These AP 9th Class Telugu Important Questions 2nd Lesson చైతన్యం will help students prepare well for the exams.
చైతన్యం AP Board 9th Class Telugu 2nd Lesson Important Questions and Answers
వ్యక్తీకరణ – సృజనాత్మకత
1. ఈ క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
‘చైతన్యం’ పాఠ్యభాగ రచయితను గూర్చి రాయండి. (లేదా) (FA-1: 2023-24)
“చైతన్యం” పాఠ్యభాగ కవి “తాపీ ధర్మారావు” గురించి రాయండి. ( SA-2:2023-24)
జవాబు:
‘చైతన్యం’ పాఠ్యభాగ రచయిత తాపీ ధర్మారావు. ఈయన అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలన చిత్ర సంభాషణ రచయిత. పత్రికా సంపాదకుడిగా దిన పత్రికలలో తొలిసారి వ్యావహారిక భాషను ప్రవేశపెట్టాడు. పద్య కవిత్వంతో మొదలు పెట్టి నాటికలు, నాటకాలు, నవలలు, పరిశోధన వ్యాసాలు ఎన్నో రాశాడు. సుబోధకమైన జనరంజక శైలిలో రచనలు చేశాడు. పాతపాళీ, కొత్తపాళి, దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు, పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు, రప్పలూ, ఇనుప కచ్చడాలు, సాహితీ మొక్యరాలు మొదలైనవి ఆయన రచనలు. చేమకూర వేంకట కవి విజయవిలాస ప్రబంధానికి ఆయన రాసిన ‘హృదయోల్లాస వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం’ లభించింది. పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీ. శ్రీ వంటి గొప్ప కవులు వీరి రాలూ సమకాలికులు.
II. ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘పుట్టు గ్రుడ్డిగ పోకురా ఓ! కవీ! వట్టి మ్రోదువు కాకురా! అని’ ఎందుకన్నాడు?
జవాబు:
పుట్టుగ్రుడ్డికి లోకం ఎలా ఉంటుందో తెలీదు, ఎవరో చెప్పినది వినాలి. నమ్మాలి, వారెవరో తమ కళ్లతో చూసినది కవి తన నోటితో చెప్పాలి. అది తన సొంత భావన కాకపోయినా చెప్పాలి. అది దాస్యం, కవి భావ దాస్యం చేయకూడదు. తను చూసినది. తన భావాన్ని మాత్రమే కవి చెప్పాలి. అప్పుడే కవికి స్వతంత్రత ఉంటుంది. అందుకే పుట్టుగ్రుడ్డివి కాకురా అన్నాడు.
మ్రోడు అంటే ఎండిన చెట్టు, దానికి చిగుళ్లు ఉండవు. అది నీడ నివ్వదుఁ పూలు పళ్లు ఉండవు. దాని దగ్గరకెవరూ చేరరు. ఒంటరిగా మిగిలిపోతుంది. కవి అనేవాడు అలా ఉండకూడదు. జనంతో కలవాలి, పదిమందిలో గుర్తింపు పొందాలి. అందుకే వట్టి మ్రోదువు కాకురా అన్నాడు.
ప్రశ్న 2.
తిండి యొక్కటి కాదురా! ఓ కవి గుండె ధైర్యము సూదరా! అని ఎందుకన్నాడు?
జవాబు:
పేదల పోరాటాలన్నీ సాధారణంగా తిండి గురించే ఉంటాయి. తిండి కొరకే వారు అనేక పాట్లు పడతారు. నాయకులు కూడా పేదలకు తిండి దొరకడానికి అనేక పథకాలు ప్రవేశపెడతారు. కవులు కూడా తమ కవితా వస్తువుగా తిండిలేని పేదలను తీసుకొంటారు.
కాని తిండి ఒక్కటే సరిపోదు. సమాజంలో వారి హక్కులను వారు సాధించుకోవాలి. హక్కులను సాధించుకోవాలంటే ఉద్యమాలు నడపాలి. అనేక కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి. కష్టనష్టాలకు ఓర్చుకోవాలంటే గుండె ధైర్యం కావాలి. అటువంటి గుండె ధైర్యాన్ని కవి కల్పించాలి. తన కవిత్వం ద్వారా వారిలో చైతన్యం కల్గించాలి. పిరికితనం పోగొట్టాలి. ధైర్యం కల్గించాలి. వారినేకం చేయాలి. ఉద్యమాలు నడిపే శక్తి యుక్తులను కవి ప్రోత్సహించాలి. అందుకే తిండి యొక్కటే కాదురా! ఓ కవీ! గుండె ధైర్యము నూదరా! అన్నాడు.
సృజనాత్మక ప్రశ్నలు
ప్రశ్న 1.
కవులు ఎటువంటి రచనలు చేయాలని వివరిస్తూ మిత్రునికి లేఖ.”
జవాబు:
రాజమహేంద్రవరం, ప్రియమైన మిత్రునకు, నేను క్షేమము, నీవు క్షేమమని తలుస్తాను. మాకు ఈ రోజు మా తెలుగు మాష్టారు “చైతన్యం” అనే పాఠం చెప్పారు. చాలా బాగుంది. మా మాష్టారు ఎంతో శ్రావ్యంగా గీతాన్ని గానం చేశారు. ఈనాడు కవుల కర్తవ్యాన్ని, బాధ్యతను ఎంతో వివరణాత్మకంగా ‘చైతన్యం’ గేయంలో తాపీ ధర్మారావు విశ్లేషించారు. నేటి కవులంతా స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం రచనలు చెయ్యాలని రచయిత హెచ్చరిస్తూ, స్వార్థంతో చేసే ఏ పని వలన ప్రయోజనం ఉండదని చెప్పారు. ప్రజల కలల సాకారానికి ప్రతిన పూనుకోవాలని హితవు పల్కారు. రచయిత చెప్పిన అంశాలన్నీ నాకు బాగా నచ్చాయి. నీవు కూడా ఈ పాఠం విన్న తర్వాత నీకు కలిగిన అభిప్రాయాలను తెలియజేస్తూ వెంటనే ఉత్తరం రాయగలవు. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 2.
మీ పాఠశాలకు ‘చైతన్యం’ పాఠ్యభాగ రచయిత వస్తున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.
జవాబు:
ప్రశ్నలు:
- నమస్కారం తాపీ ధర్మారావు గారు!
- చాలా కాలానికి మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది కవి గారూ!’
- ఇంకా మీరు గేయాలు, కవితలు రాస్తున్నారా?
- మీకేమైనా అవార్డులు వచ్చాయా?
- మీరు చైతన్యం పాఠంలో చెప్పిన కవుల కర్తవ్యం గురించి చదివాను. ఈనాటి కవులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
- ఈనాటి కవుల రచనలను చూస్తే మీకేమి అర్థమైంది?
- మీ కాలంనాటి రచనలకు, ఈనాటి కవుల రచనలకు తేడా ఏమిటి?
- నేడు ఎటువంటి కవిత్వం రాణిస్తుంది?
- పద్య కవిత్వంపై మీ అభిప్రాయం ఏమిటి?
- మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
భాషాంశాలు
అలంకారాలు
ఈ క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
1. పాతరోజులు పోయెరా
రోత పాటలు మానరా
జవాబు:
అంత్యానుప్రాసాలంకారం
2. నిలిచి శాసించవేమిరా
పలికి పురికొల్ప వేమిరా
జవాబు:
అంత్యానుప్రాసాలంకారం
3. కూరుచుండిన కొమ్మ (FA-I 2023-24)
కొట్టుకొను వాజమ్మ హితము వినడు కదమ్మ
జవాబు:
అంత్యానుప్రాసాలంకారం
గణవిభజన పద్యపాదం పేరు
కింది పద్య పాదానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్య పాదమో రాయండి.
1. శమనుని దుంతఁబట్టుకొనే శక్రుఁడు దావెలి యేనుఁగంచు; వే
జవాబు:
ఇది చంపకమాల పద్యపాదము,
ప్రతి పాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు ఉంటాయి.
యతి (శ – శ) కు చెల్లినది.
2. గమున బురారి నందియని గాడుపు నెచ్చెలి మేక పోతుపైఁ
జవాబు:
ఇది చంపకమాల పద్యపాదము.
ప్రతి పాదంలో న,జ,భ,జ, జ, జ,ర అనే గణాలు ఉంటాయి.
యతి : (గ – గా) కు చెల్లినది.
అర్ధాలు
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
1. ప్రకృతి అందము వర్ణనాతీతము.
జవాబు:
సొగసు
2. ఆకాశంలో మేఘం నేలకు వరం.
జవాబు:
3. సందులలో బండి వేగంగా నడుపకూడదు.
జవాబు:
ఇరుకుదారి
4. ఆనందము కొనలేనిది.
జవాబు:
సంతోషము
5. అనవసరమైన చింత పనికిరాదు.
జవాబు:
ఆలోచన
6. నేటి మోడులు రేవు చిగురిస్తాయి.
జవాబు:
ఎండిన చెట్టు
7. వీణ తంత్రులు మీటితే రాగాలు పలుకుతాయి.
జవాబు:
తీగలు
8. కొందరి గొంతు మధురంగా ఉంటుంది.
జవాబు:
కంఠము
9. ఏ పరిస్థితి పైనా రోత పనికిరాదు.
జవాబు:
అసహ్యం
10. దిక్కులు పిక్కటిల్లెలా ఏనుగు ఘీంకరించింది.
జవాబు:
దిశలు
11. ఆకాశంలో చుక్కలు మిలమిలలాడాయి.
జవాబు:
నక్షత్రాలు
12. మంచిని కాంచుట మహాత్ముల లక్షణం.
జవాబు:
చూచుట
13. పెద్దల రీతి అనుసరణీయము.
జవాబు:
విధము
14. రక్తము పరీక్షిస్తే రోగము తెలుస్తుంది.
జవాబు:
నెత్తురు
15. ఓడికలలో నీరు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది.
జవాబు:
కాలువ
ఆ) గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
1. బక్క వారికి దేవుడే దిక్కు
అ) పేద
ఆ) భక్తి
ఇ) పూజా
ఈ) అర్చకుడు
జవాబు:
అ) పేద
2. ప్రభుత్వము శాసించు వాటిని ఉల్లంఘించకూడదు.
అ) చెప్పు
ఆ) ప్రార్ధించు
ఇ) ఆదేశించు
ఈ) నచ్చచెప్పు
జవాబు:
ఇ) ఆదేశించు
3. స్వార్థము అనర్ధదాయకం.
అ) ప్రయోజనం
ఆ) డబ్బు
ఇ) పరప్రయోజనం
ఈ) స్వప్రయోజనం
జవాబు:
ఈ) స్వప్రయోజనం
4. కోకిల గానము పంచమ స్వరంలో ఉంటుంది.
అ) పాట
ఆ) ఆట
ఇ) రంగు
ఈ) నాట్యము
జవాబు:
అ) పాట
5. కొందరి జన్మ సార్ధకము చేసుకుంటారు.
అ) స్వార్థం
ఆ) నిస్వార్థం
ఇ) అర్థవంతము
ఈ) అనర్థము
జవాబు:
ఇ) అర్థవంతము
6. వేటగాళ్ళు క్రూరులు. (SA-2023-24)
అ) దయాపరులు
ఆ) దయలేనివారు
ఇ) దయతో ఉండేవారు
ఈ) దయామయులు
జవాబు:
దయలేనివారు
7. కరోనా ఘోరమైన విలయం సృష్టించింది.
అ) భయంకరమైన
ఆ) ప్రమాదకరమైన
ఇ) మృత్యుపరమైన
ఈ) కష్టతరమైన
జవాబు:
అ) భయంకరమైన
8. గ్రంథాలు పరికించుట వలన జ్ఞానం పెరుగుతుంది.
అ) కొనుట
ఆ) సేకరించుట
ఇ) దాచుట
ఈ) పరిశీలించుట.
జవాబు:
ఈ) పరిశీలించుట.
9. పులి కోరలు భయంకరంగా ఉంటాయి.
అ) పొట్టిపళ్ళు
ఆ) పొడవైన పళ్ళు
ఇ) దంతాలు
ఈ) ముందు పళ్ళు
జవాబు:
ఆ) పొడవైన పళ్ళు
10. ఎన్నో ధాటిలను భారత్ తిప్పికొట్టింది.
అ) దౌర్జన్యం
ఆ) దండయాత్ర
ఇ) కరువు
ఈ బాధ
జవాబు:
ఆ) దండయాత్ర
11. వేసవి నిప్పుల కొలిమిలా ఉంది.
అ) గంప
ఆ) తట్ట
ఇ) కుంపటి
ఈ) పొయ్యి
జవాబు:
ఇ) కుంపటి
12. కత్తి వాదర పదునుగా ఉంటుంది. అ అచు
అ) అంచు
ఆ) పిండి
ఇ) మొత్తము
ఈ) ఒకవైపు
జవాబు:
అ) అంచు
13. మానసము ఉల్లాసంగా ఉంచుకోవాలి.
అ) శరీరము
ఆ) ఆలోచన
ఇ) ప్రవర్తన
ఈ) మనస్సు
జవాబు:
ఈ) మనస్సు
14. గంగలో సరస్వతి అంతర్ వాహినిగా ప్రవహిస్తో
అ) నీరు
ఆ) జలము
ఇ) లోపల
ఈ) నది
జవాబు:
ఈ) నది
15. శక్తి హీనులను ఆదుకోవాలి.
అ) బలము
ఆ) ధనము
ఇ) పరువు
ఈ) హెూదా
జవాబు:
అ) బలము
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
1. కృష్ణశాస్త్రి కవిత్వం అందంగా ఉంటుంది.
జవాబు:
అందం, సొగసు
2. పంటలకు మూలం మేఘం.
జవాబు:
మబ్బు, పయోధరం
3. పసిపిల్లలు ఆనందంగా ఉంటారు.
జవాబు:
సంతోషం, మోదము
4. సంగీతానికి మ్రోడు కూడా చిగురిస్తుంది.
జవాబు:
మ్రొద్దు, మొరడు
5. బాల సుబ్రహ్మణ్యం పాట బాగుంటుంది.
జవాబు:
గీతం, కీర్తన
6. లోహం కాక మీదనే వంగుతుంది.
జవాబు:
వేడి, ఉష్ణము
7. చుక్క చక్కగా ఉంది.
జవాబు:
నక్షత్రం, తార
8. యుద్ధాలలో రక్తం చిందిస్తారు.
జవాబు:
నెత్తురు, రుధిరము
9. జగము దైవస్వరూపం.
జవాబు:
లోకం, ప్రపంచం
10. కరోనాలో గొంతు నొప్పి లక్షణం.
జవాబు:
కంఠము, కుత్తుక
11. దిక్కు లేనివారికి దేవుడే దిక్కు.
జవాబు:
దిశ, ఆశ
12. పోరు నష్టం.
జవాబు:
యుద్ధం, రణం
13. బక్కవారు పౌరుషవంతులు.
జవాబు:
పేదలు, బీదలు
14. అగ్ని ప్రమాదకరం.
జవాబు:
వహ్ని, జ్వలనుడు
15. కొత్తవారిని నమ్మరాదు.
జవాబు:
నూతన, నవ
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.
1. ఆత్మబలం నిజమైన బలం.
అ) శక్తి, బలిమి
ఆ) తెగింపు, సాహసం
ఇ) దయ, కరుణ
ఈ) మనస్సు, మానసం
జవాబు:
అ) శక్తి, బలిమి
2. క్రూరులు సమాజానికి ప్రమాదం.
అ) దయలేనివారు, దయాపరులు
ఆ) నీతిహీనులు, అవినీతిపరులు
ఇ) దయలేనివారు, కరుణలేనివారు
ఈ) పిరికివారు, భయపడేవారు
జవాబు:
ఇ) దయలేనివారు, కరుణలేనివారు
3. కూడు లేనివారిని ఆదుకోవాలి.
అ) భోజనము, నీరు
ఆ) తిండి, నిద్ర
ఇ) నీడ, గూడు
ఈ) తిండి, భోజనం
జవాబు:
ఈ) తిండి, భోజనం
4. సంక్రాంతికి చాలామంది కొత్తగుడ్డలు కొనుక్కుంటారు.
అ) చీరలు, బట్టలు
ఆ) బట్టలు, వస్త్రాలు
ఇ) దుప్పట్లు, పరదాలు
ఈ) తువ్వాళ్ళు, పక్కబట్టలు
జవాబు:
ఆ) బట్టలు, వస్త్రాలు
5. గుండె కాపాడుకోవాలి.
అ) హృదయము, ఎద
ఆ) గుండు, తల
ఇ) మెదడు, మేధ
ఈ) ఆరోగ్యం, హృదయం
జవాబు:
అ) హృదయము, ఎద
6. నీరు మనకు ప్రాణా మానని
అ) జలజము, జలజ
ఆ) జలగ, జలజ
ఇ) జలము, సలిలము
ఈ) సలిలము, కలవరం
జవాబు:
ఇ) జలము, సలిలము
7. కత్తి కంటే కలము పదునైనది.
అ) ఖడ్గము, మగ్గము
ఆ) చాకు, బ్లేడు
ఇ) బాకు, అంపము
ఈ) ఖడ్గం, బాకు
జవాబు:
ఈ) ఖడ్గం, బాకు
8. కత్తి వాదర మెరుస్తూ ఉంటుంది.
అ) అంచు, తుంచు
ఆ) అంచు, కోటి
ఇ) కోటి, లక్ష్మ
ఈ) కోటి, కోటీరము
జవాబు:
ఆ) అంచు, కోటి
9. ఏదీ అధికంగా ఆలోచించకూడదు.
అ) ఎక్కువ, చాలా
ఆ) మక్కువ, మిక్కుటం
ఇ) తక్కువ, అల్పం
ఈ) అనల్పం, స్వల్పం
జవాబు:
అ) ఎక్కువ, చాలా
10. తూర్పున సూర్యుడు ఉదయించును.
అ) తొలిదిక్కు, మలిదిక్కు
ఆ) తొలిదిక్కు తూరుపు
ఇ) తొలిదిక్కు తుదిదిక్కు
ఈ) దిశ, దేశ
జవాబు:
ఆ) తొలిదిక్కు తూరుపు
11. రావణుని పరిమార్చి రాముడు సీతను తెచ్చెను.
అ) చంపి, ఓడించి
ఆ) ఓడించి, జయించి
ఇ) చంపి, నిర్జించి
ఈ) కొట్టి, కట్టి
జవాబు:
ఇ) చంపి, నిర్జించి
12. చంటి పిల్లలు ఆకలికి తట్టుకోలేరు.
అ) క్షుత్తు, అన్నార్తి
ఆ) క్షుత్తు, సుధ
ఇ) బాధ, కష్టం
ఈ) ఆకలి, దాహం
జవాబు:
అ) క్షుత్తు, అన్నార్తి
13. మంచి తరుణము మించనివ్వకూడదు.
అ) సమయము, సంధ్య
ఆ) సంధ్య, దీప్తి
ఇ) కాంతి, వెలుగు
ఈ) సమయము, ప్రొద్దు
జవాబు:
ఈ) సమయము, ప్రొద్దు
14. మారుతము విజృంభిస్తే కట్టడాలు నిలబడవు.
అ) గాలి, నీరు
ఆ) అగ్ని, నీరు
ఇ) గాలి, వాయువు
ఈ) వర్షము, వాన
జవాబు:
ఇ) గాలి, వాయువు
15. మన భారతదేశము పేరు ప్రపంచంలో మార్మొగాలి.
అ) కీర్తి, నామము
ఆ) కీర్తి, యశము
ఇ) సంపద, ఐశ్వర్యము
ఈ) పరిశోధనలు, చరిత్ర
జవాబు:
అ) కీర్తి, నామము
ప్రకృతి వికృతులు
అ) గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.
1. కష్టములకు భయపడకూడదు.
జవాబు:
కస్తి
2. తూర్పు తిరిగి దండం పెట్టమన్నారు.
జవాబు:
తూరుపు
3. దుఃఖం క్రుంగదీస్తుంది.
జవాబు:
దూకలి
4. మన శక్తిని మనం నమ్ముకోవాలి.
జవాబు:
సత్తువ
5. శూర్పణఖ ఒక రాక్షసి.
జవాబు:
రక్కసి
6. తృటిలో ప్రమాదం తప్పింది.
జవాబు:
చిటిక
7. మంచి మాట్లాడడానికి శంకవద్దు.
జవాబు:
జంకు
8. దేవుని పుష్పములతో అర్చించాలి.
జవాబు:
పువ్వు
ఆ) గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
1. మంచి గొంతు ఒక వరం.
అ) గొంతుక
ఆ) కంఠము
ఇ) గ్రీవము
ఈ) మెడ
జవాబు:
ఆ) కంఠము
2. అగ్గి ఏదైనా బుగ్గి చేస్తుంది.
అ) అగిని
ఆ) అని
ఇ) అగ్ని
ఈ) అఘము
జవాబు:
ఇ) అగ్ని
3. శివాజీ కత్తి చాలా బరువైనది.
అ) బాకు
ఆ) చాకు
ఇ) బ్లేడు
ఈ) ఖడ్గము
జవాబు:
ఈ) ఖడ్గము
4. ఒక అడవిలో సింగము ఉండేది.
అ) సింగము
ఆ) సింహం
ఇ) కేసరి
ఈ) మృగరాజు
జవాబు:
ఆ) సింహం
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
1. చింతవద్దు.
జవాబు:
ఆలోచన, బాధ
2. కాక మీద కాక ఎప్పుడు వస్తువగును?
జవాబు:
వేడి, తప్ప
3. సందులోకి వెళ్లకు.
జవాబు:
ఇరుకు వీధి, సొరంగం
4. ఎందుకు దూరి నవ్వుల పాలవుతారు?
జవాబు:
తిట్టి, ప్రవేశించి
5. ఆనందం విడువకు.
జవాబు:
మోదం, ముదము
6. జగం హాయిగా ఉండాలి.
జవాబు:
ప్రపంచం, భూలోకం
7. గొంతు బాగుండాలి.
జవాబు:
కంఠధ్వని, కంఠం
8. దిక్కులు
జవాబు:
శరణు, దిశ
9. చుక్కలు ఆకాశంలో ఉంటాయి.
జవాబు:
శుక్రుడు, నక్షత్రం
10. రీతిని బట్టి గౌరవం.
జవాబు:
విధము, ఇత్తడి
ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
1. మేఘం ఆకాశానికి మేఘం కపోలమదంకు అందం.
అ) మబ్బు, ఏనుగు
ఆ) మేఘం, కపోలం
ఇ) మబ్బు, తొండం
ఈ) మబ్బు, దంతం
జవాబు:
అ) మబ్బు, ఏనుగు
2. డబ్బు వలన ఆనందం దొరుకుతుందే కాని ఆనందం దొరకదు.
అ) విచారం, సంతోషం
ఆ) సుఖం, సంతోషం
ఇ) హాయి, ఆహా
ఈ) సౌఖ్యం, సుఖం
జవాబు:
ఆ) సుఖం, సంతోషం
3. దిక్కు లేని వారి కున్నది దేవుని దిక్కు.
అ) దిక్కు మొక్కు
ఆ) శరణు, వరుణ
ఇ) రక్షణ దిశ
ఈ) వశం, నిశి
జవాబు:
ఇ) రక్షణ దిశ
4. రాక్షస గురువు కవి గొప్ప కవి.
అ) బృహస్పతి, పండితుడు
ఆ) కైత, కైతగాడు
ఇ) కావ్యం, గ్రంధం
ఈ) శుక్రుడు, పండితుడు
జవాబు:
ఈ) శుక్రుడు, పండితుడు
5. గాలి లేదని నాపై గాలి మోపితే ఎలా?
అ) వాయువు, రాయి
ఆ) వాయువు, నింద
ఇ) నింద, తిట్టు
ఈ) స్తుతి, నింద
జవాబు:
ఆ) వాయువు, నింద
6. వాహిని వాహిని ని దాటి యుద్ధం చేసింది.
అ) సైన్యం, నది
ఆ) కోతి, సముద్రం
ఇ) కోతి, అడవి
ఈ) పులి, కొండ
జవాబు:
అ) సైన్యం, నది
7. నా పాలుకు చెందిన పాలు ఇవ్వాలి.
అ) సుధ, క్షీరం
ఆ) పెరుగు, దధి
ఇ) ఇక్షువు, పీయూషం
ఈ) భాగం, క్షీరం
జవాబు:
ఈ) భాగం, క్షీరం
8. మన భావం మంచి భావంను అలవరుస్తుంది.
అ) ఆలోచన, మనసు
ఆ) మది, మతి
ఇ) భయం, భీతి
ఈ) స్వభావం, ప్రవర్తన
జవాబు:
ఈ) స్వభావం, ప్రవర్తన
9. అందమైన గొంతులో మంచి గొంతు ఉంది.
అ) శరీరం, దేహం
ఆ) కాయం, తనువు
ఇ) కంఠం, కంఠధ్వని
ఈ) పాట, పద్యం
జవాబు:
ఇ) కంఠం, కంఠధ్వని
వ్యుత్పత్త్యర్థాలు
గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం రాయండి.
1. మేఘము ఆకాశంలో ప్రకాశిస్తోంది.
జవాబు:
తడుపునది
2. కవిని గౌరవించాలి.
జవాబు:
వర్ణించేవాడు
3. రక్తము పొంగితేనే దేనినైనా సాధించగలం.
జవాబు:
ఎరుపురంగు కలది
4. కష్టములకు భయపడకూడదు.
జవాబు:
హింసించునది
5. మానసంలో సంతోషం ఉండాలి.
జవాబు:
దీనిచేత ఎరుగబడును
6. అధికంగా సంపాదించినా దానం చేయాలి.
జవాబు:
పెట్టిన సొమ్మును మించి వచ్చినది.
ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్వర్ణాన్ని గుర్తించండి.
1. మన మనసులోనే ఆనందం పుడుతుంది.
అ) బాధించేది
ఆ) సుఖింపచేసేది
ఇ) తృప్తినిచ్చేది
ఈ) ఆనందింప చేసేది
జవాబు:
ఈ) ఆనందింప చేసేది
2. జగమున ధర్మం నిలబడాలి.
అ) దీని యందు సర్వం కలుగును.
ఆ) క్రమేణా నశించేది.
ఇ) పర్వతాలు కలది.
ఈ) జంతువులు కలది.
జవాబు:
అ) దీని యందు సర్వం కలుగును.
3. అగ్నితో వేళాకోళమాడకు.
అ) జ్వలించేది
ఆ) కుటిలంగానైనా జ్వలించేవాడు.
ఇ) మండించేది
ఈ) మంట పుట్టించేది
జవాబు:
ఆ) కుటిలంగానైనా జ్వలించేవాడు.
4. దుఃఖం శాశ్వతంగా ఉండదు.
అ) కన్నీరు
ఆ) రక్తం రప్పించేది
ఇ) బాధించేది
ఈ) దుష్టంగా బాధ పెట్టేది
జవాబు:
ఈ) దుష్టంగా బాధ పెట్టేది
5. బాధలకు భయపడకూడదు.
అ) దుఃఖపెట్టేది
ఆ) దీని చేత కలియపెట్టబడుదురు
ఇ) బాధించేది
ఈ) ఏడ్పించేది
జవాబు:
ఆ) దీని చేత కలియపెట్టబడుదురు
6. యుద్ధం వల్ల చెడే కల్గుతుంది.
అ) పోరుట
ఆ) చంపుట
ఇ) చచ్చుట
ఈ) పొడుచుట
జవాబు:
అ) పోరుట
సంధి పదాలను విడదీయడం
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
1. అందమగు ప్రకృతిని కాపాడాలి.
జవాబు:
అందము + అగు
2. కూడదది అంటే వినరేం?
జవాబు:
కూడదు + అది
3. వేటాడుట తప్పు.
జవాబు:
వేట + ఆడుట
4. రాక్షసినొక బాణంతో రాముడు కూల్చెను.
జవాబు:
రాక్షసిని + ఒక
5. ఉపకారం చేస్తే ఇంతింత అనరాని పుణ్యం వస్తుంది.
జవాబు:
ఇంత + ఇంత
6. మండుటాకలి పేదలను బాధిస్తోంది.
జవాబు:
మండు + ఆకలి
7. శ్రావణ మేఘాలు ఎక్కువ వర్షం ఇస్తాయి.
జవాబు:
మేఘము + లు
8. యుద్ధాలలో విజయం సాధించాలి.
జవాబు:
యుద్ధము + లలో
9. కన్నంలో ఎలుక దూరియానందం పొందింది.
జవాబు:
దూరి + ఆనందం
10. దరిద్రం పోఁగొట్టరా!
జవాబు:
పోన్ + కొట్టరా
11. అన్నయొకటి మంచిది కావాలి.
జవాబు:
అన్న ఒక్కటి
12. పులి కోరలు సాచి వస్తోంది.
జవాబు:
కోరలు + చాచి
13. అడవిలో ఒకయగ్ని రగిలించి.
జవాబు:
ఒక + అగ్ని
14. నియమాలు అన్ని యొక్కటి కావు.
జవాబు:
అన్ని + ఒక్కటి
15. జహ్ను మహర్షి గోదావరి వాహిని నా పెను.
జవాబు:
వాహినిని + ఆపెను
సంధి పదాలను కలపడం
సంధి పదాలను కలిపి రాయండి.
1. హృదయము + లు
జవాబు:
హృదయాలు
2. జాతికి + ఆయుధం
జవాబు:
జాతికాయుధం
3. భావము + ల
జవాబు:
భావాల
4. ఆనందమునకు + ఐ
జవాబు:
ఆనందమునకై
5. తంత్రులు + అన్ని
జవాబు:
తంత్రులన్ని
6. ధైర్యమును + ఊదు
జవాబు:
ధైర్యమునూదు
7. గుండెలు + అన్ని
జవాబు:
గుండెలన్ని
8. వెనుక + ఆడ
జవాబు:
వెనుకాడ
9. పడమరలు + అనక
జవాబు:
పడమరలనక
10. శిథిలము + లు
జవాబు:
శిథిలాలు
11. ఆయుధము + ఈవు
జవాబు:
ఆయుధమీవు
12. ఆట + ఆడు
జవాబు:
ఆటాడు
13. కవివి + ఐ
జవాబు:
కవివై
14. గోళము + లు
జవాబు:
గోళాలు
15. లోకము + ల
జవాబు:
లోకాల
సంధి నామాలు
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
1. అందమగు మేఘాల సందు.
అ) ఉత్వసంధి
ఆ) అత్వసంధి
ఇ) గుణసంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
అ) ఉత్వసంధి
2. గొందిలో దూరి ఆనందముకై పాడు.
అ) ఉత్వసంధి
ఆ) యణాదేశ సంధి
ఇ) వృద్ధి సంధి
ఈ) గసడదవాదేశ సంధి
జవాబు:
అ) ఉత్వసంధి
3. బక్కదొక్కులు రేగి ప్రళయ మారుతమట్లు.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) అత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) ఇత్వసంధి
జవాబు:
ఇ) ఉత్వసంధి
4. తక్కువెక్కువల్లెల ఒక దెబ్బకు కూర్చి లోకాల నూగింపరా.
అ) గుణసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) అత్వసంధి
ఈ) లు,ల,న,ల సంధి
జవాబు:
ఈ) లు,ల,న,ల సంధి
5. మండుటాకిలిలోను ఎండు నాల్కలు.
అ) టుగాగమ సంధి
ఆ) ఇత్వసంధి
ఇ) అత్వసంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
అ) టుగాగమ సంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
1. రామా! నీ తేజము అసామాన్యం.
జవాబు:
నీ యొక్క తేజము
2. వెనుక తరుణం మరలరాదు.
జవాబు:
వెనుకదైన తరుణము
3. మాకు వింతబలం వచ్చింది.
జవాబు:
వింతయైన బలం
4. స్వార్థగానం మానాలి.
జవాబు:
స్వార్ధముతో గానము.
5. సమసమాజంలో ఎక్కువ తక్కువలు ఉండవు.
జవాబు:
ఎక్కువయును, తక్కువయును
6. ప్రళయమారుతం భయంకరంగా ఉంటుంది.
జవాబు:
ప్రళయము నందలి మారుతం.
7. కరోనా కోటికోరలు సాచింది.
జవాబు:
కోటి సంఖ్య గల కోరలు.
8. ఆశ్వయుజంలో పాలమబ్బులు వచ్చేయి.
జవాబు:
పాలవంటి మబ్బులు
9. కత్తిసాము చేయాలంటే ధైర్యం కావాలి.
జవాబు:
కత్తితో సాము.
10. ఎండునాల్క తడపాలి.
జవాబు:
ఎండినట్టి నాల్క
11. లోకతంత్రులు మీటాలి.
జవాబు:
లోకమనెడు తంత్రులు
12. జనుల కష్టాలు తీర్చడం ప్రభుత్వ విధి.
జవాబు:
జనుల యొక్క కష్టాలు
13. అర్జునుడు సింహనాదం చేశాడు.
జవాబు:
సింహము యొక్క నాదం
14. భారతదేశం దొడ్డశక్తి కలది.
జవాబు:
దొడ్డయైన శక్తి
15. అవధాని గారిపై పూలవర్షం కురిపించేరు.
జవాబు:
పూలతో వర్షం
సమాస నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
1. మేఘాల సందులో మెరుపు పుట్టింది.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) నఞ్ తత్పురుష సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష సమాసం
2. చాలా ఘోరయుద్ధాలు జరిగాయి.
అ) తృతీయా తత్పురుష సమాసం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. దృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) నఞ్ తత్పురుష సమాసం
ఈ) తృతీయా తత్పురుష సమాసం
జవాబు:
ఈ) తృతీయా తత్పురుష సమాసం
4. కూడుగుడ్డలు లేనివారిని ఆదుకోవాలి.
అ) తృతీయా తత్పురుష సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) ద్వంద్వ సమాసం
5. ప్రళయ మారుతముతో సృష్టి అంతమగును.
అ) సప్తమీ తత్పురుష సమాసం
ఆ) ద్విగు సమాసం
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
అ) సప్తమీ తత్పురుష సమాసం
6. యుద్ధాలలో రక్తమోడికలు కడుతుంది.
అ) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) తృతీయా తత్పురుష సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఇ) తృతీయా తత్పురుష సమాసం
7. పేదలు కష్టాల కొలిమిలో కాలుతున్నారు.
అ) నఞ్ తత్పురుష సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
ఆ) రూపక సమాసం
8. కవుల స్వార్థగానం అనర్ధదాయకం.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) నఞ్ తత్పురుష సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఈ) తృతీయా తత్పురుష సమాసం
జవాబు:
ఈ) తృతీయా తత్పురుష సమాసం
9. గుండె ధైర్యంతో బతకాలి.
అ) తృతీయా తత్పురుష సమాసం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) నఞ్ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
10. కత్తివాదర నునుపుగా ఉంటుంది.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష సమాసం
11. కష్టాల కొలిమిలో ఉన్నా ధైర్యం విడవకూడదు.
అ) తృతీయా తత్పురుష
ఆ) రూపక సమాసం
ఇ) షష్ఠీ తత్పురుష
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) రూపక సమాసం
12. తూర్పు పడమరలు సూర్యుని గమన దిశలు.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) రూపక సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
ఈ) ద్వంద్వ సమాసం
13. మృత్యువునకు కోటికోరలు ఉంటాయి.
అ) నఞ్ తత్పురుష
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) ద్విగు సమాసం
ఈ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
జవాబు:
ఇ) ద్విగు సమాసం
14. కొందరిది బండగుండె.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) చతుర్థీ తత్పురుష
ఇ) తృతీయా తత్పురుష
ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
15. దుష్టరాక్షసి! అని కైకను దశరథుడన్నాడు.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
16. అంగదుడు తన సహచర వానరులతో మృదుమధురముగా ఇట్లు పలికెను.
అ) ద్విగు సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
జవాబు:
ఈ) విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
వ్యతిరేకార్థక వాక్యాలు
ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
1. కొందరు అల్లరి మానరు.
జవాబు:
కొందరు అల్లరి మానేస్తారు.
2. అనవసరమైన ఆశను వీడండి.
జవాబు:
అనవసరమైన ఆశను వీడకండి.
3. క్రమశిక్షణ తగ్గింది.
జవాబు:
క్రమశిక్షణ తగ్గలేదు.
4. నలుగురూ నవ్వుతున్నారు.
జవాబు:
నలుగురూ నవ్వడం లేదు.
5. చాలామంది బాధలు పడుతున్నారు.
జవాబు:
చాలామంది బాధలు పడడంలేదు.
6. నేను చాలా మాట్లాడతాను.
జవాబు:
నేను చాలా మాట్లాడను.
7. నేను విదేశాలకు వెడతాను.
జవాబు:
నేను విదేశాలకు వెళ్ళను.
8. నేను లెక్కలు చేయగలను.
జవాబు:
నేను లెక్కలు చేయలేను
9. నాకు ప్రయాణాలంటే ఇష్టం.
జవాబు:
నాకు ప్రయాణాలంటే ఇష్టం లేదు.
10. ఒక్క భాష నేర్చుకోవాలి.
జవాబు:
ఒక్క భాషనే నేర్చుకోకూడదు.
11. చెట్లు ఎక్కాలి.
జవాబు:
చెట్లు ఎక్కకూడదు.
12. ఆనందాన్ని కొనుక్కోగలం.
జవాబు:
ఆనందాన్ని కొనుక్కోలేం.
13. మనకు కష్టాలు తగ్గుతాయేమో!
జవాబు:
మనకు కష్టాలు తగ్గవేమో!
14. కొందరికి ఆటలంటే శ్రీ ఇష్టం.
జవాబు:
కొందరికి ఆటలంటే ఇష్టం కాదు.
15. అన్నీ సాధించగలం.
జవాబు:
అన్నీ సాధించలేము.
వ్యతిరేకార్థక క్రియలు
కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
1. అ) తిని
ఆ) చూసి
ఇ) వెళ్లి
ఈ) వెళ్లక
జవాబు:
ఈ) వెళ్లక
2. అ) చూసి
ఆ) చూడక
ఇ) కని
ఈ) వెళ్లి
జవాబు:
ఆ) చూడక
3. అ) మలచి
ఆ) మలచు
ఇ) మలచక
ఈ) ఆగి
జవాబు:
ఇ) మలచక
4. అ) ముగియక
ఆ) ముగిసి
ఇ) తిని
ఈ) విని
జవాబు:
అ) ముగియక
5. అ) పూని
ఆ) పూనక
ఇ) పానకం
ఈ) పూనకం
జవాబు:
ఆ) పూనక
6. అ) రమ్ము
ఆ) రా
ఇ) వచ్చి
ఈ) రాక
జవాబు:
ఈ) రాక
7. అ) దిగక
ఆ) దిగి
ఇ) దిగుతూ
ఈ) దిగితే
జవాబు:
అ) దిగక
8. అ) పోయి
ఆ) పోక
ఇ) పోతే
ఈ) పోతూ
జవాబు:
ఆ) పోక
9. అ) ఎదిగి
ఆ) ఎదుగుతూ
ఇ) ఎదగక
ఈ) ఎదిగితే
జవాబు:
ఇ) ఎదగక
10. అ) కని
ఆ) కంటే
ఇ) కంటూ
ఈ) కనక
జవాబు:
ఈ) కనక
11. అ) పారి
ఆ) పారక
ఇ) పారితే
ఈ) పారుతూ
జవాబు:
ఆ) పారక
12. అ) తెలిసి
ఆ) తెలియక
ఇ) తెలిస్తే
ఈ) తెలిసే
జవాబు:
ఆ) తెలియక
13. అ) కాంచి
ఆ) కాంచితే
ఇ) కాంచుతూ
ఈ) కాంచక
జవాబు:
ఈ) కాంచక
14. అ) త్రాగక
ఆ) త్రాగి
ఇ) త్రాగితే
ఈ) త్రాగుతూ
జవాబు:
అ) త్రాగక
15. అ) దంచి
ఆ) దంచక
ఇ) దంచితే
ఈ) దంచుతూ
జవాబు:
ఆ) దంచక
సంక్లిష్ట వాక్యాలు
ఇవి ఏ రకమైన సంక్లిష్టవాక్యాలో రాయండి.
1. మందులు వేస్తే రోగం తగ్గుతుంది.
జవాబు:
చేదర్థకం
2. పాత పాటలు పాడుకుంటూ తిరగవద్దు.
జవాబు:
శత్రర్ధకం
3. కుతంత్రాలతో పనులు చేస్తే ఫలితాలు ప్రమాదకరంగా ఉంటాయి.
జవాబు:
చేదర్థకం
4. సమాజానికి మేలు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.
జవాబు:
చేదర్థకం
5. కవి సమాజహితం కోరి మంచి రచనలు చేశాడు.
జవాబు:
క్త్వార్థకం
6. గాలి లేనిదే జీవులు బ్రతకలేరు.
జవాబు:
చేదర్థకం
7. స్వార్థగానము మాని సార్థకానికి పూనుకోవాలి.
జవాబు:
క్త్వార్థకం
8. అమ్మ వంట చేసి నిద్రపోయింది.
జవాబు:
క్త్వార్థకం
9. పేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.
జవాబు:
శత్రర్థకం
10. కష్టాలను ఎదుర్కొంటూ పేదలు జీవితాలను చాలిస్తున్నారు.
జవాబు:
శత్రర్ధకం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
1. దుర్మార్గులు యుద్ధాలు నడుపుతారు.
అ) దుర్మార్గుల చేత యుద్దాలు జరుపబడునా?
ఆ) ఆ దుర్మార్గుల చేత యుద్ధాలు నడుపబడగలవు.
ఇ) దుర్మార్గుల చేత యుద్ధాలు నడుపబడుతున్నాయి.
ఈ) దుర్మార్గుల చేత యుద్ధాలు నడుపబడతాయి.
జవాబు:
దుర్మార్గుల చేత యుద్దాలు నడుపబడతాయి.
2. కవి ప్రజలను రక్షించాలి.
అ) ప్రజల చేత కవి రక్షించబడాలి.
ఆ) కవి చేత ప్రజలు రక్షించబడాలి.
ఇ) కవి చేత ప్రజలు రక్షించబడతారు.
ఈ) కవి చేత ప్రజలు రక్షించబడరు.
జవాబు:
ఆ) కవి చేత ప్రజలు రక్షించబడాలి.
3. నీవు మంచిపేరును సంపాదించాలి.
అ) మంచి పేరు నీ చేత సంపాదించబడాలి.
ఆ) నీ పేరు మంచిని సంపాదించబడాలి.
ఇ) మంచి పేరు చేత నీవు సంపాదించబడాలి.
ఈ) మంచి పేరు సంపాదించబడాలి.
జవాబు:
అ) మంచి పేరు నీ చేత సంపాదించబడాలి.
4. నీవు ఏక్ తార్ పాటలను చాలించాలి.
అ) ఏక్ తార్ పాటలు నీ చేత చాలించబడాలి.
ఆ) ఏక్ తార్ పాటల చేత నీవు చాలించబడాలి.
ఇ) ఏక్తార్ పాటలు నీ చేత చాలించబడును.
ఈ) ఏక్ తార్ పాటలు నీ చేత చాలించబడ్డాయి.
జవాబు:
ఆ) ఏక్ తార్ పాటల చేత నీవు చాలించబడాలి.
5. నీవు త్యాగాలు గుర్తు చేశావు.
అ) త్యాగాలు నీ చేత గుర్తించబడ్డాయి.
అ) నీ చేత త్యాగాలు గుర్తించబడును.
ఇ) త్యాగాలు నీ చేత గుర్తు చేయబడ్డాయి.
ఈ) త్యాగాలు నీ చేత గుర్తించబడాలి.
జవాబు:
ఇ) త్యాగాలు నీ చేత గుర్తు చేయబడ్డాయి.
6. నీవు బాధ్యతను తీసుకోవాలి.
అ) బాధ్యత నీ చేత తీసుకోబడును.
ఆ) బాధ్యత నీ చేత తీసుకోబడాలి.
ఇ) నీ చేత బాధ్యత తీసుకోబడుతోంది.
ఈ) నీ చేత బాధ్యత తీసుకోబడగలదు.
జవాబు:
ఆ) బాధ్యత నీ చేత తీసుకోబడాలి.
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాల్లో రాయండి.
1. క్రమశిక్షణతో ఉండండి.
జవాబు:
విధ్యర్థకం
2. కాలం వృథా చేయవద్దు.
జవాబు:
నిషేధార్థకం
3. ఎందుకలా చూస్తున్నారు?
జవాబు:
ప్రశ్నార్థకం
4. ఆహా! నది ఎంత బాగుందో!
జవాబు:
ఆశ్చర్యార్థకం
5. పని చేసి అలసిపోయేరు.
జవాబు:
సంశ్లిష్టవాక్యం
6. పని పాట నేర్చుకోవాలి.
జవాబు:
సంయుక్త వాక్యం
7. చర్చిస్తే విషయం తేలుతుంది.
జవాబు:
చేదర్థకం
8. నేను తమిళం మాట్లాడగలను.
జవాబు:
సామర్థ్యార్థకం
9. కలకాలం వర్ధిల్లు
జవాబు:
ఆశీరార్థక వాక్యం
10. దయచేసి తిండి తినండి.
జవాబు:
ప్రార్థనార్థక వాక్యం
11. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు.
జవాబు:
త్వర్థక వాక్యం
12. పరీక్ష వ్రాస్తానో! వ్రాయనో!
జవాబు:
సందేహార్థకం
13. నేను తప్పక పరీక్ష వ్రాస్తాను.
జవాబు:
నిశ్చయార్థం
14. కాకి, కోకిలలు నల్లగా ఉంటాయి.
జవాబు:
సంయుక్త వాక్యం
15. పాపాలు చేయకండి.
జవాబు:
నిషేధార్థకం
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
1. మానవులు, జంతువులు ప్రాణులే.
అ) సంక్లిష్ట
ఆ) సంయుక్తం
ఇ) విధ్యర్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
ఆ) సంయుక్తం
2. మందులు వేస్తే రోగం తగ్గుతుంది.
అ) చేదర్థకం
ఆ) నిశ్చయార్థకం
ఇ) సంయుక్తం
ఈ) విధ్యర్థకం
జవాబు:
అ) చేదర్థకం
3. నీవెవరు?
అ) ఆశ్చర్యార్థకం
ఆ) సందేహార్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఇ) ప్రశ్నార్థకం
4. అబ్బ! ఎంత చల్లగా ఉందో!
అ) ఆశ్చర్యార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) సందేహార్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
అ) ఆశ్చర్యార్థకం
5. నేను కొండ ఎక్కగలను.
అ) సందేహార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) సంక్లిష్టం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
ఈ) సామర్థ్యార్థకం
6. మా ఇల్లు చూసి ఆనందించేరు.
అ) సంయుక్తం
ఆ) క్త్వార్థకం
ఇ) సంక్లిష్టం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఇ) సంక్లిష్టం
7. దయచేసి ఇటు చూడండి.
అ) సామర్థ్యార్థకం
ఆ) ప్రార్థనార్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
ఆ) ప్రార్థనార్థకం
8. పల్లెలు దేనినైనా సాధించగలవు.
అ) నిశ్చయార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) సామర్థ్యార్థకం
ఈ) సంక్లిష్టం
జవాబు:
ఇ) సామర్థ్యార్థకం
9. మీరు వెళ్ళవచ్చు.
అ) అనుమత్యర్థకం
ఆ) సందేహార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
అ) అనుమత్యర్థకం
10. అందరూ చదవండి.
అ) సామర్ధ్యార్ధకం
ఆ) విధ్యర్థకం
ఇ) సంక్లిష్టం
ఈ) సంయుక్తం
జవాబు:
ఆ) విధ్యర్థకం
11. ఎందుకు లేచారు?
అ) ప్రశ్నార్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) సంక్లిష్టం
ఈ) సంయుక్తం
జవాబు:
అ) ప్రశ్నార్థకం
12. దీర్ఘాయుష్మాన్ భవ!
అ) ఆశ్చర్యార్థకం
ఆ) ప్రశ్నార్ధకం
ఇ) విధ్యర్థకం
ఈ) ఆశీరార్థకం
జవాబు:
ఈ) ఆశీరార్థకం
13. అబ్బ! ఎంత పెద్ద బిల్డింగో!
అ) ఆశీరార్థకం
ఆ) ఆశ్చర్యార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
ఆ) ఆశ్చర్యార్థకం
14. వాడు కచ్చితంగా చదువుతాడు.
అ) నిశ్చయార్థకం
ఆ) నిర్ణయార్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) సంక్లిష్టం
జవాబు:
అ) నిశ్చయార్థకం
15. వాడు వీడు నువ్వు ఒకటే.
అ) సంక్లిష్టం
ఆ) సంయుక్తం
ఇ) విధ్యర్థకం
ఈ) సందేహార్థకం
జవాబు:
ఆ) సంయుక్తం