SCERT AP 8th Class Biology Study Material Pdf 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 2nd Lesson Questions and Answers కణం – జీవుల మౌళిక ప్రమాణం
8th Class Biology 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం
ప్రశ్న 1.
మొట్టమొదట కణాన్ని ఎవరు, ఎలా కనిపెట్టారు ?
జవాబు:
- బ్రిటన్ కు చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త పలుచని బెండు ముక్క నుంచి ఒక పలుచని పొరను సూక్ష్మదర్శినితో పరిశీలించాడు.
- బెండు ముక్కలో ఖాళీ గదుల లాంటి నిర్మాణాలను గమనించాడు.
- అవి తేనెపట్టులో ఉండే ఖాళీ గదుల్లా కనిపించాయి.
- వీటికి ‘కణం’ అని పేరు పెట్టాడు.
- లాటిన్ భాషలో ‘సెల్’ (cell) అనగా చిన్నగది అని అర్థం. మనం. దాన్ని తెలుగులో ‘కణం’ అంటాము.
- కణం యొక్క ఆవిష్కరణ సైన్సు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం.
ప్రశ్న 2.
కణం యొక్క ఆకారం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది ?
(లేదా) ఒక కణం యొక్క ఆకారాన్ని ప్రభావితం చేసే అంశాలేమిటి ?
జవాబు:
కణం యొక్క ఆకారం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- కణత్వచం
- కణకవచం
- కణం చేసే పని మీద వాటి ఆకారం ఆధారపడి ఉంటుంది.
ఉదా : నాడీకణం పొడవుగా ఉంటుంది. అది నాడులను ఏర్పరచటానికి పొడవుగా ఉండటం అవసరం.
ప్రశ్న 3.
ఏకకణ జీవులకు, బహుకణ జీవులకు మధ్యగల భేదాలు రాయండి.
జవాబు:
ఏకకణ జీవులు | బహుకణ జీవులు | ||
1. | ఇవి ఒకే ఒక కణంతో నిర్మితమై ఉంటాయి. | 1. | ఇవి ఒకటి కన్నా ఎక్కువ కణాలతో నిర్మితమై ఉంటాయి. |
2. | అన్ని జీవక్రియలు ఒక కణం లోపలే జరుగుతాయి. | 2. | వీటిలో ప్రతి జీవక్రియను చేయటానికి ఒక నిర్దిష్ట కణం లేదా కణాలు ఉంటాయి. |
3. | వీటికి స్పష్టమైన ఆకారం అమీబా వంటి వాటిలో ఉండదు. కానీ పేరమీషియం, యుగ్లీనా వంటి వాటిలో నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. | 3. | బహుకణ జీవులకు నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. |
4. | ఇవన్నీ సూక్ష్మదర్శిని సాయంతోనే చూడవచ్చు. | 4. | వీటిలో కొన్ని సూక్ష్మదర్శినితోనూ, మరికొన్ని మన కంటితోనూ చూడవచ్చు. |
ప్రశ్న 4.
స్లెడ్ మీద ఉంచిన పదార్థం త్వరగా ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేస్తావు ?
జవాబు:
- స్లెడ్ మీద ఉంచిన పదార్థం త్వరగా ఆరిపోకుండా ఉండాలంటే ఒక నీటిచుక్కతో పాటు ఒక చుక్క గ్లిసరినను వేయాలి.
- ఎక్కువ రోజులు సైడ్ ను ఉంచాలంటే గ్లిసరిన్, వేసి కవర్ స్లిప్ ను కూడా అమర్చాలి.
- అందువల్ల నీరు కానీ, గ్లిసరిన్ కానీ సూక్ష్మదర్శిని యొక్క అక్షి కటకానికి అంటుకోకుండా ఉంటుంది.
ప్రశ్న 5.
“మనం కణాలను కంటితో చూడలేం !” అని దీక్షిత్ చెప్పాడు. ఈ వాక్యం తప్పా ? ఒప్పా ? ఎందుకో రాయండి.
జవాబు:
1. ఈ వాక్యం ‘తప్పు.
2. కారణాలు :
i) కణాలు చాలా సూక్ష్మంగా ఉండి, మైక్రోస్కోప్ సహాయంతో చూడగలము. అయినప్పటికి దీనికి మినహాయింపుగలదు. అండము (ఆస్ట్రిచ్ గుడ్డు) ఒక కణము. ఇది 17 సెం.మీ. నుండి 18 సెం.మీ. పరిమాణం ఉంటుంది.
ii) చాలా కణాలు సూక్ష్మంగా ఉన్నప్పటికి, కంటికి కనిపించే పెద్ద కణాలు కూడా కలవు.
ప్రశ్న 6.
పెద్ద ఉల్లిగడ్డలను, చిన్న ఉల్లిగడ్డలతో పోల్చినప్పుడు పెద్ద కణాలు కలిగి ఉంటాయి” అని రియాజ్ చెప్పాడు. అతడు . చెప్పిన దానితో నీవు ఏకీభవిస్తావా ? కారణాలు వివరించండి.
జవాబు:
రియాజ్ చెప్పిన దానితో నేను ఏకీభవించను.
శరీర పరిమాణానికి కణపరిమాణానికి సంబంధం లేదు. దాదాపు ఒక కణజాలంలోని కణాలన్ని ఒకే పరిమాణం కల్గి ఉంటాయి. శరీర పరిమాణం పెరిగే కొలది కణాల సంఖ్య పెరుగుతుంది. కావున చిన్న ఉల్లిగడ్డలో కణాల సంఖ్య తక్కువగాను, పెద్ద ఉల్లిగడ్డలో అదే పరిమాణం కలిగిన కణాలు అధికంగా ఉంటాయి. కణాల సంఖ్య పెరగటం వలన జీవి పరిమాణం పెరుగుతుంది. భూమిపైన పెద్ద శరీరం కలిగిన ఏనుగులోనూ కణాల పరిమాణం సాధారణంగానే ఉంటుంది.
ప్రశ్న 7.
కింది వాక్యాలు చదవండి. తప్పుగా ఉన్న వాటిని గుర్తించి, సవరించి రాయండి.
ఎ) కణకవచం వృక్ష కణాలకు తప్పనిసరిగా అవసరం.
బి)కేంద్రకం కణం యొక్క జీవక్రియలను నియంత్రిస్తుంది.
సి) ఏకకణ జీవులు శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ నిర్వహిస్తాయి.
డి) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం చేయనవసరం లేదు.
జవాబు:
ఎ) కణకవచం వృక్షకణాలకు తప్పనిసరి. ఎందుకంటే ఇది కణానికి పటుత్వాన్ని ఇస్తుంది.
బి) కేంద్రకం కణం యొక్క జీవక్రియలు నిర్వర్తిస్తుంది. (DNA సహాయంతో) నిజమే !
సి) ఏకకణ జీవులు శ్వాసక్రియ, విసర్జనక్రియ, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ నిర్వహిస్తాయి.
వాస్తవమే – కనుక ఇది ఒప్పు.
డి) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం చేయాలి. అప్పుడే మనం స్పష్టంగా అన్నింటినీ సూక్ష్మదర్శినితో చూడగలం.
ప్రశ్న 8.
కేంద్రకం విధులను వివరించండి.
జవాబు:
కేంద్రకం విధులు :
- ఇది కణంలోని జీవపదార్థం మధ్యలో గుండ్రంగా ఉంటుంది.
- ఇది కణంలో అంతర్భాగం.
- ఈ కేంద్రకం కణంలో జరిగే చర్యలను నియంత్రిస్తుంది.
- కేంద్రకంలో ఉన్న జన్యువులు ఈ వంశపారంపర్య లక్షణాలను జీవులలో ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమింపచేస్తాయి.
ప్రశ్న 9.
ఉల్లిపొరలోని కణాలకు, గడ్డి చేమంతి కాండం అడ్డుకోతలోని కణాలకు తేడాలు తెలపండి.
జవాబు:
ఉల్లిపొరలోని కణాలు | గట్టి చేమంతి కాండంలోని కణాలు |
1. ఇవి అన్నీ ఒకే ఆకారంలో ఉన్నాయి. | 1. ఇవి అన్నీ ఒకే ఆకారంలో లేవు. |
2. ఇవి అన్నీ ఒకే పరిమాణంలో ఉన్నాయి. | 2. ఇవి అన్నీ ఒకే పరిమాణంలో లేవు. వేర్వేరుగా ఉన్నాయి. |
3. ఇవి కేంద్రకాన్ని కలిగి ఉన్నాయి. | 3. వీటిలో కూడా కేంద్రకం ఉంది. |
4. ఇవి అన్నీ ఒకే పనికి వినియోగించబడ్డాయి. అది ఆహార నిల్వ. | 4. వీటిని గ్రూపు-ఎ, గ్రూపు-బి, గ్రూపు-సి, గ్రూపు-డి లుగా గుర్తిస్తాం. |
5. జీవక్రియలన్నీ ఏకకణంలోనే జరుగుతాయి. (జీర్ణక్రియ, నీరు, ఆహార రవాణా, పెరుగుదల మొదలైనవి.) | 5. గ్రూపు-ఎ కణాలు ఆకారాన్ని ఇస్తాయి. గ్రూపు-బి కణాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి. గ్రూపు-సి కణాలు నీరు, ఆహారాన్ని రవాణా చేస్తాయి. గ్రూపు-డి కణాలు కాండం మధ్యలో ఉంటాయి. |
ప్రశ్న 10.
పైన ఇవ్వబడిన పటాలలో భాగాలు గుర్తించండి. వీటిలో ఏది వృక్షకణమో ? ఏది జంతు కణమో గుర్తించండి.
(లేదా)
ఎ) వృక్షకణ నిర్మాణం చూపు బొమ్మను గీచి, భాగాలను గుర్తించండి.
బి) కణ కవచం దేనికి ఉపయోగపడుతుంది ?
జవాబు:
A. కేంద్రకము
B. జీవపదార్ధం
C. ప్లాస్మాపొర
D. రిక్తిక
E. కేంద్రకం
F. కణకవచము
G. ప్రక్క కణము
H. ప్లాస్మాపొర
I. జీవ పదార్థము
పై పటాలలో ఎడమవైపుది జంతుకణం, కుడివైపుది వృక్షకణం (దీర్ఘచతురస్రాకారం)
1. కుడివైపున ఉన్న కణం జంతు కణం.
2. ఎడమవైపున ఉన్న కణం వృక్ష కణం.
బి) కణ కవచం వృక్షకణానికి యాంత్రిక బలాన్ని చేకూర్చుతుంది.
ప్రశ్న 11.
కణాలలో వైవిధ్యం గురించి తెలుసుకోవటానికి నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
- కణాలన్నీ చిన్నవిగా ఉంటాయా? కొన్ని పెద్దకణాలు ఉంటాయా?
- కణాలలో ఉండే ప్రధానమైన నిర్మాణాలు ఏమిటి?
- కణాల ఆకారం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
- అతిపొడవైన కణం ఏమిటి?
- వృక్షకణం జంతుకణం కంటే విభిన్నంగా ఉంటుందా?
- వృక్షాలలో లేకుండా జంతువులలో మాత్రమే ఉండే కణాలు ఏమిటి?
ప్రశ్న 12.
ఏకకణజీవులు, బహుకణజీవుల గురించి తెలుసుకోవటానికి ఏమేమి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
- ఏకకణజీవులు అనగానేమి?
- బహుకణజీవులు అనగానేమి?
- బహుకణజీవులలో కణాల పరిమాణం ఎలా ఉంటుంది?
- ఏకకణజీవులలో అన్ని జీవక్రియలు జరుగుతాయా?
- ఉపయోగకర ఏకకణజీవులు ఏమిటి?
- బహుకణజీవులను ఎలా వర్గీకరిస్తావు?
ప్రశ్న 13.
నీటికుంటలో తేలే పచ్చని మొక్కను (Slime) సేకరించండి. దాని నుండి సన్నని భాగాన్ని వేరు చేసి స్లెడ్ మీద వేసి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించండి. మీరు పరిశీలించిన దానిని పటం గీయండి.
జవాబు:
మా ఇంటి దగ్గరలోని కుంటలో తేలియాడుతున్న పచ్చని మొక్కను సేకరించాను.
- అది నాచు మొక్కలా జిగురుగా ఉంది.
- పీచు భాగం కూడా దానిలో ఉండటం గమనించాను.
- దానిని బ్లేడుతో సన్నని ముక్కలుగా చేసి పెట్రేడిష్ లో కణకవచం ఉన్న నీళ్ళలో వేశాను.
- అతి సన్నని ముక్కను బ్రష్ సహాయంతో స్లెడ్ పైన వేసి ఒక చుక్క నీరు వేశాను.
- తరువాత దానికి ఒక చుక్క గ్లిసరిన్ వేసి దానిని కవర్ స్లిప్ తో కప్పాను.
- తరువాత దానిని సూక్ష్మదర్శిని సాయంతో చూడగా పక్క బొమ్మ మాదిరిగా కనిపించింది.
ప్రశ్న 14.
మీ పరిసరాలలోని ఆకులు సేకరించండి. ఆకుల ఉపరితల కణాలు, ఆకారాలను, సూక్ష్మదర్శినితో చూడండి. ఒక పట్టిక తయారుచేయండి. పట్టికలో క్రమసంఖ్య, ఆకు పేరు, ఆకు ఆకారం, బాహ్యత్వచంలోని కణాలు ఆకారం రాయండి. మీరు ప్రత్యేకంగా కనుగొన్న అంశాలను పట్టిక కింద రాయడం మరువవద్దు.
జవాబు:
ప్రశ్న 15.
ఈ పాఠంలో మీరు పరిశీలించిన కణాలను అంతర్జాలం నుండి సేకరించి వాటిని చిత్తుపుస్తకంలో అతికించి, వాటి విధులు రాయండి.
జవాబు:
పటం | కణం పేరు | విధి |
1. కండర కణం పటం | కండర కణం | చలనము, కదలిక |
2. నాడీకణం పటం | నాడీకణం | సమాచార రవాణా సమాచార విశ్లేషణ |
3. ఎర్రరక్త కణం పటం | ఎర్రరక్త కణం | O2, CO2, సరఫరా |
4. తెల్లరక్త కణం పటం | తెల్లరక్త కణం | సూక్ష్మజీవుల నుండి రక్షణ |
ప్రశ్న 16.
సూక్ష్మదర్శినితో పరిశీలించిన వృక్ష, జంతు కణాల పటాలు, భాగాలను గీయండి.
జవాబు:
1. వృక్ష కణం
2. జంతు కణం
ప్రశ్న 17.
మానవులు, జంతువులు, వృక్షాలు మొదలైనవన్నీ కంటికి కనిపించని కణాలతో నిర్మితమైనాయి. దీనిని నీవు ఏవిధంగా అభినందిస్తావు ?
జవాబు:
- కంటికి కనిపించని సూక్ష్మ నిర్మాణాలు కణాలు.
- ఇవి సజీవులైన మొక్కలు, జంతువులు, మానవులలో నిర్మాణాత్మక, క్రియాత్మక నిర్మాణాలు అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.
- కణాలన్నీ కలసి అంగాలను నిర్మిస్తాయి.
- అంగాలన్నీ కలసి వ్యవస్థలు నిర్మిస్తాయి.
- అభివృద్ధి చెందిన జీవులలో ప్రతి జీవక్రియా నిర్వహణకు ఒక్క వ్యవస్థ ఉంటుంది.
ఉదా : జీర్ణవ్యవస్థ, విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ మొ॥నవి. - ఈ వ్యవస్థలన్నీ కలసి ‘జీవి’ నిర్మాణం జరుగుతుంది.
- పై విషయాలు తెలుసుకున్నప్పుడు, కణం, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగి అభినందించాలని అనిపిస్తుంది.
ప్రశ్న 18.
“వృక్ష కణాలలో కణకవచం లేకపోతే మొక్కలు నిలబడలేవు” అని దీపక్ తన మిత్రుడు జాతో చెప్పాడు. అతను చెప్పిన దానిని నీవెలా సమర్థిస్తావు ?
జవాబు:
- దీపక్ చెప్పిన ఈ విషయాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే –
- వృక్ష కణాలలో కణత్వచంపై అదనపు రక్షణ, పటుత్వం కోసం కణకవచం ఉంటుంది.
- ఈ పటుత్వం వల్ల మొక్కలు వృక్షాలు నిర్దిష్టమైన ఆకారంలో నిలబడతాయి.
- వీటిలో ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థలు ఏర్పడతాయి.
- అందువల్ల వేర్లు, కాండం, శాఖలు, ఆకులు పటుత్వంతో ఉంటాయి.
- ఇది మొక్కను పటుత్వంతో నిలబెట్టగలుగుతుంది.
కనుక నేను దీపక్ చెప్పిన విషయాన్ని సమర్థిస్తాను.
8th Class Biology 2nd Lesson కణం – జీవుల మౌళిక ప్రమాణం InText Questions and Answers
8th Class Biology Textbook Page No. 21
ప్రశ్న 1.
వివిధ రకాల కణాలు కాండంలో ఎందుకు ఉంటాయో ఆలోచించండి. (పేజీ నెం. 21)
జవాబు:
- కాండము అనేక రకాల పనులు నిర్వహిస్తుంది.
- నీరు, పోషక పదార్థాల రవాణా కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది.
- ఆధారాన్ని ఇవ్వటానికి బరువు మోయటానికి ప్రత్యేక కణజాలం ఉంటుంది.
- కాండాన్ని ఆవరించి వెలుపలివైపు పొరవంటి కణజాలం రక్షణ ఇస్తుంది.
- కాండం పెరగడానికి విభజన చెందే కణాల గుంపు ఉంటుంది.
8th Class Biology Textbook Page No. 23
ప్రశ్న 1.
ఏనుగులో ఉండే కణాలు, మనిషిలో ఉండే కణాల కంటే పెద్దవా ?
జవాబు:
- ఏనుగు మరియు మనిషిలో ఉండే కణాలు ఒకే పరిమాణం కలిగి ఉంటాయి.
- జీవి సైజు కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కాని కణాల పరిమాణంపై కాదు.
- కావున ఏనుగులో మనిషికన్నా ఎక్కువ కణాలు ఉంటాయి.
కృత్యములు
కృత్యం – 1
ప్రశ్న 1.
అగ్గిపుల్లలో కణాల పరిశీలన
కృత్యం : ఒక అగ్గిపుల్లను నీటిలో అరగంట నానబెట్టండి. పల్చని పొరలుగా బ్లేడ్ తో కత్తిరించండి. వీటిలో చాలా పల్చని పొరని బ్రష్ తో తీసుకొని దానిని స్లెడ్ పైన పెట్టండి. దానిపై ఒక నీటిచుక్క వేసి దానిని కవర్ స్లిప్ తో నీటి బుడగలు ఏర్పడకుండా కప్పండి. సూక్ష్మదర్శినితో పరిశీలించండి. మీరు గీసిన పటాన్ని నమూన పీఠం బెండు కణాల పటంతో పోల్చండి..
a) మీరు గీసిన పటాన్ని పటం – 2 తో పోల్చండి. రెండూ ఒకేరకంగా ఉన్నాయా ?
జవాబు:
ఔను. నేను గీసిన పటం,పటం – 2 రెండూ ఒకే విధంగా ఉన్నాయి.
b) దీర్ఘచతురస్రాకారంగా ఉన్న వాటిని ఏమని పిలుస్తారు ?
జవాబు:
దీర్ఘచతురస్రాకారంగా ఉన్న వాటిని కణాలు అంటారు.
కృత్యం – 2
ప్రశ్న 2.
ఉల్లిగడ్డ పొరను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:
- ఉల్లిగడ్డ పొట్టు తీసి మందమైన చిన్న ముక్కను కోయాలి.
- ఉల్లిముక్కను రెండుగా విరిచి నెమ్మదిగా వేరుచేసే ప్రయత్నం చేయండి.
- రెండు ముక్కలను కలుపుతూ ఉన్న పలుచని పాక్షిక పారదర్శకంగా ఉండే పొరను గమనించండి.
- ఈ పొరను నెమ్మదిగా వేరు చేయాలి. దాని నుండి చిన్నముక్క కత్తిరించాలి.
- స్లెడ్ పై నీటిచుక్క వేసి ఉల్లి పొరను పెట్టాలి.
- స్లెడ్ పైన వేసిన ఉల్లిపొర మడతలు పడకుండా జాగ్రత్తగా కవర్ స్లిప్ తో కప్పాలి. దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
a) మీరు పరిశీలించిన ఉల్లిపొర కణాల పటాలు గీయండి.
జవాబు:
b) మీరు గీచిన పటాన్ని పై పటంతో పోల్చండి. ఆ రెండింటి మధ్య ఏమైనా తేడాలున్నాయా ?
జవాబు:
రెండింటి మధ్య ఎటువంటి తేడాలు లేవు.
కృత్యం – 3
ప్రశ్న 3.
బుగ్గలోని కణాలను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:
- నోటిని శుభ్రంగా కడుక్కొని, ప్లాస్టిక్ స్పూన్ తో నోటి లోపల బుగ్గపై గీకండి.
- స్లెడ్ పై నీటి బిందువును వేసి, దానిలో గీకగా వచ్చిన పదార్థం వేయాలి.
- దీనిని కవర్ స్లితో కప్పి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
- గుండ్రని, కేంద్రకం కలిగిన కణాలను మనం గమనించవచ్చు.
జాగ్రత్తలు :
- స్పూన్ శుభ్రంగా కడగాలి.
- నోటి లోపల గట్టిగా గీకరాదు.
a) నీవు పరిశీలించిన కణాలు, పటంలో చూపిన కణాలు మాదిరిగానే ఉన్నాయా ?
జవాబు:
ఔను నేను పరిశీలించిన కణాలులో చూపిన కణాలు మాదిరిగానే ఉన్నాయి.
b) రెండు కణాల చుట్టు ఆవరించి ఉన్న పొర ఒకే విధంగా ఉందా ?
జవాబు:
ఔను. రెండింటిని ఆవరించి ఉన్న పొర ఒకే విధంగా ఉంది. దీనినే ప్లాస్మాపొర అంటారు.
కృత్యం – 4
ప్రశ్న 4.
ఉల్లి పొరలోని కేంద్రకం పరిశీలించే విధానం రాయండి. (లేదా) నీవు ఉల్లిపొరలోని కణాలను పరిశీలించావు కదా ? ఈ ప్రయోగ విధానాన్ని తెలపండి.
జవాబు:
- ఉల్లిగడ్డ నుండి ఉల్లిపొరను తియ్యాలి.
- పొరను స్లెడ్ పై ఉంచి 1-2 చుక్కల రంజకాన్ని (సాఫనిన్ లేదా మిథైలీన్ బ్లూ లేదా ఎర్రసిరా) వెయ్యాలి.
కణకవచం - దానిని కవర్ స్లిప్ తో కప్పి 5 ని॥లు కదల్చకుండా ఉంచాలి.
- తరువాత కవర్ స్లిప్ కు ఒకవైపు చుక్కలు చుక్కలుగా నీరు పోస్తూ అధికంగా ఉన్న నీటిని రెండవవైపు నుండి ఫిల్టర్ పేపర్లో అద్ది తీసివేయాలి.
- దీనివల్ల అధికంగా ఉన్న రంజనం తొలగిపోతుంది. ఇప్పుడు సైడ్ ను సూక్ష్మదర్శిని సహాయంతో చూడండి.
- నీలం లేదా ఎరుపు రంగులో ఉండే చుక్కలాంటి నిర్మాణం కనిపించింది కదా ! ఇదే ఉల్లిపొర కణంలోని కేంద్రకం.
కృత్యం – 5
ప్రశ్న 5.
బుగ్గ కణంలోని కేంద్రకం పరిశీలించే విధానం రాయండి.
జవాబు:
- ఒక స్పూన్ తీసుకొని నోటి లోపలి భాగంలో గీకండి.
- పదార్థాన్ని స్లెడ్ మీద ఉంచి ఒక్క చుక్క నీరు చేర్చండి.
- దానికి మిథైలీన్ బ్లూ రంజకం కలిపి కవర్ స్లిప్ వేయండి.
- స్లెడ్ ను మైక్రోస్కోప్ కింద పరిశీలించండి.
- కణం మధ్యభాగంలో గుండ్రని కేంద్రకం కనిపిస్తుంది.
a) ఉల్లిపొరలోని కణాలను బుగ్గలోని కణాలను పరిశీలించారు కదా ? రెండింటిని పోల్చండి.
జవాబు:
- ఉల్లిపొరలోని కణాలు చాలా పొడవుగా ఉండే బుగ్గకణాలు గుండ్రంగా ఉన్నాయి.
- ఉల్లి పొరకణాలు దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, బుగ్గకణాలు వృత్తాకారంగా ఉన్నాయి.
b) కణాలలో మీరు పరిశీలించిన నిర్మాణాలు ఏమిటి ?
జవాబు:
- కణాలలో జీవపదార్థం ఉంది.
- జీవ పదార్థంలో గుండ్రని నిర్మాణం ఉంది.
- జీవపదార్థం చుట్టూ వెలుపలి పొర ఉంది.
c) రంగు కలిగిన గుండ్రని నిర్మాణాలు ఏవైనా చూసారా ?
జవాబు:
కణాల మధ్య అధిక రంగు కలిగిన గుండ్రని నిర్మాణాలు ఉన్నాయి.
d) అవి కణాల మధ్యలోనే ఉన్నాయా ?
జవాబు:
ఔను, రంగుకలిగిన గుండ్రని నిర్మాణాలు కణాల మధ్యలోనే ఉన్నాయి.
e) ఉల్లిపొరలోని కణాలు, బుగ్గకణాలు, బుగ్గకణాల బయట త్వచంలో ఏమైనా తేడాలు గమనించారా ?
జవాబు:
ఉల్లిపొరలోని త్వచం బయటకు స్పష్టమైన గోడవంటి నిర్మాణం ఉంది. బుగ్గ కణాల త్వచం బయట ఇటువంటి గోడ వంటి నిర్మాణం కనిపించదు.
కృత్యం – 6
ప్రశ్న 6.
ఆకులోని కణాలను ఎలా పరిశీలిస్తావు ?
జవాబు:
- లేతగడ్డి ఆకు నుండి పలుచని పొర తీసుకొని దానిని స్లెడ్ పైన ఉంచండి.
- దానికి ఒక చుక్క నీటిని కలపండి.
- పదార్థంపై కవర్ స్లిప్ వేసి సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి.
- వరుసగా అమరిన కణాలు కనిపిస్తాయి.
a) మీరు పరిశీలించిన కణాలు పై పటంలో పోల్చి చూడండి. రెండింటిలో కణాలు ఒకే విధంగా ఉన్నాయి ?
జవాబు:
ఔను. రెండింటిలో కణాలు ఒకే విధంగా ఉన్నాయి.
b) దానిలో ఎన్ని రకాల కణాల గుంపులు చూసారు ?
జవాబు:
ఆకుపై పొరలోని కణాలు అన్ని ఒకే విధంగా ఉంటాయి.
కాని ఆకును అడ్డుకోత కోసి పరిశీలించగా విభిన్న కణాల గుంపులు ఉన్నాయి.
కృత్యం – 7
ప్రశ్న 7.
కింద ఇచ్చిన మానవ శరీర కణాలను పరిశీలించండి.
ప్రశ్న 8.
కింది పట్టిక నింపండి.
జవాబు:
a) కణాల ఆకారంలో ఏమైనా పోలికలు ఉన్నాయా ?
జవాబు:
కణాలు విభిన్న ఆకారాలలో ఉన్నాయి. కొన్ని గుండ్రముగా ఉండి, మరికొన్ని పొడవుగా, ఇంకొన్ని శాఖాయుతంగా ఉన్నాయి.
b) అన్ని కణాల కేంద్రకం ఉందా ?
జవాబు:
అన్ని కణాలలో దాదాపు కేంద్రకం ఉంది. కాని ఎర్రరక్త కణాలలో కేంద్రకం కనిపించలేదు.
c) అన్ని జీవులలో ఏ కణం పెద్దదిగా ఉంటుందో తెలుసా ?
జవాబు:
జీవులలో నాడీకణం పొడవుగా ఉంటుంది. ఇది సుమారు 90 నుండి 10 సెం.మీ. పొడవు ఉంటుంది. ఉష్ణపక్షి గుడ్డు అన్నింటికంటే పెద్దకణం. దీని పరిమాణం 17 సెం.మీ. × 18 సెం.మీ. ఉంటుంది.