AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

These AP 9th Class Telugu Important Questions 5th Lesson స్నేహం will help students prepare well for the exams.

స్నేహం AP Board 9th Class Telugu 5th Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది పరిచిత పద్యాలను చదివి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. సరస జేరి విన్ను సంస్తవ మొనరించు
వారలెల్ల పఖులుగారు నీకు
కష్టకాలముందు గాచు వాడొక్కండె
నిక్కమైన సఖుడు నీకు దలప

ప్రశ్నలు – జవాబులు

అ) ఎటువంటి వారంతా, స్నేహితులు కారు?
జవాబు:
మన పక్కన చేరి పొగిడేవారు స్నేహితులు కారు.

ఆ) నిజమైన మిత్రుడు ఎవరు?
జవాబు:
కష్టకాలంలో ఆదుకొనేవాడే నిజమైన మిత్రుడు.

ఇ) ఈ పద్యంలో కవి దేనిని గురించి చెప్పాడు?
జవాబు:
ఈ పద్యంలో కవి స్నేహం గురించి చెప్పాడు.

ఈ) పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలో స్నేహితునకు పర్యాయపదంగా ఏది ఉపయోగించారు?

2. మైత్రిం బోలెడు ధర్మము
ధాత్రీ దివిజులకు లేదు దాని నడపినం
బుత్రా యేకర్మంబు ప
విత్రతయును వలవదది వివేకము జేర్చున్

ప్రశ్నలు – జవాబులు

అ) అన్నిటి కంటే గొప్పదేది?
జవాబు:
అన్నిటి కంటే స్నేహం గొప్పది.

ఆ) పై పద్యం ఎవరికి చెప్పారు?
జవాబు:
పై పద్యం పుత్రునకు చెప్పారు.

ఇ) స్నేహం దేని కంటే పవిత్రమైనది?
జవాబు:
స్నేహం అన్నిటి కంటే పవిత్రమైనది.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
దివిజులంటే ఎవరు?

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

3. నీవు చెప్పినయట్ల రాజీవనేత్రు
పాద పద్మంబు లాశ్రయింపంగఁ జనుట
పరమ శోభనమా చక్రపాణికిపుడు
గానకేమైనఁ గొంపోవఁగలదె మనకు

ప్రశ్నలు – జవాబులు

అ) కానుక ఎవరికి?
జవాబు:
కానుక కృష్ణునకు.

ఆ) పరమశోభనమైనది ఏది?
జవాబు:
కృష్ణుని దగ్గరకు వెళ్ళడం పరమ శోభనం.

ఇ) ఆశ్రయింపవలసినవేవి?
జవాబు:
శ్రీకృష్ణుని పాదపద్మాలాశ్రయించాలి.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలో కృష్ణునకు పర్యాయపదాలేవి?

4. దళమైన పుష్పమైనను
ఫలమైనను సలిలమైనఁ బాయని భక్తిన్
గొలిచిన జమలర్పించిన
నెలమిన్ రుచిరాన్నముగనె యేమ భుజింతున్.

ప్రశ్నలు – జవాబులు

అ) ఎలా సమర్పించాలి?
జవాబు:
భక్తితో సమర్పించాలి.

ఆ) ఎవరర్పించాలి?
జవాబు:
భక్తులర్పించాలి.

ఇ) ఎలా భుజిస్తాడు?
జవాబు:
రుచికరమైన భోజనంలా భుజిస్తాడు.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలో ‘ఏను’ అంటే ఎవరు?

5. మీతో సఖ్యము చేయగఁ
త్రేతోగతి నతడు వాంఛ చేయుచు మండెన్
నా తోడ వార్తనంపెను.
వే తెలియగ మిమ్ము ఛలిత వేషము తోడన్.

ప్రశ్నలు – జవాబులు

అ) దేనిని పంపెను?
జవాబు:
వార్తను పంపెను.

ఆ) ఎందుకు వార్తను పంపాడు?
జవాబు:
స్నేహం చేయడానికి వార్తను పంపాడు.

ఇ) ఎవరితో స్నేహం చేయడానికి?
జవాబు:
రామలక్ష్మణులతో స్నేహం చేయడానికి.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలో ఎవరు ఎవరితో అన్నారు?

6. మీరు మీరు కలిసి మిత్రులౌటయ మాకు
జక్షురిస్తే భావచారితార్థ్య
మఖిలసృష్టిసారమైనది యొక్కండె
యరయ సాధుజన సమాగమంబు

ప్రశ్నలు – జవాబులు

అ) సృష్టిలో సారవంతమైనది ఏది?
జవాబు:
సృష్టిలో మంచివారి కలయిక సారవంతమైనది.

ఆ) ఇద్దరూ కలిసి ఏమవ్వాలి?
జవాబు:
ఇద్దరూ కలిసి మిత్రులవ్వాలి.

ఇ) కన్నుల పండుగేది?
జవాబు:
మంచివారి కలయిక చూడడం కన్నుల పండుగ.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యం ఎవరు చెప్పారు?

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

7. సమ శీల శ్రుతయుతులకు
సమధనవంతులకు సమను చారిత్రులకుం
ధనలో సఖ్యమును వివా
హమునగుఁగా కగునె రెండునసమానులకున్

ప్రశ్నలు – జవాబులు

అ) ఎవరెవరికి స్నేహం కుదరదు?
జవాబు:
సమానం కానివారికి స్నేహం కుదరదు.

ఆ) సంపదలలో వ్యత్యాసం ఉంటే స్నేహం కుదురుతుందా?
జవాబు:
సంపదలలో వ్యత్యాసం ఉంటే స్నేహం కుదరదు.

ఇ) పై పద్యంలో వేటి గురించి చెప్పారు?
జవాబు:
పై పద్యంలో స్నేహం, పెళ్లి గురించి చెప్పారు.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలో మైత్రికి పర్యాయపదమేది?

8. బృహదబ్ధి మేఖలాఖిల
మహీతల క్షత్రవర సమక్షమున మహా
మహిమాన్వితుగా నన్నును
మహీశుగా జేసి తతి సమర్థత వెలయన్

ప్రశ్నలు – జవాబులు

అ) భూమాతకు మొలనూలేది?
జవాబు:
భూమాతకు సముద్రం మొలనూలు.

ఆ) ఎవరిని రాజుగా చేశాడు?
జవాబు:
కర్ణుని రాజుగా చేశాడు.

ఇ) ఎవరి ఎదుట రాజుగా చేశాడు?
జవాబు:
రాజుల ఎదుట రాజుగా చేశాడు.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
రాజుగా చేసినదెవరు?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

I. ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
స్నేహ ధర్మాన్ని, స్నేహం గొప్పతనాన్ని తిక్కన చెప్పిన విధమెట్టిది?
జవాబు:
మిత్రత్వమునకు సమానమైన ధర్మం భూమండలంలో లేదు. స్నేహాన్ని నడిపించేది స్నేహధర్మం. ఇది మిక్కిలి పవిత్రమైంది. కాబట్టి ప్రతి మనిషి తమ జీవితంలో మంచి మిత్రుల్ని పొందాలి. మైత్రీ మాధుర్యాన్ని అనుభవించాలి. స్నేహితులు లేని జీవితం నిస్సారంగా ఉంటుంది.

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

ప్రశ్న 2.
మిత్రులు ఎన్ని రకాలు? ఉదాహరణలిమ్ము.
జవాబు:
మిత్రులు ఉత్తమ, మధ్యమ, అధమ మిత్రులని మూడు రకాలుగా ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి వారి స్వభావాన్ని తెలిపే కథలు, అన్ని కాలాల్లో, అన్ని వాఙ్మయాల్లోనూ కనిపిస్తాయి. అందులో శ్రీకృష్ణ కుచేలుల మైత్రి, శ్రీరామ సుగ్రీవుల స్నేహం, దుర్యోధన కర్ణుని మిత్రత్వం, ద్రోణుడు ద్రుపదుని సఖ్యం ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

II. ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నిజమైన స్నేహితుని లక్షణాలేవి? వివరించండి.
జవాబు:
నిజమైన స్నేహితుడు నిరంతరం పొగడడు, మంచి ఉంటే మెచ్చుకొంటాడు. చెడులక్షణాలుంటే వాటిని ఎత్తిచూపుతాడు,

నివారిస్తాడు, చెడ్డమార్గంలో ప్రయాణించనివ్వడు, ఎప్పుడూ పొగుడుతూ ఉండేవాడు నిజమైన స్నేహితుడు కాదు, నిజమైన స్నేహితునితో మన రహస్యాలు చెప్పినా ఎవ్వరికీ చెప్పడు, మంచి మంచి సలహాలు చెబుతాడు, మనలో ఉన్న మంచి లక్షణాలను మెచ్చుకొంటాడు, అవి పదిమందికీ చెబుతాడు. అర్హతకు తగిన గౌరవం లభించేలా చేస్తాడు. కష్టసమయంలో విడిచిపెట్టడు. తోడు నీడగా నిలబడతాడు, కష్టాలలో పాలుపంచుకుంటాడు. వాటి నివారణకు శాయశక్తులా కృషిచేస్తాడు. కష్టాలను నివారించేదాకా విశ్రమించడు. ధనం లేనపుడు అడగకుండానే ధనసహాయం చేస్తాడు. తన వద్ద లేకపోతే అప్పుచేసి ఐనా సహాయపడతాడు. బంధువుల కంటే, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల కంటే ఎక్కువగా సహాయపడేది నిజమైన స్నేహితులే. అందుకే మంచి స్నేహితులను వదులుకోకూడదు.

ప్రశ్న 2.
స్నేహాన్ని మించిన ధర్మంలేదని తిక్కనగారెందుకన్నారు?
జవాబు:
అన్ని ధర్మాలకంటే ఉత్తమమైనది స్నేహధర్మం, ఎందుకంటే ఎవ్వరూ చేయలేని సహాయాన్ని స్నేహం చేస్తుంది. సీతాన్వేషణలో రాముడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. సీతను ఎవరు, ఎక్కడికి ఎత్తుకు పోయారో తెలియని స్థితి. అసలు బ్రతికుందోలేదో తెలియని స్థితి, ఆ స్థితిలో సుగ్రీవుడు స్నేహితుడయ్యాడు. సీతాన్వేషణలో తన వారి ద్వారా సహాయపడ్డాడు, వారధి కట్టడానికి, రావణుని చంపడానికి కీలకపాత్ర పోషించాడు. అదీ స్నేహధర్మం యొక్క గొప్పతనం.

సుగ్రీవుని వాలి భయపెట్టాడు, చంపడానికి ప్రయత్నించేడు, సుగ్రీవుని భార్యను, రాజ్యాన్ని అపహరించాడు, వాలిని ఏమీ చేయలేని స్థితిలో సుగ్రీవుడున్నాడు. అటువంటి క్లిష్టపరిస్థితులలో శ్రీరామస్నేహం లభించింది, రాముడు వాలిని చంపాడు. గృహలక్ష్మిని, రాజ్యలక్ష్మినీ సుగ్రీవుడు తిరిగి పొందేడు, అది కూడా స్నేహధర్మం వల్లనే సాధ్యమయింది.

దరిద్రుడైన కుచేలుడు సంపన్నుడు కావడానికి శ్రీకృష్ణునితో బాల్య స్నేహమే కారణం. అందరిచేతా అవమానింపబడే కర్ణుడు అంగరాజు కావడానికి దుర్యోధనుని స్నేహమే కారణం. స్నేహధర్మాన్ని పాటించిన స్నేహితులకు దేనికీ లోటుండదు. కనుకనే తిక్కనగారు అన్ని ధర్మాల కంటే స్నేహధర్మం గొప్పదన్నారు.

III. సృజనాత్మక ప్రశ్నలు

ప్రశ్న 1.
స్నేహం గొప్పతనాన్ని వివరిస్తూ స్నేహితునికి లేఖ రాయండి.
జవాబు:

నూజివీడు,
X X X X X,

ప్రియమైన మిత్రునకు,

నేను క్షేమము. నీవు క్షేమమని తలుస్తాను. ఈ రోజు మాకు తెలుగులో స్నేహం అనే పాఠం తెలుగుమాష్టారు చెప్పారు. చాలా ఆసక్తికరంగా ఉంది. సృష్టిలో స్నేహం కన్నా గొప్ప బంధుత్వం లేదనిపించింది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది స్నేహమైనప్పుడు, మనం ఎటువంటి స్నేహాన్ని ఎంచుకోవాలో ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలేవో తెలుసుకున్నాను. స్నేహానికి సంబంధించిన పురాణగాథలను విన్నాను. బాల్య స్నేహంలో ఉన్న గొప్పతనం, సత్పురుషుల స్నేహం వల్ల లోక కల్యాణం జరుగుతుందని గ్రహించాను. స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించాను. నేను కూడా జీవితంలో ఒక మంచి స్నేహితుణ్ని సంపాదించుకుంటాను. శ్రీరామ సుగ్రీవుల వలె జీవితాంతం కలిసి ఉంటాను. కాని స్నేహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకున్నాను. విజ్ఞత ప్రదర్శించాలి. సన్మార్గం వైపు నడిపించ.. గలరని నమ్మిన వారితో స్నేహం పెంచుకోవాలి. మైత్రీ మాధుర్యాన్ని పంచుకోవాలి. సుఖమయ జీవితాన్ని కొనసాగించాలి. కనుక నీవు కూడా స్నేహం చెయ్యడంలో గల విజ్ఞతను ఎలా సంపాదించాలో వెంటనే ఉత్తరం రాయి.
ఉంటా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. నాగేశ్వరావు,
9వ తరగతి.

చిరునామా :
పి. రామారావు, 9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
పటమట, విజయవాడ.

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

ప్రశ్న 2.
నీకు తెలిసిన కవులెవరైనా స్నేహం గురించి కవిత వ్రాస్తే, సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
స్నేహగతి
తైలాలు లేకుండా వెలిగేటి దీపం
విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం
హృదయాలలో ఎప్పుడూ నిలిచేటి దీపం
నిజమైన దీపం మా స్నేహదీపం
మనసులో దీపం మలిపితే పొపం

వర్గాలు వర్గాలు వదిలితే స్నేహం
వేషాలు, రోషాలు మానితే స్నేహం
ప్రాణాల నర్పించగలిగితే స్నేహం
కష్టాల, నష్టాల నోర్చితే స్నేహం ॥మనసులో దీపం॥

నిరుపేద అయితేమి ఎవరైతే ఏమి?
చదువేమి రానట్టి చనటయితే ఏమి ?
అందాలు చందాలు లేకుంటె ఏమి?
నిన్ను కాచిన వాడే నిజమైన నేస్తం ॥మనసులో దీపం॥

దోస్తీని మించింది లేదు లోకాన
రత్నాలకంటె అది మిన్న తూకాన
మిత్రుడె కావాలి సుఖమున శోకాన
అతడు లేకున్నచో నగరమే కాన ॥మనసులో దీపం॥

చీకట్లలో దారి చూపేది నేస్తం
కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తం
మనలోని లోపాలు తెలిపేది నేస్తం
నిజమైన మనిషిగా నిలిపేది నేస్తం ॥మనసులో దీపం॥

భాషాంశాలు

అలంకారాలు

ఈ క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి.

1. శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ
జవాబు:
లాటానుప్రాసాలంకారం

2. నీటిలో పడిన తేలు తేలుతుందా
జవాబు:
లాటానుప్రాసాలంకారం

గణవిభజన పద్యపాదం పేరు

కింది పద్య పాదానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్య పాదమో రాయండి.

1. వరదుడు సాధుభక్తజన వత్సలుదార్త శరణ్యుడిందిరా
జవాబు:
AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం 1

2. కనిదాయంజను నంతఁ గృష్ణుడు దళత్కంజాక్షు డప్పేద వి
జవాబు:
AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం 2

అర్థాలు

అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.

1. ఉపకారం చేసిన వాడే దేవుడు అంటారు.
జవాబు:
దైవం

2. వీలు ఉన్నంతవరకు అసత్యం పలుకరాదు.
జవాబు:
అవకాశం

3. జ్ఞానం ఉన్నవారు దేనినైనా సాధించగలరు.
జవాబు:
తెలివి

4. అష్ట దిక్పాలకులు ఉన్నారు.
జవాబు:
ఎనిమిది

5. విద్యావంతుడే నిజమైన శ్రీమంతుడు.
జవాబు:
సంపద కలవాడు

6. సులభ వరదుడు శివుడు.
జవాబు:
వరములనిచ్చేవాడు

7. గజ ప్రకరములు ఊళ్ళపై దాడి చేశాయి.
జవాబు:
సమూహములు

8. చక్రపాణి గజేంద్రుని రక్షించెను.
జవాబు:
విష్ణువు

9. మాంస ఖండము నక్క ఎత్తుకు పోయెను.
జవాబు:
ముక్క

10. జ్ఞానతృష్ణ ఉండాలి.
జవాబు:
కోరిక

11. మిత్రుడు సాదరంగా ఆహ్వానించాడు.
జవాబు:
ఆదరణగా

12. ఏ పనినైనా ఎలమితో చేయాలి.
జవాబు:
ఇష్టం

13. నిర్నిద్రముతో చదవాలి.
జవాబు:
విశ్రాంతి లేకుండా

14. గురు సంస్తవము చేయాలి.
జవాబు:
పొగడ్త

15. మంచి తలపు మంచికి మార్గము.
జవాబు:
ఆలోచన

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

ఆ) గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.

1. విద్యచే దారిద్య్రం నివారించబడును.
అ) అజ్ఞానం.
ఆ) పేదరికం
ఇ) మూర్ఖత్వం
ఈ) అవివేకం
జవాబు:
ఆ) పేదరికం

2. ఇంటిని పవిత్రముగా ఉంచాలి.
అ) పాతివ్రత్యము
ఆ) శుభ్రము
ఇ) చల్లదనము
ఈ) పునీతము
జవాబు:
ఈ) పునీతము

3. ధర్మమును అడపు వారు నశిస్తారు.
అ) అణచు
ఆ) పాటించు
ఇ) బోధించు
ఈ) చూచు
జవాబు:
అ) అణచు

4. కృష్ణ కుచేలురు బాల్య సఖులు.
అ) బంధువులు
ఆ) విరోధులు
ఇ) స్నేహితులు
ఈ) విద్యార్థులు
జవాబు:
ఇ) స్నేహితులు

5. ఎప్పటిపనులు అప్పుడే ఒనరించడం మంచిది.
అ) సాధించడం
ఆ) చేయడం
ఇ) చెప్పడం
ఈ) వినడం
జవాబు:
ఆ) చేయడం

6. ఆవుకు పులి తారసపడింది.
అ) వైరము
ఆ) కలిసింది
ఇ) చంపింది
ఈ) వదిలింది
జవాబు:
ఆ) కలిసింది

7. స్నేహం కులమతాలకు అతీతం.
అ) మంచిది
ఆ) గొప్పది
ఇ) మించినది
ఈ) ముంచునది
జవాబు:
ఇ) మించినది

8. దుష్టులతో స్నేహము నిస్సారముగా ఉండును.
అ) విరోధం
ఆ) గొడవ
ఇ) రగడ
ఈ) సారములేనిది
జవాబు:
ఈ) సారములేనిది

9. అర్జునుడు అనూన ప్రతిభావంతుడు.
అ) మంచి
ఆ) గొప్ప
ఇ) సాటిలేని
ఈ) పేద
జవాబు:
ఇ) సాటిలేని

10. నూతన వస్త్రము ధరించాలి.
అ) గృహము
ఆ) బట్ట
ఇ) వాహనము
ఈ) ఆభరణము
జవాబు:
ఆ) బట్ట

11. కిరణ్ తెలివికి సంభ్రమం కలిగింది.
అ) తొందరపాటు
ఆ) ఆనందం
ఇ) చిరాకు
ఈ) దయ
జవాబు:
అ) తొందరపాటు

12. సీతారామకళ్యాణానికి మణిమయ వేదిక నిర్మించారు.
అ) తాటాకులతో కూడినది
ఆ) బంగారంతో కూడినది
ఇ) మణులతో కూడినది
ఈ) ధనంతో కూడినది
జవాబు:
ఇ) మణులతో కూడినది

13. ధర్మమును పాయని వాడు శ్రీరాముడు.
అ) చెప్పని
ఆ) విడువని
ఇ) కోర
ఈ) వినని
జవాబు:
ఆ) విడువని

14. పెళ్ళికి అందలములో ఊరేగుతారు.
అ) అకార
ఆ) రథము
ఇ) పల్లకి
ఈ) ఓడ
జవాబు:
ఇ) పల్లకి

15. చెడుమాటలకు మనసు వికలము అవుతుంది.
అ) గట్టిగా
ఆ) మెత్తగా
ఇ) బాధగా
ఈ) ముక్కలు
జవాబు:
ఈ) ముక్కలు

పర్యాయపదాలు

అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.

1. మంచి వారి స్నేహం విడువకూడదు.
జవాబు:
మైత్రి, సఖ్యము

2. సుభద్ర శ్రీకృష్ణుని తోబుట్టువు.
జవాబు:
సోదరి, సహోదరి

3. లోకములో మంచి చెడులు రెండూ ఉంటాయి.
జవాబు:
జగతి, జగము

4. చట్టానికి ఎవరూ అతీతులు కారు.
జవాబు:
మించినవారు, ఎక్కువవారు.

5. కాకి అరుపు బంధువుల రాకను సూచిస్తుంది.
జవాబు:
కాకము, వాయసము

6. అవసరం కోసం సంస్తవం చేయటం హీనగుణం.
జవాబు:
పొగడ్త, నుతి

7. రాజీవము సూర్యప్రియ.
జవాబు:
కమలము, పద్మము

8. మారేడు దళము శివునికి ప్రీతి.
జవాబు:
ఆకు, పత్రము

9. యతికి బంధాలు ఉండవు.
జవాబు:
సన్యాసి, పరివ్రాజకుడు

10. చినుకుకు ధాత్రి పులకిస్తుంది.
జవాబు:
పుడమి, భూమి

11. గోళ్ళు కొరక రాదు.
జవాబు:
నఖములు, కరరుహములు

12. జ్ఞాన అన్వేషణ గొప్పవారి లక్షణం.
జవాబు:
పరిశోధన, వెతకుట

13. గొప్పవారి సమాగమము గొప్పగానే ఉంటుంది.
జవాబు:
కలయిక, సమావేశము

14. పెరవారు ఎప్పటికీ నా వారు కారు.
జవాబు:
పరులు, ఇతరులు

15. కల్తీ చేసిన బీజము చల్లితే రైతుకు నష్టము.
జవాబు:
విత్తనము, విత్తు

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.

1. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం.
అ)జనని, జగతి
ఆ) మాత, మమత
ఇ) జనని, మాత
ఈ) పిన్ని, పిన్నమ్మ
జవాబు:
ఇ) జనని, మాత

2. సృష్టికర్త కూడా తల్లికి కొదుకే,
అ) బ్రహ్మ, బ్రాహ్మణుడు
ఇ) నలువ, కలువ
ఇ) బ్రహ్మ, నలువ
ఈ) వలువ, నలువ
జవాబు:
ఇ) బ్రహ్మ, నలువ

3. కాకిలా కలకాలం జీవించడం వృథా.
అ) ఎల్లపుడు, సదా
ఆ) ఇప్పుడు, అప్పుడు
ఇ) అలా, ఇలా
ఈ) అక్కడ, ఇక్కడ
జవాబు:
అ) ఎల్లపుడు, సదా

4. సుగ్రీవుని ఆజ్ఞ అనుల్లంఘనీయం.
అ) విజ్ఞప్తి, విజ్ఞాపన
ఆ) కోరిక, ఆశ
ఇ) పిలువు, ఆహ్వానం
ఈ) ఉత్తర్వు, ఆనతి
జవాబు:
ఈ) ఉత్తర్వు, ఆనతి

5. రాముని భార్య సీత.
అ) పడతి, వనిత
ఆ) సతి, అర్ధాంగి
ఇ) సతి, పతి
ఈ) పత్ని, భరణం
జవాబు:
ఆ) సతి, అర్ధాంగి

6. మన ధర్మమే మనను కాచును.
అ) కాపాడును, రక్షించును
ఆ) పోషించును, కాపాడును
ఇ) పెంచును, ఉంచును
ఈ) ఒంచును, మించును
జవాబు:
అ) కాపాడును, రక్షించును

7. ఇందిర దయతో దరిద్రం పోయింది.
అ) మంత్రి, ప్రధాని
ఆ) నేత, నాయకురాలు
ఇ) రమ, లక్ష్మి
ఈ) ప్రభుత్వం, రాజ్యం
జవాబు:
ఇ) రమ, లక్ష్మి

8. దయలేని వారిని క్రూరులు అంటారు.
అ) డబ్బు, ధనం
ఆ) జాలి, కరుణ
ఇ) తెలివి, జ్ఞానం
ఈ) ఇల్లు గృహం
జవాబు:
ఆ) జాలి, కరుణ

9. వేదాంతులు సంసారాన్ని పయోధితో పోల్చారు.
అ) సముద్రం, సాగరం
ఆ) నది, ఏరు
ఇ) ఏరు, కొండకాలవ
ఈ) వాగు, సరస్సు
జవాబు:
అ) సముద్రం, సాగరం

10. దానము చేయడం చెయ్యికి అలవాటుగా మారాలి.
అ) హస్తి హస్తం
ఆ) కరి, కరము
ఇ) హస్తం, కరము
ఈ) కరి, హస్తి
జవాబు:
ఇ) హస్తం, కరము

11. ఒక వానరుడు లంకను కాల్చెను.
అ) కోతి, నారి
ఆ) కపి, లిపి
ఇ) అపి, రపి
ఈ) కపి, కోతి
జవాబు:
ఈ) కపి, కోతి

12. గురు పాదము జ్ఞాన మార్గం.
అ) చరణము, అంఘ్రి
ఆ) కాలు, కాలం
ఇ) శరణు, చరణం
ఈ) పాదం, పద్యం
జవాబు:
అ) చరణము, అంఘ్రి

13. పాపము చేయడానికి భయపడాలి.
అ) దుష్టము, హాని
ఆ) హాని, హానికరం
ఇ) దురితము, దోషము
ఈ) అనారోగ్యం, జబ్బు
జవాబు:
ఇ) దురితము, దోషము

14. మన వాంఛ మంచిది కావాలి.
అ) కోరు, కోరడం
ఆ) కోరిక,ఆశ
ఇ) అలోచన, ఊహ
ఈ) సంపద, డబ్బు
జవాబు:
ఆ) కోరిక, ఆశ

15. బాస తప్పడం మా ఆస కాదు.
అ) భాష, ఒట్టు.
ఆ) భాష్యం, ఒట్టు
ఇ) ఒట్టు, గట్టు
ఈ) ప్రమాణం, ఒట్టు
జవాబు:
ఈ) ప్రమాణం, ఒట్టు

ప్రకృతి – వికృతులు

గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.

1. పుష్పము ఏదీ నిష్ఫలము కాదు.
జవాబు:
పువ్వు

2. సుమతులు యతిని స్తుతిస్తారు.
జవాబు:
జతి

3. దొంగ వేషము వేయకు.
జవాబు:
వేసము

4. హనుమ అనుమానము లేక రామాభిమానము పొందెను.
జవాబు:
అనుమ

5. రాజు తేజము వీడకూడదు.
జవాబు:
రాయలు

6. మన సంతోషము మనసంతా హాయిని నింపుతుంది.
జవాబు:
సంతనము

7. అగ్నిలో నిమగ్నమైతే బుగ్గే.
జవాబు:
అగ్ని

8. అక్షులు లేని సాక్షి మక్షికము వంటివాడు.
జవాబు:
సారికి

9. అధమమైన విధము నిధనము తెచ్చును.
జవాబు:
వితము

10. జ్ఞాని ప్రతిజ్ఞను తప్పడు.
జవాబు:
ప్రతిన

11. ప్రాణి ప్రాణమునకు త్రాణ అందటంలేదు.
జవాబు:
పానము

12. భాషా భాష వేషము తమాషాగా ఉంటుంది.
జవాబు:
బాస

13. అనివార్యకార్యము మంగళ తూర్యములు మ్రోగించును.
జవాబు:
కర్ణము

14. పర్వదినమున గర్వముతో సర్వమూ పోగొట్టుకున్నాను.
జవాబు:
గరువము

15. సహాయము చేయుటలోనే హాయి ఉంది.
జవాబు:
సాయము

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

ఆ) గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

1. సిరిగల వానికి చింతలేల?
ఆ) శీరి
అ) సేరి
ఇ) శ్రీ
ఈ) స్త్రీ
జవాబు:
ఇ) శ్రీ

2. సంక్రాంతి పెద్ద పబ్బము.
అ) పరువము
ఆ) పర్వము
ఇ) పరవశము
ఈ) ప్రాభవము
జవాబు:
ఆ) పర్వము

3. బొట్టె వలన సుఖం కలిగితే చాలు.
అ) పుత్రుడు
ఆ) తిలకం
ఇ) కుంకుమ
ఈ) చుక్క
జవాబు:
అ) పుత్రుడు

4. భువిలో కవికి గౌరవం ఎక్కువ.
అ) పుడమి
ఆ) భూ
ఇ) పృథ్వీ
ఈ) అవని
జవాబు:
ఆ) భూ

5. చట్టము కొందరికి చుట్టము కాకూడదు.
అ) శాస్త్రము
ఆ) శాసనము
ఇ) తీర్మానము
ఈ) రాజ్యాంగము
జవాబు:
శాస్త్రము

6. నమ్మకమే సొమ్ము.
అ) స్వా
ఆ) స్వము
ఇ) స్వార్థం
ఈ) స్వయం
జవాబు:
ఈ) స్వము

7. కితకితలు పెట్టే కతలు పిల్లలకిష్టం.
అ) గాథ
ఆ) కథనం
ఇ) కథ
ఈ) కథానిక
జవాబు:
ఇ) కథ

8. కన్నడు కన్నాలు వేశాడనడం అసత్యం.
ఆ) శౌరి
అ) కన్నయ్య
ఇ) అర్జునుడు
ఈ) కృష్ణుడు
జవాబు:
ఈ) కృష్ణుడు

9. పద్దెవిద్దె గద్దెనెక్కెను.
అ) విధము
ఆ) విద్య
ఈ) విదురుడు
ఇ) విధానం
జవాబు:
ఆ) విద్య

10. అగరుబత్తి వెలిగిస్తేనే బత్తి అనడం ఉత్తిది.
అ) భక్తి
ఆ) బకితి
ఇ) బత్తెము
ఈ) బత్తుడు
జవాబు:
అ) భక్తి

11. తన సామి సామిల్లుకు స్వామి రమ్మన్నాడు.
అ) ఆసామి
ఆ) ఈసామి
ఇ) స్వామి
ఈ) దొరసాని
జవాబు:
ఇ) స్వామి

12. పాఱుడు వీరుడు కాదని ధీరువులంటారు.
అ) బ్రాహ్మణుడు
ఆ) భూసురుడు
ఇ) రేరాజు
ఈ) విప్రుడు
జవాబు:
ఈ) విప్రుడు

13. ఉన్నంతలో సోన్నము అన్నకివ్వాలి.
అ) జొన్న
ఆ) స్వర్ణము
ఇ) మిన్న
ఈ) మన్ను
జవాబు:
ఆ) స్వర్ణము

14. అంచనాలు మించి అంచ పాలు తాగింది.
అ) అంచెనా
ఆ) హంస
ఇ) అంచు
ఈ) కంచం
జవాబు:
ఆ) హంస

15. పండుగాడికి మామిడి పండు దండుగ.
అ) కాయ
ఆ) పువ్వు
ఇ) పిందె
ఈ) ఫలము
జవాబు:
ఈ) ఫలము

నానార్థాలు

అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.

1. మిత్రుడు వెలలేని ఆస్తి.
జవాబు:
సూర్యుడు, స్నేహితుడు

2. కొలనులో రాజీవములు అందంగా ఉన్నాయి.
జవాబు:
పద్మము, ఎర్రకలువ

3. మన ధర్మము మనల్ని కాపాడుతుంది.
జవాబు:
పుణ్యము, వేదోక్త విధి

4. మీరిచ్చిన ఉదాహరణ బాగుంది.
జవాబు:
ఒకరకపు కావ్యం, దృష్టాంతం

5. మీ మధ్య బంధం పలచబడింది.
జవాబు:
నడుము, నడుమ

6. కొందరు శ్రీనే అర్చిస్తారు.
జవాబు:
సంపద, లక్ష్మీదేవి

7. ఈ కాలము కొందరికి నచ్చదు.
జవాబు:
సమయం, నలుపు

8. మంచి సమయం కావాలి.
జవాబు:
కాలము, ప్రతిజ్ఞ

9. కవి చమత్కారం మురిపిస్తుంది.
జవాబు:
కావ్యకర్త, శుక్రాచార్యుడు

10. రాజు బలవంతుడై ఉండాలి.
జవాబు:
క్షత్రియుడు, పరిపాలకుడు

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.

1. నిజము ఎప్పుడూ మేలైన నిజమునే ఎన్నుకొంటుంది.
అ) సత్యం, అసత్యం
ఆ) సత్యం, విధము
ఇ) నిక్కం, చిక్కం
ఈ) సత్యం, మంచి
జవాబు:
ఆ) సత్యం, విధము

2. కష్టంను కష్టంగా భావించకూడదు.
అ) ఆపద, సంకటం
ఆ) ఆపద, ఆనందం
ఇ) ఆపద, ఇష్టం
ఈ) ఆపద, స్నేహం
జవాబు:
అ) ఆపద, సంకటం

3. భక్తి కలవాడికి మంచి భక్తి దొరుకుతుంది.
అ) బత్తి, బత్తాయి
ఆ) బత్తెం, బొత్తం
ఇ) బత్తి, భాగం
ఈ బత్తి, భావం
జవాబు:
ఇ) బత్తి, భాగం

4. బాస చేసి పండితుడు తన బాస నెగ్గించుకొన్నాడు.
అ) మాట, బాట
ఆ) తెలివి, కావ్యం
ఇ) కాలం, పంతం
ఈ) శపథం, మాట
జవాబు:
ఈ) శపథం, మాట

5. శౌర్యము లేకపోతే శౌర్యం వృథా.
అ) పరాక్రమం, పంతం
ఆ) పౌరుషం, బలం
ఇ) పరాక్రమం, ధైర్యం
ఈ) ధైర్యం, బలం
జవాబు:
ఆ) పౌరుషం, బలం

6. దళం యొక్క దళంలో ఈనెలు ఉంటాయి.
అ) ఆకు, భాగం
ఆ) ఆకు, ఈనె
ఇ) కొమ్మ, ఆకు
ఈ) ఆకు, కాయ
జవాబు:
అ) ఆకు, భాగం

వ్యుత్పత్త్యర్థాలు

అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం రాయండి.

1. తోబుట్టువు ఇంటికి సంపద,
జవాబు:
తోడబుట్టినది

2. కృష్ణుడు వ్రేపల్లెలో పెరిగాడు.
జవాబు:
జ్ఞాన స్వరూపుడు

3. మంచి మిత్రుడు సంపదల కంటే ఎక్కువ.
జవాబు:
అన్ని జీవుల పట్ల స్నేహభావం కలవాడు.

4. విద్యను సంపాదించాలి.
జవాబు:
జ్ఞానాన్ని ఇచ్చేది.

5. శస్త్రము ప్రయోగించడం నేర్చుకోవాలి.
జవాబు:
దీనిచేత హింసించబడతారు.

6. ధర్మం తప్పకూడదు.
జవాబు:
విశ్వాన్ని ధరించేది.

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

ఆ) గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్త్వర్ణాన్ని గుర్తించండి.

1. పాండవులను ఇందిరావరుడు కాపాడాడు.
అ) లక్ష్మికి భర్త
ఆ) పాండవుల బావ
ఇ) యశోద కొడుకు
ఈ) వెన్న దొంగ
జవాబు:
లక్ష్మికి భర్త

2. కుచేలుడు శ్రీకృష్ణుని స్నేహితుడు.
అ) పేదవాడు
ఆ) దరిద్రుడు
ఇ) చిరిగిన బట్టలు కట్టుకునేవాడు.
ఈ) ఎక్కువ సంతానం కలవాడు.
జవాబు:
ఇ) చిరిగిన బట్టలు కట్టుకునేవాడు

3. మంచి స్నేహం విడువకూడదు.
అ) లాభం ఇచ్చేది.
ఆ) ప్రీతిని కలిగించేది.
ఇ) ఆపదలో ఆదుకొనేది.
ఈ) అల్లరిని ప్రోత్సహించేది.
జవాబు:
ఆ) ప్రీతిని కలిగించేది.

4. కురుక్షేత్ర సంగ్రామంలో చాలా అస్త శస్త్రాలు ప్రయోగించారు.
అ) బాధించేది
ఆ) శత్రువులను చంపేది
ఇ) కాపాడేది
ఈ) దేహాదుల మీద చిమ్మబడేది
జవాబు:
ఈ) దేహాదుల మీద చిమ్మబడేది

5. కౌరవుల పెద్దన్న దుర్యోధనుడు.
అ) దుష్టమైన యుద్ధ విద్యా నైపుణ్యం కలవాడు.
ఆ) శత్రువులను చంపేవాడు.
ఇ) పాండవ విరోధి.
ఈ) దుష్టమైన స్వభావం కలవాడు.
జవాబు:
అ) దుష్టమైన యుద్ధ విద్యా నైపుణ్యం కలవాడు.

6. శివుని పురంధ్రి పార్వతీ దేవి.
అ) భార్య
ఆ) గృహాన్ని ధరించేది (ఇల్లాలు)
ఇ) వంట చేసేది
ఈ) ఇంట్లో పనులన్నీ చేసేది
జవాబు:
ఆ) గృహాన్ని ధరించేది (ఇల్లాలు)

జాతీయాన్ని గుర్తించడం

ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

1. మా బజారులో రోడ్డు వేయుటకు అంకురార్పణ జరిగింది.
జవాబు:
అంకురార్పణ

2. మా పల్లెటూరు చూడటానికి ఎంతో కన్నులపండుగగా ఉంది.
జవాబు:

3. నా స్నేహితుడు కష్టకాలంలో నన్ను ఎంతో ఆకళింపు చేసుకొన్నాడు.
జవాబు:
ఆకళింపు చేసికొను

4. నా స్నేహితురాలు స్టేజీ మీద గజ్జె కట్టింది.
జవాబు:
గజ్జెకట్టు

5. మా వీధిలో పిల్లలు దారికి వచ్చారు.
జవాబు:
దారికివచ్చు

6. సీత లవకుశల్ని అపురూపంగా చూసుకుంది.
జవాబు:
అపురూపం

జాతీయము – సందర్భము

ఈ జాతీయాన్ని ఏ అర్థంలో/సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.

1. పసందు = అందం
జవాబు:
ఏదైనా ఒక వస్తువు యొక్క స్వరూప స్వభావాలను వర్ణించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

2. క్షేత్రం = భూమి, పొలము
జవాబు:
భూమి సారవంతమై ముంచి పంటలు పండే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

3. నిమ్మకు నీరెత్తినట్లు = ఏమీ పట్టనట్లు
జవాబు:
తనకేమీ సంబంధం లేనట్లు ప్రవర్తించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

4. ఉలుకూ పలుకూ లేకపోవడం = ప్రతిస్పందన లేకపోవడం
జవాబు:
ఏమీ మాట్లాడక పోవడం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

5. మహత్తర ఘట్టానికి చేరుకోవడం = పూర్తి చేయడం
జవాబు:
వార్షిక పరీక్షలు పూర్తయ్యే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

6. ఘనకార్యం చేయడం = సాహసంతో కూడిన గొప్ప పని చేయడం
జవాబు:
గొప్ప పని చేశాడని ప్రశంసిస్తూ చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

7. కన్నుల పండుగ = చూడటానికి అందంగా ఉంది
జవాబు:
ఏదైనా అందమైన సన్నివేశాన్ని వివరిస్తూ చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సంధి పదాలను విడదీయడం

గీత గీసిన పదాన్ని వీడదీసి రాయండి.

1. దేవుడన్ని అన్యాయాలూ నశింపచేస్తాడు.
జవాబు:
దేవుడు + అన్ని

2. రావణుడు సీతాపహరణం చేసెను.
జవాబు:
సీత + అపహరణం

3. మంచి వారికి అందరూ దగ్గరవుతారు.
జవాబు:
దగ్గర + అవుతారు.

4. వీణరాగాలను మ్రోగించింది.
జవాబు:
రాగము + లను

5. చిట్టచివర వున్న లోటు లేదు.
జవాబు:
చివర + చివర

6. మంచి చేయాలని మహాత్ములు చూస్తారు.
జవాబు:
చేయాలి + అని

7. సాయంకాలపు నీడ చల్లగా ఉంటుంది.
జవాబు:
సాయంకాలము + నీడ

8. సుగ్రీవమైత్రించోలెడు మైత్రి లేదు.
జవాబు:
మైత్రిన్ + పోలెడు

9. దొంగ సుఖులు సఖులుగారు.
జవాబు:
సఖులు + కారు

10. మంచి మనసు అష్ట్యెశ్వర్యాలతో సమానం.
జవాబు:
అష్ట + ఐశ్వర్యాలు

11. పెద్దలు చెప్పినయట్ల నడుచుకోవాలి.
జవాబు:
చెప్పిన + అట్ల

12. అప్పేద వామనుడే దైవము.
జవాబు:
ఆ + పేద

13. అత్యంత శ్రద్ధతో విద్యను ఆర్జించాలి.
జవాబు:
అతి + అంత

14. కుచేలుడు ఖండోత్తరీయముతో వెళ్ళెను.
జవాబు:
ఖండ + ఉత్తరీయము

15. పెద్దలు ఎదురైనప్పుడు నమస్కరించాలి.
జవాబు:
ఎదురు + ఐనప్పుడు

సంధి పదాలను కలపడం

సంధి పదాలను కలిపి రాయండి.

1. ఏ + నాళ్ళు
జవాబు:
ఎన్నాళ్ళు.

2. ఐనది + ఒక్కండే
జవాబు:
బనదొక్కండే

3. కృష్ణుడ + లౌన్
జవాబు:
కృష్ణుడులొన్

4. అడపినన్ + పుత్రా
జవాబు:
అడపింబుత్రా

5. చేయాలి + అని
జవాబు:
చేయాలని

6. పురాణము + లు
జవాబు:
పురాణాలు

7. అన్న + అయ్య
జవాబు:
అన్నయ్య

8. స్వా + అర్థం
జవాబు:
స్వార్థం

9. వారు + ఇద్దరు
జవాబు:
వారిద్దరు

10. గుణము + ఉన్న
జవాబు:
గుణమున్న

11. విద్య + అభ్యాసం
జవాబు:
విద్యాభ్యాసం

12. ఉన్న + అంత
జవాబు:
ఉన్నంత

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

13. కాలము + లలో
జవాబు:
కాలాలలో

14. ఏమి + ఐన
జవాబు:
ఏమైనా

15. అనది + ఒక్కంటే
జవాబు:
బనదొక్కండే

సంధి నామాలు

గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.

1. నిక్కమైన మాట ఒక్కటి చాలు.
ఆ) ఉత్వసంధి
ఆ) అత్వసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) లు, ల, న, ల సంధి
జవాబు:
ఆ) ఉత్వసంధి

2. రుచిరాన్నము భుజించాలి.
అ) గుణసంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) అత్వసంధి
ఈ) ఇత్వసంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘ సంధి

3. పేదలకు ప్రభుత్వం కొండంత అండ.
అ) ఉత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) అత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
ఇ) అత్వసంధి

4. ధర్మాలు ఆచరించాలి.
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఆ)ఇత్వసంధి
ఇ) అత్వసంధి
ఈ) లు,ల,న,ల సంధి
జవాబు:
ఈ) లు,ల,న,ల సంధి

5. చిట్టచివర పేజీవరకు చదవాలి.
అ) టుగాగమ సంధి
ఆ) సరళాదేశ సంధి
ఇ) ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
ఈ) యణాదేశసంధి
జవాబు:
ఇ) ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి

6. ఆచంద్రారము గాంధీ పేరు నిలుస్తుందట.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) యడాగమం
జవాబు:
ఆ) ఇత్వసంధి

7. దైవకృప సాయంకాలపు నీడలా చల్లగా ఉంటుంది.
అ) పుంప్వాదేశ సంధి
ఆ) లు,ల,న,ల సంధి
ఇ) మువర్ణలోప సంధి
ఈ) గుణసంధి
జవాబు:
అ) పుంప్వాదేశ సంధి

8. దుష్టులు సరసఁజేరి తప్పులు చేయిస్తారు.
అ) గసడదవాదేశసంధి
ఆ) లు,ల,న,ల సంధి
ఇ) సరళాదేశ సంధి.
ఈ) గుణసంధి
జవాబు:
ఇ) సరళాదేశసంధి

9. సఖుల వగల్ గలిమి సఖ్యతకు మేలు.
అ) సరళాదేశ సంధి
ఆ) గసడదవాదేశ సంధి
ఇ) లు,ల,న,ల సంధి.
ఈ) మువర్ణలోప సంధి
జవాబు:
ఆ) గసడదవాదేశ సంధి

10. గొడవలు లేని ఇల్లు అష్టైశ్వర్యాల నిలయం.
ఆ) గుణసంధి
ఆ) సవర్ణదీర్ఘసంధి
ఇ) వృద్ధిసంధి
ఈ) అత్వసంధి
జవాబు:
ఇ) వృద్ధిసంధి

11. అర్జునుడొక్కండెయరయ భరతవీరుడు.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) యడాగమం
జవాబు:
ఈ) యడాగమం

12. ఎవ్విధముగా నైనా జ్ఞానార్జన చేయాలి.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) త్రికసంధి
ఈ) లు,ల,న,ల,సంధి
జవాబు:
ఇ) త్రికసంధి

13. తల్లికి పిల్లలపై అత్యంత ప్రేమ ఉంటుంది.
అ) అత్వసంధి
ఆ) యణాదేశసంధి
ఇ) యడాగమం
ఈ) ఇత్వసంధి
జవాబు:
ఆ) యణాదేశసంధి

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

14. శిష్యులపై గురువుకు సమానమైన ప్రేమ ఉంటుంది.
అ) ఉత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) అత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
అ) ఉత్వసంధి

15. రామమహీశునకు సాటిలేదు.
అ) గుణసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) సవర్ణదీర్ఘసంధి
ఈ) అత్యసంధి
జవాబు:
ఇ) సవర్ణదీర్ఘసంధి

విగ్రహవాక్యాలు

గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.

1. తల్లిదండ్రులు పూజ్యనీయులు.
జవాబు:
తల్లియును తండ్రియును

2. కర్ణదుర్యోధనులు అధమమిత్రులు.
జవాబు:
అధములైన మిత్రులు

3. కుచేలుడు తన మిత్రుడు అని కృష్ణుడు గర్వంగా చెప్పారు.
జవాబు:
తన యొక్క మిత్రుడు

4. పిల్లలకు లోకజ్ఞానం అవసరం.
జవాబు:
లోకమును గూర్చి జ్ఞానం

5. సజ్జనసాంగత్యము మంచిది.
జవాబు:
సజ్జనులతో సాంగత్యం

6. శాంతిపర్వంలో మంచి నీతులు ఉన్నాయి.
జవాబు:
శాంతి అను పేరు గల పర్వం

7. ధాత్రీ దివిజులు ఎక్కువగా పూజలు చేస్తారు.
జవాబు:
ధాత్రీ యందలి దివిజులు

8. జీవితము నిస్సారముగా గడుపకూడదు.
జవాబు:
సారము లేనిది

9. మంచిపిల్లలే తల్లిదండ్రులకు అష్టైశ్వర్యాలు.
జవాబు:
అష్ట సంఖ్య గల ఐశ్వర్యాలు

10. అధికార గర్వం తలకెక్కకూడదు.
జవాబు:
అధికారము వలన గర్వం

11. గురుదక్షిణ ఘనంగా సమర్పించాలి.
జవాబు:
గురువు కొరకు దక్షిణ

12. స్నేహం ముసుగులో కొంత మంది మోసం చేస్తారు.
జవాబు:
స్నేహమనెడు ముసుగు

13. ప్రతిమనిషి తెలివైనవాడే.
జవాబు:
మనిషి, మనిషి

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

14. రాజీవనేత్రుడు దేవతలకు వరాలనిస్తాడు.
జవాబు:
రాజీవముల వంటి నేత్రములు కలవాడు.

15. సృష్టి అఖిలము అందమైనదే.
జవాబు:
ఖిలము కానిది.

సమాస నామాలు

గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.

1. శ్రీరాముని పరాక్రమము అసమానము అనది.
అ) నఞ్ తత్పురుష సమాసము
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
అ) నఞ్ తత్పురుష సమాసము

2. శ్రీనివాసుని పాదపద్మములు ఆశ్రయించాలి.
అ) సప్తమీ తత్పురుష సమాసం
ఆ) చతుర్థీ తత్పురుష సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
జవాబు:
ఈ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

3. అర్జునుడు సర్వసమర్ధుడు.
అ) రూపక సమాసం
ఆ) షష్ఠీ తత్పురుష సమాసము
ఇ) బహువ్రీహి సమాసము
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
ఇ) బహువ్రీహి సమాసము.

4. చిట్టచివర కొమ్మనున్న పిట్ట బాగుంది.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) సప్తమీ తత్పురుష సమాసం
ఇ) రూపక సమాసం
ఈ) అవ్యయీభావ సమాసము
జవాబు:
ఈ) అవ్యయీభావ సమాసము

5. క్షత్రవరులు అందరూ వీరులే.
అ) బహువ్రీహి సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము
ఈ) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము

6. గురుదక్షిణ పూర్వం ఇచ్చేవారు.
అ) చతుర్థీ తత్పురుష సమాసము
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
అ) చతుర్థీ తత్పురుష సమాసము

7. ధనమదం పనికి రాదు.
అ) పంచమీ తత్పురుష సమాసము
ఆ) నఞ్ తత్పురుష సమాసం
ఇ) చతుర్థీ తత్పురుష సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
అ) పంచమీ తత్పురుష సమాసము

8. మన తృప్తే మనకు అష్టైశ్వర్యాలు.
అ) సప్తమీ తత్పురుష సమాసం
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ఈ) ద్విగు సమాసము
జవాబు:
ఈ) ద్విగు సమాసము

9. అవరూధికి రక్షణ ఉండదు.
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) నఞ్ బ్బహువ్రీహి సమాసము
ఇ) రూపక సమాసం
ఈ) చతుర్థీ తత్పురుష సమాసము
జవాబు:
ఆ) నఞ్ బహువ్రీహి సమాసము

10. పర్వతప్రాంతములో వర్షాలు ఎక్కువ.
అ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) సప్తమీ తత్పురుష సమాసం
ఈ) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) సప్తమీ తత్పురుష సమాసము

11. ద్వారకానగరము కృష్ణుని నివాసము.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) బహువ్రీహి సమాసము
ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
ఈ) నఞ్ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

12. అప్పుల విషవలయంలో చిక్కకూడదు.
అ) చతుర్థీ తత్పురుష సమాసం
ఆ) ద్వంద్వ సమాసము
ఇ) తృతీయా తత్పురుష సమాసము
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
ఇ) తృతీయా తత్పురుష సమాసము

13. అష్టావక్రుని మించిన తత్వవిదుడు లేదు.
అ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) ద్వితీయా తత్పురుష సమాసము
ఈ) నఞ్ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) ద్వితీయా తత్పురుష సమాసము

14. వివాహానికి అగ్నిసాక్షి బలమైనది.
అ) ద్వంద్వ సమాసం
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) రూపక సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసము
జవాబు:
ఈ) షష్ఠీ తత్పురుష సమాసము

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

15. నలుని సమస్తసంపదలు జూదంలో పోయాయి.
అ) చతుర్థీ తత్పురుష సమాసం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
ఇ) షష్ఠీ తత్పురుష సమాసము
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

ఆధునిక వచనాలు

ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.

1. సరసఁ జేరితిని
అ) సరసన్ జేరితిని
ఆ) సరసను జేరితి
ఇ) సరసను చేరాను
ఈ) సరసం జేరితి
జవాబు:
ఇ) సరసను చేరాను

2. వారలెల్ల సుఖులు గారు.
అ) వారంతా సుఖులు కారు
ఆ) సుఖులుగారు వారలున్
ఇ) వారలున్ సుఖులుగారు
ఈ) వారలెల్ల సుఖులునేగారు
జవాబు:
అ) వారంతా సుఖులు కారు

3. మైత్రిఁబోలెడు ధర్మము లేదు.
అ) మైత్రినిబోలెడు ధర్మంబు లేదు
ఆ) మైత్రింబోలెడు ధర్మంబు లేదు.
ఇ) మైత్రినిన్ బోలెడు ధర్మమ్ము లేదు
ఈ) మైత్రిని పోలిన ధర్మం లేదు.
జవాబు:
ఈ) మైత్రిని పోలిన ధర్మం లేదు.

4. ఏ కర్మంబు పవిత్రతయువలవదు.
అ) ఏ కర్మము పచిత్రతయును వలవదు
ఆ) ఏ కర్మమున్ పవిత్రతయున వలవడు
ఇ) ఏ కర్మ పవిత్రత వలదు
ఈ) ఏ కర్మమును పవిత్రతయున్ వలవదు
జవాబు:
ఇ) ఏ కర్మ పవిత్రత వలదు.

5. మిమ్ముఁజూచె విభుందు
అ) మిమ్ములంజూచె విభుండు
ఆ) మిమ్ముచూశాడు విభుడు
ఇ) విభుడున్ మిమ్ములఁ జూచెన్
ఈ) చూచె మిమ్మున్ విభుడున్
జవాబు:
అ) మిమ్ము చూశాడు విభుడు

6. చెప్పినయట్ల జరిగినది.
అ) చెప్పిన యట్లు జరిగినది
ఆ) చెప్పినటుల్ జరిగినది
ఇ) చెప్పినటులనే జరిగినది
ఈ) చెప్పినట్లే జరిగింది
జవాబు:
ఈ) చెప్పినట్లే జరిగింది.

7. పాదపద్మంబు లాశ్రయించితి
అ) పాదపద్మాలాశ్రయించాను
ఆ) పాదపద్మమ్ములనాశ్రయించితి
ఇ) ఆశ్రయించితి పాదపద్మంబులు.
ఈ) పాదపద్మమ్యులు నాశ్రయించితి
జవాబు:
అ) పాదపద్మాలాశ్రయించాను

8. తల్పమున్ దిగెన్
అ) తల్పమునుదిగెను
ఆ) తల్పం దిగాడు
ఇ) దిగెన్ల్పమున్
ఈ) దిగియెన్ దల్పమున్
జవాబు:
ఆ) తల్పం దిగాడు

9. ఫలముఁగొలిచిన జనులర్పింతురు
అ) ఫలమును గొలిచిన జనులు నర్పింతురు
ఆ) ఫలమ్ముఁ గొలిచిన జనులర్పింతురు
ఇ) ఫలంబుఁ గొలిచిన జనులు నర్పింతురు
ఈ) ఫలం కొల్చిన జనం అర్పిస్తారు.
జవాబు:
ఈ) ఫలం కొల్చిన జనం అర్పిస్తారు.

10. సఖ్యముఁ జేయగ వచ్చితిని.
అ) సఖ్యం చేయడానికి వచ్చాను
ఆ) సఖ్యమున్ జేయగవచ్చితిన్
ఇ) వచ్చితిన్ సఖ్యమును జేయగ
ఈ) సఖ్యమున్టేయగ వచ్చితిని
జవాబు:
అ) సఖ్యం చేయడానికి వచ్చాను.

11. మైత్రిం బోలెడు ధర్మము ధాత్రి లేదు. (SA-I 2023-24)
అ) మిత్రత్వమునకు సమానమైన ధర్మం ధరణిపై కలదు.
ఆ) మిత్రునిని పోలిన ధర్మాత్ముడు భూమిమీద లేదు.
ఇ) మిత్రత్వమునకు సమానమైన ధర్మం భూమిమీద లేదు.
ఈ) మైత్రి వంటి ధర్మం భూమి మీద మరొకటి లేకపోదు.
జవాబు:
ఇ) మిత్రత్వమునకు సమానమైన ధర్మం భూమిమీద లేదు.

వ్యతిరేకార్థక వాక్యాలు

ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.

1. అమ్మను సృష్టించాడంటారు.
జవాబు:
అమ్మను సృష్టించాడనరు.

2. నాకు లోకజ్ఞానం ఎక్కువగా ఉంది.
జవాబు:
నాకు లోక జ్ఞానం ఎక్కువగా లేదు.

3. నాకు బంధువులు తారసపడతారు.
జవాబు:
నాకు బంధువులు తారసపడరు.

4. కష్టాలలో బంధువులు వస్తారు.
జవాబు:
కష్టాలలో బంధువులు రారు.

5. విశ్వాసం వ్యక్తమవుతోంది.జవాబు:
జవాబు:
విశ్వాసం వ్యక్తం కావడంలేదు.

6. అందరూ గొప్ప స్నేహితులు.
జవాబు:
అందరూ గొప్ప స్నేహితులు కారు.

7. అందరిని పొగడాలి.
జవాబు:
అందరినీ పొగడకూడదు.

8. స్నేహాన్ని నడిపించేది ధనం.
జవాబు:
స్నేహాన్ని నడిపించేది ధనం కాదు.

9. జీవితం నిస్సారంగా ఉంటోంది.
జవాబు:
జీవితం నిస్సారంగా ఉండడం లేదు.

10. స్నేహాలు అనేక రకాలు.
జవాబు:
స్నేహాలు అనేక రకాలు లేవు.

11. కర్ణ దుర్యోధనులు మంచి మిత్రులు.
జవాబు:
కర్ణ దుర్యోధనులు మంచి మిత్రులు కారు.

12. స్నేహం కంటె ధనం గొప్పది.
జవాబు:
స్నేహం కంటె ధనం గొప్పది కాదు.

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

13. కుచేలుని భార్య మాట్లాడింది.
జవాబు:
కుచేలుని భార్య మాట్లాడలేదు.

14. మన కష్టాలు తొలగుతాయి.
జవాబు:
మన కష్టాలు తొలగవు.

15. చాలాకాలం సంపాదించగలం.
జవాబు:
చాలాకాలం సంపాదించలేము.

వ్యతిరేకార్థక క్రియలు

కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.

1. అ) పొందక
ఆ) పొంది
ఇ) పొందుతూ
ఈ) పొందితే
జవాబు:
అ) పొందక

2. అ) ఉండి
ఆ) ఉంటూ
ఇ) ఉండక
ఈ) ఉంటే
జవాబు:
ఇ) ఉండక

3. అ) పంచి
ఆ) పంచుతూ
ఇ) పంచితే
ఈ) పంచక
జవాబు:
ఈ) పంచక

4. అ) పాలించక
ఆ) పాలించి
ఇ) పాలిస్తూ
ఈ) పాలిస్తే
జవాబు:
అ) పాలించక

5. అ) కని
ఆ) కంటూ
ఇ) కనక
ఈ) కంటే
జవాబు:
ఇ) కనక

6. అ) పడ
ఆ) పడక
ఇ) పడితే
ఈ) పడుతూ
జవాబు:
ఆ) పడక

7. అ) పోరాడక
ఆ) పోరాడి
ఇ) పోరి
ఈ) పోరుతూ
జవాబు:
అ) పోరాడక

8. అ) పోరి
ఆ) పోరక
ఇ) పోరుతూ
ఈ) పోరితే
జవాబు:
ఆ) పోరక

9. అ) కోరి
ఆ) కోరుతూ
ఇ) కోరక
ఈ) కోరితే
జవాబు:
ఇ) కోరక

10. అ) చేరి
ఆ) చేరుతూ
ఇ) చేరితే
ఈ) చేరక
జవాబు:
ఈ) చేరక

11. అ) ఏరక
ఆ) ఏరి
ఇ) ఏరుతూ
ఈ) ఏరితే
జవాబు:
అ) ఏరక

12. అ) వదలి
ఆ) వదలక
ఇ) వదిలితే
ఈ) వదులుతూ
జవాబు:
ఆ) వదలక

13. ఆ) పట్టి
ఆ) పట్టు
ఇ) పట్టక
ఈ) పట్టుతూ
జవాబు:
ఇ) పట్టక

14. అ) విడువక
ఆ) విడిచి
ఇ) విడుస్తూ
ఈ) విడిస్తే
జవాబు:
అ) విడువక

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

15. అ) పోవు
ఆ) పోక
ఇ) పోతే
ఈ) పోతూ
జవాబు:
ఆ) పోక

సంశ్లిష్ట వాక్యాలు

ఇవి ఏ రకమైన సంశ్లిష్టవాక్యాలో రాయండి.

1. మంచిగా మాట్లాడితే స్నేహం కలుస్తుంది.
జవాబు:
చేదర్థకం

2. పచ్చని పంట పొలాలు చూస్తూ కాలం గడపాలి.
జవాబు:
శత్రర్థకం

3. మంచిగా ఉంటేనే స్నేహం నిలుస్తుంది.
జవాబు:
చేదర్థకం

4. పొగుడుతూ ఉండే వారంతా స్నేహితులవరు.
జవాబు:
శత్రర్ధకం

5. శ్రీకృష్ణుడు పరుగుపరుగున వచ్చి కుచేలుని ఆలింగనం చేసుకున్నాడు.
జవాబు:
క్త్వార్థకం

6. రామసుగ్రీవులు స్నేహితులైతే సీతాన్వేషణ సఫలమవు తుంది.
జవాబు:
చేదర్థకం

7. శ్రీకృష్ణుని దర్శిస్తే మన కష్టాలు తొలగుతాయని కుచేలుని భార్య అంది.
జవాబు:
చేదర్థకం

8. కుచేలుని శ్రీకృష్ణుడు హంసతూలికా తల్పంపై కూర్చోపెడ్తూ. యోగక్షేమాలడిగాడు.
జవాబు:
శత్రర్థకం

9. స్వార్థంతో చెడ్డ పనులు చేస్తే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
జవాబు:
చేదర్థకం

10. జింక పులిని చూసి భయపడి పారిపోయింది.
జవాబు:
క్త్వార్థకం

కర్మణి వాక్యాలు

సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

1. నన్ను ఒకడు పొగిడాడు.
అ) నేను ఒకని చేత పొగడబడ్డాను.
ఆ) ఒకడు నా చేత పొగడబడ్డాడు.
ఇ) నేను ఒకని చేత పొగడబడతాను.
ఈ) నేను అందరి చేత పొగడబడ్డాను.
జవాబు:
అ) నేను ఒకని చేత పొగడబడ్డాను.

2. అందరూ శాస్త్రాలు చదువుతున్నారు.
అ) అందరి చేత శాస్త్రాలు చదువబడవు.
ఆ) అందరి చేత శాస్త్రాలు చదువబడతాయి.
ఇ) అందరి చేత శాస్త్రాలు చదువబడుతున్నాయి.
ఈ) శాస్త్రాలను అందరి చేత చదువబడుతున్నాయి.
జవాబు:
ఆ) అందరి చేత శాస్త్రాలు చదువబడుతున్నాయి.

3. శ్రీకృష్ణుని కుచేలుడు ఆశ్రయించాడు.
అ) కుచేలుడు శ్రీకృష్ణుని చేత ఆశ్రయించబడ్డాడు.
ఆ) కుచేల కృష్ణుల చేత స్నేహం ఆశ్రయించబడింది.
ఇ) కుచేలుని చేత శ్రీకృష్ణుడు ఆశ్రయించబడుతున్నాడు.
ఈ) కుచేలుని చేత శ్రీకృష్ణుడు ఆశ్రయించబడ్డాడు.
జవాబు:
అ) కుచేలుడు శ్రీకృష్ణుని చేత ఆశ్రయించబడ్డాడు.

4. ద్రుపదుడు ద్రోణుని అవమానించారు.
అ) ద్రోణుని చేత ద్రుపదుడు అవమానించబడ్డాడు.
ఆ) ద్రుపదుని చేత ద్రోణుడు అవమానించబడ్డాడు.
ఇ) ద్రుపదుడు, ద్రోణుడు అవమానించబడుతున్నారు.
ఈ) ద్రుపదుని చేత ద్రోణుడు అవమానించబడుతున్నాడు.
జవాబు:
ఆ) ద్రుపదుని చేత ద్రోణుడు అవమానించబడ్డాడు.

5. బాల్య స్నేహం ఎవ్వరూ మరువకూడదు.
అ) ఎవ్వరి చేత బాల్య స్నేహం మరువబడకూడదు.
ఆ) బాల్య స్నేహం చేత ఎవ్వరూ మరువబడకూడదు.
ఇ) ఎవ్వరి చేత బాల్యస్నేహం మరువబడుతోంది.
ఈ) ఎవ్వరి చేత బాల్య స్నేహం మరువబడడం లేదు.
జవాబు:
అ) ఎవ్వరి చేత బాల్య స్నేహం మరవబడకూడదు.

6. శ్రీరాముడు వాలిని బాణంతో కొట్టాడు.
అ) శ్రీరాముని చేత వాలి బాణం దెబ్బ తిన్నాడు.
ఆ) శ్రీరాముని చేత వాలి బాణంతో కొట్టబడ్డాడు.
ఇ) శ్రీరాముని చేత వాలి కొట్టబడ్డాడు.
ఈ) శ్రీరాముడు వాలిపై బాణం వేశాడు.
జవాబు:
ఆ) శ్రీరాముని చేత వాలి బాణంతో కొట్టబడ్డాడు.

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.

1. కృష్ణ కుచేలురు మంచి స్నేహితులు.
జవాబు:
సంయుక్త వాక్యం

2. కుచేలుని ఆహ్వానించి గౌరవించాడు.
జవాబు:
సంశ్లిష్ట వాక్యం

3. కృష్ణుడు సంపదలు ఇవ్వగలదు.
జవాబు:
సామర్థ్యార్ధక వాక్యం

4. భక్తికి భగవంతుడు తప్పక లొంగును.
జవాబు:
నిశ్చయార్థకం

5. మంచి స్నేహం చేయండి.
జవాబు:
విధ్యర్ధకం

6. చెడుస్నేహాలు పట్టవద్దు.
జవాబు:
నిషేధార్థకం

7. దుర్యోధనుడు మంచి వాడా?
జవాబు:
ప్రశ్నార్థకం

8. వారిది మంచి స్నేహమో! కాదో!
జవాబు:
సందేహర్థకం

9. మీరిద్దరూ స్నేహం చేయవచ్చు.
జవాబు:
అనుమత్యర్థకం

10. మీ స్నేహం వర్ధిల్లుగాక!
జవాబు:
ఆశీరార్ధక వాక్యం

11. అబ్బ! కృష్ణుని మందిరమెంత బాగుందో!
జవాబు:
ఆశ్చర్యార్థకం

12. మంచివారితో స్నేహం చేస్తే మంచి జరుగుతుంది.
జవాబు:
చేదర్థకం

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

13. కర్ణునితో స్నేహం చేసినా దుర్యోధనుడు నెగ్గలేదు.
జవాబు:
అప్యర్థకం

14. దయచేసి చెడుస్నేహాలు విడిచిపెట్టండి.
జవాబు:
ప్రార్థనార్ధకం

15. దుష్టాలోచన ఉండబట్టి స్నేహం ఫలించలేదు.
జవాబు:
హేత్వర్థకం

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.

1. మంచి భక్తి ఉంది కాబట్టి కుచేలుడు ధన్యుడయ్యాడు.
అ) అప్యర్థకం
ఆ) హేత్వర్ధకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఆ) హేత్వర్ధకం

2. మంచి స్నేహం తప్పక నిలుస్తుంది.
అ) నిశ్చయార్థకం
ఆ) అప్యర్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
అ) నిశ్చయార్థకం

3. దుష్టులను నమ్మవద్దు.
అ) విధ్యర్థకం
ఆ) హేత్వర్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) ఆశీరర్థకం
జవాబు:
ఇ) నిషేధార్థకం

4. కాలం, జ్ఞానం విలువైనవి.
అ) సంశ్లిష్టం
ఆ) చేదర్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) సంయుక్తవాక్యం
జవాబు:
ఈ) సంయుక్తవాక్యం

5. స్నేహం చేస్తూ మంచి చేయాలి.
అ) సంశ్లిష్టం
ఆ) సంయుక్తం
ఇ) విధ్యర్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
అ) సంశ్లిష్టం

6. కృష్ణుని చూస్తే బాధలు తీరతాయి.
అ) విధ్యర్థకం
ఆ) చేదర్థకం
ఇ) అప్యర్థకం
ఈ) హేత్వర్ధకం
జవాబు:
ఆ) చేదర్థకం

7. అబ్బ! ఆ కొండ ఎంతుందో!
అ) ఆశ్చర్యార్థకం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) సందేహార్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
అ) ఆశ్చర్యార్థకం

8. దయచేసి మంచి స్నేహం ఎంచుకోండి.
అ) అప్యర్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఆ) ప్రార్థనార్థకం

9. మీ స్నేహితుని మీరే ఎంచుకోవచ్చు.
అ) విధ్యర్థకం
ఆ) చేదర్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఇ) అనుమత్యర్థకం

10. అది పర్వతమా?
అ) ప్రశ్నార్థకం
ఆ) సందేహార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
అ) ప్రశ్నార్థకం

11. డబ్బు వచ్చినా సుఖంలేదు.
అ) విధ్యర్థకం
ఆ) అనుమత్యర్థకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఇ) నిశ్చయార్థకం

12. నిండు నూరేళ్లూ జీవించు.
అ) ప్రార్థనార్థకం
ఆ) ఆశీరర్థకం
ఇ) అప్యర్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
ఆ) ఆశీరర్థకం

13. మంచిని విడవవద్దు.
అ) అప్యర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
ఇ) నిషేధార్థకం

AP 9th Class Telugu 5th Lesson Important Questions స్నేహం

14. నేను పరుగెత్తగలను.
అ) విధ్యర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) సామర్థ్యార్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
ఇ) సామర్థ్యార్థకం

15. అందరూ తినండి.
అ) విధ్యర్థకం
ఆ) హేత్వర్థకం
ఇ) సంక్లిష్టం
ఈ) సంయుక్తం
జవాబు:
అ) విధ్యర్థం

Leave a Comment