3. సిమెంట్ నాణ్యత పెరగటంతో తూర్పు ఆసియా, గల్ఫ్ దేశాలలో, ఆఫ్రికా దక్షిణ ఆసియాలలో మన దేశ సిమెంటుకు గిరాకీ పెరిగింది.

సిమెంట్ పరిశ్రమ నెలకొని ఉన్న ప్రాంతాలు :

  1. తమిళనాడు : తలైయుత్తు అలంగులం, తలకపట్టి దాల్మియాపురం, పాలియూర్, వంకరిదుర్గ్, మధురై.
  2. మధ్యప్రదేశ్ : జముల్, సాత్నా, కల్ని, కైమూర్, బాన మూర్, ముంధర్ దేశంలోకెల్లా జముల్ ఫ్యాక్టరీ అతి పెద్దది.
  3. ఆంధ్రప్రదేశ్ : జగ్గయ్యపేట.
  4. తెలంగాణ : కరీంనగర్, కోదాడ.
  5. రాజస్థాన్ : లఖేరి బుంది, సవాయ్, మాధోపూర్ బితోర్ గద్, ఉదయపూర్.

9th Class Social Textbook Page No.84

ప్రశ్న 16.
దిగువ పట్టికను పూరించండి.
కొన్ని పరిశ్రమల గురించి తెలుసుకోవడానికి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 4
జవాబు:

పరిశ్రమ ప్రస్తుతం అవి ఉన్న రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో అవి ఎందుకు ఉన్నాయి?
రసాయనిక పరిశ్రమ రసాయనిక ఎరువులు :
బీహార్ లోని సింద్రి, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్, తెలంగాణలోని రామగుండం, పంజాబ్ – నంగల్, హర్యానా – పానిపట్
ఆయా రాష్ట్రంలో ఎక్కువగా నెలకొల్పడానికి ప్రధాన కారణం – రసాయనాలు, విద్యుత్, పెట్రోలియం వంటి ఉత్పత్తులు ఆయా ప్రాంతాలలో విరివిగా దొరకడం.
ఎరువుల పరిశ్రమ సింథటిక్ దారాలు :
మహారాష్ట్ర – ముంబయి
గుజరాత్ – అహ్మదాబాద్
మధ్యప్రదేశ్ – గ్వాలియర్
తెలంగాణ – కాగజ్ నగర్పెట్రో కెమికల్స్ :
మహారాష్ట్ర – ట్రాంబే ధానే
గుజరాత్ – వడోదర
సిమెంట్ పరిశ్రమ తమిళనాడు – తలైయుత్తు అలిహలా
తలకపట్టి దాల్మియాపూర్
ఆంధ్రప్రదేశ్ – జగ్గయ్యపేట
తెలంగాణ – కరీంనగర్, కోదాడ
గుజరాత్ – సిక్కా, సూరీ
రాజస్థాన్ – లభేరి బుంది
సిమెంట్ పరిశ్రమకు కావలసిన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలతో పాటు, అభివృద్ధి చెంది రవాణా సౌకర్యాలు
ఆటోమొబైల్ పరిశ్రమ మహారాష్ట్ర – ముంబయి, పుణె
పశ్చిమబెంగాల్ – కోల్ కత
తమిళనాడు – చెన్నై
ఉత్తరప్రదేశ్ – లక్నో
రోడ్లు, రవాణా అభివృద్ధి చెంది ఉండడం, ఎగుమతులు, దిగుమతులకు అనుకూల ప్రదేశాలు సాంకేతిక నైపుణ్యం గల, సాంకేతిక నైపుణ్యం లేని శ్రామికులు ఎక్కువగా ఉండడం.

9th Class Social Textbook Page No.88

ప్రశ్న 17.
రెండు ‘పై’ (Pie) చార్టులలోని మూడు రకాల ఆర్థిక రంగాలలో ‘ఉపాధిలో తేడాలు ఏమిటి ? :
(లేదా)
కింది “పై” చార్టు, వ్యవసాయ, పరిశ్రమలు మరియు సేవారంగం ద్వారా పొందుతున్న ఉపాధి శాతాలను తెలియజేస్తున్నది. చార్టును పరిశీలించి, ప్రశ్నకు సమాధానం రాయండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 5
ప్రశ్న: 1972 – 73 మరియు 2009-2010 మధ్య ఉపాధి కల్పనలో వచ్చిన మార్పులు ఏమిటి?
జవాబు:
1972-73 సం||రం వ్యవసాయంపై ఆధారపడిన వారి శాతం – 74%.
2009-2010 సం||రం వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం 53%.
కావున 1972 -73 సం||రంతో పోలిస్తే వ్యవసాయ రంగంపై ఆధారపడిన శాతం తగ్గింది.
1972 -73 పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 11%.
2009 – 10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 22%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009-10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
1972 – 73 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 13%.
2009 – 10 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 25%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009 – 10 సం||రాల్లో సేవలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
మొత్తం మీద 1972 – 73 సం||రానికి 2009 – 10 సం||రానికి తేడా ఏమనగా వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం తగ్గగా మిగిలిన రంగాలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.

ప్రశ్న 18.
పారిశ్రామిక రంగం వారీగా ఉపాధి కల్పనలో ఎంత శాతం తేడా ఉంది?
జవాబు:
1972 – 73 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 11%
2009 – 10 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 22%
తేడా – 11%
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 6

ప్రశ్న 19.
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదా? టీచరుతో చర్చించండి.
జవాబు:
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదు. కారణం –
1972-73లో 11% ఉంటే 2009-10లలో 22 శాతానికి మాత్రమే పెరిగినది. అంటే 27 సం||రాలలో ఉపాధి కేవలం 11% మాత్రమే పెరిగినది.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 7

9th Class Social Textbook Page No.90

రవాణా వాహనాలు, పంపులు ఉత్పత్తి, ….. 1950 – 2011
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 8

ప్రశ్న 20.
వివిధ కర్మాగారాలు తమ ఉత్పత్తులలో ఉపయోగించే వస్తువులు ఉత్పత్తి పెరుగుదలకు ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:
వాణిజ్య వాహనాలు 1950-51లో 9 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 753 మిలియన్లకి పెరిగింది.

మోటారు సైకిళ్ళు 1950-51లో ఏమీ లేవు. 1960-61లో 1 మిలియన్ మాత్రమే ఉండగా 2010-11 నాటికి 10. 527 మిలియన్లకు పెరిగాయి. అనగా పెరుగుదల గణనీయంగా ఉన్నది.

పంపులు 1950-51లో 35 మిలియన్లు ఉండగా 2010-11లో 3139 మిలియన్లకు పెరిగింది.

ట్రాక్టర్లు డీజిల్ తో నడిచేవి 1980-81కు ముందు లేవు. ఆ సంవత్సరం మాత్రం 71 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 465 మిలియన్లకు పెరిగింది. కాబట్టి పెరుగుదల పై విధంగా ఉన్నది.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 21.
గత 30 సంవత్సరాలలో వస్త్ర ఉత్పత్తి ఎంత పెరిగింది ? దీని ప్రభావం ఎలా ఉంటుంది ? మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
వస్త్రాల ఉత్పత్తి (మిలియన్ చదరపు మీటర్లలో)

సంవత్సరం నూలు వస్త్రాలు ఇతర వస్త్రాలు
1950-51 4900
1960-61 6000 100
1970-71 6500 1000
1980-81 8000 2000
1990-91 15000 8000
2000-01 20000 20000
2010-11 31000 30000

వస్త్రాలు మన అవసరాలకు ఉపయోగించడం మాత్రమే కాక ఇతర దేశాలకు దిగుమతి చేయడం జరుగుతుంది.

ప్రశ్న 22.
సిమెంటు, ఉక్కు ఉత్పత్తిని చూపించే పటాన్ని చూడండి. 1980 – 81 నుంచి ఇప్పటి వరకు వీటి ఉత్పత్తిలో పెరుగుదల తెలియజేయటానికి ఒక పట్టిక తయారు చేయండి. ఈ ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన ప్రయోజనాలను, నష్టాలను చర్చించండి.
జవాబు:

సంవత్సరం సిమెంట్ ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
ఉక్కు ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
1950-51 5 1
1960-61 10 2
1970-71 15 6
1980-81 20 8
1990-91 50 12
2000-01 100 30
2010-11 210 62

ఉక్కు ఉత్పత్తి పెరిగినది దీనివలన మౌలిక పరిశ్రమలు సంఖ్య పెరిగింది.

ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన లాభాలు :
సిమెంట్ ఉత్పత్తి పెరగటం వల్ల భవన నిర్మాణం రంగం పెరిగింది. మరియు ఎగుమతులు పెరిగాయి.

అరబ్ దేశాలకు మన సిమెంట్ ను ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతున్నది.

నిర్మాణ రంగానికి కూడా ఉక్కును ఎక్కువగా ఉపయోగించడం జరుగుతున్నది.

నష్టాలు :
సున్నపురాయి, జిప్సమ్ నిల్వలు రోజు రోజుకు తరిగిపోతున్నాయి. అలాగే ఉక్కుకు కావలసిన ముడి ఇనుమును ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతుంది.

ఇంకా పూర్తి స్థాయిలో ముడి ఇనుమును మన అవసరాలకు ఉపయోగించుకోగలిగితే ఇనుము – ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు అవుతుంది.

పట నైపుణ్యం

1. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఉక్కును 1950-51 నుండి. 2010-11 వరకు గ్రాఫ్ చిత్రంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 9

2. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన సిమెంట్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 10

3. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 11

4. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన వస్త్రాలను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 12

5. భారతదేశంలో లభించే ఇనుప ఖనిజ క్షేత్రాలను, ఇనుప ఖనిజ గనులను భారతదేశం పటంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 13

6. బొగ్గు లభించే ప్రాంతాలను భారతదేశ పటం నందు చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 14

7. భారతదేశ పటం నందు ఇనుము – ఉక్కు కర్మాగారాల ప్రదేశాలను చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 15

8. భారతదేశ పటం నందలి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులను గుర్తించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 16

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఒకదానిని, ఖనిజ ఆధారిత పరిశ్రమను ఒకదానిని ఎంచుకోండి.
1) వాటిల్లో ఉపయోగించే ముడిసరుకులు ఏమిటి?
2) ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
3) ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?
జవాబు:
మా ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ.

– పొగాకు పరిశ్రమ :

  1. వాటిలో ఉపయోగించే ముడి సరుకులు – పొగాకు.
  2. ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
    పొగాకుకు రవాణా ఖర్చు కావాలి.

మరియు తయారుచేయబడిన సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటిని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా, మరియు సిగరెట్ పరిశ్రమ, బీడీల పరిశ్రమ, చుట్టల పరిశ్రమ ప్రాంతాలకు పొగాకును చేరవేయాలన్నా రవాణా ఖర్చు కావలసి ఉంటుంది.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను అంతగా పాటించడం లేదనే చెప్పవచ్చును.

ఎందువలెనంటే పరిశ్రమల చుట్టు మొక్కలను పెంచడం లేదు.

పరిశ్రమ నందు వడిలివేయబడిన పదార్థాల డంపింగ్ యార్డ్ ద్వారా నాశనం చేయకుండా దగ్గరలోని కృష్ణానదిలోను, రోడ్ల ప్రక్కన వేయడంవల్ల ఆ పరిసర ప్రాంతాలు కాలుష్యానికి గురౌతున్నాయి.

మా ప్రాంతంలోని ఖనిజాధార పరిశ్రమ.

– సిమెంట్ పరిశ్రమ :
ప్రధాన ముడి సరుకులు : సున్నపురాయి, జిప్సం , బొగ్గు, డోలమైట్, పింగాణి మన్ను మొదలగునవి.

ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో సున్నపురాయి, జిప్సం, డోలమైట్, పింగాణి మన్ను, బొగ్గు మొదలైన వాటి అన్నింటికి రవాణా ఖర్చు కావాలి.

సున్నపురాయి అధిక పరిమాణంలో కావాలి.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?

అంతగా పాటించడం లేదనే చెప్పాలి. ఎందువలెనంటే ఈ పరిశ్రమ పనిచేస్తున్నప్పుడు దుమ్ము, ధూళి విపరీతంగా వస్తుంది.

అది గాలిలో కలిసి గాలిని కలుషితం చేస్తుంది.
అలాగే వ్యర్థ పదార్థాలను బయట ప్రదేశములందు వదలడం వలన బయటి ప్రదేశాలు రసాయనిక కాలుష్యానికి గురౌతున్నాయి.

Leave a Comment