These AP 9th Class Telugu Important Questions 12th Lesson ఏ దేశమేగినా will help students prepare well for the exams.
ఏ దేశమేగినా AP Board 9th Class Telugu 12th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
ఈ క్రింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. రష్యాలోని విల్నూస్ నగర వాస్తవ్యులైన సర్ ఎడ్వర్డ్ దాస్ అనే లిథువేనియా మహాకవిని సందర్శించడానికి మేము వెళ్ళాము. ఆయన మన ‘జవహర్లాల్ అవార్డు’ గ్రహీత. ఆయన లిథువేనియా భాషలో మాయ్ నో రామ, ‘మాయినో ఇండిష్కి’ అనే కావ్యాన్ని వ్రాసిన మహాకవి. నేను సంస్కృత కవయిత్రినని తెలుసుకొని నాకు ‘బెల్ట్ ఆఫ్ పొయిట్స్’ అని వ్యవహరింపబడే ఒక బెల్టును బహూకరించి “మా దేశానికి వచ్చిన సంస్కృత రచయిత్రిని ఈ మాత్రమైనా సత్కరించలేకపోతే అది మా దేశానికే తలవంపు” అని అన్నారు.
ప్రశ్నలు – జవాబులు
అ) పై పేరాలోని మాటలు ఎవరివి?
జవాబు:
పై పేరాలోని మాటలు రచయిత్రివి.
ఆ) ‘బెల్ట్ ఆఫ్ పొయిట్స్’ను ఎవరు ఎవరికి బహూకరించారు?
జవాబు:
‘బెల్ట్ ఆఫ్ పొయిట్స్’ను సర్ ఎడ్వర్డ్ దాస్, రచయిత్రికి బహూకరించారు.
ఇ) ‘మాయ్ నో రామ’, ‘మాయినో ఇండిష్కి’ అనే కావ్యాన్ని వ్రాసిన కవి ఎవరు?
జవాబు:
సర్ ఎడ్వర్డ్ దాస్ అనే లిథువేనియా మహాకవి.
ఈ) పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
సర్ ఎడ్వర్డ్ దాస్ ఏ నగర వాస్తవ్యుడు?
2. కాని ఉత్తర క్షణంలోనే ఒక విస్పష్టమైన భగవదాదేశం స్థిరసౌదామినివలె నాలో భాసించి, విదేశ పర్యటనకు నన్నంగీకరింప జేసింది. ఆ క్షణం ఎంతో పవిత్రమైనదనీ, ఆనాటి ఆ నా నిర్ణయం ప్రయోజన కరమైనదనీ నేను జీవితాంతం భావింపవలసిన శుభతరుణమది. ఎందువల్లనంటే, మనలను సర్వనాశనం చేసిన, ఈ విదేశముల యందలి ఆచారవ్యవహారాలెట్టివో, వారికి మన భారతీయ సంస్కృతిపై గల ఉద్దేశాలెట్టివో తెలుసుకొనవలెననే నా చిరకాలాభిప్రాయానికి ఆనాడు ఒక -పరిష్కార రూపంగా ఆ పర్యటన నాకు పరమేశ్వరుడు ప్రాప్తింప చేసినాడనే తృప్త భావం నాలో ఒక క్షణ కాలం తకు క్కున మెరిసింది. ఆ ఉద్దేశంతోనే నేను ఆ పర్యటనకు అంగీకరించాను.”
ప్రశ్నలు – జవాబులు
అ) భగవంతుని ఆదేశాన్ని దేనితో పోల్చారు?
జవాబు:
భగవంతుని ఆదేశాన్ని స్థిర సౌదామినితో పోల్చారు.
ఆ) మనను నాశనం చేసినదెవరు?
జవాబు:
మనను విదేశీయులు నాశనం చేశారు.
ఇ) ఆమెకు పర్యటించే అవకాశం ఇచ్చినదెవరు?
జవాబు:
ఆమెకు పర్యటించే అవకాశం పరమేశ్వరుడే ఇచ్చాడు.
ఈ) పై పేరాలో ద్వంద్వ సమాస పదమేది?
జవాబు:
పై పేరాలో ‘ఆచార వ్యవహారాలు’ ద్వంద్వ సమాస పదం.
3. అనుకొన్న కార్యక్రమం ప్రకారం 1972 ఆగస్టు 13వ తేదీన భారతకాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ పాలం విమానాశ్రయంలో విమానం అధిరోహించి మాస్కో మీదుగా తూర్పు జర్మనీ రాజధాని నగరమైన బెర్లినుకు, జర్మనీ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు చేరుకొన్నాను. మన దేశ రాయబార కార్యాలయం నుండి శ్రీ దేశికర్, జర్మనీ ప్రభుత్వము నుండి కుమారి బ్విల్ నాకు స్వాగతం చెప్పడానికి బెర్లిన్ విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుండి నన్ను 37 అంతస్తుల హెూటలుకు తీసుకొని వెళ్ళారు. ఆ హెూటల్లో 24వ అంతస్తులో 7వ నెంబరు రూము నాకు ఇచ్చారు. మర్నాటి ఉదయం జర్మనీ ప్రభుత్వం వారి విద్యాశాఖయందలి విదేశాంగశాఖాధికారి మిస్టర్ మట్యోవ్, వారి పర్సనల్ అసిస్టెంటు మీసెస్ ఆర్నాయిట్ నన్ను చూడడానికి వచ్చి నేను చూడగోరే ప్రదేశాలేవో తెలుసుకున్నారు.
ప్రశ్నలు – జవాబులు
అ) ఆమె ఎన్నో అంతస్తులో నివసించారు?
జవాబు:
ఆమె 24వ అంతస్తులో నివసించారు.
ఆ) ఖ్విల్టి ఏ దేశం?
జవాబు:
ఖ్విల్ ది జర్మనీ దేశం.
ఇ) తూర్పు జర్మనీ రాజధాని ఏది?
జవాబు:
తూర్పు జర్మనీ రాజధాని బెర్లిన్.
ఈ) ఆమె విమానం ఎక్కడ ఎక్కారు?
జవాబు:
ఆమె ఢిల్లీ పాలం విమానాశ్రయంలో విమానమెక్కారు.
4. శ్రీ రూబెన్ పండితుడు మహాకవి కాళిదాసు రచనలన్నింటిని ఆమూలాగ్రంగా అధ్యయనంచేసి, ఆ మహాకవి కావ్యాలపై సాధికారికమైన విమర్శనలను చేసి, జర్మనీ భాషలో వేలపుటలుగల మహా గ్రంథాలను రచించిన మహామనీషి ! ‘బెర్లిను మహానగరంలో ఒకమూల ‘స్ప్రే’ నదీ తీరప్రాంతంలో ఉన్న రవీంద్రనాథ్ టాగోర్ వీధిలో 25వ నెంబరు ఇంటిలో ఆయన ఉన్నారు. ఆజానుబాహువై, ఉన్నతమైన విగ్రహస్ఫూర్తితో, భారతీయ ఋషిసత్తముని జ్ఞప్తికి దెచ్చేలా ‘ఉన్నాడు ఆ మహానుభావుడు. నా కారు వారి యింటిముందు ఆగేటప్పటికి రోడ్డు మీదికి వచ్చి ఎంతో సాదరంగా స్వాగతించారు.
ఇంటిలోనికి వెళ్లిన తర్వాత వారు నన్ను వేసిన మొదటి ప్రశ్నయిది. ‘రాకెట్ గమనంతో, అతిత్వరగా సోషలిస్టు సమాజ స్థాపనోద్దేశంతో ముందుకు దూసుకొని పోతూ ఉన్న మా యువతరానికి, వేద నాగరికతను ఆదర్శంగా పెట్టుకొన్న మీ భారతదేశం, ఏమి సందేశమియ్యాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడకు పంపిందమ్మా?” అని. నేను వారి సూటియైన ప్రశ్నకు జవాబు చెప్పడానికి కొంచెం ఆలోచించే యత్నం చేసే లోపుగానే వారందుకొని, “నన్ను ముందు కొంచెం చెప్పనీయండి. నేను మహాకవి కాళిదాసు రచనలను అధ్యయనం చేశాను.
ప్రశ్నలు – జవాబులు
అ) రూబెన్ పండితుని నివాసం ఏ నది ఒడ్డున ఉంది?
జవాబు:
రూబెన్ పండితుని నివాసం ‘స్ప్రే’ నది ఒడ్డున ఉంది.
ఆ) రూబెనన్ను చూస్తే ఎవరు గుర్తొచ్చారు?
జవాబు:
రూబెన్ ను చూస్తే ఋషి గుర్తుకు వచ్చాడు.
ఇ) భారతదేశపు ఆదర్శం ఏమిటి?
జవాబు:
భారతదేశపు ఆదర్శం వేద నాగరికత.
ఈ) రూబెన్ ఏమి అధ్యయనం చేశారు?
జవాబు:
రూబెన్ కాళిదాసు రచనలను అధ్యయనం చేశారు.
5. “భారతీయ సాహిత్యంలోని సీతాసాధ్వి, ద్రౌపది మున్నగు స్త్రీలందరూ స్వీయత్యాగంతో, లోక హితాన్ని సాధించిన మహిళామణులు. ఇది మీ భారతీయ సంస్కృతియందలి పరమోదార రామణీయకత. మా పాశ్చాత్య వాఙ్మయంలో ఇట్లాంటి త్యాగసౌందర్యం కనబడదు. స్వార్థ భోగవిలాసయుతమైన మా యువతరానికి నేను ఈ విధంగా మీ భారతీయ సంస్కృతిని గూర్చి తెలుపుతూ నాకు తోచిన సాహిత్య సేవచేస్తూ ఉన్నాను” అని రెండు గంటలు మన భారతీయ సాహిత్యంపై ఎంతో ఉన్నత భావంతో ప్రసంగించారు. వారి ప్రసంగం వింటూ ఉన్నంతసేపూ నేను ఏలోకంలో ఉన్నానో మరచిపోయాను. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టగానే మన భారతీయ సంస్కృతిని గూర్చి యింత ఉన్నతమైన ప్రశంస వినడంతో నాకు ఒళ్ళు పులకరించి పోయింది. (SA-2 2023 24)
ప్రశ్నలు – జవాబులు
అ) లోక హితాన్ని సాధించిన మహిళామణులు ఎవరు?
జవాబు:
సీతాసాధ్వి, ద్రౌపది మున్నగు స్త్రీలందరూ.
ఆ) పాశ్చాత్య వాఙ్మయంలో కనిపించనిదేది?
జవాబు:
పాశ్చాత్య వాఙ్మయంలో ఇట్లాంటి త్యాగ సౌందర్యం కనపడదు.
ఇ) లక్ష్మీకాంతమ్మగారు ఆనందించడానికి కారణమేమి?
జవాబు:
భారతీయ సాహిత్యంపై వారి ఉన్నతాభిప్రాయానికి ఆనందించారు.
ఈ) పై పేరా ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
భారతీయ వాఙ్మయంలో ఏముంది?
6. తరువాత సంస్కృత వాఙ్మయంలో చారిత్రక పరిశోధన చేస్తూ ఉన్న శ్రీమతి రిచెల్ పండితురాలిని చూచాను. ఆమె శ్రీ రూబెన్ పండితుని శిష్యురాలు, 15 ఏండ్లు సంస్కృత, పాళీ భాషలలో అధ్యయనం చేసింది. ప్రపంచంలో కల్లా తలమానిక మనదగిన ఉత్తమ చరిత్ర, సంస్కృతి హిందూ దేశమందు విలసిల్లి యున్నదని ఆ విషయమై పరిశోధన మొదలుపెట్టింది. ఆమెకు రామాయణ భారతాలపై ఎంతో గొప్ప అభిప్రాయం ఉన్నది. తర్వాత ప్రసిద్ధ రచయిత్రియైన రూత్ కాప్టును, బెర్లిన్ యూనివర్శిటీలో ప్రస్తుతం ఓరియంటల్ డిపార్టుమెంటులో ప్రొఫెసరైన శ్రీ హూబర్ పండితుని నేను కలుసుకొన్నాను.
జర్మనీ భాషపై వారికెంత గౌరవప్రపత్తులున్నవో సంస్కృతభాషపై, మన భారత, రామాయణములపై వారికంత గొప్ప గౌరవభావం ఉండడం చూచినప్పుడు నాకెంతో సంతోషం కలగడమేకాదు, ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది. అంతేకాక తన ధార్మిక సంస్కృతిచే విశ్వానికే పూజ్య భావంతో ఆదరణీయమైన స్థానాన్ని సంపాదించిన మన సంస్కృత భాషయెడల నాకెంతో భక్తిభావం కల్గింది. ప్రొఫెసర్ హూబర్ పండితులు భారత రామాయణాది ప్రధాన గ్రంథాలెన్నో అనేక పాశ్చాత్య భాషలలోనికి అనువదింపబడ్డాయని ఎంతో గౌరవభావంతో చెప్పారు.
ప్రశ్నలు – జవాబులు
అ) హూబర్ పండితుడెక్కడ పనిచేస్తున్నారు?
జవాబు:
బెర్లిన్ యూనివర్శిటీలో హూబర్ పండితుడు పనిచేస్తున్నారు.
ఆ) వారికి దేనిపై గౌరవం ఉంది?
జవాబు:
వారికి సంస్కృతం, భారత, రామాయణాలపై గౌరవం ఉంది.
ఇ) రిచెల్ పండితురాలు దేనిపై పరిశోధన చేస్తోంది?
జవాబు:
రిచెల్ పండితురాలు సంస్కృత వాఙ్మయంపై పరిశోధన చేస్తోంది.
ఈ) ఉత్తమ చరిత్ర, సంస్కృతి ఎక్కడ విలసిల్లాయి?
జవాబు:
ఉత్తమ చరిత్ర, సంస్కృతి భారతదేశంలో విలసిల్లాయి.
7. తర్వాత, మేము హాల్ నగరంలో నివసిస్తూ ఉన్న ప్రొఫెసర్ మోడేగారిని చూడటానికి వెళ్లాము. శ్రీ మోడే పండితుడు ఒక గొప్ప విశ్వసాహిత్యవేత్త. విశేషించి భారతీయ తత్త్వ శాస్త్రాభిమాని. వారి ఇల్లు ఒక గొప్ప గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో అన్నీ భారతీయ గ్రంథాలే. భారతీయ శిల్ప, చిత్ర, నాట్య, సంగీత, సాహిత్యాది వివిధ కళలపై ఎన్నో గ్రంథాలు వారి దగ్గర ఉన్నాయి. వేదవేదాంగములు మన శాస్త్రపురాణేతిహాసములు, బౌద్ధ వాఙ్మయం లెక్కలేనన్ని సంపుటాలు మహాపండితుని మందిర గ్రంథాలయంలో స్థానం కల్పించుకొన్నాయి.
రవీంద్రుని వ్రాతప్రతులను, మేక్స్ ముల్లర్ వ్రాతప్రతులను ఎంతో గౌరవంతో ఆయన భద్రపరచుకొన్నారు. భారతదేశంలో వివిధ దేశభాషా సాహిత్యముల తీరుతెన్నులు ఆయనకు తెలిసినంత మనకు తెలియదేమో! ఆశ్చర్యమేమంటే మన తెలుగు సాహిత్యాన్ని గూర్చి ఆయన సేకరించినన్ని ఆంగ్ల వ్యాసములు మనం సేకరించలేము. కొన్ని పత్రికల పేర్లు కూడా మనకు తెలియవంటే అత్యుక్తి లేదు. ఆయన తన పేరును ‘మోద’ అనిన్నీ, తన నగరాన్ని ‘శాల’ అనిన్నీ పిలవమన్నారు. ప్రొఫెసర్ మోద మహాశయునితోడి పరిచయం నాకు జీవిత సార్థక్యాన్ని చేకూర్చే ఒక మహా వరప్రసాదం! నా పర్యటన యొక్క ప్రయోజనసారం మోద మహాశయుని దర్శనం అంటే అతిశయోక్తి కాదు.
ప్రశ్నలు – జవాబులు
అ) మోడేగారి గ్రంథాలయంలోని పుస్తకాలేమిటి?
జవాబు:
మోడేగారి గ్రంథాలయంలోని’ పుస్తకాలన్నీ భారతీయ గ్రంథాలే.
ఆ) మోడేగారెవరు?
జవాబు:
మోడేగారు గొప్ప పండితుడు, విశ్వ సాహిత్య వేత్త.
ఇ) శాల అని ఏ నగరానికి పేరు పెట్టారు?
జవాబు:
శాల అని హాల్ నగరానికి పేరు పెట్టారు.
ఈ) మోద ఎవరి పేరు?
జవాబు:
మోద అనేది మోడేగారి పేరు.
8. తర్వాత ‘స్ప్రే’ నదిలో బెర్లిన్ నగరాన్ని చుట్టి రావడానికి నౌకా విహారం బయలుదేరాము. ఆ నౌకలో సరిగ్గా మా ఆసనాలకు ఎదురు ఆసనంపై హంగరీలోని బుడాపెస్టు యూనివర్శిటీలో ఓరియంటల్ డిపార్టుమెంటులో పనిచేస్తూ ఉన్న డా॥ క్లారా అనేవారు కూర్చొని ఉన్నారు. వారితో ప్రసంగించే భాగ్యం మాకు కల్గడం చాలా భాగ్యమనుకోవాలి. ఆయన మన భారతీయ వేద పురాణేతిహాసాలపై పరిశోధన చేస్తూ ఉన్న మహానుభావుడు. ఆయనకు భారతీయ సాహిత్యంపై, భగవద్గీతపై గల గౌరవాదరాలు వర్ణింపశక్యం కానివి. ఆయన తండ్రిగారికి కూడా భారతీయ తత్త్వశాస్త్రంపై ఎంతో “గౌరవం. చిత్రమేమంటే ఆయన తండ్రి తన భార్యపేరు ‘రత్న’ అని మార్చేసుకున్నారు. డా॥ క్లారా తన భార్య పేరును ‘పద్మ’ అని మార్చుకున్నారు. అంతతో వూరుకోక శ్రీ క్లారా తన కుమార్తెకు ‘అమృత’ అని పేరుపెట్టారు.
ప్రశ్నలు – జవాబులు
అ) క్లారా గారి తల్లి పేరేమిటి?
జవాబు:
క్లారా గారి తల్లి పేరు రత్న.
ఆ) పద్మ ఎవరు?
జవాబు:
క్లారా గారి భార్య పద్మ.
ఇ) తండ్రీ కొడుకు లిద్దరికీ దేనిపై గౌరవం?
జవాబు:
ఇద్దరికీ భారతీయతత్వశాస్త్రం పై గౌరవం.
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పేరాలో ఎవరి గురించి ఉంది?
9. బెర్లిన్ నుండి చెకొస్లొవేకియాకి వెళ్ళాము. అక్కడ ఎన్నో గ్రంథాలయాలను, ఎన్నో మ్యూజియంలను చూచాము. ఎన్నో ఓరియంటల్ డిపార్టుమెంటులను కూడా చూచాము. ఎక్కడకు వెళ్ళినా ముఖ్యంగా భారత, భాగవత, రామాయణ, భగవద్గీతల అనువాద గ్రంథాలు కొల్లలుగా ఉండడం చూచి విస్తుపోయాను. ఐరోపియా దేశాల విశ్వవిద్యాలయా లన్నింటిలోనూ అతిప్రాచీనమైన ‘ప్రాహా విశ్వవిద్యాలయం’లోని ఓరియంటల్ డిపార్టుమెంటు చూడటానికి వెళ్ళాము. అక్కడ 25-30 మంది విద్యార్థులు హిందీ, సంస్కృత భాషలలో అధ్యయనం చేస్తూ ఉన్నారు.. ఆ డిపార్టుమెంటు డైరెక్టరైన మిస్టర్ కాసా పండితుడు ‘లుక్కింగ్ టువార్డ్స్ ఇండియా’ అనే గ్రంథాన్ని వ్రాశాడు. అందులోని మొదటి పేరాలో తత్త్వశాస్త్రం, సమ్యగ్విజ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, భగవద్విశ్వాసము మొదలైన మహావిషయములచే తక్కిన ప్రపంచ దేశస్థులంతా ఎట్లా ఆకర్షితులైనది, భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వశ్రేయస్కరమైనదీ వివరించి చెప్పారు.
ప్రశ్నలు – జవాబులు
అ) ఐరోపాలో ప్రాచీన విశ్వ విద్యాలయమేది?
జవాబు:
ఐరోపాలో ‘ప్రాహా విశ్వ విద్యాలయం’ అతి ప్రాచీనమైనది.
ఆ) అక్కడ విద్యార్థులు ఏయే భాషలు అధ్యయనం చేస్తున్నారు?
జవాబు:
అక్కడ విద్యార్థులు హిందీ, సంస్కృత భాషలు అధ్యయనం చేస్తున్నారు.
ఇ) లుకింగ్ టువార్డ్స్ ఇండియా గొప్పతనమేమిటి?
జవాబు:
దాని మొదటి పేరాకే ప్రపంచం ఆకర్షించబడింది.
ఈ) విశ్వ శ్రేయస్కరమైనది ఏది?
జవాబు:
భారతీయ సంస్కృతి విశ్వ శ్రేయస్కరమైనది.
10. ఐరోపాలో చెక్, స్లావ్ భాషలు సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటాయి. అంతకంటే లిథువేనియా భాష సంస్కృతానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈశ్వరుని నిజ తత్త్వాన్ని చెప్పే ఉపనిషత్తులు గల సంస్కృత భాషకు మా భాష దగ్గరగా ఉండడం మా అదృష్టమని వారు అంటూంటే, నేను మన దేవభాషకు ఎన్నో జోతలర్పించాను. తర్వాత, నేను కెనడాలో ఉద్యోగంచేస్తూ ఉన్న, మా అబ్బాయి రాజరాజనరేంద్రుని దగ్గరకు వెళ్ళాలని, మాస్కో నుండి మాంట్రియల్కు వెళ్లాను. దీనితో భారత ప్రభుత్వం వారి సాంస్కృతిక పర్యటన కార్యక్రమం ముగిసి, నా స్వంత పర్యటన ప్రారంభమైనదని అనవచ్చును.
ప్రశ్నలు – జవాబులు
అ) సంస్కృతానికి చాలా దగ్గరగా ఉండే భాషలేని?
జవాబు:
చెక్, స్లావ్, బిథువేనియాలు సంస్కృతానికి చాలా దగ్గరగా ఉండే భాషలు.
ఆ) ఉపనిషత్తుల గొప్పతనం ఏమిటి?
జవాబు:
ఈశ్వరుని నిజతత్వాన్ని ఉపనిషత్తులు చెప్పాయి.
ఇ) రాజరాజనరేంద్రుడెవరు?
జవాబు:
రచయిత్రి కొడుకు రాజరాజనరేంద్రుడు.
ఈ) రాజరాజనరేంద్రుడెక్కడ ఉంటాడు?
జవాబు:
రాజరాజనరేంద్రుడు కెనడాలో ఉంటాడు.
అపరిచిత గద్యాలు
1. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు నాలుగు సమాధానాలు కలవు. వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించి దాని సంకేతాన్ని ప్రక్కనున్న కుండలిలో రాయండి.
భారతీయ చిత్రకళ యనినంతనే ఎల్లరకు గుర్తు వచ్చునవి అజంతా చిత్రములు. ఇవి ప్రపంచ విఖ్యాతములు. అజంతా గుహల యందలి కుడ్య చిత్రములు రెండువేల సంవత్సరముల నాటివి. అయినను నిన్న మొన్న చిత్రింపబడినవా యనిపించును. కళాకాంతులెంత మాత్రము తగ్గకుండా వేలకొలది సంవత్సరములు నిల్చి యుండుటకు ఆ చిత్రకారులు ఏ రంగులను, ఏ తైలములను, ఏ పాళ్ళలో మేళవించి యుపయోగించిరో!
అజంతా చిత్రకారుల ప్రతిభ అద్భుతమైనది. ఏ చిత్రమును చూచినను ప్రాణముతో తొణికిసలాడు చుండును. గుహలందలి స్త్రీల చిత్రములు మనవంక చూచుచున్నట్లు, మనతో మాటాడబోవుచున్నట్లు భ్రాంతి గొల్పును. ఆ చిత్రములలో “అలంకరణము” అను సుందరి చిత్రము తలమానికము వంటిది. ఆ సుందరి కంఠమందలి హారము అచ్చముగా బంగరు గుండ్లతో గ్రుచ్చబడినదా యనిపించును.
చిత్రములందలి రూపములు కదలినట్లు భ్రాంతి గొల్చునే కాని, నిజముగా గదలవు. అవియే కదలి యొయ్యారముతో నడయాడినచో, నాట్యమాడినచో నెంత యానందముగా నుండును. అట్టి యానందము నాశించియే మానవుడు నృత్తము, నృత్యము, నాట్యము సృష్టించుకొనెను.
బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. కుడ్య చిత్రాలు ఉన్న స్థలము (ఇ)
అ) హంపి
ఆ) లేపాక్షి
ఇ) అజంతా
ఈ) రాజమండ్రి
జవాబు:
ఇ) అజంతా
2. ‘అలంకరణము’ అనే చిత్రం ఉన్న స్థలం (ఇ)
అ) హంపి
ఆ) ఎల్లోరా
ఇ) అజంతా
ఈ) లేపాక్షి
జవాబు:
ఇ) అజంతా
3. మానవుడు వృత్తము, నృత్యము, నాట్యము ఎందుకు సృష్టించుకొనెను. (అ)
అ) ఆనందం కొరకు
ఆ) బాధల కొరకు
ఇ) విలాసం కొరకు
ఈ) దుఃఖము పొందుటకు.
జవాబు:
అ) ఆనందం కొరకు
4. ఎవరి చిత్రకారుల ప్రతిభ అద్భుతమైనది.
అ) హంపి
ఆ) అజంతా
ఇ) లేపాక్షి
ఈ) ఎల్లోరా
జవాబు:
అ) హంపి
5. అజంతా గుహలయందలి కుడ్య చిత్రములు ఎన్ని సంవత్సరములనాటివి? (ఈ)
అ) వెయ్యి సంవత్సరాలు
ఆ) పదివేల సంవత్సరాలు
ఇ) మూడువేల సంవత్సరాలు
ఈ) రెండువేల సంవత్సరాలు
జవాబు:
ఈ) రెండువేల సంవత్సరాలు
2. క్రింది పేరాను చదివి, దిగువ నిచ్చిన ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
నేడు క్రీడలు స్థిరనిబంధనలతో కూడిన వేడుకలుగా మారిపోయాయి. ఈ క్రీడలు పలు రకాలు. ఒక ప్రత్యేక ప్రాంతానికి లేదా ఓ సమాజానికి స్వకీయాలైన క్రీడల్ని జానపద క్రీడలంటారు. జానపద క్రీడలు తరచుగా సమాజం యొక్క ఉపయోగం కొరకు ప్రారంభింపబడి, కాలక్రమంలో విస్తరించి ప్రజాదరణ పొంది పౌర క్రీడలుగా పరిణమించాయి. అప్పుడు వాటిని ప్రచారం చేయువారు వినోదం కొరకు తాత్కాలికంగా ఎన్నుకొన్నబడ్డవారు కాక అందులో నిపుణులైన వారౌతారు. బహు వ్యాప్తి చెందిన “క్రీడ” కూడా.. ఆదిలో జానపద క్రీడగానే ప్రారంభింపబడి ఉండుననుట నిస్సంశయము. జానపద కళల, వృత్తులవలెనే జానపద క్రీడలు కూడా పౌర క్రీడలుగా మారిన తరువాత వృత్తి స్వరూపము, వ్యాపార స్వరూపం పొందాయి.
బహువ్యాప్తి పొందిన క్రీడల్ని పౌరక్రీడలు లేదా బహువిస్తృత క్రీడలంటారు. పుట్బాల్, క్రికెట్ లాంటివి పౌరక్రీడలు. పరుగిడుట, దుముకుట, రువ్వుట, వేగంగా నడచుట ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగానికి చెందినవి.
స్కూలు స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు భారతదేశంలో ట్రాక్ అండ్ షీల్డ్ పోటీలు జరుగుతున్నాయి. రెండేండ్ల కొక మారు జాతీయ క్రీడోత్సవాలు, నాలుగేండ్ల కొకమారు ఆసియా క్రీడోత్సవాలు జరుగుచున్నాయి.
ప్రశ్నలు – జవాబులు
1. జానపద క్రీడలంటే ఏమిటి?
జవాబు:
ఒక ప్రత్యేక ప్రాంతానికి లేక సమాజానికి సంబంధించినవి.
2. జానపద క్రీడలు పౌర క్రీడలుగా పరిణితి చెందుటకు కారణం?
జవాబు:
దేశదేశాలకు విస్తరించి ప్రజాదరణ పొందినపుడు.
3. పౌరక్రీడలకు ఉదాహరణ?
జవాబు:
ఫుట్ బాల్
4. ట్రాక్ అండ్ ఫీల్డ్ స్పోర్ట్స్ విభాగానికి చెందిన ఒక ఆట
జవాబు:
పరుగిడుట
5. ఎన్నియేండ్ల కొకమారు ఆసియా క్రీడోత్సవాలు జరుగుతాయి?
జవాబు:
నాలుగేండ్ల కొకమారు
3. దిగువనున్న పేరా చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఇక భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేవి మన పండుగలు పబ్బాలు. దసరా, దీపావళి, మొహర్రం, హిందువులు, మహమ్మదీయులు కలిసి జరుపుకుంటారు. అలాగే సిక్కు, బౌద్ధ మతస్థులను అన్యమతస్థులుగా ఏ హిందువు భావించడు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు, స్మృతులు, శాస్త్రాలు, సంహితలు, ఖురాన్, గురు గ్రంథ సాహెబ్, జైన, బౌద్ధ దర్శనాలు…. భారతీయులందరికీ ఆదరణీయాలే గాక విశ్వమానవ కల్యాణ కవచాలు. మన జాతీయ సమైక్యతకు ప్రతీకలు. భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధించే విశ్వగీతికలు. అలాగే మన దేశంలోని పుణ్య నదులు, యాత్రా స్థలాలు యావద్భారతమంతటా ఉండటం కూడా ఏకత్వమే!
వేదకాలం నుండి నేటి దాకా వైదిక సంస్కృతి, గిరిజన సంస్కృతి, జానపద సంస్కృతి, నవభారత సంస్కృతి,. స్వాతంత్ర్యోద్యమం వల్ల ఏర్పడ్డ జాతీయతా భావం, లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్యం, ప్రణాళికలు, ఆర్థిక విధానం, విద్యా విధానం, క్రీడలు, రవాణా సౌకర్యాలు, శాస్త్రీయ దృక్పథాలు, హేతువాద దృష్టి, పోరాటాలు, ఉద్యమాలు, సంస్కరణలు, లలితకళలు, సాహిత్యం… అన్నీ భిన్నత్వంలో ఏకత్వాన్ని సమకూర్చేవే. వీటన్నింటిలోనూ, పూలదండలో దారం దాగున్నట్లుగా మానవత్వం అనే అమృత సూత్రం దాగుంది.
భారతీయుడు తన ముందుకు స్వర్గమే దిగి వచ్చినా “నాకు అక్కర్లేదు. మా అమ్మ భారతమాత చరణ స్మరణ శ్రవణ కీర్తనలే చాలంటాడు. నిజమే మనమంతా ఇందుకోసం కృషి చేయాలి.” జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అందుకే అన్నారు.
ప్రశ్నలు – జవాబులు
1. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేవి?
జవాబు:
పండుగలు
2. విశ్వమానవ కల్యాణ కవచం వంటిది ఏది?
జవాబు:
భగవద్గీత
3. పూలదండలో దారం దాగి ఉన్నట్లున్న అమృత సూత్రం ఏది?
జవాబు:
మానవత్వం
4. “ప్రతీక” అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
చిహ్నం
5. భారత భాగవతాలు అనేవి ఏమిటి?
జవాబు:
పవిత్ర గ్రంథాలు
వ్యక్తీకరణ – సృజనాత్మకత
I. ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఏ దేశ మేగినా….! పాఠం నేపథ్యం రాయండి.
జవాబు:
ఈనాడు ఉబుసుపోక ఊరకే దేశాలు తిరిగే లోక సంచారులు కాదు ప్రపంచానికి కావలసింది. తమ తిరుగుడుకు సార్థకతను కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక, స్థిరవాసులైన లక్షలాది మంది.ప్రజలకు అందించగలిగి ఉండాలి లోక సంచారులు” అని ‘లోకసంచారి’ పుస్తకంలో ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక హిందీ రచయిత ‘రాహుల్ సాంకృత్యాయన్’ వెల్లడించారు. సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశంతోనే, శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం, ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం.
ప్రశ్న 2.
‘యాత్రా రచన’ ప్రక్రియను వివరించండి. (FA-3:2023-24)
జవాబు:
యాత్రికుడు తాను పొందిన యాత్రానుభవాలను గ్రంథస్థం చేయడాన్ని ‘యాత్రారచన’ అంటారు. వ్యక్తులు స్వదేశంలో కానీ, విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినపుడు అక్కడి విశేషాలను, పొందిన అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రారచన.
నేటికీ ఏ తీర్థయాత్రకో, విహారయాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులకో ఇరుగు పొరుగు వారికో అక్కడి వింతలు విశేషాలు కథలు కథలుగా చెప్పడాన్ని చూడవచ్చు. యాత్రారచనలు చదువుతున్నపుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలుకూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి, విజ్ఞానయాత్రల గురించి యాత్రారచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకు అక్షరరూపం కల్పించడం అన్నమాట.
ప్రశ్న 3.
సంస్కృతానికి దగ్గరగా ఉన్న భాషలేవి? వాటి గొప్పతనమేమిటి?
జవాబు:
సంస్కృతానికి దగ్గరగా ఉండేవి చెక్, స్లావ్, లిథుమేనియా భాషలు. ఈశ్వరుని నిజ తత్త్వాన్ని చెప్పేవి ఉపనిషత్తులు.. అవి సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతాన్ని దేవభాష అంటారు. అటువంటి దేవభాషకు మా చెక్, స్లావ్, లిథుమేనియా దగ్గరగా ఉండడం మా అదృష్టమని వారంటుంటే రచయిత్రికి చాలా ఆనందం కల్గింది. దేవభాషపై గౌరవం ఇంకా పెరిగింది. సంస్కృతానికి దగ్గరగా ఉండి, అందరి గౌరవాన్ని పొందడమే ఆ భాషల గొప్పదనం.
II. ఈ క్రింది ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
జెకోస్లొవేకియాలో రచయిత్రి ఏం చూశారు?
జవాబు:
జెకోస్లొవేకియాలో ఎన్నో గ్రంథాలయాలను చూశారు. మ్యూజియమ్లను చూశారు. ఎన్నో ఓరియంటల్ డిపార్టుమెంట్లను చూశారు. ఎక్కడకు వెళ్లినా భారత, భాగవత, రామాయణ, భగవద్గీతల అనువాద గ్రంథాలను చాలా చూశారు. అవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. ఐరోపా దేశాల విశ్వ విద్యాలయాలన్నింటిలోనూ అతి ప్రాచీనమైనది ‘ప్రాహా విశ్వ విద్యాలయం. దానిలోని ఓరియంటల్ డిపార్టుమెంటును కూడా చూశారు. అక్కడ 25-30 మంది విద్యార్థులు హిందీ, సంస్కృత భాషలను అధ్యయనం చేయడం చూశారు. ఆ డిపార్టుమెంట్ డైరెక్టర్ కాసా పండితుడు. ఆయన వ్రాసిన “లుక్కింగ్ టువార్డ్స్ ఇండియా” అనే గ్రంథాన్ని చూశారు. దానిలోని మొదటి పేరాలో తత్త్వశాస్త్రం, సమ్యగ్విజ్ఞానం, ఆధ్యాత్మిక చింతన, భగవద్విశ్వాసం మొదలైన విషయాల చేత మిగతా ప్రపంచ దేశస్తులంతా ఆకర్షితులయ్యారనీ, భారతీయ సంస్కృతి యొక్క విశ్వశ్రేయస్కరం గురించి వారు వివరించిన తీరును గమనించారు. ‘
సృజనాత్మక ప్రశ్నలు
ప్రశ్న 1.
“సాహిత్యాన్ని చదవడానికి, అభిమానించడానికి భాష, ప్రాంతం అనే ఎల్లలు లేవు” అని ఏ దేశమేగినా….! పాఠం ఆధారంగా ఒక కరపత్రం రాయండి.
జవాబు:
ఏ దేశమేగినా………..! (కరపత్రం) ప్రియమైన సోదర సోదరీమణులారా! సాహిత్యాన్ని చదవడానికి, అభిమానించడానికి ఎల్లలు లేవు. సాహిత్యాన్ని ఒక ప్రాంతానికో లేదా ఒక భాషకో ముడివేసి గిరి గీయకండి. పాశ్చాత్య విద్య, సంస్కృతుల మోజులో పడి సనాతనమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మేళవించి ఋషి సత్తముల వంటి మన కవులు జీవం పోసిన భారతీయ సాహిత్యాన్ని పక్కన పెట్టకండి. జర్మనీ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలోని స్వార్థ భోగవిలాసయుతమైన యువతరానికి అక్కడి పండితులు మన భారతీయ సంస్కృతిని గురించి తెలుపుతూ భాష, ప్రాంతం అనే ఎల్లలు తుడిపేశారు. భారతీయ సాహిత్యం అంటే ఆదరం లేని మనం విదేశీయుల నుండి తెలుసుకోవల్సిన ఖర్మ పడుతోంది. మన భారతీయ సాహిత్యంలోని సీతా సాధ్వి, ద్రౌపది మున్నగు స్త్రీలందరూ స్వీయ త్యాగంతో, లోకహితాన్ని సాధించిన మహిళామణులు, ఇది మన భారతీయ సంస్కృతియందలి పరమోచార రామణీయకత, “మా పాశ్చాత్య వాఙ్మయంలో, ఇలాంటి త్యాగ సౌందర్యం కనబడదు” అని ప్రొఫెసర్ రూబెన్ చెప్పారు. విదేశీయులు మన సాహిత్యాన్ని చదివి చక్కగా అర్ధం చేసుకున్నారు. కానీ మనం ఆధునిక పోకడలు పోయి మన సాహిత్యాన్ని, సంస్కృతిని విమర్శిస్తున్నాం. ఎంతోమంది జర్మనులు భారతీయ భాషలు నేర్చుకొని, పరిశోధనలు చేస్తున్నారు. ఇంకా మన భారతీయ భాషలలోని ఉత్తమ సాహిత్య గ్రంథాలను జర్మను భాషలోకి అనువదించారు. ప్రొఫెసర్ మోద, డా॥ క్లారా, మిస్టర్ కాసా, ఎడ్వర్డ్స్ వంటి పండితులు మన భారతీయ సాహిత్యాన్ని చదివి, వాటికి ఆలయాలు (గ్రంథాలయాలు) ఏర్పాటు చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, సంస్కృతం, హిందీ ఇలా మన భాషలను నేర్పండి. వాటిల్లోని సాహిత్యం చదివి, చక్కని జ్ఞానాన్ని పొందండి. సాహిత్యానికి భాష, ప్రాంతం అనే ఎల్లలు లేవని నిరూపించండి. ఇట్లు, |
ప్రశ్న 2.
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు భావించి, ప్రశ్నావళి రాయండి.
జవాబు:
ప్రశ్నావళి
నమస్కారమండీ! మీతో ఇలా మాట్లాడటం మా అదృష్టం. మీ యాత్రా రచనను ‘ఏ దేశమేగినా ….!’ అను పాఠం ద్వారా కొంత తెలుసుకున్నాం. దాని పరంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసి పూర్తి వివరాలు తెలుసుకుందామని అనుకుంటున్నాము. ఇక –
- జర్మనీలోని వారితో భాష సంబంధంగా (మీరు ఇంగ్లీషురాదని చెప్పారు కదా!) మీకు ఇబ్బంది అనిపించిందా?
- “మా యువతరానికి ఏం సందేశమివ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడకు పంపింది మీ దేశం” అని ప్రా॥ రూబెన్ అడిగిన ప్రశ్నకు మీరు ఏమని సమాధానం చెప్పారు?
- శ్రీమతి రిచెల్ పండితురాలు “ప్రపంచంలో కెల్లా తలమానికమనదగిన ఉత్తమ చరిత్ర, సంస్కృతి హిందూ దేశంలో విలసిల్లి ఉందని చెప్పారు. మరి మన దేశంలో మన వాళ్ళే మన మనుస్మృతిని తగలబెడుతూ, రాముణ్ణి, కృష్ణుణ్ణి నిందిస్తున్నారు కదా! మీరేమంటారు?
- భారతదేశంలో వివిధ దేశ భాషా సాహిత్యాల తీరు తెన్నులు ఆయనకు తెలిసినంత మనకు తెలియదేమో! అని మోడే గారి గురించి చెప్పారు. మనం ఆయనలా జ్ఞాని కావడానికి ఏం చేయాలి?
- డా॥ క్లారాతో ప్రసంగించే భాగ్యం మాకు కల్గడం చాలా భాగ్యమనుకోవాలి అని అన్నారు కదా! వారి ప్రత్యేకతలు ఏమిటో చెప్పండి.
- సర్ ఎడ్వర్డ్ దాస్ ‘జవహర్ లాల్ అవార్డు’ గ్రహీత అని చెప్పారు. ఈ అవార్డు గురించి చెప్పండి.
- ‘మాయ్ వో రామ, మాయినో ఇంటిమీ’ కావ్యం గురించి చెప్పండి.
- ‘బెల్ట్ ఆఫ్ పాయిట్స్’ అని వ్యవహరింపబడే ఒక బెల్టును మీకు బహూకరించారు కదా! దాని సంగతులు చెప్పండి.
మీ మాటలు మాకు ఎంతో ఆనందాన్ని, స్ఫూర్తిని కలిగించాయి. ధన్యవాదాలు.
భాషాంశాలు
అర్థాలు
అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.
1. జాబు అందాక రిప్లై వ్రాయాలి
జవాబు:
ఉత్తరం
2. మంచి తరుణం మించకూడదు.
జవాబు:
సమయం
3. పిల్లలను తిట్టిన ఉత్తరక్షణం లోనే బాధ కల్గుతుంది.
జవాబు:
వెంటనే
4. చిన్నప్పుడు చదువుకోవడం ప్రయోజనకరం.
జవాబు:
ఉపయోగం కలిగించేది.
5. చిన్నప్పుడు చదువుకోకపోతే జీవితాంతం బాధపడాలి.
జవాబు:
జీవితమంతా
6. దేనినీ నాశనం చేయకూడదు.
జవాబు:
ధ్వంసం
7. మన సంస్కృతి మనం కాపాడుకోవాలి.
జవాబు:
నాగరికత
8. మంచి స్నేహం చిరకాలం ఉంటుంది.
జవాబు:
చాలాకాలం
9. ఈ సృష్టిలో అన్నీ పరమేశ్వరుడు ప్రసాదించినవే.
జవాబు:
భగవంతుడు
10. తప్పును అంగీకరించడం గొప్పవారికే సాధ్యం.
జవాబు:
ఒప్పుకోవడం
11. చెడు తొందరగా వ్యాప్తి చెందుతుంది.
జవాబు:
వ్యాపించడం
12. ప్రప్రథమంగా తెలుగు భాష నేర్చుకోవాలి.
జవాబు:
మొట్టమొదట
13. మంచి కాంక్ష తప్పక తీరుతుంది.
జవాబు:
కోరిక
14. గాఢముగా మంచు పేరుకొంది.
జవాబు:
దట్టము
15. మల్లి మస్తాన్ బాబు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. (FA-3:2023-24)
జవాబు:
ఎక్కాడు.
ఆ) గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
1. మా మామయ్య అత్త రజతోత్సవ వివాహ వేడుకలు జరుపుకొన్నారు.
అ) 25 ఏళ్లు
ఆ) 30 ఏళ్లు
ఇ) 50 ఏళ్లు
ఈ) 7 ఏళ్లు
జవాబు:
అ) 25 ఏళ్లు
2. పుస్తకం ఆమూలాగ్రం చదవాలి.
అ) కొంత
ఆ) పీఠిక
ఇ) కథ
ఈ) అంతా
జవాబు:
ఈ) అంతా
3. పుస్తకంలోని ప్రతి పుట విలువైనదే.
అ) అక్షరం
ఆ) పేరా
ఇ) పేజి
ఈ) కథ
జవాబు:
ఇ) పేజి
4. రాముడు ఆజానుబాహుడు.
అ) పొట్టివాడు
ఆ) పొడగరి
ఇ) మంచివాడు
ఈ) ధైర్యవంతుడు
జవాబు:
ఆ) పొడగరి
5. విశ్వామిత్రుడు ఒక ఋషి.
అ) ముని
ఆ) రాజు
ఇ) యుగకర్త
ఈ) కోపిష్టి
జవాబు:
అ) ముని
6. మంచి విషయాలు జ్ఞప్తి ఉంచుకోవాలి.
అ) చెప్పాలి
ఆ) జ్ఞాపకం
ఇ) అమలులో
ఈ) మనసులో
జవాబు:
ఆ) జ్ఞాపకం
7. చెప్పిన పని త్వరగా చేయాలి.
అ) జాగ్రత్తగా
ఆ) ఆలోచించి
ఇ) తొందరగా
ఈ) నిదానంగా
జవాబు:
ఇ) తొందరగా
8. కాళిదాసు రచన ఒకటైనా చదవాలి.
అ) శ్లోకం
ఆ) పద్యం
ఇ) కథ
ఈ) కృతి
జవాబు:
ఈ) కృతి
9. గాంధీజీ భావాలు ఉత్కృష్టమైనవి.
అ) గొప్పవి
ఆ) తెలివైనవి
ఇ) దానం చేసేవి
ఈ) సత్యమైనవి
జవాబు:
అ) గొప్పవి
10. విధి వ్రాతను ఎవ్వరూ తప్పించలేరు.
అ) పెన్ను
ఆ) బ్రహ్మ
ఇ) నుదుటి
ఈ) సరస్వతి
జవాబు:
ఆ) బ్రహ్మ
11. అరణ్యం క్రూర మృగాలకు నిలయం.
అ) కొండ
ఆ) గిరి
ఇ) విపినం
ఈ) జనారణ్యం
జవాబు:
ఇ) విపినం
12. ఉపాధ్యాయుడు మంచి ప్రేరకుడు కావాలి.
అ) ప్రేరేపించబడేవాడు
ఆ) ప్రేరణ చెందేవాడు
ఇ) వినేవాడు
ఈ) ప్రేరేపించేవాడు
జవాబు:
ఈ) ప్రేరేపించేవాడు
పర్యాయపదాలు
అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.
1. మన భారతదేశం విశ్వ విఖ్యాతి కలది.
జవాబు:
ఇండియా, హిందూ దేశం
2. ప్రభుత్వం ప్రజా సంక్షేమం చూడాలి.
జవాబు:
దొరతనం, సర్కారు
3. కార్యము మధ్యలో మానకూడదు.
జవాబు:
పని, కార్యక్రమం
4. పెద్దలు చెప్పినది అంగీకరించడం మంచిది.
జవాబు:
ఒప్పుకోవడం, సమ్మతించడం.
5. చిన్న విషయానికి కలగుండు ఎందుకు?
జవాబు:
కలవరం, కలత
6. మల్లినాథ సూరి సంస్కృత కావ్యాలకు వ్యాఖ్యానం చేశాడు.
జవాబు:
వివరణ, అర్థ వివరణ
7. తప్పు పని చేసి తలవంపులు తేకూడదు.
జవాబు:
అవమానం, పరాభవం
8. భాగ్యం అనేది భగవద్దత్తం.
జవాబు:
సంపద, ఐశ్వర్యం
9. ఆసనం గౌరవాన్ని బట్టి ఉంటుంది.
జవాబు:
కుర్చీ, కూర్చొనేది
10. నదిలో నీరు కలుషితం చేయకూడదు.
జవాబు:
ఆపగ, కూలంకష
11. పత్రికలు రోజూ చదవాలి.
జవాబు:
వార్తా పత్రిక, సంచిక
12. మోదముతో మోదకములు తిను.
జవాబు:
ముదము, హర్షము
13. మన మందిరము మనందరిదీ.
జవాబు:
గృహము, ఇల్లు
14. వేదాంగాలు అధ్యయనం చేయాలి.
జవాబు:
శాస్త్రాలు, దర్శనాలు
15. వేదం మన సంస్కృతికి మూలం.
జవాబు:
ఆగమం, ఆమ్నాయము
ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.
1. మన స్థానం మనకు బలం.
అ) తావు, చోటు
ఆ) టావు, కాగితం
ఇ) డబ్బు, ధనం
ఈ) ఊరు, గ్రామం
జవాబు:
అ) తావు, చోటు
2. ఈ విశ్వం ధర్మంపై నడుస్తుంది.
అ) ప్రచండం, ఛండం
ఆ) బ్రహ్మాండం, పిండం
ఇ) లోకం, ప్రపంచం
ఈ) వచనం, మాట
జవాబు:
ఇ) లోకం, ప్రపంచం
3. పండితుడు ధర్మాధర్మాలు చెప్పాలి.
అ) కవి, రచయిత
ఆ) బుధుడు, విద్వాంసుడు
ఇ) గురువు, ఒజ్జ
ఈ) విప్రుడు, బాపడు
జవాబు:
ఆ) బుధుడు, విద్వాంసుడు
4. మొదలు పెట్టాక చదవడం ఆపకు.
అ) తొలి, ప్రారంభం
ఆ) తుద, కొన
ఇ) కొస, కొన
ఈ) చదువు, అభ్యసనం
జవాబు:
అ) తొలి, ప్రారంభం
5. గురువులకు జోతలు పెట్టాలి.
అ) నతులు, నుతులు
ఆ) నుతులు, సతులు
ఇ) నతులు, నమస్కారాలు
ఈ) గతులు, జతులు
జవాబు:
ఇ) నతులు, నమస్కారాలు
6. స్వార్థం విడిచిపెట్టాలి.
అ) స్వప్రయోజనం, తన మేలు
ఆ) మేలు, ప్రయోజనం
ఇ) కీడు, చెడు
ఈ) నతి, సతి
జవాబు:
అ) స్వప్రయోజనం, తన మేలు
7. త్యాగము మహాత్ముల లక్షణం.
అ) పని, క్రియ
ఆ) మేషం, మేక
ఇ) పరిత్యాగం, వర్ణనము
ఈ) అది, ఇది
జవాబు:
ఇ) పరిత్యాగం, వర్ణనము
8. మంచి పనికి ప్రశంస అవసరం.
అ) పొగడ్త, నుతి
ఆ) అభిశంసన, అదృష్టం
ఇ) సతి, సవతి
ఈ) శంస, శంక
జవాబు:
అ) పొగడ్త, నుతి
9. చెడుపనికి అడుగు పడకూడదు.
అ) చెడు, కీడు
ఆ) పదము, పాదము
ఇ) చెప్పు, విను
ఈ) అను, కను
జవాబు:
ఆ) పదము, పాదము
10. మంచి సాహిత్యం చదవాలి.
అ) పద్యం, గద్యం
ఆ) పాట, గేయం
ఇ) కథ, నాటకం
ఈ) వాఙ్మయం, సారస్వతం
జవాబు:
ఈ) వాఙ్మయం, సారస్వతం
11. రాముడు ఆశ్రమం నిర్మించుకొన్నాడు.
అ) ఇల్లు, గృహం
ఆ) మేద, హార్యం
ఇ) పర్ణశాల, ఆకుల ఇల్లు
ఈ) గది, మది
జవాబు:
ఇ) పర్ణశాల, ఆకుల ఇల్లు
12. విధిని ఎదిరించలేము.
అ) శివుడు, ఈశ్వరుడు
ఆ) బ్రహ్మ, విధాత
ఇ) హరి, విష్ణువు
ఈ) హరి, గిరి
జవాబు:
ఆ) బ్రహ్మ, విధాత
13. కొన్ని ఏకాంతంగా మాట్లాడుకోవాలి.
అ) రహస్యం, ఏకతం
ఆ) స్త్రీ, పడతి
ఇ) సతి, భార్య
ఈ) భర్త, పతి
జవాబు:
అ) రహస్యం, ఏకతం
ప్రకృతి – వికృతులు
అ) గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.
1. శిష్యుని ప్రశ్న గురువుకు సంతోషం ఇస్తుంది.
జవాబు:
పన్నము
2. మంచి యత్నము ఎప్పుడూ ఫలిస్తుంది.
జవాబు:
జతనము
3. రాజును బట్టి రాజ్యం ఉంటుంది.
జవాబు:
రాయలు
4. అటవిలో పులిని చూశాను.
జవాబు:
అడవి
5. పిల్లల బుగ్గపై తల్లి ముద్ర ఇచ్చింది.
జవాబు:
ముద్దు
6. కలియుగము ఇప్పుడు నడుస్తోంది.
జవాబు:
ఉగము
7. రాముని కుమారుడు కుశుడు.
జవాబు:
కొమరుడు
8. విధము చెడినా ఫలితం దక్కాలి.
జవాబు:
వితము
9. ద్రౌపది దృష్టద్యుమ్నుని సోదరి.
జవాబు:
ద్రౌపది
10. స్త్రీని గౌరవించడం మన విధి.
జవాబు:
ఇంతి
11. త్యాగము ఎప్పుడూ వృథాగా పోదు.
జవాబు:
చాగము
12. ధనముతో భోగము కంటే త్యాగం మంచిది.
జవాబు:
బోగము
13. హితము పలకాలి.
జవాబు:
ఇతవు
14. సాందీపుని శిష్యుడు శ్రీకృష్ణుడు.
జవాబు:
శిసువుడు
15. మాణిక్యము ఖరీదెక్కువ,
జవాబు:
మానికము
ఆ) గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
1. విద్దెతో బుద్ధి పెరుగుతుంది.
అ) విద్య
ఆ) విదియ
ఇ) ద్వితాము
ఈ) విద్దియ
జవాబు:
అ) విద్య
2. శ్రీకృష్ణ రాయబారము నాటకం బాగుంటుంది.
అ) రాజగురువు
ఆ) రాజభారము
ఇ) రాజు బరువు
ఈ) రాజగౌరవం
జవాబు:
ఆ) రాజభారము
3. మంచి విసయం నలుగురికీ చెప్పు.
అ) వినయం
ఆ) వినమ్రత
ఇ) విజయం
ఈ) విషయం
జవాబు:
ఈ) విషయం
4. పెద్ద వారిది పెద్ద మనసు.
అ) పెద్ద
ఆ) వృద్ధు
ఇ) పేద
ఈ) పెద్ధ
జవాబు:
ఆ) వృద్ధు
5. కృష్ణ పాడ్యమి మంచిది.
అ) పౌర్ణమి
ఆ) విదియ
ఇ) ప్రథమ
ఈ) ద్వితీయ
జవాబు:
ఇ) ప్రథమ
6. కయిని సన్మానించారు.
అ) కవి
ఆ) కవము
ఇ) పండితుడు
ఈ) పామరుడు
జవాబు:
అ) కవి
7. కబ్బము అబ్బ ఎంత బాగుందో?’
అ) కవనం
ఆ) కావ్యము
ఇ) కవిత
ఈ) కవిత్వం
జవాబు:
ఆ) కావ్యము
8. తల్లి బాస విడవనని బాస చేయాలి.
అ) బస
ఆ) బస్సు
ఇ) బసు
ఈ) భాష
జవాబు:
ఈ) భాష
9. పడవ దరి చేరింది.
అ) దారి
ఆ) తీరము
ఇ) తిరము
ఈ) ధర
జవాబు:
ఆ) తీరము
10. మన పొంత మనకు బాగుంటుంది.
అ) పొత్రం
ఆ) పాత్ర
ఇ) ప్రాంతము
ఈ) ప్రాత
జవాబు:
ఇ) ప్రాంతము
నానార్థాలు
అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
1. అంతస్తులు మనుషుల మధ్య అంతరాలు పెంచుతాయి.
జవాబు:
మేడ, తారతమ్యం
2. శాఖ అధికారిని బట్టి ఉంటుంది.
జవాబు:
కొమ్మ, విభాగము
3. రజతము విలువైనది.
జవాబు:
వెండి, 25 సం॥ల కాలం
4. మన కీర్తి వ్యాప్తి చెందింది.
జవాబు:
వ్యాపించడం, ప్రసిద్ధికెక్కడం.
5. విగ్రహం అందంగా ఉంది.
జవాబు:
శిల్పం, శరీరం
6. రచన అందరికీ రాదు.
జవాబు:
హారం కట్టడం, ఊహ.
7. ఉదాహరణ బాగుండాలి.
జవాబు:
దృష్టాంతం, కావ్యకం
8. విధి విలాసమేమొ!
జవాబు:
బ్రహ్మ, చేయుట
9. తాతను గౌరవించాలి.
జవాబు:
కన్నవారితండ్రి, తండ్రి.
10. విలాసం అందరికీ తెలియాలి.
జవాబు:
చిరునామా, క్రీడ
ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.
1. ప్రతీ ఆశ్చర్యంని మనం ఆశ్చర్యంగా చూస్తాం.
అ) గొప్పతనం, ఆనందం
ఆ) వింత, అచ్చెరువు
ఇ) ఆనందం, కోపం
ఈ) సినిమా, ఆనందం
జవాబు:
ఆ) వింత, అచ్చెరువు
2. హిమాలయ స్థిరం స్థిరంగా ఉంటుంది.
అ) కొండ, అందం
ఇ) కొండ, కదలనిది
అ) కొండ, పెద్ద
ఈ) పర్వతం, మంచుతో నిండినది
జవాబు:
కొండ, కదలనిది
3. ప్రయోజనం పొందడం నాకు ప్రయోజనం.
అ) ఉపయోగం, సహజం
ఆ) లాభం, అవసరం
ఇ) లాభం, పదవి
ఈ) పదవి, లాభం
జవాబు:
ఆ) లాభం, అవసరం
4. నా ఉద్దేశం చెప్పాలని నా ఉద్దేశం.
అ) ఆలోచన, మేలు
ఆ) లాభం, ఆనందం
ఇ) పాఠం, లక్ష్యం
ఈ) భావం, కోరిక
జవాబు:
ఈ) భావం, కోరిక
5. భాగ్యం కలవారికి భాగ్యం కలుగుతుంది.
అ) సుకృతం, అదృష్టం
ఆ) సంపద, అందం
ఇ) అందం, సంపద
ఈ) ఆస్తి, పదవీ యోగం
జవాబు:
అ) సుకృతం, అదృష్టం
6. సంఘం యొక్క సంఘం ఎంతైనా ఉండవచ్చు.
అ) గుంపు, లాభం
ఆ) సమూహం, నష్టం
ఇ) సమూహం, పరిమాణం
ఈ గుంపు, గోల
జవాబు:
ఇ) సమూహం, పరిమాణం
7. ఋషి సమూహం ఋషి ఏర్పరచింది.
అ) ముని, వేదం
ఆ) ముని, సమాజం
ఇ) ముని, మంత్రం
ఈ) ముని, తపస్సు
జవాబు:
అ) ముని, వేదం
8. విధిని తప్పించుకోవడం విధికి కూడా సాధ్యం కాదు.
అ) కాలం, బ్రహ్మ
ఆ) అదృష్టం, శివుడు
ఇ) పాపం, విష్ణువు
ఈ) అడవి, రాముడు
జవాబు:
అ) కాలం, బ్రహ్మ
వ్యుత్పత్త్యర్థాలు
అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం రాయండి.
1. మనిషి తలచుకొంటే సాధించలేనిది లేదు.
జవాబు:
మనస్సును వశంలో ఉంచినవాడు.
2. అధ్యయనం శ్రద్ధగా చేయాలి.
జవాబు:
గురు ముఖమున జరుపు వేదపఠనం.
3. మహాభారతం ఇతిహాసం.
జవాబు:
ఇట్లు జరిగినని చెప్పే పూర్వరాజుల చరిత్ర.
4. ఉపనిషత్తులు ఎక్కువగా శివుని గురించి చెబుతాయి.
జవాబు:
గురుని సమీపాన శిష్యునిచే లెస్సగా పొందబడేవి.
ఆ) గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్వర్ణాన్ని గుర్తించండి.
1. అదృష్టం ఉండాలి దేనికైనా.
అ) చూడబడనిది
ఆ) చేయబడినది
ఇ) తినబడినది
ఈ) వినబడినది
జవాబు:
అ) చూడబడనిది
2. ఆదర్శం అబద్ధమాడదు.
అ) ముఖం కనిపించేది.
ఆ) ముఖం కనబడినది.
ఇ) దీని యందు తన నీడ కనబడును.
ఈ) గాజుతో తయారగును.
జవాబు:
ఇ) దీని యందు తన నీడ కనబడును.
3. మనదేశ రాజధాని ఢిల్లీ.
అ) ప్రధాన నగరం.
ఆ) రాజు నివసించే ప్రధాన పట్టణం.
ఇ) రహదారులు కలది.
ఈ) పెద్ద భవనాలు కలది.
జవాబు:
ఆ) రాజు నివసించే ప్రధాన పట్టణం.
4. మా తెలుగు పండితుడు పాఠం బాగా చెబుతారు.
అ) చదివినవాడు
ఆ) భాష తెలిసినవాడు
ఇ) కవిత్వం చెప్పేవాడు
ఈ) ఎరుక గలవాడు
జవాబు:
ఈ) ఎరుక గలవాడు
సంధి పదాలను విడదీయడం
గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
1. ఆ యాత్రికురాలు జర్మనీ వెళ్లింది.
జవాబు:
యాత్రిక + ఆలు
2. నేను చెప్పేది ఏమంటే వినండి.
జవాబు:
ఏమి + అంటే
3. ఆమె కవయిత్రినని చెప్పుకోలేదు.
జవాబు:
కవయిత్రిని + అని
4. వేయిపడగలు నవల ఎక్కువ పుటలుగలది.
జవాబు:
పుటలు + కలది
5. విద్యాశాఖయందలి అధికారి నాకు తెలుసు.
జవాబు:
శాఖ + అందలి
6. వంకాయలు ఎంచుకొన్నట్లు పూలెంచనివ్వరు.
జవాబు:
ఎంచుకొన్న + అట్లు
7. తెలుగుకు స్పష్టమైన మాటతీరు అందం ఇస్తుంది.
జవాబు:
స్పష్టము + ఐన
8. ఇతఃపూర్వము దేనిని వినలేదు.
జవాబు:
ఇతః + పూర్వము
9. జీవితాంతం నీతిగా బతకాలి.
జవాబు:
జీవిత + అంతం
10. గురువులు అనఁదగిన వారే.
జవాబు:
అనన్ + తగిన
11. భగవదాదేశంతో లోకం నడుస్తుంది.
జవాబు:
భగవత్ + ఆదేశం
12. తెలుగు వాఙ్మయం గొప్పది.
జవాబు:
వాక్ + మయం
13. అత్యుక్తి తగవు తెస్తుంది.
జవాబు:
అతి + ఉక్తి
14. ఇంట్లో అన్ని వ్యవహారాలు మా నాన్న చూస్తారు.
జవాబు:
వ్యవహారము + లు
15. పురాణాలు మన సంపద.
జవాబు:
పురాణము + లు
సంధి పదాలను కలపడం
సంధి పదాలను కలిపి రాయండి.
1. ఉద్దేశము + లు
జవాబు:
ఉద్దేశాలు
2. అధి + ఆత్మిక
జవాబు:
ఆధ్యాత్మిక
3. భగవత్ + గీత
జవాబు:
భగవద్గీత
4. విద్యా + ఆలయం
జవాబు:
విద్యాలయం
5. అంగీకరింపన్ + చేసినది
జవాబు:
అంగీకరింపఁజేసినది
6. ప్రారంభము + ఐనది
జవాబు:
ప్రారంభమైనది
7. భాష + ఎడల
జవాబు:
భాష యెడల
8. వెల్వడిన + అట్లు
జవాబు:
వెల్వడినట్లు
9. లేని + అన్ని
జవాబు:
లేనన్ని
10. అయినది + అని
జవాబు:
అయినదని
11. శిష్య + ఆలు
జవాబు:
శిష్యురాలు
12. ఎరుగని + అట్లే
జవాబు:
ఎరుగనట్లే
13. చూచిన + అప్పుడు
జవాబు:
చూచినప్పుడు
14. రచయిత్రి + ఐన
జవాబు:
రచయిత్రియైన
15. మాట్లాడడము + ఐన
జవాబు:
మాట్లాడడమైన
సంధి నామాలు
గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.
1. మా ఉపాధ్యాయిని పెద్ద పండితురాలు.
అ) టుగాగమ సంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) లు,ల,న,ల సంధి
ఈ) రుగాగమ సంధి
జవాబు:
ఈ) రుగాగమ సంధి
2. ఏమి పంపిందమ్మ మీ అమ్మ.
అ) ఇత్వసంధి
ఆ) అత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
అ) ఇత్వసంధి
3. అమ్మను చూడాలని ఉంది.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
ఆ) ఇత్వసంధి
4. వేయి పుటలు గల పుస్తకం చదివాను.
అ) సరళాదేశ సంధి
ఆ) లు,ల,న,ల సంధి
ఇ) గసడదవాదేశ సంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
గసడదవాదేశ సంధి
5. భక్తుని కోరికేమి అని భగవంతుడడిగాడు.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) టుగాగమ సంధి
జవాబు:
అ) అత్వసంధి
6. వారియింటి పెండ్లికి వెళ్లాము.
అ) యణాదేశ సంధి
ఆ) యడాగమం
ఇ) అత్వసంధి
ఈ) ఇత్వసంధి
జవాబు:
ఆ) యడాగమం
7. రాజధాని నగరమైన ఢిల్లీ వెళ్లాను.
అ) లు,ల,న,ల సంధి
ఆ) అత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) ఇత్వసంధి
జవాబు:
ఇ) ఉత్వసంధి
8. అనఁదగిన వారన్నా వరవాలేదు.
అ) సరళాదేశ సంధి
ఆ) గసడదవాదేశ సంధి
ఇ) అత్వసంధి
ఈ) ఇత్వసంధ
జవాబు:
సరళాదేశ సంధి
9. నేను బెంగుళూరు విమానాశ్రయం చూశాను.
అ) అత్వసంధి
ఆ) ఇత్వసంధి
ఇ) ఉత్వసంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఈ) సవర్ణదీర్ఘ సంధి
10. సమ్యగ్విఙ్ఞానం అవసరం.
అ) అత్యసంధి
ఆ) జశ్వసంధి
ఇ) కుృత్వసంధి
ఈ) గుణసంధి
జవాబు:
ఆ) జత్వసంధి
11. మన వాఙ్మయం గొప్పది.
అ) అనునాసిక సంధి
ఆ) అత్వసంధి
ఇ) శ్చుత్వ సంధి
ఈ) జశ్వ సంధి
జవాబు:
అ) అనునాసిక సంధి
12. మా ఇల్లు రజతోత్సవం జరుపుకొన్నాము.
అ) అనునాసిక సంధి
ఆ) యణాదేశ సంధి
ఇ) గుణసంధి
ఈ) అత్వసంధి
జవాబు:
ఇ) గుణసంధి
13. మా గురువుగారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ.
అ) యణాదేశ సంధి
ఆ) యడాగమం
ఇ) అత్వసంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
అ) యణాదేశ సంధి
14. మహాభారతం చాలా ధర్మాలను చెప్పింది.
అ) గుణసంధి
ఆ) లు,ల,న,ల సంధి
ఇ) అత్వసంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఆ) లు, ల, న,ల సంధి
15. కవయిత్రికి స్వాగతము చెప్పారు.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) పుంప్వాదేశ సంధి
ఇ) యణాదేశ సంధి
ఈ) గుణసంధి
జవాబు:
ఇ) యణాదేశ సంధి
విగ్రహవాక్యాలు
గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.
1. గురువుగారి వరప్రసాదం మాకీ విద్య.
జవాబు:
వరమనెడు ప్రసాదం.
2. పాలం విమానాశ్రయం ఢిల్లీలో ఉంది.
జవాబు:
పాలం అను పేరు గల విమానాశ్రయం.
3. ఆమె స్థిరసౌదామిని వలె ఉంది.
జవాబు:
స్థిరమైన సౌదామిని.
4. పేపరు మా తాతగారు ఆమూలాగ్రం చదువుతారు.
జవాబు:
మూలము నుండి అగ్రం వరకు.
5. ఒక్కనిముషం ఆలస్యమైనా పరీక్షకు రానివ్వరు.
జవాబు:
ఒక్క సంఖ్య గల నిముషం.
6. ఆమె విదేశీ పర్యటన ముగిసింది.
జవాబు:
విదేశము నందు పర్యటన.
7. విద్యాశాఖ పరీక్షలు జరిపింది.
జవాబు:
విద్య అనుపేరు గల శాఖ.
8. పత్రికల పేర్లు కూడా తెలియవా?
జవాబు:
పత్రికల యొక్క పేర్లు.
9. మన ఆచార వ్యవహారాలు మనవి.
జవాబు:
ఆచారమును వ్యవహారమును.
10. శాస్త్రపురాణేతిహాసాలు చదవాలి.
జవాబు:
శాస్త్రమును పురాణమును ఇతిహాసమును.
11. మా అన్నయ్య విద్యాభ్యాసము పూర్తయింది.
జవాబు:
విద్యను గూర్చి అభ్యాసము.
12. విషయం సాధికారికముగా మాట్లాడాలి.
జవాబు:
అధికారముతో కూడినది.
13. ధన మదాంధత్వము పనికిరాదు.
జవాబు:
మదము వలన అంధత్వము.
14. ఆయన శాస్త్రాభిమాని.
జవాబు:
శాస్త్రము నందు అభిమానం కలవాడు.
సమాస నామాలు
గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
1. మహిళామణులు గొప్పవారు.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) నఞ్ తత్పురుష
ఈ) ఉపమాన ఉత్తరపదకర్మధారయ సమాసము
జవాబు:
ఈ) ఉపమాన ఉత్తరపదకర్మధారయ సమాసము
2. నాటకంలోని పాత్రలన్ని కల్పితమే.
అ) సప్తమీ తత్పురుష సమాసం
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) విశేషణ ఉత్తరపదకర్మధారయ సమాసము
ఈ) రూపక సమాసం
జవాబు:
ఇ) విశేషణ ఉత్తరపదకర్మధారయ సమాసము
3. కవయిత్రిని సాదరముగా ఆహ్వానించారు.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) తృతీయా తత్పురుష సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఇ) తృతీయా తత్పురుష సమాసం
4. ఆయన మంచి సాహిత్యవేత్త.
అ) రూపక సమాసం
ఆ) ద్వితీయా తత్పురుష
ఇ) చతుర్థీ తత్పురుష
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) ద్వితీయా తత్పురుష సమాసం
5. భారత భాగవత రామాయణ భగవద్గీతలు పవిత్ర గ్రంథాలు.
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఆ) బహుపద ద్వంద్వ సమాసము
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) సప్తమీ తత్పురుష
జవాబు:
ఆ) బహుపద ద్వంద్వ సమాసము
6. అతని తీరుతెన్నులు బాగోలేవు.
అ) ఉపమాన పూర్వపద కర్మధారయం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) ద్వంద్వ సమాసము
ఈ) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) ద్వంద్వ సమాసము
7. దేవభాష సంస్కృతం.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) నఞ్ తత్పురుష
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష సమాసం
8. మన విదేశాంగశాఖ తెలివైనది.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) చతుర్థీ తత్పురుష
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
ఆ) చతుర్థీ తత్పురుష సమాసం
9. భగవద్విశ్వాసం ఉండాలి.
అ) బహువ్రీహి సమాసం
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) రూపక సమాసం
ఈ) షష్ఠీ తత్పురుష
జవాబు:
ఆ) సప్తమీ తత్పురుష సమాసం
10. 37 అంతస్తుల భవనం చూశాను.
అ) ద్విగు సమాసం
ఆ) ద్వితీయా తత్పురుష
ఇ) నఞ్ తత్పురుష
ఈ) బహువ్రీహి సమాసం
జవాబు:
అ) ద్విగు సమాసం
11. ఆమూలాగ్రం పరిశీలించాలి.
అ) సప్తమీ తత్పురుష
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) అవ్యయీభావ సమాసం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఇ) అవ్యయీభావ సమాసం
12. అతని నిజతత్త్వం తెలిసింది.
అ) షష్ఠీ తత్పురుష
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఈ) రూపక సమాసం
జవాబు:
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయం
13. సీతాసాధ్వి రాముని సతి.
అ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) సప్తమీ తత్పురుష
ఇ) చతుర్థీ తత్పురుష
ఈ) ద్విగు సమాసం
జవాబు:
అ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
14. ఆమె ప్రసిద్ధ రచయిత్రి.
అ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఆ) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
ఇ) షష్ఠీ తత్పురుష సమాసం
ఈ) సప్తమీ తత్పురుష
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
15. రైలు రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది.
అ) ఉపమాన పూర్వపద కర్మధారయం
ఆ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) ద్విగు సమాసం
ఈ) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు:
ఇ) ద్విగు సమాసం
ఆధునిక వచనాలు
ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.
1. ఆ క్షణమెంతయో పవిత్రమైనది.
అ) ఆ క్షణమునెంతయో పవిత్రమయినది.
ఆ) ఆ క్షణం ఎంతో పవిత్రమైంది.
ఇ) ఆ క్షణమ్మునెంతయో పవిత్రం.
ఈ) ఆ క్షణమదెంతో పవిత్రమైనదియే.
జవాబు:
ఆ) ఆ క్షణం ఎంతో పవిత్రమైంది.
2. భావించవలసిన శుభతరుణమది.
అ) భావించాల్సిన శుభతరుణం అది.
ఆ) భావించవలసిన శుభతరుణమిది.
ఇ) భావించవలసిన శుభతరుణంబది.
ఈ) భావించవలసిన శుభతరుణంబునది.
జవాబు:
అ) భావించాల్సిన శుభతరుణం అది.
3. నాకు స్వాగతం చెప్పిరి.
అ) నాకు స్వాగతంబు చెప్పితిరి.
ఆ) నాకు స్వాగతమ్ము చెప్పినారు.
ఇ) నాకు స్వాగతం చెప్పారు.
ఈ) నాకు స్వాగతమున్ జెప్పిరి.
జవాబు:
ఇ) నాకు స్వాగతం చెప్పారు.
4. విమానమును అధిరోహించితిని.
అ) విమానం అధిరోహించాను.
ఆ) విమానమ్ము నధిరోహించితిని.
ఇ) విమానంబు నధిరోహించితిని.
ఈ) విమానము నధిరోహించితిని.
జవాబు:
అ) విమానం అధిరోహించాను.
5. విమానాశ్రయమునకు వచ్చితిరి.
అ) విమానాశ్రయమ్మునకు వచ్చిరి.
ఆ) విమానాశ్రయంబునకు వచ్చినారు.
ఇ) విమానాశ్రయమునకు వచ్చియుంటిరి.
ఈ) విమానాశ్రయానికి వచ్చారు.
జవాబు:
ఈ) విమానాశ్రయానికి వచ్చారు.
6. ఆమూలాగ్రముగా అధ్యయనము జేసితిని.
అ) ఆమూలాగ్రం అధ్యయనం చేశాను.
ఆ) ఆమూలాగ్రమునధ్యయనముఁజేసియుంటిని.
ఇ) ఆమూలాగ్రము నధ్యయనంబు చేసితిని.
ఈ) ఆమూలాగ్రమును అధ్యయనమ్ముంచేసితిని.
జవాబు:
అ) అమూలాగ్రం అధ్యయనం చేశాను.
7. పరిచయము కలిగించవలయునని కోరితిని.
అ) పరిచయమునుఁ గలిగించవలయునని కోరితిని.
ఆ) పరిచయంబుంగల్పించవలయునని కోరితిని.
ఇ) పరిచయమ్ము గలిగించవలెనని కోరితిని.
ఈ) పరిచయం కల్గించమని కోరాను.
జవాబు:
ఈ) పరిచయం కల్గించమని కోరాను.
8. వారి యింటి ముందు ఆగితిమి.
అ) వారి యింటి ముందట నాగితిమి.
ఆ) వారి యింటి ముందర నాగితిమి.
ఇ) వాళ్లింటి ముందాగాం.
ఈ) వారి యింటి ముందు నాగియుంటిమి.
జవాబు:
ఇ) వాళ్లింటి ముందాగాం.
9. మీ సందేశము నీయవలెను.
అ) మీ సందేశము నీయవలెను.
ఆ) మీ సందేశం ఇవ్వాలి.
ఇ) మీ సందేశమ్ము నీయవలెన్.
ఈ) మీ సందేశంబీయవలెను.
జవాబు:
ఆ) మీసందేశం ఇవ్వాలి.
10. జవాబును చెప్పుటకాలోచించితిని.
అ) జవాబును ‘చెప్పుటకునాలోచించితిని.
ఆ) జవాబు చెప్పడానికాలోచించా.
ఇ) జవాబునుఁ జెప్పుటకాలోచించితిని.
ఈ) జవాబు చెప్పుటకు నాలోచించితి.
జవాబు:
ఆ) జవాబును చెప్పడాని కాలోచించా.
11. రచనలనధ్యయనముఁజేసితిని.
అ) రచనల్నధ్యయనం చేశాను.
ఆ) రచనలనునధ్యయనము చేసితిని.
ఇ) రచనలనధ్యయనము చేసితిని.
ఈ) రచనలనధ్యయనంబు జేసితిని,
జవాబు:
అ) రచనల్నధ్యయనం చేశాను.
12. ఆమెకు భారతముపై అవగాహనయున్నది.
అ) ఆమెకు భారతముపై నవగాహనంబున్నది.
ఆ) ఆమెకు భారతంబుపై నవగాహనమున్నది.
ఇ) ఆమెకు భారతంపై అవగాహనుంది.
ఈ) ఆమెకు భారతముపై నవగాహన కలదు.
జవాబు:
ఇ) ఆమెకు భారతంపై అవగాహనుంది.
13. ఆ విషయుమునామె సహించలేదు.
అ) ఆ విషయాన్నామె సహించలేదు.
ఆ) విషయంబునామె సహించలేదు.
ఇ) ఆ విషయము నామె సహించలేదు.
ఈ) ఆ విషయుమునామె సహియించలేదు.
జవాబు:
అ) ఆ విషయాన్నామె సహించలేదు.
వ్యతిరేకార్థక వాక్యాలు
ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.
1. ఆమెను ఒక యాత్రికురాలుగా ఎంచుకొన్నారు.
జవాబు:
ఆమెను ఒక యాత్రికురాలుగా ఎంచుకొనలేదు.
2. ఆదిభగవదాదేశం.
జవాబు:
అదిభగవదాదేశం కాదు.
3. ఆ క్షణం పవిత్రమైనది.
జవాబు:
ఆ క్షణం పవిత్రమైనది కాదు.
4. మనల్ని సర్వనాశనం చేసింది.
జవాబు:
మనల్ని సర్వనాశనం చేయలేదు.
5. కార్యక్రమం ముగిసింది.
జవాబు:
కార్యక్రమం ముగియలేదు.
6. నేను బెర్లిన్ వెళ్లాను.
జవాబు:
నేను బెర్లిన్ వెళ్లలేదు.
7. నేను విమానం ఎక్కాను.
జవాబు:
నేను విమానం ఎక్కలేదు.
8. చాలా వ్యాప్తిలో ఉంది.
జవాబు:
చాలా వ్యాప్తిలో లేదు.
9. నన్ను అందరికీ పరిచయం చేశారు.
జవాబు:
నన్ను అందరికీ పరిచయం చేయలేదు.
10. నేను సంస్కృతంలో మాట్లాడగలను.
జవాబు:
నేను సంస్కృతంలో మాట్లాడలేను.
11. నేను సంస్కృతంలో కవిత వ్రాయగలను.
జవాబు:
నేను సంస్కృతంలో కవిత వ్రాయలేను.
12. రచయిత్రి అన్నీ చూశారు.
జవాబు:
రచయిత్రి అన్నీ చూడలేదు.
13. జర్మనీలో నాకు స్నేహితులున్నారు.
జవాబు:
జర్మనీలో నాకు స్నేహితులు లేరు.
వ్యతిరేకార్థక క్రియలు
కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.
1. అ) క్రీడించక
ఆ) క్రీడించి
ఇ) క్రీడిస్తూ
ఈ) క్రీడిస్తే
జవాబు:
అ) క్రీడించక
2. అ) వలచి
ఆ) వలపించక
ఇ) వలపించి
ఈ) వలచు
జవాబు:
ఆ) వలపించక
3. అ) ఆడి
ఆ) ఆడుతూ
ఇ) ఆడక
ఈ) ఆడితే
జవాబు:
ఇ) ఆడక
4. అ) ఊపుతూ
ఆ) ఊపి
ఇ) ఊపితే
ఈ) ఊపక
జవాబు:
ఈ) ఊపక
5. అ) ఆలోచించి
ఆ) ఆలోచించక
ఇ) ఆలోచిస్తూ
ఈ) ఆలోచిస్తే
జవాబు:
ఆ) ఆలోచించక
6. అ) రచించక
ఆ) రచించి
ఇ) రచిస్తూ
ఈ) రచిస్తే
జవాబు:
అ) రచించక
7. అ) ప్రవచించక
ఆ) వచించి
ఇ) వచిస్తే
ఈ) వచిస్తూ
జవాబు:
అ) ప్రవచించక
8. అ) చూపించి
ఆ) చూపించక
ఇ) చూపిస్తూ
ఈ) చూపిస్తే
జవాబు:
ఆ) చూపించక
9. అ) ఈక్షిస్తూ
ఆ) ఈక్షిస్తే
ఇ) ఈక్షించి
ఈ) రక్షించక
జవాబు:
ఈ) ఈక్షించక
10. అ) పరిశీలించి
అ) పరిశీలిస్తూ
ఇ) పరిశీలించక
ఈ) పరిశీలిస్తే
జవాబు:
ఇ) పరిశీలించక
11. అ) కలయక
ఆ) కలిసి
ఇ) కలిస్తే
ఈ కలుస్తూ
జవాబు:
అ) కలయక
12. అ) పులమక
ఆ) పులిమి
ఇ) పులుముతూ
ఈ) పులితే
జవాబు:
అ) పులమక
13. అ) పలికి
ఆ) పలికితే
ఇ) పలకక
ఈ) పలుకుతూ
జవాబు:
ఇ) పలకక
సంశ్లిష్ట వాక్యాలు
ఇవి ఏ రకమైన సంశ్లిష్టవాక్యాలో రాయండి.
1. లోక సంచారాలు చేసి జ్ఞానాన్ని సంపాదించారు.
జవాబు:
క్త్వార్థకం
2. రచయిత్రి మాస్కో మీదుగా ప్రయాణిస్తూ ఎన్నో వింతలు గాంచింది.
జవాబు:
శత్రర్ధకం
3. లక్ష్మీకాంతమ్మ గారు విమానం అధిరోహించి తూర్పు జర్మనీ చేరుకుంది.
జవాబు:
క్త్వార్థకం
4. రూబెన్ పండితుడు కాళిదాసు రచనలు అధ్యయనం చేస్తూ మహాగ్రంథాలు రచించాడు.
జవాబు:
శత్రర్ధకం
5. నిగ్రహం లేకపోతే అనుకున్న కార్యాలు సఫలం కావు.
జవాబు:
చేదర్థకం
6. నేను శ్రీమతి రిఛెల్ పండితురాలిని చూసి చాలా నేర్చుకున్నాను.
జవాబు:
క్త్వార్థకం
7. భారతీయ సంస్కృతిని గురించి తెలుపుతూ నాకు తోచిన – సాహిత్య సేవ చేస్తున్నాను.
జవాబు:
శత్రర్ధకం
8. స్వార్థ భోగ విలాసయుతమైన జీవితాన్ని విడిచి పెడితే యువత బాగుపడుతుంది.
జవాబు:
చేదర్థకం
9. శకుంతల రాజును గడ్డిపోచవలె తిరస్కరించి మరీచముని ఆశ్రమానికి వెళ్ళింది.
జవాబు:
క్త్వార్థకం
10. జర్మనులు ఎంతోమంది తమిళభాషలలో పరిశోధనలు చేస్తూ సంస్కృతం నేర్చుకుంటున్నారు.
జవాబు:
శత్రర్ధకం
కర్మణి వాక్యాలు
సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
1. కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖర చరిత్ర నవల రాశారు. (FA-3:2023-24)
అ) కందుకూరి వీరేశలింగం గారిచే రాజశేఖర చరిత్ర నవల రాయబడింది.
ఆ) రాజశేఖర చరిత్రచే కందుకూరి వీరేశలింగం గారి నవల రాయబడింది.
ఇ) కందుకూరి వీరేశలింగం గారిచే రాజశేఖర చరిత్ర నవల రాయబడుతోంది.
ఈ) కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖర చరిత్ర నవలను రాస్తున్నారు.
జవాబు:
అ) కందుకూరి వీరేశలింగం గారిచే రాజశేఖర చరిత్ర నవల రాయబడింది.
2. ఆమె రూబెన్ ను చూశారు.
అ) రూబెన్ చేత ఆమె చూడబడ్డారు.
ఆ) ఆమె చేత రూబెన్ చూడబడ్డాడు.
ఇ) రూబెన్, ఆమె చూడబడ్డారు.
ఈ) పరస్పరం రూబెన్, ఆమె చూడబడ్డారు.
జవాబు:
ఆ) ఆమె చేత రూబెన్ చూడబడ్డాడు.
3. ఆయన ఋషిని జ్ఞప్తికి తెస్తారు.
అ) ఆయన చేత ఋషి జ్ఞప్తికి తేబడ్డాడు.
ఆ) ఋషి చేత ఆయన జ్ఞప్తికి తేబడ్డాడు.
ఇ) ఆయన, ఋషి జ్ఞప్తికి తేబడ్డారు.
ఈ) ఋషిని ఆయన జ్ఞప్తికి తెచ్చుకోబడ్డాడు.
జవాబు:
అ) ఆయన చేత ఋషి జ్ఞప్తికి తేబడ్తాడు.
4. ఆయన కాళిదాసు రచనలను అధ్యయనం చేశారు.
అ) కాళిదాసు చేత ఆయన రచనలు అధ్యయనం చేయబడ్డాయి.
ఆ) ఆయన చేత రచనలు, కాళిదాసు అధ్యయనం చేయబడ్డారు.
ఇ) ఆయన, కాళిదాసు రచనల చేత అధ్యయనం చేయబడ్డారు.
ఈ) ఆయన చేత కాళిదాసు రచనలు అధ్యయనం చేయబడ్డాయి.
జవాబు:
ఈ) ఆయన చేత కాళిదాసు రచనలు అధ్యయనం చేయబడ్డాయి.
5. జర్మనులు సంస్కృత గ్రంథాలను అనువదించారు.
అ) జర్మనుల చేత సంస్కృత గ్రంథాలు అనువదించబడ్డాయి.
ఆ) సంస్కృతం చేత జర్మనుల గ్రంథాలు అనువదించబడ్డాయి.
ఇ) గ్రంథాల చేత సంస్కృతం, జర్మనులు అనువదించబడిరి.
ఈ) సంస్కృత గ్రంథాల చేత అనువదించబడినవి.
జవాబు:
అ) జర్మనుల చేత సంస్కృత గ్రంథాలు అనువదించబడ్డాయి.
6. వారు మన తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు.
అ) వారి చేత మన చేత తెలుగు సాహిత్యం అధ్యయనం చేయబడింది.
ఆ) మన చేత వారి తెలుగు సాహిత్యం అధ్యయనం చేయబడింది.
ఇ) వారి చేత మన తెలుగు సాహిత్యం అధ్యయనం చేయబడింది.
ఈ) వారి తెలుగు మన చేత సాహిత్యాధ్యయనం చేయబడింది.
జవాబు:
అ) వారి చేత మన తెలుగు సాహిత్యం అధ్యయనం చేయబడింది.
7. ఉపనిషత్తులు ఈశ్వరుని నిజతత్వం చెబుతాయి.
అ) ఈశ్వరుని చేత ఉపనిషత్తుల నిజతత్వం చెప్పబడింది.
ఆ) ఉపనిషత్తుల చేత ఈశ్వరుని నిజతత్వం చెప్పబడతాయి.
ఇ) ఉపనిషత్తుల చేత ఈశ్వరుని నిజతత్వం చెప్పబడును.
ఈ) ఉపనిషత్తుల చేత ఈశ్వరుని నిజతత్వం చెప్పబడుతోంది.
జవాబు:
ఆ) ఉపనిషత్తుల చేత ఈశ్వరుని నిజతత్వం చెప్పబడతాయి.
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.
1. ఆమె స్ట్రే నదిని చూసి ఆనందించారు.
జవాబు:
సంశ్లిష్ట వాక్యం
2. ఆమె భారతం, రామాయణం చదివేరు.
జవాబు:
సంయుక్త వాక్యం
3. జర్మనీ పండితులు సంస్కృతం మాట్లాడగలరు.
జవాబు:
సామర్ధ్యార్ధకం
4. పండితులందరూ రండి.
జవాబు:
విధ్యర్థకం
5. రామాయణం అనువదిస్తే చదువుతారు.
జవాబు:
చేదర్థకం
6. మహాగ్రంథాల గురించి తెలియనివి మాట్లాడవద్దు.
జవాబు:
నిషేధార్థకం
7. మనకు పత్రికలున్నా చదవం.
జవాబు:
అప్యర్థకం
8. సంస్కృతం అర్థంకాక చదవలేదు.
జవాబు:
హేత్వర్థకం
9. దయచేసి భారతం చదవండి.
జవాబు:
హేత్వర్థకం
10. అన్ని మతగ్రంథాలనూ చదువవచ్చు.
జవాబు:
అనుమత్యర్థకం
11. ఓ కవయిత్రీ! కలకాలం చల్లగా ఉండు.
జవాబు:
ఆశీరర్థకం
12. ఇది నవలా?
జవాబు:
ప్రశ్నార్థకం
13. విమానం వస్తుందో! రాదో!
జవాబు:
సందేహార్థకం
14. నేను తప్పక సంస్కృతం నేర్చుకొంటాను.
జవాబు:
నిశ్చయార్థకం
వాక్య రకాలు
ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.
1. ఆమె బెర్లిన్, చెకొస్లోవేకియాలకు వెళ్లారు.
అ) సందేహార్ధకం
ఆ) చేదర్థకం
ఇ) సంక్లిష్టం
ఈ) సంయుక్తం
జవాబు:
ఈ) సంయుక్తం
2. నన్ను ఆపే అధికారం నీకెక్కడిది?
అ) ప్రశ్నార్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) నిశ్చయార్థం
ఈ) విధ్యర్థకం
జవాబు:
అ) ప్రశ్నార్థకం
3. పండితులను గౌరవించండి.
అ) అప్యర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిశ్చయార్థం
ఈ) సంయుక్తం
జవాబు:
అ) అప్యర్థకం
4. జర్మనీ వెళ్ళినా మనవాళ్లే ఉన్నారు.
అ) విధ్యర్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) అప్యర్థకం
ఈ) సంశ్లిషం
జవాబు:
ఇ) అప్యర్థకం
5. నేర్చుకుంటే సంస్కృతం వస్తుంది.
అ) అప్యర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
ఈ) చేదర్థకం
6. దయచేసి జర్మనీ మళ్లీ రండి.
అ) ప్రార్థనార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) అప్యర్థకం
ఈ) సంశ్లిష్టం
జవాబు:
అ) ప్రార్థనార్థకం
7. మా దేశంలో ధూమపానం చేయవద్దు.
అ) విధ్యర్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఆ) నిషేధార్థకం
8. మీరు మీ భాషలో మాట్లాడుకోవచ్చు.
అ) విధ్యర్థకం
ఆ) అప్యర్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
ఇ) అనుమత్యర్థకం
9. ఆహా! భారతదేశం ఎంత బాగుందో!
అ) ఆశ్చర్యార్థకం
ఆ) అప్యర్థకం
ఇ) విధ్యర్థం
ఈ) చేదర్థకం
జవాబు:
అ) ఆశ్చర్యార్థకం
10. నేను కచ్చితంగా రామాయణం చదువుతాను.
అ) నిశ్చయార్థకం
ఆ) ఆశ్చర్యార్ధకం
ఇ) విధ్యర్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
అ) నిశ్చయార్థకం
11. దీర్ఘ సుమంగళీభవ!
అ) ఆశ్చర్యార్థకం
ఆ) ఆశీరర్థకం
ఇ) నిషేధార్థకం
ఈ) విధ్యర్థకం
జవాబు:
ఆ) ఆశీరర్థకం
12. వారు వింటారో! వినరో!
అ) నిశ్చయార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) అప్యర్థకం
ఈ) సందేహార్థకం
జవాబు:
ఈ) సందేహార్థకం
13. దయచేసి సవ్యంగా మాట్లాడండి.
అ) ప్రార్థనార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) అప్యర్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
అ) ప్రార్థనార్థకం
14. మీరిక కవిత చెప్పవచ్చు.
అ) నిశ్చయార్థకం
ఆ) అప్యర్థకం
ఇ) అనుమత్యర్థకం
ఈ) సందేహార్ధకం
జవాబు:
ఇ) అనుమత్యర్థకం
15. ఈ పాఠం పేరేమిటి?
అ) ప్రశ్నార్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) అప్యర్థకం
ఈ) చేదర్థకం
జవాబు:
అ) ప్రశ్నార్థకం