SCERT AP 8th Class Biology Study Material Pdf 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 3rd Lesson Questions and Answers సూక్ష్మజీవుల ప్రపంచం 1
8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 Textbook Questions and Answers
ప్రశ్న 1.
ఏ జీవి సజీవులకు, నిర్జీవులకు మధ్య. అనుసంధానం అనుకుంటున్నారు ? ఎందుకు ?
జవాబు:
- సజీవులకు, నిర్జీవులకు మధ్య అనుసంధానంగా వైరస్లు వున్నాయని నేను అనుకుంటున్నాను.
- ఎందుకంటే సజీవ కణంలోకి ప్రవేశిస్తేనే వైరస్లు ప్రత్యుత్పత్తి జరుపుకుంటూ క్షోభ్యతను ప్రదర్శిస్తాయి.
- కణం బయట వున్నప్పుడు ఇవి నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి.
- ఈ విషయాన్ని బట్టి సజీవులకు, నిర్జీవులకు మధ్య వైరస్లు వారధిగా అనుసంధానం చేశాయి అని అనుకుంటున్నాను.
ప్రశ్న 2.
సూక్ష్మజీవులు వలన కలిగే వ్యాధుల గురించి రాయండి.
జవాబు:
- కంటికి కనబడకుండా వుండే అతి చిన్న జీవులను సూక్ష్మజీవులు అంటారు.
- ఇవి బాక్టీరియా, వైరస్, శైవలాలు శిలీంధ్రాలు.
- బాక్టీరియా వల్ల టైఫాయిడ్, క్షయ, కుష్టు వంటి వ్యాధులు వస్తాయి.
- వైరస్ల వల్ల పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ వంటి వ్యాధులు వస్తాయి.
- శైవలాలు ఎక్కువగా నిల్వ వాటిలో వుంటాయి. కాబట్టి వీటి వల్ల దురదలు వస్తాయి.
- శిలీంధ్రాలు మన చర్మం పై వుంటూ, చర్మ వ్యాధులైన గజ్జి, తామర వంటి వాటిని కలుగచేస్తాయి.
ప్రశ్న 3.
కుంట నీటిలో ఏయే రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి ?
జవాబు:
- కుంట నీరు అంటే ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీరు.
- అందువల్ల దీనిలో శైవలాలు, బాక్టీరియా, ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏక కణజీవులు ఉంటాయి.
ప్రశ్న 4.
సూక్ష్మజీవులు మనకు ఉపకారులా ? అపకారులా ? వివరించండి.
జవాబు:
కొన్ని సూక్ష్మజీవులు మనకు అపకారులుగాను, మరికొన్ని సూక్ష్మజీవులు మనకు ఉపకారులుగాను ఉంటాయి.
ఉపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణలు :
- లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా పాలను, పెరుగుగా మార్చుతుంది.
- కిణ్వణప్రక్రియలో ఈస్ట్ ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను పెద్ద మొత్తంలో ఆల్కహాలు, వైన్, బీరు, ఎసిటిక్ ఆమ్లాల తయారీలో ఉపయోగిస్తారు.
- శిలీంధ్రాల నుండి సూక్ష్మజీవి నాశకాలు (antibiotics) ను తయారు చేస్తారు.
అపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణ :
- టైఫాయిడ్, క్షయ, కుష్టు, డయోరియా లాంటి జబ్బులు బాక్టీరియా వలన కలుగుతాయి.
- మలేరియా, అమీబియాసిస్ లాంటి వ్యాధులు ప్రోటోజోవాల వల్ల కలుగుతాయి.
- శిలీంధ్రాలు, బాక్టీరియా, మైక్రో ఆర్రోపోడాల వల్ల కొన్ని రకాల చర్మవ్యాధులు కలుగుతాయి.
ప్రశ్న 5.
మజ్జిగ కలిపినప్పుడు ఏ రకమైన పాలు పెరుగుగా మారతాయి ? పరికల్పన చేయండి.
అ) చల్లని పాలు
ఆ) వేడి పాలు
ఇ) గోరువెచ్చని పాలు
జవాబు:
- మజ్జిగ కలిపినపుడు గోరువెచ్చని పాలు పెరుగుగా మారతాయి.
- లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా వలన పాలు పెరుగుగా మారతాయి.
- లాక్టోబాసిల్లస్ పెరుగుదలకు కొంచెం అధికంగా ఉష్ణోగ్రత అవసరం.
- కావున లాక్టోబాసిల్లస్ గోరు వెచ్చని పాలలో వేగంగా పెరిగి, పెరుగు తయారవుతుంది.
- తక్కువ ఉష్ణోగ్రతలో కానీ, అధిక ఉష్ణోగ్రతలో కానీ బాక్టీరియా పెరుగుదల సరిగా ఉండదు.
- కావున చల్లని, వేడిపాలలో కలిపిన మజ్జిగ వలన పెరుగు ఏర్పడలేదు.
ప్రశ్న 6.
మానవ కార్యకలాపాల వల్ల సూక్ష్మజీవులకు హాని కలుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుంది ?
జవాబు:
మానవ కార్యకలాపాల వల్ల సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది. ఈ హాని వలన అపాయకరమైన మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి.
ప్రశ్న 7.
మీరు లాక్టోబాసిల్లస్ బాక్టీరియాను ప్రయోగశాలలో పరిశీలించినపుడు అనుసరించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
ఒకటి లేదా రెండు మజ్జిగ చుక్కలు స్లెడ్ పై తీసుకోవాలి.
- సైడు 3-4 సెకన్ల పాటు వేడి చేయాలి.
- తరువాత దీనిపై క్రిస్టల్ వైలెట్ ద్రావణాన్ని 2 లేదా 3 చుక్కలు వేయాలి.
- ఇది వర్ణదము కాబట్టి బాక్టీరియాను రంజనం చేసి చూపుతుంది.
- ఇలా చేసిన తర్వాత 30-60 సెకన్ల వరకూ స్లెడ్ ను కదపకుండా వుంచాలి.
- తరువాత నీటిలో సైడ్ ను జాగ్రత్తగా, పదార్థం కొట్టుకుపోకుండా కడగాలి.
- ఇప్పుడు స్లెడ్ ను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలిస్తే కింది పటంలో చూపినట్లుగా లాక్టోబాసిల్లస్ బాక్టీరియా కనపడుతుంది.
ప్రశ్న 8.
మీ ఉపాధ్యాయుని సహాయంతో మీ దగ్గరలోని బేకరీని సందర్శించి బ్రెడ్, కేక్ తయారుచేసే పద్ధతిని తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు:
బ్రెడ్ : కావలసినవి : మైదా: 1\(\frac {1}{2}\) కప్పు; బేకింగ్ పౌడర్ : \(\frac {1}{2}\) టీ స్పూన్; బేకింగ్ సోడా : 1 టీ స్పూను; నూనె : \(\frac {3}{4}\) కప్పు; గ్రుడ్లు : 2; పంచదార: 1\(\frac {1}{4}\) కప్పు; వెనీలా ఎసెన్స్ : టీ స్పూను.
తయారీ : ఓవెన్‌ను 180 డిగ్రీలకు వేడిచేయాలి. బ్రెడ్ పాన్ కి కాస్త వెన్న రాసి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి స్పూనుతో కలపాలి. మరో గిన్నెలో గ్రుడ్ల సొన వేసి గిలకొట్టాక పంచదార, నూనె వేసి కలిసేలా గిలకొట్టాలి. వెనీలా ఎసెన్స్ వేసి మృదువుగా అయ్యే వరకూ గిలకొట్టాక మైదా మిశ్రమం వేసి నెమ్మదిగా కలపాలి. మరీ వేగంగా కలిపితే బ్రెడ్ గట్టిగా వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఓవెన్లో ఉంచి సుమారు గంట పాటు బేక్ చేసి, తీసి చల్లారాక కోయాలి.
క్యారెట్ కేక్ : మైదా: 2 కప్పులు, దాల్చిన చెక్కపొడి : 1\(\frac {1}{2}\) టీ స్పూన్లు: బేకింగ్ పౌడర్ : 1\(\frac {1}{2}\) టీ స్పూన్లు; ఉప్పు : 1\(\frac {1}{2}\) టీ స్పూను క్యారెట్ తురుము : 2\(\frac {1}{2}\) కప్పులు; గ్రుడ్లు : 4; పంచదార : 1\(\frac {1}{2}\) కప్పులు; వెనీలా ఎక్స్ ట్రాక్ట్ : 2 టీ స్పూన్లు; నూనె : కప్పు.
తయారీ : మైదాలో దాల్చిన చెక్కపొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచాలి. విడిగా ఓ గిన్నెలో కోడిగ్రుడ్లు వేసి రెండు నిమిషాలు గిలకొట్టాలి. తర్వాత పంచదార వేసి మరో ఐదు నిమిషాలు బీట్ చేయాలి. ఇప్పుడు వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి మరో నిమిషం గిలకొట్టాలి. నెమ్మదిగా నూనె పోస్తూ గిలకొడుతుండాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ, తెడ్డు లాంటి గరిటెతో కలపాలి. చివరగా క్యారెట్ తురుము వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి వెన్నరాసిన రెండు కేకు గిన్నెలో వేసి ముందుగానే 180 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర వేడి చేసిన ఓవెన్లో 30 నిమిషాల పాటు బేక్ చేయాలి. చల్లారాక ముక్కలుగా కోయాలి.
ప్రశ్న 9.
మట్టితో గానీ, థర్మోకోల్ తో గానీ ఏదేని సూక్ష్మజీవి నమూనా తయారుచేయండి. దాని లక్షణాలను వివరిస్తూ నివేదిక రాయండి.
జవాబు:
HIV వైరస్:
- దీని సమాచారం మా సైన్స్ ల్యాబ్ నుండే సేకరించాను.
- ఇది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్.
- ఇది మానవుని తెల్లరక్త కణాలు. అంటే లింఫోసైట్లలోనే జీవించగలుగుతుంది.
- AIDS వ్యా ధిని కలుగచేస్తుంది.
- ఇది ‘ఐకోసా హెడ్రల్’ రూపంలో వుంటుంది.
- దీనిలో ఎంజైములు, RNA వుంటాయి.
- పై పొర గరుకుగా వుంటుంది. లోపలి పొర నున్నగా వుంటుంది.
ప్రశ్న 10.
మీ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ లో వున్న సూక్ష్మజీవుల పర్మినెంట్ స్లెలు పరిశీలించండి. వాటి పటాలు గీయండి.
జవాబు:
మా పాఠశాల సైన్స్ ల్యాబ్ లో ఈ కింద పేర్కొన్న సూక్ష్మజీవుల స్లెలు వున్నాయి.
ప్రశ్న 11.
భోజనం చేసేముందు చేతులను సబ్బుతో శుభ్రంగా ఎందుకు కడుక్కోవాలి ?
జవాబు:
- మనం రోజూ చేతులతో అనేక పనులు చేస్తాం. అనేక వస్తువులను తాకుతాం.
- ఆ పనుల వలన, తాకిన వస్తువుల వలన చేతులకు మురికి అంటుకుంటుంది. ఆ మురికి ద్వారా అనేర రోగకారక క్రిములు చేతులకు అంటుకుంటాయి.
- ఆ చేతులతో భోజనం చేయుటవలన మనము అనేక రోగాల బారిన పడతాం.
- అందువలన భోజనం చేసేముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 InText Questions and Answers
పాఠ్యాంశములోని ప్రశ్నలు
ప్రశ్న 1.
సూక్ష్మజీవుల సమూహాలు గురించి రాయండి.
జవాబు:
సూక్ష్మజీవులను 5 సమూహాలుగా విభజిస్తారు. అవి –
- బాక్టీరియా
- శైవలాలు
- శిలీంధ్రాలు
- ప్రోటోజోవన్స్ మరియు
- సూక్ష్మ ఆర్రోపోడ్స్
2. బాక్టీరియా ఎటువంటి ఆవాసాలలో జీవించగలదు ?
జవాబు:
- బాక్టీరియాను మజ్జిగ లేదా పెరుగులోను, నాలుకపై ఉండే పాచి (నోరు శుభ్రం చేయకముందు) లోను, నేలలోను, చెట్ల కాండంపైన, చర్మంమీద, చంకలోను ఇంకా అనేక ప్రదేశాలలో చూడవచ్చు.
- కానీ వీటిని సాధారణ సూక్ష్మదర్శినిలో చూడలేం.
- మన చర్మం పైన కూడా కొన్ని రకాల బాక్టీరియాలు పెరుగుతాయి. వీటిలో కొన్ని మనకు రోగాలు కలుగజేస్తాయి.
- కొన్ని ఇతర బాక్టీరియాలతో సహజీవనం చేస్తాయి.
- మన శరీరం లోపల కూడా రకరకాల బాక్టీరియాలున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఉండే బాక్టీరియాలు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి.
- బాక్టీరియాలు ఉండని చోటేలేదని చెప్పవచ్చు. నేలలో, నీటిలో, గాలిలో లక్షల సంఖ్యలో ఉన్నాయి.
- ఇవి అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలలో కూడా జీవించగలుగుతాయి.
ప్రశ్న 3.
సూక్ష్మ శైవలాల ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
సూక్ష్మశైవలాలు (మైక్రో ఆల్గే) జరిపే కిరణజన్య సంయోగక్రియ భూమి మీద జీవులకు చాలా ముఖ్యం. వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి.
ప్రశ్న 4.
వైరస్లు గురించి రాయండి.
జవాబు:
- వైరస్లు చాలా ఆసక్తిని రేకెత్తించే సూక్ష్మజీవులు.
- ఇవి సజీవ కణము బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి.
- కానీ బాక్టీరియా, వృక్షకణాలు, జంతు కణాల లాంటి అతిథేయి కణాలలో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి.
- వీటిని శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులలో మాత్రమే చూడగలం.
- పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ వైరస్ల వలననే కలుగుతాయి.
ప్రశ్న 5.
సూక్ష్మ ఆర్రోపోడ్ ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
- నేల సారాన్ని పెంచడానికి కొన్నిరకాల మైక్రో ఆర్రోపోడ్ జీవులు చాలా అవసరం.
- ఇవి జీవ పదార్ధాన్ని కుళ్లిపోయేలా చేస్తాయి.
- సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి.
ప్రశ్న 6.
ప్రోటోజోవనను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:
- ప్రోటోజోవాలను వర్తనం చేయడానికి ఎండుగడ్డిని నీటిలో నానబెట్టాలి.
- 3-4 రోజుల తరువాత గడ్డితో సహా నీటిని సేకరించాలి.
- గడ్డితో సహా సేకరించిన నీటి నుండి ఒక చుక్క నీటిని స్లెడ్ పై తీసుకుని కవర్ స్లిప్ తో కప్పాలి.
- దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
- అనేక ఏకకణ ప్రోటోజోవనను గుర్తించవచ్చు.
ప్రశ్న 7.
బాక్టీరియాను రంజనం చేసే విధానాన్ని క్లుప్తంగా వివరింపుము. (లేదా) మీ ప్రయోగశాలలో మీరు బాక్టీరియాను పరిశీలించారు కదా ! అయిన కింది వాటికి జవాబులిమ్ము. ఎ) ఈ ప్రయోగం చేయడానికి కావలసిన పరికరాలు ఏవి? బి) ప్రయోగ విధానం ఏమిటి ?
జవాబు:
ఎ) అగార్ మాధ్యమం, సైడ్లు, క్రిస్టల్ వైలెట్ రంజకం, సూక్ష్మదర్శిని, బున్ సెన్ బర్నర్.
బి) 1. బాక్టీరియాలు కలిగిన మాధ్యమాన్ని స్లెడ్ పై వేసి, మరొక స్లె తో రుద్ది సమంగా చేయాలి.
2. అలా చేసిన తరువాత కొద్దిగా వేడి చేయాలి. 3. తరువాత ఒక చుక్క ‘క్రిస్టల్ వైలెట్’ వేసి 30 నుండి 60 సెకన్లు వేడి చేయాలి.
4. కొద్ది సేపటి తరువాత నీరు పోసి కడగాలి తడి ఆరిన తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
ప్రశ్న 8.
శైవలాలు ఆకుపచ్చగా వుండటానికి కారణం ఏమిటి ?
జవాబు:
- నిల్వ వున్న నీటిలో శైవలాలు ఎక్కువగా పెరుగుతాయి.
- వీటి పెరుగుదల వల్ల ఆ నీటికి పచ్చదనం వస్తుంది.
- వీటి కణాలలో ‘హరితరేణువులు’ వుంటాయి. ఇవి ‘కిరణజన్య సంయోగక్రియ’ జరిపి ఆహారాన్ని తయారుచేసి కణానికి అందిస్తాయి.
- అందువల్ల శైవలాలు వున్న ప్రదేశం ఆకుపచ్చని చెట్టు లాగా కనబడుతుంది.
ప్రశ్న 9.
‘పరాన్న జీవులు’ అనగానేమి ?
జవాబు:
కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి. ఇలాంటి వాటిని ‘పరాన్న జీవులు’ అంటారు.
కృత్యములు
కృత్యం – 1
ప్రశ్న 1.
నీటిలోని సూక్ష్మజీవులను పరిశీలించే విధానం తెలపండి.
జవాబు:
- మీ పరిసరాలలో ఉన్న నీటి కుంట / మురికి కుంట నుండి కొంత నీటిని సేకరించండి.
- కుంటలోని నీరు ఆకుపచ్చని చెట్టులా ఉండేలా చూసుకోండి.
- సేకరించిన నీటి నుండి 1-2 చుక్కల నీటిని స్లెడ్ పై వేసి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి.
- కదులుతున్న రకరకాల ప్రోటోజోవన్స్ కనిపిస్తాయి.
- వీటితోపాటు ఆకుపచ్చగా ఉండే శైవలాలను చూడవచ్చు.
- మరికొన్ని నీటి లార్వాలను గమనించవచ్చు.
కృత్యం – 2
ప్రశ్న 2.
కుళ్ళిన కూరగాయలు, నల్లబ్రెడ్, చెడిపోయిన కొబ్బరిలో ఎలాంటి సూక్ష్మజీవులు వుంటాయి ?
జవాబు:
- కుళ్ళిన కూరగాయలు, చెడిన నల్లని బ్రెడ్, కొబ్బరిలను సేకరించాలి.
- తరువాత కొద్ది పదార్థాన్ని సూదితో సేకరించి స్లెడ్ పైన ఉంచండి.
- దానిపై చుక్క నీరు వేసి స్లెడను కవర్ స్లితో కప్పాలి.
- తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినిలో పరిశీలించగా అది ‘రైజోఫస్’ అనే శిలీంధ్రంగా గుర్తించాను.
కృత్యం – 3
ప్రశ్న 3.
ఒకటి లేదా రెండు చుక్కలు మజ్జిగ తీసుకొని స్లెడ్ పైన పరచండి. సైడ్ ను 3-4 సెకన్లు పాటు వేడి చేయండి. దాని పైన కొన్ని చుక్కలు “క్రిస్టల్ వైలెట్” ద్రావణం వేయాలి. 30-60 సెకన్ల పాటూ కదపకుండా ఉంచాలి. తరువాత నీటితో సైడ్ ను పదార్థం కొట్టుకు పోకుండా నెమ్మదిగా కడగాలి. దీనిని సంయుక్త సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. మీరు పరిశీలించిన దాని పటం గీయండి. నీవు గీచిన పటాన్ని పటంతో పోల్చి చూడండి.
కృత్యం – 4
ప్రశ్న 4.
శైవలాలను పరిశీలించే విధానం రాయండి. (లేదా) నీటి కొలనులో తేలియాడే నాచుమొక్కల, మైక్రోస్కోప్, సైడులు, కవర్ స్లిన్లు, వర్ణదాలను ఇవ్వబడినవి. వీటితో ప్రయోగశాలలో మీరు ఏం చేయగలరో నివేదిక రాయండి.
జవాబు:
- కుంటలలో నిలువ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండడాన్ని మనం చూస్తూంటాం.
- నీటిలో పెరిగే శైవలాల వల్ల నీటికి పచ్చదనం వస్తుంది.
- స్పెరోగైరా, ఖారా లాంటి శైవలాలు కంటితో చూడవచ్చు.
- నీటిలో ఉండే చాలా శైవలాలను కంటితో చూడలేం. కేవలం సూక్ష్మదర్శిని సాయంతో మాత్రమే చూడగలం.
- నీటి కుంటలోని నీటిని ఆకుపచ్చని చెట్టుతో సహా సేకరించండి.
- సేకరించిన నీటి నమూనా నుండి సన్నని దారపు పోగుల్లాంటి నిర్మాణాలు లేదా వాటి ముక్కలను స్లెడ్ పైన తీసుకోవాలి.
- కవర్ స్లిప్ తో కప్పి, సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
- ఆకుపచ్చని తంతువులు కణాలతో సహా కనిపిస్తాయి.
- పత్రహరితం కలిగిన ఈ జీవులను శైవలాలు అంటారు.
కృత్యం – 5
ప్రశ్న 5.
గడ్డితో సహా సేకరించిన నీటి నుండి ఒక చుక్క నీటిని స్లెడ్ పై తీసుకుని కవర్ స్లిప్ తో కప్పాలి. దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. మీరు పరిశీలించిన దాని పటాలు గీయండి. గీచిన పటాలను పటంతో పోల్చండి.
జవాబు:
కృత్యం – 6
ప్రశ్న 6.
నేలలోని సూక్ష్మజీవులను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:
నేలలోని సూక్ష్మజీవులను పరిశీలించే విధానం :
- పొలం నుండి సేకరించిన మట్టిని ఒక బీకరు లేదా గ్లాసులో వేసి నీరు పోయండి. బాగా కలపండి.
- తరువాత మట్టికణాలు బీకరు అడుగున పేరుకునే వరకు ఆగండి.
- దాని నుండి ఒక నీటి చుక్కను డ్రాపి తీసుకుని స్లెడ్ పైన వేయండి.
- సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి.
- అనేక సూక్ష్మజీవులు కదులుతూ స్లెడ్ మీద కనిపిస్తాయి.
- వీటిలో బాక్టీరియాను సులువుగా గుర్తించవచ్చు.