AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం

SCERT AP 9th Class Physics Study Material Pdf Download 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 7th Lesson Questions and Answers వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం

9th Class Physical Science 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కాంతి పరావర్తన నియమాలు వక్ర తలాలకు అనువర్తించవు. ఇది సరియైన వాక్యమేనా? (AS 1)
జవాబు:
సరియైన వాక్యం కాదు. కాంతి పరావర్తన నియమాలు వక్రతలాలకు కూడా అనువర్తిస్తాయి.

ప్రశ్న 2.
పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరాన్ని ఎలా కనుగొంటారు? (AS 1)
(లేదా)
దర్పణ ధ్రువము మరియు నాభిల మధ్య దూరమును ఏమంటారు? ఒక కృత్యం ద్వారా దానిని ఏ విధంగా కనుగొంటారు?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 1

  1. సూర్యుని కాంతి పడే విధంగా ఒక పుటాకార దర్పణాన్ని పట్టుకొనుము.
  2. దర్పణానికి ఎదురుగా ఒక చిన్న కాగితం ముక్కనుంచుము.
  3. ఆ కాగితాన్ని మెల్లగా వెనుకకు జరుపుతూ, ఏ స్థానంలో చిన్నదైన మరియు అధిక తీవ్రత గల సూర్యుని ప్రతిబింబం ఏర్పడునో గుర్తించుము.
  4. సూర్యుని నుండి వచ్చే సమాంతర కాంతికిరణాలు పుటాకార దర్పణం వల్ల ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి.
  5. ఈ బిందువును దర్పణం యొక్క నాభి (F) అంటాము.
  6. నాభి నుండి దర్పణకేంద్రానికి గల దూరం నాభ్యంతరం (F) అగును.

ప్రశ్న 3.
ఫుటాకార దర్పణం యొక్క ప్రధానాక్షంపై నాభి, వక్రతా కేంద్రం మధ్య ఒక వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? (AS 1)
జవాబు:
పుటాకార దర్పణం యొక్క ప్రధానాక్షంపై నాభి, వక్రతా కేంద్రం మధ్య ఒక వస్తువును ఉంచితే ప్రతిబింబం వక్రతా కేంద్రం ఆవల ఏర్పడును.
ప్రక్క పటంలో
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 2
OB → వస్తువు
IJ → ప్రతిబింబం
F → నాభి
C → వక్రతా కేంద్రం

AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 4.
8 సెం.మీ. వక్రతా వ్యాసార్ధం గల పుటాకార దర్పణం యొక్క ప్రధానాక్షంపై దర్పణం నుండి 10 సెం.మీ. దూరంలో ఒక వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది? (AS 1)
(లేదా)
ఒక పుటాకార దర్పణపు వ్యాసార్ధం 8 సెం.మీ. దాని నుండి 10 సెం.మీ.ల దూరంలో, ప్రధానాక్షంపై వస్తువును ఉంచిన, దాని ప్రతిబింబం ఏర్పడు దూరం?
జవాబు:
వస్తు దూరం (u) = 10 సెం.మీ. ; వక్రతావ్యాసార్థం (R) = 8 సెం.మీ.
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 3
∴ ప్రతిబింబ దూరము (v) = 6.7 సెం.మీ.

ప్రశ్న 5.
పుటాకార, కుంభాకార దర్పణాల మధ్య భేదాలను తెల్పండి. (AS 1)
(లేదా)
‘A’ అను విద్యార్థి వాహనాలలో వాడు రియర్ వ్యూ దర్పణంను గమనించెను. ‘B’ అను విద్యార్థి దంత వైద్యులు వాడు దర్పణంను గమనించెను. ఆ దర్పణాల రకాలేవి? వాటి మధ్య భేదాలను వ్రాయుము.
జవాబు:
ఆ దర్పణాలు 1) పుటాకార దర్పణం 2) కుంభాకార దర్పణం

పుటాకార దర్పణం కుంభాకార దర్పణం
1) ఇది గోళాకార దర్పణంలోని అంతరతలం పరావర్తన తలం అయినటువంటి దర్పణ రకము. 1) ఇది గోళాకార దర్పణంలోని బాహ్యతలం పరావర్తన తలం అయినటువంటి దర్పణ రకము.
2) దీనియందు పరావర్తనం చెందిన తర్వాత కాంతి కిరణాలు కేంద్రీకరించబడతాయి. 2) దీనియందు పరావర్తనం చెందిన తర్వాత కాంతికిరణాలు వికేంద్రీకరించబడతాయి.
3) దీని వక్రతా వ్యాసార్ధం ధనాత్మకము. 3) దీని వక్రతా వ్యాసార్ధం ఋణాత్మకం.
4) ఇవి ఎక్కువగా నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. 4) ఇవి ఎక్కువగా మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి.
5) వీటిని హెడ్ లైట్స్ లోను, టెలిస్కోలోను వాడతారు. 5) వీటిని ‘రియర్ వ్యూ మిర్రర్లు’గా వాడతారు.

ప్రశ్న 6.
నిజప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం మధ్య భేదాలను తెల్పండి. (AS 1)
(లేదా)
రాజు తన ప్రతిబింబంను పుటాకార దర్పణంలో చూచుకొనెను. అతను దర్పణం నుండి దూరంగా పోపుకొలది ప్రతిబింబంను చూడలేకపోయెను. ఆ ప్రతిబింబాల మధ్యభేదాలను వ్రాయుము.
జవాబు:

నిజప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం
1) ఇది పరావర్తన కిరణాలు ఖండించుకొనుట వలన ఏర్పడుతుంది. 1) ఇది పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగించుట వలన ఏర్పడుతుంది.
2) దీనిని తెరపై పట్టవచ్చును. 2) దీనిని తెరపై పట్టలేము.
3) ఇది తలక్రిందులుగా ఏర్పడుతుంది. 3) ఇది నిటారుగా ఏర్పడుతుంది.
4) ఇది పుటాకార దర్పణం వల్లనే ఏర్పడుతుంది. 4) ఇది కుంభాకార దర్పణం వల్లనే ఏర్పడుతుంది.
5) ఇది వస్తువున్న వైపే ఏర్పడును. 5) ఇది వస్తువున్న వైపునకు అవతలివైపు ఏర్పడును.

ప్రశ్న 7.
పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని ఎలా ఏర్పరుస్తారు? (AS 1)
(లేదా)
రాము పుటాకార దర్పణం వైపుకు ఒక వస్తువును కదిలించుచున్నాడు. అతను ఏ స్థానం వద్ద వుంచిన వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబాన్ని పొందగలడు?
జవాబు:
పుటాకార దర్పణం యొక్క నాభి వద్ద వస్తువును ఉంచిన దాని మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది.

ప్రశ్న 8.
గోళాకార దర్పణాలకు సంబంధించిన, కింద ఇవ్వబడిన పదాలను వివరించండి. (AS 1)
ఎ) దర్పణధ్రువం బి) వక్రతా కేంద్రం సి) నాభి డి) వక్రతా వ్యాసార్ధం ఇ) నాభ్యంతరం ఎఫ్) ప్రధానాక్షం జి) వస్తుదూరం హెచ్) ప్రతిబింబ దూరం ఐ) ఆవర్తనం
(లేదా)
వినయ్ దర్పణాలకు సంబంధించిన సమస్యలను సాధించుటకు పాటించవలసిన నియమాలను వ్రాయుము.
జవాబు:
ఎ) దర్పణధ్రువం (P) :
దర్పణం యొక్క మధ్య బిందువు లేక జ్యామితీయ కేంద్రాన్ని “దరణధ్రువం” అంటారు.

బి) వక్రతా కేంద్రం (C) :
గుల్ల గోళాకారం యొక్క కేంద్రంను “వక్రతా కేంద్రం” అంటారు.

సి) నాభి (F) :
వస్తువు నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు గోళాకార దర్పణం యొక్క ఏదో ఒక కేంద్రం వద్ద కేంద్రీకరించబడతాయి. ఈ బిందువును దర్పణం యొక్క “నాభి” అంటారు.

డి) వక్రతా వ్యాసార్ధం(R) :
దరణ కేంద్రం, వక్రతా కేంద్రానికి మధ్యగల దూరాన్ని ఆ దర్పణపు “వక్రతా వ్యాసార్ధం” అంటారు.

ఇ) నాభ్యంతరం (f) :
నాభి నుండి దర్షణ కేంద్రానికి మధ్య గల దూరాన్ని “దర్పణపు నాభ్యంతరం” అంటారు.

ఎఫ్) ప్రధానాక్షం (P) :
వక్రతాకేంద్రం మరియు దర్శణ కేంద్రం గుండా పోతున్నట్లు గీయబడిన క్షితిజ సమాంతర రేఖను దర్పణం యొక్క “ప్రధానాక్షం” అంటారు.

జి) వస్తుదూరం (U) :
దర్పణం వక్రతా కేంద్రం, వస్తువుకు మధ్యగల దూరాన్ని “వస్తుదూరం” అంటారు.

హెచ్) ప్రతిబింబ దూరం(v) :
దర్పణం వక్రతా కేంద్రం, ప్రతిబింబానికి మధ్యగల దూరాన్ని “ప్రతిబింబ దూరం” అంటారు.

ఐ) ఆవర్ధనం (m) :
ప్రతిబింబ పరిమాణానికి, వస్తు పరిమాణానికి గల నిష్పత్తిని “ఆవర్ధనం” అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 9.
సంజ్ఞాసాంప్రదాయంలోని నియమాలను తెల్పండి. (AS 1)
జవాబు:
దర్పణ సూత్రంలోని వివిధ అంశాలకు పాటించవలసిన సంజ్ఞాసాంప్రదాయం :

  1. అన్ని దూరాలను దర్పణ కేంద్రం (P) నుండే కొలవాలి.
  2. కాంతి (పతనకాంతి) ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగానూ, వ్యతిరేకదిశలో కొలిచిన దూరాలను ఋణాత్మకంగానూ పరిగణించాలి.
  3. వస్తువు ఎత్తు (H0), ప్రతిబింబం ఎత్తు (Hi) లను ప్రధానాక్షానికి పై వైపు ఉన్నప్పుడు ధనాత్మకంగానూ, ప్రధానాక్షానికి కింది వైపు ఉన్నప్పుడు ఋణాత్మకంగానూ పరిగణించాలి.

ప్రశ్న 10.
గోళాకార దర్పణాలు లేకపోతే దైనందిన జీవితం ఎలా ఉంటుందో ఊహించండి. (AS 2)
(లేదా)
ఒకవేళ గోళాకార దర్పణాలను ఆవిష్కరించకపోతే మానవుని జీవిత సరళిని ఊహించి వ్రాయుము.
జవాబు:
14వ శతాబ్దంలో గోళాకార దర్పణాల ఆవిర్భావం జరిగింది. అప్పటి నుండి ఇవి దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి.

  1. కార్ల హెడ్ లైట్లలో వీటిని అధిక తీవ్రతగల కాంతి విడుదలయ్యేందుకు వాడతారు. అవి లేకపోతే హెడ్ లైట్లు విస్తృతమైన కాంతిని ఇవ్వవు.
  2. దంతవైద్యులు, కంటి వైద్యులు అంతర్గత భాగాలను పరీక్షించుటకు వాడతారు. అవి లేకపోతే వైద్యులకు ఈ సూక్ష్మ పరీక్ష సాధ్యపడేది కాదు.
  3. కుంభాకార దర్పణాలను ‘రియర్ వ్యూ మిర్రర్’లుగా ఉపయోగిస్తారు. ఇవి లేకపోతే వాహన చోదకులు వెనుక వచ్చే ట్రాఫిక్ను సరిగా గమనించలేకపోవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతాయి
  4. సోలార్ కుక్కర్లు, హీటర్ల తయారీలో పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. ఇవి లేకపోతే సౌరశక్తిని సరిగా వినియోగించుకొనేవారం కాదు.
  5. సెక్యూరిటీ చెకింగ్ విధానంలో కూడా వీటిని విరివిగా వాడుతున్నారు. అవిగానీ లేకపోతే సరైన రక్షణ వ్యవస్థ ఉండేది కాదు.

ఈ విధంగా మానవాళికి ఉపయోగపడుతున్న గోళాకార దర్పణాలు లేకపోతే దైనందిన జీవితం అభివృద్ధి చెందేది కాదు.

ప్రశ్న 11.
ఇంటిలో ఉన్న స్టీలు పాత్రలు, వాటిలోని ప్రతిబింబాలను చూసిన 3వ తరగతి విద్యార్థి సూర్య తన అక్క శ్రీవిద్యను కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు ఏమై ఉంటాయో ఊహించండి. (AS 2)
జవాబు:
సూర్య తన అక్క శ్రీవిద్యను కింది ప్రశ్నలు అడిగి ఉండవచ్చును.

  1. పాత్రలపై ఏర్పడు ప్రతిబింబం స్పష్టంగా లేదు – ఎందుకు?
  2. పాత్రను బయట నుండి చూసినపుడు ప్రతిబింబం చిన్నదిగా ఎందుకు కనిపిస్తుంది?
  3. పాత్రను లోపల నుండి చూసినపుడు ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడింది – ఎందుకు?
  4. పాత్రల నుండి దూరంగా అటు, ఇటు కదులుతున్న ప్రతిబింబాలు వాటి పరిమాణంలో మార్పులున్నాయి. ఎందుకు?

ప్రశ్న 12.
పుటాకార దర్పణాన్ని ఉపయోగించి క్షీణ ప్రతిబింబాన్ని తెరపై ఎలా పొందగలవో రాయుము. (AS 3)
జవాబు:
ఫుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రానికి ఆవలివైపున వస్తువు నుంచిన, క్షీణ ప్రతిబింబం నాభికి మరియు వక్రతా కేంద్రానికి మధ్యలో ఏర్పడుతుంది.

ప్రశ్న 13.
పుటాకార దర్పణ నాభ్యంతరాన్ని ప్రయోగశాలలో ఎలా కనుగొంటావు? (AS 3)
(లేదా)
ఒక ఫుటాకార దర్పణం నాభ్యంతరం కనుగొనడానికి కావలసిన పరికరాలను జాబితా రాసి, ప్రయోగ విధానాన్ని వివరించుము.
జవాబు:
a) ఒక పుటాకార దర్పణం నాభ్యంతరం కనుగొనడానికి కావలసిన పరికరాలు :

  1. పుటాకార దర్పణం
  2. తెల్లని కాగితం ముక్క
  3. మీటరు స్కేలు

b) ప్రయోగ విధానం:

  1. సూర్యుని కాంతి పడే విధంగా ఒక పుటాకార దర్పణాన్ని పట్టుకొనుము.
  2. దర్పణానికి ఎదురుగా ఒక చిన్న కాగితం ముక్కను పట్టుకొనుము. ఇది తెర వలె పని చేయును.
  3. ఆ కాగితాన్ని మెల్లగా వెనుకకూ, ముందుకు జరుపుతూ స్పష్టమైన, చిన్నదైన ప్రతిబింబం తెరపై పడేట్లు చూడాలి.
  4. అలా ఏర్పడిన ప్రతిబింబం సూర్యుని ప్రతిబింబం అవుతుంది మరియు ఆ బిందువు దర్పణనాభి (F) కూడా అవుతుంది.
  5. మీటరు స్కేలుతో దర్పణ దృవం (P) నుండి దర్పణ నాభి (F) కి మధ్యగల దూరాన్ని కొలవాలి. ఇదే ఆ దర్పణ నాభ్యంతరం (f) అవుతుంది.

కారణం:

  1. సూర్యుడి నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలను పుటాకార దర్పణం నాభి వద్ద కేంద్రీకరింపజేస్తుంది.
  2. దర్పణ దృవం – నాభికి మధ్య గల దూరమే నాభ్యంతరం.

AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 1

మరొక పద్దతి :

a) కావలసిన పరికరాలు :
1) కొవ్వొత్తి 2) తెల్లకాగితం లేదా డ్రాయింగ్ షీటు 3) పుటాకార దర్పణం 4) V – స్టాండ్ 5) మీటరు స్కేలు.

b) పద్ధతి :

  1. పుటాకార దర్పణాన్ని V – స్టాండ్ పై ఉంచండి.
  2. దానికెదురుగా పటంలో చూపినట్లు వెలుగుతున్న కొవ్వొత్తి మీటరు స్కేలు ఉంచండి.
    AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 4
  3. దర్పణం నుండి వివిధ దూరాలలో (10 సెం.మీ. నుండి 80 సెం.మీ.) ప్రధాన అక్షం వెంబడి కొవ్వొత్తిని ఉంచుతూ, కాగితాన్ని ముందుకూ, వెనుకకూ కదుపుతూ ప్రతిసారీ ఏ స్థానంలో స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుందో గుర్తించండి.
  4. వస్తు దూరం, ప్రతిబింబం దూరంలను కొలిచి క్రింది పట్టికలో నమోదు చేయండి.
    AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 5
  5. పై పట్టిక నుండి మీ ల యొక్క సరాసరి ఇచ్చిన దర్పణం యొక్క నాభ్యాంతరం అవుతుంది.

ప్రశ్న 14.
వస్తు దూరం, ప్రతిబింబ దూరం కొలిచినటువంటి పుటాకార దర్పణం ప్రయోగం ద్వారా మీరు ఏమి నిర్ధారించారు? (AS 3)
జవాబు:
నేను ప్రయోగం ద్వారా గమనించిన విషయాలు:

  1. వస్తు దూరం పెరిగే కొలదీ ప్రతిబింబ దూరం తగ్గుతున్నది.
  2. వస్తు దూరం పెరిగే కొలదీ ప్రతిబింబ పరిమాణం తగ్గుతున్నది.

వివరణ:

  1. వస్తువును దర్పణం, నాభి మధ్య ఉంచితే ప్రతిబింబం దర్పణం వెనుక ఏర్పడింది.
  2. వస్తువును నాభి వద్ద ఉంచితే దాని ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడింది.
  3. వస్తువును నాభి, వక్రతా కేంద్రాల మధ్య ఉంచితే దాని ప్రతిబింబం వక్రతా కేంద్రం ఆవల ఏర్పడటం జరిగింది.
  4. ఈ విధంగా వస్తుదూరం, ప్రతిబింబ దూరాలలో మార్పును కనుగొనటం జరిగింది.

AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 15.
పుటాకార దర్పణం ద్వారా నాలుగు ప్రధానాక్షానికి సమాంతర కాంతి కిరణాలను తీసుకొని కిరణ చిత్రాన్ని గీయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 6

ప్రశ్న 16.
ఫుటాకార దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబ స్థానాన్ని గుర్తించటానికి అవసరమయ్యే కాంతి కిరణాలను గీయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 7

ప్రశ్న 17.
పుటాకార దర్పణం యొక్క ప్రధానాక్షంపై వక్రతా కేంద్రానికి ఆవల వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని వివరించే పటం గీయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 8

ప్రశ్న 18.
సోలార్ కుక్కర్ ను తయారుచేయండి. తయారీ విధానాన్ని వివరించండి. (AS 5)
(లేదా)
సౌరశక్తిని వినియోగించి, ఆహారంను తయారుచేయుటకు వాడు పరికరంను, దాని నిర్మాణంను వివరించుము.
(లేదా)
సోలార్ కుక్కలను ఏ విధంగా తయారుచేస్తారో వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 9

  1. పుటాకార దర్పణం సమాంతర సూర్యకిరణాలను నాభి వద్ద కేంద్రీకరించును.
  2. పుటాకార దర్పణంతో ఒక చిన్న కాగితం ముక్కను మండించవచ్చును.
  3. కర్ర లేదా ఇనుపబద్ధలతో టి.వి. డిష్ ఆకారంలో ఫ్రేమ్ ను తయారుచేయుము.
  4. “ఆక్రలిక్ అద్దం షీట్” ను సేకరించి మీ డిష్ యొక్క వ్యాసార్థానికి సమానమైన ఎత్తు ఉండే విధంగా 8 లేదా 12 సమద్విబాహు త్రిభుజాలుగా ఆక్రలిక్ అద్దాలను కత్తిరించుము.
  5. పటంలో చూపినట్లుగా త్రిభుజాకార అద్దాలను డిష్ ఫ్రేమ్ పై అంటించుము.
  6. దీనిని సూర్యునికి అభిముఖంగా ఉంచి, దాని నాభిని కనుగొనుము.
  7. ఆ నాభివద్ద పాత్రను ఉంచితే వేడెక్కును.
  8. ఆ పాత్రలో ఏ పదార్థాన్ని ఉంచిన అది వేడెక్కును.
  9. ఈ విధంగా సోలార్ కుక్కర్ ను తయారుచేయవచ్చును.

ప్రశ్న 19.
వస్తువుపైనే ప్రతిబింబం ఏర్పడాలంటే పుటాకార దర్పణం ముందు వస్తువును ఎలా ఉంచాలో పటం గీచి వివరించండి. (AS 5)
జవాబు:
వస్తువు పైనే ప్రతిబింబం ఏర్పడాలంటే పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం వద్ద వస్తువును ఉంచాలి.

వివరణ :
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 10

  1. పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం ‘C’ వద్ద వస్తువును ఉంచుము.
  2. వస్తువు నుండి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయోగించు కాంతి కిరణం R1 దర్పణంపై పరావర్తనం చెంది నాభి (F) గుండా పోతుంది.
  3. వస్తువు నుండి ప్రయాణించిన మరొక కాంతికిరణం R2 నాభి గుండా ప్రయాణించి, దర్పణంపై పతనం చెంది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.
  4. ఈ రెండు కిరణాలు R1 మరియు R2 లు ఒకే బిందువు వద్ద ఖండించుకొని వస్తు ప్రతిబింబాన్ని ‘C’ వద్ద ఏర్పరుస్తున్నవి.
  5. ఈ ప్రతిబింబం తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం వస్తు స్థానంలోనే ఏర్పడింది.

ప్రశ్న 20.
మన దైనందిన జీవితంలో గోళాకార దర్పణాల పాత్రను మీరెలా అభినందిస్తారు? (AS 6)
(లేదా)
మన నిజజీవితంలో గోళాకార దర్పణాల ఉపయోగాలను అభినందించుము.
జవాబు:
గోళాకార దర్పణాలు మన దైనందిన జీవితంలో ప్రముఖపాత్రను వహిస్తున్నాయి.

  1. కుంభాకార దర్పణాలను వాహనాలలో “రియర్ వ్యూ మిర్రర్స్”గా ఉపయోగిస్తున్నారు.
  2. పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లో, వస్త్ర దుకాణాలలో, బంగారపు షాపులలో, సెక్యూరిటీ సిస్టమ్ లలో కుంభాకార దర్పణాలను వాడుతున్నారు.
  3. పుటాకార దర్పణాలను దంతవైద్యులు ఉపయోగిస్తున్నారు. అలాగే షేవింగ్ షాపులలోనూ విరివిగా వాడుతున్నారు.
  4. పుటాకార దర్పణాలు సోలార్ కుక్కర్, సోలార్ హీటర్ల తయారీలలో ఉపయోగపడుతున్నాయి.
  5. పుటాకార దర్పణాలు వాహనాల హెలైట్లలో, టార్చ్ లైట్లలో పరావర్తకాలుగా ఉపయోగపడుతున్నాయి.
  6. పుటాకార దర్పణాలను సోలార్ ఫర్నేస్లలో వాడతారు.

AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 21.
పుటాకార దర్పణాలను వైద్యులు ఎలా వినియోగిస్తుంటారు? (AS 7)
జవాబు:

  1. దంతవైద్యులు పళ్ళ యొక్క పెద్ద మరియు స్పష్టమైన ప్రతిబింబాలు చూడటానికి పుటాకార దర్పణాలను వినియోగిస్తారు.
  2. ENT స్పెషలిస్టులు నోటి లోపలి భాగాలు, చెవుల లోపలి భాగాలను స్పష్టంగా చూడటానికి వీటిని వినియోగిస్తారు.

ప్రశ్న 22.
వాహనాల “రియర్ వ్యూ మిర్రర్లు”గా కుంభాకార దర్పణాలనే ఎందుకు వాడతారు? (AS 7)
జవాబు:

  1. కుంభాకార దర్పణాలు నిటారుగా ఉండే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
  2. కుంభాకార దర్పణాల వలన వాహన చోదకులు వాహనాన్ని నడుపు సమయంలో వెనుకకు తిరిగి చూడకుండా వెనుకనున్న రోడ్డు దృశ్యాన్ని, వెనుకవచ్చే వాహనాన్ని చూడగలుగుతారు.
  3. కుంభాకార దర్పణం వస్తువు కంటే చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
  4. ఈ రకమైన కారణాల వలన కుంభాకార దర్పణాలను మాత్రమే “రియర్ వ్యూ మిర్రర్స్”గా వాహనాలలో వాడతారు.

ప్రశ్న 23.
పుటాకార దర్పణంతో చేసిన ప్రయోగం సంబంధించిన పట్టిక 4ను సరియైన సమాధానాలతో నింపుము. (AS 4)
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 11
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 12

ప్రశ్న 24.
కుంభాకార దర్పణ ఆవర్ధనం – 1 అని ఇవ్వబడింది. దీనిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు? (AS 1)
జవాబు:
కుంభాకార దర్పణ ఆవర్ధనం – 1 అని ఇవ్వబడిన ప్రవచనంతో నేను అంగీకరిస్తాను. ఎందుకనగా కుంభాకార దర్పణము ఆవర్ధనము – 1 కనుక.

ప్రశ్న 25.
లేజర్ లైట్ల సహాయంతో కేంద్రీకరణాన్ని, వికేంద్రీకరణాన్ని ఎలా చూపించగలవో రాయుము. (AS 3)
జవాబు:
ఉదేశ్యము :
లేజర్ లైట్ల సహాయంతో కేంద్రీకరణాన్ని, వికేంద్రీకరణాన్ని చూపించుట.

కావలసిన పరికరములు:
పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, రెండు లేజర్ లైట్లు, తెర, V – స్టాండు, అగరబత్తి.

పద్ధతి :

  1. V- స్టాండ్ పైన పుటాకార దర్పణాన్ని అమర్చి V – స్టాండును బల్లపై నుంచవలెను.
  2. రెండు లేజర్ లైట్లను తీసుకొనండి.
  3. పుటాకార దర్పణ అక్షాంశానికి సమాంతరంగా రెండు లేజర్ లైట్లను ప్రసారం చేయండి.
  4. పుటాకార దర్పణంపై పడిన రెండు లేజర్ లైట్ల కాంతి పుంజాలు పరావర్తనం చెంది ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి.
  5. పరావర్తనం చెందిన కాంతి కిరణాల కేంద్ర బిందువు వద్ద ఒక తెరను ఉంచండి.
  6. బల్లకు దగ్గరగా ఒక అగరుబత్తిని వెలిగించండి.
    పరిశీలన :
    అగరుబత్తి యొక్క పొగలో మనము పతనకిరణాలను మరియు పరావర్తన కిరణాలను పరిశీలించవచ్చును.
  7. ఇప్పుడు V – స్టాండుపై కుంభాకార దర్పణాన్ని అమర్చండి.
  8. కుంభాకార దర్పణ అక్షాంశానికి సమాంతరంగా రెండు లేజర్ లైట్లను ప్రసారం చేయండి.
    పరిశీలన :
    కాంతి కిరణాలను పరిశీలించగా అవి వికేంద్రీకరణ జరిగినట్లుగా కనబడతాయి. మనము ఎలాంటి కేంద్రీకరణ బిందువులను తెరపై పట్టలేము.

ప్రశ్న 26.
మానవ నాగరికతలో గోళాకార దర్పణాల పాత్ర గురించి సమాచారాన్ని సేకరించండి. (AS 4)
(లేదా)
మానవ నాగరికత అభివృద్ధితో పాటు, గోళాకార దర్పణాల అభివృద్ధి ఏ విధంగా జరిగినదో ఒక నివేదికను తయారుచేయుము.
జవాబు:

  1. మొట్టమొదటగా ప్రాచీన కాలంలో ప్రజలు స్థిరంగా ఉండే నీటి ఉపరితలాలను అద్దాలుగా ఉపయోగించేవారు.
  2. అద్దాల చరిత్రను బట్టి 6000 B.C.లో అగ్నిపర్వతాల నుండి సహజంగా లభించే నునుపైన రాళ్లను అద్దాలుగా తయారుచేసేవారు.
  3. క్రీ. శ. మొదటి శతాబ్దంలో రోమన్లు మొదటగా గాజు అద్దాలను తయారుచేశారు.
  4. క్రీ. శ. 1835 లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త జస్టిస్ వాన్ లీ బేగ్ సిల్వర్ అద్దాన్ని తయారుచేశాడు.
  5. క్రీ. శ. 11వ శతాబ్దంలో “మూరిష్ స్పెయిన్” గాజు అద్దాలను తయారుచేశాడు.
  6. క్రీ. శ. 14వ శతాబ్దంలో గ్లాస్ బోయింగ్ పద్ధతిని కనుగొనడం గోళాకార దర్పణాల తయారీకి నాంది పలికింది. దీని ద్వారా గాజు దర్పణాల ప్రాముఖ్యత అభివృద్ధి చెందింది.
  7. క్రీ.శ. 16వ శతాబ్దంలో వెనీస్ నగరం సిల్వర్ – మెర్క్యురీ మిశ్రమాన్ని ఉపయోగించి అద్దాలను తయారు చేస్తూ, అద్దాల తయారీకి ప్రధాన కేంద్రం అయింది.
  8. క్రీ. శ. 18వ శతాబ్దంలో అద్దకపు తయారీ ప్రాముఖ్యత పెరిగిపోయింది.
  9. 19వ శతాబ్దంలో గాజు తయారీలో అభివృద్ధి చెందిన పద్ధతులు పెరిగిపోయాయి.

ప్రశ్న 27.
మీ పరిసరాలలో ఉన్న వివిధ వస్తువులలో కుంభాకార, పుటాకార దర్పణాలుగా పనిచేసే వాటిని పట్టిక రూపొందించి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. (AS 4)
(లేదా)
మీ చుట్టుప్రక్కల నుండి కొన్ని వస్తువులను సేకరించి, వాటిలో ఏవి ఫుటాకార, కుంభాకార దర్పణాలుగా పనిచేయునో ఒక నివేదికను తయారుచేయుము.
జవాబు:

వస్తువు పేరు దర్పణ స్వభావం
1. నీటితో నిండిన గ్లాసు, నీటి ఉపరితలం సమతల దర్పణం
2. నీటిగ్లాసు ఉపరితలం కుంభాకార దర్పణం
3. గ్లోబు ఉపరితలం కుంభాకార దర్పణం
4. వాహనాల సైడ్ అద్దం కుంభాకార దర్పణం
5. వాహనాల హెడ్లైట్స్ పుటాకార దర్పణం
6. భోజనం చేయు పళ్ళెం పుటాకార దర్పణం
7. సైకిల్ బెల్ పై భాగం కుంభాకార దర్పణం
8. పాత్రల అంతర తలాలు పుటాకార దర్పణం
9. బల్బుల ఉపరితలాలు కుంభాకార దర్పణం
10. వాటర్ ఫిల్టర్ బయటి ఉపరితలం కుంభాకార దర్పణం
11. వాటర్ ఫిల్టర్ లోపలి ఉపరితలం పుటాకార దర్పణం

AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 28.
పుటాకార, కుంభాకార దర్పణాలలో మన ప్రతిబింబాలు ఎలా ఉంటాయి? వాటికి సంబంధించిన ఫోటోలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. (AS 4)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 13

ప్రశ్న 29.
పుటాకార దర్పణం వల్ల కాంతి పరావర్తనం పొందే విధానాన్ని టి.వి యాంటెన్నా డిష్ నిర్మాణంలో ఉపయోగించిన తీరును మీరు ఎలా అభినందిస్తారు? (AS 6)
జవాబు:

  1. టి.వి. యాంటెన్నా డిష్ కు గల పుటాకార తలం వివిధ రకాల ఉపగ్రహాల నుండి వెలువడు సంకేతాలను తీసుకుంటుంది.
  2. పరావలయ ఆకృతిలో ఉన్న పుటాకార తలం యాంటెన్నా యొక్క నాభ్యంతరం నుండి ఆ సంకేతాలను పరావర్తనం చెందేలా చేస్తుంది.
  3. ఈ రకంగా యాంటెన్నా డి నిర్మాణంలో ఉపయోగపడిన పుటాకార దర్పణం వలన మానవాళి యొక్క జ్ఞానాన్ని పెంచి, క్షణాల్లో సమాచారాన్ని ఇంటి ముంగిట్లో ఉంచుటకు దోహదపడిన పుటాకార దర్పణం అభినందనీయమైంది.

ప్రశ్న 30.
3 మీటర్ల వక్రతా వ్యాసార్థం గల కుంభాకార దర్పణాన్ని ఒక వాహనానికి రియర్ వ్యూ మిర్రర్ గా ఉపయోగించారు. ఈ దర్పణానికి 5 మీ. దూరంలో ఒక బస్సు ఉంటే అపుడు ఏర్పడే ప్రతిబింబస్థానాన్ని, పరిమాణాన్ని లెక్కించంది. ఈ ప్రతిబింబం నిటారు ప్రతిబింబమా, తలక్రిందుల ప్రతిబింబమా తెల్పండి.
జవాబు:
వక్రతా వ్యాసార్ధం R = 3 మీ. ; నాభ్యంతరం f = \(\frac{\mathrm{R}}{2}=\frac{3}{2}\) = 1.5 మీ.
వస్తుదూరం = -5 మీ.
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 14
∴ దర్పణమునకు వెనుక 1.15 మీ. దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది.
ఈ ప్రతిబింబం నిటారు ప్రతిబింబం మరియు మిథ్యా ప్రతిబింబం.

ప్రశ్న 31.
15 సెం.మీ. నాభ్యంతరం గల కుంభాకార దర్పణం ముందు 10 సెం.మీ. దూరంలో వస్తువును ఉంచాం. ప్రతిబింబ స్థానం, ప్రతిబింబ లక్షణాలను తెల్పండి.
జవాబు:
వస్తుదూరం = u = – 10 సెం.మీ. ; నాభ్యంతరం = f = 15 సెం.మీ. ; ప్రతిబింబ దూరం = v = ?
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 15
దర్పణానికి వెనుక 6 సెం.మీ దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం నిటారైన మిథ్యా ప్రతిబింబం.

ప్రశ్న 32.
పట్టిక 3లో దత్తాంశం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయుము. (AS 4)
1) పుటాకార దర్పణం ముందు ఒక వస్తువును ఉంచి దూరంగా జరుపుకుంటూ పోతే ప్రతిబింబ పరిమాణంలో ఎటువంటి మార్పులు క్రమంగా వస్తాయి?
2) పుటాకార దర్పణంతో తలక్రిందుల ప్రతిబింబం ఏఏ సందర్భాలలో ఏర్పడుతుంది?
3) పుటాకార దర్పణం వక్రతా వ్యాసార్థం 10 సెం.మీ. అయితే వస్తువుని ఎక్కడ ఉంచితే ప్రతిబింబం వక్రతా వ్యాసార్థం వద్ద ఏర్పడుతుంది?
4) ఏఏ పరిమాణాలలో నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచగలం?
జవాబు:
1) a) పుటాకార దర్పణం నుండి ఒక వస్తువును దాని నాభివైపు జరుపుకుంటూ పోతే, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది.
b) నాభివద్ద వస్తువును ఉంచితే, ఆ ప్రతిబింబ పరిమాణం అనంతంగా ఉంటుంది.
c) నాభి నుండి వక్రతా కేంద్రం ‘C’ వైపుకు వస్తువును జరిపితే, ప్రతిబింబ పరిమాణం క్రమంగా తగ్గుతుంది. కాని ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణం కంటె పెద్దగా ఉంటుంది.
d) వక్రతా కేంద్రం ‘C’ వద్ద ప్రతిబింబ పరిమాణం వస్తువు ప్రతిబింబ పరిమాణంతో సమానంగా ఉంటుంది.
e) వక్రతా కేంద్రం ‘C’ నుండి అనంత దూరానికి, ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణం కంటే చిన్నదిగా ఉంటుంది మరియు క్రమంగా తగ్గుతుంది.
f) పుటాకార దర్పణం యొక్క నాభినుండి వస్తువును దూరంగా జరుపుకుంటూ పోతే ప్రతిబింబ పరిమాణం తగ్గుతుంది.

2) పుటాకార దర్పణం నాభి (F) కి ఆవల వస్తువును ఉంచితే, తలక్రిందుల ప్రతిబింబం ఏర్పడుతుంది.

3) 10 సెం.మీ. దూరం వద్ద (లేదా) u = 10 సెం.మీ. వద్ద

4) వస్తువు కన్నా ప్రతిబింబ పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, సమానంగా ఉన్నప్పుడు మరియు తక్కువగా ఉన్నప్పుడు నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచగలం.

9th Class Physical Science 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 115

ప్రశ్న 1.
ఇచ్చిన పటంలో కుంభాకార దర్పణంపై సమాంతర కాంతికిరణాలు పతనం చెందుతున్నాయి. వాటిని పరిశీలిస్తే మీరేం చెప్పగలరు?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 16

  1. కుంభాకార దర్పణంపై పడిన సమాంతర కాంతికిరణాలు పరావర్తనం చెందాక వికేంద్రీకరింపబడుతున్నాయి.
  2. పరావర్తన కిరణాలను మనం వెనుకకు పొడిగిస్తే అవి కుంభాకార దర్పణనాభి ‘F’ వద్ద కలుస్తున్నాయి.

ప్రశ్న 2.
ఆ దర్పణం యొక్క నాభి వద్ద తెరను ఉంచితే, దానిపై ఒక బిందు ప్రతిబింబం ఏర్పడుతుందా?
జవాబు:
నాభి వద్ద తెరను ఉంచితే, దానిపై బిందు ప్రతిబింబం ఏర్పడదు. ఎందుకనగా ఆ స్థానంలోనిది మిథ్యా ప్రతిబింబం.

9th Class Physical Science Textbook Page No. 112

ప్రశ్న 3.
నీవు ఎప్పుడైనా కాగితాన్ని భూతద్దంతో కాల్చావా?
జవాబు:
కాగితాన్ని భూతద్దంతో కాల్చాను.

ప్రశ్న 4.
అలా చేసినప్పుడు కాగితం కాలడానికి కారణమేమి?
జవాబు:
భూతద్దం లాంటి కటకం కాంతిని కాగితంపై కేంద్రీకరించడం వలన కాగితం కాలింది.

ప్రశ్న 5.
భూతద్దానికి బదులు ఒక సమతల దర్పణాన్ని ఉపయోగించి కాగితాన్ని కాల్చగలవా? ఎందుకు?
జవాబు:
కాల్చలేము. సమతల దర్పణం కాంతి కిరణాలను కేంద్రీకరింపజేయలేదు.

ప్రశ్న 6.
కాంతి కేంద్రీకరించడానికి ఎటువంటి దర్పణాలను ఉపయోగించవచ్చును?
జవాబు:
కాంతి కేంద్రీకరించడానికి పుటాకార దర్పణాలను ఉపయోగించవచ్చును.

AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 7.
పూర్వం ఆర్కిమెడిస్ అనే శాస్త్రవేత్త నున్నని పాలిష్ చేయబడిన తలాలను ఉపయోగించి, శత్రువుల యుద్ధనౌకలను తగులబెట్టడానికి ఉపయోగించేవాడట!
ఆర్కిమెడిస్ ఎటువంటి తలాలను ఉపయోగించి ఉంటాడు?
జవాబు:
ఆర్కిమెడిస్ వక్రతలాలను ఉపయోగించి ఉంటాడు.

పరికరాల జాబితా

వివిధ రకాల దర్పణాలు, V- స్టాండ్, కొలిచే టేపు, చార్ట్, కొవ్వొత్తి, డ్రాయింగ్ బోర్డ్, అక్రిలిక్ షీట్, గుండు సూదులు, థర్మాకోల్ ముక్క, పల్చని ఫోమ్, డిష్ యాంటీనా, జిగురు, అల్యూమినియం ఫాయిల్, నలుపురంగు వేసిన పాత్ర, కత్తెర

9th Class Physical Science 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

పరావర్తన కృత్యం
జవాబు:

  1. 3″ × 6″ కొలతలు గల ఒక దీర్ఘ చతురస్రాకార ఆక్రలిక్ టన్ను తీసుకోండి.
  2. ఈ షీట్ కాంతి కిరణాలను పరావర్తనం చెందించే తలం వలె ఉపయోగపడుతుంది.
  3. దానిని వంచకుండా అరచేతిలోకి తీసుకొని, దానిపై టార్చిలైట్ కాంతిని వేయండి.
  4. పరావర్తన కాంతి గోడపై పడునట్లు షీటు తిప్పండి.
    పరిశీలన : షీట్ ను వంచనందువలన, అది సమతల దర్పణం వలె పనిచేస్తుంది. కనుక కాంతి కిరణాలు ఒక ప్రాంతంలో కేంద్రీకరింపబడలేదు.
  5. షీట్ పుటాకార ఆకృతి పొందేలా అరచేతిని నెమ్మదిగా లోపలికి వంచండి.
  6. దానిపై టార్చిలైట్ కాంతిని వేసి, గోడపై ఏర్పడిన ప్రతిబింబాన్ని పరిశీలించండి.
    పరిశీలన : షీటు వంచినందువలన అది పుటాకార దర్పణం వలె పనిచేస్తుంది. కనుక కాంతి కిరణాలు ఒక ప్రాంతంలో కేంద్రీకరింపబడతాయి.
  7. ఇప్పుడు షీట్ కుంభాకార ఆకృతి పొందేలా అరచేతిని నెమ్మదిగా బయటికి వంచండి.
  8. దీనిపై టార్చిలైట్ లో కాంతిని వేసి, గోడపై ప్రసరించిన కాంతిని పరిశీలించండి.
    పరిశీలన : షీటు బయటకు వంచినందువలన అది కుంభాకార దర్పణంవలె పనిచేస్తుంది. కనుక కాంతి కిరణాలు ఒక ప్రాంతంలో కేంద్రీకరింపబడకుండా తక్కువ తీవ్రతతో వికేంద్రీకరింపబడినవి.

కృత్యం – 2

2. అత్యంత దూరాల నుండి మనల్ని చేరే కాంతికిరణాలు దాదాపుగా సమాంతరంగా ఉంటాయని తెలపడానికి ఒక ప్రయోగాన్ని సూచించండి. దానిలోని దశలను ఫ్లోచార్టు రూపంలో రాయండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 17

  1. పటంలో చూపబడినట్లుగా థర్మాకోల్ దిమ్మెకు రెండు గుండు సూదులను చూడుము.
  2. ఆ సూదులు పరస్పరం సమాంతరంగా ఉన్నాయి.
  3. పటంలో చూపినట్లు ఆ సూదులకు దగ్గరలో కాంతిజనకాన్ని ఉంచితే వాటి నీడలు వికేంద్రీకరించడం జరుగుతుంది.
  4. కాంతి జనకాన్ని కొంచెం దూరంగా జరిపినప్పుడు వాటి నీడలు వికేంద్రీకరించబడే కోణం తగ్గిపోతుంది.
  5. కాంతి జనకాన్ని ఇంకా దూరంగా జరిపిన గుండు సూదుల నీడలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేటట్లు ఏర్పడతాయి.
  6. కొవ్వొతిని మరీ దూరంగా జరుపుతూ పోతే కాంతి తీవ్రత తగుతుంది. అంటే సమాంతర కాంతిపుంజం కావాలంటే కాంతి జనకం చాలా దూరంలో ఉండాలి మరియు అది తగినంత తీవ్రత కలదై ఉండాలి. దీనిని బట్టి అత్యంత దూరాల నుండి మనల్ని చేరే కాంతి కిరణాలు దాదాపు సమాంతరంగా ఉంటాయని చెప్పగలము.

కృత్యం – 3

3. పుటాకార దర్పణం యొక్క నాభిని గుర్తించండి.
(లేదా)
నీకివ్వబడిన పుటాకార దర్పణం యొక్క నాభిని ఎలా కనుగొంటావు? ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 1

  1. సూర్యకాంతి పడే విధంగా ఒక పుటాకార దర్పణాన్ని పట్టుకోండి.
  2. దర్పణానికి ఎదురుగా చిన్న కాగితం ముక్కను ఉంచండి.
  3. ఆ కాగితం ముక్క మెల్లగా వెనుకకు జరుపుతూ ఏ స్థానంలో చిన్నదైన మరియు అధిక తీవ్రత కలిగిన బిందువు ఏర్పడుతుందో గుర్తించండి.
  4. ఈ బిందువు సూర్యుని ప్రతిబింబం.
  5. సూర్యుని నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడినవి.
  6. ఈ బిందువును పుటాకార దర్పణం యొక్క నాభి ‘F’ లేదా నాభీయ బిందువు అంటారు.

కృత్యం – 4

4. వక్రతలానికి లంబాన్ని కనుగొనే కృత్యాన్ని రాయుము.
(లేదా)
ఒక వక్రతలంకు లంబంను నీవు ఏ విధముగా కనుగొంటావు?’ వక్రతలాల లంబాలను ఖండించు బిందువులను ఏమంటారు? వివరింపుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 18

  1. చిన్న రబ్బరు ముక్క లేదా ఫోమ్ ముక్కను తీసుకొనుము.
  2. పటం (ఎ) లో చూపిన విధంగా దానిపై ఒకే వరుసలో గుండుసూదులను గుచ్చుము.
  3. ఆ గుండుసూదులన్నీ రబ్బరు ముక్క తలానికి లంబంగా ఉంటాయి.
  4. ఆ రబ్బరు ముక్కను అద్దంలా భావిస్తే గుండుసూదులు వాటిని గుచ్చిన బిందువుల వద్ద లంబాలను సూచిస్తాయి.
  5. గుండుసూది గుచ్చిన బిందువు వద్ద పతనమైన కిరణం గుండుసూదితో ఎంత కోణం చేస్తుందో, అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది.
  6. పటం – (బి) లో చూపినట్లు రబ్బరు ముక్కను లోపలి వైపునకు వంచుము. గుండుసూదులను నిశితంగా పరిశీలిస్తే అవి ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడుతున్నట్లుగా కనిపిస్తాయి.
  7. పటం (సి) లో చూపినట్లు రబ్బరు ముక్కను వెలుపలి వైపునకు వంచితే గుండుసూదులు వికేంద్రీకరింపబడుతున్నట్లుగా కనిపిస్తాయి.
  8. ఈ రబ్బరు ముక్కలు గోళాకార దర్పణాలను వివరిస్తున్నాయి.
  9. పటం – (బి) లోపలికి వంచిన రబ్బరు ముక్క వలె పుటాకార దర్పణం ఉంటుంది.
  10. పటం – (సి) వెలుపలికి వంచిన రబ్బరు ముక్క వలె కుంభాకార దర్పణం ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రయోగశాల కృత్యం – 1

5. కృత్యం ద్వారా వివిధ రకాల ప్రతిబింబాలను పరిశీలించడం, వస్తుదూరం, ప్రతిబింబ దూరాలను పుటాకార దర్పణం ద్వారా కొలుచుటను వివరించుము.
(లేదా)
అనేక వస్తువుల ప్రతిబింబాలను పరిశీలించుట, వస్తుదూరం, ప్రతిబింబ దూరాలను పుటాకార దర్పణం ద్వారా ఏ విధంగా కొలిచెదరో ప్రయోగ పూర్వకముగా తెలుపుము.
జవాబు:
ఉద్దేశ్యం :
పుటాకార దర్పణం వలన ఏర్పడే వివిధ రకాల ప్రతిబింబాలను పరిశీలించడం – వస్తుదూరం, ప్రతిబింబ దూరాలను కొలవడం.

కావలసిన పదార్థాలు :
కొవ్వొత్తి, తెల్లకాగితం / డ్రాయింగ్ షీట్, నాభ్యంతరం తెలిసిన పుటాకార దర్పణం, V- స్టాండు, కొలత టేపు లేదా మీటరు స్కేలు.

పద్ధతి :
AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 4

  1. పుటాకార దర్పణాన్ని V – స్టాండుపై పెట్టుము.
  2. దర్పణానికి ఎదురుగా పటంలో చూపినట్లు వెలుగుతున్న కొవ్వొత్తి, మీటరు స్నేలును ఉంచుము.
  3. దర్పణం నుండి వివిధ దూరాలలో (10 – 80 సెం.మీ. వరకు) ప్రధాన అక్షం వెంబడి కొవ్వొత్తిని ఉంచుతూ, కాగితాన్ని (తెరను) ముందుకు, వెనుకకు కదుపుతూ ప్రతీసారి ఏ స్థానంలో ఖచ్చితమైన ప్రతిబింబం ఏర్పడుతుందో గుర్తించండి.
  4. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.

AP Board 9th Class Physical Science Solutions 7th Lesson వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం 19
పై పట్టిక నుండి వస్తువు దర్పణం వైపు కదులుతూ ఉంటే, దాని ప్రతిబింబం దర్పణం నుండి వెనుకకు జరుగుతూ ఉంటుంది.

Leave a Comment