AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

These AP 9th Class Telugu Important Questions 6th Lesson తీర్పు will help students prepare well for the exams.

తీర్పు AP Board 9th Class Telugu 6th Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది పరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. గగనమువ నేగు కలహంస గణము గాంచి
జాగరితమయ్యెనేమొ హింసాప్రవృత్తి;
వారి సారించి వాడి బాణమ్ము నొకటి
దేవదత్తుండు వింట సంధించినాఁడు,

ప్రశ్నలు – జవాబులు (SA-2: 2023-24)

అ) ఆకాశంలో ఏమి సంచరిస్తున్నాయి?
జవాబు:
ఆకాశంలో హంసలు సంచరిస్తున్నాయి.

ఆ) దేవదత్తుడిలో ఏ ప్రవృత్తి కనిపించింది?
జవాబు:
దేవదత్తుడిలో హింసా ప్రవృత్తి కనిపించింది.

ఇ) దేవదత్తుడు ఏం చేశాడు?
జవాబు:
దేవదత్తుడు పక్షిని కొట్టాడు.

ఈ) పై పద్యం ఆధారంగా అర్థవంతమైన ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
హంసను దేనితో కొట్టాడు?

2. గిరగిర దిరుగుచు వరచుచు
ధరణీస్థలిఁగూలి, సోలి తడబడు హంసన్
కరుణామూర్తి కనుంగొని
బిరబిరఁజని యెత్తి చేర్చి ప్రేమాంకమువన్.

ప్రశ్నలు – జవాబులు

అ) హంస ఎలా తిరుగుతూ పడింది?
జవాబు:
హంస గిరగిరా తిరుగుతూ పడింది.

ఆ) కరుణామూర్తి ఎవరు?
జవాబు:
సిద్ధార్థుడు కరుణామూర్తి.

ఇ) సిద్ధార్థుడు ఎలా వెళ్లాడు?
జవాబు:
సిద్ధార్థుడు గబగబా వెళ్లాడు.

ఈ) హంసను ఏం చేశాడు?
జవాబు:
హంసను తన ఒడిలోకి చేర్చుకొన్నాడు.

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

3. మానవత్వమ్మునే కాళ్ల మట్టగించి
దానవత్వమ్మునే తలఁ దాల్చినావు!
స్వస్తి చెప్పిత్తివేమి సౌజన్యమునకు!
స్వాగత మొసంగితేమి దౌర్జన్యమునకు!!.

ప్రశ్నలు – జవాబులు

అ) కాళ్లతో దేనిని తొక్కాడు?
జవాబు:
కాళ్లతో మానవత్వాన్ని తొక్కాడు.

ఆ) దేనిని తలదాల్చాడు?
జవాబు:
రాక్షసత్వాన్ని తలదాల్చాడు.

ఇ) దేనికి స్వాగతం పలికాడు?
జవాబు:
దౌర్జన్యానికి స్వాగతం పలికాడు.

ఈ) సౌజన్యాన్ని ఏం చేశాడు?
జవాబు:
సౌజన్యాన్ని విడిచిపెట్టాడు.

4. ఆకసమునందు గుంపులో నరుగుచుండ
వాడి శర మేసి కూల్చినవాఁడ నేను;
కొట్టిన విహంగమును దాచుకొందువేమి?
పక్షి నిమ్మయ్య, శాక్యభూపాలపుత్ర!

ప్రశ్నలు – జవాబులు

అ) సమూహం ఎక్కడ ఎగురుతోంది?
జవాబు:
ఆకాశంలో సమూహం ఎగురుతోంది.

ఆ) దేనితో కూల్చాడు?
జవాబు:
బాణంతో కూల్చాడు.

ఇ) శాక్యభూపాల పుత్రుడంటే ఎవరు?
జవాబు:
శాక్యభూపాల పుత్రుడంటే సిద్ధార్థుడు.

ఈ) దేనిని అడుగుతున్నాడు?
జవాబు:
పక్షిని అడుగుతున్నాడు.

5. పాలుగారెడు రాయంచ ప్రక్కలోన
క్రూర నారాచ మేరీతి గ్రుచ్చినావు ?
నిండు జాబిల్లి మెత్తని గుండెలోన
కుటిల విషదంష్ట్ర రాహువు గ్రుచ్చినట్లు.

ప్రశ్నలు – జవాబులు

అ) పాలుగారే వయస్సంటే ఏమిటి?
జవాబు:
పాలుగారే వయస్సంటే పసి వయస్సు.

ఆ) రాజహంస పక్కలో ఏం గుచ్చాడు?
జవాబు:
రాజహంస పక్కలో బాణం గుచ్చాడు.

ఇ) జాబిల్లి గుండెలో ఏది గుచ్చుకుంది?
జవాబు:
జాబిల్లి గుండెలో రాహువు విషపు కోర గుచ్చుకుంది.

ఈ) పై పద్యంలో రాజహంసను దేనితో పోల్చారు?
జవాబు:
రాజహంసను జాబిల్లితో పోల్చారు.

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

6. ‘నాది నాది నాది’ నా దేవదత్తుండు
‘కాదు నాది’ యనియె గౌతముండు;
వాదులాడి యాడి వారిద్దరుమ గూడి
యేది కూడ నిర్ణయింపలేక

ప్రశ్నలు – జవాబులు

అ) ఎవరెవరు వాదించుకొన్నారు?
జవాబు:
దేవదత్తుడు, సిద్ధార్థుడు వాదించుకొన్నారు.

ఆ) దేని గురించి వాదించుకొన్నారు?
జవాబు:
రాజహంస గురించి వాదించుకొన్నారు.

ఇ) ఏమి నిర్ణయించారు?
జవాబు:
ఏమీ నిర్ణయించలేదు.

ఈ) దేవదత్తుని దృష్టిలో హంస ఎవరిది?
జవాబు:
దేవదత్తుని దృష్టిలో హంస తనదే.

7. చనిరి దేవదత్త శౌద్దోదమలు, మహా
రాజసభకు విహగరాజుతోడ;
పోయి యచట నున్న న్యాయాధికారితో
వంచ తగపు విన్నవించుకొనిరి.

ప్రశ్నలు – జవాబులు

అ) శౌద్ధోదనుడంటే ఎవరు?
జవాబు:
శుద్ధోదనుని కుమారుడైన సిద్ధార్థుడు.

ఆ) ఎక్కడకు వెళ్లారు?
జవాబు:
రాజసభకు వెళ్లారు.

ఇ) ఎవరిని తీసుకొని వెళ్లారు?
జవాబు:
పక్షిని తీసుకొని వెళ్లారు.

ఈ) తగవు గురించి ఎవరికి చెప్పారు?
జవాబు:
తగవు గురించి న్యాయాధికారికి చెప్పారు.

8. కలహ మెంత పుట్టె కలహంసచే నంచు
వగపు వచ్చే శాక్యనాయకులకు;
తగవు మాలినట్టి తగ’ వంచు తలపోసి
తగవు చెప్పెనిట్లు ధర్మమూర్తి.

ప్రశ్నలు – జవాబులు

అ) దేని వలన తగవు వచ్చింది?
జవాబు:
హంస వలన తగవు వచ్చింది.

ఆ) ఎవరు నవ్వారు?
జవాబు:
శాక్య నాయకులు నవ్వారు.

ఇ) అది ఎటువంటి తగవన్నారు?
జవాబు:
అది పనిలేని తగ్గవన్నారు.

ఈ) ఎవరు తగవు తీర్చారు?
జవాబు:
ధర్మమూర్తి ఆ తగవు తీర్చారు.

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

9. బాణ హతిచేత ప్రాణమ్ము బాసెనేని
దేవదత్త కుమారునిదే ఖగమ్ము;
ప్రాణదానమ్ము సలిపి కాపాడుకతన
రాజపుత్రుని దయ్యె నీ రాజహంస.

ప్రశ్నలు – జవాబులు

అ) ప్రాణం పోతే పక్షి ఎవరిది?
జవాబు:
ప్రాణం పోతే పక్షి దేవదత్తునిది.

ఆ) ప్రాణదానం చేసినదెవరు?
జవాబు:
సిద్దార్థుడు ప్రాణదానం చేశాడు.

ఇ) హంస ఎవరిదన్నారు?
జవాబు:
హంస సిద్ధార్ధునిదన్నారు.

ఈ) హంస ప్రాణం తీసే ఆయుధమేది?
జవాబు:
హంస ప్రాణం తీసే ఆయుధం బాణం.

10. చెల్లి రావె ! మంచిమల్లి రావే ! కల్ప
వల్లి రావె ! పాలవెల్లి రావె !
చిక్కదనము లీమ చక్కదనాల జా
బిల్లి రావె; అంచతల్లి రావె !”

ప్రశ్నలు – జవాబులు

అ) ఏ బంధుత్వపు పేర్లతో హంసను పిలిచాడు?
జవాబు:
చెల్లి, తల్లి అనే బంధుత్వపు పేర్లతో హంసను పిలిచాడు.

ఆ) హంసను ఏ పువ్వు పేరుతో పిలిచాడు?
జవాబు:
హంసను మల్లెపువ్వు పేరుతో పిలిచాడు.

ఇ) హంసను ఏ ప్రవాహం పేరుతో పిలిచాడు?
జవాబు:
హంసను పాలవెల్లి పేరుతో పిలిచాడు.

ఈ) జాబిల్లి పేరుతో దీనిని పిలిచాడు?
జవాబు:
జాబిల్లి పేరుతో హంసను పిలిచాడు.

11. అంచు గేలిచి పిలువ రాయంచ రివ్వు
మంచు వ్రాలె సిద్దార్థు హస్తాంచలముల;
జయజయ నినాదములు సభాసదులు పలుక!
శాక్యపతి కళ్ల హర్షబాష్పమ్ము లొలుక !!

ప్రశ్నలు – జవాబులు

అ) హంసను ఎలా పిలిచాడు?
జవాబు:
చేయిచాచి హంసను పిలిచాడు.

ఆ) హంస ఎలా ఎగిరి వచ్చింది?
జవాబు:
హంస రివ్వున ఎగురుతూ వచ్చింది.

ఇ) హర భాష్పాలంటే ఏమిటి?
జవాబు:
హర్ష భాష్పాలంటే ఆనందంతో వచ్చే కన్నీరు.

ఈ) జయజయ నినాదాలెవరు చేశారు?
జవాబు:
సభలోని వారు జయజయ నినాదాలు చేశారు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

II. ఈ క్రింది ప్రశ్నకు 8 లేక 10 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
గౌతముడు దేవదత్తునితో పల్కిన హితవు ఎట్టిది?
జవాబు:
గౌతముడు దేవదత్తునితో ఈ విధంగా పల్కాడు. “ఎక్కడనో జన్మించి, పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి, యితరుల జోలికెళ్ళక, ఏదో భుజించి, సరస్సులలో నీళ్ళు తాగి, ఆకాశమార్గంలో వెళ్ళే రాజహంసపై నీ రాక్షసబుద్ధి చెల్లుతుందా? వంపులు తిరిగిన అగ్ని వంటి బాణాలను హంస ఓర్చుకోగలదా? ఎవరైనా నిన్ను గిచ్చితే విలవిలలాడుతావు. కాలికి ముల్లు గుచ్చుకుంటే బాధ పడతావు, హింసకు ఫలితం బాధే కదా! ప్రపంచంలో ఉండే సమస్త జీవుల ప్రాణం ఒకటే కదా! అవీ నీ వలే ప్రాణులే అనవసరంగా బాధలు కలిగించే పనులు తగవు.

రాచకులం వారికి రక్షించడమే విధి. కానీ బాణాలు చేతపట్టి జంతు జాలాల స్వేచ్ఛను హరించడం మంచిది కాదు. హింసను ఆచరించడం వల్ల నాలుగు సముద్రాలచే చుట్టబడి ఉన్న భూమండలం నాశనం అవుతుంది. క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు.. మానవత్వాన్ని కాలదన్ని, రాక్షసత్వాన్ని తలకెత్తుకున్నావు. మంచితనాన్ని వదలిపెట్టి, దౌర్జన్యానికి స్వాగతం పలుకుతున్నావు.” అని హితవు పల్కాడు.

సృజనాత్మక ప్రశ్న

ప్రశ్న 1.
గౌతముని దయార్ద్ర హృదయాన్ని వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

పటమట,
X X X X X.

ప్రియమైన మిత్రునకు,
నమస్కారములు!

నేను క్షేమము. నీవు క్షేమమని తలుస్తాను. ఈ రోజు మా తెలుగు మాష్టారు “తీర్పు” అనే పద్యపాఠం చెప్పారు. ‘చాలా బాగుంది. ఈ పద్యభాగాన్ని ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు రచించారు.
ఆకాశంలో విహరిస్తున్న హంసను వాడి బాణంతో దేవదత్తుడు కొట్టాడు. విలవిలలాడుతూ గౌతముని కాళ్ళ ముందర పడింది. వెంటనే దానిని రక్షించాడు. బాధపడుతున్న హంసను ఒళ్ళో కూర్చోపెట్టుకుని, రెక్కలు దువ్వి, వీపు సవరించి, పాదాలు, చెక్కిళ్ళు చక్కదిద్ది, శరీరాన్ని తడిమి, ప్రేమ పూర్వకమైన మాటలు మాట్లాడి, దిగులు పోగొట్టి, బుజ్జగించి, ప్రేమతో లాలన చేశాడు. దీనిని బట్టి గౌతముని జీవలోక కారుణ్యం అర్ధమవుతుంది. జీవహింస చేయరాదని ఈ కథ వల్ల తెలుస్తోంది. ఈ కథ సమాజానికి మంచి సందేశం ఇస్తోంది. నీకేమైనా కథ తెలిస్తే వివరిస్తూ ఉత్తరం వ్రాయి.
ఉంటా!

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. కల్యాణ్.

చిరునామా :
కె. వేంకటేశ్వరరావు,
9వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మంగళగిరి.

భాషాంశాలు

అలంకారాలు

ఈ క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి.

1. ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహా కవుల భావాకాశంలో సంచరించు సరస్వతీ పాద లాస్యంలా ఉంది.
జవాబు:
ఉపమాలంకారం

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

2. బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం శాపం తగిలి చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది.
జవాబు:
ఉపమాలంకారం.

3. బాణం దెబ్బకు హంస గాయపడడం రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది.
జవాబు:
ఉపమాలంకారం

గణవిభజన పద్యపాదం పేరు

కింది పద్య పాదానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్య పాదమో రాయండి.

1. ఈయది శాస్త్ర ధర్మ మొకయింత సహించిన లోక ధర్మమిం
జవాబు:
AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు 1

2. గిలగిల మందువే యెరులు గిచ్చిన కాలికి ముల్లు గ్రుచ్చినన్
జవాబు:
AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు 2

అర్థాలు

అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.

1. అంబరవీథిలో విమానాలు తిరుగుతున్నాయి.
జవాబు:
ఆకాశమార్గం

2. కొంగలు బారులు బారులుగా చెరువులో తిరుగుతున్నాయి.
జవాబు:
వరుసలు

3. ఆ తోటలో మంజుల లతలు ఎన్నో ఉన్నాయి.
జవాబు:
అందమైన

4. పిల్లల లాస్యం చాలా బాగుంటుంది.
జవాబు:
నవ్వ

5. ముత్యాల సౌరు బాగుంటుంది.
జవాబు:
అందము

6. పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తుమ్మెదలు గ్రోలుతాయి.
జవాబు:
తేనె

7. శరీరానికి నయనం ప్రధానం.
జవాబు:
కన్ను

8. గగనం మేఘాలలో కప్పబడి యుంది.
జవాబు:
ఆకాశము

9. సన్న్యాసులు సంచారం చేస్తుంటారు.
జవాబు:
గమనం

10. అతని పాదపద్మాలు మరువలేనివి.
జవాబు:
పద్మముల వంటి పాదాలు

11. దుర్వాస మహర్షికి క్రుధ ఎక్కువ.
జవాబు:
కోపం

ఆ) గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.

1. ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించాలి.
అ) స్వతంత్రత
ఆ) అస్వతంత్రత
ఇ) సంతోషము
ఈ) దుఃఖము
జవాబు:
అ) స్వతంత్రత

2. దేవదత్తుడు మరాళమును కొట్టెను.
అ) ఎలుక
ఆ) హంస
ఇ) పులి
ఈ) మేక
జవాబు:
ఆ) హంస

3. శ్రీరాముడు ఈ మహీవలయాన్ని పాలించాడు.
అ) ఆకాశము
ఆ) దిక్కులు
ఇ) భూమండలం
ఈ) సముద్రాలు
జవాబు:
ఇ) భూమండలం

4. శివుడు లయ కర్త.
అ) రక్షణ
ఆ) సంతోషం
ఇ) ఆనందం
ఈ) నాశనము
జవాబు:
నాశనము

5. గౌతముడు సౌజన్యవంతుడు.
అ) మంచితనము
ఆ) దొంగతనము
ఇ) సోమరితనము
ఈ) చెడ్డతనము.
జవాబు:
అ) మంచితనము

6. రాము కరములను జోడించి అంజలి ఘటించాడు.
అ) కాళ్ళు
ఆ) చేతులు
ఇ) శరీరము
ఈ) తల
జవాబు:
ఆ) చేతులు

7. హంసపై దేవదత్తుడు నారాచమును వదిలాడు.
అ) ప్రాణము
ఆ) ఆర్తత్రాణము
ఇ) బాణము
ఈ) ధనుస్సు
జవాబు:
ఇ) బాణము

8. దేవదత్తునికి, గౌతమునికి తగవు వచ్చింది.
అ) తనువు
ఆ) తల్లి
ఇ) న్యాయము
ఈ) తగాదా
జవాబు:
ఈ) తగాదా

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

9. దేవదత్తుడు టక్కరి చూపులతో చూశాడు.
అ) చిరునవ్వులు
ఆ) మోసపు చూపులు
ఇ) సంతోషము
ఈ) ఆనందము
జవాబు:
ఆ) మోసపు చూపులు

10. హంస రివ్వున ఎగిరింది.
అ) వేగంగా
ఆ) నడవలేక
ఇ) నిదానంగా
ఈ) పడిపోతూ
జవాబు:
అ) వేగంగా

పర్యాయపదాలు

అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.

1. అంబరంలో విహంగాలు హాయిగా తిరుగుతున్నాయి.
జవాబు:
ఆకాశం, గగనం

2. మా వీథిలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది.
జవాబు:
తెరువు, వాటిక

3. మానస సరోవరంలో హంసలుంటాయి.
జవాబు:
మరాళము, కలహంస

4. నేడు మానవ సమూహంలో కులభేదాలెక్కువ.
జవాబు:
గణము, అమ్మాయము

5. అమ్మా! శారదా! నన్ను రక్షించు తల్లీ!
జవాబు:
వాణి, సరస్వతి

6. కొత్త దంపతులు ఎంతో విలాసంగా కాలం గడుపుతున్నారు.
జవాబు:
ఒయ్యారము, నయగారము

7. అమ్మ చరణాలే నాకు దిక్కు
జవాబు:
పాదము, అంఘ్ర

8. ముత్యాల సౌరు చాలా బాగుంది.
జవాబు:
అందము, ఒప్పిదము

9. ఆ కొలనులో అంబుజము లెక్కువ.
జవాబు:
పద్మము, అరవిందము

10. హింసా ప్రవృత్తి మంచిది కాదు.
జవాబు:
అతిసర్జనము, ద్రోహము

11. పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తుమ్మెదలు త్రాగు తున్నాయి.
జవాబు:
మధువు, మరందము

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.

1. రాముని భంగిని అందరూ నేర్చుకోవాలి.
అ) విధము, చందము
ఆ) పందెము, బంధము
ఇ) శోభ, సోయగము
ఈ) అందము, చందము
జవాబు:
అ) విధము, చందము

2. ఒక్క నిమేష కాలంలో మార్పు రావడం సహజం.
అ) నిర్ణయము, నీతి
ఆ) నిముసము, తెప్పపాటు కాలము
ఇ) నిజము, నిక్కము
ఈ) నిస్సత్తువ, నియము
జవాబు:
ఆ) నిముసము, తెప్పపాటు కాలము

3. దేవదత్తుడు ఒక్క బాణంతో హంసను కొట్టాడు.
అ) వేషము, మోసము
ఆ) ద్రోహము, మోహము
ఇ) కంటకము, నారాచము
ఈ) సహనము, అసహనము
జవాబు:
ఇ) కంటకము, నారాచము

4. శశాంకము చూస్తే పిల్లలకు ఆనందం కల్గుతుంది.
అ) బ్రహ్మ, సూర్యుడు
ఆ) ఇంద్రుడు, చంద్రుడు
ఇ) సౌమ్య, రమ్య
ఈ) చంద్రుడు, అమృత కిరణుడు
జవాబు:
ఈ) చంద్రుడు, అమృత కిరణుడు

5. మల్లెపూల తోట మనోజ్ఞంగా ఉంది.
అ) మనోహరము, కొమరు
ఆ) కాసారము, తటాకము
ఇ) పద్మాకరము, సరోజిని
ఈ) జలము, కలము
జవాబు:
అ) మనోహరము, కొమరు

6. ప్రతి ప్రాణికి నీరు అవసరము.
అ) కారు, పోరు
ఆ) వేగిరము, వీరు
ఇ) జలము, ఉదకము
ఈ) నీరము, నార
జవాబు:
ఇ) జలము, ఉదకము

7. అతని శరీరం వజ్రాయుధం వలె ఉంటుంది.
అ) గాత్రము, మేను
ఆ) ఛాత్రుడు, పాత్ర
ఇ) విలాసము, వినోదము
ఈ) అర్థము, పరమార్థము
జవాబు:
అ) గాత్రము, మేను

8. పరమేశ్వరుని నివాసం కైలాసం.
అ) శివుడు, అభవుడు
ఆ బ్రహ్మ, విష్ణు
ఇ) ఇంద్రుడు, చంద్రుడు
ఈ) వాణి, రాణి
జవాబు:
అ) శివుడు, అభవుడు

9. చేలల్లో నడుస్తుంటే ముల్లు గుచ్చుకుంది.
అ) శివుడు, విల్లు
ఆ) కంటకము, ఋక్షరము
ఇ) అంగద, గద
ఈ) భేదము, ఖగము
జవాబు:
ఆ) కంటకము, ఋక్షరము

10. ఎవ్వరికి నీ క్రుధ పనికిరాదు.
అ) కోపము, అంగద
ఆ) క్షయము, క్షిణము
ఇ) నాశము, నాశనము
ఈ) శశి, శశధరుడు
జవాబు:
అ) కోపము, అంగద

11. ఆకాశంలో జాబిల్లి చాలా అందంగా ఉంటుంది.
అ) మల్లి, చెల్లి
ఆ) కల్పవల్లి, పాలవెల్లి
ఇ) చంద్రుడు, చందమామ
ఈ) నవమల్లి, కోమలి
జవాబు:
ఇ) చంద్రుడు, చందమామ

ప్రకృతి – వికృతులు

అ) గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.

1. ప్రతి నిత్యము జ్ఞానం సంపాదించాలి.
జవాబు:
నిచ్చలు.

2. మంచి హృదయానికి మంచి ఫలితాలే వస్తాయి.
జవాబు:
ఎద, ఎడద

3. శత్రువు పక్షంలో మంచినే చూడాలి.
జవాబు:
పక్కు

4. ఆకాశంలో పక్షులు తిరుగుతాయి.
జవాబు:
పక్కి

5. రూప్యము లేనిదే మనిషి జీవించలేదు.
జవాబు:
రూపాయి

6. రిక్త హస్తాలతో పిల్లల దగ్గరకు వెళ్ళకూడదు.
జవాబు:
రిచ్చ

7. ఈనాడు లాభం లేనిదే ఏ పని చేయరు.
జవాబు:
లాబము

8. ఆకాశంలో రాత్రి పూట చంద్రుడు ఎంతో అందంగా ఉంటాడు.
జవాబు:
రాతిరి

9. రాజహంస గౌతముని ఆశ్రయించింది.
జవాబు:
రాయంచ

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

ఆ) గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

1. అందరి పట్ల మరియాదగా ప్రవర్తించాలి.
అ) మరీ అద
ఆ) గౌరవం
ఇ) మన్నన
ఈ) మర్యాద
జవాబు:
ఈ) మర్యాద

2. ఱేడు ఆజ్ఞను ధిక్కరించకూడదు.
అ)రాట్టు
ఆ) రాజు
ఇ) రాడు
ఈ) రాజ్యం
జవాబు:
ఆ) రాజు

3. బత్తితో అన్నం పెట్టాలి.
అ) భతి
ఆ) బక్త
ఇ) భక్తి
ఈ) భక్తుడు
జవాబు:
ఇ) భక్తి

4. బూమిని కలుషితం చేయకూడదు.
అ) భూమి
ఆ) భువి
ఇ) పృథ్వీ
ఈ) ధర
జవాబు:
అ) భూమి

5. అమ్మను మించిన దైవం లేదు.
అ) తల్లి
ఆ) అంబ
ఇ) మాత
ఈ) జనయిత్రి
జవాబు:
ఆ) అంబ

6. చెరువులో కమలాలు చూస్తే అచ్చెరువు గొల్పుతుంది.
అ) ఆ చెరువు
ఆ) అచ్చేరువు
ఇ) ఆశ్చర్యము
ఈ) అచ్చరము
జవాబు:
ఇ) ఆశ్చర్యము

7. మంచివారి నెయ్యమును విడువరాదు.
అ) నేస్తము
ఆ) స్నేహము
ఇ) మైత్రి
ఈ) సఖ్యము
జవాబు:
ఆ) స్నేహము

8. తన సంతసమే తనకు రక్ష.
అ) ఆనందం
ఆ) మోసం
ఇ) సంతోషం
ఈ) సుఖం
జవాబు:
ఇ) సంతోషము

9. ఆలసము బద్ధకానికి గుర్తు.
అ) జాగు
ఆ) విలంబం
ఇ) సోమరితనం
ఈ) అలస్యం
జవాబు:
ఈ) ఆలస్యం

10. ఎదలో చెడు ఆలోచనలు రాకూడదు.
అ) రొద
ఆ) హృదయం
ఇ) గుండె
ఈ) మనసు
జవాబు:
ఆ) హృదయం

11. పగటి నిద్దుర అనారోగ్యం.
అ) నిద్ర
ఆ) మగత
ఇ) మైకం
ఈ) మత్తు
జవాబు:
అ) నిద్ర

నానార్థాలు

అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.

1. అంబరంలో మేఘం నల్లని అంబరం కట్టింది.
జవాబు:
ఆకాశం, వస్త్రం

2. చీమల బారు చాలా బారుగా ఉంది.
జవాబు:
వరుస, పొడవు

3. మంజులములో ఆకుల పరుపు మంజులముగా ఉంది.
జవాబు:
పొదరిల్లు, మెత్తనిది

4. ఇంద్రుడు మన ఇంద్రుడులోనే ఉంటాడు.
జవాబు:
సురపతి, అంతరాత్మ

5. శారద పూజలకు శారద ప్రసిద్ధం.
జవాబు:
సరస్వతి, శరదృతువు

6. పిల్లలు ఉల్లసిల్లు పనికి తల్లి ఉల్లసిల్లు.
జవాబు:
ప్రకాశించు, సంతోషించు

7. కల మంచి కలగా ఉంది.
జవాబు:
స్వప్నం, మధురం

8. మానసమును పరవశింప చేసే మానసము హిమాలయా లలో ఉంది.
జవాబు:
మనసు, మానస సరోవరం

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.

1. మా వీథిలో ఒక వీథి ప్రదర్శించారు.
అ) సినిమా, నాట్యం
ఆ) సందు, హరికథ
ఇ) సందు, ఒక రకమైన నాటకం
ఈ) సందు, బుర్రకథ
జవాబు:
ఇ) సందు, ఒక రకమైన నాటకం

2. బౌద్ధులు విహారము కంటె విహారమునకు ప్రాధాన్యం ఇస్తారు.
అ) షికారు, బౌద్ధాలయం
ఆ) యాత్ర, ప్రయాణం
ఇ) షికారు, భిక్ష
ఈ) షికారు, అర్చన
జవాబు:
అ) షికారు, బౌద్ధాలయం

3. రాముని గణము ఐనకపులు ఒక గణముగా కదిలారు.
అ) బంధువులు, యోగం
ఆ) మిత్రులు, సమూహం
ఇ) బంటులు, సైన్యం
ఈ) సేనావిశేషం, సమూహం
జవాబు:
ఈ) సేనావిశేషం, సమూహం.

4. కాశీలో విశ్రుతం ఐన గంగ విశ్రుతం.
అ) పేరు, నది
ఆ) ప్రవహించునది, మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది
ఇ) నది, గొప్పది
ఈ) పుణ్యప్రదం, గొప్పది
జవాబు:
ఆ) ప్రవహించునది, మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది

5. ఋషులకు విలాసం ఐనది దేవుని విలాసం.
అ) ఒప్పిదం, చిరునామా
ఆ) ఉన్నది, బొమ్మ
ఇ) గొప్పది, పూజ
ఈ) తపస్సు, ఖాయం
జవాబు:
అ) ఒప్పిదం, చిరునామా

6. అంగణం మన ఇంటి అంగణంలో ఉండదు.
అ) వీథి, నడుమ
ఆ) బైట, దుకాణం
ఇ) వేదిక, ముంగిలి
ఈ) దుకాణం, వరండా
జవాబు:
ఇ) వేదిక, ముంగిలి

7. అంబుజము ఐనా అంబుజము ఐనా కొలనులోనే జన్మించును.
అ) నీరు, జలము
ఆ) కమలం, కలువ
ఇ) కప్పు, చేసు
ఈ) నత్త గుల్ల, పంట
జవాబు:
ఆ) కమలం, కలువ

8. అర్జునుని శరంతో గంగా శరం పైకి వచ్చింది.
అ) బలం, నీరు
ఆ) కత్తి, నది
ఇ) సుత్తి, నురగ
ఈ) బాణం, నీరు
జవాబు:
ఈ) బాణం, నీరు

వ్యుత్పత్త్యర్థాలు

అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్ధం రాయండి.

1. అంబరంలో మెరుపులు వస్తున్నాయి.
జవాబు:
శబ్దం చేసేది

2. శారద తెల్లనిది.
జవాబు:
శరత్కాలంలో పూచేది.

3. నరకాసురుడు క్రూరుడు.
జవాబు:
బాధ పెట్టువాడు.

4. వారినిధిలో కెరటాలెక్కువ ఉంటాయి.
జవాబు:
నీటికి నిలయం

5. కుమారుడు, కుమార్తె ఒక్కటే.
జవాబు:
ఆడుకొనువాడు

6. ఖగములో చిలుక పచ్చనిది.
జవాబు:
ఆకాశంలో పోయేది

7. శరీరం కాపాడుకోవాలి.
జవాబు:
నశించేది

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్వరాన్ని గుర్తించండి.

1. కవి కావ్యం రచిస్తాడు.
అ) నీతులు చెప్పేవాడు
ఆ) కథ చెప్పేవాడు
ఇ) వర్ణించేవాడు
ఈ) రాసేవాడు
జవాబు:
ఇ) వర్ణించేవాడు

2. హంస పాలు, నీరు వేరుచేస్తుంది.
అ) అందమైనది
ఆ) లలితమైనది
ఇ) ఎగిరేది
ఈ) చరించేది
జవాబు:
ఈ) చరించేది

3. అర్జునుడు శరము వేసి కర్ణుని చంపాడు.
అ) బాణం
ఆ) హింసించేది
ఇ) అమ్ము
ఈ) చంపేది
జవాబు:
ఆ) హింసించేది

4. ధరణిని కలుషితం చేయకూడదు.
అ) సమస్తాన్ని ధరించేది.
ఆ) కొండలను భరించేది.
ఇ) నదులు కలది.
ఈ) మట్టితో నిండినది.
జవాబు:
అ) సమస్తాన్ని ధరించేది.

5. విహంగములను కాపాడాలి.
అ) రెక్కలు కలది
ఆ) ఆకాశంలో పోయేది
ఇ) ఈకలు కలది
ఈ) ఎగిరేది
జవాబు:
ఆ) ఆకాశంలో పోయేది

6. భోజనం తృప్తిగా తినాలి.
అ) అన్నం
ఆ) తిండి
ఇ) భుజించేది
ఈ) వడ్డించేది
జవాబు:
ఇ) భుజించేది

7. పూర్వం క్షత్రియుడు పాలించేవాడు.
అ) క్షత్రం వల్ల రక్షించేవాడు.
అ) రాజ్యం కలవాడు.
ఇ) కత్తి కలవాడు.
ఈ) యుద్ధం చేసేవాడు.
జవాబు:
అ) క్షతం వల్ల రక్షించేవాడు.

జాతీయాన్ని గుర్తించడం

ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

1. వాడు రాజకీయాలను కాచి వడపోసిన మహానుభావుడు.
జవాబు:
కాచివడపోసిన

2. సమ్మెలు దేశ ప్రగతికి గొడ్డలి పెట్టుగా ఉన్నాయి.
జవాబు:
గొడ్డలి పెట్టు

3. వివాహ మహోత్సవానికి ఇంటిల్లిపాది వెళ్ళారు.
జవాబు:
ఇంటిల్లిపాది

4. అమరావతి బౌద్ధ సంస్కృతికి ఆలవాలంగా ఉంది.
జవాబు:
ఆలవాలం

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

5. ఉత్సాహం నీరుకారిపోయినా పట్టుదల వదలలేదు.
జవాబు:
నీరుకారిపోయినా

జాతీయము సందర్భము

ఈ జాతీయాన్ని ఏ అర్థంలో/సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి.

1. కన్నులపండుగ
జవాబు:
చూడటానికి అందంగా ఉంది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

2. కొడిగట్టిన దీపాలు
జవాబు:
ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపాలు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

3. మంత్రాలకు చింతకాయలు రాలడం
జవాబు:
కేవలం మాటలు చెప్పడం వలన పనులు జరుగవు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

4. మిన్నందుకోవడం
జవాబు:
గొప్ప కార్యాన్ని సాధించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

సంధి పదాలను విడదీయడం

గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.

1. హంసను గౌతముడు తన ప్రేమాంకమున నిల్పెను.
జవాబు:
ప్రేమ + అంకము

2. కవుల భావాంబర వీధులలో ఎన్నెన్నో భావనలు కలుగుతాయి.
జవాబు:
భావ + అంబర

3. సుభాంతర మధ్యమున రత్న పీఠికపై హంసను ఉంచారు.
జవాబు:
సభ + అంతర

4. సరోవరంలో హంసలు తిరుగుతున్నాయి.
జవాబు:
సరః + వరం

5. గౌతముని హస్తాంచలములపై హంస వాలింది.
జవాబు:
హస్త + అంచలములు

6. గౌతముడు హంసను లాలనసేసి బుజ్జగించాడు.
జవాబు:
లాలన + చేసె

7. హంసపై దేవదత్తుడు శరాగ్నులు వేశాడు.
జవాబు:
శర + అగ్నులు

8. హంసలు బారులై ఆకాశంలో విహరిస్తున్నాయి.
జవాబు:
బారులు + ఐ

9. దివసేంద్రుడు లేనిచో లోకానికి అంధకారమే మిగులును.
జవాబు:
దివస + ఇంద్రుడు

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

10. హంస క్రేంకారముసేయుచు కిందపడింది.
జవాబు:
క్రేంకారము + చేయుచు

సంధి పదాలను కలపడం

సంధి పదాలను కలిపి రాయండి.

1. విహారంబు + ఒనరించు
జవాబు:
విహారంబొనరించు

2. విహారము + ఒనర్చు
జవాబు:
విహారమొనర్చు

3. ఆనందములు + ఒల్క
జవాబు:
ఆనందములొల్క

4. జాగరితము + అయ్యెను
జవాబు:
జాగరితమయ్యెను

5. మరాళము + అరాళ
జవాబు:
మరాళ మరాళ

6. శర + అగ్నులు
జవాబు:
శరాగ్నులు

7. శరాగ్నులు + ఓర్చునే
జవాబు:
శరాగ్నులోర్చునే

8. ప్రాణము + ఒక్కటే
జవాబు:
ప్రాణమొక్కటే

9. చెప్పితివి + ఏమి
జవాబు:
చెప్పితివేమి

10. దాచు కొందువు + ఏమి
జవాబు:
దాచుకొందువేమి

11. నారాచము + ఏ రీతి
జవాబు:
నారాచమేరీతి

12. వారు + ఇద్దరు
జవాబు:
వారిద్దరు

13. తగు + అంచు
జవాబు:
తగవంచు

14. వెన్కకు + ఒదిగెన్
జవాబు:
వెన్కకొదిగెన్

15. కుంచితాంసము + ఐ
జవాబు:
కుంచితాంసమై

16. బాష్పమ్ములు + ఒలుక
జవాబు:
బాష్పములొలుక

17. స్వ+ ఇచ్ఛ.
జవాబు:
స్వేచ్ఛ

18. వమ్ము + చేయుట
జవాబు:
వమ్ము సేయుట

19. నా + అది
జవాబు:
నాయది

20. విలాసము + ఉల్లసిల్లగన్
జవాబు:
విలాసముల్ల సిల్లగన్

21. క్రొత్త + తలిరాకు
జవాబు:
క్రొందలిరాకు

22. తలిరు + ఆకు
జవాబు:
తలిరాకు

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

23. గ్రుక్క + విడు
జవాబు:
గ్రుక్కెడు

24. బుద్ధి + చెల్లునె
జవాబు:
బుద్ధిసెల్లునె

25. క్రేంకారము + చేయుచు
జవాబు:
క్రేంకారము సేయుచు

26. హింస + ఆచరణము
జవాబు:
హింసాచరణము

27. న్యాయ + అధికారి
జవాబు:
న్యాయాధికారి

28. సు + ఆగతము
జవాబు:
స్వాగతము

29. అతి + అంతము
జవాబు:
అత్యంతము

30. వాదులు + ఆది
జవాబు:
వాదులాడి

సంధి నామాలు

గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.

1. ఆకాశంలో శశాంకుడు ప్రకాశిస్తున్నాడు.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) గుణసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) యడాగమ సంధి
జవాబు:
అ) సవర్ణదీర్ఘ సంధి

2. అత్యంతము తిరుపతి లడ్డు మధురమైనది.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) గుణసంధి
ఇ) యణాదేశ సంధి
ఈ) విసర్గ సంధి
జవాబు:
యణాదేశ సంధి

3. సభోంగణ వీథిలో హంస తిరుగుతోంది.
అ) అత్వసంధి
అ) ఇత్వ సంధి
ఇ) విసర్గ సంధి
ఈ) శ్చుత్వ సంధి
జవాబు:
ఇ) విసర్గ సంధి

4. హంసను గౌతముడు లాలనసేసెను.
అ) ఉకార సంధి
ఇ) విసర్గ సంధి
ఆ) గుణసంధి
ఈ) గసడదవాదేశ సంధి
జవాబు:
ఈ) గసడదవాదేశ సంధి

5. సభాంతరమున రత్న వీరికపై హంస ఉంది.
అ) గుణసంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) వృద్ధి సంధి
ఈ) విసర్గ సంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి

6. హంసలు సరోవరంలో ఉంటాయి.
అ) ఉత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) యడాగమ సంధి
ఈ) విసర్గ సంధి
జవాబు:
ఈ) విసర్గ సంధి

7. గౌతముడు అత్యంత ప్రేమతో హంసను లాలించాడు.
అ) యణాదేశ సంధి
ఆ) వృద్ధి సంధి
ఇ) రుగాగమ సంధి
ఈ) టుగాగమ సంధి
జవాబు:
అ) యణాదేశ సంధి

8. గౌతముడు హంసతో స్వాగత వచనాలు పల్కాడు.
అ) రుగాగమ సంధి
ఆ) టుగాగమ సంధి
ఇ) త్రికసంధి
ఈ) యణాదేశ సంధి
జవాబు:
ఈ) యణాదేశ సంధి

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

9. నేడు గగనాంతరాళంలో విమానాలు తిరుగుతున్నాయి.
అ) గుణసంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) విసర్గ సంధి
ఈ) యణాదేశ సంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి

10. మునీంద్రుల ఆశీర్వచనాలు ఫలిస్తాయి.
అ) గుణసంధి
ఆ) ఇకారసంధి
ఇ) సవర్ణదీర్ఘ సంధి
ఈ) ఉకార సంధి
జవాబు:
ఇ) సవర్ణదీర్ఘ సంధి

విగ్రహవాక్యాలు

గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.

1. అంబరవీధి ఎంతో అందంగా ఉంటుంది.
జవాబు:
అంబరమనెడు వీథి

2. భావాంబరవీథిలో ఎన్నో ఆశలకు రెక్కలు వస్తున్నాయి.
జవాబు:
భావమనెడు అంబరవీధి

3. మంజులమరాళము గౌతముని చేతిపై వ్రాలింది.
జవాబు:
మంజులమైన మరాళము

4. పోతన కవీంద్రుడు.
జవాబు:
కవులలో ఇంద్రుడు

5. దేవదత్తుడు టక్కరిచూపులు చూశాడు.
జవాబు:
టక్కరి వైన చూపులు

6. మునీంద్రుల మాట తప్పక జరిగి తీరుతుంది.
జవాబు:
మునులలో ఇంద్రుడు

7. దేవదత్తుడు చేటుల స్వరముతో పిలిచాడు.
జవాబు:
చటులమైన స్వరము

8. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి.
జవాబు:
తన యొక్క ఇచ్ఛ

9. రాజసభలో కవి సమ్మేళనం జరుగుతోంది.
జవాబు:
రాజు యొక్క సభ

10. దేవదత్తుడు హంసలపై శరాగ్నులు వేశాడు.
జవాబు:
శరమనెడి అగ్నులు

సమాస నామాలు

గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.

1. గౌతముని జయలక్ష్మి వరించింది.
అ) రూపక సమాసం
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) ద్వితీయా తత్పురుష సమాసం
ఈ) సప్తమీ తత్పురుష సమాసం
జవాబు:
అ) రూపక సమాసం

2. గగనాంతరాళంలో కలహంస తిరుగుచున్నది.
అ) నఞ్ తత్పురుష సమాసం
ఆ) సప్తమీ తత్పురుష సమాసం
ఇ) షష్టీ తత్పురుషము
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం

3. సమస్త జీవులకు నీరే ప్రాణాధారము.
ఆ) తృతీయా తత్పురుష సమాసం
ఆ) ద్వితీయా తత్పురుష సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయము

4. శాస్త్ర ధర్మాన్ని గౌరవించాలి.
అ) ద్విగు సమాసం
ఆ) ద్వితీయా తత్పురుష సమాసం
ఇ) షష్ఠీ తత్పురుషము
ఈ) ద్వంద్వ సమాసము
జవాబు:
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం

5. న్యాయాధికారి మంచి తీర్పు నిచ్చాడు.
అ) బహువ్రీహి సమాసం
ఆ) నఞ్ తత్పురుష సమాసము
ఇ) తృతీయా తత్పురుష సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
ఈ) షష్ఠీ తత్పురుష సమాసము

6. దేవదత్తుని దగ్గర కఠోరబాణం ఉంది.
అ) విశేషణ పూర్వపద కర్మధారయము
ఆ) చతుర్థీ తత్పురుష సమాసం
ఇ) రూపక సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయము

7. హంస యొక్క శరీరమాంసాలు నావి అని దేవదత్తుడు పల్కాడు.
అ) చతుర్థీ తత్పురుష సమాసం
ఆ) ద్వంద్వ సమాసము
ఇ) రూపక సమాసం
ఈ) తృతీయా తత్పురుష సమాసము
జవాబు:
ఆ) ద్వంద్వ సమాసము

8. గౌతముడు హంసకు ప్రాణదానం చేశాడు.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
ఈ) పంచమీ తత్పురుష సమాసం
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష సమాసం

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

9. విచ్చల విడిగా దేవదత్తుడు శరాగ్నులు వేశాడు.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) రూపక సమాసము
ఈ) సప్తమీ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) రూపక సమాసము

10. పరమేశ్వరుడు అంతర్యామిగా ఉంటాడు.
అ) చతుర్థీ తత్పురుష సమాసం
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయము
ఈ) తృతీయా తత్పురుష సమాసం
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయము

ఆధునిక వచనాలు

ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.

1. కొత్త శతాబ్దములోనికి అడుగుపెట్టుచుంటిమి.
అ) కొత్త శతాబ్దంలోకి అడుగుపెడుతున్నాం.
ఆ) కొత్త సహస్రాబ్దంలోకి అడుగుపెడుతున్నాం.
ఇ) కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం.
ఈ) కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టం.
జవాబు:
అ) కొత్త శతాబ్దంలోకి అడుగుపెడుతున్నాం.

2. స్త్రీలు ప్రధానముగా ఉండిరి.
అ) స్త్రీలు ఉన్నారు
ఆ) స్త్రీలు ప్రధానమే
ఇ) స్త్రీలు ప్రధానంగా ఉన్నారు.
ఈ) స్త్రీలు ప్రధానంగా లేరు.
జవాబు:
ఇ) స్త్రీలు ప్రధానంగా ఉన్నారు.

3. స్త్రీల భాగస్వామ్యమును గురించి ఆలోచించితిమి.
అ) స్త్రీల భాగస్వామ్యం గురించి ఆలోచించం.
ఆ) స్త్రీల భాగస్వామ్యం గురించి ఆలోచించకు.
ఇ) స్త్రీల భాగస్వామ్యం గురించి ఆలోచించగలం.
ఈ) స్త్రీల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచించాలి.
జవాబు:
ఈ) స్త్రీల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచించాలి.

4. బలముగా గలిగి యెంతయో గర్వమనిపించింది.
అ) బలంగా గలిగి ఎంతో గర్వం అనిపించింది.
ఆ) బలంగా ఉండి ఎంత గర్వం ఉందో
ఇ) బలం, గర్వం ఉన్నాయి.
ఈ) బలంగా కలిగి ఎంతో గర్వమనిపించలేదు.
జవాబు:
అ) బలంగా గలిగి ఎంతో గర్వం అనిపించింది.

5. ఆ నీరమె శుక్తిలో బడును.
అ) నీరే శుక్తిలో పడలేదు.
ఆ) ఆ నీరే శుక్తిలో పడుతుంది.
ఇ) ఆ నీరు శుక్తిలో పడగలదు.
ఈ) ఆ నీరే శుక్తిలో పడుతూ ఉంది.
జవాబు:
ఆ) ఆ నీరే శుక్తిలో పడుతుంది.

వ్యతిరేకార్థక వాక్యాలు

ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.

1. పేదలకు దానం చేయాలి.
జవాబు:
గొప్పవాళ్ళకు దానం చేయాలి.

2. మన సంస్కృతిని రక్షించాలి.
జవాబు:
మన సంస్కృతిని నాశనం చేయాలి.

3. అందరు ధర్మాన్ని ఆశ్రయించాలి.
జవాబు:
అందరూ అధర్మాన్ని ఆశ్రయించాలి.

4. మూర్ఖులతో స్నేహం మంచిది.
జవాబు:
సజ్జనులతో స్నేహం మంచిది.

5. సజ్జనమైత్రి కీర్తిని ఇస్తుంది.
జవాబు:
కుజనుల మైత్రి అపకీర్తిని కల్గిస్తుంది.

6. కరవులో బంధువుల ఇండ్లకు వెళ్ళకు.
జవాబు:
కరవులో బంధువుల ఇండ్లకు వెళ్ళు.

7. మీగడ పంచదారతో కలిపి తింటే ఆరోగ్యం.
జవాబు:
మీగడ పంచదారతో కలిపి తింటే అనారోగ్యం.

8. తేనెబొట్టుతో సముద్రం తీయగా మారదు.
జవాబు:
తేనె బొట్టుతో సముద్రం తీయగా మారుతుంది.

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

9. కవ్వంతో పెరుగును చిలుకుతున్నా అది ఓర్చుకుంది.
జవాబు:
కవ్వంతో పెరుగును చిలుకుతున్నా అది ఓర్చుకోదు.

10. చెడు పనులు చేయడం నిరర్థకం.
జవాబు:
చెడు పనులు చేయడం నిరర్థకం కాదు.

11. మహాత్ముడు గొప్పవాడు.
జవాబు:
మహాత్ముడు గొప్పవాడు కాదు.

వ్యతిరేకార్థక క్రియలు

కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.

1) అ) వెళ్ళకు
ఆ) వెళ్ళు
ఇ) వెళ్ళగలవు
ఈ) వెళుతూ ఉండు
జవాబు:
అ) వెళ్ళకు

2. అ) చెప్పవచ్చు
ఆ) చెప్పకూడదు
ఇ) చెప్పలేమా
ఈ) చెప్పు
జవాబు:
ఆ) చెప్పకూడదు

3. అ) పెట్టు
ఆ) పెడతారు
ఇ) పెట్టలేడు
ఈ) పెడుతూ ఉండు
జవాబు:
ఇ) పెట్టలేడు

4. అ) ఆశించగలరు
ఆ) ఆశిస్తారు
ఇ) ఆశించకూడదు
ఈ) ఆశించడమెలా
జవాబు:
ఇ) ఆశించకూడదు

5. అ) సాధ్యం
ఆ) సాధ్యం కాదు
ఇ) సుసాధ్యం
ఈ) శపథం
జవాబు:
ఆ) సాధ్యం కాదు

6. అ) బాగుంటుంది
ఆ) బాగుండదు
ఇ) బాగుండాలి
ఈ) బాగుండదా
జవాబు:
ఆ) బాగుండదు

7. అ) వేయవచ్చు
ఆ) వేయండి
ఇ) వేస్తే బాగుంటుంది
ఈ) వేయకపోవచ్చు
జవాబు:
ఈ) వేయకపోవచ్చు

సంశ్లిష్ట వాక్యాలు

ఇవి ఏ రకమైన సంశ్లిష్టవాక్యాలో రాయండి.

1. బంజారా పక్షులు కువకువలు చేస్తూ ఎగురుతున్నాయి.
జవాబు:
శత్రర్థకం

2. ఘంటసాల గారు పుష్ప విలాపం అర్ధంగా పాడుతూ ఆనందింపజేశారు.
జవాబు:
శత్రర్థకం

3. గౌతముదు హంసను బుజ్జగించి గాయాన్ని మాచ్చాడు.
జవాబు:
క్త్వార్థకం

4. కఠోరమైన బాణం తగిలి హంస క్రేంకారం చేస్తూ నేల వాలింది.
జవాబు:
శత్రర్థకం

5. ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనలను రక్షిస్తుంది.
జవాబు:
చేదర్థకం

6. గౌతముడు హంస రెక్కలు దువ్వి వీపు సవరించాడు.
జవాబు:
క్త్వార్థకం

7. ఎవరైనా నిన్ను గిచ్చితే నీవు బాధపడతావు,
జవాబు:
చేదర్థకం

8. రాచకులం వారికి పక్షులను రక్షించడమే విధి.
జవాబు:
చేదర్థకం

9. హంస గిజగిజలాడుతూ నేలపై పడిపోయింది.
జవాబు:
శత్రర్థకం

10. హంస రివ్వున ఎగిరి వచ్చి గౌతముని చేతిలో వాలింది.
జవాబు:
క్త్వార్థకం

కర్మణి వాక్యాలు

సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

1. సిద్ధార్థుడు హంసలను చూశాడు.
అ) హంసలు సిద్ధార్థుని చేత చూడబడ్డాయి.
ఆ) హంసలు సిద్ధార్థుని చేత చూడబడింది.
ఇ) హంసలు సిద్ధార్థుని చేత చూడబడతాయి.
ఈ) సిద్ధార్థుని చేత హంసలు చూశాడు.
జవాబు:
అ) హంసలు సిద్ధార్థుని చేత చూడబడ్డాయి.

2. దేవదత్తుని హింసా ప్రవృత్తిని సిద్ధార్థుడు గమనించాడు.
అ) దేవదత్తుని చేత హింసా ప్రవృత్తిని సిద్ధార్థునిచే గమనించబడింది.
ఆ) దేవదత్తుని హింసా ప్రవృత్తి చేత సిద్ధార్థుడు గమనించబడ్డాడు.
ఇ) సిద్ధార్థుని చేత దేవదత్తుని హింసా ప్రవృత్తి గమనించబడింది.
ఈ) సిద్ధార్థుడు దేవదత్తుని హింసా ప్రవృత్తి గమనించబడ్డాయి.
జవాబు:
ఇ) సిద్ధార్థుని చేత దేవదత్తుని హింసా ప్రవృత్తి గమనించబడింది.

3. హంస క్రేంకారం చేస్తోంది.
అ) క్రేంకారం హంస చేత చేయబడింది.
ఆ) హంస చేత క్రేంకారం చేయబడుతోంది.
ఇ) క్రేంకారం చేత హంస చేయబడుతుంది.
ఈ) క్రేంకారం హంస చేత చేయబడుతుంది.
జవాబు:
ఆ) హంస చేత క్రేంకారం’ చేయబడుతోంది.

4. పరమేశ్వరుడిచ్చిన గాలిని హంస పీల్చింది.
అ) హంస పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చబడింది.
ఆ) హంసకు గాలిని పరమేశ్వరుడిచ్చాడు.
ఇ) పరమేశ్వరుని గాలి హంస చేత పీల్చబడింది.
ఈ) పరమేశ్వరుడిచ్చిన గాలి హంస చేత పీల్చబడింది.
జవాబు:
ఈ) పరమేశ్వరుడిచ్చిన గాలి హంస చేత పీల్చబడింది.

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

5. సిద్ధార్థుడు హంసను కాపాడాడు.
అ) హంస సిద్ధార్థుని చేత కాపాడబడింది.
ఆ) హంస చేత సిద్ధార్థుడు కాపాడాడు.
ఇ) సిద్ధార్థుని చేత హంస కాపాడబడును.
ఈ) హంస సిద్ధార్థుని చేత కాపాడబడుతోంది.
జవాబు:
అ) హంస సిద్ధార్థుని చేత కాపాడబడింది.

6. బాణం ప్రాణం తీస్తుంది.
అ) ప్రాణం బాణం చేత తీస్తుంది.
ఆ) ప్రాణం బాణం చేత తీయబడుతుంది.
ఇ) ప్రాణం బాణం చేత తీయబడింది.
ఈ) ప్రాణం బాణం చేత తీయబడదు.
జవాబు:
ఆ) ప్రాణం బాణం చేత తీయబడుతుంది.

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాల్లో రాయండి.

1. గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది.
జవాబు:
సంశ్లిష్ట వాక్యం

2. రాము పాఠం చదివి, అర్థం చేసుకున్నాడు.
జవాబు:
సంశ్లిష్ట వాక్యం

3. రాజు, గోపి బడికి వెళ్ళారు.
జవాబు:
సంయుక్త వాక్యం

4. అతడు రావడం ఆలస్యం అయింది కాబట్టి బండి తప్పిపోయింది.
జవాబు:
సంయుక్త వాక్యం

5. జయ ఇంటికి వెళ్ళింది. విజయ బడికి వెళ్ళింది.
జవాబు:
సామాన్య వాక్యాలు

6. స్వప్న అన్నం తిన్నది. పద్మ పండ్లు తిన్నది.
జవాబు:
సామాన్య వాక్యాలు

7. నా ఆజ్ఞను అందరూ పాటించాలి.
జవాబు:
విద్యర్థక వాక్యం

8. హైందవభూమిపై దుశ్చర్యలు సాగుతాయా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యం

9. దయచేసి నన్ను మన్నించండి.
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం

10. స్త్రీలను అవమానించవద్దు.
జవాబు:
నిషేధార్థక వాక్యం

11. అమ్మా! మా సర్దారును దయతో మన్నించు,
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం

వాక్య రకాలు

ఇది ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.

1. మీకు శుభము కలుగుగాక!
అ) అనుమత్యర్థకం
ఆ) ఆశీరర్థకం
ఇ) సందేహార్ధకం
ఈ) విధ్యర్ధకం
జవాబు:
ఆ) ఆశీరర్థకం

AP 9th Class Telugu 6th Lesson Important Questions తీర్పు

2. ధనమే సర్వశ్రేయములకు నిదానము. కానీ నిలబడదు.
అ) నిశ్చయార్ధక వాక్యం
ఆ) విధ్యర్ధక వాక్యం
ఇ) ఆశ్చర్యార్థక వాక్యం
ఈ) సంయుక్త వాక్యం
జవాబు:
అ) నిశ్చయార్థక వాక్యం

3. ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుక కొయ్య?
అ) సందేహార్థక వాక్యం
ఆ) ప్రశ్నార్థక వాక్యం
ఇ) అశ్చర్యార్థక వాక్యం
ఈ) సంయుక్త వాక్యం
జవాబు:
ఆ) ప్రశ్నార్ధక వాక్యం

Leave a Comment