SCERT AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 12th Lesson Questions and Answers నక్షత్రాలు – సౌరకుటుంబం
8th Class Physical Science 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
మీ ఊరిలో “ప్రాంతీయ మధ్యాహ్న వేళ” సమయం తెల్పండి. (AS1)
జవాబు:
ప్రాంతీయ మధ్యాహ్న వేళ సమయం తెలుసుకొనుట :
- ఒక మీటరు కంటే ఎక్కువ పొడవున్న ఒక కర్రను తీసుకోండి.
- చదునుగా ఉండే చెట్టు, ఇండ్ల నీడపడకుండా ఉండే స్థలాన్ని ఎంచుకోండి.
- ఈ స్థలంలో కర్ర యొక్క ఒక మీటరు భాగము కచ్చితంగా భూమిపై ఉండే విధంగా కర్రను పాతండి.
- ఉదయం 9 గంటలకు కర్ర నీడ చివరి బిందువు వద్ద ఒక ఇనుపమేకును గుచ్చి, నీడ పొడవును మరియు సమయాన్ని నమోదు చేయండి.
- ఈ విధంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నీడ పొడవు మరియు సమయాన్ని నమోదు చేయండి.
- కర్ర యొక్క అతి తక్కువ పొడవైన నీడను, నమోదైన సమయాన్ని ప్రాంతీయ మధ్యాహ్న వేళ సమయం అంటారు. దీనిని మీ ప్రాంతంలో కనుగొని నమోదు చేయండి. దానినే మీ ప్రాంతీయ మధ్యాహ్న వేళ అంటారు.
ప్రశ్న 2.
ఈ కింది సందర్భాలలో మీకు రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు? (AS1)
ఎ) పౌర్ణమికి రెండు రోజుల ముందు
బి) అమావాస్యకు 2 రోజుల తర్వాత
జవాబు:
ఎ) పౌర్ణమికి రెండు రోజుల ముందు రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు తూర్పువైపు కనిపిస్తాడు.
బి) అమావాస్యకు రెండు రోజుల తరువాత రాత్రివేళలో ఆకాశంలో చంద్రుడు పడమర వైపు కనిపిస్తాడు.
ప్రశ్న 3.
ప్రతి పౌర్ణమి రోజున లేదా ప్రతి అమావాస్య రోజున గ్రహణాలు ఎందుకు ఏర్పడవు? (AS1)
జవాబు:
- ప్రతి పౌర్ణమి రోజున లేదా ప్రతి అమావాస్య రోజున గ్రహణాలు ఏర్పడవు.
- ఎందుకంటే చంద్రుని కక్ష్యతలము భూమి కక్ష్యతలానికి 59, 9′ కోణంలో ఉంటుంది.
- భూ కక్ష్య తలానికి బాగా పైనగాని, కిందగాని చంద్రుడు ఉన్నప్పుడు గ్రహణాలు ఏర్పడవు.
ప్రశ్న 4.
ధృవ నక్షత్రం ఎక్కడ కనిపిస్తుంది? (AS1)
జవాబు:
- ధృవ నక్షత్రం భూభ్రమణ అక్షానికి సూచిగా పైవైపు కనిపిస్తుంది.
- ఆకాశంలో ఉత్తరం వైపుగల సప్తర్షి మండలంలోని చతుర్భుజ ఆకారంలో గల నాలుగు నక్షత్రాలలో బయటివైపున ఉన్న రెండు నక్షత్రాలను కలుపుతూ ఒక రేఖను ఊహించండి. ఈ రెండు నక్షత్రాల మధ్య దూరానికి సుమారు 5 రెట్ల దూరంలో ఊహించిన రేఖ పైనే ధ్రువ నక్షత్రం ఉంటుంది.
- ఆకాశంలో ఉత్తరం వైపు గల “m” ఆకారంలో గల శర్మిష్టరాశి యొక్క మధ్యలో గల నక్షత్రం నుండి తిన్నగా ఊహించిన రేఖ ధ్రువ నక్షత్రాన్ని చూపుతుంది.
ప్రశ్న 5.
ధృవ నక్షత్రానికి, ఇతర నక్షత్రాలకి మధ్య భేదమేమి? (AS1)
జవాబు:
ధృవ నక్షత్రం | ఇతర నక్షత్రాలు |
1) ధృవ నక్షత్రం ఎల్లప్పుడు కనిపిస్తుంది. | 1) ఇతర నక్షత్రాలు కొంతకాలం కనిపిస్తాయి. |
2) ధృవ నక్షత్రం నిశ్చలస్థితిలో ఉంటుంది. | 2) ఇతర నక్షత్రాలు కదులుతున్నట్లు కనిపిస్తాయి. |
ప్రశ్న 6.
ధృవ నక్షత్రం కదలకుండా ఉన్నట్లు ఎందుకు కనబడుతుంది? (AS1)
జవాబు:
- ధృవ నక్షత్రం భూభ్రమణ అక్షానికి ఉత్తరం వైపు సూటిగా పై వైపున ఉంటుంది.
- కాబట్టి ధృవ నక్షత్రం కదలకుండా ఉన్నట్లు కనబడుతుంది.
ప్రశ్న 7.
కొన్ని నక్షత్ర రాశుల పేర్లు తెలపండి. (AS1)
జవాబు:
1) సప్తర్షి మండలం 2) శర్మిష్టరాశి 3) ఒరియన్ 4) లియో (సింహరాశి) 5) ఏరిస్ (మేషం) 6) టారస్ (వృషభం) 7) జెమిని (మిథునం) 8) కేన్సర్ -(కర్కాటక) 9) వర్గో (కన్య) 10) లిబ్రా’ (తుల) 11) స్కార్పియో (వృశ్చికము) 12) శాగిటారియస్ (ధనుస్సు) 13) కేఫ్రికార్న్ (మకరము) 14) ఎక్వేరియస్ (కుంభం) 15) ఫిస్బేస్ (మీనము).
ప్రశ్న 8.
మన సౌరకుటుంబంలో ఎన్ని గ్రహాలున్నాయి? అవి ఏవి? (AS1)
జవాబు:
- మన సౌరకుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి.
- అవి 1) బుధుడు (Mercury) B) శుక్రుడు (Venus) 3) భూమి (Earth) 4) కుజుడు లేదా అంగారకుడు (Mars) 5) గురుడు లేదా బృహస్పతి (Jupiter) 6) శని (Saturn) 7) వరుణుడు (Uranus) 8) ఇంద్రుడు (Neptune)
ప్రశ్న 9.
క్రింది గ్రహాల వివరాల పట్టికను చూసి అన్నిటికంటే చిన్న గ్రహాన్ని, పెద్ద గ్రహాన్ని తెలపండి. (AS1)
జవాబు:
అతిచిన్న గ్రహం – బుధుడు
అతిపెద్ద గ్రహం – బృహస్పతి
ప్రశ్న 10.
సౌర కుటుంబంలో 8 గ్రహాలలోకి భూమి యొక్క ప్రత్యేకత ఏమిటి? (AS1)
జవాబు:
- భూమిపై జీవం పుట్టడానికి, మనగలగడానికి ప్రత్యేక పర్యావరణ పరిస్థితులు.
- సూర్యునికి తగిన దూరంలో ఉండటం, నీరు, వాతావరణం ఉండటం, వాటిని ఆవరించి ఓజోన్ పొర ఉండటం వంటివి భూమిపై జీవాన్ని నిలిపి ఉంచాయి.
- రాత్రి – పగళ్ళు ఏర్పడటం.
- జీవరాశికి కావలసిన విధంగా ఋతువులు ఏర్పడటం.
- భూమిపై సహజ వనరులు ఉండటం.
ప్రశ్న 11.
పగలు – రాత్రులు ఎలా ఏర్పడతాయి? (AS1)
జవాబు:
సూర్యునికి అభిముఖంగా భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల పగలు – రాత్రులు ఏర్పడతాయి.
ప్రశ్న 12.
నక్షత్రాలు కదులుతున్నాయా? నీవెలా చెప్పగలవు? (AS1)
జవాబు:
- నక్షత్రాలు కదలవు.
- భూమి తన అక్షం చుట్టూ పడమర నుండి తూర్పుకు భ్రమణం చేయడం వలన నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు కనిపిస్తాయి. కాని. నిజానికి నక్షత్రాలు కదలవు.
ప్రశ్న 13.
భూమి యొక్క దక్షిణార్ధగోళంలో ఉన్నవారు ధృవ నక్షత్రాన్ని చూడగలరా? ఎందుకు? (AS1)
జవాబు:
- భూమి యొక్క దక్షిణార్ధ గోళంలో ఉన్నవారు ధృవ నక్షత్రాన్ని చూడలేరు.
- ఎందుకంటే ధృవ నక్షత్రం భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో భూభ్రమణ అక్షానికి పైవైపు ఉంటుంది.
ప్రశ్న 14.
కృత్రిమ ఉపగ్రహాల వలన మన నిత్య జీవితంలో ఏమేమి ఉపయోగాలున్నాయి? (AS1)
జవాబు:
- దూరదర్శన్ (T.V), రేడియో ప్రసారాలలో ఉపయోగిస్తారు.
- వాతావరణ సూచనలు, సమాచారాన్ని ముందుగా అందజేస్తాయి.
- టెలిఫోన్, టెలిగ్రామ్, సెల్ ఫోన్, ఫ్యాన్ మరియు నెట్ ద్వారా సమాచారం అందించడం.
- సహజ వనరుల, భూగర్భజల నిక్షేపాలున్న ప్రాంతాల గుర్తింపు.
- రిమోట్ సెన్సింగ్ ద్వారా అడవి వనరుల సర్వే.
- వ్యవసాయ పంటల అభివృద్ధి, సాగునేలల రకాల విభజన
- ఉపగ్రహాలను, గ్రహాలను, నక్షత్రాలను, గెలాక్సీలను ‘పరిశోధించడానికి ఉపయోగిస్తారు.
- ఏదైనా ఒక దేశపు సైనిక విభాగంపై గూఢచర్యము చేయడానికి ఉపయోగిస్తారు.
ప్రశ్న 15.
శుక్రుడు ఎందుకు కాంతివంతమైన గ్రహం? (AS1)
జవాబు:
- శుక్ర గ్రహం ఉపరితలంపై దట్టమైన కార్బన్ డై ఆక్సెడ్ వాయువులతో వాతావరణం ఏర్పడి ఉంటుంది.
- శుక్ర గ్రహంపై పడిన సూర్యకాంతిలో 75% కాంతిని పరావర్తనం చెందించడం వలన శుక్ర గ్రహం కాంతివంతమైనదిగా కనబడుతుంది.
ప్రశ్న 16.
మీరు చంద్రుని మీదకు వెళ్లాలనుకుంటున్నారా? ఎందుకు? (AS2)
జవాబు:
నేను చంద్రుని పైకి వెళ్లాలనుకుంటున్నాను. తను
- చంద్రునిపై ఉన్న శిలలను అధ్యయనం చేయడానికి.
- చంద్రునిపై నీటివనరులు ఉన్నవో లేవో అన్వేషించుటకొరకు.
- చంద్రునిపై జీవుల మనుగడకు అనువైన వాతావరణం ఉందో లేదో తెలుసుకొనుటకు.
- కృత్రిమ ఉపగ్రహాలను ఉపయోగించుకునే రీతిలో చంద్రున్ని ఉపయోగించవచ్చునో లేదో పరిశోధించుటకు.
- చంద్రుని అంతర నిర్మాణాన్ని తెలుసుకొనుటకు.
- చంద్రునిపై రాత్రి పగళ్ళు ఏర్పడుతాయా? రాత్రి పగళ్ళు ఎంతకాలం ఉంటాయి? అని తెలుసుకొనుటకు.
- చంద్రునిపై ఏ జీవరాశి అయినా ఉందా లేదా తెలుసుకొనుటకు.
- చంద్రునిపై నుండి భూమిని పరిశీలించుటకు.
ప్రశ్న 17.
భూమిలో నిటారుగా పాతిన కర్ర యొక్క నీడలను పరిశీలించినపుడు రమ్య మదిలో అనేక ప్రశ్నలు ఉదయించాయి. ప్రశ్నలేమై ఉండవచ్చును? (AS2)
జవాబు:
- కర్ర నీడ ఏర్పడుటకు కారణం ఏమిటి?
- కర్ర నీడ పొడవు ఎందుకు మారుతుంది?
- కర్ర నీడలలో అతి తక్కువ పొడవు గల నీడ ఏర్పడే సమయాన్ని ఏమంటారు?
- కర్ర నీడలలో అతి తక్కువ పొడవు గల నీడ సూచించే దిశలు ఏమి తెలియజేస్తాయి?
- కర్ర యొక్క నీడల ద్వారా నీడ గడియారము తయారుచేయవచ్చా?
ప్రశ్న 18.
రాత్రివేళ ఆకాశాన్ని పరిశీలిస్తున్నప్పుడు మీకు ఏం సందేహాలు కలిగాయి? (AS2)
జవాబు:
- చంద్రుడు ఉపగ్రహం అయినప్పటికి ఎందుకు కాంతివంతంగా కనబడుతున్నాడు?
- నక్షత్రాలు ఎందుకు మిణుకుమిణుకు మంటున్నాయి?
- నక్షత్రాలు ఎందుకు కదులుతున్నట్లు కనబడుతున్నాయి?
- ధృవ నక్షత్రం ఎందుకు కదలుటలేదు?
- రోజురోజుకు చంద్రుని ఆకారం ఎందుకు మారుతుంది?
- అమావాస్య రోజున చంద్రుడు రాత్రివేళ ఎందుకు కనిపించడు?
ప్రశ్న 19.
మన వద్ద గడియారం లేకున్నా పగటి వేళలో కొన్ని వస్తువుల నీడను బట్టి మనం సమయాన్ని చెప్పవచ్చు. మరి రాత్రివేళ సమయాన్ని ఎలా చెప్పగలమో మీ స్నేహితులతో చర్చించండి. (AS2)
జవాబు:
రాత్రివేళ ధృవ నక్షత్రం సహాయంతో సమయాన్ని తెలియజేస్తారు.
ప్రశ్న 20.
మీరు ఇప్పుడున్న ప్రదేశంలో ఉత్తర – దక్షిణ దిక్కులను ఎలా కనుగొంటారు? (AS3)
జవాబు:
- ఒక మీటరు కంటే ఎక్కువ పొడవున్న ఒక కర్రను తీసుకోండి.
- చదునుగా ఉండే, చెట్లు, ఇండ్ల నీడ పడకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి.
- ఈ స్థలంలో కర్ర యొక్క ఒక మీటరు భాగము కచ్చితంగా భూమిపై ఉండేవిధంగా కర్రను పాతండి.
- ఉదయం 11 గంటలకు కర్ర నీడ చివరి బిందువు వద్ద ఒక ఇనుపమేకును గుచ్చి, నీడ పొడవును మరియు సమయాన్ని నమోదు చేయండి.
- ఈ విధంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నీడ పొడవును మరియు సమయాన్ని నమోదు చేయండి.
- కర్ర యొక్క అతి తక్కువ పొడవైన నీడను గుర్తించండి.
- ఈ కర్ర నీడ ఎల్లప్పుడు ఆ ప్రాంతాల ఉత్తర – దక్షిణ దిక్కులను సూచిస్తుంది.
ప్రశ్న 21.
ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు ఉత్తర – దక్షిణ దిక్కులలో ఎటు కదులుతున్నాడు? (AS3)
జవాబు:
ఈ కింది గమనికను బట్టి జవాబు వ్రాయండి.
గమనిక :
- డిసెంబరు 22 నుండి జూన్ 21 వరకు దక్షిణం నుండి ఉత్తరం వైపు కదులుతూ ఉంటాడు.
- జూన్ 21 నుండి డిసెంబరు 22 వరకు ఉత్తరం నుండి దక్షిణం వైపు కదులుతూ ఉంటాడు.
ప్రశ్న 22.
ఆకాశంలో మీరు ఏయే గ్రహాలను చూశారు.? ఎప్పుడు చూశారు? (AS3)
జవాబు:
- ఆకాశంలో నేను శుక్ర గ్రహాన్ని చూశాను.
- కొన్నిసార్లు సూర్యాస్తమయం తర్వాత చూశాను.
- కొన్నిసార్లు సూర్యోదయం కన్నా ముందు చూశాను.
ప్రశ్న 23.
ఈ రోజు పగలు – రాత్రుల నిడివి ఎంత? గడచిన వారం రోజుల వార్తాపత్రికలు సేకరించి పగలు, రాత్రులు నిడివులను పరిశీలించి ఇప్పుడు ఎండాకాలం రాబోతుందో, శీతాకాలం రాబోతుందో తెలపండి. (AS4)
జవాబు:
01-03-2014 శనివారం రోజున పగలు గంటలు 11 : 49 నిమిషాలు రాత్రి గంటలు 12 : 11 నిమిషాలు
- పగలు నిడివి పెరుగుతుంటే ఎండాకాలం రాబోతుంది అని తెలుస్తుంది.
- పగలు నిడివి తగ్గుతుంటే శీతాకాలం రాబోతుంది అని తెలుస్తుంది.
(గమనిక : ఈనాడు వార్తా పత్రిక నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం ల నుండి పగలు – రాత్రుల నిడివిని కనుగొని ఈ ప్రశ్నకు జవాబు రాయాలి).
ప్రశ్న 24.
మీ జిల్లా గుండా పోయే అక్షాంశంపైన ఉన్న ఇతర జిల్లాలు ఏవి? (AS4)
జవాబు:
- మా తూర్పు గోదావరి జిల్లా గుండా పోయే అక్షాంశ డిగ్రీ (ఉత్తరం) 17°.
- మా జిల్లా గుండా పోయే అక్షాంశం పైన ఉన్న ఇతర జిల్లాలు :
1) తూర్పు గోదావరి,
2) విశాఖపట్నం,
3) రంగారెడ్డి (తెలంగాణ),
4) హైదరాబాద్ (తెలంగాణ),
5) నల్గొండ (తెలంగాణ).
సూచన : మిగిలిన జిల్లాల వారు ఈ ప్రశ్నకు జవాబు ఈ క్రింది పట్టిక ఆధారంగా రాయండి.
ప్రశ్న 25.
వార్తా పత్రికల నుండి, అంతర్జాలం నుండి అంతరిక్ష వ్యర్థాలపై సమాచారాన్ని సేకరించండి. వాటివల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ ఒకచార్టును తయారుచేసి మీ పాఠశాల ప్రకటనల బోర్డులో ప్రదర్శించండి. (AS4)
జవాబు:
1. ఆస్టరాయిడ్స్ :
కుజుడు, బృహస్పతి మధ్యగల ఆస్టరాయిడ్లు ఒక్కొక్కసారి కూపర్ బెల్ట్ నుండి బయటకు వచ్చి గ్రహాల మధ్య తిరుగుతుంటాయి. ఏదైనా గ్రహం గురుత్వాకర్షణ పరిధిలోనికి వచ్చినపుడు, గ్రహ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. వాటి వాతావరణంలో జరిగే ఘర్షణ వల్ల మండిపోతాయి లేదా వాతావరణం లేని గ్రహం మీద అయితే ఢీకొనడం వల్ల అక్కడ గోతులు ఏర్పడతాయి. ఈ విధంగా భూమి మీద జరిగితే ప్రాణ, ఆస్తినష్టం జరుగుతుంది.
ఉదా : సిరిస్
2. తోకచుక్కలు :
తోకచుక్క తన కక్ష్యలో ప్రయాణం చేస్తూ సూర్యునికి సమీపంగా వచ్చినపుడు దానిలో ఉండే మంచు, ధూళి, సూర్యుని వేడివల్ల విడిపోయి గ్రహాల మీద పడిపోతుంది.
ఉదా : షూమేకర్ – లేవి – 9 (టెంపుల్ టటిల్ తోకచుక్క) 1994 జులైలో బృహస్పతిని ఢీ కొట్టింది. ఇదే కనుక భూమిని ఢీకొట్టి ఉంటే విపరీతమైన పరిణామాలు ఏర్పడేవి.
3. రేడియేషన్ :
రేడియేషన్ విశ్వవ్యాప్తమైనది. సూర్యకిరణాలు, ఉష్ణకిరణాలు, మైక్రోవేవ్స్, రేడియో తరంగాలు, కాస్మిక్ కిరణాలు, రేడియోధార్మిక లోహాల నుండి వెలువడే వికిరణాలను రేడియేషన్ అంటారు. అంతరిక్షంలో నుండి ” స్వాభావికముగా వెలువడే వికిరణాలతో బాటు మానవ కార్యకలాపాల వల్ల స్వాభావిక రేడియోధార్మిక లేదా కృత్రిమ రేడియోధార్మికత వలన పర్యావరణము కలుషితమై జీవరాశులకు హాని కలిగిస్తాయి. రేడియేషన్ అధికంగా సోకడం వలన జన్యు ఉత్పరివర్తన ఏర్పడి కేన్సర్ వ్యాధులు సోకుతాయి.
4. మానవ చర్యల వలన :
మానవుడు ప్రయోగించిన అనేక కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు కాలం తీరిపోయిన తరువాత పనిచేయక అంతరిక్షంలో ఉండిపోతాయి. వాటివల్ల పనిచేస్తున్న అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలకు తరచుగా ప్రమాదాలు జరుగుతాయి.
ప్రశ్న 26.
నీడ గడియారాన్ని తయారుచేయండి. తయారీ విధానం వివరించండి. (కృత్యం – 3) (AS5)
జవాబు:
- ఒక కార్డుబోర్డు ముక్కను తీసుకొని ప్రక్క పటంలో చూపినట్లు ABC లంబకోణ త్రిభుజాన్ని తయారుచేయాలి.
- దీనిలో 4 వద్ద లంబకోణం , C వద్ద ప్రాంతపు అక్షాంశ డిగ్రీకి సమానమైన కోణం ఉండేలా తీసుకొనవలెను.
- ఒక దీర్ఘచతురస్రాకారపు చెక్క ముక్క మధ్యలో కార్డు బోర్డుతో చేసిన నీడ గడియారం త్రిభుజం యొక్క BC భుజం ఆనునట్లు నిలువుగా ఉంచవలెను.
- త్రిభుజంలో BC భుజం వెంట కాగితాన్ని కొంతమేరకు అంటించి, మిగిలిన కాగితాన్ని చెక్కముక్కకు అంటించి పటంలో చూపినట్లు చెక్కపై త్రిభుజం నిలబడేట్లు చేయాలి.
- దీనిని రోజంతా సూర్యుని వెలుగు తగిలే విధంగా ఉన్న చదునైన ప్రదేశంలో త్రిభుజం యొక్క భుజం BC లో B ఉత్తర దిశలో, C దక్షిణ దిశలో ఉండే విధంగా అమర్చాలి.
- ఉదయం 9 గంటలకు AC భుజం యొక్క నీడ చెక్కపై ఎక్కడ వరకు పడిందో గమనించి రేఖను గీయాలి.
- ఈ రేఖ వెంట 9 గంటలు అని సమయాన్ని నమోదు చేయాలి.
- ఈ విధంగా ప్రతి గంటకు తప్పనిసరిగా నీడను పరిశీలించి రేఖలు గీయాలి మరియు సమయాన్ని నమోదు చేయాలి.
- ఈ విధంగా సూర్యాస్తమయం వరకు రేఖలు గీసి’ సమయాలను నమోదు చేయాలి.
- దీనిని ఉపయోగించి ప్రతిరోజూ సమయాన్ని తెలుసుకోవచ్చును.
ప్రశ్న 27.
చంద్రుని యొక్క వివిధ ఆకారాలను (చంద్రకళలను) గీసి వాటి, పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఆకారాల క్రమంలో అమర్చండి. (AS5)
జవాబు:
ప్రశ్న 28.
సప్తర్షి మండలం నుండి ధృవ నక్షత్రం ఏ దిశలో ఉంటుందో బొమ్మ గీచి చూపండి. (AS5)
జవాబు:
ప్రశ్న 29.
సౌర కుటుంబం బొమ్మ గీయండి. (AS5)
జవాబు:
ప్రశ్న 30.
మన పూర్వీకులు విశ్వం గురించి అనేక విషయాలు తెలుసుకున్న పద్ధతిని నీవెలా అభినందిస్తావు? (AS6)
జవాబు:
- చంద్రగ్రహణ సమయంలో చంద్రునిపై పడే భూమి నీడను చూసి భూమి గుండ్రంగా ఉందని భావించినారు.
- నావికులు సముద్రంపై ప్రయాణిస్తూ ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత తిరిగి వారు బయలుదేరిన ప్రదేశానికి చేరుకున్నారు. దీని వలన భూమి గోళాకారంగా ఉందని భావించారు.
- సముద్రతీరాన నిలబడి చూసేవారికి సముద్రంలో సుదూరం నుండి తీరం చేరే ఓడల యొక్క పొగ మొదట కనబడటం, తర్వాత కొంత సేపటికి పొగగొట్టం కనబడడం, మరికొంత సేపటికి ఓడ పైభాగం తర్వాత ఓడ మొత్తం కనబడటం వంటి అంశాల ద్వారా భూమి ఆకారాన్ని తెలుసుకోవడానికి సహాయపడింది.
విశ్వానికి కేంద్రంలో సూర్యుడున్నాడని మిగిలిన అంతరిక్ష వస్తువులన్నీ దాని చుట్టూ పడమర నుండి తూర్పు వైపుగా తిరుగుతున్నాయని కోపర్నికస్ తెలిపాడు. - భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల రాత్రి, పగళ్ళు ఏర్పడతాయని మన పూర్వీకులు నిర్ధారించారు.
- గెలీలియో టెలిస్కోపు ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలు ప్రజలకు చూపించాడు.
- భూ పరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయని తెలియజేసినారు.
- మన పూర్వీకులు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఎలా ఏర్పడతాయో వివరించగలిగినారు.
- ఉత్తరాయణం, దక్షిణాయణం ఎలా ఏర్పడతాయో వివరించగలిగినారు.
- చంద్రకళలు ఏర్పడుటను వివరించగలిగినారు.
పై విషయాలన్నీ మన పూర్వీకులు ఏ సాధనలు లేకుండా, తెలుసుకున్న పద్ధతిని మనం అభినందించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
ప్రశ్న 31.
వివిధ అవసరాల కొరకు మనం భూమిచుట్టూ అనేక కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించాం. వాటివల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం జీవవైవిధ్యంపై ఎలా ఉంటుంది? (AS7)
జవాబు:
కృత్రిమ ఉపగ్రహాలను ఉపయోగించడం వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం :
- రేడియేషన్ జీవుల యొక్క నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది.
- రేడియేషన్ జీవుల యొక్క ప్రత్యుత్పత్తిపై ప్రభావాన్ని చూపుతుంది.
- రేడియేషన్ వలన క్యాన్సర్ వ్యాధికి గురి అవుతారు.
- రేడియేషన్ మానవుల రక్తప్రసరణ వ్యవస్థపై పనిచేస్తుంది.
- అయనీకరణం చెందితే రేడియేషన్ క్యాన్సర్, థైరాయిడ్ గ్రంథి మరియు బోన్‌మ్యారో పై ఎక్కువ ప్రభావం చూపి వ్యాధి – తీవ్రతను పెంచుతుంది.
- రేడియేషన్ ద్వారా చర్మవ్యాధులు వస్తాయి.
ప్రశ్న 32.
సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాలలో భూమిపైన మాత్రమే జీవమున్నది. ఈ భూమిని, దాని వాతావరణాన్ని మనం ఎలా సంరక్షించాలో తెలపండి. (AS7)
జవాబు:
1. నేల కాలుష్యం సంరక్షణ :
అ) భారీ పరిశ్రమల నుండి విడుదలైన విష వ్యర్థ పదార్థాలను ప్రత్యేకంగా సూచించబడిన స్థలాలలో పెద్ద పెద్ద గుంతలు తీసి అందులోకి పంపించాలి.
ఆ) థర్మల్ పవర్ కేంద్రంలోని ప్లెయాష్ ను ఇటుకలు, సిమెంట్ హాలో బ్రిక్స్ తయారీలో ఉపయోగించాలి.
ఇ) రసాయన ఎరువులకు బదులుగా జైవి ఎరువులు ఉపయోగించాలి.
ఈ) గృహ సంబంధ చెత్తతో కంపోస్ట్ ఎరువులు తయారు చేయాలి.
2. గాలి కాలుష్యం కాకుండా సంరక్షణ :
అ) వాయువు కాలుష్య కారకాలైన పదార్థాలను ఇంధనాల నుండి తొలగించాలి.
ఆ) వాహనాల ఇంజన్లను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించి మంచి కండీషన్లో ఉంచాలి.
ఇ) వాహనాలలో పెట్రోల్ కు బదులుగా ఎల్ పిజి, సిఎజ్ గ్యా న్లు వాడాలి.
ఈ) పరిశ్రమల నుండి వెలువడే వాయువులను ఎత్తైన చిమ్మీల ద్వారా వాతావరణంలోని పై భాగములోకి పంపించాలి.
3. జలకాలుష్యం కాకుండా సంరక్షణ :
అ) మురుగు నీటిని శుద్ధి చేసిన తరువాత ఆ నీటిని జలాశయానికి లేదా నదులలోకి పంపించాలి.
ఆ) పరిశ్రమల నుండి వెలువడే విషపూరిత వ్యర్థ పదార్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతనే బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి.
ఇ) మురుగునీటిని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి.
4. శబ్ద కాలుష్యం కాకుండా సంరక్షణ :
అ) వాహనాలకు సైలెన్సర్లను ఉపయోగించాలి.
ఆ) వాహనాలకు తక్కువ శబ్ద తీవ్రత గల హారన్లను ఉపయోగించాలి.
ఇ) ఫ్యాక్టరీలకు, సినిమా హాళ్ళకు సౌండ్ ఫ్రూఫ్ గోడలతో నిర్మించాలి.
ఈ) ఆరాధన స్థలాలు, ఊరేగింపులో, శుభకార్యాలలో లౌడ్ స్పీకర్లను సాధ్యమైనంత తక్కువ స్థాయిలో ఉపయోగించాలి.
5. అడవుల సంరక్షణ :
అ) అడవులలో ఏవైనా కొన్ని చెట్లు అవసరాల కొరకు కొట్టి వేసినపుడు అంతకంటే ఎక్కువ చెట్లను నాటాలి. దీనివలన సమతుల్యత కాపాడబడుతుంది.
ఆ) ప్రజలను చైతన్య పరిచి చెట్లను నరకకుండా కాపాడాలి.
ఇ) తగ్గుతున్న అడవి విస్తీర్ణం కంటే పెంచే అడవి విస్తీర్ణం ఎక్కువగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి.
పరికరాల జాబితా
నిటారు మీటరు పొడవైన కర్ర, నీడ గడియారం నమూనా, గ్రహణాలను ప్రదర్శించే చిత్రాలు, గ్రహాలకు సంబంధించిన చిత్రాలు.
8th Class Physical Science 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం Textbook InText Questions and Answers
ఆలోచించండి – చర్చించండి
8th Class Physical Science Textbook Page No. 162
ప్రశ్న 1.
ఒక మీటరు పొడవు ఉండునట్లు పాతిన కర్ర యొక్క నీడ కదిలిన మార్గాన్ని గుర్తించడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు అమర్చిన “పెగ్” లను పరిశీలించండి. వీటిని బట్టి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆకాశంలో సూర్యుని స్థానం ఎలా మారుతుందో చెప్పగలరా?
జవాబు:
ఆకాశంలో సూర్యుని స్థానం దీర్ఘవృత్తాకార మార్గంలో తూర్పు నుండి పడమరకు మారుతున్నట్లు కనబడుతుంది.
8th Class Physical Science Textbook Page No. 164
ప్రశ్న 2.
సూర్యుడు ఉత్తర దిక్కుకో లేక ,దక్షిణ దిక్కుకో కదులుతున్నట్లు ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:
- సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే మార్గంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. దీనినే కక్ష్యతలం అంటారు.
- కక్ష్యతలానికి, భూమి భ్రమణాక్షం లంబంగా ఉండకుండా 23.5° కోణంలో వంగి ఉంటుంది.
- భూభ్రమణాక్షం 23.5° కోణంలో వంగి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వలన సూర్యుడు ఉత్తర దిక్కుకో లేదా – దక్షిణ దిక్కుకో కదులుతున్నట్లు కనిపిస్తుంది.
8th Class Physical Science Textbook Page No. 189
ప్రశ్న 3.
చంద్రునిపై కొన్ని కట్టడాలను నిర్మించి అందులో నివసించేందుకు ఏర్పాట్లు చేయాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. అక్కడ గాలి లేదని మీకు తెలుసు. మరి అక్కడ నివసించడం ఎలా సాధ్యం?
జవాబు:
చంద్రునిపై సంచరించి వచ్చిన నీల్ ఆర్న్ స్టాంగ్ లాంటి వ్యోమగాములు తమవీపుపై ఆక్సిజన్ సిలిండర్లను మోసుకునిపోయి, అక్కడ సంచరించి తిరిగి వచ్చారు. అలాగే పర్వతారోహకులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తమతో ఆక్సిజన్ సిలిండర్లు తీసుకునిపోతారు. ఇలాంటి ఏర్పాట్లను చేయడంగాని, లేదా మొత్తం కట్టడానికి ఆక్సిజన్ అందించే పైపులైన్లుగాని ఏర్పరిస్తే తప్ప చంద్రుని ఉపరితలం మీద మానవులు నివసించడం సాధ్యం కాదు.
8th Class Physical Science Textbook Page No. 161
ప్రశ్న 4.
ఆకాశంలో మనం చూడగలిగే అంతరిక్ష వస్తువులు ఏవి?
జవాబు:
ఆకాశంలో మనం చూడగలిగే అంతరిక్ష వస్తువులు : 1) సూర్యుడు, 2) చంద్రుడు, 3) నక్షత్రాలు, 4) గ్రహాలు.
ప్రశ్న 5.
నక్షత్రాలు కదులుతున్నాయా?
జవాబు:
కదులుతున్నవి.
ప్రశ్న 6.
మనకు రాత్రివేళలో కనబడిన నక్షత్రాలే తెల్లవారుజామున కనబడతాయా?
జవాబు:
కనబడవు.
ప్రశ్న 7.
మీకు వేసవికాలంలో రాత్రిపూట కనబడిన నక్షత్రాలే చలికాలంలో కూడా కనబడతాయా?
జవాబు:
కనబడవు.
ప్రశ్న 8.
చంద్రుని ఆకారం ఎలా ఉంటుంది? అది ప్రతిరోజూ ఎందుకు మారుతుంటుంది? మరి సూర్యుని ఆకారం మారదేం?
జవాబు:
- చంద్రునికి స్వయం ప్రకాశం లేదు. సూర్యకాంతి చంద్రునిపై పడి పరావర్తనం చెందడం వల్ల చంద్రుడు కాంతివంతగా కనిపిస్తాడు.
- అయితే చంద్రుడికి ఆకాశంలో తను కనిపించిన ప్రదేశంలో తిరిగి కనిపించడానికి ఒక రోజు పైన సుమారు 50 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. అందువలన చంద్రుడు మనకు సంపూర్ణ వృత్తాకారం నుండి అసలు కనిపించని స్థితికి వివిధ ఆకృతులలో కనిపిస్తాడు.
- కాని సూర్యుడు అలా కాక సరిగా ఒక నిర్ణీత ప్రదేశంలో సరిగ్గా 24 గంటల తర్వాత కనిపిస్తాడు. పైగా స్వయం ప్రకాశం గలవాడు. కనుక సూర్యుడు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా కనిపిస్తాడు.
ప్రశ్న 9.
మిట్టమధ్యాహ్నం వేళ సూర్యుడు ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడు?
జవాబు:
మిట్టమధ్యాహ్నం వేళ సూర్యుడు ఖచ్చితంగా నడినెత్తిన ఉంటాడు.
ప్రశ్న 10.
ఉదయం నుండి సాయంత్రం వరకూ ఒక చెట్టునీడలో ఎందుకు మార్పు వస్తుంది?
జవాబు:
సూర్యకిరణాలు ఆ చెట్టుపై ఏటవాలుగా పడినప్పుడు నీడ పొడవుగాను, సూర్యుడు ఆకాశం మధ్యలో ఉంటే నీడ పొట్టిగానూ, సూర్యునిస్థానం బట్టి మారుతుంది.
8th Class Physical Science Textbook Page No. 165
ప్రశ్న 11.
ఆకాశంలో చంద్రుని కదలికను మీరెప్పుడైనా పరిశీలించారా?
జవాబు:
పరిశీలించాను.
ప్రశ్న 12.
ప్రతిరోజూ చంద్రుడు ఒక నిర్దిష్ట సమయంలో ఒకే చోట కనిపిస్తాడా?
జవాబు:
కనిపించడు.
ప్రశ్న 13.
ప్రతిరోజూ చంద్రుని ఆకారం ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
ఉండదు.
8th Class Physical Science Textbook Page No. 169
ప్రశ్న 14.
చంద్రునిపై మనం శబ్దాలను వినగలమా? ఎందుకు?
జవాబు:
- చంద్రునిపై మనం శబ్దాలను వినలేము.
- శబ్ద ప్రసారానికి యానకం అవసరం. చంద్రునిపై గాలి లేదు. శూన్య ప్రదేశం మాత్రమే. శూన్య ప్రదేశం గుండా శబ్దం ప్రసరింపజాలదు.
ప్రశ్న 15.
చంద్రునిపై జీవం ఉంటుందా? ఎందుకు?
జవాబు:
జీవ జాలానికి ప్రధానమైనది శ్వాసక్రియ. శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరం. చంద్రునిపై వాతావరణం లేదు. కేవలం ఆ శూన్యప్రదేశం మాత్రమే ! కనుక జీవం ఉండదు.
8th Class Physical Science Textbook Page No. 170
ప్రశ్న 16.
చంద్రగ్రహణం పౌర్ణమి రోజున మాత్రమే ఎందుకు ఏర్పడుతుంది?
జవాబు:
పౌర్ణమినాడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలో ఉండి, భూమి సూర్యచంద్రుల మధ్యగా ఉంటుంది. కనుక పౌర్ణమినాడు మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ప్రశ్న 17.
పటం 7 ప్రకారం భూమినీడ చంద్రునిపై ఎప్పుడు పడుతుంది?
జవాబు:
పటం 7 ప్రకారం భూమి నీడ చంద్రునిపై పడాలంటే సూర్యుడు, చంద్రుల గమనమార్గాలు ఖండించుకునే స్థానానికి సరిగ్గా ఒకే సమయానికి అవి రెండూ చేరుకోవాలి, మరియు భూమి వాటిని రెండింటినీ కలిపి సరళరేఖలో ఉండాలి.
ప్రశ్న 18.
ఈ పరిస్థితి ఒక్క పౌర్ణమినాడే సంభవిస్తుందా?
జవాబు:
అవును.
ప్రశ్న 19.
సూర్యగ్రహణం అమావాస్యనాడే ఎందుకు ఏర్పడుతుందో మీరిప్పుడు చెప్పగలరా?
జవాబు:
అమావాస్యనాడు చంద్రుని నీడ భూమిపై పడటం వలన భూమిపై కొన్ని ప్రాంతాలలో సూర్యుడు కన్పించడు. అందువల్ల అమావాస్యనాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
8th Class Physical Science 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం Textbook Activities
కృత్యములు
కృత్యం – 1
ప్రశ్న 1.
నీడ పొడవులో మార్పును పరిశీలించుట
(లేదా)
మీ ప్రాంతం యొక్క “ప్రాంతీయ మధ్యాహ్నవేళ” సమయాన్ని ఒక కృత్యం ద్వారా కనుగొనండి.
జవాబు:
- ఒక మీటరు కంటే ఎక్కువ పొడవున్న ఒక కర్రను తీసుకోండి.
- చదునుగా ఉండే, చెట్లు, ఇండ్ల నీడ పడకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి.
- ఈ ప్రదేశంలో కర్ర యొక్క ఒక మీటరు భాగము కచ్చితంగా భూమిపై ఉండే విధంగా కర్రను పాతండి.
- ఉదయం 11 గంటలకు కర్ర నీడ చివరి బిందువు వద్ద ఒక ఇనుపమేకును గుచ్చి, నీడ పొడవును మరియు సమయాన్ని నమోదు చేయండి.
- ఈ విధంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నీడ పొడవు మరియు నీడ పొడవులో తేడాలు – సమయాన్ని నమోదు చేయండి.
- ఏర్పడిన కర్ర నీడ పొడవులలో అతి తక్కువ పొడవు గల నీడ ఏర్పడినపుడు నమోదు అయిన సమయాన్ని ‘ప్రాంతీయ మధ్యాహ్నవేళ’ అంటారు.
- ప్రాంతీయ మధ్యాహ్నవేళను, సమయాన్ని గుర్తించండి.
కృత్యం – 2
ప్రశ్న 2.
ఉత్తర – దక్షిణ దిశలలో సూర్యుడు కదలడాన్ని అవగాహన చేసుకొనుట.
(లేదా)
ఉత్తరాయణం, దక్షిణాయణం అర్థం చేసుకొనుటకు ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- సూర్యోదయాన్ని చూడటానికి ఏదైనా డాబా పైన గానీ, మైదాన ప్రాంతాన్ని గానీ ఎన్నుకోండి.
- ఎంచుకున్న స్థానం నుండి తూర్పు దిక్కుగా ఏదైనా ఒక చెట్టు లేదా స్తంభం వంటి కదలని వస్తువును “సూచిక”గా ఎంచుకోండి. ఉదయించే సూర్యుని స్థానాన్ని పరిశీలించుట
- వరుసగా 10 నుండి 15 రోజులు నిర్ణయించుకున్న ఈ స్థానానికి చేరి సూర్యోదయం ఎక్కడ జరుగుతుందో పరిశీలించండి.
- ఎంచుకున్న సూచికను దానికి అనుగుణంగా ఉదయిస్తున్న సూర్యుణ్ణి గమనించి పై పటంలో చూపినట్లు ప్రతిరోజూ పుస్తకంపై బొమ్మను గీయండి.
- సూర్యుడు ఉదయించే స్థానం ఒకవేళ మారితే సూర్యుడు ఏ దిక్కుకు జరుగుతున్నట్లు ఉన్నదో గమనించండి.
- సూర్యుడు రోజురోజుకీ దక్షిణ దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే అది దక్షిణాయణం అనీ, ఉత్తర దిక్కుగా కదులుతున్నట్లు అయితే అది ఉత్తరాయణం అనీ అంటారు.
కృత్యం – 4
ప్రశ్న 3.
చంద్రకళలను పరిశీలించుట :
ఈ కింది విధంగా కృత్యాన్ని చేస్తూ, పరిశీలిస్తూ, కృత్యం కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
జవాబు:
1) అమావాస్య తర్వాత మొదటిసారిగా చంద్రుడు (నెలవంక) కనబడిన రోజు యొక్క తేదీని మీ నోట్ బుక్ లో రాసుకోండి. ఆ రోజు చంద్రుడు అస్తమించే సమయాన్ని నమోదు చేయండి. అదేవిధంగా ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో చంద్రుడు ఎక్కడున్నాడో గుర్తిస్తూ పటంలో చూపి నట్లు చంద్రుని ఆకారాన్ని బొమ్మ గీయండి. ఆ రోజు తేదీని చంద్రుడు అస్తమించిన సమయాన్ని ఆ కాగితం పైనే రాసుకోండి.
ఇలా మీకు వీలైనన్ని రోజులు చంద్రుణ్ణి పరిశీలించండి.
2) పౌర్ణమికి కొన్ని రోజుల ముందు నుండి పౌర్ణమి తర్వాత కొన్ని రోజుల వరకు చంద్రుణ్ణి పరిశీలించండి. పౌర్ణమికి ముందు రోజులలో సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించండి. ఆ సమయాన్ని, ఆ రోజు తేదీని నమోదు చేయండి.
పౌర్ణమి తరువాత రోజులలో ఆకాశంలో తూర్పువైపున చంద్రుడు ఉదయించే సమయాన్ని, ఆ రోజు తేదీని రాయండి. ప్రతిరోజూ చంద్రుని ఆకారాన్ని, ఆకాశంలో దాని స్థానాన్ని బొమ్మగీయడం మరవకండి.
ఈ పరిశీలనల వల్ల మీరు ఏం అర్థం చేసుకున్నారు?
ఎ) రెండు వరుస చంద్రోదయాల మధ్య లేదా రెండు వరుస చంద్ర అస్తమయాల మధ్య ఎన్ని గంటల సమయం పడుతుందో లెక్కగట్టగలరా?
జవాబు:
రెండు వరుస చంద్రోదయాల మధ్య లేదా రెండు వరుస చంద్ర అస్తమయాల మధ్య 1 రోజు (24 గంటలు) కంటే దాదాపు 50 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది.
బి) రెండు వరుస సూర్యోదయాలు లేదా సూర్యాస్తమయాల మధ్య కాలమెంత?
జవాబు:
దాదాపు 24 గంటలు (ఒక రోజు)
సి) ఆకాశంలో రెండు వరస సూర్యోదయాలు, రెండు వరుస చంద్రోదయాల మధ్య కాలాలు సమానంగా ఉంటాయా?
జవాబు:
సమానంగా లేవు.
డి) సూర్యాస్తమయ సమయాన ఆకాశంలో చంద్రుడు ప్రతిరోజూ ఒకే స్థానంలో కనబడుతున్నాడా?
జవాబు:
సూర్యాస్తమయ సమయాన ఆకాశంలో చంద్రుడు ప్రతిరోజూ ఒకే స్థానంలో కనబడడు.
ఇ) చంద్రుడు ఏ ఆకారంలో ఉన్నాడు? ప్రతిరోజూ అదే ఆకారంలో ఉంటుందా?
జవాబు:
చంద్రుని ఆకారం ప్రతిరోజూ మారుతుంది. చంద్రుని ఆకారంలో కలిగే మార్పులనే చంద్రకళలు అంటారు.
కృత్యం – 7
ప్రశ్న 4.
నక్షత్రరాశుల కదలికను పరిశీలించుట.
20 సెం.మీ. పొడవు, 20 సెం.మీ. వెడల్పు గల తెల్ల కాగితాన్ని తీసుకొని దాని మధ్యలో 1 సెం.మీ. వ్యాసం గల రంధ్రాన్ని చేయండి. పటంలో చూపినట్లు ఆ కాగితానికి ఒక వైపున ‘x’ గుర్తునుంచండి.
ఈ కాగితాన్ని మీ ముఖానికి ఎదురుగా ఉంచుకుని దానిపై ఉన్న ‘x’ గుర్తు కింది వైపుగా ఉండేట్లు పట్టుకోండి. కాగితం మధ్య నున్న రంధ్రం గుండా ధృవనక్షత్రాన్ని చూడండి. ధృవ నక్షత్రాన్ని గుర్తించాక కాగితాన్ని కదలకుండా పట్టుకుని సప్తర్షి మండలం, శర్మిష్ట రాశి ఏ దిశలో ఉన్నాయో వెదకండి.
ధృవ నక్షత్రానికి సప్తర్షి మండలం ఏ దిశలో కనిపిస్తుందో కాగితంపై ఆ దిశలో ‘G’ అని, శర్మిష్ట రాశి ఏ దిశలో కనబడుతుందో కాగితంపై ఆ దిశలో ‘C’ అని రాయండి. మీరు ఆ రాశులను గుర్తించిన సమయాన్ని ఆ అక్షరాల పక్కన రాసుకోండి.
మీరు ఈ పరిశీలన చేసేటప్పుడు మీ దగ్గరలో ఉన్న చెట్టు లేదా స్తంభం వంటి ఏదేని సూచిక నొకదానిని ఎన్నుకోండి. – అది మీకు ఏ దిశలో ఉందో మీ ప్రయోగ కాగితంపై ఆ దిశలో దాని బొమ్మ గీయండి.
ఈ పరిశీలన చేసేటప్పుడు మీకు ఎక్కడైతే నిలబడ్డారో ప్రతీసారి అక్కడే నిలబడుతూ గంట గంటకూ ఈ రెండు రాశు లను చూడండి.
ప్రతిసారి సప్తర్షి మండలం కనబడిన దిశలో ‘G’ అక్షరాన్ని శర్మిష్ట రాశి కనబడిన దిశలో ‘C’ అక్షరాన్ని కాగితంపై రాయండి. మరియు మీరు పరిశీలించిన సమయాన్ని ఆ అక్షరాల పక్కన తప్పక రాయండి: మీరు నిర్ణయించుకున్న సూచిక (చెట్టు / స్తంభం) ను బట్టి ధృవ నక్షత్ర స్థానం మారిందో లేదో గమనించండి. ఒకవేళ మారితే మారిన స్థానాన్ని గుర్తించండి. ఈ విధంగా వీలైనన్ని సార్లు (నాలుగు సార్లకు తక్కువ కాకుండా) ఈ కృత్యాన్ని చేయండి. ప్రతిసారి కాగితంపై నున్న ‘x’ గుర్తు కింది వైపుగా ఉండాలి. –
మీరు గీసిన చిత్రాన్ని గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
ఎ) మీరు చూసిన నక్షత్రాల స్థానాలలో ఏమైనా మార్పు కన్పించిందా?
జవాబు:
కన్పించింది.
బి) ధృవ నక్షత్రం స్థానం కూడా మారిందా?
జవాబు:
మారలేదు.
సి) సప్తర్షి మండలం, శర్మిష్ట రాశుల ఆకారం మాత్రమే మారిందా? లేక ఆకాశంలో వాటి స్థానం కూడా పూర్తిగా మారిపోయిందా?
జవాబు:
వాటి స్థానం కూడా పూర్తిగా మారిపోయింది.
డి) ఈ రాశులు ఆకాశంలో కదిలిన మార్గం ఏ ఆకారంలో ఉంది?
జవాబు:
దీర్ఘవృత్తాకారంలో ఉంది.