These AP 8th Class Telugu Important Questions 9th Lesson చిరుమాలిన్యం will help students prepare well for the exams.
చిరుమాలిన్యం AP Board 8th Class Telugu 9th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గేయాలు – భావాలు
1. ఆకాశానికి
భూమికీ మధ్య
అవతరించాం
గగన డమరుక లయనీ
అడివిని ఊయలలూగించే వాయురాగాలనీ విన్నాం
హెూరుజలపాతాల బృందగానాలని అవధరించాం
సిగ్గు తెలిసి ఆకులు ధరించాం
రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం.
సాటి జంతువులని చంపి ఆకలి తీర్చుకున్నాం.
భావం: ఆకాశానికీ, భూమికీ మధ్య (భూమిపై) జన్మించాం. ఆకాశం అనే డమరుకం యొక్క ధ్వనులను (ఉరుములు మొదలైనవి) విన్నాం. అడవులను ఊయలలూగించే గాలిపాటలను (చెట్ల సందులలోంచి గాలి వీచేటపుడు వచ్చే ధ్వనులను) విన్నాం. జలపాతాల సమూహపు పాటలను (సెలయేళ్ల చప్పుళ్లు) విన్నాం. ఆదిమానవునిగా ఉన్నపుడు సిగ్గు తెలిసి ఆకులను బట్టలుగా కట్టుకొన్నాం. రాళ్లను ఆయుధాలుగా తయారు చేసుకొన్నాం. మనతో కలిసి-తిరిగే సాటి జీవులైన జంతువులను చంపి ఆ మాంసం తిని ఆకలి తీర్చుకొన్నాం (ఇది ఆదిమానవుడిగా మన మొదటి దశ).
2. మాటలు నేర్చుకున్నాం
లివులు కూర్చుకున్నాం
దేవుళ్ళని సృష్టించుకున్నాం
నక్షత్రాలకి నామకరణం చేశాం
గ్రహాలని విగ్రహాలుగా మార్చాం
నిప్పుని రాజేశాం
భావం: (ఆదిమానవ దశలో కొంత అభివృద్ధి చెందాక) మాట్లాడడం నేర్చుకొన్నాం, అక్షరాలు, పదాలు వ్రాయడం నేర్చుకొన్నాం, దేవుళ్లని కల్పించుకొన్నాం. నక్షత్రాలకి పేర్లు పెట్టాం. గ్రహాల శిల్పాలు తయారు చేసుకొన్నాం. నిప్పును తయారు చేయడం నేర్చుకొన్నాం.
3. చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిరా తిప్పాం
ఖండాలు దాటి పోయాం వచ్చాం.
రాజ్యాలు దాటి పోయాం వచ్చాం.
రాజ్యాలు నిర్మించాం
సామ్రాజ్యాలు ఆక్రమించాం
నదులు మళ్ళించాం సముద్రాలు మధించాం
గ్రహాల మీద అడుగులు వేశాం
నియంతలుగా ఏలాం
నిరంకుశుల్ని నాశనం చేశాం
శ్రామిక రాజ్యాలు కూల్చాం
సంపదలు దోచుకున్నాం
దేవతలకి స్వర్ణకలశాలలో
పంచామృతాలతో అభిషేకాలు చేశాం…
భావం: చక్రాన్ని కనుగొని గిరగిరా త్రిప్పాము, దొర్లించాం. 7 ఖండాలలో ఒకదాని నుండి మరొక దానిలోకి (సముద్రమార్గం ద్వారా) ప్రయాణించాం. ఒక రాజ్యం నుండి మరో రాజ్యంలోకి ప్రవేశించాం. కొత్త రాజ్యాలు నిర్మించుకొన్నాం, శత్రు సామ్రాజ్యాలు (యుద్ధాలు చేసి) ఆక్రమించాం, నదులను (వ్యవసాయం కోసం) దారి మళ్లించాం, సముద్రాలు (పెట్రోలు, డీజిలు, మొ॥వాటి కోసం) చిలికాం, ఇతర గ్రహాల మీదకు ప్రవేశించాం, నియంతలుగా మారాం, ఎవరి మాటా వినని నిరంకుశుల్ని నశింపచేశాం, వారు దోచుకొని దాచుకున్న సంపదను తిరిగి దోచుకొన్నాం, దేవతలకు బంగారు చెంబులలో నింపిన పంచామృతాలతో అభిషేకాలు చేశాం.
4. కానీ సోదరా
మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్ళతో
కడిగి శుభ్రం చేయలేక పోయాం ….!
భావం : కానీ! సోదరా! మనిషి మనసులో ఉండే మాలిన్యాన్ని కొద్దిగా వెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేక పోయాం.
పరిచిత గేయాలు – ప్రశ్నలు
1. కింది పరిచిత గేయం చదివి, నాలుగు ప్రశ్నలు తయారు చేయండి.
ఆకాశానికీ
భూమికీ మధ్య
అవతరించాం
గగన డమరుక లయనీ
అడివిని ఊయలలూగించే వాయురాగాలనీ విన్నాం
హెూరుజలపాతాల బృందగానాలని అవధరించాం
సిగ్గు తెలిసి ఆకులు ధరించాం
రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం
సాటి జంతువులని చంపి ఆకలి తీర్చుకున్నాం
ప్రశ్నలు:
1. మనిషి ఎక్కడ అవతరించాడు?
2. బృందగానాలు చేసినదెవరు?
3. దేని వలన ఆకులు ధరించాం?
4. మన ఆకలి తీర్చడానికి వేటిని చంపాము?
2. మాటలు నేర్చుకున్నాం
లిపులు కూర్చుకున్నాం
దేవుళ్ళని సృష్టించుకున్నాం
నక్షత్రాలకి నామకరణం చేశాం
గ్రహాలని విగ్రహాలుగా మార్చాం
నిప్పుని రాజేశాం
ప్రశ్నలు:
1. పై గేయంలోని ఏ అంశం మానవ జీవిత పరిణామ క్రమాన్ని పూర్తిగా మార్చేసింది?
2. ‘నామకరణం” అంటే ఏమిటి?
3. ‘సృష్టి’కి వ్యతిరేక పదం ఏమిటి?
4. గ్రహం అంటే ఏమిటి?
3. క్రింది పరిచిత గేయాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిరా తిప్పాం
ఖండాలు దాటి పోయాం వచ్చాం
రాజ్యాలు దాటి పోయాం వచ్చాం
రాజ్యాలు నిర్మించాం
సామ్రాజ్యాలు ఆక్రమించాం
నదులు మళ్ళించాం సముద్రాలు మధించాం
గ్రహాల మీద అడుగులు వేశాం
నియంతలుగా ఏలాం
నిరంకుశుల్ని నాశనం చేశాం
శ్రామిక రాజ్యాలు కూల్చాం
సంపదలు దోచుకున్నాం
దేవతలకి స్వర్ణకలశాలలో
పంచామృతాలతో అభిషేకాలు చేశాం….
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ప్రయాణం చేయడానికి అవసరమైన వస్తువు పై గేయంలో ఏది ఉంది?
జవాబు:
ప్రయాణం చేయడానికి అవసరమైన వస్తువు పై గేయంలో చూస్తే చక్రమే.
ప్రశ్న 2.
‘నియంత’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
నియంత అంటే ‘అధినాయకుడు’
ప్రశ్న 3.
‘నిరంకుశులు’ అంటే ఎవరు?
జవాబు:
నిరంకుశులు అంటే కనికరం లేనివారు.
ప్రశ్న 4.
‘పంచామృతాలు’ అంటే ఏవి?
జవాబు:
పంచామృతాలు 5 అవి: 1) ఆవుపాలు, 2) ఆవు పెరుగు 3) ఆవు నేయి 4) చక్కెర 5) తేనె
అపరిచిత గేయాలు – ప్రశ్నలు
క్రింది అపరిచిత గేయాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
మబ్బుకు మనసు కరగడం ద్వారా ఏ ఫలితం వస్తుంది?
జవాబు:
వర్షమై భూమి మీద కురుస్తుంది.
ప్రశ్న 2.
దారి ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
భయపడకుండా, నిరుత్సాహ పడకుండా ముందడుగు వేసే స్ఫూర్తి నలుగురికి దారి అవుతుంది.
ప్రశ్న 3.
ఈ గేయం రచయిత ఎవరు?
జవాబు:
సి. నారాయణరెడ్డి గారు.
ప్రశ్న 4.
పై గేయం చదివి ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘ఎడారి దిబ్బలు’ అంటే ఏమిటి?
2. ఎవరికి వారే గీపెడితే ఆశించిన గమ్యం దొరకదోయ్,
సమైక్య సంఘర్షణలో ఉన్నది సంఘం చేసిన సంతకం,
ఆలయాలలో కొలిచే ప్రతిమలు ఆత్మ సంతృప్తికే ‘సినారే’
దయకురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం
ప్రశ్నలు:
ప్రశ్న 1.
‘సమైక్యతతోనే సంఘం వర్ధిల్లుతుంది’ అనే భావం ఏ పాదంలో ఉంది?
జవాబు:
2వ పాదం
ప్రశ్న 2.
‘దయకురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం’ అనే మాట ద్వారా కవి మనుషులకు ఏమి సందేశం ఇస్తున్నాడు?
జవాబు:
తోటి మనిషికి సేవచేసే దయలోనే దైవం ఉన్నాడు.
ప్రశ్న 3.
‘ప్రతిమలు’ అనే మాటకు అర్థం ఏమిటి?
జవాబు:
బొమ్మలు
ప్రశ్న 4.
పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
గేయంలోని మొదటి పాదంలోని అర్థం ఏమిటి?
3. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
మనసుకు మళ్ళీ ముసిరితే కన్నీరవుతుంది.
వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం!
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
మబ్బులు కురవాలంటే ఏం జరగాలి?
జవాబు:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే కురుస్తాయి.
ప్రశ్న 2.
మనసుకు మబ్బు ముసరడం అంటే ఏమిటి?
జవాబు:
మనసుకు మబ్బు ముసరడం అంటే ఆందోళన, చింత, బాధ, దిగులు కమ్ముకోవడం.
ప్రశ్న 3.
ఈ పై గేయం ఆధారంగా రెండు ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:
1) ‘జంకని’ అంటే ఏమిటి?
2) ‘నేస్తం’ పర్యాయపదాలు రాయండి.
4. ఉరుగుణవంతు డొడ్లుదన కొండపకారము సేయునప్పుడున్
బరహితమే యొనర్చు నౌకపట్టుననైనను గీడుజేయగా
నెఱుగడు నిక్కమే కద యదెట్లన గవ్వముబట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా !!
ప్రశ్నలు:
1. మనకి చెడు చేసినవారికి కూడా మనం మంచి చేయడం ఎటువంటి లక్షణం? (సి)
ఎ) మూర్ఖత్వం
బి) చేతకానితనం
సి) ఉత్తమ లక్షణం
డి) చెడ్డ లక్షణ
జవాబు:
సి) ఉత్తమ లక్షణం
2. ఇచ్చిన పద్యం ఏ శతకంలోనిదో గుర్తించండి. (బి)
ఎ) సుమతీ శతకం
బి) భాస్కర శతకం
సి) వేమన శతకం
డి) నరసింహ శతకం
జవాబు:
బి) భాస్కర శతకం
3. కింద గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. దొంగ నిక్కము పలికినా ఎవరూ నమ్మరు. (డి)
ఎ) వేదాలు
బి) అబద్ధం
సి) నీతులు
డి) నిజము
జవాబు:
డి) నిజము
5. పోస్టర్ని చదివి కింది ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి. (SA-2-2023-24)
1. ఈ వేసవి శిక్షణా శిబిరం వలన విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది. (ఎ)
ఎ) జీవనోపాధికి తోడ్పడుతుంది.
సి) అల్లరి చేయడం తగ్గుతుంది.
బి) విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది.
డి) ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది.
జవాబు:
ఎ) జీవనోపాధికి తోడ్పడుతుంది.
2. ఎనిమిదో తరగతి చదువుతున్న రవి కబడ్డీ, అఖిల క్రాఫ్ట్ వర్క్, సునీల్ తైక్వాండోలు నేర్చుకోవాలనుకుంటున్నారు. వారు ఏయే సమయాలకు హాజరు కావలసి ఉంటుంది? (ఎ)
ఎ) రవి సా. 4.00 నుండి 5.00 వరకు, అఖిల మ. 2.00 నుండి 3.30 వరకు, సునీల్ ఉ. 8.00 నుండి 9.00 వరకు
బి) రవి సా. 4.00 నుండి 5.00 వరకు, అఖిల మ. 2.00 నుండి 3.30 వరకు, సునీల్ ఉ. 7.00 నుండి 8.00 వరకు
సి) రవి ఉ. 9.00 నుండి 12.30 వరకు, అఖిల ఉ. 8.00 నుండి 9.00 వరకు, సునీల్ మ. 2.00 నుండి 3.30 వరకు
డి) రవి ఉ. 9.00 నుండి 12.30 వరకు, అఖిల ఉ. 8.00 నుండి 9.00 వరకు, సునీల్ మ. 3.00 నుండి 4.00 వరకు
జవాబు:
ఎ) రవి సా. 4.00 నుండి 5.00 వరకు, అఖిల మ. 2.00 నుండి 3.30 వరకు, సునీల్ ఉ. 8.00 నుండి 9.00 వరకు
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
మానవుడు మొదటి దశలో ఎలా ఉండేవాడో వివరించండి.
జవాబు:
మానవుడు మొదటి దశలో ఆదిమానవుడుగా ఉండేవాడు. ఏ విధమైన తెలివీ అభివృద్ధి చెందలేదు. జంతువులతో సమానంగా బ్రతికేవాడు. ఆకాశంలో ఉరుములూ, మెరుపులూ చూసి దానిని డమరుక ధ్వనిలా వినేవాడు, భయపడేవాడు. అడవులలో చెట్ల సందున గాలి దూరి చేసే చప్పుడును వాయు రాగాలుగా భావించేవాడు, ఆనందపడేవాడు. కొండలపై నుండి పడే జలపాతాల చప్పుళ్లకు ఆనందించేవాడు, ఆ జలపాతాలను చాలా ఆశ్చర్యంతో చూసేవాడు.
కొంతకాలానికి సిగ్గు తెలిసింది. ఆకులు కట్టుకొన్నాడు. కొంచెం తెలివి పెరిగింది. రాళ్లను ఆయుధాలుగా చెక్కాడు. జంతువులను చంపి వాటి మాంసం పచ్చిగానే తినేవాడు.
ప్రశ్న 2.
మనిషి మనసులోని మాలిన్యమేమిటి? దానిని ఎలా కడగాలి?
జవాబు:
ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్థం మొదలైనవి మనిషి మనసులోని మాలిన్యాలు, తోటివారి పట్ల, సాటి జీవుల పట్ల జాలితో ప్రవర్తించడం, సహాయం చేసే గుణం చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా చిన్నతనం నుండీ అలవాటు చేస్తే మనిషి మనసులోని మాలిన్యం పోతుంది.
ఆ) క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఇతరులకు సహాయం చేయడం వలన కలిగే ఉపయోగాలను వివరిస్తూ మిత్రునకు/మిత్రురాలికి లేఖ వ్రాయండి.
జవాబు:
పాడేరు, ప్రియమైన మిహిరకు నీకొక విషయం ఎప్పటినుండో చెప్పాలనుకొంటున్నాను. మనం ఇతరులకు సహాయం చేస్తే అది మనకే ప్రయోజనం. ఎందుకంటే, మనకు అవసరం ఏర్పడినపుడు వాళ్లు అలాగే సహాయం చేస్తారు. అంతేకాదు, మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్లు కూడా ఇతరులకు సహాయం చేస్తారు. దీని వలన ఇరుగు పొరుగు వారితో అనవసరపు గొడవలు రావు. అందరం కలిసిమెలిసి ఆనందంగా బ్రతకవచ్చు. ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. సమాధానం వ్రాయి. ఇట్లు చిరునామా: |
ప్రశ్న 2.
దేవుళ్లని సృష్టించడం వలన ఏం ప్రయోజనం కలిగింది?
జవాబు:
ప్రకృతిలోని గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి, ప్రకృతి నుండి మానవుడు దేవుళ్లను సృష్టించుకొన్నాడు. వీటి వలన మానవునకు మనశ్శాంతి దొరికింది. దేవుడు రక్షిస్తాడనే నమ్మకం పెరిగింది. ఆ నమ్మకంతో ఇంకా వేగంగా పని చేశాడు. అభివృద్ధిని సాధించాడు. తొలిదశలో ప్రకృతిని చూసి భయపడినవాడు అదంతా దైవలీలగా భావించి ధైర్యం తెచ్చుకొన్నాడు. పంచభూతాలను, ప్రకృతిని దైవంగా భావించి, వాటిని కలుషితం చేయకుండా జాగ్రత్తగా బ్రతికాడు. తన అవసరాలకు తగినంత మాత్రమే వినియోగించుకొన్నాడు. ఒక చెట్టు కొట్టినా భక్తి భావంతో 10 మొక్కలు నాటాడు. నదులను తల్లులుగా భావించి వాటిని కాపాడాడు. సురక్షితంగా ఉన్నాడు.
ప్రశ్న 3.
మానవుని అభివృద్ధిలో కీలకపాత్ర పోషించినవేవి? ఎందుకు?
జవాబు:
మానవజాతి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించినవి నిప్పు, చక్రం.
నిప్పు చేయడం కనుగొన్నాక మాంసాన్ని, దుంపలను కాల్చుకు తినడం అలవాటయింది. తనకు కావలసిన విధంగా ఆహారాన్ని ఉడికించుకొని తయారు చేసుకొనే నేర్పు ఏర్పడింది. దాని కోసం కావలసిన మొక్కలు పెంచుకొన్నాడు. వ్యవసాయం నేర్చుకొన్నాడు. నాగరికత, ఆరోగ్యం పెరిగింది.
చక్రం కనుగొన్నాక అభివృద్ధి వేగవంతంగా జరిగింది. సరుకులను సులువుగా కదిలించే స్థితి నుండి ప్రయాణ సాధనాలు తయారు చేసుకొన్నాడు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాడు. ఆధునికత రూపుదిద్దుకొంది.
భాషాంశాలు
బహుళైచ్ఛిక ప్రశ్నలు
పదజాలం
అర్థాలు : గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
1. మంచిని అవధరించాలి. (సి)
ఎ) చూడాలి
బి) చెప్పాలి
సి) వినాలి
డి) కాపాడాలి
జవాబు:
సి) వినాలి
2. మంచి బట్టలు ధరించాలి. (ఎ)
ఎ) కట్టుకోవాలి
బి) పెట్టాలి
సి) ఇవ్వాలి
డి) దాచాలి
జవాబు:
ఎ) కట్టుకోవాలి
3. కొత్త కథలను సృష్టి చేయాలి. (డి)
ఎ) వ్రాయడం
బి) చెప్పడం
సి) వినడం
డి) సృజన
జవాబు:
డి) సృజన
4. దేవుని విగ్రహం బాగుంది. (బి)
ఎ) మహిమ
బి) బొమ్మ
సి) పూజ
డి) మంత్రం
జవాబు:
బి) బొమ్మ
5. నిప్పు కాలుతుంది. (సి)
ఎ) కరెంటు
బి) వేడి
సి) అగ్ని
డి) ఎండ
జవాబు:
సి) అగ్ని
6. సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది. (బి)
ఎ) అద్ది
బి) అబ్ధి
సి) అభి
డి) జలము
జవాబు:
బి) అబ్ధి
7. పెరుగు మధిస్తే వెన్న వస్తుంది. (ఎ)
ఎ) చిలికితే
బి) గుంజితే
సి) దంచితే
డి) కాస్తే
జవాబు:
ఎ) చిలికితే
8. భూమిని ఏలుట పాలకుల పని. (డి)
ఎ) ఉంచుట
బి) కాపాడుట
సి) దున్నుట
డి) పాలించుట
జవాబు:
డి) పాలించుట
9. స్వర్ణం ధర ఎక్కువ. (ఎ)
ఎ) బంగారం
బి) భూమి
సి) వజ్రం
డి) వెండి
జవాబు:
ఎ) బంగారం
10. కలశముతో నీరు తేవాలి. (బి)
ఎ) బాలీ
బి) కుండ
సి) కుండీ
డి) బిందె
జవాబు:
బి) కుండ
11. మనిషి స్వార్థం వదలాలి. (ఎ)
ఎ) మానవుడు
బి) పురుషుడు
సి) తండ్రి
డి) నాయకుడు
జవాబు:
ఎ) మానవుడు
12. ప్రతివాడూ మన సోదరుడు అనుకొంటే గొడవ రాదు. (సి)
ఎ) తండ్రి
బి) తల్లి
సి) తోడబుట్టినవాడు
డి) సఖుడు
జవాబు:
సి) తోడబుట్టినవాడు
13. అనవసరంగా కన్నీరు పెట్టకూడదు. (సి)
ఎ) రక్తం
బి) రుధిరం
సి) అశ్రువులు
డి) పోరు
జవాబు:
సి) అశ్రువులు
14. ఇన్ని మంచి నీళ్లయ్యి. (బి)
ఎ) చాలా
బి) కొంచె
సి) ఎన్నో
డి) గ్లాసుతో
జవాబు:
బి) కొంచె
15. మనసులో మాలిన్యం ఉందకూడదు. (ఎ)
ఎ) మురికి
బి) తప్పు
సి) ద్రోహం
డి) కోపం
జవాబు:
ఎ) మురికి
పర్యాయపదాలు : గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
16. పేదల ఆకలి తీర్చాలి. (ఎ)
ఎ) క్షుత్తు, అంగద
బి) అంగము, క్రుశము
సి) బాధ, దుఃఖం
డి) అన్నం, భోజనం
జవాబు:
ఎ) క్షుత్తు, అంగద
17. బాగా ఊహ చేస్తే కావ్యం వ్రాయవచ్చు. (ఎ)
ఎ) ఉత్ప్రేక్ష, యోచన
బి) ఉపమ, రూపకం
సి) ఆలోచన, లోచనం
డి) మన్నన, గ్రహించటం
జవాబు:
ఎ) ఉత్ప్రేక్ష, యోచన
18. ప్రగతికి గుర్తు చక్రము. (డి)
ఎ) విష్ణు చక్రము, బాణ సంచా
బి) బండి చక్రము, బండి
సి) ప్రగతి చక్రము, బస్సు
డి) బండి కల్లు, చుట్టు కైదువు
జవాబు:
డి) బండి కల్లు, చుట్టు కైదువు
19. భారతదేశములోని ఖండమే పాకిస్థాన్. (సి)
ఎ) దేశము, ప్రదేశము
బి) ప్రాంతము, పొంత
సి) ముక్క తునుక
డి) వేరొక దేశం, స్వతంత్ర దేశం
జవాబు:
సి) ముక్క తునుక
20. మన రాజ్యములో హింసకు తావులేదు. (బి)
ఎ) దేశము, భారతదేశము
బి) ప్రదేశము, సామ్రాజ్యము
సి) భారతదేశము, ఇండియా
డి) ఇండియా, హిందూదేశము
జవాబు:
బి) ప్రదేశము, సామ్రాజ్యము
21. ఇతరుల ఆస్తుల ఆక్రమణ తప్పు. (ఎ)
ఎ) క్రమ్ముట, ఆక్రమించుట
బి) దోచుకోవటం, దాచుకోవటం
సి) కానిదీ, లేనిదీ
డి) విలువయినవి, ఖరీదయినవి
జవాబు:
ఎ) క్రమ్ముట, ఆక్రమించుట
22. గంగానది పవిత్రమైనది. (డి)
ఎ) సెలయేరు, యేరు
బి) ఝురి, ప్రవాహము
సి) నదము, ప్రవాహము
డి) ఏరు, ఆపగ
జవాబు:
డి) ఏరు, ఆపగ
23. సముద్రము లోతుకు వెళ్ళుట ప్రమాదకరము. (బి)
ఎ) నది, ఆపగ
బి) జలనిధి, ఉదధి
సి) లంఘించి, కుప్పించి
డి) సూటీ, పోటీ
జవాబు:
బి) జలనిధి, ఉదధి
24. సముద్రమును మథించి అమృతం పొందారు. (బి)
ఎ) ఈది, దాటి
బి) చిలికి, త్రచ్చి
సి) జలము, ఉదకము
డి) ఝరి, ప్రవాహము
జవాబు:
బి) చిలికి, త్రచ్చి
25. గురువుల అడుగులకు మడుగులొత్తాలి. (ఎ)
ఎ) పదము, పాదము
బి) మాట, పలుకు
సి) ఆజ్ఞ, ఆన
డి) నడక, నడత
జవాబు:
ఎ) పదము, పాదము
26. సంపద చూసి గర్వించకు. (సి)
ఎ) డబ్బు, పొలము
బి) చేను, ఇల్ల
సి) ఐశ్వర్యము, విభూతి
డి) బంగారము, వెండి
జవాబు:
సి) ఐశ్వర్యము, విభూతి
27. దేనిని నాశనం చేయకూడదు. (డి)
ఎ) ఆది, అంతము
బి) మొదలు, చివర
సి) అంతము, అనంతము
డి) అంతము, క్షయము
జవాబు:
డి) అంతము, క్షయము
28. శ్రామికుడు లేనిదే ప్రగతి లేదు. (ఎ)
ఎ) శ్రమజీవి, కష్టజీవి
బి) కర్షకుడు, కార్మికుడు
సి) అధికారులు, అనధికారులు
డి) నాయకులు, నేతలు
జవాబు:
ఎ) శ్రమజీవి, కష్టజీవి
29. స్వర్ణముతో చేసిన నగలు మెరుస్తాయి. (బి)
ఎ) వజ్రము, వైడూర్యము
బి) బంగారము, పుత్తడి
సి) పుత్తడి, ఇత్తడి
డి) వెండి, రజితము
జవాబు:
బి) బంగారము, పుత్తడి
30. కలశముతో నీటిని తేవాలి. (డి)
ఎ) బిందె, గుండిగ
బి) అంభము, కుంభము
సి) కుంభకము, డంభము
డి) కుంభము, కుంభకము
జవాబు:
డి) కుంభము, కుంభకము
నానార్థాలు : గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
31. ఇల్లు శుభ్రముగా ఉండాలి. (ఎ)
ఎ) అభ్రకము, ప్రకాశించునది
బి) తళతళ, మిలమిల
సి) తెల్లగా, నల్లగా
డి) తెలుపు, ధవళ వర్గం
జవాబు:
ఎ) అభ్రకము, ప్రకాశించునది
32. మనసులో మాలిన్యం ఉండకూడదు. (సి)
ఎ) కుళ్లు, మురికి
బి) మురికి, మాలినత్వం
సి) మలినత్వం, బాధ
డి) బాధ, దుఃఖం
జవాబు:
సి) మలినత్వం, బాధ
33. అమృతం తాగితే తేజస్సు పెరుగుతుంది. (డి)
ఎ) వెయ్యి, ఘృతము
బి) తేనె, తీయనిది
సి) పాలు, క్షీరం
డి) సుధ, నెయ్యి
జవాబు:
డి) సుధ, నెయ్యి
34. కలశం రైతు ఇంట్లో ఉంటుంది. (బి)
ఎ) కుండ, కుంభం
బి) కుండ, కవ్వం
సి) ఎద్దు, కవ్వం
డి) పాలు, నేయి.
జవాబు:
బి) కుండ, కవ్వం
35. దేవతను నిందించకూడదు. (ఎ)
ఎ) దేవుడు, ప్రభువు
బి) దేవుడు, వేల్పు
సి) రాజు, రేడు
డి) రాజు, కింకరుడు
జవాబు:
ఎ) దేవుడు, ప్రభువు
36. ఖండము గురించి పోట్లాడకు. (సి)
ఎ) తునుక, ముక్క
బి) ముక్క, సగం
సి) తునుక, ఒక భాగం
డి) భాగం, వంతు
జవాబు:
సి) తునుక, ఒక భాగం
37. మంచి విగ్రహం చూశాను. (డి)
ఎ) బొమ్మ, చిత్రం
బి) చిత్రం, చిత్తరువు
సి) దేహం, కాయం
డి) బొమ్మ, శరీరం
జవాబు:
డి) బొమ్మ, శరీరం
38. ఆకాశంలో నక్షత్రములు చూడు. (బి)
ఎ) చుక్క, తార
బి) చుక్క, నశింపనివి
సి) చుక్క, బిందువు
డి) క్షయము, తార
జవాబు:
బి) చుక్క, నశింపనివి
39. జంతువును వేటాడడం తప్పు. (సి)
ఎ) మృగము, పసరము
బి) పశువు, జింక
సి) మృగము, ప్రాణి
డి) ప్రాణి, జీవి
జవాబు:
సి) మృగము, ప్రాణి
40. లోకమును దేవుడు రక్షించును. (డి)
ఎ) దేవత, దైవం
బి) ప్రభువు, రాజు
సి) పాలకుడు, రాజు
డి) దేవత, ఈశ్వరుడు
జవాబు:
డి) దేవత, ఈశ్వరుడు
41. వాయువు కూడా ప్రమాదం తెస్తుంది. (ఎ)
ఎ) గాలి, వాతరోగం
బి) రోగం, జబ్బు
సి) గాలి, పవనం
డి) ఆయువు, ప్రాణం
జవాబు:
ఎ) గాలి, వాతరోగం
42. నులిని ఒకసారి గమనించండి. (సి)
ఎ) పురుగు, చెద
బి) పాము, సర్పం
సి) అల్పం, మెలికలు గలది
డి) వెచ్చని, వేడి
జవాబు:
సి) అల్పం, మెలికలు గలది
43. ఎప్పటికైనా స్వర్ణం విలువైనది. (బి)
ఎ) బంగారం, పసిడి
బి) బంగారం, ఎర్ర టెంకాయ చెట్టు
సి) చెట్టు, బంగారం
డి) సంపద, సిరి
జవాబు:
బి) బంగారం, ఎర్ర టెంకాయ చెట్టు
44. నాశనము మంచిది కాదు.
ఎ) నశింపచేయుట, కనబడకుండా చేయుట
బి) క్షయం, నాశనము
సి) కాల్చుట, దహనం
డి) వేడి, ఉష్ణం
జవాబు:
ఎ) నశింపచేయుట, కనబడకుండా చేయుట
45. సముద్రం ఈదడం గగనం. (బి)
ఎ) ఆకాశం, నింగి
బి) ఆకాశం, దుర్లభం
సి) కష్టం, బాధ
డి) దుఃఖం, బాధ
జవాబు:
బి) ఆకాశం, దుర్లభం
46. భూమి అందరిదీ. (డి)
ఎ) నేల, పుడమి
బి) జగతి, ప్రపంచం
సి) ప్రజలు, జనం
డి) నేల, ప్రపంచం
జవాబు:
డి) నేల, ప్రపంచం
ప్రకృతి – వికృతులు : గీతగీసిన ప్రకృతి పదానికి వికృతిని – వికృతి పదానికి ప్రకృతిని గుర్తించండి.
47. ఆయుధములు యుద్ధంలో వాడతారు. (సి)
ఎ) ఆయతము
బి) అయితము
సి) ఆయుదము
డి) ఆదం
జవాబు:
సి) ఆయుదము
48. మోసం చేయడానికి సిగ్గు పడాలి. (ఎ)
ఎ) స్వకుచ్
బి) స్వర్
సి) లజ్జ
డి) బిడియం
జవాబు:
ఎ) స్వకుచ్
49. మా మిత్ర బృందము పెళ్లికి వెళ్లాం – గీతగీసిన పదానికి వికృతిని గుర్తించండి. (బి)
ఎ) బందము
బి) పిఁడు
సి) విడెము
డి) వీడెము
జవాబు:
బి) పిఁడు
50. డమారము ధ్వని బాగుంది – గీతగీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి. (ఎ)
ఎ) డమరుకం
బి) డక్కి
సి) డప్పు
డి) డిక్కీ
జవాబు:
ఎ) డమరుకం
51. మనకు సంపద నిచ్చేది అటవి – గీతగీసిన పదానికి వికృతిని గుర్తించండి. (డి)
ఎ) అరణ్యం
బి) విపినం
సి) కాన
డి) అడవి
జవాబు:
డి) అడవి
వ్యుత్పత్త్యర్థాలు : గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
52. ఆకాశం – వ్యత్పత్యర్థం గుర్తించండి.
ఎ) దీనియంతటను సూర్యాదులు ప్రకాశించును
బి) పక్షులు సంచరించును
సి) విమానాలు తిరుగును
డి) నక్షత్రాలుందును
జవాబు:
ఎ) దీనియంతటను సూర్యాదులు ప్రకాశించును
53. ఉదకము వలన పుట్టినది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (సి)
ఎ) పుడమి
బి) పృథ్వి
సి) భూమి
డి) ఇల
జవాబు:
సి) భూమి
54. దమ అనెడు శబ్ధం పలుకునది – వ్యుత్పత్తి అర్థం గుర్తించండి. (బి)
ఎ) డమారం
బి) డమరుకం
సి) డక్కి
డి) డప్పు
జవాబు:
బి) డమరుకం
55. వాయువు చల్లగా ఉన్నది – వ్యుత్పత్యర్థం గుర్తించండి. (డి)
ఎ) చల్లనిది
బి) వీచేది
సి) వేసేది
డి) విసరెడువాడు
జవాబు:
డి) విసరెడువాడు
56. దీనిచేత యుద్ధం చేస్తారు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) ఆయుధం
బి) కత్తి
సి) బాణం
డి) గద
జవాబు:
ఎ) ఆయుధం
57. నీ లిపి బాగుండాలి – వ్యుత్పత్యర్థం గుర్తించండి. (డి)
ఎ) వ్రాత
బి) రాత
సి) రాయబడేది
డి) దీని చేత పత్రము పూయబడును
జవాబు:
డి) దీని చేత పత్రము పూయబడును
58. క్రీడించువాడు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) బాలుడు
బి) దేవ
సి) బాలిక
డి) ఆటగాడు
జవాబు:
బి) దేవ
59. అమృతమును దేవతలు త్రాగుతారు – గీతగీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి. (ఎ)
ఎ) మరణము నీయనిది
బి) మరణించేది
సి) దేవతలు త్రాగేది
డి) తెల్లనిది
జవాబు:
ఎ) మరణము నీయనిది
60. నశించనిది వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) చంద్రుడు
బి) సూర్యుడు
సి) ఆకాశం
డి) నక్షత్రం
జవాబు:
డి) నక్షత్రం
61. స్వర్ణము ధరించాలి – వ్యుత్పత్యర్థం గుర్తించండి. (సి)
ఎ) ఖరీదైనది
బి) విలువైనది
సి) మంచి వన్నె కలది
డి) గౌరవం పెంచేది
జవాబు:
సి) మంచి వన్నె కలది
వ్యాకరణాంశాలు
సంధులు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
62. సంగీతంలో రాగాలు తీస్తారు – సంధి విడదీసిన రూపం గుర్తించండి. (సి)
ఎ) రాగా + లు
బి) రాగం + లు
సి) రాగము + లు
డి) రాగ + ములు
జవాబు:
సి) రాగము + లు
63. స + ఉదరుడు – సంధి కలిసిన రూపం గుర్తించండి. (ఎ)
ఎ) సోదరుడు
బి) సోదరి
సి) సూదరుడు
డి) సుందరుడు
జవాబు:
ఎ) సోదరుడు
64. రాజ్యాలు ప్రశాంతంగా ఉండాలి – సంధిపేరు గుర్తించండి. (బి)
ఎ) సవర్ణదీర్ఘసంధి
బి) లు, ల, న, ల సంధి
సి) అత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) లు, ల, న, ల సంధి
65. లు, ల, న ల సంధికి ఉదాహరణ గుర్తించండి. (సి)
ఎ) వజ్రాయుధము
బి) రాజోత్తముడు
సి) ఆయుధాలు
డి) పాఠం
జవాబు:
సి) ఆయుధాలు
66. పంచామృతాలు – ఇది ఏ సంధి గుర్తించండి. (డి)
ఎ) సవర్ణదీర్ఘసంధి
బి) లు, ల, న ల సంధి
సి) అత్వసంధి .
డి) సవర్ణదీర్ఘ లు,ల,న,ల సంధులు
జవాబు:
డి) సవర్ణదీర్ఘ లు,ల,న,ల సంధులు
67. నక్షత్రాలు – సంధి విడదీయండి. (బి)
ఎ) నక్షత్రం + లు
బి) నక్షత్రము + లు
సి) నక్షత్ర + ములు
డి) ఇది సంధి పదం కాదు
జవాబు:
బి) నక్షత్రము + లు
68. అమృత + అభిషేకము – సంధి కలపండి. (ఎ)
ఎ) అమృతాభిషేకము
బి) అమృత్యభిషేకము
సి) అమృతభిషేకము
డి) అమృతమభిషేకము
జవాబు:
ఎ) అమృతాభిషేకము
69. విగ్రహాలు – సంధి విడదీసిన రూపం గుర్తించండి. (ఎ)
ఎ) విగ్రహము + లు
బి) విగ్రహా + లు
సి) విగ్రహం + లు
డి) విగ్రహ + ములు
జవాబు:
ఎ) విగ్రహము + లు
70. ఉత్వసంధికి ఉదాహరణ గుర్తించండి. (డి)
ఎ) సోదరా
బి) సోదర
సి) రాజ్యము
డి) రాజ్యమున్నది
జవాబు:
డి) రాజ్యమున్నది
71. ఏడు ఖండాలు ఉన్నాయి – సంధిపేరు గుర్తించండి. (సి)
ఎ) సవర్ణదీర్ఘసంధి
బి) అత్వసంధి
సి) లు, ల, న, ల సంధి
డి) గుణసంధి
జవాబు:
సి) లు, ల, న, ల సంధి
సమాసాలు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
72. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ గుర్తించండి. (ఎ)
ఎ) నులివెచ్చని
బి) సాధారణ
సి) అసాధారణం
డి) సుఖదుఃఖాలు
జవాబు:
ఎ) నులివెచ్చని
73. కన్నీళ్లు – ఏ సమాసమో గుర్తించండి. (డి)
ఎ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
బి) షష్ఠీ తత్పురుష సమాసం
సి) బహువ్రీహి సమాసం
డి) సప్తమీ తత్పురుష సమాసం
జవాబు:
డి) సప్తమీ తత్పురుష సమాసం
74. పంచామృతాలు – సమాసం పేరు గుర్తించండి. (ఎ)
ఎ) ద్విగుసమాసం
బి) బహువ్రీహి సమాసం
సి) తత్పురుష సమాసం
డి) ద్వంద్వ సమాసం
జవాబు:
ఎ) ద్విగుసమాసం
75. శ్రామికరాజ్యం – విగ్రహవాక్యం గుర్తించండి. (సి)
ఎ) శ్రామికుల చేత రాజ్యం
బి) శ్రామికుల వలన రాజ్యం
సి) శ్రామికుల యొక్క రాజ్యం
డి) శ్రామికుల కొరకు రాజ్యం
జవాబు:
సి) శ్రామికుల యొక్క రాజ్యం
76. వాయువు యొక్క రాగాలు ఏ సమాసమో గుర్తించండి. (బి)
ఎ) తృతీయా తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) చతుర్థీ తత్పురుష
డి) నజ్ తత్పురుష
జవాబు:
బి) షష్ఠీ తత్పురుష
77. స్వర్ణ కలశము – విగ్రహవాక్యం గుర్తించండి. (సి)
ఎ) స్వర్ణము యొక్క కలశము
బి) స్వర్ణము వలన కలశము
సి) స్వర్ణము చేత కలశము
డి) స్వర్ణము నందు కలశము
జవాబు:
సి) స్వర్ణము చేత కలశము
78. చిరుమాలిన్యం – సమాసం పేరు గుర్తించండి. (డి)
ఎ) షష్ఠీ తత్పురుష సమాసం
బి) సప్తమీ తత్పురుష సమాసం
సి) బహువ్రీహి సమాసం
డి) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
డి) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
79. బృందము యొక్క గానము సమాస పదం గుర్తించండి. (బి)
ఎ) గానబృందం
బి) బృందగానం
సి) బృందం గానం
డి) గానం బృందం
జవాబు:
బి) బృందగానం
80. క్రింది వానిలో షష్ఠీ తత్పురుష సమాస పదం గుర్తించండి. (ఎ)
ఎ) డమరుక లయ
బి) వనవాసం
సి) జలపాతం
డి) భారతదేశం
జవాబు:
ఎ) డమరుక లయ
81. మనిషి మాలిన్యం – విగ్రహవాక్యం గుర్తించండి. (బి)
ఎ) మనిషి చేత మాలిన్యం
బి) మనిషి యొక్క మాలిన్యం
సి) మనిషి చేత మాలిన్యం
డి) మాలిన్యమైన మనిషి
జవాబు:
బి) మనిషి యొక్క మాలిన్యం
ఛందస్సు కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
82. నేర్పరి ఇది ఏ గణమో గుర్తించండి.
ఎ) జ గణం
బి) స గణం
సి) భ గణం
డి) ర గణం
జవాబు:
సి) భ గణం
83. క్రింది వానిలో ‘గల’ గణం గుర్తించండి. (ఎ)
ఎ) భవ్య
బి) నవ్యం
సి) నవ
డి) కావ్యం
జవాబు:
ఎ) భవ్య
84. గంగమ్మ – ఇది ఏ గణమో గుర్తించండి. ( బి )
ఎ) జ గణం
బి) మ గణం
సి) ర గణం
డి) న గణం
జవాబు:
బి) మ గణం
85. మూడు లఘువులు గల గణం పేరు గుర్తించండి. (డి)
ఎ) ర గణం
బి) జ గణం
సి) మ గణం
డి) న గణం
జవాబు:
డి) న గణం
86. జగమ్ము – గణం పేరు గుర్తించండి.
ఎ) ర గణం
బి) జ గణం
సి) స గణం
డి) న గణం
జవాబు:
బి) జ గణం
వాక్య రకాలు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
87. క్రింది వానిలో ఆశ్చర్యార్థక వాక్యం గుర్తించండి. (ఎ)
ఎ) ఆహా! ఎంత బాగుంది.
బి) బాగుందా!
సి) బాగుందో! లేదో!
డి) బాగుంటుంది.
జవాబు:
ఎ) ఆహా! ఎంత బాగుంది.
88. రేపు బడి ఉంటుందో! ఉండదో! – ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (సి)
ఎ) అనుమత్యర్ధకం
బి) అప్యర్థకం
సి) సందేహార్ధకం
డి) విధ్యర్థకం
జవాబు:
సి) సందేహార్ధకం
89. రేపు రావద్దు – వాక్యపు రకం గుర్తించండి. (బి)
ఎ) విధ్యర్థకం
బి) నిషేధార్థకం
సి) అప్యర్థకం
డి) సంశ్లిష్టం
జవాబు:
బి) నిషేధార్థకం
90. టి.వి. చూస్తూ అన్నం తింటున్నాడు వాక్యపు రకం గుర్తించండి. (డి)
ఎ) సంయుక్తం
బి) సామాన్యం
సి) క్త్వార్థం
డి) సంశ్లిష్టం
జవాబు:
డి) సంశ్లిష్టం
91. సినిమా చూడండి – వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి. (ఎ)
ఎ) సినిమా చూడకండి
బి) సినిమా చూడలేదు
సి) సినిమా చూడరు
డి) సినిమా చూడలేరు
జవాబు:
ఎ) సినిమా చూడకండి
Previous Bits
1. ఆకాశంలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవరైనా లెక్క పెట్టగలరా? గీత గీసిన పదానికి పర్యాయపదం (CBA-2:2023-24) (FA-3:2022-23)(ఎ)
ఎ) గగనం
బి) ధరణి
సి) ప్లవంగం
డి) గహనం
జవాబు:
ఎ) గగనం
2. ‘నగర వీధులు’ అనే సమాస పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి. (FA-3:2022-23)(CBA 2:2023-24) (ఎ)
ఎ) నగరమందలి వీధులు
బి) నగరం చేత వీధులు
సి) నగరం గూర్చి వీధులు
డి) నగరం వలన వీధులు
జవాబు:
ఎ) నగరమందలి వీధులు
3. కింది వాక్యాలలో “నిషేధార్థక వాక్యం” ను గుర్తించండి. (FA-3:2022-23)(డి)
ఎ) సీతమ్మ తల్లి అడవులకి వెళ్ళిందా?
బి) మీరు లోపలికి రావచ్చు.
సి) ఇది ఎంత యాదృచ్ఛికం
డి) మీరు ఈ ఫలహారాన్ని తినొద్దు
జవాబు:
డి) మీరు ఈ ఫలహారాన్ని తినొద్దు
4. కింది వాటిలో చేదర్థక వాక్యం ఏమిటి?(FA-3:2022-28) (సి)
ఎ) గంగన్న కుటుంబం వలస వెళ్లి, జీవితాన్ని గడిపింది.
బి) గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడ్డాడు.
సి) వానలు కురిస్తే పంటలు పండుతాయి.
డి) రమ్య అన్నం తిని, బడికి వెళ్ళింది.
జవాబు:
సి) వానలు కురిస్తే పంటలు పండుతాయి.
5. క్రింది వాక్యంలో గీతగీసిన పదమునకు సరైన పద విచ్ఛేదనను గుర్తించండి. (SA-2:2022-23) (బి)
మా ఊరి పక్కన చిన్న చిట్టడవి కలుదు.
ఎ) చిన్న + అడవి
బి) చిఱు + అడవి
సి) చిట్టి + అడవి
డి) చిట్ట + అడవి
జవాబు:
బి) చిఱు + అడవి
6. సరైన జవాబు గుర్తించండి. (SA-2 2022-23) (ఎ)
“ఇక్కడ బావి త్రవ్వడం వలన దారివెంట వెళ్లే ప్రయాణికులు, యాత్రికులు నీరు త్రాగవచ్చు. మరియు చెరకు పంటలను కూడా పండించుకోవచ్చును.”
ఈ వాక్యాన్ని చదివేటప్పుడు ఏ సామెత దృష్టికి వస్తుంది?
ఎ) ఒకే దెబ్బకు రెండు పిట్టలు
బి) ఒకే ఒరలో రెండు కత్తులు కలవు
సి) ముందు నుయ్యి వెనుక గొయ్యి
డి) తనకోసం గొయ్యి త్రవ్వుకోవడం
జవాబు:
ఎ) ఒకే దెబ్బకు రెండు పిట్టలు
7. ఈ క్రింది వాక్యం చదివి అది ఏ అలంకారానికి చెందినదో రాయండి. (SA-2:2022-23) (బి)
రాళ్ళను మలచి ఆయుధాలుగా చెక్కుకున్నాం.
జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం.
ఎ) వృత్త్యానుప్రాస అలంకారం
బి) అంత్యానుప్రాస అలంకారం
సి) లాటానుప్రాస అలంకారం
డి) స్వభావోక్తి అలంకారం
జవాబు:
బి) అంత్యానుప్రాస అలంకారం
8. కింది వాక్యంలో గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. (CBA-2:2023-24) (బి)
మానవ మనుగడకు గృహము ఒక కనీసం అవసరం.
ఎ) గుహ
బి) గీము
సి) ఇల్లు
డి) సదనము
జవాబు:
బి) గీము
9. కింది కవితను చదివి అందులోని అలంకారాన్ని గుర్తించండి. (SA-2;CBA-2:2023-24) (ఎ)
భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామకథయే రక్తి
ఎ) అంత్యానుప్రాసాలంకారము
సి) ఉపమాలంకారము
బి) వృత్త్యనుప్రాసాలంకారము
డి) అతిశయోక్తి అలంకారము
జవాబు:
ఎ) అంత్యానుప్రాసాలంకారము
10. నింగి పదానికి అర్థాలు రాసి వాటితో సొంతవాక్యాలు రాయండి. (CBA-2:2023-24)
జవాబు:
నింగి = ఆకాశం
సొంతవాక్యం : ఆకాశంలో నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి.
11. సాగరం పదానికి అర్థాలు రాసి వాటితో సొంతవాక్యాలు రాయండి. (CBA-2:2023-24)
జవాబు:
సాగరం = సముద్రం
సొంతవాక్యం : సముద్రంలో అలలు ఒడ్డుకు ఎగిసిపడుతుంటాయి.