SCERT AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 10th Lesson Questions and Answers సమతలాల వద్ద కాంతి పరావర్తనం
8th Class Physical Science 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
కాంతి పరావర్తన నియమాలను తెల్పండి. (AS1)
(లేదా)
కాంతి పరావర్తన నియమాలను వ్రాయుము.
జవాబు:
పరావర్తన నియమాలు :
1) కాంతి ఏదైనా ఉపరితలంపై పడి పరావర్తనం చెందినప్పుడు, పతన కోణం (i), పరావర్తనకోణం (r) లు సమానంగా ఉంటాయి.
2) పతనకోణం, పతన బిందువు వద్ద తలానికి గీసిన లంబం మరియు పరావర్తన కిరణం ఒకే తలంలో ఉంటాయి. ప్రక్క పటంలో
PQ = పతన కిరణం
QR = పరావర్తన కిరణం
QS = లంబం
Q = పతన బిందువు
∠i = పతన కోణం
∠r = పరావర్తన కోణం
AQB = పరావర్తన తలం
ప్రశ్న 2.
కాంతి మొదటి పరావర్తన సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా మీరు ఎలా సరిచూస్తారు? (AS3)
(లేదా)
సుధీర్ పరావర్తన సూత్రాలను నిరూపించాలనుకున్నాడు. అతనికి అవసరమైన పరికరాలేవి? పరావర్తన సూత్రాలను తెల్పి ప్రయోగ నిర్వహణను గూర్చి తెల్పుము.
(లేదా)
రాజు అను విద్యార్థి, సమతల దర్పణంలో పతన కోణము విలువ పరావర్తన కోణము విలువకు సమానమని వినెను. దీని నిరూపణకు ఒక ప్రయోగమును వ్రాయుము. (ప్రయోగశాల కృత్యం -1)
జవాబు:
ఉద్దేశ్యం :
కాంతి మొదటి పరావర్తన సూత్రాన్ని సరిచూచుట.
కావలసిన వస్తువులు :
అద్దం, డ్రాయింగ్ బోర్డు, తెల్లకాగితం, గుండుసూదులు, డ్రాయింగ్ బోర్డు క్లాంపులు, స్కేలు మరియు పెన్సిల్.
పద్ధతి :
- ఒక డ్రాయింగ్ బోర్డును తీసుకొని క్లాంపుల సహాయంతో దానిపై ఒక తెల్ల కాగితాన్ని అమర్చండి.
- కాగితం మధ్య భాగంలో AB అనే రేఖాఖండాన్ని గీయండి.
- AB పై ఏదైనా బిందువు ‘O’ వద్ద AB కి లంబాన్ని (ON) గీయండి.
- ON తో కొంతకోణం (i) చేసే విధంగా PQ రేఖాఖండాన్ని గీయండి.
- P, Q బిందువుల వద్ద రెండు గుండుసూదులను నిలువుగా గుచ్చండి.
- AB వెంబడి నిలువుగా అమర్చిన అద్దంలో P, Qల వద్ద గుచ్చిన గుండుసూదుల ప్రతిబింబాలు P’, Q’ లను పరిశీలించండి.
- P’, Q’ లతో ఒకే వరుసలో ఉండే విధంగా R, Sల వద్ద మరో రెండు గుండుసూదులు గుచ్చండి.
- R, S మరియు ) లను కలపండి.
- ON, RS ల మధ్య కోణం (r) ను కొలవండి.
- ∠i = ∠r అని మనము గుర్తించవచ్చును.
- ఇదే ప్రయోగాన్ని వివిధ పతనకోణాలతో చేసి చూడండి.
- ప్రతీ సందర్భంలో ∠i = ∠r అని గమనించండి.
- ఈ విధంగా కాంతి ఏదైనా ఉపరితలంపై పడి పరావర్తనం చెందినపుడు పతనకోణం, పరావర్తన కోణాలు సమానంగా ఉంటాయి. కాంతి మొదటి పరావర్తన నియమాన్ని గమనించవచ్చును.
ప్రశ్న 3.
కాంతి రెండవ పరావర్తన సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా మీరు ఎలా సరిచూస్తారు?
(లేదా)
రఘు అను విద్యార్థి సమతల దర్పణంతో కాంతి ప్రసరణ నందు ఒకే తలంపై ఉండునని తెలుసుకొనెను. దీని నిరూపణకు కావలసిన పరికరాలేవి? ప్రయోగం ద్వారా నిరూపించుము.
(లేదా)
నీవు ఏ విధముగా కాంతి రెండవ పరావర్తన నియమమును సరిచూచెదవు? వివరింపుము.
జవాబు:
ఉద్దేశ్యం :
కాంతి రెండవ పరావర్తన సూత్రాన్ని సరిచూచుట.
కావలసిన వస్తువులు :
అద్దం, డ్రాయింగ్ బోర్డు, తెల్లకాగితం, గుండుసూదులు, డ్రాయింగ్ బోర్డు క్లాంపులు, స్కేలు మరియు పెన్సిల్
పద్దతి :
- ఒక డ్రాయింగ్ బోర్డును తీసుకొని క్లాంపుల సహాయంతో దానిపై ఒక తెల్ల కాగితాన్ని అమర్చండి.
- కాగితం మధ్య భాగంలో AB అనే రేఖాఖండాన్ని గీయండి.
- AB పై ఏదైనా బిందువు ‘O’ వద్ద AB కి లంబాన్ని (ON) గీయండి.
- ON తో కొంతకోణం (i) చేసే విధంగా PQ రేఖాఖండాన్ని గీయండి.
- P, Q బిందువుల వద్ద రెండు గుండుసూదులను నిలువుగా గుచ్చండి.
- AB వెంబడి నిలువుగా అమర్చిన అద్దంలో P, Q ల వద్ద గుచ్చిన గుండుసూదుల ప్రతిబింబాలు P’, Q’ లను పరిశీలించండి.
- P’, Q’ లతో ఒకే వరుసలో ఉండే విధంగా R, S ల వద్ద మరో రెండు గుండుసూదులు గుచ్చండి.
- R, S మరియు 0 లను కలపండి. 9) P, Q బిందువుల గుండా పోవు కిరణం “పతన కిరణం”.
- R, S బిందువుల గుండా పోవు కిరణం “పరావర్తన కిరణం”.
- ON అనునది ‘O’ వద్ద అద్దానికి లంబం.
- ఈ మూడు ఒకే కాగితం అనగా ఒకే తలంపై కలవు.
- ఈ విధంగా పరావర్తన 2వ నియమాన్ని సరిచూడవచ్చును.
ప్రశ్న 4.
పిహోల్ కెమెరాలో ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని పటం ద్వారా వివరించండి. (కృత్యం -1) (AS5)
జవాబు:
- ఒక కొవ్వొత్తిని వెలిగించి దానిని పిస్తోల్ కెమెరా గుండా చూడుము.
- లోపల అమర్చబడిన సన్నని గొట్టపు వెనుక భాగం నుండి చూస్తూ సన్నని గొట్టాన్ని వెనుకకు, ముందుకు కదుపుతూ కొవ్వొత్తి మంట గొట్టానికి అమర్చిన తెరపై స్పష్టంగా కనిపించునట్లు చేయుము.
- తెరపై కొవ్వొత్తి మంట తలక్రిందులుగా ఉండునట్లు కనపడును.
- కొవ్వొత్తి మంట, ప్రతి బిందువు నుండి అన్ని దిశలలో కాంతి – ఋజుమార్గంలో ప్రయాణించును.
- కాని ఒక ప్రత్యేక దిశలో పిహోల్ కెమెరా వైపుగా వచ్చిన కాంతి కిరణాలే కెమెరాలోనికి ప్రవేశిస్తాయి.
- కొవ్వొత్తి మంట యొక్క పై భాగం నుండి వెలువడిన కాంతి ఋజుమార్గంలో ప్రయాణించి, కెమెరాలోని తెరక్రింది ఆ భాగానికి చేరును.
- అదే విధంగా కొవ్వొత్తి మంట క్రింది భాగం నుండి వెలువడిన కాంతి కెమెరాలోని తెర పైభాగానికి చేరును.
- దీనివలన తెరపై మంట ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడును.
- కెమెరా తెరపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడటం అనునది కాంతి ఋజుమార్గ ప్రయాణం వలన సాధ్యం.
ప్రశ్న 5.
సమతల దర్పణానికి ముందు ఉంచిన రెండు గుండుసూదుల తలలను తాకుతూ పోయి దర్పణంపై పతనమయ్యే కిరణానికి సంబంధించిన పరావర్తన తలాన్ని ప్రయోగపూర్వకంగా కనుక్కోండి. (AS3)
జవాబు:
ఉద్దేశ్యం :
పరావర్తన తలాన్ని ప్రయోగపూర్వకంగా కనుగొనుట.
కావలసిన వస్తువులు :
అద్దం, డ్రాయింగ్ బోర్డు, తెల్లకాగితం, క్లాంపులు, గుండుసూదులు, స్కేలు మరియు పెన్సిల్.
పద్దతి :
- ఒక డ్రాయింగ్ బోర్డును తీసుకొని క్లాంపుల సహాయంతో దానిపై ఒక తెల్ల కాగితాన్ని అమర్చండి.
- కాగితం మధ్య భాగంలో AB అనే రేఖాఖండాన్ని గీయండి.
- AB పై ఏదైనా బిందువు ‘O’ వద్ద AB కి లంబాన్ని (ON) గీయండి.
- ON తో కొంతకోణం (i) చేసే విధంగా PQ రేఖాఖండాన్ని గీయండి.
- P, Q బిందువుల వద్ద రెండు గుండుసూదులను నిలువుగా గుచ్చండి.
- AB వెంబడి నిలువుగా అమర్చిన అద్దంలో P, Q ల వద్ద గుచ్చిన గుండుసూదుల ప్రతిబింబాలు P’, Q’ లను పరిశీలించండి.
- P’, Q’ లతో ఒకే వరుసలో ఉండే విధంగా R, Sల వద్ద మరో రెండు గుండుసూదులు గుచ్చండి.
- R, S మరియు O లను కలపండి.
- P, Q బిందువుల గుండా పోవు కిరణం “పతన కిరణం”.
- R, S బిందువుల గుండా పోవు కిరణం “పరావర్తన కిరణం”.
- ON అనునది ‘O’ వద్ద అద్దానికి లంబం.
- ఈ మూడూ ఒకే కాగితం అనగా ఒకే తలంపై కలవు.
- ఈ మూడూ అనగా పతన కిరణం, పరావర్తన కిరణం మరియు లంబం ఉన్నటువంటి తలాన్ని “పరావర్తన తలం” అంటారు.
- ఈ విధంగా మనం ప్రయోగపూర్వకంగా పరావర్తన తలాన్ని పరిశీలించవచ్చును.
ప్రశ్న 6.
వర్షం వల్ల ఏర్పడ్డ నీటిగుంటలలో ఆకాశపు ప్రతిబింబాన్ని మీరెప్పుడైనా చూశారా? ఇందులో కాంతి పరావర్తనం ఎలా జరుగుతుందో వివరించండి. (AS6)
జవాబు:
- వర్షం వల్ల ఏర్పడ్డ నీటి గుంటలలో ఆకాశపు ప్రతిబింబం ఏర్పడుతుంది.
- దూరం నుండి చూసినపుడు నీటిలో చిన్న ఎండమావి కన్పిస్తుంది.
- ఈ ఏర్పడ్డ ఎండమావి నిజమైన వస్తువు (ఆకాశం) క్రింద ఏర్పడింది.
- నీలి ఆకాశం నుండి వచ్చిన కాంతి కిరణాలు గాలి గుండా ప్రయాణించి నీటి ఉపరితలంపై తలక్రిందులుగా ఉన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
- ఈ ప్రక్రియ పినహోల్ కెమెరాను పోలి ఉంటుంది.
- ఇక్కడ నీరు అద్దము వలె పనిచేసి ఆకాశ ప్రతిబింబం కనిపిస్తుంది.
ప్రశ్న 7.
భవంతులు, డాబాలను అద్దాలతో అలంకరించటం వల్ల కలిగే లాభనష్టాలను చర్చించండి. (AS6)
(లేదా)
కుంభాకార దర్పణాలను మాత్రమే “రియర్ వ్యూ మిర్రర్”గా వాడుటలో గల ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
భవంతులు, డాబాలను అద్దాలతో అలంకరించడం వల్ల కలిగే లాభాలు :
- అద్దాలను వాడటం వలన కాంతి మన ఇంటిలోనికి ధారాళంగా ప్రసరిస్తుంది.
- అద్దాలను మనకు కావలసిన ఆకారాలలో, డిజైన్లలో, పరిమాణాలలో ‘తయారుచేసుకోవచ్చును.
- అద్దాలను వాడటం వలన ఇంటి బయట ఏ మార్పులు సంభవిస్తున్నాయో ఇంటిలో నుండి కూడా గమనించవచ్చును.
- అద్దాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవచ్చు.
భవంతులు, డాబాలను అద్దాలతో అలంకరించడం వల్ల కలిగే నష్టాలు :
- అద్దాలతో అలంకరించడం అనేది ఖర్చుతో కూడిన పని.
- ఇవి సులభంగా పగులుతాయి.
- ఇవి అధిక ఉష్ణోగ్రతల వద్ద కరిగిపోతాయి.
- ఇవి ఆకాశంను ప్రతిబింబిస్తాయి. దాని ప్రభావం వలన కీటకాలు, పక్షులు మొదలగునవి అయోమయంలో పడి ప్రమాదాలకు లోనవుతాయి.
- వీటి సూర్యకాంతి పరావర్తనం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కలదు.
ప్రశ్న 8.
ఒక కాంతి కిరణం, సమతల దర్పణంపై లంబంగా పతనమయితే పరావర్తన కోణం ఎంత ఉంటుంది? (AS1)
జవాబు:
ఒక కాంతి కిరణం, సమతల దర్పణంపై లంబంగా పతనమయితే పరావర్తన కోణం విలువ సున్నా.
ప్రశ్న 9.
సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబం ఎందుకు పార్శ్వవిలోమాన్ని పొందుతుంది? (AS1)
జవాబు:
సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబము పార్శ్వవిలోమాన్ని పొందడానికి కారణం :
- మన కుడివైపు నుండి వచ్చే కాంతి కిరణాలు సమతల దర్పణంపై పడి పరావర్తనం చెంది మన కంటికి చేరుకున్నాయని అనుకుందాం.
- కాని మన మెదడు ఆ కాంతి కిరణాలు సమతల దర్పణం లోపల నుండి వస్తున్నట్లుగా మన మెదడు భావిస్తుంది.
- అందువలన ప్రతిబింబం యొక్క కుడి భాగం, ఎడమ భాగంలాగా కనిపిస్తుంది.
- దీన్నే కుడి ఎడమల తారుమారు లేదా పార్శ్వవిలోమం అంటారు.
ప్రశ్న 10.
సమతల దర్పణం వలన ఒక బిందురూప వస్తువుకు ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలియజేసే పటం గీచి వివరించండి. (AS5)
జవాబు:
వివరణ :
- ‘O’ వస్తుస్థానము.
- ‘0’ నుండి వెలువడిన కొన్ని కిరణాలు దర్పణంపై పడి, పరావర్తనం చెందుతాయి.
- మనము దర్పణంలోనికి చూసినప్పుడు, ఈ పరావర్తన కిరణాలు ‘l’నుండి వచ్చినట్లుగా కనబడతాయి.
- కనుక ‘l’ వస్తువు ‘O’ యొక్క ప్రతిబింబస్థానమౌతుంది.
ప్రశ్న 11.
ప్రక్క పటంలో AO, OB లు వరుసగా పతన, పరావర్తన కిరణాలను సూచిస్తాయి. AOB = 90° అయితే పతన కోణం, పరావర్తన కోణం ఎంత? (AS1)
జవాబు:
పతన కోణం = పరావర్తన కోణం i = r ………….. (1)
పటం నుండి ∠AOB ⇒ i + r = 90°
(1) నుండి ⇒ i + i = 90°
⇒ 2i = 90° ⇒ i = 90/2 = 45° ⇒ i = r = 45°
∴ పతన కోణం (i) – 45°: .రావర్తన కోణం (r) = 45°.
ప్రశ్న 12.
హిందుజా ఒక సమతల దర్పణానికి ఎదురుగా 5 మీ. దూరంలో నిలబడి తన ప్రతిబింబాన్ని దర్పణంలో చూసుకున్నది. ఆమె దర్పణం దిశగా 2 మీ. దూరం నడిస్తే ఆమెకు, ఆమె ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత ఉండవచ్చు? (AS1)
జవాబు:
సమతల దర్పణమునకు మరియు హిందుజాకు మధ్య గల దూరము = 5 మీ.
ఆమె దర్పణం దిశగా కదిలిన దూరం = 2 మీ.
∴ ఆమెకు, సమతల దర్పణానికి గల మధ్య దూరం = 5 – 2 = 3 మీ.
దర్పణం దిశగా నడిచిన తరువాత దర్పణానికి, ఆమె ప్రతిబింబానికి మధ్యగల దూరం = 3 మీ. ……….. (2)
∴ దర్పణం దిశగా నడిచిన తరువాత ఆమెకు, ఆమె ప్రతిబింబానికి మధ్యగల దూరం
= (1) + (2) = 3 మీ. + 3 మీ. = 6 మీ.
ప్రశ్న 13.
‘B’ అక్షరానికి సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబాన్ని పటం గీచి చూపండి. (AS5)
జవాబు:
ప్రశ్న 14.
తెల్ల కాగితం తనపై పడిన కాంతిని పరావర్తనం చెందించగలదు. అయిననూ తెల్ల కాగితంలో మనం మన ప్రతిబింబాన్ని ఎందుకు చూడలేము? (AS1)
జవాబు:
తెల్లకాగితం తనపై పడిన కాంతిని పరావర్తనం చెందించగలదు. అయిననూ తెల్లకాగితంలో మనం మన ప్రతిబింబాన్ని చూడలేక పోవుటకు గల కారణాలు :
- తెల్ల కాగితం యొక్క ఉపరితలం మనకు నునుపుగా కనిపించిననూ, దాని ఉపరితలం వాస్తవంగా నునుపుగా ఉండదు.
- అందువలన తెల్లకాగితంపై కాంతి పడినపుడు, అది వివిధ కోణాలలో కాంతిని పరావర్తనం చెందిస్తుంది.
- ఈ బహుళ పరావర్తనం, పరావర్తన కిరణాలను పరిక్షేపణం చేస్తుంది.
- అందువలన మనము ప్రతిబింబాన్ని చూడలేము.
ప్రశ్న 15.
ఇచ్చిన పటాన్ని పరిశీలించండి. AB, BC అనే సమతల దర్పణాలు పరస్పరం 120° డిగ్రీల కోణంతో అమరియున్నాయి. AB దర్పణంపై 55° కోణంతో ఒక కాంతి కిరణం పతనమయితే ‘x’ విలువను కనుగొనండి. (AS1)
జవాబు:
పటంలో చూపబడిన కోణాలను a, b, c, d లుగా గుర్తిద్దాం.
a = 55° [∵ i = r]
a + b = 90° [∵ తలానికి ఉన్న లంబానికి ఇరువైపులానున్న కోణాలు]
55° + b = 90° ⇒ b = 90° – 55° = 35°
120° + b + c = 180° [∵ త్రిభుజములోని కోణాల మొత్తము]
120° + 35° + C = 180° ⇒ c = 180° – 155° = 25°
c + d = 90° [∵ తలానికి ఉన్న లంబానికి ఇరువైపులా ఉన్న కోణాలు]
155, 25° + d = 90° ⇒ d = 90°- 25° = 65°
Ab 120, d = x [∵ i = r]
∴ x = 65°
ప్రశ్న 16.
మీ ముందు ఉన్న అద్దం నుండి ఒక వస్తువును మీ ‘కంటి వైపుగా జరుపుతున్నప్పుడు అద్దంలో ఆ వస్తువు ప్రతిబింబ పరిమాణం వస్తుపరిమాణం కంటే తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ అంశాన్ని వివరించే విధంగా కోణాలను తెలియపరుస్తూ చిత్రాన్ని గీయండి. (AS5)
జవాబు:
ప్రశ్న 17.
సమతల దర్పణాలను ఉపయోగించే వివిధ సందర్భాల సమాచారాన్ని సేకరించి నివేదిక తయారుచేయండి. (AS1)
జవాబు:
సమతల దర్పణాలను ఉపయోగించే వివిధ సందర్భాలు :
- మన ఇండ్లలో సాధారణంగా వ్యక్తిగత అలంకరణ కొరకు సమతల దర్పణాన్ని ఉపయోగిస్తాము.
- నగల దుకాణాలు, మిఠాయి అంగళ్ళలో, బార్బర్ షాట్లు వంటి దుకాణాలలో వస్తువులను, మనుషులను వివిధ దిశలలో గమనించుటకు మరియు అధిక ప్రతిబింబాలు పొందుటకు సమతల దర్పణాలను ఉపయోగిస్తారు.
- పెరిస్కోప్ వంటి పరికరంలో సమతల దర్పణాలను ఉపయోగిస్తారు.
- సోలార్ కుక్కర్ తయారీలో సమతల దర్పణాలను కాంతి పరావర్తన తలాలుగా వాడతారు.
- కెలిడయాస్కో లో సమతల దర్పణాలను వాడతారు.
సరైన సమాధానాన్ని ఎన్నుకోండి
1. పతన కోణానికి, పరావర్తన కోణం సమానమని తెలియజేసే సూత్రం
A) ఫెర్మాట్ సూత్రం
B) న్యూటన్ సూత్రం
C) పాస్కల్ సూత్రం
D) బెర్నౌలి సూత్రం
జవాబు:
A) ఫెర్మాట్ సూత్రం
2. ఈ క్రింది అక్షరాలలో సమతల దర్పణం వలన పార్శ్వవిలోమం పొందనట్లుగా కనిపించేది
A) K
B) O
C) J
D) S
జవాబు:
B) O
3. సమతల దర్పణానికి 90° కోణంతో ఒక కాంతి కిరణం పతనమయితే పరావర్తన కోణం విలువ :
A) 0°
B) 90°
C) 180°
D) 45°
జవాబు:
A) 0°
4. వస్తువును సమతల దర్పణం నుంచి కొంత దూరంగా జరిపితే ప్రతిబింబ పరిమాణం
A) పెరిగినట్లు కనిపిస్తుంది
B) తగ్గినట్లు కనిపిస్తుంది
C) వస్తు పరిమాణంతో సమానంగా ఉన్నట్లు కనిపిస్తుంది
D) ప్రతిబింబం కనబడదు
జవాబు:
B) తగ్గినట్లు కనిపిస్తుంది
5. సమతల దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబానికి సంబంధించి క్రింది వాటిలో సరి కొనిది ఏది?
A) ప్రతిబింబం నిటారుగా ఉంటుంది
B) ప్రతిబింబం నిజ ప్రతిబింబంగా ఉంటుంది
C) ప్రతిబింబం పార్శ్వవిలోమం పొందుతుంది
D) ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణానికి సమానం
జవాబు:
D) ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణానికి సమానం
6. ఒక వస్తువు సమతల దర్పణానికి ముందు 7 సెం.మీ. దూరంలో ఉంచబడినది. దర్పణంలో ఆ వస్తువు ప్రతిబింబం దూరం
A) 3.5 సెం.మీ.
B) 14 సెం.మీ.
C) 7 సెం. మీ.
D) 21 సెం.మీ.
జవాబు:
C) 7 సెం. మీ.
పరికరాల జాబితా
డ్రాయింగ్ బోర్డ్, సమతల దర్పణం, గుండు పిన్నులు, ఫ్లాష్ కార్డులు, పిన్‌హోల్ కెమెరా, చార్టులు.
8th Class Physical Science 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook InText Questions and Answers
ఆలోచించండి – చర్చించండి
8th Class Physical Science Textbook Page No. 135
ప్రశ్న 1.
కెమెరాకు పెద్ద రంధ్రం చేసి చూస్తే ప్రతిబింబం పాఠంలో చర్చించిన విధంగానే ఏర్పడిందా?
జవాబు:
అవును ఏర్పడింది.
ప్రశ్న 2.
కెమెరా రంధ్రం ఇంకా పెద్దగా అనగా కొవ్వొత్తి మంట పరిమాణంలో ఉంటే ఏం జరుగుతుంది?
జవాబు:
కెమెరా రంధ్రం ఇంకా పెద్దగా అనగా కొవ్వొత్తి మంట పరిమాణంలో ఉంటే ప్రతిబింబం ఏర్పడదు.
ప్రశ్న 3.
రంధ్రం పెద్దగా ఉన్నప్పుడు కెమెరా తెరపై కొవ్వొత్తి మంట ప్రతిబింబం ఏర్పడుతుందా? ఎందుకు?
జవాబు:
కెమెరా యొక్క రంధ్రం కొంచెం పెద్దగా ఉంటే ప్రతిబింబం కొంచెం మసకబారినట్లుగా ఏర్పడుతుంది.
ప్రశ్న 4.
అదే కొవ్వొత్తి మంటను అదే పిన్పల్ కెమెరాతో చాలా దూరం నుండి చూస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ప్రతిబింబ పరిమాణం వస్తు దూరంపై ఆధారపడును. కావున తక్కువ పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడును.
ప్రశ్న 5.
పినహోల్ కెమెరాకు రెండు రంధ్రాలు చేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
పి హోల్ కెమెరాకు రెండు రంధ్రాలు చేస్తే రెండు ప్రతిబింబాలు ఏర్పడతాయి.
8th Class Physical Science 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook Activities
కృత్యములు
కృత్యం – 2
ప్రశ్న 1.
ఫెర్మాట్ నియమాన్ని ఒక కృత్యం ద్వారా క్లుప్తంగా వివరించుము.
(లేదా)
కాంతి కనిష్ఠ దూరాన్ని తెలిపే కృత్యాన్ని రాయుము.
(లేదా)
కాంతి ఏదైనా తలంపై పరావర్తనం చెందినపుడు అది తక్కువ కాలంలో ప్రయాణించగల మార్గాన్ని అనుసరిస్తుందని ఎట్లా సమర్థిస్తావు?
జవాబు:
- ఒక చెట్టుపై ‘A’ అనే స్థానం వద్ద ఒక తెలివైన కాకి గలదు. నేలపై కొన్ని ధాన్యపు గింజలు చల్లబడి ఉన్నాయి.
- ఆ కాకి నేలపై ఉన్న గింజలలో ఏదో ఒక దానిని తీసుకొని త్వరగా వేరొక చెట్టుపై ఉన్న ‘B’ అనే స్థానం వద్దకు చేరాలనుకుంది.
- కాకి A స్థానం నుండి B స్థానానికి అతి త్వరగా వెళ్ళేందుకు వీలయ్యేటట్లు నేలపై ఒక స్థానాన్ని ‘అది ఎన్నుకోవాలి.
- కాకి యొక్క వేగం .స్థిరమని భావిస్తే, అది త్వరగా వెళ్ళాలంటే దగ్గరి మార్గం ఎన్నుకోవాలి.
- పైనున్న పటాలను పరిశీలించగా A నుండి B ను చేరడానికి అతి దగ్గరి మార్గం AEB అవుతుంది.
- పటం – 4లో చూపబడిన AEB మార్గాన్ని పరిశీలించగా ఆ కాకి E అనే స్థానం వద్ద నున్న గింజనే తీసుకుంటుంది.
- ‘E’ బిందువు వద్ద EE’ అను లంబాన్ని గీస్తే కోణం AEE’, కోణం E’EB లు సమానంగా ఉన్నాయని గుర్తించవచ్చును.
- పై సందర్భంలోని కాకివలె కాంతి కూడా తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుంది.
- కాంతి ఏదైనా తలంపై పరావర్తనం చెందినపుడు కూడా అది తక్కువ కాలంలో ప్రయాణించగల మార్గాన్ని అనుసరిస్తుంది. దీనినే “ఫెర్మాట్ సూత్రం” అంటారు.
కృత్యం – 3
ప్రశ్న 2.
పటం-(ఎ), (బి) పటాలతో పాటు ఒక సమతల దర్పణం ఇచ్చిన పటం-(సి) లో లాగా పట పరావర్తనం ఏర్పడింది. అదే విధముగా పటం-(బి) లోని అన్ని బొమ్మలకు పరావర్తనాలను ఏర్పరచగలరా?
(లేదా)
పరావర్తనం వలన కొన్ని అందమైన ఆకారాలు ఏర్పడతాయని కృత్యం ద్వారా చూపుము.
(లేదా)
నీ యొక్క కాంతి పరావర్తన ధర్మంను పరీక్షించుము.
జవాబు:
సమతల దర్పణ స్థానాన్ని క్రింద ……………) తో చూపడమైనది.
i)
ii) దర్పణ స్థానం అమర్చే అవసరం లేదు.