Access to the AP 9th Class Telugu Guide 3rd Lesson హరివిల్లు Questions and Answers are aligned with the curriculum standards.
హరివిల్లు AP 9th Class Telugu 3rd Lesson Questions and Answers
చదవండి – చర్చించండి
ప్రకృతి కావ్యాలు
చెట్లు,
ప్రకృతి రాసుకుంటున్న కావ్యాల్లా పరిమళిస్తున్నాయి
వాటి నిండా విస్తరించే పత్రాలు భావ ఛతాలై
మండి పోయే మట్టి మీద
మమతల నీడలు కురిపిస్తున్నాయి.
వాటి గుండెల్లో నిదురించే కలలు
ఫలాలుగా మేల్కొని
ఆకొన్న ప్రాణికోటికి ఆహారమై తరిస్తున్నాయి.
తోటలు,
గాలి ఒడిలో గంధాలు నింపుతున్నాయి
ఎంత పంచినా తరగని స్నేహ పరిమళం
ఎంత మోసినా తనివి తీరని
రాగబంధం పవనాలది
బండరాళ్ళను, సెలమేళ్ళను
కని పెంచే మాతృత్వం
కొండకోనలది
ఖేచరాలను, భూచరాలను
కళ్ళకద్దుకొనే కరుణామయులు
చెట్టుచేమలు
స్నార్థ పూరిత మానవ లోకానికి
సహనహీనతత్వ సమాజానికి
సహజీవన పాఠం బోధిస్తున్నది ప్రకృతి.
ఆలోచనాత్యక ప్రశ్నలు
ప్రశ్న 1.
ఎన్నో జీవాశులకు ఆవాసం కల్విస్తున్న చెట్నను చూస్తే నీకేమనిహిస్తుంది ?
జవాబు:
చెట్లు చాలా జీవులకు ఆవాసం కల్సిస్తున్నాయి. వాటి మీద ఎన్నో పక్షులు గూళ్లు .కట్టుకొని నివసిస్తున్నాయి. ఎంతోమంది మానవులు చెట్ల క్రింద కూర్చొని చల్లగాలిని పీల్చుకొంటున్నారు. ఎన్నో జంతువులు కూడా చెట్ల నీడన హాయిగా విశశమిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు మా మామ్మగారు గుర్తువస్తారు.
ఎందుకంటే ఆవిడ కూడా బాటసారులను ఇంట్లోకి పిలిచి కడుపునిండా ధోజనం పెడతారు. విశశమించడానికి మడత మంచాలు వేస్తారు. ‘రోజుం కుక్కలకు, పిల్లులకు అన్నీ పెడతారు. ఆవులను, గేదెలను మేపిస్తారు, మా ఊరి చెరువు గట్టున పెద్ట రావి చెట్టు ఉంది. అది ఆమే నాటారు. అందుకే మా మామ్మ గారినందరూ చెట్టు మామ్మగారు అంటారు.
ప్రశ్న 2.
చెట్టును, పిట్టను, చీమను చూసి మనం ఎన్నోవిషయాలు నేర్చుకోవచ్చు. ఇలా మీకు అనుభవమైన ఏదైనా ప్రకృతి నేర్పన పాఠం గురంంచి చెష్డి.
జవాబు:
మాకు ఒక కుక్క ఉంది. దాని పేరు లూసీ, అది చాలా విశ్వాసంగా ఇంటిని కాపలా కాస్తుంది. డానిని మా ఇంట్లో మనిషిలాగే చూస్తాం. అది ఒకసారి ఒక మూలకు చూస్తూ మొరుగుతోంది. అక్కడ ఎండుపుల్లలు, చెత్తా చెడారం ఉంటాయి. ఎంత ఆపినా ఆగలేదు. దానిని విప్పగానే ఆ చెత్తను కాలితో దువ్వింది.
అంతే దానిలో నుండి పెద్ద తాచుపాము వచ్చి, లూసీని కరిచింది. వెంటనే ఆసుపత్రికి తీసుకొని పెళ్లారు. బ్రతికింది. ఎవరినో పిలిచి ఆ పామును పట్టించేసారు. నేను, మా తమ్ముడు అక్కడే ఆడుకొంటాం. లూసీ మా ప్రాణాలు కాపాడింది.
ఇవి చేయండి
అవగాహన – ప్రతిస్పందన
అ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
ప్రశ్న 1.
కోలాహాలాద్రి తన పేరును ఎలా సార్థకం చేసుకుంది ?
జవాబు:
కోలాహల పర్వతం మీద ఒకవైపు కోకిలల పాటలు వినిపిస్తాయి. ఒక వైపు నెమళ్ల క్రేంకారాలు వినిపిస్తాయి. ఒక వైపు చిలుకల పలుకులు మధురంగా వినిపిస్తాయి. ఒక వైపు దేవతా స్త్రీల పాటలు వినిస్తాయు. ఒక వైపు సురకాంతల పాటలు వినిపిస్తాయి. ఒక వైపు గోరువంకల సంభాషణలు వినిపిస్తాయి.
ఒక వైపు చారణ కుమార స్తుతులు వినిపిస్తాయి. ఒక వైపున అరటి పందిళ్ల క్రింద కిన్నెర స్త్రీల పాటలు వినిపిస్తాయి. ఈ విధంగా పర్వతమంతా చాలా కోలాహలంగా ఉండడం చేత కోలాహల పర్వతం తన పేరును సార్ధకం చేసుకుంది.
ప్రశ్న 2.
మేఘాలను కవి ఎణా వర్ణించాడు ?
జవాబు:
దిక్కరుణుల బృందము ఒక్కసారిగా ఈనిన పిల్లలు ఆకాశంలో వ్యాపించాయా అన్నట్లు నల్లని మేఘాలున్నాయి. గాలి దెష్ణకు కులపర్వతాలన్నీ భూమి నుంచి పెళ్ళగించుకుపోయి ఆకాశంలోకి ఎగిరాయా అన్నట్లుగా మేఘాలున్నాయి. పాతాళంలో ఉన్న దట్టమైన చీకట్లన్నీ సూర్యుడుని మింగాలనే కోరికతో ఆకాశంలోకి వెళ్ళాయా అన్నట్లుగా నల్లని మేఘాలున్నాయి.
భూమికి నాలుగువైపులా వున్న సముడ్రాలన్నీ విజృంభించి ఆకాశంలో వున్నాయా అన్నట్లుగా ? మేఘాలున్నాయి. పైన చెప్పిన వాటన్నిది వల దట్టమైన మేఘాలు దిక్కుల చివరల పుట్టి, ఆకాశంలో వ్యాపించి ఆకాశాన్ని మూసివేయగా చాలా మెరుపులు కనబడ్డాయి. ఆకాశం నుండి పిడుగులు, రాళ్ళు పడటం ఆరంభించాయి అని దట్టమైన. మేఘాలను కవి వర్ణించాడు.
ప్రశ్న 3.
అరణ్య వర్ణశలో మీకు ఆశ్చర్యం కలిగించన లంశం ఏద ?
జవాబు:
పులులు నిద్రపోతుంటే డాని పెదవుల చివర ఈగలు ముసరడం ఆశ్చర్యం కల్గించింది. ఎలుగుబంటి తేనె తుట్టెను కాడితే తేనిటీగల నీడలు పడితే వాటి మధ్య ఎండ పడింది. అది నువ్వులు, బియ్యం కలిపి చల్లినట్లు ఉందని వర్ణించడం నాకు చాలా ఆశ్చర్యం కల్గించింది.
ఆ) కింది పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
మందారమకరందమాధుర్యమునc దేలు
మధుపంబు వోవునే? మదనములకు;
నిర్మలమందాకినీవీచికలc దూఁగు
రాయంచ చనునె? తరంగిణులకు;
లతితరసాలపల్లవఖాది యై చొక్కు
కోయిల సేరునే? కుటజములకుఁ;
బూర్ణేందుచంద్రికాస్ఫురితచకోరక
మరుగునే? సాంద్రనీహారములకు
అంబుజోదరదివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్తమేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయునేల?
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
ఈ పద్యంలో పేర్కొన్న పక్షుల పేర్లు రాయండి.
జవాబు:
రాయంచ, కోయిల, చకోర పక్షులు ఈ పద్యంలో పేర్కొన్న పక్షులు.
ప్రశ్న 2.
పై పద్యంలో పొగమంచు అని అర్థం వచ్చే పదం ఏది?
జవాబు:
పై పద్యంలో నీహారిక అనేది పొగమంచు అనే అర్థం వచ్చే పదం.
ప్రశ్న 3.
తుమ్మెదలు దేనిని ఆస్వాదిస్తాయి ?
జవాబు:
మందార పుష్పంలో తేనెను తుమ్మెదలు ఆస్వాదిస్తాయి.
ప్రశ్న 4.
“అంబుజోదరుడు” – సమాసం తెల్పండి.
జవాబు:
అంబుజమే గర్భముగా గలవాడు – బహువ్రీహి సమాసం.
ప్రశ్న 5.
“లేత మామిడి చిగుళ్ళను తినే కోయిల కొండమల్లెలను కోరుకోదు” – ఇలాంట మరొక వాక్లాన్ని మీ సొంతంగా రాయండి.
జవాబు:
చెంగల్వ గడ్డిని మేసే కపిల గోవు ఎండు గడ్డిని తినదు.
ఇ) కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
శ్రీనగరంలో కెల్లా ప్రశస్తమైన సరోవరం దాల్ సరస్సు. అందులో నౌకా విహారం చేస్తూ దారి చుట్టూ రమణీయంగా నెమలిపింఛంలో కన్నులు కుదురుకున్నట్టుగా అమరిన పూల తోటలు చూడడం ఆ వేళ్టి మా కార్యక్రమం. సరస్సులో తిరగడానికి పడవలు సిద్ధంగా ఉన్నాయి. దాల్ సరస్సు మా ముందు పరచుకుని ఉంది. ఎక్కడ చూసినా వెండిరేకులా తళ తళలాడే నీటి ఉపరితలం.
శరరీ నగరానికి తూర్పు దిశనున్న ఈ సరస్సుకు ఆవల వైపునున్న పర్వత (శేణి నిటారుగా ఠీవిగా నిల్చుని సరస్సు అందాన్ని తదేకంగా పరికిస్తున్న రస హృదయుడైన వ్యక్తిలా కనిపిస్తుంది.ఆ పర్వత శరీర ఛాయ నీళ్లలో ప్రతిబింబిస్తూ గాఢ నీల వర్ణంతో భాసించే నీటిలో, ఛాయ పడినంతమేరా నలుపు కలిసిన మరో వర్ణఛాయను కల్పిస్తుంది.
నిర్మలంగా అలజడి లేకుండా మెరుస్తున్న జలగర్భాన్ని చీల్చుకుంటూ ముందుకు పోతోంది నావ. ఆ నీటి తు్లింతలకు చుట్టుపక్కల చిన్నచిన్న కెరటాలు ఏర్పడి చూస్తుండగానే దూరంగా తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లిపోయే పసిపిల్లల పాదాల్లా జరిగిపోవడం మొదలుపెట్టాయి. నీరు నిండుగా మనోహరమైన నీలవర్ణంతో భాసిస్తోంది.
ఆకాశం స్వచ్ఛంగా ఉన్నప్పది ప్రతి ఫలనంలో ఒక అందం. దూరంగా ఉన్న కొండ నీళ్లల్లో తొంగి చూసినప్పడు ఒక అందం పక్కగా పోయే మరో పడవ నీడ నీళ్లలో హుందాగా కదలాడినప్పుడు మరొక అందం. పడవ నడిపేవాడు పాటలు పాడడం మొదలుపెట్టాడు. గాలి సన్నగా మధురంగా చేసే సవ్వడితో లయ కలుపుతూ అతడు పాడే పాట మనోజ్ఞంగా కిందనున్న జలతరంగాలను అనుసరిస్తూ పెడలు పెడలుగా చెవులను తాకుతోంది.
ఈ రామణీయకం ఇలా శాశ్వతంగా కళ్లముందు నిలిచోపోతే! ఈ అనంత ప్రకృతి శోభా సంపదను అనుక్షణం అనుభవిస్తూ అజరామరమైన అమృతత్వాన్ని పొందగలిగితే! ఎన్ని ఊహలు.. నా మెదడులో చకచకా మెరిసే ఊహలు. (-నాయని కృష్ణకుమారి – కాశ్మీర దీపకళిక నుండి)
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
దాల్ సరస్సులో నీరు వెండి రేకులా ఉందని రచయిత్రి అన్నారు. నీవు అయితే దేనితో పోలుస్తావు ?
జవాబు:
నేనైతే దాల్ సరస్సులోని నీటిని ఉల్లిపొర కాగితంతో పోలుస్తాను.
ప్రశ్న 2.
సరస్సుకు అవతల వైపునున్న పర్వతాల వరుస ఎలా ఉంది?
జవాబు:
సరస్సుకవతల ఉన్న పర్వతాల వరుస నిటారుగా ఠీవిగా నిల్చుని సరస్సు అండాల్ని తదేకంగా పరికిస్తున్న రస హృదయుడైన వ్యక్తిలా ఉంది.
ప్రశ్న 3.
పడవ నడిపే వాని పాట మరింత మనోజ్ఞంగా ఎందుకనిపిస్తోంది ?
జవాబు:
జల తరంగాల ననుసరిస్తూ చెవులను తాకడం వలన అ పాట మరింత మనోజ్ఞంగా ఉంది.
ప్రశ్న 4.
కదిలిపోయే కెరటాలను రచయిత్రి దేనితో పోల్చారు ?
జవాబు:
కదిలిపోయే కెరటాలను తప్పటడుగులు వేస్తూ వెళ్లిపోయే పసిపిల్లల పాదాలతో పోల్చలరు.
ప్రశ్న 5.
ఫై గద్యభాగానికి సరైన 8ీర్షిక పెట్టండి.
జవాబు:
దాల్ సరస్సు
వ్యక్తీకరణ – పృజనాత్యకత
అ) కంది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధాసాలు రాయండి
ప్రశ్న 1.
పాఠంలో సూర్యోదయ, సూర్యాస్తమయాల్నికవులు ఎలా వర్ణించారో మీ సాంత మాటల్లో రాయండి.
జవాబు:
సూర్యోదయాన్ని కవిగారు చక్కగా వర్చించారు. ఆకాశమనే పొలంలో నక్షత్రాలనే పంట పండింది. దానిని ఉదయం అనే గొప్ప రైతు తూర్పారబట్టాడు. అది తూర్పు దిక్కున తెల్లదనంగా తోచింది. సారం కోల్పోయిన చంచ్రుడు దానికి దూరంగా ఎర్రగా మాంసప ముద్దలా అస్తమించాడు. సూర్యోదయం అయ్యుంది.
సూర్యాస్తమయాన్ని కూడా కవిగారు చక్కగా వర్ణించారు. సూర్యాస్తమయ సమయంలో కాలం అనే వక్తకుడు ఆకాశం అనే త్రాసులో ఒక వైపు కెంపు, మరో వైపు తెల్లని ముత్యాలు పోశాడు. తక్కెడ మళ్య బిళ్లగా జాబిల్లిని ఉంచాడు. తక్కెడ ఒక్కసారిగా పైకి లేపాడు. కెంపు (సూర్యుడు) క్రిందకి (క్రుంగింది. ముత్యాల పళ్లెం పైకి లేచింది. ముత్యాలు జలజలా రాలాయి. అవే నక్షత్రాలు అని సూర్యాస్తమయాన్ని కవిగారు చాలా చక్కగా వర్చించారు.
ప్రశ్న 2.
వెన్నెల వెల్లువ దేవతలను సైం ఎలా బ్రాంతికి లోను చేసిందో వివరంచండి.
జవాబు:
వెన్నెల వెల్లువ అన్ని జీవులను షైమరపింప చేసింది. దేవతలను కూడా భ్రమింప చేసింది. దట్టమైన వెన్నెల లోకమంతా వ్యాపించింది. ఆ వెన్నెలలో దేవతలు తమ వాహనాల విషయంలో పొరబడ్డారు. ఇంద్రుని వాహనం ఐరావతం. అది తెల్లా ఉంటుంది. యముని హాహనం డున్నపోతు. అది నల్లాా ఉంటుంది.
నల్లని దున్నపోతుని చూసి, ఇంద్రుడు తన హాహనమైన తెల్లసి ఐరావతం అనుకొని పొరబడ్డాడు. శవుని వాహనం నందీశ్వరుడు. తెల్లగా ఉంటాడు. వాయువు వాహనం మేకపోత. నల్లగా ఉంటుంది. వెన్నెలలో శివుడు మేకపోతుని చూసి తన వాహనమైన నంది అనుకొని పొరబడ్డాడు. బ్రహ్మ వాహనం హంస. అది తెల్లగా ఉంటుంది. కుమారస్వామి వాహనం నెమలి. అది నల్లగా ఉంటుంది. వెన్నెలలో బ్రహ్మ నెమలిని చూసి తన వాహనమైన హంస అనుకొన్నాడు.
ప్రశ్న 3.
కోలాహలపర్వతం గురించి రాయండి.
జవాబు:
కోలాహలము అనునది ఒక పర్వతము. హిమవంతుని కుమారుడు. ఇతడు శుక్తిమతియను నదిని కామించాడు. ఖీరి ద్దఱకు వసుపదుడను కుమారుడును, గిరికయను కూతురును కలిగిరి. శుక్తిమతి ప్రవహించుటకు ఈ పర్వతము అడ్డుగా ఉన్నందున ‘వసువు’ అను రాజు దీనిని కాలితో తన్ని నదికి మార్మము చేసెను. ఇది మామూలు పర్వతం కాదు. క్రీడా పర్వతం. చుక్తి మతిని అల్లి చేసిన కోలాహలుడి కొమ్ములు విరిచి, మదం అణచివేసాడు వసు మహారాజు. నర్మ సచివునితో ఆయన వ్యాహ్యాళికి వెళ్ళినపుడు ఆ కోలాహల పర్వతాన్ని ఎంతో అద్భుతంగా కవి వర్ణించాడు.
ఆ) కింది ప్రశ్నలకు సమాధాగాలు రాయండి.
ప్రశ్న 1.
వర్షం కురిసినపుడు మురు పాందిన అనుభూతిని వర్ణుస్తూ మిత్రుడికి లేఖ రూపంలో రాయండి.
జవాబు:
కాకినాడ
x x x x x
ప్రియమైన కార్తీకికి,
ఇక్కడంతా క్షేమం, అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.
జూలైలో మా ప్రాంతంలో బాగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మా వీధిలో రోడ్డు చాలా పల్లంగా ఉంటుంది. దానితో చాలా నీరు నిలబడిపోయింది. నేను, రాజు, కిరణ్ వానలో భలే ఆడుకొన్నాం. ‘వానా వానా వల్లప్పా ………..’, అంటూ ఆడపిల్లలు కూడా ఆడుకొన్నారు. చాలా ఆనందం అనుభవించాం.
జవాబు వ్రాయి.
ఇట్లు,
నీ స్నేహితుడు,
వై. అరుణ్.
చిరునామా :
కె. కృష్ర కార్యీక,
నెం. 16, 9వ తరగతి,
ఆనంద్ ఇంగ్లీషు మీడియం స్కూలు,
గనికమ్మ గుడి వీధి, అమలాపురం,
డా.బి. ఆర్. అంబేద్కర్ కోనసీమజిల్లా.
ప్రశ్న 2.
ఈ పాఠంలో డాశరథ చీకటిని వర్ణించిన తరులో మీరు గుర్తించిన విశేషాలను రాయండి.
జవాబు:
చీకట్లను దాశరథి చాలా చక్కగా వర్ణించారు, చీకట్లు అందమైన స్త్రీ యొక్క చంద్రబింబంలాంటి ముఖంపైన కస్తూరి దొట్టుగా నిలిచింది. నల్లస్ గిరజాల జుట్టుగల స్త్రీ కనుటొమ్మలనే ఇంద్రధనుస్సుకు చీకట్లు బాణంలా నిలిచాయి. లేడి కళ్లు వంటి కళ్లు గటి అందమైన స్తీ యొక్క అందమైన బుగ్గపై చీకట్లు నల్లని చుక్కగా మారాయి. తెల్లని కైలాస పర్వతంపై చీకట్లు నల్లని మేఘమై నిలిచాయి. చంద్రుడనే పొలంలో నల్లని జింకలులా చీకట్లు నిలిచాయి. తెల్లని ఆదిశేషువు పై నల్లని విష్ణుమూర్తిలా చీకట్లు నిలిచాయి.
ప్రశ్న 3.
సాహిత్యంలో కవులు ప్రక్తి వర్ణనకు ఎందుకింతటి ప్రాధాన్యత నిచ్చారో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ప్రక్తం
మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగం. ఆది మానవుడు ప్రకృతిలోని పెద్ద పెద్ద చెట్లు, గుహలు, నదులు, సెలయేళ్లు, పర్వతాలు, ఎడారులు మొదలైనవి చూసి చాలా భయపడేవాడు. కాల క్రమేణా ప్రకృతిలోని అందాలను చూచి పరవశించాడు. పక్షుల, జంతువుల అరుపులను అనుకరించాడు, అలా అలా ప్రకృతి అండాలను తదేకంగా చూడడం అలవరచుకొన్నాడు. ఆ పరిశీలనలో ఆనందం పొందాడు. మైమరచిపోయాడు. తన అనుభూతిని రకరకాలుగా వ్యక్తీకరించాడు. చితాలు గీశాడు.
అభినయం ద్వారా చూపించాడు. అలతి అలతి పదాలతో కవిత్వం రచించాడు. ఆ కవితా వస్తువుగా ప్రకృతిని స్వీకరించాడు. రకరకాలుగా వర్ణించాడు. ఇప్పటికీ కవులు వర్ణిస్తున్నారు. వర్ణిస్తూనే ఉంటారు. ప్రకృతి అందాలను ఎంత వర్ణించినా కవులకు తనివి తీరదు. సూర్యోదయం, సూర్యాస్తమయం, నదులు, వెన్నెల, పర్వతాలు, ఉద్యానవనాలు, చీకటి, చంద్రుడు, వెస్న్రెల ఇలా ఎన్నెన్ వర్ణించారు కవులు, అందుకే కవులు ప్రకృతిని విడిచి ఉండలేరు. అందుకే సాహిత్యంలో కవులు ఏ్రకృతి వర్ణనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
భాషాంశాలు – పదజాలం
అ) ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి, దానిని ఉపయోగించి సొంత వాక్లం రాయండి.
1. భానుడు తూర్పున ఉదయిస్తాడు.
భానుడు = సూర్యుడు
సొంతవాక్యం : సూర్యుడంటే పద్మాలకు ఇష్టం.
2. శివుని తాండవం చూస్తే ఆనందం కలుగుతుంది.
తాండవం = నాట్యం
సొంతవాక్యం : నాట్యం అనేది లలితకళలలో సమాహార కళ.
3. నాకు అమ్మభాష అంటే మిక్కిలి ఇష్టం.
మిక్కిలి
సొంతవాక్యం : ఎక్కువగా ఏదీ చేయకూడదు.
4. జింక తత్తరపాట్లుతో పొదలోకి దూకింది.
తత్తరపాటు కంగారు
సొంతవాక్లం : దేనికీ కంగారు పనికిరాదు.
5. సాయంకాలం కాగాఖే సూర్యబింబం కనుమరుగెంది.
కనుమరుగైంది = అదృశ్లమైంది
సొంతవాక్యం : రాక్షస బల్లుల జాతి అదృశ్యమెంది.
ఆ) కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : నభం :- ఆకాశం, గగనం
ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. రాజు గగనం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
1. ధనువు = విల్లు, ధనుస్సు
రాముడు శివుని విల్లు ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సు ఫెళ్లున విరిశోయింది.
2. పయోధరము = మేఘము, జలధరము
మేఘము నల్లగా ఉంటే వర్షం పడుతుంది. ఆకాశంలో జలధరములు చాలా ఉన్నాయి.
3. కేదారము = ఓొలము, పంటభూమి
డబ్బు మోజులో పడి ఓొలములు చేపల చెరువులు చేస్తున్నారు. పంట భూమికి నీరు, ఎరువులు కావాలి.
4. సస్యము = పంట, పైరు
సస్యము పండితేనే మనకు తిండి. పైరు పచ్చగా ఉంటే వెచ్చని కూడుకు లోటుండదు.
5. వెల్లువ = ప్రవాహు, వెల్లి
గంగా ప్రవాహం పవిత్రమైనది. వెన్నెల పాలవెల్లిలా ఉంది.
6. నెచ్చెలి = స్నేహితురాలు, సఖి
లక్ష్మి స్నేహితురాలు సరస్వతి. సరస్వతికి నెచ్చెలి పార్వతి.
ఇ) కింది పదాలకు గానార్థాలు రాయండి
1. ధర: భూమి, ఖరీదు
2. పంక్తీ : వరుస, ఒక ఛందస్సు
3. తారక : నక్షత్రము, కంటిలోని నల్లగ్రుడ్డు
4. చుక్క : నక్షతము, బిందువు
ఈ) కింది పదాలకు వ్యుత్తత్తులు రాయండి
1. సూర్యుడు : లోకమును ప్రకాశింప చేయుహాడు.
2. ధర : భూమిని ధరించునది.
3. తోయజము : రక్షించునది
4. శైలము : శిలలతో కూడినది.
ఉ) కింది ప్రకృతి పడాలకు వికృతి పదాలు రాయుండి.
1. సంధ్య = సందె, సంజ
2. దిశ = దెస
3. ఆకాశం = ఆకసము
4. చంద్రుడు = చేందరుడు
5. ముత్యము = ముత్తియ (ప)
6. మేఘము = మొయిలు
వ్యాకరణాంశాలు
సంధులు
యడాగమ సంధి :
సూత్రం: “సంధి లేనిచోట స్వరంబు కంటె పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.”
“ఆగమంబనగా వర్ణాధిక్యంబు”
ఉదా: మా + అమ్మ = మాయమ్మ
మీ + ఇల్లు = మీయిల్లు
సూత్ర వివరణ: సంధి జరగనప్పుడు అచ్చు కంటే పరమైన అచ్చుకు యడాగమం వస్తుంది. స్వరం అంటే అచ్చు. యట్ + ఆగమం = యడాగమం ‘య’లో అకారం ఉచ్చారణానికి చేర్చబడింది. ‘య్’ అనేది ఆగమమవుతుంది. తెలుగు భాషలో పూర్వపదాంత దీర్ఘాచ్చులకు సాధారణంగా సంధి జరగదు. ఇతర అచ్చులకు కూడా కొన్ని సందర్భాలలో సంధి జరగదు. రెండు అచ్చుల్ని వరుసగా ఉచ్చరించడం కష్టం. కాబట్టి ఉచ్చారణ సౌకర్యం కోసం వాటి మధ్యలో ‘య’కారం చేరుతుంది. దీన్నే ‘యడాగమం’ అంటారు.
వర్ణాధిక్యం అంటే ఒక వర్ణం అధికంగా వచ్చి చేరడం ‘మిత్రవదాగమః’ అని లక్షణం. ఆగమం మిత్రుని వంటిది. కాబట్టి ఒక వర్ణం మిత్రునివలె పక్కకు వచ్చి చేరడం ఆగమమని గ్రహించాలి.
రూప సాధన : మా + అమ్మ
‘మా’లోని ‘ఆ’ పూర్వ స్వరం. ‘అమ్మ’లోని ‘అ’ కారం స్వరం కంటే పరమైన స్వరం. కాబట్టి దానికి ముందు ‘య్’ అనేది ఆగమం అవుతుంది.
మా + య్ + అమ్మ = మాయమ్మ
మీ + ఇల్లు = మీ + య్ + ఇల్లు = మీ యిల్లు
ఈ యడాగమం కళలకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ద్రుతర్రకృతికాలకు సంధి లేనిచోట నుగాగమం వస్తుంది.
అ) కింది పదాలను విడదీసి సంధుల పేర్లు రాయండి.
1. ఇందుండేగి = ఇందుండు + ఏగి = ఉత్వ సంధి
2. అయ్యెడన్ = ఆ + ఎడన్ = సంధి
3. సుధాంశుడు = సుధ అంశుడు = సవర్ణదీర్ఘ సంధి
4. బ్రహ్మాదులు = బ్రహ్మ + ఆదులు = సవర్ణదీర్ఘ సంధి
5. దుగ్ధాంబునిథి = దుగ్ధ + అంబునిధి = సవర్ణదీర్ఘ సంధి
ఆ) పాఠం చదివి కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి.
1. సవర్ణదీర్ఘ సంధి = ట్రహ్మాండము, మధురానుభూతి
2. ఉత్వసంధి = నారదులైరి, కొండలన్నీ
3. త్రికసంధి = అక్కన్య, అయ్యెడ
సమాసాలు
ఖాళీలను ఫూరించంజి.
జవాబు:
అలంకారాలు
అ) ఉత్తేక్షాలంకారం
లక్షణం :- ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది.
ఉదాహరణ:- ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుంది.
సమన్వయం : పై ఉదాహరణలో వెన్నెల పాలవెల్లి (పాలసము(ద్రం)గా ఊహించబడింది. కాబట్టి ఉత్ప్రేక్షాలంకారం అయ్యింది.
ఛందస్సు
శార్దూలపద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం.
* పాఠంలోని కింది పద్య పాదాలకు గురు – లఘువులను పరిశీలించండి.
శార్దూల పద్య లక్షణాలు :
1. ఇది వృత్త జాతికి చెందిన పద్యం.
2. ఇందులో నాలుగు పాదాలుంటాయి.
3. ఏతిి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి.
4. ప్రతి పాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా వస్తాయి.
5. ప్రతి పాదంలో 13వ అక్షరం యతి స్థానం.
6. ప్రాస నియమం ఉంది.
కింది పద్య పాదాలకు గురు – లఘువులను గుర్తించండి. పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
1. ఉదయధరాధరంబు పయినుండి హుటాహుటి నేఁగుదెంచుచో
ఇది చంపకమాల పద్యపాదము.
లక్షణము :
1. చంపకమాల పద్యంలో నాలుగు పాడాలుంటాయి.
2. ప్రతి పాదము నందును న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
3. యతి 11వ అక్షరం, ప్రాస నియమం కలదు.
సమన్వయం :
1. ఇచ్చిన పద్యపాదంలో వరసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలున్నాయి.
2. యతి 11వ అక్షరం ‘ఉ – న + ఉ’ లకు చెల్లినది.
2. అల్లన కాలవర్తకుఁడు నయ్యోడఁగెంపును ముత్తియంజులున్
ఇది ఉత్పలమాల పద్యపాదము.
లక్షణము :
1. ఉత్పలమాల పద్యము నందు నాల్గు పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలో వరుసగా భ, ర, న, భ, ఫ, ర, వ అనే గణాలుంటాయి.
3. యతి 10వ అక్షరం. ప్రాస నియమం కలదు.
సమన్వయం :
1. ఇచ్చిన పాదంలో వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
2. యతి 10వ అక్షరం. ‘అ – న + అ’లకు చెల్లినది.
3. శారదరాత్రులుజ్ఞ్వల లసత్తర తారకహార పంక్తులం.
ఇది ఉత్పలమాల పద్యపాదము.
లక్షణము :
1. ఉత్పలమాల పద్యము నందు నాల్గు పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలో వరుసగా భ, ర, న, భ, ఫ, ర, వ అనే గణాలుంటాయి.
3. యతి 10వ అక్షరం. ప్రాస నియమం కలదు.
సమన్వయం :
1. ఇచ్చిన పాదంలో వరుసగా భ, ర, న, ఫ, భ, ర, వ అనే గణాలుంటాయి.
2. యతి 10వ అక్షరం. ‘శ – స’ లకు.చెల్లినది.
4. ‘తారాసస్యము’ పద్యంలోని మిగిలిన పాదాలకు గణవిభజన చేయండి.
రెండవ పాదము
ఇది శార్దూల పద్యపాదము.
లక్షణం :
1. శార్దూల పద్యానికి 4 పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలోనూ వరుసగా మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. యతి – 13వ అక్షరం. ప్రాస నియమం కలదు.
సమన్వయం :
1. ఇచ్చిన పద్యపాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉంటాయి.
2. యతి 13వ అక్షరం. ‘ని – ని’ లకు చెల్లినది.
మూడవ పాదము
ఇది శార్దూల పద్యపాదము.
లక్షణం :
1. శార్దూల పద్యానికి 4 పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలోనూ వరుసగా మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. యతి – 13వ అక్షరం. ప్రాస నియమం కలదు.
సమన్వయం :
1. ఇచ్చిన పద్యపాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉంటాయి.
2. యతి 13వ అక్షరం! ‘టీ – చె’ లకు చెల్లినది.
నాల్గవ పాదము
ఇది శార్దూల పద్యపాదము.
లక్షణం :
1. శార్దూల పద్యానికి 4 పాదాలుంటాయి.
2. ప్రతి పాదంలోనూ వరుసగా మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. యతి – 13వ అక్షరం. ప్రాస నియమం కలదు.
సమన్వయం :
1. ఇచ్చిన పద్యపాదంలో మ,స,జ,స,త,త,గ అనే గణాలు వరుసగా ఉంటాయి.
2. యతి 13వ అక్షరం. ‘దూ – దు’ లకు చెల్లినది.
ప్రాజెక్టు పని
క్యూ.అర్. కోడ్ను స్కాన్ చేయండి. “మౌనంగానే ఎదగము….” గేయాన్న చదవ అందులో గల రక్రనలఫి వ్యాఖ్యాగం రాయండి. తరగఆగదల ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
పద్య మధురిమ
శా. 1. వాసోనిగ్రహ మెన్న రాకలియు నిర్వట్టుల్ గణింప ర్తలల్
మాసెంగా యన అంగముల్ బడలినం బాటింప రట్టుండనీ
యాసాయంబుగ నానిశాత్యమయుగా నామ్నాయముల్ గ్రోల్చుచో
నాసీన ప్రచలాయితం బయిన లే దాహా! వితర్కింపగన్ — పాండురంగ మాహాత్త్యము, తెనాలి రామకృష్ణుడు
భావం : అయుత, నియుత లిద్దరూ అగస్తుని శిష్యులు. వారికి చదువంటే ఎంతో (శద్ధ. ఎలాంటి దుస్తులు ధరించారో పట్టించుకోరు. ఆకలి దప్పులను గురించి ఆలోచించరు. తలలు మాసినా, శరీరం అలసినా శశర్ధ పెట్టరు. అహెూారాత్రులు చదువు గురించే ధ్యాస. వేదాలు వల్లె వేస్తున్నప్పుడు కదలక, మెదలక కునికి పాట్లు పడకుండా శరద్ధగా చదువుకునేవారు.
పద్యాలు – ప్రతిపదార్ధ తాత్వర్యాలు
1వ – పద్యం
శా. తారా సస్యము పండినన్ గగన కేదారంబునం, జంద్రికా
నీరం బారగఁగోసి, తర్రుచి ఫలానీకంబు ప్రాతర్మహా
సీరి గ్రామణి తూరుపెత్తెననఁదోచెం దూర్పునందెల్పు, త
ద్దూరన్యస్త పలాల రాశి క్రియనిందుండేగె నిస్సారుడై
ప్రతిపదార్ధం :
తారా = నక్షతాలనెడు
సస్యము = పంట
పండినన్ = పండగా
గగన = ఆకాశమనెడు
కేడారంబునన్ = పొలంలో
చంద్రికా = వెన్నెలనెడు
నీరంబు + ఆరగన్ = నీరు ఆరిపోగానీ
కోసి = పంటను కోస్
తత్ = ఆ రుచుకమైన
ఫలానీకంబు = ఏంట మొత్తం
ప్రాతః = ఉడయం అనే
మహా సీర = గాప్ప రైత
గ్రామణి = గ్రామీణుడు
తూరుపుఎత్తెను = తూర్పారబట్టెను
అనన్ = అనునట్లుగా
తోచెన్ = ఊట్గింది
తూర్పునన్ = తూర్పు దిక్కున
తెల్పు = తెల్లడనము
తత్ = ఆ
దూరన్తస్త = దూరంగా ఉంచబడిన
పలాల = మూంసపు
రాశి = ముద్దలా
క్రియన్ = అనునట్లు
ఇందుండు = చంద్రుడు
ఏగెన్ = వెళ్ళెను
భావము : ఆకాశమనే పొలంలో నక్షత్రాలనే పంట పండగా దానిని ఉదయం అనే గొప్ప రైతు తూర్పారబట్టగా అది తూర్పు దిక్కున తెల్లదనంగా తోచింఓ, సారం కోల్పోయిన చంద్రుడు దూరంగా ఎర్రని మాంసపు ముద్దలా అస్తఖంచెను.
2వ – పద్యం
ఉ. అల్లన కాలవర్తకుఁడు నయ్యెడఁ గెంపును ముత్తియంబులున్
మెల్లనఁదూన్కె చూచుటకు మేలిమి త్రాసునఁబెట్టి తూఁచఁగా
ఝల్లని ఏ్రాలు ముత్తెముల చాడ్పునc దారలు, త్రాసు బిల్ల జా
బిల్లి యనంగ, మించె, మణి పేరిటి సూర్యుఁడు గ్రుంకుచుండcగన్
ప్రతిపదార్ధం :
కాలవర్తకుడు =కాలమనే వ్యాపారి
కెంపును = ఎర్రటి వైఢూण్యాన్ని
ముత్తియంబులున్ = మంచి ముత్యాలను
అల్లన = ఒకసారి
మెల్లన = నెమ్మదిగా
తూన్కె = తూచి
చూచుటకు = చూడడానికి
ఆ + ఎడ = అ సమయంలో
మేలిమి = మంచి గొప్పదైన
తాసునన్ = తాసులో
పెట్టి = ఉంచి
తూచగా = తూకం వేయగా
మణిపేరిటి = కెంపు అను పేరు గల
సూర్యుడు = రవి
గ్రుంకుచుండగన్ = తాసులో క్రిందికి దిగుచుండ
తాసుబిల్ల = త్రాసును పట్టుకొనే పిళ్ల
జాబిల్ల = చంద్రుడు
మించి = తిశయించి
అనంగ = అనుకొనుచుండగా
ఝుల్లు + అని = ఆశ్చర్యకరంగా
వ్రాలు = రాలుతున్న
ముత్తెముల = మంచి ముత్యాల విధంగా
చాడ్సున =విధంగా
తారలు =నక్షత్రాలున్నాయి
భావము : సూర్లాస్తమయ సమయంలో కాలం అనే వర్తకుడు ఒక పెద్ద కెంపును ముత్యాలతో తూకం వేశాడు. ఆకాశమే త్రాసుగా తీసుకున్నాడు. ఆ త్రాసులో ఒకבైపు పళ్ళెంలో నిండా ముత్యాలు పోశాడు. రెండవ వైపు పళ్ళెంలో ఎర్రది వైఢూర్యాన్ని ఉంచాడు. తాసును పైకతత్తే బిళ్ళ చంద్రుడు. అది పట్టుకుని (తాసును పైకి లేపాడు. సూర్యుడు (కంపు) ఉన్న పళ్ళెం క్రిందకు కుంగిపోతోంది. ముత్యాలున్న పళ్ళెం తటాలున తేలిపోయింది. మంచి ముత్లాలు రాలుతున్నాయి. అవే తారలుగా ఆకాశంలో ఉన్నాయి. అదే సూర్యాస్తమయం.
3వ – పద్యం
చ. శమనుని దుంతఁ బట్టుకొనె శక్రుఁడు దా వెలి యేనుఁ గంచు; వే
గమున బురారి నంది యని గాడుపు నెచ్చెలి మేకపోతుపైఁ
దమకము మీఱననెక్కె; నల ధాత కుమారుని నెమ్మిగాంచి హం
సముగc దలంచె; సాంద్రతర చంద్రిక లోకములెల్లఁగప్పుటన్
ప్రతిపదార్ధం :
సాంద్రతర = దట్టమైన
చంద్రిక = వెన్నెల
లోకములు + ఎల్లన్ = లోకాలన్నీ
కప్పుటన్ = వ్యాపించుట చేత
శక్రుడు = దేమేంద్రుడు
తాన్ = తన
వెలి ఏనుగు = తెల్లని ఏనుగు (ఐరావతము)
అంచు = అనుకొంటూ
వేగమున = గబగబా
శమనుని = యమధర్మరాజు యొక్క
దుంతన్ = దున్నపోతుు
పట్టుకొనే = పట్టుకొన్ను
పుర + అరి = శవుడు
నంది = తన వాహనమైన నందీశ్వరుడు
అని = అనుకొని
గాడుపు నెచ్చెలి = తన స్నేహితుడైన వాయువు యొక్క
మేకపోతుపైన్ = మేకపోతు మీద
తమకము మీరన్ = తొందర పెరుగగా
ఎక్కెను = అధిరోహించెను
అల = అక్క
కుమారుని = సుబ్రహ్మణ్యేశ్వరుని
నెమ్మిన్ = వాహనమైన నెమలిని
కాంచి = చూచి
ధాత = బ్రహ్మ
హంసముగన్ = తన హాహనమైన హంసగా
తలంచెన్ = అనుకున్నాడు
భావము : దట్టమైన వెన్నెల లోకమంతా వ్యాపించగా ఆ వెన్నెలలో దేవతలే తమ వాహనాల విషయంలో పొరబడ్డారు. నల్లనివన్నీ తెల్లగా కనిపించాయి. దేవేంద్రుని వాహనమైన ఐరావతం తెల్లగా ఉంటుంది. యముని వాహనమైన నల్లని దున్నపొతుని చూచి అది తన వాహనమనుకొని పట్టుకొన్నాడు. వాయువు వాహనమైన నల్లని మేకపోతును తన వాహనమైన తెల్లని నందీశ్షరుడనుకొస శివుడు అధిరోహించెను. కుమార స్వామి వాహనమైన నీలం రంగులో ఉండే నెమలిని చూచి తన వాహనమైన తెల్లని హంస అని బ్రహ్మదేవుడు అనుకొన్నాడు.
4వ – పద్యం
ఉ. నారదులైరి సన్మునులు, నాక మహీజములయ్యు భూజముల్
శారదలైరి భామినులు శంకర శైలములయ్య్ గోత్రముల్
పారదమయ్యె నీరధులు, పన్నగ నాయకులయ్యె నాగముల్
వారిద వర్గమెల్ల సితవర్ణములయ్యెను బండు వెన్నెలన్
ప్రతిపదార్ధం :
పండు వెన్నెలన్ = నిండు వెన్నెలలో
సత్ + మునులు = మునీశ్వరులు అందరూ
నారదులు + ఐరి = (తెల్లటి) నారద మహర్షు లయ్యారు
భూజముల్ = వృక్షాలన్నీ
నాక = స్వర్గలోకపు
మహీజములు = (దేవతా) వృక్షాలు
అయ్యె = అయినవి
భామినులు = స్తీలు
శారదలు = (తెల్లని) సరస్వతీ దేవిలు
ఐరి = అయ్యారు
గో(తముల్ = పర్వతాలు
శంకర శైలములు = (తెల్లని) కైలాస పర్వతాలు
అయ్యో = అయినవి
నీరధులు = సము(దాలు
పారదములు = పాదరసములు
అయ్యె = అయినవి
నాగముల్ = సర్పములు
పన్నగ = పాముల
నాయకులు = రాజులు(తెల్లని ఆది శేషువులు)
అయ్యె = అయినవ
వారిద వర్గములు = మబ్బుల గుంపులు
ఎల్లన్ = అన్నీ
సితవర్ణములు = తల్లని రంగు కలవి
అయో = అయునవి
భావము : పండు వెన్నెలలో భూలోకంలోని మునీశ్వరు లెందరో దేవర్షి అయిన నారదుని వల తెల్లగా కనిపించారు. వృక్షాల్నీ తెల్లని దేవతా వృక్షాల వలే కనిపించాయి. స్ట్రీలందరూ సరస్వతి దేవి వలె తెల్లగా కనిపించాయి . పర్వతాలన్నీ కైలాస పర్వతంలా తెల్లాగా కనిపించాయి. సముద్రాలన్ని తెల్లగా సాదరస ప్రవాహాలులా కనిపించాయి. పాములన్నీ తెల్లగా ఆదిశేషువులా కనిపించాయి. మబ్చులన్నీ తెల్లా కనిపించాయి.
5వ – పద్యం
సీ. ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందు బింబాననా
ముఖమై కస్తూరి బొట్టు పెట్టి
ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా
భ్రుకుటికా ధనువు నంబకము కూర్చి
ఇటు సాగి అటు సాగి ఇందీవరేక్షఙా
పక్ష్మభాగములపై వచ్చి (వాలి
ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు
చెక్కిలిపై అగర్ చుక్క నునిచి
తే గీ. వెండి కొండపయిన్ మబ్బు విధము దోచి
చంద్రకేదారమున లేడిఛాయ తిరిగి
ఆదేశునిపై విష్టువై శయించి
చీకటులు కూర్చె నందమ్ము లోకమునకు.
ప్రతిపదార్ధం :
చీకటులు = అంధకారాలు
ఇటు ప్రాకి అటు ప్రాకి = ఇటూ అటూ ఏాకి
ఇందు బింబా + ఆనన= చంద్రబింబము వంటి ముఖము గల స్త్రీ యొక్క
ముఖముపై = ముఖం మీద
కస్తూరి = నల్లని కస్తూరని
బొట్టుపెట్టి = తిలకంగా పెట్టి
ఇటు దూకి అటు దూకి = ఇటూ అటూ గెంతి
కుటిల = వంకర తిరిన
నీల + అలక = నల్లని జుట్టు గల స్త్రీ యొక్క
భూకుటికా = రెండు కనుబొమ్ములు అనెడు
ధనువునకు = ధనస్సునకు
అంబకమున్ = నల్లని మెంట్రుకలనై బాణమును
కూర్చి = ర్పాటు చేసి
ఇటు సాగి అటు సాగి = అటూ ఇటూ ప్రయాణించి
ఇంటీవర = నల్ల కలువల వంటి
ఈక్షణ = కళ్ళు గలిగిన స్త్రీ యొక్క
పక్ష్మభాగములు = కనురెప్పలు
పై = పైన
వచ్చి = ప్రవేశించి
వాలి = (నల్లని వెంట్రుకల రూపంలో) వాలి
ఇటు వీగి.అటు వీగి = ఇటూ అటూ దాగి
మృగనేత్ర = లేడి కళ్ళు వంటి కళ్ళు గల స్త్రీ యొక్క
బంగారు = పచ్చని రంగు గల
చెక్కిలిపై = బుగ్గపై
అగర్ చుక్కను = అగులు బొట్టును
ఇనిచి = ఉంచి
వెండ కొండఫై = కైలాస పర్వతముపై
మబ్బు విధము = నల్లని మేఘం లాగ
తోచి= కనిపించి
చంద్రకేచారమున = చంద్రుడు అనెడు పొలంలో
లేడి ఛాయ = లేడి వలె భమింపజేసి
తిరి = తరిగ
ఆది శోషుప్రై = తెల్లని ఆదీషేషువుపై
విష్ణువు + ఐ = నల్లని ఎష్చుమూర్తి అయి
శయించి = పండుకొని
లోకమునకు = లోకానికి
అందమ్ము = సొగసును
కూర్చె = తెచ్చి పెట్టెను
భావము : చీకట్లు చండ్రబింబములాటి ముఖము గల స్త్రీ ముఖముపై నల్లని కస్తూరి బొట్టుగా నిలిచాయి. చీకట్లు నల్లని గిరజాల జుట్టు గల స్త్రీ కనుబొమ్మలనే ధనుస్సుకు మధ్ల నల్లని వెంట్రుకలు అనే బాణంగా కనిపించాయి. నల్ల కలువల వంటి కళ్ళు గల ట్త్రీ యొక్క కనురెప్పలపై వెంట్రుకలుగా చీకట్లు . నిలిచాయి. లేడి కళ్ళ వంది కళ్ళు గల స్త్రీ యొక్క అందమైన బుగ్గపై నల్లని ఆగులు చుక్కా చీకట్లు నిలిచాయి. తెల్లని కైలాస పర్వతంపై నల్లని మేఘంగా చీకట్లు నిలాయి. చంద్రుడనే పొలంలో నల్లని జింకలా చీకట్లు నిలిచాయి. తెల్లది ఆదిశేషవుపై నల్లటి విష్చుమూర్తి రూపంలో చీకట్లు శయనించి లోకానికి .అండాలను సంతరించాయి.
6వ – పద్యం
మ. నభ మెల్లం గలయంగ నిండc బొడిచె న్సంధ్యావశే షాదృతా
రభటీ డంబర తాండవ భ్రమరి కారంభంబున న్శాంభవీ
ప్రభు పాదాహతి మీఁదికి న్నెగయుచున్ బ్రహ్మాండ గోళంబుతో
నభిసంబద్ధము లయ్యెనో రజత శైలాశ్మంబు లన్న ట్టుడుల్.
ప్రతిపదార్ధం :
నభము = ఆకాశము
ఎల్లన్ = మొత్తము
కలయంగ = వ్యాంిగా
నిండన్ = ఆకాశం నిండా
సంధ్య = సంధ్యా సముయంలో
అవశేషాదృత = మిగిలినటువంటి
శాంభవీ ఏ్రభు = 8ివుని
పాదాహతి = పాదతాడనపు
ఆరభటీ = ఏౌఢమి
డంబర = విజృంభించిన
తాండవ = తాండవపు
ఢమరికా = విన్యాసపు
ఆరంభంబునన్ = పారంభములో
మీదికిన్ = ఆకాశము మీదకు
ఎగయుచున్ = వ్యాపిస్తూ
బ్రహ్మాండగోళంబుతోన్ = బ్రహ్మండముతో
అభి సంబద్ధములు = తగలడం వలన
రజతశైల = వెండి కొండ యొక్క
అశ్మంబులు = రాతిముక్కలు
అయ్యెనో = అయ్యనేమో
అన్నట్టు = అనిపించేటట్టు
ఉడుల్ = నక్షతాలు
పొడిచెన్ = ఉదయుచెను
భావము : శివుడు సాయం సంధ్యా సమయంలో క్రెలాస పర్వతం మీద తాండవం చేస్తున్నాడు. ఆ తాండవంలో శవుని పదఘట్టన చేత ఆ వెండి కొండ ముక్కలు అకాశంలో వ్యాపించాయా అన్నట్లుగా సంధ్లా సమయంలో నక్షత్రాలు ఆకాశంలో ఉదయించాయి.
7వ – పద్యం
సీ. దిక్కరిణీ బృంద మొక్కట యానిన
పిల్లలు దివిఁబ్రిసరిల్లె ననcగc
గోతాచలంబులు చిత్రవాతాహత
వెసఁబెల్లగిక మీఁదవెలసె ననఁగc
బాతాళమున నున్న బంధురధ్కాంతముల్
వెడలి భానుని (హంగ నడర ననఁగ
నిల నాల్గుచెఱఁగగు జలధులు నలరేఁగ
కడళుల నభ మెక్కcగడఁగ్ ననఁగ
త. నొప్పి యుద్ధురస్థూల పయోధరములు,
దెసలకడపటఁదొడమి యాకసముమూసి
మెఱ్ఁగు జోతులుచూడ్కికి మిక్కుటముగc
నాదవెఁబిడుగులు రాలును నుప్పతిల్లె
ప్రతిపదార్ధం :
దిక్కరిణీ = దిక్కుల యందల ఏనుగుల యొక్క
బృందము = సమూహము
ఒక్కటా = ఒక్కసారిగా
ఈనిన = ప్రసవించిన
పిల్లలు = సంతానం
దివిన్ = ఆకాశంలో
ప్రసరిల్లెను = వ్యాపించెను
అనంగన్ = అనునట్లుగా
గోత అచలంబులు = కుల పర్వతాలు
చిత్ర = విచిత్రమయిన
వాతా = గాలి యొక్క
హతి = పెబ్బలకు
వెసన్ = వేగంగా
పెల్లగిలి = కూకటి వేళ్ళతో పెల్లగించబడి
మీద = ఆకాశంలో
వెలసెను = వ్యాపించెను
అనంగన్ = అనునట్లుగా
పాతాళమునన్ = పాతాళ లోకంలో
ఉన్ = ఉన్నటువంట
బంధుర = దట్టమైన
ధ్యాంతముల్ = చీకట్లు
వెడలి = కదలి
భానుని = సూర్యుని
మింగన్ = మింగుటకు
అడరెను = ప్యించెను
అనంగన్ = అనునట్లుగా
ఇల = ఝూమి
సాల్గు చెరగులా = నాలుగు వైపులా గల
జలధులు = సము(దాలు
నలిరేగి = విజృంఫించి
కడళుల = దిక్కుల చివరల నుండి
నథము + ఎక్కస్ = ఆకాశము మీదకు ఎక్కుటకు
కడగెను = ప్రయత్నించెను
అనగన్ = అనునట్లు
ఉద్దుర = దట్టమైన
స్థూల = పెద్దవైన
పయోధరములు = మేఘాలు
దెసల = దిక్కుల
కడపటన్ = చివర
పొడమి = పుట్టి
ఆకసము మూసి = ఆకాశాన్ని కప్పి
ఒప్పి = అతిశయించి
చూడ్కికి = చూపులకు
మెరుగుజోతులు = మెరుపుల కాంతులు
మిక్కుటముగన్ = ఎక్కువగా
ఒదమెన్ = పుట్టెను
పిడుగులు = పిడుగులు
రాలును = రాళ్ళు
ఉప్పతిల్లె = పుట్టెను
భావము : దట్టమైన నల్లని పెద్ద పెద్ద మేఘాలు దిక్కుల చివర పుట్టి అవి ఆకాశమంతా హ్యాపించాయి. అవి ఎలా ఉన్నాయంటే ఎనిమిది దిక్కులలోని ఆడ ఏనుగుల బృందం ఒక్కసారి ఈనగా ఆ పిల్లలు ఆకాశమంతా వ్యాపించాయా అన్నట్టుగా ఉన్నాయి. విపరీతమైన గాలి తాకిడికి కుల పర్వతాలు పెల్లగించబడి ఆకాశంలో ఉన్నాయా అన్నట్లు ఆ మేఘా లున్నాయి.
పాతాళంలో ఉన్న దట్టమయిన చీకట్లు ఒక్కసారిగా సూర్యుని మింగటానికి ఆకాశంలో వ్యాపించాయా అన్నట్లు కారుమబ్బులు ఉన్నాయి. భూమికి నాలుగువైపులా వున్న సముద్రాలన్నీ ఆకాశంలోకి వెళ్ళాయా అన్నట్లుగా ఆ మేఘాలున్నాయి. అటువంటి పెద్ద పెద్ద మేఘాలు దిక్కుల చివర పుట్టి ఆకాశమంతా వ్యాపించి కప్పేశాయి. ఆకాశంలో మెరుపుల కాంతులు పుట్టాయి. పిడుగులు, రాళ్ళు పడ్డాయి.
8వ – పద్యం
సీ. ఒక చాయననపాయ పికగేయ సముదాయ
మొకసీమ నానా మయూర నినద
మొకవంక నకలంక మకరాంక హయహేష
లొకక్రేవ వనదేవ యువతిగీతి
యొకచెంత సురకాంతల కరాంత తతనాద
మొకదారి నవశారికోదితంబు
లొకయోర బటుడారణకుమారఫణితంబు,
లొకదండ నలమమండలికలగాన,
తే. మొక్కమొగి (మోయగదళీగృ హొూాపన్న
కిన్నరీబృంద బృందసంగీతరీతి
నమరునతివేల కోలాహలముల కలి
నధిప! హోయద్రి కోలాహలాఖ్య మొక్కొ
ప్రతిపదార్ధం :
అధిప = ఓ రాజా!
ఒక చాయను = ఒక వైపు
అనపాయ = విడువలేని
పిక = కోయిలల
గేయ = పాటలు
సముదాయము = సమూహం
ఒక సీమ = ఒక ప్రాంతంలో
నానా = అనేక
మయూర = నెమళ్ళ
నినదము = క్రేంకారము
ఒక వంక = ఒక వైపు
అకలంక = తొటటుపాటులేని
మకర + అంక = మన్మథని
హయ = గుఱ్ఱాల (వాహసాలై చ చిలుకల)
హేషలు = పలుకులు
ఒక క్రేవ = ఒక వైపు
వన దేవ = వనదేవతా
యువతి = స్త్రీల
గీతము = పాట
ఒక చెంత = ఒక వైపు
సురకాంతల = దేవకాంతల
కరాంత = హస్యాగాల యందలి
తత = వీణాది వాద్యాల యొక్క
నాదము = శబ్దము
ఒకదారిన్ = ఒక బాటలో
నవ = క్రొత్తదైన
శారిక + ఉదితంబులు = గోరువంకల భాషితాలు
ఒకదార = ఒక వైపు
పటుచారణ = సమర్థులైన చారణజాతి
కుమార ఫణితంబు = కుమార స్తుతులు
ఒక దండ = వైపు
అలి = తుమ్మెదల
మండలికల = గుంపుల
కంగానము = మధుర ఝంకారం
ఒక్కమొగి = ఒకవైపున
కదళీ = అరటి
గృహ + ఉపపన్న = పందిళలో ఉన్న
కిన్నరీబృంద = కిన్న(స్తీల సముదాయం యొక్క
బృంద సంగీతరీతి = సామూహిక సంగీతాలాపన విధానం
(మోయ = ధ్వనించు చుండగా
అతివేల = ఎక్కువైన
కోలాహలముల = సందడుల
కలిమి = సంపద కలిగియున్నందున
ఓ + అద్రి = పర్వతమా!
కోలాహల + ఆఖ్యము = కోలాహలమను పేరు గలది
ఒక్కొ = ఓహో!
అమరును =అమరి ఉన్నది
భావము : ఓ రాజా ! కోలాహల పర్వతమసే పేరుగల ఒక పర్వతం ఉంది. దానిలో ఒక వైపున కోకిలల పాటలు వినిపిస్తాయి. ఒకవైపున నెమళ్ల క్రేంకారాలు విసిపిస్తాయి. ఒక వైపు చిలుకల పలుకులు మధురంగా వినిపిస్తాయి. ఒక వైపు దేవతా స్త్రీల పాటలు వినిపిస్తాయి. ఒక వైపు దేవతా స్త్రీల, గోరువంకల మధురమైన గానాలు, మాటలు విన్పిస్తాయి. క్రాత్త శరికల పలుకులు ఒక వైపు విన్పిస్తాయి.
ఒక వైపు చారణ కుమార స్తుతులు విన్పిస్తాయి. ఒక వైపు తుమ్మెదల సమూహాల పాటలు విన్పిస్తాయి. ఒక వైపున అరటిపం’దిళ్ల క్రింద కిన్నెర స్త్రీల పాటలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా కోలాహల పర్వత ప్రాంతం చాలా కోలాహలంగా ఉంది.
9వ – పద్యం
సీ. తొండముల్సాఁచి యందుగుఁజిగుళ్లకు నిక్కు
కరులదంతచ్ఛాయ గడలుకొనcగ
సెలవుల వనదంశములు మూఁగి నెఱవెట్టఁ
చ్రోల్పులుల్ పొదరిండ్ల గుఱక విడఁగ
సెలమేటి యిసుక లంకల వరాహంబులు
మొత్తంబులై (తవ్వి ముస్తె లెత్త
నడ్డంబు నిడుపు నాఁబడ్డలగతి మనుఁ
బిళ్లు డొంకలనుండి కేళ్లు దాఁటఁ
తే. బ్రబలభల్లుక నఖభల్ల భయదమథన
శిథిలమధుకోశవిసరవిశీర్ణమక్షి
కాంతరాంతర దంతురితాతపమునc
బుడమి తిలతండులన్యాయమున వెలుంగ
ప్రతిపదార్ధం :
తొండముల్ = తొండములు
చాఁచి = చాపి
అందుగున్ = అందుకు వృక్షముల యొక్క
చిగుళ్ళకు = లేత ఆకుల కోసం
నిక్కు = నిలబడు
కరుల = ఏనుగుల యొక్క
దంతచ్భాయ = దంతముల యొక్క కాంతి
కడలుకొనగ = వ్యాపించగా
సెలవుల = ఏదవుల చివరల
వనదంశములు = అడవి ఈగు
మూగి = గుంపుగా వాలి
నెఱ + పెట్ట = సందు చేయగా
క్రోల్పులుల్ = పెద్ద పులులు
పొదరిండ్లన్ = ఓొదరిళ్ళలో
గుఱక + పెట్ట = గురకలు పెట్టుచుండా
సెలయేటి = సెలమేటి యందలి
లంకల = లంకలలో (మధ్య ప్రదేశాలలో)
ఇసుక = ఇసుకను
తవ్వి = పెళ్ళగించి
వరాహములు = పందులు
ముస్తెలు + ఎత్త = మోరలు పైకెత్తూ తుంగ గడ్డలు
అడ్డంబును = ఆటంకాలను
ఇడుపు = డాటు
ఆ బిడ్డల గతి = ఆవుదూడల వలె
మనుబిళ్ళు = ఒక రకపు జంతువులు
డొంకల నుండి = డొంకలలో నుండి
కేళ్ళు వాట = దుముకుచుండగా
ప్రబల = పొగరెక్కిన (బలమైన)
భల్లుక = ఎలుగుబంటుల యొక్క
నఖబల్ల = బముల్లెల వంటి గోళ్ళ యొక్క
భయద = భయము కలిగించునట్ట
మథన = చిదుములటచేత
శిథిల = తునిగిన
మధుకోశమున = తేనెతుట్టెల సమూహము నుండి
విశ్ = రేగిన
మక్షికా = ఈగల యొక్క
అంతరాంతర = మధ్యమధ్యలో
దంతురితా = దట్టమైన
ఆతపమునన్ = ఎండచేత
పుడమి = ధూమి
తిలతండుల న్యాయమున్ = నువ్వులు బియ్యము కలిసిన
వెలుంగన్ = ప్రకాశించు విధంగా (పై పద్యంతో అన్వయము)
భావము : ఏనుగులు అందుగు మొక్కల చిగుళ్ళ కోసం నిలబడి తొండాలు చాపునప్పుడు వాటి దంతాల 5ాంతి ఆతిశయించెను. పొదలలో పెద్దపులులు నిద్రించు చుండగా వాటి పెదవుల మూలల ఈగలు ముసురుచుండెను. సెలయేళ్ళ లోని ఇసుక దుబ్బులు తవ్వి అడవి పందులు తుంగ గడ్డలను తినుచుండెను.
బలిసిన ఆవు పెయ్యల వలె ఋశ్య మృగములు డొంకలలో దూకుచుండను. ఎలుగుబంట్లు తమ గోళ్ళతో తేనె తుట్టెలను పెళ్ళగంచగా తేనె టీగలు రేగి ఆడుచుండను. వాని నీడలు నల్లగాను వాని మధ్య ప్యాపించు ఎండ పొడలు తెల్లగాను ఉండడం చేత నువ్వులు, బియ్యము కలిసినట్లుండెను.
10వ – పద్యం
ద్ని. తొలకోడి కను విచ్చి, నిలిచి మై వెంచి,
జలజల రెక్కలు సడలించి, నీల్గ
గ్రక్కున కాలార్చి, కంఠంబు వచ్చి
ముక్కున నీకలు సక్కొత్పి, కడుపు
నెక్కించి, మెడసాచి,నిక్కి, మిన్సూచి
కొక్కొరో కుఱ్ఱని కూయక మున్న
ప్రతిపదార్ధం :
తాలికోడి = ఉదయప కోడి
కనువిచ్చి = నిద్రలేచి కళ్లు విప్పి
నిలిచి = నిలబడి
మై = శరీరాన్న
వెంచి = పెరుగునట్లు చేసి
రెక్కలు = తన రెక్కలను
జలజల = టపటప
సడలించి = బిగువును సడలునట్లు చేసి
నీల్గి ళ్ళు విరుచుకుని
గ్రక్కున =వెంటనే
కాలు + ఆర్చి =కాళ్ళను సాగదీసి
కంఠంబు విచ్చి = గొంతును విప్పి
ముక్కున = తన ముక్కుతో
ఈకలు ఈకలను
సక్కొల్పి = సరిదిద్దుకొని
కడుపు = పొట్టను
నెక్కించి =సాగదీసి
మెడ + చాచి మెడను చాపి
నిక్కి నిలదడి మెడను ఎత్తి
మిన్ + చూచి = ఆకాశమును చూచి
కొక్కొరోకుర్ =కొక్కొరోకుర్
అని = అని శబ్దము చేయుచూ
కూయకమున్న = కూయక మునుపె
భావము : తొలికోడి లేచి కళ్ళు విప్పి నిలబడి శరీరాన్ని పెంచి ఆెక్కలు విప్పి నీల్గి కాళ్ళు చాచి గొంతును విప్పి ముక్కుతో ఈకలు సద్దుకుని కడుపును సాగదీసి మెడను చాపి నిలబడి మెడను ఎత్తి ఆకాశాన్ని చూచి కొక్కొరోకో అని కూసింది.
కవుల పరిచయం
1. ఎఱ్ఱన :
కాలం : 14వ శతాట్దపు కవి
ఉద్యోగం : ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి.
రచనలు : ఆంధ్ర మహాభారత అరణ్య పర్న శేషము, నృసింహపురాణం, హరివంశం.
తల్లిదంద్రులు : పోతమాంబ, సూరన
జననం : ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు.
బిరుడులు : ప్రబంఫ పరమేశ్వరుడు, శంభుడాసుడు
కవిత్వ శైరి : వర్ణనాత్మకం
2. రామరాజ భూషణుడు :
కాలం : 16 శతాబ్దపప కవి
స్వగ్రామం : బళ్లారికి సమీపంలోని పాలమండలంలోని ఫట్టుపల్లి.
రచనలు : వసుచరిత, హరిశ్చంద్రనలోపాఖ్లానం, కావ్యాలంకార సంగ్రహం.
ఉద్యోగం : శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఈయన ఒకడు. ఈయనకు భట్టుమూర్తి అనే పేరు కూడా ఉంది.
3. మొల్ల :
కాలం : 16వ శతాబ్దం
స్వగామం : కడప జిల్లాలోని గోపవరం.
రచనలు : రామాయణం
బిరుదులు : సహజ పండితురాలు
4. కూచిమంచి తిమ్మ కవి :
కాలం : 18వ శతాబ్దం
తల్లిదంద్రులు : లచ్చమాంబ, గంగనామాత్యుడు
భార్య : బుచ్చమ్మ
రచనలు : అచ్చ తెలుగు రామాయణం, రుక్మిణీ పరిణయం, సింహాచల మాహాత్యం మొ॥వి.
బిరుదులు : అభినవ వాగనుశాసనుడు, కవి సార్వభౌముడు.
5. దాశరథి కృష్ణమాచార్య :
కాలం : 22.7 .1925 నుండి 5.11.1987 వరకు జీవించారు.
జననం : మహూబాబాద్ జిల్లా చిన్న గూడూరు.
తండ్రి : డాశరథి వెంకటాచార్య.
రచనలు : అమృతాభిషేకం, మహోంర్రోదయం, తిమిరంతో సమరం మొు॥వి.
బిరుదులు : కళాప్రపూర్థ, మొ॥వ.
6. శ్రీనాథుడు :
కాలం : 1400 నుండి 1500
జననం : ప్రకాశం జిల్లా
రచనలు : అనేక చాటువులు, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం మొు॥వి.
బిరుదులు : కవి సార్వభౌమ
7. అల్లసాని పెద్దన :
కాలం : 16వ శతాబ్దం
స్వగ్రాం : బళ్లారి మండలం దోర్నాల
గురువు : శరగోపయతి
రచనలు : స్వారోచిష మనుసంభవం, హరికథాసారం, రామస్తవాాజం మొ॥వి.
బిరుడు : ఆంధ్రకవితా పితామహుడు.
ఉద్యోగం : శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు.
8. వీహూరి వెంకటాచారి :
రచన : విశ్వకర్మ పురాణం
9. పాల్కురికి సోమనాథుడు :
కాలం : 12 శతాబ్దం
తల్లిదండులు : శ్రియాదేవి, విష్ణురామదేవులు
స్వగ్రాం : వరంగల్లు సమీపంలోని పాల్కురికి
రచనలు : బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, నృపాధిప శతకం మొ॥వి.
ప్రత్యేకత : వీరశైవ కవి
ఉద్దేశం
మనిషి ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతిని ఆరాధించడం మనిషికి అలవాటు, సూర్య ఉదయ. అస్తుయాలు, వర్నం, వీచే ప్రకుతి అందాలను మనిషి మైమరుపుతో చూస్తాడు. తన్శయత్వంతో జరిగిన కావ్య సృష్టి ప్రకృతికి ప్రతింబమాతుంది. బాగ వర్ణించి చెఫ్పే వాడిని కవి అంటారు.
కవిలోని సృజనాత్యకతకు ప్రకృతి పదును పెడుతుంది. ప్రక్కతలోని అద్షుతాలు పరిళలించే వార హృదయం సున్నితంగా ఉంటుంది. మానవత్వం అంకురిస్తంది. వ్రకృతి ధ్వంసం చేయుం ఆగుతుంది. రసార్ధమై కవి పెంచడం ఈ పాఠం ఉద్దేశం.
నేపద్యం
నేపద్యం సృష్షించాకు, అదే సాహిత్యం, అది పాఠకులను మైమరింిప చేస్తుంది. కవి నన్నయ నుంిి నేటి వరకు కవులంతా ప్రకృతిని వళ్చించరు. ప్రబంధం అంటేనే 18 వర్డనల కాష్యం. వర్ణశలు రండు రకాలు, లం వివధ డచులు వర్ణించిన తిరును పరచయం చేయాలనే ఆలోచనే ఈ పాఠ్యాంశ నేపద్యం.
ప్రక్రియ – వర్ణన
ఒక విషయాన్ని రసరమ్యంగా చెప్పడమే వర్ణన, కవికి ఉండే ప్రఫాన లక్షణం వర్లన, పమర్థుడైన కని చేతలో స్మళానం కూడా నందనవనమే. అసము్థుడు హ్రాస్తే నందనవనం కూడా స్మతానమే. పాఠకుల షృదయాలను ఆకర్షించేవి వర్లనే.