Access to the AP 9th Class Telugu Guide 13th Lesson నా చదువు Questions and Answers are aligned with the curriculum standards.
నా చదువు AP 9th Class Telugu 13th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి:
మువ్వల చేతికర్ర

నన్ను
సముద్రపు బొడ్డున
వొది లేయండి
ముత్యం దొరకలేదని బాధపడను.
ఇసుకలో
మువ్వల చేతికర
దులిపేసుకుంటాను.
నన్ను తూనీగలాగో సీతాకోకచిలుకలాగో
గాలిలోకి వొదిలేయండి.
పూలు లేవనీ
వన్నెల ఇంద్రచాపం లేదనీ
పిచ్చుక గూళ్లు కట్టి
ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను.
అలలు నడిచిన
అడుగు జాడలు పరికిస్తూ
ఓ గుడ్డి గవ్వను ఏరుకుని
సంబర పడిపోతాను.
నన్ను
తోటలో విడిచిపెట్టేయండి కోకిల పాట వినబడలేదని
కొంచెం కూడా చింతించను.
కొమ్మనున్న పండు కోసం
ఎగిరి ఎగిరి అలసి సొలసి
చివరకు చతికిల పడిపోయి
చిన్న పిల్లాడిలా పిర్రలకు
అంటుకున్న మట్టిని
చేతులతో అటూ ఇటూ
చిన్న బుచ్చుకోను.
గాలి భాషకు
వ్యాకరణ సర్వస్వాన్ని రాసిపారేసి
వర్షాల గురించి
వాయుగుండాల గురించీ
మీ చెవిలో రహస్యాలను ఊదేస్తాను..
అదీ కాకపోతే
ఓ అనాథ పిల్లాడిమల్లే.
జన సమ్మర్ధం గల
చౌరస్తాలో నన్ను విడిచి పెట్టేయండి
ఆదరించే వారు లేరని
ఆవేదన చెందను.
కళ్లు లేని కబోది చేతిలో
మువ్వల చేతికర్రనై
రోడ్డు దాటిస్తాను.
![]()
ఆలోచనాత్మక ప్రశ్నలు :
ప్రశ్న 1.
నిన్ను ఒక అందమైన ఉద్యానవనంలో విడిచిపెడితే అక్కడ నీవు ఏమేమి చేస్తావు ?
జవాబు:
నన్ను ఒక అందమైన ఉద్యానవనంలో నిలబెడితే ఉద్యానవనం అంతా కలియ తిరుగుతాను. ప్రతి మొక్కను పరిశీలిస్తాను. ప్రతి పువ్వు అందాన్ని చూస్తాను. ప్రతి ఆకు యొక్క సొగసును వీక్షిస్తాను. ప్రతి చిగురుటాకును స్పృశిస్తాను. ఎగిరే తుమ్మెదలను పట్టుకొనే ప్రయత్నం చేస్తాను. వాటి కూడా పరుగెడతాను. నిద్ర, ఆకలి, దాహం, అలసట మరిచిపోతాను. ఉద్యానవనంలో ఆనందిస్తాను.
ప్రశ్న 2.
సాధనకు ఒక పని చేయమని చెప్పారు. ఆమె ఆ పని పూర్తి చేయడానికి అక్కడ వనరులు ఏమీ లేవు అయినా ఆలోచించి ఆ పనిని పూర్తి చేసేసింది. ఇలా మీరు ఎప్పుడయినా చేసారా ? మీ అనుభవాన్ని పంచుకోండి.
జవాబు:
నేనొకసారి సైకిలుపై వెడుతుంటే సైకిలు గోతిలో పడింది. నేను కింద పడ్డాను. కొద్దిగా దెబ్బలు తగిలాయి. దగ్గరలో ఎవ్వరూ లేరు. సైకిలుషాపు చాలా దూరంలో ఉంది. సైకిలును లేపాను. ముందుచక్రం మూడంకెలా వంగిపోయింది. నడుపడానికి వీలులేదు. కొంచెం ఆలోచించాను. సైకిలు కింద నేలపై పడుకోబెట్టాను. కాళ్లతో తొక్కుతూ ముందు చక్రం వంకర తీశాను. కొంత బాగైంది. మళ్ళీ ప్రయత్నించాను. మరి కొంచెం బాగైంది. బారు వంపు తీశాను. 80 శాతం బాగైంది. జాగ్రత్తగా తొక్కుతూ సైకిలు షాపుకు వెళ్లి బాగు చేయించుకొన్నాను. నాకు కొంత గర్వమనిపించింది కూడా.
అవగాహన – ప్రతిస్పందన
ఇవి చేయండి :
అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
ప్రశ్న 1.
ఆడవారి మాటలలో నుండి శ్రీపాదవారు తెలుగు భాషను నేర్చుకున్న విధానం గురించి మాట్లాడండి. రాయండి.
జవాబు:
స్పష్టంగా, బుద్ధవరపు సీతమ్మగారు ఛలోక్తులు విసిరేవారు. మైలవరపు శేషమ్మగారు శ్లేషలు కురిపించేవారు. రచయిత తల్లిగారైన సోదెమ్మగారు సామెతలూ, పలుకుబళ్లూ విరజిమ్మేవారు. తటవర్తి సుబ్బమ్మగారు నిశ్చలంగా మాట్లాడేవారు. బుచ్చి వెంకయ్యమ్మ గారి భాష రాణుల భాషలాగే ఉండేది. ఆ గోష్ఠిలో నవరసాలు చిప్పిల్లేవి. సరస్వతి లాస్యం చేసేది. కాళిదాసు నాలుక మీద కాళికాదేవి బీజాక్షరాలు వ్రాసిందంటారు. రచయిత చెవిలో ఆ మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు. నలుగురు స్త్రీలు ఎక్కడ మాట్లాడుకున్నా శ్రీపాద వారు అది వినేవారు అలా ఆయన భాషను నేర్చుకొన్నారు.
![]()
ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది వ్యక్తులు, ప్రదేశాల గురించి మీరేమి అర్థం చేసుకున్నారో చెప్పండి. రాయండి.
జవాబు:
అ) లక్ష్మీపతి సోమయాజులు : లక్ష్మీపతి సోమయాజులుగారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి తండ్రి, లక్ష్మీపతి సోమయాజులు
గారు వేద, జ్యోతిష పండితులు. ధర్మశాస్త్రంలో పారంగతులు. మంత్ర దీక్షాపరులు.
ఆ) సీతారామ శాస్త్రిగారు : వీరి పూర్తి పేరు గుంటూరి సీతారామశాస్త్రిగారు. వీరి స్వగ్రామం జల్లి సీమలోని మోగల్లు. వల్లూరి గ్రామస్తులు తమకు సాహిత్య విద్య నేర్పాలని ఆయనను కోరారు. సంవత్సరానికి కొంత డబ్బు చెల్లిస్తూ శాస్త్రిగారిని తమ గ్రామంలో నిలుపుకొన్నారు.
ఇ) వల్లూరు గ్రామం : ఇది రామచంద్రపురం తాలూకాలోని మండపేటకు రెండు మూడు మైళ్ల దూరంలో ఉంటుంది.
ఇది తూర్పు గోదావరి జిల్లాలోనిది. అది పెద్ద రైతాంగం ఉన్న ఊరు. పాడి పంటలతో తులతూగే ఊరు.
ఈ) దేవాలయ గోపురం: దేవాలయ గోపురం పై అంతస్థులో శ్రీపాద వారు విద్యాభ్యాసం చేసే రోజులలో కూర్చొనేవారు. అది ఆయన చదువుకు, కలలకు, కల్పనలకు వేదిక. దాని ఎదుట విరగబూసిన బొగడ చెట్లుండేవి. ఎడమ వైపు కలువల కోనేరుండేది. వెనుక చిరుగంటలతో ధ్వజస్తంభం ఉండేది. మిలమిల మెరిసే పసిడి కుండలతో దేవాలయ శిఖరం ఉండేది. కుడివైపు చేతికందే ఎత్తున నిండైన గెలలతో కొబ్బరి చెట్లుండేవి. అక్కడ నాలుగు వైపుల నుండీ గాలి వీచేది. మధ్య మధ్య గబ్బిలాల కంపు వచ్చేది.
ప్రశ్న 3.
శ్రీపాద వారికి చదువు పట్ల ఉన్న శ్రద్ధ గురించి చెప్పండి. రాయండి.
జవాబు:
శ్రీపాద వారికి చదువుపట్ల శ్రద్ధ ఉండేది. ఆటలూ ఆడుకొన్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. సీతారామశాస్త్రిగారి దగ్గర
కావ్యపాఠం చెప్పుకొన్నారు. తండ్రి గారి దగ్గర వేదం, జ్యోతిషం అభ్యసించేవారు.
ఆ) కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు. ప్రజల జీవిత కష్టాలను తీర్చలేనిది ఆవిష్కారం కాదు. మానవజీవితం లోని ప్రతికోణాన్ని చూపించలేనిది సాహిత్యం కాదని భావించిన ప్రసిద్ధ రచయిత, హేతువాది కొడవటిగంటి కుటుంబరావు. ఈయన 1909 అక్టోబరు 28న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించారు. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన వీరు 13 సంవత్సరాల వయస్సులోనే రచనకు శ్రీకారం చుట్టి, తెలుగు జాతి గర్వించదగ్గ రచయితగా ఎదిగారు. వీరు వారసత్వం, ఐశ్వర్యం, ఎండమావులు, చదువు వంటి నవలలు, కొత్తజీవితం, నిరుద్యోగం, అద్దెకొంప, బాహుకుడు వంటి కథలు, రంపపుకోత, నిరాకరణ, మహాకవి మొదలైన నాటికలు, మాయాపోరు, భూతదయ, ధర్మయుద్ధం వంటి గల్పికలతో పాటు అనేక అనువాదాలు కూడా చేశారు. ఈ జగత్తుకు స్థలం, కాలం అనే కొలతలతో పాటు, బుద్ధి అనేది కొలతగా పనిచేస్తుందని దీనినే ‘బుద్ధి కొలతవాదం’ అనే పేరుతో ప్రతిపాదించిన వీరు 1980 ఆగస్టు 17న మరణించారు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
‘శాస్త్రం – సాహిత్యం’ వీటికి ఉండాల్సిన లక్షణాలేవి ?
జవాబు:
ప్రకృతి రహస్యాలను వివరించేది శాస్త్రం, మానవ జీవితంలోని ప్రతి కోణాన్నీ చూపించేది సాహిత్యం.
![]()
ప్రశ్న 2.
రచనా రంగంలో కొడవటిగంటి గారి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
13వ సంవత్సరంలోనే రచనకు శ్రీకారం చుట్టడం రచనా రంగంలో కొడవటిగంటి గారి ప్రత్యేకత.
ప్రశ్న 3.
పై పేరాలోని కథలు, గల్పికల పేర్లు రాయండి.
జవాబు:
కొత్త జీవితం, నిరుద్యోగం, అద్దె కొంప, బాహుకుడు వంటి కథలు వ్రాశారు. మాయాపోరు, భూతదయ, ధర్మయుద్ధం
వంటి గల్పికలు రచించారు.
ప్రశ్న 4.
‘బుద్ధి కొలతవాదం’ దేని గురించి చెప్పింది ?
జవాబు:
ఈ లోకానికి స్థలం, కాలం అనే కొలతలతో పాటు బుద్ధి అనేది కొలతగా పని చేస్తుందని చెప్పేదే బుద్ధి కొలతవాదం.
ప్రశ్న 5.
పై పేరాకు శీర్షిక పెట్టండి.
జవాబు:
మేథ.
ఇ) కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
తన తమ్ముడు ఆగని విరేచనాలతో, రక్తహీనత వల్ల బాధపడుతూ, ఆ వ్యాధికి తగిన మందు లేక, సరైన వైద్యం అందక తన కళ్ళముందే శాశ్వతంగా కన్నుమూశాడు. ఆ సమయాన పన్నెండేళ్ళ అన్న కన్నీరు కారుస్తూ, భయంకరమైన ఈ వ్యాధికి మందు కనిపెట్టాలనీ తాను డాక్టరు కావాలనీ నిశ్చయించుకున్నాడు. ఆ చదువు కోసం నిరంతర శ్రమ, అకుంఠిత దీక్షతో ముందడుగు వేశాడు. వైద్యరంగాన విశేష పరిశోధనలతో గొప్ప వైద్యశాస్త్రవేత్తగా ఎదిగాడు. ప్రపంచ ప్రజల మన్ననలందుకున్న ఆ మహోన్నత వ్యక్తి డా॥ యల్లాప్రగడ సుబ్బారావు గారు.
ఈయన 1896 జూలై ఒకటవ తేదీన రాజమండ్రిలో జన్మించారు. రామకృష్ణ మఠం, మల్లాది సత్యలింగ నాయర్ ధర్మ సంస్థల సహాయంతో విద్యార్థి వేతనం పొంది మనదేశంతో పాటు లండన్, అమెరికా దేశాలకు వెళ్ళి వైద్యశాస్త్రంలో ప్రావీణ్యం పొందారు. తాను అనుకున్నట్టుగానే తన తమ్ముడిని బలిగొన్న స్పూ వ్యాధితో పాటు, క్షయ, బోదకాలు, టైఫాయిడ్, పాండు రోగాల శాశ్వత నిర్మూలనకు మందులు కనుగొన్నాడు. చదువుకు పేదరికం, ప్రాంతం, భాష, మతం అడ్డంకి కావు పట్టుదల ఉంటే చాలు అని ఆయన నమ్మకం. ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయమందించి వారి పట్ల అమితమైన ప్రేమను చూపిన మహనీయుడు ఆయన.
ప్రశ్నలు :
ప్రశ్న 1.
యల్లాప్రగడ సుబ్బారావు గారు ఈ రంగానికి చెందిన వారు.
అ) విద్యారంగం
ఆ) రాజకీయ రంగం
ఇ) వైద్యరంగం
జవాబు:
ఇ – వైద్యరంగం
ప్రశ్న 2.
సుబ్బారావు గారి జన్మస్థలం ఏది ?
జవాబు:
సుబ్బారావు గారి జన్మస్థలం రాజమండ్రి.
![]()
ప్రశ్న 3.
పై పేరాలో నైపుణ్యం అని అర్థాన్నిచ్చే పదం ఏది ?
జవాబు:
నైపుణ్యం అంటే ప్రావీణ్యం అని అర్థం.
ప్రశ్న 4.
సుబ్బారావు గారు చదువు కోసం ఏఏ దేశాలు వెళ్ళారు ?
జవాబు:
సుబ్బారావు గారు చదువు కోసం లండన్, అమెరికా దేశాలకు వెళ్ళారు.
ప్రశ్న 5.
పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
చదువుకు అడ్డంకానివేవి ?
ఈ) కింది పేరాను చదివి, పట్టికను పూరించండి.
తెలుగు సాహిత్యంలో పద్యం, గద్యం, వ్యాసం, లేఖ, గేయం, కవిత, జీవిత చరిత్ర, గజల్, ఆత్మకథ మొదలైన ప్రక్రియలెన్నో వున్నాయి. అందులో ఆత్మకథ విశిష్టమైనది. ఇది అనేక ఇతివృత్తాలతో కూడి, వ్యక్తి వికాసానికి తోడ్పడుతుంది. ఇవి వ్యక్తి అనుభవాలైనప్పటికీ నాటి సామాజిక స్థితిగతులను తెలుపుతాయి. గాంధీజీగారి ఆత్మకథ ‘సత్యశోధన’ లో వారి బాల్యం, విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న సమస్యలు, సత్యం గొప్పదనం వంటి సంఘటనలు కన్పిస్తాయి.
దరిశి చెంచయ్య గారి ఆత్మకథ ‘నేను – నా దేశం’ లో దేశ స్వాతంత్ర్య పోరులో సైనికుడిగా ఆయన చేసిన పోరాటాలు, పడ్డ కష్టాలు కనిపిస్తాయి. ఆదిభట్ల నారాయణదాసుగారి ‘నా ఎరుక’ ఆత్మకథలో వారి బాల్యంతో పాటు తన ‘హరికథ’ ప్రస్థానం కనిపిస్తుంది. అలాగే షేక్ నాజర్ గారి ఆత్మకథ ‘పింజారీ’ లో ఆయన బాల్యంతో పాటు బుర్రకథ విశేషాలు, వారి అనుభవాలు కనిపిస్తాయి. తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ ‘హంపీ నుండి హరప్పా దాకా’ లో వారి బాల్యం, విద్యాభ్యాసం, గాంధీతో అనుభవాలు, నాటి సామాజిక స్థితిగతులు కన్పిస్తాయి.
టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ ‘నా జీవిత యాత్ర’ లో వారి వ్యక్తిత్వం, ధైర్యసాహసాలు తెలుసుకోవచ్చు. వీటితో పాటు కాళోజీ నారాయణరావు గారి గొడవ’ బుచ్చిబాబు గారి ‘నా అంతరంగ కథనం’ కపిలవాయి లింగమూర్తి గారి ‘సాల గ్రామం’ మొదలైన ఆత్మకథలున్నాయి. ఇవన్నీ మనకు వారి జీవితాలలో జరిగిన ఘట్టాలను కళ్ళ ముందుంచుతాయి.

జవాబు:
| క్ర.సం. | ఆత్మకథ పేరు | రచయిత |
| 1. | సత్య శోధన | మహాత్మాగాంధీ |
| 2. | నేను – నా దేశం | దరిశ చెంచయ్య |
| 3. | నా. ఎరుక | ఆదిభట్ల నారాయణదాసు |
| 4. | పింజారీ | షేక్ నాజర్ |
| 5. | హంపీ నుండి హరప్పా దాకా | తిరుమల రామచంద్ర |
| 6. | నా జీవిత యాత | టంగుటూరి ప్రకాశంపంతులు |
| 7. | నా గొడవ | కాళోజీ నారాయణరావు |
| 8. | నా అంతరంగ కథనం | బుచ్చ్బాబు |
| 9. | సాలగ్రామం | కపిలవాయి లింగమూర్తి |
![]()
వ్యక్తీకరణ – సృజనాత్మకత :
ఆ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పొరుగూరు వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
ఆయన విద్యాభ్యాసంలో భాగంగా కావ్య పాఠంకోసం పొరుగూరుకు తప్పనిసరిగా వెళ్లవలసి వచ్చింది. ఆయనకు వారి అమ్మగారి దగ్గర గారాబం, పెద్దన్నగారి దగ్గర అతి చనువు. ఊరి నిండా స్నేహితులే. ఆయనకు సహజంగా ఆటలంటే ఇష్టం. వారి కుటుంబం కూడా తరచుగా ఊర్లు వెడుతూ ఉండేవారు. ఇన్ని కారణాల వల్ల ఆయనకు ఇంట్లో సాహిత్యం అబ్బదని వారి నాన్నగారు నిర్ధారించారు. అందుచేత చదువు కోసం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ పొరుగూరైన వల్లూరుకు వెళ్లవలసి వచ్చింది.
ప్రశ్న 2.
వల్లూరులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి దినచర్య గురించి రాయండి.
జవాబు:
వల్లూరులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు చిన్నతనంలో విద్యాభ్యాసం చేసారు. ఆయన అక్కడ సూర్యోదయం మునుపే మేల్కొనేవారు. దర్భలతో చేసిన చాపను విడిచి లేచి వెళ్ళేవారు. కాలకృత్యాలు తీర్చుకునేవారు. ఆయన చెంబును ఆయనే తోముకునేవారు. చన్నీళ్ళతో స్నానం చేసేవారు. ఆయన బట్టలు ఆయనే ఉతుక్కునేవారు. వాటిని ఆరవేసుకునేవారు. జాగ్రత్త చేసుకునేవారు. పాత పాఠాలు చదువుకునేవారు.
కొత్తపాఠం చూసుకుని క్రమం ఏర్పరుచుకునేవారు. గురువుగారి వీలుని బట్టి పాఠాలను చెప్పించుకునేవారు. స్త్రీలు వంటలు ప్రారంభించకముందే వారి ఇళ్ళకు వెళ్ళి వారం చెప్పుకునేవారు. వేళ కనిపెట్టి రాత్రి భోజనం చేసేవారు. గడపమీద పెట్టిన దీపం వెలుగులో చదువుకునేవారు. ఇంటివారికి చిరాకు కలగకుండా మెల్లిగానో, గట్టిగానో చదువుకునేవారు. రాత్రి తాగటానికి మంచినీటి చెంబు సిద్ధం చేసుకునేవారు. అది చేతికో, కాలికో తగలకుండా జాగ్రత్తగా పడుకునేవారు. మధ్యాహ్నం మాత్రం తప్పనిసరిగా దేవాలయ గోపురంపై అంతస్తులో కూర్చునేవారు.
![]()
ప్రశ్న 3.
ఆనాటి విద్యావిధానంలో వారాల భోజన పద్ధతి గురించి వివరించండి.
జవాబు:
ఆనాటి విద్యా విధానంలో వారాల భోజన పద్ధతి ఉండేది. పొరుగూరు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు ఇప్పటిలా అప్పుడు హోటల్స్, రూమ్స్, హాస్టల్స్ ఉండేవి కావు. అందుచేత రోజుకు ఒకరి ఇంట్లో చొప్పున వారానికి ఏడు ఇళ్ళల్లో భోజనాలు పెట్టమని విద్యార్థులు అడిగేవారు. ఆ ఇళ్ళ యజమానులు ఒప్పుకున్న వారంనాడు తమ ఇంట్లో భోజనం వసతి ఏర్పాటు చేసేవారు. ఉదాహరణకు ఒకరి ఇంట్లో సోమవారానికి భోజన, వసతులు కుదిరితే ప్రతీ సోమవారం ఆ విద్యార్థికి వారింట్లోనే భోజన వసతి కల్పించేవారు. దీనిని వారాల భోజన పద్ధతి అంటారు.
ప్రశ్న 4.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న అనుభవాలను గురించి రాయండి.
జవాబు:
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తన విద్యాభ్యాసంలో అనేకానుభవాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వారాల భోజనంలో వింత వింత అనుభవాలు కలిగేవి. ఒక్కొక్క వారం నిమిషాల మీద కుదిరేది. ఒక్కొక్క వారం చాలా శ్రమపడితే కానీ కుదిరేది కాదు. ఒక్కొక్క ఇల్లాలు ఏదో వచ్చాడు తింటాడు, పోతాడు అన్నట్లు భోజనం పెట్టేది. మరొక ఇల్లాలు తల్లి లాగ బుజ్జగిస్తూ అన్నం పెట్టేది. ఈ పరిస్థితులకు తోడు భోజనానికి వేళాపాళా ఉండేది కాదు. చదువుతో పాటు ఇంటిపనులు చేయడం కూడా వచ్చేది. ఇంగిత జ్ఞానం కలిగింది. సంస్కారం అబ్బింది. ఆయన చదువుకున్న 45 ఏళ్ళకే చాలా అనుభవాలు వచ్చాయి.
ప్రశ్న 5.
అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలను రాయండి.
జవాబు:
అభివృద్ధి కోసం పాటు పడే వ్యక్తికి సర్దుకుపోయే లక్షణం ఉండాలి. సౌఖ్యాలను ఆశించకూడదు. కష్టనష్టాలను పరిగణించ కూడదు. ఇతరులు ఎవరైనా అపహాస్యం చేసినా, నిందించినా పట్టించుకోకూడదు. తన లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. అవరోధాలను అధిగమించాలి. ఆటంకాలను లెక్క చేయకూడదు. ఓటమి చెందినా ధైర్యం కోల్పోకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. పట్టుదలతో ప్రయత్నించాలి. కష్టసుఖాలను లెక్కించకూడదు. తనకు తానే ధైర్యం చెప్పుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. లక్ష్యాన్ని చేరుకోవాలి. విజయం సాధించాలి.
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దేవాలయ గోపురం నుండి కనిపించే దృశ్యాన్ని వర్ణించారు కదా. మీ ఇంటి ముందు నిలబడి చూస్తే మీ వీధి ఎలా కనిపిస్తుందో వర్ణిస్తూ రాయండి.
జవాబు:
మా ఇంటిముందు నిలబడి చూస్తే మా వీధి చాలా అందంగా కనిపిస్తుంది. మా వీధిలోని ఇళ్ళన్నీ రోడ్డుకు ఇరువైపులా పేర్చినట్లుగా ఉంటాయి. రకరకాల రంగులతో అన్ని డాబా ఇళ్ళు, మిలమిలా మెరుస్తూ ఉంటాయి. అన్ని ఇళ్ళ ముందు పూలమొక్కలు ఉంటాయి. అవి పూలను విరగబూస్తాయి. మా వీధిలో నడుస్తుంటే ఒక ఉద్యానవనంలో నడుస్తున్నట్లు ఉంటుంది. మా వీధిలోని సిమెంటు రోడ్డు మా వీధి అందాలను ద్విగుణీకృతం చేస్తుంది. చీకటిపడితే దీపాల కాంతిలో మెరిసిపోయే మా వీధిని వర్ణించడం వేయి తలలున్న ఆదిశేషువుకు కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది.
![]()
ప్రశ్న 2.
నేటి విద్యా విధానంలో విద్యార్థులకు లభిస్తున్న సౌకర్యాలను తెలియజేస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
విద్యార్థుల సౌకర్యాలు
మేమెంతో అదృష్టవంతులం.
ఎవరికీ లేనన్ని సౌకర్యాలు మాకున్నాయి.
విద్యార్థుల సౌకర్యాలు
మేము విద్యార్థులమని మీకీ పాటికీ తెలిసి ఉంటుంది.
మాకు పాఠశాలలో ఉచితవిద్యను అందిస్తున్నారు.
మాకు బూట్లు, బట్టలు, టైలు, పుస్తకాలు, ట్యాబ్లు ఇవికాక అమ్మఒడి పేరుతో ప్రతి ఏటా 15,000 రూపాయలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అందిస్తున్నారు.
రుచిగా, సుచిగా మధ్యాహ్న భోజనం వేడివేడిగా పెడుతున్నారు.
త్రాగటానికి మినరల్ వాటర్ ఇస్తున్నారు.
ఉపాహారంగా చిక్కీలు పెడుతున్నారు.
రాసుకోవటానికి నోట్సులు, పెన్నులు ఇస్తున్నారు.
నాడు, నేడు కార్యక్రమంలో భాగంగా దేవేంద్ర భవనాల లాంటి తరగతి గదులను ఏర్పాటు చేశారు.
మంచి మంచి టాయిలెట్లు నిర్మించారు.
ఆడుకోవటానికి రకరకాల ఆటవస్తువులు విశాలమైన ఆటస్థలం ఏర్పాటు చేశారు.
ప్రతి సబ్జెక్ట్కు సమర్థవంతమైన టీచర్లను నియమించారు.
రండి ప్రభుత్వ పాఠశాలలో చేరండి.
మీ బాల్యాన్ని సుసంపన్నం చేసుకోండి.
భవిష్యత్తుకి మంచి పునాది వేసుకోండి.
ఇట్లు,
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు,
అమరావతి.
ప్రశ్న 3.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ గురువు సీతారామశాస్త్రి గారి గొప్పతనం గురించి చెప్పారు. కదా ! అలాగే మీ ఉపాధ్యాయుని గొప్పతనం గురించి పది వాక్యాలు రాయండి.
జవాబు:
మా గురువు గారు చాలా పెద్ద పండితులు. ఆయన చాలా అష్టావధానాలు చేసారు. మా చేత కూడా మా పాఠశాల వార్షికోత్సవంలో అష్టావధానం చేయించారు. మా తరగతిలో సగం మందిమి జాతి, ఉపజాతి పద్యాలను అల్లగలము. మా గురువుగారైతే అలవోకగా సొంతంగా ఆశువుగా పద్యాలను చెబుతారు. మన రాష్ట్రంలో వారి పేరు తెలియనివారు లేరు. చాలామంది ఉపాధ్యాయులు కూడా వారి వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు. సందేహాలు తీర్చుకుంటారు. అటువంటి ఉపాధ్యాయులు మాకు దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన పాఠశాలకు సైకిలు మీదే వస్తారు.
![]()
భాషాంశాలు :
పదజాలం
అ) కింది పదాలకు సరైన అర్థాలను గుర్తించి రాయండి. వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి.

ఉదా : సఫలం = విజయవంతం
మనం చేసే పనులు సఫలం అయినప్పుడే సార్థక్యం.
1. ప్రాప్యం = పొందదగినది.
సొంతవాక్యం : మన కష్టానికి పొందదగినది ప్రతిఫలమే అవుతుంది.
2. పారంగతుడు
నిష్ణాతుడు
సొంతవాక్యం : ఘంటసాల పాటలు పాడటంలో నిష్ణాతుడు.
3. ప్రవర్తన = నడవడిక
సొంతవాక్యం : నడవడిక బాగుంటేనే గౌరవిస్తారు.
4. దీక్షాపరుడు = అనుకొన్న కార్యాన్ని నెరవేర్చేవాడు.
సొంతవాక్యం : అనుకొన్న కార్యాన్ని నెరవేర్చేవాడు ఎప్పుడూ విజయం సాధిస్తాడు.
5. ఉదాయించడం = వెళ్ళిపోవడం.
సొంతవాక్యం : పనిని మధ్యలో వదిలి వెళ్ళిపోవటం బుద్ధిమంతుల లక్షణం కాదు.
ఆ) కింది వాక్యాలను చదివి, పర్యాయ పదాలను గుర్తించి రాయండి.
1. ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. ఆ తోవలో జనసంచారం ఎక్కువ. అందుకే జనులందరూ ఆ దారిలో వెళ్తారు.
జవాబు:
మార్గం, తోవ, దారి
2. మన రహస్యం ఎవరికీ చెప్పకూడదు. మన గుట్టు విప్పడం వలన మనకే కీడు. కనుక మర్మమును మనలోనే ఉంచుకోవాలి.
జవాబు:
రహస్యం, గుట్టు, మర్మము
![]()
3. పక్షికి గూడు, మనిషికి గృహం అవసరం. సదనం మనకు రక్షణనిస్తుంది. అలాంటి ఆవాసం అందరికి ఉండాలి.
జవాబు:
గూడు, గృహం, సదనం, ఆవాసం
4. కోనసీమ పచ్చదనానికి పుట్టిల్లు. ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ. ఈ ప్రదేశం సందర్శకులకు కనువిందుచేస్తుంది.
జవాబు:
సీమ, ప్రాంతం, ప్రదేశం
5. మహిళలు నడయాడే దేవతామూర్తులు. వనితలను అగౌరవ పరచకూడదు. స్త్రీలకు తగిన చేయూతనివ్వాలి.
జవాబు:
మహిళలు, వనితలు, స్త్రీలు
ఇ) కింది పదాలను సరైన నానార్థాలతో జతచేయాలి.

జవాబు:
1. పూనిక – (ఆ) యత్నం, సన్నాహం
2. నిర్మాణం – (అ) ఆకృతి, కల్పన
3. దృక్పథం – (ఉ) అభిప్రాయం, మార్గం.
4. పాదు – (ఇ) కుదురు, ఆవాసం
5. సుతరాం – (ఈ) ఏమాత్రం, ఏకొంచెమైనా
![]()
ఈ) కింది ప్రకృతి పదాలను చదవండి. వాటికి సరైన వికృతి పదాలను గుర్తించి వాక్యాలలో రాయండి.

ఉదా : విద్య – విద్దె
మనిషికి విద్య అవసరం. విద్దెను వదలక సాధించాలి.
1. దేవళం = దేవాలయం
సొంతవాక్యం : ఇల్లే దేవళం, బడే దేవాలయం.
2. వీధి = వీధి
సొంతవాక్యం : మా వీదిలో వీధి కుక్కలు ఎక్కువ ఉన్నాయి.
3. నిదుర = నిద్ర
సొంతవాక్యం : మొద్దులా నిదురపోతే భవిష్యత్తులో నిద్ర ఉండదు.
4. చట్టము = శాస్త్రం
సొంతవాక్యం : చట్టమునకు శాస్త్రము తెలిసిన వారైనా లొంగాలి.
5. రాతిరి = రాత్రి
సొంతవాక్యం : నిన్న రాతిరి చంద్రుడు వచ్చి వెన్నెల రాత్రి చేసాడు.
![]()
6. దిస్టి = దృష్టి
సొంతవాక్యం : దిష్టి తగులుతుందనే దృష్టి పెట్టుకోకు.
సంధులు :
వ్యాకరణాంశాలు :
ఆ) కింది పదాలను విడదీసి, సంధిని గుర్తించి సూత్రం రాయండి.

1. సూర్యోదయం = సూర్య + ఉదయం = గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ, లు పరమైతే వానికి క్రమంగా ఏ, ఓ, అర్ లు వస్తాయి.
2. నవోదయం = నవ + ఉదయం = గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ, లు పరమైతే వానికి క్రమంగా ఏ, ఓ, అర్ లు వస్తాయి.
3. విద్యార్థులంటే = విద్య + అర్థులంటే = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటికి దీర్ఘాలు వస్తాయి.
4. పొరుగూళ్ళు = పొరుగు + ఊళ్ళు = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు.
![]()
5. కలగజోచ్చింది = కలగన్ + చొచ్చింది = సరళాదేశ సంధి
సూత్రం : 1) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
టుగాగమ సంధి:
తెలుగు సంధులలో ఒకటైన ‘టుగాగమసంధి’ని గురించి తెలుసుకుందాం !
కింది ఉదాహరణలను పరిశీలిద్దాం.
ఉదా :
1. కఱకుటమ్ము = కఱకు + అమ్ము (ఉ + అ = ఉ + ట్ + అ)
2. నిలువుటద్దము = నిలువు + అద్దము (ఉ + అ = ఉ + ట్ + అ)
పై ఉదాహరణలు పరిశీలిస్తే అవి కర్మధారయ సమాసాలు. పూర్వపదం చివరి అక్షరంగా ఉ (ఉత్తు) ఉన్నది. అలాగే పరపదంలోని మొదటి అక్షరంగా అ (అచ్చు) ఉన్నది.
పూర్వ పరస్వరాలు కలిసిపోయేటప్పుడు పూర్వస్వరం అలాగే ఉంటూ ‘ట్’ ఆదేశంగా వస్తున్నది. కావున దీనిని ‘టుగాగమ సంధి’ అంటారు.
సూత్రం 1 : కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర ‘ఉ’ ఉండి దానికి అచ్చు పరమైనప్పుడు ‘ట్’ ఆగమంగా వస్తుంది. కింది ఉదాహరణలను పరిశీలిద్దాం.
ఉదా : పేరుటురము = పేరు + ఉరము (పేరుట్ + ఉరము)
చిగురుటాకు = చిగురు + ఆకు (చిగురుట్ + ఆకు)
పై ఉదాహరణలు పరిశీలిస్తే పూర్వపదం చివరి అక్షరంలో ‘ఉత్తు’ ఉన్నది.
(పూర్వపదంలోని పదాలన్నీ పేర్వాది శబ్దాలున్నాయి. ‘పేరు’ ‘చిగురు’ ‘పొదరు’ మొదలైన శబ్దాలను పేర్వాదులు అంటారు. ఈ పదాల చివరి అక్షరంలో ఉత్తు ఉన్నది)
పరపదం మొదటి అక్షరంగా అచ్చులున్నాయి. ఇందులో పూర్వపదంలోని చివరి అక్షరంలో గల ‘ఉత్తు’ అలాగే ఉంది. పరపదంలోని ‘అచ్చు’ స్థానంలో టుగాగమం వస్తుంది.
అంటే ఉ = టు గాను ఆ = టా గాను మార్పు చెందినది కాబట్టి ఇది టుగాగమ సంధి.
సూత్రం 2 : కర్మధారయంబునందు పేర్వాది శబ్దాలకు అచ్చు పరమగునపుడు టుగాగమం విభాషగానగు.
ఆ) కింది పదాలను విడదీసి, సంధి పేరు తెలిపి సూత్రీకరించండి.

జవాబు:

సమాసాలు :
కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

జవాబు:
1. సీత భర్త = సీత యొక్క భర్త – షష్ఠీ తత్పురుష సమాసం
2. బావి నీరు = బావి యందలి నీరు – సప్తమీ తత్పురుష సమాసం
3. అసాధ్యుడు = సాధ్యము కానివాడు – నఞ తత్పురుష సమాసం
4. అధర్మము = ధర్మము కానిది – నఞ తత్పురుష సమాసం
5. నిద్రాహారాలు = నిద్రయును, ఆహారమును – ద్వంద్వ సమాసం
6. కొత్త వీధి = కొత్తదైన వీధి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
![]()
ఆధునిక వచనం :
కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి.
1. తమ శిష్యులందరిలోను నాకే అగ్రతాంబూలంబునిచ్చిరి.
జవాబు:
తమ శిష్యులందర్లో నాకే అగ్రతాంబూలం ఇచ్చారు.
2. చల్లని నీటితో స్నానంబు సేసి, బట్టలనద్దుకొనియూ వేసుకొనవలయును.
జవాబు:
చల్లని నీటితో స్నానం చేసి, బట్టలు అద్దుకొని (ఉతుక్కొని) వేసుకోవాలి.
3. మధ్యాహ్నంబు వేళ తఱచుగా బోయి దేవాలయ గోపురంబుపై యంతస్తున కూర్చునియుండెడివాడను.
జవాబు:
మధ్యాహ్నం వేళ తరచుగా పోయి దేవాలయ గోపురం పై అంతస్తులో కూర్చునేవాణ్ణి.
4. నేను మా నాన్నగారి యనుమతితో యాడుకొనుటకు వెళ్ళేడివాడిని.
జవాబు:
నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోడానికి వెళ్ళేవాణ్ణి.
ప్రాజెక్టు పని :
క్యూఆర్ కోడ్లో ఇచ్చిన చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారి బాల్యం – విద్యాభ్యాసాన్ని తెలిపే వ్యాసం చదివి, కింది అంశాలను గురించి రాసి, తరగతిగదిలో ప్రదర్శించాలి.
1. చిలకమర్తి జననం.
2. చిలకమర్తి తాతగారి నుంచి సిద్ధించిన లక్షణాలు.
3. గణితం గురించి చెప్పిన మాటలు.
4. పెద్దాడ నరసమ్మ ప్రత్యేకత.
5. మిడిల్ స్కూల్ పరీక్షలో జరిగిన సంఘటన.
6. రేచీకటి వల్ల చిలకమర్తి పడ్డ ఇబ్బందులు.
7. చిలకమర్తి భోజనం కోసం ఏర్పాటు చేసుకొన్న వసతి.
8. వ్యాసంలో ఉన్న సామెత ఏది ? దాని గురించి మీరు గ్రహించిన విషయాలు ఏవి ?
జవాబు:
విద్యార్థి కృత్యం
![]()
పద్య మధురిమ :
అన్నదానము గొప్పదన వచ్చునేకాని
అన్నంబు జాములో సరిగిపోవు
వస్త్ర దానము గూడ భవ్యదానమె కాని
వస్త్రమేడాదిలో పాత దగును
గృహదానమొకటి యుత్కృష్టదానమె కాని
కొంప కొన్నేండ్లలో కూలిపోవు
భూమి దానము మహాపుణ్యదానమె కాని
భూమి యన్యుల జేరి పోవవచ్చు
అరిగిపోక, ఇంచుక యేని చిరిగిపోక
కూలిపోవక యన్యుల పాలుగాక
నిత్యమయి, వినిర్మలమయి, నిశ్చయమయి
యొప్పుచుందు విద్యాదానమొకటి జగతి.
– చిలకమర్తి లక్ష్మీనరసింహం
భావం : అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పది అంటారు. కానీ తినిన అన్నం అరిగిపోయిన తరువాత మరలా ఆకలి వేస్తుంది. కొత్త బట్టలు కూడా కొన్నాళ్ళకు మాసిపోయి పాతబడతాయి. ఇల్లు దానం చేసినా అధి కొన్ని సంవత్సరాల తరువాత కూలిపోవచ్చు. భూమిని దానం చేస్తే దానిని ఎవరైనా ఆక్రమించవచ్చు. ఎప్పటికీ అరిగిపోకుండా, చిరిగిపోకుండా, కూలిపోకుండా, ఇతరుల పాలబడకుండా ఉండే దానం ‘విద్యాదానం’ మాత్రమే.
రచయిత పరిచయం :

రచయిత : శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
స్వగ్రామం : తూర్పుగోదావరి జిల్లా ‘పొలమూరు’.
తల్లిదండ్రులు : మహాలక్ష్మి సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు దంపతులు.
కాలం : 23.04.1891 నుండి 25.02.1961 వరకు (20వ శతాబ్దం)
రచనలు : వడ్ల గింజలు, మార్గదర్శి, పుల్లంపేట జరీ చీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత మొదలైన 75 కథలు, మిథునానురాగం, శ్మశాన వాటిక మొదలైన నవలలు, ప్రేమపాశం, రాజరాజు, రక్షాబంధనం మొదలైన నాటకాలు, ఆయుర్వేద యోగముక్తావళి వంటి వైద్యశాస్త్ర గ్రంథాలు వ్రాశారు.
ప్రత్యేకతలు : ఎన్నో అవధానాలు చేశారు. 1956లో కనకాభిషేకం పొందారు. “శ్రీపాద వారి వచనము” తెలుగువారికి, తెలుగుతనానికి “నారాయణ కవచము” అని మల్లాది రామకృష్ణశాస్త్రిగారి చేత కీర్తించబడ్డారు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీపాద వారి ‘అనుభవాలు – జ్ఞాపకాలు’ లోనిది.
![]()
ఉద్దేశం :

విద్య వలన వినయం,’ వినయం వలన పాత్రత కలుగుతుంది అనేది ఆర్షవాక్యం. అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యాభ్యాసం కోసం ఎంతోమంది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి, సఫలీకృతులయ్యారు. అలాగే కోరుకున్న రంగంలో రాణించి, దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. విద్యార్థులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలను తెలియజేసి, వారి బాటలో నడిచేలా చూడడం దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం.
![]()
నేపథ్యం :

తెలుగులో వచనానికి పట్టం కట్టిన ప్రముఖులలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అగ్రగణ్యులు. ఆధునిక తెలుగుకథకు గురజాడ వారు బీజం వేశారు. శ్రీపాద వారు మొలకెత్తించారు. పద్య కవితా ప్రాభవాన్ని ఎదుర్కొన్నారు. వచన రచన వైపు నడిచారు. వీరు చక్కని తెలుగుదనంతో గ్రామీణ నేపథ్యంలో కథలు, కావ్యాలు వ్రాశారు.
ఆయన తన చిన్నతనంలో చదువును సాగించిన తీరు తన విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి మార్గదర్శకం. రచయిత తన బాల్యం, విద్యాభ్యాసం గ్రంథస్తం’ చేయాలనే ఆలోచనే పాఠ్యాంశ నేపథ్యం.
![]()
ప్రక్రియ – ఆత్మకథ :

వ్యక్తి తన జీవితానుభవాలు, అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకొనే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. తనకై తాను రాసుకున్న జీవిత చరిత్ర. అవి ఆత్మకథలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథలను చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. అందుచేతనే ఎన్ని ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదివితే అన్ని జీవితాలను ఏక కాలంలో జీవించినవారమవుతాము అంటారు.
![]()
పదాలు – అర్థాలు :
ముందంజ = అభివృద్ధి
యుగసంధి = రెండిటి మధ్యకాలం
వాత్సల్యం = ఆప్యాయత
రహస్యం = మర్మం
పూనిక = ప్రయత్నం
లక్ష్యం = గురి
ప్రాప్యం = ప్రాపకం
దృక్పథం = ఆలోచన
విరమించు = విడిచిపెట్టు
ఏకాగ్రత = అవధానం
తటస్థించు = ఏర్పడు
సహనం = ఓర్పు
కదలిక = చలనం
క్షుణ్ణంగా = పూర్తిగా
పారంగతులు =ఒడ్డును తాకినవారు (నిష్ణాతులు)
ఉడాయించు = పరుగెత్తు
పొరుగూరు = ప్రక్క గ్రామం
గారాబం = గారం
మక్కువ = ఇష్టం
అబ్బదు = రాదు
జతకట్టడం = అగ్రతాంబూలం
అణుకువ = వినయం
వ్యత్యాసాలు = తేడాలు
సాగరం = సముద్రం
గృహకృత్యాలు = ఇంటిపనులు
నేర్పు = నైపుణ్యం
ఇంగితం = వివేకం
మునుపు = ముందు
స్థండిలము = దర్భలతో చేసిన చాప
వల్లించుకోవడం = పదే పదే చదవడం
వీలు = అవకాశం
దేహళీదత్త దీపము = గడప మీద పెట్టిన దీపం
గద్దించి = బెదిరించి
గావంచా = అంగాస్త్రం
అవాంతరాలు = అడ్డంకులు
తడవు = చాలాకాలం
ధ్వజస్తంభం = గుడి ముందు ఉండే పొడవైన స్తంభం (జెండాకర్ర)
పసిడి = బంగారం
సంభవించదు = జరగదు
రణక్షేత్రం = యుద్ధభూమి
సహచరులు = స్నేహితులు
గానుగ = చెరకు రసం తీసే యంత్రం
ముంజెలు = లేత తాటికాయలు
పటుత్వం = పట్టు
గోష్ఠి = చర్చ
కాలక్షేపం = కాలం గడపడం
లోకాభిరామాయణం = ఊళ్లో కబుర్లు
ఛలోక్తులు = హాస్యపు మాటలు
శ్లేష = చాలా అర్థాలుండే పదప్రయోగం
సహస్రాంశం = వెయ్యవ వంతు
యాతన = బాధ
పరిణమించు = మార్పు జరుగు
వారాలు చేసుకోవడం = విద్యార్థి ఒకరింట్లో ఒక వారం (రోజు) మరొకరింట్లో మరొక వారం (రోజు) భోజనాలు చెప్పుకొంటూ అలాగా వారం రోజులు గ్రామంలో ఏడుగురి ఇళ్లలో ఉచితంగా భోజనాలు చేస్తూ చదువుకొనేవారు. ఆ రోజులలో పొరుగూరు విద్యార్థులు ఇలాగే చదువుకొనేవారు.