AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

SCERT AP 7th Class Social Study Material Pdf 5th Lesson కాకతీయ రాజ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 5th Lesson కాకతీయ రాజ్యం

7th Class Social 5th Lesson కాకతీయ రాజ్యం Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం 1
ప్రశ్న 1.
ఇవ్వబడిన పటములో ఏఏ రాజ వంశాలను మీరు గమనించారు?
జవాబు:
ఢిల్లీ సుల్తానులు, రాజపుత్ర రాజ్యాలు, తూర్పుగాంగులు, కాకతీయ రాజ్యం, హోయసాలులు, పాండ్యులు.

ప్రశ్న 2.
ఇచ్చిన పటము ఆధారంగా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ రాజవంశము పాలించినదో చెప్పండి.
జవాబు:
ఆంధ్ర ప్రాంతాన్ని పాలించినది కాకతీయులు.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

ప్రశ్న 3.
ఇవ్వబడిన పటములోని దక్షిణ భారతదేశ రాజవంశముల పేర్లు తెలుపుము.
జవాబు:
కాకతీయులు, హోయసాలులు, పాండ్యులు దక్షిణ భారతదేశ రాజవంశములు.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.

ప్రశ్న 1.
కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఏ విధముగా ఆవిర్భవించారు?
జవాబు:
కాకతీయులు మొదట్లో రాష్ట్ర కూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. పశ్చిమ చాళుక్యుల పతన అనంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. నేటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు తూర్పు కర్ణాటక మరియు దక్షిణ ఒడిశాలోని కొన్ని భాగాలతో కూడిన తూర్పు దక్కన్ ప్రాంతాన్ని వారు పరిపాలించారు.

ప్రశ్న 2.
కాకతీయుల పరిపాలనా విధానాన్ని గురించి వ్రాయండి.
జవాబు:
కాకతీయుల పాలన :
రాజ్యపాలన సైనిక ప్రాతిపదికగా నిర్వహించబడింది. కాకతీయులు సార్వభౌమాధికారం కలిగి తమ రాజ్య భూభాగాలను చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులను వాటికి పరిపాలకులుగా నియమించారు.

నాయంకరుల వ్యవస్థ :
కాకతీయులకు సామంతులుగా పనిచేసిన నాయంకరులు వారి హోదా నిలబెట్టుకోవటానికి కాకతీయ చక్రవర్తుల నుండి భూములు పొందేవారు. నాయంకరులు తమ ఆధ్వర్యంలో చక్రవర్తి సేవల కోసం నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించవలసి వుంటుంది. వీరికి పన్ను వసూలు చేసుకొనేందుకు కొన్ని గ్రామాలు ఇవ్వబడినప్పటికి వారికి ఈ గ్రామాలను శాశ్వతంగా ఉంచలేదు. చక్రవర్తి తన’ అధికారముతో వారిని కొత్త ప్రదేశానికి బదిలీ చేయవచ్చు. ఈ నాయంకరులు చక్రవర్తిపై ఆధారపడటముతో పాటుగా వారికి విధేయులుగా ఉండేవారు. వీరి రాజ్యములో ఏదైనా తిరుగుబాటు జరిగిన సమయములో వాటిని అణచుటకు చక్రవర్తికి సహాయము అందించుటకు సిద్ధంగా వుండేవారు. ప్రతాప రుద్రుని పాలన నాటికి దాదాపు 72 నాయంకరులు వుండేవారు.

గ్రామ పరిపాలన :
గ్రామ పరిపాలనా విభాగాలను స్థల మరియు నాడు అనే రెండు ప్రధాన తరగతులుగా విభజించారు. పూర్వం పది నుండి అరవై వరకు గ్రామాల సమూహాన్ని స్లల అంటారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని నాడు అంటారు. ఆయగార్లు అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాల పాలనను పర్యవేక్షించేవారు. గ్రామము ప్రాథమిక పరిపాలనా విభాగము.

ప్రశ్న 3.
నాయంకరులు ఎవరు? వారు ఎందుకొరకు నియమించబడినారు?
జవాబు:
కాకతీయులు సార్వభౌమాధికారం కలిగి తమ రాజ్య భూభాగాలను చిన్న విభాగాలుగా విభజించి ‘నాయంకరులు’ అనే సైనిక నాయకులను వాటికి పరిపాలకులుగా నియమించారు. నాయంకరులు తమ ఆధ్వర్యంలో చక్రవర్తి సేవల కోసం నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించేవారు. వీరికి పన్ను వసూలు చేసుకొనేందుకు కొన్ని గ్రామాలు ఇవ్వబడినప్పటికీ వారికి ఈ గ్రామాలను శాశ్వతంగా ఉంచలేదు. వీరు రాజ్యములో ఏదైనా తిరుగుబాటు జరిగితే వాటిని అణుచుటకు చక్రవర్తికి సహాయము అందించుటకు సిద్ధంగా వుండేవారు.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

ప్రశ్న 4.
కాకతీయుల శిల్పకళా వైభవము ఆనాటి నిర్మాణ శైలిని గురించి వర్ణించండి.
జవాబు:
కళలు మరియు నిర్మాణాలు : వెయ్యి స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయాలు కాకతీయుల కాలం నాటి అద్భుతమైన నిర్మాణాలు. వెయ్యిస్తంభాల ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అంటారు. ఇది హనుమకొండలో ఉంది. దీనిని రుద్రదేవుడు నిర్మించాడు. ఈ ఆలయం చక్కటి వాస్తుశిల్పం మరియు శిల్పకళలతో నిర్మించబడింది. రాతితో మలచిన ఏనుగులు మరియు డోలరైట్ శిలతో నిర్మించిన ఏకశిలా నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయాన్ని స్థానికంగా “వేయి స్తంభాల గుడి” అని పిలుస్తారు.

వరంగల్ ప్రాంతంలోని పాలంపేట గ్రామానికి సమీపంలో ఉన్న రామప్ప ఆలయం చాలా ప్రసిద్ది చెందింది. ఇక్కడి దైవము రామలింగేశ్వరస్వామి. రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇతడు గణపతి దేవుని ముఖ్య సైనిక అధికారులలో ఒకడు. ఈ ఆలయంలో విష్ణువు మరియు శివులను ఒకే చోట ఆరాధించడం వలన ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కాకతీయ కళ యొక్క వైభవాన్ని చూడవచ్చు. రామప్ప ఆలయాన్ని ఇటుకలతో నిర్మించారు. ఇది నక్షత్ర ఆకారపు వేదికపై నిర్మించబడింది. ఈ ఆలయ విగ్రహాలు నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడ్డాయి. వాటిపై పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తకీమణుల శిల్పాలు, ఇతిహాస కథలు మొదలైనవి చెక్కబడ్డాయి. వీటిలో యక్షిణి, నాగిని, శిల్పాలు చాలా ఆకర్షణీయమైనవి. ఇక్కడి నంది విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయంలోని కొన్ని శిల్పాలు సప్తస్వరాలను ధ్వనింపచేస్తాయి. జాయప రాసిన నృత్య రత్నావళి ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది.

కాకతీయ ఆలయ నిర్మాణ శైలిలోని ఈ నల్ల పాలరాతి శిల్పాలు అద్భుతంగా ఉండి మృదువైన వంపులతో చూపరులను ఆకట్టుకుంయి. స్తంభాలపైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణము, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు. ఈ శైలిని త్రికూట పద్ధతి అని కూడా అంటారు.

ప్రశ్న 5.
పాఠం నందలి ప్రారంభ పేరాగ్రాఫ్ (మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో…………….వాస్తు శిల్పాలను ప్రోత్సహించారు) చదివి వ్యాఖ్యానించుము.
జవాబు:
మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఐదు ముఖ్యమైన రాజ్యాలు’ ఆవిర్భవించాయి. అవి కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసల మరియు పాండ్యరాజ్యాలు. ఈ ఐదు రాజ్యాలలో కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు. ఈ రాజ్యాలు సాధారణంగా పొరుగురాజ్యాల నుండి మరియు ఢిల్లీ సుల్తాన్ల నుండి దండయాత్రలను ఎదుర్కొన్నప్పటికీ, ఎవరకి వారే తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. తమ అధీనములోని ప్రాంతంలో ఐక్యతను పెంపొందించడానికి ప్రయత్నించారు. స్థానిక భాషలు, కళలు మరియు వాస్తు శిల్పాలను ప్రోత్సహించారు.

ప్రశ్న 6.
క్రింది కాకతీయ పాలకులను చారిత్రకంగా పాలనా కాలమును అనుసరించి వరుసలో అమర్చండి.
(రుద్రమదేవి, గణపతి దేవుడు, రెండవ ప్రోలరాజు, మహాదేవుడు, రుద్రదేవుడు)
జవాబు:

  1. రెండవ ప్రోలరాజు,
  2. రుద్రదేవుడు,
  3. మహాదేవుడు,
  4. గణపతిదేవుడు,
  5. రుద్రమదేవి.

ప్రశ్న 7.
రుద్రమదేవి పాలనా కాలములో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ యాత్రికుడు ఎవరు? అతడు ఏ దేశం నుండి వచ్చినాడు?
జవాబు:

  1. రుద్రమదేవి పాలనా కాలములో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ ‘మార్కోపోలో’.
  2. ఇతను ఇటలీ దేశం నుంచి వచ్చినాడు.
  3. రుద్రమదేవి పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించినాడు.

ప్రశ్న 8.
కాకతీయుల కాలములోని ప్రజల సామాజిక, ఆర్థిక జీవనము గూర్చి సంక్షిప్తంగా వ్రాయండి.
జవాబు:
ఆర్థిక మరియు సామాజిక జీవితం :
భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి క్రింద ఉంచబడింది. దీనిని “రాచపొలం” అని పిలిచారు. ఈ భూమిని రైతులకు కౌలు సాగు కోసం ఇచ్చారు. ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులు అర్ధశిరి అని పిలవబడ్డారు. భూమికి సంబంధించిన సర్వే రికార్డులను అధికారులు చాలా జాగ్రత్తగా భద్రపరిచేవారు.

కాకతీయులు అధిక విస్తీర్ణములో అటవీ భూములను సాగులోకి తెచ్చినారు. వీరు వ్యవసాయం కోసం జలాశయాలను నిర్మించారు మరియు అనేక చెరువులను త్రవ్వించారు. వాటిలో కొన్ని ఈ రోజు వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదా: పాకాల, లక్కవరం, ఘనాపురం చెరువులు మొదలైనవి. ఈ కాలంలో వివిధ రకాల పన్నులు విధించబడ్డాయి. అవి ప్రధానంగా వాణిజ్య పన్ను, ఇల్లరి అని పిలువబడే గృహ పన్ను, అటవీ ఉత్పత్తులపై పుల్లరి మరియు గొర్రెల మందపై విధించిన అడ్డపట్టు సుంకంతో పాటు చేతివృత్తుల వారి నుండి వృత్తిపరమైన పన్ను వసూలు చేశారు.

వీరు పన్నుల వసూలు కోసం సుంకాధికారి అని పిలువబడిన అధికారులను నియమించారు. కాకతీయ రాజులు విదేశీ వాణిజ్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో వారు మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఆ కాలంలో ముప్పమాంబ, మైలమాంబ వంటి రాజ కుటుంబానికి చెందిన చాలా మంది మహిళా సభ్యులు భూదానములు చేశారు. ఇతర ధనవంతులు అయిన మహిళలు కూడా భూములు, చెరువులు, ధనం, పశువులు, నగలు మొదలైన సంపదలను దేవాలయాలతో పాటు బ్రాహ్మణులకు విరాళంగా ఇచ్చారు.

ప్రశ్న 9.
మధ్యయుగములో దక్షిణ భారతదేశములో ఏఏ రాజవంశాలు ఆవిర్భవించినాయి?
జవాబు:
మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఐదు ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి

  1. కల్యాణి చాళుక్యులు (బసవ కల్యాణి రాజధాని నగరం)
  2. యాదవులు (దేవగిరి రాజధాని నగరం)
  3. కాకతీయులు (ఓరుగల్లు రాజధాని నగరం)
  4. హోయసాలులు ( ద్వార సముద్రం రాజధాని నగరం)
  5. పాండ్య రాజ్యాలు (మదురై రాజధాని నగరం)

ఈ అయిదు రాజ్యాలలో కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

ప్రశ్న 10.
దిగువన ఇవ్వబడిన ప్రదేశాలను భారతదేశ పటము నందు గుర్తించుము.
అ) గోదావరి నది
ఆ) మోటుపల్లి
ఇ) వరంగల్
ఈ) దేవగిరి
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం 2

II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.

1. కాకతీయ వంశ స్థాపకుడు
ఎ) గుండ్యన
బి) రేచర్ల రుద్రుడు
సి) గణపతి దేవుడు
డి) జాయప
జవాబు:
ఎ) గుండ్యన

2. కాకతీయులు ఆరాధించిన దేవత ………
ఎ) అమ్మతల్లి
బి) కాకతి
సి) త్రిపుర సుందరి
డి) మైసమ్మ
జవాబు:
బి) కాకతి

3. శివతత్వ సారం అను గ్రంథం వ్రాసినది
ఎ) మల్లికార్జున పండితారాధ్యుడు
బి) జాయప
సి) పాల్కురికి సోమనాథుడు
డి) నన్నెచోడుడు
జవాబు:
ఎ) మల్లికార్జున పండితారాధ్యుడు

4. ప్రతీ గ్రామములోను చక్రవర్తి ఆస్తిగా వుంచబడిన భూమి ………
ఎ) వెలిపొలం
బి) రాచ పొలం
సి) తోట పొలం
డి) పైవన్నీ
జవాబు:
బి) రాచ పొలం

5. మోటుపల్లి శాసనం జారీ చేసిన వారు
ఎ) రుద్రమదేవి
బి) రుద్రదేవుడు
సి) ప్రతాపరుద్రుడు
డి) గణపతి దేవుడు
జవాబు:
డి) గణపతి దేవుడు

III. జతపరుచుము.

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. బసవ పురాణం ఎ) విద్యానాథుడు
2. కుమార సంభవం బి) పాల్కురికి సోమనాథుడు
3. నృత్య రత్నావళి సి) నన్నె చోడుడు
4. ప్రతాప రుద్రీయము డి) తిక్కన్న
5. శ్రీమదాంధ్ర మహాభారతం ఇ) జాయప

జవాబు:

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. బసవ పురాణం బి) పాల్కురికి సోమనాథుడు
2. కుమార సంభవం సి) నన్నె చోడుడు
3. నృత్య రత్నావళి ఇ) జాయప
4. ప్రతాప రుద్రీయము ఎ) విద్యానాథుడు
5. శ్రీమదాంధ్ర మహాభారతం డి) తిక్కన్న

IV. క్రింది ఖాళీలను పూర్తి చేయుము.

1. రామప్ప ఆలయము గల ప్రాంతము …………
2. విలస రాగి శాసనము ……………………. నాయకను గూర్చి తెలుపును.
3. రేకపల్లి …………………… నది పరీవాహక ప్రాంతంలో కలదు.
4. ఘటికలు అని పిలవబడిన విద్యాసంస్థలను స్థాపించిన రాజవంశము ……….
5. యాదవుల రాజధాని ………
జవాబు:

  1. పాలంపేట,
  2. ముసునూరి,
  3. శబరి,
  4. కల్యాణి చాళుక్యులు,
  5. దేవగిరి.

పద బంధము

ఇచ్చిన ఆధార పదాల సహాయంతో బాక్సులను గీయండి.
AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం 3
1. కాకతీయుల తొలి రాజధాని (5)
2. కాకతీయ సామ్రాజ్యంను పాలించిన మహిళ (5)
3. కాకతీయుల కొత్త రాజధాని (4)
4. ఇతని దండయాత్ర ఫలితముగా ప్రతాప రుద్రుడు సింహాసమును కోల్పోయినాడు (4)
5. నృత్య రత్నావళి గ్రంథము వ్రాసినది (6)
6. రాజు యొక్క స్థావరము (2)
7. మహిళా పాలకురాలను ఇలా పిలుస్తారు (2)
8. అటవీ ఉత్పత్తుల పైన విధించబడిన పన్ను (3)
9. ఇంటి పన్నును ఇలా పిలిచిరి (3)
10. ఓడలు నిలుపు చోటు (4)
11. చాళుక్య వంశ స్థాపకుడు (4)
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం 4

  1. హనుమ కొండ
  2. రుద్రమదేవి
  3. ఓరుగల్లు
  4. ఉల్గుఖాన్
  5. జాయపసేనాని
  6. కోట
  7. రాణి
  8. పుల్లరి
  9. ఇల్లరి
  10. ఓడరేవు
  11. తైలపుడు

7th Class Social Studies 5th Lesson కాకతీయ రాజ్యం InText Questions and Answers

7th Class Social Textbook Page No.145

ప్రశ్న 1.
పురావస్తుత్రవ్వకాలు మరియు పురాతన వస్తువులు బయల్పడిన వార్తలు మీరు ఏమైనా విన్నారా? వాటిని గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:

  1. ఇటీవల 1 ఆగష్టు, 2021లో ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో కాకతీయుల కాలం నాటి (14వ శతాబ్దం నాటీ) శాసనాన్ని కనుగొన్నారు.
  2. శ్రీకాకుళం నగర సమీపంలోని నాగావళి నదీతీరాన ప్రాచీన కాలం నాటి ‘శివలింగం’ మరియు కోటేశ్వరస్వామి దేవాలయ ఆనవాళ్ళను పురావస్తుశాఖ మరియు పర్యాటక శాఖ బృందం కనుగొన్నారు. (మార్చి 28, 2021)

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.137

ప్రశ్న 1.
రుద్రమదేవి అంతటి ధైర్య సాహసాలను ఎలా ప్రదర్శించిందని నీవు అనుకుంటున్నావు?
జవాబు:

  1. రుద్రమదేవి నిస్సందేహంగా ఆంధ్రా ప్రాంతంలోని గొప్ప పాలకులలో ఒకరు.
  2. చాలా సందర్భాలలో సైన్యాన్ని ధైర్యంగా ముందుకు నడిపించింది.
  3. ఈమె ఇంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించటానికి కారణము ఆమె చిన్నతనము నుంచి యుద్ధ విద్యలలో మంచి శిక్షణ పొందడం.
  4. ఆమె తల్లిదండ్రులు ప్రత్యేకంగా తండ్రి ఆమెకు ఇచ్చిన ప్రోత్సాహము అన్ని విద్యలలో శిక్షణ పొందటం ఆమెలో ఆత్మ విశ్వాసమును, ధైర్యసాహసాలను నింపింది.

7th Class Social Textbook Page No.139

ప్రశ్న 2.
కాకతీయ చక్రవర్తులు తమ నాయంకరులను ఎందుచేత బదిలీ చేసేవారు?
జవాబు:
కాకతీయ చక్రవర్తులు తమ నాయంకరులను ఎందుకు బదిలీ చేసేవారంటే ఒకే స్థానంలో ఎక్కువ కాలం పనిచేసినట్లయితే ఆ ప్రదేశములోని వారితో సంబంధాలు ఏర్పడతాయి. వారి ప్రాభవము పెరుగుతుంది. ఒకే స్థానంలో వున్నట్లయితే ఆ ప్రాంతం మీద పట్టు సాధించి చక్రవర్తులకు ఎదురు తిరిగే ప్రమాదముంది. అలాగే చక్రవర్తుల అధీనంలో తాము పనిచేస్తున్నామని (ఈ బదిలీ) తెలియజేస్తుంది. ఒకే స్థానంలో ఎక్కువ కాలం ఉంటే అక్కడి వారిపై పక్షపాతం పెరిగే అవకాశం ఉంది. అవినీతి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

7th Class Social Textbook Page No.143

ప్రశ్న 3.
దేవాలయాన్ని సందర్శించేటప్పుడు మీరు ఏ అంశాలను గమనిస్తారు?
జవాబు:
నేను దేవాలయాన్ని సందర్శించినపుడు క్రింది అంశాలను గమనిస్తాను.

  1. ప్రధానంగా నేను దర్శించుకునే దేవుడు / దేవతపై శ్రద్ధ పెడతాను.
  2. దేవాలయ వాతావరణం / పరిసరాలను పరిశీలిస్తాను.
  3. దేవాలయ నిర్మాణం, వానిలో ప్రత్యేకతలు ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను.
  4. దర్శించిన దేవుని / దేవత విగ్రహాన్ని మనస్సులో నిలుపుకుంటాను.
  5. ఆ దేవాలయానికి ఉన్న చరిత్ర గురించి అడిగి తెలుసుకుంటాను.
  6. దేవాలయ గోపుర నిర్మాణం, శిల్పాలు ఏమైనా ఉంటే వాటిని పరికిస్తాను.

7th Class Social Textbook Page No.147

ప్రశ్న 4.
స్థానిక రాజులు ఎందుకోసం కూటమిగా ఏర్పడినారు?
జవాబు:
స్థానిక రాజులు కూటమిగా ఏర్పడుటకు ప్రధాన కారణం ముస్లిం దండయాత్రల నుండి తమను తాము రక్షించుకోవటానికి. ముస్లింల పెద్ద, ఆధునిక ఆయుధాలు కల్గిన సైన్యమును చిన్న సైన్యములు కలిగిన స్థానిక రాజులు ఒంటరిగా పోరాడి గెలవడం అసాధ్యము. అలాగే సుశిక్షితులైన సైనికులు, ఆధునిక ఆయుధాలు, అశ్వదళము కల్గిన ముస్లిం దండయాత్రలు ఎదుర్కోవాలంటే స్థానిక రాజులు ఐకమత్యంగా పోరాడవలసి వచ్చింది.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.129

ప్రశ్న 1.
మధ్యయుగ కాలం గురించి మీ ఉపాధ్యాయుని సహాయంతో మరింత తెలుసుకోండి.
జవాబు:

  1. 8 నుండి 18వ శతాబ్దం వరకు కాలాన్ని భారతదేశంలో మధ్యయుగంగా పేర్కొంటారు.
  2. భారతదేశంలో ఇస్లామిక్ ప్రభావం మరియు పాలనతో చాలా ముడిపడి ఉన్న కాలము, మధ్యయుగ భారతీయ చరిత్ర.
  3. మధ్యయుగ మొదటి భాగంలో దేశీయ పాలకులు (రాజపుత్రులు) అయిన చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు, రాష్ట్ర కూటులు, చోళులు ఉన్నారు.
  4. అలాగే రాజపుత్రులలో పాలాస్, సేనా, ప్రతీహార, చౌహాన్లు, హోయసాలులు, పశ్చిమ గాంగులు పరిపాలించారు.
  5. దక్షిణ భారతంలో చోళలు, కాకతీయ, పల్లవ, విజయనగర రాజ్యా లు ప్రముఖమైనవి.
  6. మొదటి తైమూర్ దండయాత్రలతో భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు నాంది పలికిందని చెప్పవచ్చు.
  7. మధ్యయుగ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన మైలు రాయి సమాజంలో నిశ్శబ్ద విప్లవం, భక్తి ఉద్యమం.
  8. ఉప ఖండంలోని హిందువులు, ముస్లింలు, సిక్కులు దేవుని ఆరాధనతో సంబంధం ఉన్న అనేక ఆచారాలకు ఈ ఉద్యమం సంబంధం కలిగి ఉంది.
  9. ఢిల్లీ సుల్తానుల పాలనా కాలం నుంచి మొఘల్ సామ్రాజ్య పతనం వరకు ఇస్లాం పాలనగా పేర్కొంటారు. ఈ కాలాన్నే తొలి ఆధునిక యుగంగా పేర్కొంటారు.
  10. మధ్యయుగంలో చాలావరకు భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది.
  11. భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరు.
  12. మతం ప్రాధాన్యత సంతరించుకున్నది.
  13. కళలు, వాస్తు, శిల్పం, ఇతర కట్టడాలు, నిర్మాణాలు పతాక స్థాయికి చేరినాయి.

7th Class Social Textbook Page No.135

ప్రశ్న 2.
కాకతీయ కళాతోరణం గురించి మరిన్ని విషయాలు అంతర్జాలం నుండి తెలుసుకొనండి.
జవాబు:

  1. కాకతీయుల కళాతోరణం వరంగల్ కోటలోని ఒక భాగం.
  2. నల్లరాయితో చెక్కబడింది.
  3. నాలుగు పిల్లర్లు ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనటానికి నిదర్శనం, చివరి రెండు పిల్లర్ల మీద సింహాలు కాకతీయుల ఎదురు లేని నాయకత్వానికి చిహ్నం, తల పైకెత్తిన మొసలి జలకళకు ప్రతీతి. (కాకతీయుల కాలంలో చెరువులు, కుంటలు కాలువల్లో నీరు పుష్కలంగా ఉండేది). రెండు హంసలు కాకతీయుల పారదర్శక పాలనకు నిదర్శనం. హంస కింద ఇరువైపుల చేతులు పైకెత్తిన కుబేరుల విగ్రహాలు ఆర్థిక పరిపుష్టికి సంకేతం. బోర్లించిన ఏడు పూర్ణ కుంభాలు గ్రామ దేవతల ప్రతిబింబాలు. వాటినే సప్త మాతృకలు అని కూడా పిలుస్తారు. స్తంభం మధ్యలో చేపల బొమ్మలు మత్స్య పరిశ్రమకు చిహ్నం.
  4. రాతి వంపు ద్వారాలు చాలా బాగా నిర్మించబడ్డాయి.
  5. కాకతీయులు నిర్మించిన శివాలయానికి ద్వారంగా ఈ తోరణం ఉంది.
  6. దీనిని శక్తివంతమైన వరంగల్ గేట్ అని పిలుస్తారు.
  7. కాకతీయుల వైభవానికి చిహ్నంగా నిలిచిన ఈ తోరణం ప్రపంచ వారసత్వ సంపదగా, తెలంగాణ ప్రభుత్వ (రాజముద్ర) చిహ్నంగా గుర్తించబడింది.
  8. ఈ తోరణం కాకతీయుల కళా, వాస్తు, శిల్పుల ప్రతిభకు దర్పణంగా ఉంది.
  9. కాకతీయుల ఏలుబడిలో ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చారో ఈ తోరణం తెలియజేస్తుంది.

AP Board 7th Class Social Solutions Chapter 5 కాకతీయ రాజ్యం

7th Class Social Textbook Page No.147

ప్రశ్న 3.
చర్చిద్దాం:
చరిత్ర నుండి మనం ఏమి నేర్చుకుంటాము?
మనం గతం నుండి నేర్చుకొన్న అంశాలతో భవిష్యత్తులో తెలివిగా నడుచుకోవాలి.
మన సంస్కృతి మరియు వారసత్వాలను చరిత్ర నుండి నేర్చుకోవాలి, మీ అభిప్రాయాన్ని జోడించండి.
జవాబు:

  1. చరిత్ర నైతికపరమైన అవగాహనకు మరియు తదాత్మైకతకు దోహదం చేస్తుంది.
  2. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం.
  3. అందమైన భవిష్యత్ నిర్మాణానికి చరిత్ర పునాదిలా ఉపయోగపడుతుంది.
  4. గతంలోని (చరిత్రలోని) తప్పులను పునరావృతం కాకుండా పాలకులు జాగ్రత్త పడతారు.

Leave a Comment