Access to the AP 9th Class Telugu Guide 10th Lesson ప్రియమైన నాన్నకు Questions and Answers are aligned with the curriculum standards.
ప్రియమైన నాన్నకు AP 9th Class Telugu 10th Lesson Questions and Answers
చదవండి – చర్చించండి :
మా నాయన
కోడి మా నాయన్ని నిద్రలేపేదో
మా నాయనే కోడిని నిద్ర లేపేవాడో
తెలియదు గాని
సూర్యుణ్ణి నిద్రలేపేది మాత్రం మా నాయనే
సూర్యకిరణాలతో పులకించే ముందు
మా నాయన పాదస్పర్శతో.
పంటపొలం పరవశించిపోయేది.
మా నాయన పొలంలోకి అడుగుపెట్టగానే
గెనాల మీద పచ్చిక
మా నాయన
మంచుబిందువులతో ఆయన పాదాలు కడిగేది.
ఆయన పంచ పై కెగగట్టి నడుస్తుంటే
గెనాలు వంతెనలా ఊగేవి.
ఆయన నడిచి పోయిన గెనిమి
నీళ్ళు జల్లించడం మానేసేది.
మా నాయన
కాడి పైకెత్తి లొట్టవేస్తేచాలు
కాడెద్దులు విధేయులైన కొడుకుల్లా
కాడి కింద దూరేవి.
ఆయన వేసిన కొండ్ర
ఇంజనీర్లకు గీత గీయ్యడం నేర్పేది.
పారతో అండ జెక్కితే.
ఆచారి బాడిసతో దూలం చెక్కినట్టుండేది.
మొలకెత్తిన వడ్లను
గోయిందా గోయిందా అని నారు విడుస్తుంటే
తిండి గింజలు పండుతాయి భయపడకండని
దండోరా వేస్తున్నట్లుండేది.
ఊరందరికన్నా ముందు
నాట్లు వేసి కోత కోసే పందెంలో
మొదటి బహుమతి ఎప్పుడూ మా నాయనదే
అడుసు ఏడు సాళ్ళు దున్నేటప్పుడు
ఆయన మఖంలో కళ
తొలి చూలు మోసేది.
నాటిన పైరు పొట్టకరక్కు వచ్చేటప్పుడు
ఆయన ముఖం ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయ్యేది.
పనగొట్టిన వడ్లను తూర్పారబడుతూ
కన్నబిడ్డలను స్నానం చేయించే తండ్రిలా అయ్యేవాడు.
తిరుపతి నుంచి ముసలయ్య గీతాలతో వచ్చి
వడ్ల ధర చెబుతుంటే
ఆయన ముఖం సంపూర్ణ సూర్యగ్రహణం
పట్టినట్లయ్యేది.
మొలక మీసం పలితకేశమయ్యేదాకా
పొలం వేదిక మీద హలాయుధంతో
స్వైర విహారం చేసిన కర్షకయోధుడు మా నాయన.
ఆలోచనాత్మక ప్రశ్నలు :
ప్రశ్న 1.
మనందరికీ అన్నం పండించిపెట్టే రైతు పడుతున్న శ్రమను చూస్తే నీకేమనిపిస్తుంది ?
జవాబు:
రైతు చాలా శ్రమ పడనిదే పంట చేతికిరాదు. దుక్కి దున్నాలి. వర్షం కోసం ఎదురుచూపులు, తొలకరించాక భూమిని రైతు దున్నుతాడు. బాగా దున్నాక నీరు పెట్టాలి. నీరు పెట్టాక విత్తనాలు చల్లాలి. విత్తనాలు మంచివి ఎంచుకొని చల్లుతాడు. విత్తనం మొలకెత్తాక పురుగుమందులు చల్లుతాడు. ఆకుమడి కొంచెం ఎదిగాక నాట్లు వేస్తాడు. మళ్లీ నీరు పెడతాడు. ఎరువులు,, పురుగుమందులు చల్లుతాడు. పశువులు తినకుండా కాపలాకాస్తాడు. పంట పండాక కోతలు కోస్తాడు. కుప్ప వేస్తాడు. నూర్చుతాడు, ధాన్యం బస్తాలలోకి ఎత్తి మిల్లుకు తీసుకొని వెడతాడు. 24 గంటలూ ప్రతిరోజూ రైతు శ్రమిస్తాడు. పంట పండిస్తాడు.
ప్రశ్న 2.
నీవు ఎప్పుడయినా మీ నాన్న చేసే పనిలో పాలు పంచుకున్నావా ? అక్కడ నీకు చాలా అద్భుతంగా అనిపించిన అంశం ఏమిటి?
జవాబు:
మా నాన్నగారు ఉపాధ్యాయుడు. ఆయన ఉదయం నుండి సాయంత్రం దాకా బడిలో నిలబడి పాఠాలు చెబుతారు. విద్యార్థులు చేసే అల్లరిని ఓపికగా భరిస్తారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా పాఠం చెబుతారు. పిల్లలు అడిగే ప్రశ్నలకు విసుక్కోకుండా జవాబులు చెబుతారు. మేము రాసే తప్పులను చాలా ఓర్పుగా, నేర్పుగా సవరిస్తారు. మళ్లీ ఆ తప్పులు చేయకుండా చేస్తారు. నేను కూడా అదే పాఠశాలలో చదువుతున్నాను. కనుక ఆయన పడే కష్టం నేను దగ్గర్నుంచి చూస్తున్నాను. నోట్సులు, పేపర్లు ఇంటికి తెచ్చుకొని అక్షరం అక్షరం పట్టి పట్టి చూసి దిద్దుతారు. నేనెప్పుడైనా దిద్దుతానంటే ముందు తమరు తప్పుల్లేకుండా వ్రాయడం నేర్చుకోండి, నాకు అదే మహోపకారం అని వెటకారంగా అంటారు. మా నాన్నగారు మంచి మంచి కథలు, జోకులు కూడా చెబుతారు.
పేజి 133 లోని ప్రశ్నలు :
ప్రశ్న 1.
మనం పుస్తకాలు ఎందుకు చదవాలి ?
జవాబు:
మనం పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని పొందుతాం. తద్వారా ఏది మంచి, ఏది చెడు అనే వివేకం కలుగుతుంది. ఇంకా మనిషి తనకు కావలసిన దానికంటే ఎక్కువ కోరుకోవడం తప్పనీ, దురాశ దుఃఖానికి చేటనీ, పిలవని పేరంటానికి వెళ్ళకూడదనీ, పెద్దలను గౌరవించాలని ఇలా ఒక చక్కని విచక్షణ కలుగుతుంది. కనుక మనలోని చెడును తొలగించి, మంచిని పెంచే మంచి మంచి పుస్తకాలను మనం చదవాలి.
ప్రశ్న 2.
మీరు చదివిన పుస్తకాల పేర్లు రాయండి.
జవాబు:
మా నాన్నగారు మా కోసం చందమామ, బాలమిత్ర, పంచతంత్ర కథల పుస్తకాలు ఊళ్ళకు వెళ్ళినపుడు కొని తెచ్చేవారు. వాటిని నేను, అక్క పోటీపడి చదివేవాళ్ళం. ఇంకా బొమ్మల రామాయణం, బొమ్మల భారతం, బొమ్మల భాగవతం పుస్తకాలు, బారిస్టరు పార్వతీశం నవల, కాశీమజిలీ కథలు, వివేకానందుని జీవిత చరిత్ర, అబ్దుల్ కలాం జీవిత చరిత్ర మొదలైన పుస్తకాలు మా పాఠశాల గ్రంథాలయంలో చదివాను.
అవగాహన – ప్రతిస్పందన :
ఇవి చేయండి :
అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
ప్రశ్న 1.
‘ప్రియమైన నాన్నకు’ కథ రచయిత్రి గురించి రాయండి.
జవాబు:
‘ప్రియమైన నాన్నకు’ కథను రాసిన రచయిత్రి శ్రీమతి పింగళి బాలాదేవి. ఈమె మహిళా సాధికారత, స్వాతంత్ర్యం, చదువు, ఉద్యోగం, కుటుంబ విలువలు ఇతివృత్తాలుగా అనేక నవలలు, కథలు, కవితలు రాశారు. తండ్రి నుంచి వారసత్వంగా రచనా నైపుణ్యాన్ని పొందారు. తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో రచనలు చేసారు. ఈమె రాసిన “గాజు బొమ్మలు” కు 2007లో సోమేపల్లి సాహితీ పురస్కారం లభించింది. ఈమె M.Sc. విద్యను కటక్ చదివారు. జువాలజీ ప్రొఫెసర్గా పనిచేసి, రిటైరయ్యారు. ఒక చీకటి – ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం, నాన్నకు రాయని ఉత్తరం, కుసుమ కోమలి, ప్రశ్న, గాజు బొమ్మలు, గృహప్రవేశం వీరి రచనలు.
ప్రశ్న 2.
కృష్ణమూర్తి గారికి ఫోన్లో మాట్లాడడం కన్నా ఉత్తరాలు రాయడం అంటేనే ఎందుకు ఇష్టం ?
జవాబు:
కృష్ణమూర్తి గారికి ఫోన్లో మాట్లాడడం కన్నా ఉత్తరాలు రాయడం అంటేనే ఇష్టం. ఎందుకంటే టైము గడిచేకొద్దీ డబ్బులు ఎక్కువైపోతాయని ఆయనకు గాబరా. ఆ గాబరాలో ఒకటి రెండు మాటలలోనే సరిపెట్టుకోవాలి. సంతృప్తిగా మాట్లాడుకొందుకు ఉండదని ఆయన భయం. అందుకే ఆయనకు ఫోన్లో మాట్లాడడం ఇష్టం ఉండదు. ఉత్తరంలో అయితే తమ అనుభూతులు, అభిప్రాయాలు పూర్తిగా వ్రాయవచ్చు.
ప్రశ్న 3.
చిన్నతనంలో రచయిత్రి తండ్రిగారైన కృష్ణమూర్తి గారు ఆమెతో ఏ ఏ పుస్తకాలు చదివించారు ?
జవాబు:
చిన్నతనంలో రచయిత్రి తండ్రిగారైన కృష్ణమూర్తి గారు ఆమెతో చాలా పుస్తకాలు చదివించారు. అవి ‘దక్షయజ్ఞం’, ‘బంగారు రాజు కథ’, జంతువుల – పక్షుల కథల పుస్తకాలు, చందమామ, బాలమిత్ర పుస్తకాలూ, ఠాగూరు, శరత్, బంకిం బాలల అనువాదాలు, చలం, కొడవటిగంటి గారి కథలు, రామాయణం, భారతం, భాగవతం వచన పుస్తకాలు, పెర్ల్బక్, స్టీక్, టాల్స్టాయ్, ఓ హెన్రి కథలు, షేక్స్పియర్ నాటకాలు చదివించారు.
ప్రశ్న 4.
రచయిత్రి తండ్రికి ఎప్పుడు, ఎందుకు ఉత్తరం రాయవలసి వచ్చింది ?
జవాబు:
రచయిత్రి తండ్రి మరణించాక ఆయనకు ఆమె ఉత్తరం రాసింది. అది ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఆమె ఎప్పుడూ తన తండ్రికి మనస్పూర్తిగా ఉత్తరం వ్రాయలేదు. ఫోన్లో మాట్లాడడం ఆయనకు ఇష్టం ఉండదు. అయినా ఆయన ఫోన్లో పలకనంత దూరం వెళ్లిపోయాడు. ఆయన తను ఇక ‘భువనేశ్వర్ రాలేనేమో’ అన్న మాటలు గుర్తుకు వచ్చి, ఆమెను చాలా బాధించాయి. తన జీవితంలో తండ్రికి చెప్పాలనుకొన్న సంగతులన్నీ గుర్తుకు వచ్చాయి. అవి ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఉత్తరం వ్రాస్తుంటే తన తండ్రితో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. తన మనసుకు తృప్తిగా ఉంటుంది. కనుకనే ఆమె మనశ్శాంతి కోసం తండ్రికి ఉత్తరం వ్రాసింది.
ప్రశ్న 5.
“కమ్యూనికేషన్ గ్యాప్” అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు ?
జవాబు:
“కమ్యూనికేషన్ గ్యాప్” అంటే సమాచార పంపిణిలో లోపం. రచయిత్రి తాను చెప్పాలనుకొన్నవేవీ తండ్రికి బ్రతికి ఉండగా చెప్పలేకపోయింది. దానికి కారణం కేవలం ఖాళీ లేకపోవడమే. ఆయన మరణించాక ఆ సంగతులన్నీ లేఖ రూపంలో వ్రాసింది.
ఇలాగే చెప్పాలనుకొన్నవి చెప్పలేకపోవడం, తెలియజేయాలనుకొన్నవి తెలియజేయలేకపోవడాన్నే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. దీనికి కారణాలుండవచ్చు. లేకపోవచ్చు.
ఆ) కింది అపరిచిత గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
నా కళ్ళు అందమైనవి అంటుంది అమ్మ. నిజమే నా కళ్ళు పెద్దవే కానీ ఏమి లాభం, పక్కింటి వాళ్ల రాముడివి చింతాకంత చీకిరికళ్ళు. నాకూ వాడికీ పఅంటే ఇష్టం లేదు. ఏడిస్తే నా కళ్ళు ఏమి బాగుండవు. మొహమంతా నల్లగా కాటుకవుతుంది. నేనెప్పుడూ ఏడవను బాబూ. మదేళ్లే. కానీ మా ఊళ్లో వాడు చూసిన వింతల్లో వందో వంతు కూడా నేను చూడలేదు.
నాకు ఏడుపు న కళ్ళకు ఏం కనబడ్డా సరే మనం ఏం అనుకూడదంట ఏమీ చెయ్యకూడదంట! అలా దిక్కులు చూస్తావేం తలొంచుకు నడువు. నేలమీద చూడు అంటూ అమ్మ మొట్టికాయలేస్తుంది. నాకు నాన్న చేతిలో మామిడిపళ్ళ బుట్ట కనపడిందనుకో – ఓ మామిడి పళ్ళో అని ఎగర బుద్ధిస్తుంది. ఎగర కూడదంట. అవి మన కంచంలోకి వచ్చే వరకూ అరవకూడదంట. కంచంలోకి వచ్చాక బుద్ధిగా తినాలంట. మామిడిపళ్ళు చూడగానే ఎగరక పోతే చూసిన ఫలితం ఏముంటుంది ? అలాగే కోపం వచ్చేది, చూసినా కూడా అరవ కూడదంట. అప్పుడొక రోజు ఏమయింది.
కల్యాణి అక్క కాలేజ్ నుంచి ఒస్తుంటే ఒకబ్బాయి. సైకిల్ మీద నుంచి పడిపోయాడు – కాలు బెణికి లేవలేక పోయాడు. రోడ్డు మీద ఎవరూ లేరు కళ్యాణి అక్క అతన్ని లేపి సైకిల్ తీసి స్తంభానికి అనించి పెట్టింది. ఆ అబ్బాయిని లేపి కాలు విదిలించుకుంటుంటే అతను పడిపోకుండా అతని చేయి పట్టుకుందట. ఇదంతా మా పక్కింటి మామయ్య చూసి కల్యాణి వాళ్ళ నాన్నతో చెప్పాడట. పరాయి పిల్లవాడి చేయి పట్టుకుంటావా అని అక్కను వాళ్ల నాన్నగారు కొట్టారు. పడిపోతే చూసి లేవదీసానంటే – చూస్తే చూసావు. నీ దారిన నీవు రావాలిగానీ దేశసేవ చేస్తావా అంటూ తిట్టాడు.
చూసిన తర్వాత ఏదయినా చెయ్యాలి గదా – లేకపోతే చూడడమెందుకు ? చూసినా చూడనట్లు ఉండటం ఎలా? అంటే అమ్మకి అర్థం కాదు. నోరుమూసుకో అంటుంది. కళ్ళు మూసుకోవాలి. నోరు మూసుకోవాలి. అమ్మ కళ్ళకు ఏమీ కనిపించవు. కనిపించినా వాటి గురించి అమ్మ పట్టించుకోదు. ఆడవాళ్ళ కళ్ళే ఇట్లా ఎందుకుంటాయో …!
(-సురక్ష ఆంధ్రప్రదేశ్ పోలీసు మాస పత్రిక, రాజకీయ కథలు – శ్రీమతి ఓల్గా)
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
రచయిత్రికి ఏడుపు అంటే ఇష్టం లేదు ఎందుకు ?
జవాబు:
రచయిత్రికి ఏడుపు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఏడిస్తే ఆమె కళ్ళు ఏమీ బాగుండవని ఆమె అభిప్రాయం. మొహమంతా నల్లగా కాటుకవుతుందని భయం. అందుకే రచయిత్రి ఏడవదు.
ప్రశ్న 2.
‘నోరు మూసుకో లేకుంటే కళ్ళు మూసుకో” అని అమ్మ ఎందుకన్నది ?
జవాబు:
పెద్దవాళ్లు ఏంచేసినా మాట్లాడకూడదు. నోరు తెరువకూడదు, మగపిల్లలు (పక్కవాళ్లు) ఆపదలో ఉన్నా పట్టించు కోకూడదు. కళ్లు మూసుకోవాలి. అటు చూడకూడదు అనేది వాళ్ల అమ్మ అభిప్రాయం. అందుకే అలా అన్నది.
ప్రశ్న 3.
ఆపదలో ఉన్నవాళ్ళకు సాయం చేయడంలో ఆడ, మగ తేడాలుంటాయా ?
జవాబు:
ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేయడంలో ఆడ, మగ తేడాలు అస్సలు ఉండవు.
ప్రశ్న 4.
చూసి చూడనట్లు ఉండడం అంటే ఏమిటి ?
జవాబు:
‘చూసీ చూడనట్లు ఉండడం’ అంటే చూసినా పట్టించుకోకపోవడం అని అర్థం.
ప్రశ్న 5.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న రాయండి.
జవాబు:
కల్యాణిని వాళ్ల నాన్నగారెందుకు కొట్టారు ?
ఇ) కింది పేరా చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.
యుద్ధంలోకి మొదటిసారిగా మహిళల్ని తెచ్చింది నేతాజీ. స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసి, వాళ్ల చేతికి తుపాకులిచ్చారు. నేతాజీ. సరిగ్గా శత్రువుల గుండెల్లోకి పేల్చేలా వారికి శిక్షణ ఇచ్చారు. కదన రంగంలో ముందుకు కదలడానికి ఆ మహిళలకు కట్టుకున్న చీరలు అడ్డుపడలేదు. కానీ ఆరంభంలోనే యుద్ధంలోకి స్త్రీలెందుకు, స్త్రీల చేతులకు తుపాకులెందుకు అని మగాళ్లు ముఖం చిట్లిస్తూ అడొచ్చారు. అయినా నేతాజీ వినలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ (నేతాజీ సారథ్యం వహించిన సైన్యం)కి ప్రత్యేకమైన పోరాట వ్యూహాలు ఉన్నప్పటికీ భారీ బలగాల్లేవు. మహిళాశక్తిపై నమ్మకంతో, విశ్వాసంతో వారిని సంగ్రామంలోకి ఆహ్వానించారు నేతాజీ. అందుకోసం 1943 జూలై 9న సింగపూర్లో సమావేశం జరిగింది.
“ఏం చేస్తారు బోస్… ఆడవాళ్లు సైన్యంలోకి వచ్చి ?” మగవాళ్లెవరో లేచి అడిగారు నేతాజీని,
“ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు” అన్నారు నేతాజీ! “తిరుగుబాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయ్. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను. పురుషులతో పాటు మహిళలూ కదిలొస్తే మనకు త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. మహిళా సైనికులు యుద్ధరంగంలోకి దుమికితే భారతదేశం అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్కు అందుతుంది” అన్నారు నేతాజీ. ఆ వెంటనే చెయ్యి ముందుకు చాస్తూ ప్రమాణం చేస్తున్నట్లుగా “మన మహిళా దళం పేరు ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’. మరణ ధిక్కార మహిళా దళం మనది” అని దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదం చేసారు మహిళా సైనికులు.
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
యుద్ధ రంగంలో మహిళల్ని మొదటిసారిగా పరిచయం చేసిన వారు ఎవరు ?
జవాబు:
యుద్ధ రంగంలో మహిళల్ని మొదటిసారిగా నేతాజీ పరిచయం చేశారు.
ప్రశ్న 2.
స్త్రీలు యుద్ధరంగంలో ప్రవేశించడంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
స్త్రీలు యుద్ధరంగంలో కూడా ప్రవేశించాలి. స్త్రీలు అన్ని రంగాలలో పురుషులతో సమానమే.
ప్రశ్న 3.
పై పేరాలో యుద్ధం అని అర్థం వచ్చే పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
సంగ్రామం, కదనము, పోరాటం
ప్రశ్న 4.
‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిషువారితో మరణించేదాకా పోరాడింది. అలాంటి ధైర్యసాహసాలనే ఈ మహిళలూ
యుద్ధరంగంలో ప్రదర్శిస్తారని భావం.
ప్రశ్న 5.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
‘మరణ ధిక్కార మహిళాదళం మనది’ అంటే ఏమర్థమయింది ?
వ్యక్తీకరణ – సృజనాత్మకత :
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
కృష్ణమూర్తిగారు తన కుటుంబంతో కలిసి ఫోటో తీయించుకోవడం వెనుక గల సందర్బాన్ని మీ సొంతమాటల్లో
రాయండి.
జవాబు:
కృష్ణమూర్తిగారిని కుక్క కరిచింది. అందరూ రేబిస్ వ్యాధి వస్తుందని భయపెట్టారు. కృష్ణమూర్తిగారిని చచ్చిపోతారని భయపెట్టారు. చచ్చిపోయేలోగా భార్యా బిడ్డలతో ఒక ఫోటో అయినా తీయించుకోవాలని ఆయన కోరిక, వెంటనే భార్యా పిల్లలతో ఫోటో స్టూడియోకు వెళ్లారు. ఫోటో తీయించుకొన్నారు.
ప్రశ్న 2.
ఈ పాఠ్యాంశం ద్వారా రచయిత్రి తన తండ్రి గురించి ఏమి చెప్పదలచుకున్నారు ?
జవాబు:
ఈ పాఠ్యాంశం ద్వారా రచయిత్రి తన తండ్రి గురించి చాలా చెప్పదలచుకొన్నారు. ఆయన తమను పెంచిన తీరు చెప్పాలనుకొన్నారు. తమకు చిన్నతనం నుండీ ఆయన నేర్పిన చదువు, క్రమశిక్షణ గురించి చెప్పాలనుకొన్నారు. ఆయన జీవితంలో కుటుంబం కోసం పడిన కష్టాలు చెప్పాలనుకొన్నారు. ఆయన స్వయంకృషితో ఎదిగిన తీరు చెప్పాలనుకొన్నారు.
ప్రశ్న 3.
రచయిత్రి తండ్రి తన కుమార్తెలకు స్వేచ్చనిచ్చినా, అప్రమత్తంగా ఉండేవారు అనడానికి కారణం ఏమిటీ ?
జవాబు:
కృష్ణమూర్తిగారు తమ పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వాళ్ల చదువులు పూర్తయి ఉద్యోగాలలో చేరే వరకు వాళ్ల పెళ్ళిళ్ల
గురించి ఆలోచించలేదు..
కానీ, అంత అప్రమత్తంగానూ ఉండేవారు. రచయిత్రి ఉద్యోగంలో చేరిన కొత్తలో కాలేజీ మీటింగు ఉందని సాయంత్రం ఐదు దాటినా ఇంటికి రాలేదు. ఆమె తండ్రి కారులో వచ్చి కాలేజీ అంతా రెండుసార్లు తిరిగి వెళ్లారు. ఆయన అలా వచ్చినందుకు రచయిత్రి ఆ వయస్సులో విసుక్కొన్నారు. కానీ, పెద్దయ్యాక తెలిసింది. ఆయన పిల్లల పట్ల అంత అప్రమత్తంగా ఎందుకు ఉన్నారో !
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘తల్లిదండ్రుల బాగోగులు చూడడం పిల్లల కర్తవ్యం’ ఈ విషయంపై మాట్లాడడానికి ఒక ప్రసంగ వ్యాసాన్ని రాయండి.
జవాబు:
కర్తవ్యం
‘తల్లిదండ్రుల బాగోగులు చూడడం పిల్లల కర్తవ్యం’ ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడతారు. తల్లి నవమాసాలు కడుపులో మోసి ప్రాణాలకు తెగించి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ శిశువును చూసిన ఆనందంలో తను పడిన బాధంతా మరచిపోతుంది. పాలిచ్చి పెంచుతుంది. అల్లరికి, చేష్టలకూ మురిసిపోతుంది.
తన బిడ్డకు ఏంకావాలన్నా తన అవసరాలు మానుకొని అయినా తండ్రి కొనిస్తాడు. తమ బిడ్డ తమకంటే చాలా గొప్పగా ఉండాలని కడుపులు మాడ్చుకొని చదివిస్తారు. బిడ్డ కాలిలో ముల్లు గుచ్చుకొంటే తమ గుండెల్లో గునపం దిగినంతగా విలవిలలాడిపోతారు తల్లిదండ్రులు.
అటువంటి తల్లిదండ్రులను దైవం కంటే ఎక్కువగా భావించి, చేదోడు వాదోడుగా ఉండాలి పిల్లలు. వారికోసం ఎక్కువ సమయం కేటాయించాలి. తల్లిదండ్రులకు ఏం కావలసినా సమకూర్చాలి, వారికి ఆనందం కల్గించాలి. వారి ఆరోగ్యం కాపాడాలి. దేవుడికి దండం పెట్టడం కంటే తల్లిదండ్రులను గౌరవించడం ప్రధానం. తల్లిదండ్రుల మాట వినని వారు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధర్మాలు పాటించినా ప్రయోజనం లేదు.
ప్రశ్న 2.
మీకు మీ నాన్న మీద ఉన్న ప్రేమను తెలుపుతూ మీ సొంతమాటల్లో లేఖను రాయండి.
అమరావతి,
X X X X X.
గౌరవనీయులైన నాన్నగారికి,
మీ కుమార్తె మల్లీశ్వరి వ్రాయు లేఖ,
ఇక్కడ నేను క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను. నేను ఇక్కడ హాస్టల్లో బాగా చదువుకొంటున్నాను. ఇంతవరకు పెట్టిన రెండు నిర్మాణాత్మక మూల్యాంకనాలలోను మార్కులు బాగా వచ్చాయి.
మీ నాన్నగారు మాస్టారు కాబట్టి నీకన్నీ వేసవి సెలవులలో మీ నాన్నగారు చెప్పేశారు కాబట్టి నీకు ఎప్పుడూ ఫస్టు మార్కులేనని మా ఫ్రెండ్స్ అంటున్నారు. టీచర్స్ కూడా నన్ను చాలా పొగుడుతున్నారు.
దీనికంతటికీ కారణం మీరే, నేను మీ గౌరవం పెంచగలనో లేదో కానీ మీరు మాత్రం నా గౌరవం చాలా పెంచేస్తున్నారు. తల్లిదండ్రులంటే భగవంతుడి కంటే ఎక్కువని మా తెలుగు మాస్టారు చెప్పారు. అది నిజమే, నాకింతకంటే ఏం రాయాలో తెలియడం లేదు. మీరు చెప్పినట్లు వాక్య నిర్మాణంలో కాని, పదజాలంలో కాని, భాషలో కాని, భావంలో కాని తప్పులుంటే మన్నించండి.
ఇట్లు,
మీ కుమార్తె,
సి. హెచ్. మల్లీశ్వరి.
చిరునామా :
శ్రీ సి. హెచ్. విశ్వనాథం గారు, (టీచరు)
మసకపల్లి,
గంగవరం (మండలం),
తూర్పు గోదావరి జిల్లా.
ప్రశ్న 3.
‘ఉత్తరాలు రాయడం, టెలిఫోన్లో మాట్లాడడం’ వీటిలో ఏది ఉపయోగకరమైనది – అని నీవు భావిస్తున్నావు ? మీ సమాధానాన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ఉత్తరాలు వ్రాయడం ఉపయోగకరమా ? ఫోన్లో మాట్లాడడం ఉపయోగకరమా ? అంటే రెండూ ఉపయోగకరమే, ఆయా పరిస్థితులను బట్టి. ఉత్తరాలు వ్రాయడం వల్ల ఉపయోగాలున్నాయి. తీరుబడిగా, ప్రశాంతంగా, అన్నింటినీ గుర్తు చేసుకొంటూ ఉత్తరం వ్రాయవచ్చు. ఉత్తరంలో మనకు నచ్చినట్లుగా వర్ణనాత్మకంగా, అలంకారాలు, చమత్కారాలతో ఉత్తరం వ్రాయవచ్చు. ఉత్తరం మళ్లీ మళ్లీ చదువుకొని ఆనందించవచ్చు.
ఇతరులకు బాధ కల్గించేవి వ్రాతలో పరిహరించుకోవచ్చు. ఉత్తరమైతే ఎన్ని సంవత్సరాలైనా దాచుకోవచ్చు. మన పిల్లలకు, వాళ్ల పిల్లలకు చూపించవచ్చు. ఈనాటి పరిస్థితులు, భవిష్యత్తరాలకు కూడా తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి భాషా ప్రయోగాలు, అలవాట్లు, అభిమానాలు, ఆచారాలు, సంప్రదాయాలు మొదలైనవన్నీ మన ఉత్తరాలు దాచుకొంటే ముందు తరాలకు కూడా తెలుస్తాయి.
ఫోన్లో అయితే గొంతు కూడా వినవచ్చు. వీడియోకాల్ అయితే ఎదురెదురుగా ఒకర్నొకరు చూసుకొంటూ మాట్లాడుకోవచ్చు. హావభావాలు పంచుకోవచ్చు. కానీ, ఇది తాత్కాలికం. అప్పటికప్పుడే ఆనందం. ఇది ఉత్తరంలా భవిష్యత్ తరాలకు అందదు.
మొత్తం మీద ఫోన్ కంటే ఉత్తరాలు వ్రాసుకోవడం వల్లన చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రశ్న 4.
తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన కింది టెలిఫోన్ సంభాషణను పొడిగించి రాయండి.
జవాబు:
కూతురు : నాన్నా …… నేను
తండ్రి : ఎలా ఉన్నావు తల్లీ !
కూతురు : బాగున్నాను నాన్న….. నువ్వు వేళకు మందులు వేసుకుంటున్నావా ? అమ్మ ఎలా ఉంది ?
తండ్రి : దానికేం నిక్షేపంలా ఉంది.
కూతురు : ఏంటి మళ్లీ దెబ్బలాడుకున్నారా ?
తండ్రి : జిలేబీ చెయ్యవే అంటే చెయ్యదు. నాకు పెట్టదు.
కూతురు : మొన్న అమ్మ చెప్పింది. మీరు స్వీట్సు తినేస్తున్నారని.
తండ్రి : అప్పుడే అనుమానం వచ్చింది. మోసేసిందని.
కూతురు: నీ కోసమే కదా ! తినద్దనేది, నీకు సుగరెలా ఉంది.
తండ్రి : కాస్త పెరిగింది.
కూతురు : మరి, తినకు నాన్నా ! మీరు పెద్దవారే కదా!
తండ్రి : మా అమ్మగారి ముందు చంటాడినే అమ్మా !
కూతురు: మీరిలా స్వీట్సు తింటే అమ్మగారికి కోపం వస్తుంది.
తండ్రి : సరే ! అమ్మా ! ఇంక తిననులే.
కూతురు : వెరీగుడ్’! ఈసారి నే వచ్చినపుడు పోలియో డ్రాప్స్ వేయిస్తాలే ! (తండ్రి, కూతురు పకపకా నవ్వుకుంటారు)
కూతురు : ఇక ఉంటాను నాన్నా!
తండ్రి : ఒ.కే. బై. బంగారు తల్లీ !
భాషాంశాలు :
పదజాలం :
అ) ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థం రాసి, వాటిని సొంతవాక్యాల్లో రాయండి.
1. ఏరు చిన్నపిల్లలా ఉరకలు వేస్తోంది.
జవాబు:
ఉరుకు = దుముకు
సొంతవాక్యం : చెట్టు మీద నుండి దుముకకు రా !
2. వర్షాభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు నీడలు అలముకున్నాయి.
జవాబు:
కరువు = క్షామం
సొంతవాక్యం : నిరంతరం కృషి చేస్తే క్షామము కనబడదు.
3. దేశనాయకుల చిత్రాలు ఎన్నో స్మృతులను గుర్తు చేస్తున్నాయి.
జవాబు:
స్మృతులు = జ్ఞాపకాలు
సొంతవాక్యం : మా తాతగారు తన చిన్ననాటి జ్ఞాపకాలు మాకు చెబుతారు.
4. మా ఇంటిపేరు నాన్న అస్తిత్వాన్ని గుర్తు చేస్తోంది.
జవాబు:
అస్తిత్వం = ఉనికి
సొంతవాక్యం : కొందరు దేవుని ఉనికిని ప్రశ్నిస్తారు.
ఆ) కింది వాక్యాలను చదివి పర్యాయపదాలను గుర్తించి రాయండి.
ఉదా : అమ్మ ఎద ప్రేమమయం, నాన్న హృదయం అనురాగమయం
ఎద, హృదయం = ప్రేమ, అనురాగం
1. నేను రాసిన లేఖకు మా స్నేహితురాలు ఉత్తరమిచ్చింది.
జవాబు:
లేఖ, ఉత్తరం
2. తాతయ్య జ్ఞాపకాలను కుటుంబం మననం చేసుకున్నది.
జవాబు:
జ్ఞాపకం, మననం
3. ఆహారపదార్థాల లేమి వల్ల భోజనంలో కూరల వెలితి కన్పించింది.
జవాబు:
ఆహారం, భోజనం ; లేమి, వెలితి
4. ఆమె పరుగు పోటీల్లో ఆత్రుత వల్ల గమ్యాన్ని తొందరగా చేరలేకపోయింది.
జవాబు:
ఆత్రుత, తొందర
5. పశువుల గుంపులో బెదురుకున్న గొడ్డు భయంతో పరుగుపెట్టింది.
జవాబు:
పశువు, గొడ్డు ; బెదురు, భయం
ఇ) కింది పద్యం చదివి నానార్థాలను గుర్తించి రాయండి.
భోగమన పాము పడగయు
భోగంబన శుభము కీర్తి భోజన మొప్పున్
భోగమన దపము, భువనము
భోగంబన మేనమామ పుత్రిక యయ్యెన్
జవాబు:
భోగము = పాము పడగ, శుభము, కీర్తి, భోజనము, తపస్సు, భువనము, మరదలు
ఈ) కింద సూచించిన ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను గుర్తించి రాయండి. వాటిని వాక్యాల్లో ప్రయోగించండి. :
ప్రకృతి – వికృతి
- శ్రీ – సిరి
- క్షేత్రం – సేమం
- పంక్తి – బంతి
- ఆశ – ఆస
- కుమారుడు – కొమరుడు
1. శ్రీ లక్ష్మిని అర్చిస్తే సిరికి లోటుండదు.
2. ప్రజల క్షేమము ప్రభుత్వానికి సేమము నిస్తుంది.
3. త్రిలింగ దేశంలో వ్యవహరింపబడే భాష తెలుగు.
4. త్రినగముల మధ్య మాట్లాడే భాష తెలుగు.
5. ఆశ పెంచుకొని ఆ ఆస్తి తీరేలా కృషి చేయాలి.
6. పంక్తిలో వడ్డన చేస్తూ బంతి మొత్తం తృప్తిగా తినేలా చేశారు.
వ్యాకరణాంశాలు :
సంధులు :
అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
ఉదా : మీరెప్పుడు = మీరు + ఎప్పుడు = ఉకారసంధి
జవాబు:
ఆ) సరళాదేశ సంధి మరొకసారి గుర్తు చేసుకుందాం. కింది ఉదాహరణను గమనించండి.
1. రామలక్ష్మణులు రాక్షసులఁజూసిరి
2. సత్యభామ నరకాసురుని ప్రాణముఁదీసెను
రాక్షసులఁజూసిరి = రాక్షసులన్ + చూసిరి
ప్రాణముఁ దీసెను = ప్రాణమున్ + తీసెను
పై ఉదాహరణల్లో పూర్వపదం చివర ‘న్’ అనే ద్రుతం ఉంది. పరపదంలో చ, త అనే పరుషాలకు సంధి జరిగి జ, ద అనే సరళాలుగా మారాయి. క-చ-ట-త-ప లు సంధి జరిగిన తరువాత గ-జ-డ-ద-బ-లు గా మారుతున్నాయి. ఇలా పరుషాల స్థానంలో సరళాలు ఆదేశంగా రావడాన్ని సరళాదేశ సంధి అంటారు.
కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
జవాబు:
సమాసాలు :
అ) కింది పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి.
1. తండ్రీ కూతుళ్ళు = తండ్రియును కూతురును – ద్వంద్వ సమాసం
2. అజ్ఞానము = జ్ఞానము కానిది – నఞ తత్పురుష సమాసం
3. గౌరవాభిమానములు = గౌరవము మరియు అభిమానము – ద్వంద్వ సమాసం
4. పఠనలేఖనములు = పఠనము మరియు లేఖనమును – ద్వంద్వ సమాసం
వాక్యాలు – రకాలు
అ) కింది వాక్యాలను పరిశీలించండి.
1. నీవు పాఠం చదువు.
2. చిత్రం గురించి వివరించండి.
పై వాక్యాలు చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేస్తున్నాయి. ఇలా విధిగా చేయమని చెప్పే వాక్యాలు విధ్యర్థక వాక్యాలు అంటారు. ఇలాంటి వాక్యాలు మీరూ కొన్ని రాయండి.
1. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించు.
2. కన్నతల్లిని, నేల తల్లిని పూజించు
3. గురువుల పట్ల గౌరవ భావంతో నడువు.
4. స్నేహితులపై అభిమానం చూపు.
ఆ) కింది వాక్యాలను పరిశీలించండి.
1. ప్రతి ఆదివారం సెలవు.
2. ప్రతి రోజూ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
పై వాక్యాలలో సమాచారం స్పష్టంగా కచ్చితంగా తెలుస్తోంది. ఇలా కచ్చితంగా సమాచారాన్నిచ్చే వాక్యాలను నిశ్చయార్థక వాక్యాలు అంటారు. ఇలాంటి వాక్యాలు మీరూ కొన్ని రాయండి.
1. నేను తప్పక వస్తాను.
2. నేను బడికి వెళతాను.
ఇ) కింది వాక్యాలను పరిశీలించండి.
1. అతిగా సెల్ఫోనులో ఆటలు ఆడవద్దు.
2. బస్సులో చేతులు బయట పెట్టరాదు.
పై వాక్యాలను గమనిస్తే అవి చేసే పనిని నిషేధిస్తున్నాయని తెలుస్తోంది. ఇలాంటి వాక్యాలను నిషేధార్థక వాక్యాలు అంటారు. ఇలాంటి వాక్యాలను మీరు కొన్ని రాయండి.
1. పెద్దలను నిందించవద్దు.
2. తోటివారితో గొడవలకు వెళ్ళవద్దు.
అలంకారాలు :
కింది ఉదాహరణలు పరిశీలించండి. అలంకారాన్ని గుర్తించండి.
1. శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
జవాబు:
పై వాక్యంలో ‘శిరము’ అనే పదం రెండు సార్లు వచ్చింది. అర్థంలో భేదం లేదు. తాత్పర్యం మాత్రమే భేదం. కాబట్టి ఈ
వాక్యంలోని శబ్దాలంకారం “లాటానుప్రాసం”.
2. మధుర ఫలంబులిచ్చు వృక్షంబు వృక్షంబు
జవాబు:
పై వాక్యంలో “వృక్షంబు” అనే పదం రెండు సార్లు వచ్చింది. అర్థంలో భేదం లేదు. తాత్పర్యం మాత్రమే భేదం. కాబట్టి
ఈ వాక్యంలోని శబ్దాలంకారం “లాటానుప్రాసం”.
లాటానుప్రాసాలంకారం : ఒకే పదాన్ని అర్థభేదం లేకుండా, తాత్పర్య భేదంతో మరల ప్రయోగించడాన్ని లాటానుప్రాసాలంకారం అంటారు.
3. దేవా ! నీకు వంద వందనాలు
జవాబు:
పై వాక్యంలో హల్లుల జంట, అర్థ భేదంతో ప్రయోగించబడింది. కాబట్టి ఇది ఛేకానుప్రాసాలంకారం.
4. నీటిలో పడిన తేలు తేలుతుందా
జవాబు:
పై వాక్యంలో తేలు, తేలు అనే పదాలు అర్థ భేదంతో ప్రయోగించబడింది. కాబట్టి ఇది ఛేకానుప్రాసాలంకారం.
5. వర్ష వర్షంలో తడుస్తూ ఉంది.
జవాబు:
పై వాక్యంలో హల్లుల జంట అర్థ భేదంతో ప్రయోగించబడింది. కాబట్టి ఇది ఛేకానుప్రాసాలంకారం.
6. రామ బాణం తగిలి వాలి వాలిపోయెను.
జవాబు:
పై వాక్యంలో హల్లుల జంట అర్థభేదంతో ప్రయోగించబడింది. కాబట్టి ఇది ఛేకానుప్రాసాలంకారం.
ఛేకాను ప్రాసాలంకారం : హల్లుల జంట అర్థభేదంతో ప్రయోగించబడితే అది ఛేకాను ప్రాసాలంకారం.
ప్రాజెక్టు పని :
క్యూ. ఆర్. కోడ్ను స్కాన్ చేయండి. ప్రకాశ్ నాయుడు రచించిన, తనికెళ్ళ భరణి ఆలపించిన ‘నాన్న ఎందుకో వెనుకబడ్డాడు’ కవితను వినండి. దానిని చార్టుపై రాసి తరగతిగదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
పద్య మధురిమ :
మ|| కొడుకుల్ పుట్టరటంచు నేడు రవివేకుల్జీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్
వడిసెం ? బుత్రులు లేని యాశుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా !
– శ్రీకాళహస్తీశ్వర శతకం – ధూర్జటి
భావం : కొంతమంది సంతానం కోసం ఆశతో ఎదురు చూస్తుంటారు. కొడుకులు లేరని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పుత్రులు పున్నామ నరకం నుంచి రక్షిస్తారనీ వంశాంకురాలనీ అనవసరమైన, భ్రమలో ఉంటారు. వందమంది కౌరవుల వల్ల ధృతరాష్ట్రునికి సద్గతులు ఏమైనా కలిగాయా ? కొడుకులు లేని శుక మహర్షికి మోక్షం లభించింది కదా !
రచయిత్రి పరిచయం :
రచయిత్రి : శ్రీమతి పింగళి’ బాలాదేవి తల్లిదండ్రులు : భట్టిప్రోలు కృష్ణమూర్తి, వేల్పూరి సుభద్రాదేవి
వృత్తి : అధ్యాపకురాలు
రచనలు : ఒక చీకటి, ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం ‘నవలలు’ మొదలైనవి, ‘నాన్నకు రాయని ఉత్తరం’ కథాసంపుటి, కుసుమకోమలి, ప్రశ్న, గాజు బొమ్మలు, గృహప్రవేశం మొదలైనవి కవితా సంపుటాలు. మహిళా సాధికారత, స్వాతంత్ర్యం, చదువు, ఉద్యోగం, కుటుంబ విలువలు ఇతివృత్తాలుగా రచనలు సాగాలు.
ప్రత్యేకతలు : తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ భాషలలో రచనలు చేశారు.
స్వగ్రామం : తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా కాట్రావుల పల్లె గ్రామం.
కాలం : 18.06.1946 నుండి 10.12.1992 వరకు జీవించారు.
ప్రస్తుత పాఠం వీరు రచించిన ‘తెలుగు కథా పారిజాతాలు’ లోనిది.
ఉద్దేశం :
మనిషి పలకరింపుకు పులకరిస్తాడు. నేడు మనిషి చాలా హడావిడిగా జీవిస్తున్నాడు. ఈ హడావుడిలో అమ్మా నాన్నలను, బంధువులను, ఆత్మీయులను ఎవ్వరినీ పట్టించుకోవడం లేదు. ఆత్మీయమైన పలకరింపులు లేవు. తన మనసులోని మాటను ఎవ్వరికీ చెప్పుకొనే తీరిక లేదు. మన భావాలు ఇతరులతో పంచుకొందుకు ఉపయోగపడే ఏకైక సాధనం ఉత్తరం. ఈ రోజులలో లేఖారచన కరువైంది. పిల్లలలో లేఖారచన పట్ల ఆసక్తి పెంపొందించడం మానవ సంబంధాలు పెంపొందించుకోవడం పట్ల అభిలాష కల్గించడం ఈ పాఠం ఉద్దేశం.
నేపథ్యం :
ఉత్తరాల వలన భావాలను, అనుభూతులను చక్కగా వ్యక్తీకరించగలం. లేఖారచన ఒక కళ. మనవారి గురించిన సమాచారం ఉత్తరాలలో చదువుకొంటుంటే చాలా ఆనందం కల్గుతుంది. మళ్లీ మళ్లీ చదువుకొని ఆనందిస్తాం. ఆత్మీయబంధం పెరుగుతుంది. ఆ ఉత్తరాలను పదిలంగా దాచుకొంటాం. వాట్సాప్, ట్విట్టర్, మెయిల్ ఇవేవీ ఇంత ఆనందాన్ని ఇవ్వలేవు. ఆత్మీయతలు, ప్రేమానురాగాలు, బంధాలు బాంధవ్యాలు పెంపొందాలంటే లేఖను మించిన సాధనం లేదు. తండ్రి తమకు చేసినవీ, తమకు తండ్రి అంటే ఉండే అభిమానం వ్యక్తీకరించాలని తపన పడే ఒక అమ్మాయి మేధో మథనమే ఈ పాఠ్యాంశ నేపథ్యం.
ప్రక్రియ లేఖ :
తెలుగు సాహిత్యంలో లేఖా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తులు, సంస్థలు, వ్యక్తులు సంస్థల మధ్య పరస్పరం జరుపుకొనే లిఖిత పూర్వక సమాచార మార్పిడినే లేఖ అంటారు. లేఖకు సంబోధన, విషయం, ముగింపు, చిరునామా అనేవి చాలా అవసరం. కొందరు ప్రముఖులు లేఖలలో రాజకీయ, సాహిత్య, వ్యాపారాది విలువలు కూడా ఉంటాయి.
పదాలు – అర్ధాలు :
- మూస పోసినట్లు = నమూనా వస్తువును సిద్ధపరచినట్లు
- వగైరా = మొదలైనవి.
- భావన = తలంపు, ఊహ, ఆలోచన, యోచన, ధ్యానం
- మథనం = చిలకడం, ఆందోళన, గందరగోళం
- ఏకాగ్ర = ఒక విషయము నందు మనస్సు నిలుపుట, అవధానం
- భగ్నం = నాశనం, ధ్వంసం, విరిగిన, పగిలిన, మోసం
- కోన = అడవి, కొండల యందలి మరుగుచోటు లోయ, కొండ మూలలో నీరు ప్రవహించు చోటు
- వెలితి = తక్కువ, లోపం, సన్నని
- నిస్పృహ = నిరాశ, ఆశలేని, కోరిక నుండి విముక్తి
- స్కృతి = తలంపు, ధర్మశాస్త్రం, బుద్ధి, ఆలోచన, స్మరణము
- కలవరపరచు = ఆందోళన కలిగించు
- నిగ్రహం = అదుపులో ఉంచడం, సంయమము, అడ్డగింపు
- అంతర = భేదం, తేడా, అంతరువు, ఎడమ, ఎడబాటు.
- తీర్చిదిద్ద = చక్కగా నుంచు, సవరించు
- ఉరుకు = పరుగు, దూకు
- అస్తిత్వం = ఉనికి, నివాసస్థానం
- వేధించు = బాధించు
- భిక్ష = బిచ్చము, బికిరము, తిరిపెము, ఆహారం
- చలవ = ఉపకారం, ఉదారత, సౌమ్యత, జలుబు, చల్లని, తెలుపు
- బెదురు = భయపడు
- స్థగితం = స్థిరంగా ఉండడం
- టిన్నుపెట్టె = అల్బుమినా రేకు పెట్టి
- ముత్యాలకోవ = ముత్యాల దండ
- పేరంటం = ముత్తైదువ సన్మానం
- అనువాదం = ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోనికి మార్చుట, భాషాంతరీ కరణ
- అచ్చు = ముద్ర, ప్రతిరూపం, స్వరం, ప్రాణాక్షరం
- ఆస్తి = సంపద
- ప్రస్తావన = ఎదుటివారి దృష్టికి తేవడం, చెప్పడం, ప్రసక్తి స్వతంత్ర
- స్వేచ్ఛ = స్వతంత్రత
- అప్రమత్తత = జాగరూకత, జాగ్రత్తగా ఉండడం
- గాబరా = భయం, తొందర, కలవరం
- విసుగు = చికాకు, నిర్వేదం, అసహ్యం, అసహనం
- ఆత్రుత = త్వర, తొందరపాటు, వేగిరపాటు, ఆందోళన
- సాంత్వన = ఓదార్చుట, ఓదార్చునది
- స్వయంకృతులు = తనకు తానే చేసుకొన్నవారు
- హోదా = ఉద్యోగం, ర్యాంక్, స్థాయి, పదవి
- ఔన్నత్యం = ఉన్నతి, ఎత్తు, గొప్పదనం
- ఆదర్శం = నమూనా, అద్దం, అనుకరింప బగినది, మేలుబంతి, టీక, నకలు, దృష్టాంతం
- ఆకాంక్ష = కోరిక, వాంఛ, కక్కుర్తి
- సాంకేతిక = సంకేతంచే చేయబడినది
- పరిజ్ఞానం = సంపూర్ణ జ్ఞానం
- నవలోకం = యువత
- ఉర్రూతలూగు = చలించు, కుతూహలపడు
(ఉఱ్ఱు + ఊతలు + ఊగు – శబ్ద పల్లవం) - ఉత్తరం = జాబు లేఖ
- మాసిపోవు = మురికిఅగు, మరుగునపడు, మరచిపోవు.
- మమత = అభిమానం
- అనురాగం = అనురక్తి, కూరిమి, ప్రేమ, ప్రీతి, ఎరుపు
- ఆప్యాయత = ప్రేమ, ఆదరము, ఆత్మీయత
- పుంజుకొని = శక్తి కూడదీసికొను, క్రమంగా బలపడు
- ఫిర్యాదు = విన్నపం, మొర
- తప్త = తపింప చేయబడినది
- నీడ = ఛాయ, ఎండలేని, ప్రతిబింబం
- స్వార్థం = స్వప్రయోజనం, తన మేలు
- సంకెళ్ళు = గొలుసులు, శృంఖలాలు
- శ్రద్ద = అక్కర, ఆసక్తి, కోరిక, విశ్వాసం, ఉత్సాహం, భక్తి, సడ్డ, సడ, లక్ష్యం.