AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

These AP 9th Class Telugu Important Questions 11th Lesson ఆశావాది will help students prepare well for the exams.

ఆశావాది AP Board 9th Class Telugu 11th Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. 13వ ఏట నాలో రచయిత మేల్కొన్నాడు. నేను చదివే పాఠశాల వసతి గృహంలో, వ్యాసరచనల పోటీల్లో బహుమతులు నావే. 10వ తరగతిలో ‘అస్పృశ్యతా నివారణ’ను గూర్చి ఒక వ్యాసం వ్రాసి మా పాఠశాల వార్షిక సంచికకు ఇచ్చాను. దాని సంపాదకులు “స్వాతంత్ర్యం వచ్చి పదేళ్లయ్యింది. ఇంకా ఎక్కడుంది అస్పృశ్యత? బుద్ధి లేకుంటే సరి “అంటూ కాగితాలను విసిరికొట్టారు. అది నాలో పట్టుదలను పెంచింది. సహనంతో కార్యం సాధించుకోవలసిన దీక్షను గుర్తుచేసింది. నా 15వ యేట అప్పటికి నాకు తెలిసినప్పటి ఛందోవిజ్ఞానంతో పద్యాలు వ్రాయాలన్న ఆలోచన కలిగింది. ఒకసారి మా నాన్న వ్రాసి ఎవరికీ చెప్పకుండా తన జేబులోనే భద్రపరచుకొన్న కొన్ని కంద పద్యాలను ఆకస్మికంగా చూచాను. ఆ తండ్రి కొడుకుగా పద్యరచనలో పేరు నిలుపుకోవాలన్న ఆశ మొలకెత్తింది.

ప్రశ్నలు – జవాబులు

అ) ఆశావాది వ్రాసిన వ్యాసాన్ని సంపాదకులు అంగీకరించారా?
జవాబు:
ఆశావాది వ్రాసిన వ్యాసాన్ని సంపాదకులు అంగీకరించలేదు.

ఆ) సంపాదకుల తిరస్కారం వలన ఏం ప్రయోజనం కల్గింది?
జవాబు:
సంపాదకుల తిరస్కారం ఆశావాదిలో పట్టుదల పెంచింది.

ఇ) కార్యాన్ని ఎలా సాధించుకోవాలి?
జవాబు:
కార్యాన్ని సహనంతో సాధించుకోవాలి.

ఈ) ఆశావాదిలో ఆశకు కారణం ఏమిటి?
జవాబు:
తండ్రి వ్రాసిన కంద పద్యాలే ఆశావాదిలో ఆశలు మొలకెత్తించాయి.

2. కళాశాలలో సారస్వత సంఘ ఆధ్వర్యంలో తరచు ప్రసిద్ధ కవి పండితుల ప్రసంగాలు ఉండేవి. ఊళ్ళలో రాష్ట్రస్థాయి సంచార నాటక సమాజాలవాళ్లు మూడు నెలలకు ఒకమారైనా తప్పక పద్యనాటకాలు ప్రదర్శించే వాళ్లు. ఆసక్తిగా వీటికి హాజరయ్యేవాడిని. అంతే కాకుండా పాఠశాలలో అప్పటి బోధనా పద్ధతులు, పరీక్షా విధానాలు సృజనాత్మకతను పెంచేవిగా ఉండేవి. ఇవన్నీ పద్యంపై ప్రీతి పెంచుకోవడానికి, అవగాహనలో ఒదిగివచ్చిన వాటికి చక్కని వ్యాసరూపం ఇవ్వటానికి, ధైర్యంగా వేదికలపై ప్రసంగించటానికి తగిన బీజాలు వేశాయి.

ప్రశ్నలు – జవాబులు

అ) కళాశాలలో కవి పండితుల ప్రసంగాలు ఎవరు పెట్టేవారు?
జవాబు:
కళాశాలలో సారస్వత సంఘంవారు కవి పండితుల ప్రసంగాలు పెట్టేవారు.

ఆ) పద్యనాటకాలెక్కడ జరిగేవి?
జవాబు:
పద్యనాటకాలు ఊళ్లో జరిగేవి.

ఇ) పద్యనాటకాలెవరు ప్రదర్శించేవారు?
జవాబు:
సంచార నాటక సమాజాల వాళ్లు పద్య నాటకాలు ప్రదర్శించేవారు.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఆశావాది ధైర్యానికి బీజాలు వేసినవేవి?

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

3. పౌర గ్రంథాలయానికి వెళ్లి ఆసక్తిగల గ్రంథాన్ని తీసుకొనే వాడిని. దానిని ఆద్యంతం చదవకుండా పీఠికను మాత్రం తప్పనిసరిగా చదివేవాడిని. నాకంటే ముందే దాన్ని చూచిన పాఠకులు ఆ పుటల్లో ఎక్కడైనా క్రీగీటులు పెట్టారా?, మరేవైనా గుర్తులు ఉంచారా? స్పందనలు వ్రాశారా? అని చూచి, వాటిపై దృష్టి నిలిపి దానికి కారణాలు అన్వేషించేవాడిని.

దీనివల్ల తక్కువకాలంలో ఎక్కువ విషయసేకరణ జరిగేది. విజ్ఞానం పెరిగేది. వ్రాతకు బలం చేకూర్చే అనేకాంశాలు తెలిసివచ్చేవి. ఈ విధంగా కూర్చుకొన్న రచనా సామర్థ్యం తరచూ చుట్టూ జరిగే అసంబద్ధతలపై కరపత్రాలు తయారుచేసి పంచేదాకా వెళ్లింది. నా ప్రయత్నాన్ని ప్రత్యర్థులు వమ్ముచేస్తూ బెదిరించటంతో ఆ విధానం మానుకున్నాను.

ప్రశ్నలు – జవాబులు

అ) పుస్తక పరిశీలన వలన ఉపయోగం ఏమిటి?
జవాబు:
పుస్తక పరిశీలన వలన విజ్ఞానం పెరిగింది.

ఆ) కరపత్రాలెందుకు మానేశారు?
జవాబు:
బెదిరింపుల వలన కరపత్రాలు మానేశారు.

ఇ) ఒక పుస్తకంలో ఏది తప్పక చదివేవారు?
జవాబు:
ఒక పుస్తకంలో తప్పక పీఠిక చదివేవారు.

ఈ) కరపత్రాలు వేటిపై వేశారు?.
జవాబు:
తన చుట్టూ జరిగే అసంబద్ధతలపై కరపత్రాలు వేశారు.

4. తాళ్లపాక అన్నమాచార్యుల వారి పౌత్రుడు తాళ్ళపాక అన్నయ్య రచించిన ‘చెల్లపిళ్లరాయ చరిత్రము’ (బీబీ నాంచారు కళ్యాణ గాథ) అముద్రిత యక్షగాన తాళపత్రప్రతి సేకరించి పరిశీలించి, క్రిమిదష్ట భాగాలను పూరించి, కవి కాలాదులు నిర్ణయిస్తూ విపులమైన పీఠికతో ప్రచురించాను. శ్రీ రాప్తాటి వారి నిరోష్ఠ్య కృష్ణ శతకానికి లఘుటీక వ్రాసే అవకాశం లభించింది. పి. హెచ్.డి. పట్టాకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయంలో పేరు నమోదు చేసుకొన్నాను, కాని కొన్ని అవాచ్య సంఘటనల మధ్య విరమించాను. కొన్నేళ్ల విరామంతో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లోనూ చేరి సరిపడని సంగతులు తలెత్తటంతో దాని ఆశ వదులుకొన్నాను. ‘అంతకంటె మించిన డిగ్రీ రాకుండా పోతుందా’ అని యథాలాపంగా పలికిన నా మాటను దైవం నెగ్గించాడు. నా 56వ యేట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ (డి.లిట్) లభించింది.

ప్రశ్నలు – జవాబులు

అ) ఆశావాది పీఠికతో ప్రచురించినదేది?
జవాబు:
‘చెల్లపిళ్లరాయ చరిత్రము’ను ఆశావాది పీఠికతో ప్రచురించారు.

ఆ) డాక్టరేట్ ఏ యూనివర్శిటీ ఇచ్చింది?
జవాబు:
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది.

ఇ) నిరోష్ఠ్య కృష్ణ శతక కర్త ఎవరు?
జవాబు:
నిరోష్ఠ్య కృష్ణ శతక కర్త రాప్తాటి వారు.

ఈ) పిహెచ్.డి. కి ఎన్ని యూనివర్శిటీలలో ప్రయత్నించారు?
జవాబు:
పిహెచ్.డి. కి రెండు యూనివర్శిటీలలో చేరి ప్రయత్నించారు.

5. ఈ పరిశోధనా ప్రస్థానంలో సోదరతుల్యుడు శ్రీ గంగవరప్పగారి చెన్నయ్యతో కలిసి ఒంగోలు ఎఱ్ఱన పీఠం ప్రకటనకు స్పందించి, ‘ప్రహ్లాద చరిత్ర-ఎఱ్ఱన, పోతన తులనాత్మక పరిశీలన’ రాసాను. దానికి ఉత్తమ సిద్ధాంత గ్రంథ రచనా పురస్కారం వచ్చింది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులకు నేను సమర్పించిన కొన్ని పరిశోధనా పత్రాలు ‘సువర్ణ గోపురం’గా పుస్తకాకృతి పొందాయి. 2021లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో నాలోని అవధాన సరస్వతిని సత్కరించింది.

ప్రశ్నలు – జవాబులు

అ) ఉత్తమ సిద్ధాంత గ్రంథ రచనా పురస్కారం దేనికి వచ్చింది?
జవాబు:
‘ప్రహ్లాద చరిత్ర – ఎఱ్ఱన. పోతన తులనాత్మక పరిశీలన’కు ఉత్తమ సిద్ధాంత గ్రంథ రచనా పురస్కారం వచ్చింది.

ఆ) పరిశోధనా పత్రాల పుస్తకం పేరేమిటి?
జవాబు:
పరిశోధనా పత్రాల పుస్తకం పేరు ‘సువర్ణ గోపురం’.

ఇ) పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది?
జవాబు:
2021లో పద్మశ్రీ వచ్చింది.

ఈ) ఎఱ్ఱన పీఠం ఎక్కడుంది?
జవాబు:
ఎఱ్ఱన పీఠం ఒంగోలులో ఉంది.

6. తిరుమల తిరుపతి దేవస్థానంవారి పోతన భాగవతం ప్రాజెక్టునుండి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసికోదలచి తృతీయస్కంధానికి సరళ గద్యానువాదం చేశాను. దీని ప్రధాన సంపాదకులు ‘కరుణశ్రీ’ డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ గ్రంథానికి రాసిన మున్నుడిలో “ఆశావాది ప్రకాశరావు అష్టావధాన కళలో ఆరితేరినవాడు. వినయభూషణుడు, మధుర భాషణుడు. వీరి అనువాదం సరళంగా సాగింది” అన్నారు. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్స్మిత్ రచించిన ‘సిటీ నైట్ పీస్’ను ‘చీకటి కోణం’ శీర్షికతో వచన కవితగా అనువదించాను. పుట్టపర్తి సాయిబాబాగారి సూక్తులకు ‘విభూతి గీత’ పేర పద్యరూపం ఇచ్చాను. ఇలా అనువాద పరంపర కొనసాగింది.

ప్రశ్నలు – జవాబులు

అ) భాగవతం ఎవరు రచించారు?
జవాబు:
భాగవతమును పోతన రచించెను.

ఆ) ‘సిటీ నైట్ పీస్’కు తెలుగు అనువాదం ఏది?
జవాబు:
‘సిటీ నైట్ పీస్’కు తెలుగు అనువాదం చీకటి కోణం.

ఇ) మున్నుడి వ్రాసినదెవరు?
జవాబు:
జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు మున్నుడి వ్రాశారు.

ఈ) ‘విభూతి గీత’లో అంశం ఏమిటి?
జవాబు:
‘విభూతి గీత’లోని అంశం సాయిబాబా సూక్తులు.

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

7. అదొక అద్భుత ఘట్టం. చెబుతాను. ఎండాకాలం సెలవుల్లో ఏలూరులోని ఫడ్స్ కంట్రోల్ సర్కిల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే అందులో గుమాస్తాగా చేరాను. అక్కడ శ్రీ బస్వా సింహాద్రి అప్పారావుగారి సాహచర్యంలో మూడు నెలలపాటు చేమకూర వేంకటకవి విజయ విలాసం అధ్యయనం చేశాను. అది నా పద్యాలకు మరింత వెలుగునిచ్చే అచ్చ తెనుగు ముచ్చట్లను పదబంధాలను సమకూర్చింది. ఇవన్నీ ఒక రకమైన బలాన్ని తృప్తిని కలిగించడంతో ఆ యేడే గాంధీజయంతి సందర్భంగా మొట్టమొదటి అష్టావధానం జయప్రదంగా ముగించాను. ఈ వార్త మా తెలుగుశాఖ ‘హెడ్’ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులవారి చెవిలో పడింది. వారు నన్ను ‘డిపార్ట్మెంట్ ‘కు పిలిపించి మా ‘మాస్టర్ల’ సన్నిధిలో సమస్యాపూరణ పరీక్ష నిర్వహించారు.

ప్రశ్నలు – జవాబులు

అ) వేసవిలో ఏ గ్రంథం చదివారు?
జవాబు:
వేసవిలో విజయవిలాసం చదివారు.

ఆ) మొదటి అష్టావధానం ఏ రోజున చేశారు?
జవాబు:
గాంధీ జయంతినాడు మొదటి అష్టావధానం చేశారు.

ఇ) సమస్యాపూరణ పరీక్ష ఎవరు నిర్వహించారు?
జవాబు:
నండూరి రామకృష్ణమాచార్యులవారు సమస్యాపూరణ పరీక్ష నిర్వహించారు.

ఈ) అలాది గారు ఏం ఉద్యోగం చేశారు?
జవాబు:
ఆశాద్ గారు గుమాస్తా ఉద్యోగం చేశారు.

8. నేను ప్రధానంగా పద్యజీవినే. అయినా వచనకవితను ఏనాడు నిరసించలేదు. నినాదప్రాయంగా కాకుండ హృదయా వర్ణకంగా వెల్వడే ఏ చిన్నమాటనైనా ఆదరించేవాడిని. అడపాదడపా నేను రసాత్మక వాక్యాలను వ్రాయడానికి ఆసక్తి చూపేవాడిని. పి.జి. కళాశాల వార్షిక సంచికలో ‘నీవు-నేను’ అనే నా మొదటి వచన కవిత అచ్చయింది. ఒక దశాబ్ది పిమ్మట అదే కవిత డా. కమల్నాథ్ పంకజ్ గారిచే హిందీభాషలోనికి అనూదితమై మంచి గుర్తింపు సంపాదించుకుంది.

వేదికపై ఆశువుగా చెప్పిన వచనకవిత ‘రొయ్య మీసాలు’. శ్రోతల సమక్షంలో నిర్వహించే కవి సమ్మేళనాలకు ఒకమారు పద్యం, మరొకమారు వచనం కాన్క చేసేవాడిని. ఇలా తయారైన వచనకవితల సంపుటియే ‘అంతరంగ తరంగాలు’. నేను సాహిత్యానికి చేసిన దానికంటే సాహితీలోకం నాకు చేసిందే ఎక్కువ. ఆయా సందర్భాలు ఎటు ఈడిస్తే అటుగా వెళుతూ అక్కడ నన్ను నేను ప్రతిష్టించుకునే ప్రయత్నం చేసాను. భాషా సాహిత్యాలకు దూరంగా బ్రతకలేని బలహీనత నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది.

ప్రశ్నలు – జవాబులు

అ) ఆశువుగా చెప్పిన వచన కవిత పేరేమిటి?
జవాబు:
అశువుగా చెప్పిన వచన కవిత పేరు ‘రొయ్య మీసాలు’.

ఆ) వచన కవితల సంపుటి పేరేమిటి?
జవాబు:
వచన కవితల సంపుటి పేరు ‘అంతరంగ తరంగాలు’.

ఇ) మొదటి వచన కవిత పేరేమిటి?
జవాబు:
మొదటి వచన కవిత పేరు ‘నీవు – నేను’.

ఈ) ఆయన వేటిని విడిచి బ్రతకలేడు?
జవాబు:
ఆయన భాషా సాహిత్యాలను విడిచి బ్రతకలేదు.

అపరిచిత గద్యాలు

1. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములిమ్ము.

నన్నయ యుగకర్త. ఆంధ్ర సాహిత్య సృష్టికర్త. ప్రథమాంధ్ర కావ్య కర్త. సంస్కృత లౌకిక సారస్వతంలో వాల్మీకి ఆదికవి వలె ఆంధ్ర సాహిత్యంలో నన్నయ ఆదికవి.

ఆంధ్ర కవితా పోషకులైన మహారాజులలో ప్రథముడు రాజరాజ నరేంద్రుడు. చోళుల సహాయంతో రాజరాజు వేంగిని స్వాధీనం చేసుకుని ఆ కాలాన్ని భారత రచనకు వినియోగించారు. రాజరాజుకు భారత శ్రవణాభిలాష ఎక్కువ. నన్నయ రాజరాజ నరేంద్రుల వైదిక మతాభిమానమే తెలుగులో మొట్టమొదటి గ్రంధమైన భారత రచనకు హేతువైందని తెలుస్తుంది. నన్నయ అవిరళ జపహోమ తత్పరుడు, విపుల శబ్దశాసనుడు, సంహితాభ్యాసుడు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు. లోకజ్ఞుడు. ఉభయ భాషా కావ్య రచనా శోభితుడు. నిత్య సత్య వచనుడు. తెలుగు కవితకు మార్గదర్శకుడైన మార్గదర్శి. మహర్షి అను సూక్తిని సార్ధకం చేసిన కవి. నన్నయ రచించిన భారత భాగంలో ఎక్కువగా ఆఖ్యాయక శైలి కన్పిస్తుంది. అక్కడక్కడ నాటకీయ శైలి, వర్ణనాత్మక శైలి కనపడుతుంది. రాజరాజ నరేంద్రుని కోరికతో మహాభారతాన్ని అనువాదం చేయుటకు పూనుకొని యథాతథంగా చేయలేదు. మూలగ్రంథంలో అనుచితాలైన ఘట్టాలను తగ్గించి, పరిహరించి, రసవంతమైన ఘట్టాలలో స్వతంత్రమైన కల్పనలు చేసి, వర్ణనలు పెంచి, భారతాన్ని తెలుగులో అనువదించాడు.

ప్రశ్నలు – జవాబులు

1. ప్రథమాంధ్ర కావ్య కర్త ఎవరు?
జవాబు:
నన్నయ

2. సంస్కృత లౌకిక సారస్వతంలో ఆదికవి ఎవరు?
జవాబు:
వాల్మీకి

3. చోళుల సహాయంతో రాజరాజు ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు?
జవాబు:
వేంగిని

4. వైదిక మతాభిమానం గల తెలుగులో మొట్టమొదటి గ్రంథమేది?
జవాబు:
మహాభారతము

5. రాజరాజ నరేంద్రుని కోరికతో ఏ కావ్యాన్ని నన్నయ అనువాదం చేశాడు?
జవాబు:
మహాభారతం

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

2. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములిమ్ము.

గృహస్థాశ్రమ ధర్మాలు అయిన కొడుకు, భార్య, యజమాని మొదలైన అంశాలను, యజమానిచే వంచింపబడిన ప్రకృతిలో ఎంత సంక్షోభం కలుగుతుందో ఈ సన్నివేశంలో నన్నయ వస్తు ధ్వని ద్వారా తెలియపరిచారు. ఈ కథలో వస్తు ధ్వని సహజంగా నిగూఢమై ఉంది. కథా ముగింపులో ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని తెలియజెప్పాడు. అధర్మంగా ప్రవర్తించిన దుష్యంతుని నలుగురి ముందు దోషిగా నిలబెట్టాడు. రాజైనా, పేద అయినా ధర్మం ముందు తలవంచవలసిందే అని ఈ కథ ద్వారా నిరూపించాడు.

నన్నయ నిత్య సత్య వచనుడు కాబట్టి సత్యం మాట్లాడటం యొక్క ప్రాశస్త్యాన్ని పదే పదే చెప్పించారు. శకుంతల మాటలలో చక్కని లోకజ్ఞానాన్ని చూపించారు. ‘బహుకార్యమగ్నులు కారె’ అంటూ రాజుల మనస్తత్త్వాన్ని శకుంతల ఆలోచించినట్లు చిత్రీకరించారు. “రాత్రీ తలనాథ”, “జననుత”, “విమలయశోనిధీ” మొదలయిన పదాలు శకుంతల లోకజ్ఞతకు నిదర్శనాలు. “తడయక పుట్టిననాడే తల్లిచే, తండ్రిచే విడువబడితి” అను పద్యంలో శకుంతల కర్మ సిద్ధాంతాన్ని నమ్మిందని తెలుస్తుంది. హిందూ సంప్రదాయం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. తనను తాను నిందించుకోక, దుష్యంతుని నిందించక అంతా కూడా తాను చేసిన “నోముల ఫలమే” అంటూ దుఃఖించడము శకుంతల సహన గుణాన్ని తెలియజేస్తుంది.

శైలి సంస్కృత శబ్దం. కవుల శైలి పద్య రచనకు సంబంధించినది. ఇది కథాకథనానికి సంబంధించింది. నన్నయది ఆఖ్యాన శైలి. కవి తానై కథ చెప్పుట అభ్యాన పద్ధతి, పాత్రల సంభాషణ ద్వారా కథను విస్తరింపచేయుట నాటకీయశైలి.

ప్రశ్నలు – జవాబులు

1. నన్నయ ఎటువంటివాడు?
జవాబు:
నిత్య సత్యవచనుడు

2. శకుంతల మాటల్లో ఎటువంటి విషయాన్ని నన్నయ చూపించాడు?
జవాబు:
చక్కని లోకజ్ఞానాన్ని

3. శకుంతల నమ్మిన సిద్ధాంతమేది?
జవాబు:
కర్మ సిద్ధాంతం

4. ఎటువంటి ఫలము శకుంతల సహన గుణాన్ని తెలియజేస్తుంది?
జవాబు:
తాను చేసిన నోముల ఫలము

5. కవి తానై కథ చెప్పుటను ఏ పద్ధతి అని అంటారు?
జవాబు:
ఆఖ్యాన పద్ధతి

3. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములిమ్ము.

సామాన్యంగా ఒక జాతి యొక్క లేక ఒక మతం యొక్క సంప్రదాయాల్ని బలపరచటం కోసం చరిత్రకందని పురావృత్తాల్ని, సముజ్జ్వల ఆధ్యాత్మిక దృష్టితో సముద్ధరించి వ్యాఖ్యానించే లక్ష్యంతో నిర్మించబడిన సారస్వత గ్రంథాలు పురాణాలు. సంస్కృత అష్టాదశ పురాణాలు అలాంటివి. ఆ పురాణ కర్తలైన ఆర్షమనీషులు పురాతత్త్వ, జిజ్ఞాసువులై సర్గ, ప్రతిసర్గ మహా విషయాల్ని శ్రుతి, స్మృతి పరమార్థాను సంధానవృత్తులై భావించి, దర్శించి వాటిని ధర్మ, అర్ధ, కామ, మోక్షం ది చతుర్వర్గ ఫలోపాత్తాలు అయ్యేటట్లు మిత్ర సమ్మతంగా ప్రవచించారు. ఆగమార్ధ జలసేచనంతో భారతీయ హృదయ క్షేత్రాల్ని ఆర్ద్రీకరించి, ఆర్ష సంస్కృతీ సస్యాల్ని పండించారు.

అమూల్య కథా నిధులను చూసి మురిపించుచూ, అమోఘశాస్త్ర విధులను చెప్పి ఒప్పించుచూ, కవి రసిక ముముక్షు జనాల రచనా ప్రసంగ వ్యాసంగాల్ని ఉపలాలించే మాతృమూర్తులుగా పురాణాల్ని తీర్చిదిద్దారు. కావ్య శాస్త్రాల వలె కాకుండా, పురాణాలు జన సామాన్యాన్ని ఉద్దేశించి రచించబడ్డాయి. కాబట్టి మత వ్యాప్తికి ఈ గ్రంథాలు శక్తి దంతాలైన సాధనాలుగా గుర్తించబడ్డాయి. శైవ వైష్ణవాది మత శాఖాంతరాలన్నీ పురాణాలు ముఖంగానే ప్రజల మన్ననల్ని అందుకున్నాయి. ఉద్దిష్ట ప్రయోజనాన్ని సాధించాయి.

ప్రశ్నలు – జవాబులు

1. సముజ్జ్వల ఆధ్యాత్మిక దృష్టితో సముద్ధరించి వ్యాఖ్యానించే లక్ష్యంతో నిర్మించబడిన సారస్వత గ్రంథాలని వేటిని అంటారు?
జవాబు:
పురాణాలు

2. ‘చతుర్వర్గ పురుషార్థాలేవి?
జవాబు:
ధర్మ, అర్థ, కామ, మోక్షాది

3. దేనితో భారతీయ హృదయ క్షేత్రాల్ని ఆర్ద్రీకరించింది?
జవాబు:
ఆగమార్ధ జలసేచనంతో

4. ఆర్ష సంస్కృతీ సస్యాల్ని ఎలా పండించారు?
జవాబు:
ఆగమార్థ జలసేచనంతో భారతీయ హృదయ క్షేత్రాన్ని ఆర్ద్రీకరించి ఆర్ష సంస్కృతీ సస్యాల్ని పండించారు.

5. శైవ వైష్ణవాది మన శాఖాంతరాలన్నీ వేటివల్ల ప్రజల మన్ననల్ని అందుకున్నాయి?
జవాబు:
పురాణాల ముఖంగా

4. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములిమ్ము.

దక్షిణ దేశభాషా సాహిత్యాలలో ఇలాంటి దేశ పురాణాలు మత వాఙ్మయాలకు ఎత్తిన కీర్తి పతాకాలై విరాజిల్లుతున్నాయి. కన్నడంలో ప్రసిద్ధ జైనకవులు – జైనమతాన్ని వ్యాప్తి చేసిన తీర్థంకరుల చరిత్రల్ని “పురాణాలుగా” రచించారు. కన్నడంలో “ఆదికవి” అని ప్రసిద్ధి చెందిన పంప కవి (క్రీ.శ. 941) జైన ప్రథమ తీర్థంకరుడైన పురుదేవుని చరిత్రను “ఆదిపురాణం” అనే పేరుతో చంపువు (పద్య, గద్య మిశ్రితంగా) అనువదించాడు. అది జినసేనుని సంస్కృత కృతికి అనుకృతి. అలాగే పొన్నకవి (క్రీ.శ. 10వ శతాబ్దం) పదహారవ తీర్థంకరుని జీవిత చరిత్రను చంపువుగా “శాంతి పురాణం” అనే పేరుతో రచించాడు. రన్నడు (క్రీ.శ. 11వ శతాబ్దం) ద్వితీయ తీర్ధంకరుని చరిత్రను “అజిత పురాణం” అనే పేరుతో చంపూ గ్రంథంగా నిర్మించాడు. ఇవికాక నాగచంద్రకవి “మల్లినాథ పురాణం”, నయసేనుని “ధర్మనాథ పురాణం”, జన్నకవి “అనంతనాథ పురాణం” మొదలైనవి ప్రసిద్ధ కన్నడ, జైన పురాణాలు.

ప్రశ్నలు – జవాబులు

1. కన్నడంలో ప్రసిద్ధ జైన కవులు – జైన మతాన్ని వ్యాప్తి చేసిన తీర్థంకరుల చరిత్రల్ని ఏ విధంగా రచించారు?
జవాబు:
పురాణాలుగా

2. కన్నడంలో ‘ఆదికవి’గా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు?
జవాబు:
పంప కవి

3. పద్య, గద్య మిశ్రితంగా ఉన్న కావ్యాన్ని ఏమంటారు?
జవాబు:
చంపూ కావ్యం

4. పదహారవ తీర్థంకరుని జీవిత చరిత్రను చంపువుగా రాసిన కావ్యమేది?
జవాబు:
శాంతిపురాణం

5. రన్నడు ద్వితీయ తీర్ధంకరుని చరిత్రను చంపూ గ్రంథంగా రాసిన కావ్యమేది?
జవాబు:
అజితపురాణం

వ్యక్తీకరణ – సృజనాత్మకత

I. ఈ క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘ఆశావాది’ పాఠం ప్రక్రియ రాయండి. (లేదా) ‘ముఖాముఖి’ ప్రక్రియ రాయండి.
జవాబు:
ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి. మరెన్నో వెలుగునీడలుంటాయి. ‘వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించటమే ‘ముఖాముఖి’. సేకరించిన సమాచారాన్ని ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా ‘వారి ద్వారానే తెలుసుకునే వీలుంటుంది.

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

II. ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వచన కవిత పట్ల ఆశావాది అభిప్రాయమేమిటి?
జవాబు:
ఆయన ప్రధానంగా పద్యాన్నే ఇష్టపడతారు. అయినా వచన కవితను ఏనాడు చిన్నచూపు చూడలేదు. ఏవో నాలుగు పదాలు కలిపిన కవితను కాకుండా హృదయాన్ని కదిలించే రసాత్మక కవితలను అవి వచన కవితలైనా ఇష్టపడేవారు. ఆయన కూడా అటువంటి వచన కవితలు రాయటానికి ప్రయత్నించేవారు. ఆయన కళాశాలలో చదివే రోజులలో నీవు నేను అనే కవిత కళాశాల వార్షిక సంచికలో అచ్చయ్యింది. పది సంవత్సరాలు పోయాక అది హిందీలోకి కూడా అనువదించబడింది. వేదికలపై ఒక్కొక్కసారి పద్యకవిత, ఒక్కొక్కసారి వచనకవిత చెప్పేవారు. ఆయన వచనకవితా సంపుటి అంతరంగ తరంగాలు మొత్తంమీద ఆశావాదికి వచనకవిత పద్యకవిత రెండూ ఇష్టమేనని చెప్పాలి.

ప్రశ్న 2.
ఆశావాదిగారి అనువాద సామర్థ్యాన్ని వివరించండి.
జవాబు:
ఆశావాదిగారు తనకు లభించిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా అందిపుచ్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంవారు పోతన భాగవతం ప్రాజెక్ట్ కు ఆయనకు అవకాశం కల్పించారు. ఆయన కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు. అందుకే పోతన భాగవతంలోని తృతీయ స్కంధాన్ని తేలికైన వచనంలోకి అనువాదం చేసారు. దానికి ప్రధాన సంపాదకులు జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు. ఆయన రాసిన పీఠికలో ఆశావాదిని అష్టావధాన కళలో ఆరితేరినవాడు అన్నారు. వినయభూషణుడు, మధురభాషనుడు అన్నారు. ఆయన అనువాదం చాలా సరళంగా సాగిందన్నారు. ఆంగ్లంలో అలివర్ గోల్డ్ స్మిత్ రచించిన సిటీ నైట్ పీస్ ను చీకటికోణం శీర్షికతో వచనకవితగా అనువదించారు. పుటపర్తి సాయిబాబాగారి సూక్తులను విభూతిగీత అనే పేరుతో పద్యాలలో రాసారు. అలా వారి అనువాద పరంపర సాగింది.

సృజనాత్మక ప్రశ్నలు

ప్రశ్న 1.
‘ఆశావాది’ వారిని గురించి పాఠం చదివారు కదా! వారి గురించి సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
జస్వంత్ : లీలా! ఇవాళ తెలుగు మాస్టారు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేశార్రా.

లీలాకృష్ణ : అవును జస్వంత్ ! ఒకనాటి రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేత బాలకవిగా ప్రశంసలందుకున్నారు.

జస్వంత్ : మరి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని నాటి రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు.

లీలాకృష్ణ : నేను కూడా 10వ తరగతి పూర్తి అయ్యేలోపు ఒక శతకం అయినా పూర్తిగా కంఠస్థం చేస్తా.

జస్వంత్ : బాగుంది. మంచి ఆలోచన. నేను కూడా ప్రయత్నిస్తాను.

లీలాకృష్ణ : 170 పైగా అవధానాలు చేయడం మాటలు కాదు.

జస్వంత్ : అవును, పద్యం ఆశువుగా చెప్పాలి. అదీ పృచ్ఛకుడు అడిగిన తీరులో, పైగా చివరలో ధారణ చేయాలి. అబ్బో! చాలా కష్టం.

లీలాకృష్ణ : ఆశావాది వారి ‘అస్పృశ్యతా నివారణ’ వ్యాసాన్ని పాఠశాల వార్షిక సంచిక సంపాదకుడు ఎందుకు విసిరికొట్టాడంటావు?

జస్వంత్ : ఎందుకేముంది, స్వాతంత్ర్యం వచ్చింది, అంటరానితనం నేరం. కాబట్టి అస్పృశ్యత లేదు.

లీలాకృష్ణ : ఇది కేవలం పుస్తకాల్లో రాసుకోవడానికి మాత్రమే బాగుంటుంది. సమాజం ఇంకా మారలా.

జస్వంత్ : ప్రజల సహకారం, ప్రభుత్వానికి మార్పు తేవాలనే పట్టుదల ఉంటే ఇదేమంత పెద్ద సమస్య కాదు.

లీలాకృష్ణ : తుమ్మల, మధునాపంతులు, దాశరథి, సినారె, కరుణశ్రీ, నండూరి, సి.వి. సుబ్బన్న వంటి మహనీయుల సహచర్యం, వారితో కలసి కళాగోష్టి చేయడం గొప్ప అదృష్టం కదరా!

జస్వంత్ : ఆశావాది వారు గొప్ప అదృష్టవంతులు నిజమే.

లీలాకృష్ణ : ఎన్ని పుస్తకాలు రాశార్రా! పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోక లీలాసూక్తం, అవధాన చాటువులు… ఇలా 50కి పైగా రచనలు చేశారు.

జస్వంత్ : రేయ్ లీలా! చివర్లో ఆయన మాటలు నాకు కన్నీళ్ళు తెప్పిచ్చాయిరా.
‘అవధానం ఏర్పాటు చేయడంలో ఆర్భాటమే కాని అవధాని గౌరవాన్ని కాపాడే పద్ధతిలో శ్రద్ధ చూపరు’ అన్న మాటలూ, “ఎన్నో చేదుల్ని దిగమ్రింగి గంభీరంగా సభ ముగించేవాణ్ణి” అన్న మాటలూ.

లీలాకృష్ణ : నిజం జస్వంత్! నాకూ బాధ అనిపించింది. ఎదురుగా ఉన్న వ్యక్తి కులం చూశారే తప్ప, వారి పాండిత్యాన్ని చూడలేని గుడ్డి సమాజం అది.

జస్వంత్ : ఇంకొక గొప్ప మాట కూడా సందేశంగా ఇచ్చారు. ‘మాటకు, ఆచరణకు పొంతన ఉండాలి’ అన్న మాటలు నాకు బాగా నచ్చాయి.

లీలాకృష్ణ : అవును. చెప్పే మాటకు, చేసే పనికి పొంతన లేని మనిషికి లోకంలో విలువుండదు. ఇవాళ మనం మంచి విషయాలు చర్చించుకున్నాం. ఇక ఇంటికి వెళతాను. అమ్మ ఎదురుచూస్తుంది.

జస్వంత్ : సరేరా! త్వరగా వెళ్ళు.

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

ప్రశ్న 2.
మీ ఊరిలో జరుగుతున్న అష్టావధానాన్ని చూడడానికి రమ్మని ఆహ్వాన పత్రం రాయండి.
జవాబు:
AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది 1

భాషాంశాలు

అర్ధాలు

అ) గీత గీసిన పదానికి అర్థం రాయండి.

1. మనిషికి ఆశ ఉండాలి.
జవాబు:
కోరిక

2. అక్షరము మనిషికి రక్షణనిస్తుంది.
జవాబు:
అత్కరము

3. శ్వాసలో ఇబ్బంది ఏర్పడితే వైద్యున్ని సంప్రదించాలి.
జవాబు:
ఊపిరి

4. ఆటంకం కలిగినా ప్రస్థానం ఆగకూడదు.
జవాబు:
ప్రయాణం

5. విద్వాంసులను సరస్వతీ పుత్రులు అంటారు.
జవాబు:
బ్రహ్మ

6. ఎవరైనా తమ సంతానం బాగుండాలనుకుంటారు.
జవాబు:
సంతతి

7. గుడిలో పూజారిని ఇబ్బంది పెట్టకూడదు.
జవాబు:
అర్చకుడు

8. అవధాన సభను పండిత సభ అని కూడా అంటారు.
జవాబు:
సదస్సు

9. గ్రామము దేశానికి పట్టుకొమ్మ అని గాంధీజీ అన్నారు.
జవాబు:
పల్లెటూరు

10. పెళ్ళిలో కాన్కలు ఆశించకూడదు.
జవాబు:
ఉపహారములు

11. ధీమంతులు తక్కువ మార్కులను సహించరు.
జవాబు:
బుద్ధిమంతులు

12. మంచివారిని కొనియాడు.
జవాబు:
కీర్తించు

13. వాక్కు మంచిదైతే అందరూ మెచ్చుకుంటారు.
జవాబు:
మాట

14. మా గురువుగారు గొప్ప పండితులు.
జవాబు:
ఉపాధ్యాయుడు

15. ఆకాశంలో భాస్కరుడు నిప్పులు కక్కుతున్నాడు.
జవాబు:
సూర్యుడు

16. అష్టావధానంలో ఎనిమిది మంది పృచ్ఛకులు ఉంటారు. (SA-1&22023-24)
జవాబు:
ప్రశ్నలు అడిగేవారు

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

ఆ) గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.

1. సహనంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు.
అ) సాహసం
ఆ) ఓర్మి
ఇ) హననం
ఈ) సవనం
జవాబు:
ఆ) ఓర్మి

2. విజ్ఞానం మాత్రమే అభివృద్ధి కారకం.
ఆ) మూర్ఖత్వం
ఆ) అవివేకం
ఇ) ఆజ్ఞత
ఈ) జ్ఞానం
జవాబు:
ఈ) జ్ఞానం

3. కొడుకు మాత్రమే వారుసుడు కాదు కూతురు కూడా.
అ) కుమారుడు
ఆ) పుత్రిక
ఇ) సంతానం
ఈ) సుత
జవాబు:
అ) కుమారుడు

4. విత్తనాలకు మొలక కనిపించింది.
అ) అంకురం
ఆ) వృక్షం
ఇ) చెట్టు
ఈ తరువు
జవాబు:
అ) అంకురం

5. మా ఉపాధ్యాయులు పండితుడు అంటే అర్థం చెప్పారు.
అ) పామరుడు
ఆ) పండ
ఇ) విద్వాంసుడు
ఈ) వైద్యుడు
జవాబు:
ఇ) విద్వాంసుడు

6. మంచి పద్ధతి అనుసరించాలి.
అ) పరపతి
ఆ) మార్గం
ఇ) పడతి
ఈ) వరసతి
జవాబు:
ఆ) మార్గం

7. పాఠం అవగాహన చేసుకోవాలి.
అ) చదవడం
ఆ) వ్రాయడం
ఇ) ఆకళింపు
ఈ) వింటూ
జవాబు:
ఇ) ఆకళింపు

8. పుస్తకానికి పీఠిక ప్రాణం వంటిది.
అ) పీట
ఆ పీఠం
ఇ) అట్ట
ఈ) మున్నుడి
జవాబు:
ఈ) మున్నుడి

9. అన్ని అంశాలు సరిగా అర్థం చేసుకోవాలి.
అ) విషయాలు
ఆ) అంశలు
ఇ) అసలు
ఈ) కథలు
జవాబు:
అ) విషయాలు

10. కొందరికే రచనా సామర్థ్యం ఉంటుంది.
అ) బలం
ఆ) శక్తి
ఇ) నేర్పు
ఈ) ఓపిక
జవాబు:
ఇ) నేర్పు

11. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.
అ) ప్రయత్నం
ఆ) పట్టుదల
ఇ) చదువు
ఈ) మంత్రం
జవాబు:
అ) ప్రయత్నం

12. నాకు గెలుపు అంటే ఇష్టం.
అ) ఆట
ఆ) విజయం
ఇ) పోటీ
ఈ) పందెం
జవాబు:
ఆ) విజయం

13. అందరూ తప్పనిసరిగా చదువుకోవాలి.
అ) జాగ్రత్తగా
ఆ) బాధ్యత
ఇ) తప్పక
ఈ) తప్పు
జవాబు:
ఇ) తప్పక

14. భుజబలం కంటె బుద్ధిబలం గొప్పది.
అ) శక్తి
ఆ) కీర్తి
ఇ) పొడవు
ఈ) అందం
జవాబు:
అ) శక్తి

15. మా పాఠశాలలో కడిమెళ్ల వారికి పురస్కారం చేశాము.
అ) ఉద్యోగం
ఆ) ఉపాధి
ఇ) పెళ్ళి
ఈ) సన్మానం
జవాబు:
ఈ) సన్నానం

పర్యాయపదాలు

అ) గీత గీసిన పదానికి పర్యాయపదాలు రాయండి.

1. మనం చరిత్ర తయారుచేయాలి.
జవాబు:
చరితము, ఇతిహాసము

2. సువర్ణము వంటి నోట్సు చింపేశావా?
జవాబు:
బంగారం, కనకం

3. ఇంటి ఆకృతి ఏర్పరచడమే కష్టంగా ఉంది.
జవాబు:
ఆకారం, రూపం

4. మేరువు దగ్గర దేవతలుంటారు.
జవాబు:
హేమాద్రి, మేరుపర్వతం

5. మంచివారి సాంగత్యం విడవకూడదు.
జవాబు:
స్నేహం, మైత్రి

6. జనకోటి వచ్చింది.
జవాబు:
గుంపు, సమూహం

7. రాజుకు మకుటం ఉండాలి.
జవాబు:
కిరీటము, కోటరము

8. మా పెరట్లో పాప రేడు వచ్చింది.
జవాబు:
పాము, పన్నగము

9. గురువులపట్ల వినయముగా ఉండాలి.
జవాబు:
వినమ్రత, అడకువ

10. భూషణములు అందం పెంచుతాయి.
జవాబు:
నగలు, భూషలు

11. పాఠానికి శీర్షిక బాగుండాలి.
జవాబు:
నామము, పేరు

12. పేదరికం లోంచే గొప్పవాళ్లెక్కువగా తయారయ్యారు.
జవాబు:
బీదరికం, దరిద్రం

13. తల్లిదండ్రులు అమృతము పెట్టి పెంచుతారు.
జవాబు:
సుధ, పీయూషము

14. విజయుడు ధనుర్ధారి.
జవాబు:
అర్జునుడు, కిరీటి

15. పులి విలాసముగా ఉంటుంది.
జవాబు:
ఠీవి, పొంకము

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

ఆ) గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.

1. పిల్లల ఎదుగుదల పెద్దలకు ఆనందం ఇస్తుంది.
అ) పెరుగుదల, అభివృద్ధి
ఆ) పొడవు, పొట్టి
ఇ) ఉద్యోగం, చదువు
ఈ) విద్య, తెలివి
జవాబు:
అ) పెరుగుదల, అభివృద్ధి

2. ప్రతి పుస్తకం క్షుణ్ణంగా చదవాలి.
అ) జాగ్రత్త, పరిశీలనగా
ఆ) అంతా, పూర్తిగా
ఇ) గట్టిగా, పైకి
ఈ) లోపల, మెల్లిగా
జవాబు:
ఆ) అంతా పూర్తిగా

3. క్రికెట్లో శతకం కొడితే ఆనందం.
అ) నాలుగు, ఆరు
ఆ) వడిగా, వేగంగా
ఇ) వంద, శతం
ఈ) చాలా, ఎక్కువ
జవాబు:
ఇ) వంద, శతం

4. చదివినది ధారణలో ఉండాలి.
అ) తెలివి, మేధ
ఆ) బుద్ధి, మతి
ఇ) బుర్ర, తల
ఈ) జ్ఞప్తి, జ్ఞాపకం
జవాబు:
ఈ) జ్ఞప్తి, జ్ఞాపకం

5. పూర్వ కవులు గద్యము కూడా బాగా వ్రాసేవారు.
అ) వచనము, గద్దెము
ఆ) పద్యము, వడ్డెము
ఇ) సంభాషణ, భాషణ
ఈ) భాష, బాస
జవాబు:
అ) వచనము, గద్దెము

6. పోలీసులు ఆకస్మికంగా వచ్చి దొంగను పట్టుకొన్నారు.
అ) గబగబా, తొందరగా
ఆ) మెల్లిగా, నెమ్మదిగా
ఇ) అకస్మాత్తుగా, హఠాత్తుగా
ఈ) జాగ్రతగా, ఆలోచిస్తూ
జవాబు:
ఇ) అకస్మాత్తుగా, హఠాత్తుగా

7. తెలుగు సారస్వతము అనంతమైనది.
అ) సాహిత్యం, వాఙ్మయం
ఆ) పద్యం, గద్యం
ఇ) వచనం, గద్యం
ఈ) భాష, బాస
జవాబు:
అ) సాహిత్యం, వాఙ్మయం

8. పాఠశాల దేవాలయం వంటిది.
అ) బడి, గుడి
ఆ) బడి, నుడి
ఇ) విద్య, చదువు
ఈ) విద్యాలయం, బడి
జవాబు:
ఈ) విద్యాలయం, బడి

9. మా గురువుల ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరిగాయి.
అ) నిర్వహణ, నిర్మాణం
ఆ) నిర్వహణ, యాజమాన్యం
ఇ) అధికారం, హోదా
ఈ) హోదా, పదవి
జవాబు:
ఆ) నిర్వహణ, యాజమాన్యం

10. బడిని పవిత్రముగా ఉంచాలి.
అ) పునీతము, పావనము
ఆ) పావని, పావనుడు
ఇ) పవనము, వనము
ఈ) పతివ్రత, పాతివ్రత్యం
జవాబు:
అ) పునీతము, పావనము

11. దేవాలయం పుణ్యాల ప్రోవు.
అ) గుడి, నుడి
ఆ) కోయిల, కోకిల
ఇ) దైవం, దేవత
ఈ) గుడి, కోవెల
జవాబు:
ఈ) గుడి, కోవెల

12. సీతారాముల కల్యాణం ఒంటిమిట్టలో జరుగుతుంది.
అ) పెళ్లి, పెండ్లి
ఆ) వన్నె, వన్నియ
ఇ) అభిషేకం, పూజ
ఈ) పూజ, అర్చన
జవాబు:
అ) పెళ్లి, పెండ్లి

13. అవాచ్యములు చెప్పకూడదు.
అ) వచనము, గద్యము
ఆ) రహస్యం, మర్మము
ఇ) చెప్పలేని, అనలేని
ఈ) వినలేని, కొనలేని
జవాబు:
ఇ) చెప్పలేని, అనలేని

14. మనిషికి పనితోబాటు విశ్రాంతి కూడా అవసరమే.
అ) విరామము, విరయము
ఆ) ఖాళీ, అవకాశం
ఇ) అవకాశం, అవసరం
ఈ) జీతం, బత్తెం
జవాబు:
అ) విరామము, విరయము

15. భగవంతునికి తుల్యుడు భగవంతుడే.
అ) గొప్పవాడు, అధికుడు
ఆ) శక్తివంతుడు, బలవంతుడు
ఇ) సమానుడు, సముడు
ఈ) అర్చకుడు, పూజారి
జవాబు:
ఇ) సమానుడు, సముడు

ప్రకృతి – వికృతులు

అ) గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.

1. గౌరవమును డబ్బుతో కొనలేము.
జవాబు:
గారవము

2. పుస్తకం విలువ చదివితే తెలుస్తుంది.
జవాబు:
పొత్తము

3. వంఠడు అయినా వామనుడు గట్టివాడు.
జవాబు:
పొట్టి

4. త్రిలింగమునకు వికృతి పదమేది?
జవాబు:
తెలుగు

5. రూపము దానగుణానికి సంకేతం కాదు.
జవాబు:
రూపు

6. గాంధీజీ త్యాగమూర్తి.
జవాబు:
మూరితి

7. మా తోటలో పుష్పము వికసించింది.
జవాబు:
పువ్వు

8. మంచి కీర్తి గలవాడు నెహ్రూ.
జవాబు:
కీరితి

9. ప్రశ్న వేస్తే జవాబు వినాలి.
జవాబు:
పన్నము

10. అవధానం అద్భుతముగా ఉంది.
జవాబు:
అబ్బురము

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

ఆ) గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.

1. పెద్దవారి అనుభవాలే మనకు పాఠాలు.
అ) వృద్ధు
ఆ) వడ్డీ
ఇ) వృద్ధి
ఈ) ధనవంతులు
జవాబు:
అ) వృద్ధు

2. గీము శుభ్రంగా ఉంచాలి.
అ) గుహ
ఆ) గృహము
ఇ) ఇల్లు
ఈ) కొంప
జవాబు:
ఆ) గృహము

3. కాగితములపై వ్రాత తగ్గింది.
అ) కాగలది
ఆ) కాగలము
ఇ) కాగదము
ఈ) కాగు
జవాబు:
ఇ) కాగదము

4. కర్జము మధ్యలో వదలకూడదు.
అ) కార్యము
ఆ) పని
ఇ) క్రియ
ఈ) కరకణ్ణము
జవాబు:
అ) కార్యము

5. విన్నాణము సంపాదించంటే విన్నావా?
అ) జ్ఞానము
ఆ) విజ్ఞానము
ఇ) తెలివి
ఈ) వివేకం
జవాబు:
ఆ) విజ్ఞానము

6. కయికి తెలివి ఎక్కువ.
అ) కయే
ఆ) కయ్య
ఇ) కవి
ఈ) పండితుడు
జవాబు:
ఇ) కవి

7. అసహాయులకు సహాయం చేస్తే పున్నెము వస్తుంది.
అ) పుణ్యము
ఆ) తృప్తి
ఇ) సంతృప్తి
ఈ) సంతోషం
జవాబు:
అ) పుణ్యము

8. అర్హతను బట్టి పీట కేటాయిస్తారు.
అ) చోటు
ఆ) పీఠము
ఇ) పీట
ఈ) పేటిక
జవాబు:
ఆ) పీఠము

9. దిష్టి భయం మూర్ఖులకుంటుంది.
అ) చేతబడి
ఆ) కట్టడి
ఇ) దృష్టి
ఈ) దిష్టికొట్టడం
జవాబు:
ఇ) దృష్టి

10. దమ్మము నెమ్మదిగా గెలుస్తుంది.
అ) ధర్మము
ఆ) ధర్నా
ఇ) పుణ్యము
ఈ) ధనము
జవాబు:
అ) ధర్మము

11. బీరిజము ఎప్పటికైనా మొలకెత్తుతుంది.
అ) విత్తనము
ఆ) బీజము
ఇ) విత్తు
ఈ) మొలక
జవాబు:
ఆ) బీజము

12. దేవళము పవిత్రంగా ఉంచాలి.
అ) గుడి
ఆ) కోవెల
ఇ) దేవాలయము
ఈ) కోయిల
జవాబు:
ఇ) దేవాలయము

13. జక్కులు ఒక జాతి వారు.
అ) యక్షులు
ఆ) యక్షిణి
ఇ) యక్షుడు
ఈ) అక్షులు
జవాబు:
అ) యక్షులు

14. రాయలు కాలంలో రత్నాలు కుప్పలుగా పోసి అమ్మేవారు.
అ) రాణి
ఆ) రాజు
ఇ) రాజా
ఈ) రాపౌ
జవాబు:
ఆ) రాజు

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

15. దయ్యమును అర్చిస్తే కాపాడుతుంది.
అ) పిశాచం
ఆ) భూతం
ఇ) గాలి
ఈ) దైవము
జవాబు:
ఈ) దైవము

నానార్థాలు

అ) గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.

1. అక్షరం జగద్రక్ష చేస్తుంది.
జవాబు:
అక్కరము, పరబ్రహ్మము

2. సంతానంను పోషించడం మన కర్తవ్యం.
జవాబు:
సంతు, ఒక దేవతావృక్షం.

3. శ్వాసము మనిషికి ఆయువు.
జవాబు:
ఊపిరి, ఉబ్బసం

4. కందము ఋషులకు ఆహారం.
జవాబు:
ఒక దుంప, ఒక పద్యం

5. కవి తెలివైనవాడు.
జవాబు:
కావ్యకర్త, శుక్రుడు

6. చైత్రము నెల వచ్చింది.
జవాబు:
మాసము, చంద్రుడు

7. బీజము మంచిది కావాలి.
జవాబు:
విత్తనము, హేతువు

8. విరామం శక్తినిస్తుంది.
జవాబు:
విశ్రాంతి, యతిస్థానం

9. సువర్ణము సువర్ణము కలది.
జవాబు:
బంగారం, మంచిరంగు

10. గోపురమును అందరూ కోరుకొంటారు.
జవాబు:
వాకిలి, స్వర్గం

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

ఆ) గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి.

1. శ్వాస అదుపులో ఉంటేనే శ్వాస సరిపోతుంది.
అ) గాలి, ధూళి
ఆ) దమ్ము, దుమ్ము
ఇ) ఊపిరి, దమ్ము
ఈ) ప్రాణం, బాధ
జవాబు:
ఇ) ఊపిరి, దమ్ము

2. సంతానం లేకున్నా సంతానం కోరికలు తీరుస్తుంది.
అ) పిల్లలు, డబ్బు
ఆ) పిల్లలు, కల్పవృక్షం
ఇ) కులం, బలం
ఈ) బిడ్డ, చదువు
జవాబు:
ఆ) పిల్లలు, కల్పవృక్షం

3. రాజు గారి సభ ఒక సభ అయ్యింది.
అ) గృహం, కొలువు కూటం
ఆ) కొలువు, ఖజానా
ఇ) ఖజానా, మందిరం
ఈ) కొలువు, గుడి
జవాబు:
అ) గృహం, కొలువు కూటం

4. పురస్కారం గల వారికే పురస్కారం అందుతుంది.
అ) గౌరవం, ధనం
ఆ) ఆనందం, సంపద
ఇ) గౌరవం, సన్మానం
ఈ) గౌరవం, పదవి
జవాబు:
ఇ) గౌరవం, సన్మానం

5. కృతి తెలియని వారు కృతి వ్రాయలేరు.
అ) శృతి, లయ
ఇ) లయ, పాట
ఆ) శ్రుతి, సంగీతం
ఈ) ఛందస్సు, ప్రబంధం
జవాబు:
ఈ) ఛందస్సు, ప్రబంధం

6. చెరువులో తామరతంపర మంచి తామరతంపర చెందింది.
అ) తామరల సమూహం, అభివృద్ధి
ఆ) పూలు, ఆకులు
ఇ) తామరపూలు, ఆకులు
ఈ) తామరాకులు, పూలు
జవాబు:
అ) తామరల సమూహం, అభివృద్ధి

7. కొందరు పొంతన లేని మాటలతో పెళ్లికి పొంతన లేదంటారు.
అ) సంబంధం, డబ్బు
ఆ) స్నేహం, అవకాశం
ఇ) పోలిక, గ్రహమైత్రి
ఈ) ధర్మం, ముహూర్తం
జవాబు:
ఇ) పోలిక, గ్రహమైత్రి

వ్యుత్పత్యర్థాలు

అ) గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం రాయండి.

1. దీక్ష ప్రారంభించి వదలకూడదు.
జవాబు:
యజ్ఞాది పనుల ప్రారంభంలో చేయడానికి పూనుకునే ఆచారం.

2. పీఠిక చదివితే పుస్తకం గురించి పూర్తిగా తెలుస్తుంది.
జవాబు:
గ్రంథ ప్రారంభ ఉపోద్ఘాతం.

3. కడిమెళ్లవారు ఎందరికో సహస్రావధానం నేర్పిన మంచి అవధాని.
జవాబు:
మనోయోగం కలవాడు.

4. సరస్వతి దయతో నేను కవిని అయ్యాను.
జవాబు:
అంతా వ్యాపించి ఉండేది. (లేదా) వాక్కుకు అధిదేవత.

5. శ్రీనాథుని చాటువు పద్యాలలో ఉంది.
జవాబు:
ప్రియమైన మాట

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

ఆ) గీతగీసిన పదానికి సరైన వృత్పత్వర్ణాన్ని గుర్తించండి.

1. మన సంప్రదాయం మనం పాటించాలి.
అ) గురు పరంపర చేత/వంశ క్రమం చేత వచ్చే వాడుక
ఆ) ఆచారం
ఇ) తండ్రి నేర్పేది
ఈ) సమాజం నేర్పే ఆచారం
జవాబు:
అ) గురు పరంపర చేత/వంశ క్రమం చేత వచ్చే వాడుక

2. అవధానం కొందరికే సాధ్యం.
అ) అష్టావధానం
ఆ) శతావధానం
ఇ) సహస్రావధానం
ఈ) మనసు ఇతర విషయాల నుండి మరలి ఒక విషయం మీద నిలిచి ఉండడం.
జవాబు:
ఈ) మనసు ఇతర విషయాల నుండి మరలి ఒక విషయం మీద నిలిచి ఉండడం.

3. పవర్గ ఓష్ఠ్యం.
అ) నోటిలో పుట్టినది.
ఆ) ముక్కుతో పలికేది.
ఇ) పెదవుల యందు పుట్టినది.
ఈ) నాలుక యందు పుట్టినది.
జవాబు:
ఇ) పెదవుల యందు పుట్టినది.

4. కౌముది చల్లగా ఉంటుంది.
అ) కుముదము (కలువ)లు వికసించడానికి కారణమైనది.
ఆ) వెన్నెల
ఇ) అందమైనది
ఈ) చల్లని ఎండ
జవాబు:
అ) కుముదము (కలువ)లు వికసించడానికి కారణమైనది.

సంధి పదాలను విడదీయడం

గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.

1. అవధానాచార్యులు గరికపాటివారు వచ్చేరు.
జవాబు:
అవధాన + ఆచార్యులు

2. నేను మొట్టమొదటిగా చదవిన పద్యం గుర్తుంది.
జవాబు:
మొదటి + మొదటి

3. మన ప్రత్యర్థులు తెలివైనవారే.
జవాబు:
ప్రతి + అర్ధులు

4. తెలుగు భాషకు అవధానమే వరం.
జవాబు:
అవధానము + ఏ

5. పాపయ్య శాస్త్రిగారు గొప్పకవి.
జవాబు:
పాప + అయ్య

6. తిరుమల వేంకటేశ్వర దర్శనం పాపహరణం.
జవాబు:
వేంకట + ఈశ్వర

7. మహాత్ముని కొనియాడని వారుండరు.
జవాబు:
కొని + ఆడని

8. ఏటేట సీతాకల్యాణం ఒంటిమిట్టలో జరుగుతుంది.
జవాబు:
ఏట + ఏట

9. పదేళ్లు వచ్చేటప్పటికి 5వ తరగతిలో ఉండాలి.
జవాబు:
పది + ఏళ్లు

10. పద్యం వ్రాయాలన్న కోరిక ఉండాలి.
జవాబు:
వ్రాయాలి + అన్న

11. మహాభారతం గొప్ప విశేషాలతో నిండిన కథ.
జవాబు:
విశేషము + లతో

12. కాగితాలను చింపవద్దు.
జవాబు:
కాగితము + లను

13. కొన్నేళ్ళు కష్టపడి చదవితే జీవితం బాగుంటుంది.
జవాబు:
కొన్ని ఏళ్లు

14. మా అన్నయ్య ఇప్పుడు ఇంటర్లో ఉన్నాడు.
జవాబు:
అన్న + అయ్య

15. జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాట ఎప్పుడూ వినాలి.
జవాబు:
జన్మను + ఇచ్చిన

16. తల్లిదండ్రుల అమ్మతాశీర్వానాలు పిల్లలకు బలం.
జవాబు:
అమృత + ఆశీర్వాదాలు

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

17. వసుదైక కుటుంబం స్ఫూర్తిగా యోగా వివిధ దేశాలకు చెందిన ప్రజలను ఏకం చేస్తుంది. (SA-12023-24)
జవాబు:
వసుధ + ఏక

సంధి పదాలను కలపడం

సంధి పదాలను కలిపి రాయండి.

1. కుల + ఆచారము
జవాబు:
కులాచారము

2. స్తుతి + ఆత్మకం
జవాబు:
సత్యాత్మకం

3. పక్కీరు + అప్ప
జవాబు:
పక్కిరప్ప

4. ఎక్కడ + ఉంది.
జవాబు:
ఎక్కడుంది

5. కుమ్మట + ఉచికి
జవాబు:
కుక్కటేశ్వర

6. తయారు + ఐన
జవాబు:
తయారైన

7. తన + ఎదలో
జవాబు:
తన యెదలో

8. ఏవి + ఐనా
జవాబు:
ఏవైనా

9. అవుతుంది + అన్న
జవాబు:
అవుతుందన్న.

10. పురస్కారము + లు
జవాబు:
పురస్కారాలు

11. రకము + లు
జవాబు:
రకాల

12. గంగవర + అప్ప
జవాబు:
గంగవరప్ప

13. భావంబు + ఏమో
జవాబు:
భావంబేమో

14. సన్మాన + ఆదులు
జవాబు:
సన్మానాదులు

15. అభి + అర్ధన
జవాబు:
అభ్యర్థన

సంధి నామాలు

గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి.

1. విద్యార్థికి వినయం ఉండాలి.
అ) గుణ సంధి
ఆ) అత్వ సంధి
ఇ) ఇత్వసంధి
ఈ) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఈ) సవర్ణదీర్ఘ సంధి

2. మా పాఠశాలలో ఒకటవ తరగతి మొట్ట మొదటి తరగతి.
అ) ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) గుణ సంధి
ఈ) యడాగమ సంధి
జవాబు:
అ) ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి

3. మంచిపనికి అభ్యర్ధన చేయాలి.
అ) యడాగమ సంధి
ఆ) యణాదేశ సంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) అత్వ సంధి
జవాబు:
ఆ) యణాదేశ సంధి

4. జీవితంలో ఒకమారైనా సన్మానం అందుకోవాలి.
అ) ఉత్వ సంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) లు,ల, నల సంధి
ఈ) గుణ సంధి
జవాబు:
అ) ఉత్వ సంధి

5. మతఘర్షణలు తలెత్తడం మంచిదికాదు.
అ) ఉత్వ సంధి
ఆ) అత్వ సంధి
ఇ) గుణ సంధి
ఈ) గసడదవాదేశ సంధి
జవాబు:
ఆ) అత్వ సంధి

6. వేంకటేశ్వరుడు కలియుగ దైవం.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) అత్వ సంధి
ఇ) గుణ సంధి
ఈ) యణాదేశ సంధి
జవాబు:
ఇ) గుణ సంధి

7. ఇప్పుడు మూడవయేడు చదువు ప్రారంభిస్తున్నారు.
అ) యణాదేశ సంధి
ఆ) గుణ సంధి
ఇ) అత్వ సంధి
ఈ) యడాగమ సంధి
జవాబు:
ఈ) యడాగమ సంధి

8. ఏటేట మా గ్రామంలో జాతర జరుగుతుంది.
అ) ఆమ్రేడిత సంధి
ఆ) యడాగమం
ఇ) అత్వ సంధి
ఈ) ఉత్వసంధి
జవాబు:
అ) ఆమ్రేడిత సంధి

9. సంబంధంలేని కారణాలు చెప్పకూడదు.
అ) సవర్ణదీర్ఘ సంధి
ఆ) లు,ల, నల సంధి
ఇ) అత్వ సంధి
ఈ) ఇత్వ సంధి
జవాబు:
ఆ) లు, ల, న, ల సంధి

10. కొన్నేళ్లు పోతే మంచి జరగొచ్చు.
అ) అత్వ సంధి
ఆ) ఉత్వ సంధి
ఇ) ఇత్వ సంధి
ఈ) గుణ సంధి
జవాబు:
ఇ) ఇత్వ సంధి

11. నన్ను అడగండని ముందుకు తోస్తారు.
అ) అత్వ సంధి
ఆ) గుణ సంధి
ఇ) ఉత్వ సంధి
ఈ) ఇత్వ సంధి
జవాబు:
ఈ) ఇత్వ సంధి

12. మీసాలు రోషానికి గుర్తు.
అ) లు,ల,న,ల సంధి
ఆ) సవర్ణదీర్ఘ సంధి
ఇ) అత్వ సంధి
ఈ) గుణ సంధి
జవాబు:
అ) లు,ల,న,ల సంధి

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

13. ఆ కథా సంపుటియే పెద్దది.
అ) యణాదేశ సంధి
ఆ) యడాగమ సంధి
ఇ) గుణ సంధి
ఈ) అత్వ సంధి
జవాబు:
ఆ) యడాగమ సంధి

14. గురువుగారూ! మీరిచ్చే సలహా గొప్పది.
అ) ఇత్వ సంధి
ఆ) అత్వ సంధి
ఇ) ఉత్వ సంధి
ఈ) గుణ సంధి
జవాబు:
ఇ) ఉత్వ సంధి

15. పరీక్షతేదీలు తెలిసినప్పటి నుండి కంగారుగా ఉంది.
అ) ఇత్వ సంధి
ఆ) ఉత్వ సంధి
ఇ) త్రిక సంధి
ఈ) అత్వ సంధి
జవాబు:
ఈ) అత్వ సంధి

విగ్రహవాక్యాలు

గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి.

1. ఆశావాది మంచి కవి.
జవాబు:
ఆశను గూర్చి వాదించువాడు.

2. పదిమంది మాటే నమ్ముతారు.
జవాబు:
పది సంఖ్య గల మంది.

3. మా గ్రామ దేవత పేరు మనకపల్లమ్మ,
జవాబు:
గ్రామము నందలి దేవత.

4. అవధాన సభ రసవత్తరంగా సాగింది.
జవాబు:
అవధానం కొరకు సభ.

5. మా గురువుగారికి అక్షర ప్రణామాలు.
జవాబు:
అక్షరాలతో ప్రణామాలు.

6. మన సమస్యలు అనేకం.
జవాబు:
ఏకం కానిది.

7. పద్య గద్యాలు ఉన్నదానిని చంపూ కావ్యం అంటారు.
జవాబు:
పద్యమును, గద్యమును

8. కడిమిళ్లవారు సరస్వతీ పుత్రుడు.
జవాబు:
సరస్వతి యొక్క పుత్రుడు.

9. అక్షరజీవులు కొందరుంటారు.
జవాబు:
అక్షరమే జీవముగా గలవారు.

10. ప్రాథమిక విద్యలోనే మంచి పునాది పడాలి.
జవాబు:
ప్రాథమికమైన విద్య.

11. పెద్దల అమృతాశీర్వాదాలు దక్కించుకోవాలి.
జవాబు:
అమృతము వంటి అశీర్వాదాలు.

12. మా గురుదేవులు నాకు స్ఫూర్తి,
జవాబు:
దేవుని వంటి గురువులు.

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

13. అనంతపురం జిల్లా ఎంతో మంది గొప్పవారికి జన్మ నిచ్చింది.
జవాబు:
అనంతపురం అను పేరు గల జిల్లా

సమాస నామాలు

గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.

1. కులాచారము అతిక్రమించకూడదు.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) రూపక సమాసం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
అ) షష్ఠీ తత్పురుష సమాసం

2. పద్యధారణ చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) ద్వితీయా తత్పురుష సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) ద్వితీయా తత్పురుష సమాసం

3. మూడు నెలలు సాధనచేస్తే ఏదైనా సాధ్యమౌతుంది.
అ) చతుర్థీ తత్పురుష
ఆ) ద్వితీయ తత్పురుష
ఇ) సప్తమీ తత్పురుష
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ద్విగు సమాసం

4. నేను వసతి గృహంలో చదువుతున్నాను.
అ) చతుర్థీ తత్పురుష
ఆ) రూపక సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
చతుర్థీ తత్పురుష సమాసం

5. పద్య నాటకం వ్రాయడంలో తిరుపతి వేంకటకవులు సిద్ధహస్తులు.
అ) నఞ్ తత్పురుష
ఆ) తృతీయా తత్పురుష సమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) సప్తమీ తత్పురుష
జవాబు:
తృతీయా తత్పురుష సమాసం

6. సినిమా ఆద్యంతం బాగుంది.
అ) షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) అవ్యయీభావ సమాసం
ఇ) ద్వంద్వ సమాసం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
ఆ) అవ్యయీభావ సమాసం

7. అసంబద్ధతగా ప్రవర్తించకూడదు.
అ) చతుర్థీ తత్పురుష
ఆ) నఞ్ తత్పురుష సమాసం
ఇ) ద్విగు సమాసం
ఈ) ద్వంద్వ సమాసం
జవాబు:
ఆ) నఞ్ తత్పురుష సమాసం

8. కవి పండితులు ఉన్న సభ బాగుంటుంది.
అ) ద్వంద్వ సమాసం
ఆ) బహువ్రీహి సమాసం
ఇ) రూపక సమాసం
ఈ) ద్విగు సమాసం
జవాబు:
అ) ద్వంద్వ సమాసం

9. పండితుల ప్రసంగం వింటే ఒళ్లు పులకరిస్తుంది.
అ) చతుర్థీ తత్పురుష
ఆ) ద్వితీయ తత్పురుష
ఇ) సప్తమీ తత్పురుష
ఈ) షష్ఠీ తత్పురుష
జవాబు:
ఈ) షష్ఠీ తత్పురుష సమాసం

10. వినయ భూషణుడు ఎక్కడైనా గౌరవింపబడతాడు.
అ) నఞ్ తత్పురుష
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) బహువ్రీహి సమాసం
ఈ) సప్తమీ తత్పురుష
జవాబు:
ఇ) బహువ్రీహి సమాసం

11. మధురభాషణం వలన మర్యాద లభిస్తుంది. (SA-1: 2023-24)
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
ఇ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
జవాబు:
అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఆధునిక వచనాలు

ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.

1. శతక పద్యములను చదివించితిరి.
అ) శతక పద్యంబులను చదివించితిరి.
ఆ) శతక పద్యములే చదివించినారు.
ఇ) శతక పద్యాలు చదివించారు.
ఈ) శతక పద్యమ్ములన్ చదివించితిరి.
జవాబు:
ఇ) శతక పద్యాలు చదివించారు.

2. పెద్దబాలశిక్షను చదివించితిరి.
అ) పెద్దబాలశిక్ష చదివించారు.
ఆ) పెద్దబాలశిక్షయును చదివించితిరి.
ఇ) పెద్దబాలశిక్షనున్ జదివించితిరి.
ఈ) పెద్దబాలశిక్ష దీవించితిరి.
జవాబు:
అ) పెద్దబాలశిక్ష చదివించారు.

3. పద్య గద్యములను చదువవలయును.
అ) పద్య గద్యంబులను చదవవలయు.
ఆ) పద్య గద్యాలు చదవాలి.
ఇ) పద్య గద్యముల్ చదువవలెన్.
ఈ) పద్య గద్యమ్ముల్ చదువవలయున్.
జవాబు:
ఆ) పద్య గద్యాలు చదవాలి.

4. సాహితీ ప్రస్థానమును కొనసాగించితిని.
అ) సాహితీ ప్రస్థానం కొనసాగించాను.
ఆ) సాహితీ ప్రస్థానంబును కొనసాగించితిని.
ఇ) సాహితీ ప్రస్థానమ్మును కొనసాగించితిని.
ఈ) సాహితీ ప్రస్థానంబున్ కొనసాగించితిని.
జవాబు:
అ) సాహితీ ప్రస్థానం కొనసాగించాను.

5. స్వాతంత్ర్యము వచ్చి పదియేండ్లయినది.
అ) స్వాతంత్య్ర్యంబు వచ్చి పదేండ్లయినది.
ఆ) స్వతంత్రమొచ్చి పదేళ్లింది.
ఇ) స్వాతంత్ర్యమ్ము వచ్చి పదేండ్లయియున్నది.
ఈ) స్వాతంత్ర్యమున్ వచ్చి పదేండ్లయెన్.
జవాబు:
స్వతంత్రమొచ్చి పదేళ్లైంది.

6. కాగితములు విసిరితిరి.
అ) కాగితంబులు విసిరియుంటిరి.
ఆ) కాగితముల్ విసిరితిరి.
ఇ) కాగితములన్ విసిరితిరి.
ఈ) కాయితాలు విసిరేరు.
జవాబు:
ఈ) కాయితాలు విసిరేరు.

7. నాయందు పట్టుదలను పెంచినది.
అ) నాయందు పట్టుదలన్ పెంచినది.
ఆ) నాలో పట్టుదల పెంచింది.
ఇ) నాయందునే బట్టుదలనే బెంచినది.
ఈ) నాయందుఁ బట్టుదలఁబెంచినది.
జవాబు:
ఆ) నాలో పట్టుదల పెంచింది.

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

8. సహనముతో కార్యము సాధించవలయును.
అ) సహనమ్మున కార్యమును సాధించవలె.
ఆ) సహనంబున కార్యంబుసాధించవలెన్.
ఇ) సహనంతో కార్యం సాధించాలి.
ఈ) సహనముతోనే కార్యము సాధించవలయున్.
జవాబు:
ఇ) సహనంతో కార్యం సాధించాలి.

9. పద్యములు వ్రాయవలెనను కోరిక కలిగినది.
అ) పద్యంబులు వ్రాయవలయునను కోరికంఁగలిగినది.
ఆ) పద్యముల్ వ్రాయవలెననెడు కోరిక కలిగినది.
ఇ) పద్యముల్ వ్రాయవలెనను కొరిక కలిగినది.
ఈ) పద్యాలు వ్రాయాలనే కోరిక కల్గింది.
జవాబు:
ఈ) పద్యాలు వ్రాయాలనే కోరిక కల్గింది.

10. కందములను ఆకస్మికముగా చూచితిని.
అ) కందాలను ఆకస్మికంగా చుశాను.
ఆ) కందంబులాకస్మికంబుగా చూచితిని.
ఇ) కందములనునాకస్మికముగా చూచితిని.
ఈ) కందమ్ములనా కస్మికముగా చూచితిని.
జవాబు:
అ) కందాలను ఆకస్మికంగా చుశాను.

వ్యతిరేకార్థక వాక్యాలు

ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి.

1. క్రీగీటులు పెట్టారు.
జవాబు:
క్రీగీటులు పెట్టలేదు.

2. గుర్తులు ఉన్నాయి.
జవాబు:
గుర్తులు లేవు.

3. స్పందనలు వ్రాస్తున్నారు.
జవాబు:
స్పందనలు వ్రాయడంలేదు.

4. దృష్టి నిలిచింది.
జవాబు:
దృష్టి నిలవలేదు.

5. విజ్ఞానం పెరిగింది.
జవాబు:
విజ్ఞానం పెరగలేదు.

6. విషయ సేకరణ జరిగేది.
జవాబు:
విషయ సేకరణ జరిగేది కాదు.

7. అనేకాంశాలు తెలిశాయి.
జవాబు:
అనేకాంశాలు తెలియలేదు.

8. పోటీలు నిర్వహించారు.
జవాబు:
పోటీలు నిర్వహించలేదు.

9. కాగితాలు విసిరారు.
జవాబు:
కాగితాలు విసరలేదు.

10. స్వాతంత్ర్యం వచ్చి పదేళ్లయింది.
జవాబు:
స్వాతంత్య్రం వచ్చి పదేళ్లు కాలేదు.

వ్యతిరేకార్థక క్రియలు

కింది క్రియా పదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి.

1. అ) ఏడ్చి
ఆ) ఏడ్వక
ఇ) ఏడుస్తూ
ఈ) ఏడిస్తే
జవాబు:
ఆ) ఏడ్వక

2. అ) ఏడ్పించి
ఆ) ఏడ్చిస్తూ
ఇ) ఏడ్పించక
ఈ) ఏడ్చిస్తే
జవాబు:
ఇ) ఏడ్పించక

3. అ) దెప్పక
ఆ) దెప్పి
ఇ) దెప్పుతూ
ఈ) దెప్పితే
జవాబు:
అ) దెప్పక

4. అ) సన్మానించి
ఆ) సన్మానిస్తూ
ఇ) సన్మానించక
ఈ) సన్మానిస్తే
జవాబు:
ఇ) సన్మానించక

5. అ) సత్కరించక
ఆ) సత్కరిస్తూ
ఇ) సత్కరిస్తే
ఈ) సత్కరించి
జవాబు:
అ) సత్కరించక

6. అ) పూజిస్తూ
ఆ) పూజించక
ఇ) పూజిస్తే
ఈ) పూజిస్తూ
జవాబు:
ఆ) పూజించక

7. అ) నిరసించక
ఆ) నిరసిస్తే
ఇ) నిరసించి
ఈ) నిరసిస్తూ
జవాబు:
అ) నిరసించక

8. అ) నీరసిస్తూ
ఆ) నీరసించక
ఇ) నీరసిసే
ఈ) నీరసించి
జవాబు:
ఆ) నీరసించక

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

9. అ) కలిపి
ఆ) కలుపుతూ
ఇ) కలపక
ఈ) కలిపితే
జవాబు:
ఇ) కలపక

10. అ) నలిపి
ఇ) నిలిపితే
ఆ) నలుపుతూ
ఈ) నలపక
జవాబు:
ఈ) నలపక

సంశ్లిష్ట వాక్యాలు

1. ఇవి ఏ రకమైన సంశ్లిష్టవాక్యాలో రాయండి.

1. బావులు పూడ్చి చెరువులు త్రవ్విస్తాను.
జవాబు:
క్త్వార్థకం

2. రచయిత సినిమా బాణిలో పాటలు వ్రాస్తూ చిట్టి పొట్టి పద్యాలల్లేవారు.
జవాబు:
శత్రర్థకం

3. రచయిత కష్టపడి చదివి పేరుప్రఖ్యాతులు గాంచారు.
జవాబు:
క్త్వార్థకం

4. రచయిత తన 19వ యేటనే అవధానం ప్రారంభించి, వేదికపై ప్రదర్శించారు.
జవాబు:
క్త్వార్థకం

5. విద్యార్థికి క్రమశిక్షణ లేకపోతే ప్రగతిని సాధించలేదు.
జవాబు:
చేదర్థకం

6. నిత్యం పుస్తకాలు చదువుతూ ఉండాలి.
జవాబు:
క్త్వార్థకం

7. నన్ను డిపార్ట్మెంట్కు పిలిపించి గురువుల సన్నిధిలో సమస్యాపూరణ పరీక్ష నిర్వహించారు.
జవాబు:
క్త్వార్థకం

8. అష్టావధానంలో పృచ్ఛకస్థానం పొందుతూ భువన విజయంలో నేపథ్యగాయకుడనయ్యాను.
జవాబు:
శత్రర్ధకం

9. అవధాన ప్రక్రియలో పరిశ్రమిస్తే కీర్తితో పాటు ధనలాభం వస్తుంది.
జవాబు:
చేదర్థకం

10. నిషిద్ధాక్షరిలో నాకు మెలకువలు నేర్పించి అవధానిని చేశారు.
జవాబు:
క్త్వార్థకం

కర్మణి వాక్యాలు

సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

1. పూజారులను గ్రామస్తులు ఆసాదులు అని పిలుస్తారు.
అ) పూజారులు గ్రామస్తుల చేత ఆసాదులని పిలవబడతారు.
ఆ గ్రామస్తులు పూజారుల చేత ఆసాదులని పిలవబడతారు.
ఇ) ఆసాదుల చేత గ్రామస్తులు పూజారులుగా పిలవబడతారు.
ఈ) పూజారుల చేత గ్రామస్తులు ఆసాదులుగా పిలవబడ తారు.
జవాబు:
అ) పూజారులు గ్రామస్తుల చేత ఆసాదులని పిలవబడతారు.

2. వారు ఆశువుగా పద్యాలు చెబుతారు.
అ) ఆశువు చేత వారి పద్యాలు చెప్పబడతాయి.
ఆ) పద్యాల చేత వారు ఆశువుగా చెప్పబడతారు.
ఇ) వారి చేత ఆశువుగా పద్యాలు చెప్పబడతాయి.
ఈ) ఆశువు చేత వారు పద్యాలు చెప్పబడతాయి.
జవాబు:
ఇ) వారి చేత ఆశువుగా పద్యాలు చెప్పబడతాయి.

3. వారు డాక్టరేట్ పొందారు.
అ) డాక్టరేట్ చేత వారు పొందబడ్డారు.
ఆ) వారి చేత డాక్టరేట్ పొందబడింది.
ఇ) వారి డాక్టరేట్ చేత పొందబడింది.
ఈ) వారి చేత డాక్టరేట్ పొందబడును.
జవాబు:
ఆ) వారి చేత డాక్టరేట్ పొందబడింది.

4. వారు గ్రంథాన్ని తీసుకొనేవారు.
అ) గ్రంథం చేత వారు తీసుకోబడ్డారు.
ఆ) వారి చేత గ్రంథం తీసుకోబడదు.
ఇ) వారి చేత గ్రంథాలు తీసుకోబడతాయి.
ఈ) వారి చేత గ్రంథం తీసుకోబడేది.
జవాబు:
ఈ) వారి చేత గ్రంథం తీసుకోబడేది.

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

5. వారు పద్మశ్రీని అందుకొన్నారు.
అ) వారి చేత పద్మశ్రీ అందుకోబడింది.
ఆ) పద్మశ్రీ వారి చేత పొందబడింది.
ఇ) వారి చేత పద్మశ్రీ అందుకోబడును.
ఈ) వారి చేత పద్మశ్రీ పొందబడును.
జవాబు:
అ) వారి చేత పద్మశ్రీ అందుకోబడింది.

6. వారిని పెద్దలు అభినందించారు.
అ) పెద్దల చేత వారు అభినందించబడ్డారు.
ఆ) వారి చేత పెద్దలు అభినందించబడ్డారు.
ఇ) వారు పెద్దల చేత అభినందనలు అందుకోబడినవి.
ఈ) పెద్దల చేత పొగడబడ్డారు.
జవాబు:
అ) పెద్దల చేత వారు అభినందించబడ్డారు.

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయండి.

1. ఆయన ఆటవెలది పద్యాలు చెపుతూ శతకం వ్రాశారు.
జవాబు:
సంశ్లిష్టవాక్యం

2. ఆశావాది కవి, విమర్శకుడు, అవధాని.
జవాబు:
సంయుక్త వాక్యం

3. ఆహా! ఆశావాది వారి పద్యం ఎంతబాగుందో!
జవాబు:
ఆశ్చర్యార్థకం

4. ఈ రోజు అవధానం ఉంటుందో! ఉండదో!
జవాబు:
సందేహార్ధకం

5. అవధానిగారిదే ఊరు?
జవాబు:
ప్రశ్నార్థకం

6. దయచేసి మంచి ప్రశ్నలు వేయండి.
జవాబు:
విధ్యర్థకం

7. దెప్పిపొదుపు మాటలు వద్దు.
జవాబు:
నిషేధార్థకం

8. ఆశావాది ఎక్కడైనా అవధానం చేయగలరు.
జవాబు:
సామర్థ్యార్థకం

9. ఇక పృచ్ఛకులు ప్రశ్నించవచ్చు.
జవాబు:
అనుమత్యర్థకం

10. అవధానిగారూ! కలకాలం వర్ధిల్లండి.
జవాబు:
ఆశీరార్ధకం

వాక్య రకాలు

ఇవి ఏ రకమైన సామాన్య వాక్యాలో గుర్తించండి.

1. భాగవతం అనువాదం చేస్తూ అవధానం చేశారు.
అ) సంయుక్తం
ఆ) సంశ్లిష్టం
ఇ) చేదర్థకం
ఆ) సంశ్లిష్టం
ఈ) అవ్యర్థకం
జవాబు:
ఆ) సంశ్లిష్టం

2. ఆయన చీకటికోణం, విభూతి గీత వ్రాశారు.
అ) సంశ్లిష్టం
ఆ) చేదర్థకం
ఇ) సంయుక్తం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఇ) సంయుక్తం

3. అవధానం చేస్తే పేరు వస్తుంది.
అ) చేదర్థకం
అ) సంయుక్తం
ఇ) సంశ్లిష్టం
ఈ) విధ్యర్ధకం
జవాబు:
అ) చేదర్థకం

4. కొందరికి ధనం ఉన్నా సుఖం ఉండదు.
అ) విధ్యర్థకం
ఆ) సంయుక్తం
ఇ) ప్రశ్నార్థకం
ఈ) అప్యర్థకం
జవాబు:
ఈ) అప్యర్థకం

5. అవధాని గారిని సత్కరించండి.
అ) విధ్యర్ధకం
ఆ) ప్రశ్నార్ధకం
ఇ) విషేధార్థకం
ఈ) ఆశ్చర్యార్థకం
జవాబు:
అ) విధ్యర్ధకం

6. ఇది అవధానమా! అమృత ధారా!
అ) విధ్యర్ధకం
ఆ) సందేహార్ధకం
ఇ) అప్యర్థకం
ఈ) ఆశీరార్ధకం
జవాబు:
ఆ) సందేహార్ధకం

AP 9th Class Telugu 11th Lesson Important Questions ఆశావాది

7. ఆహా! ఏమి పద్యమధురిమలు!
అ) ఆశీరార్ధకం
అ) సందేహార్ధకం
ఈ) విధ్యర్థకం
ఇ) ఆశ్చర్యార్థకం
జవాబు:
అ) ఆశీరార్ధకం

8. దీర్ఘాయుష్మాన్ భవ!
అ) అశ్చర్యార్థకం
ఆ) సందేహార్ధకం
ఇ) అప్యర్థకం
ఈ) ఆశీరార్ధకం
జవాబు:
ఈ) ఆశీరార్ధకం

9. పృచ్ఛకులెవరెవరు?
అ) ప్రశ్నార్థకం
ఆ నిషేధార్ధకం
ఇ) నిశ్చయార్థకం
ఈ) సామర్థ్యార్థకం
జవాబు:
అ) ప్రశ్నార్థకం

Leave a Comment