AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

These AP 9th Class Telugu Important Questions 13th Lesson నా చదువు will help students prepare well for the exams.

నా చదువు AP Board 9th Class Telugu 13th Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. తెనుగు జాతి కొత్త కొత్త వీథుల్లో ముందంజ వెయ్యాల్సిన యుగసంధిది. నా జీవిత రహస్యాలు కొన్ని ప్రకటించడం వల్ల తమ అంతస్తు ఏమాత్రం పెరుగుతుందో? తమ పూనిక ఏ మాత్రం సఫలం అవుతుందో? నేను చెప్పలేను. అయితే గతాన్ని పరిశోధించుకొని, వర్తమానాన్ని సమన్వయించుకొని, భవిష్యత్తు నిర్ధారణగా నిరూపించుకోవడం అందుకు తగిన ప్రణాళిక వేసుకొని, జాతిని ఆ మార్గాన నడిపించడం, మనందరి ముఖ్యవిధి. దీనికి ప్రతి వ్యక్తికి ఏదోవొక విద్య లేదా ఏదోవొక కళ ఉపయోగపడుతూనే వుంటాయి. అవి తమ లక్ష్యం కోసం, తన ప్రాప్యం కోసం ప్రవర్తమానం అవుతూనే వుంటాయి.

ప్రశ్నలు – జవాబులు

అ) పరిశోధన దేనిపై చేయాలి?
జవాబు:
పరిశోధన గతంపై చేయాలి.

ఆ) నిర్ధారణ చేసుకోవలసినదేది?
జవాబు:
భవిష్యత్తును నిర్ధారణ చేసుకోవాలి.

ఇ) విద్య ఉపయోగమేది?
జవాబు:
జాతిని కొత్త మార్గాన నడిపించడానికి విద్య ఉపయోగపడుతుంది.

ఈ) దేనిని సమన్వయించుకోవాలి?
జవాబు:
వర్తమానాన్ని సమన్వయించుకోవాలి.

2. అభివృద్ధికోసం పాటుపడే వ్యక్తి తన ప్రాప్యం మరిచిపోడు. తన లక్ష్యం మార్చుకోడు. తన దృక్పథం మళ్ళించుకోడు. తన ప్రణాళికను చింపేసుకోడు. తన సాధన విరమించుకోడు. తన దీక్ష విడిచిపెట్టుకోడు. తన ఏకాగ్రత చేరుచుకోడు. ఇందుకు నిద్రాహారాలు కరువైపోనీ, ప్రాణ భయమే తట్కంచనీ, అడుగు మాత్రం ముందుకే చేస్తారు. నిశ్చలంగా చివరికి జయమా! అపజయమా! అంటే అది వేరే సంగతి. కాని సంకల్పం, నిశ్చయం, సహనం, దీక్ష, ఏకాగ్రత ఇవి అతని ప్రతి అడుగులో, ప్రతి కదలికలో అచ్చుకట్టి వుంటాయి. ఊపివూపిన్నీ వురికిస్తాయి ముందుకి, అదిగో! ఆ వికారాల విసురులే అనుభవాలు. ఆ అనుభవాల నీడలే జ్ఞాపకాలు వాటిలో కొన్నింటిని చూద్దాం.

ప్రశ్నలు – జవాబులు

అ) లక్ష్యం మార్చుకోనిదెవరు?
జవాబు:
అభివృద్ధి కోసం పాటు పడే వ్యక్తి లక్ష్యం మార్చుకోడు.

ఆ) చివరికి జయమా? అపజయమా?
జవాబు:
చివరికి ఏదైనా కలగవచ్చు.

ఇ) జ్ఞాపకాలంటే ఏమిటి?
జవాబు:
జ్ఞాపకాలంటే అనుభవాల నీడలే.

ఈ) అనుభవాలంటే ఏమిటి?
జవాబు:
సంకల్పం, నిశ్చయం మొదలైన వికారాల విసురులే అనుభవాలు.

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

3. నా విద్యాభ్యాసంలో భాగంగా కావ్యపాఠం కోసం పొరుగూరుకు తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. మా అమ్మగారి దగ్గర గారాబం, మా పెద్దన్న గారి దగ్గర అతి చనువు. ఊరినిండా స్నేహితులు. సహజంగా ఆటలంటే మిక్కిలి మక్కువ. నా సంగతి యిలా వుండగా, మా కుటుంబం తరుచు ఆ వూరూ యీ వూరూ వెడుతూ వుండడం. ఇన్ని కారణాలవల్ల ఇంట్లో నాకు సాహిత్యం అబ్బదని ఇది యిలా నిర్ధారణ చేశారు మా నాయనగారు. పొరుగూళ్ళంటే కొంచెం కూడా భయం లేదు నాకు. ఎందుకంటే రెండు దినాల్లోనే ఆ వూరిలో నా వయస్సు గాళ్ళతో జతకట్టేసుకోగలను. కాని చదువు కోసమే అయినా, ఆ వయస్సులో, ఆ స్థితిలో, నేను పొరుగూళ్ళు వెళ్ళడం ఏ మాత్రం యిష్టం లేదు మా అమ్మగారికి.

ప్రశ్నలు – జవాబులు

అ) సాహిత్యం అబ్బదని ఎవరు నిర్ణయించారు?
జవాబు:
సాహిత్యం అబ్బదని వాళ్ల నాన్నగారు నిర్ణయించారు.

ఆ) రచయితకు ఇష్టమైనవేవి?
జవాబు:
రచయితకు ఆటలంటే ఇష్టం.

ఇ) రచయిత పొరుగూరు వెళ్లడం ఎవరికి ఇష్టం లేదు?
జవాబు:
రచయిత పొరుగూరు వెళ్లడం వాళ్ల అమ్మగారికి ఇష్టం లేదు.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పొరుగూళ్లంటే ఎవరికి భయం లేదు?

4. మా గురువు సీతారామశాస్త్రిగారు తమ శిష్యులందరిలో మొదట నాకే అగ్రతాంబూలం యిచ్చారు. వారి దగ్గర సంవత్సరంన్నర కాలం చదివాను. ఎలాంటి సందర్భంలోనూ ఎవరిమీదా వారు కోప్పడ్డం చూడలేదు నేను. విద్యార్థులంటే వారికెంతో వాత్సల్యం. నేనంటే మరీ వాత్సల్యం. దానికి కారణం నాకు బాగా చిన్నతనం కావడం. దీంతో గురువుగారి దగ్గర విద్యార్థులకెవరికీ లేని చనువు నాకు దొరికింది. అక్కడ వుండినంత కాలం నాకు తల్లిదండ్రులను విడిచివుండినట్టే అనిపించలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరియైన శిక్షణ అలవరిస్తే వారికి అసభ్య ప్రవర్తన ఎందుకు అలవడుతుంది? డబ్బు సంపాదించడంలో లేదు-దానిని జాగ్రత్త చెయ్యడంలో వుంది విశేషం. అలాగే బిడ్డలను కనడంలో లేదు వారికి సభ్యత అలవరచడంలోనే వుంది గొప్పతనం. అదే తల్లిదండ్రుల ప్రయోజకత్వం, అలాగే జాతిని పెంచేది పశుప్రవృత్తి. జాతిని సరిదిద్దేది మాత్రం మానవ ప్రవృత్తియే. అందుకే తల్లిదండ్రులు పిల్లలను సరైన మార్గంలో నడిపించాలి.

ప్రశ్నలు – జవాబులు

అ) అగ్రతాంబూలం అంటే మీ కేమర్ధమయింది?
జవాబు:
అగ్రతాంబూలం అంటే మొదటి ప్రాధాన్యం.

ఆ) విద్యార్థులంటే ఎవరికి వాత్సల్యం?
జవాబు:
విద్యార్థులంటే సీతారామశాస్త్రి గారికి వాత్సల్యం.

ఇ) పిల్లల ప్రవర్తనను ఎవరు సరిదిద్దాలి?
జవాబు:
పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు సరిదిద్దాలి.

ఈ) జాతిని సరిదిద్దేది ఏది?
జవాబు:
జాతిని సరిదిద్దేది మానవ ప్రవర్తన.

5. వారాల భోజనంలో వింతవింత అనుభవాలు కలుగుతాయి. ఒక్కొక్క వారం నిమిషాల మీద కుదురుతుంది. ఒక్కొక్క వారం మిక్కిలి శ్రమ పడితే గాని కుదరదు. ఒక యిల్లాలు ఏదో వచ్చాడు తింటాడు, పోతాడు అన్న నిరసన భావంతో పెడుతుంది భోజనం. ఇంకొక యిల్లాలు తల్లి లాగా బుజ్జగిస్తూ పెడుతుంది. ఈ వ్యత్యాసాలకు తోడు భోజనానికి వేళాపాళా వుండదు. ఒక అంతస్తూ వుండదు. రకరకాల భోజనాలున్నా కోరుకున్నది మాత్రం దొరకదు. వారాలు చేసుకొనే విద్యార్ధి అవలంబించేది బ్రహ్మచర్యమైనా ఈదేది మాత్రం సంసార సాగరం, ఇందువల్ల చదువుతో పాటు గృహకృత్యాలు నిర్వహించుకొనే నేర్పుకూడా అలవడుతుంది. ఇంగిత జ్ఞానం కలుగుతుంది. సంస్కారం అబ్బుతుంది.

ప్రశ్నలు – జవాబులు

అ) ఒక సమయము అంటూ లేనిది దేనికి?
జవాబు:
భోజనానికి వేళా పాళా ఉండదు.

ఆ) ఒక్కొక్క ఇల్లాలు భోజనం ఎవరిలా పెడుతుంది?
జవాబు:
ఒక్కొక్క ఇల్లాలు భోజనం తల్లిలాగ పెడుతుంది.

ఇ) ఏ నేర్పు అలవడుతుంది?
జవాబు:
గృహ కృత్యాలు నిర్వహించే నేర్పు అలవడుతుంది.

ఈ) పై పేరాలో దేని గురించి చెప్పారు?
జవాబు:
పై పేరాలో వారాల భోజనాల గురించి చెప్పారు.

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

6. వల్లూరిలో నేను సూర్యోదయం మునుపే మేలుకోవాలి. స్థండిలశయ్య విడిచి లేచిపోవాలి. ఎంత బద్ధకంగా ఉండినా కాలకృత్యాలు తీర్చుకోవడం తడవుగా నా చెంబు నేనే తోముకోవాలి. చన్నీళ్ళతో స్నానం చేసి, నా బట్టలు’ నేను ఉతుక్కోవాలి. ఆరవేసుకోవాలి. వాటిని జాగ్రత్త చేసుకోవాలి. పాతపాఠాలు చింతన చేసుకోవాలి. అది మరుపు రాకుండా వల్లించుకోవాలి. కొత్తపాఠం స్వయంగా చూచుకొని, క్రమం ఏర్పర్చుకోవాలి. అది గురువుగారి వీలు కనిపెట్టి చెప్పించుకోవాలి.

స్త్రీలు వంట ప్రయత్నాలు ప్రారంభించక పూర్వమే వెళ్ళి వారం చెప్పుకోవాలి. వేళ కనిపెట్టుకొని మళ్ళా రాత్రి భోజనం చెయ్యాలి, వెంటనే పడుకొని నిద్రపోవడం కుదరదు. దేహళీ దత్త దీపం దగ్గర కూచుని చదువుకోవాలి. యింటి వారికి చిరాకు పుట్టకుండా గట్టిగానో, మెల్లగానే చదువుకోవాలి. ఇంట్లో అయితే అర్ధరాత్రి అయినా ముసుగు తన్నుకునే ఉండి అమ్మను లేపి గద్దించి తెమ్మనవచ్చు. అక్కడ మాత్రం రాత్రివేళ దాహం కావచ్చు. కనుక ముందే జాగ్రత్తపడి సిద్ధంగా వుంచుకోవాలి మంచినీళ్ళ చెంబు. ఆ మంచినీళ్ళ చెంబు నిద్రమత్తులో వొత్తిగిల్లడంలో చేతికో కాలికో తగిలి నీళ్ళు వొలికిపోతే పడుకున్న దాపా, చాప మీద గావంచా, ముసుగు పెట్టుకుని దుప్పటి తడిసిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త పడాలి.

ప్రశ్నలు – జవాబులు

అ) దేహళీదత్త దీపం అంటే ఏమిటి?
జవాబు:
దేహళీ దత్త దీపం అంటే గడప మీద పెట్టిన దీపం.

ఆ) వేటి గురించి ఆలోచించాలి?
జవాబు:
పాత పాఠాల గురించి ఆలోచించాలి.

ఇ) బట్టలెవరు ఉతుకుతారు?
జవాబు:
తన బట్టలు తానే ఉతుక్కోవాలి.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
వొత్తిగిల్లి పడుకోవడం అంటే ఏమిటి?

7. ఇలా రాత్రివేళ ఎన్ని అవాంతరాలున్నా, ఉదయం చెప్పుకున్న కొత్త పాఠాన్ని వల్లించుకోవడానికి మధ్యాహ్నం వేళ తడవుగా పోయి దేవాలయం గోపురం పై అంతస్తులో కూర్చునే వాణ్ణి ఏమిటో కలలు కంటూ నేను. నా చదువుకు, నా కలలకు, నా కల్పనలకు వేదిక మాత్రం ఆ గోపురమే. అక్కడ నుంచి చూస్తే ఎదుట వరసగా విరగబూసిన బొగడ చెట్ల శిఖరాలు. ఎడమవైపున ముడుచుకు పోయిన కలవలతో నిండివున్న కోనేరు, వెనుక చిరుగంటలతో ధ్వజస్తంభాగ్రమూ. మిలమిల మెరిసే పసిడికుండలతో దేవాలయ శిఖరమూనూ, కుడి వైపున చేతికందేటట్టు నిండైన గెలలతో అలరించే కొబ్బరి చెట్ల తలలు. ఇలా ఆ పరిసరాలు చదువుకు అనుకూలంగానే వుండేవి. దీనికి సాయంగా అక్కడ నాలుగు వైపుల నుంచీ కమ్మనిగాలి రివ్వున వీచేది. మధ్య మధ్య మాత్రం గబ్బిలాల కంపుతో కలుషితం అయ్యేది. నా పఠనానికి, రచనకు అనుకూలమైన ఆ గోపురం దిగడమంటే నాకెంతో బాధగా ఉండేది. కాని సూర్యాస్తమయం కాగానే దిగక తప్పేదికాదు.

ప్రశ్నలు – జవాబులు

అ) కోనేరు ఎటువైపు ఉంది?
జవాబు:
కోనేరు ఎడమ వైపు ఉంది.

ఆ) మధ్య మధ్య దేనితో పాడయ్యేది?
జవాబు:
మధ్య మధ్య గబ్బిలాల కంపుతో కలుషితమయ్యేది.

ఇ) దేవాలయ శిఖరంపై ఏవి మెరిసేవి?
జవాబు:
దేవాలయ శిఖరంపై పసిడికుండలు మెరిసేవి.

ఈ) రచయిత కలల వేదిక ఏది?
జవాబు:
రచయిత కలల వేదిక గుడి గోపురం.

8. వల్లూరిలో ప్రవేశించడం మరో ప్రపంచాన పడ్డట్టయింది. అక్కడ నాకు చదువు రాసాగింది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి జయించుకు రాగలమన్న ధైర్యం కలగజొచ్చింది. జీవన సరణిలో స్పష్టమైన మార్పు ప్రారంభమైంది. నిజమే పొరుగూరిలో ఉండడం వల్ల కలిగే మార్పది. స్వగ్రామంలో ఉంటే అది సంభవించదు. జీవితం రసవంతం కాదు. ఆనందమన్నది అనుభవానికి రాదు. పదమూడు సంవత్సరాల వయస్సుకే ఇలాంటి అనుభవం రావడం నా అదృష్టం. పొరుగూరి లోనే యిలాంటిది తటస్థ పడితే? మరి జిల్లాను దాటి వెడితే? రాష్ట్రాన్ని, దేశాన్ని దాటి వెడితే? ఖండానికి ఖండమే దాటి వెడితే? ఇలా వెళ్ళడమంటే ఆ వెళ్ళిన చోటు చదువుకోడమో లేదా ఏదో వృత్తి చేయడమో సాగించాలి. అది ఎలా అంటే భారత రణక్షేత్రంలో అర్జునుడికి కలిగిన విశ్వరూప సందర్శనంలా. అప్పుడే మనిషి కర్తవ్యం వైపు నడవగలుగుతాడు.

ప్రశ్నలు – జవాబులు

అ) ఎక్కడుంటే జీవితం రసవంతం కాదు.
జవాబు:
స్వగ్రామంలో ఉంటే జీవితం రసవంతం కాదు.

ఆ) ఆయన జీవితంలో మార్పు ఎక్కడ వచ్చింది?
జవాబు:
ఆయన జీవితంలో మార్పు వల్లూరులో వచ్చింది.

ఇ) రచయితకు అదృష్టం ఏమిటి?
జవాబు:
13 సంవత్సరాలకే అనుభవం రావడం ఆయన అదృష్టం.

ఈ) రచయితకు మరో ప్రపంచం ఏది?
జవాబు:
రచయితకు వల్లూరు మరో ప్రపంచం.

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

9. నాకు నా స్నేహితులతో కలిసి ఊరికి దగ్గరగా వనములమ్మ గుడికి నైఋతిగా ఉన్న కాలువలో ఈత కొట్టడమంటే మహా – సరదా. ఎంత ఈదినా ఇంకా ఈదాలనే కోరిక చచ్చేది కాదు. ఈ కాలువలో ఈత కొడుతున్నప్పుడు వల్లూరిలో ఆనాడు జరిగిన సంఘటనొక్కటి గుర్తొచ్చింది. ఆ రోజు నేను స్నానానికి వెళ్ళేటప్పటికి నానా అల్లరిగా వుంది కోనేటి పావంచాల రేవు. స్నానాలు చేస్తున్న విద్యార్థులలో కొందరు నీళ్ళు కలిచి వేస్తూ, వొకళ్ళ మీద వొకళ్ళు చల్లుకుంటున్నారు. కేరింతలు కొడుతున్నారు. దీని వల్ల గృహములకు నీళ్ళు తీసుకు వెళ్ళే మహిళలు సైతం వేరే రేవుకు తరలిపోతున్నారు. వాళ్ళ మధ్య స్నానం చెయ్యడం నాకిష్టం లేకపోయింది. అలాంటి వాతావరణ మంటే నాకేమాత్రం సరిపోదు. అంచేత ఆ పావంచాల రేవుకి పాతిక గజాల దూరంలో పడమరగా వున్న కాలరేవు వెళ్ళి స్నానం చేద్దామనుకున్నాను ఆ రోజు.

ప్రశ్నలు – జవాబులు

అ) రచయితకు ఏదంటే ఇష్టం?
జవాబు:
కాలువలో ఈత కొట్టడమంటే రచయితకు ఇష్టం.

ఆ) అల్లరిగా ఉన్న రేవు ఏది?
జవాబు:
కోనేటి పావంచాల రేవు అల్లరిగా ఉంది.

ఇ) కాలరేవు ఎంత దూరంలో ఉంది?
జవాబు:
కాలరేవు 25 గజాల దూరంలో ఉంది.

ఈ) అల్లరిగా స్నానం చేస్తున్నవారు ఎవరు?
జవాబు:
విద్యార్థులు అల్లరిగా స్నానం చేస్తున్నారు.

10. ఆ నలుగురిలోనూ మళ్ళీ ధోరణి భేదించేది, స్పష్టంగా. బుద్ధవరపు సీతమ్మగారు ఛలోక్తులు విసిరేవారు. మైలవరపు జోగమ్మగారు శ్లేషలు కురిపించేవారు. మా అమ్మగారు సామెతలూ పలుకుబళ్లూ విరజిమ్మేవారు. తటవర్తి సుబ్బమ్మగారు నిండుకుండలాగ నిశ్చలంగా మాట్టాడేవారు. బుచ్చి వెంకయ్యమ్మ గారి భాష రాణుల ధోరణిలోనే వుండేది. నవరసాలు చిప్పిలేని ఆ గోష్ఠిలో. సరస్వతి లాస్యం చేస్తున్నట్లుండేదప్పుడక్కడ. కాళిదాసు నాలుకమీద బీజాక్షరాలు రాసిందిట ‘కాళికాదేవి. నా చెవిలో ఆ మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు. ఇవాళ నేను రాస్తున్న భాష వారనుగ్రహించినదాన్లో సహస్రాంశమయినా కాదు, యింతా చేస్తే. ఇలాగ, నేను, వారే కాదు నలుగురు స్త్రీ లెక్కడ మాట్లాడుకుంటున్నా వింటూ వుండిపోయేవాణ్ణి. జాతీయమైన తెనుగు భాష కావాలంటే స్త్రీల దగ్గిరే నేర్చుకోవాలి.

ప్రశ్నలు – జవాబులు

అ) నిశ్చలంగా ఉండేవారిని ఎవరితో పోలుస్తారు?
జవాబు:
నిశ్చలంగా ఉండే వారిని నిండుకుండతో పోలుస్తారు.

ఆ) కాళికాదేవి ఎవరి నాలుకపై బీజాక్షరాలు వ్రాసింది?
జవాబు:
కాళిదాసు నాలుకపై కాళికాదేవి బీజాక్షరాలు రాసింది.

ఇ) స్త్రీల గోష్ఠిలో ఏవి ఉండేవి?
జవాబు:
స్త్రీల గోష్ఠిలో నవరసాలు ఉండేవి.

ఈ) సంభాషణలో ఎవరు శ్లేషలు వాడేవారు?
జవాబు:
మైలవరపు జోగమ్మ గారు సంభాషణలో శ్లేషలు వాడేవారు.

అపరిచిత గద్యాలు

1. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములిమ్ము.

వేదకాలం నుండి మన దేశంలో “గురుకుల విద్యావ్యవస్థ కొనసాగుతోంది. రాజుల నుండి సామాన్యుల వరకు తమ బిడ్డల్ని గురుకులానికి పంపి విద్యను నేర్పేవారు. బాల్యంలో శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద విద్య నేర్చాడు. ఆగర్భ దరిద్రుడైన కుచేలుడు కూడా శ్రీకృష్ణుని సహాధ్యాయి. అడవుల్లో ప్రశాంత వాతావరణంలో ఆనాటి గురుకులాలుండేవి. గురుశిష్యులు కలిసి జీవించి అధ్యయనం చేసేవారు. గురుపత్ని శిష్యుల్ని తన బిడ్డలుగా భావించి వారికి తల్లిదండ్రులు దూరమైనారనే భావన రానీయకుండా ప్రేమగా చూచుకునేది. గురుకులాల్లో శిష్యులు కఠోరనియమ నిష్ఠలతో విద్యను నేర్చేవారు. ఆనాటి విద్య పూర్తిగా ‘ఆచరణాత్మకంగా’ ఉండి విలువలతో కూడినదై ఉండేది.
గురుకుల విద్యావిధానంలోని గొప్పదనాన్ని మన ప్రభుత్వం గుర్తించి విద్యాశాఖలో గురుకుల సొసైటీని, సాంఘిక సంక్షేమశాఖలో మరొక గురుకుల సొసైటీని నెలకొల్పి విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడానికి శ్రీకారం చుట్టింది. ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహించి యోగ్యులైన విద్యార్థులకు ప్రవేశాన్ని కల్పిస్తోంది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ప్రాచీన కాలంలో గల విద్యావిధానం పేరేమి?
జవాబు:
గురుకుల విద్యావ్యవస్థ

ప్రశ్న 2.
పూర్వకాలంలో తరతమ భేదాలు పాటించక అందరూ తమ పిల్లల్ని ఎక్కడ చదివించేవారు?
జవాబు:
గురుకులంలో

ప్రశ్న 3.
‘వేదకాలం నాటి గురుకుల విద్యావిధానాన్ని వర్ణించండి.
జవాబు:
గురుకులాల్లో శిష్యులు కఠోర నియమ నిష్ఠలతో విద్యను నేర్పేవారు.

ప్రశ్న 4.
గురుకుల విద్యావిధానంలో గురుపత్ని పాత్ర ఏమిటి?
జవాబు:
గురుపత్ని శిష్యుల్ని తన బిడ్డలుగా భావించి వారికి తల్లిదండ్రులు దూరమైనారనే భావన రానీయకుండా ప్రేమగా చూసుకొనేది.

ప్రశ్న 5.
మన రాష్ట్రంలోని గురుకుల సొసైటీల పాఠశాలల్లో ప్రవేశ విధానం ఏది?
జవాబు:
ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహించి, యోగ్యులైన విద్యార్థులకు ప్రవేశాన్ని కల్పిస్తోంది.

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

2. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఒక పిల్లవాడు ఒక పాడుబడిన బావి గట్టుమీద కూర్చుని బిగ్గరగా ఏడుస్తున్నాడు. దారిన పోతున్న ఒక దొంగ ఇది గమనించాడు. పిల్లవాని వద్దకు వచ్చి, “ఎందుకు బాబూ ఏడుస్తున్నావు”? అని అడిగాడు. అందుకు పిల్లవాడు ఏడుస్తూనే “బావిలో బంతి పడింది. బంతిని చూడడం కోసం బావిలో తొంగిచూడగా నా మెడలోని బంగారు గొలుసు జారిపడిపోయింది. ఆ గొలుసు లేకుండా ఇంటికి వెళ్ళితే మా అమ్మానాన్న కొడతారు” అన్నాడు. నిజానికి బావిలో పడింది బాలుడి బంతే, గొలుసు కాదు.

దొంగకు బంగారు గొలుసు కాజేయాలన్న దురాశ కల్గింది. పిల్లవానితో “నేను బావిలోకి దిగి గొలుసు తెస్తాను. అంతవరకు నా బట్టలు జాగ్రత్తగా చూడు” అని పలికి బావిలోకి దిగాడు. బాలుడి బంతిని బైటికి విసిరాడు. నీటిలో మునిగి బంగారు గొలుసు కోసం తీవ్రంగా గాలించాడు. కాని గొలుసు కనబడలేదు. చివరకు విసిగిపోయి బావిలో నుంచి గట్టు మీదకు వచ్చి చూస్తే పిల్లవాడు లేదు. పిల్లవాడు తన బంతిని తీసికొని వెళ్ళాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
బాలుని ఏడుపునకు కారణం ఏమిటి?
జవాబు:
బంతి బావిలో పడటం

ప్రశ్న 2.
దొంగకు బాలుడు తన ఏడ్పుకు కారణమేమిటని చెప్పాడు?
జవాబు:
బంతి బావిలో పడిందని చూస్తుంటే నా బంగారపు గొలుసు జారి నూతిలో పడింది అని దొంగకు చెప్పాడు.

ప్రశ్న 3.
దొంగ బాలునీతో ఏమన్నాడు?
జవాబు:
నేను బావిలోకి దిగి గొలుసు తెస్తాను. అంతవరకు నా బట్టలు జాగ్రత్తగా చూడు.

ప్రశ్న 4.
దొంగకు బంగారు గొలుసు దొరకక పోవడానికి కారణం ఏమిటి?
జవాబు:
నూతిలో బంగారు గొలుసు పడలేదు కనుక

ప్రశ్న 5.
ఈ కథ ద్వారా నీవు గ్రహించిన నీతి ఏమిటి?
జవాబు:
దురాశ దుఃఖానికి చేటు.

3. ఈ క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు తగిన సమాధానములు రాయండి.

మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసిన దేశభక్తుడు పింగళి వెంకయ్య. ఈయన మన ఆంధ్రుడు. ఈయన 1876లో జన్మించారు. పింగళి వెంకయ్య ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. అక్కడ కొద్ది కాలం బ్రిటీష్ సైన్యంలో పనిచేసి, ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈయన మనదేశం వచ్చి బందరు జాతీయ కళాశాలలో ఉపన్యాసకుడుగా పనిచేశారు. మాతృదేశానికి ఒక జెండా తయారు చెయ్యడానికి 1907 నుండి ప్రయత్నించసాగారు. వెంకయ్య 1913లో జరిగిన జాతీయ కాంగ్రెసు మహాసభలకు హాజరై, జాతీయ పతాకం గురించి, జాతీయ నాయకులతో చర్చించారు.

1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని ఆంగ్లభాషలో రాశారు. 1921లో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గాంధీజీని కలిసి వెంకయ్య జాతీయ పతాకం గురించి చెప్పారు. గాంధీ గారి సూచనల మేరకు ఈయన భారతదేశానికి ఒక త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈయన 1963లో అమరుడయినారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పింగళి వెంకయ్య ఉన్నత విద్య ఎక్కడ నేర్చారు?
జవాబు:
ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు.

ప్రశ్న 2.
ఉపన్యాసకునిగా పింగళి ఎక్కడ పనిచేశారు?
జవాబు:
బందరు జాతీయ కళాశాలలో

ప్రశ్న 3.
“భారతదేశానికి ఒక జాతీయ పతాకం” అనే పుస్తకం ఎవరు రాశారు?
జవాబు:
పింగళి వెంకయ్య

ప్రశ్న 4.
గాంధీజీని వెంకయ్య ఎప్పుడు కలిశారు?
జవాబు:
1921 సంవత్సరంలో

ప్రశ్న 5.
పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో మరణించాడు?
జవాబు:
1963 సంవత్సరంలో

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

4. ఈ క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు తగిన సమాధానములు రాయండి.

ప్రకృతిలో గల జీవ, భౌతిక అంశాలన్నింటినీ కలిపి ప్రాకృతిక పర్యావరణంగా నిర్వచింపవచ్చు. ఈ ప్రాకృతిక పర్యావరణాన్ని జీవ పర్యావరణం, భౌతిక పర్యావరణం అంటూ కూడా విభజించవచ్చు. జీవ పర్యావరణం జీవులకు సంబంధించినదైతే, భౌతిక పర్యావరణం ప్రకృతిలోని గాలి, నీరు, వాతావరణాలకు చెందినట్టిది.

మానవుడు తన అవసరాల కొరకు ఓ కొత్త వాతావరణాన్ని నిర్మించుకున్నాడు. సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సాంకేతిక, వినోదాత్మక అంశాలన్నీ మానవ నిర్మితాలే. వీటి సముదాయాన్నే మానవ నిర్మిత పర్యావరణమంటారు.

ప్రాకృతిక, మానవ నిర్మిత పర్యావరణాలు పరస్పర సంబంధితాలు. ఇవి ఒకదానికొకటి ప్రేరణ కల్గిస్తాయి. ప్రభావితం చేస్తాయి. ఈ రెండిటి మధ్య సమతుల్యత లోపిస్తే అనర్థాలు అనేకం. నాగరికత పెరిగే కొద్దీ మానవుని అవసరాలు పెరుగుతున్నాయి. మానవుడు ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, ఇల్లు కొరకు ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాడు. అందుకు సహజ వనరులను విచక్షణారహితంగా నాశనం చేస్తుండటం వల్ల ప్రకృతిలోని సమతుల్యత లోపించి, పరిసరాల క్షీణత ప్రారంభమైంది.

ప్రకృతిలోని జీవ, భౌతిక సంబంధిత కారకాలు పరస్పర చర్య నొందుతూ భూమిపై జీవుల మనుగడకు దోహదపడుతున్నాయి. పారిశ్రామిక విప్లవానంతరం జీవావరణంలో అనేక మార్పులు సంభవించాయి. ఇటీవలి కాలంలో ఈ మార్పులు శీఘ్రుతరం అవటం వల్ల అనేక వృక్ష, జంతు జాతులు, భూమి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. మానవుని మనుగడకే ముప్పు ఏర్పడింది. మానవుడు తాను సాధించిన సాంకేతిక ప్రగతికి తానే బలైపోతున్నాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
దేనిని ప్రాకృతిక పర్యావరణంగా నిర్వచించవచ్చు?
జవాబు:
ప్రకృతిలో గల జీవ, భౌతిక అంశాలన్నింటినీ కలిపి.

ప్రశ్న 2.
జీవ పర్యావరణం అని దేనిని అంటారు?
జవాబు:
జీవులకు సంబంధించిన దాన్ని

ప్రశ్న 3.
భౌతిక పర్యావరణం అంటే ఏవి?
జవాబు:
ప్రకృతిలోని గాలి, నీరు, వాతావరణం

ప్రశ్న 4.
మానవ నిర్మితాలేవి?
జవాబు:
సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక, వినోదాత్మక అంశాలు.

ప్రశ్న 5.
దేనివల్ల జీవావరణంలో మార్పులు సంభవించాయి?
జవాబు:
పారిశ్రామిక విప్లవానంతరం వల్ల

వ్యక్తీకరణ – సృజనాత్మకత

I. ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ఆత్మకథ’ ప్రక్రియ రాయండి. (లేదా)
‘నా చదువు’ పాఠ్యభాగ ప్రక్రియ ‘ఆత్మకథ’ గురించి రాయండి. (FA-4:2023-24)
జవాబు:
వ్యక్తి తన జీవితానుభవాలు, అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకొనే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. తనకై తాను రాసుకున్న జీవిత చరిత్ర. అవి ఆత్మకథలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథలను చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. అందుచేతనే ఎన్ని ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదివితే అన్ని జీవితాలను ఏక కాలంలో జీవించినవారమవుతాము అంటారు.

ప్రశ్న 2.
శ్రీపాదవారి చదువు గురించి వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు వ్రాయండి.
జవాబు:
శ్రీపాదవారు తమ తండ్రి గారి వద్ద వేదం, జ్యోతిషం అభ్యసించారు. వాళ్ల నాన్నగారు ఇంట్లో ఉన్నంత సేపు కదలకుండా కూర్చొనేవారు. వేదం, జ్యోతిషం నేర్చుకొనేవారు. ఆయన ఇల్లు కదిలాక ఆటలకు వెళ్లిపోయేవారు. అలా ఉంటే కావ్యాలు రావని వారి నాన్నగారి అభిప్రాయం. అందుచేత కావ్య పాఠానికి పొరుగూరు పంపాలని వీరి నాన్నగారి అభిప్రాయం. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి చిన్నతనంలో వారి తల్లిగారి వద్ద గారాబం ఎక్కువ. పెద్దన్నగారి వద్ద చనువు ఎక్కువ ఊరి నిండా స్నేహితులు, ఆటలంటే మక్కువ ఎక్కువ. అందుచేత పొరుగూరు పంపాలని వారి నాన్నగారి అభిప్రాయం. కాని వారి తల్లిగారికి మాత్రం పిల్లాడిని పొరుగూరు పంపడం ఇష్టంలేదు.

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

ప్రశ్న 3.
సీతారామ శాస్త్రిగారెలాంటి వారు? వివరించండి.
జవాబు:
గుంటూరు సీతారామశాస్త్రిగారు ‘జల్లిసీమ’లో మోగల్లు గ్రామ నివాసి. రామచంద్రపురం తాలూకాలోని వల్లూరు గ్రామస్తులు. ఆయనను తమ ఊరు తీసుకొచ్చారు. తమకు సాహిత్య విద్య నేర్పడానికి కొంత డబ్బిచ్చి ఆయనను తీసుకొని వచ్చారు. సంవత్సరానికి కొంత డబ్బు ప్రతి ఏటా ఇచ్చేవారు.
ఆయన శిష్యులను చాలా వాత్సల్యంతో చూసేవారు. ఎవ్వరి మీదా కోప్పడేవారు కాదు. ఓర్పుగా, నేర్పుగా కావ్య పాఠం చెప్పేవారు. వయసులో చిన్నపిల్లలను మరీ ప్రేమగా చూసేవారు. పిల్లలెవరూ తమ తల్లిదండ్రులు దగ్గరలేరని బాధపడేవారు కాదు. గురువుగారిలోనే తల్లిదండ్రుల ఆప్యాయత చూసుకొనేవారు. అంటే సీతారామశాస్త్రిగారు తమ శిష్యులను అంత జాగ్రత్తగా, వాత్సల్యంగా చూసుకొనేవారు.

II. ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“మనందరి ముఖ్య విధి” అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి దేని గురించి చెప్పారు?
జవాబు:
తెలుగు జాతి కొత్త కొత్త వీధుల్లో ముందంజ వెయ్యాల్సిన యుగసంధి ఇది. నా జీవిత రహస్యాలు కొన్ని ప్రకటించడం వల్ల తమ అంతస్తు ఏమాత్రం పెరుగుతుందో? తమ పూనిక ఏ మాత్రం సఫలం అవుతుందో? నేను చెప్పలేను. అయితే గతాన్ని పరిశోధించుకొని, వర్తమానాన్ని సమన్వయించుకొని, భవిష్యత్తు నిర్ధారణగా నిరూపించుకోవడం అందుకు తగిన ప్రణాళిక వేసుకొని, జాతిని ఆ మార్గాన నడిపించడం, మనందరి ముఖ్య విధి. దీనికి ప్రతి వ్యక్తికి ఏదో ఒక విద్య లేదా ఏదో ఒక కళ ఉపయోగపడుతూనే ఉంటాయి. అవి తమ లక్ష్యం కోసం, తన ప్రాప్యం కోసం ప్రవర్తమానం అవుతూనే ఉంటాయని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు మనకు సందేశమిస్తున్నారు.

ప్రశ్న 2.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి మనస్తత్వాన్ని గురించి పాఠం ఆధారంగా రాయండి.
జవాబు:
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘నా చదువు’ పాఠం ఆధారంగా వారి మనస్తత్వాన్ని ఒకసారి పరిశీలిస్తే తండ్రి లక్ష్మీపతి సోమయాజులు గారు ఇంట్లో ఉన్నంత సేపు కదలకుండా కూర్చోవడం, వారి దగ్గర జ్యోతిష్యం, వేదాలు నేర్చుకుంటూ, ఆయన ఇల్లు కదలగానే ఊళ్ళోకి వెళ్ళి స్నేహితులతో ఆడుకొనేవాడు. పొరుగూళ్ళంటే కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే రెండు రోజుల్లోనే ఆ ఊరిలోని తన వయసు గాళ్లతో జతకట్టేసుకోగలడు. వల్లూరులో వారాలు చెప్పుకుంటూ దిగులు పడకుండా ఉన్నాడు. వారాలు చెప్పుకున్న వారి ఇంటి దీపం వెలుగులో ఇంటి వారికి చిరాకు పుట్టకుండా గట్టిగానో, మెల్లగానో చదువుకొనేవాడు.

వల్లూరులో చదువు బాగా సాగింది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి జయించుకురాగలనన్న ధైర్యం వచ్చిందంటారు శాస్త్రిగారు. ఒక సందర్భంలో చెరువులో స్నానం చేస్తున్న శాస్త్రిగారిని ఒక వృద్ధురాలు నీళ్ళబిందె. ముంచి ఇవ్వమని అడిగినపుడు, మరల ఆమే కథల పుస్తకం రోజూ చదివి వినిపించమని అడిగినప్పుడు కాదనకుండా పెద్దల పట్ల వినయాన్ని ప్రదర్శించాడు. ‘నా తల్లితో కబుర్లాడడానికి వచ్చే ఆడవాళ్ళ మాటల్లో చక్కని భాష, ప్రయోగ విజ్ఞానం. ఉన్నాయి. కాళిదాసు నాలుక మీద కాళికా దేవి బీజాక్షరాలు రాసిందట, నా చెవిలో ఆ మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు” అంటూ వారి పట్ల కృతజ్ఞత తెలిపాడు.

సృజనాత్మక ప్రశ్న

ప్రశ్న 1.
‘నా చదువు’ పాఠం చదివారు కదా! మీకెలా అనిపించిందో మిత్రునికి లేఖ ద్వారా మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు:

ఏలూరు,
X X X X.

ప్రియమైన మిత్రుడు త్రివిక్రము,

నేను బాగా చదువుతున్నాను. నీవెలా చదువుతున్నావు. ఇటీవల మా తెలుగు మాస్టారు అవిరా ప్రభుకిరణ్ గారు ‘నా చదువు’ పాఠం చెబుతూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు చదువుకోసం ఎంత కష్టపడ్డారో, ఎంత ఇష్టంగా చదివారో వివరంగా చెప్పారు. వాటిలో కొన్ని అంశాలు నా మనసుకు పట్టాయి. వాటిలో “పొరుగూరు అంటే కొంచెం కూడా భయం లేదు నాకు. ఎందుకంటే రెండు దినాల్లోనే ఆ ఊరిలో నా వయస్సు గాళ్ళతో జతకట్టేసుకోగలను” అన్న శాస్త్రిగారి మాటల వల్ల ఆయన ఎంత స్నేహశీలి అనేది తెలుస్తోంది. తల్లిదండ్రులు పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన శిక్షణ అలవరిస్తే వారికి అసభ్య ప్రవర్తన ఎందుకు అలవడుతుంది ? అంటూ పిల్లలకు, తల్లిదండ్రులకు బాధ్యత గుర్తు చేశారు. అట్లాగే పెద్దావిడకు నీళ్ళ బిందె ముంచి ఇవ్వడం, కథల పుస్తకం రోజూ చదివి వినిపించడం పెద్దల పట్ల వినయం, చదువు పట్ల ఆసక్తి తెలిసాయి. కుండ బంతి, ఉప్పట్టీ, చెడుగుడు ఆటలు స్నేహితులతో ఆడేవాడని చదివాం. ఇంకా చెరుకు పానకం, చెరుకు గడలు, వేడి వేడి బెల్లం, ముంజలు కొట్టించుకు తినడం ఇష్టంగా చేసేవాడని మా సారు చెప్పారు. పాఠం చెప్పిన తర్వాత, ఆ విశేషాలు అన్నీ నేను పుస్తకం చూసి చదువుకున్నాను. చాలా బాగున్నాయి. ఈ పాఠం నీకెలా అనిపించింది. లేఖ ద్వారా తెలియజేయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. లీలాకృష్ణ.

చిరునామా :
భారతుల త్రివిక్రమ శర్మ,
9వ తరగతి, భాష్యం పబ్లిక్ స్కూల్,
తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా.

భాషాంశాలు

అర్థాలు

అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.

1. ఎవరి జీవితం వారే చక్కదిద్దుకోవాలి.
జవాబు:
బ్రతుకు

2. ఇంటి రహస్యం ఎవ్వరికీ చెప్పకూడదు.
జవాబు:
గుట్టు

3. పూనిక ఉంటే పని పూర్తవుతుంది.
జవాబు:
ప్రయత్నం

4. మంచి మార్గం ఎంచుకోవాలి.
జవాబు:
దారి

5. వ్యక్తిని వ్యక్తిగా చూడాలి.
జవాబు:
మనిషి

6. ఎవరి ప్రాప్యం వారిదే.
జవాబు:
దొరికినది

7. లక్ష్యం మరిచిపోకూడదు.
జవాబు:
గురి

8. ఎంత పని ఉన్నా ఆహారం మానకూడదు.
జవాబు:
భోజనం

9. దేనికీ ఎప్పుడూ భయము ప్రదర్శించకూడదు.
జవాబు:
జంకు

10. ప్రయత్నిస్తే జయము లభిస్తుంది.
జవాబు:
విజయము

11. అపజయము విజయసోపానం.
జవాబు:
పరాజయం

12. సహనంతో ప్రయత్నించాలి.
జవాబు:
ఓర్పు

13. ఎవరి పుట్టుక బనా విధి లిఖితమే.
జవాబు:
జననం

14. ఈ రోజులలో శాస్త్ర పారంగతులు తగ్గారు.
జవాబు:
తీరము తాకినవారు

15. బాల్యం తిరిగిరాని మధురభావన.
జవాబు:
శైశవం

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

ఆ) గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.

1. గ్రామం సుభిక్షంగా ఉంటే దేశం బాగుంటుంది.
అ) పల్లె
ఆ) పట్నం
ఇ) నగరం
ఈ) దేశం
జవాబు:
అ) పల్లె

2. తండ్రి ఇల్లు కదిలితే పిల్లలు ఉడాయించడం సహజం.
అ) మాట్లాడడం
ఆ) వెళ్లిపోవడం
ఇ) రావడం
ఈ) ఆడడం
జవాబు:
ఆ) వెళ్లిపోవడం

3. అమ్మ దగ్గరెవరికైనా గారాబమే.
అ) అక్క
ఆ)అన్న
ఇ) తల్లి
ఈ) తండ్రి
జవాబు:
ఇ) తల్లి

4. స్నేహితుడు వస్తే నాకు సమయం తెలీదు.
అ) బంధువు
ఆ) చుట్టము
ఇ) వైరి
ఈ) మిత్రుడు
జవాబు:
ఈ) మిత్రుడు

5. నాకు పుస్తకాలంటే మక్కువ.
అ) ఇష్టం
ఆ) కష్టం
ఇ) ఎక్కువ
ఈ) కావాలి
జవాబు:
అ) ఇష్టం

6. నాకు చదువు అబ్బదు అనుకొన్నారు.
అ) చెప్పరు
ఆ) వినను
ఇ) రాదు
ఈ) వ్రాయను
జవాబు:
ఇ) రాదు

7. ఒక్క దినము కూడా కలిసిరాలేదు.
అ) రూపాయి
ఆ) దినుసు
ఇ) దినసరి
ఈ) రోజు
జవాబు:
ఈ) రోజు

8. నేను రాముతో జతకట్టాను.
అ) స్నేహం
ఆ) స్నేహం చేశాను
ఇ) వైరం
ఈ) వైరం వచ్చింది
జవాబు:
ఆ) స్నేహం చేశాను

9. ఆయన చదువుకు పొరుగూరు వెళ్లారు.
అ) సమీప గ్రామం
ఆ) గ్రామం
ఇ) పల్లె
ఈ) పల్లెటూరు
జవాబు:
అ) సమీప గ్రామం

10. రైతు దేశానికి అన్నదాత.
అ) కూలీ
ఆ) హాలికుడు
ఇ) హలము
ఈ) కలము
జవాబు:
ఆ) హాలికుడు

11. ఎవరి స్వగ్రామం వారికి గొప్పది.
అ) ఊరు
ఆ) పల్లె
ఇ) పల్లెటూరు
ఈ) సొంతగ్రామం
జవాబు:
ఈ) సొంతగ్రామం

12. ప్రతి సంవత్సరం ఏదో సమస్య వస్తుంది.
అ) నెల
ఆ) వర్షం
ఇ) వాన
ఈ జల్లు
జవాబు:
ఆ) వర్షం

13. ఈ రోజుల్లో అన్నం కూడా పైకం లేనిదే పెట్టరు.
అ) ఆకు
ఆ) అర్హత
ఇ) ఆకలి
ఈ) డబ్బు
జవాబు:
ఈ) డబ్బు

14. గురువు గౌరవమే శిష్య గౌరవం.
అ) దైవం
ఆ) ఉపాధ్యాయుడు
ఇ) శాస్త్రం
ఈ) అమ్మ
జవాబు:
ఆ) ఉపాధ్యాయుడు

15. బ్రహ్మ సృష్టికర్త.
అ) విధాత
ఆ) శివుడు
ఇ) హరి
ఈ) శ్రీ
జవాబు:
అ) విధాత

పర్యాయపదాలు

అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.

1. విద్యా గోష్ఠి జరగాలి.
జవాబు:
సభ, పరిషత్తు

2. చాతుర్యంతో మాట్లాడాలి.
జవాబు:
చమత్కారం, చతురత,

3. నాకు హాస్య చతురత అబ్బింది.
జవాబు:
అలవడింది, వచ్చింది.

4. బెల్లము తియ్యగా ఉంటుంది.
జవాబు:
గుడము, అమృత రసాజము

5. పెద్దల ఆశీర్వచనం భక్తితో స్వీకరించాలి.
జవాబు:
ఆశీర్వాదం, దీవెన

6. నీరు నిర్మలంగా ఉండాలి.
జవాబు:
అకలంకం, స్వచ్ఛం

7. వృద్ధులు ఎక్కువగా గొణుగు తారు.
జవాబు:
నసుగు, సణుగు

8. మా చెరువు పావంచాలు పాకుడు కట్టాయి.
జవాబు:
మెట్లు, సోపానాలు

9. చెఱకు గెడ తియ్యగా ఉంటుంది.
జవాబు:
ఇక్షువు, రసాలము

10. ఎంత మంచికూరైనా ఉప్పు లేకపోతే బాగోదు.
జవాబు:
లవణము, రుచి

11. గానుగలో నువ్వులు ఆడతారు.
జవాబు:
గాని, గాన్లు

12. పిల్లలకు బంతి ఆట అంటే ఇష్టం.
జవాబు:
చెండు, కందుకం

13. పూర్వం కుండతో వండుకొనేవారు.
జవాబు:
శరీరం, భాండము

14. ఎవరి కర్తవ్యం వారు నెరవేర్చాలి.
జవాబు:
పని, కార్యము

15. అర్జునుడు పాండవ మధ్యముడు.
జవాబు:
విజయుడు, కిరీటి

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.

1. వ్యవసాయ క్షేత్రం వంటలకుపయోగిస్తుంది.
అ) భూమి, పుడమి
ఆ) చేను, పొలము
ఇ) కాన, కాననం
ఈ) సేద్యం, కృషి
జవాబు:
అ) భూమి, పుడమి

2. వృత్తిని దైవంగా భావించాలి.
అ) జీవం, జీవనం
ఆ) జీవిక, బ్రతుకు
ఇ) జీవనోపాధి, జీవిక
ఈ) జీతం, డబ్బు
జవాబు:
ఇ) జీవనోపాధి, జీవిక

3. దాహం వేస్తే నీరు త్రాగడమే మంచిది.
అ) ఆకలి, క్షుత్తు
ఆ) నిద్ర, మైకం
ఇ) అలసట, బడలిక
ఈ) దప్పి, దప్పిక
జవాబు:
ఈ) దప్పి, దప్పిక

4. ఫోనులో మెల్లిగా మాట్లాడాలి.
అ) పిచ్చిగా, అరుస్తూ
ఆ) నెమ్మదిగా, మెల్లగా
ఇ) మెల్లగా, అరచి
ఈ) ఆపి, ఆపి ఆపి
జవాబు:
ఆ) నెమ్మదిగా, మెల్లగా

5. మనిషికి జంతువుకు వ్యత్యాసం ఉందికదా!
అ) తేడా, భేదం
ఆ) పోలిక, సమన్వయం
ఇ) జాలి, దయ
ఈ) వలె, పోలె
జవాబు:
అ) తేడా, భేదం

6. పిల్లలను బుజ్జగింపు చేయాలి.
అ) లాలన, తిండి
ఆ) గోరుముద్ర, ముద్దు
ఇ) లాలింపు, ఊరడింపు
ఈ) ఓదార్పు, చేరింపు
జవాబు:
లాలింపు, ఊరడింపు

7. పిల్లలు గృహ కృత్యము కూడా చేయాలి.
అ) పని, కార్యము
ఆ) తుడవడం, చిమ్మడం
ఇ) వంట. పెంట
ఈ) పని, గని
జవాబు:
అ) పని, కార్యము

8. సంసార సాగరం గురించి పిల్లలకేం తెలుస్తుంది.
అ) నది, స్రవంతి
ఆ) సుడి, గుండం
ఇ) కడలి, సముద్రం
ఈ) ఖర్చు, డబ్బు
జవాబు:
ఇ) కడలి, సముద్రం

9. ఒకరిపై ఒకరికి విశ్వాసం ఉండాలి.
అ) ఓర్పు, సహనం
ఆ) సమ్మకం, నమ్మిక
ఇ) గౌరవం, ఆదరం
ఈ) మర్యాద, మన్నన
జవాబు:
ఆ) నమ్మకం, నమ్మిక

10. మంచి ప్రవృత్తి అలవరచుకోవాలి.
అ) స్వభావం, స్వ
ఆ) లక్షణం, స్వభావం
ఇ) లక్ష్యం లక్షణం
ఈ) పని, క్రియ
జవాబు:
ఆ) లక్షణం, స్వభావం

11. మంచిని అవలంబించు
అ) ఆచరించు, చేయు
ఆ) ఆచారం, సంప్రదాయం
ఇ) పూజించు, అర్పించు
ఈ) సమ్మించు, చేయు
జవాబు:
అ) ఆచరించు, చేయు

12. నేను బెంగళూరు నివాసి కాదు.
అ) వాసన, వాసము
ఆ) వాస్తవ్యం, వాసవుడు
ఇ) మకాం, మక్కె
ఈ) వాస్తవ్పుడు, వాసి
జవాబు:
ఈ) వాస్తవ్పుడు, వాసి

13. కోపం అనర్థదాయకం
అ) కినుక, క్రోధం
ఆ) కునుకు, కనకం
ఇ) పసి, అలక
ఈ) కాపరం, తాపం
జవాబు:
అ) కినుక, క్రోధం

14. ఆట ఆరోగ్యమిస్తుంది.
అ) క్రీడ, కీడు
ఆ) నీడ, నీడజం
ఇ) క్రీడ, కేళి
ఈ) ఆడు, పాడు
జవాబు:
ఇ) క్రీడ, కేళి

ప్రకృతి – వికృతులు

గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.

1. పెద్దలను చూసి ఆసనము నుండి లేవాలి.
జవాబు:
ఆసాను

2. ఉదయము ఆహ్లాదంగా ఉంటుంది.
జవాబు:
ఒదవు

3. పిల్లలు బాగుపడాలనేదే తల్లితండ్రుల కాంక్ష.
జవాబు:
కచ్చు

4. చేపట్టిన ప్రతి కార్యము సఫలముకాదు.
జవాబు:
కర్ణము

5. యయాతి చరిత్ర అచ్చతెలుగు కావ్యము.
జవాబు:
కల్పము

6. చెయ్యిజారి కుండ పగిలింది.
జవాబు:
కంఠ

7. నేను రోజూ కుటీకి వెడతాను.
జవాబు:
గుడి

8. భారతదేశము ఆసియా ఖండములో ఉంది.
జవాబు:
కండ

9. మా నాన్నగారు గర్జించుచున్నారు.
జవాబు:
గద్దించు

10. నేను జ్యోతిష్యము చెప్పించుకున్నాను.
జవాబు:
జోస్యము

11. మా అక్క పెళ్ళికి తాంబూలములు పుచ్చుకున్నారు.
జవాబు:
తమ్మలము

12. నన్ను మా పెద్దమ్మగారు దత్తత పుచ్చుకున్నారు.
జవాబు:
దత్తు

13. ఇంటికి దీపం ఇల్లాలు.
జవాబు:
దివ్వె

14. మంత్రము లోపల జపించాలి.
జవాబు:
మంతరము

15. మర్మము ఎవరికీ చెప్పకూడదు.
జవాబు:
మారాము

16. వేకువనే నిద్రలేవాలి.
జవాబు:
నిదుర

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

ఆ) గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

1. నిముసము కూడా తెలివైన వాడు వృధా చేయడు.
అ) నిమ్మసము
ఆ) నిమ్మషము
ఇ) నిమ్ముసము
ఈ) నిముషము
జవాబు:
ఈ) నిముషము

2. తొందరగా నిదానము చేయలేము.
అ) నిధానము
ఆ) నిధనము
ఇ) నిర్ధారణము
ఈ) నిర్ధర
జవాబు:
ఇ) నిర్ధారణము

3. మనసు నిచ్చలముగా ఉండాలి.
అ) నిశ్చయము
ఆ) నిర్మలము
ఇ) నిశ్చలము
ఈ) నీరసము
జవాబు:
ఆ) నిర్మలము

4. తొందరగా నిచ్చయము చేయాలి.
అ) నిశ్చయము
ఆ) నిచయము
ఇ) నీచయము
ఈ) నీచము
జవాబు:
అ) నిశ్చయము

5. నీరు కలుషితము చేయవద్దు.
అ) జలము
ఆ) సలిలము
ఇ) ఉదకము
ఈ) నీరము
జవాబు:
ఈ) నీరము

6. పంతులు గౌరవించదగినవాడు.
అ) విద్వాంసుడు
ఆ) పండితుడు
ఇ) బ్రాహ్మణుడు
ఈ పూజారి
జవాబు:
ఆ) పండితుడు

7. పాతిక రూపాయలకు నీటి సీసా రాదు.
అ) పాదిక
ఆ) పొదవు
ఇ) పొదలు
ఈ) పదము
జవాబు:
ఆ) పాదిక

8. ప్రశ్న జవాబు ఒకే పొరటలో ఉండాలి.
అ) పేజీ
ఆ) కాగితము
ఇ) పుట
ఈ) పుటము
జవాబు:
ఇ) పుట

9. పరిస్థితులు ఎప్పుడూ అనుగవముగా ఉండవు.
అ) అణకువ
ఆ) అడకువ
ఇ) ఆసక్తి
ఈ) అనుకూలము
జవాబు:
ఈ) అనుకూలము

10. ఆయన అనుభవము అపారి.
అ) అపారము
ఆ) అధికము
ఇ) అనల్పము
ఈ) అత్యధికము
జవాబు:
అ) అపారము

11. అల్బెసము చేస్తేనే చదువు వస్తుంది.
అ) అబ్బురము
ఆ) అభ్యాసము
ఇ) అబసము
ఈ) ఉబ్బసము
జవాబు:
ఆ) అభ్యాసము

12. పనిలో ముందు అంజ వేయాలి.
అ) అడుగు
ఆ) మాట
ఇ) అభ్యాసము
ఈ) అంజు
జవాబు:
అ) అడుగు

13. అద్దమరేయి నిద్దురపోవేరా.
అ) అర్ధరాత్రి
ఆ) నిశిరాత్రి
ఇ) చీకటిరాత్రి
ఈ) నల్లనిరాత్రి
జవాబు:
అ) అర్ధరాత్రి

14. చదువుపై అసడ్డ పనికిరాదు.
అ) అసింట
ఆ) అసుంట
ఇ) శుంఠతనం
ఈ) అశ్రద్ధ
జవాబు:
ఈ) అశ్రద్ధ

15. పనిని అరబము చేసి మానకూడదు.
అ) ఆబ్దికము
ఆ) ఆరంభము
ఇ) ప్రారంభము
ఈ) మొదలు
జవాబు:
ఆ) ఆరంభము

నానార్థాలు

అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.

1. మంచి ఫలం అందుకోవాలి.
జవాబు:
పండు, ప్రయోజనం

2. మంచికళ చూశాను.
జవాబు:
అందం, విద్య

3. పూనిక విడవకూడదు.
జవాబు:
ప్రయత్నం, ధారణ

4. అడుగుకు అన్నీ ఆటంకాలే.
జవాబు:
క్రిందిభాగం, పాదం

5. సంగతి మరచిపోకూడదు.
జవాబు:
చేరిక, విషయము

6. వేదం మన ఆస్తి.
జవాబు:
తొలిచదువు, జ్ఞానం

7. మంత్రం లోపలే ఉండాలి.
జవాబు:
వేదభాగం, రహస్యం

8. అర్ధము శోధించాలి.
జవాబు:
భావం, డబ్బు

9. గాలి పోతే ఏమీలేదు.
జవాబు:
ప్రాణము, వాయువు

10. నిజము మరుగున పడకూడదు.
జవాబు:
సత్యము, తనది

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.

1. ఒక అంజ వేయడానికి ఒక అంజ చాలు.
అ) మంచి, మాట
ఆ) అంగ, పాదం
ఇ) మేలు, పని
ఈ) కీడు, చెడు
జవాబు:
ఆ) అంగ, పాదం

2. రహస్యం ఎప్పుడూ రహస్యంగానే ఉండాలి.
అ) గోప్యం, ఏకాంతం
ఆ) గుట్టు, మట్టు
ఇ) గుట్టు, మంచి
ఈ) మంచి, గుట్టు
జవాబు:
అ) గోప్యం, ఏకాంతం

3. ఏదైనా శోధించు మరియు శోధించు.
అ) వెతుకు, వెతుకు
ఆ) పరిశీలించు, పరిశీలించు
ఇ) పరిశీలించు, వెతుకు
ఈ) కను, విను
జవాబు:
ఇ) పరిశీలించు, వెతుకు

4. నిర్ధారణ ఎప్పుడూ నిర్ధారణగా చేయాలి.
అ) నిజం, సమర్థం
ఆ) నిజం, ధైర్యం
ఇ) సత్యం, ముందు
ఈ) నిర్ణయం, నిదానం
జవాబు:
ఈ) నిర్ణయం, నిదానం

5. దీక్ష చేశాక దీక్ష తప్పదు.
అ) ప్రతిజ్ఞ, త్యాగం
ఆ) ప్రయత్నం, ఫలం
ఇ) మంచి, ఫలితం
ఈ) ప్రతిజ్ఞ, ఫలం
జవాబు:
ఈ) ప్రతిజ్ఞ, ఫలం

6. మంత్రం ఎప్పుడూ మంత్రంగానే ఉండాలి.
అ) వయసు, రహస్యం
ఆ) డబ్బు, రహస్యం
ఇ) వేదభాగం, రహస్యం
ఈ) సంపాదన, మంచి
జవాబు:
ఇ) వేదభాగం, రహస్యం

7. సందర్భం చూచి సందర్భం తీసుకొని మాట్లాడాలి.
అ) సమయం, ధనం
ఆ) సమయం, అవకాశం
ఇ) డబ్బు, టిక్కెట్
ఈ) సమయం, కోరిక
జవాబు:
ఆ) సమయం, అవకాశం

వ్యుత్పత్త్యర్థాలు

అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం రాయండి.

1. వీథి శుభ్రంగా ఉంచుకోవాలి.
జవాబు:
దీనిలో వెళ్లుదురు.

2. అసభ్యంగా ప్రవర్తించకూడదు.
జవాబు:
సభకు యోగ్యం కానిది.

ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్వర్ణాన్ని గుర్తించండి.

1. విధి మన జన్మ కారకుడు.
అ) పుట్టించేడు
ఇ) మరణింపచేశాడు
ఆ) పాలించాడు
ఈ) ప్రపంచాన్ని రూపొందించినవాడు
జవాబు:
ఈ) ప్రపంచాన్ని రూపొందించినవాడు.

2. రహస్యం చెప్పకూడదు.
అ) ఏకాంత స్థలమందు పుట్టునది.
ఆ) అందరికీ తెలియనిది.
ఇ) కొందరికే తెలిసినది.
ఈ) ఎప్పుడో తెలిసేది.
జవాబు:
అ) ఏకాంత స్థలమందు పుట్టునది.

జాతీయాన్ని గుర్తించడం

ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

1. వారి దృష్టిలో అది కాలక్షేపం కోసం లోకాభిరామాయణం వినేయడం, కానీ నా దృష్టిలో అది రసమహితమైన సాహిత్య గోష్ఠి
జవాబు:
ఈ వాక్యంలో ‘లోకాభిరామాయణం’ అనే జాతీయం ఉంది.

2. మా గురువుగారు సీతారామ శాస్త్రిగారు తమ శిష్యు లందరిలో మొదట నాకే అగ్రతాంబూలం ఇచ్చారు.
జవాబు:
ఈ వాక్యంలో ‘అగ్రతాంబూలం’ అనే జాతీయం ఉంది.

జాతీయము సందర్భము

ఈ జాతీయాన్ని ఏ అర్థంలో/సందర్భంలో ఉపయో గిస్తారో రాయండి.

1. వేళాపాళా :
జవాబు:
సమయం సందర్భం లేదా అని తెలిపే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

2. నిండుకుండ :
జవాబు:
తొణకని, బెలుకని వారిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

సంధి పదాలను విడదీయడం

గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.

1. మా చేనుకు సంవత్సరానికింత అనిశిస్తు ఇస్తున్నారు.
జవాబు:
సంవత్సరానికి + ఇంత

2. ఇదియిలా జరగాలని ఉంది.
జవాబు:
ఇది + ఇలా

3. నిన్న పొరుగూరు వెళ్లాను.
జవాబు:
పొరుగు + ఊరు

4. కార్యసాధకుడు నిద్రాహారాలు పట్టించుకోదు.
జవాబు:
నిద్ర + ఆహారాలు

5. నేను మొట్టమొదటి సారి విమానం ఎక్కాను.
జవాబు:
మొదటి + మొదటి

6. హనుమ లంకకు ఆకాశమార్గాన వెళ్ళాడు.
జవాబు:
మార్గము + న

7. నేను ఉన్నట్లు అందరూ అనుకున్నారు.
జవాబు:
ఉన్న + అట్లు

8. పిల్లల క్షేమం తల్లిదండ్రులు కోరతారు.
జవాబు:
తల్లి + తండ్రి

9. ఎందుకో ఒక్కొక్క రోజు నీరసంగా ఉంటోంది.
జవాబు:
ఒక్క + ఒక్క

10. పద్మాలు సూర్యోదయం కోసం ఎదురుచూస్తాయి.
జవాబు:
సూర్య + ఉదయం

11. సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ చీకటి ఉండదు.
జవాబు:
ఏ + కడ

12. మా మామిడికాయలు చేతికందే ఎత్తులో ఉంటాయి.
జవాబు:
చేతికి + అందే

13. సరియైన మాట మాట్లాడాలి.
జవాబు:
సరి + ఐన

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

14. గురువుగారిని చూసి శిష్యులందరూ నమస్కరించారు.
జవాబు:
శిష్యులు + అందరూ

15. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి.
జవాబు:
విద్య + అర్థులు

సంధి పదాలను కలవడం

సంధి పదాలను కలిపి రాయండి.

1. వచ్చింది + ఆవిడ
జవాబు:
వచ్చిందావిద

2. ఒక + ఇల్లాలు
జవాబు:
ఒకయిల్లాలు

3. ఐదు + ఏళ్ళు
జవాబు:
ఐదేళ్ళు

4. సూర్య + అస్తమయం
జవాబు:
సూర్యాస్తమయం

5. వికారము + లు
జవాబు:
వికారాలు

6. పెద్ద + అన్న
జవాబు:
పెద్దన్న

7. అప్పుడు + అప్పుడు
జవాబు:
అప్పుడప్పుడు

8. ఛల + ఉక్తులు
జవాబు:
ఛలోక్తులు

9. ఆ + కడ
జవాబు:
అక్కడ

10. వెంక + అయ్య
జవాబు:
వెంకయ్య

11. సంవత్సరము + ఆ
జవాబు:
సంవత్సరాల

12. సహస్ర + అంశము
జవాబు:
సహ్యసాంశము

13. వసువులు + అమ్మ
జవాబు:
వసువులమ్మ

14. అరవై + ఏళ్ళు
జవాబు:
అరవై యేళ్ళు.

సంధి నామాలు

గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.

1. సంచినా చేతికందించి వెళ్లిపోయేడు.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
ఆ) ఇత్వసంధి

2. స్పష్టమైన అవగాహనతో మాట్లాడాలి.
అ) అత్వసంధి
ఆ) ఉత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) వృద్ధి సంధి
జవాబు:
ఆ) ఉత్వసంధి

3. దేవాలయంలో పూజలు జరుగుతాయి.
అ) వృద్ధిసంధి
ఆ) యణాదేశ సంధి
ఇ) త్రిక సంధి
ఈ) సవర్ణదీర్ఘసంధి
జవాబు:
ఈ) సవర్ణదీర్ఘసంది

4. వ్యాసునికి ఒకయిల్లాలు కూడా భిక్ష పెట్టలేదు.
అ) యడాగమం
ఆ) సరళాదేశ సంధి
ఇ) గసడదవాదేశ సంధి
ఈ) వృద్ధిసంధి
జవాబు:
అ) యడాగమం

5. వారాలు నెలలు గడిచినా పని పూర్తి కాలేదు.
అ) అత్వసంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) యడాగమం
ఈ) లు, ల, న,ల సంధి
జవాబు:
ఈ) లు,ల,న,ల సంధి

6. ఒక్కొక్క ఊరికి ప్రత్యేక చరిత్ర ఉంటుంది.
అ) త్రికసంధి
ఆ) ఆమ్రేడితసంధి
ఇ) గుణసంధి
ఈ) వృద్ధిసంధి
జవాబు:
ఆ) ఆమ్రేడితసంధి

7. గరికపాటివారి ఛలోక్తులు బాగుంటాయి.
అ) త్రికసంధి
ఆ) గుణసంధి
ఇ) యణాదేశ సంధి
ఈ) లు,ల,న,ల సంధి
జవాబు:
ఆ) గుణసంధి

8. దైవం అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉంటాడు.
అ) త్రికసంధి
ఆ) ఆమ్రేడితసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) సరళాదేశ సంధి
జవాబు:
అ) త్రికసంధి

9. తల్లిదండ్రులు పిల్లల క్షేమం కోరతారు.
అ) అమ్రేడిత సంధి
ఆ) త్రికసంధి
ఇ) గసడదవాదేశసంధి
ఈ) యణాదేశసంధి
జవాబు:
ఇ) గసడదవాదేశసంధి

10. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలు
అ) సవర్ణదీర్ఘసంధి
ఆ) వృద్ధిసంధి
ఇ) గుణసంధి
ఈ) త్రికసంధి
జవాబు:
అ) సవర్ణదీర్ఘ సంధి

11. నాకుతెలుగు నేర్పాలని మా మాస్టారి ప్రయత్నం.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
ఆ) ఇత్వసంధి

12. ఇదియిలా ఎందుకు జరిగింది.
అ) అత్వసంధి
ఆ) గుణసంధి
ఇ) యడాగమ సంధి
ఈ) సరళాదేశసంధి
జవాబు:
ఇ) యడాగమ సంధి

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

13. ఐదేళ్ళు నిందాక బడిలో వేశారు.
అ) అత్వసంధి
ఆ) గుణసంధి
ఇ) ఇత్వసంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
ఈ) ఉత్వసంధి

14. నోట్సు ఇచ్చినందుకు నా స్నేహితుడు ఆనందించాడు.
అ) అత్వసంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) సవర్ణదీర్ఘసంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
అ) అత్వసంధి

విగ్రహవాక్యాలు

గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.

1. నిద్రాహారాలు మాని కొందరు సంపాదిస్తారు.
జవాబు:
నిద్రయును, ఆహారమును.

2. అర్థరాత్రి చంటిపిల్ల ఏడ్చింది.
జవాబు:
రాత్రి యొక్క అర్ధము

3. ఎవ్వరూ తమలక్ష్యం మరవకూడదు.
జవాబు:
తమ యొక్క లక్ష్యం

4. జీవితరహస్యాలు చెబితే ప్రమాదం.
జవాబు:
జీవితము నందలి రహస్యాలు

5. మంచినీళ్లచెంబు తాతగారు తెమ్మన్నారు.
జవాబు:
నీళ్లతో చెంబు

6. మాది రామచంద్రపురం తాలుకాలోని గ్రామం.
జవాబు:
రామచంద్రపురం అను పేరు గల తాలూకా

7. మా ఇంట వంటప్రయత్నాలు ప్రారంభించారు.
జవాబు:
వంట కొరకు ప్రయత్నాలు

8. ప్రతివ్యక్తి ఏదో ఒకటి సాధించాలి.
జవాబు:
వ్యక్తి వ్యక్తి

9. విద్యాభ్యాసం నిర్లక్ష్యం చేయకూడదు.
జవాబు:
విద్యను గూర్చి అభ్యాసం

10. మన ముఖ్యవిధి నెరవేర్చాలి.
జవాబు:
ముఖ్యమైన విధి

11. నిద్రమత్తు వదలాలి.
జవాబు:
నిద్ర వలన మత్తు

12. నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేయకు
జవాబు:
చలం లేనిది

13. నేను రెండుదినాలు బడికి రాలేదు.
జవాబు:
రెండు సంఖ్య గల దినాలు

14. సమస్యలు అనేకము వస్తాయి, పోతాయి.
జవాబు:
ఏకము కానిది

15. నిండుకుండ తొణకదు.
జవాబు:
నిండైన కుండ

సమాస నామాలు

గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.

1. ఆంధ్రప్రదేశ్లో పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.
అ) ద్వంద్వ సమాసం
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) నఞ్ తత్పురుష
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
అ) ద్వంద్వ సమాసం

2. మధ్యాహ్నం భోజనం చేయలేదు.
అ) బహువ్రీహి
ఆ) ప్రథమా తత్పురుష
ఇ) సప్తమీ తత్పురుష
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) ప్రథమా తత్పురుష సమాసం

3. తన దృక్పధం మార్చుకొన్నాడు.
అ) ద్వితీయా తత్పురుష
ఆ) పంచమీ తత్పురుష
ఇ) చతుర్థీ తత్పురుష
ఈ) షష్ఠీ తత్పురుష
జవాబు:
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం

4. గృహకృత్యాలుకు సమయం చాలడంలేదు.
అ) నఞ్ తత్పురుష
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఆ) సప్తమీ తత్పురుష సమాసం

5. దేవాలయ గోపురంపై పసిడికుండలు ఉన్నాయి.
అ) తృతీయా తత్పురుష
అ) పంచమీ తత్పురుష
ఇ) ప్రథమా తత్పురుష
ఈ) షష్ఠీ తత్పురుష
జవాబు:
అ) తృతీయా తత్పురుష సమాసం

6. మా చెరకుతోట ఈ రోజే కోయించేము.
అ) ద్విగు సమాసం
ఆ) నఞ్ తత్పురుష సమాసం
ఇ) రూపక సమాసం
ఈ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఈ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

7. మా గుడిలో ధ్వజస్తంభం పొడవైనది.
అ) రూపక సమాసం
ఆ) చతుర్థీ తత్పురుష
ఇ) తృతీయా తత్పురుష
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) చతుర్థీ తత్పురుష సమాసం

8. బురదలో ప్రతిఅడుగు జాగ్రత్తగా వేయాలి.
అ) బహువ్రీహి
ఆ) అవ్యయీభావ సమాసం
ఇ) సప్తమీ తత్పురుష
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
ఆ) అవ్యయీభావ సమాసం

9. వారు న్యాయ పారంగతులు.
అ) ద్వితీయా తత్పురుష
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) నఞ్ తత్పురుష
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
అ) ద్వితీయా తత్పురుష సమాసం

10. మా ఊరిలో పెద్దరైతాంగం ఉంది.
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) చతుర్థీ తత్పురుష
ఇ) సప్తమీ తత్పురుష
ఈ) షష్ఠీ తత్పురుష
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

11. గుడిలో గబ్బిలాలకంపా?
అ) పంచమీ తత్పురుష
ఆ) నఞ్ తత్పురుష సమాసం
ఇ) రూపక సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
అ) పంచమీ తత్పురుష సమాసం

12. మా చెరువు నీరు నిర్మలంగా ఉంటుంది.
అ) నఞ్ తత్పురుష సమాసం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
అ) నఞ్ తత్పురుష సమాసం

13. మా తాతగారికి 60 ఏళ్లు ఉంటాయి.
అ) ద్వితీయా తత్పురుష
ఆ) పంచమీ తత్పురుష
ఇ) ద్విగు సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష
జవాబు:
ఇ) ద్విగు సమాసం

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

14. పనిపై అశ్రద్ధ తగదు.
అ) నఞ్ తత్పురుష
ఆ) చతుర్థీ తత్పురుష
ఇ) సప్తమీ తత్పురుష
ఈ) ద్విగు సమాసం
జవాబు:
అ) నఞ్ తత్పురుష సమాసం

15. మా బొగడచెట్టు పూసింది.
అ) ఉపమాన పూర్వపద కర్మధారయం
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) నఞ్ తత్పురుష
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
అ) ఉపమాన పూర్వపద కర్మధారయం సమాసం

ఆధునిక వచనాలు

ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.

1. రహస్యములు ప్రకటించెదను.
అ) రహస్యమ్ములు ప్రకటించెదను.
ఆ) రహస్యంబులు ప్రకటించెదను.
ఇ) రహస్యముల్ ప్రకటించెదను.
ఈ) రహస్యాలు ప్రకటిస్తాను.
జవాబు:
ఈ) రహస్యాలు ప్రకటిస్తాను.

2. ఏమాత్రము సఫలతయగునో
ఆ) ఏమాత్రం సఫలం అవుతుందో
ఆ) ఏమాత్రంబు సఫలమగునో
ఇ) ఏమాత్రము సఫలంబగునో
ఈ) ఏమాత్రమ్ము సఫలమునగునో
జవాబు:
ఆ) ఏమాత్రం సఫలం అవుతుందో

3. వర్తమానమును సమన్వయించుకొని యుంటిని.
అ) వర్తమానంబును సమన్వయించుకొని యుంటిని.
ఆ) వర్తమానమ్మును సమన్వయించుకొని యుంటిని.
ఇ) వర్తమానం సమన్వయించుకొన్నా
ఈ) వర్తమానమునున్ సమన్వయించుకొని యుంటిని.
జవాబు:
ఇ) వర్తమానం సమన్వయించుకొన్నా

4. ప్రాప్యము కొఱకు ప్రవర్తించెదరు.
అ) ప్రాప్యము కొఱకై ప్రవర్తించెదరు.
ఆ) ప్రాప్యం కోసం ప్రవర్తిస్తారు.
ఇ) ప్రాప్యము కొఱకువైప్రవర్తించెదరు.
ఈ) ప్రాప్యమ్ము కొఱకునై ప్రవర్తించెదరు.
జవాబు:
ఆ) ప్రాప్యం కోసం ప్రవర్తిస్తారు.

5. తన లక్ష్యమును మార్పుచేసుకొనడు.
అ) తన లక్ష్యంబును మార్పు చేసుకొనడు.
ఆ) తన లక్ష్యమ్మును మార్పు చేసుకొనడు.
ఇ) తన లక్ష్యమున్ మార్పు చేసుకొనదు.
ఈ) తన లక్ష్యం మార్చుకోడు.
జవాబు:
ఈ) తన లక్ష్యం మార్చుకోడు.

6. ప్రణాళికను చింపివేయుట చేయడు.
అ) ప్రణాళికను జింపివేయుట చేయడు.
ఆ) ప్రణాళిక చింపేసుకోడు.
ఇ) ప్రణాళికనుఁ జింపివేయుట చేయడు.
ఈ) ప్రణాళికనున్ జింపివేయుట చేయడు.
జవాబు:
ఆ) ప్రణాళిక చింపేసుకోడు.

7. ఉపయోగ పడుచునేయుండును.
అ) ఉపయోగ పడుచునే యుండి యుండును.
ఆ) ఉపయోగ పడుచునేయుండగలవు.
ఇ) ఉపయోగ పడుతూనే ఉంటాయి.
ఈ) ఉపయోగ పడుచునేయుండెడివి.
జవాబు:
ఇ) ఉపయోగ పడుతూనే ఉంటాయి.

8. వాటియందు కొన్నిటిని చూచెదము.
అ) వాటిల్లో కొన్ని చూద్దాం.
ఆ) వాటియందుఁ గొన్నిటిని చూచెదము.
ఇ) వాటియందున్ గొన్నిటిని చూచెదము.
ఈ) వాటియందునన్ గొన్నిటిని చూచెదము.
జవాబు:
అ) వాటిల్లో కొన్ని చూద్దాం.

9. వేదమునభ్యసించితిరి.
అ) వేదము నభ్యసించి యుంటిరి.
ఆ) వేదము నభ్యసించి యునుంటిరి.
ఇ) వేదమును నభ్యసించియు నుంటిరి.
ఈ) వేదం అభ్యసించారు.
జవాబు:
ఈ) వేదం అభ్యసించారు.

10. కావ్య పాఠము కొఱకై పొరుగు గ్రామమునకు వెళ్ళి యుండెను.
అ) కావ్య పాఠం కోసం పొరుగూరుకెళ్ళింది.
ఆ) కావ్య పాఠమును కొఱకునై పొరుగు గ్రామమునకు
ఇ) కావ్య పాఠంబు కొలుకునై పొరుగు గ్రామమునకు వె
ఈ) కావ్య పాఠము కొఱుకునై పొరుగు గ్రామమునకు
జవాబు:
అ) కావ్య పాఠం కోసం పొరుగూరుకెళ్ళింది.

11. ఆటలనినచో నిష్టంబు.
అ) ఆటలనినచో నిష్టమ్ము.
ఆ) ఆటలంటే ఇష్టం.
ఇ) ఆటలనినచో ఇష్టంబు.
ఈ) ఆటలనినచోన్ నిష్టము.
జవాబు:
ఆ) ఆటలంటే ఇష్టం.

12. పైకమును చెల్లించుచునుండిరి.
అ) పైకమును చెల్లించుచునుండిరి.
ఆ) పైకమ్మును చెల్లించుచునుండిరి.
ఇ) పైకంబు చెల్లించుచునుండిరి.
ఈ) పైకం చెల్లిస్తున్నారు.
జవాబు:
ఈ) పైకం చెల్లిస్తున్నారు.

13. వారికి నెంతయో వాత్సల్యము.
అ) వారికెంతో వాత్సల్యం.
ఆ) వారికి నెంతయో వాత్సల్యంబు.
ఇ) వారికి కెంతయో వాత్సల్యము.
ఈ) వారికి నెంతయున్ వాత్సలంబు.
జవాబు:
అ) వారికెంతో వాత్సల్యం.

వ్యతిరేకార్థక వాక్యాలు

ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.

1. వింత అనుభవాలు కలుగుతాయి.
జవాబు:
వింత అనుభవాలు కలుగవు.

2. ఒక్కొక్క వారం కుదురుతుంది.
జవాబు:
ఒక్కొక్క వారం కుదరదు.

3. భోజనం పెడుతుంది.
జవాబు:
భోజనం పెట్టదు.

4. తల్లిలా బుజ్జగిస్తోంది.
జవాబు:
తల్లిలా బుజ్జగించడం లేదు.

5. భోజనానికి వేళయ్యింది.
జవాబు:
భోజనానికి వేళవ్వలేదు.

6. కోరుకున్న భోజనం దొరికింది.
జవాబు:
కోరుకున్న భోజనం దొరకలేదు.

7. పిల్లలు ఇంటి పనులు చేస్తారు.
జవాబు:
పిల్లలు ఇంటి పనులు చేయరు.

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

8. వారాలు దొరికాయి.
జవాబు:
వారాలు దొరకలేదు.

9. ఆయన ఉదయమే లేచారు.
జవాబు:
ఆయన ఉదయమే లేవలేదు.

10. చనీళ్ళ స్నానం చేసారు.
జవాబు:
చనీళ్ళ స్నానం చేయలేదు.

11. ఆయన చెంబు తోముకున్నారు.
జవాబు:
ఆయన చెంబు తోముకోలేదు.

12. బట్టలు ఉతుక్కోవాలి.
జవాబు:
బట్టలు ఉతుక్కోనక్కరలేదు.

13. బట్టలు ఆరేసుకోవాలి.
జవాబు:
బట్టలు ఆరేసుకోనక్కరలేదు.

వ్యతిరేకార్థక క్రియలు

కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.

1. అ) మరచి
ఆ) మరవక
ఇ) మరుస్తూ
ఈ) మరిస్తే
జవాబు:
ఆ) మరవక

2. అ) పలవరించక
ఆ) పలవరించి
ఇ) పలవరిస్తే
ఈ) పలవరిస్తూ
జవాబు:
అ) పలవరించక

3. అ) ఫలిస్తూ
ఆ) ఫలించి
ఇ) ఫలించక
ఈ) ఫలిస్తే
జవాబు:
ఇ) ఫలించక

4. అ) దీవించి
ఆ) దీవిస్తే
ఇ) దీవిస్తూ
ఈ) దీవించక
జవాబు:
ఈ) దీవించక

5. అ) అనిపించక
ఆ) అనిపించి
ఇ) అనిపిస్తూ
ఈ) అనిపిస్తే
జవాబు:
అ) అనిపించక

6. అ) బ్రతుకుతూ
ఆ) బ్రతికితే
ఇ) బ్రతుకక
ఈ) బ్రతికి
జవాబు:
ఇ) బ్రతుకక

7. అ) నమిలి
ఆ) నమలక
ఇ) నమిలితే
ఈ) నములుతూ
జవాబు:
ఆ) నమలక

8. అ) నరికి
ఆ) నరుకుతూ
ఇ) నరికితే
ఈ) నరకక
జవాబు:
ఈ) నరకక

9. అ) పిండి
ఆ) పిండక
ఇ) పిండుతూ
ఈ) పిండితే
జవాబు:
ఆ) పిండక

10. అ) రుబ్బక
ఇ) రుబ్బుతూ
ఆ) రుబ్బి
ఈ) రుబ్బితే
జవాబు:
అ) రుబ్బక

11. అ) ఆర్పి
ఆ) ఆర్పుక
ఇ) అర్పుతూ
ఈ) ఆర్పితే
జవాబు:
ఆ) ఆర్పుక

12. అ) దున్నుతూ
ఆ) దున్నితే
ఇ) దున్నక
ఈ) దున్ని
జవాబు:
ఇ) దున్నక

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

13. అ) చల్లి
ఆ) చల్లక
ఇ) చల్లుతూ
ఈ) చల్లితే
జవాబు:
ఆ) చల్లక

సంశ్లిష్ట వాక్యాలు

ఇవి ఏ రకమైన సంశ్లిష్టవాక్యాల్లో రాయండి.

1. శాస్త్రిగారు సూర్యోదయానికి ముందే లేచి దినచర్యను ప్రారంభించేవారు.
జవాబు:
క్త్వార్థకం

2. ఇతర గ్రంథాలలోని అంశాలను సమన్వయం చేస్తూ ఛలోక్తులు విసిరేవారు.
జవాబు:
శత్రర్థకం

3. సమాజంలో మన ప్రవర్తనను బట్టే మనకు గౌరవం లభిస్తుంది.
జవాబు:
చేదర్థకం

4. ప్రతి విద్యార్థి దీక్షాపరులై ఉంటేనే తమ లక్ష్యాన్ని చేరుకోగలరు.
జవాబు:
చేదర్థకం

5. చంద్రుడు వచ్చి వెన్నెలను కురిపించాడు.
జవాబు:
క్త్వార్థకం

6. విద్యార్థులు వారాలు చేసుకుంటూ చదువుకుంటున్నారు.
జవాబు:
శత్రర్థకం

7. స్టండిలశయ్య విడిచి తమ తమ కార్యక్రమాలు చేసు కోవాలి.
జవాబు:
క్త్వార్థకం

8. మొద్దులా నిదురపోతే భవిష్యత్తులో నిద్ర ఉండదు.
జవాబు:
చేదర్థకం

9. శాస్త్రిగారు స్నేహితులతో కలసి కాలువలో ఈత కాల్చేవారు.
జవాబు:
క్త్వార్థకం

10. ఒక పెద్దావిడ కథల పుస్తకం అందిస్తూ శ్రద్ధగా చదవమని చెప్పింది.
జవాబు:
శత్రర్థకం

కర్మణి వాక్యాలు

సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

1. నా జీవిత రహస్యాలు నేనే ప్రకటించాను.
అ) నా చేత జీవిత రహస్యాలు ప్రకటించబడినవి.
ఆ) నా జీవిత రహస్యాలు నా చేతనే ప్రకటించబడినవి.
ఇ) నా జీవితం చేత రహస్యాలు ప్రకటించబడును.
ఈ) నా జీవిత రహస్యాలు నా చేతనే ప్రకటించబడతాయి.
జవాబు:
ఈ) నా జీవిత రహస్యాలు నా చేతనే ప్రకటించబడతాయి.

2. నా పూనిక నా జీవితం సఫలం చేసింది.
అ) నా పూనిక చేత నా జీవితం సఫలం చేయబడింది.
ఆ) నా జీవితం చేత నా పూనిక సఫలం చేయబడింది.
ఇ) నా చేత పూనిక, జీవితం సఫలం చేయబడ్డాయి.
ఈ) నా జీవితం పూనిక చేత సఫలం చేయబడుతోంది.
జవాబు:
అ) నా పూనిక చేత నా జీవితం సఫలం చేయబడింది.

3. మా నాన్నగారు జ్యోతిషం ఆపోశన పట్టారు.
అ) మా నాన్నగారు జ్యోతిషం చేత ఆపోశన పట్టబడ్డారు.
ఆ) మా నాన్నగారి ఆపోశన జ్యోతిషం చేత పట్టబడింది.
ఇ) ఆపోశన మా నాన్నాగారి చేత జ్యోతిషం పట్టబడింది.
ఈ) మా నాన్నగారి చేత జ్యోతిషం ఆపోశన పట్టబడింది.
జవాబు:
అ) మా నాన్నగారి చేత జ్యోతిషం ఆపోశన పట్టబడింది.

4. అతను తన లక్ష్యం మార్చుకోదు.
అ) తన లక్ష్యం చేత అతను మార్చుకోబడడు.
ఆ) అతని చేత లక్ష్యం మార్చుకోబడును.
ఇ) అతని చేత తన లక్ష్యం మార్చుకోబడదు.
ఈ) తన లక్ష్యం అతని చేత మార్చుకోబడింది.
జవాబు:
ఆ) అతని చేత తన లక్ష్యం మార్చుకోబడదు.

5. ఆయనను గురువుగారు ప్రేమగా చూచారు.
అ) గురువు గారి చేత ఆయన ప్రేమగా చూడబడ్డాడు.
ఆ) ఆయన చేత గురువు గారు ప్రేమగా చూడబడ్డారు.
ఇ) గురువు, ఆయన ప్రేమగా ఉండేవారు.
ఈ) గురువు గారి చేత ఆయన ప్రేమగా చూడబడతారు.
జవాబు:
అ) గురువు గారి చేత ఆయన ప్రేమగా చూడబడ్డాడు.

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

6. వారాలు ఆయనకు ఇంగిత జ్ఞానం కలిగించాయి.
అ) వారాలు ఆయన చేత ఇంగిత జ్ఞానం కలిగించాయి.
ఆ) వారాల చేత ఆయనకు ఇంగిత జ్ఞానం కలిగించబడింది.
ఇ) ఆయన చేత వారాలకు ఇంగిత జ్ఞానం కలిగించబడింది.
ఈ) ఆయనకు ఇంగిత జ్ఞానం చేత వారాలు కలిగించబడ్డాయి.
జవాబు:
ఆ) వారాల చేత ఆయనకు ఇంగిత జ్ఞానం కలిగించబడింది.

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.

1. ఆయన వేదం, జ్యోతిష్యం నేర్చుకొన్నారు.
జవాబు:
సంయుక్త వాక్యం

2. ఆయన పొరుగూరు వెళ్లి చదువుకొన్నారు.
జవాబు:
సంశ్లిష్ట వాక్యం.

3. ఆయన ఎక్కడైనా ఉండగలడు
జవాబు:
సామర్థ్యార్ధక వాశ్యం

4. ఆయన వల్లిస్తే ఏదైనా వస్తుంది.
జవాబు:
చేదర్థక వాక్యం

5. మీరిక వేదపఠనం ప్రారంభించవచ్చు.
జవాబు:
అనుమత్యర్థకం

6. వేదపఠనానికి ఆటంకం కల్గించవద్దు.
జవాబు:
నిషేధార్థకం

7. ఇది చదువా?
జవాబు:
ప్రశ్నార్థకం

8. అతనికి చదువు వచ్చునో! రాదో!
జవాబు:
సందేహాం

9. నేను కచ్చితంగా మంత్రం చెబుతాను.
జవాబు:
నిశ్చయార్థకం

10. దయచేసి వేదపండితులను గౌరవించండి.
జవాబు:
ప్రార్థనార్థకం

11. కావ్యపాఠం అందరూ చెప్పుకోండి.
జవాబు:
విధ్యర్థకం

12. కావ్యం చెప్పినా వినేవారు లేరు.
జవాబు:
అప్యర్థకం

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.

1. ఆయన జ్యోతిష్యం నేర్చుకొని ఖ్యాతి సంపాదించారు.
అ) సంయుక్తం
ఆ) సంశ్లిష్టం
ఇ) ప్రార్థనార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఆ) సంశ్లిష్టం

2. శ్రీపాదవారు కథలు, నవలలు వ్రాశారు.
అ) సంయుక్తం
ఆ) అప్యర్థకం
ఇ) విధ్యర్థకం
ఈ) హేత్వర్ధకం
జవాబు:
అ) సంయుక్తం

3. శ్రీపాదవారు పాఠకులను మెప్పించగలరు.
అ) అప్యర్థకం
ఇ) సంక్లిష్టం
ఆ) విధ్యార్ధకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
ఈ) సామర్థ్యార్థకం

4. పాతకావ్యాలను పఠించండి.
అ) అప్యర్థకం
ఆ) సంశ్లిష్టం
ఇ) విధ్యర్థం
ఈ) ప్రార్థనార్థకం
జవాబు:
ఇ) విధ్యర్థకం

5. కావ్యాలిస్తే చదువుతారు.
అ) చేదర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) విధ్యర్థం
ఈ) అనుమత్యర్థకం
జవాబు:
అ) చేదర్థకం

6. పాతకావ్యం ఇచ్చినా చదవలేదు.
అ) విధ్యర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) చేదర్థకం
ఈ) సంయుక్తం
జవాబు:
ఆ) అప్యర్థకం

7. దయచేసి పాతకావ్యాలు లైబ్రెరీలకివ్వండి.
అ) విధ్యర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) ప్రార్థనార్థకం
ఈ) ఆశీరర్థకం
జవాబు:
ఇ) ప్రార్థనార్థకం

8. దీర్ఘాయుష్మాన్ భవ!
అ) ఆశీరర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) విధ్యార్థకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
అ) ఆశీరర్థకం

AP 9th Class Telugu 13th Lesson Important Questions నా చదువు

9. పాతకావ్యాలు అమ్మవద్దు.
అ) ఆశీరర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) సామర్థ్యార్ధకం
జవాబు:
ఇ) నిషేధార్థకం

10. ఇది పుస్తకమా?
అ) నిషేధార్థకం
ఆ) ప్రశ్నార్థకం
ఇ) సందేహార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఆ) ప్రశ్నార్థకం

11. ఆహా! విశ్వనాథవారి కావ్యమెంత బాగుందో!
అ) ప్రశ్నార్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) సందేహార్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఈ) ఆశ్చర్యార్థకం

Leave a Comment