Access to the AP 9th Class Telugu Guide 1st Lesson ధర్మబోధ Questions and Answers are aligned with the curriculum standards.
ధర్మబోధ AP 9th Class Telugu 1st Lesson Questions and Answers
చదవండి – చర్చించండి
దీవెన
చిన్నప్పుడు అమ్మ ఊరికెళ్తే
నాకూ చెల్లికీ అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుండా?
పెద్ద ముద్దకి మారాం చేసినప్పుడు
నీ మొహంలో తుంటరి చిరునవ్వు
మేము నీకు తీర్చలేని బాకీ.
సంక్రాంతికి బయట నాలుగు రోడ్ల కూడలిలో
మాచేత వేయించిన భోగిమంట గుర్తుందా?
మా ఇద్దర్నీ తలోవైపూ పట్టుకున్న
నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం
మేము నీకు తీర్చలేని బాకీ.

పండగల్లో, పుట్టినరోజుల్లో
నీకూ అమ్మకీ లేకపోయినా
మాకిద్దరికీ కొత్తబట్టలు కొన్న రోజు గుర్తుందా?
ఆ రోజున పాతబట్టలే కట్టుకుని
మా తలల మీద కొత్తగా కలిపిన అక్షింతలు
వేసినప్పుడు మీ ఇద్దరి మొహాల్లో ఆనందం
మేము నీకు తీర్చలేని బాకీ.
![]()
ఖాళీ గూట్లో ఒంటరివై కూర్చున్నప్పుడు
రెక్కలొచ్చిన పిల్ల పక్షులు ఎగరడం
ఎంత సహజమో చెప్పావు గుర్తుందా?
అప్పుడు నీ మొహంలో కనిపించిన ధైర్యం
మా మీద చూపించిన నమ్మకం
మేము నీకు తీర్చలేని బాకీ
అది “తత్మావై పుత్రనామాసి”
ఆలోచనాత్యక ప్రశ్నలు
ప్రశ్న 1.
మీ కోసం మీ తలిదండ్రులు పడుతున్న కష్టాలను గురించి చెప్పండి.
జవాబు:
మా కోసం మా తల్లిరండురులు చలలా కష్టాలు పడుతున్నారు. కాసీ ఆ కష్టాల గురించి కూడా మాకు తలియనివ్వరు. ఇంట్లో ఏ పండుగ వచ్చినా నాకు మా చెల్లికీ కొత్తబట్టలు కొంటారు. మా అమ్ము పిండివంటలు చేసి పెడుతుంది. ఎంతో బతిమలాడుతూ కథలు చెబుతూ అన్నం పెడుతుంది. మేము కడుపునిండా తింట్ట శన కడుపు నిండినట్లుగా మా అమ్మ ఆనందపడుతుంది. మేము కొత్తబట్టలు వేసుకు తిరుగుతుంటే మా నాన్నగారి కళ్ళలోని సంతృప్తిని చూసి అలా చూడకండి పిల్లలకి దిష్టి తగులుతుందని మా అమ్ము అంటుంది.
మాకు కాల్లో ముల్లు గుచ్చుకుంటీ మా అమ్మా నాన్నల ఫ్రాణాలు విలవిలలాడుతాయి. ఎంత పనితో అలసిపోయినా మా అమ్ము ఇప్పటికీ మమ్టుల్ జోకాడుతూ, పాటలు పాడుతూ నిద్ర పుచ్చుతుంది. తన దగ్గర డజ్పు లేదని అప్పులెలా తీర్చాలో అర్ధం కావటం లేదని మా అమ్మతో చెప్పి మా నాన్నగారు బాధపడుతుంటే అనుకోకుండా విన్నాం. అయినా మా అవసరాలను వేటినీ మానడానికి ఒప్పుకోరు. మా తల్లిడండుడు కష్టం గురించి ఏ్రాయాలంటే ప్రపంచంలోని కాగితాలన్నీ సరిపోవు.
![]()
ప్రశ్న 2.
మి తల్లిదండ్రుల కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి.
జవాబు:
మా తల్లిదండ్రుల కోసం మేము ఏమైనా చేస్తాం. ప్రస్తుతం చక్కగా చదువుకుంటాం. మంచి మార్కులు తెచ్చుకుంటాం. ప్రతీ పనిలోను మా అమ్ముకు, నాన్నకు సహాయపడతాము. వృథాగా దేనినీ పాడుచేయము. మా తల్లిదండ్రులకు ఆనండాన్ని కలిగిస్తాము.
మేము పెద్దయ్యాక మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకాని మా తల్లిదండురును జాగ్రత్తగా చూస్తాము. వాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చస్తాము. నా మొదటి జీతంతో హాళ్ళకు మంచిబట్టలు కొంటాము. డబ్బులు పోగుచేస మంచి ఇల్లు, కారు కాంటాసు. మా అమ్మ, నాన్న దర్ఱాగా, ఆరోగ్యంగా ఉండేలా, కంటికి రెప్పలా కాపాడుకుంటాము.
ఇవి చేయండి
అవగాహన – ప్రతిస్పందన
అ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి.
ప్రశ్న1.
పద్యాలను రాగయుక్తంగా పాడండి, వాటి భావాలు చెప్పండి.
జవాబు:
మీ తెలుగు ఉపాధ్యాయుని అనుసరించండి.
ప్రశ్న 2.
అనుకూలవతి అయిన భార్యను గూర్చి కవి ఏం చెప్పారు ?
జవాబు:
అనుకూలవతి అయిన భార్య ఉంటే ఆ పురుషుడు గృహస్థ ధర్మాలైన అన్ని కర్మలను ఆచరించగలడు. అతనికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. మంచి సంతానం పొందగలడు, ఎప్పుడూ గృహస్థ ధర్మాన్ని ఆచరించే గృహస్థు అందుకోవలసిన మంచి ఫలితాలన్నీ అందుకొంటాడు.’
ప్రశ్న 3.
శకుంతల రాజుతో ‘కొడుకును కరుణా దృష్టితో చూడుము’ అని అన్నది. కరుణా దృష్టితో అంటే ఏమిటి ?
జవాబు:
కరుణాదృష్టి అంటే దయాదృష్టి లేదా జాలిగా చూడటం. ఆదరభావంతో చూడడం. పసిపిల్లలు బలహీనులు. పాపం, పుణ్యం తెలియనివారు. అటువంటి వారిని కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రులది. వారు పట్టించుకోకపోతే రాజు పట్టించుకొని ఆ తల్లిదండ్రులకు బుద్ధి చెప్పాలి. ఇక్కడ దుష్యంతుడు రాజు, తండ్రి కూడా. ఆయనే పట్టించుకోకపోతే ఎవరు దిక్కు ? అందుచేతనే దుష్యంతునికి పితృ ధర్మాన్ని, రాజ ధర్మాన్ని గుర్తు చేయడానికే శకుంతల ఆ విధంగా పలికింది.
ప్రశ్న 4.
‘ధర్మాలన్నింటి కంటే సత్యమే గొప్పది’ – ఎందుకు ?
జవాబు:
ధర్మాలు అనేక రకాలున్నాయి. అవి రాజధర్మం, భర్తృ ధర్మం, పితృధర్మం, భార్యా ధర్మం ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కాని, అన్ని ధర్మాలను పరిశీలిస్తే అంతర్లీనంగా సత్యం దాగి ఉంటుంది. సత్యమే ధర్మానికి బలం, సత్యబద్ధత లేని ధర్మంలో సారం ఉండదు.
అందుకే అన్నిదికంటే సత్యమే గొప్పది, సత్యానికి దైవం కూడా కట్టుబడుతుంది. ధర్మం కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారిఏోతుంది. నిన్నటి ధర్మం నేడు అధర్మం కావచ్చు. గతంలోని అధర్మం నేడు ఫర్మంగా చెలామణీ కావచ్చు. కానీ సత్యమనేది సర్వకాల సర్వావస్థలలో ఒకలాగే ఉంటుంది. సత్లం మారదు, అందుకే అన్ని ధర్మాల కంటీ సత్యం గొప్పది.
ప్రశ్న 5.
జుతల మాటలు ఎు దుష్యంతుడు ఏమను సమాధానమిచ్చాడు ?
జవాబు:
శకుంతల మాటలను విని ‘దుష్యంతుడు చాలా అసహజంగా సమాధానమిచ్చాడు. తానెక్కడ ? శకుంతలెక్కడ ? తమకు కొడుకు ఎక్కడ ? అన్నాడు. తానెప్పుడూ శకుంతలను చూడనే లేదన్నాడు. ఆడవారు అబద్ధాల కోరులే అని, అభాండం కూడా వేశాడు. ఈ విధంగా ఎవ్వరికీ అంగీకారయోగ్యం కాని సమాధానాన్ని దుష్యంతుడు చెప్పాడు.
![]()
ప్రశ్న 6.
కింది ప్రతపదార్థాన్ని చదవండి. గుర్తు ఉన్న పద్యాలకు ప్రతిపదార్థం రాయండి. (2,8,10)
విమల = నిర్మలమైన
యశోనిధీ! = కీర్తికి నిలయమైన వాడా!
వేదములును = నాలుగు వేదాలు (ఋు్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం)
పంచభూతములు = భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే అయిదూను
ధర్మువు = ధర్మమున్నూ (ఆచరింపబడేది ధర్మం)
సంధ్యలు = ఉదయ సంధ్య, సాయం సంధ్య (రెండు ప్రొద్దులకు మధ్యకాలం)
అంత: +ఆత్మయున్ = హృదయమూ (మనస్సూ)
యముడును = యమధర్మరాజూ (మృత్యువుకు అధిదేవత)
చంద్ర సూర్యులు = చంద్రుడూ, సూర్యుడూ
అహంబును = పగలునూ
రాత్రియున్ = రాత్రీ
అన్ = అనెడి
మహత్ = చాలా గొప్పవైన
పదార్థములు = పదార్థాలూ
పురుషవృత్తము = మానవులు చేసే పనులను
ఎఱుంగుచున్ = తెలిసికొంటూ
ఉండున్ + చూవె = ఉంటాయి సుమా
ఇవి ఉండగాన్ = ఈ మహాపదార్థాలు ఉండగా
నరుడు = మానవుడు
తన్ను = తనను తాను
ముచ్చిలన్ = వంచింపగా (మోసగించుకొనుటకు)
తక్కు + ఒనన్ = అబద్ధమాడడానికి
నేర్చునె = పూనుకొనునా (వేరే విధంగా చేయడానికి ప్రయత్నించడు).
జవాబు:
అన్ని పద్యాలకూ ప్రతిపదార్థాలివ్వడం జరిగింది.
ఆ) కింది పద్యం చదవండి. మహాభారతంలో ధర్మం గురించి, సత్యం గురించి తిక్కన సోమయాజి ఏంచెప్పారో గమనించండి.
ఉ॥ సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడ బాఱిదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్యశుదాయక మయ్యును దైవముండెడున్. (- ఉద్యోగపర్వం, ఆశ్వాసం – 3, పద్యం – 273)
భావం : ధర్మం కాలానుగుణమైనది. ఉత్తమమెనని. సత్యం సర్వకాలాలలోనూ మార్పు చెందక స్ధిరంగా, ఏ్రకాశవంతమైనదిగా ఉంటుంది. ధర్మం, సత్యం అనే రెండూ పాపం చేతను, అబద్ధం చేతనూ కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తే అపుడు అవి చెడిపోవడానికి సంసిద్ధంగా ఉంటాయి.
ఆ స్థితిలో ధర్మాన్ని, సత్యాన్ని రక్షించడానికి సమర్ధులై ఉండి కూడా నిర్లక్ష్యంగా ఉంటే అది వారికే హానికరమవుతుంది. అప్పుడు భగవంతుడు ధర్మాన్ని ఉద్ధరించడానికీ, సత్యానికి శుభం కలిగించడానికి ముందుకు వస్తాడు. ధర్మాన్ని, సత్యాన్ని కప్పిపుచ్చడం ఎవరికీ సాధ్యం కాదు అని భావం.

ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
ధర్మం కాలానుగుణమైనది అంటే ఏమిటి ?
జవాబు:
కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది. మహోభారత కాలంనాటి ధర్మాలు కొన్ని ఈ రోజులలో అనుసరణీయం కావు. అలాగే అప్పటి అధర్మాలు కొన్ని ఈ రోజులలో ధర్మాలుగా ఉన్నాయి.
![]()
ప్రశ్న 2.
సమర్థులైనాారు ధర్మం విషయంలో నిర్లక్యంగా ఉంటే ఏమవుతుంి ?
జవాబు:
సమర్థులైనవారు ధర్మం విషయంలో నిర్షక్యంగా ఉండకూడదు. అలా ఉంటే అది ఆ సమర్థులకే ప్రమాదం తెస్తుంది. ధర్మాన్ని దైవం రక్షిస్తాడు.
ప్రశ్న 3.
పద్యంలో అబద్ధం అని అర్ధాన్నిచ్చే పదం ఏది ?
జవాబు:
పద్యంలో ‘బొంకు’ అనేది అబద్ధం అని అర్థాన్నిచ్చే పదం.
ప్రశ్న 4.
“సమర్థులు” అనే పదానికి వృతిరకపడాన్ని గుర్తించండి.
అ) అవివేకులు
ఆ) అధర్ములు
ఇ) అసమర్థుల
ఈ) అపరాఫులు
జవాబు:
ఇ) అసమర్థుల
ప్రశ్న 5.
పై పద్యానికి శీర్షికను నిర్చయించి రాయండి.
జవాబు:
ధర్మ రక్షణ అన శీర్షిక బూగుంటుంది.
ఇ) కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
20వ శతాబ్దంలో తమ రచనల ద్వారా, ఆచరణ ద్వారా సంఘసేవ ద్వారా ఆంధ్రజాతిని ప్రభావితం చేసిన మహనీయులలో – కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కళాప్రహూర్ణ చర్ల గణపతిశాస్త్రిగారు ఒకరు. వీరు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు, సంపాదకుడు, గాంధేయవాది, శతాధిక గ్రంథకర్త. తమ రచనలను దేశసేవకు వినియోగించాలని 1950లో ఆర్షవిజ్ఞానపరిషత్తును స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయనిరాకరణ ఉద్యమం మొదలైన వాటిలో చురుకుగా పాల్గొన్నారు.
సర్వోదయమండలి ఉద్యమ నాయకులు, వినోబా భావే అనుచరులుగా పాదయాత్ర చేసి తమ ఐదు ఎకరాల భూమిని దానం చేసిన త్యాగశీలి. స్వాతంత్య సమరయోధుల పింఛను, ఉద్యోగ పింఛను వద్దంటూ. “నా తల్లికి సేవ చేసి డబ్బు తీసుకుంటానా?” అని ప్రశ్నించారు.
హెూామి వైద్యం, ప్రకృతి వైద్యం ఉచితంగా చేసేవారు. రాట్నం వడికేవారు. స్తీలు మాతృ భూమితో సమానమని తలచి వారికి చేయూతనిచ్చి, ఉపాధి కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసారు. రాత్రిపూట ఒక లాంతరుతో గ్రామాలకు వెళ్లి వయోజనవిద్య, పారిశుద్ధ్యం గురించి నేర్పి చైతన్యపరిచేవారు. తమ ఇంటిని ఆశ్రమంగా మలిచి వృద్ధులకు, అనాథలకు ఆశ్రయమిచ్చారు. ఇది కులమతాలకు అతీతంగా ఈనాటికీ నడుస్తోంది. వీరి తుదిశ్వాస వరకు సేవాతత్పరతతో జీవించారు. (-చర్ల గణపతి శాస్ర్రి జీవిత చరిత నుండి)
ప్రశ్నలు జవాబులు:
ప్రశ్న 1.
పాదయాత్రలో చర్ల గణపతిశాస్త్రి ఎవరిని అనుసరించారు ?
జవాబు:
పాదయాత్రలో ఆచార్య వినోబా భావేను అనుసరించారు.
ప్రశ్న 2.
శతాధిక గ్రంథకర్త అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
శతాధిక గ్రంథకర్త అంటే వంద గ్రంథాలు రచించినవారని అర్థం.
ప్రశ్న 3.
పై పేరాలో అనే పదానికి సమానార్థక పదాలు చూసి రాయండి.
జవాబు:
పై పేరాలో స్త్రీ అనే పదానికి సమానార్థక పదాలు – స్త్రీ, మహిళ
ప్రశ్న 4.
భూమిని దానం చేసిన త్యాగశీలి గణపతి శాస్త్రి
ఈ వాక్యంలో త్యాగశీలి ఏ సమాసమో గుర్తించండి.
అ) బహువ్రీహి
ఆ) ద్విగు
ఇ) పంచమీ తత్పురుష
ఈ) అవ్యయీభావం
జవాబు:
అ) బహువ్రీహి
ప్రశ్న 5.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
చర్ల గణపతి శాస్త్రిగారు పొందిన పురస్కారాలేవి ?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీసాథా’ పద్యభావాన్నిమి సాంత మాటలలో రాయండి.
జవాబు:
ఓ దుష్యంత మహారాజా ! పరస్పర విరుద్దములైన మాటలెందుకు, నీ పుత్తుణ్చి కౌగిలించుకో ఇతని కౌగిలింత సుఖాన్ని అనుథవించు, ముత్యాలహారాలు, పచ్చ కర్పూరం, మంచిగంధం వంటివేవీ ఇంత హాయిని, చల్లదనాన్ని కలిగించవు.
![]()
ప్రశ్న2.
సత్యవాక్యం గొప్తనం గురించి రాయండి.
జవాబు:
అన్ని ధర్మాల కంటె సత్యం గొప్పది. అన్ని తీర్థాలు సేవించడం కంటే వేదాధ్యయనం కంటె సత్యం గొప్పది. అన్నీ తెలిసిన ఋషులు అన్ని ధర్మాల కంటే సత్యం గొప్పదంటారు. వేయి అశ్వషేథ యాగాల ఫలాన్ని ఒక వైపు, సత్యాన్ని ఒక వైపు వేసి తాసులో తూస్తే సత్యం వైపే ముల్లు మొగ్గుతుంది. అంటే 1000 అశ్వమేధ యాగాలు చేయడం కంటే ఒక సత్యవాక్యం చెప్పడం మంచిదని భావం.
ప్రశ్న 3.
పుత్రగాత్ర పరిష్వంగం అంటే ఏమిటి ?
జవాబు:
పుత్రగాత్ర పరిష్యంగం అంటే కుమారుని శరీరాన్ని కౌగిలించుకోవడం అని అర్థం. ఇది హాయిని ఇస్తుంది. కుమారుని కొగిలింత ముత్యాల హారాల కంటె గొప్పది, పచ్చకర్పూరం కంటె హాయిని ఇస్తుంది. మంచిగంధం కంటే చల్లదనాన్ని หస్తుంది.
ప్రశ్న 4.
శకుంతల దుష్యంత మహారాజును అనేక విశేషణాలతో సంబోధించింది కదా ! ఆ సంబోధనలకు అర్థాలు రాయండి.
జవాబు:
దుష్యంత మహారాజును శకుంతల అనేక విధాలుగా సందోధించింది. వాటి అర్థాలు
- మహారాజా! = గొప్పరాజా
- విమల యశోనిధీ ! = స్వచ్ఛమైన కీర్తికి నిధి వంటివాడా !
- ఉర్వీనాథా! = భూపతీ !
- ధర్మ (పియా = ధర్మమును ఇష్టపడే వాడా !
- సారమతీ = మంచిబుద్ధి కలవాడా !
- సూనృత (వ్రత = సత్యం చెప్పడమే నియమంగా కలవాడా’
- ధరాధినాథా = భూపతీ !
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న1.
పాఠం ఆధారంగా శకుంతల వేదనను మీ సొంత మాటల్లో కవితగా రాయండి.
జవాబు:
నేసు తెలిసీ తెలియద నెద వేల
నీవు ప్రకృతికి తెలుసని ఎరుగ వేల
ఆలిని తూలనాడితే కలుగు సుఖమేల
ఇల్లే ఇలలో స్వర్గమని ఎరుగ వేల
ఇల్లాలే ధర్మనిలయనెరుగ వేల
పెళ్లామే కష్టాలకు గొళ్లెమని ఎరుగ వేల ?
పిల్లాడు నీ రూపమే ననెరుగు వేల
లొల్లాయి పలుకు లిక నేల ?
కుల బలిమికి బాలుడు మూలం కదా!
నిజం పలుకు నీతికి నిలబడు.
ప్రశ్న 2.
పాఠం ఆధారంగా శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన సంఘటనను సంభాషణగా రాయండి.
జవాబు:
దుష్యంతుడు : నీవెవరు ?
శకుంతల : నేను తెలిసికూడా అలా అంటారేమిటి ?
దుష్యంతుడు : నేను నిన్నెపుడూ చూడలేదే ?
శకుంతల : కణ్వాశశములో నన్ను గాంధర్వ వివాహం చేసుకోలేదా ?
దుష్యంతుడు : లేదు.
శకుంతల : వీడు మన బిడ్డ ซరతుడు.
దుష్యంతుడు : అబద్ధాలు చెప్పకు.
శకుంతల : వెయ్యి అశ్వమేధాల కంటే సత్యం గొప్పది.
దుష్యంతుడు : అది నాకూ తెలుసు.
శకుంతల : అసత్యం పలికితే ఇహపాలుండవు.
దుష్యంతుడు : బెదిరిస్తున్నావా ?
శకుంతల : సత్యం విలువను టోధిస్తున్నాను.
దుష్యంతుడు : అబ్బో!
శకుంతల : కుమారుని కౌగిలించు కొంటే కలిగే హాయి కంటే ముత్యాలహారాలు గొప్పవి కావు.
దుష్యంతుడు : ఔను కదా!
శకుంతల : కుమారుని కౌగిలింతకంటే పచ్చకర్పూరం, మంచిగంధం గొప్పవి కావు. దుష్యంతుడు ¡ ఔనౌను.
శకుంతల : వీడు మన బిడ్డ భrతుడండి.
దుష్యంతుడు : అబద్ధాలాడకు. వెళ్లిపో.
శకుంతల : మీరు కాదంటే నాకు దేవుడే దిక్కు
ఆకాశవాణి : దుష్యంతా ! శకుంతల గొప్ప పతి|్రత, నిజం చెప్పింది. వీడు నీ కొడుకే భార్యా బిడ్డలను అక్కున చేర్చుకో!
ప్రశ్న 3.
మీరు నిజం చెప్పినపుడు మీ తఖ్లిదండ్రులుగానీ, ఉపాధ్యాయులుగానీ, మిత్లుగానీ మిష్మల్నప్రశంసంంచనపుడు మురు ఎలా అనుభూతి చెందారో తెల్పుతూ వ్యాసం రాయండి.
జవాబు:
నాకు చిన్నతనంలో అబద్ధాలాడడం సరదా ! మా తమ్ముడిని కొట్టేసి, వాడే కొట్టేడని దొంగ ఏడుపు ఏడుస్తూ మా తాతకు చెప్పేపాని. అది నిజుమనుకొని మా తాతగారు వాడిని తిట్టేవారు. ఆరవ తరగతిలో ‘ఒకసారి మా తెలుగు మాష్టారు ఆవు-పులి కథ చెప్పారు. ఆ కథలో ఆవు, పులి దగ్గర అనుమతి తీసుకొని తన దూడకు పాలిచ్చి వస్తుంది. కాని, పులి చంపదు. ఆవు యొక్క సత్య ప్రవర్తనే దాని ప్పాణాలు కాపాడిందని చెప్పారు. నేనిక అబద్ధం ఆడకూడదనుకొన్నాను.
అంతక్రితం రోజే నేను ప్రక్కవాడి తెలుగు నోట్సు తీశాను. వాడికి చెప్పలేదు. ఈ కథ చెప్పిన రోజే మాష్టారడిగారు నోట్సు ఎవరు తీశారని, కథ చెప్పకముందు నేనేం మాట్లాడలేదు. కథ చెప్పాక నేనే తీశానని చెప్పాను. మా మాష్టారు నిజం చెప్పునందుకు నన్ను చాలా మెచ్చుకొన్నారు. ఎప్పుడూ’ అలా చేయకూడదని చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది. అది మూటలలో వర్ణించలేను.
![]()
భాషాంశాలు – పదజాలం
అ) కింది వాక్లాలు చదివి, ఎరుప రంగులో ఉన్న పదానికి అర్థం రాసి, వాడిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా॥ కౌరవ పాండవులకు ద్రోణుడు విలువిద్య నేర్పిన ఆచార్కుడు.
ఆచార్యుడు = గురువు
సొంతవాక్యం : గురువును గౌరవించాలి.
ప్రశ్న 1.
కరోనా సమయంలో ప్రజలు విపత్తులకు గురి అయ్లారు.
జవాబు:
విపత్తు = ఆపద
సొంతవాక్యం : ఆపదలను అధిగమించాలి.
ప్రశ్న 2.
శకుంతల రాజుతో సున్నత వాక్యం మేలు అన్నది.
జవాబు:
సూనృత = సత్యము
సొంతవాక్యం : సత్యమునే పలకాలి.
ప్రశ్న 3.
తెలుగు పద్యం హృద్యంగా ఉంటుంది.
జవాబు:
హృద్యం = ఆహ్లాదకరం
సాంతవాక్యం : ఆహ్లాదంగా మాట్లాడాలి
ప్రశ్న 4.
గాంధీ మహాత్ముని యశస్సు దిగంతాలకు వ్యావించింిి.
జవాబు:
యశస్సు = కీర్తి
సొంతవాక్యం : మంచి కీర్తిని సంపాదించాలి.
ప్రశ్న 5.
వృద్ధులకు చేతికర్ర ఊతగా ఉంటుంది.
జవాబు:
ఊత = ఆసరా
సొంతవాక్యం : తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలి.
ఆ) కింది వాక్యాలు చదవండి, అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను గుర్తించి రాయండి. (పర్యాయపదాలు)
ప్రశ్న 1.
రైతులు భూమిని సాగు చేస్తారు. పాడి హంటలకు నిలయమైన వసుధ మీద ఎన్నో జీవరాసులు నివస్స్తుశ్నాయి. ఈ పుడమిని కాపాడుకోవడం మన బాధ్యత.
జవాబు:
భూమి, వసుధ, పుడమి
ప్రశ్న 2.
తల్లిదండ్డులకు పిల్లలు ఆసరాగా ఉండాలి. పెద్దతనంలో పిల్లలే ఆధారం.
జవాబు:
ఆసరా, ఆధారం, అండ
ప్రశ్న 3.
భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది. సతిని కళత్రం అంటారు. దారాపుత్రులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది.
జవాబు:
భార్య, సతి, డార
ప్రశ్న 4.
తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. పుతుడు పున్నామనరకం నుంిి తప్పిస్తాడని నమ్కుతారు. సుతుడు జన్మించాలని పూజలు చేస్తారు. కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి.
జవాబు:
తనయుడు, పుత్తుడు, సుతుడు, కొడుకు
ప్రశ్న 5.
ఏనుగు భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది. వెలగపండును కరి రింటుంది. మాతంగము మావటిపాని మాట వింటుంది.
జవాబు:
ఏనుగు, కరి, మాతంగము
![]()
ఇ) కింది వేరు వేరు అర్థాలనిచ్చే పదాలను గుర్తించి జతపరచండి. (నానార్థాలు)

జవాబు:
1. క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు ( ఆ ) అ) ఆశ
2. పుణ్యం, స్వభావం, స్యాయం, ఆచారం, నీతి ( ఇ ) ఆ) ధార
3. మానవుడు, అర్జునుడు ( ఉ ) ఇ) ధర్మం
4. దిక్కు, కోరిక, నమ్మకం ( అ ) ఈ) వంశం
5. కులం, వెదురు, పిల్లనగ్రోవి ( ఈ ) ఉ) నరుడు
ఈ) కింది ప్రకృతులకు – వికృతులను, వికృతులకు – ప్రకృతులను రాయండి.

ప్రకృతి — వికృతి
1. పుస్తకం – పొత్తం
2. నీరము – నీరు
3. యజ్ఞము – జన్నము
4. విద్య – విద్దె, విద్దియ
5. గృహము – గీము
6. దీపము – దివ్వె
7. సత్యము – సత్తెము
8. ధర్మము – దమ్మము
9. రాజు – రేడు
10. కావ్యం – కబ్బం
ఉ) కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు రాయండి.
1. పుత్రుడు – పున్నామ’నరకము నుండి తప్పించువాడు – కొడుకు
2. ధర్మం – భూమిని ధరించేది – ధర్మువు
3. పతివ్రత – పతి సేవయే వ్రతముగా కలది – సాధ్వి
4. జ్యోత్స్న – కాంతులను వెదజల్లునది – వెన్నెలా
ఊ) కింది పదాలకు వ్యతిరేక క్రియారూపాలు రాయండి.
1. చేసి × చేయక
2. వస్తాడు × రాడు
3. తింటే × తినకుంటే
4. వినండి × వినకండి
5. చెప్పి × చెప్పక
![]()
వ్యాకరణాంశాలు
సంధులు
అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

జవాబు:
1. వంతలెల్ల : వంతలు : ఎల్ల = ఉత్వసంధి
2. క్రతువది : క్రతువు + అది = ఉత్వసంధి
3. లేదని : లేదు + అని = ఉత్వసంధి
4. భాషలేమిటీ : భాషలు + ఏమిటి = ఉత్వసంధి
5. హూరితంబులగు : పూరితంబులు + అగు = ఉత్నసంధి
ఆ) కింది పదాలను కలిపి రాసి, సంధి పేరు రాయండి.

జవాబు:
1. కణ్వ + ఆశ్రమం : కణ్వశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
2. తీర్థ + అఖిగమనం : తీర్థాభిగమనం – సవర్ణదీర్ఘ సంధి
3. ధర+ అధినాథుడు : ధరాధినాథుడు – సవర్ణదీర్ఘ సంధి
4. సభా + అసదులు : సభాసదులు – సవర్ణదీర్ఘ సంధి
సమాసాలు
అ) కింది సమాస పదాలకు విగ్రహ్యాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.

జవాబు:
1. సూర్యచంద్రులు : సూర్యుడును, చంద్రుడును ద్వంద్వ సమాసం
2. ఇహపరాలు : ఇహును, పరమును – ద్వంద్వ సమాసం
3. రాత్రింబవళ్లు : రాత్రియును, పగలును – ద్వంద్వ సమాసం
4. శకుంతలాదుష్యంతులు : శకుంతలయును, దుష్యంతుడును – ద్వంద్వ సమాసం
అలంకారాలు
అ) ఉపమాలంకారం: – ఒక వస్తువును ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్బి రమ్యంగా చెబితే అది ఉపమాలంకారం. దీనిలో ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమానధర్మం అనే నాలుగు అంశాలు ఉంటాయి.

కింది వాక్యాలలోసి అలంకారాన్ని గుర్తించండి.
ప్రశ్న 1.
ఒక దీపం నుండి మరాక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది.
జవాబు:
ఇచ్బిన వాక్యంలో ఉపమాలంకారం ఉంది.
లక్షణం : ఒక వస్తువును ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా వర్ణించి చెబితే దానిని ఉపమాలంకారం అంటారు. దీనిలో ఉపమేయం, ఉపమానం, సమానఫధర్మం, ఉపమావాభకం అనే నాలుగు అంశాలుంటాయి. సమన్వయం : దీపం నుండి మరాక దీపం వెలిగించడంతో తం(డీ కొడుకులను పొల్చారు.
ఉపమేయం : తండ్రీ కొడుకులు
సమానధర్మం : పుట్టడం
ఉపమానం : దీపాలు
ఉపమావాచకం : అట్లు (ఆ విధంగా)
![]()
ప్రశ్న 2.
ఆకాశంలో మేఘం వెండికొండలా తెల్లగా ఉంది.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో ఉపమాలంకారం ఉంది.
లక్షణం : ఒక వస్తువును ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా వర్ణించి చెబితే దానిని ఉపమాలంకారం అంటారు. దీనిలో ఉపమేయం, ఉపమానం, సమానధర్మం, ఉపమావాచకం అనే నాలుగు అంశాలుంటాయి.
సమన్వయం : మేఘాన్ని వెండికొండతో ఏోల్చారు.
ఉపమేయం : మేఘం
ఉపమానం : వెండికొండ
సమానధర్మం : తెల్లదనం ఉపమావాచకం : లాగా (వలె)
ఛందస్సు
కింది తరగతిలో చంపకమాల పద్య లక్షణాలను తెలుసుకున్నారు కదా! ఇప్పుడు మత్తేభపద్య ల్షణాలను గురించి తెలుసుకుండాం…!
పాఠంలోని కింది పద్య పాదాలకు గురు – లఘువులుు పరీశిలించండి. పద్యలక్షణాలను అన్వయంం చేయండి.

పై పద్యపాదాలు గమనించండి. ప్రతి పాదంలో వరుసగా స, భ, ర, న, మ, య, వ అనే గణాలు ఉన్నాయి కదా! ప్రతి పాదంలోనూ 14వ అక్షరం (వి – ర్వీ, త్ర – క్తా, ద్ర – ద్ర, త్ర – ద్యం) లకు యతి చెల్లింది. ప్రతి పాదంలో ప్రాస 2వ అక్షరం ‘ప’ ఉంది. ఈ లక్షణాలు ఉంటే అది మత్తేభ పద్యం అవుతుంది.
మత్తేఖ పద్య లక్షణాలు
1. మత్తేభం వృత్త జాతి పద్యం.
2. నాలుగు పాదాలు ఉంటాయి.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి.
4. ప్రాస నియమం ఉంది.
5. ప్రతి పాదంలో స – భ – ర – న – మ – య – వ అనే గణాలు వరుసగా వస్తాయి.
6. ప్రతి పాదంలో 14వ అక్షరం యతి స్థానం.
కింది పద్య పాదాలకు గురు – లఘువులను గుర్తించండి. మత్తేఖ పద్య లక్షణాలను సమన్వయం చేయండి.
1.

ఇది మత్తేభ పద్యపాదము.
లక్షణము : మత్తేభం వృత్త జాతికి చెందిన పద్యం. దీనికి 4 పాడాలుంటాయి. ప్రతి పాదంలో వరుసగా స,ఫ,ర,న,మ,య,వ అనే గణాలు వరుసగా ఉంటాయి. యతి – 14వ అక్షరం. స్రాసనియమం కలదు.
సమన్వయం : ఇచ్చిన పద్యపాదంలో స,భ,ర,న,మ,య,వ అనే గణాలు వరుసగా ఉంటాయి. యతి 14వ అక్షరం (అ-బు+అ)కు చెల్లినది. కనుక ఇది మత్తేభ పద్యపాదం.
2.

ఇది మత్తేభ పద్యపాదము.
లక్షణము : మత్తేభం వృత్త జాతికి చెందిన పద్యం. దీనికి 4 పాడాలుంటాయి. ఫ్రతి పాదంలో వరుసగా స,థ,ర,న,మ,య,వ అనే గణాలు వరుసగా ఉంటాయి. యతి – 14వ అక్షరం. ప్రాసనియమం కలదు.
సమన్వయం : ఇచ్చిన పద్యపాదంలో స,భ,ర,న,మ,య,వ అనే గణాలు వరుసగా ఉంటాయి. యతి 14వ అక్షరం (త-ర్ఠ)కు చెల్లినది.
3.

ఇది మత్తేభ పద్యపాదము.
లక్షణము : మత్తేఝం వృత్త జాతికి చెందిన పద్యం. దీనికి 4 పాదాలుంటాయి. ఫ్రతి పాదంలో వరుసగా స,భ,ర,న,మ,య,వ అనే గణాలు వరుసగా ఉంటాయి. యతి – 14వ అక్షరం. ప్రాసనియమం కలదు.
సమన్వయం : ఇచ్చిను పద్యపాదంలో స,ధ,ర,న,మ,య,వ అనే గణాలు వరుసగా ఉంటాయి. యతి 14వ అక్షరం (అ-నం)కు చెల్లినది. కనుక ఇది మత్తేథ పద్యపాదం.
ప్రాజెక్టు పని
ప్రశ్న 1.
శకుంతలను అత్తారాంటికి పంహిస్తూ కణ్వమహహముని శకుంతలకు చెప్పిన మాటలను క్యూఅర్ కోడ్లో ఇచ్చిన శకుంతల చిత్రం స్యాన్ చేసి చూసి సమీక్షరాసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విడ్యార్థి కృత్యం
ప్రశ్న 2.
ఈనాటి పెళ్ళి వేడుకల్లో పెళ్ళకూతురును అత్తవారింటికి పంపే సందర్భాన్ని వర్ణిస్తూ ఖ్యాసం రాయండి.
జవాబు:
విహాహం అనేది రెండు జీవితాలనే కాదు, రెండు కుటుంబాలను కలిపే హారధి.
పెళ్లి తంతులో అప్పగింతలు అనేది చివరి తంతుగా చెప్పుకోవచ్చు. వరునికి, అతని తల్లిదండులుక, అన్నదమ్ములకు, అమ్మాయిని అప్పగిస్తారు.
అమ్మాయి చేతికి పాలు రాసి, ఆ చేత్తో పారి చేతులలో రాయించి వధువును అప్పగిస్తారు. ఈ అప్పగింతల తంతు జరిగేటప్పుడు వధువుకు, ఆమె తల్లిదండ్డులు మొదలైనవారికి కళ్లు చెమరుస్తాయి. అమ్మాయిని అత్తవారింటికి పంపేటపుడు, అંరటిపళ్ల గెలలు, స్వీట్సు, చలివిడి, సామాన్లు, పసుపు, కుంకం, బట్టలు అన్నీ ఇచ్చి పంపుతారు.
![]()
కొంతమందైతే పనిమనిషిని కూడా పంపుతారు. ఆమెను అరణపు దాసి అంటారు. ఆడపెళ్లివారు తమ శక్కిక మించి అమ్మాయికి సారె, చీరలు పెట్టి పంపుతారు. దీనిని గౌరవ చిహ్ంగా భావిస్తారు. ఎంత ఎక్కువ సారి పెడితే అంత గొప్పగా భావిస్తారు. అమ్మాయి తరుఫువారు కూడా కొంతమంది వెళ్లి అత్తవారింట్లో దింపుతారు. నీకేం భయం లేదు. మేమున్నామని చెప్పడానికే ఇదంతా చేస్తారని కొందరంటారు. ఏది ఏమైనా ఆడపిల్ల అత్తవారింటికి వెళ్లే సన్నివేశం చాలా అపురూపమైనది. ఆసక్తికరమైన వేడుక.
పద్య మధురిమ
ఉ || ఆపదలండు ధ్రర్యగుణ, మంచిత సంపదలందుc దాల్మియున్
భూపసభాంతరాళమునc, బుష్కలవాక్చతురత్వ, మాజి బా
హోపటుకక్తియున్, యశము నందనురక్తియు, విద్యయందు వాం
ఛాపరివృద్ధియున్, బ్రకృతి సిద్ధగుణంబులు సజ్ఞనాళికిన్ — భర్తృరి సుభాషితాలు-ఏనుగు లక్ష్మణకని
భావం: ఆపదలు వచ్చినపుడు ధైర్యగుణం, ఐశ్వర్యం కలిగినపుడు ఓర్పు, సభలో వాక్పాటవం, యుద్ధంలో శౌర్యం, కీర్తియందాసక్తి, విద్యార్జనయందు మిక్కిలి కోరిక – ఇవన్నీ సజ్జనులకు సహజసిద్ధమైన గుణాలు.
పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు
ఆ.వె. 1. ఏల యెఱ్లక లేని యితరుల యట్ల నీ
వెఱుఁగననుచుఁబలికె దెఱిఁగి యెఱిఁగి,
యేన కాని దీని నెఱుఁగరిం దొరులని
తప్పఁబలుక నగునె ధార్మికులకు!
ప్రతిపదార్ధం :
నీవు = నీవు (దుష్యంతుడు)
ఎఱిగి = అన్నీ తెలిసికూడా
ఎఱుcగను + అనుచున్ = తెలియదంటు
ఎఱుకలేని = తెలియని
ఇతరులు + ఆ + అట్లు + ఆ = పరాయివారివలె
ఎఱిగి + ఎఱిగి = తెలిసి తెలిసి
పలికెన్ = పలికితివి
ఇందున్ = ఇక్కడ
దీనిని = ఈ విషయాన్ని(ఈ శకుంతలను)
ఏను + ఆ = నేనే
కాని = కాని
ఒరులు = ఇతరులు
ఎఱుగరు + అని = తెలియరని
ధార్మికులకున్ = ధర్మాత్ములకు (మీకు)
తప్పన్ = తప్పుగా
పలుకన్ =మాట్లాడుట
అగును + ఏ సాధ్యమగుతుందా (సాధ్యం కాదు అని భావం)
భావము : అన్నీ బాగా తెలిసి కూడా నాకు తెలియదని ఇతరుల వలె ఎందుకు మాట్లాడతావు ? అన్నీ తెలిసి తెలిసి ఇలా మాట్లాడవచ్చా ? నేను తప్ప ఇతరులెవరూ దీనిని ఎఱఐగరని తప్పుగా పలకడం ధార్మికులకు సాధ్యం కాదు. అెంటే ధర్మాత్ములైన మీకు సాధ్యం కాదు అని భావము.
చం. 2. విమలయశోనిధీ! పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
ర్థము లివి యుండ గా నరుఁడు దక్కొననేర్చునె తన్ను ముచ్చిలన్
ప్రతిపదార్ధం :
విమల = నిర్మలమైన
యశః = కీర్తికి
నిధీ = నెలవైనపాడా!
వేదములునున్ = వేదాలు
పంచభూతములు = పంచభూతాలు (భూమి, నీరు,
అగ్ని, వాయువు, ఆకాశము)
ధర్మువు = ధర్మదేవత
సంధ్యలు = రెండు సంధ్యలు (ఉదయ సంధ్ల, సాయం సంధ్య)
అంతః + ఆత్మయున్ = మనస్సు
యముడును = యమధర్మరాజు
చంద్రసూర్యులు = చంద్రుడును, సూర్యుడును
అహంబును = పగలును
రాతియును = రాత్రి
అన్ = అనబడే
మహాపదార్థములు = గొప్ప పదార్థాలు
పురుష = నరుని
వృత్తము = చరిత్రను (నడవడికను)
ఎఱుంగుచునుండున్ = తెలిసింటూ ఉంటాయి
చూవె = సుమా
ఇవి = మహాపదార్థాలు
ఉండగాన్ = ఉండగా
నరుఁడు = మానవుడు
తన్ను = తనను
మ్రుచ్చిలన్ = దొంగిలింపగా (వంచింపగా)
తక్కొనన్ నేర్చునే = హూనుకొనగలడా
![]()
భావము : నిర్మలమైన కీర్తికి నిధి వంటి వాడైన ఓ దుష్యంతుడా వేదాలు, పంచభూతాలు, ధర్మదేవత, రెండు సంధ్యలు, మనస్సు, యమధర్మరాజు, చంద్రసూర్యులు, పగలు రాత్రి అనే మహాపదార్థాలు మానవుల ప్రవర్తనను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. ఆ మహాపదార్థాలు ఉండగా మనిషి తనను తాను వంచించుకోలేడు. తను చేసిన దాని నుండి తప్పించుకోలేడని భావము.
కం. 3. సతియును గుణవతియుఁబ్రజా
వతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞా
న్వితదృష్టిఁజూచు నతి దు
ర్మతికి హముంబరముఁగలదె మతిఁబరికింపన్
ప్రతిపదార్ధం :
మతిన్ = బుద్ధిలో
పరికింపన్ = ఆలోచించగా
సతియును = పతివ్రతయు
గుణవతియున్ = గుణవంతురాలు
ప్రజావతియున్ = సంతానవతియు
అనువ్రతయున్ = అనుకూలవతియు
అయిన = అయినటువంటి
వనితన్ = స్తీని
అవజ్ఞా + అన్విత = తిరస్కార
దృష్టిన్ = దృష్టితో
చూచున్ = చూసేటటువంటి
అతి దుర్మతికి = మిక్కిలి దుష్టునికి
ఇహమున్ = లోకంలో
పరమున్ = పరలోకంలో (సుఖం)
కలదే = ఉంటుండా (ఉండదు)
భావము : బాగా పరిశీలిస్తే పతి(వ్రతా, గుణవతి, పిల్లలు కలది, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార దృష్టితో చూసే అతి దుర్మార్గుడుకి ఈ లోకంలోనూ పై లోకంలోను సుఖం ఉండదు.
కం. 4. సంతత గృహమేధి ఫలం
బంతయుఁబడయంగ నోపు ననుగుణభార్యా
వంతుండగు వాఁడు క్రియా
వంతుఁడు దాంతుండుఁబుత్తవంతుండు నగున్
ప్రతిపదార్ధం :
అనుగుణ = అనుకూలవతియైన
భార్యావంతుండు = భార్యతో ఉన్నవాడు
అగువాడు = అయినటువంటివాడు
క్రియావంతుండు = కర్మలను ఆచరించేవాడు
దాంతుండున్ = ఇంద్రియ నిగ్రహం కలవాడు
పుతవంతుండున్ = పిల్లలు కలవాడు
అగున్ = అవుతాడు
సంతత = ఎల్లప్పుడూ
గృహమేధి = గృహ్థాశమం యొక్క
ఫలంబున్ = ఫలితాన్ని
అంతయున్ = అంతదినీ
పడయంగన్ = పొం దడానికి
ఓపున్ = తగినవాడవుతాడు.
భావం: అనుకూలవతియైన భార్య కలవాడు మంచి కర్మలు అచరిస్తాడు. ఇంద్రియ నిగ్రహంతో ఉంటాడు. సంతానాన్ని పొందుతాడు. గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించేవాడు పొందే ఫలితాన్నంతటినీ పొందడానికి తగినవాడవుతాడు.
సీ. 5. ధర్మార్థ కామ సాధనకుపకరణంబు
గృహనీతివిద్యకు గృహము, విమల
చారిత్ర శిక్షకాచార్యకం, బన్వయ
స్థితికి మూలంబు, సద్గతికి నూఁత,
గౌరవంబున కేకకారణం, బున్నత
స్థిరగుణమణుల కాకరము, హృదయ
సంతోషమునకు సంజనకంబు భార్యయ
చూవె భర్తకు, నొండ్లు గావు ప్రియము,
ఆ.వె. లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను,
నెట్టి తీరములను ముట్టఁబడిన
వంతలెల్లఁబాయు నింతులఁబ్రజలను
నొనరఁజూడఁగనిన జనులకెందు.
ప్రతిపదార్ధం :
ధర్మ = ధర్మమునకు
అర్థ = ధనమునకు
కామ = కోరికల
సాధనకు = సాధించడానికి
ఉపకరణంబు = పనిముట్టు
గృహనీతి = శృము అనే నీతి గల
విద్యకు = జ్ఞానానికి
గృహము = ఇల్లు వంటిది
విమల = స్వచ్భమైన
చారిత = నడవడిక
శికక్షకు = తర్ఫీదుకు
ఆచార్యకంబు = గురువు వంటిద
అన్వయస్థితికి = వంశం నిలబడటానికి
మూలంబు = పధానమయినది
సద్గతికి = ఉత్తమ గతికి
మాత = తల్లి వంటిది
గౌరవంబునకు = మర్యాదకు
ఏక కారణంబు = ఒక కారణము
ఉన్నత = శేష్టమయి
స్థర = శాశ్వతమయిన
గుణమణులకు = గుణము అనే రత్నాలకు
ఆకరము = నిలయము
హృదయ = మనసులో
సంతోషమునకు = ఆనందానికి
సంజనకంబు = పుట్టుక స్థానంబు అయిన
భార్యా + చూవె = భార్యయే సుమా !
భర్తకున్ = మగనికి
ప్రియములు = ఇష్టమయినవి
ఒండ్లు = ఇతరములు
కావు = కావు
ఇంతులన్ = భార్యలను
ప్రజలను = సంతానాన్ని
ఒనరన్ = సరిగ్గా
ఎట్టి ఘట్టములున్ = ఎటువంటి సంఫుటనలలోనైనా
ఎట్టి ఆపదలను = ఎటువంటి కష్టాలలోనైనా
ఎట్టి తీరములను = ఎటువంటి ఇబ్బందులలోనైనా
ముట్టన్ + పడినా = చుట్టుముట్టిన
వంతలు + ఎల్లన్ = దుఃఖాలన్నీ
పాయున్ = తొలగిపోతాయి
భావము : భార్య అనేది ధర్మార్థ కామాలనే పురుషార్థాలు సాధించడానికి తగినది. గృహనీతి అనే విద్యకు నెలవైనది. నిర్మలమైన నడవడికి శిక్షణనిచ్చే గురువు వంటిది. వంశం సుస్థిరంగా కొనసాగడానికి మూలము. మంైి ఉన్నత స్థితికి తల్లి వంటిది. మర్యాదకు ఒకే ఒక కారణము.
ఉన్నతమైన మంచి గుణములు అనే మణులకు నిలయము. మనసులో సంతోషాన్ని పట్టించేది అయిన ఫర్తకు భార్యయే సుమా ! మగనికి భార్య కంటే ఇష్టమయినది మరియొకటి లేదు. భార్యా బిడ్డలను (పేమగా చూసుకునేవారికి ఎక్కడైన ఎటువంటి పరిస్థితులలోనైనా కష్టాలు ఇబ్బందులులోనైనా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ తొలగిపోతాయి.
![]()
కం. 6. తాన తన నీడ నీళ్ళుల
లో నేర్పడఁజూచునట్లు లోకస్తుత! త
త్సూను జనకుండు సూచి మ
హానందముఁ బొందు నతిశయప్రీతి మెయిన్
ప్రతిపదార్ధం :
లోకస్తుత = లోకుల చేతకీర్తీంపబడినవాడా; (దుష్యంతా!)
తాను + ఆ = తానే
నీళ్ళులలోన్ = నీటిలో
ఏర్పడన్ = పట్టగా
తన నీడన్ = తన నీడను
చూచున్ + అట్లు = చూసే విధంగా
జనకుండు = తండి
తత్సూనున్ = ఆ బిడ్డను
చూచి = చూసి
మహా + ఆనందమున్ = గొప్పదైన ఆనందాన్ని
అతిశయ = ఎక్కువైన
ప్రీతి మెయిన్ = మిక్కిలి సంతృప్తితో
పొందున్ = పొందుతాడు
భావము : లోకులచే పొగడబడే ఓ దుష్యంతా ! నీళ్ళలో ఏర్పడిన తన నీడను తానే చూసుకొనినట్లు తండ్రి తన కుమారుణ్ణి చూసి చాలా ఇష్టంతో గొప్ప ఆనందాన్ని పొందుతాడు.
కం. 7. నీ పుణ్యతనువు వలనన
యీ పుత్రకుఁడు ద్భవిల్లి యెంతయు నొప్పున్
దీపంబువలన నొండొక
దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్.
ప్రతిపదార్ధం :
దీపంబు వలనన్ = ఒక దీపం వలన
ఒండు + ఒక = మరొక
దీపము = దీపం
ప్రభవించిన + అట్లు = పుట్టినట్లుగా
తేజంబు + ఎసగన్ = వెలుగొందగా
నీ పుణ్య తనువు = నీ పావనమయిన శరీరము
వలనన్ + ఆ = వలన
పుత్రకుడు = చిడ్డ (భరతుడు)
ఉద్భవిల్లి = పుట్టి
ఎంతయున్ = ఎంతో
ఒప్పున్ = ప్రకాశిస్తాడు
భావము : ఒక దీపం వలన మరొక దీపం పుట్టి కాంతి వ్యాపించినట్టుగా నీ పవిత్రమయిన శరీరము వలన ఈ భరతుడు పుట్టాడు. ఎంతో ప్రకాశిస్తాడు.
మ. 8. విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యూ పుత్త గా
త్రపరిష్యంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁజంద్ర జ్యోత్స్యుంబుత్త గా
త్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే.
ప్రతిపదార్ధం :
ఉర్వీనాథ! = భూపతి (ఓ దుష్యంతా)
విపరీత = విరుడ్ధాలైన
పతి భాషలు = మారుమాటలు
ఏమిటికి = ఎందుకు
ప పుత =ఈ పుతుని యొక్క
గాత్ర = రాన్ని
పరిష్యంగ = కౌగిలించుకోవటం వలన కలిగే
సుఖంబు = హాయిని
చేకొనుము = స్వీకరించు
ముక్తాహార = ముత్యాలహారాలు
కర్పూర = పచ్చకర్పూరము య్క్క
సాంద్ర = దట్టమైన
పరాగ = పొడి యొక్క
ప్రసరంబున్ = వ్యానిని
చందనమున్ = మంచి గంధమును
చంద్రజ్యోత్న్యయున్ = వెన్నెల
జీవులకున్ = ప్ణాణులు
పుత = కుమారుని యొక్క
గాత్ర = శరీరాన్ని
పరిష్వంగము + అట్లు = కౌగలించుకొన్నట్లు
హృద్యంబు + ఏ = సంతోషాన్ని కలిగిస్తాయా
కడున్ = మిక్కిలి
శీతము + ఏ = చల్లదనాన్ని ఇస్తాయా (ఇవ్వవు)
భావము : ఓ దుష్యంత మహారాజా ! పరస్పర విరుద్ధాలైన మాటలెందుకు ? ఈ పుతుడి శరీరాన్ని కౌగిలించుకోవడం వలన కలిగే ఆనండాన్ని అనుభవించు. ముత్యాలహారాలు, పచ్చ కర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల పుతుని కౌగిలి వంటి సుఖాన్ని, చల్లదనాన్ని మనసుకి కలిగించలేవు.
![]()
కం. 9. భూరిగుణు నిట్టి కులవి
స్తారకు దారకు నుదార ధర్మప్రియ! ని
ష్కారణమ తప్పఁజూడఁగ
సారమతీ! చనునె నాఁటి సత్యము గలుగన్.
ప్రతిపదార్ధం :
ఉదార ధర్మప్రియ = ఉత్తమమైన ధర్మము నందు ఇష్టము కలవాడా!
సారమతి బుది బ్ధి కలవాడా!
సాటి మన వివాహము నాటి
సత్యము = ఇచ్చిన మాట
కలుగన్ = వాస్తవమయి ఉండగా
భూరి = చాలా
గుణున్ = మంచి గుణాలు కలవాడిని
ఇట్టి = ఇటువంటి
కుల విస్తారకున్ = వంశోద్ధారకుని
దారకున్ = పుతుడిని
నిష్కారణము + ఆ = కారణము లేకుండా
తప్పన్ + చూడగన్ = పట్టించుకోకపోవడం
చనునే = తగునా (తగదు)
భావము : ఉత్తమ ధర్మాన్ని ఇష్టపడేవాడా మంచి బుద్ధిమంతుడా (ఓ దుష్యంతా) మన వివాహం నాడు నాకిచ్చిన మాట అలాగే ఉండగా మంచి గుణవంతుడు వంశోద్ధారకుడు ఐన కొడుకును ఏ కారణం లేకుళడానే కాదనడం తగునా (తగదని భావము)
చం. 10. నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
ఐ్రత! యొక బావి మేలు; మరి బావులు నూఱిటి కంటె నొక్క స
త్క్తుత్స వదిమేలు; తత్క్తతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
ప్రతిపదార్ధం :
సూనృత వ్రత ! = నిజం మాట్లాడటమే నియమంగా కలవాడా!
నుతజల = పొగడబడిన నీటి చేత (మంచి నీటి చేత)
పూరితంబులు + అగు = నిండినటువంటి
నూతులు = చిన్న నూతులు
నూరిటికంటెన్ = వందకంటే
ఒక = ఓకటైన
బావి = దిగుడు బావి
మేలు = ఉత్తమము
మరి = అటువంటి
బావులు = దిగుడు బావులు
నూరిటి కంటెన్ = వంద కంటీ
ఒక్క = ఒక
సత్క్రతువు + అది = మంచి యజ్ఞము
మేలు = ఉత్తమము
తత్ క్రతు = అటువంటి యజ్ఞాలు
శతంబున కంటెన్ = వంద కంటే
సుతుండు = కొడుకు
మేలు = మంచిది
తత్ = అటువంటి
సుత = కొడుకుల
శతకంబు = నూరుగురు
కంటెన్ = కంటే
చూడగన్ = పరిశీలించగా
ఒక = ఒక్క
సూనృత వాక్యము = సత్యవాక్యము
మేలు = మంచిద
భావము : నిజాలు చెప్పటమే నియమముగా కలవాడా! (ఓ దుష్యంత) వంద మంచినీటి నూతుల కంటే ఒక దిగుడు బావి మంచిది. అటువంటి బావులు వంద కంటే ఒక మంచి యజ్ఞం మంచిది. అటువంటి యజ్ఞాలు వంద కంటే ఒక కొడుకు ఉండటం మంచిది. అటువంటి కొడుకులు వందమంది కంటే ఒక సత్యవాక్యం మేలు.
![]()
కం. 11. వెలయంగ నశ్వమేధం
బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి, తూఁపఁగ సత్యము
వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
ప్రతిపదార్ధం :
తులన్ = తాసునందు
వెలయంగన్ = వ్యక్తమయ్యేటట్లు
అశ్వమేధంబులు = అశ్వమేధ యాగాలు
వేయినున్ = వెయ్యిని (ఒక వైపు)
ఒక్క = ఒకే ఒక
సత్యమును = సత్యాన్ (రెండవ వైపు)
ఇరుగడలన్ = రెండువైపులా
ఇడి = ఉంచి
తూపగా = తూచగా
గౌరవంబున = ఆధిక్యంతు (బరువుతో)
సత్యము వలనన = సత్యము వైపే
ములు + చూపున్ = తాసు ముల్లు చూపుతుంది. (సత్యం వైపే (ముగ్గుతుంది)
భావము : ఒక త్రాసులో వెయ్యి అశ్వమేథ యాగాల ఫలాన్ని ఒకవైపు ఉంచి ఒకే ఒక సత్యాన్ని మరోవైపు ఉంచి తూచితే సత్యం యొక్క బరువు వలన తాసుముల్లు సత్యం వైపే మ్రొగ్గుతుంది.
తే.గీ. 12. సర్వతీర్థాఖిగమనంబు, సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుఁగావు
ఎఱుఁగుమెల్ల ధర్మంబుల కెందుఁబెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు.
ప్రతిపదార్ధం :
సర్వ = సమస్త
తీర్థ + అభిగమనంబు = తీర్థాలకు వెళ్ళడం
సర్వ వేద = వేదాలనన్నిందినీ
సమధిగమము = అధ్యయనం చేయడం
సత్యముతోన్ = సత్య వాక్యంతో
సరియున్ కావు = సాటికావు
ధర్మజ్ఞ్రులు + ఐన = ధర్మం బాగా తెలిసిన
మునులు = ఋషులు
ఎందున్ = ఎక్కడైనా
సత్యంబు = సత్యమే
ఎల్ల ధర్మంబులకున్ = అన్ని ధర్మాలకు
పెద్ద = గొప్పది
అండుడు = అంటారు అని
ఎఱుగుము = తెలిసికొనుము
భావము : సర్వతీర్థాలు సేవించడం వేదాలను అధ్యయనం చేయటం సత్యంతో సాటిరావు. ధర్మం బాగా తెలిసిన మునులు అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని ఎల్లప్పుడూ అంటారు. దీనిని తెలిసికొనుము.
కం. 13. కావున సత్యము మిక్కిలి
గా విమలప్రతిభం దలఁచి కణ్వా(శయ సం
భావిత సమయస్థితి దయఁ
గావింపుము, గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్.
ప్రతిపదార్ధం :
కావునన్ = కాబట్టి
విమల = స్వచ్ఛమైన
ప్రతిభన్ = జ్ఞానంతో
సత్యమున్ = సత్యాన్ని
మిక్కిలిగా = గాప్పదానినిగా
తలcచి = భావించి
కణ్వ + ఆ.శమ = కణ్వ మహర్షి ఆశ్రమంలో
సంభావిత = చేసిన
సమయస్థితి = ప్రతిజ్ఞ యొక్క పరిస్థితిని
దయన్ = దయతో
కావింపుము = నెరవేర్చు
కొడుకున్ = నీ కుమారుని (భరతుని)
కరుణాదృష్టిన్ = దయతో
చూడుము = ఆదరించు
భావము : కాబట్టి స్వచ్ఛమైన బుద్ధితో సత్యాన్ని గొప్పదిగా భావించి కణ్వ మహర్షి ఆశశమంలో నీవు చేసిన ప్రతిజ్ఞను దయతో నెరవేర్చు. నీ కొడుకును దయతో చూడు.
వ. 14. అనిన శకుంతల పలుకులు సేకొన నొల్లక దుష్యంతుండిట్లనియె.
ప్రతిపదార్ధం :
అనిన = అంటే
శకుంతల పలుకులు = శకుంతల యొక్క మాటలను
చేకొననొల్లక = అంగీకరించక
ఇట్లు = = విధంగా
దుష్యంతుడు = దుష్యంతుడు
అనియె = అనెను
ఱాత్పర్యం : పై విధంగా పలికిన శకుంతల మాటలను అంగీకరించక దుష్యంతుడు ఇలా అన్నాడు.
కం. 15. ఏ నెట? నీ వెట? సుతుఁ డెట?
యే నెన్నఁడు తొల్లి చూచి యెఱంగను నిన్నున్;
మానిను లసత్య వచనలు
నా నిట్టు లసత్యభాషణం బుచితంబే?
ప్రతిపదార్ధం :
ఏన్ + ఎట = నేనెక్కడ
నీవు + ఎట = నువ్వు ఎక్కడ
సుతుcడు + ఎట = కొడుకు ఎక్కడ
ఏను + ఎన్నడు = నేనెప్పుడు
నిన్నున్ = నిన్ను
తొల్లి = ఇంతకుముందు
చూచి + ఎఱుఁగను = చూడలేదు
మానినులు = స్తీలు
అసత్య వచనలు నాన్ = అబద్ధాలాడుతారు అన్నట్టుగా
ఇట్లు = ఈ విధంగా
అసత్య భాషణంబు = అబద్ధాలాడటం
ఉచితంబు + ఏ = తగునా (తగదు)
![]()
వ. 16. “ఇంక దైవంబకాని యొండు శరణంబు” లే దని యప్పరమ
పతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱిపోవనున్న యవసరంబున
ప్రతిపదార్ధం :
ఇ०క = ఇక
దైవంబు కాని = భగవంతుడే కాని
ఒండు శరణంబు = మరాక దిక్కు
లేదు + అని = లేదని
ఆ + పరమ పతివ్రత = ఆ పరమ పతివ్రత అయిన శకుంతల
తనయున్ కొడుకుని
తోడ్కొని తీసుకుని
క్రమ్మరిపోవన్ = తిరి వెళ్ళిపోతూ
ఉన్న + అవసరంబున = ఉన్నటువంటి సమయంలో
భావము : ఇక భగవంతుడు తప్ప వేరే దిక్కు లేదని తన బిడ్డను తీసుకుని ఆ పరమ పతివ్రత అయిన శకుంతల వెళ్ళిపోతున్న సమయంలో (తరువాతి పద్యంతో అన్వయం)
చం. 17. “గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు, సే
కొని భరియింపు మీతని, శకుంతల సత్యము వల్కె, సాధ్వి స
ద్వినుత మహాపతి[్రత వివేకముతో” నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయ మందగc దత్సభాసదుల్.
ప్రతిపదార్ధం :
గొనకొని = అతిశయించి
వీడు = ఇతడు (భరతుడు)
నీకును = నీకు
శకుంతలకున్ = శకుంతలకు
ప్రియనందనుండు = ఇష్టమైన బిడ్డ
ఈతనిన్ =ఈ కొడుకుని
చేకొని = స్వీకరించి
భరియింపుము = పోషించు
సాధ్వి = ఉత్తమ ఇల్లాలు
సద్వినుత = ఉత్తముల చేత కీర్తీంచబడిన
మహాపతివ్రత = గొప్ప పతి(వత అయిన శకుంతల
వేకముతోన్ = విజ్ఞతతో
సత్యము = నిజాన్ని
పల్కెన్ = చెప్పింది
అని = అని
తత్ = ఆ
సభాసదుల్ = సభలో నున్నపారు
విస్మయము అందగన్ = అశ్చర్యపడగా
దవవ్యవాణి = దేవతా సంబంధమైన మాట
ధర + అధినాథునకున్ = భూపతికి (దుష్యంతుడికి)
వినిచెన్ = వినిపించింది
భావము : “ఈ భరతుడు నీకు శకుంతలకు జన్మించిన బిడ్డ. ఇతనిని స్వీకరించు. ఉత్తమ ఇల్లాలు, ఉత్తమ కీర్తి గలిగిన మహాపతి(వ్రత అయిన శకుంతల విజ్ఞతతో నిజం చెప్పింది” అని ఆకాశవాణి ఆ సఫలోనివారు విని ఆశ్చర్యపడేటట్టు రాజుకి వినిపించింది.
ప్రక్రియ – ఫ్రాచీన పద్యం
ఇతిపోపం : ఇతిహాసము అంటే ఇలా జరిగింది అని అర్థము. జరిగినదానిని చరిత్ర అంటారు. రామాయచ మపోభారతాలు ఇతిహాస కావ్యాలు. జరిగినదానిని కవులు తమ ప్రతిభా నైపుణ్యంతో చక్కని వర్లనలతో కుంటుపడని కథాగమనంతో ఇతిహాస కావ్యాలుగా మలిచారు. ఇవి పాఠకుల అఖిమానాన్ని చూరగాంటాయి.
కవి పరిచయం

కవి పేరు & నన్నయ్యభట్టు
కాలం : 11వ శతాబ్దం
రచనలు : మహాభారత ఆంధ్రీకరణ (ఆది, సభా పర్వాలు అరణ్య పర్వంలో కొంతభాగం), చాముండికా విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలు, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం
ఉద్యోగం : రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి
బిరుదులు : ఆదికవి, వాగనుశాసనుడు (శబ్ష శాసనుడు)
మకాలికుడు : నారాయణఝట్టు
కొందరి అభిప్రాయం : పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు మొదలైనవారు నన్నయ సమకాలికులని.
రచన విశేషాలు : అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థ యుక్తి, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం. అనువాద పద్ధతిలో, శెలిలో తరుపాతి కవులందరికీ మార్గదర్శకుడు.
ఉద్దేశం
మానవుడు తప్పు చేసాడో లేదో తన అంతరాత్మకు మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరికీ తెలియకుండా తప్పులు చేసి తప్పించుకునే స్వభావం మంచిది కాదు. తన మనస్సాక్షిని తాను కాదనకూడదు. గృహస్థ ధర్మాన్ని పాటించాలి. సంతానం యొక్క బాధ్యతను స్వీకరించాలి. సత్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోపాలి. అది చెప్పడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశము.
![]()
నేపథ్యం
రాజర్షి అయిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. ఋషులు తపస్సులను భగ్నం చేయడం దాని ద్వారా వారిలో పట్టుదలను పెంచడం దేవేంద్రుని పని. విశ్వామిత్రుని తపస్సును చెడగొట్టడానికి దేవేంద్రుడు మేనక అనే అప్సరసను పంపాడు. విశ్వామిత్రుని తపస్సుకు భంగం కలిగింది. వారిరువురికీ ఒక అమ్మాయి జన్మించింది. ఆ పసికందుని విడిచి వారు వెళ్ళిపోయారు.
ఆ అమ్మాయిని శకుంత పక్షులు కాపాడుతున్నాయి. అది చూసిన కణ్వ మహర్షి ఆ పసికందును తెచ్చుకుని పెంచుతున్నాడు. ఆ అమ్మాయికి శకుంతల అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతోంది. వేటకు వచ్చిన దుష్యంత మహారాజు ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు.
తన రాజ్యానికి వెళ్ళి ఆమెను మరచిపోయాడు. ఆమెకు భరతుడు జన్మించాడు. తల్లీ బిడ్డలను కణ్వమహర్షి అత్తవారింటికి పంపించాడు. పుత్రునితో వచ్చిన ఆమెను దుష్యంతుడు తిరస్కరించాడు. కలత చెందిన ఆమె దుష్యంతునికి ధర్మబోధ చేయటమే ఈ పాఠ్యాంశ నేపథ్యం.