Access to the AP 9th Class Telugu Guide 11th Lesson ఆశావాది Questions and Answers are aligned with the curriculum standards.
ఆశావాది AP 9th Class Telugu 11th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి :
నాక్కొంచెం నమ్మకమివ్వు
నాక్కొంచెం నమ్మకమివ్వు
కొండలు పిండి కొట్టేస్తాను
చితికిన టొమేటోలాంటి సూర్యుణ్ణి
ఆరిన అప్పడంలాంటి చంద్రుణ్ణి
ఆకాశపు ఎంగిలి పత్ళెంలోంచి నెట్టేస్తాను!
నాదగు బాహుబంధనంలో
ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను!
నిస్సహాయ మానవేయుని నొసటివ్రాలు
ఒక్క కలంపోటుతోటి కొట్టేస్తాను.
జీవిత సభా భవన ద్వారంనుంచి
అన్యాయాన్ని, అక్రమాన్ని మెడబట్టి గెంటేస్తాను.
ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేసేస్తాను.
కాని ఒక్కటి,
నాక్కొంచెం నమ్మకమివ్వు.
కాలునిమీద కలబడతాను
పరమళివుని శూలాగ్రాన తలక్రిందుగ నిలబడతాను
ఇంటింటా గగనకుసుమాలు మూడుపూవులుగా
నందన నికుంజాల అమృతఫలాలు ఆరుకాయలుగా
పూయిస్తాను, కాయిస్తాను,
కొయ్యతుపాకి దొరనౌతాను,
బావులు పూడ్పిస్తాను, చెరువులు త్రవ్విస్తాను
ఆకాశపు పందిరిక్రింద
నయాగరా నిర్జరాల చలివేంద్రాలు స్థాపిస్తాను.
ప్రపంచమనే మహాసత్రం నిండిపోతే
మరో సత్రం కట్టిస్తాను.
ఆకాశపు ఊదారంగు తానును చించి
చొక్కాల్లేని వారందరికి కుట్టిస్తాను.
ఒకటేమిటి, ఏదైనా చేసేస్తాను
కాని ఒకటి
నాక్కొంచెం నమ్మకమివ్వు.
నమ్మకమివ్వు..!
నమ్మకమివ్వు…!!
ఆలోచనాత్మక ప్రశ్నలు :
ప్రశ్న 1.
నీవేదైనా సాధించగలవన్న నమ్మకం నీకు కల్పిస్తే నువ్వేం సాధిస్తావు ?
జవాబు:
నేనేదైనా సాధించగలనన్న నమ్మకం నాకు కల్గిస్తే నేను చాలాసాధిస్తాను. మొత్తం తెలుగు సాహిత్యంలో ఉన్నపుస్తకాలన్నీ చదివేస్తాను. అపారమైన విజ్ఞానం సంపాదిస్తాను. అన్ని సబ్జెక్టులూ చదివేస్తాను. అన్నిటినీ అర్థంచేసేసుకొంటాను, డబ్బు సంపాదిస్తా. పేదలను, అనాథలను, నిస్సహాయులను ఆడుకొంటాను. వారిలో ధైర్యం నింపుతాను. బాగుపడాలనే తపనను రగిలిస్తాను. ఎవ్వరూ బద్ధకస్తులు లేకుండా చేస్తాను. అందరికీ ఆదర్శంగా నిలబడతాను.
ప్రశ్న 2.
మీ తల్లిదండ్రులకు నీ పట్ల నమ్మకం కల్పించిన సందర్భమేది ?
జవాబు:
మా తల్లిదండ్రులకు నాపై చాలాసార్లు నమ్మకం కల్గింది. ఒకసారి మా నాన్నగారు నన్ను ఒక ఆసామి వద్దకు పంపేరు. ఆయన మానాన్నగారికి రూ.50,000/-లు ఇవ్వాలి, కాని, ఇవ్వడం లేదు, ఆ బాకీ వసూలుచేసుకొని రమ్మన్నారు. నేను వెళ్లాను, ఆయనను డబ్బుల విషయం అడిగేను, మీ నాన్నతో మాట్లాడతాలే అన్నాడు, మా నాన్నగారే పంపారనీ, కావల్సి వస్తే ఫోన్ మాట్లాడమని ఇచ్చేను, ఎన్ని విధాల చెప్పాను, చివరికి విసుగెత్తి ఒక మాట అన్నాను, దెబ్బకి రూ.50,000/- ఇచ్చేశాడు. అదేంటంటే, ‘అంకుల్! ఏ విషయాన్నీ చిన్నపిల్లల చేత చెప్పించుకోకూడదని మా తెలుగు మాష్టారు చెప్పారు’ అన్నాను. మరి, ఆయనకు అందులో బాధకలిగించేదేం ఉందో నాకు తెలియదు కానీ, వెంటనే డబ్బులిచ్చారు. మా నాన్నగారికీవిషయం చెప్పాను, డబ్బిచ్చాను, ‘నువ్వు అఖండుడివిరా! మొండి బాకీ వసూలుచేసేసేవు! వెరీగుడ్!’ అన్నారు.
అవగాహన – ప్రతిస్పందన :
ఇవి చేయండి
అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
ప్రశ్న 1.
ఆశావాది ప్రకాశరావు తల్లిదండ్రుల గురించి చెప్పండి.
జవాబు:
ఆశావాది తల్లిగారి పేరు కుళ్లాయమ్మ, తండ్రిపేరు పక్కీరప్ప. పక్కీరప్పగారు ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయులు. వారికి 10 మంది సంతానం. ఆశావాది వారి విద్యాభ్యాసం ఆయన వద్దే సాగింది. శతకాలు బట్టీపట్టించారు. పెద్దబాలశిక్ష చదివించారు. పద్యధారణను తండ్రి పరీక్షించేవారు.
ప్రశ్న 2.
ఆశావాది ప్రకాశరావు రచనలు పేర్కొనండి.
జవాబు:
ఆశావాది ప్రకాశరావుగారు పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోక లీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతం, అవధాన కళాతోరణం, ప్రత్యూష పవనాలు మొదలైనవి రచించారు.
ప్రశ్న 3.
ఆశావాది పూరించిన ఒక సమస్య చెప్పండి.
జవాబు:
తెలుగు డిపార్టుమెంట్లో నండూరి రామకృష్ణమాచార్యులు గారు ‘ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామినిపలికెన్ అనే సమస్య ఇచ్చారు. ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడూ సమాధానం కాదు, కాని, ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఒకామె చెప్పిందని ఇచ్చారు. ఇదే దీనిలోని క్లిష్టతి, ఇటువంటి సమస్యలు పూరించడానికి పాండిత్యం కంటే లోకజ్ఞానం ఎక్కువ అవసరం. అవధాని ఆశావాదికి పాండిత్యం, లోకజ్ఞానం పుష్కలంగా ఉన్నాయి. కనుకనే
క. ప్రశ్నలపై వడి ప్రశ్నలు
ప్రశ్నించెడి తనదు భర్త భావంబేమో
ప్రశ్నించుచు తన యెదలో
ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్.
అని చక్కగా పూరించారు. ప్రశ్నలు వేసే భర్తను మీ ఉద్దేశం ఏమిటని ప్రశ్ననే జవాబుగా మనసులో చెప్పిందని భావం.
ఆ) కింది పేరా చదివి, ప్రశ్నలకు తగిన సమాధానాలు రాయండి.
తెలుగు సాహిత్యంలో అవధాన విద్య ఒక ప్రాచీన ప్రక్రియ. విశేషమైన ధారణ శక్తి దీనికి ఆలంబన. ‘అష్టావధానం’ అంటే ఒకే సమయంలో ఎనిమిది విషయములపైన మనస్సును ఏకాగ్రతతో నిలపడం. అవధానంలో ప్రశ్నలు అడిగేవారిని పృచ్చకులు అంటారు. సమాధానమిచ్చే వారిని అవధాని అంటారు. అవధాని కవేకాక, పండితుడై కూడా ఉండాలి. ఎందుకంటే సమయానుకూలంగా చమత్కార సంభాషణలు జరుపవలసి ఉంటుంది. పృచ్ఛకులు కూడా పండితులై ఉంటారు. అనేక సందర్భాల్లో అవధానిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. అవధానికి అది ఒక పరీక్ష అయితే ఇతరులకు అది వినోదప్రాయంగా ఉంటుంది.
కవిత్వం, కావ్య పఠనం, శాస్త్రార్థం, ఆకాశపురాణం, లోకాభిరామాయణం, చదరంగం, వ్యస్తాక్షరి, పుష్పగణనం అష్టావధానంలోని ప్రసిద్ధ అంశాలు. కొందరు అవధానులు పైన తెలిపిన ఎనిమిదింటిలో కొన్నింటిని తొలగించి వాటి స్థానంలో దత్తపది, నిషిద్ధాక్షరి, గణిత చాతుర్యం ప్రదర్శిస్తారు. అవధానాలలో నేత్రావధానం, నాట్యావధానం అనే ప్రక్రియలు కూడా ఉన్నాయి. అవధానం కేవలం వినోదం మాత్రమే కాదు. అది కవితా, పాండిత్యాలకు పట్టుగొమ్మ ఆంధ్రదేశాన అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానులు ఎందరో ఉన్నారు. మాడుగుల నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావు, మేడసాని మోహన్, కడిమెళ్ళ వరప్రసాద్ మొదలైన వారు అవధానంలో విశేషకృషి చేస్తున్నారు. సాయి కృష్ణ యాచేంద్ర గారు ‘సంగీత గేయధార’ తో అవధానంలో కొత్త వరవడి సృష్టించారు.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
తెలుగు సాహిత్యంలో ఒక ప్రాచీన ప్రక్రియ పేరు రాయండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో మనసులో ‘అవధానం’ ఒక ప్రాచీన ప్రక్రియ.
ప్రశ్న 2.
అష్టావధానం అంటే ఏమిటి ?
జవాబు:
‘అష్టావధానం’ అంటే ఒకే సమయంలో ఎనిమిది విషయాలపై మనస్సును ఏకాగ్రతతో నిలపడం. 8 మంది పృచ్ఛకులు అడిగే ప్రశ్నలకు సమర్థవంతంగా (పద్యాలలో) సమాధానం చెప్పడం. ఆఖరున అన్ని పద్యాలనూ ధారణచేయడం.
ప్రశ్న 3.
అష్టావధానంలో ప్రశ్నలు అడిగేవారిని ……….. అంటారు.
జవాబు:
అష్టావధానంలో ప్రశ్నలు అడిగే వారిని సృచ్ఛకులు అంటారు.
ప్రశ్న 4.
అష్టావధానంలోని అంశాల సంఖ్య ?
అ) 6
ఆ) 7
ఇ) 8
ఈ) 9
జవాబు:
ఇ) 8
ప్రశ్న 5.
పై పేరాలను చదివి ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
అవధానిని తప్పుదోవపట్టించడానికెవరు ప్రయత్నిస్తారు ?
ఇ) కింది పేరా చదివి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.
ఒకసారి ఒక అబ్బాయి పక్కింటి వారి ధాన్యం కొట్టంలో కూర్చొని చిన్న దీపం పెట్టుకుని చదువుకుంటున్నాడు. ఉన్నట్టుండి గాలి వీచడంతో దీపం ఆరిపోయింది. తిరిగి దీపం వెలిగించి చదువుతుండగా అది మళ్లీ ఆరిపోయింది. అలా నాలుగైదు సార్లు జరగడంతో అతనికి కోపమొచ్చింది. “ఈ దీపం చిన్నదవడం వలన ఇలా జరుగుతోంది. గాలి తగిలినా కూడా ఆరిపోవడానికి వీల్లేకుండా ఏదైనా చెయ్యాలి. ఏం చేద్దామా ?” అనుకుంటుండగా ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే తన ఆలోచనను అమలు పరుస్తూ చిన్ని ప్రయోగం చేశారు.
ప్రమాదవశాత్తు మంటలు రేగి ఆ కొట్టం తగులబడిపోయింది. కొడుకు చేసిన పనికి తండ్రికి కోపం వచ్చింది. చుట్టుపక్కలవాళ్లు మంటలు అర్పుతున్నారు. తండ్రి కొడుకుని నడిరోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి బెత్తంతో వీపు తట్లుతేలేలా కొట్టాడు. “ఇంకెప్పుడైన ఇటువంటి పనిచేస్తే చంపేస్తా”నన్నాడు. పాపం ఆ అబ్బాయి తల్లి దగ్గరకు చేరి తప్పు క్షమించమని, ఇంకెప్పుడూ అలాంటి ప్రమాదాలు రానివ్వనని వేడుకొన్నాడు.
తండ్రికి చెప్పి తన ప్రయోగాలు చేసుకోవడానికి అనుమతి ఇప్పించమన్నాడు. తన కొడుక్కి సృజనాత్మకశక్తి ఎంతో ఉందని గ్రహించిన ఆమె అతడికి అన్నివిధాలా సహకరించింది. పట్టు వదలని విక్రమార్కునిలా ఆ అబ్బాయి తన ప్రయోగాన్ని ఆపలేదు. ఆ అబ్బాయి ఇంకెవరోకాదు, ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టి ప్రపంచానికి చీకట్లో వెలుగులు అందించిన థామష్ అల్వా ఎడిసన్.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
‘సృజనాత్మకత’ అంటే ఏమిటి ?
జవాబు:
మనకు ఉన్న ప్రతిభను మెరుగుపరచడం; కొత్తరకంగా ఆలోచించి అన్వేషించడాన్ని ‘సృజనాత్మకత’ అంటారు.
ప్రశ్న 2.
‘పట్టువదలని విక్రమార్కుడు’ – సొంతవాక్యంలో ప్రయోగించండి.
జవాబు:
నేను ఏదైనా మొదలుపెడితే పట్టువదలని విక్రమార్కుడిలా అది పూర్తిచేసేవరకు ప్రయత్నిస్తాను, పూర్తిచేస్తాను.
ప్రశ్న 3.
‘తండ్రి’ – పర్యాయపదాలు రాయండి.
తండ్రి
జనకుడు, నాన్న, పిత
ప్రశ్న 4.
మీ అమ్మ దగ్గర నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్న ఒక్క సందర్భం రాయండి.
జవాబు:
నేను 7వ తరగతిలో మార్కుల విషయంలో అబద్ధం చెప్పాను. ప్రోగ్రస్ కార్డులో దిద్దే ప్రయత్నం చేశాను. దొరికిపోయేను. అప్పుడు మా అమ్మదగ్గర నా తప్పు ఒప్పుకొన్నాను. ఇంకెప్పుడూ అలా చేయనన్నాను.
ప్రశ్న 5.
పై పేరాకు శీర్షిక పెట్టండి.
జవాబు:
“బాలమేధావి”.
వ్యక్తీకరణ – సృజనాత్మకత:
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఆశావాది ‘బాలకవి’గా ఆశీర్వాదం పొందిన సన్నివేశం గురించి రాయండి.
జవాబు:
రిటైర్డు కలెక్టరు శ్రీ బి. జూగప్ప గారి చొరవతో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఆశావాదిగారు స్వాగత పద్యాలు వ్రాశారు. అప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అంటే 18 సం||ల వయస్సు ఉంటుంది, ఆ వయస్సులోనే స్వాగత పద్యాలు రచించారు. ‘బాలకవి’గా శ్రీశైలంలో అమృతాశీస్సులందుకొన్నారు.
ప్రశ్న 2.
ఆసాదిగా ఉన్న ప్రకాశరావు ఇంటి పేరు ఆశావాదిగా ఎలా మారింది ?
జవాబు:
ఆశావాదిగారు ఒక సంవత్సరం గాంధీ జయంతి నాడు మొట్టమొదటి అష్టావధానం చేశారు. అది అందరి ప్రశంసలూ అందుకొంది. అప్పటికాయన డిగ్రీ చదువుతున్నారు. ఈ అవధాన విషయం వాళ్ల తెలుగు శాఖ హెడ్ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులకు తెలిసింది. వారు ఆశావాదిని డిపార్టుమెంటుకు పిలిపించారు. మాస్టర్లునూ పిలిచారు. ఆయన “ప్రశ్నకు ప్రశ్న జవాబు భామిని పలికెన్” అనే సమస్యనిచ్చారు. దానిని అర్థవంతంగా ఆశావాది పూరించారు. (అప్పటివరకు ‘ఆసాది’ వారి ఇంటిపేరు ‘ఆశావాది’ అని ఆశీర్వదించారు. అలాగ ‘ఆసాది’, ‘ఆశావాది’ అయ్యేరు.
ప్రశ్న 3.
ఆశావాది గారు పొందిన పురస్కారాల గురించి రాయండి.
జవాబు:
ఆయన తన 56వ ఏట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ (డి.లిట్) పొందారు. భారత ప్రభుత్వం నుండి 2021లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకొన్నారు.
ప్రశ్న 4.
ప్రకాశరావు అష్టావధానంలోకి ప్రవేశం, అవధాన ప్రక్రియలో వారి కృషిని వివరించండి.
జవాబు:
ఆశావాది తన 19వ ఏట గాంధీ జయంతినాడు మొదటి అష్టావధానం చేశారు. తమ కళాశాల తెలుగు హెడ్ శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు ఇచ్చిన ‘ప్రశ్నకు ప్రశ్నయెజవాబు భామిని పలికెన్” అనే సమస్యను
క. ప్రశ్నలపై వడి ప్రశ్నలు
ప్రశ్నించెడి తనదు భర్త భావంబేమో
ప్రశ్నించుచు తన యెదలో
ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్
అని చక్కగా పూరించారు. వారి ఆశీస్సులతో ‘ఆసాది’ అనే ఇంటిపేరు ‘ఆశావాది’గా మారిపోయింది. అప్పటినుండి 26 సంవత్సరాలు నిరాఘాటంగా 171 అష్టావధానాలు చేశారు. అవి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, న్యూఢిల్లీలోనూ చాలా చోట్ల అష్టావధానాలు చేసి మెప్పుపొందేరు, 1999 ఉగాది రోజున నారాయణ్ ఖేడ్లో చిట్టచివరి అష్టావధానం చేశారు.
ఆ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఆశావాది వారి సాహితీ జీవన ప్రస్థానం తెలుసుకున్నారు కదా ! మీరు తెలుసుకున్న విషయాలను మీ మిత్రునికి ‘లేఖ’ రూపంలో రాయండి.
లేఖ
నెల్లూరు,
X X X,
ప్రియమైన అఖిల్ కు,
నేను ఇక్కడ క్షేమం, అక్కడ మీరంతా క్షేమంగా ఉన్నట్లు తలచెదను.
మాకు ‘ఆశావాది’ పాఠం చెప్పారు. ఆశావాదిగారు 19వ ఏటనే అవధానాలు ప్రారంభించారు. తొలి అవధానంలోనే పెద్దపెద్ద పండితులను మెప్పించారుట. ‘ఆసాది’ అనే తన ఇంటిపేరు అప్పటి నుండి ‘ఆశావాది’గా మారిపోయింది. 26 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ వంటి అనేకచోట్ల 171 అష్టావధానాలు చేశారు.
ఎన్నో ఒడిదుడుకులెదుర్కొన్నారు. ఎంతో సంయమనంతో అవధానాలు చేసేవారు. ఎన్నో గ్రంథాలు చదివేరు. ఎంతో పాండిత్యం సంపాదించేరు. ఎంతో మంది పెద్దపెద్ద పండితుల ప్రశంసలందుకొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకొన్నారు. 2021లో పద్మశ్రీ అందుకొన్నారు.
నాకు కూడా ఆయనలాగ గౌరవం, జ్ఞానం సంపాదించాలని ఉంది. ఈ పాఠం మీద నీ అభిప్రాయం వ్రాయి,
ఉంటాను మరి.
ఇట్లు,
నీ స్నేహితుడు,
కె. నిఖిల్ వ్రాలు,
9వ తరగతి.
చిరునామా :
డి. అఖిల్, నెం. 14,
శ్రీనంద్ పాఠశాల,
గనికమ్మగుడి దగ్గర,
అమలాపురం,
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.
ప్రశ్న 2.
మీకు దగ్గర్లోని రైతు / ఆరోగ్య కార్యకర్త / శ్రామికుడు / పోలీసు / ప్రజాప్రతినిధి వీరిలో ఎవరితోనైనా ‘ముఖాముఖి’ (ఇంటర్వ్యూ) నిర్వహించేందుకు 10 ప్రశ్నలు తయారు చేయండి.
జవాబు:
సమస్కారమండీ ! రండి ! రండి !
ప్రశ్నలు :
- మీ పేరు చెబుతారా ?
- మీరు ఈ ఉద్యోగమే ఎందుకు ఎన్నుకొన్నారు ?
- మీ చిన్నతనం నుండి ఎవరెక్కువ ప్రోత్సహించారు ?
- మీకు హైస్కూల్లో మార్కులెలా వచ్చేవి ?
- మీకు ఏమైనా అవార్డులు వచ్చేయా ?
- మీతో మీపై అధికారులెలా ఉంటారు ?
- సమస్యలు వస్తే మీకు భయం వేయదా ?
- మీ డ్యూటీ ఎన్ని గంటలండీ ?
- అవినీతి అధికారులపై మీ అభిప్రాయం ఏమిటండీ ?
- మీరు మా విద్యార్థులకేదైనా సందేశం ఇస్తారా ?
ప్రశ్న 3.
ఈ కింది ‘కవిత’ చదవండి. ఆలోచించండి. కవితను పొడిగించి రాయండి.
నాకూ ఒక ‘కల’ ఉంది
ఆకాశంపైన అడుగులు వేయాలని
నక్షత్రాల ఇంట వెలగాలని
సంద్రంలో అలనై ఎగరాలని
చీకట్లో మిణుగురై తిరగాలని
నాకూ ఒక ‘కల’ ఉంది
……………………
జవాబు:
చీకటిని తరిమే వెలుగునవ్వాలని
పువ్వులా పరిమళాలు పంచాలని
సాటి మనిషి కష్టంలో తోడుండాలని
దేశం ప్రగతిని సాధించాలని
నాకూ ఒక ‘కల’ ఉంది.
భాషాంశాలు :
పదజాలం :
అ) ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాయండి. ఆ అర్థాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
1. సజ్జనులతో ‘గోష్ఠి’ శ్రేయోదాయకం.
జవాబు:
గోష్ఠి = సల్లాపము
సొంత వాక్యం : మంచి మిత్రుల సల్లాపముతో ప్రొద్దు తెలీదు.
2. కొంతమంది కవులు పద్యాలను ‘ఆశువు’గా చెపుతారు.
జవాబు:
ఆశువు = వేగము కలది.
సొంత వాక్యం : గరికపాటి వారి పద్యం వేగం కలది.
3. అవధాన ప్రక్రియలో ‘పృచ్ఛకులు’ ప్రశ్నలు అడుగుతారు.
జవాబు:
పృచ్ఛకులు = ప్రశ్నించేవారు
సొంత వాక్యం : ప్రశ్నించేవారు సమర్థులైతేనే అవధానికి ఆనందంగా ఉంటుంది.
ఆ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయపదాలు రాయండి.
1. అవధాన ప్రక్రియలో నేత్రావధానం కూడా ఉంటుంది.
జవాబు:
నేత్రం = కన్ను, నయనము, అక్షి
2. నాన్న కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తాడు.
జవాబు:
నాన్న= తండ్రి, జనకుడు, పిత
3. ఆకాశాన కౌముది ప్రకాశం ఎంతో మనోహరంగా ఉంది.
జవాబు:
కౌముది = వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న
ఇ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్థాలు రాయండి.
1. కవికి సామాజిక స్పృహ అవసరం.
జవాబు:
కవి = శుక్రుడు, కావ్యకర్త, నీటి కాకి
2. విద్యార్థుల్లో జ్ఞానజ్యోతులను వెలిగించేవాడు గురువు.
జవాబు:
గురువు = బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి
3. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.
జవాబు:
కృషి = ప్రయత్నము, సేద్యము, జీవనోపాయం.
ఈ) కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
1. కృతులు
నెరవేరిన పనిగలవారు – నేర్పరులు
2. పౌత్రుడు = కొడుకు
కొడుకు – మనుమడు
3. ఆచార్యుడు = వేద వ్యాఖ్యానము చేయువాడు / ఏదైన ఒక విషయముపై నిశిత పాండిత్యం కలవాడు – గురువు
ఉ) కింది పట్టికలోని ప్రకృతులకు – వికృతులు, వికృతులకు – ప్రకృతులు రాయండి.
ప్రకృతి – వికృతి
- దైవం – దయ్యం
- అక్షరం – అక్కరం
- కార్య – కర్జం
- పద్యం – పద్దెం
- కీర్తి – కీరితి
- సందేహం – సందియం
- వ్యర్థ – వమ్ము
- కానుక – కానిక
- కవిత – కైత
- విజ్ఞానం – విన్నాణం
ఈ కింది జాతీయాలను వివరించండి.
1. ఎత్తిపొడుపు : గతంలో జరిగిన సంఘటనల గురించి ఏదో వంక పెట్టుకొని ఇతరుల మనసును బాధపెట్టే మాటలను మాట్లాడే వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
2. కత్తిమీద సాము : చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ చాకచక్యంతో ప్రవర్తించే సందర్భాన్ని వివరించేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు.
3. తామరతంపర : ఒక చెరువులో తామర విత్తనం ఒకటి పడితే అది అలలా విస్తరించి, చెరువు మొత్తం తామర పూలతో నిండిపోతుంది. అంత తొందరగా ఏదీ విస్తరించదు. దాని గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సంధులు :
వ్యాకరణాంశాలు :
అ) పాఠ్యాంశంలోని కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
జవాబు:
ఆ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
జవాబు:
ఇ) కింది విడదీసిన పదాలను కలపండి, సంధి పేరు రాయండి.
జవాబు:
వృద్ధి సంధి : అకారానికి ఏ, బలు పరమైతే ఐకారము, ఓ, ఔలు పరమైనప్పుడు ఔకారము ఆదేశమవుతాయి.
ఈ) కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1. మధుర భాషణము : మధురమైన భాషణము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. మూడు సంవత్సరాలు : మూడు సంఖ్య గల సంవత్సరాలు – ద్విగు సమాసం
3. కళా గోష్ఠి : కళలకు సంబంధించిన గోష్ఠి – షష్ఠీ తత్పురుష సమాసం
ప్రత్యక్ష పరోక్ష కథనాలు:
ప్రత్యక్ష కథనం : ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడాన్ని ‘ప్రత్యక్ష కథనం’ అంటారు. కింది ఉదాహరణను చూడండి.
“నేను తలచుకుంటే ఏదైనా సాధించగలను” అని వర్షిత్ అన్నాడు.
పరోక్ష కథనం : వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు. కింది ఉదాహరణను చూడండి.
తాను బాగా చదువుకుని, ఒక గొప్ప స్థితికి చేరుకుంటానని మోక్ష అన్నది.
ఈ రెండూ అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి కథనం చివర ‘అని’ వాడతాం. దీనిని అనుకారకం అంటారు.
ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చడానికి పాటించవలసిన నియమాలు
ప్రత్యక్ష కథనంలో వ్యక్తి యథాతథంగా చెప్పిన మాటలను ఉద్ధరణ చిహ్నాలలో “………. చూపించాలి. పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు ఉండవు.
ప్రత్యక్ష కథనంలో ‘నేను’ పరోక్ష కథనంలో ‘తను’ అవుతుంది.
అ) కింది ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.
1. “నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి” అని రఫీ చెప్పాడు.
జవాబు:
తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు.
2. “పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది” అని వాళ్ళ నాన్నగారు అన్నారు.
జవాబు:
పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు.
3. “మీరంతా ఎక్కడి నుండి వస్తున్నారు ?” అని శైలజ పిల్లల్ని అడిగింది.
జవాబు:
మీరంతా ఎక్కడి నుండి వస్తున్నారని శైలజ పిల్లల్ని అడిగింది.
4. “నాకు ఈత అంటే ఎంతో సరదా. ఈత కొట్టడం ఆరోగ్యం కూడా” అని అక్షయ అన్నది.
జవాబు:
తనకు ఈత అంటే ఎంతో సరదాని, ఈత కొట్టడం ఆరోగ్యం కూడాయని అక్షయ అన్నది.
ఆ) కింది పరోక్ష కథనంలోని వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.
1. చదువుకన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు.
జవాబు:
“చదువుకన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం” అని ఉపాధ్యాయులు చెప్పారు.
2. తను జీవితంలో ఎన్నో కష్టాలనెదుర్కొని ఈ స్థితికి చేరానని కలామ్ అన్నారు.
జవాబు:
“నేను జీవితంలో ఎన్నో కష్టాలనెదుర్కొని ఈ స్థితికి చేరాను” అని కలామ్ అన్నారు.
3. తామంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటామని పిల్లలు చెప్పారు.
జవాబు:
“మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటాము” అని పిల్లలు చెప్పారు.
4. తానొక ప్రకృతి ఆరాధకుడినని విజయ్ అన్నాడు.
జవాబు:
“నేనొక ప్రకృతి ఆరాధకుడిని” అని విజయ్ అన్నాడు.
ప్రాజెక్టు పని :
క్యూ. ఆర్. కోడ్ను స్కాన్ చేయండి. ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటన అనంతరం ఆశావాది గారి ఉపన్యాసం విని సమీక్ష రాయండి. మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
క్యూ.ఆర్. కోడ్ను స్కాన్ చేయండి. ఆహ్వానపత్రికను పరిశీలించి మీ పాఠశాల అవధాన కార్యక్రమానికి ఆహ్వానపత్రికను తయారు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
పద్య మధురిమ :
ఉ॥ పూరితసద్గుణంబుగని పుణ్యునకించుక రూపసంపదల్
దూరములైన వానియెడ దొడ్డగ జూతురు బుద్ధిమంతు లె
ట్లారయగోగ్గులైన మఱియందుల మాధురి జూచి కాదె ఖ
ర్జూరఫలంబులం బ్రియము జొప్పడ లోకులు గొంట భాస్కరా !
భాస్కర శతకం – మారద వెంకయ్య
భావం : భాస్కరా ! గుణవంతునికి అందము, ఐశ్వర్యమూ లేకున్నా బుద్ధిమంతులు అతని పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. ఎలాగంటే ఖర్జూర ఫలాలు ఆకారంలో అందంగా లేకపోయినప్పటికీ లోకులు వాటి మాధుర్యాన్ని స్వీకరిస్తారు కదా !
రచయిత పరిచయం :
రచయిత : ఆశావాది ప్రకాశరావు
కాలం : 02.08.1944 నుండి 17.02.2022
తల్లిదండ్రులు : కుళ్లాయమ్మ, పక్కీరప్ప దంపతులు.
జన్మస్థలం : అనంతపురం జిల్లా, శింగనమల మండలం, కొరవి పల్లె గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో.
గురువు : శతావధాని సి.వి. సుబ్బన్న
రచనలు : పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలాసూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు మొదలైనవి.
ప్రత్యేకతలు : ‘పద్యం కమ్మగా పాడువాడు, పద్యవిద్యను కాపాడువాడు, పద్యద్వేషనలతో రాపాడువాడు’ అవి సి.నా.రె.చే పొగడబడిన వాడు. 19వ ఏట అవధానం ప్రారంభించారు. 26 సంవత్సరాలు కొనసాగించారు. 171 అవధానాలు చేశారు.
బిరుదు : 2021లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకొన్నారు.
ఉద్దేశం :
విద్యార్జనకు కృషి, దీక్ష, పట్టుదల కావాలి. ఏ అవరోధాలునైనా అధిగమించి విద్యార్జన చేయవచ్చని నిరూపించిన ఘనులు అష్టావధాని ఆశావాది ప్రకాశరావుగారు. స్వయంకృషితో అక్షర సింహాసనమెక్కి తెలుగు సాహితీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ధీశాలి ఆయన, పద్యరచనలో పట్టు సాధించారు. అష్టావధానిగా రాణించారు. అత్యున్నతమైన పద్మశ్రీ అందుకొన్నారు. నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆ సాహితీమూర్తి జీవన ప్రస్థానాన్ని తెల్పడం ద్వారా విద్యార్థులను ఉత్తేజితుల్ని చేయడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
ప్రక్రియ – ముఖాముఖి :
ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయులను గురించి వారి మాటలలోనే చెప్పించడం ముఖాముఖి. వారిని వినయంగా ప్రశ్నిస్తూ విషయాలు రాబట్టడమే ముఖాముఖి, ప్రశ్నించే వారు చాలా చాకచక్యంగా వ్యవహరించాలి.. నేర్పుగా జవాబులు రాబట్టాలి, వారి ఆశలు, ఆశయాలు, జీవితంలోని ఎత్తుపల్లాలు, వారి కార్యసాధనలో ఎదురైన అడ్డంకులు, అవి వారధిగమించిన తీరు ఇవన్నీ రాబట్టాలి, భవిష్యత్తరాలకు అపాఠాలుగా ఉపయోగపడాలి.
ప్రవేశిక :
సాహితీ వ్యవసాయంలో పద్య సేద్యం చేసిన ఓ ‘భాషా పరిమళం’, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ ‘అష్టావధాన రూపం’ ఆశావాది ప్రకాశరావు. “నీదే కులం ?” అని అడిగినవారికి నాది ‘కవితా కులం’ అని చాటిన కవితావాది ‘ఆశావాది’. “అవధానం కొందరి సొత్తు… అది నీవెలా చేస్తావు” అన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానమిచ్చిన సౌజన్యమూర్తి ఆయన. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు.
తిరుపతి వేంకట కవులను ప్రేరణగా తీసుకుని, సి.వి. సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకుని సాగించిన వారి ‘సాహితీ ప్రస్థానం’ విశిష్ట పురస్కారాలకు వేదికైంది. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్చే ‘బాలకవి’గా పిలిపించుకొని, మొన్నటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న భాషాజీవి. ‘అష్టావధాని’గా అత్యున్నత శిఖరం అధిరోహించిన ఆ ప్రకాశరావు జీవిత విశేషాలను ప్రకాశరావు రచించడి. ప్రకాశ ప్రదీపనం’ లోనిది.
పదాలు – అర్థాలు :
- ప్రణామాలు = నమస్కారాలు
- ఆశ = కోరిక
- శ్వాస = ఊపిరి
- ప్రస్థానము = ప్రయాణము
- పుత్రుడు = కొడుకు
- వృత్తి = పని
- పుణ్యమూర్తి = పవిత్రుడు
- సంతానం = పిల్లలు
- పూజారి = అర్చకుడు
- ఆశువు = వేగంగా చెప్పేది
- సభ = పరిషత్తు
- గ్రామాలనే = పల్లెటూర్లలో
- కల = ఉన్న
- దేవతా = దేవతల యొక్క
- కథనములే = గాథలు
- గానంబునన్ = పాటలలో
- తీర్చుచునే = పాడుతూ
- రోమా+అంచంబును = శరీరం పులకించుటను
- కూర్చు = చేసే
- కాన్కలు = బహుమతులు
- కొనే = తీసుకొనే
- ఆచారమే = సంప్రదాయమే
- శ్రీమత్ + దివ్య = గొప్పదైన
- వధాన = అవధాన విద్యకు
- ముఖ్యగురువు + ఔ = ప్రధాన గురువైన
- శ్రీ సి.వి. సుబ్బన్నచేన్ = సుబ్బన్నగారివలన
- శ్రీమంతుత్ = బుద్ధిమంతులు
- కొని + ఆడ = పొగడగా
- నా వాక్కుననే = నా మాటలలో
- పద్యము + అయి = పద్యమై
- సందీపించె = ప్రకాశించింది
- వ్యాసంగం = పని
- బీజం = విత్తనం
- కంఠస్థం = బట్టీ
- ధారణ = జ్ఞాపకం
- పఠనం = చదవడం
- పుట = పేజీ
- వార్షిక సంచిక = స్నాతకోత్సవ పత్రిక
- అస్పృశ్యత = అంటరానితనం
- సహనం = ఓర్పు
- కార్యం = పని
- దీక్ష = పట్టుదల
- ఆకస్మికంగా = హఠాత్తుగా
- మొలకెత్తింది = అంకురించింది
- ఆధ్వర్యం = నిర్వహణ
- ప్రసంగం = ఉపన్యాసం
- ఆసక్తి = ఇష్టం
- ఒదిగి = ఇమిడి
- గ్రంథం = పుస్తకం
- ఆద్యంతం = మొదటినుండి చివరిదాకా
- పీఠిక = ముందుమాట
- తప్పనిసరి = తప్పక
- క్రీగీటు = క్రిందగీత
- స్పందన = కదలిక
- వమ్ము = వృథా
- అవశ్యం = అవసరం
- దృష్టి = చూపు
- అన్వేషణ = వెదకుట
- అంశము = విషయము
- సామర్ధ్యం = పనితనం
- తరచూ = ఎక్కువగా
- అసంబద్ధత = తగని
- ప్రత్యర్థులు = ఎదుటివారు
- జ్ఞానార్జన = విజ్ఞాన సంపాదన
- పురస్కారము = సన్మానం
- పౌత్రుడు = మనుమడు
- అముద్రితం = ముద్రితంకానిది
- కల్యాణము = పెళ్లి
- నిరోష్ఠ్యము = పెదవులు కదలకుండా చదివేది
- నమోదు = వ్రాయుట
- అవాచ్య = చెప్పలేని
- విరమించుట = తొలగుట
- విరామం = విశ్రాంతి
- తుల్యుడు = సమానుడు
- తులనాత్మక పరిశీలన = రెంటినీ సరిగా పరిశీలించుట
- సదస్సు = సమావేశం
- సువర్ణము = బంగారము
- గోపురము = గవను
- సత్కరించడం = సన్మానించడం
- బాణి = పద్దతి
- చిటిపొటి = చిన్నిచిన్ని
- స్తుతి = పొగడ్త
- వినయవతే = వినయంతో కూడిన
- ప్రకాశ = ఆశావాది ప్రకాశరావూ!
- వరద శతకమ్ము = వరద శతకం
- సకలమ్ము = అంతా
- చదివినాడ = చదివేను
- నీదు = నీ యొక్క
- కైతపసకు = కవితాశక్తికి
- కరిగినాడ = కరిగిపోయేను
- ఆకృతి = ఆకారం
- నీకు = నీకు
- ఆంధ్రకవికోటిలో = తెలుగు కవులలో
- పీట = ఆసనం
- కలదు = ఉంది
- జంకు = భయం, సంకోచం
- వలదు = వద్దు
- అభినందనలు = పొగడ్తలు
- వగైరా = మొదలైన
- విరహితం = లేకుండా
- ఆశంస = కోరిక
- మేరువు = బంగారు పర్వతం
- సరళము = సులభము
- అనువాదం = తర్జుమా
- మున్నుడి = ముందుమాట
- భూషణము = నగ
- పరంపర = వరుస
- ప్రలోభం = మిక్కిలి లోభం
- పరిశ్రమ = కష్టం
- వేళ = సమయం
- నేపథ్యం = తెరవెనుక
- ముచ్చట్లు = కబుర్లు
- ప్రశ్నలపై = ప్రశ్నల మీద
- వడి = వేగంగా
- ప్రశ్నలు = ప్రశ్నలనే
- ప్రశ్నించేడు = ప్రశ్నించే
- తనదు భర్త = తన మగని
- భావంబు + ఏమో = భావం ఏమిటో
- ప్రశ్నించుచు = ప్రశ్నిస్తూ
- భామిని = స్త్రీ (భార్య)
- తన + ఎదలో = తన మనసులో
- ప్రశ్నకు = ప్రశ్నకు
- ప్రశ్నయె = ప్రశ్నే
- జవాబు = జవాబుగా
- పలికెన్ = మాట్లాడింది
- అంతేవసిత్వం = శిష్యరికం
- వికాసం = అభివృద్ధి
- అండ = ఆసరా
- సాధన = అభ్యాసం
- నిరాఘాటంగా = అడ్డులేకుండా
- దాదాపు = ఇంచుమించు
- దీపిక = దీపం
- కౌముది = వెన్నెల
- వసంతం = మధుమాసం
- అప్రస్తుతం = ప్రస్తుతం కానిది
- మంగళం పాడడం = ముగించడం
- అనుకూలము = సరిపడు
- ఆతిథ్యం = అతిథిమర్యాద
- వివక్ష = భేదం
- ఎరుక = జ్ఞాపకం
- చవి = రుచి
- అన్యాపదేశం = వంక పెట్టిచెప్పడం.
- దాఖలా = ఆధారం
- శతధా = వందరకాలుగా
- సొత్తు = సొమ్ము
- శుష్క ప్రియాలు = ఉపయోగంలేని మాటలు
- శూన్యహస్తాలు = పనిచేయని చేతులు
- పృచ్ఛకుడు = ప్రశ్నించేవాడు (ప్రాశ్నికుడు)
- సన్నివేశం = సంఘటన
- హారం = దండ
- కీర్తి = ఖ్యాతి
- అంతరంగం = మనసు
- కృతులు = రచనలు
- తుత్తునియలు = ముక్కముక్కలు
- నిరసించడం = తిరస్కరించడం
- దశాబ్ది = పదిసంవత్సరాలు
- అనూదితము = అనువాదం
- శ్రోత = వినేవాడు
- సమక్షం = ఎదుట
- తరంగాలు = కెరటాలు
- ఈడిస్తే = లాగితే
- తామరతంపరగా = విరివిగా
- పొంతన = పోలిక
- సామరస్యం = స్నేహం
- అపహాస్యం = వెక్కిరింత
- వ్రాక్ + రూపం = మాటరూపం
- అభ్యర్థించడం = ప్రార్థించడం