Access to the AP 9th Class Telugu Guide 8th Lesson ఇల్లలకగానే Questions and Answers are aligned with the curriculum standards.
ఇల్లలకగానే AP 9th Class Telugu 8th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి :
అమ్మ – జేజి
పెరట్లో-
అమ్మ పిండి రుబ్బుతోన్న సవ్వడే
మాకు కోడి కూతయ్యేది
మేల్కొని ఒళ్ళు విరుచుకొని
బుడ్డిదీపం ముందు కూచుంటే
అమ్మే వుస్తకమై మా ముందు తెరుచుకునేది
తెల్లవార్లూ యంత్రమై గరగరలాడుతూ
అలసిపోయిన అమ్మ
మాకు మస్తిష్కంలో అక్షరమై విచ్చుకునేది
వేసవి ఒంటిపూట బడులప్పుడు
విరామ సమయంలో
మామిడి చెట్లకింద విప్పున టిఫిన్ బాక్సులోంచి
గుప్పున ఉప్మా వాసనై అమ్మ మా కడుపు తడిమేది
పాఠం గడగడా చదివేస్తున్నపుడు
ప్రశ్నలకు జవాబులు ఠక్కున చెబుతున్నపుడు
అమ్మ మెచ్చుకోలు చూపులే
మాకు ప్రశంసా పత్రాలయ్యే
అమ్మ రాత్రి ఎప్పుడు నిద్రపోయేదో!
తెల్లవారుఝాము
కొత్త పుస్తకపు వాసనలాంటి అమ్మ పిలుపుతో
విద్యార్థులుగా మేల్కొనేవాళ్లం !
హృదయంతో ఎవ్వరూ మాట్లాడలేరు
ఒక్క అమ్మ తప్ప!
హృదయంతో ఎవ్వరూ స్పర్శించలేరు
ఒక్క ‘అమ్మ’ కు అర్థం తెలిసిన వాళ్ళు తప్ప !
ఇప్పుడు మాకు ఏఏ ఆశలు
ఏవేవో ఆశయాలు ఉన్నాయి గానీ
అప్పటినుంచి యిప్పటివరకూ
అమ్మకు మేమే ఆశా దీపాలం
అమ్మ – మేం నిర్మించుకున్న జీవితాలకు పునాది
గాలికి ఆరిపోకుండా
దీపం చుట్టూ కట్టిన చేతుల దడి !
దీపమై తానెన్ని దీపాల్ని వెటిగించిందో !
అమ్మ మా పసితనంలో
దీపాన్ని చూపించి
జేజి – దండం పెట్టమని చెప్పేది !
ఆ దీపంలో అమ్మే మాకెప్పుడూ కనిపించేది !!
ఆలోచనాత్మక ప్రశ్నలు :
ప్రశ్న1.
పై కవితలో ‘హృదయంతో ఎవరూ మాట్లాడలేరు ఒక అమ్మ తప్ప’ అని ఎందుకు పేర్కొన్నారు ?
జవాబు:
‘హృదయంతో మాట్లాడడం అంటే మనస్ఫూర్తిగా మాట్లాడడం. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం. మృదువుగా మాట్లాడడం. మనసుకు హత్తుకొనేలా మాట్లాడడం. హృదయానికి హాయి కలిగేలా మాట్లాడడం. ఈ లక్షణాలన్నీ అమ్మలో మాత్రమే ఉంటాయి. “కనుకనే హృదయంతో ఎవరూ మాట్లాడలేరు అమ్మ తప్పు” అని కవిగారు అన్నారు.
ప్రశ్న2.
మీ అమ్మను తలచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ?
జవాబు:
మా అమ్మను తలచుకొంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. అమ్మ నా కోసం చెప్పే కథలు గుర్తొచ్చి మనసంతా ఆనందంతో నిండిపోతుంది. నన్ను నవ్వించడానికి అమ్మ చేసే పనులు గుర్తొచ్చి నా మనసు గిలిగింతలు పెట్టినట్లు ఔతుంది. నా కోసం అమ్మ చేసే వంటలు గుర్తొచ్చి నా నోరు ఊరిపోతుంది. ఆకలి పెరిగి పోతుంది. అమ్మ నన్ను పిలిచే, పేర్లు గుర్తొస్తే సిగ్గుతో నా ముఖం ఎర్రబడి పోతుంది. మా అమ్మ గుర్తొస్తే నాలో భయం పోతుంది. ధైర్యం వస్తుంది. బాధ పోతుంది. సంతోషం ఉప్పొంగి పోతుంది. బద్దకం ఎగిరి పోతుంది. చురుకుతనం పెరిగి పోతుంది. మొత్తం మీద మా అమ్మ గుర్తొస్తే నేను నేనుగా ఉండను. నా ఆనందానికి రెక్కలొచ్చేస్తాయి.
పేజి 105 లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
జీవితం మూడు అలుకు గుడ్డలూ – ఆరు ముగ్గు బుట్టలుగా సాగిపోవడమంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
జీవితం మూడు పువ్వులూ ఆరుకాయలుగా సాగిపోతుందని చాలామంది అంటారు. అంటే జీవితం అభివృద్ధి పథంలో హాయిగా సాగుతోంది అని అర్థం. కాని, జీవితం మూడు అలుకు గుడ్డలూ – ఆరు ముగ్గు బుట్టలుగా సాగిపోవడమంటే ఇల్లలకడం, ముగ్గులు పెట్టడంలోనే ఆవిడ జీవితం సాగిపోతోందని అర్థం.
ప్రశ్న 2.
భర్త ఇల్లాలి భుజం ఎందుకు తట్టాడు ?
జవాబు:
ఇల్లాలిని ప్రోత్సహిస్తే ఎంత పనైనా చేస్తుందని అతను పసిగట్టాడు. ఎవరివైనా మెచ్చుకొంటే ఎంత పనైనా చేస్తారు. అమాయకులైతే పొగడ్తలకు పడిపోతారు. ఇల్లాలిని భుజం తట్టి ప్రోత్సహిస్తే ఇల్లలకడం, ముగ్గులు పెట్టడం, బట్టలు ఉతకడం, వండి వడ్డించడం, ఇల్లు శుభ్రం చేయడం మొదలైన పనులన్నీ ఆవిడే చేసేస్తుంది. పనిమనుషుల ఖర్చు కూడా ఉండదని అతని ఆలోచన. అందుకే ఆ అమాయకపు మహిళ భుజం తట్టి ప్రోత్సహించాడు.
పేజి 106 లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
“అదేమిటమ్మా అమ్మగార్ల పేర్లతో మాకేమిటి పని” అన్న పనిమనిషి మాటలను బట్టి మీకేమీ అర్ధం అయ్యింది ?
జవాబు:
పనిమనుషులెవ్వరూ యజమానులను పేరు పెట్టి పిలవరు. అటువంటి సాహసం చేసి తమ ఉపాధిని పోగొట్టుకోరు. అమ్మగారు, అయ్యగారూ అని యజమానుల్ని పిలుస్తారు. వాళ్ల పిల్లలను అమ్మాయి గారూ, అబ్బాయిగారూ అనీ లేదా బాబుగారూ, పాపగారూ అని పిలుస్తారు.
ప్రశ్న 2.
పేరంటానికి పిలవడం అంటే ఏమిటి
జవాబు:
శ్రావణమాసంలోనో, పుట్టినరోజులకో సాధారణంగా స్త్రీలు చుట్టుపక్కల వారందరినీ పేరంటానికి పిలుస్తారు. వచ్చిన వారికి కాళ్లకు పసుపు రాస్తారు. మెడకు గంధం పూస్తారు. ముఖంపై బొట్టు పెడతారు. సెనగలు, కొబ్బరి : , ముక్కలు కలిపి ఇస్తారు. సందర్భాన్ని, సోమతను బట్టి బాక్సులు, రవికల గుడ్డలు, చీరలు మొదలైనవి కూడా ఇచ్చి నమస్కరిస్తారు. పేరంటానికి వచ్చిన స్త్రీలను, పేరంటం పెట్టిన స్త్రీ గౌరీ దేవిగా భావిస్తుంది. -సత్కరిస్తుంది.
పేజీ 107 లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
‘భర్తగారొక్కరే శరణ్యం’ అని ఇల్లాలు ఎందుకు భావించింది ?
జవాబు:
ఏ భర్తా తన భార్య పేరు మరచిపోడు. పెళ్లి కుదిరిన నాటి నుండీ ఆ పేరును స్మరిస్తూనే ఉంటాడు. అంతేకాక తన భర్త చాలా తెలివైనవాడనీ, గొప్పవాడనీ ప్రతి భార్యా అనుకొంటుంది. పిల్లలకు తన పేరు తెలియదన్నారు. పనిమనిషి తెలియదంది. చుట్టుపక్కలవారూ తెలియ దన్నారు. ఇక తన భర్త తప్ప తన పేరు తెలిసిన వారెవరూ లేరు అందుకే తన పేరు విషయంలో తన భర్తే శరణ్యం అనుకొంది.
ప్రశ్న 2.
పుట్టింటికి ఒక్కర్తే వచ్చిన ఇల్లాలిని చూసిన తల్లిదండ్రులకు వచ్చిన సందేహం ఏమై ఉండవచ్చు ?
జవాబు:
పుట్టింటికి ఒక్కర్తే వచ్చిన ఇల్లాలిని చూడగానే తల్లి దండ్రులకు చాలా అనుమానాలు వస్తాయి. భార్యా భర్తలు మధ్య గొడవైందేమో అనుకొంటారు. తమ కూతుర్ని అల్లుడు తిట్టడమో, కొట్టడమో చేశాడేమో అని భావిస్తారు. అల్లుడుతో దెబ్బలాడి వచ్చేసిందేమో అనుకొంటారు. తమ కూతురేమైనా తప్పు చేస్తే, అత్తింటివారు పంపేశారేమో అనుకొంటారు. ఏదైనా డబ్బు అవసరమై వచ్చిందేమో అనుకొంటారు. మొత్తం మీద ఏదో పెద్ద సమస్యనే ఆ అమ్మాయి వెంటబెట్టుకొని వచ్చిందేమో అని అనుమానిస్తారు. భయపడతారు.
పేజి 108 లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
బ్రతుకు ఇల్లలకడంగా కాకుండా, ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతకడం అంటే మీకేమి అర్థమైంది. ?
జవాబు:
బ్రతుకు ఇల్లలకడం అంటే ఆ జీవితమంతా ఇల్లలకడమే అని అర్థం. ఇంకే పనీ లేకుండా కేవలం ఇల్లలుకుతూనే బ్రతకడం అని చెప్పవచ్చు. బ్రతికినంతకాలం ఒక్కక్షణం తీరుబడి లేకుండా ఇల్లలుకుతూనే గడపడం అని చెప్పవచ్చు.
ఇల్లలకడం బ్రతుకులో ఒక భాగం. అంటే జీవితంలో ‘అన్ని పనులలాగే అది కూడా ఒక ముఖ్యమైన పనిగా భావించి చేయడం, అన్నం తినడం, స్నానం చేయడం, అలంకరించుకోవడంలాగే ఇల్లలకడం కూడా ఒక తప్పనిసరి పనిగా చేయడం అని అర్థం.
ప్రశ్న 2.
అజ్ఞాత వాసం అంటే ఏమిటి ? మహాభారతంలో అజ్ఞాతవాసం చేసినది ఎవరు ?
జవాబు:
అజ్ఞాతవాసం అంటే ఎవరికీ కనబడకుండా, ఆచూకీ తెలియకుండా, తమ గురించి కనీస సమాచారం కూడా ఎవ్వరికీ తెలియకుండా నివసిస్తూ బ్రతకడం అని అర్థం.
మహాభారతంలో కౌరవులతో ఆడిన జూదంలో పాండవులు ఓడిపోయారు. ఓడిపోయినవారు 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేయాలనేది పందెంగా కాసుకొన్నారు. అజ్ఞాత వాసంలో దొరికిపోతే మళ్లీ అరణ్య, అజ్ఞాత వాసాలు చేయాలనేది నియమం.
పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. విరాట రాజు కొలువులో మారు పేర్లతో అజ్ఞాతవాసం చేశారు. ధర్మరాజు – కంకుంభట్టు, భీముడు వలలుడు, అర్జునుడు – బృహన్నల, నకులుడు వాయగ్రంథి, సహదేవులు – తంత్రపాలురు, ద్రౌపది – సైరంధ్రిగా మాలిని అనే పేర్లతో అజ్ఞాతవాసం చేశారు. ఆ అజ్ఞాతవాసంలో అనేక కష్టాలు, అవమానాలు భరించారు.
అవగాహన – ప్రతిస్పందన :
ఇవి చేయండి
పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
ప్రశ్న1.
స్నేహితురాలు గుర్తు చేసిన ఇల్లాలి గతం ఎలాంటిది ? చెప్పండి.
జవాబు:
ఇల్లాలు 10వ తరగతి ఫస్టు క్లాసులో పాసయింది. కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లోనూ ఫస్టు వచ్చింది. అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేది. వాళ్లు పదిమంది స్నేహితులని ఇల్లాలి గతాన్ని ఆమె స్నేహితురాలు గుర్తు చేసింది.
ఇల్లాలి పేరు శారద అని కూడా ఆమే చెప్పింది.
ప్రశ్న2.
తన పేరేమిటన్న ఇల్లాలి ప్రశ్నకు పక్కింటావిడ చెప్పిన జవాబేమిటి ?
జవాబు:
తన పేరేమిటని ఇల్లాలు పక్కింటావిడను అడిగింది. ఆవిడ నవ్వేసింది. ఆమె పేరును తానడగలేదంది. తనకు చెప్పనూ లేదన్నది. కుడిచేతి వైపు తెల్లమేడావిడ అని ఇల్లాలిని పిలుస్తామంది. మందుల కంపెనీ మేనేజరు గారి భార్య అని కూడా అంటామంది. లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉండే ఆవిడ అంటామంది.
ప్రశ్న3.
‘అజ్ఞాత వాసం అంటే మీకేమి అర్థమైంది ?
జవాబు:
అజ్ఞాతవాసం అంటే ఎవరికీ తెలియకుండా, కనీసం సమాచారం కూడా ఎవ్వరికీ తెలియకుండా జనావాసంలోనే రహస్యంగా బ్రతకడమని మాకు అర్థమైంది.
ఆ) ఇచ్చిన గద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గణగణమంటూ స్కూల్ బెల్ మోగింది. పాఠశాల విడిచిపెట్టగానే పిల్లలందరూ తమతో పాటు తెచ్చుకున్న క్యారేజీలు. విప్పి తినడం ప్రారంభించారు. అందులో ఒక అమ్మాయి మాత్రం తెచ్చుకున్న రొట్టెముక్కలు, పళ్లు తమతో పాటు చదువుతున్న పేద విద్యార్థినులకు పంచి, వారితో కలిసి తింది. తెచ్చుకున్న తినుబండారాలు అందరికీ సరిపడలేదు. మరుసటి రోజు అమ్మతో “అమ్మా… ఈ మధ్య నాకు ఆకలి చాలా ఎక్కువగా ఉంటోంది. కాబట్టి నా క్యారేజీలో నలుగురైదుగురికి సరిపడినంత పెట్టు” అంది. నిజమేననుకుని ఆ తల్లి నలుగురైదుగురికి సరిపడినన్ని రొట్టెలు, పళ్లు పెట్టి ఇచ్చింది.,
సాయంత్రం ఆ అమ్మాయి స్కూల్ నుండి వచ్చినప్పుడు అమ్మ క్యారేజీ తెరిచి చూసింది. అందులో చిన్న రొట్టె ముక్కగానీ, కనీసం ఒక పండుగానీ మిగల్లేదు. కూతురు ఇన్ని ఎలా తిందా అని ఆశ్చర్యపోయింది.
ఆమె స్కూల్ టీచర్ని కలిసి తన కూతురు అన్ని పదార్థాలు ఎలా తింటుందో గమనించమని చెప్పింది. “నువ్వేం భయపడవద్దు. నేను చూస్తాలే” అని టీచర్ ఆమెకు ధైర్యం చెప్పింది. మరునాడు ఆ అమ్మాయి తోటిపిల్లలకు ఆహార పదార్థాలు పంచడం గమనించి జరిగిన విషయం ఆమెతో చెప్పింది టీచర్. ఆ అమ్మాయి తల్లి ఎంతగానో మెచ్చుకుంది. ముద్దులాడింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ప్రాంతీయ భేదాలు మరచి, భారత స్వాతంత్ర్యం కోసం ఎనలేని సేవలందించిన అనిబిసెంట్. చిన్ననాటి నుంచి సత్ప్రవర్తన, ప్రేమ, సేవ, త్యాగం వంటి మంచి లక్షణాలను అలవరుచుకోబట్టే ఆమె “మహామనిషి”గా ఎదిగింది.
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న1.
పై గద్యంలో ‘తినదగిన పదార్థాలు’ అనే అర్థం కలిగిన పదాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
పై గద్యంలో తినుబండారాలు అని ‘తినదగిన పదార్థాలు’ అనే పదానికి అర్థం.
ప్రశ్న2.
అనిబిసెంట్ను తల్లి ఎందుకు మెచ్చుకొని, ముద్దులాడింది 2
జవాబు:
తను తెచ్చుకున్న ఆహారపదార్థాలను తోటి పిల్లలకు అనిబిసెంట్ పంచిందనే విషయాన్ని తెలుసుకొని ఆమె తల్లి ఆమెను మెచ్చుకొని ముద్దులాడింది.
ప్రశ్న3.
‘దుష్ప్రవర్తన’ ఈ పదానికి వ్యతిరేక పదాన్ని గద్యంలో వెతికి రాయండి.
జవాబు:
పై గద్యంలో ‘దుష్ప్రవర్తన’ అనే పదానికి వ్యతిరేకపడంగా ‘సత్ప్రవర్తన’ అనే పదం ఉంది.
ప్రశ్న4.
అనిబిసెంట్ భారత దేశానికి ఏ విషయమై సేవలను అందించింది ?
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యం విషయమై సేవలను అందించింది.
ప్రశ్న5.
పై గద్యానికి తగిన శీర్షికను రాయండి.
జవాబు:
త్యాగం అనేది పై గద్యానికి తగిన శీర్షిక.
ఇ) కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
బండారు అచ్చమాంబ 1874లో కృష్ణాజిల్లా నందిగామలో పుట్టింది. తండ్రి వెంకటప్పయ్య, తల్లి గంగమాంబ. ఆమెకు ఆరేళ్లప్పుడు తండ్రి మరణించాడు. పదేళ్ల వయసులో మాధవరావుతో వివాహం జరిగింది. పుట్టిన ఇద్దరు పిల్లలూ ఏడాది వ్యవధిలో మరణించారు. దుఃఖం నుంచి మెల్లగా కోలుకుంది. కన్నీళ్లను కాగితాలపై అక్షరాలుగా మలచింది.
అనంత శక్తిమంతురాలనీ, ఆమెకు విద్యావకాశాలు అందితే జాతికి మార్గదర్శి కాగలదని నిశ్చయంగా నమ్మింది. తినడం, పడుకోవడమే జీవితం కాదని, వెలుగుతూ వెలిగించడమేనని, నరాల్లో ఆవేశం, గుండెల్లో చైతన్యం ఉబికివచ్చేలా ప్రసంగించేది. మాటలే కాదు చేతల్లో కూడా చేవ ఉన్న అచ్చమాంబ తన జీవితాన ఎదురైన దుఃఖాన్ని ధైర్యంగా దిగమింగుకుంది. అదే చెప్పింది అందరికీ. నీ కోసం బతకడం బతుకు కాదని, నిర్భాగ్యులకు నీడనివ్వడమే నీ పరమార్థమని ప్రసంగించేది. ఆచరించేది.
ఓసారి ఓ బిచ్చగత్తె ఇద్దరు పిల్లలతో అడుక్కుంటుంటే వారిని వారించి, ఓ ఆవును కొనిచ్చి, వారి కాళ్లపై వారిని నిలబడేలా చేసింది. తన మరిదికి భార్య చనిపోతే అందరినీ ఎదిరించి, దగ్గరుండి మరీ ఓ వితంతువును అతనికిచ్చి పెళ్లి చేసింది. 1905లో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓ గర్భిణి రోగాన పడింది. ఎవరూ తోడు లేరు. దగ్గరుండి తానే పురుడు పోసింది అచ్చమాంబ. ఆ మహమ్మారి ఆమెనూ కబళించింది. 1905 జనవరి 18న మూడు పదుల వయస్సులోనే అచ్చమాంబ కన్నుమూసింది.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న1.
అచ్చమాంబకు వివాహమైన తరువాత కలిగిన దుఃఖం ఏమిటి ?
జవాబు:
అచ్చమాంబకు వివాహమైన తర్వాత పుట్టిన ఇద్దరు పిల్లలూ ఏడాది వ్యవధిలో చనిపోయారు.
ప్రశ్న2.
‘మార్గదర్శి కావడం’ అంటే ఏమిటి ?
జవాబు:
మార్గదర్శి కావడం అంటే ‘మార్గమును (భవిష్యత్తును) చూసేది’ అని అర్థం. మార్గదర్శి కావడం అంటే అందరికీ
మంచి భవిష్యత్తును చూపించే వ్యక్తి కావడం అని అర్థం.
ప్రశ్న3.
ఏ మహమ్మారి అచ్చమాంబను కబళించింది?
అ) కలరా ఆ) మలేరియా ఇ) ప్లేగు ఈ) టైఫాయిడ్
జవాబు:
ఇ – ప్లేగు
ప్రశ్న4.
‘కన్నుమూయడం’ అనే పదాన్ని దేనికి పర్యాయ పదంగా వాడుతారు ?
జవాబు:
మరణించడం, చనిపోవడం అనే పదాలకు పర్యాయపదంగా కన్నుమూయడం అనే పదాన్ని వాడతారు.
ప్రశ్న5.
‘తన కాళ్ళపై తాను నిలబడటం’ అంటే మీకేమి అర్థం అయ్యింది ?
జవాబు:
తన కాళ్ళపై తాను నిలబడటం, అంటే ఏ అవసరానికి ఎవరిపైనా ఆధారపడకుండా, తన సంపాదన తాను సంపాదించుకొంటూ ఆ డబ్బుతో తన అవసరాలు గడుపుకొంటూ బ్రతకడం అని మాకు అర్థమయింది.
వ్యక్తీకరణ – సృజనాత్మకత :
కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న1.
“నా పేరేమిటో చెప్పమ్మా” అన్న ఇల్లాలికి తల్లి చెప్పిన చరిత్ర ఏమిటి ?
జవాబు:
ఇల్లాలు, వాళ్ల పెద్ద అమ్మాయి అని చెప్పింది. ఆమెను బి.ఎ. దాకా చదివించామని చెప్పింది. యాభైవేల రూపాయిలు కట్నం ఇచ్చి పెళ్లి చేసినట్లు చెప్పింది. ఆమెకు రెండు పురుళ్లు కూడా పోసినట్లుగా కూడా చెప్పింది. ప్రతి పురిటికీ ఆస్పత్రి ఖర్చులు తామే భరించినట్లుగా చెప్పింది. ఇల్లాలి భర్తకు మంచి ఉద్యోగమని గుర్తు చేసింది. ఆయన చాలా మంచివాడని మెచ్చుకొంది. ఇల్లాలి పిల్లలు కూడా బుద్ధిమంతులని చెప్పింది. ఈ విధంగా తన పేరడిగిన ఇల్లాలికి ఆమె తల్లి గత చరిత్రను చెప్పింది.
ప్రశ్న2.
“అమ్మయ్య నువ్వొచ్చావు. ఇంక మాకు పండగేనోయ్” అన్న శారద భర్త మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు ?
జవాబు:
‘అమ్మయ్య నువ్వొచ్చావు. ఇంక మాకు పండుగేనోయ్’ అన్న శారద భర్త మాటలను బట్టి మేము చాలా విషయాలు గ్రహించాం. శారద ఊరెళ్లాక ఇల్లెవ్వరూ అలుకలేదు. ముగ్గులు పెట్టలేదు. అంట్లు తోమలేదు. బట్టలుతకలేదు. బూజులు దులపలేదు. ఏ పనినీ ఎవ్వరూ చేయలేదు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఒక సత్రంలా ఉంది. శారద వచ్చేసిందంటే అన్ని పనులూ చేసేస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. చక్కగా ఉంటుంది. రుచిగా వండి వడ్డిస్తుంది. తామెవ్వరూ ఏ పనీ చేయనక్కర్లేదు. హాయిగా కూర్చుని సుఖపడవచ్చు అని శారద భర్త ఆలోచించాడు. కనుకనే శారద వచ్చిందంటే అంత ఆనందపడ్డాడు. అలా మాట్లాడాడు అని మేము గ్రహించాము.
ప్రశ్న3.
ఇల్లాలు తన పేరు తానే మరచిపోవడానికి గల కారణాలు రాయండి.
జవాబు:
ఇల్లాలు తన పేరు తానే మరచిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే పెళ్లయిన వెంటనే ఆ యిల్లు ఆమెదే అని భర్త అన్నాడు. అలికి ముగ్గులు పెట్టాక ‘ఇల్లు అలకడంలో నేర్పరివి – ముగ్గులు వెయ్యడంలో అంతకన్నా నేర్పరివి’ అని శారద భర్త ఆమెను భుజం తట్టి ప్రశంసించాడు. ఆ ప్రశంసలకు ఉబ్బి తబ్బిబ్బయింది. ఇల్లలకడం, ముగ్గులు పెట్టడం, మిగిలిన పనులలో తనను తాను మరచిపోయి లీనమైపోయింది. భర్త ‘ఏమోయ్’ అంటాడు. పిల్లలు ‘అమ్మా’ అంటారు. పనిమనిషి ‘అమ్మగారూ’ అంటుంది. పక్కిళ్లవాళ్లు ‘వదినగారూ, అక్కగారూ, చెల్లెమ్మా’ అంటూ ఏవో వరసలు పెట్టి పిలుస్తారు. ఉత్తరాలు కూడా ఆమె పేరున రావు. మిసెస్ మూర్తిగానే అందరికీ తెలుసు. అందుచేత శారద పెళ్లయ్యాక ఆమె పేరు ఆ ఇంటిలో వినబడలేదు. వినబడే అవకాశమూ లేదు. ఆమెకు కూడా తన పేరు తలచుకొనే అవకాశం, తీరుబడి లేనంత చాకిరీ. అందుకే ఆ ఇల్లాలు తన పేరు మరిచిపోయింది.
ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న1.
కథలో ఇల్లాలు తన పేరు మరచిపోవడాన్ని మీరు సమర్థిస్తారా ? ఎందువల్ల ?
జవాబు:
కథలో ఇల్లాలు తన పేరును మరచిపోవడాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే ‘ఇల్లలకగానే’ కథలో ఇల్లాలు ఇల్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఇల్లాలు ఇల్లలికే సంబరంలో పేరు మరిచిపోయాను అని అనుకుంది. దీనిని నేను సమర్థిస్తాను. “ఇల్లాలు చదువుకొనే రోజుల్లో స్కూలు ఫస్టు, కాలేజీ స్థాయిలో మ్యూజిక్ ఫస్టు. మంచిగా బొమ్మలు కూడా వేసేది. ఇంత ప్రతిభా పెళ్ళి కాగానే ఒక్కసారిగా మాయమైంది.
ఇల్లలకడం, ముగ్గులు పెట్టడం ఇంకా వంటా వార్పు, పిల్లల పనితో ఇల్లాలికి సమయం సరిపోయేది కాదు. ఇంక తన గురించి ఆలోచించే సమయం ఎక్కడిది? పెళ్ళయిన కొత్తలో “నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి – ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి – సెభాష్! కీప్ ఇట్ అప్” అంటూ భుజం తట్టిన భర్తను సంతోష పెట్టడానికి ఆమె జీవితం మూడు అలుకు గుడ్డలూ – ఆరు ముగ్గు బుట్టలుగా సాగిపోతూ వచ్చింది. తన పేరు ఎవరూ చెప్పడం లేదని, పుట్టింటికి వెళ్ళి వస్తానని భర్తను అడిగితే, భర్త ‘నీవు లేకపోతే ఎలా ? ఇంటి పని ఎవరు చేస్తారు ?’ అని అడుగుతాడు. అంత తీరిక లేని విధంగా జీవితం గడుపుతోంది ఆ ఇల్లాలు.
తన స్నేహితురాలు వచ్చే దాకా తన జీవితంలో ఆనందమయ క్షణాలు ఉన్నాయనే సంగతే మరిచిపోయింది. బ్రతుకు ఇల్లలకడంగా కాకుండా, ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతకడం తెలియని ఎంతోమంది అమ్మ స్థానంలో ఉన్న స్త్రీ మూర్తులకు ఈ ఇల్లాలునే ఉదాహరణగా చెప్పవచ్చు. తన గురించి కాక, తన వారిని గురించి ఆలోచించి, తనను తాను మరచిపోయే ఇల్లాలి మానసిక స్థితిని సమర్థించడమే కాదు, అటువంటి మాతృమూర్తులకు సహకరించాలి కూడా.
ప్రశ్న2.
మరచిపోయిన తన పేరును తెలుసుకోవడానికి ఇల్లాలు చేసిన ప్రయత్నాలు ఏవి ?
జవాబు:
మరచిపోయిన తన పేరును తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కిటికీ దగ్గర నిలబడింది. తలగోక్కుంది. చాలా చాలా ఆలోచించింది. ఎదురింటికి ఉన్న సుహాసిని గారి నేమ్ ప్లేట్ చూసి, తన పేరు గుర్తుకు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించింది. తెగ ఆలోచించింది. కంగారు పడింది. ఎలాగైనా తన పేరును తాను తెలుసుకోవాలనే పట్టుదల పెరిగింది.
తన పేరు పనిమనిషిని అడిగింది. అమ్మగార్ల పేర్లు తాము తెలుసుకోమనీ, వారి పేర్లతో తమకు పని లేదనీ ఆ పని మనిషి’ నిష్కర్షగా ఆ ఇల్లాలికి చెప్పింది. ఆ అమ్మాయి మాటలను ఆ ఇల్లాలు తప్పు బట్టలేదు.
తన పిల్లలకైనా తన పేరు తెలుస్తుందేమోనని ఆశించింది. పిల్లలను తన పేరు అడిగింది. వాళ్లు ఆశ్చర్యపడ్డారు. తమకు ‘అమ్మ’ అనే తెలుసు తప్ప ఆమె పేరు తెలియదన్నారు. తన పేరును ఆమె ఎప్పుడూ తమకు చెప్పలేదని వారన్నారు. ఆమె పేరుతో ఉత్తరాలు కూడా రావనీ, అందుకే తమకు ఆమె పేరు తెలియదన్నారు.
అయినా ఆ ఇల్లాలు నీరసపడలేదు. ఇంకా పంతం పెరిగింది. ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే పట్టుదల పెరిగి పోయింది. పేరంటానికి పిలువడానికి వచ్చిన పక్కింటావిడను తన పేరు ఏమిటని అడిగింది. తానడగా లేదని, ఆమె చెప్పాలేదు కనుక తనకు ఆమె పేరు తెలియదని చల్లగా చెప్పింది. భర్తను అడిగింది. ఆయనా నిరాశ పరిచాడు. కొత్త పేరైనా పెట్టుకోమన్నాడు, కానీ పేరుతో ఆమెకు పని లేదన్నట్లు మాట్లాడాడు. సర్టిఫికెట్లలో చూసుకోమని సలహా ఇచ్చాడు. సర్టిఫికెట్లు కోసం ఇల్లంతా వెతికింది. కానీ, అవి దొరకలేదు. పుట్టింట్లో ఉంటాయనుకొంది.
భర్తను ఒప్పించింది. రెండురోజులు పుట్టింటికి వెళ్లింది. కానీ పుట్టింట్లో కూడా సర్టిఫికెట్లు దొరకలేదు. తల్లిని తన పేరు అడిగింది. ఆమె ఇల్లాలి పెంపకం, చదువు, కట్నం, పెళ్లి, పురుళ్లూ గురించి చెప్పిందే తప్ప పేరు మాత్రం చెప్పలేదు. ‘అంతలో తన చిన్ననాటి స్నేహితురాలు ప్రమీల కనిపించింది. తన పేరును పెట్టి పిలిచింది.. పేరును గుర్తు చేసింది. చిన్నతనం గుర్తు చేసింది. సమస్యను తీర్చింది. ఆనందాన్నిచ్చింది.
ప్రశ్న3.
ఇల్లాలు, స్నేహితురాలిని కలిసిన సందర్భాన్ని సంభాషణ రూపంలోకి మార్చి రాయండి.
జవాబు:
స్నేహితురాలు : హాయ్ ! శారదా ! ఎలా ఉన్నావు ?
ఇల్లాలు : ఏమన్నావు మళ్లీ పిలువు
స్నేహితురాలు : శారదా ! అన్నాను. శారదా !
ఇల్లాలు : హమ్మయ్య నన్ను బ్రతికించావే ప్రమీలా !
స్నేహితురాలు : అదేమిటే అలా అంటున్నావు ?
ఇల్లాలు : నా పేరు మరచిపోయానే ? పిచ్చిదానిలాగా ఎంతమందినడిగానో ! ఎవ్వరూ చెప్పలేదు.
స్నేహితురాలు : అదేంటే! నువ్వు టెన్త్ స్కూలు ఫస్టు వచ్చావు కదా !
ఇల్లాలు : అవునా!
స్నేహితురాలు : అవునా ! ఏంటే నువ్వు మ్యూజిక్ లో ఫస్టు వచ్చావు.
ఇల్లాలు : అంత గొప్పదానినా !
స్నేహితురాలు : అయ్యో ! నువ్వు బొమ్మలెంత బాగా వేసేదానివో !
ఇల్లాలు : అన్నీ మరచిపోయానే
స్నేహితురాలు : ఏం ? ఎందుకు ?
ఇల్లాలు : ఇల్లు, భర్త, పిల్లలూ, చాకిరీ వీటిలో పడి నన్ను నేనే మరచిపోయానే.
స్నేహితురాలు : కొంచెం టైం అయినా నీకు నువ్వు కేటాయించుకో, అప్పుడే జీవితం బాగుంటుంది.
ఇల్లాలు : ఇటుపైన కొత్త శారదను చూస్తావుగా, నా కళల వీణకు బూజు దులుపుతాను. కొత్త రాగాలు పలికిస్తాను.
భాషాంశాలు :
పదజాలం :
అ) ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి, సొంత వాక్యాలలో ప్రయోగించండి.
1. కోనేరు హంపి చదరంగం ఆటలో నేర్పరి.
జవాబు:
నేర్పరి = నైపుణ్యం గలది
మిథాలారాజ్ క్రికెట్లో నైపుణ్యం కలది కనుక అగ్రస్థానంలో నిలిచింది.
2. అమ్మ తీర్చిదిద్దిన బొమ్మను నేను.
జవాబు:
తీర్చిదిద్దిన చక్కగా సవరించిన
గురువులు చక్కగా సవరించిన విద్యతో నాకు తెలివి పెరుగుతోంది.
3. ఉపాధ్యాయుడు మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థి భుజం తట్టాడు.
జవాబు:
భుజం తట్టాడు = ప్రోత్సహించాడు.
మా నాన్న నన్ను అన్నింటిలోను ప్రోత్సహించాడు.
4. విద్యార్థికి విద్యార్జనే తపనగా ఉండాలి.
జవాబు:
విద్యార్జన = చదువుకోవటం
నాకు చదువుకోవటం అంటే చాలా ఇష్టం.
ఆ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నిఘంటువును ఉపయోగించి సమానార్థక పదాలను రాయండి.
1. అన్నకు చదివిన పద్యం గుర్తు రాలేదు.
జవాబు:
‘గుర్తు = జ్ఞాపకం, జ్ఞప్తి
2. పండగనాడు ఇంట్లో అందరూ కొత్త బట్టలు ధరించారు.
జవాబు:
బట్టలు = వస్త్రాలు, ఉడుపులు,
3. నెహ్రూ జైలు నుండి ఇందిరకు ఉత్తరాలు రాశారు.
జవాబు:
ఉత్తరాలు = లేఖలు, జాబులు
4. క్రికెట్ చూస్తున్నవారందరకూ మన జట్టే గెలవాలని తపన.
జవాబు:
తపన = ఉత్కంఠ, ఎక్కువ ఆసక్తి
5. చదువుకున్న ఇల్లాలు, ఇంటిని చక్కదిద్దుకుంటుంది.
జవాబు:
ఇల్లాలు = గృహిణి, పురంధ్రి
ఇ) కింది పదాలలో ప్రకృతి – వికృతులను జతపరిచి రాయండి.
తీరము – గారవం – ప్రాణము – దరి – బాస – గౌరవం – అచ్చెరువు – భాష – ఆశ్చర్యం – పానము.
ప్రకృతి – వికృతి
- తీరము – దరి
- గౌరవం – గారవం
- ప్రాణము – పానము
- భాష – బాస
- ఆశ్చర్యం – అచ్చెరువు
వాక్యాలు :
అ) కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
1. రాధ పాట పాడుతున్నది. రవి పాట పాడుతున్నాడు.
జవాబు:
రాధ, రవి పాట పాడుతున్నారు.
2. సాందీపుడు గురువు. శ్రీకృష్ణుడు శిష్యుడు.
జవాబు:
సాందీపుడు, శ్రీకృష్ణుడు గురుశిష్యులు.
3. రవి బజారుకు వెళ్ళాడు. రఘు బజారుకు వెళ్లాడు.
జవాబు:
రవి, రఘు బజారుకు వెళ్ళారు.
4. భీముడు వీరుడు. అర్జునుడు వీరుడు.
జవాబు:
భీముడు, అర్జునుడు.
ఆ) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1. శైలజ నడుస్తున్నది. శైలజ పాట పాడుతున్నది.
జవాబు:
శైలజ నడుస్తూ, పాట పాడుతున్నది.
2. నెమలి వేగంగా వచ్చింది. నెమలి పామును చూసింది.
జవాబు:
నెమలి వేగంగా వచ్చి, పామును చూసింది.
3. నేను ఉదయాన్నే లేచాను. నేను వ్యాయామం చేశాను.
జవాబు:
నేను ఉదయాన్నే లేచి, వ్యాయామం చేశాను.
4. ఏనుగు తొండం ఎత్తింది. ఏనుగు ఘీంకరించింది.
జవాబు:
ఏనుగు తొండం ఎత్తి, ఘీంకరించింది.
వ్యాకరణాంశాలు :
అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. రామన్న కూరగాయలు పండించాడు.
2. ఊరువల్లెలు జాతరకు కదలివచ్చాయి.
3. మన అందరికీ ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులు.
4. రాజు కొలువుసేసి ఉన్నాడు.
ఆ) ఈ కింది పదాలకు సంధిచేసి కలిపి రాయండి.
ఇ) కింది పట్టికలోని ఖాళీ గళ్ళను పూరించండి.
జవాబు:
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1. చదువు సంధ్యలు | చదువు మరియు సంధ్య | ద్వంద్వ సమాసం |
2. మూడుముళ్ళు | మూడైన ముళ్ళు | ద్విగు సమాసం |
3. అశాంతి | శాంతి కానిది | న్ తత్పురుష సమాసం |
4. పాత కాగితాలు | పాతవైన కాగితాలు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
5. నా చరిత్ర | నా యొక్క చరిత్ర | షష్తీ తత్పురుష సమాసం |
ప్రాజెక్టు పని :
ఉదయం నిద్ర లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు మీ అమ్మ చేసే పనులను పరిశీలించి జాబితా రాయండి. అలుపు సొలుపు లేకుండా ఆమె చేస్తున్న పనులను విశ్లేషిస్తూ నివేదిక రాసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
ఉదయం నాలుగు గంటలకు నిద్రలేస్తుంది.
- ముఖం కడుక్కుంటుంది.
- ఇంటిని శుభ్రం చేస్తుంది.
- వీథి వాకిలి, పెరటి వాకిలి ఊడుస్తుంది.
- రెండువైపులా కళ్ళాపు జల్లి ముగ్గులు పెడుతుంది.
- పూజకు పువ్వులు కోసుకుంటుంది.
- స్నానం చేసి పూజ చేస్తుంది.
- ఇంటిలోని వారందరిని నిద్రలేపుతుంది.
- అందరినీ స్నానాలు చేయమని తొందర పెడుతుంది.
- పిల్లలకు పాలు, పెద్దలకు కాఫీలు ఇస్తుంది.
- పిల్లలను చదువుకోమని చదువులోని అనుమానాలు తీరుస్తుంది.
- వంట చేస్తూనే ఈ పనులన్నీ చేస్తుంది.
- పాలు, కూరలు తీసుకుంటుంది.
- పిల్లలకు తలదువ్వి, బట్టలు వేసి బడులకు వెళ్ళడానికి తయారు చేస్తుంది.
- అందరికీ టిఫిన్లు పెడుతుంది.
- అందరికీ క్యారేజీలు కట్టి ఇస్తుంది.
- మేమంతా వెళ్లాక గిన్నెలన్నీ శుభ్రపరచుకొని, బట్టలు ఉతికి ఆరేస్తుంది.
- సాయంత్రం మేము రాగానే మాకు అల్పాహారాలు పెడుతుంది.
- మేము చెప్పేవన్నీ శ్రద్ధగా వింటుంది.
- మాతో సరదాగా కబుర్లు చెబుతుంది.
- మమ్మల్ని చదివిస్తూనే రాత్రి వంట చేస్తుంది.
- భోజనాలు పెడుతుంది.
- కథలూ, కబుర్లు చెబుతూ మమ్మల్ని నిద్రపుచ్చుతుంది.
పద్య మధురిమ :
శా. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి బరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
భర్తృహరి సుభాషితాలు- ఏనుగు లక్ష్మణకవి
భావం : నీచులైనవారు ఆటంకాలు వస్తాయనే భయంతో తాము చేయాలనుకున్న పనిని అసలు ప్రారంభించరు. ఆటంకాలు ఎదురైతే, మొదలు పెట్టిన పనిని సగంలోనే వదిలేసేవారు మధ్యములు, ప్రజ్ఞానిధులైన ధీరులు ఎన్ని ఆటంకాలు కలిగినా, ధైర్యంతో కూడిన గొప్ప ఉత్సాహంతో ప్రారంభించిన పనులను పూర్తి చేసే వరకూ వదిలిపెట్టరు.
రచయిత్రి పరిచయం :
పేరు : పి. సత్యవతి
కాలం : 12.07.1940లో జన్మించారు.
స్వస్థలం : గుంటూరు జిల్లాలోని కొలకలూరు
చదువు : ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎమ్.ఎ.
ఉద్యోగం : ఆంగ్ల అధ్యాపకురాలు విజయవాడ ఎస్.ఎ.ఎస్. కళాశాలలో
రచనలు : సత్యవతి కథల సంపుటి, ఇల్లలకగానే (1995), మత్తునగరి, మెలకువ, రాగభూపాలం, మర్రి నీడ కథలు, మాఘ సూర్యకాంతి, దమయంతి కూతురు మొదలైన సుమారు 70 కథలు, ‘పడుచుదనం, రైలుబండి’, ‘గొడుగు’, ‘ఆ తప్పు నీది కాదు’ మొదలైన నవలలు రాశారు. ఉర్దూ రచయిత్రి ‘ఇస్మత్ చున్తాయ్’ కథలను తెలుగు అనువాదం చేశారు. రేవతి గారి ఆత్మకథను (తమిళం) ‘ఒక హిజ్రా ఆత్మకథ’ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.
పురస్కారాలు : 1997లో చాసో స్ఫూర్తి పురస్కారం, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం, 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాదికి కళారత్న పురస్కారం, ‘ఒక హిజ్రా ఆత్మకథ’ అనువాద రచన విభాగంలో 2019లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, 2020లో ‘కువెంపు’ జాతీయ పురస్కారం వంటివెన్నో పొందారు.
ఉద్దేశం :
ప్రతి వారికీ కొన్ని అభిరుచులు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. ఆడపిల్లలు పెళ్లయ్యాక పూర్తిగా మారిపోతారు. బరువు బాధ్యతలతో తలమునకలౌతారు. ఇంటి పనులలో పడి కోరికలను మరచిపోతారు. అభిరుచులనూ మరిచిపోతారు. భర్త, ఫిల్లలు, ఇల్లు తప్ప వారికి వేరే ప్రపంచం ఉండదు. వివాహితకు కుటుంబం అండగా ఉంటుంది. స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంచుకోవాలి అని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
ప్రవేశిక :
వివాహమైన స్త్రీ తన చదువును, సృజనాత్మకతను పక్కన పెట్టవలసి వస్తుంది. విసుగూ, విరామం లేకుండా పనిచేస్తూ తనకో పేరుందని కూడా మరచిపోతుంది. ఇంటిపనిలో మునిగి స్వీయ చైతన్యాన్ని, ఆత్మ గౌరవాన్ని కోల్పోవడంలోని అనౌచిత్యాన్ని ఈ కథలో తెలుసుకొందాం.
ప్రక్రియ – కథ :
కథ, కథానిక అనేవి పర్యాయపదాలుగా వాడుతున్నాం. కాని, కథానిక కంటె కథ కొద్దిగా పెద్దది. ఒక చిన్న సంఘటనను ఆధారంగా చేసుకొని సాగేదే కథ. కథకు ప్రారంభం ప్రాణం పోస్తుంది. కథనం, చదివే వారిలో ఉత్కంఠను రేపాలి. ముగింపు కొస మెరుపుగా ఉండాలి. కథను నడిపించడంలోనే రచయిత నైపుణ్యం తెలుస్తుంది.
పదాలు – అర్ధాలు :
- ఇల్లాలు = గృహిణి.
- లాస్యం = నాట్యం
- అందం = సొగసు
- నేర్పరి = నైపుణ్యం కలవాడు
- భార్య = సతి
- స్నేహితులు = మిత్రులు
- భర్త = పతి
- నాథుడు = భర్త
- గుర్తు = జ్ఞాపకం
- ఆవేదన = బాధ
- శ్రమ = కష్టం
- బ్రతుకు = జీవితం
- ఆప్యాయత = ప్రేమ
- సందేహం = అనుమానం
- దీనంగా = జాలి కొలిపేలా
- చెట్టు = తరువు
- ఆర్చుకుపోవడం = ఎండిపోవడం
- బొమ్మలు = చిత్రాలు
- ఉత్తరం = లేఖ
- అజ్ఞాతవాసం = కనబడుండా ఉండడం
- నిజం = సత్యం
- విషయం = సమాచారం
- కేంద్రీకృతం = ఒకేచోట ఉండడం
- క్రమపద్ధతి = సరైన రీతి
- ఉత్సాహం = హుషారు