Access to the AP 9th Class Telugu Guide 12th Lesson ఏ దేశమేగినా Questions and Answers are aligned with the curriculum standards.
ఏ దేశమేగినా AP 9th Class Telugu 12th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి :
తెలుగు పాట :

కొండగాలి మాట కోనసీమతోట
కోయిలమ్మ పాట హాయి పాట
దేశి కవిత కాదె తెలుగులో నామాట
దేశ భాషలందు తెనుగు తేట.
కొండగాలులందు కోనేటి అలలందు
పడవ పాటలందు పల్లెలందు
అందు నిందు చెవుల విందుగా విలసిల్లు
తెలుగు కన్న ఇంటి వెలుగు లేదు.
కడప మాటలన్న కడిగిన ముత్యాలు
మాలలల్లె అన్నమయ్య నాడు
చిగురు జూను తెనుగు చిత్తూరి గంధపు
హెయలు వరదరాజు ఒలకబోసె.
దక్షిణాదిలోన త్యాగయ్య పలికెను
తేనెలూరు తేట తెలుగు పాట
ఎడ్ల రామదాసు ఏనాడో చేసెను
అచ్చ తెనుగులోన ఆత్మబోధ.
పుణ్యమూర్తులైన పోతన్న గోపన్న
రామనామ కీర్తనామృతాన
పొంగు లెత్తించిన గంగయే గౌతమి
కృష్ణవేణి జాతి కీర్తి కాంత.
ఆర్య నాగార్జునుండవతరించిన నేల
పాళి శాసనాల పడుగు పేక
బుద్ధభూమిగా ప్రసిద్ధమైనదీ
తెలుగు నేల జాతి వెలుగు నేల
అష్టదిగ్గజాల ఆంధ్రపదఘట్టనా
ముద్ర నోచుకున్న భద్రభూమి
రాయలోరి గొప్ప ఏరాయినడిగినా
రింగు మనసు మనుచరిత్రలాగ
గుర్తు చేసినారు గురజాడ గిడుగులు
నేటి తెలుగు అన్న నోటి తెలుగు
గురుతు చేసుకొనుడు అరుదైన ఈభాష
ఆంధ్రవిష్ణుభాష అమరభాష
వేదమెందుకింక వేమన జాషువ
పద్యమున్న చోట ప్రజలనోట
కలము కదుపుడింక గతమెంతో ఘనకీర్తి
వారసత్వమున్న వాసి తెలిసి.
పేజి 157 లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
జర్మనీలో సంస్కృత పండితులను చూడాలని రచయిత్రి ఎందుకు అనుకున్నారు ?
జవాబు:
జర్మనీ సంస్కృత విద్యాభ్యాసానికి పెట్టింది పేరనే విషయం భారతదేశంలో చాలా వ్యాప్తిలో ఉంది. అందుచేత జర్మనీ దేశంలోని సంస్కృత పండితులను చూడాలని రచయిత్రి అనుకొన్నారు.
![]()
ప్రశ్న 2.
ప్రొఫెసర్ రూబెన్ ప్రత్యేకతలు ఏమిటి ?
జవాబు:
రూబెన్ పండితుడు మహాకవి కాళిదాసు రచనలన్నీ పూర్తిగా చదివారు. ఆయన కావ్యాలపై సాధికారిక విమర్శలు చేశారు. జర్మనీ భాషలో పెద్ద పెద్ద గ్రంథాలెన్నో వ్రాశారు. భారతీయ సాహిత్యంపై ఉన్నత భావం కల వ్యక్తి.
పేజి 158 లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
సమ సమాజ స్థాపన అంటే ఏమిటి ?
జవాబు:
సమ సమాజ స్థాపన అంటే సమాజంలోని వ్యక్తులంతా సమానమనే భావన. అందరికీ అంటే కుల, మత, లింగ, ప్రాంత, భాషాది భేదాలు లేకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు, ఆస్తులు, హెూదాలు కల్పించబడడం.
ప్రశ్న 2.
కాళిదాసు రచనల్లో ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
కాళిదాసు రచనలలోని పాత్రలన్నీ ఉత్కృష్టమైనవి. శకుంతల పాత్రను అత్యంత రమణీయంగా త్యాగమయిగా, సమర్థురాలిగా చిత్రీకరించాడు.
పేజి 159 లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
హిందూ దేశంపై రిచెల్ పండితురాలి అభిప్రాయం ఏమిటి ?
జవాబు:
రిచెల్ పండితురాలు రూబెన్ శిష్యురాలు. ఆమె 15 ఏళ్లు సంస్కృత, పాళీ భాషలను అధ్యయనం చేసింది. ప్రపంచంలోకెల్లా ఉత్తమ చరిత్ర, సంస్కృతి హిందూ దేశంలో ఉన్నాయన్నది, ఆ విషయంలో ఆమె పరిశోధనలు చేసింది. ఆమెకు రామాయణ, భారతాలన్నా, హిందూ దేవతలన్నా చాలా గౌరవం.
![]()
ప్రశ్న 2.
ప్రొఫెసర్ హూబర్ వెల్లడించిన విషయాలేమిటి ?
జవాబు:
బెర్లిన్ యూనివర్శిటీలో ఓరియంటల్ డిపార్టుమెంటులో శ్రీ హూబర్ పండితుడు ప్రొఫెసర్. ఆయనకు జర్మనీ భాష పైనా, సంస్కృత భాష పైనా, భారత రామాయణాల పైనా గౌరవభావం. భక్తి ప్రపత్తులూ ఉన్నాయి. భారత రామాయణాది ప్రధాన గ్రంథాలెన్నో అనేక పాశ్చాత్య భాషలలోకి అనువదింపబడ్డాయని ఆయన చెప్పారు.
పేజి 161 లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
రచయిత్రికి బెల్ట్ ఆఫ్ పోయెట్స్ బెల్టును బహూకరించిన సర్ ఎడ్వర్డ్ దాస్ ఆలోచన ఏమిటి ?
జవాబు:
సర్ ఎడ్వర్డ్ దాస్ రష్యాలోని విల్నూస్ నగర వాస్తవ్యుడు. ఆయన లిథువేనియా మహాకవి. ఆయన లిథువేనియా భాషలో “మాయ్నారామ, మాయినో ఇండిస్కి అనే కావ్యం వ్రాశారు. రచయిత్రి సంస్కృత రచయిత్రి అని తెలుసుకొని, ఆమెకు “బెల్ట్ ఆఫ్ పోయిట్స్” బహూక రించారు. తమ దేశానికి వచ్చిన సంస్కృత రచయిత్రిని ఆ మాత్రమైన సత్కరించలేకపోతే అది తమ దేశానికే తలవంపన్నారు.
ప్రశ్న 2.
మిస్టర్ కాసా పండితుడు తన గ్రంథంలో ప్రస్తావించిన విషయాలేవి ?
జవాబు:
మిస్టర్ కాసా పండితుడు “లుక్కింగ్ టువార్డ్స్ ఇండియా” అనే గ్రంథాన్ని వ్రాశారు. అందులోని మొదటి పేరాలో తత్త్వశాస్త్రం, సమ్యగ్విజ్ఞానం, ఆధ్యాత్మిక చింతన, భగవద్విశ్వాసం మొదలైన గొప్ప విషయాల చేత తక్కిన ప్రపంచమంతా భారతీయత వైపు ఎలా ఆకర్షితులైనదీ వ్రాశారు. భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వ శ్రేయ స్కరమైనదీ వివరించి చెప్పారు. భగవద్గీతకు 6, 7 వ్యాఖ్యానాలు వారి భాషలో వెలువడినట్లు చెప్పారు. భారతీయ యోగాసన వివరాలకు అక్కడ విలువ ఎక్కువ.
ఇవి చేయండి :
అవగాహన – ప్రతిస్పందన :
అ) పాఠ్యభాగం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
రచయిత్రి విదేశీ పర్యటనలో ఏయే ప్రాంతాలు సందర్శించింది ?
జవాబు:
రచయిత్రి విదేశీ పర్యటనలో చాలా ప్రాంతాలు సందర్శించారు. అవి జర్మనీలోని బెర్లిన్, హాల్ నగరం, చెకొస్లోవేకియా,
రష్యాలోని విల్నూస్, మాంట్రియల్ మొదలైనవి.
![]()
ప్రశ్న 2.
డాక్టర్ క్లారాకు భారతీయ సాహిత్యంపై అపార గౌరవం ఉన్నదని ఎలా చెప్పగలవు ?
జవాబు:
డాక్టర్ క్లారా గారు బుడాపెస్టు యూనివర్శిటీలో ఓరియంటల్ డిపార్ట్ మెంట్లో పనిచేసేవారు. ఆయన మన భారతీయ వేద పురాణ ఇతిహాసాలపై పరిశోధనలు చేశారు. ఆయనకు భారతీయ సాహిత్యంపై భగవద్గీతపై గౌరవాదరాలు ఎక్కువ. ఆయన తండ్రిగారికి భారతీయ తత్త్వశాస్త్రంపై గౌరవం ఎక్కువ. ఆయన తన భార్య పేరును ‘రత్న’ అని మార్చుకొన్నారు. డా॥ క్లారా కూడా, తన భార్య పేరును ‘పద్మ’ అని మార్చారు. కుమార్తె పేరు ‘అమృత’ అని పెట్టారు.
ప్రశ్న 3.
జర్మనీ భాషలోకి ఏఏ భాషల నుండి అనువాదాలు జరిగాయి ?
జవాబు:
జర్మనీ భాషలోకి సంస్కృతం నుండి అనువాదాలు జరిగాయి. అంతేకాక బెంగాలీ, హిందీ, తమిళ భాషలలోని అనేక గ్రంథాలు జర్మనీ భాషలోకి అనువదించబడ్డాయి.
![]()
ప్రశ్న 4.
రూబెన్ పండితుడు భారతీయ స్త్రీలను గురించి ఏమని చెప్పాడు ?
జవాబు:
శకుంతలను శాంతి, ధర్మాలను ప్రసాదించే ఒక మహాదేశం పెంపొంది విరాజిల్లడానికి తగిన విధంగా తన కుమారుని వీరునిగా తయారుచేసిన వీరమాత అని అన్నారు. సీత, ద్రౌపది వంటి స్త్రీలందరూ స్వీయత్యాగంతో లోకహితాన్ని కాంక్షించిన మహిళామణులని కీర్తించారు.
ఆ) కింది వచనం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
తెలుగులో తొలి మహిళా యాత్రాచరిత్ర.
తెలుగులో తొలి యాత్రా రచయిత్రి శ్రీమతి పోతం జానకమ్మ. అంతకు ముందు నుండే పురుషులు రాసిన యాత్రా రచనలు ఉన్నా, ఒక మహిళ రచించిన తొలి యాత్రారచన గ్రంథం ఇదే.
1873-74 నాటి ఇండియన్ ఫైనాన్స్ కమీషన్కు మహజర్లు సమర్పించుకోడానికి భారతదేశం నుండి కొందరు వ్యాపారులు లండన్ వెళుతుండగా, జానకమ్మ, రాఘవయ్య దంపతులు కూడా పశ్చిమ సముద్రం మీదుగా స్టీమర్లో ఇంగ్లండ్ వెళ్ళారు.
“నేను నా పర్యటనలో ఎన్నెన్నో అద్భుతాలను చూశాను. అక్కడి రాజమార్గాల సౌందర్యం, నౌకాయానం, నౌకా పరిశ్రమ, వస్తూత్పత్తి, సంగీతశాస్త్రం సాధించిన పరిపూర్ణత, ఆయుధాగారాలు, స్త్రీ విద్య, ప్రజల్లో సమైక్యభావం, దైవభక్తి, ప్రభుత్వం తన ప్రజల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించడం ఇంకా అనేక విషయాలను గమనించాను. ఆ దేశంలో ఎక్కడచూసినా పచ్చిక బయళ్ళు, ఫలపుష్పభరితమైన వృక్షాలు మనల్ని ఆకర్షిస్తాయి. రుతుపవనాలు వీస్తాయి గాని అవి ఆరోగ్యకరమైనవి. కూరలు, పళ్ళు అన్నీ రుచిగా, నీళ్ళు తియ్యగా వుంటాయి. మనదేశంలో లభించేవన్నీ అక్కడా లభిస్తాయి” అని ఆమె రాసారు.
అక్కడి కుటుంబ జీవితాలు బాగున్నాయనే విషయాన్ని ఆమె గుర్తించారు. స్త్రీలకు అన్ని చోట్లా సమాన అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. దీనికి ఉదాహరణగా సౌతాంప్టన్ రైల్వే స్టేషన్లో ఉద్యోగులంతా స్త్రీలేనని చెప్పి విస్తుపోతారామె. గృహ సేవకులుగా అన్ని చోట్లా స్త్రీలే పనిచేస్తున్నట్లు వివరించారు.
ఇంగ్లండ్ నుండి ఫ్రాన్స్కు వెళ్ళడం, అక్కడి వింతలు విశేషాలు, సందర్శించగల ప్రాంతాల గురించి వివరిస్తూ అక్కడి ప్రజలు మొరటుగా, కొంత అనాగరికంగా ప్రవర్తిస్తారని రాసారు. పారిస్ అందమైన నగరం. ఆరోగ్యకరంగా, ఆహ్లాదంగా ఉంటుందనీ, ఖర్చులు కూడా ఇంగ్లండ్ కన్నా తక్కువేననీ పేర్కొన్నారు. పర్యాటకులకు ఫ్రెంచ్ భాష వస్తేనే పారిస్ సౌఖ్యాలను అనుభవించగలుగుతారు. లేకపోతే చాలా కష్టం అంటూ సూచించారు. అక్కడి నుండి తిరిగి ఇంగ్లండ్ చేరుకుని, ఇంటికి తిరుగుముఖం పట్టడంతో ఈ యాత్రా చరిత్ర ముగుస్తుంది.
జానకమ్మ తెలుగులో రాసుకున్న తన యాత్రానుభవాన్ని “పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్” పేరుతో తనే ఆంగ్లంలోకి అనువదించి 1876లో ప్రచురించారు. 146 సంవత్సరాల తర్వాత కాళిదాసు పురుషోత్తం ఈ గ్రంథాన్ని తెలుగులోనికి అనువాదం చేశారు.
ప్రశ్నలు- జవాబులు :
ప్రశ్న 1.
జానకమ్మ తన విదేశీ యాత్రరచన పుస్తకానికి పెట్టిన పేరేమిటి ?
జవాబు:
జానకమ్మ తన విదేశీ యాత్రరచన పుస్తకానికి ‘పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్’ అని పేరు పెట్టారు.
ప్రశ్న 2.
‘జిజ్ఞాస’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక.
![]()
ప్రశ్న 3.
ఇంగ్లాండ్లో కుటుంబ జీవితాలపై రచయిత్రి ఆలోచన ఏమిటి ?
జవాబు:
ఇంగ్లాండులో కుటుంబ జీవితాలు బాగున్నాయని రచయిత్రి ఉద్దేశం.
ప్రశ్న 4.
సౌతాంప్టన్ రైల్వే స్టేషన్లో రచయిత్రి గమనించిన ప్రత్యేక అంశం ఏది ?
జవాబు:
సౌతాంప్టన్ రైల్వే స్టేషన్లో ఉద్యోగులంతా స్త్రీలేననే విషయం రచయిత్రి గమనించి, ఆశ్చర్యపడ్డారు.
ప్రశ్న 5.
ఈ కథనం నుంచి ఆలోచింప చేసే ఓ ప్రశ్నను రాయండి.
జవాబు:
రచయిత్రి ఏ భాషలో యాత్రారచన వ్రాశారు ?
ఇ) కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1923లో కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. ఆహ్వాన సంఘం వారు ఒక బాలికను ప్రధాన ద్వారం వద్ద వాలంటీరుగా నియమించారు. ‘స్వరాజ్య నిధి’ కి రెండణాలు చెల్లించి, ఆ టిక్కెట్టు చూపిన వారినే లోనికి పంపటాన్ని ఆమె విధిగా నిర్దేశించారు.
ఇంతలో అందంగా, ఠీవిగా ఉన్న ఒక వ్యక్తి నేరుగా లోపలికి వెళ్ళబోతుంటే, ఆ చిన్నారి ఆ పెద్దమనిషిని ఆపింది. “టిక్కెట్టు ఏది ?” అని ప్రశ్నించి, టిక్కెట్టు లేనిదే లోనికి వెళ్ళడానికి వీలుకాదని తేల్చి చెప్పింది. అప్పటికామె వయస్సు కేవలం 14 సంవత్సరాలే.
తాను టిక్కెట్టు కొనలేదని చెప్తూ “నా పేరు జవహర్లాల్” అని అతడు చెప్పాడు. “మీరు ఏ లాల్ అయినా సరే ! టిక్కెట్టుకు రెండణాలు చెల్లించి కానీ, లోపలకు వెళ్ళడం కుదరదు” అని తెగేసి చెబుతుంటే, నెహ్రూ ఏమీ అనలేక చిరునవ్వుతో చూస్తూ, నిలబడి పోయారు. ఇంతలో ఆహ్వాన సంఘాధ్యక్షులు ‘దేశభక్త’ కొండ వెంకటప్పయ్య అక్కడికి వచ్చి, నెహ్రూను లోపలికి పంపించారు. తర్వాత నెహ్రూ వంటి పెద్దమనిషిని ఆపినందుకు వాలంటీరుగా ఉన్న అమ్మాయిని మందలించారు. దానికి ఆమె “మీరే కదా ! టిక్కెట్టు లేకుండా ఎంతటి వారినైనా లోనికి పంపవద్దన్నారు. ఇప్పుడు మీ మాటను మీరే ఉల్లంఘిస్తే ఎలా ?” అని నిలదీసేసరికి ఆయన మారు మాట్లాడలేకపోయారు. ఆమె ధైర్యాన్ని పని పట్ల చూపుతున్న బాధ్యతను చూసి నెహ్రూ ఆమె భుజం తట్టి అభినందించారు.
తన రాజీలేని కర్తవ్య నిర్వహణతో నెహ్రూనే నిరోధించిన ఆ బాలిక ఎవరో కాదు, ఆంధ్ర జాతీయోద్యమ నాయకులలో చిరస్మరణీయురాలు, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలైన శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్,
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి ?
అ) విజయవాడ
ఆ) బాపట్ల
ఇ) కాకినాడ
ఈ) చీరాల
జవాబు:
ఇ) కాకినాడ
ప్రశ్న 2.
తెగేసి చెప్పడం అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
తెగేసి చెప్పడం అంటే మొహమాటం లేకుండా కచ్చితంగా చెప్పడం అని అర్థం.
![]()
ప్రశ్న 3.
దుర్గాబాయిని ప్రధాన ద్వారం వద్ద ఎందుకు నిలబెట్టారు ?
జవాబు:
స్వరాజ్య నిధికి రెండణాలు చెల్లించి టిక్కెట్టు కొనాలి, ఆ టిక్కెట్టు చూపించిన వారినే లోపలికి పంపమని దుర్గాబాయిని ప్రధాన ద్వారం వద్ద నిలబెట్టారు.
ప్రశ్న 4.
నిన్ను ఎవరైనా పెద్దలు భుజం తట్టి మెచ్చుకున్న ఏవైనా రెండు సందర్భాలు రాయండి.
జవాబు:
నాకు తరగతి ఫస్ట్ మార్కు వచ్చినపుడు మా మాస్టారు అభినందించి భుజం తట్టారు. ఒక ముసలామెను చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించినపుడు ఒక పెద్దాయన భుజం తట్టి అభినందించారు. .
ప్రశ్న 5.
ఈ పేరాకు తగిన శీర్షికను రాయండి.
జవాబు:
నిజాయితీ.
ఈ) మీ ఉపాధ్యాయుని సహాయంతో కింది యాత్రా రచన – వాటి గ్రంథకర్తను జతపరచండి.

జవాబు:

వ్యక్తీకరణ :
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
లిథువేనియా కవి సర్ ఎడ్వర్డ్ దాస్ రచయిత్రికి అందించిన గౌరవం ఏమిటి ?
జవాబు:
సర్ ఎడ్వర్డ్ దాస్ రష్యాలోని విల్నూస్ నగర వాస్తవ్యుడు. ఆయన లిథువేనియా మహాకవి. ఆయన లిథువేనియా భాషలో “మాయ్నారామ, మాయినో ఇండిస్కి” అనే కావ్యం వ్రాశారు. రచయిత్రి సంస్కృత రచయిత్రి అని తెలుసుకొని, ఆమెకు “బెల్ట్ ఆఫ్ పోయిట్స్” బహూకరించారు. తమ దేశానికి వచ్చిన సంస్కృత రచయిత్రిని ఆ మాత్రమైన సత్కరించలేకపోతే అది తమ దేశానికే తలవంపన్నారు.
![]()
ప్రశ్న 2.
కాళిదాసు సాహిత్యాన్ని గూర్చి రూబెన్ పండితుడు ఏమన్నారు ?
జవాబు:
కాళిదాసు రచనలన్నింటినీ శ్రీ రూబెన్ పూర్తిగా అధ్యయనం చేశాడు. ఆ మహాకవి కావ్యాలపై సాధికారికమైన విమర్శ చేశాడు. జర్మనీ భాషలో అనేక గ్రంథాలు వ్రాశాడు. కాళిదాసు సృష్టించిన పాత్రలన్నీ ఉత్కృష్టమైనవని ఆయన అన్నాడు. శకుంతల పాత్ర అంటే ఆయనకు చాలా ఇష్టం. దుష్యంతుని ఆమె వివాహమాడింది. దుష్యంతుడు సంతానవతియైన ఆమెను తిరస్కరించాడు. ఆ అవినయాన్ని ధనమదాంధతను ఆమె సహించలేదు. రాజును గడ్డిపోచలా తిరస్కరించింది. తన కుమారుడైన భరతుని వీరునిగా తీర్చిదిద్దింది. ఆ మహారాజు పశ్చాత్తాప్తుడై తిరిగి తీసుకు వెళ్లేలా చేసింది. కాళిదాసు సృష్టించిన ప్రతి పాత్రా శకుంతల వలే ధీరోదాత్తమైనదే అని రూబెన్ అన్నాడు.
ప్రశ్న 3.
ప్రొఫెసర్ మోడే పండితుని చూచి రచయిత్రి ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటి ?
జవాబు:
వారు హాల్ నగరంలో నివసిస్తున్న ప్రొఫెసర్ మోడే గారిని చూశారు. ఆయన పండితుడు. విశ్వ సాహిత్య వేత్త. విశేషించి భారతీయ తత్త్వ శాస్త్రాభిమాని. వారి ఇల్లు ఒక గ్రంథాలయం, ఆ గ్రంథాలయంలో అన్నీ భారతీయ గ్రంథాలే, భారతీయ శిల్ప, చిత్ర, నాట్య, సంగీత సాహిత్యాది వివిధ కళలపై ఎన్నో గ్రంథాలు వారి దగ్గరున్నాయి. వేదవేదాంగాలు, మన శాస్త్ర పురాణేతిహాసాలు, బౌద్ధ వాఙ్మయం లెక్కలేనన్ని పుస్తకాలు ఆయన గ్రంథాలయంలో ఉన్నాయి. రవీంద్రుని వ్రాత ప్రతులు, మాక్స్ ముల్లర్ వ్రాత ప్రతులను ఆయన భద్రపరచుకొన్నారు. భారతదేశంలోని వివిధ దేశ భాషా సాహిత్యాలు, వాటి తీరు తెన్నులు ఆయనకు బాగా తెలుసు. మన తెలుగు సాహిత్యం గురించి కూడా చాలా ఆంగ్ల వ్యాసాలు ఆయన సేకరించాడు. ఆయన తన పేరును ‘మోద’గా మార్చుకొన్నారు. తన నగరాన్ని ‘శాల’ అని పిలుస్తున్నారు. ఆయన పరిచయం ఒక మహాభాగ్యంగా రచయిత్రి భావించారు. ఇవన్నీ గమనించిన రచయిత్రి ఆయన భాషా సాహిత్యాభిలాషకు చాలా ఆశ్చర్యపోయారు.
ఆ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
మీరు వెళ్ళిన ప్రదేశం విశేషాలను వివరిస్తూ యాత్రా రచన ప్రక్రియలో రాయండి.
జవాబు:
నేను తిరుమల యాత్రకు మా కుటుంబ సభ్యులతో కలిసి × × × × × న వెళ్లాను. మేము మా సమీప పట్టణానికి కారులో వెళ్లి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కాము. నేను, మా తమ్ముడు, మా అమ్మా, నాన్న, మా పిన్ని, బాబాయి వాళ్ల ఇద్దరు పిల్లలూ కలిసి మొత్తం ఎనిమిది మందిమి వెళ్లాము. రాత్రి తినడానికి మా అమ్మ పులిహోర, పెరుగు తెచ్చింది. మా పిన్ని జంతికలు, చెగోడీలు చేసింది. మేము పిల్లలం నలుగురు రాత్రి పొద్దుపోయే వరకూ చాలా ఎంజాయ్ చేశాము.
పొద్దున్న తిరుపతిలో దిగాము. ఎంతమంది భక్తులో, కిటకిటలాడిపోతుంది. మా చేతులు పట్టుకొని జాగ్రత్తగా పిల్లలందర్నీ హెచ్చరిస్తూ బస్సెక్కించారు. కొండపైకి వెళ్లాం. రూమ్లో లగేజి పడేశాం. మగవాళ్లందరం తలనీలాలిచ్చాం. ఆడవాళ్లు మూడు కత్తెర్లు జుట్టు ఇచ్చారు. స్నానాలు చేశాం, కొత్త బట్టలు కట్టుకొన్నాం. దర్శనానికి వెళ్లాం. అక్కడ కూడా చాలామంది జనం ఉన్నారు. క్యూలోంచి చూస్తే ఆ ఉద్యానవనాలు, బంగారు గోపురం ఎంత బాగున్నాయో !
వేంకటేశ్వర స్వామిని దర్శించాం. ఎందుకో కానీ నాకు చాలా ఆనందం కల్గింది.. ఆ స్వామిని చూస్తే ఏదో పెద్ద. దిక్కులా కన్పించాడు. ఒళ్లంతా పులకరించింది. విచిత్రం ఏంటంటే మా వాళ్లంతా అలాగే అన్నారు.
రెండురోజులు పాపనాశనం, అలివేలు మంగాపురం, చంద్రగిరికోట అవన్నీ చూసి బెంగుళూరు మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్లాం.
![]()
ప్రశ్న 2.
విదేశాల్లో భారతీయ సాహిత్య మూలాలు చూసిన రచయిత్రి మనోభావాలను సొంత మాటల్లో రాయండి.
జవాబు:
విదేశాలలో భారతీయ సాహిత్య మూలాలను చూసిన రచయిత్రి ఉప్పొంగి పోయారు. బెర్లిన్లో భారత ప్రభుత్వ రజతోత్సవాలను చూసి చాలా ఆనందించారు. రూబెన్ పండితుడు మహాకవి కాళిదాసు రచనల గురించి చెప్పిన మాటలకు చాలా ఆనందించారు. ఆయన చేసిన శకుంతల పాత్ర విశ్లేషణ, సీత, ద్రౌపది వంటి వారి గురించి చెప్పిన వ్యాఖ్యానం ఆమెకు చాలా ఆనందం కల్గించింది. ఆయన భారతీయ సాహిత్యానికి చేస్తున్న సేవను గమనించి రచయిత్రి మనసు పులకించింది.
రిచెల్ పండితురాలు భారతదేశ చరిత్ర, సంస్కృతిపై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకొని రచయిత్రి పరవశించింది. హూబర్ పండితుడు సంస్కృత భాషపై గౌరవాన్ని వ్యక్తీకరించిన తీరుకు ఆమె సంతోషించింది. మన భారత, రామాయణాలపై వారికున్న గౌరవం ఆమెకు ఆశ్చర్యం కల్గించింది. ఆయన మన గ్రంథాలను పాశ్చాత్యభాషలలోకి అనువదించారని తెలుసుకొని ఆనందించింది.
ప్రొఫెసర్ మోడేగారిని సందర్శించి మరింత ఆశ్చర్యపోయింది. ఆయన గొప్ప విశ్వ సాహిత్యవేత్త. భారతీయ తత్త్వ శాస్త్రాభిమాని. ఆయన గ్రంథాలయం నిండా భారతీయ గ్రంథాలే చూసి ఆశ్చర్యపోయింది. రవీంద్రనాథ్, మాక్స్ ముల్లర్ వ్రాత ప్రతులు చూసి మరింత ఆశ్చర్యపోయింది. తెలుగువారికి కూడా తెలియని సాహిత్య పత్రికలాయన దగ్గర చూశారు.
డా॥ క్లారా అయితే భారతీయ వేదపురాణ ఇతిహాసాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఆయనకు భారతీయ సాహిత్యం, భగవద్గీతపై గల గౌరవాదరాలు అపారం. ఆయన తండ్రికి కూడా భారతీయ తత్త్వశాస్త్రమంటే అపార గౌరవం ఉండడాన్ని రచయిత్రి గమనించాడు. వారు తమ పేర్లు కూడా భారతీయత ఉట్టిపడేలా మార్చుకొన్నారని తెలుసుకొని మరింతగా ఆశ్చర్యపడ్డారు. ఎక్కడకు వెళ్లినా ముఖ్యంగా భారత, భాగవత, రామాయణ, భగవద్గీతల అనువాద గ్రంథాలు కోకొల్లలుగా ఉండడం గమనించి ఆశ్చర్యపోయారు.
కాసా పండితుని ‘లుక్కింగ్ టు వార్డ్స్ ఇండియా’ చదివి ఆశ్చర్యపోయారు. అందులో మొదటి పేరాలోనే తత్త్వశాస్త్రం, సమ్యగ్విజ్ఞానం, అధ్యాత్మిక చింతన, భగవద్విశ్వాసం మొదలైన గొప్ప విషయాల చేత మిగతా ప్రపంచమంతా ఎలా ఆకర్షితమైనదీ, భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వ శ్రేయస్కరమైనదీ వివరించారు. అది చదివి రచయిత్రి మైమరచిపోయారు. భగవద్గీతకు 6, 7 వ్యాఖ్యానాలు, యోగాసన గ్రంథాలకు వారిచ్చే ప్రాముఖ్యత గమనించి ఆనందించారు.
ఎడ్వర్డీస్ లుథెయేనియా భాషలో రచించిన ‘మాయ్నారామ్, మాయినో ఇండిష్కి’ కావ్యాన్ని పరిశీలించారు.
ఆనందించారు.
ప్రశ్న 3.
విదేశీ యాత్రా రచనల వల్ల మనకు కలిగే ప్రయోజనాలను తెలుపుతూ మిత్రునికి లేఖ రూపంలో రాయండి.
జవాబు:
మిత్రునికి లేఖ
అనంతపురం,
X X X X X.
ప్రియమైన రాకేష్,
నీ మిత్రుడు తరుణ్ వ్రాయు లేఖ.
మేమిక్కడ క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను. ఏ దేశమేగినా… పాఠం మాకు ఈ రోజే చెప్పారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారి విదేశీ పర్యటన విశేషాలు ఈ పాఠంలో చెప్పారు. నిజంగా ఈ పాఠం చదవడం వలన చాలా ప్రయోజనాలు కలిగాయి.
విదేశాలలో మన భారతీయతకు గల గౌరవాదరాలు తెలిశాయి. ఆమె తన యాత్ర విశేషాలు గ్రంథస్తం చేయకపోతే మనకివేవీ తెలిసేవి కావు. వారెవరూ ఇప్పుడు జీవించి ఉండే అవకాశం తక్కువ. అయినా అప్పటి పరిస్థితులిపుడుండవు ఉన్నా మనం వెళ్లలేం. తెలుసుకోలేం. ఇటువంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే యాత్రా రచనలు వ్రాయాలి. యాత్రా రచనల వలన ఎన్నో అమూల్య విషయాలు తెలుస్తాయి. అవి మన వంటి పిల్లలకు చాలా అవసరం. ప్రభుత్వం కూడా యాత్రా రచనలను ప్రోత్సహించాలి. ఉత్తమ యాత్రా రచనలకు అవార్డులు ప్రకటించి, ప్రోత్సహించాలి.
నేను యాత్రా రచనలను సేకరించాలి అనుకొంటున్నాను. నీ దగ్గర కానీ, మన ఫ్రెండ్స్ దగ్గర కానీ యాత్రా రచనలుంటే చెప్పు. మా నాన్నగారితో వచ్చి, డబ్బిచ్చి కొనుక్కొంటాను.
ఉంటాను మరి. బై……
ఇట్లు,
న స్బేహితుడు,
పి. తరుణ్.
చిరునామా :
కె. రాకేష్, నెం. 8.
9వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ధర్మవరం, విజయనగరం జిల్లా.
![]()
భాషాంశాలు :
పదజాలం :
అ) కింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాన్ని గుర్తించి రాయండి.
(కలవరం, పతివ్రత, కలయిక, ఎక్కిన, గొప్పగా, నమస్కారాలు)
1. పెద్దలు ఎదురైనప్పుడు జోతలు అర్పించాలి.
జవాబు:
జోతలు = నమస్కారాలు
2. మంచి మిత్రులతో సమాగమం మనకు మేలు చేస్తుంది.
జవాబు:
సమాగమం = కలయిక
3. సీత మహా సాధ్వి కావడం వల్ల ఆమె ఆదర్శనీయురాలైనది.
జవాబు:
సాధ్వీ = పతివ్రత
4. బయటకు వెళ్లిన పిల్లలు వేళకు చేరుకోక తల్లి మనసు కలగుండ్లు పడింది.
జవాబు:
కలగుండు.
కలవరం
5. చదువుకుంటే జీవితం ఉత్కృష్టంగా మారుతుందని పెద్దలు అంటారు.
జవాబు:
ఉత్కృష్టంగా = గొప్పగా
![]()
6. బచేంద్రీపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ.
జవాబు:
అధిరోహించిన = ఎక్కిన
ఆ) క్రింది వాక్యాల్లో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు గుర్తించి రాయండి.
1. ఒకప్పుడు జాబు ప్రధాన సమాచార వారధి. బంధుమిత్రుల మధ్య ఉత్తరాలు రాసుకోవడం పరిపాటి. లేఖలు ఎప్పటికీ ఆత్మీయ రేఖలు.
జాబు, ఉత్తరం, లేఖ
2. పరీక్షల తేదీలు ప్రకటిస్తూ అధికారులు ఆదేశం ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుని ఆజ్ఞను పాటించాలని ఉపాధ్యాయులు మాకు చెప్పారు. వారి అనుజ్ఞను అనుసరించి మంచి మార్కుల కోసం సాధన చేసాము.
జవాబు:
ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ
3. చదివిన అంశాలను జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఎక్కువ సార్లు చదివితే స్మృతిలో ఉంటాయి. అవసరమైనప్పుడు జ్ఞాపకం వస్తాయి.
జవాబు:
జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం
ఇ) ప్రకృతి – వికృతులను జతపరచండి.

జవాబు:
1. దీపము – (ఈ)
2. మాణిక్యం – (ఉ)
3. యత్నం – (ఆ)
4. యాత్ర – (అ)
5. నితము – (ఇ)
వ్యాకరణాంశాలు :
సంధులు :
అనునాసిక సంధి:
వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అని దిగువ తరగతుల్లో నేర్చుకున్నారు కదా ! వర్ణమాలలోని ‘క’ వర్గంలో పంచమాక్షరం ”. కింది పట్టికను గమనించండి.
కింది పదాల సంధి, విసంధి రూపాలను గమనించండి.

1. వాఙ్మయం = వాక్ + మయం
2. రాణ్మణి = రాట్ + మణి
3. జగన్నాటకం = జగత్ + నాటకం
పై మూడు ఉదాహరణల్లో పూర్వపదం చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలైన క, ట, త లు ఉన్నాయి.
పరపదంలో మొదట న, మ అనునాసికాలు ఉన్నాయి. వీటికి సంధి జరిగినపుడు
క్ + మ = జ్మ (క బదులుగా జ ఆదేశంగా వచ్చింది)
ట్ + మ = ణ్మ (ట బదులుగా ణ ఆదేశంగా వచ్చింది)
త్ + న = న్నా (త బదులుగా న ఆదేశంగా వచ్చింది)
వర్గ ప్రథమాక్షరాలైన క, చ, ట, త, ప లకు ‘న’ గాని ‘మ’ గానీ పరమైతే అదే వర్గ అనునాసికాలు ఙ, ఞ, ణ, న, మ లు ఆదేశంగా వస్తాయి. దీనిని అనునాసిక సంధి అంటారు.
అ) కింది పదాలను విడదీసి సంధి సూత్రంతో సరిచూడండి.
1. మరున్నందనుడు = మరుత్ + నందనుడు
2. జగన్నాథుడు = జగత్ + నాథుడు
3. రాణ్మహేంద్రవరం = రాట్ + మహేంద్రవరం
![]()
ఆ) కింది విసంధి రూపాలను కలిపి పదాలను రాయండి.
1. వాక్ + మహిమ = వాఙ్మహిమ
2. షట్ + ముఖుడు = షణ్ముఖుడు
3. సత్ + నుతి = సన్నుతి
4. చిత్ + మయం = చిన్మయం
సమాసాలు :
అ) క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసాన్ని గుర్తించండి.
1. బెర్లిన్ నగరం = బెర్లిన్ అను పేరు గల నగరం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
2. శాస్త్రాభిమాని = శాస్త్రము నందు అభిమానం కలవాడు – బహువ్రీహి సమాసం
3. పురాణ ఇతిహాసాలు = పురాణమును, ఇతిహాసమును – ద్వంద్వ సమాసం
4. యాత్రానుభవం = యాత్రను గూర్చి అనుభవం – ద్వితీయా తత్పురుష సమాసం
కింది వాక్యాలలోని అలంకారం గుర్తించి సమన్వయం చేయండి.
1. సంసారసాగరం ఈదడం గొప్ప వారికీ కష్ట సాధ్యం.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది.
లక్షణం : ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే అది రూపకాలంకారం.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో సంసారం (ఉపమేయం), సాగరం (ఉపమానం) నకు అభేదం చెప్పారు కనుక ఇచ్చినది రూపకాలంకారం.
2. అన్ని ధనములలో కెల్ల విద్యాధనము ప్రధానమైనది.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది.
లక్షణం : ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే అది రూపకాలంకారం.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో ఉపమేయమైన విద్యకు, ఉపమానమైన ధనమునకు అభేదం చెప్పారు. కనుక ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది.
![]()
3. వారు విజేతపై కుసుమాక్షతలు చల్లిరి.
జవాబు:
ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది.
లక్షణం: ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే అది రూపకాలంకారం.
సమన్వయం : ఇచ్చిన వాక్యంలో ఉపమేయమైన కుసుమాలకు, ఉపమానమైన అక్షతలకు అభేదం చెప్పారు కనుక ఇచ్చిన వాక్యంలో రూపకాలంకారం ఉంది.
వాక్యాలు – రకాలు
కర్తరి, కర్మణి వాక్యాలు :
‘కర్త’ ప్రధానంగా రాసే వాక్యాలను ‘కర్తరి’ వాక్యాలనీ, ‘కర్మ’ ప్రధానంగా రాసే వాక్యాలను ‘కర్మణి’ వాక్యాలనీ అంటారని తెలుసు కదా !
ఆ) కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
1. రవి జామకాయను తిన్నాడు.
జవాబు:
జామకాయ రవి చేత తినబడినది.
2. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది.
జవాబు:
ప్రాజెక్టు పని భావన చేత పూర్తి చేయబడింది.
3. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు.
జవాబు:
కబడ్డీ జట్టు హర్షిత్ చేత గెలిపించబడింది.
ఆ) కింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి రాయండి.
1. ‘చెట్టు కవిత’ ఇస్మాయిల్చే రాయబడింది.
జవాబు:
ఇస్మాయిల్ ‘చెట్టు కవితను వ్రాశాడు.
2. గాంధీజీగారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది.
జవాబు:
గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహమును నడిపారు.
![]()
3. చికాగోలో స్వామి వివేకానందగారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి.
జవాబు:
స్వామి వివేకానందగారు చికాగోలో గొప్ప ఉపన్యాసాలను ఇచ్చారు.
ప్రాజెక్టు పని :
నీవు వెళ్ళిన యాత్రాస్థలం గురించి, అక్కడ నీ అనుభవాలను వర్ణిస్తూ వ్యాసం రాయండి. తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
నేను తిరుమల యాత్రకు మా కుటుంబ సభ్యులతో కలిసి × × × × × న వెళ్లాను. మేము మా సమీప పట్టణానికి మా X X X కారులో వెళ్లి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కాము. నేను, మా తమ్ముడు, మా అమ్మా, నాన్న, మా పిన్ని, బాబాయి వాళ్ల ఇద్దరు పిల్లలూ కలిసి మొత్తం ఎనిమిదిమందిమి వెళ్లాము. రాత్రి తినడానికి మా అమ్మ పులిహోర, పెరుగు తెచ్చింది. మా పిన్ని జంతికలు, చెగోడీలు చేసింది. మేము పిల్లలం నలుగురు రాత్రి పొద్దుపోయే వరకూ చాలా ఎంజాయ్ చేశాము.
పొద్దున్న తిరుపతిలో దిగాము. ఎంతమంది భక్తులో కిటకిటలాడిపోతుంది. మా చేతులు పట్టుకొని జాగ్రత్తగా పిల్లలందర్నీ హెచ్చరిస్తూ బస్సెక్కించారు. కొండపైకి వెళ్లాం. రూమ్ లో లగేజి పడేశాం. మగవాళ్లందరం తలనీలాలిచ్చాం. ఆడవాళ్లు మూడు కత్తెర్లు జుట్టు ఇచ్చారు. స్నానాలు చేశాం, కొత్త బట్టలు కట్టుకొన్నాం. దర్శనానికి వెళ్లాం. అక్కడ కూడా చాలామంది జనం ఉన్నారు. క్యూలోంచి చూస్తే ఆ ఉద్యానవనాలు, బంగారు గోపురం ఎంత బాగున్నాయో !
వేంకటేశ్వర స్వామిని దర్శించాం. ఎందుకో కానీ నాకు చాలా ఆనందం కల్గింది. ఆ స్వామిని చూస్తే ఏదో పెద్ద దిక్కులా కన్పించాడు. ఒళ్లంతా పులకరించింది. విచిత్రం ఏంటంటే మా వాళ్లంతా అలాగే అన్నారు.
రెండురోజులు పాపనాశనం, అలివేలు మంగాపురం, చంద్రగిరికోట అవన్నీ చూసి బెంగుళూరు మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్లాం.
పద్య మధురిమ :
మ॥ కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతిం బొందరే ?
వారేరీ ? సిరిమూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపై
బేరైనం గలదే ? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు ? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !
శ్రీ మదాంధ్ర భాగవతం – బమ్మెర పోతన
భావం : శుక్రాచార్యా అదే శాశ్వతమని భ్రమల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు వారెక్కడ ? పోయినప్పుడు వారు ఏమీ మూటకట్టుకొని పోలేదు కదా ? కనీసం భూమి మీద వారి పేరైనా లేకుండా పోయారు. శిబి చక్రవర్తి లాంటి వదాన్యులైన రాజులు నేటికీ కీర్తిశేషులై ప్రజల గుండెల్లో ఉన్నారంటే వారి దానగుణం, సత్ప్రవర్తనలే దానికి కారణం.
![]()
రచయిత్రి పరిచయం :

రచయిత్రి : శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
స్వగ్రామం : పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు.
తల్లిదండ్రులు : ప్రముఖ సంఘ సేవకురాలు నాళం సుశీలమ్మ, ప్రముఖ పాత్రికేయులు నాళం కృష్ణారావు దంపతులు.
విద్య : ఉభయ భాషా ప్రవీణ (ఆంధ్రా యూనివర్శిటీ) 1935లో
రచనలు : మన సాహితి మధురభారతి (గేయాలు), ఆంధ్రుల కీర్తన వాఙ్మయసేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయం, అభిజ్ఞాన శాకుంతలం, జాతిపిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మాంచాల, ఆజ్ఞ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర కొన్ని గుణపాఠములు మొదలైన గ్రంథాలు, సరస్వతీ సామ్రాజ్య వైభవం (ఏకాంకిక), సాహితీ రుద్రమ (ఆత్మ చరిత్ర), కాంతి శిఖరాలు (భక్తి గీతాలు), అమృతవల్లి, చీకటిరాజ్యం మొదలైన నవలలు వ్రాశారు.
చదువు : ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయ భాషా ప్రవీణ పట్టాను పొందారు. ప్రస్తుత పాఠ్యాంశం ఆమె రచించిన “నా విదేశీ పర్యటన అనుభవాలు” లోనిది.
ఉద్దేశం :
తెలుగులో పద్యం, కథ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటూ యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్రానుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజెప్పడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం.
![]()
నేపథ్యం :
“ఈనాడు ఉబుసుపోక ఊరకే దేశాలు తిరిగే లోక సంచారులు కాదు కావలసింది. తమ సంచారానికి ఒక సార్థకత కావాలి, అంటే తాము సంపాదించిన అనుభవాలు, చూసిన ప్రదేశాల వివరాలు ప్రజలకు అందించగలగాలి” అని ‘లోకసంచార’ పుస్తకంలో రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు.

శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు భారత్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం, ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను, పర్యటనావకాశం లేని వారికి తెలియజేయాలనే వారి ఉద్దేశం. పర్యటనలకు వెళ్లేవారికి మార్గదర్శకంగా ఉంటాయనే వారి ఆలోచనే దీని నేపథ్యం.
ప్రక్రియ – యాత్రారచన :
యాత్రికుడు తాను పొందిన యాత్రానుభవాలను గ్రంథస్థం చేయడమే ‘యాత్రారచన’ అంటారు. వ్యక్తులు స్వదేశ, విదేశాలలో పర్యటించినపుడు అక్కడి విశేషాలను, అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకం వ్రాయబడినదే యాత్రారచన. సాధారణంగా యాత్రా రచనలు, వాడుక భాషలో, వచనంలో ఉంటాయి. ఈ యాత్రా రచనలు యాత్రికులకు మార్గదర్శకంగా ఉంటాయి.

![]()
పదాలు – అర్థాలు :
- సాంస్కృతికం = నాగరికతకు సంబంధించినది
- పర్యటన = ప్రయాణం
- యాత్రికురాలు = ప్రయాణీకురాలు
- తరుణం = సమయం
- నిశ్చేష్ట + ఆలు = విస్మితురాలు
- కలగుండు = కలత
- ఉత్తరక్షణం = తర్వాతి క్షణం
- ప్రాప్తించడం = కల్గడం
- విస్పష్టము = సువ్యక్తము
- ఆదేశం = ఆజ్ఞ
- సౌదామిని = మెరుపు తీగ
- భాసించి = ప్రకాశించి
- ప్రయోజనకరం = ఉపయోగించేది
- సంస్కృతి = నాగరికత
- చిరకాలం = చాలాకాలం
- అధిరోహించి = ఎక్కి
- విషయం = అంశం
- ప్రప్రథమము = మొట్టమొదట
- విందు = ఆతిథ్యము
- కాంక్ష = కోరిక
- గాఢము = దట్టము
- రజత + ఉత్సవాలు = 25 సంవత్సరాలకు జరిపే కార్యక్రమం
- ఆమూలాగ్రం = పూర్తిగా
- అధ్యయనం = చదువు
- సాధికారికం = అధికారికంగా
- పుట = పేజీ
- తీరము = దరి
- ఋషిసత్తముడు = గాప్ప ఋషి
- ఆజానుబాహువు = వెకాకాళ్ల వరకు చేతులు కలవాడు (ఏాడగరి)
- అతి త్నరగా = చాలా తొందరగా
- ఉత్కృష్తము = ఉన్నతము
- గాంధర్వ విధి = గాంధర్వ పద్ధతి
- ఏకాంతం = ఒంటరితనం
- ప్రేరకుడు = ప్రేరేపించినవాడు
- విరాజిల్లి = ప్రకాశించి
- సాధ్వి = స్త్రీ
- త్యాగం = విడిచిపెట్టడం
- తాతపాదుడు = తండ్రి వంటివాడు
- ఇతఃపూర్వము = ఇంతకుముందు
- మదాంధుడు = గర్వం చేత అంధుడు
- తిరస్కరించు = ధిక్కరించు
- సర్వదమనుడు = అన్ని విధాలా శూరుడు
- పశ్చాత్తప్తుడు = చేసిన తప్పు తెలుసుకొన్నవాడు
- హితము = మేలు
- వాఙ్మయం = సాహిత్యం
- జోతలు = నమస్కారాలు
- తలమానికము = శ్రేష్ఠమైనది
- విలసిల్లు = వెలయు
- అభిప్రాయం = ఉద్దేశం
- ప్రసిద్ధము = ప్రఖ్యాతి
- ప్రపత్తి = శరణాగతి
- అనువాదం = తర్జుమా
- ఆదరం = మన్నవ
- వేదాంగాలు = శాస్త్రాలు
- అత్యుక్తి = ఎక్కువ మాట
- ఆసనం = కుర్చీ
- శక్యం = సాధ్యం
- కొల్లలు = చాలా
- విస్తు = ఆశ్చర్యం
- చింతన = ఆలోచన
- సమ్యక్ = మంచిది