These AP 9th Physical Science Important Questions and Answers 4th Lesson పరమాణువులు-అణువులు will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 4th Lesson Important Questions and Answers పరమాణువులు-అణువులు
9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
“O2 మరియు O లు భిన్నమైనవి” అని మోహన్ చెప్పాడు. నీవు అంగీకరిస్తావా? సమర్ధించుము?
జవాబు:
1) మోహన్ చెప్పినదానిని నేను అంగీకరిస్తాను.
‘O2‘ మరియు ‘O’ లు భిన్నమైనవి.
2) ‘O’ అనగా ఒకే ఒక్క ఆక్సిజన్ పరమాణువు (కార్బన్ మోనాక్సైడ్).
‘O2‘ అనగా ఒకే ఒక్క ఆక్సిజన్ అణువు (ఆక్సిజన్).
ప్రశ్న 2.
ఒక మూలకపు పరమాణుసంఖ్య Z = 6 అయితే ఆ మూలకము పేరు రాయండి.
జవాబు:
పరమాణు సంఖ్య (Z) = 6 అయిన మూలకం కార్బన్ (C).
ప్రశ్న 3.
ఒక తరగతిలో ఆక్సిజన్ యొక్క అణు సాంకేతికం రాయమని ఉపాధ్యాయుడు చెబితే, నమిత “0” గాను, రాజు “0” గాను రాసారు. నీవు ఎవరి జవాబును సమర్ధిస్తావు?
జవాబు:
నమిత రాసిన జవాబును సమర్ధిస్తాను.
“ఆక్సిజన్ అణుసాంకేతికం O2“.
ప్రశ్న 4.
2N మరియు N2 ల మధ్య భేదమేమి?
జవాబు:
2N అనగా రెండు నైట్రోజన్ పరమాణువులు. ఇది అస్థిరమైనది.
N2 అనగా ఒక నైట్రోజన్ అణువు. ఇది స్థిరమైనది.
ప్రశ్న 5.
‘హీలియం’ మూలకానికి ఆ పేరెలా వచ్చింది?
జవాబు:
మూలకాలకు పేర్లు పెట్టడంలో అవి లభించే ప్రదేశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. సూర్యునిలో కనుగొనబడిన వాయువు కనుక ‘హీలియం’ అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో ‘హీలియో’ అనగా సూర్యుడు అని అర్ధం.
ప్రశ్న 6.
అణువు అనగానేమి?
జవాబు:
స్వతంత్రంగా ఉండగలిగి అది ఏ పదార్దంకు చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నింటినీ ప్రదర్శించే అతి సూక్ష్మమైన కణాన్నే ‘అణువు’ అంటారు.
ప్రశ్న 7.
Na మూలకమా? సమ్మేళనమా? ఎందుకు?
జవాబు:
Na మూలకము. ఇది Na పరమాణువులచే (ఒకే రకమైన పరమాణువులతో) ఏర్పడినది.
ప్రశ్న 8.
O2 మూలకమా? సంయోగ పదార్థమా? ఎందుకు?
జవాబు:
సంయోగ పదార్థము. ఎందుకనగా O2 రెండు ఆక్సిజన్ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడింది.
ప్రశ్న 9.
అవగాడ్రో సంఖ్య అనగానేమి? దీని విలువ ఎంత?
జవాబు:
ఏ పదార్థంలోనైనా ఒక మోల్ లో ఉండే కణాల సంఖ్యను అవగాడ్రో సంఖ్య అంటారు. దీని విలువ 6.022 × 1023 ఈ విలువ ఎల్లప్పుడూ స్థిరం.
ప్రశ్న 10.
పరమాణు ద్రవ్యరాశిని కచ్చితంగా కనుగొనడానికి ఆధునిక కాలంలో ఏ పరికరం వాడుతున్నారు?
జవాబు:
ద్రవ్యరాశి స్పెక్ట్రోమీటర్ (Mass Spectrometer).
ప్రశ్న 11.
రసాయనశాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు? అతను చేసిన కృషి ఏమిటి?
జవాబు:
- ఆంటోని లెవోయిజర్ అనే ఫ్రెంచి శాస్త్రవేత్తను ఆధునిక రసాయనశాస్త్ర పిత అని పిలుస్తారు.
- అతను రసాయనశాస్త్రంలో ఎంతో కృషి చేశాడు.
- ప్రధానమైన కృషి ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించుట.
ప్రశ్న 12.
ద్రవ్యనిత్యత్వ నియమమును నిర్వచించండి.
జవాబు:
ద్రవ్యనిత్యత్వ నియమము : ఒక రసాయనచర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేం, నాశనం చేయలేం.
(లేదా)
ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి, ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల ద్రవ్యరాశికి సమానం.
ప్రశ్న 13.
స్థిరానుపాత నియమమును నిర్వచించండి.
జవాబు:
స్థిరానుపాత నియమము :
ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడు స్థిర భార నిష్పత్తిలో కలిసిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది.
ప్రశ్న 14.
పరమాణుకతను నిర్వచించండి.
జవాబు:
పరమాణుకత :
ఒక మూలక అణువు ఏర్పడాలంటే ఎన్ని మూలక పరమాణువులు సంయోగం చెంది ఉంటాయో ఆ సంఖ్యను ‘పరమాణుకత’ అంటారు.
ప్రశ్న 15.
సంయోజకతను నిర్వచించండి.
జవాబు:
సంయోజకత :
ఒక మూలక పరమాణువులు వేక మూలక పరమాణువులతో సంయోగం చెందే సామర్థ్యంను ఆ మూలక పరమాణువు యొక్క ‘సంయోజకత’ అంటారు.
ప్రశ్న 16.
అయాన్లను నిర్వచించండి.
జవాబు:
అయాన్లు :
అయాన్లు ఒక ఆవేశపూరిత పరమాణువుగా గాని, ఫలిత ఆవేశం కలిగి ఉన్న పరమాణువుల గుంపుగా గాని ఉంటాయి.
ప్రశ్న 17.
పరమాణు ద్రవ్యరాశి అనగానేమి?
జవాబు:
ఒక మూలక పరమాణువు కార్బన్-12 యొక్క ద్రవ్యరాశిలో 1/12వ భాగం కంటె ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే సంఖ్యనే ఆ మూలక పరమాణువు యొక్క పరమాణు ద్రవ్యరాశి అంటారు.
ప్రశ్న 18.
అణువులు ఎట్లా ఏర్పడుతాయి?
జవాబు:
ఒకేరకమైన మూలక పరమాణువులుగాని, వేర్వేరు మూలక పరమాణువులుగాని సంయోగం చెంది ‘అణువులు ఏర్పడుతాయి.
ప్రశ్న 19.
అణుద్రవ్యరాశిని నిర్వచించండి.
జవాబు:
అణుద్రవ్యరాశి :
ఒక పదార్థం యొక్క అణుద్రవ్యరాశి, ఆ పదార్థపు అణువులోని అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశుల మొత్తానికి సమానం.
ప్రశ్న 20.
ఫార్ములా యూనిట్ ను నిర్వచించండి.
జవాబు:
ఫార్ములా యూనిట్ :
ఒక అణువు యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఆ అణువు యొక్క ఫార్ములా యూనిట్ లోని పరమాణువుల లేదా అయాన్ల మొత్తం ద్రవ్యరాశికి సమానం.
ప్రశ్న 21.
మోలను నిర్వచించండి.
జవాబు:
మోల్ :
ఒక పదార్ధ పరమాణు ద్రవ్యరాశి లేదా అణు ద్రవ్యరాశికి సమానమైన పదార్థంలో ఎన్ని కణాలు (పరమాణువులు, అణువులు, అయాన్లు) ఉంటాయో తెలిపే సంఖ్యనే ‘మోల్’ అంటాం.
ప్రశ్న 22.
మోలార్ ద్రవ్యరాశిని నిర్వచించండి.
జవాబు:
మోలార్ ద్రవ్యరాశి : ఒక మోల్ పదార్ధ ద్రవ్యరాశిని గ్రాములలో వ్యక్తపరిస్తే దానిని మోలార్ ద్రవ్యరాశి అంటాం.
9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
కింది పట్టికను పూరింపుము.
జవాబు:
ప్రశ్న 2.
జాన్ డాల్టన్ పదార్థ స్వభావం గురించి చేసిన ప్రతిపాదనలు ఏమిటి?
జవాబు:
జాన్ డాల్టన్ పదార్థ స్వభావం గురించి కొన్ని ప్రతిపాదనలు చేశాడు. అవి :
- ద్రవ్యరాశి నిత్యత్వం జరగాలంటే తప్పనిసరిగా మూలకాలన్నీ చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉండాలి. ఆ చిన్న కణాలకు అతడు ‘పరమాణువు’ అని పేరు పెట్టాడు.
- స్థిరానుపాత నియమం పాటించాలంటే ఒక పదార్థంలో అన్ని కణాలు ఒకేలా ఉండాలి. లేకపోతే ఆ పదార్థం యొక్క ఉత్పన్నం ఒకేలా ఉండదు.
ప్రశ్న 3.
భారతీయ ఋషి ‘కణాదుడు’ ప్రకారం పరమాణువు అంటే ఏమిటి?
జవాబు:
- 2600 ఏళ్ళకు పూర్వమే ‘కణాదుడు’ అనే భారతీయ ఋషి చెప్పిన ‘వైశేషిక సూత్ర’ లో పరమాణువులకు చెందిన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి.
- ఇతడు పదార్ధం యొక్క అన్ని రూపాలు “అణువు” లనే చిన్న కణాలతో నిర్మితమై ఉన్నాయని చెప్పాడు.
- ఈ అణువులే మరల పరమాణువులనే సూక్ష్మ కణాలచే నిర్మితమై ఉన్నాయని ఇతడు ప్రతిపాదించాడు.
ప్రశ్న 4.
మూలకాలకు సంకేతాలు రాయడం వలన ఉపయోగమేమి?
జవాబు:
- రసాయనశాస్త్రంలో రకరకాల రసాయన చర్యలుంటాయని మనకు తెలుసు.
- ప్రతిసారి రసాయన చర్యలో పాల్గొనే మూలకాల, సమ్మేళనాల పూర్తి పేర్లు రాయడం వలన సమయం వృథా కావడమే కాక ఇబ్బందికరంగా కూడా వుంటుంది.
- ఆ సమస్యను అధిగమించుటకు మూలకాలను చిన్న గుర్తులతో సూచించుట ప్రారంభమైనది. ఈ గుర్తులనే సంకేతాలు అంటారు.
ప్రశ్న 5.
సంకేతాలు రాయడంలో గల నియమాలేవి?
జవాబు:
1. మూలక సంకేతాలలో 1 లేదా 2 ఇంగ్లీషు అక్షరాలు వుంటాయి.
ఉదా : H, He, N, Ca మొదలైనవి.
2. సంకేతంలోని మొదటి అక్షరం ఎల్లప్పుడూ పెద్ద అక్షరం (Upper case) గాను, రెండవ అక్షరం ఎల్లప్పుడు చిన్న అక్షరం (Lower case)గాను ఉంటుంది.
ఉదా : 1) AI, Cr, CI సరియైన పద్ధతి.
2) CL, DE, he సరియైన పద్ధతి కాదు.
9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
పట్టికను పూర్తి చేయండి.
జవాబు:
ప్రశ్న 2.
క్రింది సమాచారాన్ని చదివి జవాబులు రాయండి.
ఒక అణువు ద్రవ్యరాశి అందలి వివిధ మూలక పరమాణువుల విడిద్రవ్యరాశుల మొత్తానికి సమానం.
i) Na2CO3 అణుభారం కనుగొనండి.
జవాబు:
Na2CO3 అణుభారం = (23 × 2) + 12 + (16 × 3) = 46 + 12 + 48 = 106
ii) C మరియు 0లను కలిగియున్న ఒక అణువు యొక్క అణుభారం 44 అయిన ఆ అణుఫార్ములా తెల్పండి.
జవాబు:
అణువు యొక్క అణుభారం = 44
C పరమాణు భారం = 12
మిగిలిన అణుభారం = 44 – 12 = 32 = 16 × 2
= (ఆక్సిజన్ పరమాణు భారం × 2) ⇒ O2
కావున అణుఫార్ములా = CO2
iii) పరమాణు ద్రవ్యరాశిని ఏ ప్రమాణాలలో కొలుస్తారు?
జవాబు:
పరమాణు ద్రవ్యరాశిని amu లలో కొలుస్తారు.
amu అనగా ‘పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం’ (Atomic Mass Unit).
iv) అణుభారం ఆధారంగా NaOH, H,0లలో ఏది భారమైనది?
జవాబు:
NaOH అణుభారం = 23 + 16 + 1 = 40
H2O అణుభారం = (1 × 2) + 16 = 18
NaOH అణుభారం > H2O అణుభారం
NaOH అణువు H2O అణువు కన్నా భారమైనది.
ప్రశ్న 3.
మూలకాలకు ఆ పేర్లు ఎలా పెట్టారు? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
1. మూలకాలకు వాటి ధర్మాలననుసరించి కొన్నిసార్లు పేర్లు పెట్టడం జరిగింది.
ఉదా :
a) లాటిన్ భాషలో “హైడ్రో” అనగా నీరు అని అర్థం. కావున ఆక్సిజన్తో చర్యపొంది నీటిని ఏర్పరిచే స్వభావమున్న పదార్థానికి హైడ్రోజన్ అని పేరు పెట్టారు.
b) లాటిన్ భాషలో ఆక్సి అంటే ఆమ్లం అని అర్థం. కాబట్టి ఆమ్లాన్ని ఏర్పరిచే గుణమున్న ఈ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టారు.
2. మూలకాలకు పేర్లు పెట్టడంలో అవి లభించే ప్రదేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఉదా : సూర్యునిలో కనుగొనబడిన వాయువుకు ‘హీలియం’ అని పేరు పెట్టారు. (గ్రీకు భాషలో ‘హీలియో’ అనగా సూర్యుడు)
3. శాస్త్రవేత్తల గౌరవార్థం కొన్ని మూలకాలను వారి పేర్లతో పిలిచేవారు.
ఉదా : ఐన్ స్టీనియం, రూథర్‌ఫోర్డియం, మెండలీవియం.
ప్రశ్న 4.
క్రిస్ – క్రాస్ పద్ధతిలో ఒక సంయోగ పదార్థానికి ఫార్ములా రాసే విధానాన్ని ఉదాహరణతో వివరించుము.
జవాబు:
క్రిస్ – క్రాస్ పద్ధతిలో సాంకేతికాలను రాయడానికి క్రింది సోపానాలు పాటించాలి.
ఉదా : సోడియం కార్బొనేట్ అణువుకు ఫార్ములా రాద్దాం.
సోపానం – 1 : అణువులో ఉండే పరమాణువుల లేదా పరమాణు సమూహాల సంకేతాలను పక్కపక్కనే రాయండి.
Na CO3
సోపానం – 2 : ఆ పరమాణువుల లేదా పరమాణు సమూహాల సంకేతాలకు పైన వాటి సంయోజకతలను రాయండి.
Na1 (CO3)2
సోపానం – 3 : వాటి సంయోజకతల కనీస నిష్పత్తిని పొందడానికి ఆ సంయోజకతలను వాటి గరిష్ఠ సామాన్య భాజకంతో భాగించండి.
Na1(CO3)2
సోపానం – 4 : సంయోజకతలను ఒకదానికొకటి పరస్పరం మార్పుచేసి అనుఘటకాలకు పాదాంకంగా రాయండి.
Na2 (CO3)1
సోపానం – 5 : ఏ అనుఘటకమైనా పాదాంకం 1ని పొందితే సాంకేతికాలను రాసేటప్పుడు 1 ని రాయనవసరం లేదు.
Na2CO3
∴ సోడియం కార్బొనేట్ సాంకేతికం Na,CO.
ప్రశ్న 5.
పరమాణు ద్రవ్యరాశిని అర్థం చేసుకోవడానికి ఒక ‘పై’ చిత్రాన్ని గీసి వివరించండి.
జవాబు:
వివరణ :
- పటంలోని వృత్తం కార్బన్ – 12 ద్రవ్యరాశిని సూచిస్తుందని భావించండి.
- ఈ వృత్తాన్ని 12 సమాన భాగాలుగా చేస్తే ఒక్కోభాగం కార్బన్ – 12 యొక్క \(\frac{1}{12}\) వ భాగం యొక్క ద్రవ్యరాశిని సూచిస్తుంది.
పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం :
కార్బన్ – 12 యొక్క ద్రవ్యరాశి సరిగ్గా \(\frac{1}{12}\)వ వంతును ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా నిర్వచిస్తారు.
పరమాణు ద్రవ్యరాశి :
ఒక మూలక పరమాణువు కార్బన్ – 12 యొక్క ద్రవ్యరాశిలో \(\frac{1}{12}\)వ భాగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే సంఖ్యనే, ఆ మూలక పరమాణువు యొక్క పరమాణు ద్రవ్యరాశి అంటారు.
ప్రశ్న 6.
మోల్ భావనను ఒక పటం రూపంలో వివరించుము.
జవాబు:
మోల్ :
- ఒక పదార్ధ పరమాణు ద్రవ్యరాశి లేదా అణు ద్రవ్యరాశికి సమానమైన పదార్ధంలో ఎన్ని కణాలు (అణువులు, పరమాణువులు, అయానులు) ఉంటాయో తెలిపే సంఖ్యనే ‘మోల్’ అంటారు.
- ఏ పదార్థంలోనైనా ఒక మోల్ లో ఉండే కణాల సంఖ్య ఎల్లప్పుడూ స్థిరం. దీని విలువ 6.022 × 1023 దీనినే అవగాడ్రో సంఖ్య అంటారు.
కింది పటం ద్వారా మోల్ భావనను సులభంగా అవగతం చేసుకోవచ్చు.
ప్రశ్న 7.
మొట్టమొదటగా పరమాణు నమూనాను ప్రతిపాదించిన జాన్ డాల్టనను నీవెలా అభినందిస్తావు?
జవాబు:
- ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఫలితమే శాస్త్ర, సాంకేతిక రంగాలని మనకు తెలుసు.
- ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస, కొత్త విషయాలు కనుక్కోవాలనే తపనే ఎన్నో నూతన ఆవిష్కరణలకు దారి తీసింది.
- అటువంటి నూతన ఆవిష్కరణే, డాల్టన్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణం.
- లెవోయిజర్ తెలిపిన ద్రవ్యనిత్యత్వ నియమం, ప్రొస్ట్ తెలిపిన స్థిరానుపాత నియమాల ఆధారంగా డాల్టన్ పరమాణు నిర్మాణాన్ని ప్రతిపాదించాడు.
- డాల్టన్ ప్రకారం పరమాణువు విభజింప వీలులేనిది.
- ఇది శాస్త్రవేత్తల ముందు అతి పెద్ద సవాలును విసిరి, నేడు మనకు తెలిసిన ఆధునిక పరమాణు నిర్మాణానికి దారి తీసింది.
- కావున పరమాణు నిర్మాణాన్ని ఆవిష్కరించడంలో డాల్టన్ కృషి అభినందనీయము.
ప్రశ్న 8.
వివిధ మూలకాలు, సంయోగ పదార్థాల సంకేతాలు / సాంకేతికాలు చదివిన తరువాత నీ స్పందన ఏమిటి?
జవాబు:
- రసాయన శాస్త్రం ఎక్కడో లేదు, మన వంటగదిలోనే ఉందన్న విషయాన్ని కింది తరగతులలో నేర్చుకున్నాను.
- కాని చాలా రసాయనాల (వంట సామగ్రి)ని వాటి వాటి సాధారణ పేర్లతో పిలిచేవాడిని.
- కాని సంకేతాలు / సాంకేతికాలు చదువుకున్న తరువాత, మన చుట్టూ ఉండే అనేక పదార్థాలను వాటి వాటి రసాయన పేర్లతో పిలవడం అలవాటయినది.
- ఉదా : సాధారణ ఉప్పును సోడియం క్లోరైడ్ (NaCI) అని, వంటసోడాను సోడియం బైకార్బోనేట్ (NaHCO3) అని మొదలగునవి.
- ఇది నాకెంతో ఉత్సాహాన్నిచ్చి మిగిలిన పదార్థాల రసాయన నామాలు, వాటి ఫార్ములాలు తెలుసుకోవాలనే కోరిక బలంగా నాటుకుంది.
- ఇది నా పై చదువులకు ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రశ్న 9.
స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించడానికి దారితీసిన జోసెఫ్ ప్రొస్ట్ ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
జోసెఫ్ ప్రొస్ట్, కాపర్ కార్బోనేట్ యొక్క సహజ, కృత్రిమ నమూనాలను సేకరించి వాటి అనుఘటక మూలకాల యొక్క భారశాతాలను కనుగొన్నాడు. ఈ శాతాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
భారశాతాలు | సహజ నమూనా | కృత్రిమ నమూనా |
కాపర్ | 51.35 | 51.35 |
కార్బన్ | 38.91 | 38.91 |
ఆక్సిజన్ | 9.74 | 9.74 |
- పై పట్టిక ద్వారా నమూనా ఏ ప్రాంతం నుండి లేదా ఏ పద్దతిలో సేకరించబడిందో అనే దానిపై సంఘటన శాతాలు ఆధారపడవని గ్రహించాడు.
- పై ప్రయోగం ఆధారంగా ప్రొస్ట్ స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించాడు. ఈ నియమం ప్రకారం “ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడు స్థిర భార నిష్పత్తిలో కలిసిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది”.
9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు 1 Mark Bits Questions and Answers
1. అవగాడ్రో స్థిరాంకం విలువ
A) 6, 022 × 10-19
B) 6.022 × 10-34
C) 6.022 × 1023
D) 6.022 × 1019
జవాబు:
C) 6.022 × 1023
2. హైడ్రోజన్ మోనాక్సైడ్ యొక్క సాధారణ నామము
A) నీరు
B) లవణము
C) బట్టలసోడా
D) వంటసోడా
జవాబు:
A) నీరు
3. నైట్రోజన్, హైడ్రోజన్ సంయోజకతలు వరుసగా 3, 1. అయితే వీటి కలయిక వల్ల ఏర్పడే అమ్మోనియా అణువు ఫార్ములా
A) NH3
B) NH4
C) N3H
D) N4H
జవాబు:
A) NH3
4. P : ఆక్సిజన్ పరమాణుకత 3
Q : ఓజోన్ సాంకేతికము O3
A) P – సత్యము, Q – అసత్యము
B) P – అసత్యము Q – సత్యము
C) P మరియు Q లు అసత్యము
D) P మరియు Qలు సత్యము
జవాబు:
D) P మరియు Qలు సత్యము
5. ద్రవ్య నిత్యత్వ నియమముపై చేయు ప్రయోగములో ముందుగా తీసుకునే ఒక జాగ్రత్త
A) పరీక్ష నాళిక బలికి పోకుండా చూడాలి.
B) పరీక్ష నాళిక ఒలికి పోయేట్లు చూడాలి.
C) శాంకవకుప్పెలో పరీక్ష నాళిక మునిగేట్లు చూడాలి.
D) పరీక్ష నాళిక శాంకవకుప్పె బయటవైపు ఉంచాలి.
జవాబు:
B) పరీక్ష నాళిక ఒలికి పోయేట్లు చూడాలి.
6. మనం ధరించే ఆభరణాలలో ఉండే లోహము ………
A) పాదరసం
B) సోడియం
C) కాల్షియం
D) బంగారం
జవాబు:
D) బంగారం
7. టంగ్స్టన్ మూలకపు లాటిన్ పేరు
A) ఆరం
B) ప్లంబం
C) కాలియం
D) వోల్ ఫ్రం
జవాబు:
D) వోల్ ఫ్రం
8. ఓజోన్ అణు ఫార్ములా ……….
A) O3
B) O2
C) O
D) O3
జవాబు:
A) O3
9. జతపరచండి.
i) సోడియం బై కార్పొనేట్ | x) Na2CO3 |
ii) సోడియం కార్పొనేటు | y) NaOH |
iii)సోడియం హైడ్రాక్సైడ్ | z) NaHCO3 |
A) i – y, ii – x, iii – z
B) i – z, ii – x, iii – y
C) i – y, ii – z, iii – x
D) i – z, ii – y, iii – x
జవాబు:
B) i – z, ii – x, iii – y
10. 18గ్రా|| నీటిలో H2 అణువుల సంఖ్య
A) 6.02 × 1022
B) 6.022 × 1023
C) 6.02 × 1032
D) 6.02 × 1033
జవాబు:
B) 6.022 × 1023
11. Mg యొక్క సంయోజకత ‘+2’ మరియు SO4 (సల్ఫేట్) యొక్క సంయోజకత ‘-2’ అయిన వీటితో ఏర్పడే అణు ఫార్ములా
A) Mg2SO4
B) Mg (SO4)2
C) MgSO4
D) Mg3(SO4)2
జవాబు:
C) MgSO4
12. కింది వానిలో సజాతీయ అణువు
A) H2O
B) N2
C) N2O3
D) FeSO4
జవాబు:
B) N2
13. ఒకేరకమైన పరమాణువులను కలిగి ఉన్న పదార్థంను …………………. అంటాం.
A) అణువు
B) మూలకం
C) సంయోగ పదార్ధం
D) పరమాణువు
జవాబు:
B) మూలకం
14. ఒకే రకమైన మూలక పరమాణువులచే ఏర్పడిన పదార్థాన్ని ……….. అంటారు.
A) అణువు
B) మూలకం
C) సంయోగపదార్థం
D) పరమాణువు
జవాబు:
A) అణువు
15. వేర్వేరు మూలక పరమాణువులచే ఏర్పడిన పదార్థాన్ని …………. అంటారు.
A) అణువు
B) మూలకం
C) సంయోగ పదార్థం
D) పరమాణువు
జవాబు:
C) సంయోగ పదార్థం
16. పొటాషియం సంకేతం …………
A) Pb
B) Na
C) Fe
D) K
జవాబు:
D) K
17. టంగ్ స్టన్ కు గల మరొక పేరు ……….
A) నేట్రియం
B) కాలియం
C) వోల్ ఫ్రం
D) క్యూప్రం
జవాబు:
C) వోల్ ఫ్రం
18. క్రింది వానిలో సరియైనది ……….
A) BE
B) he
C) al
D) Cr
జవాబు:
D) Cr
19. అష్టక పరమాణుక అణువునకు ఉదాహరణ
A) నైట్రోజన్
B) ఆక్సిజన్
C) కార్బన్
D) సల్ఫర్
జవాబు:
D) సల్ఫర్
20. సల్ఫేట్ యొక్క సంయోజకత …………
A) 2 –
B) 2 +
C) 3 –
D) 3 +
జవాబు:
A) 2 –
21. NH2Cl లో కాటయాన్ ……… .
A) Cl
B) NH4
C) NH4Cl
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు
22. అల్యూమినియం సల్ఫేట్ యొక్క సాంకేతికం
A) Al2SO4
B) (Al2)2 (SO4)3
C) Al2 (SO4)3
D) Al SO4
జవాబు:
C) Al2 (SO4)3
23. H2SO4 యొక్క అణుద్రవ్యరాశి
A) 98 యూనిట్లు
B) 89 యూనిట్లు
C) 49 యూనిట్లు
D) 106 యూనిట్లు
జవాబు:
A) 98 యూనిట్లు
24. 1.5055 × 1023 అణువులు గల కాల్షియం అణువు యొక్క మోలార్ ద్రవ్యరాశి …………..
A) 20 గ్రా.
B) 40 గ్రా.
C) 10 గ్రా.
D) 30 గ్రా.
జవాబు:
C) 10 గ్రా.
25. “8 గ్రా. మెగ్నీషియం” మోల్లలో …………………
A) 0.3
B) 3
C) 2
D) 0.2
జవాబు:
A) 0.3
26. కింది వాటిలో అధిక సంఖ్యలో పరమాణువులను కలిగియున్న మూలకం …………
A) సల్ఫర్
B) కాల్షియం
C) నైట్రోజన్
D) కార్బన్
జవాబు:
D) కార్బన్
27. “ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము, నాశనం చేయలేము” దీనిని ………… అంటారు.
A) స్థిరానుపాత నియమం
B) బహుళానుపాత నియమం
C) ద్రవ్యనిత్యత్వ నియమం
D) శక్తి నిత్యత్వ నియమం
జవాబు:
C) ద్రవ్యనిత్యత్వ నియమం
28. డాల్టన్ ప్రతిపాదించిన పరమాణు సిద్ధాంతమునకు ఆధారమైనది
A) ద్రవ్య నిత్యత్వ నియమం
B) సిరానుపాత నియమం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
29. డాల్టన్ ప్రకారం పరమాణువు ఒక ……….. కణము.
A) విభజించబడని
B) అతిచిన్న
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
30. పరమాణువు అనే పదం గ్రీకు పదమైన ‘atomio’ నుండి పుట్టింది. దీని అర్థం ………….
A) విభజించబడని
B) విభజించబడిన
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) విభజించబడని
31. ప్రతి పదార్థానికి …… పునాది అయినవి.
A) పరమాణువుల
B) అణువులు,
C) మూలకాలు
D) సమ్మేళనాలు
జవాబు:
A) పరమాణువుల
32. నీరు యొక్క లాటిన్ నామము
A) హైడ్రో
B) ఆక్సీ
C) హీలియోస్
D) ఏదీకాదు
జవాబు:
A) హైడ్రో
33. ఆమ్లము యొక్క లాటిన్ నామము
A) హైడ్రో
B) ఆక్సీ
C) హీలియోస్
D) ఏదీకాదు
జవాబు:
B) ఆక్సీ
34. బెరీలియం సంకేతం
A) Ba
B) Be
C) Br
D) B
జవాబు:
B) Be
35. నైట్రోజన్ సంకేతం
A) Ni
B) Na
C) N
D) NO
జవాబు:
C) N
36. Cl2 దీని యొక్క ఫార్ములా
A) క్లోరిన్
B) కాడ్మియం
C) క్రోమియం
D) కాల్షియం
జవాబు:
A) క్లోరిన్
37. బంగారం యొక్క సంకేతం
A) G
B) Ga
C) Ge
D) Au
జవాబు:
D) Au
38. సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాలను భూమిపైకి రాకుండా రక్షణ కవచంగా
A) O3
B) He
C) H2
D) Ne
జవాబు:
A) O3
39. ఒక మూలక అణువు ఏర్పడాలంటే ఎన్ని మూలక పరమాణువులు సంయోగం చెంది ఉంటాయో ఆ సంఖ్యను ……………. అంటారు.
A) వేలన్సీ
B) పరమాణుకత
C) పరమాణు సంఖ్య
D) ద్రవ్యరాశి సంఖ్య
జవాబు:
B) పరమాణుకత
40. సోడియం యొక్క పరమాణుకత
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
A) 1
41. ఒక మూలక పరమాణువులు మరొక మూలక పరమాణువులతో సంయోగం చెందే సామర్థ్యాన్ని ……………. అంటారు.
A) వేలన్నీ
B) పరమాణుకత
C) పరమాణు సంఖ్య
D) ద్రవ్యరాశి సంఖ్య
జవాబు:
A) వేలన్నీ
42. ఆర్గాన్ సంయోజకత
A) 0
B) 1
C) 2
D) 3
జవాబు:
A) 0
43. కార్బన్ సంయోజకత
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
D) 4
44. ధనావేశ అయాను ………… అంటారు.
A) రాడికల్
B) యానయాను
C) కాటయాన్
D) సంక్లిష్ట అయాను
జవాబు:
C) కాటయాన్
45. ఋణావేశ అయాను …….. అంటారు.
A) రాడికల్
B) యానయాను
C) కాటయాన్
D) సంక్లిష్ట అయాను
జవాబు:
B) యానయాను
46. NH4OH లో ఆనయాన్
A) OH–
B) NH+4
C) NH+3
D) NH–
జవాబు:
A) OH–
47. …………….. పరమాణు ద్రవ్యరాశిని ప్రామాణికంగా తీసుకొని ఇతర పరమాణువుల ద్రవ్యరాశులను కొలిచారు.
A) కార్బన్ – 12
B) కార్బన్ – 14
C) ఆక్సిజన్ – 16
D) ఆక్సిజన్ – 18
జవాబు:
A) కార్బన్ – 12
48. ఒక మూలక పరమాణువు కార్బన్ – 12 యొక్క ద్రవ్యరాశిలో 1/12వ భాగం కంటె ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే సంఖ్యనే ఆ మూలక పరమాణువు యొక్క …………….. అంటారు.
A) వేలన్సీ
B) పరమాణుకత
C) పరమాణు ద్రవ్యరాశి
D) పరమాణు సంఖ్య
జవాబు:
C) పరమాణు ద్రవ్యరాశి
49. మెగ్నీషియం యొక్క పరమాణు ద్రవ్యరాశి
A) 8
B) 10
C) 12
D) 24
జవాబు:
D) 24
50. సిల్వర్ నైట్రేట్ ఫార్ములా పనిచేసే వాయువు
A) AgNO2
B) AgSO4
C) AgNO3
D) Ag(NO3)2
జవాబు:
C) AgNO3
51. సోడియం కార్బొనేట్ యొక్క ద్రవ్యరాశి ………. U
A) 108
B) 104
C) 110
D) 106
జవాబు:
D) 106
52. అవగ్రాడో సంఖ్య (NA) = ………..
A) 6.022 × 1020
B) 6.022 × 1021
C) 6.022 × 1022
D) 6.022 × 1023
జవాబు:
D) 6.022 × 1023
53. నీటి మోలార్ ద్రవ్యరాశి …………. U
A) 16
B) 18
C) 20
D) 22
జవాబు:
B) 18
54. 32 గ్రా. ఆక్సిజన్ అణువులో ఉండే కణాల సంఖ్య …………
A) 6.022 × 1020
B) 3.011 × 1023
C) 6.022 × 1022
D) 6.022 × 1023
జవాబు:
D) 6.022 × 1023
55. 22 గ్రా. కార్బన్‌డయాక్సైడ్ యొక్క మెలార్ సంఖ్య
A) 1
B) 0.25
C) 0.75
D) 0.50
జవాబు:
D) 0.50
56. Cu2Oలో కాపర్ సంయోజకత
A) +1
B) +2
C) +3
D) -1
జవాబు:
A) +1
57. 7.75 గ్రా. ఫాస్ఫరస్ ద్రవ్యరాశి ………
A) 6.022 × 1023
B) 3.011 × 1023
C) 1.5055 × 1023
D) 6.022 × 1022
జవాబు:
C) 1.5055 × 1023
58. నైట్రోజన్ సంకేతం
A) NO3–
B) NO2–
C) N3-
D) N
జవాబు:
D) N
59. ప్రవచనం – I : క్లోరైడు అయాను సంకేతం Cl.
ప్రవచనం – II : అమ్మోనియం అయాను సంకేతం NH4+.
A) I, II లు సత్యాలు
B) I – సత్యం , II – అసత్యం
C) I – అసత్యం, II – సత్యం
D) I, II లు అసత్యాలు
జవాబు:
A) I, II లు సత్యాలు
60. సోడియం సంకేతం
A) Na
B) Na2+
C) Na3+
D) Na+
జవాబు:
D) Na+
61. జతపర్చుము.
a) కాల్షియం నైట్రేట్ | i) HNO3 |
b) నైట్రికామ్లము | ii) (NH4)3PO4 |
c) అమ్మోనియం క్లోరైడ్ | iii) Ca(NO3)2 |
d) అమ్మోనియం ఫాస్ఫేట్ | iv) NH4Cl |
A) a – iii, b – i, c – iv, d – ii
B) a – i, b – ii, c – iii, d – iv
C) a – ii, b – iii, c – iv, d – i
D) a – iv, b – i, c – ii, d – iii
జవాబు:
A) a – iii, b – i, c – iv, d – ii
62. అమ్మోనియం కార్బొనేట్ ఫార్ములా
A) AlCO3
B) Al2CO3
C) Al2(CO3)3
D) Al(CO3)2
జవాబు:
C) Al2(CO3)3
63. జింక్ అయాను సంకేతం
A) Zn
B) Zn+
C) Zn2+
D) Zn3+
జవాబు:
C) Zn2+
64. కిందివాటిలో డాల్టన్ చే ఇవ్వబడని ప్రవచనము
ప్రవచనము (A) : ద్రవ్యం నిత్యత్వమైనట్లయితే తప్పనిసరిగా మూలకాలన్ని చిన్నచిన్న కణాలతో నిర్మితమై ఉండాలి.
ప్రవచనము (B) : స్ట్రానుపాత నియమం పాటించాలంటే ఒక పదార్థంలో అన్ని కణాలు ఒకేలా ఉండాలి.
A) A మాత్రమే
B) B మాత్రమే
C) A మరియు B రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) B మాత్రమే
65. ఎవరు సరైనవారు?
మనో : మూలకాలు పరమాణువులచే ఏర్పడతాయి.
సోహన్ : పరమాణువులు మూలకాలతో నిర్మితమవుతాయి.
A) మనో
B) సోహన్
C) ఇద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
A) మనో
66. పరికల్పన (A) : మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య 24
వివరణ (R) : మెగ్నీషియం, 1/12 వంతు కార్బన్ కన్నా మెగ్నీషియం పరమాణువు 24 రెట్లుండును.
A) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ
B) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ కాదు
C) A, Rలు అసత్యాలు
D) A సత్యం కాని R అసత్యం
జవాబు:
A) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ
67. పరికల్పన (A): పరమాణు ద్రవ్యరాశికి ప్రమాణాలు లేవు.
వివరణ (R) : పరమాణు ద్రవ్యరాశి అనునది ఒక నిష్పత్తి యొక్క రూపము.
A) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ
B) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ కాదు
C) A, Rలు అసత్యాలు
D) A సత్యం కాని R అసత్యం
జవాబు:
A) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ
68. ఒక ఇనుప కమ్మీ త్రుప్పు పట్టుట వలన ఐరన్ ఆక్సెడ్ గా మారినది. రెండు సందర్భాలలో వస్తువు యొక్క భారాలను ఊహించుము.
a = కమ్మీ యొక్క భారము, b = తుప్పు యొక్క భారము
A) a > b
B) b > a
C) a = b
D) చెప్పలేము
జవాబు:
C) a = b
69. ద్రవ్య నిత్యత్వ నియమమును నిరూపించు ప్రయోగంలో పరీక్ష నాళికలోని ‘Mg’ భారము, రిబ్బనును కాల్చిన తర్వాత ఏర్పడిన MgO భారముకు సమానం కాదని సోహన్ గమనించెను. దీనికి గల కారణములు గుర్తించుము.
A) కొన్ని రసాయనిక మార్పులకు ద్రవ్య నిత్యత్వ నియమాలు వర్తించవు.
B) ఈ ప్రయోగంలో కొంత వాయువు అదృశ్యమగును.
C) అతను భారమును కొలుచుటకు సాధారణ త్రాసును వాడెను.
D) పైవన్నియూ.
జవాబు:
B) ఈ ప్రయోగంలో కొంత వాయువు అదృశ్యమగును.
70. CO : l : l :: CO2 : ……….
A) 1: 1
B ) 2 : 1
C) 1 : 2
D) 2 : 3
జవాబు:
C) 1 : 2
71. నీటిలోని అణువులు H2O అయిన హైడ్రోజన్లోని అణువులు
A) H
B) H2
C) A లేక B
D) అణువులు లేవు
జవాబు:
B) H2
72. కాపర్ యొక్క సంకేతము Cu గా ఎందుకు తీసుకున్నారు?
A) కాపర్ లాటిన్ నామము క్యూప్రమ్ కనుక
B) కాపర్ యొక్క అసలు స్పెల్లింగ్ Cupper కనుక
C) అన్ని లోహాల యొక్క సంకేతాలలో రెండు అక్షరాలు మాత్రమే తీసుకుంటారు కనుక
D) పైవన్నియూ
జవాబు:
A) కాపర్ లాటిన్ నామము క్యూప్రమ్ కనుక
73. పరికల్పన (A) :
కార్బన్ సంకేతం ‘C’ అదేవిధంగా కాల్షియం యొక్క సంకేతం ‘Ca’
వివరణ (R) :
కార్బన్ మరియు కాల్షియంలకు ఒకే మొదటి Capital letter లు కలవు, ఆవర్తన పట్టికలో కార్బన్ మొదటగా వచ్చును. కనుక దాని సంకేతంను ‘C’ గా మరియు కాలియం సంకేతంను Ca గా తీసుకుంటారు.
A) A మరియు Rలు సత్యాలు
B) A మరియు Rలు అసత్యాలు
C) A సత్యం కాని R అసత్యం
D) A అసత్యం కాని R సత్యం
జవాబు:
A) A మరియు Rలు సత్యాలు
74. సాధారణంగా జడవాయువులైన He, Ne, Ar, Kr, Xe లు ఏక పరమాణు మూలకాలుగా దొరుకును. దీనికి కారణమును ఊహించుము.
A) అవి అధిక చర్యాశీలత కలవి
B) వాటి వేలన్సీ శూన్యము
C) వాటి వేలన్సీ రి కన్నా తక్కువ
D) అవి అస్థిరములు
జవాబు:
B) వాటి వేలన్సీ శూన్యము
75. ‘x-1‘ మరియు Na’x’ అయిన ‘X’ అనునది
A) కార్బన్
B) క్రోమియం
C) క్లోరిన్
D) కాపర్
జవాబు:
C) క్లోరిన్
76. MgO నందు Mg మరియు O ల వేలన్సీలు వరుసగా
A) 1, 1
B) 2, 2
C) 1, 2
D) 2, 1
జవాబు:
B) 2, 2
77. ‘X2 Y’, ‘X’ H ‘Y’, ‘X’ OH అయిన X మరియు Y లను ఊహించుము.
A) X = Na ; Y = OH
B) X = Na ; Y = CO3
C) X = CO3 ; Y =Zn
D) X = Zn ; Y = CO3
జవాబు:
B) X = Na ; Y = CO3
78. Ag+, Cl–, Na+, OH– లనుపయోగించి ఏర్పడు పదార్థాల సంఖ్య
A) 2
B) 3
C) 4
D) 6
జవాబు:
C) 4
79. x అణువు యొక్క అణుభారము = 2 గ్రా||
y అణువు యొక్క అణుభారము = 32 గ్రా||
x²y అణువు యొక్క అణుభారము = 18 గ్రా|| అయిన
x మరియు y లను గుర్తించుము.
A) x = H2 ; y = O2
B) x = O2 ; y = H2
C) x = H2 ; y = Cl2
D) x = Cl2 ; y = H2
జవాబు:
A) x = H2 ; y = O2
80. 44 గ్రా|ల| నందు CO2 గల అణువుల సంఖ్య దీనికి సమానము.
A) 18 గ్రా||ల H2O నందు గల అణువుల సంఖ్య
B) 32 గ్రా||ల H2 నందు గల అణువుల సంఖ్య
C) 32 గ్రా||ల O2 నందు గల అణువుల సంఖ్య
D) పై వాటిలో ఏదో ఒకటి
జవాబు:
D) పై వాటిలో ఏదో ఒకటి
81. ద్రవ్య నిత్యత్వ నియమము నిరూపణలో భారము అనగా
A) లెడ్ నైట్రేటు యొక్క భారము
B) పొటాషియం అయోడైడ్ యొక్క భారము
C) లెడ్ ఆయోడైడ్ మరియు పొటాషియం నైట్రేట్ల భారము
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
82. పై ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్త అంశము
A) క్కాను గట్టిగా ఉంచాలి.
B) అనుఘటకాలను ఖచ్చితంగా కొలువుము
C) భారము తీసుకొనేటప్పుడు పరికరాలను స్వేచ్ఛగా వదలాలి
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
83. ద్రవ్యరాశి నిత్యత్వ నియమమును ప్రతిపాదించినది.
A) ఆంటోని లెవోయిజర్
B) జోసెఫ్ ఎల్. ప్రొస్ట్
C) జాన్ డాల్టన్
D) లాండాల్ట్
జవాబు:
A) ఆంటోని లెవోయిజర్
84. ద్రవ్యనిత్యత్వ నియమమును ప్రయోగాత్మకంగా నిరూపించినది.
A) లెవోయిజర్
B) ప్రొస్ట్
C) డాల్టన్
D) లాండాల్ట్
జవాబు:
D) లాండాల్ట్
85. స్థిరానుపాత నియమమును ప్రతిపాదించినది.
A) లెవోయిజర్
B) ప్రొస్ట్
C) డాల్టన్
D) లాండాల్
జవాబు:
B) ప్రొస్ట్
86. ‘అణు’, ‘పరమాణు’ లను ప్రతిపాదించిన భారతీయ ఋషి ‘కణాదుని’ అసలు పేరు
A) వైశేషిక సూత్ర
B) ఋషి
C) కశ్యప
D) భాస్కర
జవాబు:
C) కశ్యప
87. మూలకం యొక్క పేరును సూచించే ఇంగ్లీషు పదంలోని మొదటి అక్షరం (Upper case)ను మూలక సంకేతంగా వాడాలని సూచించినది.
A) జాన్ డాల్టన్
B) లాండాల్ట్
C) జాన్ బెర్జీలియస్
D) ఆస్వాల్డ్
జవాబు:
C) జాన్ బెర్జీలియస్
88. ‘మోల్’ అనే పదాన్ని ముందుగా ప్రవేశపెట్టినవారు …………….
A) జాన్ బెర్జీలియస్
B) ఆస్వాల్డ్
C) డాల్టన్
D) అవగాడ్రో
జవాబు:
B) ఆస్వాల్డ్
89. 9 గ్రా. అల్యూమినియంలో ఉండే కణాల సంఖ్య ………………
A) 2.007 × 1023
B) 3.011 × 1023
C) 18.066 × 1023
D) 6.022 × 1023
జవాబు:
A) 2.007 × 1023
90. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు
A) లెవోయిజర్
B) బ్రెస్ట్
C) డాల్టన్
D) లాండాల్ట్
జవాబు:
A) లెవోయిజర్
91. సూర్యుని యొక్క గ్రీకు నామము
A) హైడ్రో
B) ఆక్సీ
C) హీలియస్
D) అటామియో
జవాబు:
C) హీలియస్
92. మెర్క్యురీ లాటిన్ నామము
A) ఆరమ్
B) కప్సమ్
C) కాలియం
D) హైడ్రా జీరమ్
జవాబు:
D) హైడ్రా జీరమ్
93.
భార శాతాలు | సహజ నమూనా | కృత్రిమ నమూనా |
కాపర్ | 51.35 | 51.35 |
కార్బన్ | 9.74 | 9.74 |
ఆక్సిజన్ | 38.91 | 38.9 |
పై పట్టిక దేని నిరూపణకు వినియోగించెదరు?
A) ద్రవ్య నిత్యత్వ నియమం
B) స్థిరానుపాత నియమం
C) శక్తి నిత్యత్వ నియమం
D) పైవన్నియూ
జవాబు:
B) స్థిరానుపాత నియమం
94.
A) Ch
B) Ce
C) Cl
D) Chl
జవాబు:
C) Cl
95.
వరుసగా X, Y, Z లు ……………
A) సోడియం, Ag, కాలియం
B) కాలియం, సోడియం, Ag
C) Ag, సోడియం, కాలియం
D) Ag, కాలియం, సోడియం
జవాబు:
A) సోడియం, Ag, కాలియం
96. ఇవ్వబడిన పదార్ధము నుండి O2, తప్పుగా వున్న ప్రవచనమును గుర్తించుము.
A) ఇది ఆక్సిజన్ యొక్క అణువు
B) దీనికి రెండు మూలకాలు కలవు
C) దీని యందు రెండు ఆక్సిజన్ పరమాణువులు కలవు
D) ఇది సమ్మేళనం కాదు
జవాబు:
B) దీనికి రెండు మూలకాలు కలవు
97.
మెగ్నీషియం క్లోరైడు యొక్క ఫార్ములా
A) MgCl2
B) Mg2Cl
C) MgCl
D) Mg2Cl2
జవాబు:
A) MgCl2
98.
ఏకీకృత నీటి అణువు
A) ‘a’
B) ‘b’
C) ‘a’ మరియు ‘b’
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు
99. 2H2O దీనిని వినియోగించి, సరికాని ప్రవచనాన్ని గుర్తించుము.
A) నీటి అణువు యొక్క పరమాణుకత ‘6’
B) నీటి అణువు ‘3’ పరమాణువులను కల్గి ఉంటుంది
C) రెండు నీటి అణువులను తెలుపన్నునది
D) ఇది వ్యవస్థితం కాదు ఎందుకనగా అస్థిరమైనది కనుక
జవాబు:
A) నీటి అణువు యొక్క పరమాణుకత ‘6’
100.
వరుసగా X, Y, Z లు …………….
A) O8, S3, ద్విపరమాణుకత
B) S8, C3, ఏకపరమాణుకత
C) S8, O3, ద్వాపరమాణుకత
D) S8, O3, ద్విపరమాణుకత
జవాబు:
C) S8, O3, ద్వాపరమాణుకత
101.
వరుసగా a, b, c లు
A) NaCl, Na2NO3, MgOH
B) NaCl2, NaNO3, Mg(OH)2
C) NaCl, NaNO3, MgOH
D) NaCl, NaNO3, Mg(OH)2
జవాబు:
D) NaCl, NaNO3, Mg(OH)2
102. తుల్య అయాను ఆవేశపరముగా విభిన్నమైనదానిని గుర్తించుము.
A) హైడ్రోజన్, సోడియం, పొటాషియం
B) మెగ్నీషియం, కాల్షియం, జింక్
C) అల్యూమినియం, ఇనుము, సిల్వర్
D) అమ్మోనియం, కాపర్, సిల్వర్
జవాబు:
C) అల్యూమినియం, ఇనుము, సిల్వర్
103. ఆంటోని లెవోయిజర్ ను అభినందించదగిన విషయం
A) అతను ద్రవ్య నిత్యత్వ నియమంను ప్రతిపాదించెను కనుక
B) అతను ఆధునిక రసాయనశాస్త్ర పితామహుడు కనుక
C) అతను స్థిరానుపాత నియమమును ప్రతిపాదించెను కనుక
D) A మరియు B
జవాబు:
D) A మరియు B
104. పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితముగా కొలవదగిన
A) ద్రవ్య స్పెక్ట్రోమీటరు
B) కాంతి స్పెక్ట్రోమీటరు
C) విద్యుత్ త్రాసు
D) ఏదీకాదు
జవాబు:
A) ద్రవ్య స్పెక్ట్రోమీటరు
105. 16 గ్రా||ల ఆక్సిజన్లోని పరమాణు సంఖ్య
A) 6.022 × 1023
B) 3.011 × 1023
C) 12.044 × 1023
D) ఏదీకాదు
జవాబు:
A) 6.022 × 1023
106. 44 గ్రా||ల CO2 18 గ్రా॥ల నీటితో కలిసి సోదానీటిలో ఉన్న, నీటిలో గల H2CO3 అణువుల సంఖ్య
A) 6.022 × 1023
B) 3.011 × 1023
C) 12.044 × 1023
D) ఏదీకాదు
జవాబు:
A) 6.022 × 1023
107. ఒక మోల్ ఏ పదార్థం నందైనా ఉండదగు అణువుల సంఖ్యను కనుగొన్నాడు కనుక అవగాడ్రోను అభినందించవచ్చును.
అయితే ఒక మోల్ పదార్థంలోని అణువుల సంఖ్య …………….
A) 6.2 × 1022
B) 6.4 × 1019
C) 6.02 × 1023
D) లెక్కించలేము.
జవాబు:
C) 6.02 × 1023
108. మోల్ భావనను కనుగొన్నవాడు
A) అవగాడ్రో
B) వోస్ట్ వాల్డ్
C) డాల్టన్
D) లెవోయిజర్
జవాబు:
B) వోస్ట్ వాల్డ్
109. “వాషింగ్ సోడా” సాధారణ నామము
A) Na2CO3
B) NaHCO3
C) Na2SO4
D) Na2PO4
జవాబు:
A) Na2CO3
110. జతపర్చుము.
a) రాగి | i) ఆరమ్ |
b) పొటాషియమ్ | ii) క్యూప్రమ్ |
c) బంగారం | iii) కైలమ్ పరికరం |
d) సిల్వర్ | iv) అర్జెంటమ్ |
A) a – iii, b – iv, c – i, d – ii
B) a – ii, b – iii, c – i, d – iv
C) a – i, b – ii, c – iii, d – iv
D) a- iv, b – i, c – ii, d – iii
జవాబు:
B) a – ii, b – iii, c – i, d – iv
మీకు తెలుసా?
ద్రవ్య నిత్యత్వ నియమంను లెవోయిజర్ ప్రతిపాదించినప్పటికీ దీనిని లాండాల్ట్ (Landolt) అనే శాస్త్రవేత్త అభివృద్ధి చెందిన పరికరాలతో ప్రయోగం చేసి ఋజువు చేశాడు. ఆ ప్రయోగం గూర్చి మీ ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోండి.
ఆహార పదార్థాల ప్యాకింగ్ కు వాడే ఈ అల్యూమినియం పేపర్ చూడడానికి చాలా పలుచగా ఉన్నాసరే, దీనిలో వేల సంఖ్యలో పరమాణువులుంటాయి.
ఆంటోనీ లెవోయిజర్ (1743 – 1794) ప్రఖ్యాత ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త, రసాయన శాస్త్రంలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను కొందరు ‘ఆధునిక రసాయనశాస్త్ర పితామహుడు’ (Father of Modern Chemistry) అని పిలుస్తారు.
లెవోయిజర్ దహన చర్యలను గురించి విపులంగా అధ్యయనం చేశాడు. ఉదాహరణకు దహనచర్యలలో పాల్గొనే క్రియాజనకాలైన ఘనపదార్థాల భారాలను కొలవడమే కాకుండా వాయుపదార్థాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. దీని కొరకు చర్యలో వెలువడిన వాయు పదార్థాలు బయటికి పోకుండా ఉండేందుకు ప్రత్యేక పరికరాలను తయారు చేసాడు. ఈ ప్రయత్నాలే ద్రవ్యనిత్యత్వ నియమానికి దారి తీశాయి.
2600 ఏళ్ళకు పూర్వమే ‘కణాదుడు’ అనే భారతీయ ఋషి చెప్పిన ‘వైశేషిక సూత్ర’ లో పరమాణువులకు చెందిన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కణాదుడి అసలు పేరు కశ్యపుడు. తన కణసిద్ధాంతంతో ఇతడు కణాదుడుగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. పదార్ధం యొక్క అన్నిరూపాలు ‘అణువు’లనే చిన్న కణాలతో నిర్మితమై ఉన్నాయి. ఈ అణువులే మరలా పరమాణువులనే | సూక్ష్మ కణాలచే నిర్మితమై ఉన్నాయని ఇతడు ప్రతిపాదించాడు.
పరమాణువు (atom) అనే పదము గ్రీకు పదమైన ‘a-tomio’ నుండి పుట్టింది. దీని అర్థం – ‘విభజించవీలులేనిది’ (indivisible).
హైడ్రోజన్, ఆక్సిజన్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?
మూలకాలకు వాటి ధర్మాలననుసరించి కొన్నిసార్లు పేర్లు పెట్టడం జరిగింది. ఉదాహరణకు లాటిన్ భాషలో ‘హైడ్రో’ (Hydro) అనగా ‘నీరు’ అని అర్ధం. కనుక ఆక్సిజన్ చర్యపొంది నీటిని ఏర్పరిచే స్వభావం ఉన్న మూలకానికి హైడ్రోజన్ అని పేరు పెట్టారు. అలాగే ఒకప్పుడు ప్రజలు ఆక్సిజన్తో చర్యపొందే అన్ని పదార్థాలు ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటాయని నమ్మేవారు. లాటిన్ భాషలో ‘ఆక్సీ’ (Oxy) అంటే ‘ఆమ్లం’ (Acid) అని అర్ధం. కాబట్టి ఆమ్లాన్ని ఏర్పరిచే గుణం ఉన్న ఈ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆమ్ల లక్షణానికి, ఆక్సిజనకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. అయితే అప్పటికే ఈ మూలకానికి ఆ పేరు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఆ పేరును మార్పు చేయలేదు.
మూలకాలకు పేర్లు పెట్టడంలో అవి లభించే ప్రదేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఉదాహరణకు సూర్యునిలో కనుగొనబడిన వాయువుకు హీలియం (Helium) అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో ‘హీలియో’ (Helio) అనగా ‘సూర్యుడు’ అని అర్థం. పొలోనియం, కాలిఫోర్నియంలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మీరు ఊహించగలరా ? శాస్త్రవేత్తల గౌరవార్థం కొన్ని మూలకాలను వారి పేర్లతో పిలిచారు. ఉదాహరణకు ఐన్ స్టీనియం, రూథర్‌ఫోర్డియం, మెండలీవియం, ఫెర్మియం మొదలగునవి.
మోల్ అనే పదంను ,విల్ హెల్త్ ఆస్వాల్డ్ (Wilhelm Ostwald) లాటిన్ పదమైన ‘Moles’ నుండి తీసుకున్నాడు. దీని | అర్థం కుప్ప (Heap or Pile). అనగా ఒక మోల్ పదార్థాన్ని పరమాణువులు లేదా అణువుల కుప్పగా భావించవచ్చు.
ఒక నమూనా (Sample) లోని పరమాణువుల లేదా అణువుల కుప్పను తెల్పడానికి ఉపయోగించే పెద్ద సంఖ్యకు మోల్ అనే ప్రమాణంను వాడాలని 1967లో నిర్ణయించారు.
జాన్ బెర్జీలియస్ (John Berzelius) మూలకం యొక్క పేరును సూచించే ఇంగ్లీషు పదంలోని మొదటి పెద్ద అక్షరం (Upper case)ను మూలక సంకేతంగా వాడాలని సూచించాడు. ఉదాహరణకు ఆక్సిజనకు ‘O’, హైడ్రోజను ‘H’ ను సంకేతంగా వాడవచ్చు.
మూలకాల పరమాణు భారాలను నిర్ణయించడానికి డాల్టన్ మొదట హైడ్రోజన్ పరమాణు భారాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. శాస్త్రవేత్తలు ఎన్నో పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలను గురించి అన్వేషించారు. అయితే ముందుగా ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ఆక్సిజన్ పరమాణువు యొక్క ద్రవ్యరాశిలో 1/16 వంతును ప్రమాణంగా తీసుకున్నారు. ఇలా ఆక్సిజన్ ద్రవ్యరాశిని ప్రమాణికంగా తీసుకోవడానికి రెండు కారణాలున్నాయి.
- ఆక్సిజన్ ఎక్కువ రకాల మూలకాలతో చర్య పొంది సమ్మేళనాలను ఏర్పరచడం.
- ఈ ద్రవ్యరాశి ప్రమాణం ఎన్నో మూలక ద్రవ్యరాశులను చెప్పడానికి వీలుగా ఉండడం.
19వ శతాబ్దంలో పరమాణు ద్రవ్యరాశుల్ని కనుగొనడానికి ఎలాంటి వసతులు (facilities) లేవు. అందుకే రసాయన శాస్త్రవేత్తలు ఈ విలువలను ప్రయోగాల ద్వారా సాపేక్షంగా నిర్ధారించారు. ఈ రోజుల్లో పరమాణువుల ద్రవ్యరాశిని చాలా కచ్చితంగా కనుగొనడానికి ద్రవ్యరాశీ స్పెక్ట్రోమీటర్ (mass spectrometer) వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు.