Access to the AP 9th Class Telugu Guide 4th Lesson ఆత్మకథ Questions and Answers are aligned with the curriculum standards.
ఆత్మకథ AP 9th Class Telugu 4th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి
మేం మనుష్యులం
మేం మహస్సులం
గుండె లోపలి గుండె కదిలించి
తీగ లోపలి తీగ సవరించి
పాట పాటకి లేచు కెరటంలాగ
మాట మాటకి మోగు కిన్నెరలాగ
మే० ఆడుతా०
మేం పాడుతాం
మేం ఉపాసకులం
మేం పిపాసువులం
భూమి అంచులకు వెలుగు తెరకట్టి
తారకల గతికొక్క శుతివెట్టి
పాట పాటకి వెండిడారంలాగ
మాట మాటకి మండు దూరంలాగ
మేం సాగుతాం
మేం రేగుతాం
మేం నవీనులం
మేం భావుకులం
పాత లోకపు గుండెలో శతఘ్ని పగిలించి
భావి కాలపు చంద్రకాంత శిలల కరిగించి
పాట పాటకి సోకు స్వర్రంలాగ
మాట మాటకి దూకు సింహంలాగ
మేం నిలుస్తాం మేం పిలుస్తాం.
పాత లోకపు గుండెలో శతఘ్ని పగిలించి
భావి కాలపు చంద్రకాంత శిలల కరిగించి
పాట పాటకి సోకు స్వర్రంలాగ
మాట మాటకి దూకు సింహంలాగ
మేం నిలుస్తాం
మేం పిలుస్తాం.
మేం మనుష్యులం
మేం మహస్సులం
మాకు డాస్యంలేదు
మాకు శాస్తంలేదు
మాకు లోకం ఒక గీటురాయి
మాకు కరుణ చిగురు తురాయి
మేం పరపీడన సహించం
మేం దివ్యత్వం నటించం
గాలి గుర్రపు జూలు విదిలించి
హులవర్షం భవి కురిపించి
పాట పాటకు పొంగు మున్నీరులా
మాట మాటకి జారు కన్నీరులా
మేం ఆడుతాం
మేం పాడుతాం
ఆలోచనాత్యక ప్రశ్నలు
ప్రశ్న 1.
మనం మనుష్యలం అని చెప్కుకోవాలనుకుంటో మనకు ఉండవలసిన లక్షశాలేమిటి ?
జవాబు:
మనం మనుష్యలమని చెప్పుకోపాలంటే మనకు మానవత్నం ఉండాలి. ఇతర జీవుల పట్ల జాలి, దయ ఉండాలి. పాటిని కాపాడారి. ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని రక్షించాలి. ప్రకృతికి హాని తలపెట్టకూడదు. చెట్లను కొట్టకూడదు. అడవులను పెంచాలి. నీటిని వృథా చేయకూడదు. నీటి నిలువలు పెంచుకోవాలి. నీటిని కలుషితం చేయకుడడు. పాయు కాలుష్లానిన్ అరికట్టాలి. ఈ వాధంగా సృష్టిలోని ప్రతి డానిని కాపాడాలి, రక్షించాలి.
ప్రశ్న 2.
మేం నమీనులమని అంటున్నవారు డేగిన సహాంచమంటున్నారు? ఎందుకో చెప్పండి.
జవాబు:
మేం నవీనులమని చెప్పుకొనేపారు ఉపాసకులు కావాలి. అంటే ఒక విషయాన్ని తదేకంగా స్మిరించాలి, ఆచరించాలి, పిపాస ఉండాలి. అది జ్యాన పిపాస కావాలి. తెలివి తేటలు పెంచుకోపాలి. ప్రతి దాని గురించి అన్వేషణ చేసి, మూలాలు తెలుసుకోపాలి.
భూమి అంచులకు వెలుగు తెరకట్టాలి, అంటే మన కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేయాలి. నక్ష్రతాల వరకు అంతరిక్షంలోకి మన కీర్తి షతాకం ఎగరేయాలి. సంగీతంలో నైపుణ్యం సాధించాలి. మంచిగా మాట్లాడాలి. అఫివృద్ధిపథంలో సాగాలి. అఖివృద్ధి కోసం విజృంభించాలి.
ఇవి చేయండి
అవగాహన – ప్రతిస్పందన
అ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
ప్రశ్న 1.
శాలువా కప్పినపుడు కవికి ఎమరెవరు గుర్తుకు వచ్చారు ? చెప్సండి.
జవాబు:
కవికి శాలువా కప్పినప్పుడు ఒంటి మీద సరైన బట్టలు లేని తన మామ్మ గారు గుర్తుకు వచ్చారు.
ప్రశ్న 2.
సన్మానం పాందుతున్షష్తడు కవికి తన తాత రూపం ఎలా కదపంచింద ?
జవాబు:
సన్మానం పొందుతున్నప్పుడు కవికి చెప్పులు. లేకుండా మట్టి కాళ్ళతో ఉన్న తన తాతగారి రూపం కన్పించింది.
ప్రశ్న 3.
ఆత్మకథ పార్యభాగ రచయితను గురంచి రాయండి.
జవాబు:
ఆత్మకథ పాఠ్యభాగ రచయిత డా.ఎండ్లూరి సుధాకర్. ఈయన ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికుంటపల్లెలో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి వీరి తల్లిదండ్రులు. ఉన్నత చదువులు చదివిన వీరు జాషుా రచనలపై పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందారు.
కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి వీరి బిరుడులు. వర్తమానం, మల్లెమొగ్గల గొడుగు, కొత్త గబ్టిలం, వర్గకరణీయరి, గోసంగి, నల్లద్రాక్షపందిరి, ఆటాజనిగాంచె యాతా కవిత్వం, జాషువా సాహిత్యంపై విశ్లేషణ వీరి ఇతర రచనలు.
ఆ) కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అమెరికాలోని శ్వేత జాతీయులు నల్లవారిపై చూపే జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు మార్టిన్ లూధర్ కింగ్. నల్లవారికి ఓటు హక్కులేదు. కావాలన్న చోట ఇల్లు కట్టుకోకూడదు. భోజనం చేసే చోట, ప్రయాణించే చోట తెల్లవారి పక్కన కూర్చోరాదు. సాటి మనిషిన హీనంగా చూసే దురహంకారాన్ని ధైర్యంగా ఎదిరించాడు మార్టిన్.
“నాకో స్వప్నం ఉంది. బానిసల పిల్లలు, యజమానుల పిల్లలు పక్క పక్కనే కూచునే రోజు వస్తుంది. అన్యాయం అణచివేతలతో ఎడారి అయిన మిసిసిపి రాష్టం స్వేచ్ఛ, న్యాయాల ఒయాసిస్సులను పొందే రోజొస్తుందన్న స్వప్నం నాకుంది. నా పిల్లలు చర్మం రంగును బట్టి కాకుండా వ్యక్తిత్వాన్ని బట్టి మనుషులుగా విలువ పొందే రోజు వస్తుందన్న స్వప్నం నాకుంది.” అంటూ తన జాతి ప్రజల విమోచనకొరకు జీవితాంతం పోరాటం చేసిన వీరుడు ఆయన.
1929 జనవరి 15న అట్లాంటాలో జన్మించిన మార్టిన్ లూథర్ కింగ్ తండ్రి పేరు కూడా అదే. తల్లిపేరు అల్బర్టా విలియమ్స్. ముగ్గురు సంతానంలో మధ్యవాడు మార్టిన్. స్థానిక స్కూల్లో చదువుతున్నప్పుడు హొూవార్డు తూ!్రాన్ అనే గురువు ప్రభావం మార్టిన్ పై పడింది. సాటిమనిషిని మనిషిగా చూడని జంతు ప్రవృత్తిని ఈ సడించుకునే మనస్తత్వం మార్టిన్కు నచ్చింది. ఆయన ప్రోత్సాహంతో సోషియాలజీ డిగ్రీ చేసాడు.
బోస్టన్ యూనివర్సిటీ నుండి సిస్టిమేటిక్ థియాలజిలో డాక్టరేటు పొందాడు. కార్ల్మార్టు సిద్ధాంతాన్ని చదివాడు. మహాత్మాగాంధీ రచనలను, జీవితాన్ని, పోరాట మార్గాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అనేక ఉద్యమాలలో పాల్గొన్నాడు. విజయం సాధించాడు. పౌరహక్కులకోసం పోరాటం చేసిన యోధుడిగా ఇతణ్ణి ప్రపంచం గుర్తించింది. నల్లజాతి ప్రజలను నడిపించిన శక్తిగా ఇతడు కీర్తిపొందాడు. 35 ఏళ్ళకే నోబెల్ శాంతి బహుమానం పొందాడు.
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
మార్టిన్ లూథర్కింగ్ ఫవిష్యత్తును గురించి ఏం కలకన్నాడు ?
జవాబు:
అన్యాయుం, అణచివేతలతో ఎడారి అయిన మిసిసిటి రాష్ట్రంస్వేచ్చ, న్యాయాలు ఒయాసిస్స్సలను పొందే రోజు వస్తండన కలగన్నాడు.
ప్రశ్న 2.
ఉద్యమాల డ్వారా అతడు సాధించిన విజయాలేమిటి ?
జవాబు:
పౌరహక్లల పోరాటయోధుడిగా ప్రపండ గుర్తిండు ఓొంచాడు. నోబెల్ శాంతి బహుహతని కొందాడు.
ప్రశ్న 3.
పై పేరాలో ‘కల’ అని అర్థాన్నిచ్చే పదం ఏది ?’
జవాబు:
పై పేరాలో ‘కల’ అనే అర్థాన్నిచ్చే పదం స్పప్నం.
ప్రశ్న 4.
ఆకళింపు చేసుకోవడం అంటీ ?
అ) ఆవలించడం
ఆ) అర్థం చేసుకోవడం
ఇ) పోరాడడం
జవాబు:
ఆ) అర్థం చేసుకోవడం
ప్రశ్న 5.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
మార్టిన్ లూథర్ కింగ్ ఏ సబ్జెక్టులో డాక్టరేట్ పొందాడు ?
ఇ) కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలా రాయండి.
20వ శతాబ్దం స్వేచ్ఛా స్వాతంత్య ఉద్యమాలకు ఆలవాలం. బానిస సంకెళ్ళు తెంచుకోవడం కోసం ఏ్రజలు పిడికిలి బిగించి ముందుకురికిన కాలం. కవుల పాతయుగపు ఛాందసత్వం పై కలాలు ఝుళిపించిన కాలం. వ్యథార్త జీవుల గాథలకు పట్టం కట్టడం మొదలైన కాలం. తెలుగు సాహిత్యంలో దళిత జీవిత గాధలను వాస్తవిక దృష్టితో రచించడం మొదలైంది. ప్రతి మనిషి పుట్టుకకు విలువ ఉందంటూ దీనజనుల గొంతై నినదించిన ఏ్రాతఃస్మరణీయుడు గుర్రం జాషువ.
తెలుగు కథా సాహిత్యంలో తొలిసారి 1925లో శ్రీపాద సుట్రహ్మణ్యశాస్తి రాసిన ‘పల్లంరాజు కథ’లో దళితుల ఏ్రస్తావన మనకు కనిపిస్తుంది. దళిత జీవితాన్ని అనుభవించిన వ్యక్తిగా లోతులు చూచిన వాడిగా మంచి కథలు రాసినవారు ఆచార్య కొలకలూరి ఇనాక్. వీరు కోస్తాంధ్ర జీవితాన్ని, దళిత జీవితాన్ని, మూలాన్ని పట్టుకొని కొలిమి, కట్టడి, ఊరబావి, బస్సు (పయాణం వంటి గొప్పకథలు రాసారు. డాక్టర్ భార్గవీరావు సంకలనం చేసిన ‘ఇంకానా ఇకపై సాగవు’ కథలు విభిన్న కోణాలను ఆవిష్కరిస్తాయి.
గోగు శ్యామల, జూపాక సుభద్ర సంపాదకత్వంలో వచ్చిన ‘రేగటి సాళ్లు’లో దళితుల బతుకు చిత్రాలను చూడగలం. తెలంగాణ దళిత జీవితాన్ని బోయ జంగయ్య రాసిన ఎచ్చరక, గొ(రెలు కధాసంపుటాల్లో చూడగలం. రాయలసీమ దళిత జీవితాన్ని శాంతి నారాయణ, చిలుకూరి దేవపుత్ర అద్భుతమైన కధాశిల్పంతో మలిచారు. డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ ‘మల్లెమొగ్గల గొడుగు’ లో ఏ్రకాశం జిల్లా మాదిగల జీవితసారాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఇంకా నాగప్పగారి సుందర్రాజు, కొలకలూరి స్వరూపరాణి, చల్లపల్లి స్వరూపరాణి, జాజుల గౌరి, వినోదిని మొదలైన వారు దళిత కథా సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ప్రజల హక్కుల కోసం కవులు ఏమి చేస్తారు ?
జవాబు:
ప్రజల హక్కుల కోసం కవులు వ్యథార్త జీవుల గాథలకు పట్టం కట్టారు తమ రచనలలో.
ప్రశ్న 2.
రాయలసీమ ప్రాంతంలో దళిత జీవితాన్ని చిత్రించిన కథకులు ఎవరు ?
జవాబు:
రాయలసీమ ప్రాంతంలో దళిత జీవితాలను చిత్రించిన కథకులు శాంతి నారాయణ, చిలుకూరి దేవపుత్ర.
ప్రశ్న 3.
ప్రాత:స్మరణీయుడు అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
ప్రాతఃస్మరణీయుడు అంటే ఉదయమే గుర్తు చేసుకో తగినవాడని అర్థం.
ప్రశ్న 4.
ఫై పేరా చదివి రచయిత్రుల పేర్లు రాయండి.
జవాబు:
పై పేరాలోని రచయిత్రులు : గోగుశ్యామల, జూపాక సుభడ్ర, స్వరూపరాణి, జూజుల గౌరి, వినోదిని.
ప్రశ్న 5.
పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు జేయం
జవాబు:
మొదట దళిత ప్రస్తావన ఎవర కథలో వచ్చింది ?
వ్యక్తీకరణ – పృజనాత్యకత
ప్రశ్న 1.
కాలం నా పాదాలకు నమస్కరిస్తుంది అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
కాలం తన పాదాలకు ననుస్కరిస్రందనడంలో కవి ఉద్దేశం చాలా లోతైనది. గత కాలంలో తన వారంతా అనేక బాధలు పడ్డారు. తను కూడా ఎన్స్ అనకునాలను ఎముర్కొన్నాడు. ఆ రోజుల్లో అలా ఉండడానికి కారణం ఏమిటని ఎవరినైనా అడిగితే “ఆ కాలం అంతే” అంటారు. ఇక్కడ కాలం అంటే ఆ కాలంలో మానవ సమాజం డాని కట్టుబాట్లు ఆచారాలు, సంప్రడాయాలు అవన్నీ ఈ కాలంలో మారిపోయేయి.
అంటే ఈ సమాజంలో మారి ఓోయేయి. ఆనాడు కులాన్ని బట్టి, డబ్బును, హోదాను బట్టి సమాజం గౌరవించింది. ఈ కాలంలో అంటే ఈ సమాజంలో విద్యావంతులకు, మేధావులకు గౌరవం లభిస్తుంది. తను మేధావి, విద్యవంతుడు కనుక ఈ కాలం అంటే ఈ సమాజం తనకు నమస్కరిస్తోంది. తనను గౌరవిస్తోంది అని కవీ గారి ఉద్దేశం కావచ్చు.
ప్రశ్న 2.
కవి నేడు సమాజంతో సత్కారం పాందడానికి తోడ్పడిన అంశాలేమిటి ?
జవాబు:
నేటి సమాజంలో కవిగారు ఘన సత్కారం పొందడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మొట్ట మొదటిది ఆయన విద్య, జ్ఞానం, ఆయన ఉన్నత విద్యావంతుడు, మహోన్నతమైన జ్ఞాని, అంతేకాక ఎంతోమందిని చైతన్యపరిచాడు. ష్రొఫెసర్గా ఎంతో మంది విద్యార్ధులను తీర్చిదిడ్డాడు. తన రచనల ద్వారా సమాజంలోని కుళ్ళును కడిగే ఫ్రయత్నం చేశాడు. ఎంతో మంది పాఠకులను ఆలోచింపచేశాడు.
చాలా మందిని చైతన్యపరిచాడు. ఎంతో వినయంగా విమర్శలను స్వీకరిస్తూ తనను తాను అభివృద్ధిపరచుకొన్నాడు. తన విద్య, ఉద్యోగం, మంచి ప్రవర్తనల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. సమాజంలో ఒక పెద్ద మనిషిగా అందరి చేత గౌరవింపబడ్డాడు. అందుకే సత్కారానికి అర్హుడయ్యాడు. అనేక బిరుదులు, సత్కారాలు అందుకొన్నాడు.
ప్రశ్న 3.
కవి తన పూర్వీకులు ఎదుర్కొన్న సవాళ్ళ గురంచి ఏమి ఆలోచసస్తాడో రాయండి.
జవాబు:
తన హూర్వీకులు ఎదుర్కొన్న సపాళ్ళ గురించి కవి చాలా ఆలోచించాడు. అందుకే తనకు లభించిన గౌరవం అనుభవిస్తూనే, తన పూర్వీకుల కష్టాలను తల్చుకున్నాడు. తనను వేదికపై గౌరవంగా కూర్చోబెట్టినపుడు తన తాత ఊరి పొలిమేర దగ్గర నిలబడడం గుర్తొచ్చింది.
తనకు మంచి నీళ్ళ గ్లాసులు పెట్టినపుడు తన పూర్పీకులు మంచి నీటి కోసం మోకాళ్ళపై కూర్చోవడం గుర్తొచ్చింది. తనకు శాలువా కప్పినపుడు ఒంటి నిండా బట్టలు లేని తన మామ్మ గారి రూపం కళ్ళ ముండు కదిలింది. తనకు పట్టు వస్తాలు పెడితే తన తాత గారు కట్టుకొన్న చిరిగిటోయిన పంచె గుర్తుకు వచ్చింది. ఈ విధంగా కవి తన పూర్వీకులు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి ఆలోచించాడు.
ఆ) కింది ప్రశ్నలకు సమాధాగాలు రాయండి.
ప్రశ్న 1.
ఆత్మకథ పాఠ్యభాగంలో కవి వెలువరించన బాధామయ జీవితాన్నిమీ మాటల్లో రాయండి.
జవాబు:
ఆత్మకథ పాఠంలో కవి చాలా విచారకరమైన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. మయసభలాంది మాయాసథలో తనకు సన్మానం మొదలైంది. తన మెడలో దండలు వేస్తుంటే గతంలో తనకు జరిగిన అవమానాలు గుర్తుకు వచ్చాయి. అలాగే చిన్నతనం నుండీ ఎన్ని అవమానాలు పొందాడు.
తన తాత చిరిగన పంచెలు కట్టుకొన్నాడు. ఊరి పొలిమేర చగ్గర నిలబడేవాడు. తన మామ్మ గారికి ఒంటి నిండా కట్టుకొండుకు బట్టలు కూడా ఉండేవి కావు. మంచి నీళ్ళు కాఖాలంటే మోకాళ్ళపై వంగుని తాగేహారు. తను చిన్నతనంలో పశువుల పాకలో అన్నం తిన్నాడు. ఇలా కవి గారి జీవితంలో చాలా బాధామయ సంఘటనలు జరీగాయి.
ప్రశ్న 2.
కాలం నా ఆత్మకథను పాఠ్యగ్రంథంగా చదువుతుందని అనడంలో కవి ఆలోచనల గురించి రాయండి.
జవాబు:
కాలం తన ఆత్మకథను పాఠ్యగరంథంగా చదువుతుంది అనడంలో ఉద్దేశం చాలా లోతైనది. కాలం అంటే సమాజం. ఆ. కాలం. అలా ఉండేది. అంటే ఆ సమాజం అలా ఉండేది అని భావం. ఈ కాలం ఇలా ఉంది. అంటే ఈ సమాజం ఇలా ఉందని భావం. కవిగారు తన ఆత్మకథలో ఆనాటి సమాజంలో తన పూర్నూకులు ఆనుభవించిన బాధలను చెప్పారు.
ఆ రోజులలో తాను అనుభవించిన బాధలను కూడా చెప్పారు. నాటి, నేటి సమాజాలలో మార్పును కూడా సూచనా ప్రాయంగా చెప్పారు. నేటి సమాజానికి గత చరిత్ తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. జిజ్ఞాసువులకు అది అవసరం కూడా. అందుకే తప్పనిసరిగా ఈ సమాజం తన ఆత్మకథ నుండి పాఠం నేర్చుకొండుకే డానిని పార్య(గ్రంథంగా చగువుతుందని రచయిత ఉద్దేశం.
ప్రశ్న 3.
తమ గులించి తాము చెప్పుకోవడమే ఆత్యకథ. ఏదైనా ఒక వస్తువు / పక్షి / జంతువును ఎంపిక చేసుకుని అవి తమ గురించి తాము ఏమేమి చెప్కుకుంటాయో ఊహించి ఆత్మకథలా రాయండి.
జవాబు:
1. సెల్ ఫోన్
నేను సెల్ ఫోన్ మీ చేతిలో ఎక్కువగా ఉండేది నేనే. మీ స్నేహితులు, బంధువుల సమాచారాన్ని మీకు చేరమేస్తాను. వారిని మీకు చూపిస్తున్నాను కదా ! మీ హావభాఖాలు, కోపతాపాలూ నా మీద చూపిస్తారేంటి ?
మీకు ఇష్టమైన సమాచారం అందిస్తే నన్ను ముడ్దులతో ముంచేస్తారు.
మీకు కోపం వచ్చే సమాచారం వచ్చినా, మీకు కావలసిన వారికి సెంంబరు కలవకఏోయినా నస్ను తిడతారెందుకు నన్ను విసిరేస్తారెందుకు ? మీకు ఎన్ని సేవలు చేసినా, ఎంత సమాచారం ఇచ్చినా విశ్వాసం లేదు.
నన్ను ఉపయోగించుకోండి.
అనవసరమైన యాప్స్ డాన్లోడ్ చేసుకోకండి. 24 గంటలూ నా వైపే చూస్తూ సమయం వృథా చేయకండి. మీరు నన్ను సరిగా ఉపయోగించండి. మీ. చదువుకు సంబంధించి తెలియనివి అడగండి చెబుతాను. జ్ఞానం సంపాదించండి.
2. పిచ్చుక
నేను చిన్న పక్షిని. మీరెవ్వరూ నన్ను కాపాడే ప్రయత్నం కూడా చేయలేడు. ప్రస్తుతం నా జాతి అంతరించే స్థితిలో ఉంది. మీ పూర్వులు, రైతులు మా జాతిని పోషించేవారు. ఇంటి చూరుకు ఈ చివర, ఆ చివర వరివెన్నులు కట్టేవారు. అవి హాయిగా తిని మీ ఇళ్ళ దగ్గరే సంతోషంగా ఉండేహాళ్ళం. మీ ఇళ్ళల్లో చిన్నపిల్లలు మమ్మల్ని చూసి కేరింతలు కొడుతూ
ఇప్పుడన్నీ గడ్డు రోజులే. ఎక్కడా పూరిళ్ళు, పెంకుటిళ్లూ లేవు. అన్నీ డాబాలే. అఎి కూడా అపార్ట్మెంట్లే. హాయిగా ఆడుకాంటూ బతకడానికి మీకే దిక్కు లేదు. ఇక మాకేం ఆశ్రయం ఇస్తారు ? మమ్మల్నేం పోషిస్తారు.
కానీ మా బతుకులు మమ్మల్ని బతకనీయడం లేదు కడా ! సెల్టవర్లు పెట్టి మా జాతికి ముప్పు తెచ్చారు. మీరు మాటలలో సానుభూతి వ్యక్తం చేస్తారు, కానీ చేతలలో శూన్యం. మమ్మల్ని రేడియేషన్తో చంపకండి. మమ్ము్ని కాపాడండి. మేమూ మీలాంటి జీవులమే మాకూ బతికే హక్కుందని గుర్తించండి.
3. కుక్క
నన్ను చూపించి మీ పిల్లలను ఆడిస్తారు. కానీ నాకెవరూ గుప్పెడు మెతుకులు పెట్టరు. అనవసరంగా నన్నెందుకు బెడ్డలతో కాడతారు. అందుకే మమమ్ని కరుస్తాం. అప్పుడైనా మా బాధలు మీకు తెలుస్తాయని. మా బాధలు తెలుసుకోరు కానీ మాపై పగ పెంచుకొంటారు. ఇదివరకైతే మమ్మల్ని బండిపై తీసుకళ్ళి చంపేసేహారు.
అమల, రష్మి వంటి గొప్ప తల్లుల పుణ్యమా అని మా ప్రాణాలకు భద్రత కల్గింద. మీరు మమ్మల్ని పెంచుకొని టామీ, లూసీ, టైగర్ ఇలాంటి పేర్లు పెడతారు. కానీ, కుక్క కుక్కే కడా అంటారు. మీ మాట వినకపోతే అతిక్రూరంగా కొడతారు.
మీ ఇళ్ళు, ఆస్తులు కాపలా కాస్తాం. విశ్వాసానికి మారు పేరుగా బతుకుతాం. అయినా మేమంటే మీకు ఇష్టం ఉండదు. మీ ఎంగిళ్ళు మేం తినాలి. కానీ, మీరు తినేవి ఏమైనా మేం వాసన చూస్తే చాలు కుక్క ముట్టుకొంది అని అవతల పారేస్తారు. మీలో ఈ ఇగో మాత్రం ఎప్పటికీ పోదు.
ప్రశ్న 4.
“మనుషులందరూ సమానమే” అనే అంశంపై ఐదు నినాదాలు రాయండి.
జవాబు:
- అన్ని కులాల కంటే మానవ కులం గొప్పది.
- నీ ప్రక్క వానిని కూడా నీలాగే ఇష్టపడు.
- జంతువులకు, పక్షులకూ లేని కులమత భేడాలు మనకెందుకు ?
- కలసి ఉంటే కలదు సుఖం.
- చెలిమిని మించిన కలిమి లేదు.
భాషాంశాలు – పదజాలం
అ) కింద ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం తెలుసుకొని సొంత మాటల్లో రాయండి.
ప్రశ్న 1.
నాలుగు రోడ్ష చౌరస్తాలో జాతీయ జెండా ఎగురవేశారు.
జవాబు:
చౌరస్తా = నాలుగు రోడ్ల కూడలల
సొంతవాక్యం : నాలుగు రోడ కూడలిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.
ప్రశ్న 2.
పూరిగుడిసె అగ్నికి అర్చణం అయ్యింది.
జవాబు:
అర్పణం = ఇవ్వడం
సొంతవాక్యం : భక్తితో భక్తులు పరమాత్లునికి ప్రసాదాలను ఇచ్చుకున్నారు.
ప్రశ్న 3.
పిల్లలు తెలివితేటల్లో చురకత్తుల్లా ఉన్నారు.
జవాబు:
చురకత్తుల్లా = పదునైన చిన్న కత్తులు
సొంతవాక్యం : పదున్నెన కతులతో రుద్రమదేవి సైన్యం శత్రువులపై విరుచుకుపడింది.
ఆ) కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
జవాబు:
1. స్వర్ణం : పసిడి, బంగారం, కనకం
2. సూర్యుడు : రవి, ఆదిత్లుడు, ద్యుమణి
3. కళ్ళు : నే(తాలు, అక్షులు, నయనాలు
4. దేహం : శకీరము, కాయం, తనువు
ఇ) కింది పదాలకు నానార్థాలు రాయండి.
జవాబు:
1. తల : ముఖ్యమైనది, మస్తకం
2. కాలం : నలుపు, సముయం
3. క్రియ : చేష్ఠ, ప్రాయశ్బిత్తము, పూజ, శిక్ష
4. రామ : స్త్రీ, రాముడు
ఈ) కింది ప్రకృతి పదాలు వికృతులను జతపరచండి.
జవాబు:
1. భోజనం ( సి ) ఎ) కత
2. బ్రధ్న ( డి ) బి) ప్వ్ను
3. కథ ( ఎ ) సి) బోనము
4. పుష్పం ( బి ) డి) ప్రొద్దు
వ్యాకరణాంశాలు
సంధులు
ఆమ్రేడిత సంధి
ఈ కింది ఉదాహరణలను పరిశీలించండి.
ఔరారౌ = ఔర
ఓహూహో = ఓహూ + ఓహూ
ఏమేమి = ఏమి + ఏమి
సూత్రం – 1 : ఈ పదాలను విడదీసినపుడు పూర్వపదం, పరపదం రెండింటిలోనూ ఒకే పదం వస్తుంది. ఇలా రెండూ ఒకవిధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు.
సూత్రం – 2 : ఆమ్రేడితం పరమైనపుడు విభక్తిలోపం బహుళంగా వస్తుంది.
ఉదా॥ అప్పటికిన్ + అప్పటికిన్ : అప్పటప్పటికిన్
అక్కడన్ + అక్కడన్ : అక్కడక్కడన్
అ) కింది పదాలు విడదీసి, సంధి పేరు తెలపండి.
జవాబు:
1. పావనమైనది = పావనము+ ఐనది – ఉత్వసంధి
2. ధర్మమొకటి = ధర్మము + ఒకటి – ఉత్వసంధి
3. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు – అత్వసంధి
4. గుర్తుకొస్తుంది (తప్పు) = గ్లుర్తుకు + వస్తుంది – ఉత్వసంధి
సమాసాలు
తశ్పురుష సమాసం : ఉత్తర పద అర్థం ప్రధానంగా కలది తత్పురుష సమాసం.
ప్రథమా తత్పురుష సమాసం : ప్రథమా విధక్తి చివర కలిగిన పూర్వపదం, ఉత్తర పద అర్ఝ ప్రాధాన్యత కలిగినది.
ప్రథమా తత్పురుష సమాసం : ప్రథమా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి. (డు, ము, వు, లు)
ఉదా ॥ మధ్యాహ్నము : అహ్నము మధ్యభాగము
నడిరేయి : రేయి నడిమి భాగము
ద్వితీయా తత్పురుష సమాసం : ద్వితీయా విధక్తితో కూడిన పూర్వపదాలు కలవి (నిన్, నున్, లన్, కూర్చి, గురించి)
ఉదా ॥ కృష్డాశ్రితుడు : కృష్ణుని ఆశ్రయించినవాడు
నెలతాల్పు : నెలను తాల్చినవాడు
తృతీయా తత్పురుష సమాసం : తృతీయా విభక్తితో కూడిన పూర్వపడాలు కలవి (చేతన్, చేన్, తోడన్, తోన్)
ఉదా ॥ వాక్కలహము : వాక్కు చేత కలహము
విద్యాహీనుడు : విద్య చేత హీనుడు
చతుర్థీ తత్పురుష సమాసం : చతుర్థీ విఫక్తితో కూడిన పూర్వపదాలు కలవి (కొరకున్, కై)
ఉదా ॥ ధనాశ ధనము కొరకు ఆశ
పొట్టకూడు పొట్ట కొరకు కూడు
పంచమీ తత్పురుష సమాసం : పంచమీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (వలనన్, కంటె, పట్టి)
ఉదా ॥ దొంగభయం : దొంగ వలన ఫయం
పాప విముక్తుడు : పాపము వలన విముక్తుడు
షష్తీ తత్పురుష సమాసం : షష్తీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి (కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్)
ఉదా ॥ రాజపుతుడు : రాజు యొక్క పుతుడు
యజ్ఞఫలం : యజ్ఞము యొక్క ఫలం
సప్తమీ తత్పురుష సమాసం : సప్తమీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి. (అందున్, నన్)
ఉదా ॥ నీతి పారగుడు : నీతి యందు పారగుడు
మాటనేర్పరి మాట యందు నేర్పరి
అ) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి
అ) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి
కర్మధారయ సమాసం :
1. మేలు వస్త్రాలు : మేలైన వస్తాలు — విశేషణ హూర్వప్ కర్మభారయ సమాసం
2. ముతక పంచెలు : ముతకవి అయిన పంచెలు — విశేషణ పూర్వపద కర్మథారయ సమాసం
3. కొత్త దేవుళ్ళు : కొత్తవారైన దేవుళ్ళు — విశేషణ పూర్వపద కర్మథారయ సమాసం
4. వక్రధ్వనులు : వక్రమైన ధ్వనులు — విశేషణ పూర్వపద కర్మథారయ సమాసం
5. నాలుగు పంక్తులు : నాల్లెన పంక్తులు — ద్విగు సమాసం
అలంకారాలు
అ) రూపకాలంకారం
“మా అమ్మచేతి వంట అమృతం”.
పై వాక్యంలో అమ్మచేతి వంట ఉపమేయం, అమృతం – ఉపమానం, అమ్మచేతి వంటకు – అమృతానికి భేదం లేదని (అభేదం) చెప్పడం కనిపిస్తుంది.
నిర్వచనం: ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడాన్ని రూపకాలంకారం అని అంటారు.
ఉదా: ఈ మహారాజు సాక్షాత్తూ ఈశ్వరుడే!
సమన్వయం: ఇక్కడ మహారాజు ఉపమేయం. ఈశ్వరుడు ఉపమానం ‘సాక్షాత్తు’ అనే పదం రాజుకు, ఈశ్వరునికి భేదం లేదు అని వర్ణించబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
“నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి”.
అవమానాల చురకత్తులు – అవమానాలనెడి చురకత్తులు
అవమానం – ఉపమేయం, చురకత్తులు – ఉపమానం
అవమానాలు – చురకత్తులకు – భేదం లేదని వర్ణించబడింది. కాబట్టి ఇది రూపకాలంకారం.
ఛందస్సు
కింది పద్య పాదాలకు గురు – లఘువులను గుర్తించండి. శార్దూల పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
ఉదా॥
లక్షణం :
శార్దూల పద్యానికి 4 పాడాలుంటాయి.
ప్రతి పాదంలోనూ వరుసగా మ,స,జ,స,త,త,గ అనే గణాలుంటాయ.
యతి 13వ అక్షరం – ప్రాస నియమం కలదు.
సమన్వయం :
ఇచ్చిన పద్యపాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉన్నాయి.
యతి – 13వ అక్షరం – ‘ఆ – ద్రా’ కు చెల్లినది.
కనుక ఇచ్చినది శార్దూల పద్య పాదం.
1.
లక్షణం :
శార్దూల పద్యానికి 4 పాదాలుంటాయి.
ప్రతి పాదంలోనూ వరుసగా మ,స,జ,స,త,త,గ అనే గణాలుంటాయి.
యతి 13వ అక్షరం – ప్రాస నియమం కలదు.
సమన్వయం :
ఇచ్చిన పద్యపాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉన్నాయి.
యతి – 13వ అక్షరం – ‘మా – భా’ కు చెల్లినది.
కనుక ఇచ్చినది శార్దూల పద్య పాదం.
2.
లక్షణం :
శార్దూల పద్యానికి 4 పాడాలుంటాయి.
ప్రతి పాదంలోనూ వరుసగా మ,స,జ,స,త,త,గ అనే గణాలుంటాయి.
యతి 13వ అక్షరం – ప్రాస నియమం కలదు.
సమన్వయం :
ఇచ్చిన పద్యపాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉన్నాయి.
యతి – 13వ అక్షరం – ‘బా – భ్భా’ కు చెల్లినది.
కనుక ఇచ్చినది శార్దూల పద్య పాదం.
3.
లక్షణం :
శార్దూల పడ్యానికి 4 పాదాలుంటాయు.
ప్రత పాదంలోనూ వరుసగా మ,స,జ,స,త,త,గ అనే గణాలుంటాయి.
యతి 13వ అక్షరం – ప్రాస నియమం కలదు.
సమన్వయం :
ఇచ్చిన పద్యపాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉన్నాయు.
యతి – 13వ అక్షరం – ‘ప్రా – త్పా’ కు చెల్లినది.
కనుక ఇచ్చినది శార్యూల పద్య పాడం.
4.
లక్షణం :
శార్దూల పద్యానికి 4 పాడాలుంటాయి:
ప్రతి పాదంలోనూ వరుసగా మ,స,జ,స,త,త,గ అనే గణాలుంటాయి.
యతి 13వ అక్షరం – ప్రాస నియమం కలదు.
సమన్వయం :
ఇచ్చిన పద్యపాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉన్నాయి.
యతి – 13వ అక్షరం – ‘కం – గ’ కు చెల్లినది.
కనుక ఇచ్చినది శార్దూల పద్య పాదం.
ప్రాజెక్టు పని
క్యూ.ఆర్ కోడ్ను స్కాన్ చేయండి. కొలకలూరి ఇనాక్ గారు రచించిన ‘కట్టడి’ కథ చదవండి. దానిపై సమీక్షరాసి మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
ఈయన నవభారత నిర్మాత బాబా సాహౌట్ అంజేద్కర్ మీ పాఠశాల చ్రంథాలయంలో పరిశీలించి అయన జీవిత విశేషాలను, మన దేశానికి చేసిన సేవల గురించి రాయండి.
జవాబు:
డూ.బి.ఆర్. అంబేద్కర్
నవభారత రాజ్యాంగ నిర్మాణ రథసారథిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా, విశ్వవిఖ్యాతుడైన డా.ఖీమారావ్ అంబేద్కర్ 1891 సం॥రం ఏప్రిల్ 14వ తేదీన మహారాష్తంలోని రత్నగి జిల్లాలో, మందన్గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్ కులానికి చెందిన రాంజీ సక్పాల్ భీమాబాయి అను దంపతులకు 14వ సంతానంగా జన్మించాడు.
అంబేద్కర్ కార్యవాది. క్రియాశీలి, నిమ్నజాతుల సముద్ధరణయే ఆయన ఊపిరి. భావనాశక్తికి సంకల్పబలం. అనుభవం, విజ్ఞానం తగిన పాళ్ళలో సమకూరితే ఎంత గొప్ప కృషి జరుగగలదో, చరితలో ఎన్ని మార్పులు వస్తాయో అన్న దానికి ఆయన జీవితమే నిదర్శనం. బాల్యంలో విన్న పురాణగాథలు, కబీరు సూక్తులు, బుర్ధుని జీవితచరిత్ర, మహాత్మాఫూలే జీవితం ఆయనను ప్రభావితం చేశాయి. కులం కారణంగా చిన్నతనం నుండే సమాజం చూపిన చిన్న చూపును భరించి సంకల్పబలంతో అన్ని ఆటంకాలనూ అధిగమించి, పాశ్చాత్య విద్యతో తేజస్సంపన్నుడై, తన జాతికి కొత్త వెలుగును చూపిన మేధావులైన రాజకీయవేత్తలలో అంబేద్కర్ ఆఖరి తరానికి చెందినవాడు.
1927 సం||మున అంబేద్కర్ “బహిష్కృత భారత్” (Bahishkrit Bharat) అనే మరాఠీ పక్షపత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంజేద్కర్ ఇలా అఫ్నాడు. “తిలక్ గనుక అంటరానివాడుగా పుట్టి ఉంటే “స్వరాజ్యం నా జన్మ హక్కు” అనేవాడు కాదు. “అస్ఎృశ్లతా నిహారణే నా ధ్యేయం.
నా జన్మ హక్కు” అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వ్ర వాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1932- సం||మున బ్రిటిష్ ప్రభుత్వం “కమ్యూనల్” అవార్డును ఫ్రకటించింది. దాని ఫలితం అస్ట్రులకు ప్రత్యేక స్థానాలు లభించాయి. కొన్ని సంవత్సరాలు అస్టృశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం ఓోరాటం సాగించాడు.
భారతదేశానికి స్వాతంత్యం రావడం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగా అంబేద్కర్ విశేష .శయ వహించి, రాజ్యాంగం రచించడం ఆయన జీవిత విశేషంలో ప్రముఖమైన ఘట్టం. అప్పటి కేంద్రమంత్రియైన టి. ట. కృష్ఙమాచారి ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ – “రాజ్యాంగ రచనా సంఘంలో ఏడుగురిని నియమించడం జరిగింది. అందులో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు.
వేరాకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్త రాజకీయాల్లో నిమగ్నులయ్యారు. ఉన్న ఇద్దరూ ఫిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా. అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు” అని అన్నారు.1935 సం॥రంలో మొదటి భార్య మరణించింది. తర్వాత తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి “శారదా కబీర్” ను వివాహమాడాడు. 1956 సం॥ము అక్టోబరు 14 న నాగపూర్లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
పద్య మధురిమ
ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుఁగాని దుః
ఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీ భరతమేదిని ముప్పదిమూఁడుకోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులాఱునే
భావము: ఏటేటా బొమ్మల పెళ్ళిళ్ళు చేయడానికి వందలు వేలరూపాయిలు ఖర్చు చేస్తున్నారు. కానీ పేదవాళ్ళ ఖాళీపాత్రల్లో ఒక్కమెతుకు కూడా విదల్చడానికి మనసొప్పదు. కోట్లాది దేవతలకు నిలయమైన ఈ దేశంలో అన్నార్తుల ఆకలి తీరుతుందా? గబ్బిలం – గుఱ్ఱం జాషువ
పదాలు – అర్ధాలు
1. మయసభలో …………………. కోస్తూ ఉంటుంది.
అర్థాలు:
మయసభ = పాండవులకు మయుడు నిర్మించి ఇచ్చిన సభా భవనం
ఆత్మకథ = తన కభ
అవిష్కరించడం = తెరవడం
బహిరంగ వేదిక = ఆరు బయట ప్రాంగణం
సన్మానం = సత్కారం
గాయము = రక్తం కారేలా తగిలిన దెబ్ష
కొరడా = చర్నాకోలు
అభినందన = పొగడ్త
పత్రం = కాగితం
చురకత్తి = చిన్నకత్తి
పొలిమేర = ఊరి చివర
మొహం = ముఖం
జేజెమ్మ = మామ్మ
మసక = మబ్బుపట్టిన
భావము : మయసధ వంది మాయాసధ (ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కనబడే మాయాజాలం ఉన్న సభ) కవి రచించిన ఆత్మకథ అనే పుస్తకం ఆవిష్కరించబడింది. ఆ వేదిక మీద పుస్తక రచయితకు సన్మానం మొదలయింది. సన్మానంలో భాగంగా రచయిత మెడలో పూలదండలు వేస్తున్నారు. అవి చూసి గతంలోని గాయాలు గుర్తుకు వచ్చి అతని మనసు ఉలిక్కి పడింది. కవి తల మీద పూలు చల్లుతుంటే ముళ్ళ కొరడాలతో తన వారు తిన్న దెబ్బలు గుర్తాచ్చాయి.
కవిని అభినందిస్తూ రచించిన అభినందన పత్రం చదువుతుంటే గతంలో తనకు జరిగిన అవమానాలు అనే కత్తులు కడుపులో బాధించేయి. సభా వేదిక మీద కూర్చోబెడుతున్నపుడు, తన తాతను ఊరి షొలిమేరలో నిలబెట్టిన దృశ్యమే కళ్ళ ముందు కదిలింది. రచయిత ముందు మంచి నీళ్ళ గ్లాసులు పెట్టినప్పుడు మోకాళ్ళపై వంగి మంచి నీళ్ళు తాగిన దృశ్యం గుర్తు వచ్చింది. రచయితకు శాలువా కప్పినప్పుడు ఒంటి నిండా బట్టలు కూడా లేని తన మామ్మగారి రూపం మనసులో మెదిలి గుండెను కోసినట్లయింది.
2. పట్టువస్తాలు …………. పీల్బుకుంటుంది.
అర్థాలు:
అర్పణం = ఉచితంగా ఇవ్వడం
గొడ్లు = పచులు
బువ్వ = భోజనం
పొద్దు = సమయం
గురువు = ఉపాధ్యాయుడు
మన్ను = మట్టి
వేధించడం = బాధించడం
చౌరస్తా = నాలుగు రోడ్ల కూడలి
స్వర్ణము = బంగారం
పూర్వీకులు = గతంలోనివారు
డేహం = శరీరం
ధూళి = మట్టి
మాళిగ = పాతర
భావము :తనకు సన్మానంలో భాగంగా పట్టు వస్తాలు పెడుతుంటే తన తాత కట్టుకొన్న చిరిగి పోయిన పంచె తన కళ్ళు అనే దండెం తీగపై వేలాడుతున్న దృశ్యం కళ్ళ ముందు కదిలింది. తనను భోజనానికి పిలుస్తుంటే చిన్నప్పుడు గొడ్లపాకలో అన్నం తిన్న రోజులు గుర్తొచ్చాయి.
తన, పాదాలకు కాలమే నమస్కరిస్తుంటే చెప్పులు కూడా లేని తన తాత మట్టి కాళ్ళీ గుర్చొచ్చాయి. ఎక్కడెనా తన చిన్ననాటి గురువులు కనిపిస్తే, ఏకలవ్యుని బొటన(వ్రేలు కోరిన ద్రోణాచార్యుడు గుర్తొస్తాడు. అందుకే తన దొటనఐ్రేలును గుప్పెట్లో దాచేసుకొంటాడు.
తన కవిత్వాన్ని అందరూ మెచ్చుకొంటుంటే మట్టిలో కలసిపోయిన తన జాతి కవిత్వం గుర్తొచ్చి బాధిస్తుంది. తనకు రోడ్ కూడళ్ళలో కట్టిన స్వాగత తోరణాలు చూస్తే తనతో నడవడానికి సిద్ధపడుతున్న ఎందరో కనిపిస్తారు. భూమిలో కలిసిపోయిన తన తాత ముత్తాతల దేహప మట్టి కొత్తగాలి పీల్బుకొంటోంది.
3. దేవాలయాలూ ……………… చదువుకుంటుంది.
అర్థాలు:
దేవాలయం = గుడి
దశ్శనం = చూడడం
పడిగాపులుపడు = బాగా నిరీక్షించు
గుడ్డి చీకటి = ఖూర్తి చేకటి
వక్రధ్వని = వంకరగా చేసే శబ్దం
నీలి = నలుపు
చీల్చు = చీరు
కిరణము = కాంతి
తలం = సఫలం
భావము : ఆధునిక దేవాలయాలైన పాఠశాలలు, కొత్త దేవుళ్లన గురువులూ, కవి గారి రాక కోసం, ఆయనను చూడడం కోసం విపరీతంగా ఎదురు చూస్తుండే సంధ్యాసమయంలో గుడి గంటలు వంకరగా శబ్దాలు చేశాయి. నవ్వుకున్నాయి. కులాలనే నల్లని మబ్బుల నీడల్ని చీల్చుకొంటూ కవిగారు సూర్యుడిలా ఉదయించేరు, ఈ మేధావుల రక్త కాంతి చంద్రబింబం మీద ప్రతిబింబించింది. ఈ కొత్త సూర్యుడి వెలుగులో కాలమే కవి గారి ఆత్మకథను పాఠ్య గ్రంథంగా చదుపుకొంటోంది.
కవి పరిచియం
కవి పేరు : డా॥ ఎండ్లూరి సుధాకర్
తల్లిదండ్రులు : దేవయ్య, శాంతాబాయి దంపతులు
స్వగ్రామం : ఆకాశం జిల్లాలోని కనిగి తాలుకాలోని రావికుంటపల్లె గ్రామం.
ఉద్యోగం : తెలుగు విశ్వవిద్యాలయంలో, కేంద్రీయ విశ్వవిద్యాలయం (హైదరాబాదు)లో లెక్చరర్, అసోసియేట్ ప్రొఫెసర్, శాఖాధిపతిగా పని చేశారు.
రచనలు : 20 గ్రంథాలకు సంపాదకత్వం వహాంచారు. వర్తమానం, మల్లెమొగ్గల గొడుగు, కొత్త గష్లిలం, వర్గీకరణీయం, గోసంగి, నల్లు్రాక్ష పందిరి, ఆటాజనిగాంచె జాషు రచనలపై విశ్లేషణ వీరి రచనలు. ప్రస్తుత పాఠ్యాంశం ‘నల్ల దాక్షపందిర’ నుండి గ్రహించబడినది.
బిరుదులు : కవిరత్న, నవయుగ కవితా చక్రవర్తి
ప్రత్యేకత : నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అనే ప్రకటన చేయడం.
ఉద్దేశం
జీవితంలో చాలా సమస్యలుంటాయి. అవి చాలా కష్టనష్టాలను కలిగించవచ్చు. జీవితమనేది అందరికీ వడ్డించిన విస్తరికాదు. జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని విజయాలు సాధించిన వారి జీవితాలు ఆదర్శంగా తీసుకోవాలి. విజయాలు సాధించాలి. అటువంటి వారిలో ప్రస్తుత పాఠ్యభాగ రచయిత ఒకరు సమాజం అతని కృషిని గౌరవించి, సన్మానిస్తుంది. కాని కవి ఆ సన్మానానికి పొంగిపోడు.
గతంలో తన వారికి జరిగిన అవమానాలే కళ్ళ ముందు కదుల్తాయి. ఆ దుఃఖాలు బాధిస్తాయి. విద్య మాత్రమే మనిషికి గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరచిపోకూడదు. గతం మరువకూడదనేది చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
నేపథ్యం
మానవుడు స్వేచ్ఛాజీవి, ఒక మనిషి తన స్వతంత్రానికి భంగం కలిగితే సహించలేడు. హక్కులకు భంగం కలిగితే తిరగబడతాడు. పసిపిల్లలు కూడా తమకిష్టం లేకపోతే తల్లి పాలు కూడా తాగరు. ఏ మనిషికామనిషికే వ్యక్తిత్వం ఉంటుంది. తనకంటూ గుర్తింపు కోరుకొంటాడు, సమాజంలోని కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు మనిషి స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తాయి.
మనిషి వాటిని తెంచుకోవాలనుకొంటాడు. అందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. తన సృజనాత్మకత వివరిస్తాడు. మనిషిలోని మంచితనాన్ని మానవీయతను ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది. సమస్యలకు కుంగిపోక ఎదురొడ్డి పోరాడి విజయం సాధించిన కవి గారి ఆలోచనే దీని నేపథ్యం.
ప్రక్రియ – వచన కవిత
ఈ పాఠ్యభాగం వచన కవితా ప్రక్రియకు చెందినది. వచన కవితకు ఛందోనియమాలేవీ ఉండవు. గణాలు, యతిప్రాసల నియమాలు ఉండవు. లోతైన భావంతో చిక్కని పదాలతో చక్కగా సాగే లయాత్మక కవిత్వాన్ని వచన కవిత అంటారు.