AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

SCERT AP 10th Class Social Study Material Pdf 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Studies 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీరు తినే ఆహార పదార్థాలలో పదింటిని తీసుకొని, మీ వద్దకు చేరటానికి ఉత్పత్తి అయిన స్థలం నుంచి ఎంతదూరం ప్రయాణించాయో తెలుసుకోండి. (AS3)

ఆహారపదార్థం ప్రయాణించిన దూరం
1. బియ్యం
2. వంటనూనె
3. అరటిపళ్ళు

చాలామంది ఆహారం దూర ప్రాంతాలు రవాణా చెయ్యటం కాకుండా స్థానికంగా ఉత్పత్తి చెయ్యాలని అంటారు. స్థానికంగా ఆహారం ఉత్పత్తి చెయ్యటానికీ, పర్యావరణానికీ సంబంధం ఏమిటి? స్థానికంగా ఆహారాన్ని పండించి, వినియోగించాలన్న ఉద్యమం గురించి మరింత తెలుసుకుని తరగతి గదిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించండి. (మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యుట్యూబ్ లో కింద లింకులో ఉన్న హెలెనా నార్బెర్గ్ – హాడ్జ్ ఉపన్యాసాన్ని వినండి. https:/www.youtube.comwatch?v=4r06_F2FIRM
జవాబు:

ఆహారపదార్థం ప్రయాణించిన దూరం
1. బియ్యం 50 కి.మీ.
2. వంటనూనె 100 కి.మీ.
3. అరటిపళ్ళు 5 కి.మీ.
4. గోధుమలు 10 కి.మీ.
5. రాగులు 20 కి.మీ.
6. జామపళ్ళు 10 కి.మీ.
7. జొన్నలు 15 కి.మీ.
8. బొప్పాయి 5 కి.మీ.
9. దానిమ్మ 60 కి.మీ.
10. పెసలు 20 కి.మీ.

సానికంగా ఆహారపదారాలను ఉత్పత్తి చేయడం వలన తాజా, నాణ్యమైన పదార్థాలు లభిస్తాయి. అంతేకాకుండా మనం పండించడం వలన పర్యావరణపరంగా సమస్యలు అధిగమించి, సేంద్రియ ఎరువులతో ఆరోగ్యవంతమైన • ఆహారపదార్థాలను పొందవచ్చు.

ప్రశ్న 2.
జలసింధి గ్రామ ప్రజలు తమ ఊరి నుంచి తరలి వెళ్ళటాన్ని ఎందుకు తిరస్కరించారు? (AS1)
జవాబు:
సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్ లో ముంపునకు గురయ్యే మొదటి గ్రామం జలసింధి గ్రామం. తద్వారా ఆ గ్రామ ప్రజలంతా మునిగిపోతారని తెలిసికూడా తరలివెళ్ళడానికి వారు ఇష్టపడలేదు. మైదాన ప్రాంతాలకు వెళితే అభివృద్ధి చెందుతారని, జీవితాలు సుఖపడతాయని చెప్పి వాళ్ళమీద దౌర్జన్యాలు చేసినా వారు అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు అడవులను నరికారు. దేవతలను పూజించారు. నేలను మెరుగుపరచారు. జంతువులను మచ్చిక చేసుకున్నారు. అక్కడ వ్యవసాయం ఖర్చు లేకుండా, లాభసాటి ఫలసాయాన్ని అందిస్తుంది. మొక్కజొన్న వాళ్ళకు తల్లిలా ఆహారాన్ని అందిస్తుంది. సజ్జలు, జొన్నలు, శనగలు, మినుములు, నువ్వులు వారికి ఆధారంగా లభిస్తున్నాయి. అడవి వలన వాళ్ళకు ప్రవహించే నీళ్ళు, చక్కటి మేత ఉన్నాయి. పశుసంపద ఎక్కువ. రకరకాల జబ్బులకు అడవి నుండి లభించే వనమూలికలే మందులుగా ఉపయోగపడతాయి. నిర్మలమైన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సంబంధాలతో
సుఖంగా జీవిస్తున్నవాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి తిరస్కరించారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 3.
“ఇది మా పూర్వీకుల భూమి. దీనిపై మాకు హక్కు ఉంది. దీనిని కోల్పోతే మా చేతికి పారలు, గడ్డపారలు వస్తాయి తప్ప ఇంకేమీ మిగలదు…….” అన్న బావా మహాలియా మాటలను వివరించండి. (AS1)
జవాబు:
అనాదిగా బావా మహాలియా పూర్వీకులు అడవులను నరికి పోడు వ్యవసాయం ద్వారా చదును చేసి, కష్టించి, అటవీ భూములు తామే సాగుచేస్తున్నందున ఆ భూముల యజమానులుగా తలంచి, దర్జాగా అడవి మీద, వ్యవసాయం మీద ఆధిపత్యం పొందారు. అభివృద్ధి పేరుతో, పునరావాసం పేరుతో అక్కడ నుండి ఖాళీ చేయిస్తే, వ్యవసాయ భూములపై యజమానులుగా ఉన్న వాళ్లు వ్యవసాయ కూలీలుగా మారి, చేతికి పారలు, పలుగులు వచ్చి పేదరికంలో కూరుకుపోతారని, సంతోషం లేని జీవితాలవుతాయని మహాలియా భావన.

ప్రశ్న 4.
“చివరిగా (అంతమాత్రాన దీని ప్రాముఖ్యత తక్కువేమీ కాదు) వ్యర్థ పదార్థాలు, కాలుష్యం తక్కువగా ఉండేలా మన జీవన సరళిని మార్చుకోవటంపైన పర్యావరణ సమస్యల పరిష్కారం ఆధారపడి ఉంది.” (AS4)
ఎ) మన జీవనశైలి పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీ నేపథ్యం నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకొని దీనిని వివరించండి.
జవాబు:
మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మనిషి ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నాడు కాని, ప్రకృతి మనిషి మీద ఆధారపడి జీవించటం లేదు. చెట్లను నరకకుండా, ప్రతీ పుట్టిన రోజున ఒక మొక్క నాటి పెంచే విధంగా మన జీవన విధానం ఉండాలి. వ్యవసాయంలో రసాయనిక పురుగుమందుల వాడకం తగ్గించడం ద్వారా ఆరోగ్యవంతమైన పంట ఫలాలను పొందవచ్చు. పారిశ్రామిక వ్యర్థాలు, మరల మరల ఉపయోగించడం వలన, కాలుష్యరహిత విధానం వలన పర్యావరణ సమస్యలు తగ్గుతాయి.

బి) ప్రపంచంలో, వివిధ ప్రాంతాలలో చెత్త, కాలుష్య విడుదల సమస్యలను అధిగమిస్తున్న వివిధ పద్ధతులను పేర్కొనండి.
జవాబు:
పర్యావరణంలో సంభవించు పెనుమార్పుల వలన ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. అభివృద్ధి మాటున, అనర్థాలు అధికమవ్వడంతో ఆర్థిక, సామాజిక, శీతోష్ణస్థితులలో చెడు పరిణామాలు సంభవించాయి. దీనికి అనుగుణంగా వివిధ పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలను రీసైక్లింగ్ పద్ధతులు, అదే విధంగా వాటి నుండి మరికొన్ని కొత్త ఆవిష్కరణలు కనుగొనడం జరిగింది. కాలుష్యం అధికంగా విడుదల చేసే పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయడమే కాకుండా, జల కాలుష్యం జరగకుండా అనేక కొత్త పద్ధతులు అనుసరించడం జరుగుతోంది. వేస్ట్ మేనేజ్ మెంట్ ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ప్రజలను చైతన్యపరుస్తూ, మీడియా ద్వారా ప్రజలలో మార్పు తీసుకురావడానికి ప్రపంచం యావత్తు కృషి చేస్తోంది.

ప్రశ్న 5.
ఖనిజాలు, ఇతర సహజ వనరులను వేగంగా సంగ్రహించడం వల్ల భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. మీరు ఏకీభవిస్తారా? (AS4)
జవాబు:
నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజ వనరులు, అధికంగా గ్రహించడం వలన భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని నేను ఏకీభవిస్తాను. అదేపనిగా భూగర్భజలాల్ని, ఖనిజాలను వినియోగించడం వలన తరువాత లభించడం దుర్లభం. అడవులను, చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వలన, జీవావరణం, జీవవైవిధ్యం దెబ్బతిని, భవిష్యత్తు తరాలు అంధకారంలోకి నెట్టబడతాయి. ఆర్థికవ్యవస్థలోని ఇతర రంగాలు కూడా ఖనిజాలు, ఇతర సహజవనరుల మీద ఆధారపడి ఉండడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 6.
వాతావరణ మార్పు ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని ఎందుకనుకుంటున్నారు? (AS1)
జవాబు:
ప్రపంచంలోని దేశాల శాస్త్రజ్ఞులు ఎంతోకాలంగా వాతావరణంలోని మార్పుల గురించి వివరాలు సేకరిస్తూనే ఉన్నారు. వాతావరణం అంటే మనచుట్టూ ఉండే తేమ, గాలిపీడనం, ఉష్ణోగ్రత మొదలైన వాటిలో రోజువారీ వచ్చే మార్పులు. వాతావరణం గంట గంటకీ, రోజు రోజుకీ, ఋతువు, ఋతువుకీ మారిపోవచ్చు. వాతావరణ మార్పు ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది. ఈ కారణంగానే ముందుగా టీవీ, రేడియో, వార్తాపత్రికలు మొ||నవి వాతావరణ వివరాలను ప్రతిరోజూ ప్రసారం చేస్తాయి. వాతావరణ మార్పు ప్రభావం గురించి తెలుసుకుంటున్నదానిని బట్టి రాబోయే కాలంలో వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తాయో అన్ని దేశాలు అంచనావేస్తాయి.

ప్రశ్న 7.
భూమి సగటు ఉష్ణోగ్రతలను ప్రజలందరికీ సహజ వనరుగా పరిగణించాలా? (AS1)
జవాబు:
భూమి సగటు ఉష్ణోగ్రతలను ప్రజలందరికీ సహజ వనరుగానే పరిగణించాలి. 1992 సంవత్సరంలో రియోడిజెనీర్ లో ధరిత్రి సదస్సు జరిగింది. అందులో 154 దేశాలు సంతకం చేశాయి. గత 100 సం||లలో భూమి సగటు ఉష్ణోగ్రత 0. 5 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. భూమి సగటు ఉష్ణోగ్రత పర్యావరణ పరంగా జీవవైవిధ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 8.
తెలంగాణలోని జహీరాబాద్ మండలంలోని ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఏ గుణపాఠాలు నేర్చుకోవచ్చు? (AS4)
జవాబు:
తెలంగాణలోని జహీరాబాద్ మండలంలోని ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి మనం అనేక గుణపాఠాలు నేర్చుకోవచ్చు.

స్థానిక ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ, సుదూర ప్రాంతంలో రసాయనిక పురుగుమందులు, సారవంతం లేని వరి, గోధుమల స్థానంలో అధిక పౌష్టికాహార విలువలు గల చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా అక్కడ ఉండేది. (చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగి వంటివి) పోషకాహారాన్ని అందించే చిరుధాన్యాలు పండించాక భూముల బీడు పోవడమే కాకుండా, నియంత్రణ కూడా సాధించారు.

ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ విధానం ద్వారా వారు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ స్థానిక అవసరాలు, కట్టుబాట్లు కొనసాగిస్తూ ఇంకొకరి మీద ఆధారపడకుండా, స్వశక్తితో వారిలో వారే అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. గ్రామాలు స్వయం సంపూర్ణ గ్రామాలుగా మారడానికి ఐక్యత, సామాజిక చైతన్యం, సమష్టి కృషి, విశిష్ట లక్షణాలు అందరికీ ఆదర్శవంతమయ్యాయి.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 9.
“స్థానిక జన జీవనానికి, జీవనోపాధులకు, పరిసరాలతో సహజీవనం చేసే జీవన విధానానికి పర్యావరణం చాలా ముఖ్యమైనది.” వివరించండి. (AS6)
జవాబు:
“నరుని అడుగు సోకని అడవి రమణీయంగా ఉందని” వాల్మీకి అన్నట్లు రామాయణంలో ఒక శ్లోకం ఉందంటారు. వ్యవసాయం కోసమైనా, పశువుల కోసమైనా, కలప కోసమైనా, కారణం ఏదైనా ఫలితం క్షణక్షణం అడవి తల్లిని బుగ్గిపాలు చేయడం జరుగుతోంది. అడవిని ఆధారంగా చేసుకొని ఆదివాసీలు, వివిధ జంతువులు, ఇతర జీవరాసులు జీవన సమరం సాగిస్తున్నాయి. తమ చుట్టూ ఉండే చెట్టు, పు, కొండా, కోన, వ్యవసాయం, మేత ఇలా అణువణువు వారికి ఆధారమే. పర్యావరణాన్ని పాడుచేయడం వలన మానవుడు తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్లుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ పరిసరాల్లోనే, ఈ పర్యావరణంలోనే, ఈ ప్రకృతిలోనే మన శరీరం ఉంది. పర్యావరణంలోనే మనుగడ సాగుతుంది. పర్యావరణాన్ని నాశనం చేశామంటే మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకున్నట్లు. “మనం పర్యావరణాన్ని కలుషితం చేస్తే – పర్యావరణం మనల్ని కలుషితం చేస్తుంది.”

10th Class Social Studies 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి InText Questions and Answers

10th Class Social Textbook Page No.160

ప్రశ్న 1.
పర్యావరణ సమస్యల ద్వారా అభివృద్ధి అనే భావనను ఎలా ప్రశ్నించారో గుర్తించండి.
జవాబు:
అభివృద్ధి పేరుతో, పారిశ్రామికాభివృద్ధి ముసుగులో పర్యావరణం – ప్రజల మధ్య సంబంధాలు అతలాకుతలం అయినాయి. ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ద్వారా అడవులను నరికి, నేలను కోతకు గురిచేసి, కాలుష్యం పెంచి, విచ్చలవిడిగా రసాయనిక పురుగుమందుల వాడకం చేపట్టి, శీతోష్ణస్థితిలో పెనుమార్పునకు పర్యావరణ సమస్యలు మూలమయ్యాయి. అభివృద్ధి జరిగినా సహజ వనరులు అంతరించి, మానవ మనుగడయే దుర్లభమయ్యే రోజులు దాపురించాయి.

10th Class Social Textbook Page No.162

ప్రశ్న 2.
భూగర్భజలాలను ఎక్కువగా తోడటం సుస్థిర పద్దతి ఎందుకు కాదు?
జవాబు:
సంప్రదాయ వ్యవసాయంలో వర్షపు నీటి ద్వారా భూగర్భజలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకొనేవారు. 10-15 అడుగులలో నీళ్ళు ఉండేవి. ఆ తర్వాతి కాలంలో విద్యుత్, డీజిలు మోటార్లతో భూగర్భజలాలను తోడటం మొదలైన తర్వాత భూగర్భజలం కొన్ని వందల అడుగుల లోపలకు వెళ్ళిపోయింది. లోపలికి ఇంకే నీటి కంటే తోడే నీళ్ళు ఎక్కువవడం వలన భవిష్యత్తు తరాలు నీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు కానవస్తున్నాయి. కాబట్టి భూగర్భజలాలను ఎక్కువగా తోడటం సుస్థిర పద్ధతి కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 3.
పర్యావరణాన్ని ‘సహజ పెట్టుబడి’ అని కూడా అంటారు. 9వ అధ్యాయంలో పెట్టుబడి నిర్వచనాన్ని మరొకసారి చూడండి. పర్యావరణాన్ని సహజ పెట్టుబడి అని ఎందుకు అంటారు?
జవాబు:
పర్యావరణాన్ని ఆధారం చేసుకొని, ఈ భూమి మీద 5 కోట్ల వేర్వేరు జాతులు ఉన్నాయి. మనం వాడుతున్న నీళ్ళు, మనచుట్టూ ఉన్న అడవి, అడవి ఆధారంగా సహజంగా లభించే సహజ అటవీ ఉత్పత్తులు, సెలయేళ్ళు, సహజ వనరులు, (ఇంధన వనరులు, ఖనిజ వనరులు) ఆధారం చేసుకొని మానవజీవితం కొనసాగుతుంది. మానవుడు తనచుట్టూ ఉండే పరిసరాల్ని ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కాబట్టి పర్యావరణాన్ని సహజ పెట్టుబడిగా వర్ణించవచ్చు.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 4.
నీటిని ఉమ్మడి ఆస్తిగా ఎందుకు పరిగణించాలి?
జవాబు:
నీరే జీవాధారం. ప్రాణాధారం, నీరు లేకుండా ఏ జీవీ జీవనం సాగించడం దుర్లభం. ప్రకృతిలో కురిసే వానల వలన, పారే నీరు భూగర్భజలంలోకి చేరుతుంది. అంతేకాకుండా సహజవనరులైన సెలయేళ్ళు, నదులు, కాలువలు, జలాశయాలు, ఆనకట్టల ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన వారందరికీ నీరు ఉమ్మడి ఆస్తిగా చెందుతుంది.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 5.
ఎండోసల్ఫాన్ వినియోగాన్ని నిలిపివెయ్యటానికి న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?
జవాబు:
ఎండోసల్ఫాన్ అనేది రసాయనిక పురుగులమందు. ఈ పురుగులమందు అనేక రకాలుగా హానికారక ప్రభావాల్ని చూపించింది. గాలి, నీళ్ళు మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో కలుషితమయ్యాయి. దానిని పిచికారి చేయడం వలన ప్రజలలో ముఖ్యంగా వ్యవసాయ కూలీలలో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనివల్ల కనీసం 5000 మంది చనిపోయారు. అంతకంటే ఎక్కువమంది అవయవ లోపాల వల్ల, క్యాన్సర్ వల్ల మరణం కంటే దారుణమైన జీవితాన్ని గడపగా ఆ పరిస్థితుల నుండి రక్షణ పొందేందుకు న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చింది.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 6.
ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలలో ఆ పురుగుమందు వాడకం జీవించే హక్కుకు (రాజ్యాంగంలోని 21వ అధికరణానికి) భంగం కలిగించిందని పేర్కొంది. జీవించే హక్కుకు, ఎండోసల్ఫాన్ ఎలా భంగం కలిగించిందో వివరించండి.
జవాబు:
ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణం కలిగి ఉండే హక్కు కూడా ఉంటుందని న్యాయస్థానాలు అనేక తీర్పులు చెప్పడం జరిగింది. 1991లో రాజ్యాంగంలోని 21వ అధికరణం ద్వారా జీవించే హక్కు ద్వారా జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి, కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కుంటుందని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. కానీ ఎండోసల్ఫాన్ పురుగుమందు వాడకం వలన, పరిసరాలు, పర్యావరణం, నీరు, గాలి కలుషితమై, ప్రజలలో అనేక మరణాలు సంభవించాయి. కాబట్టి, కోర్టు తీర్పునకు అనుగుణంగా-ఎండోసల్ఫాన్ విఘాతం కలిగించింది కాబట్టి దానిని నిషేధించడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 7.
గిరిజనులకు వేరే రాష్ట్రంలో పునరావాసం కల్పిస్తే దిగువ పేర్కొన్న విషయాల్లో ప్రస్తుత అలవాట్లలో ఏమి మారతాయో చూపించటానికి ఒక పట్టిక తయారుచేయండి. ఆహార అలవాట్లు, వ్యవసాయం, ఆర్థిక అంశాలు, అడవితో సంబంధం, మత ఆచారాలు, ఇల్లు కట్టుకోవడం, సామాజిక సంబంధాలు.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 1

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 8.
జీవవైవిధ్యత కోల్పోటాన్ని ఉత్తరంలో ఎతా పేర్కొన్నారు?
జవాబు:
మా చుట్టూ అనేక పక్షులు, జంతువులు, చెట్లు, పువ్వులు, పండ్లు, కీటకాలు రకరకాలైనవి ఉన్నాయి. వాటితో మా బంధం పెనవేసుకుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు వంటి పశుసంపద మాకు ఆరోగ్యసంపద, ధన సంపద. ఈ అడవిలో తిరిగే ప్రతి పక్షి, జంతువు, ఇతర జీవరాసుల అరుపులు, వాటి జీవన విధానం మాకు తెలుసు. ప్రతీ జీవి కూడా పూజింపదగినదే. ఏ ప్రాణినీ తక్కువగా అంచనావేయం. అన్ని ప్రాణులపట్ల సమాన ప్రాధాన్యతతో, ప్రేమతో, కృతజ్ఞతతో మెలగుతాం.

ప్రశ్న 9.
జలసింధి గ్రామంలోని ప్రజలకు ప్రస్తుతం ఆహారభద్రత ఉందా?
జవాబు:
జలసింధి గ్రామంలోని ప్రజలకు ప్రస్తుతం ఆహారభద్రత ఉంది. వ్యవసాయాన్ని అనువుగా మార్చుకొని, తక్కువ వర్షాలతో కావలసినంత ఆహారాన్ని పొందుతున్నారు. జలసింధి గ్రామంలో గిరిజనులకు కడుపునింపేది మొక్కజొన్న. వీటితో పాటు, సజ్జలు, జొన్నలు, శనగలు, మిటికెలు, మినుములు, నువ్వులు పండించి ఆహారభద్రత పొందుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 10.
పైన పేర్కొన్న పరిస్థితులలో మీరు నివసిస్తుంటే పునరావాసం పొందాలన్నప్పుడు ఎలా స్పందిస్తారు?
జవాబు:
అడవితో అనురాగం పెంచుకొని, పరిసరాలపై ప్రేమలో మునిగి, నేలతల్లిని ఆరాధించే మేము వేరే పునరావాస ప్రాంతంలో నివసించటానికి ఇష్టపడం. అభివృద్ధి ముసుగులో మా జీవన గమనాన్ని దెబ్బతీస్తే ఊరుకోం. ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడతాం. కొండా కోన, వాగు-వంకలతో అడవిలోనే నివసిస్తాం. ఐక్యమవుతాం. ఎదిరిస్తాం. అనుకున్నది సాధిస్తాం.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 11.
భారతదేశ ఆర్థిక విధానంలో సరళీకరణ, ప్రపంచీకరణ చోటు చేసుకున్న తరువాత స్థానిక అవసరాలకు, ఎగుమతులకు ఖనిజాల తవ్వకం వేగంగా పెరిగింది. ఈ కింద ఇచ్చిన పట్టికలోని గణాంకాల ఆధారంగా ఈ వ్యాఖ్యానాన్ని వివరించండి.
పట్టిక : భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకం (వేల టన్నులలో)

ఖనిజం 1997 – 98 2008 – 09
బాక్సెట్ 6,108 15,250
బొగ్గు 2,97,000 4,93,000
ఇనుప ఖనిజం 75,723 2,23,544
క్రోమైట్ 1,515 3,976

జవాబు:
బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన మనదేశంలో స్థానిక అవసరాలు, ప్రపంచంలో మన స్థానాన్ని పదిలపరచుకోడానికిగాను, ఖనిజాలను ఎగుమతులు చేయడం జరిగింది. విరివిగా లభించే ఖనిజాలను వెలికితీసి సరళీకరణ ద్వారా, ప్రపంచ పోటీని నిలదొక్కుకోడానికి గాను విలువైన బాక్సెట్, బొగ్గు, ఇనుము, క్రోమైట్లను సగాని కంటే ఎక్కువగా వెలికితీయడం జరిగింది. 1997-98 కి, 2008-2009 కి మధ్య 10 సం||లలో అధికంగా ఖనిజాలను వెలికితీసి ఆదాయాలను పెంచి ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగింది.

ప్రశ్న 12.
గనుల తవ్వకం వేగంగా వృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి, మనుషులకి ఏ విధమైన నష్టాలు జరుగుతాయి?
జవాబు:
గనుల తవ్వకం విచ్చలవిడిగా పెంచడం వలన, అటు పర్యావరణానికి, ఇటు మనుష్యులకు తీవ్ర ప్రమాదాలు దాపురిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు, వివిధ జంతువులు, పక్షులు, వివిధ రకాల జీవరాసులు నశించి, పర్యావరణం పాడైపోతుంది. అదేవిధంగా గనులను విరివిగా తవ్వడం వలన ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజలు అనేక కాలుష్య సమస్యలతో సతమతమవుతున్నారు. . నీటి, వాయు కాలుష్యం వలన ఆరోగ్య సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి.

10th Class Social Textbook Page No.159

ప్రశ్న 13.
ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ ఆధారంగా భారతదేశంలోని అంతరాల గురించి క్లుప్తంగా రాయండి.
గ్రాఫ్ 1 : భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ (లక్షలలో) (2010 సర్వే)
AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 2 AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 3
జవాబు:
గ్రాఫ్ 1 ఆధారంగా 17 లక్షల పైన వార్షిక ఆదాయం కలిగిన వారు 30 లక్షల కుటుంబాలు ఉండగా, లక్షా యాభైవేల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారు 13 కోట్ల 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రెండవ స్థానంలో తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారు అంటే లక్షా యాభైవేల నుండి 3 లక్షల 40 వేల మధ్య ఆదాయం కలిగిన వారు 7 కోట్ల 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దీనినిబట్టి తక్కువ ఆదాయంతో పేదరికంతో బాధపడుతున్న వారు మన దేశంలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గ్రాఫ్ 2 ప్రకారం భారతదేశంలో శత కోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద -1996లో 212 బిలియన్ రూపాయలు, 2004 లో 1,157 బిలియన్ రూపాయలు కాగా, 2011లో 11,000 బిలియన్ రూపాయలకు చేరింది.

గ్రాఫ్ 3 ప్రకారం భారతదేశంలో శతకోటీశ్వరులు 1996లో ముగ్గురు ఉండగా 2004లో ఆ సంఖ్య 9 గా ఉంది. 2011లో శత కోటీశ్వరుల సంఖ్య 55కి చేరింది.

పై గ్రా ద్వారా తేలిందేమిటంటే, కొంతమంది ప్రపంచస్థాయి భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండగా అధికశాతం ప్రజలు సరైన ఉద్యోగం లేక, చాలినంత ఆదాయాలు లేక గౌరవప్రదంగా జీవించడానికి అవసరమయ్యే కనీస అవసరాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారు. ప్రజల ఆదాయాలు, అవకాశాలలో ఇంత అంతరం ఉండటం సమసమాజానికి ఆధారం కాబోదు.

10th Class Social Textbook Page No.161

ప్రశ్న 14.
భారతీయ వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి 9వ తరగతి పాఠాలను మరొకసారి చూడండి.
ఈ రెండు సందర్భాలలోనూ వనరుల పంపిణీ, అందుబాటుకు సంబంధించి అసమానతలను అవి ఎలా చర్చించాయి?
జవాబు:
భారతదేశంలో పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచి పేదరికాన్ని దూరం చేయడానికి గాను, నూతన వ్యవసాయ పరిజ్ఞానంతోపాటు అధిక విత్తనాల దిగుబడికి రసాయనిక ఎరువులే కీలకం. సకాలంలో నీరు, రసాయనిక ఎరువులు అందించి, తక్కువ కాలంలో, పొట్టి కాడలతో ఎక్కువ దిగుబడిని అందించే వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. హరితవిప్లవం ద్వారా ఆధునిక పద్ధతులతో వరి, గోధుమలలో అధికోత్పత్తి సాధించడం జరిగింది.

అదేవిధంగా పరిశ్రమలను నెలకొల్పే క్రమంలో ఉన్న అనేక పరిమితులు దూరం చేసి, లైసెన్సింగ్ విధానంలో ఉన్న సమస్యలను అధిగమించి, నూతన పారిశ్రామిక విధానం ద్వారా అనేక పారిశ్రామిక కేంద్రాలను నెలకొల్పి, అత్యంత సమర్థవంతమైన ఉత్పత్తులు పెంపొందింపజేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.161

ప్రశ్న 15.
‘హరిత విప్లవం’ విస్తరించడం వల్ల ఎటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి? దీని నుంచి భవిష్యత్తుకు మనం ‘ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవాలి?
జవాబు:
హరితవిప్లవం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, కొత్త రకం విత్తనాలు సృష్టించడంతో, ఆహారధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధి సాధించగా అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. అవి

  1. హరిత విప్లవంలో అధిక ప్రాధాన్యం ఇచ్చిన వరి, గోధుమపంటల అధిక దిగుబడికిగాను పుష్కలంగా నీరు అవసరం. అందులకై అధిక సంఖ్యలో మోటార్లు, ఇంజన్లు ఉపయోగించి భారీగా భూగర్భజలాలను వెలికితీయడంతో, భూగర్భజలాలు పడిపోయాయి. దీనితో భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి భూగర్భజలాలు లేవు.
  2. సేంద్రియ ఎరువులు, పెంటపోగు గత్తం వంటి వాటి ఎరువులకు బదులుగా రసాయనిక పురుగుమందులు, క్రిమి సంహారక రసాయనాలు వాడడం వలన భూముల సారం తగ్గి, రైతుల ఖర్చు పెరిగింది.
  3. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి వాటికి ప్రాధాన్యం లేకపోవడం, ఇవి సుమారు 80% ప్రాంతాలలో పండించేవిగా ఉండడం వలన చాలా ప్రాంతాలలో సంప్రదాయ పంటలు దూరమయ్యాయి.

కాబట్టి మనం సంప్రదాయ పద్ధతులు అనుసరిస్తూ, ఆరోగ్యాన్ని పాడుచేసే విధానాలకు స్వస్తి చెప్పి, మన పూర్వీకుల పద్ధతులు పాటిస్తూ, భూసారాన్ని రక్షించుకుంటూ పర్యావరణ సమస్యలు లేకుండా చూసుకోవాలి.

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 16.
అభివృద్ధి భావనలు అన్న అధ్యాయంలో ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చని చదివాం. దీనిని వివరించటానికి బావా మహాలియా ఉత్తరాన్ని ఉపయోగించండి.
జవాబు:
ప్రజల అవసరాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆహార ఉత్పత్తి, పారిశ్రామికీకరణ వలన అటవీ ప్రాంతంలో, నదీ పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో ఖాళీ చేయించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను పట్టణ ప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు తరలించడం జరిగింది. దీని ద్వారా కొంతమంది ప్రజలకు భద్రత, ఉద్యోగ అవకాశాలు, ఉత్పత్తి పెరిగినప్పటికీ, ఎంతోమందికి మాత్రం అది పెను ప్రమాదంగా మారింది. అడవిని నమ్ముకొని, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, ఫలసాయాల ద్వారా బ్రతుకుతున్న వారికి, కొండా కోన, పరిసరాలు తమకు అనుకూలమైనవి కావడం వలన వేరే ప్రాంతాలలో జీవించడం కష్టం. తమకు అలవాట్లు, పూర్వీకుల ఆచారాలకు అనుగుణంగా తమ తమ ప్రాంతాలలో నివసించటానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది.

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 17.
గిరిజనులలో జీవనోపాధి, సంస్కృతి, సామాజిక సంబంధాలు అడవితో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. దీనిని వివరించండి.
జవాబు:
అడవిలో నివసించే గిరిజనులకు అడవే జీవనాధారం. గిరిజనులు వారి శ్రమతో రకరకాలైన సంప్రదాయ పంటలు పండిస్తారు. డబ్బుతో పని లేకుండా, నాణ్యమైన విత్తనాలు, పశువుల నుండి వచ్చే ఎరువును వాడి, మంచి ఫలసాయాల్ని పొందుతారు. పంటలు పండని సమయంలో అడవిలో దొరికే అనేక ఫలాలు, దుంపలు, కాయలు, పండ్లు గిరిజనుల ఆకలిని తీరుస్తాయి.

సంస్కృతి, సంప్రదాయాలకు గిరిజనులు ప్రాధాన్యం ఇస్తారు. క్రమం తప్పకుండా చెట్టు తల్లిని, అగ్నిని, అమ్మతల్లిని పూజిస్తారు. సంతలలో కలిసి ఒకరికొకరు ఇష్టపడి వివాహాలు జరుపుకుంటారు. సామాజిక సంబంధాలకు విలువనిస్తారు. కష్టసుఖాలలో ఒకటిగా జీవిస్తారు. అడవిలో దొరికే జంతువుల మాంసాలను సమంగా పంచుకొని, కలిసి తింటారు. సమూహాలుగా ఏర్పడి వేటకు బయలుదేరతారు.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 18.
‘అభివృద్ధి భావనలు’ అన్న అధ్యాయంలో మీరు కుడంకుళం అణువిద్యుత్తు కర్మాగారానికి నిరసనల గురించి చదివారు. ఇక్కడ తెలుసుకున్న వాటి ఆధారంగా ఆ నిరసనలను వివరించండి.
జవాబు:

  1. ‘కుడంకుళం’ తమిళనాడులోని ఒక ప్రశాంతమైన గ్రామం.
  2. అక్కడి ప్రజల జీవనోపాధి చేపలు పట్టడం.
  3. ‘కుడంకుళం’ అణువిద్యుత్ కర్మాగారాన్ని అక్కడ స్థాపించటంవలన, వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వస్తుంది.
  4. అందువలన వారికి జీవనోపాధి పోతుంది.
  5. అంతేకాకుండా అణువిద్యుత్ కర్మాగారాలలో జరిగే విధ్వంసాల వలన కూడా వారు భయపడుతున్నారు.
  6. వారి మనస్సులలో గత కొద్దికాలం క్రిందట జపాన్ అణుకర్మాగారంలో జరిగిన విధ్వంసం మెదలుతూ ఉంది.
  7. అందువలన అక్కడ దీర్ఘకాలంగా పోరాటం జరుగుతోంది.
  8. కనుక ఆధునిక అభివృద్ధి పథకాల వలన వీరి అతి ముఖ్యమైన వనరైన సముద్రము అందుబాటులో లేకుండాపోతుంది.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 19.
పర్యావరణ పరిరక్షణ ప్రత్యక్షంగా ప్రభావితులయ్యే సమూహాలకే కాక మనందరికీ కూడా ఎంతో కీలకమైనది. కొన్ని ఉదాహరణలతో దీనిని వివరించండి.
(లేదా)
క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

“వేగమైన ఆర్థిక అభివృద్ధి వల్ల అనేక రంగాలలో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవి చూస్తున్నాం. భూగర్భ జలాలు, రసాయనిక పురుగు మందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. పర్యావరణంపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చెయ్యటమంటే ఈ సమూహాలను మట్టుపెట్టడమే.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం. మన చుట్టూ ఉండే గాలి, నీరు, చెట్లు, వాతావరణం, శీతోషసితిలో అనేక మార్పుల వలన మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉదాహరణకు అభివృద్ధి పేరుతో పరిశ్రమల స్థాపన ఆశయంతో చుట్టూ ఉండే అడవులు, జంతువులు, మిగతా జీవరాసులు నశిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ పర్యావరణంలో ప్రకృతిలో ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి జీవిస్తున్నాయి.

అదే విధంగా వ్యవసాయరంగంలో సాంకేతికత పేరుతో సంప్రదాయ పద్ధతులు కాకుండా సంకరజాతి వంగడాలు, రసాయనిక పురుగుమందులు వాడడం వలన వాటి ప్రభావం మనష్యులందరి మీద పరోక్షంగా పడుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకమైనది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 20.
ఎనిమిదవ తరగతిలోని ఆంధ్రప్రదేశ్ లోని ఖనిజాలకు సంబంధించిన అధ్యాయాలను మరొకసారి చూడండి. పారిశ్రామిక వేత్తలకు, ఖనిజాలు ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు మధ్య ఎటువంటి వైరుధ్యాలు చోటు చేసుకుంటాయి?
జవాబు:
వెనుకబడిన దేశమైన భారతదేశం ఆర్థికంగా బలం పుంజుకోవడానికిగాను పరిశ్రమలను నెలకొల్పదలచి, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, అధిక ఆదాయం పొందగా ఆర్థిక ప్రగతి సాధించింది. అయితే పారిశ్రామికవేత్తలకు కేటాయించిన ప్రదేశాలలో నివసించే ప్రజలకు అనేక విషయాలలో వైరుధ్యాలు ఉన్నాయి. ఖనిజ వనరులు లభ్యమయ్యే ప్రదేశాలలో అడవులను విచక్షణారహితంగా నరికివేయటం, ఖనిజాలను కడగడానికి పెద్ద మొత్తంలో నీళ్ళు కావాలి. తద్వారా దగ్గరలోని నదులు, నీటి వనరులు కలుషితమవుతాయి. గనులలో పనిచేసే కార్మికులు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఇలాంటివే మరెన్నో వైరుధ్యాలు చోటుచేసుకుంటాయి.

Leave a Comment