SCERT AP 8th Class Social Study Material Pdf 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం
8th Class Social Studies 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి : (AS1)
1. తమ పాలనలో ఉన్న దేశాల మధ్య పోటీలు నిర్వహించటానికి క్రికెట్ ను వలస పాలకులు ప్రోత్సహించారు.
2. పాశ్చాత్యీకరణ చెందటానికి ప్రజలు ఈ ఆటను నేర్చుకోసాగారు.
3. భారతీయ గ్రామస్తులు క్రికెట్ ఆడేవాళ్లు.
4. మంచి నడవడిక అలవాటు చేయటానికి ఈ ఆటను పాఠశాలల్లో ప్రవేశపెట్టారు.
జవాబు:
2. ఈ ఆటను అభిమానించి ప్రజలు నేర్చుకోసాగారు.
3. ఇంగ్లాండు గ్రామస్థులు క్రికెట్టు ఆడేవాళ్లు.
ప్రశ్న 2.
క్రికెట్టు, ఇతర ఆటలపై గాంధీజీ దృక్పథం గురించి కొన్ని వాక్యాలు రాయండి. (AS1)
జవాబు:
శరీరం, మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని మహాత్మాగాంధి నమ్మాడు. అయితే క్రికెట్, హాకీ వంటి ఆటలు బ్రిటిషు వాళ్ల ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకోబడి సంప్రదాయ ఆటలను కనుమరుగు చేస్తున్నాయని అతడు తరచు విమర్శించేవాడు. ఇది వలస పాలిత మనస్తత్వాన్ని చూపిస్తోంది. చేనులో పనిచేయడం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే ఈ ఆటల వల్ల విద్యాప్రయోజనం చాలా తక్కువ.
ప్రశ్న 3.
కింది వాటిని కుషంగా వివరించండి. (AS2)
• భారతదేశంలో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయటంలో పార్శీలు మొదటివాళ్లు.
• ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి దుబాయికి మారటంలోని ప్రాముఖ్యత.
జవాబు:
భారతీయ క్రికెట్ అంటే భారతీయులు ఆడిన క్రికెట్టు బొంబాయిలో పుట్టింది. ఈ ఆటను మొదట చేపట్టిన వాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్న పార్శీలు. తమ వ్యాపారాల వల్ల బ్రిటిషువాళ్లతో మొదట పరిచయం అయింది పార్శీ సమాజానికి, మొదట పాశ్చాత్యీకరణ చెందింది వీళ్లే. భారతదేశ మొదటి క్రికెట్టు క్లబ్బును వీళ్లు 1848లో బొంబాయిలో స్థాపించారు, దాని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్. పార్శీ వ్యాపారస్తులైన టాటాలు, వాడియాలు పార్శీ క్రికెట్ క్లబ్బులకు నిధులు సమకూర్చారు, వాటికి ప్రాయోజకులుగా ఉన్నారు. అయితే భారతదేశంలోని శ్వేతజాతీయ కులీనులు ఈ ఆటలో ఆసక్తి కనబరుస్తున్న పార్శీలకు ఏ విధంగానూ సహాయపడలేదు. వాస్తవానికి తెల్లజాతివాళ్లకే పరిమితమైన బాంబే – జింఖానాలో పార్కింగ్ ప్రదేశం వినియోగించుకోవటంలో పార్శీ క్రికెటర్లతో తెల్లజాతి వాళ్లు గొడవపడ్డారు.
వలస పాలకులు శ్వేత జాతీయుల పట్ల పక్షపాతం వహిస్తారని నిర్ధారణ కావటంతో క్రికెట్టు ఆడటానికి పార్శీలు తమ సొంత జింఖానా ఏర్పాటు చేసుకున్నారు. పార్శీలకు, జాతి వివక్షత ప్రదర్శించిన బాంబే జింఖానాకు మధ్య వైరుధ్యంలో భారతీయ తొలి క్రికెట్టు ఆటగాళ్లకు తీయని విజయం లభించింది. 1885లో భారత జాతీయ కాంగ్రెసు ఏర్పడిన నాలుగు సంవత్సరాలకు అంటే 1889లో క్రికెట్టులో బాంబే జింఖానాని ఒక పార్శీ బృందం ఓడించింది.
సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్‌కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.
ప్రశ్న 4.
ఏదైనా ఒక స్థానిక ఆట చరిత్ర తెలుసుకోండి. మీ తల్లిదండ్రులను, తాతా, అవ్వలను వాళ్ల బాల్యంలో ఈ ఆటను ఎలా ఆడేవాల్లో అడగండి. ఇప్పుడు కూడా ఆ ఆటను అలాగే ఆడుతున్నారా? మార్పులకు కారణమైన చారిత్రక శక్తులు ఏమై ఉంటాయో ఆలోచించండి. (AS3)
జవాబు:
‘కబడ్డీ’ అంటే ‘కూత’ అని అర్థం. ఇది కౌరవులు, పాండవుల కాలం నాటి నుండి మన దేశంలో ఉన్నది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘చిక్ చిక్’ అని, కొన్ని ప్రాంతాల్లో ‘చెడుగుడు’ అని అంటారు. మా ప్రాంతంలో దీనిని ‘కబడ్డీ – కబడ్డీ! అంటారు. ఇది రెండు జట్ల మధ్య జరిగే పోటీ. జట్టుకు 12 మంది సభ్యులుంటారు. కాని జట్టుకు 7 మంది మాత్రమే ఆటలో పాల్గొంటారు.
ఈ ఆటలో కొన్ని నియమాలు :
- నిర్ణీత కాలవ్యవధిలో ఆడే ఆట.
15 నిమిషాలు – 5 నిమిషాలు విశ్రాంతి – 15 నిమిషాలు. - ‘అవుట్’ అయిన వాళ్లు బరి నుండి బయటకు వెళ్ళాలి.
- ‘పాయింట్’ వచ్చినపుడు లోపలికి రావాలి.
- ‘7 గురు’ అవుట్ అయితే ‘లోనా’ అంటారు.
- ‘లోనా’కి అదనంగా 2 పాయింట్లు వస్తాయి.
దీని యొక్క నియమాలు ‘కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ వారు రూపొందిస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఈ సంస్థ ఉన్నది.
ఈ ఆట అనేక మార్పులకు, చేర్పులకు లోనయింది. ఇటీవలి కాలంలో ‘బోనస్ లైన్ పాయింట్’ ను ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే 6 లేదా 7 గురు క్రీడాకారులు బరిలో ఉండగా వారి బోనస్ లైన్ ను తాకి వచ్చిన వారికి ఒక పాయింట్ అదనంగా వస్తుంది. అయితే ఆటలో కూత మాత్రం ఆపరాదు.
ప్రశ్న 5.
సాంకేతిక విజ్ఞానంలో, ప్రత్యేకించి టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ఏ రకంగా ప్రభావితం చేసాయి? (AS4)
జవాబు:
రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీప కాంతులలో క్రికెట్టు వంటివి పాకర్ అనంతర ఆటలో ప్రామాణికంగా మారాయి. అన్నిటికీమించి క్రికెట్టును సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా పాకర్ దానికి గుర్తింపు తెచ్చాడు. టెలివిజన్ కంపెనీలకు ప్రసార హక్కులు అమ్ముకోవటం ద్వారా క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి. టీ.వీకి అతుక్కుపోయిన క్రికెట్టు అభిమానులకు వాణిజ్య ప్రకటనలు జారీ చేయటానికి వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేయసాగాయి. టెలివిజన్లో నిరంతర ప్రసారాల వల్ల క్రికెట్టు ఆటగాళ్లు హీరోలైపోయారు. క్రికెట్టు బోర్డు వీళ్లకి చెల్లించే మొత్తం గణనీయంగా పెరిగింది. అంతేకాదు టైర్ల నుంచి శీతల పానీయాల వరకు వివిధ వస్తువులకు వాణిజ్య ప్రకటనలలో పాల్గొనటం ద్వారా క్రికెట్టు ఆటగాళ్లు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించసాగారు. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్ ఆటను మార్చివేశాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలో సైతం ప్రసారం చేయటం ద్వారా క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్రికెట్ ఆడే వాళ్ల సామాజిక నేపథ్యాన్ని కూడా విస్తరింపచేసింది. పెద్ద పట్టణాల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచు చూసే అవకాశం లేని పిల్లలు ఇప్పుడు తమ అభిమాన క్రీడాకారులను అనుకరించి, ఆట నేర్చుకోగలిగారు. ఉపగ్రహ టెలివిజన్ సాంకేతిక విజ్ఞానం వల్ల, బహుళజాతి టెలివిజన్ కంపెనీల వల్ల, క్రికెట్ కి అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.
ఈ రకంగా టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ప్రభావితం చేసాయి.
ప్రశ్న 6.
క్రికెట్టు వాణిజ్య క్రీడగా మారటం వల్ల సంభవించిన పరిణామాలపై ఒక కరపత్రం తయారు చేయండి. (AS6)
జవాబు:
కరపత్రం
సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్టు ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్ కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.
పాత ఆంగ్ల-ఆస్ట్రేలియా, అక్షం నుంచి క్రికెట్టు కేంద్రం మారిందనటానికి మరొక ముఖ్య సంకేతంగా చెప్పవచ్చు: క్రికెట్ పద్ధతుల్లో వినూత్న ప్రయోగాలు ఉపఖండ దేశాలైన భారత, పాకిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్లు దేశాల నుంచి వచ్చాయి. బౌలింగ్ లో రెండు గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది : ‘దూస్‌రా’, ‘రివర్స్ స్వింగ్’. ఈ రెండు నైపుణ్యాలు కూడా ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి. బరువైన ఆధునిక బ్యాటులతో దుందుడుకు ఆటగాళ్ళు ‘ఫింగర్ స్పిన్’కి చరమగీతం పాడుతున్న పరిస్థితుల్లో ‘దూరా’ ముందుకొచ్చింది. నిర్మలమైన ఆకాశం కింధ, వికెట్టుపడని దుమ్ము పరిస్థితులలో బంతిని కదిలించటానికి ‘రివర్స్ స్వింగ్’ వచ్చింది. మొదట్లో ఈ రెండు పద్ధతులను బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుమానంతో చూశాయి. క్రికెట్టు నియమాలను అక్రమంగా మారుస్తున్నారని ఇవి ఆరోపించాయి. బ్రిటిషు, ఆస్ట్రేలియాలోని ఆట పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే క్రికెట్లు నియమాలను రూపొందించటం సాధ్యం కాదని కాలక్రమంలో రుజువయ్యింది, ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు అందరూ ఉపయోగించే పద్ధతిగా ఇవి మారాయి.
నూటయాభై సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటి క్రికెట్టు ఆటగాళ్లిన పార్టీలు ఆడటానికి ఖాళీ ప్రదేశం కోసం పోరాడవలసి వచ్చింది. ఈనాడు ప్రపంచమార్కెటు ఫలితంగా భారతీయ ఆటగాళ్లకు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తున్నారు, అత్యధిక ప్రజాదరణ కూడా వీళ్లకే ఉంది. ప్రపంచమంతా వీళ్లకి వేదికగా మారింది. ఎన్నో చిన్న చిన్న మార్పుల కారణంగా ఈ చారిత్రక మార్పులు సంభవించాయి. సరదా కోసం ఆడే పెద్దమనుషుల స్థానాన్ని, వృత్తిగా డబ్బు కోసం ఆడే క్రీడాకారులు తీసుకున్నారు. ప్రజాదరణలో టెస్టు మ్యాచ్ స్థానాన్ని ఒక రోజు మ్యాచు ఆక్రమించాయి. సాంకేతిక విజ్ఞానంలో, ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మారుతున్న కాలంతో మారటమే వ్యాపార చరిత్ర అవుతుంది.
ప్రశ్న 7.
ప్రపంచ పటంలో క్రికెట్ ఆడే ఐదు దేశాలను గుర్తించండి. (AS5)
జవాబు:
8th Class Social Studies 23rd Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers
8th Class Social Textbook Page No.246
ప్రశ్న 1.
మీకు ఆటలు ఆడటం అంటే ఇష్టమా?
జవాబు:
అవును
– ఏ ఆటలు ఆడతారు?
జవాబు:
ఖో ఖో, వాలీబాల్, బాడ్మింటన్
– ఏ ఆట అంటే మీకు ఎక్కువ ఇష్టం?
జవాబు:
బాడ్మింటన్
– కేవలం ఆడపిల్లలు లేదా కేవలం మగపిల్లలు ఆడే ఆటలు పేర్కొనండి.
జవాబు:
కేవలం ఆడపిల్లలు ఆడే ఆట : తొక్కుడు బిళ్ళ
కేవలం మగపిల్లలు ఆడే ఆట : గోళీలు.
– కొన్ని ఆటలను కేవలం పల్లెల్లోనే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : చెడుగుడు
– కొన్ని ఆటలను కేవలం బాగా డబ్బు ఉన్న వాళ్లే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : గోల్ఫ్
ప్రశ్న 2.
మీరు ఎందుకు ఆడతారు?
కింద ఇచ్చిన కారణంతో మీరు అంగీకరిస్తే (✓) టిక్కు పెట్టండి. అంగీకరించకపోతే (✗) గుర్తు పెట్టండి. మీకు అదనంగా తోచిన కారణాలను జాబితాకు చేర్చండి.
ఆటలు ఆడటం తేలిక. | ✓ |
ఆటలు ఆడటం సరదాగా ఉంటుంది. | ✓ |
తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు మెచ్చుకుంటారు. | ✓ |
ఆటలు సవాళ్లను విసురుతాయి. | ✓ |
ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. | ✓ |
సచిన్, సానియా వంటి అభిమాన క్రీడాకారులను అనుకరించే అవకాశం. | ✓ |
చదువుల కంటే ఆటలు తేలిక. | ✗ |
టెలివిజన్లో కనపడతాం. | ✗ |
ఆటలలో రాత పరీక్షలు, ఇతర పరీక్షలు ఉండవు. | ✗ |
అంతర్జాతీయ పోటీలలో పతకాలు పొందవచ్చు. | ✓ |
దేశానికి ఖ్యాతి తీసుకురావటానికి | ✓ |
పేరు, డబ్బు, ఖ్యాతి గడించటానికి | ✓ |
ప్రశ్న 3.
తరగతిలోని విద్యార్థులందరి అభిప్రాయలను క్రోడీకరించి ఏ కారణాన్ని వారు ముఖ్యమైనదిగా భావిస్తున్నారో తెలుసుకోండి.
జవాబు:
మా తరగతిలో అందరూ ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రశ్న 4.
వెండీస్ అన్న పేరు గల ఒక దేశం ఏదీ లేదన్న విషయం గుర్తించారా? బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ఏ. దీవులలో ఏ దీవి నుంచి వచ్చాడో గుర్తించండి.
జవాబు:
వెస్టండీస్ అనేవి కరేబియన్ దీవులు. ఇవి ఈ పేరు మీద 1958 నుండి 1962 వరకు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కొన్ని సార్వభౌమ దీవులుగాను, కొన్ని సెయింట్ కిట్స్, నివీలో భాగాలుగానూ, యు.కే. మీద ఆధారపడి కొన్ని, – డచ్ ఆధారితాలుగా కొన్ని, యు.యస్. మీద ఆధారపడి ఒకటి ఉన్నాయి. కాబట్టి ఈ పేరుమీద ఏ దేశం లేదు.
ఈ దీవులలో బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ‘ఉసియన్ బోల్ట్’ జమైకా దీవుల నుండి వచ్చాడు.
8th Class Social Textbook Page No.249
ప్రశ్న 5.
క్రికెట్టుకీ, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించటానికీ మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
క్రికెట్టు ఇంగ్లాండులో పుట్టింది, పెరిగింది. ఇది ఇంగ్లాండు వలస దేశాలలో రాణించింది. మార్పులు, చేర్పులు అన్నీ వీరి స్థాయిలోనే జరుగుతాయి. కాబట్టి క్రికెట్టుని ప్రోత్సహించడం అంటే పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడమే. ఇదే వాటి మధ్యనున్న సంబంధం.
ప్రశ్న 6.
ఇక్కడ ఆటలు ఆడటానికి వివిధ క్రీడా పరికరాలు ఉన్నాయి. మీకు స్థానికంగా దొరికే వాటితో పోలిస్తే వీటి నాణ్యత తేడాగా ఉందని మీరు గమనించి ఉంటారు. డబ్బుకోసం వృత్తి క్రీడాకారులు ఉపయోగించే ఈ పరికరాలను సరదా కోసం ఆదుకునే పిల్లలు కొనగలుగుతారా?
జవాబు:
ఇవి చాలా ఖరీదైన ఆట వస్తువులు. వీటిని మామూలు స్థాయివారు కొనలేరు. సరదా కోసం ఆడేవారు అసలే కొనలేరు. వృత్తి క్రీడాకారులు డబ్బు సంపాదిస్తారు, అదీగాక వీరిని పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. కాబట్టి కొనగలుగుతారు.
8th Class Social Textbook Page No.250
ప్రశ్న 7.
టెస్టు క్రికెట్టు ప్రాముఖ్యత అంతరించటం వల్ల సంభవించిన మార్పుల జాబితా తయారు చేయండి.
జవాబు:
- 1970వ దశకంలో క్రికెట్ మారుతున్న ప్రపంచానికి అనువుగా మారటం మొదలెట్టింది.
- టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత తగ్గి ఒకరోజు అంతర్జాతీయ పోటీ మొదలయ్యింది. ఇది జనాదరణ పొందింది.
- రెండు సంవత్సరాలు పాకర్ ‘సర్కస్’ అద్భుతంగా నిర్వహించబడింది.
- రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీపకాంతులలో క్రికెట్టు మొదలగునవి ప్రామాణికంగా మారాయి.
- క్రికెట్టు సొమ్ము చేసుకోగల ఆటగా మారింది.
- క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి.
- వాణిజ్య ప్రకటనలకు వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేసాయి.
- క్రికెట్ ఆటగాళ్ళు హీరోలైపోయారు. వీరు అనేక మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు.
- టెలివిజన్ ప్రసారాలు క్రికెట్టు ఆటను మార్చేశాయి. పల్లెల్లో సైతం ప్రేక్షకులు పెరిగారు.
- పట్టణాల్లో పిల్లలు తమ అభిమాన ఆటగాళ్ళ .ఆటను అనుకరించి, ఆట నేర్చుకుంటున్నారు.
- క్రికెట్టుకు అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.
8th Class Social Textbook Page No.251
ప్రశ్న 8.
క్రికెట్టు గురించి కొంచెం సేపు ఆలోచించిన తరవాత వినాయక్ ఇంగ్లీషులోనే ఉన్న పదాలను కొన్నింటిని రాశాడు – ‘బౌండరీ’, ‘ఓవరు’, ‘వికెట్’. వీటికి తెలుగు పదాలు ఎందుకు లేవో అతడికి వివరించండి.
జవాబు:
క్రికెట్ అచ్చంగా ఇంగ్లీషు దేశంలో పుట్టింది. కాబట్టి దానికి సంబంధించిన పదాలన్నీ ఆ భాషలోనే ఉన్నాయి. వాటికి తెలుగు అనువాదాలు చేయటం కుదరదు. అందువలన అవి తెలుగులో లేవు.
ఉదా :
‘కబడ్డీ’ని అన్ని భాషలలో మనం కబడ్డీ అనే అంటాము. అనువాదం చేయలేము.
ప్రశ్న 9.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు కవ్వటం అని అభిమానులకు తెలుసు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ, ముంబయి తలపడుతుంటే అభిమానులు ఏ పట్టణం నుంచి వచ్చారు. దీనికి మద్దతునిస్తారు అన్నదాన్ని బట్టి ఒక పక్షం వహిస్తారు. భారతదేశం, ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్టు మ్యాచ్ జరుగుతుంటే హైదరాబాదు లేదా చెన్నెలలో టీ.వీలో మ్యాచ్ చూస్తున్న వాళ్లు భారతీయులుగా తమ దేశం వైపున నిలబడతారు. అయితే భారతదేశ తొలి రోజులలో బృందాలు ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడలేదు. 1932 దాకా టెస్ట్ మ్యాచ్ లో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు. మరి బృందాలను ఎలా ఏర్పాటు చేసేవాళ్లు? ప్రాంతీయ, జాతీయ బృందాలు లేనప్పుడు అభిమానులు తమ మద్దతు తెలపటానికి బృందాన్ని దేని ప్రాతిపదికగా ఎంచుకునేవాళ్లు?
1. అభిమానులకు ఏమి తెలుసు?
జవాబు:
క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే ఏదో ఒక పక్షానికి మద్దతు ఇవ్వటం అని అభిమానులకు తెలుసు.
2. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
క్రికెట్‌కు సంబంధించినది.
3. భారతదేశానికి టెస్ట్ మ్యా చ్ లో అవకాశం ఎప్పటి దాకా రాలేదు.
జవాబు:
1932 దాకా.
4. అభిమానులు ఎవరికి మద్దతు తెలియచేస్తారు?
జవాబు:
అభిమానులు తమ ప్రాంతం వారికి మద్దతు తెలియచేస్తారు.
ప్రశ్న 10.
కింది పేరాను చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
‘మీ బాలురకు ఎటువంటి ఆటలు లేవంటే నాకు బాధతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. జాతీయ క్రీడలు, సంప్రదాయ ఆటలను పునరుద్ధరించటంలో మీ సంస్థ ముందు ఉండాలి. మనదేశంలో ఎన్నో సంప్రదాయ ఆటలు ఉన్నాయి. ఇవి ఆసక్తికరమూ, ఉత్సాహభరితంగా ఉండటమే కాకుండా వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.’
– మహీంద్ర కళాశాలలో 1927 నవంబరు 24న ఇచ్చిన ఉపన్యాసం, మహాత్మాగాంధీ సంకలిత రచనలు.
‘ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకి తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది. నా దృష్టిలో ఇటువంటి శరీరాలు ఫుట్ బాల్ మైదానంలో తయారుకావు. అవి మొక్కజొన్న, పంటపొలాల్లో తయారవుతాయి. దీని గురించి ఆలోచిస్తే, ఇందుకు రుజువుగా మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. వలస పాలకుల మోజులో ఉన్న భారతీయులకు ఫుట్ బాల్, క్రికెట్టు పిచ్చి పట్టుకుంది. కొన్ని సందర్భాలలో ఈ ఆటలకు చోటు ఉండవచ్చు… శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండే మానవాళిలోని అధికశాతం రైతులకు ఈ ఆటలు తెలియవన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదు … ?’
– లాజరస్ కి లేఖ, 1915 ఏప్రిల్ 17, మహాత్మాగాంధీ సంకలిత రచనలు, సంపుటి 14.
1. ఉపన్యాసం ఎవరు, ఎక్కడ ఇచ్చారు?
జవాబు:
ఉపన్యాసం మహీంద్ర కళాశాలలో గాంధీజీ ఇచ్చారు.
2. మన దేశంలో ఏ ఆటలు ఉన్నాయి?
జవాబు:
మన దేశంలో ఎన్నో సాంప్రదాయ ఆటలున్నాయి.
3. ఆరోగ్యకరమైన శరీరం అంటే ఏమిటి?
జవాబు:
ఆరోగ్యకరమైన శరీరం అంటే మనసుకు తగినట్టుగా ఉండి, ఎల్లప్పుడూ దాని సేవకు సిద్ధంగా ఉండేది.
4. ఆరోగ్యకరమైన శరీరాలు ఎక్కడ తయారు అవుతాయి?
జవాబు:
మొక్కజొన్న, పంట పొలాల్లో తయారు అవుతాయి.
5. ఈ లేఖ ఎవరికి రాశారు?
జవాబు:
లాజరు రాశారు.
పట నైపుణ్యాలు
ప్రశ్న 11.
మీ అట్లా లో క్రికెట్ ఆడే దేశాలను గుర్తించండి. /Page No.247)
ప్రశ్న 12.
ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ఎండీస్.
జవాబు:
ప్రశ్న 13.
క్రీడలను, వాటిని ప్రోత్సహించే వారిని ప్రశంసించండి.
జవాబు:
క్రీడలు మానసిక వికాసంతోపాటు శారీరకాభివృద్ధిని పెంపొందిస్తాయి. పాఠశాల స్థాయి నుండే పిల్లల్లోని క్రీడాసక్తిని, అభిరుచిని గుర్తించి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. ప్రభుత్వం వ్యవస్థాపరంగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధ్వర్యంలో క్రీడాశాఖ దేశంలో క్రీడారంగం అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పాఠశాల స్థాయి నుండే ప్రతిభావంతులైన బాలబాలికలను గుర్తించి క్రీడామండలుల ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పరుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలతోపాటు స్థానిక క్రీడాంశాలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ విజేతలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడలు, క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించడంతోపాటు అంతర్జాతీయంగా సాంస్కృతిక వికాసానికి, అవగాహనకు తోడ్పడి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి. భిన్న సంస్కృతులు కలిగిన మన దేశానికి జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.
ప్రశ్న 14.
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్నీలు ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు?
జవాబు:
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్శీలు 1848లో బొంబాయిలో స్థాపించారు.
ప్రశ్న 15.
రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
రంజీ ట్రోఫీ క్రికెట్ కు సంబంధించిన పోటీ.
ప్రశ్న 16.
భారతదేశానికి టెస్ట్వ్య లో అవకాశం ఎప్పటిదాకా రాలేదు?
జవాబు:
భారతదేశానికి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం 1952 దాకా రాలేదు.
ప్రశ్న 17.
ఏ దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది.
జవాబు:
1970 దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది?
ప్రశ్న 18.
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో ఏ దేశానిది పైచేయి?
జవాబు:
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో భారత్ దే పైచేయి.
ప్రాజెకు
ఏదైనా ఒక క్రీడ గురించి సమాచారాన్ని సేకరించి, ఆ క్రీడా చరిత్రను నివేదిక రూపంలో రాయండి.
జవాబు:
కబడ్డీ :
మన భారతదేశానికి చెందిన ఒక సాంప్రదాయ క్రీడ – కబడ్డీ. ఈ కబడ్డీ మొదట దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఒక గ్రూపు వాళ్ళు వేటాడుతుంటే మిగతావారు వారిని కాపాడుకోవడం అనే దాని నుండి ఆవిర్భవించింది.
మనదేశానికి చెందిన ప్రాచీన క్రీడ ఇది. ఈ క్రీడను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.
బంగ్లాదేశ్ లో – హుదుదు అని
మాల్దీవులలో – బైబాల అని
ఆంధ్రప్రదేశ్ లో – చెడుగుడు అని
తమిళనాడులో – సడుగుడు అని
మహారాష్ట్రలో – హుటుటు అని. ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు.
ఇది భారతదేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబు రాష్ట్రాలకు రాష్ట్ర క్రీడగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ 1936లో జరిగిన బెర్లిన్ ఒలంపిక్స్ లో ఈ ఆటకు అంతర్జాతీయ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
1938లో కలకత్తాలో జరిగిన భారతదేశ జాతీయ క్రీడలలో దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
1950లో All India కబడ్డీ ఫెడరేషన్ అనే దానిని స్థాపించి ఈ క్రీడకు నియమ నిబంధనలను రూపొందించడం జరిగింది.
ప్రస్తుతం స్త్రీల కబడ్డీ పోటీలు కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రో కబడ్డీ పేరిట ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల ‘జట్ల మధ్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడను ఆసియా క్రీడలలో కూడా చేర్చడం జరిగింది.