These AP 9th Class Telugu Important Questions 14th Lesson ఆకుపచ్చశోకం will help students prepare well for the exams.
ఆకుపచ్చశోకం AP Board 9th Class Telugu 14th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
ఈ క్రింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. వర్షాలు కురవాలంటే చెట్లు ఉండాలి. మన ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారం. చెట్ల శాతం తగ్గే కొంది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భూగర్భ జలం తరిగిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వలన భూగోళం వేడెక్కిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే వేడికి ధ్రువాలు కరిగిపోతాయి. సముద్రాలు పొంగిపోతాయి. భూమ్మీద మనతోపాటు అన్ని జీవుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.
ప్రశ్నలు – జవాబులు
అ) భూగోళం వేడెక్కడానికి కారణం ఏమిటి?
జవాబు:
కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వలన భూగోళం వేడెక్కిపోతుంది.
ఆ) ఆక్సిజన్కు ఆధారమైనవి ఏవి?
జవాబు:
ఆక్సిజన్కు ఆధారమైనవి చెట్లు.
ఇ) ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి?
జవాబు:
చెట్ల శాతం తగ్గడం వలన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
వర్షాలు కురవాలంటే ఏమి ఉండాలి?
2. ప్రకృతి సమస్త ప్రాణికోటికి జీవనాధారం. చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు ప్రతి జీవికి ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తోంది. ఆహారాన్ని అందిస్తోంది. ప్రకృతి సంపద మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసమే తప్ప దురాశను తీర్చుకోవడానికి కాదు అనే విషయం మరిచిపోయి ప్రవర్తిస్తున్నాం. మితిమీరిన మనిషి కోరికలు ప్రకృతికి, పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి.
ప్రశ్నలు – జవాబులు
అ) పర్యావరణానికి విఘాతం కలిగించేవి ఏవి?
జవాబు:
మనిషి మితిమీరిన కోరికలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి.
ఆ) ప్రకృతి సంపద ఎందుకు?
జవాబు:
మనిషి అవసరాలు తీర్చుకొందుకే ప్రకృతి సంపద.
ఇ) జీవులకు ఆహారం అందించేదేది?
జవాబు:
జీవులకు ప్రకృతి ఆహారం అందిస్తోంది.
ఈ) ప్రాణికోటికి జీవనాధారం ఏది?
జవాబు:
ప్రాణికోటికి జీవనాధారం ప్రకృతి.
3. నగరాల్లో నిల్చోడానికి నీడ దొరకడం లేదు. చెట్ల జాడ కనిపించడం లేదు. చెట్ల పెంపకంపై పాఠాలు మాత్రం చదువుతున్నారు. పర్యావరణ రక్షణ గురించి పెద్ద పెద్ద నినాదాలు వినిపిస్తున్నారు. కానీ పర్యావరణ స్పృహ తగ్గిపోతూనే ఉంది. ఒక వైపు ప్లాస్టిక్ వాడకం పెరుగుతూనే ఉంది. పెళ్లిళ్లు, పండగల్లో ప్లాస్టిక్ పూలు, ఆకులు కనిపిస్తున్నాయి. శుభమో అశుభమో ఏదైనా కార్యం జరిగిందంటే ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న మనుషులు మొక్కల పెంపకం, పరిసరాల శుభ్రత గురించి పట్టించుకోవడం లేదు. చెట్టు విలువ తెలుసుకోవడం లేదు.
ప్రశ్నలు – జవాబులు
అ) నగరాలలో లేనిది ఏది?
జవాబు:
నగరాలలో నీడ లేదు.
ఆ) ఏ కార్యం జరిగినా పేరుకు పోయేది ఏది?
జవాబు:
ఏ కార్యం జరిగినా చెత్త పేరుకుపోతుంది.
ఇ) మనిషి తెలుసుకోనిది ఏది?
జవాబు:
మనిషి చెట్టు విలువ తెలుసుకోవడం లేదు.
ఈ) మనిషికి తగ్గిపోతున్నదేది?
జవాబు:
మనిషికి పర్యావరణ స్పృహ తగ్గిపోతున్నది.
అపరిచిత గద్యాలు
1. కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానము రాయండి.
గ్రామ దేవతలు ముఖ్యంగా జానపదుల ఆరాధనా దేవతలు. మాంత్రిక, తాంత్రిక, అతీంద్రియ శక్తులెన్నో ఉన్నాయనీ, అనే సుఖదుఃఖాలకు మూలమనీ నమ్మటమే గ్రామదేవతల పుట్టుకకు కారణం. గ్రామ రక్షణ ఒక శక్తిపై లేదా దేవతపై ఆధారపడి ఉందనే విశ్వాసం కూడా ఇందులో ఇమిడి ఉంది.
గ్రామ దేవతల్లో స్త్రీ దేవతలకే ప్రాముఖ్యం, ప్రాచుర్యం, ఆదిమ మానవుల్లో స్త్రీలకే వ్యవసాయం చేసే అధికారం ఉండేది. అందువల్లనే గ్రామదేవతల్లో స్త్రీలే ఎక్కువని కొందరంటారు. విలక్షణమై ప్రసిద్ధమైన కొన్ని గ్రామదేవతల పేర్లు పరిశీలించండి. పోలేరమ్మ, గంగానమ్మ, మైసమ్మ, ఈదెమ్మ, పోచమ్మ, అంకాలమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ మొదలైనవి.
గ్రామదేవతలకు సాధారణంగా ఆకారం ఉండదు. ఒక రాయికి నూనె, పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి సగం పైకి కనిపించేలా పాతికే “గ్రామ దేవత” వెలసినట్లే. ఈ గ్రామ దేవత రాయి ఊరి మొదట్లో గాని, మధ్యలో గానీ ఉంటుంది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
గ్రామ దేవతలు ఎవరికి ఆరాధనా దేవతలు?
జవాబు:
జానపదులకు ఆరాధనా దేవతలు.
ప్రశ్న 2.
గ్రామ దేవతల పేర్లను నాల్గింటిని రాయండి.
జవాబు:
1. పోలేరమ్మ, 2. గంగానమ్మ, 3. మైసమ్మ, 4. అంకాలమ్మ
ప్రశ్న 3.
గ్రామ దేవతల పుట్టుకకు కారణమేమిటి?
జవాబు:
మాంత్రిక, తాంత్రిక, అతీంద్రియ శక్తులెన్నో ఉన్నాయనీ, అవే సుఖదుఃఖాలకు మూలమనీ నమ్మటమే గ్రామ దేవతల పుట్టుకకు కారణం.
ప్రశ్న 4.
గ్రామ దేవతల్లో స్త్రీ దేవతలకే ప్రాముఖ్యముండటానికి కారణమేమిటి?
జవాబు:
ఆదిమ మానవుల్లో స్త్రీలకే వ్యవసాయం చేసే అధికారం ఉండేది. అందువల్ల గ్రామదేవతల్లో స్త్రీ దేవతలకే ప్రాముఖ్యం, ప్రాచుర్యం.
ప్రశ్న 5.
గ్రామ దేవత ఎక్కడ ఉంటుంది?
జవాబు:
గ్రామ దేవత ఊరి మొదట్లో గానీ, మధ్యలో గానీ ఉంటుంది.
2. ఈ క్రింది పేరాను చదవండి. దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములిమ్ము.
దండకారణ్యంలో ఒక సింహం ఉండేది. ఆ సింహం అడవిలోని జంతువులను చంపి జీవించేది. అది ఒకరోజు ఒక అడవి దున్నను చంపి, దాని మాంసాన్ని తింటుండగా ఒక ఎముక దాని నోటిలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. ఎముక వల్ల సింహం తిండి తినలేకపోయింది. నొప్పిని కూడా భరించలేకపోయింది.
ఎముకను ఏ విధంగా తీసి వేయాలా? అని విచారపడసాగింది. ఇంతలో చెట్టుపై నున్న కాకి కనిపించింది. కాకితో సింహం ఇలా అంది. మిత్రమా! నా నోటిలో ఎముక చిక్కుకుంది. నొప్పిని భరించలేకపోతున్నాను. నా నోటిలోని ఎముకను తొలగిస్తే నేను సంపాదించిన ఈ మాంసంలో కొంతభాగాన్ని నీకిస్తాను. నీ ప్రాణానికి ఎటువంటి అపాయమూ లేదు. నాకు సహాయం చెయ్యి” అని సింహం వేడుకుంది.
సింహం పడుతున్న బాధను చూసి కాకి జాలిపడి సింహం నోటిలోని ఎముకను తొలగించాలని అనుకుంది. కాకి సింహం నోట్లోకి ప్రవేశించి తన ముక్కుతో ఎముకను పట్టి బయటికి లాగింది. ఎముక బయటికి వచ్చింది. నొప్పి తగ్గింది. కాకి సింహంతో “నీ నోటిలోని ఎముకను తొలగించి నొప్పిని నివారించాను. మన ఒప్పందం ప్రకారం నీవు సంపాదించిన ఈ మాంసంలో నాకు కూడా కొంత వాటా ఇవ్వు”. అని అడిగింది.
అపుడు సింహం “ఓసి పిచ్చిదానా! నీవు నా నోటిలో ఉన్నప్పుడు నిన్ను మింగకుండా వదిలివేయుటే నేను నీకు చేసిన గొప్ప సహాయం. ఇంకా మాంసం ఇవ్వాలా? వెళ్ళిపో!” అని గర్జించింది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
సింహానికి కల్గిన బాధ ఏమిటి?
జవాబు:
మాంసం తినేటప్పుడు ఒక ఎముక సింహం నోట్లో చిక్కుకుంది. దాని వల్ల బాధపడింది.
ప్రశ్న 2.
కాకితో సింహం ఏమంది?
జవాబు:
మిత్రమా! నా నోటిలో ఎముక చిక్కుకుంది. నొప్పిని భరించలేకపోతున్నాను. నా నోటిలోని ఎముకను తొలగిస్తే నేను సంపాదించిన ఈ మాంసంలో కొంత భాగాన్ని నీకిస్తాను. నా వల్ల నీకు ఏ ప్రమాదం ఉండదు. సహాయం చెయ్యి అని కాకితో సింహం పల్కింది.
ప్రశ్న 3.
కాకి సింహం నోటిలోని ఎముకను ఎలా తీసింది?
జవాబు:
కాకి సింహం నోట్లోకి ప్రవేశించి తన ముక్కుతో ఎముకను పట్టి బయటికి లాగింది.
ప్రశ్న 4.
సింహం నోటి నుండి ఎముకను తొలగించిన కాకి సింహంతో ఏమంది?
జవాబు:
నీ నోటిలోని ఎముకను తొలగించి, నొప్పిని నివారించాను. మన ఒప్పందం ప్రకారం నీవు సంపాదించిన ఈ మాంసంలో నాకు కూడా కొంత వాటా ఇవ్వు అని కాకి, సింహాన్ని అడిగింది.
ప్రశ్న 5.
చేసిన మేలును మరచినవాణ్ని ఏమంటారు?
జవాబు:
కృతఘ్నుడు
3. ఈ కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మన ఇతిహాస పురాణాలైన రామాయణంలో గుహుడు, శబరి, భారతంలో ఏకలవ్యుడు మొదలైన వాళ్ళ ప్రస్తావన ఉంది. కవుల కావ్యాల్లో ఉపయోగించిన శబరి, పుళింద, కిరాత, నిషాద, లుబ్ధ, బోయ, ఎఱుక, చెంచు, భిల్ల, కోయ, వ్యాధి మొదలైన శబ్దాలు గిరిజనులకు పర్యాయపదాలుగా కన్పిస్తాయి. వాల్మీకి, ఏకలవ్యుఁడు, గుహుడు, శబరి మొదలైన వాళ్ళు గిరిజనులే. కిరాతుడే వాల్మికియై రామాయణాన్ని సంస్కృతంలో రాశాడు. కవి కోకిల భారతీయ సంస్కృతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాడు. ఏకలవ్యుడు పట్టుదలకు ప్రతీక, ద్రోణునికి పరోక్ష శిష్యుడు, భక్తి శ్రద్ధలతో విలువిద్యను అభ్యసించాడు. గురుభక్తిని ప్రదర్శించి సాటిలేని వీరుడనిపించుకున్నాడు. ఇక గిరిజనుల నిర్మల భక్తికి నిదర్శనం శబరి, ఆమె భక్తి పారవశ్యంలో మునిగి ఎంగిలి పండ్లను పెట్టి శ్రీరాముని అనుగ్రహాన్ని పొందింది.
ప్రశ్నలు – జవాబులు
1. గుహుడు, శబరి ప్రస్తావన ఏ కావ్యంలో ఉంది?
జవాబు:
రామాయణంలో
2. ఏకలవ్వుని చరిత్ర ఏ కావ్యంలో ఉంది?
జవాబు:
భారతంలో
3. రామాయణాన్ని సంస్కృతంలో రాసిన కవి ఎవరు?
జవాబు:
వాల్మీకి
4. భారతీయ సంస్కృతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన కవి ఎవరు?
జవాబు:
నాల్మీకి
5. భక్తి పారవశ్యంలో మునిగి ఎంగిలి పండ్లను పెట్టి శ్రీరాముని అనుగ్రహాన్ని పొందిన భక్తురాలెవరు?
జవాబు:
శబరి
4. కింది గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానము రాయండి.
భారతీయ చరిత్రలో కూడా గిరిజనుల ప్రస్తావన ఉంది. మావళా వీరుడైన తానాజి, భిల్లు నాయకుడైన భీమాచాందు 1000నుకో. వీరు అరివీర భయంకరులు, ధైర్య సాహసాలకు ప్రతీకలు. వీరు చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచారు. వీరి స్వామి భక్తి, రాజ భక్తి, దేశ భక్తి అమోఘం. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందే గిరిజనులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆంగ్లేయ అధికారులను ఎదిరించారు. బీహార్ చౌరీ ఉద్యమం, ముండా తెగల తిరుగుబాటు, అస్సాంలో ఖాసీల తిరుగుబాటు, గుజరాత్లో భిల్లుల తిరుగుబాటు గిరిజనుల దేశభక్తికి నిదర్శనాలు, ఆంధ్ర ప్రాంతంలో గోండులు, కొమరం భీము నాయకత్వాన తిరుగుబాటు చేశారు. అల్లూరి సీతారామ రాజు నాయకత్వాన * అగ్గిదొర ముల్లు దొరలు బ్రిటిష్ అధికారుల అరాచకాలను ఎదుర్కొన్నారు. తిరుగుబాటు చేసిన సమ్మక్క సారమ్మలు వీర వనితలుగా ప్రసిద్ధి కెక్కారు. ప్రజల చేత ఆరాధింపబడుతున్నారు.
బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. భిల్లుల నాయకుడెవరు? (ఎ)
ఎ) భీమాచాందు
బి) రామరాజు
సి) అగ్గిదొర
డి) మల్లుదొర
జవాబు:
ఎ) భీమాచాందు
2. కొమరం భీము ఏ గిరిజన జాతికి చెందినవాడు? (బి)
ఎ) ఎరుకల
బి) గోండు
సి) భిల్ల
డి) కొండదొర
జవాబు:
బి) గోండు
3. ఎవరి నాయకత్వాన అగ్గిదొర, మల్లుదొరలు బ్రిటిష్ అధికారుల ఆరాచకాలను ఎదుర్కొన్నారు? (సి)
ఎ) గాంధీ నాయకత్వాన
బి) నెహ్రూ నాయకత్వాన
సి) అల్లూరి సీతారామరాజు నాయకత్వాన
డి) బ్రిటిష్వారు
జవాబు:
సి) అల్లూరి సీతారామరాజు నాయకత్వాన
4. బ్రిటిష్ అధికారుల అరాచకాలను ఎదుర్కొన్న వీర వనితలెవరు? (డి)
ఎ) ఝాన్సీరాణి
బి) ఇందిరాగాందీ
సి) రుద్రమ్మదేవి
డి) సమ్మక్క సారమ్మలు
జవాబు:
డి) సమ్మక్క సారమ్మలు
5. బీహార్ లో జరిగిన ఉద్యమం (ఎ)
ఎ) వారీ ఉద్యమం
బి) ఖాసీల ఉద్యమం
సి) భిల్లుల తిరుగుబాటు
డి) బ్రిటిష్ ఉద్యమం
జవాబు:
ఎ) వారీ ఉద్యమం
వ్యక్తీకరణ – సృజనాత్మకత
I. ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘కవితా వ్యాసం’ ప్రక్రియను గురించి రాయండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్న హానిని దాని వలన కలిగే పర్యవసానాలను తెలియచెప్పడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో, వ్యాసరూపంలో వ్యక్తీకరిస్తారు. అందువలన దీనిని ‘కవితా వ్యాసం’ అని కూడా అంటారు.
ప్రశ్న 2.
చెట్ల వలన ఉపయోగాలను రాయండి.
జవాబు:
భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పంచేవి చెట్లు. వర్షాలు కురవాలంటే చెట్లే ఆధారం. మన ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారం. పచ్చని చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ను పీల్చి భూమిపై ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. భూగర్భజలం తరిగిపోకుండా రక్షిస్తుంది. మనుష్యులతో పాటు ఎన్నో జీవరాశుల మనుగడకు నీడను, గూడును ఇస్తాయి చెట్లు, బ్రతికినన్నాళ్ళు పూలను, పళ్ళను ఇవ్వడమే కాక ఎండిన తర్వాత కూడా కలపగా, వంట చెరకుగా ఉపయోగపడుతుంది చెట్టు.
II. ఈ క్రింది ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
లెక్కల్లో మునిగిపోయిన మనిషి మొక్కర్నేం పట్టించుకుంటాడు? దీని గురించి చర్చించండి.
జవాబు:
ఒకరి పెళ్ళి మరొకరి చావు కొచ్చింతప్పట్లు, ఊరు పెరిగే కొద్దీ ఇపుడు చావు చెట్లదై పోయింది. నగరీకరణ పారిశ్రామీకరణ ఆధునీకరణ అనే మాయలో పడి మనిషి చెట్లు చేమలకు రంపపు కోత పెడుతున్నాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం మన దేశంలో కాని, అనేక ఇతర దేశాలలో కాని నోట్ల తయారీకి పత్తిని మాత్రమే ఉపయోగిస్తారు. వీటిని కాటన్ ఫైబర్ తో తయారు చేస్తారు. ప్రాణవాయువునిచ్చే చెట్లను పట్టణీకరణ మోజులో పడి చెట్లను నరికి, మన ప్రాణాలను తీసుకుంటున్నాం. చెట్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో పూర్వీకులు మనకు తెలియజేశారు. కాని మనం చెట్లను నరికి ఎలా లాభాలు పొందాలని ఆలోచిస్తున్నాం. వాటికి గుండె కోత, మనకు డబ్బుల మోత, వాటిపై వచ్చే నోట్లను చూసుకుంటూ మురిసిపోతూ లెక్కల్లో మునిగిపోయిన మనిషి ఇంక మొక్కల్ని ఎం పట్టించుకుంటాడు.
సృజనాత్మక ప్రశ్న
ప్రశ్న 1.
“పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు” ఇలాంటి నినాదాలు మరికొన్ని రాయండి.
జవాబు:
వనాలను రక్షిద్దాం – వానలను పెంచుదాం
చెట్లను పెంచు – కాలుష్యాన్ని తగ్గించు
చెట్లను పెంచు – ఆరోగ్యాన్ని పంచు
కాలుష్యం కళకళ – ఆరోగ్యం విలవిల
నరికిన చెట్టు – నరకానికి మెట్టు
పచ్చదనాన్ని పెంచుకో – ఆరోగ్యాన్ని పంచుకో
చెట్లను నాటుదాం- భూమాతను కాపాడుదాం
కాలుష్యాన్ని పెంచకు – సమస్యలను సృష్టించకు
ప్లాస్టిక్ కళకళ – భూమాత విలవిల
చెట్లను పెంచుదాం – భూతాపాన్ని తగ్గించుదాం
కార్బన్ డై ఆక్సెడ్ వద్దు – ఓజోన్ ముద్దు
చెట్లను పెంచండి మెండుగా – ఏ.సి.లు ఎందుకు దండుగ
చెట్లను పెంచండి భూగర్భజలం నింపండి
ప్రతి బొట్టు – ఒడిసిపట్టు
భాషాంశాలు
అర్థాలు
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
1. పెద్దలతో అలా మాట్లాడడం ఉచితం కాదు.
జవాబు:
తగినది
2. శోకం క్రుంగదీస్తుంది.
జవాబు:
ఏడ్పు
3. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక.
జవాబు:
వివాహం
4. చావుకు పులి భయపడదు.
జవాబు:
నిధనము
5. చెట్టు వలన మనకే లాభం.
జవాబు:
తరువు
6. యుద్ధం వలన ఎప్పుడూ నష్టమే.
జవాబు:
రణం
7. దేశరక్షణ సైనికులు చేస్తారు.
జవాబు:
సిపాయిలు
8. దేహం బట్టి గౌరవించరు.
జవాబు:
శరీరం
9. బాహువు బలంగా ఉండాలి.
జవాబు:
చెయ్యి
10. పట్నంలో సౌకర్యాలెక్కువ.
జవాబు:
నగరం
ఆ) గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
1. మనిషికి గర్వం పనికిరాదు.
అ) నరుడు
ఆ) ఉద్యోగి
ఇ) స్త్రీ
ఈ) పురుషుడు
జవాబు:
అ) నరుడు
2. చెట్టు ఛాయలో విత్తనం మొలవదు.
అ) క్రింద
ఆ) పైన
ఇ) కొమ్మ
ఈ) నీడ
జవాబు:
ఈ) నీడ
3. పొయ్యి సెగ వంటిల్లంతా వచ్చేస్తోంది.
అ) నీరు
ఆ) పొగ
ఇ) వేడి
ఈ) వంట
జవాబు:
ఇ) వేడి
4. మా రహదారి బాగు చేశారు.
అ) దారి
ఆ) మార్గం
ఇ) వీధి
ఈ) రాజమార్గం
జవాబు:
ఈ) రాజమార్గం
5. ఏదో నెపం పెట్టుకొని తప్పుకొని మాట్లాడకూడదు.
అ) వంక
ఆ) కోపం
ఇ) ద్వేషం
ఈ) పత
జవాబు:
అ) వంక
6. ఏ పనినీ విధ్వంసం చేయకూడదు.
అ) పూర్తి
ఆ) నాశనం
ఇ) సగం
ఈ) కోపం
జవాబు:
ఆ) నాశనం
7. గుడిమెట్లు అపవిత్రంగా ఎక్కకూడదు.
అ) శిఖరాలు
ఆ) గర్భగుడి
ఇ) సోపానాలు
ఈ) గుమ్మం
జవాబు:
ఇ) సోపానాలు
8. అందరి బతుకు చల్లగా ఉండాలి.
అ) భవిష్యత్తు
ఆ) సంపాదన
ఇ) ఉద్యోగం
ఈ) జీవితం
జవాబు:
ఈ) జీవితం
9. గులాబి పువ్వు అందంగా ఉంటుంది.
అ) కుసుమం
ఆ) కాయ
ఇ) ఆకు
ఈ) కొమ్మ
జవాబు:
అ) కుసుమం
10. అరటి ఆకులో భోజనం చేయాలి.
అ) కాయ
ఆ) మొవ్వ
ఇ) పత్రము
ఈ) చొప్పు
జవాబు:
ఇ) పత్రము
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
1. కొబ్బరికాయ పచ్చడి బాగుంటుంది.
జవాబు:
నారికేళం, కొబ్బెర
2. మా అక్క పెళ్లి మొన్న వేసవిలో అయ్యింది.
జవాబు:
వివాహం, కళ్యాణం
3. చింత చెట్టు చిగురు కోశాను.
జవాబు:
తరువు, వృక్షం
4. పిల్లల శోకం నవ్వు రప్పిస్తుంది.
జవాబు:
ఏడ్పు, దుఃఖం
5. తంత్రం వలన తృప్తి వస్తుంది.
జవాబు:
తంతు, పని
6. చీకట్లో పొలిమేర దాటవద్దు.
జవాబు:
హద్దు, ఊరి చివర
7. చిన్న విషయానికి యుద్ధం అవసరమా!
జవాబు:
రణం, పోరు
8. సైనికుడు దేశ రక్షకుడు.
జవాబు:
సిపాయి, వీరుడు
9. దేహం కంటె మనస్సు గొప్పది.
జవాబు:
శరీరం, కాయం
10. ప్రతి మనిషి ఆశాజీవి.
జవాబు:
మర్యుడు, మానవుడు
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.
1. తుఫాను ఉపద్రవం సర్వనాశనం చేసింది.
అ) కీడు, ప్రమాదం
ఆ) గాలి, వాయువు
ఇ) వాస, వర్షం
ఈ) వేగం, వాడి
జవాబు:
అ) కీడు, ప్రమాదం
2. అశోకుని బాహువు విజయాలు సాధించింది.
అ) చెయ్యి, కానియ్యి
ఆ) చేయి, హస్తము
ఇ) హస్తం, హస్తి
ఈ) కిరణం, ‘కరము
జవాబు:
ఆ) చేయి, హస్తము
3. పట్నంలో అన్ని సౌకర్యాలూ ఉంటాయి.
అ) నగరము, నగ
ఆ) పురము, కాపురం
ఇ) నగరము, పురము
ఈ) ఊరు, గ్రామం
జవాబు:
ఇ) నగరము, పురము
4. ఎంద సెగ ఎక్కువైంది.
అ) చలి, శీతలం
ఆ) వేడి, మాడు
ఇ) గాలి, గాడ్పు
ఈ) వేడి, ఉష్ణం
జవాబు:
ఈ) వేడి, ఉష్ణం
5. రంధ్రంలో పాము ఉండవచ్చు.
అ) కలుగు, కలిగిన
ఆ) సర్పం, ఫణి
ఇ) వల్మీకం, వాల్మీకి
ఈ) కన్నం, కలుగు
జవాబు:
ఈ) కన్నం, కలుగు
6. నిప్పుతో వేళాకోళం వద్దు.
అ) వహ్ని, మంట
ఆ) మంట, తంట
ఇ) వహిద, వహి
ఈ) అహి, మహి
జవాబు:
అ) వహ్ని, మంట
7. జల్లులో తడిస్తే బాగుంటుంది.
అ) చలి, సలిలం
ఆ) వాన, వర్షం
ఇ) నీరు, జలం
ఈ) సముద్రం, సాగరం
జవాబు:
ఆ) వాన, వర్షం
8. నల్లని మేఘం వస్తే వాన వస్తుంది.
అ) మబ్బు, దుబ్బు
ఆ) పయోధి, పయోధరం
ఇ) మబ్బు, పయోధరం
ఈ) మబ్బు, జలదము
జవాబు:
ఈ) మబ్బు, జలదము
ప్రకృతి – వికృతులు
అ) గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.
1. ఎవరి బ్రతుకు ఎవరికి కావాలి.
జవాబు:
బతుకు
2. పూజకు ఏ పుష్పం అయినా పరవాలేదు.
జవాబు:
పువ్వు
3. మనం మూలికలు పెంచాలి.
జవాబు:
మొక్క
4. ఆకాశంలో మేఘం చూశావా?
జవాబు:
మొగిలు
5. ముసలమ్మ ప్రాణం గిజగిజలాడింది.
జవాబు:
పానం
6. ఒక్క వృక్ష ఛాయా కనిపించదు.
జవాబు:
చాయ
7. చెట్టును ఉపేక్షించడం కూర్చున కొమ్మ నరుక్కోవడం.
జవాబు:
ఒప్పరికం
8. చిన్న రంధ్రం చాలదూ! ఓడ మునిగిపోయేందుకు.
జవాబు:
క్రంత
ఆ) గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
1. పల్లెల్లో సైతం క్రమంగా పచ్చదనం మాయమవుతోంది.
అ) పట్టణం
ఆ) పల్లీ
ఇ) నగరం
ఈ) పల్లియ
జవాబు:
ఆ) పల్లీ
2. చింత మ్రాన్లతోపూ లేదు.
అ) చెంత
ఆ) పుంత
ఇ) తింత్రిణి
ఈ) పులుపు
జవాబు:
ఇ) తింత్రిణి
3. సైగలో పేలాల్లా వేగిపోవడమే.
అ) వేడి
ఆ) ఆవిరి
ఇ) నిప్పు
ఈ) శిఖ
జవాబు:
ఈ) శిఖ
4. బుల్లి తెర అంటే టి.వి.
అ) తిరస్కరణి
ఆ) యవనిక
ఇ) మరుగు
ఈ) చాటు
జవాబు:
అ) తిరస్కరణి
5. లెక్కల్లో మునిగిపోయాడు మనిషి.
అ) లెక్కింపు
ఆ) లక్ష్యం
ఇ) గౌరవం
ఈ) గణనం
జవాబు:
ఆ) లక్ష్యం
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
1. అన్ని ఉచితంగా రావు.
జవాబు:
వెలలేని, తగినది
2. ఆశ ఉండాలి కాని అత్యాశ పనికి రాదు.
జవాబు:
కోరిక, దిక్కు
3. ఛాయ సూర్యుని వలన వచ్చింది.
జవాబు:
నీడ, సూర్యసతి
4. వెండి ఒకసారే ముచ్చట.
జవాబు:
రజతం, మరల
5. ప్రాణం సరిగ్గా లేదు.
జవాబు:
ఉసురు, గాలి
ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
1. మా కొబ్బరి తోపు ఎందుకో తోపు రంగులోకి మారింది.
అ) తోట, ఎరుపు
ఆ) కాయ, నలుపు
ఇ) పువ్వు, పసుపు
ఈ) ఆకు, ఎరుపు
జవాబు:
అ) తోట, ఎరుపు
2. రోడ్డు మీద ఒకడు భీభత్సంగా భీభత్సం సృష్టించాడు.
అ) భయం, గందరగోళం
ఆ) అసహ్యం, నవరసాలలో ఒకటి
ఇ) కోపం, అలజడి
ఈ) వెటకారం, యుద్ధం
జవాబు:
ఆ) అసహ్యం, నవరసాలలో ఒకటి
3. సినిమా చూసి సంబరంతో సంబరం పొందారు.
అ) భయం, ఆనందం
ఆ) ఆనందం, లాభం
ఇ) మంచి మనసు, ఆశ్చర్యం
ఈ) సంభ్రమం, సంతోషం
జవాబు:
ఈ) సంభ్రమం, సంతోషం
4. లెక్క కలవారు గొడవలకు లెక్కగా ఉంటారు.
అ) డబ్బు, సరదా
ఆ) సంఖ్య, గొడవ
ఇ) గౌరవం, దూరం
ఈ) సమస్య, దగ్గర
జవాబు:
ఇ) గౌరవం, దూరం
5. లోకంలో అనేక లోకంలు ఉంటాయి.
అ) జగం, కుటుంబం
ఆ) ఊరు, వాహనం
ఇ) పట్టణం, భవనం
ఈ) ఇల్లు, సమస్య
జవాబు:
అ) జగం, కుటుంబం
6. ఉచితంగా వచ్చిన ఉచితం మాత్రమే తీసుకోవాలి.
అ) తగనిది, తగినది
ఆ) వెలలేనిది, తగినది
ఇ) ఆనందం, మంచి
ఈ) లాభం, పుస్తకం
జవాబు:
ఆ) వెలలేనిది, తగినది
జాతీయాన్ని గుర్తించడం
ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.
1. చెప్పుకుంటూ పోతే నెపాలెన్నో అందరికీ చెట్టొక పానకంలో పుడక.
జవాబు:
ఈ వాక్యంలో ‘పానకంలో పుడక’ అనే జాతీయం ఉంది.
2. తామర తంపరగా మొలిచే అపార్టుమెంట్లకు చెట్లు అద్దమైపోతున్నాయి.
జవాబు:
ఈ వాక్యంలో ‘తామర తంపర’ అనే జాతీయం ఉంది.
జాతీయము – సందర్భము
ఈ జాతీయాన్ని ఏ అర్థంలో/సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.
1. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం :
జవాబు:
“ఆ పని చేయకూడదు అని తెలిసినా మూర్ఖంగా చేస్తున్న” సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
2. నిప్పులు కురియు :
జవాబు:
“ఎక్కువ కోపం ప్రదర్శించు” అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
సంధి పదాలను విడదీయడం
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
1. మైదానమంతట జనం నిండిపోయారు.
జవాబు:
మైదానము + అంతట
2. సైనికులు వీరోచితంగా పోరాడతారు.
జవాబు:
వీర + ఉచితం
3. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
జవాబు:
పరిసరము + లు
4. నేను మరొక పుస్తకం కొన్నాను.
జవాబు:
మరి + ఒక
5. మానవాళికి ప్రకృతి అవసరం.
జవాబు:
మానవ + అళి
6. పని ఉన్నట్లు నటించకు.
జవాబు:
ఉన్న + అట్లు
7. కళ్లెదుట అన్యాయం జరిగినా మాట్లాడవా?
జవాబు:
కళ్లు + ఎదుట
8. ఏటేట ఉత్సవాలు జరుగుతాయి.
జవాబు:
ఏట + ఏట
9. ముస్తాబైనా ఫోటో తీయలేదు,
జవాబు:
ముస్తాబు + ఐన
10. కర్మాగారాలు ఆధునిక దేవాలయాలన్నారు.
జవాబు:
కర్మాగారము + లు
సంధి పదాలను కలపడం
సంధి పదాలను కలిపి రాయండి.
1. పేరు + ఎలా
జవాబు:
పేరెలా
2. దేహము + లు
జవాబు:
దేహాలు
3. వచ్చింది + అన్నట్లు
జవాబు:
వచ్చిందన్నట్లు
4. నీడ + ఏది
జవాబు:
నీడేది
5. పేరంటము + లు
జవాబు:
పేరంటాలు
సంధి నామాల
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
1. చెట్లు చేమలన్నీ ఎండిపోయాయి.
అ) అత్వసంధి
అ) ఉత్వసంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) గుణసంధి
జవాబు:
అ) ఉత్వసంధి
2. నినాదాలు ఇస్తే మార్పు రాదు.
ఆ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) లు,ల,నలసంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
ఇ) లు, ల,నలసంధి
3. ఏటేట క్రొత్త పుస్తకాలు ఇస్తారు.
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) ఆమ్రేడితసంధి
జవాబు:
ఈ) ఆమ్రేడితసంధి
4. సీతజాడేది అని సుగ్రీవుడు ప్రశ్నించాడు.
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) త్రికసంధి
జవాబు:
అ) అత్వసంధి
5. మానవాళి భూమిని కాపాడాలి.
అ) అత్వసంధి
ఆ) సవర్ణదీర్ఘసంధి
ఇ) గుణసంధి
ఈ) ఇత్వసంధి
జవాబు:
ఆ) సవర్ణదీర్ఘసంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
1. ఒకరి పెళ్లి వలన పదిమందికి భోజనం.
జవాబు:
ఒకరి యొక్క పెళ్లి
2. రావిచెట్టు మొదలే మాకు రచ్చబండ.
జవాబు:
రావి అను పేరు గల చెట్టు..
3. చెట్టుచేమలు లేక నీడలేదు.
జవాబు:
చెట్టుయును, చేమయును
4. మాది సిమెంటు రేకు ఇల్లు.
జవాబు:
సిమ్మెంటుతో రేకు
5. ఆకుపచ్చ శోకం పాఠం బాగుంది.
జవాబు:
ఆకుపచ్చనైన శోకం
6. భూతాపం పెరుగుతోంది.
జవాబు:
భూమియందలి తాపం
7. ప్రతిదానికి అడ్డు చెప్పకూడదు.
జవాబు:
దానికి దానికి
8. వీరోచితంగా పోరాడాలి.
జవాబు:
వీరులకు ఉచితం
సమాస నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
1. మనిషి బాహువులు భూమిని కాపాడాలి.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) చతుర్థీ తత్పురుష
ఇ) సప్తమీ తత్పురుష
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష సమాసం
2. చింతమాను కింద నేను నిద్రపోలేను.
అ) రూపక సమాసం
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) నఞ్ తత్పురుష
ఈ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఈ) సంభావనాపూర్వపద కర్మధారయ సమాసం
3. మా ఇంట పెళ్లి పేరంటాలు జరిగేయి.
అ) నఞ్ తత్పురుష
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వితీయా తత్పురుష
జవాబు:
ఆ) ద్వంద్వ సమాసం
4. కాంక్రీటు వసారాలో ఉండలేం.
అ) చతుర్థీ తత్పురుష
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) తృతీయా తత్పురుష
ఈ) నఞ్ తత్పురుష
జవాబు:
ఇ) తృతీయా తత్పురుష సమాసం
5. ఎక్కడా జానెడు నీడలేదు.
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) రూపక సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6. భూగర్భజలం కూడా తగ్గుతోంది.
అ) నఞ్ తత్పురుష
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) సప్తమీ తత్పురుష
జవాబు:
ఈ) సప్తమీ తత్పురుష సమాసం
7. పెళ్లిమండపం ప్లాస్టిక్ పువ్వులతో అలంకరించారు.
అ) తృతీయా తత్పురుష
ఆ) ద్విగు సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) ద్వితీయా తత్పురుష
జవాబు:
అ) తృతీయా తత్పురుష సమాసం
8. చెట్టు విలువ తెలుసుకో!
అ) నఞ్ తత్పురుష
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
ఆ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆధునిక వచనాల
ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.
1. మరియొకరి పెండ్లి జరిగినది.
అ) మరొకళ్ళ పెళ్ళి జరిగింది.
ఆ) మరొకరిపెండ్లియు జరిగినది.
ఇ) మరియొక్కరి పెండ్లి జరిగినది.
ఈ) మరొకరి పెండ్లియున్ జరిగినది.
జవాబు:
మరొకళ్ళ పెళ్ళి జరిగింది.
2. అచట రచ్చబండ లేదు.
అ) అచట రచ్చబండయు లేదు.
ఆ) అచట రచ్చబండయును లేదు.
ఇ) అక్కడ రచ్చబండ లేదు.
ఈ) అచట రచ్చబండయున్ లేదు.
జవాబు:
ఇ) అక్కడ రచ్చబండ లేదు.
3. యుద్ధములో మరణమొందెను.
అ) యుద్ధమందు మరణమొంది.
ఆ) యుద్ధమునందు మరణమొందె.
ఇ) యుద్ధమ్మున మరణమొంది.
ఈ) యుద్ధంలో మరణించాడు.
జవాబు:
ఈ) యుద్ధంలో మరణించాడు.
4. జానెడు నీడయు లేదు.
అ) జానెడు నీడయును లేదు.
ఆ) జానెడు నీడ లేదు.
ఇ) జానెడు నీడయున్ లేదు.
ఈ) జానెడు నీడయునున్ లేదు.
జవాబు:
ఆ) జానెడు నీడ లేదు.
5. ఎక్కడైనను చెట్టున్నదా?
అ) ఎక్కడైనా చెట్టుందా?
అ) ఎక్కడనైన చెట్టున్నదా?
ఇ) ఎక్కడనయిన చెట్టునున్నదా?
ఈ) ఎక్కడనయినన్ చెట్టునున్నదా?
జవాబు:
అ) ఎక్కడైనా చెట్టుందా?
వ్యతిరేకార్థక వాక్యాలు
ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
1. ఫ్యాక్టరీలు కట్టేరు.
జవాబు:
ఫ్యాక్టరీలు కట్టలేదు.
2. చెట్టు నీడ లేదు.
జవాబు:
చెట్టు నీడ ఉంది.
3. ఇదీ కథ అన్నాను.
జవాబు:
ఇదీ కథ అనలేదు.
4. ఆక్సిజన్ పీల్చింది.
జవాబు:
ఆక్సిజన్ పీల్చలేదు.
5. చెట్లను కొట్టేశారు.
జవాబు:
చెట్లను కొట్టేయలేదు.
వ్యతిరేకార్థక క్రియలు
కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
1. అ) చచ్చి
ఆ) చస్తూ
ఇ) చావక
ఈ) చస్తే
జవాబు:
ఇ) చావక
2. అ) కట్టక
ఆ) కట్టి
ఇ) కడుతూ
ఈ) కడితే
జవాబు:
అ) కట్టక
3. అ) అంటించి
ఆ) అంటించక
ఇ) అంటిస్తూ
ఈ) అంటిస్తే
జవాబు:
ఆ) అంటించక
4. అ) త్రొక్కి
ఆ) త్రొక్కుక
ఇ) తొక్కుతూ
ఈ) తొక్కితే
జవాబు:
ఆ) త్రొక్కుక
5. అ) నక్కక
ఆ) నక్కి
ఇ) నక్కుతూ
ఈ) నక్కితే
జవాబు:
అ) నక్కక
6. అ) పులిసి
ఆ) పులవక
ఇ) పులిస్తే
ఈ) పులుస్తూ
జవాబు:
ఆ) పులవక
7. అ) ఒలవక
ఆ) ఒలిసి
ఇ) ఒలిస్తే
ఈ) ఒలుస్తూ
జవాబు:
అ) ఒలవక
8. అ) కక్కి
ఆ) కక్కుతూ
ఇ) కక్కితే
ఈ) కక్కక
జవాబు:
ఈ) కక్కక
9. అ) ఎత్తి
ఆ) ఎత్తక
ఇ) ఎత్తుతూ
ఈ) ఎత్తితే
జవాబు:
ఆ) ఎత్తక
10. అ) పారక
ఆ) పారి
ఇ) పారుతూ
ఈ) పారితే
జవాబు:
అ) పారక
సంశ్లిష్ట వాక్యాలు
ఇవి ఏ రకమైన సంశ్లిష్టవాక్యాలో రాయండి.
1. ప్రకృతి మనిషి అవసరాలు తీరుస్తూ కాపాడుతుంది.
జవాబు:
శత్రర్థకం
2. వర్షాలు కురవాలంటే చెట్లుండాలి.
జవాబు:
చేదర్థకం
3. చెట్లను రక్షించి మనం రక్షణను పొందుదాం.
జవాబు:
క్త్వార్థకం
4. చెట్ల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదు.
జవాబు:
చేదర్థకం
5. ఒకవైపు ప్లాస్టిక్ వాడకం పెరుగుతూ కాలుష్యాన్ని సృష్టిస్తోంది.
జవాబు:
శత్రర్థకం
6. కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగితే భూగోళం వేడెక్కి పోతుంది.
జవాబు:
చేదర్థకం
7. చెట్లను బ్రతికించి ముందుతరాల వారికి కానుకగా ఇద్దాం.
జవాబు:
క్త్వార్థకం
8. సముద్రాలు పొంగితే మానవాళి అంతరిస్తుంది.
జవాబు:
చేదర్థకం
9. చెట్లను నరికేస్తే ఇంత వేటా?
జవాబు:
చేదర్థకం
10. ఆధునీకరణ మాయలో పడి చెట్లను మానవుడు కనుమరుగు చేస్తున్నాడు.
జవాబు:
క్త్వార్థకం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
1. చెట్లను నగరీకరణ కబళించింది.
అ) నగరీకరణ చేత చెట్లు కబళించబడ్డాయి.
ఆ) చెట్ల చేత నగరీకరణ కబళించబడింది.
ఇ) నగరీకరణ చేత చెట్లు కబళించబడతాయి.
ఈ) నగరీకరణ చేత చెట్లు కబళించబడును.
జవాబు:
అ) నగరీకరణ చేత చెట్లు కబళించబడ్డాయి.
2. ఆధునికులు చెట్లను కొట్టడం లేదు.
అ) ఆధునికుల చేత చెట్లు కొట్టబడుతున్నాయి.
ఆ) ఆధునికుల చేత చెట్లు కొట్టబడతాయి.
ఇ) ఆధునికుల చేత చెట్లు కొట్టబడును.
ఈ) ఆధునికుల చేత చెట్లు కొట్టబడడం లేదు.
జవాబు:
ఈ) ఆధునికుల చేత చెట్లు కొట్టబడడం లేదు.
3. చెట్టును వారు పానకంలో పుడకగా చెప్పారు.
అ) వారి చేత చెట్టు పానకంలో పుడకగా చెప్పబడుతోంది.
ఆ) వారి చేత చెట్టు పానకంలో పుడకగా చెప్పబడింది.
ఇ) వారి చేత చెట్టు పానకంలో పుడకగా చెప్పబడును.
ఈ) పానకంలో పుడక చేత చెట్టువారికి చెప్పబడింది.
జవాబు:
ఆ) వారి చేత చెట్టు పానకంలో పుడకగా చెప్పబడింది.
4. వారు కర్మాగారాలు వ్యాకోచించారు.
అ) కర్మాగారాలు వారి చేత వ్యాకోచించబడ్డాయి.
ఆ) వారి చేత కర్మాగారాలు వ్యాకోచించబడును.
ఇ) వారి చేత కర్మాగారాలు వ్యాకోచించబడతాయి.
ఈ) వారి చేత కర్మాగారాలు వ్యాకోచించబడుతున్నాయి.
జవాబు:
అ) కర్మాగారాలు వారి చేత వ్యాకోచించబడ్డాయి.
5. వారు చెట్టు జాడను మాయం చేశారు.
అ) చెట్టు చేత వారి జాడ మాయం చేయబడింది.
ఆ) చెట్టు జాడ చేత వారు మాయం చేయబడ్డారు.
ఇ) వారి చేత చెట్టు జాడ మాయం చేయబడింది.
ఈ) వారి చేత చెట్టు జాడ మాయం చేయబడుతోంది.
జవాబు:
ఇ) వారి చేత చెట్టు జాడ మాయం చేయబడింది.
6. వారు నీతులను వల్లిస్తారు.
అ) నీతుల చేత వారు వల్లించబడును.
ఆ) వారి చేత నీతులు వల్లించబడతాయి.
ఇ) వారి చేత నీతులు వల్లించబడుతున్నాయి.
ఈ) వారి చేత నీతులు వల్లించబడును.
జవాబు:
ఆ) వారి చేత నీతులు వల్లించబడతాయి.
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాల్లో రాయండి.
1. బుల్లితెర, వెండితెర పాఠాలు చెప్పాయి.
జవాబు:
సంయుక్త వాక్యం
2. చెట్లు కొట్టి అడితికి పంపారు.
జవాబు:
సంశ్లిష్టం
3. వీరులు యుద్ధాలు చేయగలరు.
జవాబు:
సామర్థ్యార్థక వాక్యం
4. రోడ్డు వేయవచ్చు.
జవాబు:
అనుమత్యర్థకం
5. చెట్టు కొట్టవద్దు.
జవాబు:
నిషేధార్ధకం
6. చెట్లు కొట్టేయడం వలన వానలు తగ్గాయి.
జవాబు:
హేత్వర్థకం
7. నేను కచ్చితంగా చెట్లను కాపాడతాను.
జవాబు:
నిశ్చయార్థకం
8. చెట్లను పెంచండి.
జవాబు:
విధ్యర్ధకం
9. చెట్లను కొట్టినా పట్టించుకోవడం లేదు.
జవాబు:
అప్యర్థకం
10. ఇది వ్యాపారమా?
జవాబు:
ప్రశ్నార్థకం
11. ఆహా! ఈ చెట్టు ఎంత పచ్చగా ఉందో!
జవాబు:
ఆశ్చర్యార్థకం
12. దయచేసి చెట్లను కాపాడండి.
జవాబు:
ప్రార్థనార్థకం
13. ఆ చెట్టును బతకనిస్తారో! బతకనివ్వరో!
జవాబు:
సందేహార్ధకం
14. చెట్లను కొడితే ప్రగతి సాధించలేము.
జవాబు:
చేదర్థకం
15. వృక్షరాజమా! ఆయురారోగ్యాలతో వర్ధిలు.
జవాబు:
ఆశీరార్ధకం
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
1. రచ్చబండ, రావిచెట్టు లేవు.
అ) సంశ్లిష్టం
ఆ) సంయుక్తం
ఇ) విధ్యర్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఆ) సంయుక్తం
2. నగరీకరణ చేసి రోడ్లు వేస్తున్నారు.
అ) సంయుక్తం
ఆ) చేదర్థకం
ఇ) సంశ్లిష్టం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఇ) సంశ్లిష్టం
3. నగరీకరణ చేస్తే డబ్బు వస్తుంది.
అ) చేదర్థకం
ఆ) సంయుక్తం
ఇ) సంశ్లిష్టం
ఈ) అప్యర్థకం
జవాబు:
అ) చేదర్థకం
4. వారు ఫ్యాక్టరీ నిర్మించగలరు.
అ) చేదర్థకం
ఆ) సంశ్లిష్టం
ఇ) అప్యర్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఈ) విధ్యర్థకం
5. అభివృద్ధి చెందినా శాంతి లేదు.
అ) అప్యర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) హేత్వార్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
అ) అప్యర్థకం
6. చెట్లను రక్షించరా?
అ) ప్రశ్నార్థకం
ఆ) అనుమత్యర్థకం
ఇ) విధ్యర్థం
ఈ) అప్యర్థకం
జవాబు:
అ) ప్రశ్నార్థకం
7. ఇది అభివృద్ధి! నాశనమో!
అ) విధ్యర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) సందేహార్థకం
ఈ) నిషేధార్థకం
జవాబు:
ఇ) సందేహార్థకం
8. మా గ్రామానికి గొడ్డళ్లు తేవద్దు.
అ) విధ్యర్థకం
ఆ) నిషేదార్థకం
ఇ) అక
ఈ) చేదర్థకం
జవాబు:
ఆ) నిషేధార్థకం
9. కర్మాగారాలు కట్టడం వలన వేడి పెరిగింది.
అ) హేత్వర్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) అప్యర్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
అ) హేత్వర్థకం
10. మీరు ఫ్యాక్టరీ నిర్మించవచ్చు.
అ) అప్యర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) సందేహార్ధకం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
ఈ) అనుమత్యర్థకం
11. ఆహా! ఈ పల్లెటూరెంత బాగుంది.
అ) ఆశ్చర్యార్థకం
ఆ) అనుమత్యర్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
అ) ఆశ్చర్యార్థకం
12. నేను చెట్లను తప్పక పెంచుతాను.
అ) అనుమత్యర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) సందేహార్థకం
ఈ) నిశ్చయార్థకం
జవాబు:
ఈ) నిశ్చయార్థకం
13. దీర్ఘాయుష్మాన్ భవ! వృక్షమా!
అ) అనుమత్యర్థకం
ఆ) ఆశీరార్ధకం
ఇ) విధ్యర్థం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఆ) ఆశీరార్ధకం
14. దయచేసి అడవులు పెంచండి.
అ) ప్రార్థనార్థకం
ఆ) ఆశీరార్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) ప్రశ్నార్థకం
జవాబు:
అ) ప్రార్థనార్థకం
15. ఇది అభివృద్ధా?
అ) అనుమత్యర్థకం
ఆ) చేదర్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) నిషేధార్థకం
జవాబు:
ఇ) ప్రశ్నార్థకం