Access to the AP 9th Class Telugu Guide ఉపవాచకం Questions and Answers are aligned with the curriculum standards.
AP 9th Class Telugu Upavachakam Questions and Answers
1. ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు
వ్యక్తీకరణ – సృజనాత్మకత :
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
న్యాపతి సుబ్బారావుగారి పాత్ర స్వభావం వ్రాయండి.
జవాబు:
ఆయన పేదరికంలో గడిపారు. పట్టుదల గల మనిషి. అందుకే ఉపాధ్యాయుడిగా చేరినా న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన సంఘసంస్కరణాభిలాష కలవాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. కార్యనిర్వహణాదీక్ష, సామర్థ్యము, పట్టుదల చాలా ఎక్కువ. అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా పూర్తిచేసాడు. ఆయన సాహిత్యాభివృద్ధిని కోరుకొనే సాహితీవేత్త. ఆయన దేశ సేవాతత్పరుడు.
ప్రశ్న 2.
న్యాపతి సుబ్బారావుగారి బాల్యం, విద్యాభ్యాసం వ్రాయండి.
జవాబు:
న్యాపతి సుబ్బారావుగారు 1856 జనవరి 14న నెల్లూరులో జన్మించారు. వీరరాఘవరావు, రంగమ్మగార్లు ఆయన తల్లిదండ్రులు. ఆయన చిన్నతనంలోనే ఆ కుటుంబం రాజమండ్రికి వచ్చి స్థిరపడింది. ఆయన బాల్యమంతా పేదరికంలో గడిచింది. వీధి దీపాల వెలుగులో చదువుకున్నారు. మద్రాసులో బి.ఎ. పాసయ్యారు.
ప్రశ్న 3.
సుబ్బారావుగారి సంఘసంస్కరణ సాహిత్య సేవ గురించి వ్రాయండి.
జవాబు:
వీరేశలింగం పంతులుగారు తలపెట్టిన వితంతు వివాహాలకు సహకరించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. పురమందిర నిర్మాణానికి సహాయము చేసారు. 1878లో కొందరు మిత్రులతో కలిసి “ది హిందూ” అనే ఆంగ్ల దిన పత్రికను స్థాపించారు. తెలుగులో చింతామణి పత్రికనూ ఇంగ్లీషులో ఇండియన్ ప్రోగ్రస్ పత్రికను స్థాపించి నిర్వహించారు. చింతామణి పత్రికలో తెలుగు నవలల పోటీ పెట్టారు. ఉత్తమనవలా రచనను ప్రోత్సహించారు. భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టారు.
ప్రశ్న 4.
స్వాతంత్య్ర పోరాటంలో న్యాపతి సుబ్బారావుగారు నిర్వహించిన పాత్రను గురించి రాయండి.
(లేదా)
న్యాపతి వారి రాజకీయ జీవితం గురించి రాయండి.
జవాబు:
న్యాపతి సుబ్బారావు స్వాతంత్య్ర పోరాటంలోను, బ్రిటీష్ ప్రభుత్వంలో ప్రజాప్రాతినిథ్యం వహించడంలోను ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. 1893 నుండి 1899 వరకూ ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. 1898లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహా సభలకు ఆహ్వానసంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతం అయ్యాయి. 1914లో విజయవాడలో నిర్వహించిన రెండవ ఆంధ్ర మహాసభకు న్యాపతి వారు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.
1917లో కలకత్తాలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలో ఆంధ్రులకు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా న్యాపతి వారినే అధ్యక్షులుగా ఎన్నుకొన్నారు. రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి ఛైర్మన్ న్యాపతి వారే. ప్రసిద్ధ దేశభక్తుడు, లీడర్ పత్రికా సంపాదకుడైన సి.వై. చింతామణితో కలసి 1914లో కోస్తా జిల్లాలలో పర్యటించిన న్యాపతి సుబ్బారావు తన ప్రసంగాలతో స్వదేశీ భావనని వ్యాప్తి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్య్ర పోరాటంలో, సాంఘిక సేవారంగంలో నిరంతరం సేవ చేశారు.
![]()
2. దేశభక్త కొండ వేంకటప్పయ్య
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
కొండ వేంకటప్పయ్యగారి పాత్ర స్వభావం వ్రాయండి.
జవాబు:
కొండ వేంకటప్పయ్య గారికి నాటకరంగం అంటే ఇష్టం. స్త్రీ పాత్రలు పోషించటం అంటే మరీ ఇష్టం. స్వతంత్రమైన వృత్తి కనుక న్యాయవాద వృత్తి అంటే ఆయనకిష్టం. ఆయన నిజాయితీ, నిబద్ధత కలవాడు. తను కష్టపడి సంపాదించిన డబ్బును ఇతరులకు సహాయంగా ఇచ్చే సహృదయం కలవాడు. సంఘసంస్కరణాభిలాషి, దేశ సేవాతత్పరుడు. ఆయన మంచి రచయిత. సత్ప్రవర్తన, సత్యనిరతి కలవాడు.
ప్రశ్న 2.
కొండ వేంకటప్పయ్యగారి బాల్యం, విద్యాభ్యాసం వ్రాయండి.
జవాబు:
కొండ వేంకటప్పయ్యగారు 1866 ఫిబ్రవరి 22న గుంటూరులో జన్మించారు. బుచ్చమ్మ, కోటయ్యలు వారి తల్లిదండ్రులు. చిన్నతనం పేదరికంలోనే గడిచింది. పాత గుంటూరులో వారి ప్రాథమిక విద్య సాగింది. గుంటూరు మిషన్ పాఠశాలలో చదివేటప్పుడే నాటక రంగంలోకి ప్రవేశించారు. మద్రాస్ లోని క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసారు. ఆయన బి.ఎల్. చదివారు. తను చదువుకునే రోజుల్లో బడిపిల్లలకు ట్యూషన్ చెప్పి నెలకు రూ. 7లు సంపాదించేవారు. ఆర్థికంగా బాధపడుతున్నా తన స్నేహితునికి నెలనెలా ఆ డబ్బులు ఇచ్చేవారు.
ప్రశ్న 3.
కొండ వేంకటప్పయ్యగారి సంఘసంస్కరణ, దేశభక్తి గురించి వ్రాయండి.
జవాబు:
కొండ వేంకటప్పయ్యగారు తన ఇంటిలోనే వయోజన స్త్రీలకు చదువు చెప్పడానికి, చేతివృత్తులు నేర్పటానికి ఒక పాఠశాల ప్రారంభించారు. అదే ఉన్నవ లక్ష్మీబాయమ్మ నిర్వహించిన శారదానికేతనం. ఆ పాఠశాలకు తన ఆస్తిని అమ్మి రూ. 10,000 లు విరాళం ఇచ్చారు. గొల్లపూడి సీతారామశాస్త్రి ప్రారంభించిన వినయాశ్రమానికి కూడా పెద్ద మొత్తంలో విరాళమిచ్చిన దేశభక్తుడాయన. తిలక్ స్వరాజ్య నిధికి వేలాది రూపాయలను విరాళాలుగా సంపాదించి ఇచ్చారు. పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. సైమన్ గోబ్యాక్, ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆయన దేశ సేవాతత్పరతకు గాంధీజీ ఆనందించి శ్లాఘించారు.
![]()
3. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
కాశీనాథుని నాగేశ్వరరావుగారి బాల్యం, విద్యాభ్యాసం వ్రాయండి.
జవాబు:
కాశీనాథుని నాగేశ్వరరావుగారు 1867 మే 1న కృష్ణాజిల్లా ఎలకుర్రులో జన్మించారు. శ్యామలాంబ, బుచ్చయ్యలు తల్లిదండ్రులు. ఆయనకు పెద్దలు పెట్టిన పేరు నాగలింగం. కాలక్రమేణా అది నాగేశ్వరరావుగా మారింది. ఆయనకు చదువన్నా, వ్యాపారమన్నా ఇష్టమే. తండ్రి సంస్కృతం చదివించాలనుకొన్నారు. తల్లి ఇంగ్లీషు చదివించాలనుకొంది. చివరికి ఆమె మాటే నెగ్గింది. ఆయన బందరులోని హిందూ హైస్కూల్లో 11వ తరగతి పాసయ్యాడు. ఇంటర్ పూర్తి చేశాడు. మద్రాసులో డిగ్రీ చదివారు. వ్యాపారం చేయాలనుకొన్నారు.
ప్రశ్న 2.
నాగేశ్వరరావుగారి దేశభక్తిని వివరించండి.
జవాబు:
అమృతాంజనం వ్యాపారంలో వచ్చిన డబ్బుని దేశసేవకే వినియోగించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1908లో ఆంధ్రపత్రిక ప్రారంభించారు. ఆనాటి భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, మొదటి ప్రపంచ యుద్ధాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తన పత్రికలో ప్రతిబింబింపచేశారు. తెలుగు ప్రాంతంలో తిరిగి ప్రజలను సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేలా చైతన్యపరిచారు. స్వతంత్ర వీరులకు ఆర్థిక సహాయం చేశారు. టంగుటూరివారి పత్రికకు పేపరందించారు. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహాలలో పాల్గొని జైలుకు వెళ్లారు. శ్రీబాగ్ ఒప్పందం ఆయన గృహంలో జరిగింది. వేముల కూర్మయ్యను చదివించారు.
ప్రశ్న 3.
కాశీనాథుని నాగేశ్వరరావుగారి స్వభావం వ్రాయండి.
జవాబు:
ఆయన దేశభక్తుడు. పరోపకార స్వభావం కలవాడు. ధైర్యవంతుడు. పత్రికా నిర్వాహకుడు, వ్యాపారవేత్త, సాహితీవేత్త, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, నాయకుడు.
![]()
4. ఉన్నవ దంపతులు (లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ)
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
ఉన్నవ లక్ష్మీబాయమ్మగారి బాల్యం గురించి వ్రాయండి.
జవాబు:
ఉన్నవ లక్ష్మీబాయమ్మగారు, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలోని అమీనాబాద్ గ్రామకరణమైన నడింపల్లి సీతారామయ్య, లక్ష్మీదేవమ్మలకు చివరి సంతానంగా జన్మించారు. ఆమె 1882లో జన్మించారు. అమీనాబాద్లో ఆమె బాల్యం గడిచింది. అక్కడి ప్రాథమిక పాఠశాలలోనే ఆమె విద్యాభ్యాసం గడిచింది. ఆమెకు 10వ ఏటనే ఆమె బావ లక్ష్మీ నారాయణతో వివాహమైంది.
ప్రశ్న 2.
ఉన్నవ లక్ష్మీబాయమ్మగారి దేశ సేవను గూర్చి వ్రాయండి.
జవాబు:
ఆమె మహిళా సేవకు తన జీవితం అంకితం చేశారు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలకు వివాహాలు చేయించారు. ఉన్నవ దంపతులను వెలివేశారు కూడా. శారదానికేతన్ లో లక్ష్మీబాయమ్మ బాలికలకు కథలు, అల్లికలు చెప్పేవారు. అక్కడ తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ నేర్పేవారు. చేతివృత్తులు నేర్పారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1930లో శాసనోల్లంఘనలో పాల్గొన్నారు. అరెస్టయ్యారు. కల్లుపాకల దగ్గర పికెటింగులు చేశారు. 3. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి స్వభావం వ్రాయండి.
జవాబు: లక్ష్మీనారాయణగారు సహృదయులు. సౌజన్యమూర్తి. మహాత్ముడి మార్గాన్ని మనసారా విశ్వసించిన వ్యక్తి. త్యాగమూ సేవా అనే రెండు మాటల్ని తన జీవితంగా మలుచుకొన్న మహానుభావుడు లక్ష్మీనారాయణగారు. ఆయన న్యాయవాదిగా ఉంటూనే సంఘసంస్కరణ చేసిన సంఘ సంస్కరణాభిలాషి. ఆయన తన రచనలతో దీనజనోద్ధరణకు కృషి చేశారు. కులవ్యవస్థను నిరసించారు.
![]()
5. దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
దువ్వూరి సుబ్బమ్మగారి బాల్యం, విద్యాభ్యాసం వ్రాయండి.
జవాబు:
దువ్వూరి సుబ్బమ్మగారు 1881 నవంబరు 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో జన్మించారు. ఆమె తండ్రి మల్లాది సుబ్బావధానిగారు. ఆమెకు పదేళ్ల వయసులోనే వివాహం జరిగింది. ఆమె భర్త దువ్వూరి వెంకటప్పయ్య, ఆయన మరణించాడు. ఆమె బాల వితంతువయింది. ఆమె నిరుత్సాహ పడలేదు. చల్లపల్లి వెంకటశాస్త్రి దగ్గర తెలుగు, సంస్కృతం చదువుకొన్నది. రెండు భాషలలో పాండిత్యం సంపాదించింది. బ్రిటిషు ప్రభుత్వ దుర్మార్గాలనెండగట్టింది.
ప్రశ్న 2.
దువ్వూరి సుబ్బమ్మగారి సేవా తత్పరత గురించి వ్రాయండి.
జవాబు: దువ్వూరి సుబ్బమ్మగారు విదుషీమణి. ఆమె ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించేది. ప్రసంగం మధ్యలో పద్యాలు, శ్లోకాలు చెబుతూ అలరించేది. చిలకమర్తి పద్యాలు, గరిమెళ్ల పాటలూ పాడుతూ సభ్యులను ఉత్తేజపరిచేది. ఆమె బాలికా పాఠశాల స్థాపించింది. బాలికలకు ఉచిత భోజన వసతులు కల్పించింది. ఆమె 1920లో మొదటిసారిగా అరెస్టయ్యారు. ఉప్పుసత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, వ్యక్తి సత్యాగ్రహాలలోనూ పాల్గొన్నారు. లాఠీదెబ్బలు తిన్నారు. జైలుశిక్ష
అనుభవించారు.
ప్రశ్న 3.
దువ్వూరి సుబ్బమ్మగారి స్వభావం వ్రాయండి.
జవాబు:
దువ్వూరి సుబ్బమ్మగారు మంచి విద్వాంసురాలు, ధైర్యవంతురాలు, నిరాడంబరంగా జీవించేవారు. ఆమె ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేవారు. ఆమె సర్వ సమర్థురాలు. పెద్దాడ కామేశ్వరిగారిని కొడుతుంటే పోలీసులను ఎదిరించి, చీవాట్లు పెట్టిన ధీమంతురాలామె.
![]()
6. అయ్యదేవర కాళేశ్వరరావు
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
కాళేశ్వరరావుగారి బాల్యం, విద్యాభ్యాసం గురించి వ్రాయండి.
జవాబు:
అయ్యదేవర కాళేశ్వరరావుగారు కృష్ణా జిల్లాలోని నందిగామలో 1882 జనవరి 22వ తేదీన జన్మించారు. ఆయన బాల్యం నందిగామలోనే గడిచింది. అక్కడే ఇంగ్లీషు బడిలో చదివారు. 9వ ఏట ప్రైమరీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన ఏక సంథాగ్రాహి. ఒకసారి విన్నది మరచిపోయేవారు కాదు. హైస్కూల్ చదువుకు బందరుకానీ, బెజవాడకానీ పంపడానికి వారి తల్లిదండ్రులంగీకరించలేదు. అందుచేత 1894 వరకు నందిగామలోనే ఉండిపోయారు. 14వ ఏట వివాహమైంది. 1894 జూన్లో మూడవ ఫారంలో బందరులో చేరారు. అక్కడ నెలవారీ పరీక్షలలో మొదటి స్థానం వచ్చింది. 1897లో మెట్రిక్ ప్రథమశ్రేణిలో పాసయ్యాడు. 1899 ఎఫ్.ఏ. కూడా ప్రథమశ్రేణిలో పాసయ్యాడు. ఆయనకు ఇంజనీరింగ్ చదవాలని ఉండేది. కానీ, తండ్రి ఆజ్ఞతో బందరులోనే బి.ఏ. చదివాడు. 1901లో బి.ఏ. లో ఆయన స్వర్ణ పతకం పొందారు.
ప్రశ్న 2.
అయ్యదేవర కాళేశ్వరరావుగారి దేశ సేవను వివరించండి.
జవాబు:
మహాత్మాగాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించారు. సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. వందేమాతర ఉద్యమస్ఫూర్తితో పెద్ద నిధి సేకరించారు. సంఘ సంస్కరణకు, అస్పృశ్యతా నివారణకు ఉద్యమించారు. దళిత విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు నడిపారు. వితంతు వివాహాల సభలలో పాల్గొన్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. 1917లో విజయవాడలో ప్రథమ ఆది ఆంధ్ర మహాసభ ఆయన ధన సహాయంతోనే నడిపారు.
స్వరాజ్య పత్రికలో ‘అరే ఫిరంగీ. క్రూర వ్యాఘ్రమా!’ వ్యాసం వ్రాశారు. దానితో ఆయన అరెస్టయ్యారు. 2 సం॥లు జైలు శిక్ష అనుభవించారు. 800 గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పరిచారు. న్యాయవాద వృత్తిని వదిలి పూర్తిగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1926, 1936, 1946, 1955లలో విజయవాడ నుండి శాసన సభ్యులయ్యారు. అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. జైలు శిక్షలను అనుభవించారు. 1930లో విజయవాడ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. విజయవాడకు విద్యుత్ ఆయనే వేయించారు. విజయవాడలో అనేక భవనాలు, అనేక సౌకర్యాలు ఆయన హయాంలోనే ఏర్పడ్డాయి.
ప్రశ్న 3.
అయ్యదేవర కాళేశ్వరరావుగారి స్వభావం వ్రాయండి.
జవాబు:
ఆయనకు తెలుగంటే ఇష్టం. తెలుగువారంటే గౌరవం, తెలుగువారి ఔన్నత్యాన్ని జాతీయ స్థాయిలో చాటారు. దేశభక్తి ఎక్కువ. స్వాతంత్ర్యోద్యమంలో తన సర్వస్వం ధారపోశారు. తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేశారు. తండ్రిగారిని గౌరవించే స్వభావం కలవారు. స్వతంత్ర జీవితం గడపడం ఇష్టం.
![]()
7. కడప కోటిరెడ్డి, రామసుబ్బమ్మ దంపతులు
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
కడప కోటిరెడ్డి బాల్యం, విద్యాభ్యాసం గురించి వ్రాయండి.
జవాబు:
ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లె తాలూకా, నారాయణ చెరువు గ్రామంలో జన్మించారు. 1886లో జన్మించారు. వారి తల్లిదండ్రులు నాగమ్మ, సిద్ధారెడ్డి. కోటిరెడ్డిగారి పూర్తిపేరు కోటిరెడ్డిగారి కోటిరెడ్డి. ఆయనకు చిన్నతనం నుండీ రామాయణ, భారతాలంటే ఇష్టం. ఆయన బాల్యం పల్లెటూరిలోనే గడిచింది. ఉన్నత చదువుకోసం మద్రాసు వెళ్లారు. బి.ఏ. పాసయ్యారు. ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదివారు. బారిస్టరై తిరిగి వచ్చారు.
ప్రశ్న 2.
రామసుబ్బమ్మగారి సేవాతత్పరత గురించి వ్రాయండి.
జవాబు:
ఆమె తన భర్త కోటిరెడ్డి వద్ద ఆంగ్లం నేర్చుకొన్నారు. అనర్గళంగా ఆంగ్లం మాట్లాడేవారు. ఆమె భర్త ప్రోత్సాహంతో స్వరాజ్య ఉద్యమంలోకి ప్రవేశించారు. ఆమెకు స్వాతంత్ర్యోద్యమంతో బలమైన అనుబంధం ఏర్పడింది. సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. టంగుటూరి ధైర్యాన్ని చూశారు. 1938లో కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఆ పదవికీ రాజీనామా చేశారు. 1940లో మహిళా సంఘం స్థాపించారు. మహిళా కళాశాల స్థాపనకు ఉద్యమించారు. లక్షరూపాయిలు విరాళమిచ్చారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అరెస్టయ్యారు, అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. అనేక సార్లు అరెస్టయ్యారు. అనేక కఠిన కారాగార జైలు శిక్షలననుభవించారు.
ప్రశ్న 3.
కోటిరెడ్డిగారి స్వభావం వ్రాయండి.
జవాబు:
కోటిరెడ్డిగారు ధీశాలి, సత్యాగ్రాహి, అహింసావాది, శాంతిమార్గావర్తి ఉన్నతమైన ఆలోచన కలవాడు. ఉత్తమ భావాలు కలవాడు. సత్యంపైన, ధర్మంపైన అమిత విశ్వాసం కలవాడు. మానవత్వం నమ్మే మనిషి, కష్టించి పనిచేసే స్వభావం కలవాడు. అందర్నీ ప్రేమించేతత్వం కలవాడు. స్వేచ్ఛను ఇష్టపడే మనిషి, ధైర్యసాహసాలు కలవాడు.
![]()
8. స్వరాజ్య సమరశీలి దరిశి చెంచయ్య
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
దరిశి చెంచయ్యగారి బాల్యం, విద్యాభ్యాసం గురించి వ్రాయండి.
జవాబు:
దరిశి చెంచయ్యగారు 1890లో ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఒక నిరుపేద వైశ్య కుటుంబంలో జన్మించారు. బాగా చదువుకోవాలని, తహశీల్దారు ఉద్యోగం చేయాలనేది ఆయన చిన్ననాటి కోరిక. ఒంగోలు, మద్రాసులలో చదువుకొన్నారు. ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లారు. అక్కడ సెలవు రోజులలో కష్టపడి పనిచేస్తూ, డబ్బు సంపాదిస్తూ వ్యవసాయ శాస్త్రం చదివారు. చెంచయ్యగారు బాల్యంలోనే బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు ఆకర్షితులయ్యారు. లాలాహరిదయాళ్ పరిచయంతో స్వాతంత్రోద్యమ కాంక్ష మరింతగా పెరిగింది. కత్తిసాము, బాక్సింగ్, కుస్తీ, తుపాకీ కాల్చడంలోనూ చదువుకొనే రోజులలోనే శిక్షణ పొందారు. లోగస్ కాలేజీలో వ్యవసాయ శాస్త్రంలో బి.యస్.సి. పూర్తి చేశారు.
ప్రశ్న 2.
చెంచయ్యగారి ఉద్యమ జీవితం గురించి వివరించండి.
జవాబు:
1913 జూలై 15న సోహన్ సింగ్ ఒక్నా పట్టుదలతో గదరా పార్టీ ఆవిర్భవించింది. గదర్ అంటే తిరుగుబాటు, భారత -స్వాతంత్య్రం కోసం విదేశాలలో జరిగిన పోరాటాలలో గదర్ ప్రముఖ పాత్ర వహించింది. చెంచయ్య కూడా గదర్ పార్టీ సభ్యుడయ్యారు. శారీరకంగా దృఢంగా తయారై స్వాతంత్య్ర పోరాటానికి సంసిద్ధులయ్యారు. క్రమంగా గదర్ పార్టీ అమెరికాలో శక్తివంతమైంది. మనదేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఆయుధాలు సమకూర్చుకొంది. మొదట బర్మాను ఆక్రమించాలని గదర్ వీరులు బయల్దేరారు. అది బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసింది.
విప్లవ వీరులను పట్టుకొంది. 1915లో చెంచయ్యను మిలటరీ కోర్టులో నిలబెట్టారు, ప్రశ్నించారు, రోజుల తరబడి క్రూరంగా హింసించారు. విపరీతంగా కొట్టారు, శరీరమంతా రక్తమయమయింది. అయినా పెదవి విప్పలేదు. జైలు జీవితం చాలా దుర్భరమయింది. డిటెన్యూగానే 42 సంవత్సరాలు నిర్బంధించారు. అనేక జైళ్లు తిప్పారు. అయినా ఏ రహస్యమూ తెలియలేదు. చివరికి 1919లో చెంచయ్యని విడుదలచేశారు. 1940లో మద్రాసు సింప్సన్ కార్మిక సంఘానికి నాయకుడయ్యాడు. సమ్మె చేయించాడు. అరెస్టయ్యాడు. స్వాతంత్ర్యం వచ్చినా ఆయనకు జైలు జీవితం తప్పలేదు.
ప్రశ్న 3.
చెంచయ్య స్వభావం వ్రాయండి.
జవాబు:
దరిశి చెంచయ్య గొప్పదేశ భక్తుడు. వ్యవసాయ శాస్త్రవేత్త. గదర్ పార్టీ సభ్యుడు. ధీశాలి. జైళ్లలో దారుణ హింసలు అనుభవించాడు. అయినా పెదవి విప్పలేదు. రహస్యాలు చెప్పలేదు. మొండి పట్టుదల కలవాడు. భూదేవి కంటే ఓర్పు
కలవాడు.
![]()
9. పొణకా కనకమ్మ
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
కనకమ్మగారి బాల్యం, విద్యాభ్యాసం గురించి వ్రాయండి.
జవాబు:
పొణకా కనకమ్మగారు నెల్లూరు జిల్లాలోని మినగల్లు గ్రామంలో 1892 జూన్ 10వ తేదీన జన్మించారు. మరుపూరు కొండారెడ్డి, కామమ్మలు ఆమె తల్లిదండ్రులు. పొణకా సుబ్బరామిరెడ్డితో ఆమెకు చిన్నతనంలోనే వివాహమయింది. బాల్యంలో చదువుకోవడానికి అవకాశం లేకపోయింది. పెళ్లయ్యాక పట్టుదలతో చదువుకొంది. పాండిత్యం సంపాదించింది. పద్యరచన, వ్యాస రచనలలో మంచి ప్రావీణ్యం సంపాదించింది.
ప్రశ్న 2.
పొణకా కనకమ్మగారి సేవల గురించి వ్రాయండి.
జవాబు:
భారత స్వాతంత్య్ర పోరాట వీరులకు కనకమ్మగారిల్లే వేదిక. విప్లవవీరులూ, శాంతికాముకులూ అందరూ ఆమెను అభినందించేవారు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసంతో ఆమె స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షితురాలైంది. ఆమె సంఘసంస్కరణ కూడా చేసేది. ‘సుజనరంజనీ సమాజం’ ఆమె స్థాపించింది. దానికి అనుబంధంగా ‘వివేకానంద గ్రంథాలయం’ ఆరంభించింది. ఆమె చాలా సంస్థలు స్థాపించింది.
ఆ రోజులలో జీవహింసను వ్యతిరేకిస్తూ పెద్ద పోరాటం చేశారు. అస్పృశ్యతా నిర్మూలనోద్యమం నడిపారు. దళిత వాడలో ఇన్ఫ్లూయంజా అనే జ్వరం వచ్చినపుడు కనకమ్మ, ఆమె భర్త, ఆమె తల్లి సేవలు చేశారు. ఆర్థిక సహాయం కూడా చేశారు. స్వదేశీ సంఘమనే కార్ఖానాను స్థాపించింది. హోంరూల్ ఉద్యమం ప్రచారం చేసింది. స్వాతంత్య్ర సమర యోధుల శిక్షణా సంస్థ పొట్లూరులో సొంతధనంతో ఏర్పరచింది. రాయలసీమలో క్షామం, నెల్లూరులో తుఫాను వచ్చినపుడు అహర్నిశలూ శ్రమించింది. నెల్లూరులో కస్తూరి దేవి విద్యాలయం స్థాపించింది. ఇలా ఆమె అనేక రకాల సేవలు చేశారు.
ప్రశ్న 3.
కనకమ్మగారి స్వభావం వ్రాయండి.
జవాబు:
ఆమె గొప్ప దేశ భక్తురాలు, సంఘసేవా పరాయణురాలు, స్త్రీ విద్యా ప్రేమికురాలు, ఆమె సాహసం కలది, పట్టుదల కలది,
త్యాగశీలత కలది, ఆమె చిరస్మరణీయురాలు, పొణకా కనకమ్మగారు ఆధునిక ఆంధ్రదేశ మహిళా స్ఫూర్తికి ప్రతీక.
![]()
10. ఖద్దరు ఇస్మాయిల్, హజరాబీబీ
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
ఇస్మాయిల్ బాల్యం, విద్యాభ్యాసం వ్రాయండి.
జవాబు:
మహమ్మద్ ఇస్మాయిల్ గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామంలో 1892లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మహమ్మద్
మస్తాన్ సాహేబ్, కులుసుంబీ. వారి కుటుంబం నకరికల్లు నుండి తెనాలి వచ్చి స్థిరపడింది.
ప్రశ్న 2.
ఇస్మాయిల్ చేసిన దేశ సేవలను వివరించండి.
జవాబు:
గాంధీగారి పిలుపుతో తెనాలిలో ఖద్దరు దుకాణం ప్రారంభించారు. ఖద్దరు వ్యాప్తికి జీవితాంతం కృషి చేసారు. ఆయన పేరు కూడా ఖద్దరు ఇస్మాయిల్ గా స్థిరపడిపోయింది. ఖద్దరు ఒకటే కాకుండా రాట్నాలు, దూది, చిలపలు, తకిలీలు మొదలైనవి కూడా అందుబాటులో ఉంచేవారు. ప్రజలందరినీ ఖద్దరు ధరించవలసినదిగా ప్రోత్సహించారు. ఆయన ఖద్దరు దుకాణం ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులకు స్వరాజ్య వేదిక. ఆయన ప్రత్యక్ష కార్యాచరణలోను పాల్గొన్నారు. శాసన ఉల్లంఘనం ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, వ్యక్తి సత్యాగ్రహంలో, కల్లు పాకల దగ్గర పికెటింగ్లో పాల్గొని అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు.
ప్రశ్న 3.
హజరాబీబీ స్వభావం వ్రాయండి.
జవాబు:
ఆమె భర్త అడుగుజాడలలో నడిచిన స్త్రీ. భర్త మాటనే తన మాటగా భావించే తత్వం. భర్త ఆదర్శాలనే తన ఆశయాలుగా మలచుకొన్న ఇల్లాలు. భర్త ఇంట్లో లేనప్పుడు ధైర్యంగా ఖద్దరు షాపును నిర్వహించారు. తెనాలి రైల్వేస్టేషన్ ధ్వంసం చేయడానికి ఏడేళ్ళ తన కుమారుని కూడా పంపిన ధీరవనిత ఆమె. తన పిల్లలను హిందీ పాఠశాలకు పంపారు. భర్త మరణించాక ప్రభుత్వం ఇస్తానన్న 5 ఎకరాల భూమిని తిరస్కరించింది. ఆమె ప్రతిఫలాన్ని స్వీకరించే తత్వం లేనిది. అన్న మాట ప్రకారం విమానాశ్రయానికి 22 ఎకరాల భూమినిచ్చింది.
![]()
11. వేదాంతం కమలాదేవి
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
వేదాంతం కమలాదేవిగారు కలకత్తాలో చేసిన సేవ వివరించండి.
జవాబు:
వేదాంతం కమలాదేవిగారు కడపజిల్లా రాజంపేట తాలూకా నందలూరులో జన్మించారు. ఆమె 12వ ఏటనే వేదాంతం..
కృష్ణయ్యతో వివాహం జరిగింది. ఆయన కలకత్తాలో వైద్యవిద్యార్థి. ఆయనకు తోడుగా ఆమె కూడా కలకత్తా వెళ్లారు. కలకత్తాలో ఆమెకు సుప్రభాదేవితో పరిచయం కల్గింది. దేవిగారు సామాజిక కార్యకర్త. దేశప్రజలకు ఆమె రకరకాల సేవలు చేసేవారు. ఆనాటి నుండి కమలాదేవి కూడా స్వాతంత్ర్య పోరాటంలో ప్రవేశించారు. కష్టాలలో ఉన్నవారిని ఆదుకొనేవారు. అమాయకపు గ్రామీణ స్త్రీలకు సహాయం చేసేవారు.
ప్రశ్న 2.
కాకినాడలో కమలాదేవిగారు చేసిన సేవను వ్రాయండి.
జవాబు:
కాకినాడలో దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మగారితో కలిసి విదేశీ వస్త్ర బహిష్కరణలో పాల్గొన్నారు. రాట్నం మీద నూలు తీయడం ఆమె నిత్యకృత్యమైంది. ఖద్దరు ప్రచారం కోసం ఎన్నో గ్రామాలు తిరిగారు. చాలా శ్రమపడి తిలక్ స్వరాజ్యనిధికి విరాళాలు సేకరించారు. ఆ కృషికి గాంధీగారు కూడా ఆమెను ప్రశంసించారు. కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో కార్యకర్తలను క్రమపద్ధతిలో నడిపించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఇలా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ప్రశ్న 3.
కమలాదేవిగారి స్వభావం వ్రాయండి.
జవాబు:
కమలాదేవిగారిది కష్టాలలో ఉన్నవారిని ఆదుకొనే స్వభావం. గ్రామీణ స్త్రీలకు సహాయపడేవారు. ఆమెకు కృషి, పట్టుదల ఎక్కువ. ఏ పని మొదలుపెట్టినా ముందడుగే తప్ప వెనుకడుగు లేదు. ఆమె దేశభక్తురాలు. అరెస్టులకూ, జైళ్లకూ భయపడే స్వభావం కాదు.
![]()
12. దిగుమర్తి జానకీబాయమ్మ
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
దిగుమర్తి జానకమ్మగారి బాల్యం, విద్యాభ్యాసం వ్రాయండి.
జవాబు:
దిగుమర్తి జానకమ్మగారు 1902 నవంబరు 30న విశాఖపట్నంలో జన్మించారు. మల్లెమడుగుల బంగారయ్య, లలితాంబ దంపతులు వారి తల్లిదండ్రులు. బంగారయ్యగారు స్వాతంత్య్ర సమరయోధులు. చదువుకొనే రోజుల్లోనే జానకమ్మగారు దక్షిణాఫ్రికాలో గాంధీగారు చేస్తున్న ఉద్యమాలకు విరాళాలు పోగుచేశారు. బందరు జాతీయ కళాశాల స్థాపనకు విరాళాలు జోలె పట్టారు. ఆమెకు 13వ ఏటనే దిగుమర్తి రామస్వామిగారితో వివాహమయ్యింది. పెళ్లయ్యాక, ఆమె తన చదువును కొనసాగించారు. స్కూల్ ఫైనల్ పరీక్షలలో ఉన్నత స్థానం సాధించారు. అందుకామెకు లేడీ పెట్లాండ్ పతకం లభించింది. భర్త ప్రోత్సాహంతో మద్రాసు వెళ్లి క్వీన్ మేరీ కళాశాలలో చదివి ఇంటర్మీడియెట్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. తర్వాత గుంటూరు శారదానికేతన్ లో పనిచేశారు.
ప్రశ్న 2.
జానకమ్మగారు చేసిన దేశసేవను వివరించండి.
జవాబు:
ఆమె, భర్తతో కలిసి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు చేశారు. ఢిల్లీలో జరిగిన జాతీయ విద్యాసభలో పాల్గొన్నారు. కాకినాడలో కాంగ్రెసు మహాసభలలో పాల్గొన్నారు. లాహోర్లో కాంగ్రెసు మహాసభలలో పాల్గొన్నారు. సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానంలో పాల్గొన్నారు.
ప్రశ్న 3.
జానకమ్మగారి స్వభావం వ్రాయండి.
జవాబు:
జానకమ్మగారికి దేశభక్తి ఎక్కువ. ఆత్మాభిమానం ఉన్న మహిళ. క్షమాపణ చెప్పకుండా జైలులోనే ప్రసవించిన ధీరవనిత. భర్తను అరెస్టు చేసినా భయపడలేదు. ప్రజల్ని ఉత్తేజపరిచేవారు. జానకమ్మగారు గొప్ప ధైర్యవంతురాలు. పోలీసులు ఎంత బాధించినా ఆమె ముఖంలో చిరునవ్వు పోలేదు. తన సంయమనంతో అధికారులే సిగ్గుపడేలా చేసిన యోగిని.
![]()
13. కల్లూరి తులసమ్మ
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
కల్లూరి తులసమ్మగారి బాల్యం, విద్యాభ్యాసం వ్రాయండి.
జవాబు:
కల్లూరి తులసమ్మగారు 1910వ సంవత్సరం డిసెంబరు 25న గుంటూరు జిల్లా పెదరావూరులో జన్మించారు. కొడాలి కృష్ణయ్య, సీతమ్మలు ఆమె తల్లిదండ్రులు. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం పెదరావూరులో జరిగింది. ఆమె చాలా తెలివైనది. ఆమె జీవితం పైన, జీవన విధానంపైనా గాంధీజీ ప్రభావం పడింది. ఆమెకు కల్లూరి రంగయ్యగారితో బాల్య వివాహమయ్యింది. భర్తగారి అనుమతితో సంసార బంధనం వదిలింది.
ప్రశ్న 2.
కల్లూరి తులసమ్మగారి సేవాకార్యక్రమాల గురించి వ్రాయండి.
జవాబు:
అన్నిటినీ వదిలి ఆమె దేశసేవకే అంకితమైపోయారు. రాట్నం తిప్పడం తన జీవన కర్తవ్యంగా ఆమె భావించారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తెనాలి కోర్టులో పికెటింగ్ చేశారు. నినాదాలు చేశారు. అరెస్టయ్యారు. కఠిన కారాగార శిక్ష అనుభవించారు. తన సర్వసంపదనూ గాంధీగారికిచ్చేసింది. గ్రామగ్రామం తిరిగి ఖాదీ ఉద్యమం గురించి ప్రచారం చేస్తుండేది. సర్వోదయ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ అమ్మకంతో వచ్చిన డబ్బుతో పెదరావూరులో ఇల్లు కొన్నారు. అది గుంటూరు ఖాదీ సంస్థకు విరాళంగా ఇచ్చారు. గాంధేయ మార్గాన్ని పూర్తిగా విశ్వసించారు. పరిపూర్ణంగా అమలు జరిపిన ఆచారణ శీలి ఆమె.
ప్రశ్న 3.
తులసమ్మగారి స్వభావం వ్రాయండి.
జవాబు:
కల్మషం తెలియని దేశ సేవకురాలు. దేశసేవ కోసం తన భర్త అనుమతితో సంసార జీవితం వదిలేశారు. దేశసేవను మనసారా ప్రేమించారు. దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని ధారపోశారు. తన జీవిత సుఖాలను త్యాగం చేశారు. గాంధీ సిద్ధాంతాలను పూర్తిగా నమ్మారు. గాంధీగారు తన ఆత్మకథలో చెప్పిన నిరాడంబరత, స్వావలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే నాల్గింటిని తులసమ్మగారు తన జీవితంలో కచ్చితంగా అమలు జరిపారు. అదీ తులసమ్మగారి స్వభావం.
![]()
14. ద్వారబంధాల చంద్రయ్య
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
బోదలూరుకు చెందిన ద్వారబంధం చంద్రయ్య గురించి వ్రాయండి
జవాబు:
చంద్రయ్య తూర్పు గోదావరి జిల్లాలోని బోదలూరు నివాసి. రంప పోరాటంలో ప్రముఖుడు. ఆ రోజులలో బ్రిటిష్ అధికారులు గిరిజనులను దోపిడీ చేసేవారు. వడ్డీ వ్యాపారులు కూడా గిరిజనులను దోపిడీ చేసేవారు. గిరిజనుల ధనమాన ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. చంద్రయ్య ఆ దుర్మార్గాలకు ఎదురు నిల్చాడు. బ్రిటిష్ సైన్యాలతో పోరాడాడు. అడ్డతీగల పోలీస్ స్టేషన్ ముట్టడించాడు. దానిని తగులబెట్టాడు. అతనిని పట్టిచ్చినవారికి రూ.1000లు బహుమతిని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన అనుచరులే ఆయనను కుట్రచేసి 1880 ఫిబ్రవరి 12వ తేదీన చంపివేశారని చరిత్రకారులు అంటున్నారు.
ప్రశ్న 2.
శరభవరానికి చెందిన ద్వారబంధాల చంద్రయ్యను గురించి వ్రాయండి.
జవాబు:
శరభవరానికి చెందిన మాధవస్వామిగారు చెప్పిన దాని ప్రకారం చంద్రయ్య బొబ్బిలిలో జన్మించాడు. నరసమ్మ, లక్ష్మయ్యలు ఆయన తల్లిదండ్రులు. కొన్ని కారణాలవల్ల ఆయన నెల్లిపూడిలో పెరిగాడు. ఆయనకు స్వాతంత్య్ర కాంక్ష ఎక్కువ. బ్రిటిష్ వారి దౌర్జన్యాలను ఎదిరించడానికి బురదకోటను తన స్థావరంగా చేసుకొన్నాడు. పేదలకు గంజి కేంద్రాలను నెలకొల్పాడు. యువవీరులని సమీకరించాడు. బ్రిటిష్ మీద పోరాడాడు. వ్యాపారులను కొల్లగొట్టాడు. అది పేదలకు పంచాడు. ముట్టడించిన బ్రిటిష్ సైన్యాల చేతిలో గాయపడ్డాడు. శరభవరం చేరాడు. లక్ష్మమ్మ సేవలు చేసింది. ఆమెను పెళ్ళాడాడు. పిల్లలను కన్నాడు. 1891 ఫిబ్రవరి 23న స్థానిక జమీందారులు, బ్రిటిష్వారు కలిసి ఆయనను కిర్లంపూడిలో కిరాతకంగా చంపారు.
ఉపవాచకములోని సంఘటనల ప్రశ్నలు :
అవగాహన – ప్రతిస్పందన :
ఉపవాచకం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించినవో రాయండి.
ప్రశ్న 1.
అ) అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా చేసేవారు.
ఆ) 1907 సూరత్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆయన హాజరయ్యారు.
ఇ) ఆంధ్రమహాసభకు 1929 లోనూ, 1937 లోనూ ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ) 1936లో ఆమె దృష్టి తిరువణ్ణామలై వైపు సాగింది.
జవాబు:
అ) న్యాపతి సుబ్బారావు
ఆ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఇ) కడప కోటిరెడ్డి
ఈ) పొణకా కనకమ్మ
ప్రశ్న 2.
అ) 1943 డిసెంబర్లో ఆయన జైలు నుండి విడుదలయ్యారు.
ఆ) రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది.
ఇ) ఆయన సారథ్యంలో కాంగ్రెసు మహాసభలు ఎంతో విజయవంతం అయ్యాయి.
ఈ) 1902లో దాసు నారాయణరావుతో కలిసి కృష్ణా పత్రిక ప్రారంభించారు.
జవాబు:
అ) కడప కోటిరెడ్డి
ఆ) పొణకా కనకమ్మ
ఇ) న్యాపతి సుబ్బారావు
ఈ) కొండ వేంకటప్పయ్య
![]()
ప్రశ్న 3.
అ) 1927లో జరిగిన సైమన్ గో బ్యాక్ ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.
ఆ) పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో వారు నహించిన పాత్ర చాలా గొప్పది.
ఇ) ప్రసంగం మధ్యలో అనేక తెలుగు పద్యాలను, సంస్కృత శ్లోకాలను, అలవోకగా చదువుతూ ప్రసంగించేది. ఈ) సాహిత్యాభివృద్ధిని కోరుకుని, చింతామణి పత్రికలో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసి, ఉత్తమ నవలా రచనను
ప్రోత్సహించారు.
జవాబు:
అ) కొండ వేంకటప్పయ్య
ఆ) ఉన్నవ దంపతులు
ఇ) దువ్వూరి సుబ్బమ్మ
ఈ) న్యాపతి సుబ్బారావు
ప్రశ్న 4.
అ) స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షకు గురైన తొలి తెలుగు మహిళ ఆమె.
ఆ) వీరి 14వ ఏట కంచికచర్ల కరణం గారి అమ్మాయి పింగళి దుర్గాంబతో వివాహం జరిగింది.
ఇ) పద్య రచనతో పాటుగా వ్యాసరచనలోనూ ఆమె మంచి ప్రావీణ్యత సాధించింది.
ఈ) తొలి నుండీ ఆయనలో కార్యనిర్వహణ దీక్ష, సామర్థ్యం, పట్టుదల చాలా ఎక్కువ.
జవాబు:
అ) దువ్వూరి సుబ్బమ్మ
ఆ) అయ్యదేవర కాళేశ్వరరావు
ఇ) పొణకా కనకమ్మ
ఈ) న్యాపతి సుబ్బారావు
ప్రశ్న 5.
అ) ఆ రోజుల్లో జీవహింసను వ్యతిరేకిస్తూ ఆమె గొప్ప పోరాటమే చేశారు.
ఆ) ‘నేను నా దేశం’ పేరుతో వచ్చిన ఆయన స్వీయచరిత్ర, ఆయన జీవితాన్ని మన కళ్ళముందు నిలుపుతుంది.
ఇ) జైలు జీవితం ఆయనలోని ధైర్యాన్ని, స్వరాజ్య స్ఫూర్తిని మరింత శక్తివంతం చేసింది.
ఈ) 1930లో ఆయన మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న కాలంలోనే విజయవాడకు విద్యుచ్ఛక్తి వచ్చింది.
ఇ) కడప కోటిరెడ్డి ఈ అయ్యదేవర కాళేశ్వరరావు
జవాబు:
అ) పొణకా కనకమ్మ
ఆ) దరిశి చెంచయ్య
ఇ) కడప కోటిరెడ్డి
ఈ) న్యాపతి సుబ్బారావు
![]()
ప్రశ్న 6.
అ) ఆమెకు సమాధానం చెప్పలేక పోలీసులు తలంచుకొని వెళ్ళిపోయారు.
ఆ) ఆంధ్ర ప్రాంతంలో ఖద్దరు వ్యాప్తికి ఆయన అందించిన సేవలు చాలా గొప్పవి.
ఇ) సంఘ సంస్కరణ రంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆయన అందించిన సహకారం ఎంతో గొప్పది.
ఈ) 1941 సం॥రం జనవరి 15వ తేదీన ఆ దేశభక్తుడు తన జీవితాన్ని చాలించారు.
జవాబు:
అ) దువ్వూరి సుబ్బమ్మ
ఆ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఇ) కొండ వేంకటప్పయ్య ఈ) న్యాపతి సుబ్బారావు
ప్రశ్న 7.
అ) వీధి దీపాల వెలుగులో చదువుకొని, మద్రాసులో బి.ఏ. పాసయ్యారు.
ఆ) అక్కడ .సెలవు రోజుల్లో కష్టపడి పనిచేస్తూ, డబ్బు సంపాదిస్తూ ఆయన వ్యవసాయ శాస్త్రం చదివాడు.
ఇ) దళితుల్ని ప్రేమగా చూసింది. వారిని కష్టకాలంలో ఆదుకుంది.
ఈ) 1904, 1905లలో మద్రాసులో కొమర్రాజు లక్ష్మణరావు, దేశిరాజు పెద బాపయ్యలతో కలిసి, దళిత విద్యార్థుల కోసం రాత్రి పాఠశాల నడిపారు.
జవాబు:
అ) న్యాపతి సుబ్బారావు
ఆ) దరిశి చెంచయ్య
ఇ) పొణకా కనకమ్మ
ఈ) అయ్యదేవర కాళేశ్వరరావు
ప్రశ్న 8.
అ) ఆయన బాల్యమంతా పేదరికంలో గడిచింది.
ఆ) పొగడదొరువు ఖండ్రికలో శ్రీరామ ప్రసాద కోశ నిలయం, కొత్తూరులో గోఖలే భాండాగారం, ఇందుకూరు పేటలో ఎ.ఎస్.ఎస్. పఠన మందిరం వంటివి ఆమె కృషి వల్లనే ఏర్పడ్డాయి.
ఇ) అమృతాంజన లాభాలన్నీ ఆయన తిరిగి దేశానికే వినియోగించారు.
ఈ) తన పాండిత్యంతో అద్భుతమైన రీతిలో ఉపన్యసించి, బ్రిటీష్ ప్రభుత్వ దుర్మార్గాలను నిర్భయంగా ఎండగట్టింది.
జవాబు:
అ) న్యాపతి సుబ్బారావు
ఆ) పొణకా కనకమ్మ
ఇ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఈ) దువ్వూరి సుబ్బమ్మ
![]()
ప్రశ్న 9.
అ) 1897లో మెట్రిక్యులేషన్ పరీక్షలోనూ, 1899లో ఎఫ్.ఎ. లోనూ ఆయన ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
ఆ) తనకున్న కొద్ది పొలాన్నీ సేద్యం చేసుకుంటూ, వ్యవసాయదారునిగా స్వేచ్ఛగా జీవించడం మొదలుపెట్టారు.
ఇ) 1940లో మద్రాసు సింప్సన్ కార్మిక సంఘానికి అధ్యక్షుడై, కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు.
ఈ) భారత స్వాతంత్ర్య పోరాట వీరులకు వారి ఇల్లే చర్చావేదికయ్యింది.
జవాబు:
అ) అయ్యదేవర కాళేశ్వరరావు
ఆ) కడప కోటిరెడ్డి
ఇ) దరిశి చెంచయ్య
ఇ) దరిశి చెంచయ్య
ఈ) పొణకా కనకమ్మ
ప్రశ్న 10.
అ) 1919లో గాంధీజీ మద్రాసు వచ్చిన సందర్భంలో ఆమె తన తల్లితో కలిసి వెళ్ళి గాంధీజీని దర్శించారు.
ఆ) అమెరికాలో చదువుకునే రోజుల్లో, గదర్ పార్టీలో సభ్యుడయ్యారు.
ఇ) తొంభై అయిదేళ్ళ సంపూర్ణ జీవితమంతా దేశం కోసం, సమాజం కోసం తపించి, సమాజసేవలో ఆ దంపతులు చరితార్థులైనారు.
ఈ) తన కాలి గోరు కూడా మీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణ అడగదు అంది ఆమె.
జవాబు:
అ) పొణకా కనకమ్మ
ఆ) దరిశి చెంచయ్య
ఇ) కడప కోటిరెడ్డి దంపతులు
ఈ) దువ్వూరి సుబ్బమ్మ
ప్రశ్న 11.
అ) గృహలక్ష్మీ పత్రికవారు ఆమెకు స్వర్ణకంకణం బహూకరించారు.
ఆ) బారసాలనాడు పెద్దలు ఆయనకు పెట్టిన పేరు నాగలింగం.
ఇ) 1927లో జరిగిన సైమన్ గోబేక్ ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.
ఈ) 1913 సం॥రం మార్చి నెల 1వ తేదీన పొట్లపూడిలో “సుజనరంజన సమాజం” స్థాపించింది.
జవాబు:
అ) లక్ష్మీబాయమ్మ
ఆ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఆ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఇ) కొండ వేంకటప్పయ్య
ఈ) పొణకా కనకమ్మ
![]()
ప్రశ్న 12.
అ) ఆయన చిన్న నాటనే ఆ కుటుంబం రాజమండ్రి వచ్చి స్థిరపడింది.
ఆ) చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలెందరినో ఆదరించి, వారికి తిరిగి వివాహాలు చేయించారు.
ఇ) న్యాయవాద వృత్తిలో వారెంతో గొప్ప పేరు, ధనం సంపాదించారు.
ఈ) హోంరూల్ ఉద్యమం నాటి నుండీ సాగిన ఆయన స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని మహాత్ముడి రాయలసీమ పర్యటన, సైమన్ కమీషన్ బహిష్కరణ, దండి ఉప్పుసత్యాగ్రహం మరెంతో ఉత్తేజితం చేశాయి.
జవాబు:
అ) న్యాపతి సుబ్బారావు
ఆ) లక్ష్మీబాయమ్మ
ఇ) అయ్యదేవర కాళేశ్వరరావు
ఈ) కడప కోటిరెడ్డి
ప్రశ్న 13.
అ) సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్య్రం వస్తుందని విశ్వసించాడు.
ఆ) ఆమె జీవితం త్రివేణీ సంగమంలా దేశభక్తి, సంఘసేవానురక్తి, స్త్రీ విద్యా వ్యాప్తితో అల్లుకుపోయింది.
ఇ) కాలక్రమంలో మహాత్మాగాంధీజీ సిద్ధాంతాల వైపు ఆమె ఎంతగానో ఆకర్షితులయ్యారు.
ఈ) 1893 నుండి 1899 వరకూ ఉమ్మడి మద్రాసు శాసన సభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు.
జవాబు:
అ) దరిశి చెంచయ్య
ఆ) పొణకా కనకమ్మ
ఇ) పొణకా కనకమ్మ
ఈ) న్యాపతి సుబ్బారావు
ప్రశ్న 14.
అ) తన నటనతో స్త్రీ పాత్రల్ని గొప్పగా పోషించి గుంటూరులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ) ఆమె 1920లో మొదటిసారిగా ఒక సం॥రం రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు.
ఇ) 1919 రౌలట్ సత్యాగ్రహ యాత్ర సందర్భంగా, గాంధీజీ విజయవాడలోని వారింటికి విచ్చేశారు.
ఈ) సత్యాహింసల శాంతి మార్గమే తన మార్గమని ఆచరించి చూపిన ధీశాలి ఆయన ?
జవాబు:
అ) కొండ వేంకటప్పయ్య
ఆ) దువ్వూరి సుబ్బమ్మ
ఆ) దువ్వూరి సుబ్బమ్మ
ఇ) అయ్యదేవర కాళేశ్వరరావు
ఈ) కడప కోటిరెడ్డి
ప్రశ్న 15.
అ) గాంధీజీ రాయలసీమలో పర్యటించినప్పుడు, ఆయన గాంధీజీతో కలిసి సాగి ప్రతి సభని విజయవంతం చెయ్యడంలో
ఎంతగానో కృషి చేశారు.
ఆ) క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
ఇ) స్వాతంత్ర్య పోరాటంతో పాటుగా స్త్రీ జనోద్ధరణకు, పేదరిక నిర్మూలనకు ఆయన కృషి చేశారు.
ఈ) బాలగంగాధర్ తిలక్ భావాలతో ప్రేరణ పొంది, పొట్లపూడిలో స్వదేశీ నేత సంఘమనే కార్ఖానాను స్థాపించింది.
జవాబు:
అ) కడప కోటిరెడ్డి
ఆ) రామసుబ్బమ్మ
ఇ) దరిశి చెంచయ్య
ఈ) పొణకా కనకమ్మ
![]()
ప్రశ్న 16.
అ) 1921లో టంగుటూరి ప్రకాశం అధ్యక్షతన కాకినాడలో జరిగిన సభలో స్వాతంత్ర్య తీర్మానాన్ని సమర్థిస్తూ ఆమె చేసిన ప్రసంగం అశేష జనవాహినిని ఉత్తేజపరిచింది.
ఆ) గ్రంథాలయోద్యమంలో అయ్యంకి వెంకటరమణయ్యతో, సూరి నరసింహశాస్త్రితో కలిసి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో. దాదాపుగా ఏడెనిమిది వందల గ్రామాలలో గ్రంథాలయాలు స్థాపించారు.
ఇ) ఆంధ్ర ప్రాంతమంతా తిరిగి స్వరాజ్య సందేశాన్ని ప్రచారం చేయడంతో పాటు స్వాతంత్ర్య శపథం చేసిన వారందరికీ ఆమె వీర కంకణాలు కట్టింది.
ఈ) ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన ఒప్పందం వీరి గృహం శ్రీబాగ్ లోనే జరిగింది.
జవాబు:
అ) దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ
ఆ) అయ్యదేవర కాళేశ్వర్రావు
ఇ) లక్ష్మీబాయమ్మ
ఈ) కాశీనాథుని నాగేశ్వరరావు
ప్రశ్న 17.
అ) ఆమె జీవితం పైనా, జీవిత విధానం పైనా గాంధీజీ ప్రభావం పడింది.
ఆ) దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటానికి ప్రతిఫలం తీసుకోవడానికి ఆయన అంగీకరించలేదు.
ఇ) బాగా చదువుకోవాలని తహసిల్దారు ఉద్యోగం చేయాలనేది ఆయన చిన్ననాటి కోరిక.
ఈ) కొందరు మిత్రులతో కలసి 1878వ సంవత్సరంలో “ది హిందూ” పేరుతో ఒక ఆంగ్ల దినపత్రికను స్థాపించారు.
జవాబు:
అ) కల్లూరి తులసమ్మ
ఆ) ఖద్దర్ ఇస్మాయిల్
ఇ) దరిశి చెంచయ్య
ఇ) దరిశి చెంచయ్య
ఈ) న్యాపతి సుబ్బారావు
![]()
ప్రశ్న 18.
అ) ఈ పాఠశాల అభివృద్ధి కోసం తన ఆస్తిని అమ్మి, ఆ రోజుల్లోనే పదివేల రూపాయల విరాళం అందించిన సహృదయ మూర్తి ఆయన.
ఆ) దేశాన్ని మనసారా ప్రేమించి, దేశస్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని, జీవిత సుఖాలను ధారపోసిన మహనీయురాలు ఆమె.
ఇ) విద్యాభివృద్ధి జరిగితేనే, సంఘసంస్కరణ సాగుతుందని ఆమె మనసారా విశ్వసించింది.
ఈ) 1929లో ఢిల్లీలో జరిగిన మహిళా విద్యాసభలో ఆమె పాల్గొన్నారు.
జవాబు:
అ) కొండ వేంకటప్పయ్య
ఆ) కల్లూరి తులసమ్మ
ఇ) పొణకా కనకమ్మ
ఈ) దిగుమర్తి జానకీబాయమ్మ
ప్రశ్న 19.
అ) అడ్డతీగల పోలీస్ స్టేషన్ని ముట్టడించి, అగ్నికి ఆహుతి చేశాడు.
ఆ) దానితోపాటుగా తెలుగులో చింతామణి పత్రికను, ఇంగ్లీషులో ఇండియన్ ప్రోగ్రస్ పత్రికను స్థాపించి నిర్వహించారు.
ఇ) రాట్నం వడికితే వచ్చిన, కొద్దిపాటి ఆదాయం ద్వారా ఆమె జీవితం సాగుతూ వచ్చింది.
ఈ) జైల్లో ఉన్నప్పుడు భగవద్గీతకు ఆయన వ్యాఖ్యానం వ్రాశారు.
జవాబు:
అ) ద్వారబంధాల చంద్రయ్య
ఆ) న్యాపతి సుబ్బారావు
ఇ) కల్లూరి తులసమ్మ
ఈ) కాశీనాథుని నాగేశ్వరరావు
ప్రశ్న 20.
అ) లండన్లో బారిష్టరు చదివి న్యాయవాదిగా వృత్తి చేస్తూనే సంఘసంస్కరణకు అంకితమయ్యారు.
ఆ) ఆంధ్రప్రదేశ్ దాదాపుగా ఏడెనిమిది వందల గ్రామాలలో గ్రంథాలయాలు స్థాపించారు.
ఇ) ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో మంత్రిగా ఆయన పనిచేశారు.
ఈ) గోదావరి జిల్లాలోని ఎల్లవరం డివిజన్లో ఆయన అనేకమార్లు బ్రిటిష్ సైన్యాలతో పోరాటం చేశాడు.
జవాబు:
అ) లక్ష్మీనారాయణ
ఆ) అయ్యదేవర కాళేశ్వరరావు
ఇ) కడప కోటిరెడ్డి
ఈ) ద్వారబంధాల చంద్రయ్య
![]()
ప్రశ్న 21.
అ) ఆయనను ఢిల్లీ, కోలకత్తా, లాహోర్, కన్ననూర్, ఆలీపూర్, కోయంబత్తూరు జైళ్ళలో ఉంచి హింసించారు.
ఆ) రాయవెల్లూరు జైలులో ఆమె శిక్షను అనుభవిస్తున్నప్పుడు, ప్రభుత్వానికి క్షమాపణ చెబితే, జైలు నుండి విడుదల చేస్తా మంది బ్రిటిష్ ప్రభుత్వం.
ఇ) ఆమె సాహసం, పట్టుదల, త్యాగశీలత చిరస్మరణీయాలు.
ఈ) తన తల్లి తనకు ఇచ్చిన నగలన్నిటినీ తిరిగి ఇచ్చేశారు.
జవాబు:
అ) దరిశి చెంచయ్య
ఆ) దిగుమర్తి జానకీబాయమ్మ
ఇ) పొణకా కనకమ్మ
ఈ) కల్లూరి తులసమ్మ
ప్రశ్న 22.
అ) ఆమెది ఒంటరి జీవితం, కానీ, దేశప్రజలందరూ ఆమె కుటుంబ సభ్యులే.
ఆ) అక్కడే లక్ష్మమ్మ అనే యువతి ఆయనను ఆదరించి, గాయాలను నయం చేసిందిట.
ఇ) తెనాలి పట్టణంలోనూ, పరిసర గ్రామాలలోనూ ఖద్దరు వ్యాప్తిని ప్రోత్సహించారు.
ఈ) భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్న ఆదర్శదంపతులు వారు.
జవాబు:
అ) కల్లూరి తులసమ్మ
ఆ) ద్వారబంధాల చంద్రయ్య
ఇ) ఖద్దర్ ఇస్మాయిల్
ఈ) ఖద్దర్ ఇస్మాయిల్
ప్రశ్న 23.
అ) 1921లో అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సభలో బెజవాడలో నిర్వహించడానికి ఆయన చూపిన పట్టుదల, దీక్ష
చాలా గొప్పవి.
ఆ) తిలక్ స్వరాజ్యనిధికి విరాళాలు సేకరించడానికి ఆమె ఎంతో శ్రమించారు.
ఇ) బందరు జాతీయ కళాశాల స్థాపనకూ విరాళాలు జోలె పట్టింది.
ఈ) మహాత్మాగాంధీ వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించినప్పుడు వ్యక్తి సత్యాగ్రాహిగా ఆయన ముందు నిలిచాడు.
జవాబు:
అ) కొండ వేంకటప్పయ్య
ఆ) వేదాంతం కమలాదేవి
ఇ) దిగుమర్తి జానకీబాయమ్మ
ఈ) కడప కోటిరెడ్డి
![]()
ప్రశ్న 24.
అ) బాల్యంలో ఎక్కువ చదువుకోవడానికి అవకాశం లేకపోయినా, వివాహమయ్యాక స్వయం కృషితో చదువుకొని మంచి పాండిత్యం సంపాదించింది.
ఆ) అఖిలభారత కాంగ్రెస్ కార్యవర్గ సంఘంలో సభ్యురాలిగా ఆమె నియమించబడింది.
ఇ) ఎక్కడెక్కడి నుండో స్వాతంత్ర్య పోరాట వీరులు తెనాలి వచ్చి, వారి ఖద్దరు దుకాణం దగ్గర కలుస్తుండేవారు.
ఈ) జైల్లోనే ప్రసవించి బిడ్డకు జన్మనిచ్చిన మహిళామణి దిగుమర్తి జానకీబాయమ్మ.
జవాబు:
అ) పొణకా కనకమ్మ
ఆ) పొణకా కనకమ్మ
ఇ) ఖద్దర్ ఇస్మాయిల్
ఈ) దిగుమర్తి జానకీబాయమ్మ
ప్రశ్న 25.
అ) తన వైవాహిక జీవితం దేశస్వాతంత్ర్య పోరాటానికి ప్రతిబంధకం అవుతుందని భావించి, దేశం కోసం సంసారిక జీవితాన్నే త్యాగం చేసిన త్యాగమూర్తి ఆమె.
ఆ) గాంధీజీ రౌలత్ సత్యాగ్రహం ఆరంభించగానే ఆయన తన ఉద్యోగాన్ని విడిచి పెట్టేశారు.
ఇ) స్వాతంత్ర్యోద్యమంతో పాటు స్త్రీల వికాస అభ్యుదయాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు.
ఈ) భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం ఆ రోజు బొంబాయిలో జరగబోతోంది.
జవాబు:
అ) కల్లూరి తులసమ్మ
ఆ) దిగుమర్తి జానకీబాయమ్మ
ఇ) వేదాంతం కమలాదేవి
ఈ) న్యాపతి సుబ్బారావు
ప్రశ్న 26.
అ) బడి పిల్లలకి ట్యూషన్ చెప్పి నెలకు ఏడు రూపాయలు సంపాదించాడు.
ఆ) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు వీరికి ఆప్తులు.
ఇ) గాంధీజీ ఆత్మకథలో చెప్పిన నిరాడంబరత, స్వాలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే నాలుగు ముఖ్యాంశాలనూ ఆమె అవగతం చేసుకున్నారు.
ఈ) ప్రజలందర్నీ ఖద్దరు ధరించవలసిందిగా అర్థించారు.
జవాబు:
అ) కొండ వేంకటప్పయ్య
ఆ) కడప కోటిరెడ్డి దంపతులు
ఇ) కల్లూరి తులసమ్మ
ఈ) ఖద్దర్ ఇస్మాయిల్
![]()
ప్రశ్న 27.
అ) దేశ స్వాతంత్ర్యం కోసం ‘ప్రతి వ్యక్తీ తన జీవితాన్ని ధారపోయాలి’ అన్న బిపిన్ చంద్రపాల్ మాటలు ఆయనకు
ఎంతగానో ప్రేరణ కలిగించాయి.
ఆ) విప్లవవీరులు, శాంతి కాముకులూ అందరూ సమానంగా ఆమెను అభినందించడం ఆరంభించారు.
ఇ) అస్పృశ్యతా నిర్మూలనోద్యమంలో తొలి నుండీ ఆమె ముందడుగు వేసింది.
ఈ) బంధువులు, మిత్రులు ఆమెను అభ్యంతరపరచినా, భర్త ఇష్టాన్ని గౌరవిస్తూనే ముందుకు సాగారు.
జవాబు:
అ) దరిశి చెంచయ్య
ఆ) పొణకా కనకమ్మ
ఇ) పొణకా కనకమ్మ
ఈ) ఖద్దర్ ఇస్మాయిల్
ప్రశ్న 28.
అ) సాధించు లేదా మరణించు అన్న మహాత్ముడి సందేశాన్ని తన గుండె నిండా నింపుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుకు సాగారాయన.
ఆ) వైద్య విద్య పూర్తి అయ్యాక, కాకినాడ తిరిగివచ్చి, స్వయంగా ప్రాక్టీసు ప్రారంభించారు.
ఇ) ఆయనను పట్టి ఇచ్చిన వారికి లేదా ఆయన తల నరికి తెచ్చిన వారికి 1000 రూపాయలు రివార్డును 27-6-1879న ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం.
ఈ) 1944లో అక్టోబరులో జైలు నుండి తిరిగి వచ్చాక, ఆంధ్ర సంఘంవారు నడిపే కార్యకర్తల శిబిరంలో పాల్గొన్నారు.
జవాబు:
అ) ఖద్దర్ ఇస్మాయిల్
ఆ) వేదాంతం కమలాదేవి
ఇ) ద్వారబంధాల చంద్రయ్య
ఈ) కల్లూరి తులసమ్మ
ప్రశ్న 29.
అ) చిన్ననాటి నుండే ఆమెలో సేవాభావం, దేశప్రేమ, త్యాగనిరతి వెల్లడయ్యాయి.
ఆ) దానితో ఆమె పేరు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇ) కేవలం ఖద్దరు వ్యాప్తికే పరిమితంకాకుండా, స్వరాజ్య సమరంలో ప్రత్యక్ష కార్యాచరణలోనూ ఆయన పాల్గొన్నారు.
ఈ) 1898లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహా సభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.
జవాబు:
అ) దిగుమర్తి జానకీబాయమ్మ
ఆ) వేదాంతం కమలాదేవి
ఇ) ఖద్దర్ ఇస్మాయిల్
ఈ) న్యాపతి సుబ్బారావు
ప్రశ్న 30.
అ) 1917లో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ ప్రతినిధి వర్గం మద్రాసు వచ్చినప్పుడు ఒక ప్రతినిధి బృందంతో వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర స్థాపన గురించి, భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన గురించి వివరించారు.
ఆ) 1921లో టంగుటూరి ప్రకాశం అధ్యక్షతన కాకినాడలో, జరిగిన సభలో, స్వాతంత్య్ర తీర్మానాన్ని సమర్థిస్తూ ఆమె చేసిన అద్భుతమైన ప్రసంగం అశేష జనవాహినిని ఉత్తేజ పరిచింది.
ఇ) తాము నమ్మిన సిద్ధాంతాలకు అంకితమై సాగిన ఉత్తమ చరితులు వారిద్దరూ.
ఈ) భర్త ప్రోత్సాహంతో మద్రాస్ వెళ్ళి క్వీన్ మేరీ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యింది.
జవాబు:
అ) కొండ వేంకటప్పయ్య
ఆ) దువ్వూరి సుబ్బమ్మ
ఇ) ఖద్దర్ ఇస్మాయిల్
ఈ) దిగుమర్తి జానకీబాయమ్మ
![]()
ప్రశ్న 31.
అ) కుటుంబ బంధనాలు తెంచుకొన్నాక, చరఖాయే తన జీవితానికి ఆలంబనగా చేసుకున్నారు.
ఆ) దాంతో బ్రిటిష్ సామ్రాజ్యానికి సింహ స్వప్నమైన ఆయనను ఆయన అనుచరులే కుట్ర చేసి, 1880వ సం॥రం ఫిబ్రవరి 12న చంపివేశారని చరిత్రకారులు అంటున్నారు.
ఇ) భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టి, యువతలో నైతిక వికాసానికి కృషి చేశారాయన.
ఈ) భారత జాతీయ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్య్ర పోరాటంలో, సాంఘిక సేవారంగంలో నిరంతరం సేవ చేశారు.
జవాబు:
అ) కల్లూరి తులసమ్మ
ఆ) ద్వారబంధాల చంద్రయ్య
ఇ) న్యాపతి సుబ్బారావు
ఈ) న్యాపతి సుబ్బారావు
ప్రశ్న 32.
అ) ముఖ్యంగా, సంఘ సంస్కరణ రంగంలో కందుకూరి వీరేశలింగం మార్గం ఆయనకు ఎంతో నచ్చింది.
ఆ) 1899లో ఆయన అమృతాంజనం తయారు చేయడం మొదలుపెట్టారు.
ఇ) ఉన్నవ దంపతుల సంఘసంస్కరణని వ్యతిరేకించి, వారిని ఛాందసులు సహపంక్తి భోజనాల నుండి వెలివేస్తే, దానిని
ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు.
ఈ) డప్పు కొట్టీ కొట్టీ వాళ్ళు అలసిపోయి వాళ్ళు వెళ్ళిపోయాక ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించేవారు.
జవాబు:
అ) కొండ వేంకటప్పయ్య
ఆ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఇ) లక్ష్మీబాయమ్మ
ఈ) దువ్వూరి సుబ్బమ్మ
ప్రశ్న 33.
అ) బ్రతుకు బాటలో ఒంటరిగా సాగిపోతూనే తనదైన శైలిని చూపిస్తూ వచ్చేరు.
ఆ) స్కూల్ ఫైనల్ పరీక్షలో ఉన్నత స్థానం సాధించినందుకు, ఆమెకు లేడీ పెట్లాండ్ పతకం లభించింది.
ఇ) దేశమంతా ఉప్పు సత్యాగ్రహం ఉధృతంగా సాగుతున్న కాలంలో నౌపడ దగ్గర ఉప్పు సత్యాగ్రహ ఆందోళనలో పాల్గొన్నారామె.
ఈ) ఆయన ప్రోత్సాహం వల్లనే గుంటూరు జిల్లాలో ఖద్దరు ఎంతో ప్రచారంలోకి వచ్చింది.
జవాబు:
అ) కల్లూరి తులసమ్మ
ఆ) దిగుమర్తి జానకీబాయమ్మ
ఇ) వేదాంతం కమలాదేవి
ఈ) ఖద్దర్ ఇస్మాయిల్
ప్రశ్న 34.
అ) అనీబిసెంట్ అనుచరుడైన రంగనాథ మొదలియార్ని పొట్లపూడి ఆహ్వానించి, హోంరూల్ ఉద్యమ ప్రచారం చేయించింది ఆమె.
ఆ) స్వాతంత్ర్యోద్యమ తొలి రోజుల్లోనే స్వదేశీ ఉద్యమానికి ఆమె నెల్లూరు జిల్లాలో చైతన్య స్ఫూర్తిగా నిలిచింది.
ఇ) ఆయనను డిటెన్యూగానే నాలుగు సంవత్సరాల ఆరు నెలల కాలం నిర్బంధించారు.
ఈ) రాయలసీమలో హోంరూల్ ఉద్యమ కార్యక్రమాలలో, సర్వోత్తమరావుగారితో కలిసి ఆయన పనిచేశారు.
జవాబు:
అ) పొణకా కనకమ్మ
ఆ) పొణకా కనకమ్మ
ఇ) దరిశి చెంచయ్య
ఈ) కడప కోటిరెడ్డి దంపతులు
![]()
ప్రశ్న 35.
అ) అందువల్ల 1894 వరకూ ఆయన నందిగామలోనే ఉండిపోయారు.
ఆ) ఆ దారుణాన్ని చూసి చలించిపోయి ఆమె పోలీసుల లాఠీలకు ఎదురునిలిచింది.
ఇ) కులవ్యవస్థను నిరసిస్తూ ‘సంఘ విజయం’ వంటి గొప్ప నవలను రచించారు.
ఈ) ఆయన స్థాపించిన తెలుగు సాహిత్య మాసపత్రిక భారతి.
జవాబు:
అ) అయ్యదేవర కాళేశ్వరరావు
ఆ) దువ్వూరి సుబ్బమ్మ
ఇ) లక్ష్మీనారాయణ
ఈ) కాశీనాథుని నాగేశ్వరరావు
ప్రశ్న 36.
అ) ప్రజానీకంలో జాతీయ భావాలను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి, పత్రిక గొప్ప సాధనం అన్న విషయాన్ని గమనించి, 1902వ సం॥లో దాసు నారాయణరావుతో కలిసి కృష్ణా పత్రిక ప్రారంభించారు.
ఆ) భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన, స్వామి వివేకానందుడు అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు, మద్రాస్ ఓడరేవులో స్వామిని ఆహ్వానించి, తొలి పూలమాల సమర్పించిన గౌరవం ఆయనకే దక్కింది.
ఇ) అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆయనకు దేశభక్తుడైన లాలాహరిదయాళ్ పరిచయం అయ్యారు.
ఈ) చదువుకునే రోజుల్లో దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేస్తున్న ఉద్యమాలకు ఆర్థిక సహాయం కోసం విరాళాలు సేకరించింది.
జవాబు:
అ) కొండ వేంకటప్పయ్య
ఆ) న్యాపతి సుబ్బారావు
ఆ) న్యాపతి సుబ్బారావు
ఇ) దరిశి చెంచయ్య
ఈ) దిగుమర్తి జానకీబాయమ్మ
ప్రశ్న 37.
అ) గాంధీ మహాత్ముడి అనుచరుడిగా, స్వరాజ్య సంగ్రామంలో జైలు శిక్షలు అనుభవించి, జీవితాన్ని దేశ సేవలో చరితార్థం చేసుకున్న మహనీయుడు ఆయన.
ఆ) పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆయనకు చిన్ననాటే రామాయణ, భారతాలంటే ఇష్టం కలిగింది.
ఇ) తొలి నుండీ ఆయన ఆలోచనలు, ఆశయాలు అదుకు తగిన విధంగానే ఉండడం వల్ల స్వరాజ్య పోరాటంతో మమేకమయ్యారు.
ఈ) బిపిన్ ప్రసంగాలతో ప్రభావితురాలైన ఆమె స్వాతంత్ర్యోద్యమం వైపు అడుగులు వేసింది.
జవాబు:
అ) అయ్యదేవర కాళేశ్వరరావు
ఆ) కడప కోటిరెడ్డి దంపతులు
ఇ) కడప కోటిరెడ్డి దంపతులు
ఈ) పొణకా కనకమ్మ
ప్రశ్న 38.
అ) తన తల మీద కప్పుకున్న చీర చెంగు తీసి, నా దగ్గరేముంది, విధవని బోడిగుండు తప్ప అంటూ పకపకా నవ్వింది.
ఆ) 1918లో ఆయన చేతివృత్తుల్లో స్త్రీలకు శిక్షణ ఇవ్వడం కోసం గుంటూరులో తన గృహంలో ఒక పాఠశాలను ప్రారంభించారు.
ఇ) స్వరాజ్య పోరాటంలో పాల్గొన్నవారిలో ఎవరికి ఏ రకమైన ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఆయన ఆదుకునేవారు.
ఈ) ఆంధ్ర నాటక కళాపరిషత్ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు.
జవాబు:
అ) దువ్వూరి సుబ్బమ్మ
ఆ) లక్ష్మీనారాయణ
ఇ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఈ) కాశీనాథుని నాగేశ్వరరావు
![]()
ప్రశ్న 39.
అ) స్వాతంత్ర్య వీరులకు ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయం అందించిన మహానుభావుడాయన.
ఆ) స్వాతంత్ర్య పోరాటంలోను, బ్రిటీష్ ప్రభుత్వంలో ప్రజా ప్రాతినిథ్యం వహించడంలోను ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు.
ఇ) 1893 నుండి 1899 వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు.
ఈ) ఆ తర్వాత మిగిలిన డబ్బులతో రెండు ఖద్దరు చీరలు కొనుక్కున్నారు.
జవాబు:
అ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఆ) న్యాపతి సుబ్బారావు
ఇ) న్యాపతి సుబ్బారావు
ఈ) కల్లూరి తులసమ్మ
ప్రశ్న 40.
అ) రాట్నం వడికితే స్వరాజ్యం వస్తుంది అన్న గాంధీజీ సందేశం ఆమెను నడిపిన గొప్పశక్తి.
ఆ) భార్యాభర్తలు ఇద్దరూ కలసి కొంతకాలం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఉండి సేవా కార్యక్రమాలు చేశారు.
ఇ) ఆమె ఢిల్లీలో సరోజినీ నాయుడు నిర్వహించిన జాతీయ మహాసభలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గాలను తీవ్రంగా విమర్శించారు.
ఈ) 1907లో సుప్రసిద్ధ దేశభక్తుడైన బిపిన్ చంద్రపాల్ తన దక్షిణ భారత పర్యటనలో మద్రాసు వెడుతుంటే, ఆమె ఆయనను తమ ఇంటికి ఆహ్వానించింది.
జవాబు:
అ) కల్లూరి తులసమ్మ
ఆ) దిగుమర్తి జానకీబాయమ్మ
ఇ) వేదాంతం కమలాదేవి
ఈ) పొణకా కనకమ్మ
![]()
ప్రశ్న 41.
అ) నూకల అన్నం, చింతకాయ పచ్చడి చేసుకుని, ఒక దమ్మిడీ పెట్టి మజ్జిగ కొనుక్కొని రోజును గడిపేవారు.
ఆ) అదే సంవత్సరం డిసెంబర్ నెలలో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు వెళ్ళి సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానాన్ని గుండెలో పదిలపరచుకొన్నారు.
ఇ) మమాత్మాగాంధీజీ 1942లో ఆరంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఆయనలోని దేశభక్తికి అద్దం పట్టింది.
ఈ) ఆనాటి ప్రసిద్ధ సాహిత్య పత్రికలైన శశిరేఖ, హిందూ సుందరి, అనసూయ పత్రికలన్నీ ఆమె రచనల్ని ప్రచురించాయి.
జవాబు:
అ) కల్లూరి తులసమ్మ
ఆ) దిగుమర్తి జానకీబాయమ్మ
ఇ) ఖద్దర్ ఇస్మాయిల్
ఈ) పొణకా కనకమ్మ
ప్రశ్న 42.
అ) ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన ఒప్పందం వారి గృహం శ్రీబాగ్లోనే జరిగింది.
ఆ) మద్యపాన నిషేధాన్ని కోరుతూ, కల్లుపాకల దగ్గర ఎన్నోమార్లు పికెటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇ) రాత్రిలేదు, పగలు లేదు, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తూ పనిచేయడమే ఆయనకు తెలిసిన ఏకైక సూత్రం.
ఈ) ఆమె చేసిన దేశ సేవను దృష్టిలో ఉంచుకొని కాకినాడ కాంగ్రెస్ మహాసభ ఆమెను “దేశబాంధవి”గా ప్రస్తుతించింది.
జవాబు:
అ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఆ) ఉన్నవ దంపతులు
ఇ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఈ) దువ్వూరి సుబ్బమ్మ
ప్రశ్న 43.
అ) 1918లో మహాత్మాగాంధీజీ పిలుపు మేరకు పొట్లపూడిలో తన ఇంట్లో రాట్నాలు పెట్టి, నూలు వడికే పని ఆరంభించింది.
ఆ) హిందూ ధర్మశాస్త్రం మీద వారికి గొప్ప ప్రావీణ్యత అలవడింది.
ఇ) 1940 తొలిసారి ఎనిమిది నెలలు వెల్లూరు జైలులోనూ, తిరుచనాపల్లి జైలులోనూ ఆయన కఠిన కారాగార శిక్ష అనుభవించారు.
ఈ) 1940లో ఆమె మహిళా సమాజాన్ని ఏర్పాటు చేసి, మహిళల హక్కుల్ని కాపాడటానికి ఎంతో కృషి చేశారు.’
జవాబు:
అ) పొణకా కనకమ్మ
ఆ) అయ్యదేవర కాళేశ్వరరావు
ఇ) కడప కోటిరెడ్డి దంపతులు
ఈ) కడప కోటిరెడ్డి దంపతులు
![]()
ప్రశ్న 44.
అ) దాదాపుగా 16 ఏళ్ళు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా స్వాతంత్య్ర ఉద్యమంతో మమేకమయ్యారు.
ఆ) జీవితమంతా దేశసేవలో, ప్రజాసేవలో చరితార్థం చేసుకొన్న ఆ మహనీయుడు 30 డిసెంబర్ 1964న మరణించారు.
ఇ) చిలకమర్తి వారి పద్యాల్నీ, గరిమెళ్ళవారి పాటల్నీ రాగయుక్తంగా పాడుతూ, ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించేది.
ఈ) కడపలో మహిళా డిగ్రీ కళాశాల స్థాపనకు ఉద్యమించడమే కాక, స్వయంగా లక్ష రూపాయలు విరాళం అందించిన దాతృత్వం ఆమెది.
జవాబు:
అ). దువ్వూరి సుబ్బమ్మ
ఆ) దరిశి చెంచయ్య
ఇ) దువ్వూరి సుబ్బమ్మ
ఈ) కడప కోటిరెడ్డి దంపతులు
ప్రశ్న 45.
అ) ఆమె ఉప్పుసత్యాగ్రహంలో విశాఖపట్నం నుండి విజయనగరం వరకు పాదయాత్ర చేసింది.
ఆ) 1902వ సంవత్సరంలో దాసు నారాయణరావుతో కలసి కృష్ణాపత్రిక ప్రారంభించారు.
ఇ) 1899లో ఆయన అమృతాంజనం తయారు చేయడం మొదలుపెట్టారు.
ఈ) స్వాతంత్ర్యోద్యమ తొలిరోజుల్లోనే స్వదేశీ ఉద్యమానికి ఆమె నెల్లూరు జిల్లాలో చైతన్యస్ఫూర్తిగా నిలిచింది.
జవాబు:
అ) దిగుమర్తి జానకీబాయమ్మ
ఆ) కొండ వేంకటప్పయ్య
ఇ) కాశీనాథుని నాగేశ్వరరావు
ఈ) పొణకా కనకమ్మ