AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

SCERT AP 6th Class Social Study Material Pdf 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 9th Lesson ప్రభుత్వం

6th Class Social 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పార్లమెంటరీ మరియు అధ్యక్ష ప్రజాస్వామ్యాల మధ్య వ్యత్యాసాలను రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 1

ప్రశ్న 2.
ప్రభుత్వం అంటే ఏమిటి? వివిధ రకాల ప్రభుత్వాలు ఏవి?
జవాబు:
ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వాటికొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం’ అంటారు. ప్రభుత్వాలు రెండు రకాలు, అవి

  1. రాచరిక ప్రభుత్వం
  2. ప్రజాస్వామ్య ప్రభుత్వం

ప్రశ్న 3.
నేడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏవైనా నాలుగు కార్యకలాపాలను రాయండి.
జవాబు:

  • ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా ఉంటుంది.
  • అలాగే తపాలా సర్వీసులు నిర్వహించడం, రైల్వే వ్యవస్థ నిర్వహణ వంటి పనులను కూడా ప్రభుత్వం చూస్తుంది.
  • ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని, సరిహద్దులను రక్షిస్తుంది. ప్రజలందరికీ ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
  • ఎపుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకవసరమైన సహాయం అందిస్తుంది.
  • ప్రజలకు న్యాయస్థానాల ద్వారా వివాద పరిష్కారం చేస్తుంది.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 4.
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం సాధ్యమేనా? కొన్ని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం చాలావరకు సాధ్యం కాకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఏకాభిప్రాయం కుదురుతుంది, అయితే ఇది అన్ని వేళల సాధ్యం కాదు. అందుకనే మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఉదాహరణకు మున్సిపల్ కౌన్సిల్ లోని (20) సభ్యులు పట్టణంలో ఏర్పాటు చేయదలచుకున్న పారిశుధ్య కార్మికుల కాంట్రాక్ట్ విషయంలో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. అనేకమైన అభిప్రాయాలు వచ్చాయి. మరి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేరు, కనుక మెజారిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు.

ప్రశ్న 5.
విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కలసి పాఠశాలను నడిపిస్తే ఎలా ఉంటుంది? పాఠశాలను నడపటానికి అందరూ భాగస్వాములు కావాలని మీరు అనుకుంటున్నారా? లేక ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారా? కారణాలు తెలపండి.
జవాబు:

  • విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల నడిపిస్తే అది ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది.
  • పాఠశాల నడపడానికి ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారు.
  • కారణాలు : అందరూ నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ సమయం వృథా అవుతుంది. అమలు చేసేవారుండరు. అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి మేధావంతులై, అంకితభావం కలిగి, ఇతరుల మేలు కోరేవారిని ప్రతినిధులుగా ఎన్నుకుంటే పాఠశాల చక్కగా నడుస్తుంది.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయా? ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారా?
జవాబు:
మా పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరం మా అభిప్రాయాలను తెలియజేస్తున్నాము. అయితే ఎక్కువమంది ఏ అభిప్రాయం వెళ్ళబుచ్చారో దానినే అమలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి మా అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటున్నారు.

ప్రశ్న 7.
సాత్విక్ తండ్రి ఒక దుకాణం ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను అడిగాడు. ప్రతి ఒక్కరు భిన్నమైన అభిప్రాయాలను తెలిపారు. కానీ చివరకు, అతను దుకాణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాడని మీరు అనుకుంటున్నారా?
జవాబు:

  • సాత్విక్ తండ్రి ప్రజాస్వామ్య బద్దంగానే వ్యవహరించాడని నేను అనుకుంటున్నాను.
  • ఎందుకంటే తను కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలను అడిగాడు.
  • కుటుంబ సభ్యులందరికి దుకాణం యొక్క లాభనష్టాల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. ఈయనకు సరైన అవగాహన ఉంది కాబట్టి దుకాణం ప్రారంభించి ఉండవచ్చు.

ప్రశ్న 8.
పద్మ తల్లి, తన పిల్లలను ఆదివారం ఎక్కడికి వెళ్తాం అని అడిగింది. ఇద్దరు పిల్లలు సినిమాకు వెళ్తామని, ముగ్గురు పార్కుకు వెళ్లాని అన్నారు. మీరు పద్మ స్థానంలో ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటారు? కారణాలు చెప్పండి.
జవాబు:

  • నేను పద్మని అయితే (ఆమె స్థానంలో ఉంటే) నేను పిల్లలను పార్కుకి తీసుకువెళ్ళే దానిని.
  • ఎందుకంటే ఎక్కువమంది (మెజారిటి) పిల్లలు పార్కుకి వెళ్తామని చెప్పారు కాబట్టి.

ప్రశ్న 9.
ప్రజాస్వా మ్యానికి పుట్టినిల్లు……….
ఎ) చైనా
బి) భారతదేశం
సి) గ్రీస్
డి) రోమ్
జవాబు:
సి) గ్రీస్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 10.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది?
ఎ) పురుషులు
బి) మహిళలు
సి) ప్రతినిధులు
డి) అర్హత కలిగిన ఓటర్లు
జవాబు:
డి) అర్హత కలిగిన ఓటర్లు

ప్రశ్న 11.
భారతదేశంలో…… సంవత్సరాలు నిండినవారు విశ్వజనీన వయోజన ఓటు హక్కుకు అర్హులు.
ఎ) 18 సం||
బి) 21 సం||
సి) 20 సం||
డి) 19 సం||
జవాబు:
ఎ) 18 సం||

ప్రశ్న 12.
భారతదేశంలో ప్రతి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతానికి రాజధాని నగరం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానాలు అయిన కింది రాష్ట్ర రాజధానులను దిగువ ఇచ్చిన భారతదేశ పటంలో గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 2
జవాబు:

  1. మహారాష్ట్ర – ముంబయి
  2. తమిళనాడు – చెన్నై
  3. ఆంధ్రప్రదేశ్ – అమరావతి
  4. కర్ణాటక – బెంగుళూరు
  5. పశ్చిమ బెంగాల్ – కొల్‌కతా
  6. తెలంగాణ – హైద్రాబాద్
  7. లడఖ్/జమ్మూకాశ్మీర్-లెహ్, శ్రీనగర్
  8. పంజాబ్ – చంఢీఘర్
  9. కేరళ – తిరువనంతపురం
  10. అరుణాచల్ ప్రదేశ్ – ఇటానగర్
  11. మధ్య ప్రదేశ్ – భోపాల్
  12. జార్ఖండ్ – రాంచి
  13. ఛత్తీస్ – రాయపూర్
  14. ఉత్తరాఖండ్ – డెహ్రాడూన్
  15. గుజరాత్ – గాంధీనగర్
  16. ఒడిశా – భువనేశ్వర్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 3

6th Class Social Studies 9th Lesson ప్రభుత్వం InText Questions and Answers

6th Class Social Textbook Page No.100

ప్రశ్న 1.
శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వహక శాఖకు ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:

  • శాసన నిర్మాణ శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను చేస్తుంది.
  • కార్యనిర్వాహక శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను అమలుపరుస్తుంది.
  • ఈ రెండు శాఖలకు వేటికవే అధికారాలు కల్గి ఉన్నాయి. ఒకదానిలో మరొకటి జోక్యం చేసుకునే అవకాశం లేదు. కాని శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖను నియంత్రిస్తుంది.

ప్రశ్న 2.
న్యాయశాఖ యొక్క ప్రధాన విధి ఏమిటి?
జవాబు:
న్యాయశాఖ చట్టాలను వ్యాఖ్యానించడం, రాజ్యాంగ పరిరక్షణ చేయడం ప్రధాన విధిగా చెప్పవచ్చు.

6th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
దిగువ వార్తా పత్రికల శీర్షికలను పరిశీలించి, వాటి ఆధారంగా ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితాను రాయండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 4
జవాబు:
ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితా :

  • అందరికి ఉచిత నాణ్యమైన విద్యనందించడం.
  • మార్కెట్ ధరలను నియంత్రించడం (అదుపులో ఉంచడం).
  • అందరికి వైద్య సదుపాయాన్ని కల్పించడం (ఉచితంగా)
  • ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొవడం. ఉదా : వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులో సహాయమందించడం.
  • వివిధ శాఖాధిపతులను, నియమించటం మొదలైనవి.

6th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 5
మీ ఉపాధ్యాయుని సహాయంతో, పై లోగోలు మరియు ప్రభుత్వ కార్యకలాపాల చిత్రాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కింది మైండ్ మ్యాప్ నింపండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 6

ప్రశ్న 5.
ప్రభుత్వానికి సంబంధించిన మరికొన్ని పనులను రాయండి.
జవాబు:
ప్రభుత్వానికి సంబంధించిన పనులు :

  • రోడ్ల నిర్మాణం చేపట్టడం
  • రైల్వే, విమాన, నౌకాయానం చేపట్టడం
  • పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు నిర్మించడం , తంతి, తపాల సౌకర్యాల ఏర్పాటు, నిర్వహణ
  • ఆనకట్టలు నిర్మించడం
  • దేశ రక్షణ (అంతర్గత, బహిర్గత)
  • శాంతి, భద్రతల పరిరక్షణ
  • ప్రజలందరికి న్యాయం అందించటం
  • పన్ను వసూలు చేయటం
  • అనేక రకాల సంక్షేమ పథకాలు చేపట్టడం
  • సమర్థవంతంగా పాలన చేయడం
  • అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలు నెలకొల్పడం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 6.
మీరు ప్రభుత్వం నుండి ఏ రకమైన సౌకర్యాలను ఆశిస్తున్నారు?
జవాబు:

  • ఉచిత గృహ వసతి
  • 24 గం||లు రక్షిత మంచినీటి సౌకర్యం
  • KG to PG ఉచిత విద్య,
  • పరిశుభ్రతకై పారిశుధ్య సౌకర్యం.
  • మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయం
  • పర్యావరణ పరిరక్షణకై వన సంరక్షణ.
  • మా గ్రామం/పట్టణంలో నాణ్యమైన, మంచిరోడ్లు
  • అందరికి ఉద్యోగ, ఉపాధి కల్పించడం.

ప్రశ్న 7.
మీ ఉపాధ్యాయుని సహాయంతో ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశాలలోనైనా రాచరికాలు అమలులో ఉన్నాయేమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
ప్రస్తుత ప్రపంచంలో పూర్తిస్థాయి రాచరికాలు లేకపోయినప్పటికీ, రాజరికం అనేది (రాజు రాణి అధ్యక్షులు ఉండటం) నామమాత్రంగా నైనా కొన్ని దేశాలలో కలదు. అవి :

  • యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్)
  • బ్రూనై
  • నెదర్లాండ్
  • రోమెనియా
  • జోర్డాన్
  • బెహ్రయిన్
  • మొరాకో
  • కాంబోడియా
  • UAE
  • మొనాకో
  • కువైట్
  • భూటాన్
  • టోంగా
  • వాటికన్ సిటీ
  • కత్తార్
  • బెల్జియం
  • సౌదీ అరేబియా
  • థాయ్ లాండ్
  • మలేసియా
  • జపాన్
  • ఓమన్ మొదలైనవి.

6th Class Social Textbook Page No.103

ప్రశ్న 8.
మీకు ఏ రకమైన ప్రభుత్వం ఇష్టం? ఎందుకు?
జవాబు:
నాకు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకొనబడుతుంది. ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది.

ప్రశ్న 9.
ప్రజల అభిప్రాయాన్ని ఏ ప్రభుత్వం గౌరవిస్తుంది?
జవాబు:
ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుంది.

ప్రశ్న 10.
కింది చిత్రాలను గమనించండి. ప్రభుత్వ పేరును సంబంధిత బాక్సులలో రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 7

6th Class Social Textbook Page No.104

ప్రశ్న 11.
రాచరికం మరియు ప్రజాస్వామ్యం మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

రాచరికం ప్రజాస్వామ్యం
1. వంశపారంపర్యంగా నియమింపబడిన పాలకుడు ఉంటాడు. 1. దేశంలోని ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు ఉంటాడు.
2. రాజుకి అపరిమిత అధికారాలుంటాయి. 2. ప్రభుత్వ అధికారానికి పరిమితులుంటాయి.
3. ఎన్నికలు ఉండవు, పారదర్శకత ఉండదు. పాలకులపై నియంత్రణ ఉండదు. 3. పాలన, ఎన్నిక విధానం పారదర్శకంగా ఉంటుంది. నాయకులపై నియంత్రణ ఉంటుంది.
4. రాచరికంలో హక్కులు రాజు ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి. 4. ప్రజలందరికి ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇవి రాజ్యాంగబద్దంగా అందరికీ ఇవ్వబడతాయి.
5. రాచరికంలో రాజు నియంత్రణలోనే (కనుసనల్లోనే) సమాచార, ప్రసార సాధనాలుంటాయి. ప్రభుత్వ పాలనను విమర్శిస్తే శిక్షార్హులే. 5. సమాచార, ప్రసార సాధనాలు (వార్తా పత్రికలు, దూరదర్శన్, సినిమా) ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉండి, ప్రభుత్వాలను విమర్శిస్తూ, నియంత్రిస్తుంటాయి.
6. ఇది నిరంకుశ పాలన కావచ్చు, సమానత్వం కన్పించదు. 6. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వంలో అందరూ సమానులే.

ప్రశ్న 12.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యమేనా? కారణాలు తెల్పండి.
జవాబు:

  • ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యం కాదు, కారణం
  • భారతదేశంలో అధికంగా దాదాపు (135 కోట్లు) జనాభా ఉండటం వల్ల సాధ్యం కాదు.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 13.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు. అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి. రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారం పాలన మాత్రమే చేస్తారు. పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తారు.

6th Class Social Textbook Page No.105

ప్రశ్న 14.
పై సందర్భంలో మెజారిటీ పాలనను మీరు ఎలా అర్ధం చేసుకున్నారు? మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ప్రాతినిధ్య సూత్రంతోపాటు, ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో మెజారిటీ పాలన ఒకటి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ (simple majority) ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నికవుతారు. ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు. అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటువేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవలసిందే. ఆ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు.

ఉదాహరణకు : ఒక మున్సిపల్ కౌన్సిల్ లో 45 మంది కౌన్సిలర్స్ ఉంటే 23 మంది ఒక ప్రతిపాదనను సమరిస్తే అది ఆమోదం పొందుతుంది. మిగతా 22 మంది అభిప్రాయాలకు విలువ ఉండదు. అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాయి.

ప్రశ్న 15.
మీ తల్లిదండ్రుల నుండి, ఎన్నికల వ్యవస్థలో వారు చూసే సమస్యలను తెలుసుకొని, ఒక నివేదికను తయారు చేయండి. మీ తరగతిలో వాటిని చర్చించండి. ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. క్రింది ఆధారాలను ఉపయోగించుకోండి.

ఎన్నికలలో ప్రజలు ధనవంతుల చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతున్నారు. కొన్ని సందర్భాలలో కులం, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాక భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా పెద్దది. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ లాంటి అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఓటు చేసే వారి శాతం చాలా తక్కువగా ఉండటం యింకా పెద్ద సమస్య. ఇవి లేకుండా ఉండాలంటే ప్రజలు వివేకవంతులై ధన, కుల ప్రలోభాలకు లొంగకుండా, ఓటు చేయాలి. సరియైన ప్రతినిధులను ఎన్నుకోవాలి.

6th Class Social Textbook Page No.106

ప్రశ్న 16.
కింద ఇవ్వబడిన ప్రపంచ పటాన్ని గమనించండి. పార్లమెంటరీ వ్యవస్థ మరియు అధ్యక్ష వ్యవస్థను విడిగా అనుసరిస్తున్న దేశాల జాబితా చేయండి. (మీ ఉపాధ్యాయుని సహాయంతో) ఈ పుస్తకం యొక్క వెనుక పేజీలలో ప్రపంచ పటాన్ని చూడండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 8
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 9

6th Class Social Textbook Page No.107

ప్రశ్న 17.
మీ ఉపాధ్యాయుని సహాయంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
కేంద్ర ప్రభుత్వం :
ప్రధానమంత్రి, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఉద్యోగ బృందం

రాష్ట్ర ప్రభుత్వం :
ముఖ్యమంత్రి, శాసనసభ, శాసనమండలి) సభ్యులు, గవర్నర్, రాష్ట్రమంత్రులు, ఉద్యోగ బృందం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 18.
వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
నేడు అన్ని దేశాలు (ఉదా: భారతదేశం) అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు సమస్యలను గుర్తించడం కష్టం. కాబట్టి వివిధ సమస్యలను పరిష్కరించటానికి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణకుగాను ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది.

Leave a Comment