Access to the AP 9th Class Telugu Guide 6th Lesson తీర్పు Questions and Answers are aligned with the curriculum standards.
తీర్పు AP 9th Class Telugu 6th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి
అక్కడ…
కొమ్మ కొమ్మకో కచ్చేర
గూటిగూటికో రాగపల్లవి
ప్రతి చెట్టూ రంగుల దొంతర
నేలపట్టంతా పక్షుల జాతర
కుహుకుహులు కితకితలు
కువకువలు కిలకిలలు
ఎన్ని రాగవసంతాల సంగమాలో
ఎన్నెన్ని సంబరాల దొంతరలో
వలయాక్షుల ఉల్లాసగానాలతో
వాతావరణం వుత్ఫుల్లమౌతుంది.
విహోయస విద్యుత్ రహదారిలో
రంగుల కల ఆవిష్కృతమౌతుంది.
కాదంబినీ శ్వేత కాంతుల వీధి
అరుణరాగాల ఏ్రవాహమౌతుంది.
శరన్నవరాడ్రుల్లో శఫరి తీర్థం
కళల కొలువులో సేదతీరుతుది.
తరలి వచ్బిన బంజారా పక్షులు
కువకువల గీతికలని ఆలపిస్తాయి.
గుండెల్లో దాచుకున్న (పేమ నిధుల్ని
గుదిగూట్లో ఆరబోస్తాయి.
ప్రణయ కలాప లాటీల ఘోషకు
చుక్కలన్నీ నేలకు తొంగిచూస్తాయి.
తరుడ హృదయకేళీ వలాసాలు
యామిని ఏకాంతంలో కోరిక లూదుతాయి.
ఉదయం దినబాలుడు కిరణకరాలు
చాచి గోరింట పూసుకుంటాడు గుంభనంగా
హృదయ కవాటాలు తెరిచి కుసుమాలు
రంగులద్దుకుంటాయి నిర్మలంగా
వర్ణం ప్రాణపల్లవ మహిత స్వరూపం
మొన్నటి వరకూ ఎవరూ పలకరించని అనామక నేలపట్టు
నేడు ఖగసమాగమానికి ఆయువుపట్టు.
నిన్నటిదాకా వెలవెల బోయిన వృక్షాలు
నేడు తీగలు మీటిన వీణియలు
వేయి వేణువుల కృష్ణగీతికలు
ఇప్పుడు నేలపట్టు ఉదయాలు
స్వరమకరంద తరంగ ఝరులు
ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు
అనురాగ గీతామృత స్రవంతులు
ఒక పెలికాన్ రెక్కల గుడారంలో
ప్రియురాల్ని పొదువుకుంటుందిక్కడ
ఎర్ర కాళ్ళ కొంగ వొకటి పక్కన చేరి పొడవు
ముక్కుతో సఖినలరిస్తుందిక్కడ.
శబరికొంగ శృంగార రాగంలో
ప్రేయసి ప్రియగానంలో మైమరుస్తుంది.
వళ్లంతా వూపిరి చేసి వడ్లపిట్ట
చెలియ మేనంతా సృ్పశిస్తుంది.
క్షీరదాల ప్రేమ వరదలే కాదు
అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి.
సంతాన లక్ష్మీ మహాయజ్ఞంలో
కోటిప్రాణాలు ఉదయిస్తాయి.
ఆలోచనాత్యక ప్రశ్నలు
ప్రశ్న 1.
పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలను చూసినపుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారో తెలపండి.-
జవాబు:
పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలను చూశాను. చూసినప్పుడల్లా పక్షులకు మాట రాకపోయినా వేటాడి తన గూటికి వచ్చి పక్షి పిల్లలకు ఆహారం పెడుతుంది. అనుక్షణం పక్షి తన గూడును రక్షించుకుంటుంది. పిల్లలపై ఎంతో మమకారం కలిగి యుంటుంది. భగవంతుడు ఆ పక్షికి ఎంత జ్ఞానాన్నిచ్చాడో ఊహించుకుంటేనే చాలా ఆశ్చర్యం మరియు ఆనందం కల్గుతుంది.
ప్రశ్న 2.
పక్షి గూడు కట్టడంలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిన అంశాలు ఏమిటి ?
జవాబు:
పక్షి గూడు కట్టడంలో మహా నేర్పరి. ఒక విధంగా ఇంజనీరు అని చెప్పవచ్చును. గూడును నిర్మించడంలో గదులను ఏర్పాటు చేసుకుంటుంది. వర్షం పడకుండా గూడును ఏర్పాటు చేసుకుంటుంది. రకరకాల గడ్డితో గూడును అల్లి తన ప్రతిభా నైపుణ్యాన్ని చూపిస్తుంది. చెట్ల కొమ్మలకు వ్రేలాడే విధంగా గూడును నిర్మించుకుంటుంది. ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆవిధంగా మానవుడు గూడును నిర్మించలేడు.
అవగాహన – ప్రతిస్పందన
ఇవి చేయండి
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి.
ప్రశ్న 1.
ఆకాశంలో సంచరిస్తున్న హంసల గుంపును కవి ఎలా వర్ణించాడో చెప్పండి.
జవాబు:
ఆకాశవీథిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలు అనే ఆకాశవీధిలో గొప్ప రసాగ్రభావంతో సంచారం చేస్తున్న సరస్వతీదేవి పాదాల సవ్వడిలా విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
ప్రశ్న 2.
హంస ఎలా గాయపడింది ?
జవాబు:
ఆకాశంలో విహరించే హంసను దేవదత్తుడు కఠోరమైన బాణంతో క్రూరంగా కొట్టగా బాణం తగిలి హంస క్రేంకారం చేస్తూ సిద్ధార్థుని పాదాల చెంత పడింది.
ప్రశ్న 3.
దేవదత్తుడు, గౌతములలో మీకు ఎవరి పాత్ర నచ్చింది? ఎందుకో చెప్పండి.
జవాబు:
గౌతముని పాత్ర నాకు నచ్చింది. దయార్ద్ర హృదయంతో గాయపడ్డ హంసను రక్షించాడు. శుద్ధోదన మహారాజు సభలో జీవకారుణ్యాన్ని చూపించి సభాసదుల మన్నలను పొందాడు. మానవులంతా మానవత్వంతో జీవించాలని జాగృతి పల్కాడు.
ఆ) కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం ఎంతోమందికి మానసిక ఆనందాన్ని, చక్కటి విందును ఇస్తుంది. అందువల్ల ప్రజలందరూ దానికోసం ఎదురుచూసేవారు. ఆ సంవత్సరం కూడా వేలాది గొర్రెలు, మేకలు కాళీమాతకు బలివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఒక బాలుడు ప్రజలను తోసుకుంటూ వచ్చి బలిపీఠం వద్ద నిల్చొని ప్రసంగించడం ప్రారంభించాడు.
‘జీవులన్నీ దేవత ముందు సమానమే అయినప్పుడు కొన్నింటిని బలివ్వడం కాళీమాతకు క్రోధం కలిగించే అంశం’ అని బిగ్గరగా అరిచి చెప్పాడు, బలులు మానమన్నాడు. అక్కడి ప్రజలంతా విస్తుపోయారు. ఆ బాలుడి తండ్రి సమాజంలో గొప్పస్థానంలో ఉండడం వల్ల అతన్ని ఏమీ అనలేక తండ్రికే ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినా అతను తన వాదాన్నే వినిపించాడు. ప్రజల ఒత్తిడికి తలొంచి, తండ్రి ఆ బాలుడిని కొంతకాలం ఇల్లొదిలి వెళ్ళాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆ ధీశాలి ఎవరో కాదు అనితర సాధ్యమైన పోరాటంతో ఎన్నో దురాచారాలు రూపుమాపిన సంఘసంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్.
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
జంతుబలిని అడ్డుకొని ప్రజల ఆగ్రహానికి గురైన ధీశాలి ఎవరు ?
జవాబు:
జంతుబలిని అడ్డుకుని ప్రజల ఆగ్రహానికి గురైన ధీశాలి రాజారామ్ మోహన్ రాయ్.
ప్రశ్న 2.
పై పేరాలో మాట్లాడడం అని అర్థం వచ్చే పదం ఏది ?
జవాబు:
పై పేరాలో మాట్లాడటం అని అర్థం ఇచ్చే పదం ప్రసంగించడం.
ప్రశ్న 3.
‘విస్తుపోవడం’ అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయండి.
జవాబు:
విస్తుపోవడం = ఆశ్చర్యపోవుట
రవి, రాములిరువురు చేసే సర్కస్ విన్యాసాలను చూసి ప్రజలంతా విస్తుపోయారు.
ప్రశ్న 4.
ఆజ్ఞాపించడం అంటే
అ) ప్రార్థించడం
ఆ) ఆదేశించడం
ఇ) శిక్షించడం
ఈ) రక్షించడం
జవాబు:
ఆ) ఆదేశించడం
ప్రశ్న 5.
పై పేరాకు శీర్షిక రాయండి.
జవాబు:
గొప్ప సంఘసంస్కర్త
ఇ) కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సభక్తజిన్ పాదుషా మొదట్లో చాలా బీదవాడు. అతను ఓ మామూలు సిపాయిగా జీవితం గడుపుతూ వుండేవాడు. ఓరోజు అతను తుపాకి తీసుకొని, గుర్రమెక్కి అడవిలో వేటకు వెళ్లాడు. ఆ దినం అతను అడవి అంతా గాలించాడు. ఒక్క జంతువు కూడా చిక్కకపొయ్యే సరికి అతనికి విసుగు పుట్టింది. చాలా దూరం వెళ్లగా వెళ్లగా అతనికి ఓ జింక, జింకపిల్ల కనపడ్డాయి. సభక్తజిన్ గుర్రాన్ని ఆ జింకల వైపు దౌడుతీయించాడు.
తల్లి జింకేమో పరిగెత్తి భయంకొద్దీ ఓ పొదలో దాక్కొనింది. కాని, పాపం జింకపిల్ల సభక్తజిన్ చేతికి చిక్కిపోయింది. అతను దాని నాలుగుకాళ్లు కట్టివేసి, గుర్రంమీద వేసుకొని దాని తల్లిని కూడా ఎలాగైనా పట్టుకోవాలని నాలుగువైపులా గాలించాడు. ఎంత వెదికినా అతనికి తల్లి జింక అగపడలేదు. నిరాశచెంది అతను తిరుగుదోవ పట్టారు.
సభక్తజిన్ తనపిల్లను బంధించి తీసుకొని పోతూండటం తల్లి జింక చూసింది. పొదలోంచి బయటకొస్తే తనను కూడా పట్టుకుంటాడు. అయినా బిడ్డను కాపాడుకోవాలి అని అనుకుంది. ఏదయితే అది జరుగుతుంది లెమ్మని బిడ్డ మీది ప్రేమ కొద్దీ, పొదనుంచీ బయటికి వచ్చింది. సభక్తజిన్ గుర్రం వెంటే పరుగెత్తసాగింది. కొంత దూరం వెళ్లిన తర్వాత, సభక్తజిన్ వెనక్కు తిరిగి చూశాడు. తన వెంబడే జింక రావడం చూసి అతనికి అశ్చర్యం కలిగింది. దొరికిపోతాను అని తెలిసి కూడా పిల్ల కోసం తల్లి రావడాన్ని చూసి అతని హృదయం కరిగిపోయింది.
అతను జింకపిల్ల కట్లను విప్పి, దాన్ని గుర్రం మీదినుంచి కిందికి దించాడు. తల్లి జింక ఒక గెంతుతో పిల్లను చేరింది. ప్రేమగా ఒళ్ళంతా నాకింది. జింక సంతోషంతో పిల్లతో సహా చెంగు చెంగున గెంతుతూ అడవిలోకి పారిపోయింది. ఆ సన్నివేశం సభక్తజిన్ను దయాళువుగా మార్చింది. తదనంతర కాలంలో అతను చక్రవర్తి అయి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాడు.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
సభక్తజిన్ ఎలా జీవించేవాడు ?
జవాబు:
సభక్తజిన్ సిపాయిగా జీవితం గడుపుతూ ఉండేవాడు.
ప్రశ్న 2.
సభక్తజిన్ తన గుర్రం వెంట పరిగెత్తి వస్తున్న తల్లి జింకను చూచి ఏమనుకున్నాడు ?
జవాబు:
తన వెంట వస్తున్న తల్లి జింకను చూచి ఆశ్చర్యపోయాడు. వెంటనే అతని హృదయం కరిగిపోయింది.
ప్రశ్న 3.
‘గాలించడం’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
గాలించటం అంటే వెదకడం అని అర్థం.
ప్రశ్న 4.
పై పేరా నుంచి ఏదైనా ఒక ఆలోచనాత్మక ప్రశ్నను రాయండి.
జవాబు:
తల్లి ప్రేమ ఎటువంటిదో తెల్పండి.
ప్రశ్న 5.
‘హృదయం కరగడం’ ఉపయోగించి ఒక సొంతవాక్యం రాయండి.
జవాబు:
పేద ప్రజల జీవనవిధానం చూడగానే మదర్ థెరిసా హృదయం కరిగింది.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
గౌతముడు, దేవదత్తుని మధ్య హంస గురించి జరిగిన సంవాదాన్ని రాయండి.
జవాబు:
ఆకాశమార్గంలో వెడుతున్న హంసను చూచి దేవదత్తుడు ఒక వాడి బాణంతో కొట్టెను. అది విలవిలలాడుతూ గౌతముని ముందర పడింది. గౌతముడు వెంటనే దాని రక్షించాడు. అంత దేవదత్తుడు నేను నా బాణంతో కొట్టగా కింది పడింది. కనుక నా వస్తువు నాకీయవలసింది అనెను. కాని గౌతముడు నాచే రక్షింపబడింది కనుక ఇది నాది అని పల్కెను. ఇరువురునూ నాదంటే నాది యని తగవులాడుకునిరి.
ప్రశ్న 2.
హంస గౌతమునిదే అని నిర్ధారణ ఎలా జరిగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
హంసను ఉంచిన రత్న పీఠం వద్దకు దేవదత్తుడు చేరుకొని గంభీరంగా పిల్చాడు. కాని హంస భయంతో వెనక్కు తగ్గి కుంగిపోయింది. తర్వాత గౌతముడు – “చెల్లి రావె, మంచి మల్లి రావె, కల్పవల్లి రావె, పాలవెల్లి రావె, చిక్కని చనమున్న జాబిల్లి రావె, హంస తల్లి రావె, అంటూ ప్రేమగా పిలిచాడు. వెంటనే రివ్వున ఎగిరి గౌతముని చేతులందు వాలింది. హంసను ఎవరైతే పిలిస్తే వారి వద్దకు వస్తుందో ఆ హంస వారిదే అవుతుంది అని న్యాయాధికారులు చెప్పారు. ఆ విధంగా హంస గౌతమునిదే అని నిర్ధారణ జరిగింది.
ప్రశ్న 3.
గౌతముడు హంసకు చేసిన సపర్యల గురించి రాయండి.
జవాబు:
హంస గిర గిర తిరుగుతూ, అరుస్తూ, వాలిపోయి, నేలపై పడి గిజగిజలాడుతోంది. కరుణామూర్తియైన సిద్ధార్థుడు ఇది చూచి బిరబిరా వెళ్ళి దానిని ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చుండ బెట్టుకున్నాడు. గౌతముడు హంస రెక్కలు దువ్వి, వీపు -సవరించి, పాదాలు, చెక్కిళ్ళు చక్కదిద్ది, శరీరాన్ని తడిమి, ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి, దిగులు పోగొట్టి, బుజ్జగించి ప్రేమతో లాలనచేశాడు.
ప్రశ్న 4.
“హంసతీర్పు” పాఠ్యభాగ కవిని గురించి రాయండి.
జవాబు:
హంసతీర్పు పాఠ్యభాగంను కరుణశ్రీ రచించారు. ఈయన అసలు పేరు జంధ్యాల పాపయ్యశాస్త్రి కరుణశ్రీ అన్నది జంథ్యాల పాపయ్యశాస్త్రిగారి కలం పేరు. గుంటూరు జిల్లా కొప్పర్రు వీరి జన్మస్థలం. మహాలక్ష్మమ్మ, పరదేశయ్య వీరి తల్లిదండ్రులు. గుంటూరు ఏ.సి. కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాలసాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. వీరు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వంటి రచనలు చేశారు.
ఆ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
దేవదత్తుడు, సిద్ధార్థుడు హంసను పిలిచిన మాట తీరులోని వ్యత్యాసాన్ని, ఫలితాన్ని సొంత మాటల్లో వ్యక్తీకరించండి.
జవాబు:
శుద్ధోదన మహారాజు సభలో న్యాయాధికారి, దేవదత్త గౌతములను చూచి ఇటురమ్మని పిలిచాడు. హంసకు కొద్ది దూరంలో నిలబడి ఒక్కొక్కరుగా వచ్చి, చేతులు చాచి, హంసను పిలవండి. అది ఎవరి చేతుల మీద వాలితే వారిదవుతుంది. దీనితో న్యాయం తేలిపోతుంది అన్నాడు.
దేవదత్తుడు హంసను ఉంచిన రత్న పీఠం వద్దకు చేరుకొని కరుకు చేతులతో, గట్టి స్వరంతో, భ్రమించిన మనస్సుతో ఖగమా ఇటురా ! ఇటురా ! అని గంభీరంగా పిలిచాడు. దేవదత్తుని రూపాన్ని చూచో, మోసపు చూపులు చూచో, అతని చేతిలో ఉన్న ధనుస్సును చూచో, మనస్సులో భయం కలిగిందేమోగాని, దుష్టుని హృదయాన్ని తాకలేని సంగీతంలాగా హంస వెనక్కు తగ్గి కుంగిపోయింది.
తర్వాత గౌతముడు ప్రేమతో చెల్లిరావె, మంచి మల్లిరావె, కల్పవల్లి రావె, పాలవెల్లి రావె, చిక్కని చక్కదనమున్న జాబిల్లి రావె, హంస తల్లి రావె అని పిలిచాడు. గౌతముడు చేతులు చాచి పిలవగా హంస రివ్వున వచ్చి అతని చేతిపై వ్రాలింది.
ప్రశ్న 2.
ఈ కథలో నీకు ఎవరి పాత్ర నచ్చింది ? ఎందుకో రాయండి.
జవాబు:
ఈ కథలో నాకు గౌతముని పాత్ర నచ్చింది. అతడు ధర్మమూర్తి. జీవలోక కారుణ్యము గలవాడు. దయార్ద్ర హృదయుడు. దేవదత్తుడు కూల్చిన హంసను తీసుకున్నాడు. హంస గిరగిర తిరుగుతూ, అరుస్తూ, వాలిపోయి, నేలపై పడి గిజగిజ లాడుతోంది.
కరుణామూర్తియైన సిద్ధార్థుడు ఇది చూచి బిరబిరా వెళ్లి దానిని ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చుండబెట్టుకున్నాడు. గౌతముడు హంస రెక్కలు దువ్వి, వీపు సవరించి, పాదాలు, చెక్కిళ్ళు చక్కదిద్ది, శరీరాన్ని తడిమి, ప్రేమ పూర్వకమైన మాటలు మాట్లాడి, దిగులు పోగొట్టి, బుజ్జగించి ప్రేమతో లాలనచేశాడు. అందువల్ల గౌతముడి పాత్ర నాకు బాగా నచ్చింది.
ప్రశ్న 3.
ఈ పాఠాన్ని నాటికగా ప్రదర్శించడానికి వీలుగా గౌతముడు, దేవదత్తుల సంభాషణను రాయండి.
జవాబు:
ఆకాశంలో సంచరించే హంసల గుంపును దేవదత్తుడు చూశాడు. పదునైన బాణంతో ఒక హంసను కొట్టగా అది గౌతముని కాళ్ళ ముందరపడింది. గౌతముడు దానిని రక్షించాడు.
దేవదత్తుడు : ఓ రాజకుమారా ! ఈ హంస నా భుజశక్తికి ఫలితం. కనుక నాకే చెందుతుంది.
గౌతముడు : ఆకాశమార్గంలో స్వేచ్ఛగా విహరించే హంసపై నీ రాక్షస బుద్ధి చెల్లుతుందా ? కాలికి ముల్లు గుచ్చుకుంటే బాధపడతావే ! ప్రపంచంలో ఉండే సమస్త జీవుల ప్రాణం ఒకటే కదా ! అవీ నీ వలే ప్రాణులే ! క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు.
దేవదత్తుడు : ఓ రాజపుత్రా ! నేను కూల్చిన హంసను దాస్తావెందుకు ? నా పక్షిని నాకు ఇవ్వు.
గౌతముడు : సున్నితమైన రాజహంస రెక్క సందున క్రూరమైన బాణాన్ని గుచ్చి బాధించావు. ఇది నీకు తగునా ?
దేవదత్తుడు : ఈ హంస నాది.
గౌతముడు : నేను రక్షించాను కనుక ఇది నాది. వీరిద్దరూ ఏమీ నిర్ణయించుకోలేక శుద్దోదన మహారాజు దగ్గరకు వెళ్ళారు.
భాషాంశాలు – పదజాలం
అ) కింది వాక్యాలా చదివి, ఎరుప రంగులో ఉన్న పడానికి అర్థం రాసి, వాటిని ఉపషోగించి సొంతపాక్యాలా రాయండి.
ప్రశ్న 1.
పిల్లలు తల్లి అంకము నందు ఆడుకుంటారు.
జవాబు:
అంకము = ఒడి
అమ్మ రవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దిస్తోంది.
ప్రశ్న 2.
పక్షులు వినుత్రోవలలో విహరిస్తాయి.
జవాబు:
వినుత్రోవ = ఆకాశమార్గం
ఆకాశమార్గం గుండా విమానాలు తిరుగుతూ ఉంటాయి.
ప్రశ్న3.
ఉదయిస్తున్న సూర్యుడు గగనకాంత ఆస్య సింధూర తిలకంలా ఉన్నాడు.
జవాబు:
ఆస్యము = ముఖము
ఆమె ముఖము చంద్రబింబమువలె ప్రకాశిస్తోంది.
ప్రశ్న 4.
మరాళము మానస సరోవరంలో విరిసిన తెల్లకలువలా ఉన్నది.
జవాబు:
మరాళము = హంస
సరస్వతీ దేవి వాహనం హంస.
ప్రశ్న5.
బాధితుల కళ్ళల్లో బాష్పములు జలజలా రాలుతాయి.
జవాబు:
బాష్పములు = కన్నీళ్ళు
పంటలు పండకపోవడంతో రైతు కళ్ళవెంట కన్నీళ్ళు జలజలా రాలినాయి.
ఆ) కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్ఝక పదాలు గుర్తించి రాయండి.
1. ఆకాశంలో మేఘాలు ఆవరించినపుడు గగనం, నల్లగా మారుతుంది.
జవాబు: అంబరము = ఆకాశము, గగనము
2. వేటగాళ్ళకు బాణాలు తయారు చేయడం అమ్ములు సంధించడం తెలుసు.
జవాబు: శరం = బాణము, అమ్ము
3. సరస్సులోని కలువలు తటాక జలాల అలలకు ఊయలలూగుతున్నాయి.
జవాబు: సరోవరం = సరస్సు, తటాకం
4. సజ్జనుల మాటలు అమృత తుల్యాలు, వారి పలుకులు ఆత్మీయతను పంచుతాయి.
జవాబు: వాక్కులు = మాటలు, పలుకులు
5. చేతులు భూషణాలకు మాత్రమే కాదు, హస్తాలు శ్రమించడానికి కూడా ఉపకరిస్తాయి.
జవాబు: కరములు = చేతులు, హస్తాలు
ఇ) కింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు నానార్థాలను గుర్తించి రాయండి.
1. లక్ష్మి ఉన్న ఇంట సంపదకు కొరత ఉండదు.
జవాబు: శ్రీ = లక్ష్మి, సంపద
2. బాణము తగిలి పక్షి గాయపడింది..
జవాబు: ఖగము = పక్షి, బాణము
3. చైత్రమాసంలో తేనె విస్తారంగా దొరుకుతుంది.
జవాబు: మధు = తేనె, చైత్రము
4. ఆ పాత్రలలో నెయ్యి నీరు నిండుగా ఉన్నాయి.
జవాబు: ఘృతము = నెయ్యి, నీరు
5. పర్వత సానువులపై చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు.
జవాబు: సోమ = శ్రయము, పరాక్రమము
ఈ) ఈ కింది పదాలకు ప్రకృతి – వికృతి పదాలను రాయండి.
జవాబు:
వ్యకరణాంశాలు
సంధులు
అ) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.
ఉదా : వీథులందు : వీథులు + అందు ఉత్వసంధి
1. కవీంద్రుడు : కవి + ఇంద్రుడు — సవర్ణదీర్ఘ సంధి
2. మునీంద్రుడు : ముని + ఇంద్రుడు — సవర్ణదీర్ఘ సంధి
3. భావాంబరము : భావ +ఇంద్రుడు — సవర్ణదీర్ఘ సంధి
4. ప్రేమాంకము ప్రేమ + అంకము — సవర్ణదీర్ఘ సంధి
5. పరమేశ్వరుడు : పరమ + ఈశ్వరుడు — సవర్ణదీర్ఘ సంధి
సమాసములు
అ) వాక్యంలో సమాస పదాలు గుర్తించడం ఎలా ?
“అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం కావడం సమాసం. ఒక వాక్యంలోని పదాలను నిశితంగా పరిశీలిస్తే రెండు పదాలు కలసివున్న పదం గుర్తించగలం. గుర్తించిన పదాన్ని విడి విడిగా రావాలనుకుంటే ఆ పదంలో ముందో, వెనుకో, మధ్యనో ఒక కారకం (ప్రత్యయాలు, విశేషణాలు, ఉపమానాలు, సంఖ్యలు, వ్యతిరేకార్థకాలు) వస్తుంది. కారకాన్ని బట్టి అది ఏ సమాసమో గుర్తించగలం.
ఉదాహరణకు – రాజసభ నిండుగా వున్నది.
1. రాజసభ – ఇందులో రాజ, సభ అనే పదాలు ఉన్నాయి. ఇవి రెండూ కలిసి రాజసభ అయింది. ఇది సమాస పదం. రాజసభ అంటే రాజు యొక్క సభ – యొక్క అనే ప్రత్యయం షష్ఠీ విభక్తికి చెందుతుంది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది.
కింది వాక్యాలలో సమాస పదాలు, సమాస పదాలు కానివి గుర్తించండి.
జవాబు:
ఆ) కింది వాక్యాలలోని ఎరుపు రంగులో ఉన్న పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి.
1. పక్షులు అంబర వీథిలో సంచరిస్తాయి.
అంబర వీథి : అంబరమనెడి వీథి — రూపక సమాసం
2. సరస్సులో మంజుల మరాళము వున్నది.
మంజుల మరాళము : మంజులమైన మరాళము — విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. మహాకవులు కావ్యాలు రచించారు.
మహాకవులు : గొప్పవారైన కవులు — విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4. పక్షులు వేటగాళ్ళ బాణీహతికి చనిపోతూ ఉంటాయి.
బాణహ : బాణము యొక్క హతి — షష్ఠీ తత్పురుష సమాసం
5. దేవదత్త శౌద్దోదనులు స్నేహితులు.
దేవదత్త శౌద్ధోదనులు : దేవదత్తుడును, శుద్ధోదనుడును — ద్వంద్వ సమాసం
అలంకారాలు
కింది ఉదాహరణలు గమనించండి.
ప్రశ్న 1.
ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతీ పాద లాస్యంలా ఉంది.
జవాబు:
ఇక్కడ హంసల చలన విన్యాసాన్ని, సరస్వతీ పాద లాస్యంగా ఉంది అని వర్ణింపబడింది.
ఉపమాన ఉపమేయాలకు సామ్య రూపమైన విన్యాసం అందంగా చెప్పబడింది. అనగా ఒక వస్తువు మరొక వస్తువుతో పోల్చి చెప్పబడింది కావున ఇది ఉపమాలంకారం.
ప్రశ్న 2.
బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది.
జవాబు:
ఇక్కడి తెల్లని హంస భూమిపై పడడం, శాపం తగిలి తెల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది. ఇక్కడ ఉపమాన ఉపమేయాలలో సమాన ధర్మం ఉంది. ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పబడింది. కావున ఇది ఉపమాలంకారం.
ప్రశ్న 3.
బాణం దెబ్బకు హంస గాయపడడం రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది.
జవాబు:
హంస గాయపడడం రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉందని సారూప్యాన్ని చెప్పబడింది. ఉపమానమైన రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడం, ఉపమేయమైన హంస గాయపడడం. ఈ రెండింటిలోని ఒకదానిని మరొక దానితో పోల్చి చెప్పబడడం వల్ల ఇది ఉపమాలంకారమైనది.
ఉపమాలంకార – లక్షణం:
లక్షణం : ఉపమాన ఉపమేయాలకు ఈ రెండింటికి సామ్య రూపమైన సౌందర్యం సహృదయ రంజకంగా ఎక్కడ ఉంటుందో అక్కడ అది ఉపమాలంకారమవుతుంది. అనగా ఒక వస్తువు మరొక వస్తువుతో పోల్చి చెబితే దాన్ని ఉపమాలంకారమంటారు.
ఉపమాలంకారంలో నాలుగు ప్రధాన అంశాలుంటాయి. అవి
- ఉపమేయం – ఏ వస్తువును పోలుస్తున్నామో అది ఉపమేయం
- ఉపమానం – ఏ వస్తువుతో పోలుస్తున్నామో అది ఉపమానం
- ఉపమావాచకం – ఉపమేయంలోను, ఉపమానంలోను సమానంగా ఉన్న ధర్మం లేక లక్షణం
- సమాన ధర్మం – పోలిక చెప్పటానికి రెండు వస్తువుల్లో ఉన్న సమాన గుణం.
లక్ష – ఓ కృష్ణా ! నీ కీర్తి హంసవలె ఆకాశగంగ యందు మునుగుచున్నది.
ఇందు – కీర్తి – ఉపమేయము
హంస – ఉపమానము
వలె – ఉపమావాచకము
మునుగుచున్నది – సమాన ధర్మం
ఈ నాలుగు ధర్మాలున్నాయి కనుక ఇది ఉపమాలంకారము.
పై ఉదాహరణలలో ఉపమాన ఉపమేయాలను పోల్చడం వల్ల ఉపమాలంకారం అవుతుంది.
పాఠ్యభాగంలోని 2,6,8,22 పద్యాలలోని అలంకారాలను గుర్తించి, లక్షణ సమన్వయం చేయండి.
ప్రశ్న 1.
2వ పద్యంలో : శాక్యరాణ్ణందను మానసాంబుజమునన్
జవాబు:
మకరందము భంగి పొంగెనానందము
ఈ వాక్యంలో రూపకాలంకారముంది.
ఉపమానమైన అంబుజము (పద్మము) ఉపమేయమైన మనస్సుకు అభేదము చెప్పబడింది కావున ఇది రూపకాలంకారమైంది.
లక్షణము : ఉపమేయమునకు ఉపమానము తోడి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించిన యెడల రూపకాలంకారము అవుతుంది.
ప్రశ్న 2.
6వ పద్యంలో : రెక్కలు దువ్వి, వీపు సవరించి ……………. హంసమున్
జవాబు:
ఈ పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది.
గౌతముడు చేసిన సేవలు క్రియా స్వభావాన్ని సహజ సుందరంగా వర్ణింపబడింది కావున స్వభావోక్తి అలంకారమైంది. లక్షణం : జాతి, గుణం, క్రియలు మొదలైన వాటిని ఉన్నవి ఉన్నట్లు మనోహరంగా వర్ణించి చెప్తే స్వభావోక్తి అలంకారము.
ప్రశ్న 3.
8వ పద్యంలో : ఎక్కడనో జనించి ………… శరాగ్ను లోర్చునే
జవాబు:
ఈ వాక్యంలో రూపకాలంకారముంది.
ఉపమానమైన అగ్నులు, ఉపమేయమైన శరములకు అభేదము చెప్పబడింది కావున ఇది రూపకాలంకారము.
ప్రశ్న 4.
22వ పద్యంలో : చెల్లి రావే …………… అంచ తల్లి రావె
జవాబు:
ఈ పద్యంలో రెండు శబ్దాలంకారాలున్నాయి. అవి
- వృత్యనుప్రాసాలంకారము ద్విత్వ’ల’ కారము అనేక మార్లు పునరుక్తం కావడం వల్ల వృత్యనుప్రాసాలంకారము
- అంత్యానుప్రాలంకారము
‘రావె’ అనుపదము వాక్యాలందు అవసానంలో ప్రాసగా పాటించడం జరిగింది. కావున ఇది అంత్యానుప్రాస.
లక్షణములు :
- వృత్యనుప్రాసాలంకారము : ఒకటి గాని అంతకంటే ఎక్కువ వర్ణాలు కాని అనేకమార్లు పునరుక్తం కావడాన్ని వృత్యనుప్రాస
అని అంటారు. - అంత్యానుప్రాసాలంకారము : పద్య పాదాలందు గాని, వాక్యాలందు గాని అవసానంలో ప్రాసను పాటించిన దాన్ని అంత్యానుప్రాస అని అందురు.
ఛందస్సు
కింది పద్యపాదాలకు గణవిభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించండి. పద్య లక్షణాలు రాయండి.
1. ఈయది శాస్త్ర ధర్మ మొకయింత సహించిన లోక ధర్మమిం
ఇది ఉత్పలమాల పద్యపాదము
యతి – 1 – 10 (ఈ – యిం)
ప్రాస – రెండవ అక్షరము ‘య’ కారము.
లక్షణము :
- ఉత్పలమాల పద్యము నందు నాల్గు పాదాలుంటాయి.
- ప్రతి పాదము నందును ‘భ,ర,న,భ,భ,ర,వ’ అనే గణాలు వరుసగా ఉంటాయి.
- పాదాది అక్షరానికి ఆ పాదంలో 10వ అక్షరానికి యతి చెల్లుతుంది.
- ప్రాస నియమము కలదు. ప్రాస యతి చెల్లదు.
- ఉత్పలమాల పద్యపాదము నందు మొదటి గురువును రెండు లఘువులు చేసినచో అది చంపకమాల పద్యపాద మగును.
2. గిలగిల మందువే యెరులు గిచ్చిన కాలికి ముల్లు గ్రుచ్చినన్
యతి 1 – 11 (గి – గి)
ప్రాస రెండవ అక్షరము ‘ల’ కారము.
లక్షణము :
- చంపకమాల పద్యము నందు నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదము నందును ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు వరుసగా ఉంటాయి.
- పాదాది అక్షరానికి ఆ పాదంలోని 11వ అక్షరానికి యతి చెల్లుతుంది.
- ప్రాస నియమము కలదు – ప్రాస యతి చెల్లదు.
- చంపకమాల పద్యపాదము నందు మొదటి రెండు లఘువులను ఒక గురువు చేసినచో అది ఉత్పలమాల పద్యపాదమవుతుంది.
ప్రాజెక్టు పని
క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ఘంటసాల గానం చేసిన పుష్ప విలాపం పద్యాలను మీరు కూడా అలాగే ఆలపించేలా సాధన చేయండి. పాఠశాల సారస్వత సంఘ సమావేశంలో, బాల సభలో ప్రదర్శించండి.
జ.
విద్యార్థి కృత్యం
పద్య మధురిమ
కొతుకులు లేక, విస్తరము గూడక, శంకకు సందునీక, య
ద్రుత మవిళంబితంబు నయి, తొస్సులు పోవ కురోగళైక సు
స్థితమయి మధ్యమస్వరముచే నలరారెడ్డి వీని వాక్కు సం
స్మృతమును సక్రమంబు శుభమెంతయు హృద్యమునై రహించెడిన్. — శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం వావిలికొలను సుబ్బారావు.
(శ్రీరాముడు లక్ష్మణుడితో హనుమంతుని మాట తీరు గురించి పలికిన సందర్భం)
భావం :
కొతుకులు ఏమీలేకుండా, చెప్పవలసిన విషయాన్ని అనవసరంగా సాగదీయకుండా ఉన్నాయి ఇతని మాటలు. సందేహాలు లేకుండా ఉన్నాయి. గబగబ పరుగు లెత్తకుండా ఉన్నాయి. మాటకు మాటకు చాల విరామం ఉంది. నీళ్ళు నమలినట్లు లేవు. ఉచ్చారణలో లోపాలు లేకుండా ఉన్నాయి.
హృదయంలోంచి కంఠం ద్వారా ఊనికతో వచ్చిన పలుకులవి. స్పష్టంగా ఉన్నాయి. వ్యాకరణబద్ధంగా సంస్కరింపబడి ఉన్నాయి. ఏ మాటను ముందు చెప్పాలో, ఏది తరువాత చెప్పాలో – ఇలా క్రమబద్ధంగా ఉన్నాయి. వినే కొద్దీ ఇంకా వినాలనేటట్లు హృదయాన్ని ఆకర్షిస్తూ మంగళకరంగా ఉన్నాయి.
పద్యాలు – ప్రతిపదార్ధ భావాలు
1వ – పద్యం
ఉ॥ 1. అంబరవీధియందు గననయ్యెను బారులు బారులై విహా
రం బొనరించు మంజుల మరాళ గణమ్ము; మహా కవీంద్రు భా
వాంబరవీథి విశ్రుత విహార మొనర్చు రసార్ద్ర భావనా
లంబిత శారదా చరణలాస్య విలాసము లుల్లసిల్లగన్.
ప్రతిపదార్ధం :
అంబరవీథి + అందు
అంబరవీథి యందు = అకాశమార్గమందు
మంజుల = మృదువైన
మరాళగణమ్ము = హంసల గుంపు
బారులు – బారులు + ఐ
బారులు – బారులై = వరుసలు వరుసలుగా
విహారంబు + ఒనరించు
విహారంబోనరించు = విహరించడం
కనన్ + అయ్యెను
కననయ్యెను = కన్బించింది
మహా కవి + ఇంద్రు
మహా కవీంద్రు = గొప్ప కవులలో శేష్ఠుడైన కవి
భావాంబర వీథి = ఆలోచనలనెడి ఆకాశ వీథిలో
వి(శుత = ఎక్కువైన
రస + ఆర్ట్ర
రసార్ర = రసార్ట్రమైన, (కరుణ రసంతో)
భావనాలంబిత = భావ(ప్వవాహంతో
విహారము + ఒనర్చు
విహారమొనర్చు) = సంచారం చేస్తున్న
శారదా = సరస్వతీ దేవి యొక్క
చరణలాస్య = పాదాల ధ్ఫనితో
విలాసములు = విలాసంగా
ఉల్లసిల్లగన్ = ప్రకాశిస్తూ ఉన్నాయి
భావం : ఆకాశవీథిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా విహారం చేయడం కనిపించింది. అవి మహాకవి ఆలోచనలు అనే ఆకాశవీథిలో గొప్ప రసార్ర భావంతో సంచారం చేస్తున్న సరస్వతీ దేవి పాదాల సవ్నడిలా విలాసంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
2వ – పద్యం
ఉ॥l 2. క్రొందలిరాకు సౌరు గయికొన్న విశాల నభోంగణమ్ములో
నందము లొల్కవోయు కలహంసములన్ గనినంత శాక్యరా
ణ్దను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగె నా
నందము; నిర్నిమేషనయనమ్ములు తన్మయతా నిమగ్నముల్.
ప్రతిపదార్ధం :
కొత్త + తలిరు + ఆకు
క్రొందలిరాకు = కొత్త చగగురాకులు
సౌరు = అందము
కయికొన్న = పొందగా
విశాల = విశాలమై
నభః + అంగణమ్ములోన్ = ఆకాశమార్గంలో
అందములు + ఒల్క + పోయు
అందములొల్కవోయు = అందాలను ఒలకపోయు
కలహంసములన్ = రాజహంసలను
కనిన + అంత
కనినంత = చూడగా
శాక్యరాట్ + నందను
శాక్యరాణ్ణందను = శాక్య వంశరాజ కుమారుడు
మానస + అంబుజమునన్
మానసాంబుజమునన్ = మనస్సు అనెడి పద్మము నందు
మకరందము ఫంగి = తేనెవలె
పొంగెను + ఆనందము
పొంగెనానందము = ఆనందము పొంగెను
నిర్నిమేష నయనమ్ములు= ఱెప్పపాటు లేని కన్నులు
తన్మయతా నిమగ్నముల్= తన్మయత్వం పొందాడు
భావం : విశాలమైన ఆకాశం కొత్త చిగురాకు అందాలను సంతరించుకున్నది. ఆ ఆకాశవీథిలో అందాలు ఒలకటోసే హంసలను చూసిన మనస్సు అనే పద్మములో తేనె పొంగినట్లు ఒక నిముషం పాటు సిద్ధార్థుని కన్నులలో ఆనందం పొంగి తన్మయత్వం పొందాడు.
3వ – పద్యం
తే.గీ॥ 3. గగనమున నేగు కలహంస గణము గాంచి
జాగరితమయ్యెనేమొ హింసాప్రవృత్తి;
నారి సారించి వాడి బాణమ్ము నొకటి
దేవదత్తుండు వింట సంధించినాఁడు
ప్రతిపదార్ధం :
గగనమునన్ = ఆకాశంలో
ఏగు = పయనించుచున్న
కలహంస గణము = రాజహంసల సమూహమును
కాంచి = చూసి
హాంసా ప్రవృత్తి = రాక్షస కృత్యము
జాగరితము + అయ్యొను + ఏమొ
జాగరికతమయ్యొనేమొ = పాట మరించిందేమో ?
నారి సారించి = వింటి అల్లెత్రాడును లాగి
వాడి బాణమ్మును + ఒకటి
వాడి బాణమ్మునొకటి = పదునైన బాణాన్ని ఒకదానిని
దేవదత్తుండు = దేవదత్తుడనువాడు
వింటి సంధించినాడు = ధనసు్సు నందు సంధించి వదిలాడు
4వ – పద్యం
ఉ॥ 4. క్రూర కఠోర బాణమునకున్ బలియై కలహంసరాజు క్రేం
కారము సేయుచున్ బడె నఖండదయానిధి పాదసన్నిధిన్;
ఘోర మునీంద్ర శాపమునకున్ గురియై గగనాంతరాళ సం
చారము దక్కి వారినిధి జారు శశాంకుని జ్ఞప్తి కెత్తుచున్.
ప్రతిపదార్ధం :
క్రూర = కనికరములేనిది
కోర = దయలేనిది
బాణమునున్ = బాణానికి
బలియై = దెబ్బతగిలినదై
కలంసరాజు = రాజహంస
క్రేంకారము + చేయుచున్
క్రేంకారము సేయుచున్= బాధతో అరుస్తూ
అఖండ – దయానిధి = అనంతమైన దయకలవాడైన
పాదసన్నిధిన్ = పాదముల దగ్గర
పడెను = పడింది
ఘూర = భయంకరమైన
ముని + ఇంద్ర – శాపమునకున్
మునీంద్ర – శాపమునకున్ = అత్రి మహాముని శాపానికి
గురియై = గురియైన
గగన + అంతరాళ
గగనాంతరాళ = ఆకాశమార్గాన
సంచారమున్ + తక్కి
సంచారముడక్కి = తిరుగుట మాని ; (ఆకాశాన్ని వదిలి)
వారి నిధి – జారు = సముద్రంలో పడిన
జ్ఞప్తికి + ఎత్తుచున్
జ్ఞప్తికెత్తుచున్ = జ్ఞాపకము వస్తున్నాడు
భావం: కఠోరమైన బాణం తగిలి ఒక హంస (కేంకారము చేస్తూ అనంతమైన దయ కలవాడైన సిద్ధార్థుని పాడాల చెంత పడిపోయయంది. దీన్న్ చూస్తూ ఉంటే అత్రిముస్ కోపానికి గురై సము(్రంలో పడిపోయిన చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు.
5వ – పద్యం
కం॥ 5. గిరగిర దిరుగుచు నరచుచు
ధరణీస్థలిఁగూలి, సోలి తడబడు హంసన్
కరుణామూర్తి కనుంగొని
బిరబిరఁజని యెత్తి చేర్చె (పేమాంకమునన్.
ప్రతిపదార్ధం :
గిరగిర దిరుగుచున్ = హంస చుట్టూ తిరుగుతూ
అరచుచు = బాధతో లరుస్తూ
ధరణీస్థల్ + కూలు
ధరణీ స్థలిఁగూలీ = సేలపైపడి
సోలి = సొమ్మసిల్లి
తడబడుహంసన్ = తత్తరపాటు పడు హంసను
కరుణామూర్తి = దయార్ద హ్రాయుడైన సిడ్థార్థుడు
కనుంగాని = చూచిన
బిరబిరన్ + చని
బిరబిరఁజని =వెంటనే వెళ్ళి
ఎత్తి = హంసను పట్టుకుని
(పేమ + అంకమునన్
(పేమాంకమునన్ = (పేమతో ఒళ్ళోకి
చేర్చె = కూర్చుండ బెట్టుకున్నాడు
భావం: హంస గిరగిర తిరుగుతూ, అరుసూ, వాలిపోయి, నేల పై పడి గిజగిజలాడుతోంది. కరుణామూర్తి యౌన సిద్ధార్థుడు ఇది చూచి బిరబిరా వెళ్ళి డానిని ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చుండ బెట్టుకున్నాడు.
6వ – పద్యం
టు 6. రెక్కలు దువ్వి, వీపు సవరించి, పదమ్ముల కుంటు దీర్చి, లే
జెక్కిలి చక్కదిద్ది, సరిచేసి తనూలత, ప్రేమపూర్ణముల్
వాక్కులు పల్కుచున్, దిగులు వాపుచు, ముద్దుల బుజ్జగించుచున్
మక్కువ మీర గౌతమకుమారుఁడు లాలనసేసె హంసమున్.
ప్రతిపదార్ధం :
గౌతమ కుమారుడు = గౌతముడను రాజకుమారుడు
హంసమున = హంసను
రెక్కలు దువ్వి = హంస రెక్కలను చేతితో నిమురుతూ
వీపు సవరించి = దాని వీపును కూడా సవరిస్తూ
పదమ్ముల కుంటుదీర్చి = పాదాలను చేతితో తుడుస్తూ లేత + చెక్కిల
లేcజెక్కిల = చెక్కిళ్ళను నిమురుతూ
తనూలత = లత వంటి శరీరాన్ని
సరిచేసి = సరిచేశాడు (తడుముచూ)
డేమ పూర్జముల్ = ప్రేమ పూర్వకమైన
వాక్కులు పల్కుచున్ = మాటలను మాట్లాడుతూ
దిగులు వాపుచు = దిగులు పోగొట్టి
ముద్దుల బుజ్జగించుచున్ = ముద్గులొల్కునట్లు బుజ్జగిస్తూ
లాలన + చేసె
లాలన సేసె = లాలించాడు
భావం : గౌతముడు హంస రెక్కలు దువ్వి వీప సవరించి, పాదాలు, చెక్కిక్ళు చక్కదిద్ది, శరీరాన్ని తడిమి, (పేమ పూర్వక మైన మాటలు మాట్లాడి, దిగులు పోగొట్టి, బుజ్జగించి’ (పేమతో లాలన చేశాడు.
7వ – పద్యం
ఉ॥ 7. రాజకుమార! ఈ విహగరజము నాయది, అస్మదీయ బా
హా జయలక్ష్మికిన్ సముపహారము; నాకు లభించుగాక నీ
రోజు మనోజ్జ మానస సరోవర హ్రమ మృణాలవల్లరీ
భోజన రాజభోగ పరిపుష్ట మరాళ శరీరమాంసముల్.
ప్రతిపదార్ధం :
రాజకుమారా! ! = ఓ గౌతమ కుమారా !
ఈ విహగరాజము = ఈ రాజహంస
నా + అది
నాయది = నాది
అస్మదీయ = నా యొక్క
బాహ జయలక్ష్మికిన్ = భుజబల శక్తికి
సమ్ + ఉపహారము
సముపహారము = ఉపాహారంగా ఫలితమై ఉంది
మనోజ్ఞ = మనోహరమైన
మానస సరోవర = మానస సరోవరమందలి
హైమ = బంగారు వర్ణము గల
మృణాల వల్లరీ = తామర తూడులను
భోజన = భుజించి
రాజభోగ పరిపుష్ట = రాజభోగములతో బలిసినది
మరాళ = హంస యొక్క
శరీరమాంసముల్ = శరీర మాంసము
ఈ రోజు = ఈ రోజు
నాకు లభించుగాకన్ = నాకే చెందవలసియుంది
భావం : దేవదత్తుడు ఇది చూచి, “ఓ రాజకుమారా ! ఈ హంస నా భుజశక్తికి ఫలితం, అందమైన మానస సరోవరంలో బంగారు వర్ఱం గల తామర కాడలను భుజించి బాగా బలిసి ఉన్నది. ఈ హంస మాంసం నాకే చెందుతుంది” అన్నాడు.
8వ – పద్యం
ఉ॥ 8. ఎక్కడనో జనించి, పరమేశ్వరు డిచ్చిన గాలిపీల్చి, వే
రొక్కరి జోలి కేగక, యెదో భుజియించి, సరోవరాలలో
గ్రుక్కెడు నీళ్లు గ్రోలి, విను త్తోవల నేగెడు రాజహంసపై
రక్కసి బుద్ధి సెల్లునె? మరాళ మరాళ శరాగ్ను లోర్బునే?
ప్రతిపదార్ధం :
ఎక్కడను + ఓ
ఎక్కడనో = ఏ ప్రదేశంలో
జనించి = పుట్టి
పరమ + ఈశ్వరుడు
పరమేశ్వరుడు = భగవంతుడు
ఇచ్చిన = ఇచ్చనటువంటి
గాలి పీల్చి = ప్రాణవాయువును పీలుస్తూ
వేరు + ఒక్కరి
వేరొక్కరి = మరొకరి
జోలికి + ఏగక
జోలికేగక = జోలికి వెళ్ళకుండా
యెదో భుజియించి = దొరికిన దానిని భుజిస్తూ
సర: + వరాలలో
సరోవరాలలో = సరస్సులోని
గ్రుక్కుడు నీళ్ళుగ్రోలి = నీక్ళు తాగి
వినుతోవలన = ఆకాశమార్గాలలో
ఏగెడు = వెళ్ళుచున్ని
రాజహంసపై = రాజహంసపై
రక్కసి బుద్ధి = రాక్షస ప్రవృత్తి
చెల్లును + ఏ
చెల్లునే = చెల్లుతుండా ?
మరాళము = హంస
అరాళ = వంపులు తిరిగిన
శర + అగ్నులు
శరాగ్నులు = అగ్ని వంటి బాణం దెబ్బకు
ఓర్చును + ఏ
ఓర్చునే= సహించగలదా?
భావం:ఎక్కడో జన్మించి, పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి యితరుల జోలికి వెళ్ళక, ఏదో భుజించి, సరస్సులలో నీరు త్రాగి, ఆకాశమార్గంలో వెళ్ళే రాజహంసపై నీ రాక్షస బు ద్ధి చెల్లుతుందా ? వంపులు తిరిగిన అగ్ని వంటి బాణాలను హంస్ ఓడ్బుకోగలడా?
9వ – పద్యం
చం॥ 9. గిలగిలమందువే యొరులు గిచ్చిన; కాలికి ముల్లు గ్రుచ్చినన్ విలవిల కొట్టుకొందువటె; నీవలె జీవులు కావె! హాంసకున్ ఫలితము బాధమేగద! ప్రపంచములోని సమస్త జీవులం దలరెడు ప్రాణ మొక్కటెగడా! తగునయ్య వృథా వ్యథా క్రుధల్!!
ప్రతిపదార్ధం :
ఒరులు = ఇతరులు
గిచ్చిన = గిల్లితే
గిలగిల మందువు + ఏ
గిలగిలమందువే = విలవిలలాడుతావు
కాలికి = నీ కాలికి
ముల్లు గుచ్చినన్ = ముల్లు గుచ్చుకుంటే
విలవిల కొట్టుకొందువు = బాధ పడతావు
అటె = అదే విధంగా
నీవలె జీవులు కావే = జీవులు కూడా నీవలెనే కదా!
హింసకున్ = చంపుటకు
ఫలితము = ఫలితం
బాధయేగద = బాధయే కదా!
ప్రపంచములోని = లోకంలోని
సమస్ జీవులును = అన్ని జీవులలో
అలరెడు = ప్రకాశించెడు
10వ – పద్యం
ఉ॥ 10. రాచకొలమ్మువారలకు రక్షణ సేయుట చెల్లుఁగాని, నా
రాచము లూని ప్రాణినికరమ్ముల స్వేచ్ఛ హరింపజెల్లునే!
ఈ చతురబ్ధివేల్లిత మహీవలయమ్ము లయమ్ము గాదె హాం
సాచరణమ్మునన్, తగునె క్షాత్ర పదమ్మును వమ్ము సేయుటల్.
ప్రతిపదార్ధం :
రాచకొలమ్మువారలకు = రాచ కులం వారికి (రాజ వంశం వారికి)
రక్షణ + చేయుట
రక్షణసేయుట = రక్షించటమే
చెల్లున్ + కాని
చెల్లుఁగాని = చెల్లుతుంది కాని
నారాచములూని = బాణాలను చేతబట్టి
ప్రానికరమ్ము = జీవుల యొక్క
స్వేచ్భ = స్వతంతతను
హరింపన్ + చెల్లును + ఏ
హరింపజెల్లునే = హరించడం మంచిది కాదు
హింస + ఆచరణమ్మునన్
హాంసాచరణమ్మునన్ = హింసను ఆచరించడం వల్ల
ఈ చతురబ్ధివేల్లిత = సాలుగు సముటాలచే
చుట్టబడి ఉన్న
మహీవలయమ్ము = భూమండలము
లయమ్ముగాదె = నాశనమవుతుంది కదా !
క్షాత్మమ్మును = క్షత్రియ ధర్మాన్ని
వమ్ము + చేయుటల్
వమ్ముసేయుటల్ = మోసగించుట
తగునె = తగునా?
భావం : రాచకులం వారికి రక్షించడమే విధి కాని బాణాలు చేతపట్టి జంతు జాలాల స్వేచ్ఛను హరించడం మంచిది కాదు. హింసను ఆచరించడం వల్ల నాలుగు సముడ్రాలచే చుట్టబడి ఉన్న భూమండలం నాశనం అవుతుంది: క్షత్తియ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు.
11వ – పద్యం
తే.గీ॥ 11. మానవత్వమ్మునే కాళ్ల మట్టగించి
దానవత్వమ్మునే తలఁ డాల్చినావు!
స్వస్తి చెప్పితివేమి సౌజన్యమునకు!
స్వాగత మొసంగితేమి దౌర్ఝ్యన్యమునకు!!
ప్రతిపదార్ధం :
మానవత్వమ్మును + ఏ
మానవత్వమ్మునే = మానవత్వాన్
(సాటి మనిషిన మనిషిగా చూడడం, అన్నివిధాల సహాయ సహకారాలందించడం ఇది మానవత్వం)
కాళ్ళ మట్టగించి = కాలదన్ని (అనగా నశింప చేయడం)
దానవత్వమును + ఏ
దానవత్వమ్మునే =రాక్షసత్వాన్ని
తలన్ + తాల్చినావు
తలఁదాల్చినావు =తలకెత్తుకొంటివి
సౌజన్యమునకు = మంచితనానికి –
స్వస్తి – చెప్పితివి + ఏమి
స్వస్తి చెప్పితివేమి =వదిలి పెట్టితిపి
దౌర్జన్యమునకు = దుర్మార్గానికి
స్వాగతము + ఒసంగితి + ఏమి
స్వాగతమొసంగితేమి = స్వాగతము పల్కినావు
భావం : మానవత్వాన్ని కాలదన్ని, రాక్షసత్వాన్ని తలకెత్తు కున్నావు. మంచితనాన్ని వదిలిపెట్టి, దౌర్టన్యానికి స్వాగతం పలుకుతున్నావు.
12వ – పద్యం
తే.గీ॥ 12. ఆకసమునందు గుంపులో నరుగుచుండ
వాడి శర మేసి కూల్బినవాఁడ నేను;
కొట్టిన విహంగమును డాచుకొందువేమి?
పక్షి నిమ్మయ్య; శాక్యభూపాలపుత్ర!
ప్రతిపదార్ధం :
ఆకసమునందు = ఆకాశంలో
గుంపులోన్ = సమూహంలో
అరుగుచుండ = వెళుతున్న (హంసను).
వాడి = పదునైన
శరము + ఏసి =బాణంతో
కూల్చినవాడ = కూల్చినాను
నేను – కొట్టిన =నేను బాణంతో కొట్టిన
విహంగమును = హంసను
దాచుకొందువు + ఏమి
దాచుకొందువేమి ? = దాస్తావెందుకు ?
శాక్య భూపాల పుత్య = శాక్య వంశప రాజకుమారా !
పక్షినిమ్ము + అయ్య
పక్షినిమ్మయ్య = పక్షినీయవలసింది
13వ – పద్యం
తే.గీ॥ 13. పాలుగారెడు రాయంచ ప్రక్కలోన
క్రూర నారాచ మేరీతి (గుచ్చినావు?
నిండు జాబిల్లి మెత్తని గుండెలోన
కుటిల విషదంష్ట రాహువు గ్రుచ్చినట్లు.
ప్రతిపదార్ధం :
నిండుజాబిల్లి = పున్నమ చంద్రుని యొక్క
మెత్తని గుండెలోన = సున్నతమెన హృదయంలో
కుటిల = కపటంతో కూడిన
విషదంష్ట = విషపు కోరలతో
రాహువు = రాహువనువాడు
గుచ్చినట్లు = గుచ్చిన విధంగా
పాలు గారెడు రాయంచ
పసి ప్రాయంతోనున్న హంసను
ప్రక్కలోన = రెక్క సందున
క్రూరనారాచము = ఘారమైన బాణాన్ని
ఏ రీతి =విధంగా గుచ్చి బాధించావు?
భావం : పున్నమి చంద్రుని మృదుతైన గుండెలో రాహుపు తన క్రూరమైన కోరలను గుచ్చి హింసించినట్లు, నువ్వు కూడా సున్నితమైన రాజహంస రెక్కసందున క్రూరమైన బాణాన్ని గుచ్చి బాధించావు. ఇది తగునా నీకు ?
14వ – పద్యం
ఆ.వె॥ 14. ‘నాది నాది నాది’ నా దేవదత్తుండు
‘కాదు నాది’ యనియె గౌతముండు;
వాదులాడి యాడి వారిద్దరును గూడి
యేదికూడ నిర్ణయింపలేక
ప్రతిపదార్ధం :
నాది నాది నాది = ఆ హంస నాది అనుచు
ఆ దేవదత్తుండు = దేవదత్తుండును
కాదు నాది + అనియె
కాదు నాదియనియె = కాదు నాది అనుచు
గౌతముండు = గౌతముండును
వాదులు + ఆడి + ఆః్
ఎాదులాడి యాడి = తగవులాడు కొనుచూం
వారు + ఇద్దరును + కూడి
వారిద్దరును గూడి = వారిద్దరూ
ఏది కూడ నిర్ణయింపలేక = ఏమీ నిర్ణయించుకోలేక
భామం : హంస నాది అని దేవదత్తుడు, కాదు నాది అని గౌతముడు వాదులాడి, వారిద్దరూ ఏమి నిర్ణయించుకోలేక పోయారు.
15వ – పద్యం
ఆ.వె॥ 15. చనిర దేవదత్త శౌద్ధోదనులు, మహ
రాజసభకు విహగరాజుతోడ;
పోయి యచట నున్న స్యాయాధికారితో
నంచ తగవు విన్నవించుకొనిర.
ప్రతిపదార్ధం :
దేవదత్త = దేవదత్తుడు
శౌద్ధోద్దనుడు = శుద్ధోదనుడను
మహారాజసభకు = రాజుగారి సఫకు
వహగరాజుతోడ = హంంసతో కూడా
చనిరి = వెళ్ళారు
పోయి + అచటను + ఉన్న
పొయియచటనున్న = వెళ్ళి, అక్కడున్న
న్యాయ + అధికారితో
న్యాయాధికారితో = న్యాయాధికారితో
అంచ తగవు = హంస వలన కలిగిన తగాడాను
విన్నవించుకొనిరి = చెప్పుకొన్నారు
భావం : గౌతమ దేవదత్త లిద్దరు హంసను తీసుకుని శుద్ధోదన మహారాజు సథకు వెళ్ళారు. అక్కడ న్యాయాధికారితో తమ తగవును విన్నవించుకున్నారు.
16వ – పద్యం
ఆ.వె॥ 16. కలహ మెంత పుట్టె కలహంసచే నంచు
నగవు వచ్చె శాక్యనాయకులకు;
‘తగవు మాలినట్టి తగ’ వంచు తలపోసి
తగపు చెప్పెనిట్లు ధర్మమూర్తి.
ప్రతిపదార్ధం :
కలహంసచేన్ = హంస వలన
కలహము + ఎంత – పుట్టె
కలహమెంత – పుట్టె = ఎంతటి తగాదా వచ్చింది
అంచు = అని పలికి
శాక్య నాయకులకు = శాక్య వంశ రాజ కుమారులకు
నగవు వచ్చె = నవ్వు వచ్చింది
తగవు మాలిన + అట్టి – తగవు
తగవు మాలినట్టి – తగవు = ఎందుకు పనికిరాని తగాదా
అంచు = అని పలుకుచు
తలహోసి = తలచి
ధర్మమూర్తి = న్యాయాధికారి
ఇట్లు = విధంగా
తగవు చెప్పె = న్యాయము చెప్పె
భావం : శాక్య వంశ రాజకుమారులకు హంస కారణంగా తగవు వచ్చిందని న్యాయాధికారి నవ్వుకున్నాడు. ఇది తగవులాడవలసిన విషయం కాదని చెప్పాడు.
17వ – పద్యం
తే. గి॥ 17. బాణహతచేత ప్రాణమ్ము బాసెనేని
దేవదత్త కుమారునిదే ఖగమ్ము;
ప్రాణదానమ్ము సలి కాపాడుకతన
రాజపుత్రుని దన్య్యె నీ రాజహంస.
ప్రతిపదార్ధం :
బాణహతి చేత = బాణపు దెబ్బవల్ల
ప్రాణమ్ము = ప్రాణము
బాసెనేని = పోయినట్లైతే
ఖగమ్ము = రాజహంస
దేవదత్త కుమారునిదే = దేవదత్తునిద
ప్రాణదానమ్ము సలిపి = ప్రాణదానం చేసి
కాపాడు కతన = రక్షించి కారణంగా
ఈ రాజహంస = రాజహంస
రాజపు(త్రునిది + అయ్యో
రాజపు(తునిదయ్యో = గౌతమునిదే
భావం: బాణం దెబ్బకు ఏ్రాణాలు పోయి ఉంటే ఈ హంస దేవదత్తునికి చెంది ఉండేది. కాని ప్రాణదానం చేసి, రక్షించినాడు కాబట్టి హంస గౌతమునికి చెందుతుంది.
18వ – పద్యం
ఉ। 18. ఈయది శాస్తధర్మ మొక యుంత సహాంచిన లోకధర్మ మం
తే యగు నంచు నొక్కి వచియించి పదంపడి ధర్మమూర్తి ల
జ్ఞాయుతు దేవదత్తు నొకసారి కనుంగొని మందహాసముం
జేయుచు రాజహంసమును జేర్చి సభాంతర రత్నటీఠికన్
ప్రతిపదార్ధం :
ఈ + అది
ఈయది = ఇది
శాస్త్రధర్మము = శాస్త్రధర్మము
ఒక + ఇంత – సహించిన
ఒకయింత – సహించిన= ఓర్పు వహించుట
లోకధర్మము + ఇంతే + అగును
లోకధర్మమింతే యగును = లోకధర్మం కూడా ఇదే
అంచు = అని పల్కుచు
పదంపడి = గట్టిగా చెప్పి
ధర్మమూరి = తరువాత
ఆజ్ఞాయుతు = న్యాయాధికారి
దేవదత్తును = దేవదత్తుణ్ని
ఒకసారి కనుంగొని = ఒకసారి చూచి
మందహాసమున్ + చేయుచు
మందహాసముంజేయుచు= చిరునవ్వు నవ్వుచూ
సభ + అంతర – రత్న పీఠికన్
సభాంతర-రత్న పఠికన్ = సభలో ఉన్న రత్నములతో పొదిగిన పీఠముపై
రాజహంసమును + చేర్చి
రాజహంసమునుజేర్చి = హంసను ఉంచిరి
భావం : ఇది శాస్త్రధర్మము. లోక ధర్మము కూడా ఇదే అని ధర్మమూర్తి పలికి దేవదత్తుని వైపు చూచి చిరునవ్వు నవ్వాడు. హంసను సభా మధ్యంలో ఉన్న ఒక రత్న పీఠికపై ఉంచాడు.
19వ – పద్యం
చం॥ 19. పలకసను దేవదత్త నరపాలకుమారులఁ జూశి “రం డిటన్
నిలువు డాకింత దూరమున, నిల్చి కరమ్ములు సాచి హంసమున్
బిలువుడు చేరుచేరుగను మీర; లదెవ్వరదైన వ్రాలు వా
రల కరసారసమ్ముల మరాళము; న్యాయము దేలు డానితోన్.”
ప్రతిపదార్ధం :
దేవదత్త – నకపాలకుముయులస్ + చూని
దేవదత్త – నరపాలకుమారులఁజుచి = దేవదత్త, గౌతములను చూచ్చి
రండు + ఇటన్
రండిటన్ = ఇటు రమ్మని
పలికెను = మాట్లాడెను
నిలువుడు + ఒకింత – దూరమున
నిలువుడొకింత – దూరమున = హంసకు కొద్ది దూరంలో నిల్చి
నిల్చి =నిలబడి
కరమ్ములు + చాచి
కరమ్ములు సాచి = చేతులు చాచి
వేరువేరుగను = వేరు వేరులుగా
మీరలు = అతిశయించే విధంగా
హంసమున్ = హంసను
పిలువుడు = పిలవండి
అది + ఎవ్వరిది + ఐన
అదెవ్వరిదైన = ఆ హంస ఎవ్వరిదైన
వారల కరసార సమ్ముల = వారి చేతులపైన
మరాళము =హంస
వ్రాలు = వాలుతుంది
డానితోన్ = దానివల్ల
న్యాయమున్ + తేలు
న్యాయముదేలు = న్యాయం తేలిపోతుంది
భావం: దేవదత్త, గౌతములను చూచి ఇటు రమ్మని పిలిచాడు. హంసకు కొద్దిదూరంలో నిలబడి ఒక్కొక్కరుగా వచ్చి చేతులు చాచి హంసను పిలవండి. అది ఎవరి చేతుల మీద వాలితే వారిదవుతుంది. దీనితో న్యాయం తేలిపోతుంది అన్నాడు.
20వ – పద్యం
ఉ॥ 20. అంతట ప్రాడ్వివాకవరు లాడిన మాటకు దేవదత్తుc డ
త్యంతము సంతసించి కలహంసము నుంచిన రత్నపీఠి క
ల్లంతన నిల్చి పిల్చె “ఖగమా! యిటురా! యిటురా!” యటంచువి
భాంతమనమ్ముతో కటుకరమ్ములతో చటులస్వరమ్ముతో
ప్రతిపదార్ధం :
ఆంతట = ఆ పైన
ప్రాడ్వివాకవరులు = న్యాయాధికారులు
ఆడినమాటకు = చెప్పిన మాటలకు
దేవదత్తుడు = దేవదత్తుడు
అతి + అంతము
అత్యంతము = మిక్కిలిగా
సంతసించి = సంతోషించి
కలహంసమును = రాజహంసను
ఉంచిన = ఉంచిన
రత్నపీఠికకు = రత్న పీఠమునకు
అల్లంతన నిల్చి పిల్చె = కొద్ది దూరంలో నిల్చి పిల్చాడు
ఖగమా = ఓ రాజహంసా!
ఇటురా = ఇటురావలసినది
అటంచు = అని పల్కుచు
విభ్రాంత మనమ్ముతోన్ = ఝ్రమించిన మనస్సుతో
కటు కరమ్ములతో = కరకు చేతులతో
చటుల స్వరమ్ముతో = గట్టి స్వరముతో
ఇటురా ! = ఇటు రమ్ము (అని పిలిచాడు)
భావం : న్యాయాధికారుల మాటలకు దేవదత్తుడు సంతసెంచాడు. హంసను ఉంచిన రత్న పీఠం వద్ధకు చేరుకొని కరుకు చేతులతో, గట్టి స్వరంతో, క్రమించిన మనస్సుతో, ఖగమా ఇటురా ! ఇటురా ! అని గంభీరంగా పిలిచాడు.
21వ – పద్యం
ఉ॥ 21. అతని రూపు గాంచి భయమందెనొ! టక్కరిచూపు గాంచియే
భీతిలెనో! కరాన గనిపించు ధనుస్సునకున్ మనస్సులో
గాతరభావముం గనెనొ గాని! నృశంసు స్లృశింపఁటోని సం
గీతము భంగి, వెన్కకొదిగెన్ కలహంసము కుంచితాంసమై.
ప్రతిపదార్ధం :
అతని రూపుగాంచి = ఆ దేవదత్తుని రూపాన్ని చూచి
ఫయమందెను + ఓ
భయమందెనో = భయపడేనేమో
టక్కరి చూపుగాంచియే = మోసపు చూపులు చూచో
భీతిలెను + ఓ
భీతిలెనో = భయపడెనేమో
కరానన్ = చేతిలో
కనిపించు = కన్పిస్తున్న
ధనుస్సునకున్ = విల్లునకు
మనస్సులోన్= హృదయంలో
కాతర భావమున్ + కనెనొ
కాతర భావముంగనెనొ= భయపడెనో
కాని = కాని
నృశంసు = మానవులను హాంస పెట్టుపాడు దుర్మార్గుడు
స్పృశింపబోని = (హృదయాన్ని) తాకలేని
సంగీతము భంగి = సంగీతము వలె
కలహంసము = రాజహంస
వెన్కకు + ఒదిగెన్
వెన్కకొదిగ్న= వెనక్కు తగ్గి
కుంచితాంసము + ఐ
కుంచితాంసమై = కుంగిపోయింది
భావం : దేవదత్తుని రూపాన్ని చూచో, మోసపు చూపులు చూచో, అతని చేతిలో ఉన్న ధనుస్సును చూచో, మనస్సులో భయం కలిగిందేమో గాని, దుష్టుని హృదయాన్ని తాకలేని సంగీతం లాగా హంస వెనక్కు తగ్గి కుంగిపోయింది.
22వ – పద్యం
ఆ.వె॥ 22. చెల్లి రావె! మంచిమల్లి రావే! కల్ప
వల్లి రావె! పాలవెల్లి రావె!
చిక్కదనము లీను చక్కదనాల జా
బిల్ల రావె; అంచతల్లు రావా!”
ప్రతిపదార్ధం :
చెల్లి రావె! = నా చెల్లెలు వంటి దానా రా!
మంచి మల్లి రావే! = చక్కని మల్లె పువ్వు వంటి దానా రామ్మా!
కల్పవల్లి రావె = కోరన కోరికలు తీర్చే కల్ప
వృక్షము వంటి దానారామ్మా!
పాలవెల్లి రావె! = పాలవెల్లి రావె
చిక్కదనములు + ఈను
చిక్కదనములీను = నిండుగా ఉన్న (సంపూర్ణ కాంతితో ఉన్న)
చక్కదనాల = అందమైన
జాబిల్లి రావె = చందమామ వంటి దానా రామ్మా!
అంచతల్లి రావె = హంస తల్లివి కదా ! రామ్మా!
భావం: చెల్లి రావె, ముంజి మల్లి రావె, కల్పవల్లి రావె, పాలవెల్లి రావె, చిక్కని చక్కదనమున్న జాబిల్లి రావె, హంస తల్లి రావె అంటూ (పేమగా గౌతముడు పిలిచాడు.
23వ – పద్యం
త. శీ॥ 23. అంచు గేల్సాచి పిలువ రాయంచ రివ్వు
మంచు వ్రాలె సిద్ధార్థు హస్తాంచలముల;
జయజయ నినాదములు సభాసదులు పలుక!
శాక్యపతి కళ్ల హర్షబాష్మమ్ము లొలుక!!
ప్రతిపదార్ధం :
అంచున్ + కేల్ సాచి
అంచుగేల్ సాచి = అని పలుకుతు చేతులు చాచి
పిలువ = పిల్వగా
రాయంచ = రాజహంస
రివ్వుంచు = రివువున వచ్చి
సిద్ధార్థు = గౌతముని
హస్త + అంచలముల హస్తాంచలముల = చేతులపైన
వ్రాలె = వాలింది
సభాసదులు = సభలోని వారంతా
జయ జయ నినాదములు = జయ జయ ధ్వానాలు
పలుక = పల్కిరి
శాక్యవతి = శాక్యవంశపు రాజకుమారుడైన సిద్ధార్థుని
కళ్ళ = కళ్ళ నుండి
హర కళ్ళ భాష్పషమ్ములు + ఒలుక
హర్ష భాష్పమ్ములొలుక = ఆనంద బాష్పాలు జాలువారాయి
భావం : గౌతముడు చేతులు చాచి పిలువగా హంస రివ్వున వచ్చి అతని చేతిపై వాలింది. సభలోసి వారందరూ జయ జయ ధ్వానాలు చేశారు. గౌతముని కళ్ళలో ఆనంద బాష్పాలు జాలువారాయి.
కవి పరిచయం
కవి పేరు : జంధ్యాల పాపయ్యశాస్త్రి
కాలం : 4.8.1912 నుండి 21.6.1992 వరకు జీవించాడు.
తల్లిదండులు : మహాలక్ష్మమ్మ, పరదేశయ్య
స్వస్థలం : గుంటూరు జిల్లా కొప్పర్రు
కలం పేరు : కరుణశ్రీ
ఉద్యోగం : గుంటూరు ఎ.సి. కాలేజీలో అధ్యాపకులు
రచనలు పష్ప విలాపం, బాలసాహిత్య కథలు, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగుబాల శతకం మొదలైనవి 76 గ్రంథాలు రచించారు.
ప్రత్యేకత : వీరి పుష్పవిలాపాన్ని ఘంటసాల గారు ఆర్రంగా పాడారు. వీరు కవి, పండితులు, విమర్శకులు, వ్యాఖ్యాత, సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పండిత పామరులకు వీరి కవిత ఆనందం కలిగిస్తుంది.
సమకాలికులు : ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది.
ఉద్దేశం
బుద్దుడు నడయాడిన ఈ భరతభూమి శాంతి, అహింస, సహనాలకు ఫుట్టినిల్లు. పరోపకారం మనకు అలపాటు. మనిషికి కొన్షి విలువలు, నియుమాలు ఏర్పాటు చేసారు. అదే మానవత్వం. మనిషి ధర్మార్థ, కామ, మోక్షాలనే 4 ఫురుష్లార్థాలు సాధించాలంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవించాలి.
సాధనతో మనసును అదుఫులో ఉంచుకోపాలి. సత్యం, ధర్శం, న్యాయం, అహింస, క్షమాగుణం షొదలైన సాత్విక గుణాలు విద్యార్థులు అలవరచుకోపాలి. ఉున్నతమైన జీవన విధానం తెలుసుకోపాలి. మానవత్వాన్షి చాటాలి. ఆ దిశగా షారిని ష్రేరేపించడమే ఈ పాఠం ఉద్దేశం.
నేపథ్యం
ఒక రోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలసి వన విహారానికి వెళ్లాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, సరోవరాలను, పంట చేలను, పశువులకాపర్లను, పశు పక్ష్యాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకొక రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనుర్బాణాలు ధరించి జంతువులను వేటాడడానికి సిద్ధంగా వున్నాడు.
ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశమార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను నేల కూల్చాడు. దీన్ని చూసిన సిద్ధార్థుడు మిక్కిలి వ్యథ చెంది ఆ హంసను రక్షించాడు. ఇది యిద్దరి మధ్య వాదానికి దారి తీసింది. న్యాయం కోసం రాజాస్థానానికి వెళ్లారు. చివరకు హంస ఇద్దరిలో ఎవరికి చెందుతుందో అనే విషయం పాఠ్యభాగం ద్వారా తెలుస్తుంది.
ప్రక్రియ – ‘ఖండ కావ్యం’
చిన్నకథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన ఖండకావ్యం. దీనిలో వ్యర్థపదాలకు, వర్ణనలకు అవకాశం వుండదు. మహాకావ్యాలలోని రసవత్తరమైన ఘట్టాలను, పాత్రలను, చారిత్రక, దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి.