Access to the AP 9th Class Telugu Guide 5th Lesson స్నేహం Questions and Answers are aligned with the curriculum standards.
స్నేహం AP 9th Class Telugu 5th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి
మంచిగా మాట్లాడితే స్నేహం కలుస్తుంది.
మంచిగా ఉంటేనే స్నేహం నిలుస్తుంది.
రైల్లో కొన్ని నిముషాలు కలిసనన ఒక స్నేహం
జీవిత మజిలీల్లోనూ అనుసరిస్తుంది
నీతోపాటే నడిచి వస్తున్న ఒక స్నేహం
ఎన్ష్ళెళునా రైలు పట్టాల్లాగానే సాగిపోతుంది
ఒకడు హృదయాన్ని దాచిపెట్టుకుని
బంగారు కాంతుల్తో కళ్ళు మిరుమిట్లు గొలుపుతాడు.
కమంగా ఆ కాంతి మాసిపోతుంది.
నీ కళ్ళ నిండా చీకటి నిండిపోతుంది.
మరొకడు గంగోత్రిలా నీ గుండెను చల్లగా స్పృశిస్తాడు
క్రమక్రమంగా తడి విస్తరించి, గంగానదియై
ప్రవహించి
నీ జీవన తీరాల్లో పచ్చని పంటలు నింపుతాడు.
స్నేహానికి కాలం అడ్డంకాదు
కొన్ని నెలల పాటు ఎక్కడో ఉన్నా
వసంతం పలకరించగానే కోకిలలా తరలివస్తుంది.
స్నేహం గీతమై తోటంతా అల్లకుపోతుంది
స్నేహానికి దూరం అడ్డంకాదు
ఎక్కడో ఆకాశంలో మబ్టు కడుపులో
కళ్ళ మూసుకుని కూర్కన్న నీతీ బొట్టు
ఆనందబాష్టమై నేలఒడిలో వాలుతుంది
పటట్టలు చెట్టుతో స్నేహం చేసి
ఆకాశంలోకి చొచ్చుకుపోవడం సేక్చు నేర్చుకున్నై
గాలి. పూలతో స్నేహం చేసి
సుగంధాల్ని విరజష్ముం నేర్చుకుంది
స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడాలు
ఉచ్ఫ్యాస నిశ్వాసలంత నిశ్యబ్దంగా జరిగిపోతాయు
స్వార్ధమే ప్రయోజనమైన స్నేహం
సిమెంటు లేని ప్రాజెక్లులా కూలీపోతుంది
స్నేహం ఒక బిందువు దగ్గర ఆగిపోయే పరుగు కాదు
తనని తాను విశాలం చేసుకుంటూ సాగిపోయే నాగు స్నేహం ఏ గమ్యానికి తీసుకుపోయే విమానం కాదు
అడుగులో అడుగు కలిపి నడిచే నిరంతర అనుభూతి
స్నేహమనేది
మనిషిలో లీనమైపోగల
నీ శక్తిని నువ్వు పరీక్షించుకునే సాధనం స్నేహమనేది
నువ్వు ఇంకొకడికిచ్చే కానుక కాదు
ఇంకొకడిలో నిన్ను నువ్వు చూసుకునే నిలువెత్తు దర్పణం.
ఆలోచనాత్యక ప్రశ్నలు
ప్రశ్న 1.
కవి స్నేహాన్ని ఏఏ అంశాలతో పోల్చారు?
జవాబు:
కవి స్నేహాన్ని చాలా అంశాలతో పోల్చురు. స్నేహాన్ని గంగానదితో పోల్చాడు. కోకిలతో పోల్చాడు. స్నేహాన్ని గీతంతో పోల్చాడు. ఆనందబాష్పంతో పోల్చాడు. స్నేహాన్ని పిట్టలు, చెట్టూ అనుబంధంతో పోల్చాడు. గాలికి, హూలకు ఉన్న అనుదుధంతో పోల్చడు. ఉచ్ఛ్వాస, నిశ్వాసలతో పోల్చాడు. అది ఒక ఆగిపోని పరుగుతో పోల్చాడు. మన శక్తిని పరీక్షించుకొనే సాధనంతో పోల్చాడు. స్నేహితులలో మనల్ని మనం చూసుకునే నిలుషెత్తు అద్దంతో స్నేహాన్ని పోల్ఫాడు.
ప్రశ్న 2.
నీవు స్నేహం చేయాలి అనుకునే వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అని భావిస్తున్నావు?
జవాబు:
నేను స్నేహం చేయాలనే వ్యక్తిలో నా లక్షణులే ఉండాలి. నా లక్షణాలు ఉన్నవాడితోనే నాకు స్నేహం కుదురుతుంది. నన్ను విమర్శించే వాడితో నేను స్నేహం చేయను. అతనిలో నన్ను విమర్శించని లక్షణం ఉండాలి. నన్ను పొగుడుతూ ఉండాలి. నేను తప్పు చేసినా లోపాలెంచకూడడు.
నాకు నచ్చే విధంగా ఏ్రవర్తించాలి. నాతోనే ఎక్కువగా మాట్లాడాలి. అతని రహస్యాలన్నీ నాకు చెప్పలలి. నా మాటలు ఓర్పుగా వినాలి, నాతోనే ఆడాలి, సేను లేకుండా ఆటలకు వెళ్లకూడదు. ఏది తెచ్చుకొన్నా నాకు పెట్టాలి. ఈ విధంగా నాతో ప్రవర్తించే వారంటేనే నాకిష్టర. నేను అటువంటి వాడితోనే స్నేహం చేస్తాను.
ఇవి చేయండి
అవగాహన – ప్రతిస్పందన
అ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగయుక్తంగా పాడండి.
జవాబు:
ఉపాధ్యాయుని అనుసరించాలి.
ప్రశ్న 2.
పాఠంలో మీకు నచ్చిన స్నేహం గురించి మాట్లాడండి.
జవాబు:
పాఠంలో నాకు నచ్చిన స్నేహం కృష్ణ కుచేలులది. శ్రీకృష్ణుడు ఆగర్భ శ్రీమంతుడని తెలిసినా అతని వద్దకు వెళ్లేటపుడు అతనికి ఇష్టమైన అటుకులు తీసుకెళ్లాడు. చిరిగిన బట్టలతో, బక్కచిక్కిన శరీరంతో దరిద్రానికి ప్రతిరూపంలా ఉన్న కుచేలుని అంత దూరం నుండే శ్రీకృష్ణుడు చూశాడు. పాన్పు దిగాడు. ఎదురెళ్ళి ఆహ్వానించాడు. అదీ స్నేహమంటే, స్నేహానికి కులమతాలు అడ్డురావు, పేద ధనిక భేదం లేదని నిరూపించిన కృష్ణ కుచేలుల స్నేహమంటే చాలా ఇష్టం.
ప్రశ్న 3.
కింది మాటలు ఎవరు ? ఎవరితో ? ఎందుకన్నారో పాఠం ఆధారంగా రాయండి.
అ) మీ చిన్ననాటి మిత్రుని వద్దకు వెళ్ళిరా !
జవాబు:
ఈ మాట కుచేలుని భార్య కుచేలునితో అంది. శ్రీకృష్ణుడు ధన సహాయం చేస్తాడనే ఆశ ఆమె మనసులో ఉంది.
ఆ) మీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
జవాబు:
ఈ వాక్యం శ్రీరామునితో హనుమ అన్నాడు. శ్రీరామ, సుగ్రీవుల స్నేహం కలపాలనే ఉద్దేశంతో ఈ వాక్యం అన్నాడు.
ఇ) నిశ్చలమైన ప్రేమతో ఇచ్చేదేదైనా స్వీకరిస్తాను.
జవాబు:
ఈ వాక్యం శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు. కుచేలుడు తెచ్చిన అటుకులను తింటూ అన్నమాట ఇది.
ఆ) కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉండేది. ఆ అడవిలో కాకి, లేడి మంచి చెడులు చెప్పుకొంటూ స్నేహంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలో ఒక జిత్తుల మారి నక్క నివసిస్తోంది. ఒకరోజు అది లేడిని చూసింది, దీనిని ఎలాగైనా చంపి, తినాలనుకున్నది. మేత మేసే లేడి వద్దకు వెళ్ళి “నమస్కారం లేడి బావగారూ నీతో నేను కూడా ఈ అడవిలోనే నివసిస్తున్నాను. నీతో స్నేహం చేయాలనే కోరిక కలిగి, ఇక్కడికి వచ్చాను.”
అని అన్నది. తనతో స్నేహం చేయమని ప్రాధేయ పడింది. లేడి నక్క మాటలు నమ్మింది. ఆపదలో ఉన్న వారినైనా ఆతిథ్యం కోరి వచ్చిన వారినైనా, స్నేహం ఆశించి వచ్చిన వారినైనా ఆదరించడం కనీస ధర్మమని భావించింది. నక్కను తన మిత్రుడైన కాకి దగ్గరకు తీసుకు వెళ్ళింది. దానికి నక్క విషయమంతా చెప్పింది. అందుకు కాకి, లేడితో కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదనీ, దీనితో మనకు ‘మైత్రి’ మంచిది కాదనీ తెలిపింది. (- పంచతంత్ర కథ)
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
ఈ కథలో మంచి మిత్రులు ఎవరు ?
జవాబు:
కాకి, లేడి మంచి మిత్రులు.
ప్రశ్న 2.
జింక నక్కను చూసి ఏమని భావించింది ?
జవాబు:
జింక నక్కను చూసి మంచిదని భావించింది.
ప్రశ్న 3.
పై పేరాలో ‘స్నేహం’ అనే అర్థాన్నిచ్చే పదం ఏది ?
జవాబు:
పై పేరాలో స్నేహం అనే పదానికి మైత్రి అనే పదం ఉంది.
ప్రశ్న 4.
నక్క స్వభావం
అ) జిత్తుల మారి
ఆ) మంచి గుణం కలది
ఇ) తన పని తాను చేసుకొనేది
జవాబు:
అ) జిత్తుల మారి
ప్రశ్న 5.
పై పేరా ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
పై పేరాలో అమాయకులు ఎవరు ?
ఇ) కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
భారతదేశ స్వాతంత్ర్యోద్యమపు రోజులవి. సైమన్ కమీషన్ 1928 మార్చి 2న బొంబాయిలో అడుగుపెట్టింది. దీనితో దేశమంతటా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మద్రాసులో కూడా ఇదే పరిస్థితి. నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థసారథి అనే యువకుడు మరణించాడు. అతన్ని సమీపించిన వారినెవరినైనా కాల్చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి కోపోద్రిక్తుడైన ఒక వ్యక్తి తన చొక్కా చించి, ధైర్యంగా రొమ్ము చూపిస్తూ ‘రండిరా! కాల్చండిరా!’ అంటూ వారి ముందుకొచ్చాడు.
ఆయనే ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం. వీరు 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా వినోదరాయని పాలెంలో పేద కుటుంబంలో జన్మించారు. సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య వీరి తల్లిదండ్రులు. ప్రాథమిక విద్య, తమ గ్రామంలోనే సాగింది. చదువుకునే రోజులలో వీరు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుతో కలిసి నాటకాలు వేసేవారు. అందులో ఆడ, మగ వేషాలు ధరించి అందరి మన్ననలు పొందారు. గణిత ఉపాధ్యాయుడు, నటుడు అయిన ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారి సహాయంతో ఉన్నత విద్యను వారాల పద్ధతిలో చదివారు.
తనకు సంపాదననిచ్చే న్యాయవాది వృత్తిని వదిలి దేశసేవలో పాల్గొన్నారు. స్వరాజ్య పత్రిక ఏర్పాటు చేశారు. పేదల విద్యకై జాతీయ పాఠశాల ఏర్పాటు చేశారు. ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నడిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసిన వీరు 1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా 13 నెలలు పనిచేశారు. పేదరికంలో పుట్టినా న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం-నా జీవిత యాత్ర నుండి)
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
టంగుటూరి ప్రకాశం పంతులు బిరుదు ఏమిటి ?
జవాబు:
‘ఆంధ్రకేసరి’ అనేది టంగుటూరి ప్రకాశం పంతులు గారి బిరుదు…
ప్రశ్న 2.
ప్రకాశం తల్లిదండ్రుల పేర్లు రాయండి.
జవాబు:
సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య అనే పుణ్యదంపతులు ప్రకాశం పంతులు గారి తల్లిదండ్రులు.
ప్రశ్న 3.
ఇమ్మానేని హనుమంతరావు గారు ఈ వృత్తికి చెందినవారు.
అ) వైద్యుడు
ఆ) అధ్యాపక
ఇ) వ్యవసాయం
జవాబు:
ఆ – అధ్యాపక
ప్రశ్న 4.
పై పేరాలో నామవాచకాలను గుర్తించి రాయండి.
జవాబు:
నామవాచకాలు : ఆంధ్రకేసరి, టంగుటూరి ప్రకాశం, జిల్లా, వినోదరాయని పాలెం, కుటుంబం, సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య, తల్లిదండ్రులు, విద్య, గ్రామం, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, నాటకాలు, వేషాలు, ఇమ్మానేని హనుమంతరావు నాయుడు, వారాలు, న్యాయవాది, వృత్తి, పత్రిక, పాఠశాల, ఖాదీ, మద్రాసు, రాష్ట్రం, ముఖ్యమంత్రి, వ్యక్తి, యాత్ర.
ప్రశ్న 5.
పేరా ఆధారంగా ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పేరా దేని నుండి గ్రహించబడింది ?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
శ్రీరామ, సుగ్రీవుల మైత్రిని గురించి రాయండి.
జవాబు:
శ్రీరామ, సుగ్రీవుల మైత్రి ఉన్నతమైనది. శ్రీరామ సుగ్రీవుల మైత్రికి ప్రాణం పోసినవాడు హనుమంతుడు. సుగ్రీవుని మంత్రి ఐన హనుమంతుడు రామలక్ష్మణులను చేరి, వారి మైత్రి వలన తమకు ఆనందం కలుగుతుందని చెప్పాడు. శ్రీరాముడు అంగీకరించాడు. తమలో ప్రాణం ఉన్నంత కాలం తమ స్నేహం నిలబడి ఉంటుందని ఇద్దరూ ప్రమాణాలు చేశారు. అవిశ్రాంతంగా ఉపకారాలు చేసుకోవాలని అంగీకరించారు. అంత గొప్పది వారి స్నేహం.
ప్రశ్న 2.
మంచి స్నేహం వలన కలిగే ప్రయోజనాలు రాయండి.
జవాబు:
మంచి స్నేహం వలన కలలో కూడా మోసం జరగదు. బ్రతికున్నంతకాలం స్నేహం ఉంటుంది. ధనం కోసం మనసులో కూడా మోసం చేయాలనే ఆలోచన కూడా రాదు. స్నేహితుల మధ్య అరమరికలుండవు. ప్రాణానికి ప్రాణంగా ఉండేలా స్నేహితులను స్నేహం తయారుచేస్తుంది. ఎటువైపుకూ అవకాశం ఇవ్వనిది స్నేహం. ఇతరుల దౌర్జన్యాలను నిరోధిస్తుంది. అంత గొప్పది స్నేహం.
ప్రశ్న 3.
శ్రీకృష్ణ కుచేలులు మంచి స్నేహితులనడానికి కారణాలు రాయండి.
జవాబు:
శ్రీకృష్ణ కుచేలుల స్నేహం చాలా గొప్పది. కుచేలుడు దరిద్రానికి ప్రతిరూపంగా ఉండే పేదవాడు. బక్కచిక్కినవాడు. శ్రీకృష్ణుడు ఆగర్భ శ్రీమంతుడు, సాక్షాత్తూ లక్ష్మీపతి, అయినా శ్రీకృష్ణుని వద్దకు వెడుతూ అటుకులు తీసుకెళ్ళాడు. కుచేలుని చూసిన కృష్ణుడు పాన్పు దిగి స్వాగతం పలికాడు. అటుకులు తిన్నాడు. స్నేహానికి కులమతాలు, ధనిక పేద భేదాలు ఉండవని నిరూపించిన గొప్ప స్నేహం కృష్ణ, కుచేలుంది.
ప్రశ్న 4.
ద్రుపదుడు చేసిన తప్పు ఏమిటి ? దానివలన కలిగిన ఫలితమేమిటి?
జవాబు:
ద్రుపదుడు, ద్రోణుడు బాల్య స్నేహితులు, తన కుమారునికి పాలు కోసం ఆవును అడగడానికి ద్రుపదుని దగ్గరకు ద్రోణుడు ఒకసారి వెళ్ళాడు. అప్పటికి వారిద్దరూ పెద్దవారయ్యారు. ద్రుపదుడు రాజయ్యాడు. ద్రోణుడు విలువిద్యా చార్యుడయ్యాడు. పెరిగిన సంపదతో ద్రుపదునికి గర్వం తలకెక్కింది.
బాల్య స్నేహితుని అనరాని మాటలు అన్నాడు. సమాన ధనవంతులు, గుణవంతులు, విద్యావంతుల మధ్య మాత్రమే స్నేహం ఉంటుంది అన్నాడు. స్నేహం కాని, పెళ్లి కాని సమానుల మధ్యే ‘ఏర్పడుతుందన్నాడు. ధనవంతునికి పేదవానితో, జ్ఞానికి మూర్ఖునితో, శాంతునికి క్రూరునితో, మంచివానికి చెడ్డవానితో స్నేహం ఉండదన్నాడు. అదే ద్రుపదుడు చేసిన తప్పు, దానితో వారి స్నేహం వైరంగా మారింది. తన విలువిద్యా నైపుణ్యంతో తన శిష్యుడు అర్జునుని తయారు చేశాడు. అతని ద్వారా ద్రుపదుని బంధింపచేశాడు.
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
పాఠం ఆధారంగా మనం ఎలాంటి స్నేహాన్ని ఎంచుకోవాలో తెలుపుతూ వ్యాసం రాయండి.
(లేదా)
స్నేహితుని ఎంపిక చేసుకోవడంలో ఏయే విషయాలలో జాగ్రత్త వహించాలి?
జవాబు:
స్నేహం :
మనం మంచి స్నేహాన్ని ఎంచుకోవాలి. స్నేహితుడు అంటే హితం కోరేవాడు. ఇద్దరి మధ్య అరమరికలు లేని స్నేహాన్ని కోరుకోవాలి. ఒకరికొకరు ప్రాణంగా ఉండే స్నేహం కోరుకోవాలి. కర్ణ దుర్యోధనులలా దుర్మార్గాలు చేయడానికి స్నేహాన్ని ఉపయోగించకూడదు. అటువంటి స్నేహం కోరుకోకూడదు. ఇతరుల దౌర్జన్యాలను నివారించగలిగే స్నేహాన్ని ఎంచుకోవాలి.
కృష్ణకుచేలుల వంటి స్నేహాన్ని ఎంచుకోవాలి. స్నేహానికి కుల, మత, ప్రాంత, భాషాది భేదాలుండకూడదు. కుచేలుడు పేదవాడు, శ్రీకృష్ణుడు ఆగర్భ శ్రీమంతుడు. అయినా కుచేలుడు శ్రీకృష్ణుని కోసం అటుకులు తెచ్చాడు. అవి ఎంతో ఇష్టంగా కృష్ణుడు తిన్నాడు. కుచేలుని చూసి శ్రీకృష్ణుడు పాన్పు దిగి పరుగు పరుగున వెళ్లి ఆహ్వానించాడు. అటువంటి అరమరికలు లేని స్నేహాన్ని ఎంచుకోవాలి.
శరీరంలో ప్రాణం ఉన్నంతకాలం తమ స్నేహం ఉండాలని కోరుకొన్న రామ, సుగ్రీవుల స్నేహం ఆదర్శప్రాయమైనది. ఒకరికొకరు ఉపకారం చేసుకోవాలి. స్నేహితుని ఆపదలను నివారించాలి అనే అభిప్రాయం గల స్నేహాన్ని ఎంచుకోవాలి.
ప్రశ్న 2.
శ్రీరామ సుగ్రీవుల మధ్య స్నేహాన్ని ఏర్పరచడంలో హనుమ సంభాషణను రాయండి.
జవాబు:
హనుమ : మహావీరా! మీరెవరు ?
శ్రీరాముడు : ముందుగా నీవెవరో చెప్పు,
హనుమ : నన్ను హనుమంతుడు అంటారు.నేను సుగ్రీవుని మంత్రిని.
శ్రీరాముడు : బాగుంది.
హనుమ : తమరెవరో సెలవిస్తారా ?
శ్రీరాముడు : నన్ను శ్రీరాముడంటారు, ఇతని పేరు లక్ష్మణుడు. మేము దశరథ పుత్రులం.
హనుమ : నాదొక చిన్న విన్నపం.
శ్రీరాముడు : ఏమిటది ?
హనుమ : మా వానర రాజు మీతో స్నేహం కోరుకొంటున్నాడు.
శ్రీరాముడు : అయితే –
హనుమ : మీరు కూడా స్నేహ హస్తం చాపాలి.
శ్రీరాముడు : అలాగే !
హనుమ : నాకు చాలా ఆనందంగా ఉంది, మీ స్నేహం మాకు కన్నుల పండుగే. ధన్యవాడాలు శ్రీరామా! ఇప్పుుడే వెళ్లి మా రాజుకు చెబుతాను.
ప్రశ్న 3.
కింద పద్యాలకు ప్రతి పదార్థాలు రాయండి.
చ. వరదుడు సాధుభక్తజన వత్సలుడార్త శరణ్యుడిందిరా
వరుఁడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు దాఁ గుశస్థలీ
పురమున యాదవ ప్రకరముల్ భజియింపగ నున్నవాఁడు నీ
వరిగిన మిమ్ముఁ జూచి విభుండప్పుడు యిచ్చుననూన సంపదల్
ప్రతిపదార్ధం :
వరదుడు = కోరిన కోరికల నిచ్చువాడు
సాధు భక్త జనవత్సలుడు = సాధువులైన సేవక జనుల యందు వాత్సల్యము కలపాడు
ఆర్త శరణ్యుడు = పిడితులైన వారికి రక్షకుడు
ఇందిరావరుడు = లక్ష్మీదేవికి భర్త
దయాపయోధి = దయా రసమునకు సముద్రుడైన వాడు
భగవంతుడు = షడ్రుణెశ్వర్ల సంపన్నుడు కృష్టుడు
తాన్ = తాను
కుశస్థలీ పురమునన్ = కుశస్థలి యను పట్టణము నందు
యాదవ ప్రకరములు = యదువంశస్థుల గుంపులు
భజియింపగన్ = సేవింపగా
ఉన్నవాడ (ఇట్లు + అరిగినన్) = ఉండనే ఉన్నాడు
ఇట్లరిగినన్ = ఈ విధంగా పోయినట్టయిన
విభుడు = నిగ్రహానుగ్రహ సమర్థుడైన కృష్టుడు
అప్పుడు = నిన్ను చూచినప్పుడే
అనూన సంపదలు = తక్కువ గాని కలుములు (ఇచ్చును)
మ. కనిడాయంజను నంతఁ గృష్ణుడు దళత్కంజాక్షు డప్పేద వి
ప్రుని నశశాంత దరిద్ర పీడితు గృశీ భూతాంగు జీర్ణాంబరున్
ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ గుచే
లుని నల్లంతనె చూచి సంఘ్రమ విలోలుండై దిగెన్ దల్పమున్
ప్రతిపదార్ధం :
కని = చూచి
(డాయన్ + చనునంతన్)
డాయంజనునంతన్ = దగ్గఱటోవు నంతలో
(దళత్ + కంజ + అక్షుడు)
దళత్కంజాక్షుడు = వికసించిన తామరల వంటి కన్నులు గల (కృష్టుడు)
(ఆ + పేద – విప్రునిన్)
అప్పేద – విప్రునిన్ = దరిద్రుడైన ఆ బ్రాహ్మణుని
(కృశీ – భూత+అంగున్)
(జీర్ణ + అంబరున్)
జీర్ణాంబరున్ = ప్రాత పేలికలు కలవానిని
(ఘన – తృష్ణ – ఆతుర చిత్తున్)
ఘన – తృష్ణాతుర చిత్తున్ = అధికమైన దప్పి చేత పీడింప బడిన మనసు గల వానిని
హాస్య నిలయున్ = పరిహాసమునకు చోటయిన వానిని
(ఖండ + ఉత్తరీయున్)
ఖండోత్తరీయున్ = చింపులైన యుత్తరీయము కలవాడును (కుచేలుని)
(అల్ల + అంతనే)
అల్లంతనే = కొంతదూరము నందే (చూచి)
(సంహ్రమవిలోలుండు + ఐ)
సంహ్రమవిలోలుండై = తొట్రపపాటు చేత చలించువాడై
తల్పమున్ = పానుపును (దిగెను)
ప్రశ్న 4.
స్నేహితుని ఎంపిక చేసుకోవడంలో ఏయే విషయాలలో జాగ్రత్త వహించాలి?
జవాబు:
స్నేహితుని ఎంచుకోవడంలో చాలా విషయాలలో జాగ్రత వహించాలి. స్నేహితుడు మోసం చేసేహాడు కాకూడడు. అతని అలఖాట్లూ, లక్షణాలూ జాగ్రత్తా పరిశీలించాలి. దురలవాట్లు ఉంటే స్నేహం చేయకాడదు. దూరం పెట్టాలి. దొంగ లక్షణాలూ, హొసం చేస్లక్షణాలూ ఉన్నాషేమో పరీశలించాలి.
అటువంటి లక్షణాలుంటే దూరం పెట్టాలి. అటువంటి వారితో స్నేహం చేయకూడదు. కొంతమంది గొడవలు పెట్టే వారుంటారు. వారితో కూడా స్నేహం చేయకూడదు. మనసులో ఎటువంది కల్మషం లేనిపానినే స్నేహితునిగా ఎంచుకోవాలె. పరధనాన్ని ఆశించని వారినే స్నేహానికి ఎంచుకోవాలి.
భాషాంశాలు – పదజాలం
అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్ధాన్ని రాసి, వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : మానవులు సంపదను మంచి మార్గంలో సంపాదించాలి. ధనాన్ని అనవసర పనులకు ఖర్చుపెట్టరాదు.
ప్రశ్న 1.
ద్వారకా నగరంలో సౌధములు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి.
జవాబు:
సౌధము = భవనము
సొంతవాక్యం : మా గ్రామంలోను భవనములు ఎక్కువే.
ప్రశ్న 2.
కృష్ణునికి, కుచేలుడు తండ్రులములు బహుకరించాడు.
జవాబు:
తండులము = బియ్యం
సొంతవాక్యం : తినడానికి బియ్యం ఇచ్చే రైతును గౌరవించాలి. (పుస్తకంలో ఇచ్చినది తప్పు, తండులములు అంటే అటుకులు కాదు)
ప్రశ్న 3.
శ్రీరామ, సుగ్రీవులు స్నేహం కోసం ప్రతిజ్ఞ చేశారు.
జవాబు:
ప్రతిజ్ఞ = శపథం
సొంతవాక్యం : సూర్యాస్తమయంలోగా సైంధవుని చంపుతానని అర్జునుడు శపథం చేశాడు.
ప్రశ్న 4.
చెడ్డ వారితో సఖ్యం మంచిది కాదు.
జవాబు:
సఖ్యం = స్నేహం
సొంతవాక్యం”: మంచి స్నేహం మంచి ఫలితం ఇస్తుంది.
ఆ) కింది వాక్యాలు చదివి, పర్యాయ పదాలను గుర్తించి రాయండి.
ప్రశ్న 1.
మంచి మిత్రులతో స్నేహం చేయాలి. నేస్తాలతో సరిగా నడుచుకోవాలి. ఆ స్నేహితులే ఆపదలలో ఆదుకుంటారు.
జవాబు:
మిత్రులు, నేస్తాలు, స్నేహితులు
ప్రశ్న 2.
ఆ గృహంలో తల్పములు చాలా ఉన్నాయి. ఆ శయ్యలు మెత్తనైనవి. ఆ పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది.
జవాబు:
తల్పములు, శయ్యలు, పరుపులు
ప్రశ్న 3.
స్నేహ కొత్త వసనములు తెచ్చుకుంది. ఆ అంబరములంటే తనకు చాలా ఇష్టం. పుట్టిన రోజున కొత్త వస్త్రాలు ధరించింది.
జవాబు:
వసనము, అంబరము, వస్త్రము
ప్రశ్న 4.
ప్రతి ప్రాణికి ఉదకం అవసరం. సలిలము లేనిదే మనుగడ లేదు. కావున జలమును వృథా చేయకూడదు.’
జవాబు:
ఉదకం, సలిలం, జలము
ప్రశ్న 5.
తామర పత్రం నీటి బిందువులతో మెరుస్తుంది అందువల్ల ఆ దళం మరింత అందంగా కన్పిస్తుంది. ఆ ఆకుతో పూల పొట్లం కడతారు:
జవాబు:
పత్రం, దళం, ఆకు
ఇ) కింది పదాలకు సరియైన నానార్థాలను గుర్తించి రాయండి
జవాబు:
1. విభుడు ( ఆ ) అ) పండు, కార్యం, పరిణామం
2. కను ( ఇ ) ఆ) ప్రభువు, శివుడు, బ్రహ్మ
3. దళం ( ఈ ) ఇ) చూచు, వెదకు, జన్మనిచ్చు
4. ఫలం ( అ ) ఈ) ఆకు, భాగం, దండు
ఈ) కింది పదాలకు సరైన వ్యుత్పత్యర్థాలను గుర్తించి రాయండి.
జవాబు:
1. గురుపు ( ఉ ) అ) మరణం లేసి (సు)
2. మితుడు ( ఇ ) ఆ) గృహాన్ని ధరించేది (ఇల్లాలు)
3. మోక్షం ( ఈ ) ఇ) సర్వభూతాల పట్ల స్నేహ భావం గలవాడు. (సూర్యుడు)
4. పురంధ్రి ( ఆ ) ఈ) జీవుళ్ణి పాశం నుంచి విడిపించేది (ముక్తి)
5. అమృతం ( అ ) ఉ) అజ్ఞానమనే అంధకారమును ఛేదించువాడు. (ఉపాధ్యాయుడు)
ఉ) కింది పదాలను వివరించి రాయండి.
జవాబు:
1. బ్రహ్మానందం — గొప్పదైన సాటిలేని ఆనందం.
2. చక్రపాణి — చక్రము పాణియందు కలవాడు (విష్ణువు)
3. కుంభవృష్టి — కుండలతో ఒంచినట్లు పడే పెద్ద వాన.
4. తళతళలాడు — కళ్లకు మిరుమిట్లు గొలిపే వస్తువుల యొక్క నిగనిగ.
5. ప్రచండ వాయువు — బాగా ఎక్కువగా, భయంకరంగా వీచే గాలి.
ఊ) కింది వాక్యాలలో గల ప్రకృతి, వికృతులను గుర్తించి రాయండి.
1. హనుమంతుడు కార్యముకై రాముని దగ్గరకు వెళ్ళెను. ఆ కర్ణమును సాధించుకొని వచ్చెను.
జవాబు:
కార్యము (ప్ర) — కర్జము (వి)
2. రాజగృహము బంగారుమయం. ఆ గీము సూర్య కాంతులతో మెరుస్తున్నది.
జవాబు:
గృహము (ప్ర) — గీము (వి)
3. పెద్దల పట్ల గౌరవం కలిగివుండాలి. వారిని గారవించడం మన సంప్రదాయం.
జవాబు:
గౌరవం (ప్ర) — గారవం (వి)
4. రాముడు ధర్మం కలవాడు. ఆ దమ్మమే అతనిని కాపాడింది.
జవాబు:
ధర్మము (ప్ర) — దమ్మము (వి)
5. లక్ష్మి అంటే సంపద. ఆ లచ్చితో మన కష్టాలు తీరుతాయి.
జవాబు:
లక్ష్మి (ప్ర) — లచ్చి (వి)
వ్యాకరణాంశాలు
సంధులు
అ) లు, ల, న సంధి ఆధారంగా కింది పదాలను విడదీసి రాయండి.
జవాబు:
1. వష్రాలు : వజ్రము + లు
2. దేశాలు : దేశము + లు
3. పుస్తకాన : పుస్తకము + న
4. సమయాన : సమయము + న
5. అందాలు : అందము + లు
ఆ) కింది పదాలు కలిపిరాసి, సంధి పేరు రాయండి.
జవాబు:
1. నిత్య + ఆనందం : నిత్యానందం – సవర్ణదీర్ఘ సంభి
2. వైథవ + ఉన్నతి : వైభవోన్నతి – గుణ సంధి
3. అతి + అంత : అత్యఁత – యణాదేశ సంధి
4. కానుక + ఏమైన : కానుకేమైన – ఉత్య సంధి
5. చెప్పిన + అట్లు : చెప్సినడుయట్టు – అత్న సంది
సమాసములు
అ) కింది సమాస పదాలకు, విగ్రహ వాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.
1. ఉత్తమపురుషుడు : ఉత్తముడైన పురుషుడు — విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. ద్వారకా నగరం : ద్వారకా అను పేరు గల నగరం — సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
3. భార్యాభర్తలు : భార్యయును, భర్తయును — ద్వంద్వ సమాసం
4. ఫలపుష్పాలు : ఫలమును, పుష్పమును — ద్వంద్వ సమాసం
5. నలుదిక్కులు : నాలుగు సంఖ్య గల దిక్కులు — ద్వంద్వ సమాసం
అలంకారాలు
ఛేకానుప్రాసాలంకారం :
శబ్దాలంకారాలలో ఛేకానుప్రాసాలంకారం ఒకటి. దీని గురించి తెలుసుకుందాం !
కింది ఉదాహరణను పరిశీలించండి.
1. విచారింపని పని చేయరాదు.
పై ఉదాహరణను పరిశీలిస్తే ‘పని’ అనే పదం వాక్యంలో అర్థ భేదంతో పునరుక్తమయ్యింది. మొదటి ‘పని’ అనే పదం ‘విచారింపని’ లోని పదభాగం. రెండవ ‘ పని” అనే పదం ‘కార్యం’ అనే అర్థాన్నిస్తుంది. కాబట్టి ఇది ఛేకానుప్రాసము.
లక్షణం: పద్యపాదం లేక వాక్యంలో అర్థ భేదం కలిగిన హల్లుల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని ‘ఛేకానుప్రాసాలంకారం’ అంటారు.
సమన్వయం : పై వాక్యంలో ‘పని’ – ‘పని’ అనే పదం (హల్లుల జంట) అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది. అందువల్ల ఇది ఛేకాను ప్రాసాలంకారం.
లాటానుప్రాసాలంకారం :
లాటానుప్రాసాలంకారం కూడా శబ్దాలంకారమే. కింది ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం!
1. కమలాక్షు నర్చించు కరములు కరములు.
పై పద్య పాదంలో ‘కరములు’ అనే పదం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది. ఇక్కడ ‘కరములు’ అంటే చేతులు అని అర్థం. వాక్యంలో ‘కరములు కరములు’ అని వెంట వెంటనే ప్రయోగించడం వల్ల ఆ చేతులే ధన్యమైన చేతులు, మిగిలినవేవి చేతులు కావు” అనే తాత్పర్య భేదాన్నిస్తున్నది. కావున ఇది లాటాను ప్రాసాలంకారం.
లక్షణం : పద్యపాదం లేక వాక్యంలో ఏదైన ఒక పదాన్ని అర్థ భేదం లేకుండా తాత్పర్య భేదం కలుగునట్లు వెంటవెంటనే ప్రయోగిస్తే దానిని లాటాను ప్రాసాలంకారం అంటారు.
అ) కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం సమన్వయం చేయండి.
ప్రశ్న 1.
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో లాటానుప్రాసాలంకారం ఉంది.
లక్షణం : ఒకే పదం అర్థ భేదం లేకుండా తాత్పర్య భేదంతో రెండుసార్లు ప్రయోగిస్తే అది లాటానుప్రాసాలంకారం. సమన్వయం : ఇచ్చిన వాక్యంలో జిహ్వ = నాలుక, జిహ్వ = నిజమైన నాలుక అనే భావంలో అర్థ భేదం లేకుండా ప్రయోగించారు. కనుక ఇచ్చినది లాటానుప్రాసాలంకారం గల వాక్యం.
ప్రశ్న 2.
నీటిలో పడిన తేలు తేలుతుందా.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో వృత్తను(ప్రాసాలంకారం ఉంది.
“లక్షణం : ఒకే హల్లు పదే పదే ఆవృతమైతే దానిని వృత్తసు(్రాసాలంకారం అంటారు.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో ‘లకారం’ పదే పదే ఆవృతమైెంద, కనుక ఇచ్చినది వృత్త్యనుప్రాసాలంకారం ఉన్న” వాక్యం.
ప్రశ్న 3.
రామ బాణం తగిలి వాలి వాలిపోయోను.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో కానుప్రాసాలంకారం ఉంది.
లక్షణం : హల్లుల జంట అర్థ భేదంతో ప్రక్క ప్రక్కస పయోగిస్తే అది ఛేకానుప్రాసాలంకారం.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో వాలి = సుగ్రీవుని అన్న, ఎాలి = ఒరిగి, అనే రెండర్థాలలో ప్రక్క ప్రక్కనే ప్రయోగించారు. కనుక ఇచ్చిన వాక్యంలో ఛేకానుప్రాసాలంకారం ఉంది.
ప్రశ్న 4.
కందర్పదర్పములకు సుందర దరహోసములు.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో ఛేకానుప్రాసాలంకారం ఉంది.
లక్షణం : హల్లుల జంట అర్థ భేదంతో ప్రక్క ప్రక్కే ప్రయోగిస్తే అది ఛేకానుప్రాసాలంకారం.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో దర్ప = మన్మథుడు, దర్షము = గర్వము, సుందర = అందమైన, దరహాసం = నవ్వు, అనే రెండర్థాలలో ప్రక్క ప్రక్కనే ప్రయోగించారు. కనుక ఇచ్చిన సాక్యంలో ఛేకాసుప్రాసాలంకారం ఉంది.
ఛందస్సు
ఆటవెలది పద్య లక్షణాలు
ఆటవెలది పద్యం ఉపజాతికి చెందినది. పద్య లక్షణాలను పరిశీలిద్దాం.
1. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
2. 1వ 3వ పాదాలు ఒక విధంగాను, 2వ 4వ పాదాలు ఒక విధంగాను ఉంటాయి.
3. 1,3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు. రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
4. 2,4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉంటాయి.
5. ప్రతిపాదంలో నాల్గవ గణం లోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది
6. యతిలేని చోట ప్రాస యతి చెల్లుతుంది.
7. ప్రాసనియమం లేదు.
పై లక్షణాలను పరిశీలించినప్పుడు ఆటవెలది పద్యం ఇంద్రగణాలు, సూర్యగణాలచేత ఏర్పడుతుందని తెలుస్తుంది. వీటిని గురించి తెలుసుకుందాం.
ఇంద్రగణాలు 6 అవి: నల – నగ- సల- భ-ర-త
కింది ఉదాహరణ ద్వారా ఆటవెలది పద్యలక్షణాలను సమన్వయం చేద్దాం.
పై పద్యపాదాలను గణవిభజన చేయగా ఆటవెలది పద్యలక్షణాలను ఈ విధంగా సమన్నయం చేయవచ్చును.
1వ 3వ పాదాలలో వุరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలుండాలి. పై పద్య పాదాలలో అలాగే ఉన్నాయి. 2,4 పాడాలలో 5 సూర్యగకాలుండాలి.
ప్రతి పాదంలోని 1వ గణాద్యక్షరానికి 4వ గణాద్యక్షరానికి యతి చెల్లుతుంది.
పై పద్యంలో
1వ పాదంలో బ – బ లకు
2వ పాదంలో వ – వ లకు
3వ పాదంలో జీ – జ లకు
4వ పాదంలో మా – మా లకు యతి చెల్లుతున్నది.
పాఠంలో ఉన్న అటవెలది పద్యాన్ని గణవిభజన చేసి లక్షణాలను సమన్వయం చేయండి.
1. సరస జేరి నిన్ను సంస్తవ మొనరించు
జవాబు:
మూడు సూర్యగణాలు + రెండు ఇంద్రగణాలు
యతి – స – సం లకు
2. వారలెల్ల సఖులుగారు నీకు
జవాబు:
అయిదు సూర్య గణాలు
ప్రాసయతి – వార – గారు లకు
3. కష్టకాలమందు గాచు వాడొక్కండె
జవాబు:
మూడు సూర్య గణాలు + రెండు ఇంద్ర గణాలు
యతి – క – గా లకు
4. నిక్కమైన సఖుడు నీకు దలప
జవాబు:
అయిదు సూర్యగణాలు.
యతి – ని – నీ లకు
1 పాదం – యతి స – సం లకు
2 పాదం – ప్రాసయతి పార – గారు లకు
3 పాదం – యతి – క – గా లకు
4 పాదం – యతి ని -నీ లకు
కనుక ఇది ఆటవెలది పద్యము.
2. మీరు మీరు కలిసి మిత్రులౌటయ మాకు
జక్షురస్తి భావచారితార్థో
మఖిలసృష్టిసారమైనది యొక్కండే
యరయ సాధుజన సమాగమంబు
జవాబు:
అయిదు సూర్యగణాలు.
1 పాదం – యతి మీ – మి లకు
2 పాదం – యతి జ – చా లకు
3 పాదం – యతి తార్థము + అ – మ్ + ఐ లకు
4 పాదం – యతి య – సమ + అ లకు
కనుక ఇది ఆటవెలది పద్యము.
ప్రాజెక్టు పని
స్నేహం కథావస్తువుగా గల ఏదైనా కథను సేకరించండి. చార్టుపై రాసి జరగం గదిలో ప్రదర్శించండి
జవాబు:
స్యే సంపద
కాళిందీ సా(మాజ్యాన్ని పరిపాలించే విక్రమవర్మకు ఒక్కడే కొడుకు. అతని పేరు వీరవర్మ. ఆయన మంెతి చతుర్వేదికి కూడా ఒక్కడే కొడుకు. అతని ప్రేరు చమత్కారి. వీరవర్మ, చమత్కారి చిన్నతనం నుండీ ప్రాణ స్నేహితులు.
ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేక పోయేవారు. తిట్టుకొనేవారు, కొట్టుకొనేవారు, ఆడుకొనేవారు, అల్లరి చేసేవారు, విద్యాభ్యాసం చేసేవారు, ఏం చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. ఇద్దరూ అన్ని విద్యలలోనూ ఆరితేరారు. కొద్దిగా పెద్దవారయ్యారు. యుక్త వయసు వస్తోంది.
ఒకరోజు విక్రమవర్మ తన మంత్రి చతుర్వేదిని ఆంతరంగిక మందిరంలోకి పిలిచాడు. మా వీరవర్మకు పట్టాభిషేకం చేసి, రాజ్యం అప్పగిద్దామనుకొంటున్నాను. మీ కుమారుడు చమత్కారిని మంత్రిని చేద్దాం. మనం వెనక ఉండి వాళ్లను నడిపిద్దాం అన్నాడు చతుర్వేది సరే అన్నాడు. ఇది వీరవర్మకు, చమత్కారికి చెప్పారు. తర్వాత వాళ్లిద్దరూ ఆలోచించుకాన్నారు. మనం ఈ పరిపాలనలో పడితే హాయిగా ఉండలేము. కనుక ఎక్కడికైనా పారిషోవాలని నిర్ణయించుకొన్నారు.
ఇద్దరూ చరోరో గుర్రం మీద ధనపుమూటలతో అర్ధరాత్రి వెళ్లిపోయారు. వెళ్లగా వెళ్లగా ఒక నిర్జన ప్రదేశం వచ్చింది. అక్కడొక పెర్ద రాయి కనిపించింది. అది చాలా పొడవుగా వెడల్పుగా ఉంది. వీరవర్మ గుర్రం ఆపాడు. దానిపై నుండి దూకుతానన్నాడు, అన్నదే తడవుగా దానిని దూకేడు, రెండు కాళ్లూ విరిగి పోయేయి. తన మితుడు దూకేక తనూ దూకాలన్నాడు చమత్కారి. దూకేడు. బోర్లా పడ్డాడు. రెండు కళ్లూ పోయేయి. ఇద్దరూ కొంచెం బాధపడ్డారు. పకపకా నవ్వేసుకున్నారు.
వీరవర్మను చమత్కారి భుజంపై కూర్చోపెట్టుకొన్నాడు. అతను డారి చెబుతుంటే నడుస్తున్నాడు. కొద్దిదూరం నడిచేక అలసట కలిగింది. ఒక తాడిచెట్టు కింద కూర్చొన్నారు. ఎండ మండిపోతుంది. పక్కనే మరొక రాజు వెయ్యిమంది సైన్యంతో మర్రిచెట్టు కింద విడిది చేశాడు.
ఆ రాజు పేరు విక్రమచండ్రుడు. ఆయన పకపక నప్వాడు. ఆయన నవ్వును చూసి మంత్రిగారు అందరూ నవ్వారు. మంత్రిని పిలిచి తానెండుకు నవ్వానో చెప్పమన్నాడు. అప్పుడు మంత్రి తాడిచెట్టు కింద కూర్చున్న ఇద్దరిలో ఒకరిక కళ్ళు ఒకరికి కాళ్ళు లేవని నవ్వారన్నాడు. ఛీ ఫీ ! అవయవలోపం ఉన్నవారిని చూసి నవ్వేటంత మూర్ఖుడినా ! అని విక్రమచండ్రుడు కోప్పడ్డాడు. ఇంతలో నేను చెప్పవచ్చా అని కళ్ళు లేని చమత్కారి గట్టిగా అడిగాడు. చెప్పమన్నాడు. మర్రి విత్తనం ఆవగింజంత ఉంటుంది.
అది వెయ్యిమందికి నీడనిచ్చే చెట్టును తయారు చేసింది. అలాగే తాటి విత్తనం చాలా పెద్దది ఉంటుంది. కానీ ఇద్రరికి కూడా సరిపడ నీడ నివ్వలేని చెట్టును సృష్టించింది. ఇదే ప్రకృతిలోని విచిత్రమని నవ్వారన్నాడు. దానికి విక్రమచంద్రుడు చాలా ఆనందించాడు. ఆ తెలివైన మిత్రులను తన రాజ్యానికి ఆహ్వానించాడు. వారిని ముఖ్య అతిథులుగా గౌరవించి వైద్యుల చేత వారి కళ్ళు, కాళ్ళు బాగా చేయించాడు. వారిద్దరూ ఆడింది ఆట పాడింది పాటగా ఆ సంస్థానంలో గడుపుతున్నారు.
పద్య మధురిమ
మ. నిరయంబైన, నిబద్ధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు ర్మరణంబైనc గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో; హరుఁడైనన్, హరియైన, నీరజభవుండభ్యాగతుండైన నౌఁ; దిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా! ధీవర్య వేయేటికిన్? — పోతన – భాగవతం
భావం: ఓ సుధీమణీ! నాకు నరకం దాపురించినా సరే! బంధనం ప్రాప్తమైనా సరే! భూమండలం అదృశ్యమైనా సరే! దుర్మరణం వచ్చినా సరే! నా వంశానికి చేటు వాటిల్లినా సరే! నేను ఆడిన మాట తప్పను. జరగవలసింది జరగనీ! భయం లేదు. వచ్చిన వాడు శవుడైనా, విష్టువైనా, బ్రహ్మదేవపైనా, ఎవరైనా సరే! ఏమైనా సరే! నా నోట మరో మాటరాదు.
పద్యాలు – ప్రతిపదార్ధ భావాలు
1వ – పద్యం
ఆ.వె. సరస జేరి నిన్ను సంస్తవ మొనరించు
వారలెల్ల సఖులుగారు నీకు
కష్టకాలమందు గాచు వాడొక్కండె
నిక్కమైన సఖుడు నీకు దలప
ప్రతిపదార్ధం :
సరసన్ = సమీపానికి
చేర = వచ్చి
నిన్ను = నిన్ను
సంస్తవము = పూగడడము
ఒనరించు = చేయు
వారలు = వారు
ఎల్ల = అందరూ
నీకు = నీకు
సఖులున్ = స్నేహితులు
కారు = కాదు
కష్టకాలము + అందు = ఆపద సమయంలో
కాచువాడు = కాపాడేవాడు
ఒక్కండ = ఒక్కడే
నిక్కము + ఐన = నిజమైన
నీకున్ = నీకు
తలపన్ = ఆలోచించగా
సఖుడు = స్నేహితుడు
భావం : నీ దగ్గర చేరి నిన్ను పొగిడేవాడు స్నేహితుడు కాదు. నీ కష్ట సమయాలలో నిన్ను ఆదుకునేవాడే నీకు స్నేహితుడు.
2వ – పద్యం
కం. మైత్రిం బోలెడు ధర్మము
ధాత్రీ దివిజులకు లేదు దాని నడపినం
బుత్రా యేకర్మంబు ప
విత్రతయును వలవదది వివేకము జేర్చున్.
ప్రతిపదార్ధం :
పుతా = ఓ కుమారా!
ధాత్రీ దివిజులకు = బ్రాహ్మణులకు
మైత్రిని స్నేహాన్ని
ఓోలెడు = సాటియైన
ధర్మము = ధర్మము
లేదు = లేదు
దానిని = ఆ స్నేహాన్నీ
అడిపినన్ = అణచినట్లయితే
అది = అ పని
ఏ కర్మంబు = ఏ పనియైనా
పవిత్యతును = పునీతమును
వలవదు = కలగనివ్వదు
అది = అది
వివేకము = వుజ్ఞతను
చేర్చునే = కలిగించునా!
భావం : ఓ కుమారా ! బ్రాహ్మణులకు స్నేహాన్ని మించిన ధర్మము లేదు. స్నేహధర్మాన్ని పాటించకపోతే ఏ పుణ్యాలు, ఏ కర్మలు మంచి ఫలితాలను ఇవ్వవు. వైరము వివేకాన్ని చంపుతుంది.
3వ – పద్యం
చ. వరదుడు సాధుభక్తజన వత్సలుడార్త శరణ్యుడిందిరా
వరుఁడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు దాఁ గుశస్థలీ
పురమున యాదవ ప్రకరముల్ ఫజియింపగ నున్నవాఁడు నీ
వరిగిన మిమ్ముఁ జూచి విభుండప్చుడు యిచ్చుననూన సంపదల్
ప్రతిపదార్ధం :
వరదుడు = వరములనిచ్చేవాడు
సాధు = సాధువులకు
భక్తజన = భక్తులకు
వత్సలుడు = ఇష్టమైనవాడు
ఆర్త = బాధలలో ఉన్నవారికి
శరణ్యుడు = శరణు నిచ్చేవాడు
ఇందిరా = లక్ష్మీదేవికి
వరుడు = భర్త
దయా = జాలి అనెడు
సముడుుడు = సాగరుడు
ఫగవంతుడు = దేవుడు (ఐన)
తాన్ = తాను
కుశస్థలీ = కుశస్థలము అను పేరు గల
పుమునన్ = పట్టణున
యాదవ = యదువంశ
ప్రరముల్ = సమూహాలు
ఫజియింపగన్ = కొలుచుచుండగా
ఉన్నవాడు = ఉండినవాడు (ఐన)
కృషుడు = శీకృష్ణుడు
నీవు = నీవు (కుచేలుడు)
అరిగిన = వెళ్లిన
మిమ్మున్ = మమ్మి
చూచి = చూడగానే
అప్పుడు = సమయంలో
విభుండు = మహారాజు
అనూన = సాటిలేని
సంపదల్ = ఐశ్వర్యాలు
ఇచ్చును = ఇస్తాడు
భావం : కోరిన కోర్కెలు తీర్చేవాడు, సాధువులకు, భక్తులకు ఇష్టమైనవాడు, ఆర్తులను కాపాడేవాడు, లక్ష్మీపతి, దయాసముద్రుడు, దైవము అయిన శ్రీకృష్చుడు కుశస్థలీ పురంలో యాదవుల చేత కొలవబడుతున్నాడు. మీరు ఆయన దగ్గరకు వెడితే ఆయన మిమ్మల్ని చూచి సాటిలేని సంపదలిస్తాడని కుచేలునితో భార్య అంది.
4వ – పద్యం
నీవు చెప్పినయట్ల రాజీవనే(తు
పాద పద్మంబు లాశయయింపంగc జనుట
పరమ శోభనమా చక్రపాణికిపుడు
గానుకేమైనc గొంపోవcగలదె మనకు.
ప్రతిపదార్ధం :
నీవు = నీవు
చెప్పిన + అట్ల = చెప్పిన విధంగా
రాజీవనేతు = కమలాక్షుని (శ్రీకృష్ణుని)
పాదపద్మంబులు = పద్మాల వంటి పాడాలు
ఆశయింపంగన్ = శరణు వేడుటకు
చనుట = వెళ్లుట
పరమ శోభనము = చాలా శుభాలనిచ్చును
ఇప్పుడు = ఇప్పుడు
ఆ చక్రపాణిక = శ్రీకృష్డునికి
కానుక = బహుతిగా
ఏమి + ఐనా = ఏదైనా
కొన్ + పోవన్ = తుసుకి వెళ్లడానికి
మనకు = మనవద్డ
కలదె = ఉండా ?
భావం : నువ్వు చెప్సినట్లుగా పద్మనేత్రుడై ఆ శ్రీకృష్చుని పాద ప్మమాలను ఆశ్రయించడానికి మెడతాను. అది చాలా శుభాల నిస్తుంది. ఆ శ్రీకృష్టుడికి ఇవ్వడానికి మన దగ్గరేదైనా బహుమతి ఉందా ? అని కుచేలుడు తన భార్యతో అన్నాడు.
5వ – పద్యం
మ. కనిడాయంజను నంతఁ గృష్ణుడు దళత్కంజాక్షు డప్పేద వి
ఫ్రని నశాంత దరిద్ర పీడితుc గృశీ భూతాంగు జీర్ణాంబరున్
ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ గుచే
లుని నల్లంతనె చూచి సంఱ్రమ విలోలుండై దిగెన్ దల్పమున్
ప్రతిపదార్ధం :
దళత్కంజ + అక్షుడు = తామర రేకుల వంటి కళ్లు కలవాడు
కృష్డుడు = శ్రీకృష్డుడు
అంతన్ = అంతట
ఆ + పేద విప్రననన్ = ఆ పేద బ్రాహ్మణుని
అశాంత దరర్ర పీడితున్ = ఎల్లపుడూ దరిద్రంతో పీడింప బడేవానిని
కృశీభూతా + అంగు = & బక్కచిక్కిన శరీరం కలవానిని
జీర్ఙ + అంబరున్ = చిరిగిన బట్టలు కట్టుకొన్నవానిని
షున = గొప్బదైన
తృష్ణ = ఆశ చేత
ఆతుర = ఆత్రుత నిండిన
చిత్తు = మనసు గల వానిని
హాస్య నిలయున్ = హాస్యాస్పదుని
ఖండ = ముక్క అయిన
ఉత్తరీయున్ = ఉత్తరీయము కలవానిని (ఐన)
కుచేలుని = కుచేలుని (తన మిత్రుని)
అల్లంతనె = ఆంత దూరం నుండే
చూచి = చూచి
సంభ్రమ విలోలుండై = తొందరపాటుకు లోనైన వాడై
తల్పమున్ =మంచమును
దిగేనే = దిగెను
కని = చూచి
డాయన్ + చనును = సమీపికి వెళ్లను
భావం : తామర రేకుల వంటి కళ్లు గల శ్రీకృష్ణుడు బీద బ్రాహ్మణుడు, దరిడ్రం చేత బాధింపబడుతున్నవాడు, బక్క చిక్కికఐాడు, చిరిగిన బట్టలు కట్టుకొన్నపాడు, గొప్ప ఆశ, ఆత్రుత నిండిన మనసు గలవాడూ, హాస్యాస్పదుడు, ఉత్తరీయప ముక్క వేసుకొన్నఖాడూ అయిన కుచేలుని అంత దూరంలోనే చూచి పాన్పు దిగి, సమీపానికి వెళ్లెను.
6వ – పద్యం
క. దళమైన పుష్పమైనను
ఫలమైనను సలిలమైనఁ బాయని భక్తిన్
గొలిచిన జనులర్పించిన
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్.
ప్రతిపదార్ధం :
కొలిచిన = సేవించిన
జనులు = ప్రజలు
పాయని = విడువని
ఈక్తిన్ = భక్తితో
దళము + ఐన = పత్రైనా
పుషుము + ఐనను = పువ్వైనను
ఫలము + ఐనను = పండైనా
సలిలము + ఐవన్ = నీరైనా
అర్పించినన్ = నాకు ఇస్తే
రుచిర + అన్నముగనె = రుచికరమైన ఘోజనంలాగే
ఎలమిన్ = ఇష్టంతో
ఏను = నేను
భుజింతున్ = తింటాను
భావం : నన్ను కాలిచే భక్తులు నాకు పతతమైనా, పుష్పమైనా, పండైనా, నీరైనా భక్తితో సమర్పుస్తే రుచికరమైన భోజనం లాగే చాలా ఇష్టంతో తింటానని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు.
7వ – పద్యం
క. మీతో సఖ్యము చేయగc
జ్రేతోగతి నతడు వాంఛ చేయుచు నుండెన్
నా తోడ వార్తనంపెను.
వే తెలియగ మిమ్ము ఛలిత వేషము తోడన్.
ప్రతిపదార్ధం :
మీతో = మీతో (రామలక్ష్మణులతో)
స్నేహము = మైత్రిని
చేయగన్ = చేసే ఉద్దేశంతో
చేతో = చైతన్యంతో
అతడు = అతడు (సుగీవుడు)
వాంఛ = కోరిక
చేయుచును = పెంచుకొంటూ
ఉండెన్ = ఉన్నాడు
మిమ్ము = మీ గురించి
వే తెలియగ = తొందరగా తెలియడానికి
ఛలిత = మోసగింపబడినపాడు (సుగీవుడు)
వేషము తోడన్ = వేషంలో
నాతోడ = నా చేత
వార్తను = సమాచారాన్ని
అంపెను = పంపెను
భావం : మా రాజైన సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలని కోరుకొంటున్నాడు. అది తొందరగా తెలుసుకోఖాలని నా చేత వార్త పంపాడు. అని రామలక్ష్మణులతో హనుమ అన్నాడు.
8వ – పద్యం
ఆ. వె .మీరు మీరు కలిసి మితత్లులో మాకు
జక్షురస్తి భావచారితార్థ్
మఖిలసృష్టిసారమైనది యొక్కండె
యరయ సాధుజన సమాగమంబు.
ప్రతిపదార్ధం :
మీరు మీరు = మీరంతా
కలిసి = కలిసిపోయి
మితులు + ఔటయ = స్నేహితులు 5ావడం
మాకు = మాకు
చక్షుః = కళ్లకు
భావ = అర్థవంతమైన
చారితార్థ్యము = చరితార్థత పొందడం
అస్తి = అగును
అరయ = అలోచాంచగా
అఖిల సృష్టి = సమస్త సృష్టిలో
సారమైనది = గాప్పది
సాధుజన = మంచివారి
సమాగమంబు = కలయిక
ఒక్కండే = ఒక్కటే
భావం : మీరు, సుగ్రీవుడూ కలసి స్నేహితులు కావాలి. అది మాకు, కళ్లకు సార్థకతను చేకూరుస్తుంది. ఆలోచిస్తే ఈ సృష్టిలో సారవంతమైనది ఒక్కటే ఉంది. అదే సాధుజన సమాగమం.
9వ – పద్యం
మధ్య. ఈ మేనిలోపలఁ బ్రాణ మెన్నాళ్ళు లెసలారుచుండు
నీ మైత్రి యన్నాళ్ళు నాకు నిరుపాయనిర్ణిద్ర మొప్పు
నీ మేని లోపలc బ్రాణ మెన్నాళ్ళు లెసలారుచుండు
నీ మైత్రి యన్నాళ్ళు నాకు నిరపాయనిర్ణిద్ర మొప్పు
ప్రతిపదార్ధం :
మేనిలోపలన్ = శరీరంలో
ప్రాణము = జీవము
ఏ + నాళ్ళు ఎంతకాలం
ఎసలారుచుండు = ఏ్రకాశస్తుందో
ఆ + నాళ్ళు = అంతకాలం
నీ మైత్రి = స్నేహం
నాకు = నాకు (రామునికి)
నిర్ణిద్రము = వి(శాంతి లేకుండా
నిః + అపాయము = అపాయాలు లేకుండా
ఒప్పును = అతిశయిస్తుంది
ఈ మేనిలోపలన్ =ఈ ఈరంరో
ప్రాణము = జీవు
ఏ + నాళ్ళు = ఎంతకాలం
ఎసలారుచుండు = ప్రకాశిస్తుందో
ఆ + నాళ్ళు = అంతకాలం
నీ మైత్తి = నీ స్నేహం
నాకు = నాకు (సుగ్రీవునికి)
నిర్ణద్రము = విశ్రాంతి లేక
నిరపాయము = రక్షణను
ఒప్పు = అతిశయిస్తుంది
భావం:తాము ప్రాణాలతో ఉన్నంతకాలం తమ స్నేహం వలన అవిశాాంతమైన రక్షణ పరస్పరం కలుగుతుందని శ్రీరామ సుగ్రీవులు ప్రమాణం చేసుకొన్నారు.
10వ – పద్యం
కం. సమ శీల (శుతయుతులకు
సమధనవంతులకు సమసు చారిత్రులకుం
దమలో సఖ్యమును వివా
హమునగుఁగా కగునె రెండునసమానులకున్
ప్రతిపదార్ధం :
సమ = సమానమైన
శీల = స్వభావ
శ్రుతయుతులకు = వి్యావంతులకు
సమ = సమానమైన
ధనవంతులకు = సంపన్నులకు
సమ= సమానమైన
సుచారిత్రులకున్ = మంచి చరీత కలవారికీ
తమలో = పరస్పరం
సఖ్యమును = స్నేహము
విమాహమున్ = పెళ్లి
అగునె = జరుగుతాయి
కాక = అంతేకాకుండా
అసమానులకున్ = సమానులు కానివారికి
రెండును స్నేహం, పెళ్ళి అనే రెండూ
అగునె = ఔతాయా (కుదరవు)
భావం: సమానమైన స్వభావం, విద్య, సంపద, చరిత్ర కలవారికి మాత్రమే పరస్పరం స్నేహం, వివాహాలు జరుగుతాయి. సమానులు కాని వారితో కుదరవు అని చ్రుపదుడు ద్రోణునితో అన్నాడు.
11వ – పద్యం
చ. ధనపతితో దరిద్రునకు దత్వవిదుండగు వానితోడ మూ
ర్ఖునకు బ్రశాంతుతోడ గడు గ్రూరునకున్, రావణశూరు తోడ భీ
రునకు, వరూధితోడ నవరూధికి, సజ్జనుతోడ గష్టదు
ర్జనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడగూడ నేర్చునే
ప్రతిపదార్ధం :
ధనపతితో = ధనవంతునితో
దరిద్రునకు = పేదవానికి
తత్వవిడుండు + అగువానితో = తత్వవేత్తతో
మూర్ఖునకున్ = మూర్ఖుడికి
ప్రశాంతుతోడ = ప్రశాంతంగా ఉండేవానితో
కడు (కూరునకున్ = చాలా దుర్మార్రునిక
రావణశూరు తోడ = మహావీరునితో
భీరునకు = పిరికివానికి
వరూధితోడన్ = కవచం కలవానితో
అవరూధిక = కవచం లేనివానితో
సత్ + జనుతోడన్ = మంచివానితో
కష్ట దు: + జనునకు = చెడ్డవానికి
ఏ + విధంబునను = ఏ విధంగానైనా
సఖ్యము = స్నేహం
తాన్ = అది
ఒడగూడ = కలుగుటకు
నీర్చునే = ప్రయత్నించదు (ప్రయుత్నించదు)
భావం : ధనవంతునితో పేదకు, జ్ఞానితో మూర్థునకు శాంతపరునికి దుర్మార్గునితో, పరాక్రమవంతునితో పిరికివానికి కవచం ఉన్నతానికి కవచం లేనిహానితో, మంచిహానికి చెడ్డవానితో స్నేహం కలవడం ఏ విధంగానూ సాధ్యం కాదని ద్రోణునితో ద్రుపదుడు అన్నాడు.
12వ – పద్యం
క. బృహదబ్ధి మేఖలాఖిల
మహీతల క్షత్రవర సమక్షమున మహా
మహిమాన్వితుగా నన్నును
మహీశుగా జేసి తతి సమర్థత వెలయన్.
ప్రతిపదార్ధం :
బృహత్ = పెద్దనైన
అబ్ధి = సముద్రం
మేఖల = మొల నూలుగా గల
అఖిల = అనంతమైన
మహీతల = ధూమండల
క్షత్రవ = రాజ(శేష్లుల
సమక్షమున = ఎడురుగా
నన్నును = నన్ను (కర్ణుని)
మహిమ + అన్వితుగా = గొప్పవానిగా
అతి = గొప్ప
సమర్థత = సామర్థ్యం
వెలయన్ = ప్రకాశించగా
మహి + ఈశుగాన్ = రాజుగా
చేసితి = చేశావు
భావం : మహాసముద్రం మొలనూలుగా గల భూమండలంలోని గొప్పరాజుల సమక్షంలో నున్న గొప్పవానిగా నా సమర్థత ప్రకాశించేలా నన్ను రాజుగా చేశావు అని దుర్యోధనునితో కర్ణుడు అన్నాడు.
13వ – పద్యం
సీ. కలలోన నేనియుc గపటకృత్యము లేక
కడసాగు గుణముల కలిమి చెలిమి
ధన మనో వంచకత్వము లేశమును లేక
యేపు దీపించిన యెలమి చెలిమి
యొండొరు మదులలో నారపారలు లేక
ప్రాపు దాఁపున నైన బలిమి చెలిమి
ప్రాణంబు ప్రాణంబు లై వింత లెదలేక
హత్తిన దగు జయం బలిమి చెలిమి.
తే. కెలని కెడ మీక తగువగల్ గలిమి, చెలిమి
చూచి వారించుc బెఱవారిఁ జులిమి చెలిమి
నూళ్ళొ సంగనిరిపులచే నులిమి చెలిమి
చెప్పనిక నేల వారల చెలిమి బలిమి
ప్రతిపదార్ధం :
కలలోనన్ = కలలో కూడా
కపటకృత్యము = మోసపు పని
లేక = లేకుండా
కడసాగు = చివరిడాకా ఉండే
గుణముల = స్వభావాల
కలమమ = సంపద
చెలిమి = స్నేహం
ధన = కనం కోసం
మనః = మనసలో
వంచకత్వము = మోసపుగుణం
లేశమును = కొగ్ది కూడ
లేక = లేకుండా
ఏపు = అష్వృద్ధిత
దీపించిన = ప్రకాశిం
ఎలమి = ఇష్టం
చెలిమి = స్నేహం
ఒండొరు = పరస్పరం
మదులలోన్ = మనసులో
ఒరపారలు = అరమరికలు
లేక = లేకుండా
ప్రాపు = ఆశయం
దాపునను + ఐన = చాటున కూడా
బలిమి = బలాన్ని కల్గించేది
చెలమ = స్నేహం
ప్రాణంబు = జీవునకు
పాణంబులు + ఐ = జీపాలై
వింతలు = ఆశ్చర్యాలు
ఎద = మనసులో
లేక = లేకుండా
హత్తిన = చేరి
తగు = తగినటువంటి
జయం = విజయం యొక్క
బలిమి = బలమే
చెలిమి = స్నేహం
కెలనికి = మరొక పార్య్వానికి
ఎడమీక = చోదివ్వక
తగువగల్ = తగి వయ్యారాల
కలిమి = సంపద
చెలిమి = స్నేహం
పెరవారి = ఇతరుల
జులిమి = దౌర్జన్యం
చూచి = కని
చెలిమి = స్నేహం
వారించున్ = నివారిస్తుంది
నూళ్ళు + ఒసంగని = దారాలు కూడా ఇవ్వని
రిపులచే = శతువుల చేతలను
నులిమి = పెల్లగించేది
చెలిమి = స్నేహం
ఇక = ఇంకా
వారల = వారి యొక్క
చెలి బలిమి = స్నేహ బలాన్ని గూర్చ
ఇక = ఇంకా
చెప్పను = చెప్పడం
ఏల = ఎందుకు ?
భావం: కలలో కూడా మోసం చేయకుండా చివరిడాకా సాగే స్వభాఖాల బలం స్నేహం. ధనం, మనస్సు వంటి వాటిలో మోసం చేయక వృద్ధి చెందేదే స్నేహం. పరస్పరం అరమరికలు లేకుండా పరస్పరా(శయంలో వృద్ధి చెందేదే స్నేహం. ప్రాణానికి ప్రాణమై ఆశ్చర్యాలు, ఎడబాట్లు లేకుండా హత్తకొని విజయానికి బలం ఇచ్చేది స్నేహం. మరొక వైపుకు స్థానం ఇవ్వకుండా వయ్యారాలు పోయేది స్నేహం. ఇతరుల దౌర్జన్యాన్ని చూచి నివారించేది స్నేహం. దారాలు కూడా ఇవ్వని శత్రువుల చేతలను. పెల్లగించేది స్నేహం. వాళ్ళ స్నేహం గురించి ఇంకా చెప్పడ మెందుకు ?
కవులు పరిచయం
1. నన్నయ :
కాలం : 11వ శతాబ్ది
రచనలు : ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర మహాభారతం 2 1/2 పర్వాలు
ఉద్యోగం : రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి
బిరుదులు : ఆదికవి, వాగనుశాసనుడు
ప్రత్యేకత : కవిత్రయంలో మొదటివాడు.
2. బమ్మెర పోతన :
కాలం : 15వ శతాబ్ది
రచనలు : శ్రీమదాంధ్ర మహాభాగవతం, భోగినీ దండకం, నారాయణ శతకం, వీరభద్ర విజయం
బిరుదు : సహజపండితుడు
3. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ :
కాలం : 20వ శతాబ్దం (10.09, 1895)
తల్లిదండ్రులు : గురువు
గురువు : తిరుపతి వేంకట కవులలో ఒకరైన చళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు.
స్వగ్రామం : కృష్ణాజిల్లా నందమూరు
ఉద్యోగం : అధ్యాపకులు
రచనలు : రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది) వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి, ఏకవీర మొదలైనవి.
బిరుదు : కవి సమ్రాట్
ఉద్దేశం
స్నేహానికి విశ్వాసం మూలమని గౌతమబుద్ధుని అభిప్రాయం. అవసరకాలంలో ఆదుకొనే మిత్రుడికన్నా ఇష్టమైనదేదీ ఉండదని గురునానక్ అభిప్రాయం. కష్టకాలంలోనే మిత్రుడి విలువ తెలుస్తుందని గాంధీగారన్నారు. స్నేహం ఒక మధురానుభూతి. చిన్నతనంలో స్నేహం ఏర్పడుతుంది. అది కాలక్రమేణా మహా వృక్షమౌతుంది. జీవితాంతం తోడు నీడగా నిలబడుతుంది. కొందరి స్నేహం అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది. కొందరి స్నేహం అధః పాతాళానికి చేరుస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్రను స్నేహమే పోషిస్తుంది. మనం ఎటువంటి స్నేహం ఎంచుకోవాలో దాని వలన కలిగే ప్రయోజనం తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
ప్రక్రియ – పద్యం
ఛందోబద్ధ నియమాలు కలది పద్యం. గణాలు, యతి, ప్రాసలు మొదలైనవి తప్పనిసరిగా పాటించాలి. సాధారణంగా వ్యాకరణ దోషాలు ఉండకూడదు. దుష్ట సంధులు, దుష్ట సమాసాలు ప్రయోగించకూడదు. పెద్దలు రచించిన పద్యాలలో వలెనే సాగాలి. అర్థ దోషం, భావ దోషం మొదలైనవి ఉండకూడదు. అన్యభాషా పద ప్రయోగాలు తక్కువగా ఉండడం మంచిది. ఇవి వృత్తాలు, జాతులు, ఉపజాతులు అనే రకాలుగా ఉంటాయి.
పాఠ్యభాగ వివరాలు
ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం, పోతన రచించిన శ్రీమద్భాగవతం, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షం గ్రంథాల నుండి గ్రహింపబడినది.