AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 2nd Lesson అతిథి మర్యాద Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 2nd Lesson అతిథి మర్యాద

7th Class Telugu 2nd Lesson అతిథి మర్యాద Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో శ్రీకృష్ణుడు, రుక్మిణి, కుచేలుడు ఉన్నారు. రుక్మిణి కుచేలుని పాదాలపై కలశంతో నీరు పోస్తోంది. శ్రీకృష్ణుడు అతిథిగా వచ్చిన మిత్రుడైన కుచేలుని పాదాలను కడుగుతున్నాడు. తన మిత్రుడు కృష్ణుడు తనకు చేస్తున్న అతిథి సేవలకు కుచేలుడు సంతోషిస్తున్నాడు.

ప్రశ్న 2.
చిత్రంలో ఆసనంపైన కూర్చున్న వ్యక్తికి ఎందుకలా చేస్తున్నారు?
జవాబు:
కుచేలుడు శ్రీకృష్ణుని ఇంటికి అతిథిగా వచ్చాడు. అతిథికి కాళ్ళు కడిగి ఆతిథ్యం ఇవ్వాలి. అందువల్ల కుచేలుని పాదాలు శ్రీకృష్ణుడు కడుగుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

ప్రశ్న 3.
పై సందర్భం ఏమై ఉంటుంది? వాళ్ళు ఏం.మాట్లాడుతుండవచ్చు? ఊహించి చెప్పండి.
జవాబు:
శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన కుచేలుడు, శ్రీకృష్ణుని దర్శించడానికి ద్వారకా నగరానికి వచ్చిన సందర్భంలోనిది. కుచేలుని వంటి బాల్యమిత్రుడు, బ్రాహ్మణోత్తముడు తన యింటికి అతిథిగా రావడం, తన అదృష్టమని శ్రీకృష్ణుడు కుచేలునితో చెప్పి ఉంటాడు.

తనకు బాల్యమిత్రుడు, పురుషోత్తముడు, భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు తనకు స్వయంగా అతిథి సత్కారములు చేయడం వల్ల తన జన్మ ధన్యము అయ్యిందని, కుచేలుడు శ్రీకృష్ణునితో చెప్పి ఉంటాడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మీ ఇంటికి వచ్చిన అతిథులకు మీరు ఎలా మర్యాద చేస్తారు?
జవాబు:
మా ఇంటికి వచ్చిన అతిథిని లోనికి రమ్మని పిలుస్తాం. కాళ్ళు కడుగుకోడానికి నీళ్ళు ఇస్తాం. మంచి నీరు తెచ్చి ఇస్తాం. ఆయన వచ్చిన పని ఏమిటో తెలుసుకుంటాం. ఆయనకు కాఫీ కాని, టీ కాని, మజ్జిగ కాని ఇస్తాం. భోజనం కావాలంటే వండి పెడతాం.

ప్రశ్న 2.
ఈ కథలో ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏది ? దాన్ని గురించి చెప్పండి.
జవాబు:
ధర్మరాజు అశ్వమేధయాగాన్ని మెచ్చుకొని, దేవతలు పూలవాన కురిపించారు. ఇంతలో ముంగిస ఒకటి వచ్చి, ఇది దేవతలు అభినందించేటంత గొప్ప యాగమా ? అని ప్రశ్నించింది. ఆ ముంగిస వేసిన ప్రశ్న, ఆశ్చర్యం కల్గించింది.

ప్రశ్న 3.
కథను సొంత మాటల్లో చెప్పండి.
(లేదా)
“అతిథి మర్యాద” కథను సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
యుద్ధం చేసిన పాపం పోవడానికి ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. ఆ యాగంలో ధర్మరాజు గొప్ప దాన ధర్మాలు చేశాడు. దేవతలు కూడా మెచ్చుకున్నారు. .ఇంతలో ఒక ముంగిస వచ్చి, ధర్మబుద్ధిలో సక్తుప్రస్థుడు … ధర్మరాజు కంటే గొప్పవాడు అని చెప్పింది. ముంగిస సక్తుప్రస్థుని కథ ఇలా చెప్పింది.

“కురుక్షేత్రంలో సక్తుప్రస్థుడు, అతని భార్య ఉంటున్నారు. ఆయనకు ఒక కొడుకు, కోడలు ఉన్నారు. వారంతా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని, జీవితం గడుపుతున్నారు.. వారు ఒక రోజు. ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని, వాటిని దంచి, పిండి చేసి, దాన్నే వండుకొని నలుగురూ సమంగా పంచుకున్నారు. వారు తినే సమయంలో ఒక ముసలివాడు వచ్చి ఆకలిగా ఉంది అన్నాడు.

సక్తుప్రస్థుడు తన వంతు ఆహారాన్ని ముసలివాడికి పెట్టాడు. ముసలివాడి ఆకలి తీరలేదు. మిగిలిన ముగ్గురూ కూడా తమ ఆహారాన్ని ఇచ్చారు. ఆ వృద్ధుడు వారి దానబుద్ధిని మెచ్చుకున్నాడు. వారు ఆకలితో ఉన్నా, తినడం ‘మాని వారు తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని దానం చేశారు. ఆకలితో బాధపడే వానికి అన్నం పెట్టడం కంటె గొప్ప దానం లేదని వృద్దుడు చెప్పాడు.

దేవ విమానం వచ్చింది. సక్తుప్రస్థుడి కుటుంబం అంతా, ఆ విమానం ఎక్కి వెళ్ళారు. సక్తుప్రస్థుడి ఇంటికి వచ్చిన అతిథి పాదాలు కడిగిన స్థలంలో నేను తిరిగాను. నా శరీరంలో ఒక వైపు భాగం బంగారమయమయింది. ఆ తరువాత దానధర్మాలు జరిగే ఎన్నో ప్రదేశాలు తిరిగాను. కానీ నా రెండో వైపు శరీరం అలాగే ఉండి పోయింది. ఈ ధర్మరాజు అశ్వమేధయాగం చేసిన స్థలం వద్ద తిరిగినా, నా శరీరంలో రెండో భాగం బంగారం కాలేదు, అని ముంగిస ఈ కథ చెప్పింది.

II. చదవడం -రాయడం

1. పాఠం చదవండి. కింది సూచనలకు అనుగుణంగా, వాక్యాలను పాఠంలో వెతకండి. వాటి కింద గీత గీయండి.

అ) మహాభారత యుద్ధానికి సంబంధించిన వాక్యాలు.
జవాబు:
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షౌహిణుల సేన ఉన్న కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మాత్రం మిగిలారు. ఇటు పాండవులు ఐదుగురూ, కృష్ణుడూ, సాత్యకీ మిగిలారు.

ఆ) అశ్వమేధయాగానికి సంబంధించిన వాక్యాలు.
జవాబు:
ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ధర్మరాజు భావించాడు. అశ్వమేధం చేయమని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం ధర్మరాజు అశ్వమేధయాగం ఆరంభించారు. దేశదేశాలనుంచి చక్రవర్తులూ, విద్వాంసులూ, ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు.

ఇ) అతిథి సత్కారాన్ని గురించి తెలిపే వాక్యాలు.
జవాబు:
చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు”

ఈ) దానం గొప్పదనాన్ని గురించి తెలిపే వాక్యాలు.
జవాబు:
ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే, ఏ దానమూ గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు.

ఉ) ముంగిస మాట్లాడిన మాటలు.
జవాబు:

  1. “దేవతలు కూడా అభినందించే యాగమా ఇది?”
  2. సక్తుప్రస్థుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏ మాత్రం?
  3. ‘సావధానంగా వినండి’
  4. అనంతరం ఎన్నోన్నో దాన, ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా, ఈ రెండో వైపు దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే – అనేవి, ముంగిస మాట్లాడిన మాటలు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

2. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

“మహారాజా ! నీ రాజ్యంలో ఎక్కడా ఆకలిదప్పికలు లేకుండా చూడు. సత్రాలు, చావడులు కట్టించు. చెరువులు తవ్వించు. అడిగిన వాళ్ళకు లేదనకుండా అన్నం పెట్టు. ఏ దానమైనా అన్నదానంతో సరికాదని గుర్తించు. ఎవరి శక్తికి తగినట్లుగా వాళ్ళు అన్నదానం చేసేలా నీ ప్రజల్ని ప్రోత్సహించు. ఆకలి గొన్నవారికి కడుపారా అన్నం పెట్టి, వాళ్ళు తృప్తిగా తింటూంటే అది చూసి మురిసిపోవడం గొప్ప అదృష్టం, గొప్ప అనుభవం. రాజుల సొమ్ము బీదసాదలకు, బడుగు జీవులకు, అన్నార్తులకు, అనాథలకు, అవిటి వారికి ఆదరువు కావాలి, అక్కరకు రావాలి. అదే ముక్తికి మార్గం,” అని వశిష్ఠుడు శ్వేతరాజుకు చెప్పాడు.

అ) పేరాలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు?
జవాబు:
పేరాలోని మాటలు, వశిష్ఠుడు శ్వేతరాజుతో అన్నాడు.

ఆ) రాజులు చేయాల్సిన పని ఏమిటి?
జవాబు:
రాజులు తమ రాజ్యంలో ప్రజలకు ఎక్కడా ఆకలిదప్పికలు లేకుండా చూడాలి. సత్రాలు, చావడులు కట్టించాలి. ఆ చెరువులు తవ్వించాలి. అడిగిన వాళ్ళకు లేదనకుండా అన్నం పెట్టాలి.

ఇ) పై పేరాలో ‘ఆదరువు’ అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
‘ఆదరువు’ అంటే ఆధారం అని అర్థం.

ఈ) వశిష్ఠుడు ముక్తికి మార్గం ఏదని చెప్పాడు?
జవాబు:
“రాజుల సొమ్ము బీదసాదలకు, బడుగు జీవులకు, అన్నార్తులకు, అనాథలకు, అవిటి వారికి ఆదరవు కావాలి, అక్కరకు రావాలి. అదే ముక్తికి మార్గం” అని వశిష్ఠుడు చెప్పాడు.

ఉ) రాజు తన ప్రజలను ఏ విషయంలో ప్రోత్సహించాలి?
జవాబు:
ప్రజలు ఎవరి శక్తికి తగినట్లుగా, వాళ్ళు అన్నదానం చేసేలా రాజు తన ప్రజలను ప్రోత్సహించాలి.

ఊ) పై పేరాకు తగిన శీర్షికను సూచించండి.
జవాబు:
“రాజు కర్తవ్యం” లేక ‘రాజ ధర్మములు.

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ). ధర్మరాజు మనసు ఎందుకు వికలమైంది?
జవాబు:
జరిగిన యుద్ధంలో బంధువులు అందరూ మరణించారనే బాధ, ధర్మరాజు మనస్సును వికలం చేసింది.

ఆ) ధర్మరాజు చేసిన పాపం ఏమిటి? ప్రాయశ్చిత్తంగా ఏమి చేశాడు?
జవాబు:
ధర్మరాజు చేసిన యుద్ధంలో, ఆప్తులూ, ఆత్మీయులూ అంతా మరణించారు. ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా, ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు.

ఇ) ధర్మరాజు చేసిన దానధర్మాలను చూసి ముంగిస ఏమన్నది?
జవాబు:
ధర్మరాజు చేసిన దానధర్మాలను చూసి ముంగిస, “సక్తుప్రసుడి ధర్మబుద్దితో పోలిస్తే, ధర్మరాజు చేసిన దానం ‘ గొప్పది కాదు” అని చెప్పింది.

ఈ) సక్తుప్రసుడు ఏ విధంగా జీవితం గడిపేవాడు?
జవాబు:
ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆపూట దొరికిన దాన్ని తిని సక్తుప్రస్థుడు తృప్తిగా జీవితం గడిపేవాడు.

ఉ) ఆకలితో ఉన్న ముసలివాణ్ణి సక్తుప్రసుడు ఎలా తృప్తి పరిచాడు?
జవాబు:
తాము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన మొత్తం ఆహారాన్ని సక్తుప్రస్థుడు ముసలివాడికి పెట్టి అతణ్ణి తృప్తిపరచాడు.

ఊ) కడుపు నిండిన ముసలివాడు, సక్తుప్రస్థుడితో ఏమన్నాడు?
జవాబు:
“నాయనా ! మీ అన్నదానం, అతిథి సత్కారం నాకు తృప్తి కల్గించాయి. మీరు ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా, మీ ఆహారాన్ని దానం చేసి పుణ్యం సాధించారు. మీ దాన బుద్ధిని అన్నిలోకాలూ మెచ్చుకుంటాయి. మీకు దివ్య లోకాలు లభిస్తాయి” అని ముసలివాడు సక్తుప్రస్థుడితో అన్నాడు.

III స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఒక్కో పేరాలో లేదా ఐదేసి వాక్యాలలో ఆలోచించి సమాధానాలు రాయండి.

అ) అతిథులు అంటే ఎవరు? అతిథి మర్యాద అంటే ఏమిటి?
జవాబు:
‘అతిథులు’ అంటే తిథి నియమం లేకుండా ఇంటికి వచ్చేవారు. మన ఇండ్లకు ఎవరైనా క్రొత్తవారు వస్తే, వారిని మర్యాదతో లోపలికి పిలిచి, వారికి కాళ్ళు కడుగుకోడానికి నీళ్ళు ఇచ్చి, వారికి కాఫీ, టిఫిను, వగైరా ఇవ్వడం అతిథి మర్యాద. అవసరమైతే వారికి భోజనం కూడా పెట్టాలి. మా ఇంటికి అతిథులు వస్తే వారిని … ఆదరించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనం పెడతాను. ఉన్నంతలో వారి కోరికలు తీరుస్తాను.

ఆ) దయగల గుండె గలవారే ఆశకు దూరమౌతారు’ దీని మీద అభిప్రాయం ఏమిటి? వివరించండి.
జవాబు:
కొంతమందికి దయగల గుండె ఉంటుంది. వారు ప్రక్క వారికి కష్టం వస్తే, చూచి సహించలేరు. అవసరమైతే ప్రక్కవారి కోసం వారు తమ ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధమౌతారు. వారికి వారి ప్రాణాల మీద కూడా ఆశ ఉండదు. ఇతరులకు అవసరమయితే తమ రక్తాన్ని, అవయవాలను సైతం దానం చేస్తారు. తమ మూత్రపిండాల్నీ, నేత్రాలనూ దానం చేస్తారు. దయాహృదయం లేనివారు దానం చేయలేరు.

ఇ) ముంగిస దేహం పూర్తిగా బంగారంగా మారాలంటే ఏం జరగాలి?
(లేదా)
ముంగిస దేహం పూర్తిగా బంగారంగా ఎప్పుడు మారుతుంది?
జవాబు:
సక్తుప్రస్తుడి వంటి గొప్ప ధర్మబుద్ధి కల దాత, ముసలివాని వంటి అతిథి యొక్క పాదాలు కడిగిన చోట, ఆ ముంగిస తిరిగితే, దాని రెండవ భాగం కూడా బంగారంగా మారుతుంది.

ఈ) “సక్తుప్రసుడు సర్వభూత కోటిని దయతో చూసేవాడు కదా !” అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
‘భూతము’ అంటే ప్రాణము కల ప్రాణి. సర్వభూత కోటి అంటే అందరు ప్రాణులు. మనిషికి ఉన్నట్లే జంతువులకు, – వృక్షాలకు, కూడా ప్రాణం ఉంటుంది. ‘తోటి మనిషికి ఆకలి వేస్తే అన్నం పెడతాము. అలాగే ఆవు, గేదె వంటి జంతువులకు కూడా ఆహారం పెట్టాలి. వృక్షాలకు నీళ్ళు పోయాలి. ఇలా అన్ని ప్రాణులయందు దయ చూపించాలి.

ఉ) ఈ కథకు ఇంకేం పేరు పెట్టవచ్చు? ఎందుకు? కారణాలు రాయండి.
జవాబు:
ఈ కథకు “సక్తుప్రస్థుడి ధర్మబుద్ధి’ అని కాని ‘అన్నదాన మహిమ’ అని కాని పేరు పెట్టవచ్చు. ఈ కథలో సక్తుప్రస్థుడి దాన, ధర్మ బుద్ధి ప్రధానము కాబట్టి ‘సక్తుప్రస్థుడి ధర్మబుద్ధి’ అని పేరు పెట్టవచ్చు. ఆకలితో ఉన్న . అతిథికి అన్నదానం చేసి సక్తుప్రస్థుడు దివ్యలోకాలు చేరాడు కాబట్టి ‘అన్నదాన మహిమ’ అని కూడా పేరు పెట్టవచ్చు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ధర్మరాజు, సక్తుప్రసుడు ‘ఇద్దరూ దానాలు చేశారు కదా ! వీరిద్దరిలో ఎవరిది గొప్పదానం? ఎందుకు?
జవాబు:
సక్తుప్రసుడి దానం గొప్పది. సక్తుప్రసుడు ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని, జీవితం నడుపుతున్న. పేదవాడు. కేవలం రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని, వాటిని దంచి పిండి చేసి, దానినే వండుకొని ఆ ఇంట్లో నలుగురూ తింటారు. సక్తుప్రస్థుడితో పాటు, అతని కుటుంబంలోని వాళ్ళంతా. ఆకలితో ఉన్నారు. వారు ఆహారం తినడానికి సిద్ధపడ్డారు. ఆ పరిస్థితుల్లో వచ్చిన వృద్ధుడికి, వాళ్ళకు ఉన్నదంతా పెట్టారు. కాబట్టి, సక్తుప్రస్థుడి దానం గొప్పది.

ధర్మరాజు తనకు లేకుండా సంపూర్తిగా తనకు ఉన్నవన్నీ దానం చేయలేదు. దానం చేశాక కూడా ధర్మరాజు వద్ద ఎంతో సంపద ఉంది. అదీగాక ధర్మరాజు అశ్వమేధ యాగంలో అశ్వాన్ని చంపి, పశుహింస చేశాడు. కాబట్టి సక్తుప్రస్థుని అన్నదానం, ధర్మరాజు దానం కంటె గొప్పది.

ఆ) ఈ కథ ఆధారంగా మానవులందరూ అలవరచుకోవలసిన మంచి గుణాలు ఏమిటి?
(లేదా)
సక్తుప్రస్తుని కథ ద్వారా మనం ఏమి గ్రహించాలి?
(లేదా)
“అతిథి మర్యాద” కథ ఆధారంగా మానవులందరూ అలవరచుకోవలసిన మంచి గుణాలను తెల్పండి.
జవాబు:

  1. తమ పొట్ట పోషించుకోవడం కోసం ఆహారం సంపాదించడం కోసం, ఏ పాపానికి ఒడిగట్టరాదు.
  2. వచ్చిన అతిథిని ఆదరంగా తీసికొని వచ్చి ఆదరించాలి.
  3. అతిథిని యోగక్షేమాలు అడిగి తెలిసికోవాలి.
  4. అతిథిని ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాలి.
  5. అతిథి. ఆకలి బాధను తీర్చాలి.
  6. ఆకలితో బాధపడే ప్రాణికి అన్నం పెట్టడం కంటె మించిన దానము లేదని మానవులు గ్రహించాలి.
  7. అన్నం కోసం దారుణాలు చేయరాదు.
  8. తమకు ఉన్నంతలో ఇతరులకు అవసరమయితే ‘దానం చేయాలి.

IV. పదజాలం

1) కింది ఆధారాలకు తగిన పదాలు రాయండి.
ఉదా : ఇతరులకు ఉచితంగా అన్నం పెడితే అది అన్నదానం.

అ) ఉచితంగా చదువు చెబితే…………
జవాబు:
అది విద్యాదానం.

ఆ) అవసరమున్నవాళ్ళకు దుస్తులు ఇస్తే ………………
జవాబు:
అది వస్త్రదానం

ఇ) అవసరానికి రక్తాన్ని ఇస్తే ………….
జవాబు:
అది రక్తదానం

ఈ) శరీర అవయవాలను ఇతరులకు ఇస్తే ……………
జవాబు:
అది అవయవదానం

ఉ) లేని వాళ్ళకు భూమిని ఇస్తే ……………
జవాబు:
అది భూదానం

ఊ) చూపులేని వాళ్ళకు కళ్ళను ఇస్తే …………
జవాబు:
అది నేత్రదానం

ఎ) ఇతరుల మేలు కోసం స్వచ్ఛందంగా శ్రమిస్తే ………….
జవాబు:
అది శ్రమదానం

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

2) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.

అ) పుణ్యకాలం = పుణ్యాన్ని కలిగించే సమయం
సొంతవాక్యం : సూర్యగ్రహణం పట్టిన పుణ్యకాలంలో నదీస్నానం చేసి దానాలు చేయాలి.

ఆ) మనసు వికలం = మనసు పాడవడం.
సొంతవాక్యం : నా స్నేహితుడికి వచ్చిన కష్టాన్ని చూసి, నా మనసు వికలం అయింది.

ఇ) ప్రాయశ్చిత్తం’ = పాపం పోవడానికి చేసే పని
సొంతవాక్యం : పిల్లిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు.

ఈ) నిర్విరామం = విశ్రాంతి లేకుండా, అంతులేకుండా.
సొంతవాక్యం : నా మిత్రుడు తన కుటుంబ పోషణకై నిర్విరామంగా పనిచేస్తాడు.

ఉ) ధర్మబుద్ధి = ధర్మముతో కూడిన బుద్ధి
సొంతవాక్యం : మా అన్నదమ్ములు అందరమూ ధర్మబుద్ధితో నడుచుకుంటాము.

ఊ) ఒడికట్టడం = అన్నింటికీ సిద్ధపడడం
సొంతవాక్యం : ధన సంపాదన కోసం పాపకార్యాలు చేయడానికి ఒడికట్టడం మంచిదికాదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

3) కింది పదాలకు వ్యతిరేకపదాలను పాఠంలో గుర్తించండి. ఆ పదాలతో వాక్యాలు రాయండి.
అ) అసంతృప్తి × సంతృప్తి
మనం ఉన్నదానితో సంతృప్తి పడాలి.

ఆ) విరామం × నిర్విరామం
మనం నిర్విరామంగా శ్రమిస్తే ఆరోగ్యం చెడుతుంది.

ఇ) అధర్మం × ధర్మం
ధర్మమును మనం రక్షిస్తే, ధర్మం తిరిగి మనలను రక్షిస్తుంది.

ఈ) అనాదరణ × ఆదరణ
ప్రభుత్వము పేదలపట్ల ఆదరణ చూపాలి.

ఉ) పుణ్యాత్ములు × పాపాత్ములు
పాపాత్ములు ఈ లోకంలో ఎక్కువయ్యారు.

ఊ) పాపము × పుణ్యము
ధర్మకార్యాలు చేసి పుణ్యము సంపాదించుకోవాలి.

ఋ) ధర్మము × అధర్మము
ఎవ్వరూ అధర్మమునకు సిద్ధపడరాదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

4) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

1) పండుగకు మా ఇంటికి ఆప్తులు అంతా వచ్చారు. నం ఉన్నదానం నిర్విస్తే ఆరోగ్యం (హితులు)

2) గురువుగారు మా ఆతిథ్యం స్వీకరించారు. (అతిథి సత్కారం)

3) సినిమా ‘టిక్కట్లు అయిపోతాయనే ఆతురతతో పరిగెత్తాము. (తొందర)

4) తొంభై సంవత్సరాల వయస్సులో మా మామ్మ కన్ను మూసింది. (మరణించింది)

5) మీరు సెలవుల్లో ఏయే సినిమాలు తిలకించారు? (చూచారు)

6) మా నాన్నగారు అతిథి సత్కారం బాగా చేస్తారు (సన్మానం)

7) కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరో వీరులు మరణించారు. (యుద్ధం)

8) ప్రజలు ఆకలితో దొంగ పనులకు ఒడిగడుతున్నారు. (అన్నింటికీ సిద్ధమగు)

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

5) పాఠంలోని ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

పక్షి – పక్కి
కృష్ణుడు – కన్నయ్య
శయ్య – సెజ్జ
పుణ్యము – పున్నెము
మణి – మిన్న
రత్నము – రతనము
శాల – సాల
కథ – కత
కుమారుడు – కొమరుడు
వృద్ధుడు – పెద్ద
ఆహారము – ఓగిరము

6) ముఖ్యమైన సంధులు

పట్టాభిషేకం = పట్ట + అభిషేకం – సవర్ణదీర్ఘ సంధి
ఆదేశానుసారం = ఆదేశ + అనుసారం – సవర్ణదీర్ఘ సంధి
సావధానంగా = స + అవధానంగా – సవర్ణదీర్ఘ సంధి
పరమేశ్వర ధ్యానం = పరమ + ఈశ్వర ధ్యానం – గుణసంధి
ధాన్యపు గింజలు = ధాన్యము + గింజలు – పుంప్వాదేశ సంధి
పుణ్యాత్ములు = పుణ్య + ఆత్ములు – సవర్ణదీర్ఘ సంధి

7) సమాసములు – విగ్రహవాక్యాలు

సమాసములు విగ్రహవాక్యాలు సమాసం పేరు
దానధర్మాలు దానమును, ధర్మమును ద్వంద్వ సమాసము
కామక్రోధాలు కామమును, క్రోధమును ద్వంద్వ సమాసము
యాగశాల యాగము కొఱకు శాల చతుర్డీ తత్పురుష సమాసము
ఆకలి బాధ ఆకలి వలన బాధ పంచమీ తత్పురుష సమాసము
పద్దెనిమిది అక్షౌహిణులు పద్దెనిమిది (18) సంఖ్య గల అక్షౌహిణులు ద్విగు సమాసము
పరమేశ్వర ధ్యానము పరమేశ్వరుని యొక్క ధ్యానము షష్ఠీ తత్పురుష సమాసము
పుణ్యాత్ములు పుణ్యమైన ఆత్మ కలవారు బహుజొహి సమాసము
దివ్యలోకాలు దివ్యమైన లోకాలు విశేషణ పూర్వపద కర్మధారయము
పూలవాన పూలతో వాన తృతీయా తత్పురుష సమాసము

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

8) సమానార్థక పదములు

1) సేన : సైన్యము, దండు, బలము, వాహిని.
2) సంగ్రామం : యుద్ధము, పోరు, సమరము, రణము, కలహము.
3) మనస్సు : మనము, చిత్తము.
4) వాన : వర్షము, వృష్టి, జడి.
5) యజ్ఞము : యాగము, క్రతువు, మఖము.
6) భూమి : జగతి, ధరిత్రి, ధరణి, ఉర్వి.
7) పాదము : అడుగు, అంఘి, చరణము.
8) ఆనందము : ముదము, హర్షము, ప్రమోదము.

9) సొంతవాక్యాలు

1) దానధర్మాలు : ప్రతివ్యక్తి సంపాదించిన దానిలో కొంత దానధర్మాలు చేయాలి.
2) పట్టాభిషేకం : దశరథుడు శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని తలపెట్టాడు.
3) కామక్రోధాలు : సన్యాసులు తప్పక కామక్రోధాలు విడిచి పెట్టాలి.

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
“అతిథి దేవోభవ” అనే శీర్షికతో చిన్న కథ రాయండి.
జవాబు:
‘రంతి దేవుడు’ అనే రాజు చాలా యజ్ఞాలు, దానాలు చేశాడు.. చివరకు ఆయనకు తినడానికి తిండి కూడా లేకపోయింది. అయనకు కొంచెము అన్నము దొరికింది. దానిని ఆయన తినబోతుండగా ఒక అతిథి వచ్చి అన్నము పెట్టమన్నాడు.

రంతి దేవుడు తనకు గల దానిలో సగము అతిథికి పెట్టాడు. ఆ అతిథి తరువాత ఒక శూద్రుడు, చండాలుడు కూడా వచ్చారు. ఆ తరువాత ఒక కుక్క వచ్చింది. రంతి దేవుడు తనవద్ద మిగిలిన అన్నాన్ని వారందరికీ పూర్తిగా పెట్టాడు.

తరువాత బ్రహ్మ మొదలయిన దేవతలు వచ్చి, తామే అతిథులుగా వచ్చామని రంతి దేవుడికి చెప్పారు. వారు .. రంతి దేవుని అతిథి సత్కారానికి మెచ్చి ఆయనకు వరాలు ఇచ్చారు.

(లేదా )

ప్రశ్న 2.
అతిథి మర్యాద కథను సంభాషణల రూపంలో రాసి ప్రదర్శించండి.
జవాబు:
సక్తుప్రస్థుడు : మనకు దొరికిన ఆహారాన్ని మన కుటుంబం అంతా సమంగా పంచుకున్నాము. తిందాం రండి.

వృద్ధుడైన అతిథి : అయ్యా ! ఆకలి, ఆకలి, నీరసంగా ఉంది. ఏదైనా ఉంటే పెట్టండి.

సక్తుప్రస్థుడు : బాబూ ! లోపలకు రా. కూర్చో

అతిథి : అయ్యా ! ఆకలిగా ఉంది. తొందరగా పెట్టండి.

సక్తుప్రస్థుడు : మా ఆతిథ్యం స్వీకరించండి. .ఇది మేము తెచ్చుకున్న ధాన్యం గింజల పిండితో వండిన పదార్థం. దీన్ని తినండి.

అతిథి : అయ్యా ! మీరు పెట్టినది మంచి రుచిగా ఉంది. ఇంకా ఆకలిగా ఉంది.

సక్తుప్రస్థుని కుటుంబంవారు : అయ్యా ! మా దగ్గర ఉన్న ఆహారం కూడా తినండి.

అతిథి : నాయనా ! మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తిని కల్గించాయి. మీరు ఆకలిగా ఉన్నా, మీకు ఉన్నదంతా నాకు పెట్టారు.

సక్తుప్రస్థుడు : మీకు కడుపు నిండింది మాకు అదే సంతోషం.

అతిథి : మీరు దయగలవారు. మీకు దివ్యలోకాలు వస్తాయి.

VI. ప్రశంస

1) “ఆకలిగా ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడం, అవసరానికి సహాయం చేయడం వంటివి మంచి లక్షణాలు.” మీ తరగతిలో ఇలాంటి మంచి లక్షణాలు గలవాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళను అభినందించండి.
జవాబు:
ఆకలిగా ఉన్న వాళ్ళకు అన్నం పెట్టే అలవాటు, అవసరంలో ఉన్నవారికి సాయం చేసే అలవాటు మా తరగతిలో గోపాల కు, రాజుకు, సుమిత్రకు ఉంది. వారికి ఉన్నవన్నీ మంచి లక్షణాలే.

ఒకరోజున రాజు, గోపాల్ లు ఇద్దరూ మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో తాము తెచ్చుకున్న కేరియర్స్ తెరిచి అన్నం తినడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో మా తరగతి అబ్బాయి దాసు నీరసంగా వారి పక్కనుండి వెడుతున్నాడు. దాసు బీదవాడు. రాజు, గోపాల్ లు ఇద్దరూ దాసును పిలిచి తమతోపాటు దాసుకు భోజనం వడ్డించారు. దాసు వారికి కృతజ్ఞత చెప్పాడు.

అలాగే సుమిత్ర, తన తరగతి బాలిక రాధ పరీక్షఫీజు కట్టలేక పోయిందని తెలిసి తన పర్సులోని డబ్బుతీసి . రాధ పరీక్షఫీజు తాను కట్టింది. రాజు, గోపాల్, సుమిత్ర మంచి లక్షణాలు కలవారు.

అభినందనలు :
రాజూ ! గోపాల్ ! మిత్రులారా ! తోటి పిల్లవాని ముఖం చూసి, అతడు అన్నం తెచ్చుకోలేదని మీరు గ్రహించి అతడికి మీరు అన్నదానం చేశారు. మీ పరోపకార బుద్ధికి, దయ ధర్మగుణానికి నా అభినందనలు. సుమిత్రా ! నీవు రాధకు పరీక్ష ఫీజు కట్టి, రాధ చదువు కొనసాగించడానికి సాయపడ్డావు. నీ పరోపకారబుద్ధికి, దాతృత్వానికీ. నా అభినందనలు.

VII. ప్రాజెక్టు పని

1) మర్యాద చేయడం, ఆతిథ్యం ఇవ్వడం ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబంలో, ఒక్కో రకంగా ఉంటుంది. వీటిని గురించి మీ మిత్రులతో మాట్లాడి వివరాలు సేకరించండి. ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థికృత్యం.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) ఈ కింది పదాలు కలిపి రాయండి.
ఉదా : వెయ్యి + అమ్మా = (ఇ + అ = అ) = వెయ్యమ్మా

1. చిర్రు + ఎత్తు = (ఉ + ఎ = ఎ) = చిఱ్ఱెత్తు
2. అప్పటికి + ఏ = (ఇ + ఏ = ఏ) = అప్పటికే
3. రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = రాకుంటే

గమనిక :
పై మూడు పదాల్లో పూర్వ స్వరం (మొదటి అచ్చు) స్థానంలో వరసగా ఉ, ఇ, అ లు ఉన్నాయి. వాటికి ఎ, ఏ, ఉ అనే అచ్చులు కలిశాయి. (పరం అయినాయి) ఏ అచ్చులు కలిశాయో అదే రూపం పూర్వ స్వరాలకు వచ్చింది. అంటే పూర్వ పరస్వరాలు మిగులుతాయి. తెలుగు సంధుల్లో ఈ మార్పు మనం గమనిస్తాం.

ఇక్కడ పూర్వ స్వరాన్ని (మొదటి పదం చివరి అచ్చుని) ఆధారంగా చేసుకొని, సంధి నిర్ణయం జరుగుతుంది.
ఆ ప్రకారంగా 1) ఉత్వ 2) ఇత్వ 3) అత్వ సంధులు, ఏర్పడే మీరు 6వ తరగతిలో తెలుసుకున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

ఆ) ఈ కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సంధి జరిగిన విధాన్ని చర్చించండి.
ఉదా : ఏమిటా కథ = ఏమిటి + ఆ కథ – (ఇ + ఆ = ఆ) = ఇత్వసంధి

1. జీవగడ్డయి = జీవగడ్డ + అయి = (అ + అ = అ) = అత్వసంధి
2. భాగ్యసీమయి = భాగ్యసీమ + అయి = (అ + అ = అ) – అత్వసంధి
3. చేసుకోవాలని = చేసుకోవాలి + అని = (ఇ + అ = అ) = ఇత్వసంధి
4. సెలవిచ్చి = సెలవు + ఇచ్చి = (ఉ + ఇ = ఇ) = ఉత్వసంధి
5. రానిదని = రానిది + అని = (ఇ + అ = అ) = ఇత్వసంధి
6. ఎవరికెంత = ఎవరికి + ఎంత = (ఇ + ఎ = ఎ) = ఇత్వసంధి
7. వచ్చిందిప్పుడు = వచ్చింది + ఇప్పుడు = (ఇ + ఇ = ఇ) = ఇత్వసంధి
8. కవితలల్లిన = కవితలు + అల్లిన = (ఉ + అ = అ) = ఉత్వసంధి

ఇ) ఇటువంటి పదాలను మొదటి రెండు పాఠాల నుండి తీసుకొని, వాటిని విడదీసి, లక్షణాలను చర్చించండి.

1. “శ్రీలు పొంగిన జీవగడ్డ” పాఠం నుండి

1. వెలిసె నిచ్చట = వెలిసెను + ఇచ్చట = (ఉ + ఇ = ఇ) – ఉత్వసంధి
2. విమల తలమిదె = విమల తలము + ఇదె = (ఉ + ఇ = ఇ) – ఉత్వసంధి
3. రాగమెత్తీ = రాగము + ఎత్త = (ఉ + ఎ = ఎ) = ఉత్వసంధి
4. నాట్యమాడగ = నాట్యము + ఆడగ = (ఉ + ఆ = ఆ) – ఉత్వసంధి
5. దేశమరసిన = దేశము + అరసిన = (ఉ + అ = అ) – ఉత్వసంధి
6. లోకమంతకు = లోకము + అంతకు = (ఉ + అ = అ) – ఉత్వసంధి

2. “అతిథి మర్యాద” పాఠం నుండి

1. క్షేత్రమైన = క్షేత్రము + ఐన = (ఉ + ఐ = ఐ) – ఉత్వసంధి
2. మరణించారనే = మరణించారు + అనే = (ఉ + అ = అ) – ఉత్వసంధి
3. వారందరికీ = వారు + అందరికీ = (ఉ + అ = అ) – ఉత్వసంధి
4. మీ వాళ్ళంతా = మీ వాళ్ళు + అంతా = (ఉ + అ = అ) – ఉత్వసంధి
5. తనకింకా = తనకు + ఇంకా = (ఉ + ఇ = ఇ) – ఉత్వసంధి
6. కాంతు లీనుతోంది = కాంతులు + ఈనుతోంది = (ఉ + ఈ = ఈ) = ఉత్వసంధి
7. కుమారుడుండేవాడు = కుమారుడు + ఉండేవాడు = (ఉ + ఉ = ఉ) = ఉత్వసంధి
8. లక్షలాది . = లక్షలు + ఆది = (ఉ + ఆ = ఆ) – ఉత్వసంధి
9. బంగారు మయమయింది = బంగారుమయము + అయింది = (ఉ + అ = అ) = ఉత్వసంధి
10. యోగ్యులైన = యోగ్యులు + ఐన = = ఐ) = ఉత్వసంధి
11. పాపానికైనా = పాపానికి + ఐనా = (ఇ + ఇ = ఐ) = ఇత్వసంధి
12. సక్తుప్రస్తుడనే = సక్తుప్రస్తుడు + అనే = (ఉ + అ = అ) – ఉత్వసంధి
13. వారందరూ = వారు + అందరూ = (ఉ + అ = అ) – ఉత్వసంధి

విభక్తులు – ఉపవిభక్తులు

1. కింది వాక్యాలలోని విభక్తి ప్రత్యయాలను గుర్తించి, అవి ఏ విభక్తులో రాయండి.
ఉదా : సమావేశంలో చదివిన విషయం బాగుంది – లో – షష్ఠీ విభక్తి

విభక్తి ప్రత్యయం ఏ విభక్తి ప్రత్యయం?
అ) గాలికి రెపరెపలాడుతున్నది కి షష్ఠీ విభక్తి
ఆ) రహస్యాలను అన్వేషించండి ను ద్వితీయా విభక్తి
ఇ) జంతువులు మనకంటె ముందున్నాయి కంటె పంచమీ విభక్తి లు
లు ప్రథమా విభక్తి
ఈ) జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం చేత తృతీయా విభక్తి
ఉ) బాధవలన దుఃఖం వస్తుంది వలన పంచమీ విభక్తి
ఊ) ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు బట్టి పంచమీ విభక్తి
ను ద్వితీయా విభక్తి
ఎ) రాముడు, ధేనువు పాలు పిండుతున్నాడు డు ప్రథమా విభక్తి
వు ప్రథమా విభక్తి
విభక్తి ప్రత్యయాలు విభక్తులు
అ) డు, ము, వు, లు ప్రథమా విభక్తి
ఆ) ని (న్), ను (న్), ల(న్), ‘కూర్చి, గుఱించి’ ద్వితీయా విభక్తి
ఇ) చేత (న్), చే (న్), తోడ (న్), తో (న్) తృతీయా విభక్తి
ఈ) కొఱకు (న్), కై చతుర్టీ విభక్తి
ఉ) వలన (న్), కంటె (న్), పట్టి పంచమీ విభక్తి
ఊ) కి (న్), కు(న్), యొక్క లో(న్),. లోపల(న్) షష్ఠీ విభక్తి
ఎ) అందు (న్), న(న్) సప్తమీ విభక్తి
ఏ) ఓ ! ఓరి ! ఓయీ ! ఓసీ! సంబోధన ప్రథమా విభక్తి

2. కింది ఖాళీలను సరైన ప్రత్యయాలతో పూరించండి. విభక్తులను బ్రాకెట్లలో రాయండి.
ఉదా : ప్రహ్లాదుడు, విష్ణువును గురించి తపస్సు చేశాడు. (ద్వితీయ)

అ) తేట తెలుగు మాటలతో పాటలు రాశాడు. (తృతీయ)
ఆ) దేశమును కాపాడిన వీరులు. (ద్వితీయ)
ఇ) దేశాన్ని గురించి కీర్తించారు కవులు. . (ద్వితీయ)

3. కింద గీత గీసిన పదాలను గమనించండి. వాటి నామవాచకం అసలు రూపాన్ని గుర్తించి రాయండి.
ఉదా : కంటిలోని నలుసు చూడు. (కన్ను)
1) ఇంటికి వెలుగు ఇల్లాలు. (ఇల్లు)
2) ఏటిలోని చేపపిల్ల (ఏరు)
3) ఊరి కట్టుబాట్లు. (ఊరు)
4) కాలికి బుద్ధి చెప్పారు. (కాలు)

గమనిక : పై వాక్యాల్లోని నామవాచకాల్లో వచ్చిన మార్పులు గమనించారు కదా ! నామవాచకాలు వాక్యాలలో ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాటి స్వరూపం’ మారుతున్నది. (కన్ను – కంటిగా, ఇల్లు – ఇంటిగా, ఏరు – ఏజుగా, ఊరు – ఊరిగా, కాలు – కాలిగా, మారాయి.) అలా మారేటప్పుడు నామవాచకం చివరి అక్షరం మీద ‘ఇ’ గాని, ‘టి’ గాని, ‘తి’ గాని, చేరుతున్నాయి. వీటిని ‘ఉపవిభక్తులు’ అంటారు.

ఔపవిభక్తములు : ఉపవిభక్తులు కలిగిన నామవాచకాలను “ఔపవిభక్తులు” అంటారు.

4. కింది నామవాచకాలకు ఇచ్చిన ఉపవిభక్తులు చేర్చి, ఔపవిభక్తులుగా మార్చి వాక్యాలు రాయండి.
ఉదా : చేయి + తి = చేతి; అతనికి చేతినిండా పని ఉంది.
అ) గోరు + టి = గోటి; శివుడు బ్రహ్మ ఐదవతలను గోటితో గిల్లాడు.
ఆ) రోలు + టి = రోటి; రోటిలో తలదూర్చి రోకటి పోటుకు భయపడరాదు.

రచయిత పరిచయం

రచయిత : ఉషశ్రీ (పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు)
జననం : మార్చి 16, 1928 (16.03. 1928)
మరణం : సెప్టెంబరు 07, 1990 (07.09. 1990)
జన్మస్థలం : కాకరపర్రు, పశ్చిమగోదావరి జిల్లా.
రచనలు : రామాయణ, భారత, భాగవతాలను వచనంలో రాశారు. ప్రవచనం చేశారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

కొత్త పదాలు – అర్థాలు

అతిరథులు = అనేక మందితో ఒంటరిగా యుద్ధం చేయగల యోధులు (వీరు అర్థరథుడు, సమరథుడు, మహారథుల కన్న గొప్పవారు)
అక్షౌహిణి = 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,160 గుర్రములు, 1,09,350 సైనికులు ఉన్న సైన్య విభాగము.
అశ్వత్థామ = కృపా, ద్రోణాచార్యుల పుత్రుడు
అంపశయ్య = బాణాలతో తయారుచేసిన పడక
అనంతరం = తరువాత
అశ్వమేధం = ఇది ఒక రకం యాగం. గుజ్రాన్ని యజ్ఞ పశువుగా చేసి, చేసే యజ్ఞం.
అభినందించు = పొగడు, మెచ్చుకొను
అనుగ్రహించు = దయతో ఇచ్చు
ఆప్తులు = బంధువులు, హితులు
ఆత్మీయులు = తనకు కావలసినవారు
ఆదేశానుసారం = ‘ఆజ్ఞకు తగిన విధంగా
ఆతురత = తొందర
ఆతిథ్యం = అతిథి సత్కారము
ఆరగించు = తిను
ఈను = బయలుపఱచు, వెదజల్లు
ఉత్తరాయణము = సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దగ్గర నుండి ఆరు నెలల సమయం, సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణించే కాలం (సంక్రాంతి పండుగ నుండి ఆరు నెలల కాలం)
ఒడిగట్టు = అన్నిటికీ సిద్ధమగు, పూనుకొను
కన్ను మూయు = మరణించు
కురుక్షేత్రం = కౌరవ పాండవులు యుద్ధం చేసిన పుణ్యభూమి
కృతవర్మ = భోజ చక్రవర్తి ఇతడు దుర్యోధనుని మిత్రుడు
కృపాచార్యులు = కౌరవ పాండవులకు మొదటి అస్త్ర విద్యా గురువు
కృష్ణుడు = దేవకీవసుదేవుల పుత్రుడు
కుశలము = క్షేమము
జనపదాలు = గ్రామాలు
డొక్కలు = కడుపులు
తిలకించు = చూచు

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

ధర్మ క్షేత్రము = ధర్మ భూమి
దారుణాలు = భయంకరములు
దివ్య లోకాలు = స్వర్గము మొదలయిన పుణ్య లోకాలు
దేవ విమానాలు = దేవతలు విహరించే విమానాలు
నిర్విరామంగా = ఆపులేకుండా
నివారించు = అడ్డగించు
పద్దెనిమిది = పదునెనిమిది (18) (కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు, పాండవ సైన్యం 7 అక్షౌహిణులు)
ప్రాయశ్చిత్తం = పాపం పోవడానికి చేసే కర్మ
పట్టాభిషేకము = కొత్తగా రాజు అయిన వాడిని, సింహాసనముపై ఉంచి, నుదుట పట్టము కట్టి, పుణ్య జలాలతో అభిషేకము చేయడం
పాండవులు = పాండురాజు పుత్రులు ఐదుగురు (ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులు)
పరబ్రహ్మ = పరమాత్మ
భీష్మపితామహుడు = తాత అయిన భీష్ముడు
మహనీయుడు = గొప్పవాడు
మహారథులు = 10 వేల మంది విలుకాండ్రతో ఒంటరిగా పోరాడగల శస్త్రాస్త్ర విశారదులైన వీరులు
యాగం = యజ్ఞము
యాగశాల = యజ్ఞము చేసే శాల (ప్రదేశం)
వికలం = చెదరుట (పాడగుట)
విద్యాంసులు = పండితులు
వృద్ధులు = పెద్దలు
వస్త్రదానం = బట్టలు దానం ఇవ్వడం
సత్కారం = సన్మానం
సంగ్రామం = యుద్ధం
సాత్యకి = ఒక యాదవ వీరుడు. అర్జునుని శిష్యుడు
సువర్ణం = బంగారం
సర్వ భూతకోటి = అందరు ప్రాణులు
సావధానంగా = ఏకాగ్రతతో

Leave a Comment