AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

SCERT AP 8th Class Social Study Material Pdf 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం

8th Class Social Studies 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరి చేయండి. (AS1)
అ) గ్రామీణ ప్రాంతాలలో చాలా వాటిల్లో అర్హులైన డాక్టర్లు ఉన్నారు. (తప్పు)
ఆ) ప్రభుత్వ ఆసుపత్రులలో కంటే ప్రైవేటు ఆసుపత్రులలో ఎక్కువ సేవలు అందుబాటులో ఉన్నాయి. ( ఒప్పు)
ఇ) ఆరోగ్య స్థితిని మెరుగుపరచటంలో పోషకాహారం దోహదం చేస్తుంది. ( ఒప్పు)
ఈ)డబ్బులు సంపాదించటానికి కొంతమంది డాక్టర్లు అనవసరమైన చికిత్సలు చేయవచ్చు. (ఒప్పు)
జవాబు:
అ) గ్రామీణ ప్రాంతాలలో చాలావాటిల్లో నాటువైద్యులున్నారు.

ప్రశ్న 2.
జయమ్మ ఈ కింది వాటిని ఉపయోగిస్తుంది. వీటిల్లో ఏవి మౌలిక ప్రజా సదుపాయాల కిందకు వస్తాయి? (AS1)
అ) బడికి స్కూటరు వేసుకుని వెళుతుంది.
ఆ) అంగన్‌వాడీకి తన బిడ్డను పంపుతుంది.
ఇ) ఇంట్లో టివి ఉంది.
ఈ) ఆమెకు మొబైల్ ఫోన్ ఉంది.
ఉ) పోస్టాఫీసు ద్వారా ఉత్తరం పంపిస్తుంది.
జవాబు:
ఆ) అంగన్వాడీకి తన బిడ్డను పంపుతుంది.
ఉ) పోస్టాఫీసు ద్వారా ఉత్తరం పంపిస్తుంది.

ప్రశ్న 3.
ఈ పాఠంలో ప్రజా ఆరోగ్యంలో ప్రభుత్వ పాత్ర గురించి చర్చించే వాక్యాలను గుర్తించండి. (AS3)
జవాబు:
స్వయం అభ్యసనం : విద్యార్థి స్వయంగా గుర్తించాలి.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 4.
ఈ పాఠంలో కింద వాటిల్లో ఏవి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలుగా భావిస్తున్నారో, ఏవి అటువంటి చర్యలు కాదని భావిస్తున్నారో రాయండి. మీ సమాధానానికి కారణాలు రాయండి. (AS1)
అ) క్షయ రోగులకు ఉచితంగా మందులు ఇస్తారు.
ఆ) కొన్ని గ్రామాలలో రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు.
ఇ) జలుబు, జ్వరం, వంటినొప్పులు వంటి వాటికి దుకాణదారులు మందులు అమ్ముతున్నారు.
ఈ) చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం ఆహార ధాన్యాలను అందిస్తోంది.
జవాబు:
అ, ఆ, ఈ – లో ఉన్న చర్యలు ప్రభుత్వం ప్రజలకు అందచేసేవి. ఇవి ఉచిత సేవలు. కాబట్టి ఇవి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలుగా భావిస్తున్నాను.

దుకాణదారులు మందులు అమ్మటం అనేది వారి వ్యాపారానికి సంబంధించినది. కాబట్టి ఇది అటువంటి చర్యకాదు.

ప్రశ్న 5.
ప్రియంవద ఒక ప్రైవేటు ఆసుపత్రి నడుపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కంటే ఇక్కడ ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. మండల ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యనారాయణ డాక్టరుగా పనిచేస్తున్నాడు. వాళ్లిద్దరి మధ్య వైద్య సేవలు ప్రజలకు అందటంపై జరిగే చర్చను ఊహించి రాయండి. (AS4)
జవాబు:
ప్రియంవద : హలో డాక్టర్ ! ఎలా ఉన్నారు?

సత్యనారాయణ : హాయ్ డాక్టర్ ! బాగున్నాను. మీరెక్కడ పని చేస్తున్నారు?

ప్రియంవద : నేను పట్టణంలో సొంత హాస్పిటలను నడుపుతున్నాను. మరి మీరు?

సత్యనారాయణ : నేను ఇక్కడ ప్రభుత్వ మండలాసుపత్రిలో పనిచేస్తున్నాను.

ప్రియంవద : అయ్యో ! అదేంటి? మన వాళ్ళందరూ సిటీలో సూపర్ స్పెషాలిటీలు ఏర్పాటుచేసి పనిచేస్తుంటే మీరేంటిలా?

సత్యనారాయణ : నాకెందుకో అవన్నీ నచ్చవండీ ! ఇక్కడే బాగుంటుంది.

ప్రియంవద : ఇదేంటండీ బాబూ – అక్కడ ఒక హాస్పటల్ లో పనిచేస్తూ నాలుగైదు చోట్ల విజిటింగ్ డాక్టరుగా కూడా పనిచేసుకోవచ్చు. కోరినంత ఆదాయం ఉంటుంది. పైగా అన్ని వసతులూ ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు, అంబులెన్లు, ఒకటేమిటి అన్ని రకాల అధునాతనమైనవి అందుబాటులో ఉంటాయి.

సత్యనారాయణ : ప్రియంవద గారూ ! క్షమించండి. నాకు ఈ ఉద్యోగమే ఇష్టం. ఇక్కడ పల్లెటూర్లలో అమాయక ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక నాటు వైద్యుల్ని నమ్ముకుంటున్నారు. వైద్య విద్య చదివింది వైద్యం చేయడానికే కదా ! అది ఎక్కడైతే ఏమిటి? ప్రభుత్వం వారిచ్చే జీతం నాకు, నా కుటుంబానికి సరిపోతుంది. వీరికి వ్యాధి నయమైన తరువాత వారి ముఖాల్లో కనిపించే ఆనందమే నాకు పదివేలు. అయినా మా ఆసుపత్రిలో కూడా పడకలతో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయి.

ప్రియంవద : క్షమించండి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజంగా మా ద్వారా కంటే మీ ద్వారానే ప్రజలకు ఎక్కువ వైద్య సేవలు అందుతున్నాయి. నేను కూడా ఇక నుండి వారానికి రెండుసార్లు ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్యం చేస్తాను.

సత్యనారాయణ : మంచిది, మీకు శుభం కలుగు గాక !

ప్రశ్న 6.
మందులు మాత్రమే ఇవ్వటం వల్ల ఆరోగ్యం సమకూరదు. ఈ అధ్యాయంలో ఆరోగ్యానికి సంబంధించి ఇతర అంశాలు (ఉదా : శుభ్రమైన తాగునీరు వంటివి) పేర్కొన్నారు. వాటన్నిటిని ఒక చోటకు తెచ్చి వాటి గురించి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
మందులు మాత్రమే ఇవ్వటం వల్ల ఆరోగ్యం సమకూరదు. తగిన పోషకాహారాన్ని అందించాలి. త్రాగునీటి సౌకర్యాలను కలిగించాలి. కొన్ని వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి. బాధితులకు ముందు ప్రథమచికిత్స అందించాలి. సరైన గృహ వసతి, శుభ్రమైన పరిసరాలు ఉండేలా చూడాలి. రక్షిత మంచినీరును అందించాలి. వీటన్నింటినీ అందిస్తేనే ఆరోగ్యం సమకూరుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వైద్యంపై పెట్టే ఖర్చులను కింది చిత్రం వివరిస్తుంది. పేదరికంలో ఉన్నవారిలో 65 శాతం దాకా ప్రజలు అప్పు చేయవలసి వస్తోంది. చిత్రంలో దీనికి రంగు వేయబడిన భాగాన్ని గుర్తించి, శాతాన్ని కూడా గుర్తించండి. పేదరికానికి ఎగువన ఉన్నవారిలో ఆసుపత్రి ఖర్చులో 45 శాతం వరకు తమ పొదుపులోంచి భరిస్తున్నారు. దీనిని కూడా పటంలో గుర్తించండి. పేదరికానికి ఎగువన ఉన్న వారిలో 35 శాతం మంది మాత్రమే అప్పుచేయాల్సి వస్తోంది. దీనిని, ఆ శాతాన్ని పటంలో గుర్తించండి.
కింద చూపించిన పట్టికల ఆధారంగా ఆసుపత్రి ఖర్చులు ఏ విధంగా సమకూర్చుకుంటున్నారో, అందులో సుమారుగా ఎంత శాతం ప్రజలు ఉన్నారో చెప్పండి. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం 2
పై విధంగా వారు ఆసుపత్రి ఖర్చులు సమకూర్చుకుంటున్నారు.

ప్రశ్న 8.
మీ ప్రాంతంలో ప్రభుత్వ ఆరోగ్య పథకాలపై సర్వే చేసి లబ్ది పొందుతున్న వారి జాబితా తయారుచేయండి. (AS3)
జవాబు:

  1. ఆరోగ్యశ్రీ పథకం – తెల్లకార్డులున్నవారికి
  2. E.S.I – కార్మిక, ఉద్యోగులకు, వారి కుటుంబాలకు
  3. ప్రభుత్వోద్యోగులకు రీయింబర్స్మెంట్ పథకం

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 9.
అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి మీ ప్రాంత ఆరోగ్య కార్యకర్తను ఏయే ప్రశ్నలు అడుగుతావు?
(లేదా)
అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి మీ ప్రాంతంలో ఆరోగ్యకార్యకర్తను అడగదగిన రెండు ప్రశ్నలను తయారుచేయండి.
జవాబు:
అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవడానికి ఆరోగ్య కార్యకర్తను అడిగే ప్రశ్నలు :

  1. అంటువ్యాధులు ఏవి? అంటువ్యాధులు రాకుండా పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలి?
  2. అంటువ్యాధులు రాకుండా ఎటువంటి శుభ్రతను పాటించాలి?
  3. అంటువ్యాధులు సోకకుండా ఆహారపు అలవాట్లలో ఎటువంటి మెలకువలు పాటించాలి?
  4. అంటువ్యాధులకు కారకాలైన జీవులేవి ? వాటి బారిన పడకుండా ఏమి చేయాలి?

ప్రశ్న 10.
“108 సేవలు” అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తుంది? (AS6)
జవాబు:
‘108 సేవలు’ అత్యవసర పరిస్థితులలో అందిస్తున్న సేవలు :

  1. 108 సేవలు అత్యవసర పరిస్థితులలో విశిష్టమైన సేవలందజేస్తున్నారు.
  2. ప్రమాదాలు జరిగినపుడు, విషజంతువులు పొడవటం వంటివి జరిగినపుడు, ప్రసవ సమయంలో 108 సేవలు అందజేస్తారు.
  3. వీరి సేవలు పొందడానికి ఉచితంగా కాల్ చేయవచ్చు.
  4. ఫోను చేసిన కొద్ది నిముషాలకే సంఘటనా స్థలానికి చేరుకుంటారు.
  5. ప్రథమ చికిత్స, ఆక్సిజన్ వంటి సదుపాయాలు ఈ వాహనంలో అందుబాటులో ఉన్నందున డాక్టరు వద్దకు వెళ్ళేవరకు ఇవి ఉపకరిస్తాయి.
  6. రోగి లేదా క్షతగాత్రుడు కోరిన వైద్యశాలకు తీసుకొనిపోవుదురు.
  7. ఈ సేవలకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
  8. త్వరితంగా ఆసుపత్రికి చేరుకోవచ్చు.

8th Class Social Studies 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం InText Questions and Answers

8th Class Social Textbook Page No.101

ప్రశ్న 1.
మలేరియా నివారణకు ఏ చర్యలు తీసుకోవాలి?
జవాబు:

  1. మలేరియా నివారణకు ముందు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  2. దోమ తెరను వాడాలి.
  3. ‘ఓడోమాస్’ లాంటి క్రీములను ఒంటికి రాయాలి.
  4. ఇంటిముందు మురికి కాలువలు, నీటి గుంటలు ఏర్పడి, నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  5. వేప, తులసి వంటి సమిధలను సేకరించి రోజూ రాత్రిపూట వాటితో ఇంటిలో పొగ వేయాలి.
  6. వాటంలో నీరు నిలువ వుండకుండా జాగ్రత్తపడాలి.
    పై చర్యలతో మలేరియాను చాలావరకు నివారించవచ్చు.

ప్రశ్న 2.
అంగన్‌వాడీలలో పిల్లలకు ఆహారం ఎందుకు ఇస్తున్నారు? మీ ప్రాంతంలోని అంగన్ వాడీలలో వాళ్ళకి తగినంత ఆహారం దొరుకుతోందా?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ 5 సం||ల లోపు పిల్లల్లో వయస్సుకు తగ్గ బరువులేని వాళ్ళు 33 శాతం మంది. వీరు పోషకాహార లోపం వలన ఇబ్బంది పడుతున్నారు. అందువలన ప్రభుత్వం వీరికి పోషకాహారం అందించడం కోసం అంగన్‌వాడీ కేంద్రాలను ఎంచుకుంది. వాటి ద్వారా 5 సం||లోపు ఉన్న పిల్లలకు ఆహారం అందిస్తుంది.

మా ఊరిలో 2 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీరు పిల్లలకు కలగలిసిన పిండి, సోయాపిండి, సోయాచిప్స్ మొదలైన వాటిని తగిన మోతాదులో అందిస్తున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 3.
మీరు పాఠశాలలో త్రాగేనీరు నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా?
జవాబు:
మా పాఠశాల నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నది. మా పాఠశాల పక్కనే నీళ్ళ ట్యాంకు ఉన్నది. దాని నుంచి శుభ్రపరచబడిన నీరు మా పాఠశాల ట్యాంకుకు వస్తుంది. దాని నుండి పంపుల్లో వచ్చే నీరు మేము తాగుతాము. మా ట్యాంకును నెలరోజులకొకసారి శుభ్రం చేసి బ్లీచింగ్ వేస్తారు.

ప్రశ్న 4.
గ్రామీణ ప్రాంతాలలో డాక్టర్లు పనిచేయటానికి ఇష్టపడక పోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. గ్రామీణ ప్రాంతాలు బాగా వెనుకబడి ఉండటం.
  2. అధిక సౌకర్యాలు లేకపోవడం.
  3. డాక్టర్లు ఆశించినంత ఆర్థిక లబ్ది చేకూరకపోవటం.
  4. పూర్తి వైద్యానికి కావలసిన వసతులు లేకపోవటం.
  5. పట్టణాలలో అయితే వారికి ప్రైవేటు ప్రాక్టీసు పెట్టుకోవచ్చన్న ఆశ ఉండటం. మొదలైనవి దీనికి కారణాలు.

8th Class Social Textbook Page No.103

ప్రశ్న 5.
ప్రభుత్వ ఆసుపత్రిలో కిరణ్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ? ఆ ఆసుపత్రి ఇంకా మెరుగ్గా ఎలా పని చేయవచ్చు? చర్చించండి.
జవాబు:

  1. ప్రభుత్వ ఆసుపత్రిలో కిరణ్ ఓపిక లేకపోయినా 3 గంటలు లైనులో నుంచోవాల్సి వచ్చింది.
  2. రక్తపరీక్ష లైనులో మరలా 2 గం||లు నుంచోవాల్సి వచ్చింది.
  3. పరీక్ష నివేదిక కోసం రెండు రోజులు వెళ్ళి మరలా లైనులో వేచి వుండాల్సి వచ్చింది.
  4. జ్వరం తగ్గడానికి, బడికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టింది.

ఈ ఆసుపత్రి ఇంకా బాగా పనిచేయవచ్చు. అనారోగ్యంతో వచ్చిన వారికి ఇంకా మెరుగైన వసతులు కల్పించవచ్చు. వారికి కూర్చునే సౌకర్యాలు కల్పించవచ్చు. అలాగే చేయవలసిన పరీక్షలు చేసి అదేరోజు నివేదికలు ఇవ్వవచ్చు.

ప్రశ్న 6.
ప్రైవేటు ఆసుపత్రులలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాం? తరగతిలో చర్చించండి.
జవాబు:
ప్రైవేటు ఆసుపత్రులలో సమస్యలు :

  1. ఇక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి.
  2. మందులకు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి.
  3. కొన్నిచోట్ల పేషెంట్ల తాలూకు వారికి అనవసరమైన ఒత్తిడి కలిగిస్తారు.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 7.
మీకు జబ్బు చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళతారు? మీరు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ అనుభవం ఆధారంగా ఒక పేరా రాయండి.
జవాబు:
ఒకసారి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. మా నాన్నగారు రైల్వేలో పనిచేయడం మూలంగా, నన్ను రైల్వే ఆసుపత్రిలో చేర్పించారు. నన్ను దాదాపు 10 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. రకరకాల రక్తపరీక్షలు చేశారు. అంతా బాగానే వైద్యం చేశారు. కాని ఏ విషయం మాతో చెప్పేవాళ్ళు కాదు. పేషెంట్లందరూ వారిచ్చిన బట్టలే వేసుకోవాల్సి వచ్చేది. ఇది నాకు నచ్చేది కాదు. ఎందుకో నాకు ఆ వాతావరణం నచ్చేదికాదు.

ప్రశ్న 8.
సరిత అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ? కారణాలు ఇవ్వండి.
జవాబు:
సరిత తన విలువైన సమయాన్ని కోల్పోలేదు. ఆసుపత్రిలో ఎటువంటి ఇబ్బంది పడలేదు. తక్కువ సమయంలోనే తన వ్యాధి నయమై బడికి వెళ్ళింది. అందుకే సరిత అంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

8th Class Social Textbook Page No.104

ప్రశ్న 8.
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు నాటువైద్యుల దగ్గరకు, వాళ్ళకు సరైన వైద్యం రాదని తెలిసీ ఎందుకు వెళుతుంటారు? మీ చర్చలో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. శిక్షణ పొందిన డాక్టర్లు పల్లెల్లో లేరు. ప్రజలకు ఇంజెక్షన్లపై నమ్మకం ఉంది. నాటు వైద్యులకు డబ్బులు తర్వాత కూడా ఇవ్వవచ్చు. వాళ్ళకు ధాన్యం, కోడి వంటి వాటి రూపంలో చెల్లింపులు చెల్లించవచ్చు.
జవాబు:
నాటువైద్యులు పెద్ద పెద్ద వైద్యాలు సరిగా చేయలేకపోయినా చిన్న చిన్న జ్వరాలు, వాంతులు, విరేచనాలు, దగ్గు లాంటి వాటికి చక్కగా వైద్యం చేయగలరు. వీరు RMP ట్రయినింగ్ అయి ఉంటారు. లేదా అంతకు ముందు ఎవరైనా పెద్ద డాక్టర్ల దగ్గర పనిచేసిన కంపౌండర్లు అయివుంటారు. ప్రజలకు కూడా మాత్రల మీద కన్నా ఇంజక్షన్ల మీద నమ్మకం ఎక్కువ. . ‘సూదిమందు’ను ఎక్కువ ఆశిస్తారు. చాలామంది పల్లెటూర్ల నాటువైద్యులు వీటిమీద అధికవ్యాపారం చేస్తారు. ఈ నాటువైద్యులు డబ్బులు నెలకోసారి, లేదా. వారికి ఆదాయం లభించే రోజులలోనే తీసుకుంటారు. అప్పటిదాకా అప్పులు పెడతారు. అలాగే వారు. వారి సేవలకు వస్తువులను కూడా తీసుకుంటారు. ఏది ఎలా ఉన్నా పల్లెటూరు. ప్రజలకు ఈ నాటువైద్యులు దేవుడితో సమానం. పెద్ద పెద్ద అనారోగ్యాలపుడు వీరే పట్టణాలలో ఉన్న పెద్ద డాక్టర్లకు పరిచయం కూడా చేస్తారు.

ప్రశ్న 9.
ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్రింద ప్రతి గ్రామంలో ఏమేమి అందుబాటులో ఉండాలి?
జవాబు:
‘ఆశ’ కార్యకర్త, పోషకాహారం, టీకాలు వేసే సదుపాయం, బరువు తూచే యంత్రం మొదలైనవి అందుబాటులో ఉండాలి.

ప్రశ్న 10.
ప్రైవేటు ఆరోగ్య సేవలు అంటే అనేకం ఉండవచ్చు. మీ ప్రాంతంలో ఉన్న కొన్నింటిని ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
మాది హైద్రాబాద్ మహానగరం. ఇక్కడ అనేక రకాల ప్రైవేటు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అవి :
1) మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు :
ఇక్కడ అన్ని రకాల రోగాలకు వైద్యం చేయబడుతుంది.
ఉదా :
యశోద హాస్పిటల్, మొదట్లో ఇక్కడ హృద్రోగులకు మాత్రమే వైద్యం జరిగేది. కానీ ఇప్పుడు అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయి.

2) స్పెషల్ ఆసుపత్రులు :
ఇవి శరీరంలో ఏవో ఒక భాగానికి సంబంధించిన ఆసుపత్రులు,
ఉదా :
ఫెర్నాండెజ్ మెటర్నటి హాస్పిటల్, లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, యల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి మొ||వి.

3) ప్రైవేటు ఆసుపత్రులు :
ఇవి సాధారణంగా ఫ్యామిలీ ఆసుపత్రులయి ఉంటాయి. ఒకమాదిరి వైద్యాలకు కుటుంబీకులు ఇక్కడ వైద్యం చేయించుకుంటారు. ఈ డాక్టర్లు తక్కువ ఫీజుతో మంచి వైద్యం చేస్తారు.
ఉదా :
డా|| కిరణ్ M.B.B.S హాస్పిటల్.

4) మెడికల్ సెంటర్లు :
ఇవి R.M.P లచే నడుపబడుతుంటాయి. వీరు చిన్న చిన్న జ్వరాలు, విరేచనాలు, జలుబు, దగ్గు లాంటి వాటికి మాత్రమే వైద్యం చేస్తారు.
ఉదా :
స్టార్ మెడికల్ సెంటర్.

8th Class Social Textbook Page No.106

ప్రశ్న 11.
ఈ పాఠంలో వారు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలకు, ప్రజల ఆరోగ్యానికి మధ్య సంబంధాలను సూచించే వాక్యాల కింద గీతలు గీయండి. Page No. 106)
జవాబు:
స్వయం అభ్యసనం.
గమనిక : వీటికి సంబంధించిన వాక్యాల క్రింద విద్యార్థులు గీతలు గీయాలి.

8th Class Social Textbook Page No.108

ప్రశ్న 12.
మీ ఊరు లేదా పట్టణంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాల గురించి క్లుప్తంగా రాయండి. మీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?
జవాబు:
మా ఊరు కామారెడ్డి. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. ఇది ఒక పట్టణం. మా ఊర్లో ప్రభుత్వ ఆసుపత్రులు, మిషనరీ ఆసుపత్రి, అనేక ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. మిషనరీ ఆసుపత్రిలో కూడా ఒకప్పుడు చాలా బాగుండేదని, ఇప్పుడు కూడా పరవాలేదని, మా పెద్దలు అంటుంటారు. ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రం అన్ని సౌకర్యాలతో వైద్య సదుపాయాలు లభిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది వైద్యులు ఒక గ్రూపుగా కూడా ఏర్పడి వైద్యం చేస్తున్నారు. ఇక్కడ మేము అందరం కౌసల్య మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ను సందర్శించాము. ఈ, ఆసుపత్రి నాలుగు అంతస్తులు కల భవంతిలో ఉన్నది. హాస్పిటల్ నందు ఎక్స్ రే, రక్త పరీక్షలు చేయు సౌకర్యము కూడా కలదు. అత్యంతాధునిక ఆపరేషన్ థియేటర్ కలదు. డాక్టర్లుగారు ఎటువంటి సమయంలోనైనా రోగులకు అందుబాటులో ఉంటారని అందరూ చెప్పారు. ఆసుపత్రిలోని రూములు, ప్రాంగణం చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ఇక్కడ ఫీజు కూడా మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఎవరైనా ఆర్థికస్తోమత సరిలేని వారు వచ్చినప్పుడు వారికి ఉచితంగా కూడా వైద్యం చేస్తామని డాక్టరు గారు చెప్పారు. ఆస్పత్రిలోనే మెడికల్ షాపు ఉన్నది.

ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినవారు వారి విలువైన సమయాన్ని నష్టపోతున్నారు. అంతేకాక ఉద్యోగుల అలసత్వం, అత్యాశల వల్ల డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది.

ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ సొమ్ము ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కొంతమంది అయితే పూర్తిగా వైద్యంతో వ్యాపారమే చేస్తున్నారని చెప్పవచ్చును. మధ్యతరగతి వారికి, పేదవారికి ఈ వైద్యం అందని ద్రాక్ష అని చెప్పుకోవచ్చు.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 13.
మీ ప్రాంతంలో చిన్న పిల్లలకు టీకాలపై (రెండు సంవత్సరాలలోపు పిల్లలున్న కనీసం 5 కుటుంబాలలో) దిగువ ఇచ్చిన ప్రశ్నావళి ఆధారంగా ఒక చిన్న సర్వే చేపట్టండి.
అ) మీ పిల్లలకు టీకా కార్డు ఉందా?
ఆ) మీ పిల్లలకు ఎడమ చెయ్యిపై మచ్చ మిగిలే టీకా వేశారా? (వీలైతే మీరు స్వయంగా చూడండి.)
ఇ) నడుము కింద మీ పిల్లలకు టీకా వేశారా?
ఈ) మీ పిల్లలకు పోలియో చుక్కలు వేశారా? ఎన్ని సార్లు?
ఉ) తొమ్మిది నెలలప్పుడు మీ పిల్లలకు తొడ మీద టీకాతోపాటు ఒక చెంచా మందు ఇచ్చారా?
ఊ) మీ పిల్లలకు 18 నెలలప్పుడు (పిల్లలకు ఆ వయసు ఉంటే) ఏమైనా టీకా వేశారా? వాళ్లకి ఆ సమయంలో తాగటానికి కూడా ఏమైనా మందు ఇచ్చారా?

ప్రతి ప్రశ్నకు అవును/ కాదు (వర్తించే చోట) అని నింపి ఎన్ని దోసులో రాయండి. తెలియదు / వర్తించదు వంటి సమాధానాలతో నింపండి (ఉదాహరణకు ‘ఊ’ అన్న ప్రశ్నకు బిడ్డ వయసు ఒక సంవత్సరం అయితే సమాధానం వర్తించదు అవుతుంది). మీ ఫలితాలను చర్చించండి.
జవాబు:
శ్రీ సాయి – కనకదుర్గ గార్ల కుటుంబం : పాప పేరు – దీప, వయసు 2 సం||లు
అ – ఉంది ఆ – అవును ఇ – తొడమీద ఈ – 4 సార్లు ఉ – అవును – అవును ఊ – అవును

శ్రీ కృష్ణారావు – దుర్గాంబ గార్ల కుటుంబం : బాబు పేరు – బాబ్ది, వయసు 1 సం||
అ – ఉంది. ఆ – అవును ఇ – నడుము క్రింద ఈ – 4 సార్లు ఉ – అవును – అవును ఊ – వర్తించదు

శ్రీ మాధవరావు – రాజ్యలక్ష్మి గార్ల కుటుంబం : బాబు పేరు – బాబి, వయసు 6 నెలలు.
అ – ఉంది ఆ – అవును ఇ – నడుము క్రింద ఈ – 3 సార్లు ఉ – వర్తించదు ఊ – వర్తించదు

శ్రీ రాంబాబు – సుబ్బలక్ష్మి గార్ల కుటుంబం : పాప పేరు – సీత, వయసు 11 నెలలు.
అ – ఉంది. ఆ – అవును ఇ – నడుము క్రింద ఈ – 2 సార్లు ఉ – అవును ఊ – వర్తించదు

శ్రీ హనుమంతరావు – కామేశ్వరి గార్ల కుటుంబం : బాబు పేరు – వెంకట రమణ, వయసు 2 1/2 సం||లు
అ – ఉంది. ఆ – అవును ఇ – నడుము క్రింద ఈ – 5 సార్లు ఉ – అవును – అవును ఊ – అవును

ఈ వివరాలన్నీ పరిశీలించిన తరువాత ఈ కాలంలో తల్లిదండ్రులు బిడ్డ ఆరోగ్యాన్ని చాలా శ్రద్ధగా చూస్తున్నారని తెలుస్తోంది.

ప్రశ్న 14.
ప్రజా, ప్రైవేటు వైద్య సేవలలో అనేకం పట్టణాలలో ఉన్నాయి. 2003లో ఎంపిక చేసిన ప్రాంతాలలో చేపట్టిన నమూనా సర్వే ఆధారంగా అర్హులైన ప్రైవేటు డాక్టర్లలో ఎక్కువమంది (79 శాతం) పట్టణాలలో ఉంటున్నారని వెల్లడయ్యింది. కొంతమంది దాక్టర్లను గ్రామీణ ప్రాంతాల్లో నియమించినప్పటికీ ఉద్యోగాలకు సరిగా వెళ్లకపోవడం వల్ల వాళ్ల అందుబాటు నామమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితికి కారణాలను చర్చించండి. ఈ సమస్య గురించి మీ ప్రాంతంలో పెద్దవాళ్లతో మాట్లాడండి, దీనిని ఎలా పరిష్కరించవచ్చో చర్చించండి. Page No. 108)
జవాబు:
కారణాలు:

  1. వైద్య విద్య చాలా ఖర్చుతో కూడుకున్న విద్య.
  2. ఇంత ఖర్చు పెట్టి అభ్యసించిన వారు దానిని తిరిగి రాబట్టుకోవాలని చూస్తారు.
  3. దేశంలో నగరీకరణం ఎక్కువయింది. పల్లెల్లో జనాభా తగ్గారు.
  4. పట్టణంలో వైద్యానికి కావలసిన వసతులన్నీ వీరికి తక్కువ ధరకు లభిస్తాయి. ఉదా : రక్తనిధి నుండి ఒక లీటరు రక్తం సిటీలోని ఆసుపత్రికి తరలించడం తేలిక, అదే పల్లెటూరుకు పంపాలంటే అది చాలా కష్టమవుతుంది.
  5. రవాణా సౌకర్యాలు, గృహవసతి, తాగునీటి సౌకర్యాలు చాలా వరకు పల్లెల్లో నామమాత్రంగానే ఉంటాయి. ఈ కారణాల వలన ఈ పరిస్థితి వచ్చింది.

పరిష్కారాలు :

  1. వైద్య విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక స్పృహను కలిగించాలి.
  2. గ్రామాలలో నివసించే, గ్రామీణులు దేశానికి వెన్నెముక లాంటివారు అని చెప్పాలి.
  3. వారికి అవసరమైన, తగిన వసతులు కల్పించాలి.
  4. ఆర్థిక రూపేణా వారికి మంచి అవకాశాలు ఇవ్వాలి.

8th Class Social Textbook Page No.109

ప్రశ్న 15.
గర్భధారణలో సమస్యల వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో లక్షమంది మహిళలు చనిపోతున్నారు. తల్లి ఆరోగ్యం, పోషకాహారస్థాయి సరిగా ఉండకపోవటం, కాన్పు సమయంలో సరైన సేవలు అందించకపోవటం వల్ల శిశు మరణాలు – అధికంగా సంభవిస్తున్నాయి. పై పరిస్థితిలో 104, 108 సేవలు ఏమైనా మార్పులు తెచ్చాయా? చర్చించండి.
జవాబు:
104, 108 సేవలు మంచి మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. ప్రైవేటుగా అంబులెన్స్ ను అద్దెకు తీసుకోవాలంటే ఖర్చుతో కూడిన పని. అదే 108 అయితే అతి తక్కువ సమయంలో రోగి దగ్గరకు వచ్చి, వారికి కావలసిన అత్యవసర వైద్య సేవను (ఆక్సిజన్ లాంటివి) అందిస్తూనే ఆసుపత్రికి చేరుస్తుంది.

104 సేవలు పల్లెప్రాంతాల్లో ప్రజలను వైద్యం పట్ల చైతన్యం కలిగిస్తూ, రోగులకు వైద్యం కూడా అందిస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 16.
తెల్లకార్డు ఉన్న కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకంగా ఆరోగ్యశ్రీని మొదలుపెట్టారు. ఆసుపత్రిలో చేరాల్సిన వైద్యానికి అయ్యే ఖర్చులను దీని కింద చెల్లిస్తారు. ఈ పథకం కింద అనేక రకాల రోగాలకు వైద్యం చేయించుకోవచ్చు. చాలా ప్రైవేటు ఆసుపత్రులలో కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. మీ చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడి ఈ పథకం ఎంత బాగా పనిచేస్తోందో రాయండి.
జవాబు:
‘ఆరోగ్యశ్రీ’ అన్న పథకం నిజంగా పేదలకు చాలా ఉపయోగకరమైనది. మా నాన్నగారికి ఆరోగ్యం బాగోక ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించినపుడు, ఎంతోమంది ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్యం చేయించుకోవడం చూశాను. అంతేకాక వారికి తరువాతి కాలంలో మందులు ఉచితంగా ఇవ్వడం గమనించాను, అయితే ఇందులో ఇపుడు చాలా వ్యాధులకు వైద్యాన్ని మినహాయించేశారు. అందువలన ఇది ,అన్నివేళలా అందుబాటులో ఉండటం లేదని తెలిసింది.

ప్రశ్న 17.
మీ బడిలో పెట్టే మధ్యాహ్న భోజనంలో చెయ్యదగిన ముఖ్యమైన మార్పు ఏమిటి?
జవాబు:
మధ్యాహ్న భోజన పథకంలోని భోజనంలో ముందు ‘బియ్యం’ రకంను మార్చి మంచి బియ్యం ఇవ్వాలి. అవి నీరు ఎక్కువైతే సుద్దలాగానూ, తక్కువపోస్తే పలుకుగాను ఉంటాయి. సమానంగా పోస్తే అడుగంటిపోతుంది. కాబట్టి మంచి , బియ్యం ఇవ్వాలి.

ప్రశ్న 18.
“మౌలిక ప్రజా సౌకర్యాలు” శీర్షిక కింద గల మొదటి పేరా చదివి కింది ప్రశ్నకు జవాబు రాయండి.

జీవనానికి, మంచి ఆరోగ్యానికి నీళ్లు తప్పనిసరి. మన రోజువారీ అవసరాలకు నీళ్లు కావాలి. రక్షిత మంచినీటి ద్వారా అనేక రోగాలను నివారించవచ్చు. నీళ్ల వల్ల వ్యాపించే విరేచనాలు, కలరా వంటి రోగాలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో ప్రతిరోజూ నీటి సంబంధిత వ్యాధుల కారణంగా 1600 మంది చనిపోతే, అందులో చాలామంది 5 సంవత్సరాల లోపు పిల్లలే. ప్రజలకు రక్షిత మంచినీరు అందుబాటులో ఉంటే ఇలాంటి మరణాలు నివారించవచ్చు. మీ ప్రాంతంలో ఏదైనా రక్షిత మంచినీటి సదుపాయం ఉందా? వివరించండి. మా ఊరు ఖానాపూర్’ మండలంలో ఉన్న హుస్నాబాద్ గ్రామం. ఇక్కడ రెండు చెరువులున్నాయి. ఒక చెరువులో ఉన్న నీరును శుద్ధిచేసి ట్యాంకుకు ఎక్కిస్తారు. అక్కడి నుండి ఊరందరికీ మంచినీరు సరఫరా అవుతుంది. ఇలా చేయడం మూలంగా మేమందరం నీటి వలన వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడబడుతున్నాం. ఈ సరఫరా మొత్తంను మా పంచాయితీ వారే చూసుకుంటారు.

ప్రశ్న 19.
క్రింది పేరాను చదివి, ఒక ప్రశ్నను తయారుచేయుము.

ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి నివేదిక 2007 ఆధారంగా మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. “ఆకలి, పోషకాహారలోపం నుంచి స్వేచ్ఛ అన్నది ప్రాథమిక హక్కులలో ఒకటి. మానవజాతి పురోభివృద్ధికి ఇది ఎంతో అవసరం. మెరుగైన పోషకాహారం ఉంటే రోగనిరోధకశక్తి బాగా ఉంటుంది, రోగాలు తక్కువగా ఉండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో అయిదేళ్లలోపు పిల్లల్లో అంటువ్యాధుల కారణంగా మరణాలలో రెండింట ప్రతి ఒకదానికి (53 శాతానికి) పోషకాహారలోపమే కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అయిదు సంవత్సరాల లోపు పిల్లల్లో వయస్సుకు తగ్గ బరువులేని వాళ్లు 33 శాతం ఉన్నారు….. 31 శాతం మహిళలు, 25 శాతం పురుషులు పోషకాహారలోపానికి గురవుతున్నారు,” అని ఈ నివేదిక పేర్కొంటోంది.
ప్ర. మానవజాతి పురోభివృద్ధికి ఏది అవసరం?

ప్రశ్న 20.
ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా కూడా ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? దీనిపై మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
ప్రభుత్వ ఆసుపత్రులు ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీచేసి ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయిస్తోంది. దీన్ని ప్రజలు కూడా ఆదర్శంగా తీసుకుని ఉండవచ్చు.

ప్రశ్న 21.
మలేరియా నివారణకు తీసుకోవలసిన రెండు చర్యలు రాయండి.
జవాబు:

  1. మలేరియా నివారణకు ముందు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  2. దోమ తెరను వాడాలి.
  3. ‘ఓడోమాస్’ లాంటి క్రిములను ఒంటికి రాయాలి.

AP Board 8th Class Social Solutions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 22.
మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల జాబితా రాయండి. (వీటిల్లో ఏదో ఒకదానికి వెళ్లి) మీ అనుభవంలో అక్కడ లభ్యమయ్యే సదుపాయాలు, దానిని నిర్వహించే వాళ్ల గురించి రాయండి.
జవాబు:
మాకు దగ్గరలో ఇందుపల్లిలో ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉన్నది. ఇంకొంచెం దూరంలో ఉంగుటూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. మా ఊరిలో ఒక RMP నడిపే ఆసుపత్రి ఉన్నది.

Leave a Comment