Access to the AP 9th Class Telugu Guide 7th Lesson మాట మహిమ Questions and Answers are aligned with the curriculum standards.
మాట మహిమ AP 9th Class Telugu 7th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి
మాటలు మనతో నడుస్తూ ఉంటాయి.
కొన్ని తాబేళ్ళలా నింపాదిగా తొందరేమిటంటాయి.
కొన్ని కుందేళ్ళలా గంతులేస్తూ ఆలస్యమెందుకంటాయి.
కొన్ని మన ప్రక్కన పక్షుల్లా ఎగురుతాయి.
కొన్ని మన చేతిలోని దీపంలా దారి చూపిస్తాయి.
కొన్ని సీతాకోకల్లా మనమున్నా లేనట్లే మనముందే అటూ ఇటూ తిరుగుతాయి.
కొన్ని మన నీడల్ని మనకంటే పొడవుగా మన ముందు పరుస్తాయి.
కొన్ని మాటలు తోటలోని పూలలా పలకరించి తప్పుకొంటాయి.
కొన్ని మాటలు వెన్నెల వాన కురిపించి తడిపేస్తాయి.
మన ప్రక్కన ఉన్నట్లే ఉండి మనకు అందకుండా ఉంటాయి.
మనతో నడుస్తున్నట్లే ఉండి అనంతగమ్యాలని చేరి ఉంటాయి.
అన్ని మాటలూ ఒకలాగానే మనతో నడుస్తూ ఉన్నట్లుంటాయి.
కొన్ని మనతో ఒక్క అడుగువేసి మాయమవుతాయి.
కొన్ని మన చేయి పట్టుకొని, మనకు చేయందించి నడుస్తాయి.
ఆలోచనాత్మక ప్రశ్నలు
ప్రశ్న 1.
నీకు ఎవరి మాటలు వింటుంటే హాయిగా అనిపిస్తుంది ? ఎందుకు ?
జవాబు:
సజ్జనుల మాటలు వింటుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. వేమన కవి చెప్పినట్లు “సజ్జనుండు పల్కు చల్లగాను” అనే రీతిగా మంచి మాటలు బాగుంటాయి. వాటివల్ల ఎదుటివారు ఉత్తేజితులై నీతిమంతులవుతారు. ప్రతి ఒక్కరికి ఉపకారం జరుగుతుంది. మన నోటిమాట తీరులోనే మన ఇంటి సంపద ఉంటుంది. మితంగాను, నిజంగాను మాధుర్యం పొంగే విధంగా మాట్లాడటం అంటే నాకు ఇష్టం.
ప్రశ్న 2.
మాటలతోనే బంధాలు ముడిపడతాయి, తెగిపోతాయి అంటారు కదా! ఈ విషయంపై మీ అనుభవాలను తెలియ జేయండి.
జవాబు:
మాధుర్యం గల మంచి మాటలతోనే బంధాలు ముడిపడతాయి. ఎప్పటికిని విడిపోవు. మాటల విలువను తెలుసుకుని మాట్లాడాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. విలువైన మాటలు బంధాలను, స్నేహాలను పెంచుతాయి. మాట అనేది వ్యక్తి సంస్కారానికి గీటురాయివంటిది. పెదవి దాటివచ్చే మాటపై అదుపు, పొదుపు అవసరం. అదే మాట తీరు బాగలేకపోతే కష్టనష్టాలు ఎదురౌవుతాయి. అందుకే సుమతీకారుడు క్రింది విధంగా చెప్పాడు.
కం. ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ !
అవగాహన – ప్రతిస్పందన
ఇవి చేయండి
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
ప్రశ్న 1.
పద్యాలను రాగయుక్తంగా పాడండి.
జవాబు:
మీ తెలుగు ఉపాధ్యాయుని అనుసరించండి.
ప్రశ్న 2.
పుకార్లు ఎలా వ్యాపిస్తాయో చెప్పండి.
జవాబు:
ఎక్కడ ఏ మహానుభావుడు ఉన్నవీ, లేనివీ కలిపి వందతులను, పుకార్లను పుట్టిస్తాడో తెలియదు కానీ, ఆ పుకారు ఒక పెద్ద ఏనుగులా బలిసి, కొండలా ఎంతో రాజసంతో ఆకాశమంత ఎత్తు ఎదుగుతుంది. అంటే పుకార్లు ఎవరు ఎక్కడ పుట్టిస్తారో తెలియదు కానీ, అవి చాలా కొద్దికాలంలోనే నిజానిజాలతో పనిలేకుండా నలుదిక్కులా వ్యాపిస్తాయి.
ప్రశ్న 3.
‘మచ్చలున్న నాలుక’ గురించి కవయిత్రి ఏమని చెపుతున్నారు ?
జవాబు:
కొందరు ఈ లోకంలో ఉట్టుట్టి మాటలు అనగా మాయ మాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. మచ్చల నాలుక కల్గిన వారు చెప్పే చాడీలకు జుట్టు జుట్టు పట్టుకొనే దాకా తగాదాలు అవుతాయి అని పెద్దలంటారు. అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి జట్టుగా ఉన్నవారు తలా ఒక దారిగా విడిపోయేటట్లు రెచ్చగొట్టి మాటలాడుతాడు. మనసునిండా విషాన్ని నింపుకొని, తియ్యతియ్యని మోసకారి మాటలు పలికి ఎదుటి వారిని నాశనం చేస్తారు.
ప్రశ్న 4.
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం అంటే ఏమిటి ?
జవాబు:
లోకంలో కొందరు నోటితో మాట్లాడుతూ, నొసలుతో వెక్కిరించే కళాప్రవీణులుంటారు. ప్రక్కన వారిని కావాలని, బాధపెట్టి మళ్ళీ ఓదార్చే విపరీత స్వభావాన్ని వంటబట్టించుకుని ఉంటారు. పదునైన కళ్ళతో పరికిస్తూ ఎటువంటి హీనమైన పనులు చేయటానికైనా కంకణం కట్టుకుని ఉంటారు. కొందరైతే మాటల మూటలతో గోలచేసి, గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు. అంటే మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యవంటిది.
ప్రశ్న 5.
పువ్వు గుర్తు ఉన్న పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
జవాబు:
ప్రతి పద్యానికి ప్రతిపదార్థాలియబడ్డాయి. వాటిని చూచి నేర్చుకోండి.
ఆ) పాఠంలోని పద్యాల్లో స్థానపదాలను గుర్తించి రాయండి.
ఉదా :
రంగరించుకొనియె
జీర్ణించుకొనియె
రగిలించు – శ్రవణయుగళము
ధరించుచు – కరయుగళము
ఇ) కింది వాక్యాలు చదవండి. భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి రాయండి.
ప్రశ్న 1.
మనసులో విషం. మాటల్లో తియ్యదనం.
జవాబు:
4వ పద్యంలో – ఆత్మలో గరళంబు నంగిటనమృతంబు
ప్రశ్న 2.
మంచి మనసుల్లో కూడా విషం చిమ్ముతుంది.
జవాబు:
యమృతహృదయాలలో జిల్కు హాలహలము 5వ పద్యము
ప్రశ్న 3.
మాట తీరును బట్టే మన సంపద ఉంటుంది.
జవాబు:
3వ పద్యము – సిరి ప్రవర్తిల్లు చుండును జిహ్వ కొలది.
ఈ) కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
“దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్త వలెనోయ్, నరుల చెమటను తడిసి మూలం, ధనం పంటలు పండవలెనోయ్” అన్నాడు గురజాడ. “కండగలవాడేను మనిషోయ్ తిండిగలిగితె కండ గలదోయ్” అనీ ఉద్బోధించారు. –కాని, వీటన్నిటికీ ముందుగా ముఖ్యంగా దేశాభిమానం కావాలి కదా ! ఏ పని అయినా, నిర్ణీత కాలంలో దాన్ని పూర్తి చేసినప్పుడే ఆశించిన ప్రయోజనం దక్కుతుంది. నలభై ఏళ్ళకిందట నిర్మించాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు నిర్మించాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని.
ఈ దేశం నాది. ఈ నాదేశం కోసం, నా దేశంలో పుట్టబోయే ముందు తరాల కోసం నేను శ్రమించాలి. అది నా ధర్మం అని ప్రజలు అనుకొనేట్లు చేయగల పరిపాలకులు ధన్యులు. నవచైనాలో ఒక భారీ ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో నిర్మించిన అద్భుతమైన వృత్తాంతాన్ని సుప్రసిద్ధ ఇంజనీరు డా.కె.ఎల్. రావు తమ అనుభవాలు, జ్ఞాపకాలలో వివరించారు.
చైనాలో దక్షిణ కాంగ్సీయా రాష్ట్రంలో బ్రహ్మాండమైన సేద్యపు కాలువను నిర్మించారు. ఈ కాలువ వెడల్పు 140 మీటర్లు. భూమి ఉపరితలం నుంచి 7 మీటర్లు లోతు. ఈ కాలువ పొడవు 170 కిలోమీటర్లు. ఈ పని మొత్తం 80 రోజుల్లో పూర్తిచేశారు. 7 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని తవ్విపోయాల్సి వచ్చింది ఈ మొత్తం కాలువ తవ్వటంలో ఈ పనిలో యంత్రాలేవీ పాల్గొనలేదు. 13 లక్షల మంది పనివాళ్ళు ఈ పనిని పూర్తి చేశారు.
ఈ పనిలో పాల్గొన్న పనివాళ్ళను దేశం. ఎంతో ఆదరంగా చూసింది. వాళ్ళకోసం ఆ పని కేంద్రాల వద్ద సువిఖ్యాతులైన కళాకారులెందరో వినోద, విరామ, విశ్రాంతి ప్రదర్శనలు నిర్వహించేవాళ్ళు. చైనాలో ఇంజనీర్లు ఎంతో ప్రతిభావంతులు, ఉల్లాస ప్రవృత్తి గలవారు, కలివిడితనం కలవాళ్ళు, అతిథి మర్యాద బాగా తెలిసిన వాళ్లు అని డా. కె.ఎల్. రావు గారు రాశారు.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
దేశప్రజలు ఎలా ఉండాలని కె.ఎల్. రావుగారు ఆకాంక్షించారు ?
జవాబు:
“తిండిగలిగితే కండగలదోయ్. కండగలవాడేను మనిషోయ్” ఇలా దేశప్రజలు ఉండాలని కె.యల్. రావుగారు ఆకాంక్షించారు.
ప్రశ్న 2.
చైనా దేశంలోని భారీ ప్రాజెక్టు గురించి వర్ణించిన ఇంజనీరు ఎవరు ?
జవాబు:
డా. కె.యల్.రావు.
ప్రశ్న 3.
‘వృత్తాంతము’ అంటే ఏమిటి ?
జవాబు:
సంగతి, జరిగినపని, చరిత్రము, కథ అను అర్థాలు ఉన్నాయి.
ప్రశ్న 4.
కె.ఎల్.రావు గారు చైనా ఇంజనీర్లను
అ) వ్యతిరేకించారు
ఆ) ప్రశంసించారు
ఇ) తిరస్కరించారు
ఈ) ఏదీకాదు
జవాబు:
ఆ) ప్రశంసించారు
ప్రశ్న 5.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
చైనాలో ఏ రాష్ట్రంలో సేద్యపు కాలువను నిర్మించారు ?
ఉ) కింది పద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మాటలాడవచ్చు, మనసు దెల్వఁ గలేఁడు
తెలుపవచ్చుఁ దన్ను తెలియలేడు
సుడియఁ బట్టవచ్చు శూరుఁడు కాలేఁడు
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
పై పద్యం ఎవరి గురించి చెబుతున్నది ?
జవాబు:
తెలివి తక్కువ గల వారిని గురించి చెప్పబడింది.
ప్రశ్న 2.
పద్యంలో ఏ పని చాలా కష్టమని చెప్పారు ?
జవాబు:
ఇతరులకు చెప్పే సలహాలను తాను ఆచరించడం కష్టమని చెప్పారు.’
ప్రశ్న 3.
‘సుడియ’ అనగా అర్థం ఏమిటి ?
జవాబు:
కత్తి
ప్రశ్న 4.
పద్యం నుంచి నీవు నేర్చుకున్న నీతి ఏమిటి ?
జవాబు:
సమర్థత లేని వాడు ఎందుకును కొఱగాడు
ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు:
వేమన శతకం లోనిది.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
మాట వలననే సిరిసంపదలు కలుగుతాయి అని ఎలా చెప్పగలరు ?
జవాబు:
మన నోటి తీరులోనే మన ఇంట(లక్ష్మి) సంపద ఉంటుంది. అబద్ధాలు ఆడేచోట లక్ష్మీదేవి ఉండదు. మాటతీరును అనుసరించే స్నేహితుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కనపడని చెవులు కలిగిన ఆడ ఏనుగు వంటి నాలుకతోనే ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి మాటతీరు జాగ్రత్తగా ఉండాలి.
ప్రశ్న 2.
పాఠంలోని పద్యాల ద్వారా కవయిత్రి ఎలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెపుతున్నారు ?
జవాబు:
కొందరు ఈలోకంలో ఉట్టుట్టి మాటలు అనగా మాయ మాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు, మచ్చల నాలుక కల్గినవారు చెప్పే చాడీలకు జుట్టుజుట్టు పట్టుకొనే దాక తగాదాలు అవుతాయి అని పెద్దలంటారు. అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి జట్టుగా ఉన్నవారు తలా ఒక దారిగా విడిపోయేటట్లు రెచ్చగొట్టి మాటలాడుతాడు.
మనసు నిండా విషాన్ని నింపుకొని, తియ్యతియ్యని మోసకారి మాటలు పలికి ఎదుటివారిని నాశనం చేస్తారు. ఒక్కో మనిషి దగ్గర ఒక్కో విధంగా మాట్లాడే వారుంటారు, అట్లాంటి వారు ఎన్నో రకాలుగా మాటలు మార్చి అన్ని పనులనూ పాడుచేస్తుంటారు. కత్తికి లేని పదును ఈ నాలుకకు ఉంటుంది. అటువంటి వారికి దూరంగా ఉండాలి లేకపోతే మనకే నష్టం.
ప్రశ్న 3.
నాలుకను నియంత్రించుకోవాలంటే ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి ?
జవాబు:
ఎంతో ముఖ్యమైన ఈ నాలుకను ఉపయోగించి మంచిని పెంపొందించాలి. నాలుకను మితంగా వాడాలి. అవసరమైనపుడే మాట్లాడాలి. లేకపోతే తగవులకు వాడరాదు. నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది. అటువంటి పరిస్థితి రానీయకూడదు. మాటతీరుతో ఎంత హాని అయినా జరుగుతుంది. మంచిగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. దుర్భాషలు ఆడరాదు. అహంకారంతో కన్నుమిన్నుగానక మాట్లాడరాదు.
ప్రశ్న 4.
‘వరము లేని నాలుక’ అంటే మీరేమి గ్రహించారో రాయండి.
జవాబు:
నరము లేని నాలుక ఇష్టం వచ్చినరీతిగా మాట్లాడుతుంది. అట్లా ముందూ వెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాటలు మాట్లాడితే మనసు విరిగిపోయి కుటుంబాలే నాశనమవుతాయి.
ప్రశ్న 5.
నాలుకను ఎలా ఉపయోగించుకుంటే గౌరవింపబడతామో వివరించండి.
జవాబు:
పంచేంద్రియాల్లో కెల్లా ఆరురుచులనూ ఆస్వాదించ కలిగింది నాలుక మాత్రమే. నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది కనుక జాగ్రత్తగా మంచిగా మాట్లాడితే సమాజంలో గౌరవాన్ని పొందుతాడు. అబద్ధాలాడరాదు. దుర్భాషలాడరాదు. అహంకారంతో విర్రవీగరాదు ఇతరుల సుగుణాలు గురించి చెప్పాలి. మాటతీరులో మాధుర్యం ఉండాలి. ఈ విధంగా ప్రవర్తిస్తే గౌరవింపబడతారు. మాట తీరును అనుసరించే స్నేహితుల సంఖ్య పెరుగుతుంది.
ఆ) కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
ప్రశ్న 1.
మాటతీరు సరిగా లేకపోతే కలిగే కష్టనష్టాలను వివరించండి.
జవాబు:
మాటతీరు సరిగా లేకపోతే శత్రువులు పెరుగుతారు. నరంలేని నాలుక ఇష్టం వచ్చినరీతిగా మాట్లాడుతుంది. అట్లా ముందూ వెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాటలు మాట్లాడితే మనసు విరిగిపోయి కుటుంబాలే నాశనమవుతాయి. మచ్చల నాలుక కల్గినవారు చెప్పే చాడీలకు జుట్టు జుట్టు పట్టుకొనే దాకా తగాదాలు అవుతాయి.
అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి నాలుక జట్టుగా ఉన్నవారు తలా ఒక దారిగా విడిపోయేటట్లు రెచ్చగొడుతుంది. అమృత హృదయాల్లో విషాన్ని చిమ్ముతుంది. చాలా రహస్యంగా సత్యాన్ని దాచిపెట్టేస్తుంది. ఈ నాలుక మాటలమేదరి. నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది. అంటే మాటతీరుతో ఎంత హాని అయినా జరుగుతుంది.
ప్రశ్న 2.
‘మన మాటలే మన గౌరవం’ – అనే అంశంపై వ్యాసం రాయండి.
శ్లో. అనుద్వేగ కరం వ్యాకం – సత్యం ప్రియ హితంచయత్ !
స్వాధ్యాయాభ్యాసనం చైవ – వాఙ్మయం తపఉచ్యతే !!
శ్రీమద్భగవద్గీత -17:15
జవాబు:
ఇతరుల మనస్సుకు బాధ కలిగింపనదియు, సత్యమైనదియు, మాటలాడుట, వేదాధ్యయనము చేయుటకును వాచిక తపస్సని గీతాచార్యుడు.
మంచిగా, మాధుర్యంగా అనేది ఒక తపస్సు వంటిది. ఇదెలా సాధ్యమవుతుంది?
ఇతరులకు ప్రియము కల్గించే విధంగా తియ్యగా మాట్లాడటం. అలా మాట్లాడుట వలన మేలు కలుగుతుంది. అలా ప్రవర్తించినవాడు ప్రశాంత చిత్తుడవుతాడు. కోరిక, ద్వేషము, రోషము, మోసము, సుఖదుఃఖాలు అరిషడ్వర్గాలు (కామక్రోధలోభ మోహమదమాత్సర్యాదులు) డంభము, దర్భము, అహంకారము మున్నగునవి వదలినవాడు ప్రశాంతచిత్తుడవుతాడు.
కఠినంగా మాట్లాడుట, అబద్ధాలు, చాడీలు, అసంబద్ధ ప్రలాపాలు పల్కుట ఈ నాల్గు వాగ్రూపమైన పాపాలని ఆర్యధర్మము చెస్తోంది. దానగుణము, మంచి మాటలాడు స్వభావము, ధీరత్వము, ఉచితానుచిత జ్ఞానము ఈ నాలుగు గుణాలు పుట్టుకతో వచ్చేవి కాని నేర్చుకుంటే వచ్చేవికావు.
మనిషికి చక్కగా మాట్లాడటం అనేది ఒక వరం. ఈ భగవంతుని సృష్టిలో ఏ జీవునికి లేని గొప్ప సంపద చక్కగా మాట్లాడటం తనలో నున్న అభిప్రాయాల్ని ఎదుటివారికి తెలిపే బలోపేతమైన సాధనం తియ్యగా మాట్లాడటం, తియ్యగా మాట్లాడటంలోగల తియ్యని మాటలు మనిషికి ఆనందాన్నిస్తుంది.
మన నోటిమాట తీరులోనే మన ఇంట సంపద ఉంటుంది. అబద్ధాలు ఆడేచోట లక్ష్మీదేవి ఉండదు. మాట తీరును అనుసరించే స్నేహితులసంఖ్య పెరుగుతూ ఉంటుంది. కనపడని చెవులు కలిగిన ఆడ ఏనుగు వంటి నాలుకతోనే ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి మాటతీరు జాగ్రత్తగా ఉన్నప్పుడు మన మాటలే మనకు గౌరవాన్ని కల్గిస్తాయి.
3. పాఠ్యాంశంలోని పద్యాలు ఆధారంగా సారాంశాన్ని ఏకపాత్ర రూపంలో ప్రదర్శించడానికి ప్రదర్శన పాఠం రాయండి. నరం లేని నాలుక
నేను నరం లేని నాలుకను. నేను ఇష్టం వచ్చినరీతిగా మాట్లాడతాను, అలా ముందు వెనుకా ఆలోచించకుండా మాట్లాడటంవల్ల పచ్చని కాపురాల్లో చిచ్చు రేగుతుంది. ఆలోచన లేకుండా మాటలు మాట్లాడి మనసు విరిగిపోయి కుటుంబాలే. నాశనమవుతాయి. నోటిలోనున్న నా మాటతీరులోనే మన ఇంట(లక్ష్మి) సంపద ఉంటుంది. అ ఆడేచోట లక్ష్మీదేవి ఉండదు. కనుక మాట తీరును అనుసరించే స్నేహితుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కొంతమంది మాయ మాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు.
మచ్చల నాలుక కల్గిన వారు చెప్పే చాడీలకు జుట్టు జుట్టు పట్టుకొనే దాకా తగాదాలు అవుతాయి. మరి కొందరు మనసునిండా విషాన్ని నింపుకొని, తియ్యతియ్యని మోసకారి మాటలు పలికి ఎదుటివారిని నాశనం చేస్తారు.కొందరి నోరు పాముల పుట్టగా మారి అవాకులు చవాకులు మాట్లాడుతుంది. అమృత హృదయాల్లో విషాన్ని చిమ్ముతుంది. మాయమాటలు చెప్పి బుట్టలో వేసే వారితో జాగ్రత్తగా ఉండాలి. షడ్రుచులను ఆస్వాదించే నేను జాగ్రత్తగా మాట్లాడితే లోకమే మహదానందంతో ఉంటుంది.
భాషాంశాలు – పదజాలం
అ) కింది వాక్యాలు చదివి, ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి, వాటిని ఉపయో గించి సొంతవాక్యాలు రాయండి.
1. అమలిన ప్రథమున గమియించుటకే లెమ్ము.
పథము = మార్గం
సొంతవాక్యం : ప్రతివాడు ధర్మ మార్గంలోనే నడవాలి.
2. పలుకు మాత్రము మితముగా పలుకుమన్న.
మితము = కొద్దిగా
సొంతవాక్యం : కొద్దిగానే మాట్లాడితే మధురంగా ఉంటుంది.
3. సృష్టికర్త కులాలుడై చేసె పెద్ద లోక భాండము.
కులాలుడు = కుమ్మరివాడు.
సొంతవాక్యం : కుమ్మరివాడు కుండలు చేస్తాడు.
4. దుర్గుణాలు విడనాడితే విజయం లభిస్తుంది.
దుర్గుణాలు = చెడుగుణాలు
సొంతవాక్యం : సత్ప్రవర్తన కలిగినవాడు చెడుగుణాల జోలికిపోరాదు.
5. పాము గరళము నుండి ఔషధం తయారు చేస్తారు.
గరళము = విషము
సొంతవాక్యం : పాము విషంతో కొన్ని మందులు తయారుజేస్తారు.
ఆ) కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయపదాలు రాసి, వాక్యాలలో ప్రయో గించండి.
ఉదా : ఎ) సీత, లత మంచి నేస్తాలు.
బి) మిత్రులు ఎల్లప్పుడూ మన మంచినే కోరుకుంటారు.
1. వహ్వ ! మాటల మేదరి జిహ్వగాడు
జవాబు:
జిహ్వ = నాలుక, రసజ్ఞ
నాలుక లేనిదే రుచులు తెలియవు.
2. అందమో చందమో అంబకమొక కంట తిలకించు పల్లెత్తి పలుకలేదు.
జవాబు:
తిలకించు = చూచు, ఈక్షించు
హిమాలయ పర్వతాలను చూచాను.
3. సిరి ప్రవర్తిల్లుచుండును జిహ్వకొలది.
జవాబు:
సిరి = లక్ష్మి, సంపద
శుక్రవారం లక్ష్మీపూజ చేస్తారు.
ఇ) కింది వాక్యాలను పరిశీలించి, ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్థాలు రాయండి.
జవాబు:
1. క్షామము తాళలేక పక్షులు నీరున్న చోటుకు పయన మయ్యాయి.
జవాబు:
పయనము = ప్రస్థానము, గమనము
2. ఆత్మలో గరళంబు నంగిట నమృతంబు
జవాబు:
అమృతంబు = సుధ, నెయ్యి
3. కనులార మంచిని కాంచుటకేనేమొ
జవాబు:
కాంచుట = చూచుట, పొందు
ఈ) కింది వాక్యాలలో ప్రకృతి, వికృతులను గుర్తించి రాయండి.
ఉదా : మన ఆంధ్రుల భాష తెలుగు. ఇది దేశ బాసలలో మేటి.
భాష (ప్ర) – బాస (వి)
1. విద్యార్థుల చేతుల్లో పుస్తకాలున్నాయి. ఆ పొత్తములు జ్ఞాన భాండాగారాలు.
జవాబు: పుస్తకాలు (ప్ర) – పొత్తములు (వి)
2. ఎంత దూరమైనా నడవాలి. దవ్వు అని ఆలోచించకూడదు.
జవాబు: దూరము – దవ్వు
3. హరివిల్లులో సప్తవర్ణాలు ఉంటాయి. ఆ వన్నెలు ప్రకృతికే శోభనిస్తాయి.
జవాబు: వర్ణము – వన్నె
4. ప్రతి ఎదలో దయ ఉండాలి. అప్పుడు హృదయమే దేవాలయం అవుతుంది.
జవాబు: హృదయము – ఎద
5. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి. ఆ సహాయమే మనకు పుణ్యమై రక్షణనిస్తుంది.
జవాబు: సహాయం
ఉ) కింది జాతీయాలను ఉదాహరణలతో వివరించండి.
1. కంకణం దాల్చు : చేతికి కడియాన్ని ధరించుట, ఆమె బంగారు కడియాలను చేతికి ధరించింది. మరొక అర్థం : వివాహాది కార్యములందు రక్షార్థము కంకణము దాల్చికార్యము నెఱవేఱువరకు నది విప్పరుగావున కార్యము నెఱవేర్చు శపథము పట్టుటకు “కంకణము కట్టుకొనుట” అను వ్యవహారము గలిగెను.
2. గిల్లి జోలబాడటం : మనిషి క్రింద మంటపెట్టి నెత్తిపైన నీళ్ళు చల్లుట
ఎవరు చూడకుండా ఉన్న సమయంలో పృష్ఠం క్రింద గోళ్ళతో గిచ్చుతాడు. పదిమంది చూస్తుండగా కళ్ళనీళ్ళు తుడుస్తాడు.
3. జుట్లు ముడిపెట్టడం : తగాదా పెట్టుట.
కొంతమంది స్నేహితుల మధ్య తగాదాలు పెట్టి వినోదిస్తుంటారు.
4. వంట జీర్ణించుకోవడం : పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకోవడం.
రాముడు ఎటువంటి సమస్యనైనను పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకొంటాడు.
వ్యాకరణాంశాలు
సంధులు
ద్విరుక్తటకార సంధి:
సూత్రము 1 : కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దాలలోని ఱ-డలకు అచ్చుపరమైతే ద్విరుక్త “ట” కారం ఆదేశంగా వస్తుంది. ఉదా :
1. కుఱు + కుట్టి + ఉసురు = కుట్టుసురు
2. చిఱు + ఎలుక = చిట్జ్ + ఎలుక = చిట్టెలుక
3. కడు + ఎదురు + ఎదురు = కట్టెదురు
4. నడు + ఇల్లు = నిట్జ్+ ఇల్లు = నట్టిల్లు
5. నిడు + ఊరుపు = నిట్జ్ + ఊరుపు = నిట్టూర
సూత్రము 2 : ఆమ్రేడితం పరమైనపుడు కడాదుల తొలి అచ్చుమీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది. ఉదా :
1. పట్టపగలు = పగలు + పగలు
2. కట్టకడ = కడ + కడ
3. తుట్టతుద = తుద + తుద
4. మొట్ట మొదట = మొదట + మొదట
5. చిట్ట చివరి = చివర + చివర
ద్విరుక్తము అంటే ఒకే హల్లు రెండు సార్లు వచ్చుట. హల్లు కింద అదే హల్లు వచ్చుట. దీనినే ద్విత్వాక్షరం అంటారు.
అ) కింది పదాలు విడదీసి, సంధి పేరు తెలపండి.
జవాబు:
1. రసనేంద్రియం : రసన + – గుణసంధి
2. పరస్పరానురాగం : పరస్పర పర + అనురాగం – సవర్ణదీర్ఘ సంధి
3. పరాధీనము + ఆధీనం – సవర్ణదీర్ఘ సంధి
4. ఉర్వియెల్ల : ఉర్వి + ಎಲ್ಲ – యడాగమసంధి
సమాసములు
అ) కింది పదాలు చదవండి. విగ్రహవాక్యం తెలిపి ఏ సమాసమో రాయండి.
జవాబు:
1. ప్రాణహాని : ప్రాణమునకు హాని – షష్ఠీ తత్పురుష సమాసం
2. అమృత హృదయాలు : అమృతము వంటి హృదయాలు – ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
3. లోకభాండము : లోకమనెడు భాండము రూపక సమాసం
4. జీతభత్యాలు : జీతమును, భత్యమును – ద్వంద్వ సమాసం
5. చిత్తశుద్ధి : శుద్ధమైన చిత్తము – విశేషణ ఉత్తరపదకర్మధారయ సమాసం
6. మధుర పదార్థం : మధురమైన పదార్థం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
7. కురు వృద్ధులు : వృద్ధులైన కురు వంశంవారు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
8. ధీరోదాత్తుడు : ధీరమైన ఉదాత్తుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అలంకారాలు
వృత్త్యనుప్రాసాలంకారం :
భాషకు సౌందర్యాన్ని కలగజేసేవి అలంకారాలు. వృత్త్యనుప్రాసాలంకారాన్ని గురించి తెలుసుకుందాం !
లక్షణం : ఒకటిగానీ అంతకంటే ఎక్కువ గానీ హల్లులు అనేకసార్లు వచ్చినట్లయితే అది “వృత్త్యనుప్రాసాలంకారం”. అవుతుంది.
ఉదా : కటకచరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్
దీనిలో “క” హల్లు అనేకసార్లు తిరిగి తిరిగి వచ్చినందువలన ఇది “వృత్త్యనుప్రాసాలంకారం” అవుతుంది.
ఉదా : ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులను శిక్షించెను.
దీనిలో “క్ష” అను అక్షరం పలుమార్లు వచ్చుట వలన ఇది వృత్త్యాను ప్రాసాలంకారం అవుతుంది.
ఉదా : చిటపట చినుకులు. టపటపమని పడుతున్న వేళ.
దీనిలో ‘ట’ అక్షరం పలుమార్లు వచ్చుట వలన ఇది వృత్యాను ప్రాసాలంకారం అవుతుంది.
కింది ఉదాహరణలలో అలంకారాన్ని గుర్తించండి.
ప్రశ్న 1.
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము పోవునే మదనములకు
జవాబు:
ఈ వాక్యంలో ‘మ’ అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చినందు వలన ఇది వృత్యను ప్రాసాలంకారం అయింది.
ప్రశ్న 2.
అడిగెదనని కడువిడి జనునడిగిన దను మగడు నుడవడని నడయుడుగన్
జవాబు:
ఈ వాక్యంలో ‘డ’ కారము అనేకసార్లు తిరిగితిరిగి వచ్చినందువలన ఇది వృత్యను ప్రాసాలంకారము అయింది.
ప్రశ్న 3.
దక్షాధ్వర శిక్షా దీక్షా దక్ష విరూపాక్ష నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్ష నుపేక్షసేయక
జవాబు:
ఈ వాక్యంలో ‘క్ష’ కారము అను హల్లు పలుమార్లు వచ్చుట వలన ఇది వృత్త్యను ప్రాసాలంకారము అయింది.
ఛందస్సు
కింది ఉత్పలమాల పద్యలక్షణాలను పరిశీలించండి.
సమన్వయం :
1. భ,ర,న,భ,భ,ర,వ అనే గణాలు వచ్చాయి.
2. పాదం మొదటి అక్షరం “ఎ” కి 10వ అక్షరం “వే” లో ఉన్న “ఎ” కి యతి చెల్లింది.
3. ప్రాస నియమం కలదు.
4. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉన్నాయి.
కింది పద్యపాదాలకు గణవిభజన చేసి లక్షణ సమన్వయం రాయండి.
1. చక్కని కన్యకా మణికి జక్కని వాడగు ప్రాణ నా థుడన్
2. ఎక్కడ నుండి రాకయిటకెల్లరునున్ సుఖులేకదా! యశో
3. ఏ మహనీయ సిద్ధి కొరకీ బ్రతుకున్ ముడివెట్టుకుంటినో
4. చారునిశీధినీ విమల సాంద్ర సుధాకర భాతి రోదసీ
1.
ఇచ్చినది ఉత్పలమాల పద్యపాదం.
లక్షణం :
1. యతి 1 నుండి 10 చ – జ
2. ప్రాస – రెండవ అక్షరము (క్క ‘ద్విత్వ’ అకారము)
2.
ఇది ఉత్పలమాల పద్యపాదము.
లక్షణం :
1. యతి 1 నుండి 10 ఎ – క్ + ఎ
2. ప్రాస – రెండవ అక్షరము ‘క్క’ ద్విత్వ’ లకారము.
3.
ఇచ్చినది ఉత్పలమాల పద్యపాదం.
1. యతి 1 నుండి 10 ఏ – క్ + ఈ
2. ప్రాస – రెండవ అక్షరము ‘మ’కారము.
4. చారు నిశీధినీ విమల సొంద్ర సుధాకర ఖాతి రోదసీ
ఇచ్చినది ఉత్పలమాల పద్యపాదం
1. యతి 1 నుండి 10 చా సా
2. ప్రాస – రెండవ అక్షరము ‘ర’కారము.
ప్రాజెక్టు పని
క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయండి. దానిలో ఉన్న ‘మాటలంటే మాటలా’ వచన కవితను, మీ మొబైల్ ఫోన్లో రికార్డు చేయండి. దానిని విద్యాదాన్ దీక్షాయాప్కు పంపండి.
జ. విద్యార్థికృత్యము
పద్య మధురిమ
చ. మకర ముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా
యక ఛలదూర్మికానికర మైన మహోదధి దాఁటవచ్చు మ
స్తకమునఁ బూవుదండవలె సర్పమునైన ధరింపవచ్చు మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరికిన్ – భర్తృహరి సుభాషితములు ఏనుగు లక్ష్మణకవి
భావం : మొసలి కోరల మధ్య నున్న ముత్యాన్ని ప్రయత్నించి బయటికి తీయవచ్చును. పెద్ద అలలు గల అపారమైన సముద్రాన్ని అయినా దాటవచ్చును. కోపంతో బుసకొట్టే విష సర్పాన్ని పూలదండవలే తలపై ధరించవచ్చును; కాని మూర్ఖుని మనసును సమాధాన పెట్టడం ఎవరికీ సాధ్యంకాదు.
పద్యాలు – ప్రతిపదార్ధ భావాలు
1వ – పద్యం
తే.గీ 1. ఎక్కడే మహాత్ముండు పుట్టించునో వ
దంతి నిముషాన నది పెద్ద దంతి వోలె
బలిసి దిగ్దిగంతాలకు పయన మగును
నడలలో రాజసంబుట్టి పడుచునుండ.
ప్రతిపదార్ధం :
ఎక్కడ + ఏ – మహా + ఆత్ముండు
ఎక్కడే మహాత్ముండు = ఎక్కడ ఏ మహానుభావుడు
వదంతి = పుకార్లు
పుల్టించును + ఓ
పుట్టించునో = ఉద్భవిస్తాయో
నమషునన = క్షణంలో
అది = పుకార్లు
పెద్దదంతివోలె = పెద్ద ఏనుగువల
బలిసి = బలంగా పెరి
దిక్ + దిక్ + అంతాలకు
దిగ్దిగంతాలకు = దిక్కుల చివరి వరకు
నడలలో రాజసంబు = నడకలో రాజసం
ఉట్టిపడుచునుండ = కన్పిస్తుంటుంది
భావం:ఎక్కడ ఏ మహానుభావుడు ఉన్నవీ, లేనివి కలిపి వదంతులను, పుకార్లను పుట్టిస్తాడో తెలియదు కానీ ఆ పుకారు ఒక పెద్ద ఏనుగులా బలిసి, కొండలా ఎంతో రాజసంతో ఆకాశమంత ఎత్తు ఎదుగుతుంది. అంటే పుకార్లు ఎవరు ఎక్కడ పుట్టిస్తారో తెలియదుగాని, అవి చాలా కొద్దికాలంలోనే నిజా నిజాలతో పనిలేకుండా నలుదిక్కులా వ్యాపిస్తాయి.
2వ – పద్యం
తే.గీ 2. నరము లేనిది నాలుక తిరుగు చుండు
ఇచ్చ వచ్చిన రీతిగా ఇచ్చకాల
చిచ్చు రగిలించుచును దీని మచ్చ మాయ
పచ్చనౌ కాపురాల నిప్పచ్చరముగ.
ప్రతిపదార్ధం :
నరము లేనిది నాలుక = నరంలేని నాలుక
ఇచ్చ వచ్చిన రీతిగా = ఇష్టానుసారంగా
తిరుగుచుండు =మాట్లాడుతుంది
ఇచ్చకాల చిచ్చు = ముఖీప్రీతి మాటలనెడు చిచ్చు
దీని మచ్చ మాయ = మాటకున్న చెడ్డతనము పోవగా
పచ్చనౌకాపురాలు = పచ్బని కాపురాలు
నిప్పచ్చరముగ = నశించిషోతాయి
భావం : నరంలేని నాలుక ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతుంది. అట్లా ముందు వెనుకా ఆలోచించకుండా మాట్లాడినమాట పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాటలు మాట్లాడితే మనసు విరిగిహోయి కుటుంబాలే నాశనమవుతాయి.
3వ – పద్యం
తే.గీ 3. సిరి ప్రవర్తిల్లు చుండును జిహ్వ కొలది
ఏతదాధీనమగుచు స్నేహితము నడచు
దాననే బంధనము ప్రాణహాని ధ్రువము
కనపడని కర్ణ ధారి కుంభినికి నాల్క
ప్రతిపదార్ధం :
జిహ్వకొలది = మంచీ మాట మాట్లాడిన కొద్దీ
సిరి ప్రవర్తిల్లుచుండు = లక్షి (సంపద) ఉంటుంది
ఏతత్ + అధీనము + అగుచు
ఏతదాధీనమగుచు = మాటతీరును అనుసరించిన కాలది
స్నేహితము నడచు దానను = స్నేహితుల సంఖ్య పెరుగుతుంది
ఏ బంధనము = ఎటువంటి బంధము
కనబడని = కంటికి కనిపించని
కర్ణధారి = చెవులు కలిగిన
కుంభినికి = ఆడ ఏనుగువంటి
నాల్క = నాలుకతోనే
పాణహాని = ప్రాణహాని
ధ్రువము = కలుగుతుంది
భావం : మన నోటిమాట తీరులోనే మన ఇంట (లక్ష్మి) సంపద ఉంటుంది. అబడ్ధాలు ఆడే చోట లక్ష్మిదేవి ఉండదు. మాట తీరును అనుసరించే స్నేహితుల సంఖ్ల పెరుగుతూ ఉంటుంది. కనబడని చెవులు కలిగిన ఆడ ఏనుగు వంటి నాలుకతోనే ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి మాటతీరు జాగ్తత సుమా !
4వ – పద్యం
సీ. 4. ఊక దంపుడు మాట లూదర గొట్టేసి
పూటలు గడుపుకు పోవు నాల్క
నాలుక మచ్చల వాలుగా జుట్టును
జుట్టును ముడి పెట్టి చూచు నాల్క
రెండు నాల్కల పగ రెచ్చగొట్టుచు తల
కొక దారి బట్టించనోపు నాల్క
ఆత్మలో గరళంబు నంగిటనమృతంబు
పొలు పారగా మోసపుచ్చు నాల్క
తే.గీ నాలు కొక్కటియైన నానా విధాల
రూపములు ధరించుచును ఏరోటి చెంత
పాడు నాపాట, సర్వము పాడు జేయు
వాలునకు లేని పదును ఈ నాలుక కును.
ప్రతిపదార్ధం :
ఊకదంపుడు మాటలు = వ్యర్థపు మాటలు
ఊదర గొట్టేసి = తపింపచేసి
పూటలు గడుపుకుహోవు
నాల్క = పబ్బం గడుపుకునే నాలుక
నాలుక మచ్చల వాలుగా = మచ్చల నాలుక కల్గినవారు
జుట్టును జుట్టును
ముడిపెట్టి = జుట్టు జుట్టు పట్టుకొనే దాకా
చూచు నాల్క= తగాదాలు చేయి నాలుక
రెండు నాల్కల పగ = ఇద్దరి మధ్య విరోధాన్ని
రెచ్చగొట్టుచు = విజృంభిస్తూ
తలకు + ఒక దారి = తలా ఒక దారిగా
పట్టించను + ఓపు-నాల్క = విడిపోయేటేట్లు, రెచ్చగొట్టు నాల్క
ఆత్మలో గరళంబు = మనసులో గరళము
అంగిట నమృతంబు = అంగిట్లో అమృతము
పొలు పారగా = అతిశయించే విధంగా
మోసపుచ్చు నాల్క = మోసగించు నాల్క
నాలుక + ఒక్కటి + ఐన
నాలుకొక్కటియైన = నాలుక ఒక్కటే అయినా
నానావాల రూపములు = అనేక విధాల రూపాలను
ధరించుచును = ధరిస్తుంటుంది
వాలునకు లేని పదును = కత్తికి లేని పదును
ఈ నాలుకకును = నాలుకకు కలదు
ఆ పాట = పాటను
ఏరోటి చెంత పాడును = ఇంటికి తగినట్టుగా ఆ విధంగా పాడులుంది
సర్వము పాడుజేయు = సర్వం నాశనం చేస్తుంది.
భావం: కొందరు ఈ లోకంలో ఉట్టుట్టి మాటలు అనగా మాయ మాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు; మచ్చల నాలుక కల్గిన వారు చెప్పే చాడీలకు జుట్టు జుట్టు పట్టుకొనే దాకా తగాదాలు అవుతాయి. అని పెద్దలంటారు. అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి జట్టుగా ఉన్నవారు తలా ఒకదారిగా విడిపోయేటట్లు రెచ్చగొట్టి మాటలాడుతాడు. మనసు నిండా విషాన్ని నింపకకొని, తియ్యతియ్యని మోసకారి మాటలు పలికి ఎదుటి వారిని నాశనం చేస్తారు.
ఒక్కో మనిషి దగ్గర ఒక్కో విధంగా మాట్లాడేవారుంటారు. అట్లాంటి వారు ఎన్న్రకాలుగా మాటలు మార్బి అన్ని పనులనూ పాడుచేస్తుంటారు. కత్తికిలేని పదును ఈ నాలుకకు ఉంటుంది. అటువంటి వారికి దూరంగా ఉండాలి లేకపోతే మనకే నష్టం.
5వ – పద్యం
సీ. 5. అందమో చందమో అంబక మొక కంట
తిలకించు పల్లెత్తి పలుక లేదు
మేలైన కీలైన ఆలించుటే గాని
చెవిదోయి నొక్కి వచించ లేదు
ఇం పైన కాకున్న కంపు గన్గాను నాసి
కా పుటంబులకు వాగ్థాటి లేదు
మై సోకు నేని రోమాంచ మౌనే గాని
చర్మంబునకును వాక్సరణి లేదు.
తే.గీ పక్వముల చవుల్ గుర్తించు పనికి తోడు
ఎరుగు మాటాడు పని రసనేంద్రి యంబు
ఎన్నగ నవాకులు చవాకులన్ని వాగి
యమృత హృదయాలలో జిల్కు హాల హలము
ప్రతిపదార్ధం :
అందమో చందమో = అందచండాలతో నున్న
అంబకు = కన్ను
ఒక కంట తిలకించు = ఎక వైపు చూస్తుంది
పల్లెత్తి పలుకలేడు = పల్లెత్తి మాట్లాడలేదు
మేలు + ఐన
మేలైన = మేలు అయినా
కీలు + ఐన
కీలైన = కీడైనా
ఆలించుటే గాని = వినడమే గాని
చెవిదోయి = చెవుల జంట
నాక్కివచించలేదు = వక్కాణించి ఖచ్చితంగా చెప్పలేదు
ఇంపు + ఐన
ఇంపైన = మాధుర్యమైన
కాక + ఉన్న
కాకున్న = మాధుర్యము లేకపోయిన
కంపుగన్గాను = వాసనను పసిగట్టు
వాగ్ధాడిలేదు = మాట్లాడే మాటల ప్రవాహం లేదు
మై సోకునేని = చర్మానికి స్పర్శ కల్గెనేని
రోమాంచ మౌనెగాని = వెంట్రుకలు నిక్కటొడుచు కునేలా స్పందించే శక్తి ఉన్న
చర్మంబునకును = చర్మానికి
వాక్సరణిలేడు = మాట్లాడే శక్తిలేదు
పక్వముల్ చవుల్ గుర్తించు
పనికితోడు = రకరకాల ఆహారపడార్థాలను రుచిచూసే పనితోపాటు
ఎరుగు మాటాడుపని = ఏది మంచి ? ఏది చెడు ? అని తెలుసుకొని మాట్లాడే పని
రసన + ఇంద్రియంబు
రసనేందియంబు = నాలుకది
ఎన్నగన్ = చూడగా
అవాకులు చవాకులు + అన్ని
అవాకులు చవాకులన్ని = అవాకులు చవాకులు
వాగి = మాట్లాడి
అమృత హృదయాలలోన్ = అమృతం వంది హృయాలలో
హాలహాలము = విషము
చిల్కు = చిమ్ముతుంది
భావం : అందచందాలతో ఉన్న కన్ను చూడగలదే కానీ పల్లెత్తి మాట్లాడలేదు. ఎరత చక్కగా పనిచేసే చెపులైల ఖచ్చితంగా వక్కాణించి చెప్పలేవు, అందంగా ఉన్న్ లేకున్నా వాసనలను పసిగట్టగల ముక్కు అనర్గళంగా మాట్లాడలేదు. వెంట్రుకలు నిక్కదొడుచుకునేలా స్పందించే శక్తి ఉన్న చర్మానికి సహితం మాట్లాడే దారి లేదు.
రకరకాల ఆహారపదార్థాల రుచి చూసే పనితో పాటుగా ఏది మంచి? ఏది చెడు? అని తెలుసుకుని మాట్లాడే పని నాలుకది. కానీ కొందరి నోరు పాముల పట్టగా మారి అవాకులు చవాకులు మాట్లాడుతుంది. అమృత హృదయాల్లో విషాన్ని చిమ్ముతుంది. అంటే కొందరి మాటతీరు అంత కఠినంగా, విషం కంటే హానికరంగా ఉంటుందన్నమాట.
6వ – పద్యం
తే.గీ 6. మదిని పొదలెడు తలపుల వెదురు మలచి
బుట్ట లల్లి దుర్బలుల జోకొట్టు నందు
గుట్టుగా సత్యమును దాచిపెట్ట గలడు.
వహ్వ!! మాటల మేదరి జిహ్వగాడు
ప్రతిపదార్ధం :
మదిని = మనస్సులో
పొదలెడు = పుట్టిన
తలపులవెదురు = ఆలోచనలనే వెదురు
మలచి బుట్టలు + అల్లి
మలచి-బుట్టలల్లి = బుట్టలుగా మార్చి అల్లి
అందు = అ బుట్టలో
దుర్బలుల = బలహీనులను
జోకొట్టును = జోకొడుతుంది
గుట్టుగా = రహస్యంగా
సత్యమును = సత్యాన్ని
దాచిపెట్టగలదు = దాచిపెడుతుంది
వహ్వ! = ఆహా!
జిహ్వగాడు = నాలుక
మాటల మేదరి = మాటలనెడు మేదరి వంటి వాడు
భావం : ఆహా ! ఈ నాలుక చెడు ఆలోచనలనే వెదురు బుట్టను అల్లి అందులో మోసకారి మాటలతో బలహీనులను
చక్కగా పడుకోబెట్టి (చిన్నపిల్లలను చేసి) జోకొడుతుంది. చాలా రహస్యంగా సత్లాన్ని దాచిపెట్టేస్తుంది. ఈ నాలుక మాటల మేదరి. మాయమాటలు చెప్పి బుట్టలో వేసే వారితో జాగ్రత్తగా ఉండాలి
7వ – పద్యం
సీ. 7. కనులార మంచిని కాంచుటకేనేమొ
పన్నుగా అమరెను కన్నుదోయి
వీనులార సువార్త వినుటకే కాబోలు
సమకూర్ప బడియెను శ్రవణ యుగము
చేతులార సుకృతమ్ము చేయుటకౌనేమొ
కలుగుట నరులకు కర యుగళము.
అమలిన పథమున గమి యుంచుటకె లెమ్ము
తనరారు చుండు పద ద్వయంబు
తే.గీ అన్ని యంగాలు రెండేసి – యతి ప్రధాన
రసన మొకటి – హిత ప్రసరణకు వలయు
పలుకు మాత్రము మితముగా పలుకు మన్న
తగవు తెలుపుట దీని యాంతర్య మేమొ.
ప్రతిపదార్ధం :
కనులారా = కళ్ళ నిండుగా
మంచిని = మంచిని
కాంచుటకు + ఏనేమొ
కాంచుటకేనేమొ = చూడడానికి
కన్నుదోయి = కన్నులజంట
పన్నుగా అమరెను = అందంగా ఏర్పడ్డాయి
వీనులార = చెవులారా!
సువార్త వినుటకు + ఏ
సువార్త వినుటకే = మంచి మాట విసుటకే
కాబోలు = కాడోలు
శవణయుగము = చెవుల జంట
సమకూర్పబడియెను = ఏర్పడ్డాయి
చేతులార సుకృతమ్ము = తనివితీరా రెండు చేతులతో మంచి పనులను
చేయుటుకు + ఔను + ఏమొ
చేయుట కౌనేమొ = చేయుట కొఱకే
నరులకు = మానవులకు
కరయుగళము = చేతుల జంట
కలుగుట = = కల్గినవి
అమలిన పథమున = సన్మార్గంలో
గమియుంచుటకెలెమ్ము = నడవటానికే నేమో
పద ద్వయంబు = రెండు పాదాలు
తనరారుచుండు = ఒప్పేవిధంగా ఉన్నాయి
అన్ని + అంగాలు = శరరరంలోనున్న అవయవాలు
రెండు + ఏసి
రెండేసి = రెండు ఉన్నాయి
యతిప్రధాన = పద్యంలో యతి ప్రధానమైనట్టు
రసనము + ఒకటి
రసనమొకటి = నాలుక మాత్రం ఒక్కటే ఉంది
హాత ప్రసరణకు = మేలు కల్గిడుటకు
వలయు పలుకు మాత్రము = కావలిసిన మాత్రం
మితముగా పలుకుము = మితంగా (కొద్దిగానే) పలకాలి
అన్న = అన్నటువంటి
తగవు = యుక్తత
తెలుపుట = తెలియేముట
దీని ఆంతర్యము+ఏమొ
దీని ఆంతర్యమేమొ = దీని భావమేమో!
భావం : కళ్ళనిండుగా మంచిని చూడటానికి ‘మాత్రమే రెండు కళ్ళు ఉన్నాయి. మంచి మంచి మాటలు వినటం కోసమే చెవులు ఉన్నాయి. తనివితీరా రెండు చేతులా మంచి పనులు చేయటానికే, బహుశా మానవులకు రెండు చేతులు ఉన్నాయి. సన్మార్గంలో నడవటానికేనేమో మానవ జాతికి రెండేసి కాళ్ళు న్నాయి.
అన్ని అంగాలు రెండేసి ఉన్నా నాలుక మాత్రం ఒక్కటే ఉన్నది. ఎంతో ముఖ్యమైన సాలుకను ఉపయోగించి, మంచిని పెంపొందించాలి. కాబట్టి నాలుకను మితంగా వాడాలి. అంటే అవసరమయినపుడు మాత్రమే మాట్లాడాలేకానీ లేనిపోని తగవులకు వాడరాదు.
8వ – పద్యం
తే.గీ 8. ఒక్క నాలుక ధాటికి యుర్వి యెల్ల
గింగిరాలెత్తు చెలరేగి గంగ వెఱ్ఱి
అవియు రెండున్న అయ్యారె అడుగవలెనె
తలకు మాసిన దద్దాని తస్సదియ్య.
ప్రతిపదార్ధం :
ఒక్క నాలుకధాటికి = ఒకే ఒక్క నాలుక ప్రతాపానికి
ఉర్వి + ఎల్ల
ఉర్వియెల్ల = ప్రపంచం మొత్తం
గింగిరాలు + ఎత్తు
గింగిరాలెత్తు = గింగిరాలెత్తుచు
చెలరేగి = విజృంభించి
గంగవెట్ఱి = గంగవెఱ్ఱలతత్తును
అవియు రెండున్న = ఆ నాలుకలు రెండున్న
అయ్యారె = అయ్యారే !
అడుగవలెనె = చెప్ఎనక్కరలేదు
తద్దాని = దానియొక్క
తస్సాదియ్య = తస్సాదియ్య !
తలకు మాసిన = పనికిమాలిన పనులు
భావం : ఒక్కొక్కరి మాటతీరులో ఈ ప్రపంచం మొత్తం గంగవెఱ్ఱలెత్తి గింగిరాలు తిరుగుతుంది. అంటే అతలాకుతలం అయిపోతుంది. అట్లాంటి చెడు స్వభావం ఉన్నవారికి ఒకవేళ రెండు నాల్కలుంటే ఇక పరిస్థితి చెప్పనక్కర లేదు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి. మాటలు మార్చి తగవులు పెట్టే వారితో ప్రమాదం అని తెలుసుకోవాలి.
9వ – పద్యం
తే.గీ 9. రెండు చేతులు గలిగియు రిత్తవడును
చిక్కులంబడు వారికి చేయి నిడగ
ఒక్క నాల్క ప్రయోగించి, యుసురుదీయు
చిత్ర మయ్యెడు నాలుక చేవగనిన.
ప్రతిపదార్ధం :
రెండు చేతులు కలిగియు = రెండు చేతులున్నప్పటికి
వారికి చేయినిడగ = ఎదుటి వారికి సహాయం చేయవలెనన్న
చిక్కులంబడు = ఆపదలో పడుతుంది
రిత్త + పడును
రితవడును = శూన్యమగును.
ఒక్క నాల్క ప్రయోగించి = నోట్లో ఉన్న ఒక్క నాల్కతోనే
ఉసురు దీయు = ప్రాణం తీస్తుంది
నాలుక చేవ గనిన = నాలుక యొక్క బలం చూడగా
చిత్రమయ్యెడు = ఆశ్చర్యం కదా!
భావం : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వెళ్ళినా ఒక్కోసారి అపవాదులు, చెడ్డపేరు వస్తాయి. కానీ చిత్రంగా నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది. అంటే మాట తీరులో ఎంత హాని అయినా జరుగుతుంది.
10వ – పద్యం
తే.గీ 10. పరగ పంచేంద్రియాలలోపలను – షడ్డ
సజ్ఞయై యుండు నదియె రసజ్ఞ – పలుకు
ప్రల్లదన మబ్బు కతన పరస్పరాను
రాగ మధుర రసజ్ఞయై రంపటిల్లు,
ప్రతిపదార్ధం :
పరగ = పరగుచున్నట్టి
పంచ + ఇంద్రియాల లోపలను
పంచేంద్రియాల లోపలను = అయిరు ఇంద్రియాలలో నున్న
షడ్రసజ్ఞజై + ఉండును
షడ్డసజ్ఞయైయుండును = ఆరు రుచులను ఆస్వాదించ గలిగినది
అదియే-రసజ = అదియే నాలుక
(పల్లదనము+అబ్బు)
ప్రల్లదనమబ్బు = దుర్బాషలు మాట్లాడుట
కతన = అలవాటుపడితే
పరస్పర+అనురాగ
పరస్పరానురాగ = పరస్పర అనురాగంతో:
మధుర = మధురమైన
రసజ్ఞయై = నాలుకయై
రంపటిల్లు = విజృంభించును
భావం : పంచేంద్రియాల్లోకెల్లా ఆరురుచులనూ ఆస్వాదించ గలిగినది నాలుక మాత్రమే. కానీ దుర్భాషలాడటానికి అలవాటుపడితే, అదే ఒక వ్యసనంలా మారి విజృంభిస్తుంది. అందుకే దుర్భాషలాడే వారికి, అహంకారంలో కన్నూ మిన్నూ గానక మాట్లాడేవారికి దూరంగా ఉండాలి.
11వ – పద్యం
తే.గీ 11. నుడువ పెరవారి సుగుణాలు నోట నాల్క
కల్గ దదె దుర్గుణాల యేకరువు బెట్ట
యే కరువు లేదు మాటాడి, యేకబిగిని
చెలగి వొక్కొక్కడొక ఆదిశేషుడగుచు.
ప్రతిపదార్ధం :
పెడవారి సుగుణాలు = ఇతరుల మంచి గుణాలను
నుడువ = మాట్లాడుటకు
నోట నాల్క కల్గడు = నోట్లో నాలుక కలుగదు
అదె = నాలుకే
దుర్గుణాల = ఎదుటివారిలోని దుర్గుణాలను
ఏకరువు = ఏకరువు
పెట్ట = చెప్పటానికి
ఏకరువు లేదు = ఎటువంటి దరిద్రముండదు
ఏకబిగి బెలగి = అదే పనిగా చెప్పటానికి
ఒక్కొక్కడొక = ఒక్కొక్కడు
ఆశేషుడు + అగుచు
ఆదిశేషుడుచు = ఆదశేషుడవుతాడు
భావం : ఇతరుల సుగుణాలు గురించి చెప్పాలంటే కొందరి నోట నాలుక కదలదు. కానీ వారిలోని దుర్గుణాలను ఏకరువు పెట్టాలంటో మూత్రం వివరించి చెప్పటానికి ముందుంటారు. దుర్్ణాలను ఏచారం చేయటానికి ఆదిశేషుడిలా పడగలు విప్పి వేయినాలుకలతో ప్రచారం చేస్తారు.
12వ – పద్యం
సీ. 12. నోట మాటాడుచు నుదుటి తోడను వెక్కి
రించు కళను రంగరించుకొనియె
క్రిందుగా గిల్లి పై కిని జోలబాడి వం
చించుట వంట జీర్ణించుకొనియె
చచ్చు వాడికనుల (గుచ్చి వేళులు చూచు
కఠిన చర్యకు దాల్చెకంకణంబు
గాలి మూటలుగట్టి గోలపట్టించి గో
తులు (త్రవ్వు పని వెన్నతోడ నేర్చె)
తే.గీ ఊరకుండక తన లీల సారెపైన
సృష్టికర్త కులాలుడై చేసె పెద్ద
లోకభాండము మూయగా మూకుడొకటి
చేయ మరచెను – అక్కడే చేటువచ్చు.
ప్రతిపదార్ధం :
నోటమాటాడుచు = నోటితో మాట్లాడుతూ
నుదుటి తోడను = నోసలుతో
వెక్కిరించు కళను = వెక్కిరించే కళను
రంగరించుకొనియె = కలుపుకొనును
క్రిందుగాగిల్లి = పృష్టం కిందగిల్లి (పక్కవారిని బాధపెట్టి)
పైకిని జోలపాడి = మళ్ళీ ఓదార్చి
వంచించుట = మాసగించుట
వంట జీర్జించుకొనియె = వంట బట్టించుకుంటారు
చచ్చువాడి కనుల (గుచ్చి = పదునైన కళ్ళలో పరికిస్తూ
వేళులుచూచు = సమయంచూసి
కఠనచర్యకు = హీనమైన పనులు చేయడానికి
దాల్చె కంకణంబు = కంకణం కట్టుకొని ఉంటారు
గాలి మూటలు గట్టి = కొందరైతే మాటల మూటలతో
గోల పట్టించి = గోలచేసి
గోతులు త్రుపపని = మోసం చేయడం వారికి
వెన్నతోడ నేర్చె = వెన్నతో పెట్టిన విద్య
ఉుక+ఉండక
ఊరకుండక = ఊరుకోకుండా
తన లీల సారెపైన = తన లీలతో
సృష్టికర్త = బ్రహ్
కులాలుడై = కుమ్మరియై
పెద్దలోక భాండము = పెద్దకుండను
మాయగాచేసె = మాగా చేశాడు
మూకుడు+ఒకటి
మూకుడొకటి = మూతను ఒకదానిని
చేయమరచెను = చేయడం మరచోపోయాడు
అక్కడే చేటు వచ్చె = అందువల్లనే అసలు చేటు వచ్చింది.
భావం : లోకంలో కొందరు నోటితో మాట్లాడుతూ, నొసలుతో వెక్కిరించే కళా ప్రవీణులుంటారు. ప్రక్కన వారిని కాఖాలని బాధపెట్టి మళ్ళీ ఓడార్చే విపరీత స్వభావాన్ని వంట బట్టించుకుని ఉంటారు. పదునైన కళ్ళలో పరికిస్తూ ఎటువంటి హీనమైన పనులు చేయడానికైనా కంకణం కట్టుకొని ఉంటారు. కొందరైతే మాటలతో గోలచేని, గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు. అంటే మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య.
13వ – పద్యం
త.గీ 13. కర్మ జాలక లోగుట్టు కాస్త బయట
పడినదా, లేదు వేరు వ్యాపనము ప్రజకు
జీత భత్యాలు లేకున్న చిత్త శుద్ధి
చెడని యుద్యోగులై సేవ చేయు చుండు
ప్రతిపదార్ధం :
కర్మజాలక = కర్మకాలి
లోగుట్టు కాస్త
బయటపడినదా = రహస్యం ఏదైనా బయటపడిందో
లేదు = లేనియల
వ్యాపనము = వ్యాపకం
ప్రజకు = ప్రులు
జీతఫత్యాలు లేకున్ను = జీతఫత్యాలు లేకపోయిన
చిత్తశుద్ధి చెడని = పవిత్రమైన మనసు చెడకుండా
ఉద్యోగులై = ఉద్యోగస్థులై
సేవచేయుచుండు = సేవచేస్తారు
భావం : కర్మకాలి ఏ మనిషి గురించిన రహస్యం ఏదైనా ఐయటహడిందో ఈ ప్రజలు ఎంతో చత్తశుద్ధి అంకితభావం కల్గిన ఉద్యోగుల్లా పనిచేసి చిలవలు పలువలు చేసి ప్రచారం చేసే సేవను ప్రదర్శిస్తారు. ఇతరుల రహస్యాలను అందరితో చాదింపువేసే సేవను బహుబాగా చేస్తారు. అంటే మనకు సంబంధించిన రహస్యాలను నలుగురికి చెప్పేవారితో జాగ రూకులై ఉండాలి.
14వ – పద్యం
తే.గీ 14. మంచికిని లేదు – పవమాన మానసముల
చెలగదా వేగమొక గృహచ్ఛిద్రమైన
ఎన్ని రెక్కల నెగయునో ఏమొగాని
పెదవి దాటినదా ఇంక పృథివి దాటు
ప్రతిపదార్ధం :
మంచికిని లేదు = మంచి మాటలకు లేదు
పవమాన మానసములు = వాయువు మనస్సుకన్నా
వేగము = వేగంగా
చెలగదా = విజ్లంభిస్తుంది
ఒక గృహ ఛిద్రము + ఐన
ఒక గృహ ఛిద్రమైన = ఎన్ని విధాలుగా
ఎగయునో = ఫైకి తెలియుట
ఏమొగాని = ఏమోగాని
పెదవి దాటినడా = పెదవి డాటి బయటకు వస్తే
ఇంక పృథివి డాటు = ఇంక భూమినంతా పాకిపోవును
భావం : ఇంట్లోవారు కనుక చెప్పుడు మాటలను వినకపోతే వాయువు కంటే వేగంగా ఆ వార్తను రెక్కలు కట్టుకుని మరి ప్రచారం చేస్తారు. అదే మంచి వార్తసు ప్రచారం చేయరు. కనుక ఏదైనా ఒక మాట పెదవి డాటి బయటికి వచ్చిందో అది ఈ భూగోళాన్నే దాటుతుంది. అంటే ప్రపంచం మొత్తం చుట్టివస్తుంది. కనుక మాటను మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మాట మహిమ తెలిసి ఉండాలి.
కవి పరిచయం
కవి పేరు : కొలకలూరి స్వరూప రాణి
తల్లిదండ్రులు : నడుకుర్తి వెంకటరత్న కవి, రత్నమరియాంబ దంపతులు.
స్వస్థలం : గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, గోవాడ గ్రామం.
గురువులు : తల్లిదండ్రుల వద్ద సంగీత, సాహిత్య అధ్యయనం చేశారు.
విద్య : విద్యాభ్యాసం గుంటూరులోని శారదా నికేతనంలో (HCM) టీచర్ ట్రైనింగ్ స్కూలు, ఒంగోలులో జరిగింది.
వృత్తి : ఉపాధ్యాయిని
రచనలు : మేమంతా భటులం, విష్ణుమార్గ దర్శకులం అనే కవిత మొట్టమొదట కృష్ణా పత్రికలో వచన కవితగా ప్రచురితమైంది. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం మొదలైన అంశాలపై విశేషంగా రచనలు చేశారు. నన్నయ, మహిళ, శివతాండవం, వాయునందన శతకం మొదలైన గ్రంథాలు రచించారు.
బిరుదు : కవయిత్రీ తిలక
ప్రత్యేకతలు : సంప్రదాయ కవిత్వంలో ఆధునికత పండించడం 10వ ఏటనే కవిత్వ రచన ప్రారంభం. ప్రప్రథమ స్త్రీవాద కవయిత్రి.
కాలం : 01.05.1943 నుండి 15.10.2022 వరకు జీవించారు.
ప్రస్తుత పాఠ్యాంశం ఆమె రచించిన చంద్రగ్రహణం కావ్యం లోనిది.
ఉద్దేశం
“నోరు వీపుకు దెబ్బలు తేకే !” అన్నారు పెద్దలు. “నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.” అన్నారు వారే. నాలుక మనకు చెడునైనా మంచినైనా తెస్తుంది. “నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది” అనేక వదంతులు పుట్టిస్తుంది. దాని ఫలితంగా మనకు అనేక కష్టనష్టాలు ఎదురౌతాయి.
అవయవాలన్నింటిలోనూ ప్రధానమైనది నాలుక. విలువయిన మాటలతో గౌరవం పెరుగుతుంది. బంధాలూ, స్నేహాలూ వికసిస్తాయి. వ్యక్తి సంస్కారానికి మాటతీరు గీటురాయి. మాటలపై అదుపు, పొదుపు అవసరం. మాట విలువను తెలుసుకొని, మంచి మాటలనే మాట్లాడడం అలవరుచుకొనేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం.
నేపథ్యం
నాలుక చాలా గొప్పది. అందరి మాట తీరు ఒకేలా ఉండదు. కొందరి మాటతీరు ప్రేమను పెంచుతుంది. కొందరి మాటలు బాధను కల్గిస్తాయి. కొందరి మాటలు ధైర్యాన్నిస్తాయి. కొందరి మాటలు భయాన్ని కలిగిస్తాయి. నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. మోసపు మాటల వలలో పడకూడదు అనే ఆలోచనను పెంపొందింప చేయాలనే సత్సంకల్పమే ఈ పాఠ్యాంశ నేపథ్యం.
ప్రక్రియ – ఆధునిక పద్యం
తెలుగు సాహిత్య ప్రక్రియలో పద్యం ప్రధానమైనది. పద్యానికి ఛందోనియమాలు ఎక్కువ. అవి కచ్చితంగా పాటించాలి. గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాస నియమాలు ఆధునిక పద్యంలోనూ తప్పవు. కాని, ఆధునిక పద్యంలో వ్యవహారిక పద ప్రయోగాలు, అన్య భాషాపద ప్రయోగాలు, వస్తు వైవిధ్యం కన్పిస్తుంది.