AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 6th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 6th Lesson Questions and Answers జ్ఞానేంద్రియాలు

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కారణాలను ఇవ్వండి.
అ) సాధారణంగా మనం తక్కువ కాంతిలో (చిరుకాంతిలో) కాంతివంతమైన రంగుల్ని చూడలేము. (AS 1)
జవాబు:

  1. నేత్రపటలంలో దండాలు, శంకువులు అనే కణాలుంటాయి.
  2. మన కంటిలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగిన దండాలు సుమారుగా 125 మిలియన్లు ఉన్నాయి.
  3. దండాలు అతి తక్కువ కాంతిలో అంటే చీకటిలో వస్తువులను చూడగలవు.
  4. కానీ వివిధ రంగులకు సంబంధించిన నిశితమైన తేడాలను మాత్రం దండాలు గుర్తించలేవు.

ఆ) మరీ తరచుగా చెవిలో గులిమి (మైనం)ను తొలగించడం అన్నది చెవి వ్యాధులకు దారి తీయవచ్చు.
జవాబు:

  1. వెలుపలి చెవినందు మైనంను ఉత్పత్తిచేయు సెరుమినస్ గ్రంథులు మరియు నూనె ఉత్పత్తి చేయు తైలగ్రంథులు ఉన్నాయి.
  2. ఇవి శ్రవణకుల్యను మృదువుగా ఉంచడానికి, మురికి మరియు ఇతర బాహ్య పదార్థములను శ్రవణకుల్యలోనికి ప్రవేశించడాన్ని నిరోధిస్తాయి.
  3. తరచుగా చెవిలో గులిమిని తొలగిస్తే బ్యా క్టీరియా, ఫంగస్ వల్ల చీము, కర్ణభేరికి ఇన్ఫెక్షన్ సాధారణంగా వస్తాయి.
  4. అందువలన గులిమిని తరచుగా తొలగించకూడదు.

ఇ) బాగా దగ్గు, జలుబు ఉన్నప్పుడు మనకు ఆహారం రుచి తెలియదు.
జవాబు:

  1. మనకు జలుబుగా ఉన్నప్పుడు నోటికి ఆహారం రుచి తెలియకపోవడానికి కారణం నాసికాకుహరం పూడుకున్నట్లు ఉండటం.
  2. తద్వారా ఆహారంలోని మధురమైన సువాసనను ముక్కు గ్రహించదు. అందువలన ఆహారం రుచి తెలియదు.

ఈ) ఉల్లిగడ్డలు కోస్తున్నప్పుడు మన కళ్ళ నుండి నీరు కారుతుంది.
జవాబు:

  1. ఉల్లిగడ్డనందలి కణములు అమైనో ఆమ్లాలను, సల్ఫోనిక్ ఆమ్లమును ఏర్పరచే సల్ఫాక్సెడ్ను కలిగి ఉంటాయి.
  2. ఇవి రెండు ఉల్లిగడ్డ కణమునందు వేరుగా ఉంచబడతాయి.
  3. మనము ఉల్లిగడ్డను కోసినపుడు వేరుగా ఉంచబడిన అమైనో ఆమ్లములు, సల్ఫాక్సైడ్ లు కలసి ప్రొపనిధియోల్ సల్ఫర్ ఆక్సైడ్ ను ఏర్పాటు చేస్తాయి.
  4. ప్రొపనిధియోల్ సల్ఫర్ ఆక్సెడ్ ఆవిరి అయి మన కళ్ళవైపు ప్రయాణిస్తుంది.
  5. ఇది మన కంటినందలి నీటితో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లమును ఏర్పరచును.
  6. కంటినందు. సల్ఫ్యూరిక్ ఆమ్లము వలన కళ్ళు మండుతాయి. దీనివలన అశ్రుగ్రంథులు నీటిని స్రవిస్తాయి.
  7. అందువలన ఉల్లిగడ్డను మనము కోసిన ప్రతిసారి మన కళ్ళు నీటితో నిండుతాయి.

ప్రశ్న 2.
తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. (AS 1)
అ) నేత్రపటలం మీద ప్రతిబింబం పడడమన్నదే “చూడడం”కు వెనుక ఉన్న నియమం లేక సూత్రం.
ఆ) చెవులు వినడానికి మాత్రమే పనికొస్తాయి.
ఇ) కంటిపాప నమూనాలు, వేలిముద్రల మాదిరిగానే వ్యక్తుల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.
ఈ) రుచిని కనుగొనడం (జిహ్వజ్ఞానం)లో లాలాజలం రుచికణికలకు సహాయపడుతుంది.
ఉ) మనం ఇంద్రియ జ్ఞానాలకు తగిన అనుకూలనాలు కలిగిలేము.
అ) నేత్రపటలం మీద ప్రతిబింబం పడడమన్నదే “చూడడం”కు వెనుక ఉన్న నియమం లేక సూత్రం.
జవాబు:
ఈ వాక్యము సరియైనదే. కెమెరా మాదిరిగానే కన్ను కాంతిని సేకరించి, కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

ఆ) చెవులు వినడానికి మాత్రమే పనికొస్తాయి.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు. ఎందుకంటే చెవులు వినడంతో బాటు మన శరీరం యొక్క సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి చెవులు ఉపయోగపడతాయి.

ఇ) కంటిపాప నమూనాలు, వేలిముద్రల మాదిరిగానే వ్యక్తుల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.
జవాబు:
ఈ వాక్యము సరియైనదే. ఎందుకంటే కంటిపాపలు ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వేలిముద్రల మాదిరిగానే వాటిని కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.

ఈ) రుచిని కనుగొనడం (జిహ్వ జ్ఞానం)లో లాలాజలం రుచికణికలకు సహాయపడుతుంది.
జవాబు:
ఈ వాక్యము సరైనదే. ఎందుకంటే ఆహారంలో రుచిని కలుగజేసే రసాయనిక పదార్థాలు లాలాజలంలో కరుగుతాయి. ఈ లాలాజలం, రుచికణికల ద్వారా వాటి కుహరంలో ప్రవేశించి జిహ్వ గ్రాహకాలను తడుపుతుంది. తద్వారా లాలాజలం రుచికణికలకు సహాయపడుతుంది.

ఉ) మనం ఇంద్రియ జానాలకు తగిన అనుకూలనాలు కలిగి లేము.
జవాబు:
ఈ వాక్యము సరికాదు. ఎందుకంటే అన్ని జ్ఞానేంద్రియాలకు తగిన అనుకూలనాలు మన శరీరం కలిగి ఉంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 3.
రెండింటి మధ్య తేడాలు తెలపండి. (AS 1)
అ) దందాలు, శంకువులు

దండాలు శంకువులు
1. అతి తక్కువ కాంతిలో, చీకటిలో వస్తువులను చూడగలవు. 1. కాంతివంతమైన వెలుతురులో రంగులను గుర్తిస్తాయి.
2. వివిధ రంగులకు సంబంధించిన నిశితమైన తేడాలను గుర్తించలేవు. 2. నీలం, ఎరుపు, పసుపుపచ్చ వంటి రంగులు కాకుండా వాటి కలయికచే ఏర్పడు రంగులను కూడా గుర్తించగలవు.
3. దండాలు సుమారుగా 125 మిలియన్లు ఉంటాయి. 3. శంకువులు దాదాపు ఏడు మిలియన్లు ఉంటాయి.
4. దండాలలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. 4. శంకువులలో అయెడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది.
5. దండాలలో లోపములు ఉంటే రేచీకటి కలుగుతుంది. 5. శంకువులలో తేడాలుంటే రంగులను గుర్తించలేని లోపము కలుగుతుంది.

ఆ) కంటిపాప, తారక
జవాబు:

కంటిపాప తారక
1. కంటిలో తారక చుట్టూ ఉన్న రంగుగల భాగము. 1. కంటి మధ్యన ఉన్న గుండ్రటి భాగము.
2. కంటిపాప నీలం, ఆకుపచ్చ, బూడిద మరియు గోధుమరంగు వర్ణములో ఉండవచ్చు. 2. తారక నల్లని రంగులో ఉంటుంది.
3. కాంతి తీవ్రతకు అనుగుణంగా పెద్దగా మరియు చిన్నగా మారదు. 3. కాంతి తీవ్రతకు అనుగుణంగా పెద్దదిగాను, చిన్నదిగాను అవుతుంది.

ఇ) పిన్నా, కర్ణభేరి
జవాబు:

పిన్నా కర్ణభేరి
1. దీనిని వెలుపలి చెవి అంటారు. 1. దీనిని టింపానమ్ అని అంటారు.
2. ఇది మన తలభాగాన ఇరువైపులా కంటికి కనిపించే చెవిభాగము. 2. వెలుపలి చెవి మరియు మధ్యచెవి మధ్యన ఉంటుంది.
3. ఇది ఒక దొప్ప మాదిరిగా ఉంటుంది. 3. ఇది శంకువు ఆకారములో ఉంటుంది.
4. పిన్నా మృదులాస్థితో నిర్మితమైనది. 4. కర్ణభేరి ఒక పలుచని పొరలాంటి నిర్మాణము.
5. శబ్ద తరంగాలను సేకరిస్తుంది. 5. శబ్ద తరంగాలను ప్రకంపనాలుగా మారుస్తుంది.
6. ఇది వెలుపలి చెవి మొదటి భాగము. 6. ఇది వెలుపలి చెవి చివరి భాగము.

ఈ) నాసికా కుహరం, శ్రవణకుల్య
జవాబు:

నాసికా కుహరం శ్రవణ కుల్య
1. బాహ్య నాసికా రంధ్రములలోని ఖాళీ ప్రదేశం నాసికా కుహరం. 1. వెలుపలి, మధ్య చెవినందలి కాలువలాంటి నిర్మాణం శ్రవణ కుల్య.
2. నాసికా కుహరం అంతరనాసికా రంధ్రాల లోనికి తెరుచుకుంటుంది. 2. శ్రవణ కుల్య మధ్య చివర కర్ణభేరి ఉంటుంది.
3. అంతరనాసికా రంధ్రాలలోనికి పోయే గాలి నుండి దుమ్ము కణాలను వేరుచేస్తుంది. 3. వెలుపలి చెవి నుండి శబ్ద తరంగాలను కర్ణభేరికి తీసుకువెళుతుంది.
4. నాసికా కుహరం గోడలు శ్లేషస్తరాన్ని, చిన్న వెంట్రుకలను కలిగి ఉంటుంది. 4. శ్రవణ కుల్యనందు సెరుమినస్ మరియు తైల గ్రంథుల స్రావమైన గులిమి ఉంటుంది.

ప్రశ్న 4.
క్రింది ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయి? (AS 1)
అ) మనం వస్తువును చూడగానే దాని నిజమైన ప్రతిబింబం నేత్రపటలంపై తలకిందులుగా ఏర్పడుతుంది.
ఆ) పిన్నా సేకరించిన శబ్ద తరంగాలు ప్రకంపనాలుగా మారతాయి.
ఇ) మనం మనచేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం.
ఈ) ఘాటైన వాసన, మనం ముక్కు మూసుకునేలా చేస్తుంది.
అ) మనం వస్తువును చూడగానే దాని నిజమైన ప్రతిబింబం నేత్రపటలంపై తలకిందులుగా ఏర్పడుతుంది.
జవాబు:
మనం వస్తువును చూడగానే, కెమెరా మాదిరిగానే కన్ను కాంతిని సేకరించి, కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగాను, తలకిందులుగాను ఉంటుంది.

ఆ) పిన్నా సేకరించిన శబ్ద తరంగాలు ప్రకంపనాలుగా మారతాయి.
జవాబు:
పిన్నా శబ్ద తరంగాలను సేకరిస్తుంది. సేకరించిన శబ్ద తరంగాలు శ్రవణకుల్యను చేరతాయి. అవి అప్పుడు కర్ణభేరిని తాకుతాయి. ఈ శబ్ద తరంగాలు, ప్రకంపనాలుగా మారతాయి.

ఇ) మనం మనచేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం.
జవాబు:
జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికీ కేంద్రం మెదడు. అది జ్ఞానేంద్రియాల నుండి నాడీ సంకేతాలు తెచ్చే జ్ఞాననాడుల ద్వారా సమాచారాన్ని అందుకుంటుంది. తరువాత వాటిని విశ్లేషించి చాలకనాడులు అని పిలువబడే మరొక రకం నాడుల ద్వారా ప్రతిచర్యను చూపాల్సిన భాగాలకు సంకేతాలు పంపుతుంది. ఉదాహరణకు మన చేతిని వేడి వస్తువు దగ్గరకు తీసుకెళ్ళామనుకోండి. వెంటనే జ్ఞాననాడులు, చర్మానికి వేడి తగులుతుందనే సమాచారాన్ని మెదడుకు చేరుస్తాయి. మెదడు చేతిని దూరంగా జరపాల్సిందిగా చాలకనాడుల ద్వారా సమాచారం పంపుతుంది. అపుడు చేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం.

ఈ) ఘాటైన వాసన, మనం ముక్కు మూసుకునేలా చేస్తుంది.
జవాబు:
ముక్కులోని గ్రాహక కణాలు ప్రేరణను, నాడీ సంకేతాలుగా మార్చి మెదడులో కింది భాగాన ఉండే ఝణకేంద్రాలకు చేరుస్తాయి. అక్కడ ఋణ జ్ఞానం (వాసన) ప్రక్రియ జరుగుతుంది. అలా ఘాటైన వాసన ముక్కులోని గ్రాహక కణాల ‘ నుండి మెదడుకు చేరుతుంది. వెంటనే మెదడు భరించలేని వాసన కనుక ముక్కు మూసుకోమని సంకేతాన్నిస్తుంది.

ప్రశ్న 5.
ఖాళీలను సరియైన పదాలతో పూరించండి. తరువాత ఆ పదాలు ఎలా సరిపోతాయో కారణాలు ఇవ్వండి. (AS 1)
1. రక్తపటలం కంటికి ………………. ఇస్తుంది.
జవాబు:
రక్షణ.
కారణం : ఈ పొర కంటి యొక్క అన్ని భాగాలను (తారక తప్ప) ఆవరించియుంటుంది కనుక.

2. నాలుకకు, ……………… కు మధ్య సంబంధం చాలా ఎక్కువ.
జవాబు:
ముక్కు
కారణం : వాసనకు, రుచికి సంబంధం ఉంది కనుక.

3. కంటిపాప నమూనా వ్యక్తుల ……………… కు ఉపయోగపడుతుంది.
జవాబు:
గుర్తింపు
కారణం : కంటి పాప ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి.

4. దృక్మడి కంటిని దాటి చోటు పేరు ………..
జవాబు:
అంధచుక్క
కారణం : అంధచుక్క దృక్మడి కంటినుండి బయటకు పోయేచోట ఉంటుంది కనుక.

5. కర్ణభేరి అనేది ……………..
జవాబు:
ప్రకంపించే పొర
కారణం : శబ్ద తరంగాలు కర్ణభేరిని తాకగానే ప్రకంపనాలు వస్తాయి కనుక.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 6.
సరియైనదాన్ని ఎంపిక చేయండి : (AS 1)
అ. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్
ఎ) విటమిన్ ‘ఎ’
బి) విటమిన్ ‘బి’
సి) విటమిన్ ‘సి’
డి) విటమిన్ ‘డి’
జవాబు:
ఎ) విటమిన్ ‘ఎ’

ఆ. ఇంద్రియ జ్ఞానమన్నది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి
ఎ) జ్ఞానేంద్రియాలు
బి) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు
సి) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు
డి) మెదడు, నాదీ ప్రేరణలు
జవాబు:
సి) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు

ఇ. వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలని కేంద్రీకరించకపోతే ‘శ్రవణ కుల్య
ఎ) అనేక రకాల శబ్దాలను గట్టిగా వినగలదు
బి) ఏమి వినలేదు
సి) కొద్దిగా వినగలదు
డి) శబ్దం పుట్టుకని, రకాన్ని తెలుసుకోలేదు
జవాబు:
బి) ఏమి వినలేదు

ఈ. ఒక వ్యక్తి యొక్క కంటిగుద్దు కండరాలు పనిచేయకుండా పాడైతే, తప్పనిసరిగా కలిగే ప్రభావం?
ఎ) ఆ వ్యక్తి కళ్ళు మూసుకోలేడు
బి) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు
సి) కంటిలో నొప్పి వస్తుంది, కళ్ళు మూసుకోలేడు
డి) ఆ కండరాలకు చేరే నాడులు పనిచేయవు
జవాబు:
బి) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు

ఉ. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది. అప్పుడు ఆ వ్యక్తి
ఎ) ఉప్పటి పదార్థాలను తినడం నేర్చుకుంటాడు
బి) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడతాడు
సి) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడడు
డి) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు.
జవాబు:
డి) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు

ప్రశ్న 7.
మన చర్మానికి స్పర్శజ్ఞానం లేకపోతే ఏమవుతుంది? (AS 2)
జవాబు:

  1. శరీరము బయట నుండి సమాచారం గ్రహించడానికి చర్మమునందు అనేక జ్ఞాన గ్రాహకాలున్నాయి.
  2. చర్మమునందలి జ్ఞాన గ్రాహకాలు కనీసం ఐదు రకాల జ్ఞానాన్ని కలుగచేస్తాయి. అవి బాధ, వేడి, చలి, స్పర్శ మరియు పీడనము.
  3. ఐదు జ్ఞానేంద్రియాలను వర్గీకరించే క్రమంలో బాధ, వేడి, చలి, స్పర్శ మరియు పీడనములు అన్నింటిని స్పర్శజ్ఞానము గానే పరిగణించడం జరిగింది.
  4. మన చర్మానికి స్పర్శజ్ఞానం లేకపోయినట్లయితే బాధ, వేడి, చలి, స్పర్శ మరియు పీడనముల గురించిన జ్ఞానాన్ని మనం పొందలేము.

ప్రశ్న 8.
శ్రవణజ్ఞానం కోసం మీరు చేసిన ప్రయోగంలో రబ్బరు పొర మీకు ఏ విధంగా ఉపయోగపడింది? (AS 3)
జవాబు:
శ్రవణజ్ఞానం కోసం మనం చేసిన ప్రయోగంలో రబ్బరు పొర చెవిలోని కర్ణభేరి మాదిరిగా పని చేస్తుంది.

  • గరాటు మూతి వద్ద ‘ఓ’ అని అన్నపుడు శబ్ద తరంగాలకు బెలూన్ ముక్కపై గల ధాన్యపు గింజలు కదులుతాయి.
  • రబ్బరు షీటుని కలిగి ఉన్న గరాటు మూతిని స్నేహితుని ఛాతిపై ఉంచినపుడు గుండెచప్పుడు ల డ మని వినిపిస్తుంది.

ప్రశ్న 9.
మీ తరగతిలోని ఐదుగురు విద్యార్థులు ఒక జట్టుగా ఏర్పడి కంటి వ్యాధులు – లక్షణాలు గురించి సమాచారాన్ని నేత్రవైద్యుల సహాయకుల నుండి సేకరించండి. (AS 4)
(లేదా)
కంటికి వచ్చే ముఖ్యమైన వ్యాధులు, లోపాలను పేర్కొనండి.
జవాబు:

కంటి వ్యాధి పేరు, దోషము పేరు లక్షణాలు
1. వయసు సంబంధిత మాక్యులా (పచ్చచుక్క) క్షీణత ఈ వ్యాధి పరిస్థితిలో నేత్రపటలం నందలి మధ్యభాగమైన మాక్యులా లేదా ఫోవియా క్షీణించిపోతుంది. అంధత్వము వస్తుంది.
2. ఎస్టిగ్మాటిజమ్ నేత్రపటలం నందలి వంపు అసంపూర్ణంగా ఉండడం.
3. కంటిశుక్లం (కెటరాక్ట్) కంటి ముందరభాగంలో ఉండే పొర ఉబ్బి మెత్తగా అయి పగులుతుంది. కళ్ళు సరిగా కనపడవు.
4. సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లుసన్ నేత్రపటం నందలి సిరలో రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడడం.
5. కలర్ బ్లైండ్ నెస్ (వర్ణాంధత) సాధారణ పరిస్థితులలో రంగులను గుర్తించకపోవటం, చూడలేకపోవడం.
6. కండ్ల కలక కంటి ముందర పొర ఉబ్బుతుంది. కన్ను ఎరుపెక్కుతుంది, మండుతుంది, నీరు కారుతుంది.
7. శుక్లపటలం మార్పుచెందడం శుక్లపటలం మీద మచ్చలు, ఉబ్బటం వలన లేదా అక్రమాకారం ఉండడం వలన కళ్ళు మెరవడం, చూపు చెదరడం జరుగుతుంది.
8. డయాబెటిక్ రెటినోపతి మధుమేహం వలన కంటికి వచ్చు వ్యాధి నేత్రపటలం నందలి రక్తనాళాలలో మార్పు వలన కలుగుతుంది.
9. పొడికళ్ళు లేదా జిరాఫ్తాల్మియా కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చెయ్యవు. కంటిపొర పొడిగా అవుతుంది.
10. దీర్ఘదృష్టి (హైపర్ మెట్రోపియా) ఇది వక్రీభవన దోషము. కన్ను సరిగ్గా కాంతిని ” వక్రీభవించదు. అందువలన ప్రతిబింబాలు నేత్రపటలం వెనుక ఏర్పడతాయి. దూరపు వస్తువులు కనపడతాయి. దగ్గర వస్తువులు సరిగ్గా కనపడవు.
11. గ్లూకోమా కంటిలోని దృక్మడి పాడయిపోతుంది. దీనివలన కంటిలో ఎక్కువ పీడనము కలుగుతుంది.
12. కెరోలైటిస్ శుక్లపటలం ఉబ్బుతుంది. అందువలన కన్ను ఎర్రగా మారి నొప్పి కలిగిస్తుంది. చూచునపుడు నొప్పి ఉంటుంది.
13. మాక్యులార్ ఎడిమా నేత్రపటలం నందలి మాక్యులా లేదా పచ్చచుక్క ఉబ్బుతుంది. మాక్యులా ఉబ్బుట వలన దృష్టి దోషము కలుగవచ్చు.
14. హ్రస్వదృష్టి (మయోపియా) ఇది వక్రీభవన దోషము. కన్ను కాంతిని సరిగా వక్రీభవించటం జరుగదు.
ప్రతిబింబాలు నేత్రపటలం ముందు ఏర్పడతాయి. దగ్గర వస్తువులు చూడడం, దూరపు వస్తువులు సరిగ్గా చూడలేకపోవటం జరుగుతుంది.
15. ఆప్టిక్ న్యూరైటిస్ కంటినందలి దృక్మడి పెద్దగా మారుతుంది.
16. రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ నెలలు నిండకుండానే పుట్టే పిల్లలలో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరుగుతాయి.
17. సీరైటిస్ కంటిలోని తెల్లగుడ్డు ఉబ్బటం వలన నొప్పి కలుగుతుంది. దీనినే స్క్లీరా అంటారు.
18. డిటాచ్ రెటీనా లేదా టార్న్ రెటీనా నేత్రపటలం ఒకటి లేదా ఎక్కువ స్థలాలలో చిరగడం, కంటి గోడల నుండి నేత్రపటలం పైకి నెట్టబడటం జరుగును.
19. నైట్ బ్లెండ్ నెస్ లేదా రేచీకటి ఈ వ్యాధితో బాధపడేవారు తక్కువ వెలుతురులోగాని, రాత్రి గాని వస్తువులను చూడలేరు.
20. ట్రకోమా కంటికి సోకే అంటువ్యాధి. రెండు కళ్ళకు వస్తుంది. ఇది క్లామీడియా ట్రాకోమేటిస్ అనే బాక్టీరియా వల్ల కలుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 10.
కింది వాటి నిర్మాణాలను సూచించే పటాలను గీయండి. భాగాలను గుర్తించండి. (AS 5)
1) కన్ను 2) చెవి 3) నాలుక
జవాబు:
1) కన్ను :
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1
2) చెవి :
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 2
3) నాలుక :
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 3

ప్రశ్న 11.
జ్ఞానేంద్రియాలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు? (AS 6)
జవాబు:

  1. జ్ఞానేంద్రియాలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మనం సానుభూతిని కలిగి ఉండాలి.
  2. అటువంటి పిల్లలు సక్రమమైన జీవితమును గడపటానికి కావలసిన సహకారం అందిస్తాను.
  3. వారు మామూలు మనుష్యులలాగానే జీవించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసమును వారిలో నింపుతాను.
  4. అంధులైన పిల్లలకు బ్రెయిలీ లిపి గురించి వివరిస్తాను. వారిని ప్రత్యేక శిక్షణ ఇచ్చు పాఠశాలల యందు చేర్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
  5. చెవులు పనిచేయని విద్యార్ధులకు మనము చేసే సంజ్ఞలు, సైగల ద్వారా విషయము అవగాహన అయ్యే విధముగా చేస్తాను.
  6. ప్రభుత్వము నుండి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కావలసిన సహాయమును అందే విధముగా కృషిచేస్తాను.
  7. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తమకు ఎటువంటి కొరత లేదనే భావనను మరియు వారికి కొదువ లేదనే తృప్తిని అందిస్తాను.

ప్రశ్న 12.
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సహాయపడే జ్ఞానేంద్రియాల పనులను నువ్వెలా మెచ్చుకోగలవు? (AS 6)
జవాబు:

  1. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తాము.
  2. మనం ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళతో, వీనులవిందైన సంగీతాన్ని చెవులతో, పూల సువాసనలను ముక్కుతో, ఆహారపదార్థాల రుచిని నాలుకతో ఆస్వాదిస్తున్నాము. చల్లని చిరుగాలిని చర్మంతో స్పర్శిస్తున్నాము.
  3. ఇటువంటివన్నీ మన జ్ఞానేంద్రియాలు ఎలా సమాచారాన్ని గ్రహిస్తున్నాయో, ఎలా ప్రతిస్పందిస్తున్నాయో మనకు ప్రత్యక్షంగా తెలియచేస్తున్నాయి.
  4. జ్ఞానేంద్రియాలు మన శరీరంలోని భాగాలు మాత్రమే కాదు, అవి మనమంటే ఏమిటో నిర్వచిస్తాయి.
  5. మన జీవితంలో అతిముఖ్యమైన విషయాల నుండి, అతి చికాకుపడే విషయాల వరకు ఏదీ జ్ఞానేంద్రియాల ప్రమేయం లేకుండా జరుగవు.
  6. మన కళ్ళు, చెవులు, చర్మం, నాలుక, ముక్కు గ్రహించే సమాచారం మిల్లీ సెకనుల వ్యవధిలో మెదడుకు అందచేయడం, అది సమాచారాన్ని సరిపోల్చుకోవడం, ప్రతిస్పందించడమనేది లేకపోతే ఈ ప్రపంచంలో పరిశోధనలకు అవకాశమే ఉండేది కాదు.

ప్రశ్న 13.
సాగర్ సరిగ్గా వినలేకపోతున్నాడు. అతనికి ఏం జరిగి ఉండొచ్చో ఊహించండి. అతనికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? (AS 7)
జవాబు:

  1. సాగర్ పెద్ద ధ్వనులను వినడం వలన అతను సరిగా వినలేకపోవచ్చు. ఇటువంటి స్థితిని ధ్వని వలన కలిగే వినికిడి లోపం అంటారు.
  2. కొన్నిసార్లు ఎక్కువ ధ్వని తీవ్రతకు గురి అయిన చెవినందు మోగుతున్నట్లు, బుసకొడుతున్నట్లు, అరుపుల శబ్దములు ఉండే స్థితిని ‘టిన్నిటస్’ అంటారు.
  3. చెవి భాగములందు సమస్య ఉన్నా కూడా సరిగా వినబడకపోవచ్చు.
  4. వినికిడి లోపం బ్యాక్టీరియా మరియు వైరస్ట్ వలన కలగవచ్చు.
  5. కనుక సరిగా వినలేకపోవటానికి కారణమును కనుగొనమని సాగర్‌కు సలహా ఇస్తాను.
  6. పాటలను ఎక్కువ ధ్వనితో వినవద్దని సలహా ఇస్తాను.
  7. చెవి వ్యాధులందు నిపుణుడైన వైద్యుని సంప్రదించమని సాగర్ కు నేను సలహా ఇస్తాను.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Activities (కృత్యములు)

కృత్యం -1

1. పుష్పాల గురించి కొన్ని వాక్యాలు మీ నోటు పుస్తకంలో రాయండి. ఆ పనిలో పాల్గొన్న జ్ఞానేంద్రియాలు, వాటి ప్రేరణలు ప్రతిచర్యలు, జ్ఞాన, చాలక నాడుల విధులను రాయండి.
జవాబు:
పుష్పములు వివిధ రంగులలో ఉంటాయి.
పుష్పములు సువాసనలను వెదజల్లుతాయి.
పుష్పములను తాకినచో మృదువుగా ఉంటాయి.
పుష్పములు తియ్యని మకరందాన్ని ఉత్పత్తి చేస్తాయి.
ఈ వాక్యములు రాయడంలో పాల్గొన్న జ్ఞానేంద్రియాలు కన్ను మరియు చర్మం.
పుష్పముల గురించి రాయడమన్నది ప్రేరణ. వాటిని రాయడం ప్రతిచర్య.

జ్ఞాననాడులు వార్తలను లేదా సమాచారాన్ని మెదడుకు తీసుకొని వెళతాయి. చాలకనాడులు సమాచారాన్ని మెదడు నుండి శరీరపు వివిధ భాగాలకు తీసుకొని వెళతాయి.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

కృత్యం – 2

2. ప్రేరణ కృత్యం.
జవాబు:
1) ఒక గ్లాసు నీటిలో చిటికెడు పంచదార కలపాలి.
2) కొంచెం తాగితే తియ్యగా అనిపించాయి.
3) ఆ నీటిలో ప్రతిసారి పావు టీ స్పూన్ చొప్పున పంచదార పరిమాణం పెంచుతూ వివిధ గాఢతల్లో ద్రావణాన్ని తయారుచేయాలి.
4) ప్రతిసారి రుచి చూడాలి.
5) 3 టీస్పూన్ల పంచదార వేసిన తరువాత రుచి స్థిరంగా ఉంటుంది.

కృత్యం – 3

3. మీ స్నేహితుని కంటి బాహ్య నిర్మాణం పరిశీలించండి. దాని పటం గీచి, భాగాలను గుర్తించండి. సాధారణ కాంతిలో మీ స్నేహితుని కంటిగుడ్డు పరిశీలించండి. తరువాత అతని కంటిలోకి టార్చిలైట్ కాంతి కిరణపుంజాన్ని వేసి మరలా పరిశీలించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1

  1. నా స్నేహితుని కంటిలో కంటిరెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, అశ్రుగ్రంథులు, నల్లగుడ్డు, తెల్లగుడ్డు ఉన్నాయి.
  2. కంటిలోకి టార్చిలైట్ కాంతికిరణ పుంజాన్ని వేసినపుడు కంటిని వెంటనే శుక్ల పటలంలో మూయడం జరిగింది.
  3. మరలా టార్చిలైట్ కాంతికిరణ పుంజాన్ని కంటిలో వేస్తూ స్నేహితుడు కళ్ళు తెరచినప్పుడు చిన్న నలుపురంగు భాగం పరిమాణం చిన్నదిగా అయినది.

కృత్యం – 4

4. అంధచుక్క పరిశీలన
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 4

  1. పుస్తకాన్ని చెయ్యంత దూరంలో పెట్టుకోవాలి.
  2. కుడి కన్ను మూయాలి. ఎడమకంటితో + గుర్తుకేసి తీక్షణంగా చూడాలి.
  3. కుడి కంటిని అలా మూసే ఉంచి పుస్తకాన్ని నెమ్మదిగా కంటి దగ్గరకు తీసుకురావాలి.
  4. పుస్తకం 8 నుండి 10 అంగుళాల దూరంలో ఉన్నప్పుడు + గుర్తు మన ఎడమకన్ను అంధచుక్క దగ్గర ఉండడంతో కనపడకుండా పోతుంది.
  5. + గుర్తుకు బదులుగా మన దృశ్య వ్యవస్థ దానికి అటు ఇటు ఉన్న నీలిరేఖల సమాచారంతో కనిపించని ఆ ప్రాంతాన్ని పూర్తి చేస్తుంది.

కృత్యం – 5

5. మీ స్నేహితుని కన్నులో కంటిపాప, దాని చుట్టుపక్కలను పరిశీలించండి. తారక మీకు కనిపించిందా? మీ స్నేహితుల కళ్ళలోని కంటిపాప రంగులు, ఆకారాలు పరిశీలించండి. ఒకరి నుండి ఒకరికి ఏమైనా తేడా ఉన్నదా?
జవాబు:

  1. స్నేహితుని కంటిలో నల్లటి చుక్క తారక కనిపించింది.
  2. స్నేహితుల కళ్ళలోని కంటిపాపల రంగులు వేరువేరుగా ఉన్నాయి.
  3. స్నేహితుల ‘కంటిపాపలు కొందరిలో నీలంరంగుగాను, కొందరిలో ఆకుపచ్చగాను, కొందరిలో బూడిద మరియు గోధుమరంగులో ఉన్నాయి.
  4. కంటిపాపల ఆకారాలు అందరిలో గుండ్రంగా ఉన్నాయి. తేడా ఏమీ లేదు.

కృత్యం – 6

6. కాంతివంతంగా ఉన్న ప్రాంతం నుండి చీకటిగా ఉండే గదిలోకి వెళ్ళండి. ఏం జరుగుతుంది ? చీకటి గదిలో కొంతసేపు కూర్చోంది. అప్పుడు ఎండలోకి వెళ్ళండి. ఏం జరుగుతుంది?
జవాబు:
a) 1) కాంతివంతంగా ఉన్న ప్రాంతంలో ఉండే తారక చాలా చిన్నదిగా ఉంటుంది.
2) చీకటి గదిలోకి వెళ్ళినట్లయితే మొదట మనకు ఏమీ కనిపించదు. ఈ సమయంలో తారక యొక్క పరిమాణం పెరుగుట వలన నెమ్మదిగా గదిలోని వస్తువులు మనకు కనపడతాయి.

b) 1) చీకటి గదిలో నుండి ఎండలోకి వెళ్ళినప్పుడు మొదట మనకు ఏమీ కనిపించదు. నెమ్మదిగా తారక పరిమాణం ఎండకు అనుగుణంగా మారుట వలన మనము వస్తువులను చూడగలము.
2) ఒకే పరిమాణంలో ఉన్న రెండు తెల్లకాగితం ముక్కల్ని తీసుకోవాలి.
3) ఒక కాగితం మీద పంజరం పటాన్ని, మరొక కాగితం మీద చిలక పటం గీయాలి.
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 5
4) రెండింటి మధ్య పుల్ల ఉంచాలి. వాటి కొనల్ని జిగురుతో అంటించాలి.
5) ఆరిన తర్వాత పుల్లని వేగంగా తిప్పాలి.
6) వేగంగా పుల్లను తిప్పినపుడు చిలుక పంజరములో ఉన్నట్లు మనకు భ్రమ కలుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

కృత్యం – 7

7. 1) ఒక ప్లాస్టిక్ లేక ఇనుప గరాటును తీసుకోవాలి.
2) ఒక రబ్బరు బెలూన్ ముక్కను సాగదీసి, గరాటు మూతికి కట్టాలి.
3) దాన్ని రబ్బరు బ్యాండ్తో గట్టిగా కట్టాలి.
4) 4-5 బియ్యపు గింజల్ని రబ్బరు ముక్కపై వేయాలి.
5) గరాటు మూతి వద్ద స్నేహితుడిని ‘ఓ’ అని అనమనండి.

పరిశీలనలు:

  1. గరాటు మూతి వద్ద ‘ఓ’ అని అన్నపుడు శబ్ద తరంగాలకు బెలూన్ ముక్కపై గల ధాన్యపు గింజలు కదులుతాయి.
  2. రబ్బరు ఓటుని కలిగి ఉన్న గరాటు మూతిని స్నేహితుని ఛాతిపై ఉంచినపుడు గుండెచప్పుడు ల ‘ మని వినిపిస్తుంది.

కృత్యం – 8

8. 1) మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టాలి.
2) నిమ్మకాయ, టీ, కాఫీ, బంగాళాదుంప, టొమాటో, చింతకాయ, పాలకూర, పెరుగు, వంకాయ పదార్థాలను గుర్తించమనాలి.
3) మనము ఎంపిక చేసిన పదార్థాలు పొడిగా ఉండకూడదు.
4) మీ స్నేహితుడు పదార్థాలను ముట్టుకోకూడదు. కేవలం వాసన మాత్రమే చూడాలి.
పై పదార్థాలను గుర్తించడానికి వాసన ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. జీవశాస్త్ర పరంగా వాసన అన్నది ముక్కులో ఉండే రసాయనాల సంఘటనతో ప్రారంభమవుతుంది.
  2. అక్కడ వాసనలు ప్రత్యేకమైన నాడీకణాలతో కూడిన గ్రాహక మాంసకృత్తులతో అంతరచర్య పొందుతాయి.
  3. ముక్కులోని నాడీకణాలు మాత్రమే బాహ్య ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి.
  4. ముక్కులోపలి గోడల్లో ఉండే కణాలు వాసన కలిగిన రసాయనాలకి సూక్ష్మ గ్రాహకతను కలిగి ఉంటాయి.
  5. వాసన కలిగించే రసాయనాలు సంక్లిష్టమైనవి. భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి.

కృత్యం- 9

9. 1) మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టండి. అతనికి అల్లం ముక్క, వెల్లుల్లి, చింతకాయ, అరటిపండు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి.
2) అతన్ని ఒక్కొక్కటి నాలుకకి ఒకసారి రాసుకొని రుచి చెప్పమనండి.
3) ప్రతి ఒక్కటి రుచి చూశాక నోటిని, నీటితో పుక్కిలించమనాలి.
4) స్నేహితులు అందరూ రుచిని చెప్పగలిగారు.
5) మీ స్నేహితుని ప్రతి పదార్థం నోట్లో పెట్టుకొని ఒక్కసారి కొరికి నాలుకతో చప్పరించమనాలి. ఇప్పుడు తేడా ఏ విధంగా ఉంది?
6) ఆహారం నోటిలోకి వెళ్ళగానే మనం దాన్ని కొరుకుతాం, నమలుతాం, సాలుకతో చప్పరిస్తాం.
7) ఇందువల్ల ఆహారం నుండి వెలువడే రసాయనాలు, మన రుచి కణికల్ని ప్రేరేపిస్తాయి.
8) దాంతో అవి ప్రేరణను మెదడుకి పంపి రుచిని తెలుసుకునేలా చేస్తాయి.
9) ఒకే విధమైన రుచికళికలు, వివిధ సంకేతాలు ఉత్పత్తి చేస్తూ వివిధ ఆహారపదార్థాల్లోని రసాయనాల్ని గుర్తించగలవు.

కృత్యం – 10

10. అద్దం ముందు నిలబడి, నాలుకను బయటకు తెచ్చి పరిశీలించండి. మీరు ఎన్ని రకాల నిర్మాణాల్ని మీ నాలుకపై చూడగలిగారో ఇచ్చిన పటంతో సరిచూడండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 3

  1. నాలుకపై పొలుసులవంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవి ఫిలి. ఫార్మ్ పాపిల్లే.
  2. గుండ్రంగా నాలుకపై కనిపించేవి ఫంగి ఫార్మ్ పాపిల్లే.
  3. నాలుక వెనుకవైపు గుండ్రంగా ఉండే పెద్ద పాపిల్లే సర్కం విల్లేట్ పాపిల్లే.
  4. నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలు ఫోలియేట్ పాపిల్లే.

కృత్యం – 11

11. 1) మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టాలి.
2) ముక్కుకి గుడ్డ కట్టాలి.
3) కొంచెం జీలకర్ర ఇచ్చి నమలమనాలి.
4) మీరు ఇచ్చిందేమిటో చెప్పమనాలి.
5) ఇలాగే చిన్న బంగాళాదుంప ముక్కతో కూడా ప్రయత్నించాలి.
6) నా స్నేహితుడు జీలకర్ర గింజలను, చిన్న బంగాళాదుంపను గుర్తించెను.

కృత్యం – 12

12. 1) మూడు పంటిపుల్లలు కట్టగా కట్టాలి.
2) వాటి సన్నని కొనలు మూడూ ఒకే తలంలో ఉండేలా చూడాలి.
3) మీ స్నేహితుని చేతిమీద వాటిని ఒకసారి అదిమి ఎలా ఉందో అడగాలి.
4) తర్వాత స్నేహితుని కళ్ళు మూసుకోమనాలి.
5) బొటనవేలు కొన నుండి క్రమంగా అరచేయి అంతా ‘వాటిని తేలికగా గుచ్చుతూ, గుచ్చినప్పుడల్లా ఎన్ని కొనలు గుచ్చుకున్నట్లుందో అడిగి నమోదు చేయాలి.
6) వచ్చిన అంకెను బట్టి అరచేతిలో ఏ భాగంలో స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉందో, ఏ భాగంలో తక్కువ ఉందో గుర్తించమనాలి.

పరిశీలనలు :

  1. అరచేతి మధ్యలో స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉన్నది.
  2. తక్కువ స్పర్శ జ్ఞానం అరచేయి అంచుల వద్ద ఉన్నది.
  3. అందరి అరచేతుల్లో స్పర్శ జ్ఞానం ఒకే విధంగా ఉంటుంది.
  4. బొటనవేలు కొన వద్ద ఎక్కువ స్పర్శ జ్ఞానం ఉండి, క్రింద భాగంలో తక్కువగా స్పర్శ జ్ఞానం ఉంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

కృత్యం – 13

13. సన్నగా చెక్కిన పెన్సిల్ కొనపై మీ బొటనవేలిని నెమ్మదిగా అదమండి. తరువాత మొద్దుగా ఉన్న కొనపై అదమండి. మీకెలా అనిపించింది?
పరిశీలనలు :

  1. సన్నగా చెక్కిన పెన్సిల్ కొనపై బొటనవేలిని అదిమినపుడు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది.
  2. మొద్దుగా ఉన్న కొనపై అదిమినపుడు ఆ విధంగా అనిపించదు.

Leave a Comment