Access to the AP 9th Class Telugu Guide 2nd Lesson చైతన్యం Questions and Answers are aligned with the curriculum standards.
చైతన్యం AP 9th Class Telugu 2nd Lesson Questions and Answers
చదవండి – చర్చించండి
పూలమ్ముకొని బతికిపోయినా బావుండు
నిత్యం రంగుల సుగంధాల వానలో నృత్యం చేసేవాడిని
పూలు రాశులుగా ఓోసి కిలోలు క్వింటాళ్ళ లెక్కన అమ్మేచోట
కూలీకి కుదిరినా చక్కగా ఉండేది
తోటల్ని తోలుకు తిరిగే పూలకాపరినయ్యేపాడిని
పూలు లారీలకక్కించే చోట పని చేసుకున్నా సరిపోయేద్రి
పూల బస్తాలు కుట్టీ కుట్టీ సువాసనల
సూదీదారాలతో మనుషుల్ని కుట్టిపారేసేపాడిని
నెత్తిమీద రంగుపూల బుట్టల్ని పెట్టుకుని
పూల వ్యాపారం చేసుకున్నా ఓ లెక్కనుండేది.
కువకువలాడే చిత్రవర్ణాల చిట్టిపిట్టలు
తల మీద ఆడుకుంటుంటే
నా చుట్టూ నేనే పూల ముగ్గులు వేసుకుంటూ
మనిషి చెట్టునై మసలేవాడిని
పూలండోద్ పూలు
జ్ఞాపకాల జాజులు మమకారాల మందారాలు
మమతల మల్లెలు కలల కనకాంబరాలు
చలాకీ ఊహల గులాబీలు ముద్దు చూపుల ముద్దణంతులు
పాటల పారిజాతాలు ఆశల సంపెంగలు
పూలండోడ్ పూలు
బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట
నాకు బతుకు పరమార్థం దొరికింది.
మనుషులంతా పవ్వులైయోనట్టు
పువ్వలు, మనుషుల్ని మూటలుగట్టి
మంచికీ మానవత్వానికీ మధ్య ఆదానప్రదానాలు చేస్తున్నట్టు
అక్కడోసారి ఎాసన చూశాకే
రోజూ సూర్యుడు తూర్పు కొండెక్కి
ఒళ్ళు విరుచుకుంటున్నట్టు
ఒకటే కలలు కలలు
పూలండోమ్ పూలు
ఆలోచనాత్యక ప్రశ్నలు
ప్రశ్న 1.
నిండా వరబూసిన పూల చెట్టునో రుంగురంగుల పూలతోటనో చూస్త నీకేమనిప్తుంద ? వాట్ర నుండి మనం నేశ్చుకోదగినది ఏఘైనా ఉందా?
జవాబు:
హుల తోటలో నిండా విరబూసిన పూల చెట్టును చూస్తే నాకానందం కల్గుతుంది. మనసులో ఏదో తెలియని ఆనందం కల్గుతుంది. నిండా పూలతో ఉన్న చెట్టును చూస్తే రంగు రంగుల దుస్తులతో కేరింతలు కొడుతూ ఆడుకొంటున్న పసిప్లలను చాలామందిని ఒకేచోటు (అంగన్వాడీ)లో చూసినట్లు ఆనందం కల్గుతుంది.
అటువంది హూలచెట్లు గల హూల తోట నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎవరు పట్టించుకొన్నా పడ్టించుకోకపోయినా ఆనందంగా జీవించాలి. మనల్ని చూసిన ఇతరులు కూడా ఆనందించాలి. నిష్కల్మషంగా జీవించాలి. కలకలలాడుతూ బ్రతకాలి, పదిమందికీ ఆనందం కల్గించాలి. నవ్వుతూ, నవ్విస్తూ జీవించాలి. అని తెలుస్తుంది.
ప్రశ్న 2.
పూలు అమ్షుకుని బతికిపోయినా బాగుండు అన అనడంలో కవి మనకు ఏమి సూచస్తున్నాడు ?
జవాబు:
హూలమ్ముకొని బ్రతికినా బాగుండును అని కవి అనడానికి కారణాలు, నిత్యం రంగుల సువాసనలో తడుస్తూ ఆనందపడేవాడు. కనీసం పూలబజారులో కూలీ అయినా పూలతోటలలో తిరుగుతూ ఆనందపడేవాడు. పూలను ఎగుమతి చేసే పనిలో ఐనా ఆనందం అనుభవించేవాడు. హూలచుట్టూ తిరేే పక్షులతో ఆడుకొనేవాడు, ఆశలను, అనుబంధాలను పెంచే పూలలో జీవిత పరమార్థాన్ని కవి వెదుక్కొన్నాడు.
ఇవి చేయండి
అవగాహన – ప్రతిస్పందన
అ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
ప్రశ్న 1.
గేయాన్ని లయబద్ధంగా పాడండి. ప్రాస పదాలను గుర్తియి రాయండి.
జవాబు:
గేయాన్ని లయబద్ధంగా పాడటానికి ఉపాధ్యాయుని అనుసరించండి.
ప్రాస పదాలు : అందం – సందు – గొంది – కుందాము, పుట్టు – వట్టి ఇంక – కాక – లోక, పాత – రోత, చుక్క ఒక్క – ఒక్క, నిలిచి – పలికి, స్వార్ఠము – సార్థకము, క్రూర – ఖోర, కోట్లు – పాట్లు, తిండి – గుండ, నీటి – కోది – ధాటి, మెత్త – కత్తి, పూల – పాల – రాల – కాల, మండు – ఎండు – మొండి, అదురు – పదును, లోకాల – శోకాల.
ప్రశ్న 2.
కవి తనకున్న రచనాశత్తితో ఏమి చేయాలన తెల్యజ్స్తున్నాడు ?
జవాబు:
కవి తనకున్న రచసాశక్తతోో అందాలు చిందే మేఘాల సందులలో దూరి జన్మాంథుడిలా వాటి గుళించే పాడాలనుకోలేదు. లోకానికి వేడి కలిగించాలనుకున్నాడు. పేదల పక్షాన నిలబడాలనుకొన్నాడు. వారిని ఉత్సాహషరచాలనుకొన్నాడు. గొంతలో విప్లవం రగల్చాలనుకొన్నాడు.
స్వార్ధగానం మాని సార్ధకానికి పూనాలనుకొన్నాడు. పేదలకు యుద్ధాలు చేసే గుండ ధైర్యంకల్పించాలనుకున్నాడు. పేదల మరణాలు ఆపడానికి మెత్తదనం విడిచి కత్తిసాము గురించి ఉత్తేజపరచాలను కొన్నాడు. మానవుల కష్టాలను తీర్చడానికి కత్తి కంటే పదునైన భాష ప్రయోగించాలనుకొన్నాడు.
వారి మనసులును ఉత్తేజపరచాలనుకొన్నాడు, విచక్షణ లేని మృత్యుదేవతను నిలవరించడానికి కంకణం కట్టుకోవాలనుకొన్నాడు. కుదిల మానవుల కుతంతాలనూ ప్రజలను కాపాడే ఆయుధంగా మారాలి అనుకొన్నాడు. తన సాహిత్య సృష్టితో అందరి భయాలనూ పొగొట్టాలనుకొన్నాడు. పేదవారిని ఉత్తేజపరచి గాండ్రింప చేయాలనుకొన్నాడు. శాశ్వత కీర్తిని సంపాదించాలను కొన్నాడు.
ప్రశ్న 3.
కవి తన పేరును సార్థకం చేసుకోవాలంటే ఏమి చేయాలి ?
జవాబు:
కవి.తన పేరును సార్ధకం చేసుకోవాలంటే గొంతులో విప్లవ కవిత్వం పలకాలి. అప్పుడు ఎంతైనా బలం వస్తుంది. తన గురించి తన లాభాపేక్షతో చెప్పే కవిత్వం మానాలి, లోకానికి మేలు చేసే కవిత్వం చెప్పాలి.
ప్రశ్న 4.
కంది వాక్యాలు చదివి గేయంలో ఆ వాక్యాల భామాలు వచ్చే పంక్తులను గుర్యంచి రాయండి.
అ) అన్ని దిక్కుల నుంచి కష్టాలు కమ్ముకుని వస్తున్నాయి.
జవాబు:
తూర్పు పడమరలనక దొర్లుకొని వచ్చేటి దుఃఖవాహిని.
ఆ) దుర్మార్గుల కుతంత్రాల వలన ఘోరమైన యుద్ధాలు జరిగాయి.
జవాబు:
కూరూరులై కల్పించు ఘోర యుద్ధాలు.
ఇ) థయం ఝయంగా బ్రతుకుతున్న వాళ్ళందరినీ ఒక్కది చేయాలి.
జవాబు:
అదురు బెదురు గుండె లొక్కటి చేసి.
ఆ) కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలా రాయండి.
‘యోగ్తాపత్రం’ ఇది తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న ముందు మాట. అక్షర దివిటీలు చేపట్టి పదాల ఫెళఫెళార్భాటాలతో తెలుగుకవితను కొత్త పుంతలు తొక్కించిన యుగకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కావ్యానికి మరో మహోకవి చలం రాసిన ముందుమాట ఇది.
తన కవిత్వానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవు అన్నాడు చలం, తూచవద్దు అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ. తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్ బహార్ యుద్ధారావమే కవిత్వం అంటాడు చలం. నెత్తురునూ, కన్నీళ్ళనూ తడిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేసాడు శ్రీశ్రీ. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనానికి పాటల రూపాన్నివ్వడం అతనికి తెలుసు.
మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చడం అతనికి చేతనవును. పద్యాలు చదువుతుంటే అవి మాటలు కావు, అక్షరాలూ కావు, ఉద్రేకాలు, బాధలు, యుడ్ధాలు – అతని హృదయంలోంచి మన హృదయంలోకి నేరుగా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలువలు అనిపిస్తుంది.
ఎందుకంటే కృష్ణశాడ్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు. శ్రీశశ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతము ఒకటే రకం అంటుంది సౌరీస్. ఆ రెండింటికీ హద్షులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడూ లక్షణాలనూ, రాగాలను మీరి చెవి కిర్రుమనేలా అరుస్తారిద్దరూ. ఆ అరుపుల్లో ఎగిరిపడే సముుర్రం, తుఫాను గర్షనం, మర ఫిరంగుల మరణధ్వానం గింగురు మంటాయి.
కంఠం తగ్గించి మూలిగారా, ఆ మూలుగులు దిక్కులేని దీనుల మూగవేదన, నీళ్ళు లేక ఎండుతున్న గడ్డిపొలం ఆర్తనాదం వినిపింపజేస్తాయి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాంతించి, రక్షించే అపూర్వ వ్కితి మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం. ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు ఉంది? ఏం చేస్తోంది అని దిజ్బరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశీ కవిత్వం ప్రత్యుత్తరం.(- మహాప్రస్థానం ముందుమాట నుండి)
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
మహాప్రస్థానం కావ్యానికి ముందుమాట రాసింది ఎవరు ?
జవాబు:
మహాప్రస్థానం కావ్యానికి ముందుమాట రాసింది చలం.
ప్రశ్న 2.
శ్రీశ్రీ కవిత్వాన్ని సౌరీస్ ఎవరితో పోల్చారని చలం చెప్పారు ?
జవాబు:
శ్రీశ్రీ కవిత్వాన్ని సౌరీస్, పాల్రోబ్సన్ సంగీతంతో ఓోల్చారు.
ప్రశ్న 3.
సాయంకోరి పిగ్గరగా అరవడం అని అర్థాన్నిచ్చే పదం ఏది ?
జవాబు:
సాయంకోరి బిగ్గరగా అరవడం అని అర్థాన్నిచ్చే పదం ఆర్తనాదం.
ప్రశ్న 4.
వృద్ధ ప్రపంచానికి కొత్త టానికి తయారు చేయడం అంటే ఫమిటి ?
జవాబు:
వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేయడం అంటే కోపాన్నీ, ఆవేశాన్ని, బాధలనూ తన కవిత్వంలో వ్యక్తపరచడం.
ప్రశ్న5.
ఫై గద్యానికి ఒక శీర్షి (పేరు) పెట్టండి.
జవాబు:
ఫై గద్యానికి “శ్రీశ్రీ కవిత్వం” శీర్షిక బాగుంటుంది.
ఇ) కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
“ఆపరేషన్ అవకముందు నా మాటలో స్పష్టత తగ్గటం మొదలయింది. నా సన్నిహితులకే నా మాటలు అర్థమయ్యేవి. అప్పుడు కనీసం ఆలోచనలైనా వినపించగలిగే వాడిని. సెక్రటరీకి డిక్టేషన్ ఇవ్వటం వల్ల సైటిఫిక్ పేపర్లు రాయగలిగే వాడిని.
నా మాటలను మరొకరు స్పష్టంగా మళ్లీ పలుకుతూంటే సమినార్లలో ఉపన్యాసాలు ఇవ్వగలగే వాడిని. కానీ ట్టాకియాటమీ ఆపరేషన్ నా మాట్లాడే శక్తిని పూర్తిగా తగ్గించింది. కొద్దికాలం పాటు, ఎవరైనా అక్షరాలను చూపుతుంటే, నాకు కావల్సిన అక్షరం చూపగానే కనుబొమ్మలెత్తి సైగచేయటం ద్వారా నేను చెప్పాలనుకున్నది చెప్పేవాడిని.
ఇలా మాట్లాడటమే అతి కష్టమైన విషయం. ఇక సైంటిఫిక్ సెమినార్లలో మాట్లాడటం కుదరని పని. అయితే, కాలిఫోర్నియాకు చెందిన కంప్యూటర్ నిపుణుడు ‘వాల్డ్ వోల్టేజ్’ ప్రత్యేకంగా నా కోసం ‘ఈక్విలైజర్’ అనే ప్రోగ్రాం రాసి పంపాడు. ఇందువల్ల తెరపై ఉన్న పదాలను, నా చేతిలోని మీటను నొక్కటం వల్ల ఎంచుకోగలుగుతాను. నేను చెప్పాలనుకున్న పదాలను ఎంచుకుని న్పీచ్ సింథసైజర్కు పంపుతాను. నా మాటలను కంపూయూటర్ పలుకుతుంది”.
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ బ్లాగు “హోకింగ్ డాట్ ఆర్గెట్ యు.క”’ లో హాకింగ్ అంతరంగ భావ వ్యక్తీకరణ ఇది. మానవ మేధ భౌతక పరిమితులకు లొంగదని నిరూపించిన శాస్తచేత్త హాకింగ్. శరీరం కదలికలు లేకచక్రాల కుర్చీకి పరిమితమైనా, అతని మేధ మాత్రం అనంత విశ్వరహస్యాలను అత్యద్భుతమైన రీతిలో పరిశోధించి ఆవిష్కరించింది.
స్టీఫెన్ హాకింగ్ రచించిన ‘ఏ బ్రీఫ్ హాస్టరీ ఆఫ్ టైమ్’ ఆధునిక కాస్మాలజీని సామాన్య మానవుడికి చేరువచేసిన మహత్తర పుస్తకం. కాల్పనిక నవలలకన్నా అధికంగా అమ్ముడుపోయిందీ శాప్రవేత్త సిడ్ధాంత గ్రంథం. దీనిని ‘కాలం కథ’ పేరుతో తెలుగులోకి అనువదించారు.(-కాలం కథ నుండి)
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
హోకింగ్ సైందిఫిక్ పేపర్లు ఎలా రాయగలిగేవారు ?
జవాబు:
సెక్రటరీకి డిక్టేషన్ ఇవ్వడం ద్వారా హాకింగ్ సైందిఫిక్ పేపర్లు ప్రాసేవాడు.
ప్రశ్న 2.
వాల్ట్ వోల్టేజ్ అనే కంప్యూటర్ నిపుణుడు హోకింగ్ కోసం తయారు చేసిన ప్రోగ్రాం ఏమిటి ?
జవాబు:
వాల్ట్ వోత్టేజ్ అనే కంప్యూటర్ నిపుణుడు హాకింగ్ కోసం ‘ఈక్విలైర్’ అనే ఏర్రోగ్రాం రాసి పంపాఝు.
ప్రశ్న 3.
హోకింగ్ జీవితంలో నిన్ను ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటి ?
జవాబు:
చక్రాల కుర్చీకి చరిమితమైనా అతని మేధ మాత్రం అనంత విశ్వ రహస్తాలను అద్భుతరీతిలో పరిశోధించి ఆవిష్కరించింది అనేది హాకొంగ్ జీవితంలో నన్నాశ్చర్యపరిచిన సంఘటన.
ప్రశ్న 4.
స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్తకం పేరేమిటి ?
జవాబు:
“ఏ బ్రీఫ్ హిస్టరీ త’ఫ్ టైమ్” అనేది స్టీఫెన్ హోకింగ్ రాసిన పుస్తకం.
ప్రశ్న 5.
పై పేరా నుంచి ఒక ప్రశ్ తయారు చేయం
జవాబు:
స్టీఫెన్ హాకింగ్ ఎక్కడ ఉపన్యాసాలు ఇచ్చేవాడు ?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఒక పారుడుగా కవి కర్తవ్యం ఏమిటని నీవు భావిస్తున్నావు ?
జవాబు:
కవి సమాజాన్ని చెతన్యపరచాలి, తన కవిత్వం చ్వారా ఏది మంచో ? ఏది చెడో ? సమాజానికి చెప్పాలి, తన కవిత్వం డ్వారా అవినీతి వలన నష్టాలు, నీతి వలన ప్రయోజనాలు తెలపాలి. న్యాయం, ధర్మం, పుణ్యం యొక్క ప్రయోజనాలను తెలపాలి, అధర్మం, అన్యాయం, పాపాలు చేయడం వలన కలిగే నష్టాలను కూడా సోదాహరణంగా వివరించాలని ఒక ‘పౌరుడిగా నేను భావిస్తున్నాను.
ప్రశ్న 2.
“స్వార్ గానమూ మానరా ! ఓ కవి సార్థకానికి పూనరా !’ ఈ గేయ పంక్లు భావాన్నమి సాంతమాటలలో వురంచండి.
జవాబు:
ఓ కవవ ! గొంతులో విప్లవ భావం అనే అగ్ని కొత్తగా రగిలింది, విప్లవ, భాఖాలనే తంతులన్ని ఒక ప్రదేశంలో చేరాయి. డానితో విపరీతమైన వింత బలం కవికీ, కవిత్వానికి వచ్చింది. కాబట్టి నీ స్వార్థానికి కవిత్వం చెప్పడం మానెయ్యి, విశ్వఃశశయం అన్నారు కదా ! అలాగే లోకానికి మేలు చేసే కవిత్వాన్న చెప్పే ప్రయత్నం చెయ్యి అనేది ఈ గేయ పంక్తుల సారాంశం.
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
అసమానతలకు తావులేని సమాజం కోసం మనం ఏమి చేయాలో వివరష్తూ వ్యాసం రాయండి.
(లేదా)
అసమానతలకు తావులేం సమాజం కోసం మనం చేయాలో వింంచండి.
జవాబు:
అసమానతలకు తావులేని సమాజం. నిర్మించాలంటే అసమానతలు అంటీ తెలుసుకోవాలి. అసమానతలు అంటే ప్రజల మధ్య సమానత లేకపోవడం, దానికి కారణం విద్య, కులం, డబ్బు, హోదా మొదలైనవి. వీదిని నివారించాలంటో మనం విద్యాపరమైన అసమానత నివారించాలి. అందరికీ చదువుకొనే అవకాశాలు కల్పించాలి ఏ విధమైన ఆటంకాలు కల్పించకూడదు.
కులం : కొందరు కులపరంగా అసమానతలకు గురికావచ్బు దాని నివారణకు రిజర్వేషన్లు ఏ్రోత్సాహకాలు కల్పించాలి. ప్రత్లేక సదుపాయాలు కల్పించాలి.
డబ్ష : కొంతమందికి సంపద ఎక్కువ ఉంటుంది. వారికి, పేదలకు మధ్య అసమానత ఎక్కువగా ఉంటుంది. దానిని నివారించాలంటే పేదలకు వడ్డీ లేని ఋణాలు, సబ్సిడీలు ఇవ్వాలి.
హోదా : ధనవంతులు ఉన్నత చదువులు చదివి; వ్యాపారాలు చేసి సమాజంలో రాజకీయ పదవులు, ఉద్యోగాలు సంపాదించి ఉన్నత హోదాలో ఉంటారు. పేదవారికీ అసమానతలు ఏర్పడతాయి. అవి నివారించాలంటే పేదలకు రాజకీయ పదవులు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి. వ్యాపారాలు పెట్టడానికి ఋణాలు ఇవ్వాలి.
ఈ విధంగా అనేక రకాలుగా కృషి చేస్తే -సమాజంలోని అసమానతలను నివారించవచ్చు.
ప్రశ్న 2.
నీవే కవివైతే ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎలాంటి కవితను రాస్తావు.
జవాబు:
నేనే కవినైతే ప్రజలను చైతన్యపరిచే కవితలు ఏ్రాస్తాను. ప్రజలను ఉత్తేజపరిచే కవిత్వం వ్రాస్తాను. అన్యాయాలను, అసమానతలను, అధర్మాలను నివారించే దిశగా పాఠకులను ప్రేరేపించే కవిత్వం వ్రాస్తాను.
విద్య పట్ల, జ్ఞానార్జన పట్ల, పరోపకారం, ధర్మాచరణ, న్యాయవర్తనల పట్ల అవగాహన, ఉత్సాహం, ఆచరణలు ప్రేరేపించే కవిత్వం ప్రాస్తాను. పాఠకులకు ఆనందం, ఆలోచన, ధైర్యం కలిగించే కవిత్వం ఏ్రాస్తాను. కుల, మత, ప్రాంత, భాషాపరంగా విరోధాలు పెట్టేవారిని నిలదీసి, కడిగేసి, సమాజం ముందు నిలబెట్టడానికి వారి నిజ జీవిత చరితలను కవిత్వంగా చ్రాస్తాను. సమాజంలోని కుళ్లును కడిగేసే సాధనంగా కవిత్వాన్ని మలుస్తాను.
భాషాంశాలు – పదజాలం
అ) కింది వాక్యాలు చదివి, ఎరుప రంగు గల పదానికి అర్థం రాసి, డానిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ప్రశ్న 1.
హుల పాసనలు నింపుకున్న మారుతం మనసుకు హాయినిస్తుంది.
జవాబు:
మారుతం = గాలి
సొంతవాక్యం : వేసవి కాలంలో చల్లని గొలి కావాలి.
ప్రశ్న 2.
నిత్యమూ చింతతో రగిలే మనిషికి సుఖం ఉండదు.
జవాబు:
చింత – ఆలోచన
సొంతనాక్యం : మంచి ఆలోచనలే ప్రగతికి మార్గాలు.
ప్రశ్న 3.
మనం చేసే మంచి పనుల వలన స్థిరమైన పేరు సంపాదిస్తాం.
జవాబు:
స్థిరమైన – శాశ్వతమైన
సొంతవాక్యం : శాశ్యతమై ప్రణాళికలతో అవిద్యను రూపుమాపాలి.
ప్రశ్న 4.
ఎవరైతే తమ మానసమును అదుపులో పెట్టుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళవురు.
జవాబు:
మానసము = మనసు
సొంతవాక్యం : మనసు ప్రశాంతంగా ఉంచుకోపాలి.
ప్రశ్న 5.
క్రూరులతో స్నేహం ప్రాణానికే ప్రమాదం.
జవాబు:
క్రూరులు = దయలేనివారు
సొంతవాక్యం : కొందరు దయలేనివారు అరాచకకాలు సృష్టిస్తారు.
ఆ) కింది వాక్యాల్లో ఒకే అర్థాన్నిచ్చే పదాల్ని గుర్తించి వాటిని వేరు చేసి రాయండి.
ప్రశ్న 1.
అభ్రములు వర్షిస్తే పంటలు పండుతాయి. జలధరముల కోసం రైతన్నలు ఎదురు చూస్తారం. ఆకాశంలో మేఘములు కదులుతుంటే చూడముచ్చటగా ఉంటుంది.
జవాబు:
అభ్రములు, జలధరములు, మేఘములు
ప్రశ్న 2.
యుద్ధం వల్ల నష్టం. సమరం చేస్తే మరణాలు సంభవిస్తాయి. పోరు లేనపుడే లాళం పొందుతాం.
జవాబు:
యుద్ధం, సమరం, పోరు
ప్రశ్న 3.
ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటాయి. ఎందరో కవులు తారలు గురించి వర్చించారు. పౌర్ణమి రోఖు చండ్రుని చుట్టూ నక్షతాలు సందళి చేస్తాయి.
జవాబు:
చుక్కలు, తారలు, నక్ష్తాలు
ప్రశ్న 4.
కోరికలు శోకానికి మూలం. దుఃఖానికి దూరమైతే సంతోషం దగ్గరవుతుంది. ఏడుస్తూ కూర్చుంటే గెలుపు దూరమవుతంది.
జవాబు:
శోకం, దుఃఖం, ఏడుపు
ఇ) కింది పదాలకు వేరు వేరు అర్థాలను గుర్తించి జతపరచండి. (నానార్థాలు)
జవాబు:
1. దిక్కు ( ఉ ) అ) జగత్తు, చూపు, గుంపు
2. వర్షం ( ఈ ) ఆ) పేరు, బొట్టు
3. నామం ( ఆ ) ఇ) నది, సైన్యం
4. వాహిని ( ఇ ) ఈ) వాన, సంవత్సరం
5. లోకం ( అ ) ఉ) దిశ, ఉపాయం, మార్గం
ఈ) ఈ కింది వాక్యాల్లో ఉన్న ప్రకృతి – వికృతి పడాలను గుర్తించి రాయండి.
ప్రశ్న 1.
అగ్ని ప్రమాదకరం కాబట్టి పిల్లలు అగ్గితో ఆటలు ఆడకూడదు.
జవాబు:
అగ్ని (ప్ర) – అగ్గి (వి)
ప్రశ్న 2.
అడవికి రాళూ సింహం. జంతువులకు సింగం అంనే ఐాలా థయం.
జవాబు:
సింహం (ప్ర) – సింగం (వి)
ప్రశ్న 3.
లంకిణి ఒక రాక్షసి. హనుమంతుడు ఆ రక్కసిని జయించాడు. .
జవాబు:
రాక్షసి (ప్ర) – రక్కసి (వి)
ప్రశ్న 4.
తలపెట్టిన కార్యమును సాధించాలి. ఆటంకాలు ఎదురైనా కర్జమును విడువరాదు.
జవాబు:
కార్యము (ప్ర) – కర్జము (వి)
ప్రశ్న 5.
ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. అవి పెద్ద వానకురిసే మొయిళ్లులా ఉన్నాయి.
జవాబు:
మేఘాలు (ప్ర) – మొయిళ్లు (వి)
వ్యాకరణాంశాలు
సంధులు
గుణసంధి : ‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే వరుసగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వచ్చి గుణసంధి జరుగుతుందని కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా!
అ) కింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి
జవాబు:
1. రాజేశ్వరి – రాజ + ఈశ్వరి = గుణసంధి
2. పరోపకారం – పర + ఉపకారం = గుణసంధి
3. మహర్షి – మహా + ఋషి = గుణసంథి
4. నూతనోత్సాహం – నూతన + ఉత్సాహం = గుణసంధి
సమాసాలు
కర్ధధారయ సమాసం : విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికి) సమాసం జరిగితే దాన్ని కర్మధారయ సమాసం అంటారు. దీనిని ‘సమానాధికరణం’ అని కూడా పిలుస్తారు. ఈ పాఠంలో కర్మథారయ సమాసాలను గురించి తెలుసుకుందాం.
విశేషణ పూర్వపద ఫర్మధారయ సమాసం : విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే ఆ సమాసాన్ని “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.
ఉదా :
తెల్ల చొక్కా – తెల్లననన చొక్కా
తెల్లని – విశేషణం (హూర్వపదం – మొదటి పదం)
చాక్కా – నామవాచకం (ఉత్తర పదం – రెండవ పదం)
ఫై ఉదాహరణను గమనిస్తే తెల్ల – చొక్కా అనే రెండు పదాలున్యి. మొదటి పదం ‘తెల్ల’ విశేషణం. రెండోపదం ‘చాక్కా’ నామవాచకం. ఇలా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికి) సమాసం జరిగితే దాన్ని ‘కర్మధారయ సమాసం’ అంటారు.
ఆ) కింది పదాలకు విర్రహవాక్యాలు రాసి సమాస నామం తెలపండి.
జవాబు:
1. పాత రోజులు : పాతవి అయిన రోజులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. మంచి డారి : మంచిదైన దారి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. కొత్త పుస్తకం : కొత్తదెన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4. నల్ల హూసలు : నల్లవైన పూసలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. కొత్త కోక : కొత్తదెన కోక – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6. ఎర్ర గులాబి : ఎర్రదైన గులాటి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
7. లేత మొగ్గ : లేతదైన మొగ్గ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణం ఉత్తరపద కర్మధారయ సమాసం : విశేషణం ఉత్తరపదంగా (రెండవ పదంగా) ఉంటే సమాసాన్ని “విశేషణం ఉత్తరపద కర్మధారయ సమాసం” అంటారు.
ఉదా :
కపోతవృద్ధము – వృద్ధమైన కపోతము
కపోతము – నామవాచకం (పూర్వపదం – మొదటి పదం)
వృద్ధము – విశేషణం (ఉత్తర పదం – రెండవ పదం)
పై ఉదాహరణలో కపోతము, వృద్ధము అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం కపోతము నామవాచకం (విశేష్యం), రెండో పదం వృద్ధము విశేషణం. విశేషణ పదం ఉత్తరపదంగా రావడం వలన ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము.
ఇ) కింది పదాలకు విర్రహవాక్యాలు రాసి సమాస నామం తెలపండి.
జవాబు:
1. మృదుమధురం : మృదువైనది, మధురమును — విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
2. సరసగంఫీరం : సరసమును, గంఫీరమును — విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
3. నిమ్నోన్నతం : నిమ్నమును, ఉన్నతమును — విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
4. ఎగుడు దిగుడు : ఎగుడును, దిగుడును — విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
అలంకారాలు
అ) అంత్యానుప్రాస అలంకారం
కింది తరగతిలో నేర్చుకున్న అంత్యాను ప్రాస అలంకారం – గుర్తు చేసుకుందాం.
భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామకథయే ముక్తి
పై కవితలో పాదాలన్నింటి చివర ఒకే లయతో కూడిన ప్రాస పదాలు వచ్చాయి కదా! ఇలా అన్ని పాదాలలోనూ చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. పై ఉదాహరణలో ‘క్తి’ అనే అక్షరం చివర ప్రాసగా వచ్చ్ంది.
వేదశాఖలు వెలిసెనిచ్చట
ఆదికావ్యం బలరెనిచ్చట
పై ఉడాహరణలో ‘ఇచ్చట’ అనే పదం చివరలో ప్రాసగా రావాడం జరిగింది. పాదాంతంలో లేదా పంక్ చవరలో ఒకే ఉ చ్భారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని ‘అంత్యాను (ప్రాస అలంకారం’ అంటారు. పాఠాన్ని పరిశీలించండి. అంత్యానుప్రాస కలిగిన పాడాలను గుర్తించి రాయండి.
ఉదా : పుట్టుగ్రుడ్డిగ పోకురా
వట్టి మ్రోడువు కాకురా
1. పాతరోజులు పోయెరా!
ఓ కవీ! రోత పాటలు మానరా!
2. నిలిచి శాసించవేమిరా!
పలికి పురికొల్స వేమిరా!
3. స్వార్థగానము మానరా!
సార్థకానికి పూనరా!’
ఛందస్సు :
ఈ కింది చంపకమాల పద్య పాదాలకు గణవిభజన చేసి పద్య లక్షణాలు రాయండి.
అ) జనిత పరాక్రమ ! క్రమ విశారద ! శారద కందకుందచం
ఇది చంపక్మాల పద్యపాదము
లక్షణము :
1. చంపకమాల వృత్త జాతికి చెందిన పద్యము. దీనిలో నాల్గు పాదాలుంటాయి.
2. ఏ్రతి పాదము నందు న,జ,భ,జ,జ,జ,ర అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. ప్రాస నియమం కలదు. ప్రాసయతి 11వ అక్షరం.
ఆ) దన ఘన సార సార యశ ! దాశరథీ కరుణా పమోనిధీ.
ఇది చంపకమాల పద్యపాదము.
లక్షణము :
1. చంపకమాల వృత్త జాతికి చెందిన పద్యము. దీనిలో నాల్గు పాదాలుంటాయి.
2. ప్రతి పాదము నందు న,జ,భ,జ,జ,జ,ర అనే గణాలు వరుసగా ఉంటాయి.
3. ప్రాస నియమం కలదు. ప్రాసయతి 11వ అక్షరం.
ప్రాజెక్టు పని
పిల్లలూ ! క్యూ ఆర్ కోడ్ని స్కాన్ చేసి అక్కడ ఇచ్చిన గేయాలను రాగయుక్తంగా ఆలపించి మీ పాఠశాల సారస్వత సంఘ సమావేశంలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
పద్య మధురిమ
సమయమమూల్య మొక్కనిమిషంబు వృథాచన గ్రమ్మఱింప నే
రము, మనయాయువా త్రుటి పరంపరయాట నెఱింగి, నిద్రమాం
ద్యమును దొలంగి మీ పనుల నారయుడో జనులార యంచు డం
బముగ మెడన్నిగిడ్చి కృకవాకము గూసెడి నింటి కొప్పనన్ – కృషీవలుడు – దువ్వూరి రామిరెడ్డి
భావం : ఓ జనులారా! సమయం చాలా విలువైనది. ఒక నిమిషం కూడా వృథాగా గడపరాదు. మన ఆయువు శాశ్వతమైనది కాదు. నిద్రమత్తును వదిలి పెట్టండి. మీరు చేయవలసిన పనులేవో తొందరపడి పూర్తిచేయండని కోడిపుంజు ఇంటి కప్పు పైకెక్కి మెడను చాచి బిగ్గరగా కూసింది.
గేయాలు – అర్ధాలు – భావాలు
1వ – గేయం
అందమగు మేఘాల
సందులో, నొక చిన్ని
గొందిలో దూరి, యానందమునకై పాడు
కుందామనే చింత కూడ దది, కూడ దది
పుట్టు గ్రుడ్డిగ పోకురా
ఓ కవీ!
వట్టి (మోడువు కాకురా!
అర్థాలు
అందము = సొగసు
మేఘం = మబ్బు
సందు = ఇరుకుదారి
గొంది = చిన్నసందు
ఆనందం = సంతోషం
చింత = ఆలోచన
పుట్టు(గుడ్డి = జన్మాంథుడు
(మోడు) = ఎండిన చెట్టు
భావము : ఓ కవీ ! అందమైన మబ్బుల సందులోని చిన్న సందులో దూరి, ఆనందం కోసం పాడుకోహాలని ఆలోచించకు, జన్నాంథుడవు కాకు, ఎండిన చెటులా ఉండకు.
2వ – గేయం
“ఏకతార్” పాటలను
ఇంక చాలించరా
కాకతో జగమొక్క కమ్మచ్చునే తీసి,
లోకతంత్రుల గొంతులోన పల్కించరా
పాతరోజులు పోయెరా
ఓ కవీ!
రోత పాటలు మానరా!
అర్థాలు
ఏకఠార్ = ఒకే తిగ గల వాయిద్యం
కాక = వేడి
కమ్మచ్చు = లోహాపు తీగను తయారు చేయునది
తంత్రులు = తీగలు (వాయిద్యం యొక్క)
గొంతు = కంఠము
రోత = అసహ్యం
భావము : ఒకే తీగతో మీటే వాయిద్యంతో పాడిన పాటలనే మళ్ళీ మళ్ళీ పాడకోయి కవీ ! లోకానికి వేడి పుట్టించి అంటే చైతన్యం కలిగించి క్రొత్త తీగను తయారుచేసి సరికొత సాహిత్యాన్ని లోకము యొక్క కంఠంలో పలికించవోయి కవీ! ఓ కవీ! దైవాలను, పాలకులను స్తుతిస్తూ పాడే పాత రోజులు పోయాయి. ఆ పాటలు విని విని ప్రజలకు కూడా ఇష్టం పోయింది. ఇక అ పాటలు మానెయి.
3వ – గేయం
దిక్కులను చూచినా,
చుక్కలను కాంచినా,
ఒక్కరీతిని రక్త మోడికలు కడుతుంది.
బక్కవారిని పోరు చక్కాడిపోకుండ
నిలిచి శాసించవేమిరా! ఓ కవీ!
పలికి పురికొల్ప వేమిరా!
అర్థాలు
దిక్కులు = దిశలు
చుక్కలు = నక్షత్రాలా
కాంచుట = చూచుట
రీతి. = విధము
రక్తము = నెత్తురు
ఓడిక = కాలువ
బక్క = పేద
చక్కాడిపోకుండా = విడిచోపోకుండా
శాసించు = ఆదేశించు
పలికి = మాట్లాడి
పరికొల్పు = ఏర్రహహించు
భావము :ఓ కవీ! పేదవారు చేసిన యుడ్ధాల గురించి దిక్కులను అడిగినా, చుక్కలను అడిగినా రక్తం కాలువలు కట్టిన ఆ గాథలు విడిచిపొకుండా చెబుతాయి. నువ్వు నిలబడి పేదలను ఉత్సాహపరచి వారికి యుడ్ధాలలో విజయం దొరికేలా ఎందుకు చేయవు ?
4వ – గేయం
గొంతులో ఒక యగ్ని
కొత్తగా రగిలంంది
తంత్రులన్నీ ఒక్క పుంతలో బడ్డాయి
ఇంతింత అనరాని వింత బలమొచ్చింది
స్వార్థగానము మానరా
ఓ కవీ!
సార్థకానికి పూనరా!
అర్థాలు
గొంతు = కంఠం
అగ్ని = నిప్పు
రగలడం = అంటుకోవడం
పుంత = పాంతము
సార్థము = స్వప్రయోజనము
గానము = పాట
సార్థకము = అర్థవంతము
పూను = ప్రయత్నించు
భావము : ఓ కవీ ! మానవుని మాటలలో విప్లవ భొవాలు పుడుతున్నాయి. అన్ని రకాల ఆవేశాలు విప్లవం బాటపట్టాయి. దానితో పేదలకు బలం పెరిగింది. నీ స్వఏ్రయోజనాలను ఆళంచే పాటలను మాను. విశ్వఃశేయము అనే నానుడిని నిజం చేస్తూ ఒక కవిగా సమాజ శ్రేయస్సుకు ప్రయత్నించు.
5వ – గేయం
క్రూరులై కల్పించు
ఘోర యుడ్ధాలలో
కోట్లకొద్దీ జనులు కూడు గుడ్డకు లేక
పాట్లుపడి చచ్చారు పరికించలేదేమొ
తిండియొక్కడి కాదురా!
ఓ కవీ!
గుండె ధైర్యము నూదరా !
అర్థాలు
క్రూరులు = దయలేనివారు
ఘోరము = భయంకరమైనది
కూడుగుడ్డ = తిండి బట్ట
పాట్లు = కష్టాలు
పరికించుట = పరిశించుట, చూచుట
ఊడుట = చెప్పుట
భావము : ఓ కవీ ! దయలేనివారు తమ స్వార్థం కోసం కల్పించిన యుద్ధాలలో చాలామంది చాలా కష్టాలు పడి మరణించారు. ప్రజలకు కేవలం తిండి మాత్రమే కాదు తమ హక్కుల సాధనకు ధైర్యం కూడా కావాలని నీ కవిత్వం ద్వారా చెప్పు.
6వ – గేయం
నీటిలో గాలిలో
నేలమీదను “చావు”
కోటికోరలు చాచి వేటాడుచున్నదా
ధాటికోరవలేక దద్దరిల్లుచున్నారు
మెత్తదనమును వీడరా!
ఓ కవీ!
కత్తిసామును పాడరా!
అర్థాలు
చావు = మరణము
కోరలు = పొడవైన పళ్ళు
వేటాడుట = తరిమి తరి చంపుట
ధాటి = దండయాత
ఓర్వలేక = సహించలేక
దద్దరిల్లు = అడలిపోవు, కంపించు
మెత్తదనము = మృదు స్వభావము
కత్తిసాము = కత్తియుద్ధము
భావము : ఓ కవీ! నీటి మీద గాలిలోను నేల మీద ఎక్కడ పడితే అక్కడ అమాయకులు, పేదలను చంపడానికి మృత్యువు కోరలు చాపుతోంది. అ దండయాత్రకు అందరూ బెదిరిపోతున్నారు. కవులు మృదు స్వభావులు అనే పేరు నిలబెట్టుకోవడానికి, సున్నితమయిన పూల వంట వాటని వర్ణించటం కాడు. భయంకరమైన కత్తి యుద్ధాలను కూడా వర్ణించు.
7వ – గేయం
అధిక బాధలతోడ
అలమటించే జనుల
కష్టాల కొలిమిలో కాగి మండినగుండె
కత్తిఖాదరనైన మెత్తననిపించగా
మాటాడ నుంకించరా!
ఓ కవీ!
మానసము నురికించరా!
అర్థాలు
అధిక = ఎక్కువ
అలమటించుట. = బాధపడుట
కొలిమి = వేడి కుంపటి
గుండె = హృదయం
వాదర = అంచు
ఉంకించు = పయత్నించు
మానసము = మనస్సు
ఉరికించు = పరెత్తించు
భావము : ఓ కవీ ! చాలా బాధలతీ విపరీతంగా బాధపడుతున్న మానవుల కష్టాలు అనే నిప్పుల కుంపటిలో వేడక్కిన గుండ కంటే పదునైన కత్తి అంచు కూడా మెత్తగానే ఉంటుంది అనే భావం గల కవిత్వంతో మనసుని పరిగెత్తించు.
8వ – గేయం
తూర్పు పడమరలనక
దొర్లకకొని వచ్చేటి
దుఃఖవాహాని నాపి, దొడ్డశక్తిగ మార్చి
దుష్టరాక్షసి నొక్క త్రుటిలోన పరిమార్చ
కంకణమ్మును కట్టరా!
ఓ కవీ!
జంకెల్ల పోగొట్టరా !
అర్థాలు
వాహిని = నది
దొడ్డ = గొప్ప
శక్తి = బలము
(తుటి = సెకను
పరిమార్చు = చంపు.
కంకణము కట్టు = దీక్షపూను
జంకు = భయం
భావము : ఓ కవీ ! దిక్కులతో నిమిత్తము లేకుండా అందరినీ బాధపెట్ట్టే దుఃఖ ప్రవాహాన్ని నాశనం చేయడానికి దీక్ష వహింబచు ప్రజలకు నీ కవిత్వంతో భయం పోగొట్టు.
9వ – గేయం
హూలవర్షము కురియు
పాలమబ్బుల నుంచి
రాలుచుండే అగ్నిగోళాల మంటలో
కాలకుండా ప్రజల కాపాడి రక్షించ
జాతి కాయుధ మీవెరా!
ఓ కవీ!
నీ తేజమును చూపరా!
అర్థాలు
వర్షము = వాన
పాలమబ్బు తెల్లటి మేఘం
అగ్నిగోళం = నిప్పుల బంతి
తేజము = కాంతి
భావము : ఓ కవీ ! తెల్లది మబ్బుల నుండి జలజలా కురిసే హులవర్షం లాంటి చిరుజల్లులతో రాలుతున్న పిడుగులతో. కాలకుండా అంటే పైకి నవ్వుతూనే ఏ్రమాదాలను కల్పించే దుష్టుల బారి నుండి జనాలను కాపాడే ఆయుథానివి నువ్వే. నా తెలివి తేటలతో కుతంత్రాలు చేసేవారి గుట్టు విప్పి ప్రజలకు కనువిప్పు కలిగించు.
10వ – గేయం
మండు టాకలిలోను
ఎండు నాల్కలలోను
మొండిబారిన పేద బండ గుండెలలోను
గాం(డిరించు భావాల నిండించి నీ గొంతు
సింహనాదము చేయరా!
ఓ కవీ!
స్థిరమైన పేర్మోయరా!
అర్థాలు
మండుటాకలి = ఆకలిమంట
ఎండునాల్క = దాహంతో పిడచగట్టిన నాల్క
మొండిబారిన = చురుకుదనం పోయిన
గాండిరించు = పులిలా ,రచు
సింహనాదము = సింహగర్జన
పేరు మోయు = కీర్తి సంపాదించు
స్థిరము = శాశ్వతము
భావము : ఓ కవీ ! ఆకలి మంటలలో దాహంతో పిడచ గట్టిన నాల్కలతో బండబారిన గుండెలతో పులిలా గర్జించి నీ భావాలతో సింహనాదం చేసి ఆ పేద గుండెలలో శాశ్వతమైన కీర్తిని సంషాదించుకో.
11వ – గేయం
చిదిగి శిథిలాలైన
హృదయాలు పెనవేసి
అదురుబెదురుల గుండెలన్నీ యొక్కటి చేసి, పదును నాలుకతోడ పలికి సాధించాలి
వెనుకాడగా కాదురా!
ఓ కవీ!
వెనుక తరుణము రాదురా!
అర్థాలు
చిదిగి = తునాతునకలై
శిథిలము = నశించి పోగా మిగిలినది
పెనవేసి = కలిపి
అదురుబెదురు = భయం
పదును నాలుక = పదునైన నాలుక (తీవ్రమైన మాటలు)
తరుణము = సమయము
భావము : ఓ కవీ ! బాధలతో భయాలతో చితికిపోయిన హృదయాలను ఓకటిగా చేయి. భయంతో విలవిలలాడే గుండెలను ఒకటిగా చేయి. పదునైన మాటలతో దీనిని సాధించాలి. ఈ విషయంలో వెనుకంజ వేయవద్దన. హూర్వకాలప మంచిరోజులు మళ్ళీరావు.
12వ – గేయం
ప్రజల కవివై గొంతు
రగిలించి పాడితే
బక్కడొక్కలు రేగి ప్రళయమారుతమట్లు
తక్కువెక్కువలెల్ల ఒక్క దెబ్బను కూల్బల
లోకాల నూగింపరా!
ఓ కవీ!
శోకాల తొలగింపరా!
అర్థాలు
గొంతు రగిల్చి = విప్లవ గీతాలు పాడి
మారుతము = గాలి
కూల్చి = నశింపజేసి
శోకము = ఏడ్పు
భావము : ఓ కవీ ! ప్రజాకవివై విప్లవగీతాలు పాడితే పేదల ఆకలి కడుపులు ప్రళయకాలంలో ఝంఝూ మారుతంలా విజృంభించి సమాజంలోని అసమానతలను ఒక్కదెబ్పతో నళింప జేస్తాయి. ఆ విధంగా లోకంలోని పేదల బాధలను తొలగించు.
కవి పరిచయం
కవి పేరు : తాపీ ధర్మారావు
తల్లిదండులు : నరసమ్మ, డా|| అప్పన్న గార్లు
జననం : ఒరిస్సా, బెరహంపూర్లు 19.09.1887న
చదువు : ఎఫ్. ఎ వరకు
ఉద్యోగం : కళ్లి కోట రాజావారి.కళాశాలలో గణితోపాధ్యాయుడు
రచనలు : పాతపొళీ, కొత్త పాళీ దేవాలయాలపై బూతు దొమ్మలెందుకు ? రాళ్లు – రప్పలు, సాహితీ మొర్మాాలు, ఇనుప కచ్చడాలు మొునవి. విజయ విలాసానికి రచించిన హృదయోల్లాసం వ్యాఖ్యానానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
ప్రత్యేకతలు : నాస్తికవాది, శ్రీశీ, గురజాడ, గుఱఱఱం జాషువా, పుట్టపర్తి నారాయణాచార్యులు గార్లకు సమకాలికుడు, ఏ్రస్తుత పాఠ్యాంశం తాపీ ధర్మారావు రచించిన కొత్తపాళీ గ్రంథంలోనిది.
ఉద్దేశం
మానవులలో కొందరు అందర కంటే భిన్నంగా ఉుంటరు. ఎారు రాబోయే కాలాగ్షి, మార్పులను ఊటాస్తారు. ముందుచూపుతో ఉంటారు. ఎారు కరదీపికలులా ఉంటారు. ఐారు తాత్వికులు, మాటలు, చేతలతో దిశా నిర్రేశం చేస్తారు. కవి తాట ధర్మారావు గారు ఇటువంటీ పాడే. ఆయన కవిత్వంతో సామాజక చెతస్యాష కర్గిస్తాడు, తన రచనలతో చైతన్యం కల్గిస్తాడు. మనిషలోని మంచిని మెచ్చుకొంటాడు, వంచించే గుణాన్ని సళాంచడు, అందుకే కవి భావాలే కవితగా వెల్లడించారు. విద్యార్థులలో కూడా ఈ భావాలు కలిగించడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
తోటివారిక లండగా నిలచే గుం థెర్యం ఉండాల్. సొంతలాభం కొంత మానుకొని పారుగునాంక తోడు పడాలి. అనే ప్రరరణ ఈ పాఠ్యాంశ నేపథ్ళం.
నేపథ్యం
సామాజిక ప్రయోజనమే కవిత్వ లక్ష్యం. కవి తన కవిత ద్వారా సామాజిక అసమానతలను నిర్మూలించాలి. తోటివారికి అండగా నిలిచే గుండె ధైర్యం ఉండాలి. సొంతలాభం కొంత మానుకొని పొరుగువారికి తోడు పడాలి. అనే ప్రేరణ ఈ పాఠ్యాంశ నేపథ్యం.
ప్రక్రియ – గేయకవిత
గేయ కవిత మాత్రాఛందస్సులో ఉంటుంది. లయాత్మకంగా సాగుతుంది. పాడుకోవడానికి అనువైనది. యతి,
ప్రాసలు, గణ నియమాలు ఉండవు. వ్యావహారిక పదాలతో తూగును, ఊపును తేవడం గేయ కవిత లక్షణం.