AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

These AP 8th Class Telugu Important Questions 6th Lesson పయనం will help students prepare well for the exams.

పయనం AP Board 8th Class Telugu 6th Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు – ప్రశ్నలు

అ) కింది పరిచిత గద్యాలు చదివి, నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.

1. “ఎంత బావుందో” అంది వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ, ఆమె కళ్లకు ఇలాంటి పచ్చటి దృశ్యం కన్పించి ఎంత కాలమయిందో! “నడిచినట్టే లేదు” అంది నరసమ్మ ఆ పొలాలను కళ్లనిండా నింపుకుంటూ! వాళ్ళకు మనసుల్లో తమ ఊరూ, బీడుపడ్డ ఎర్రటి పొలాలు, మెదలుతున్నాయి. “మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే, ఇంత దూరం వచ్చే పని ఏముంది?” అన్నాడు నారాయణ ముందు నడుస్తున్న తండ్రిని ఉద్దేశించి, గంగన్నకు ఒక్క క్షణం తమ ఊరి దృశ్యాలు కళ్లముందు కదిలినాయి. ఊరి చుట్టూ భగ్గుమని మండుతున్న ఎర్రటి నేలలు, గడ్డిమొక్క కూడా ” కన్పించని ఆ చేన్లు, నిస్సారమై నిర్జీవమై నీటి చుక్క కోసం నోరు తెరచినట్టుండే భూములు అన్ని కళ్లముందు కదిలి తన కొడుకు వైపు అర్థమైందన్నట్లు చూశాడు గంగన్న. “కాని కాలం వస్తే ఇంతే నాయనా!” అంటూ తన జేబును చేతితో తడిమి చూసుకున్నాడు. అతని జేబులో తమ ఊరి వెంకటస్వామి రాసి యిచ్చిన జాబు ఉంది.

ప్రశ్నలు:

1. పై పేరాలో ఉన్న వ్యక్తుల పేర్లు ఏమిటి?
2.“కానికాలం వస్తే ఇంతే నాయనా!” అన్న ఈ మాటలు ఎవరివి?
3. చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతున్నదెవరు?
4. జాబు ఎవరు రాసి ఇచ్చారు?

AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

2. రామప్ప “చూడు గంగన్నా! నువ్వు మరీ సిగ్గుపడుతూ నా ముందు నిలబదొద్దు. నా మాదిరి నువ్వూ రైతునే, నీ సంగతంతా మా వెంకట స్వామి వివరంగా రాసినాడు. మీ ప్రాంత కరువు పరిస్థితులు ఇక్కడ అందరికీ తెలుసు. మీ ప్రాంతం నుండి వలసలు వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల దండిగా ఉన్నారు. నువ్వేమీ సంకోచపడవద్దు. మీరంతా మీ సొంత ఇంటిలో మాదిరిగా ఇక్కడ ఉండిపోండి అని చెప్పినాడు. మీకు కావాల్సిన సంబరాలన్నీ అడిగి తీసుకోండి. ఇక్కడ కూడ మీరు రైతుల్లాగే బతకండి. మనందరిదీ రైతు వంశం. మనల్ని మనమే కాపాడుకోవాలి. మీరిక్కడున్నంత కాలము ఇక్కడి రేటుకంటే ఎక్కువగానే మీకు ఫలితం ఇస్తాను. మీ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడగానే మీరు వెళ్ళవచ్చు….” అని చెప్పినాడు.

ప్రశ్నలు:

1. “నా మాదిరి నువ్వూ రైతువే” ఈ మాటలు ఎవరివి?
2. ఎవరి సంగతి వివరంగా రాయబడింది?
3. “మీరు రైతుల్లాగే బతకండి” అంటే అర్ధం ఏమిటి?
4. ‘దండిగా’ అంటే అర్థం ఏమిటి?

అపరిచిత గద్యాలు – ప్రశ్నలు.

1. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

నిరుద్యోగ సమస్య నిజమునకు నిరక్షరాస్యుల వలన నేర్పడినది కాదు. విద్యావంతుల విషయముననే ఇది తీరని సమస్యగా పరిణమించినది. ఈ విద్యావంతులు కుర్చీలలో కూర్చుండి గుమాస్తా పని చేయుటకే కుతూహలపడుచున్నారు. చదివిన చదువు కూడ అందుకే ఉపకరించుచున్నది. కావున మన విద్యావిధానము కొంత మారవలయును. విద్యావంతులు వృత్తి విద్యల సభ్యసించుట మేలు. ప్రభుత్వమువారి ప్రోత్సాహముతో వారు కుటీర పరిశ్రమలను నెలకొల్పుటయే ఈ సమస్యకు తగిన పరిష్కారము, వృత్తి విద్యల నభ్యసించినవారికి ప్రభుత్వమువారి తోడ్పాటు తప్పక లభించి తీరును.

ప్రశ్నలు:

1. నిరుద్యోగ సమస్య ఎవరి వలన ఏర్పడినది?
2. చదివిన చదువు ఎందుకుపయోగపడుచున్నది?
3. నేటి విద్యావిధానములో ఎట్టి మార్పు రావలెను?
4. ప్రభుత్వమువారు ఎవరికి తోడ్పడుచున్నారు?

2. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

పరిణయవేళ పుట్టినింటి వారు ధూతాంబకు వెలలేని రత్నాల హారమును బహుకరించిరి. దానిని ఆమె వ్రతదానమను నెపమున మైత్రేయునకిచ్చెను. తన భర్తకే దానిని అతడిచ్చుననియు, పోయిన సువర్ణభాండమునకు బదులు దానికంటె పదిమడుంగులు ఎక్కువ వెలగల తన రత్నాల హారమును తన భర్త వసంతసేనకు పంపుననియు ధూతాంబ తలచెను. తాను స్వయముగనే తన భర్తకిచ్చుచో అది స్త్రీ ధనమని యెంచి అతడు గ్రహించకపోవచ్చును. కావున ఆమె మైత్రేయుని ద్వారా దానిని పంపుటకు ఉపాయమును పన్నెను.

సుగుణవతియగు ధూతాంబ యొక్క పవిత్రాశయము నెరింగిన మైత్రేయు డాహారమును తీసికొనిపోయి చారుదత్తునకిచ్చెను. అనుకూలవతియగు భార్య వల్ల భర్త యొక్క కీర్తి ప్రతిష్ఠలు అభివృద్ధి నొందునని పల్కి అతడు తనకు స్త్రీ విత్తమునకు ఆశపడవలసిన దుర్గతి పట్టెనని మిక్కిలి సిగ్గుచెందెను.

ప్రశ్నలు:

1. ధూతాంబ ఎవరికేమి ఇచ్చెను?
2. ధూతాంబ భర్త పేరేమి?
3. తన భర్త దేనికి బదులు ఏమి ఇచ్చునని ధూతాంబ తలచెను?
4. తాను స్వయముగా ఇచ్చుటకు ధూతాంబ ఏల సంశయించెను?

3. కింది పేరా ఆధారంగా కింది వాక్యములు సరైనవో కాదో (✓), (✗) గుర్తుల ద్వారా గుర్తించండి.

ముందుగా వ్యక్తి బాగుపడవలెను. ఆ వెనుక సంఘము బాగుండును. ముందుగా సంఘమును సంస్కరించవలెననుట వెట్టిమాట మాటలో, చేతలో, తుదకు భావనలో సంస్కారముట్టిపడవలెను. అట్టి వ్యక్తులు పెక్కుమంది ఉన్నచో తనంతట తానే సంఘము ఉద్ధరింపబడును. వ్యక్తిని, తుదకు జాతిని తీర్చిదిద్దుకునే ఈ సంస్కారములు వాని ప్రణాళికను గమనించినచో తన పొట్టకు శ్రీరామరక్ష అమరీతిలో ఉండక వ్యక్తి శ్రేయస్సు, సమాజ కళ్యాణము పరస్పరము ముడిపడియున్నవని విడివిడిగా లేవని తెలియచేయును. ఉదాహరణకు ప్రతి గృహస్థు విధిగా చేయవలసిన పంచమహాయజ్ఞములను చూడుడు. దేవయజ్ఞము నందు దేవతలను, ఋషి యజ్ఞమునందు ఋషులను, వారందించిన విజ్ఞానమును, పితృ యజ్ఞము నందు పితృదేవతలను కొలుచుచున్నాడు కదా! భూత యజ్ఞము నందు కుక్కలకు, కాకులకు బలివేయుచున్నాడు కదా! పొరుగువానిని ప్రేమింపమని ఇతర మతములన్నచో, పొరుగు ప్రాణిని కూడా ప్రేమింపమని ఈ సనాతన ధర్మము చాటుచున్నది. తనకుతాను వండుకొని తినువాడు కేవలము పాపమునే తినుచున్నాడని వేదము భాషించుట లేదా ? ఇట్టి సూత్రములు సంస్కారములతో ముడివడియున్నవి.

ప్రశ్నలు:

1. వ్యక్తి బాగుపడినప్పుడే సంఘము బాగుపడుతుంది. (✓)
2. మాటలు, చేతలు, భావనలతో సంస్కారముట్టిపడదు. (✗)
3. ప్రతిగృహస్థు విధిగా పంచమహాయజ్ఞములను చేయవలెను. (✓)
4. పొరుగు వానిని ప్రేమించమని, పొరుగు ప్రాణిని ద్వేషించమని సనాతన ధర్మము చెప్పుచున్నది. (✗)

AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

4. కింది పేరా చదివి, ఖాళీలు పూరించండి.

వ్యవసాయ భూముల్ని ఎలా ఉపయోగించుకుంటామో, జీవనోపాధి కోసం వీడు భూముల్ని కూడా ఒక పద్దతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలూ ఉన్నాయి. గుజరాత్లో అముల్ ప్రయోగం మన రాష్ట్రంలోనూ చేయవచ్చు. వృత్తికులాల వాళ్ళు అనేక మంది పరిస్థితులను బట్టి వృత్తులు మార్చుకుంటారు. చిత్రమేమంటే పేదవాళ్ళు ఎప్పుడూ విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగరు. భూములు లీజుకు ఇస్తే పెత్తందారులకు, దళారులకు, కులపెద్దలకూ లాభం వస్తుంది. ఈ విషయంలో పేదలను చైతన్యపరచవలసిన ప్రభుత్వాలు కూడా చురుకైన పాత్ర నిర్వహించకపోవడం దురదృష్టకరం!

ఖాళీలు

1. బీడు భూములంటే …………
జవాబు:
పంటలు పండని భూములు

2. జీవనోపాధి కోసం రైతులు ఆధారపడేది………….
జవాబు:
వ్యవసాయంపై

3. విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగని వాళ్ళు…………
జవాబు:
పేదవాళ్ళు

4. దళారులు చేసేపని ………..
జవాబు:
భూములను లీజుకు తీసుకోవడం.

5. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతు మాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్ గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబనియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్ కు వలసవెళ్ళి 1916లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రిపై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణ పరిశోధనాశాలను నెలకొల్పారు.

ప్రశ్నలు:

1. కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ పేరేమి?
2. ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు?
3. మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళినది?
4. 1923లో సాంగర్ దేనిని నెలకొల్పినది?

6. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగసంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్క పెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుద్ధప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్హతాశుర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు. లేదు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే మనకు ముందు స్ఫురించేది బ్రౌనుకు నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి, 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణ అయింది. ఈ కృషిలో బ్రౌనుకు ఏనుగుల వీరాస్వామి సహాయం పొందాడు. వీరాస్వామి రచించిన కాశీయాత్ర గురించిన పుస్తకం చారిత్రక దృష్ట్యా విలువైనది.

ప్రశ్నలు:

1. తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం’ భావ్యం?
2. బ్రౌను సంపాదించిన పుస్తకాలను ఏమంటారు?
3. పండితులతో బ్రౌను చేయించిన పనులేమిటి?
4. నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది?

7. క్రింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ఆయన 6.4.1922న విశాఖపట్నం. జిల్లాలోని పద్మనాభం అనే గ్రామములో జన్మించారు. వారికి శాస్త్రములు, కావ్యములు, పురాణములు చదవటం చెప్పటం ఇష్టం. ఆయన పతంజలి మహాభాష్యములోని కొన్ని భాగాలను తెలుగులోకి అనువదించారు. ఆయన అనేక ఉపన్యాసాలు చెప్పారు. ప్రజలలో భక్తిని పెంచారు.

ప్రశ్నలు:

1. శ్రీ భాష్యం అప్పలాచార్యులవారు ఎక్కడ జన్మించారు?
జవాబు:
శ్రీ భాష్యం అప్పలాచార్యులవారు విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం అనే గ్రామంలో జన్మించారు.

2. శ్రీ భాష్యం అప్పలాచార్యులవారు ప్రజలలో దేనిని పెంచారు?
జవాబు:
శ్రీ భాష్యం అప్పలాచార్యులవారు ప్రజలలో భక్తిని పెంచారు.

3. ఆచార్యులవారు రచించినదేమిటి?
జవాబు:
ఆచార్యులవారు పతంజలి మహాభాష్యంలోని కొన్ని భాగాలను అనువదించారు.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పేరాలో ఎవరి గురించి చెప్పారు.

AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

8. ఇచ్చిన వ్యాసాన్ని చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

గురుజాడ ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క వంటివారు. తెలుగువారి మత్తు వదలగొట్టిన భావ విప్లవకారుడు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆయన అందించిన “కన్యాశుల్కం” నాటకము. ఆనాడు సామాజిక సమస్యలపై వచ్చిన నాటకములు లేవు. ఆ లోటును ‘కన్యాశుల్కం” పూరించింది. కన్యాశుల్కం నాటకం 1897లో ప్రచురించబడింది. అంతకుముందే 1892లో విజయనగరంలో ప్రదర్శింపబడింది. కొద్దిమార్పులతో రెండవ ముద్రణ పొందింది.

ఈనాటి వాళ్లకి కన్యాశుల్కం అంటే ఏమిటో కూడా తెలియదు. కొన్ని కుటుంబాలలో చిరుప్రాయములోనే అడపిల్లలని ముసలివారికిచ్చి పెళ్లిచేసేవారు. ఆ వివాహానికి వరుడు బాలికకు ధనాన్ని కట్నరూపములో ఇచ్చేవారు. ధనాశ వలన అభం – శుభం తెలియని చిన్నారి ఆడపిల్లలను తల్లిదండ్రులు ముసలివారికి కట్టబెట్టేవారు. కొంతకాలానికి వారు బాలవితంతువులుగా జీవితం వెళ్లబుచ్చేవారు. ఈనాడు కన్యాశుల్కం స్థానంలో వరకట్నం వచ్చింది.

ఏ నాటకానికైనా ఇతివృత్తానికైనా ప్రాణాలు పాత్రలే. ఈ నాటకంలో రామప్పంతులు వంటి దగాకోరులు, స్వార్థపరులు, గిరీశంలాంటి బడాయి కోరులూ, మాటకారులు, అగ్నిహోత్రావధాన్లులాంటి ధనాశాపరులు, సంస్కర్తలకు కూడా బుద్ధి చెప్పగల మధురవాణి వంటి సమయోచిత ప్రజ్ఞ గల స్త్రీ పాత్ర మనకు కన్పిస్తాయి. ఇంతటి వైవిధ్యం, సహజత్వం గల పాత్రల వల్ల నాటకం సజీవంగా నిలిచింది.

1. ఆనాటి సాంఘిక దురాచారం కన్యాశుల్కము అయితే ఈనాటి దురాచారం ఏదని ఈ గద్యములో ప్రస్తావించారు? (B)
A) లంచగొండితనం
B) వరకట్నము
C) శిశుహత్యలు
D) బాల్యవివాహాలు
జవాబు:
B) వరకట్నము

2. కన్యాశుల్కము నాటికలో మధురవాణిని ఏ విధముగా వర్ణించారు? (B)
A) నగరంలోనే అత్యంత ధనవంతురాలు
B) అత్యంత తెలివితేటలు గల స్త్రీ
C) మిక్కిలి అమాయకురాలైన స్త్రీ
D) విజయనగర రాజవంశపు రాణి
జవాబు:
B) అత్యంత తెలివితేటలు గల స్త్రీ

3. గురజాడ వారు ‘కన్యాశుల్కము నాటకము’ను వాడుక భాషలో రచించుటకు గల ముఖ్య కారణము ఏమిటి? (C)
A) ప్రజల కోరికపైన వారు తేలిక భాషలో రచన చేశారు.
B) వాడుక భాషలో రచన చేయుట గురజాడవారికి సులభము మరియు ప్రియము.
C) నాటకము ప్రజల మనస్సుకు హత్తుకుపోయి దురాచారమును రూపుమాపుతారని.
D) రాజకీయముగా అన్ని వర్గాల వారికీ దగ్గరగా ఉండాలనీ, రాజకీయంగా ఎదగాలని.
జవాబు:
C) నాటకము ప్రజల మనస్సుకు హత్తుకుపోయి దురాచారమును రూపుమాపుతారని.

4. ‘గురజాడ తెలుగువారి మత్తు వదలగొట్టిన భావవిప్లవకారుడు’ అని ఎలా చెప్పగలం? (B)
A) తెలుగువాడు గర్వించదగ్గ కన్యాశుల్కం అనే నాటకం రాసినందున
B) తెలుగు సమాజంలోని కన్యాశుల్కం దురాచారం గురించి రాయడం వలన
C) సమాజంలో సారా మత్తులో ఉన్నవారిని తన రచనలో ప్రస్తావించినందువలన
D) 1897 సంవత్సరంలోనే తెలుగులో మొట్టమొదటి సాంఘిక నాటకం రాయడం వలన
జవాబు:
B) తెలుగు సమాజంలోని కన్యాశుల్కం దురాచారం గురించి రాయడం వలన

9. కింది పేరాను చదివి అర్థవంతమైన 4 ప్రశ్నలు తయారు చేయండి.

మామిడిపండు మన జాతీయ ఫలము. మన దేశం ప్రతి సంవత్సరం 13 మిలియన్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1365 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు. వీటిలో కనీసము 1000 రకాలు భారతదేశంలోనే కనిపిస్తాయి. ప్రాచీన ప్రసిద్ధ కవి కాళిదాసు కూడా మామిడిని తమ కవితలలో ప్రశంసించారు. అక్బర్ చక్రవర్తి కూడా మామిడిపండ్లను చాలా ఇష్టపడేవారు. అంతేకాక ఆయన తన రాజ్యంలో విరివిగా మామిడి చెట్లను నాటాలని ఆదేశించాడు.

1. మన జాతీయ పండు ఏది?
2. మన దేశంలో ప్రతియేట ఎన్ని టన్నుల మామిడిపండ్లు ఉత్పత్తి అవుతాయి?
3. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల మామిడిపండ్లు పండిస్తున్నారు?
4. ఏ చక్రవర్తికి మామిడిపండ్లంటే ఇష్టం?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో జీవాబులు రాయండి.

ప్రశ్న 1.
గంగన్న కుటుంబం ఎందుకు వలస వెళ్ళవలసి వచ్చింది?
జవాబు:
గంగన్న కుటుంబం పాపం పల్లెలో ఒక మంచి రైతు కుటుంబం. సుమారు 12 ఎకరాల భూమి, పాడిపంట సమృద్ధిగా కల కుటుంబం కానీ రెండేళ్ళపాటు వానలు కురవకపోవటంతో పరిస్థితి తలక్రిందులయ్యింది. ఐదారు సంవత్సరాలయ్యే సరికి పూట గడవటమే కష్టమయ్యింది. పంటచేలన్నీ బీడువారి పోయాయి. వారి గ్రామంలోని పెద్ద రైతు వెంకటస్వామి గారి సలహాతో పనుల కోసం గ్రామం విడిచి వలస వెళ్ళిపోయారు.

ప్రశ్న 2.
గంగన్న కుటుంబం ప్రయాణమైన విధానం వ్రాయండి.
జవాబు:
గంగన్న కుటుంబం అంటే అతని భార్య, కొడుకు, కోడలు, ఆరునెలల మనుమడు. వారంతా పనికోసం కర్ణాటకలో బళ్ళారి దగ్గర ఉన్న కంపిలి కొట్టాలకు ప్రయాణమయ్యారు. వాళ్ళు బస్సు దిగి నడుస్తున్నారు. గంగన్న తలపై పాత ట్రంకు పెట్టె ఉంది. అతని భార్య బట్టల మూట పట్టుకుంది. కొడుకు ఒక సంచీ పట్టుకున్నాడు. కోడలు ఆరునెలల పసికందును ఎత్తుకుంది.

ప్రశ్న 3.
కంపిలి కొట్టాలలో గంగన్న కుటుంబం పరిస్థితి ఎలా ఉంది?
జవాబు:
కంపిలి కొట్టాలలో రామన్న కుటుంబానిది ఆ ఊరు కాదని జనం గ్రహించారు. ఏ ఊరని ప్రశ్నించారు. ఎవరింటికని అడిగారు. చాలామంది ఆ కుటుంబాన్ని ఎగాదిగా చూసారు. కరువు ప్రాంతం నుంచి వచ్చిన వారని జాలిగా చూసారు. వారి మాటలు, చూపులు గంగన్న కుటుంబాన్ని కొంత ఇబ్బంది పెట్టాయి. రామప్పగారు తప్పక పని చూపిస్తారనే ఆశ వారిలో ధైర్యాన్ని నింపింది.

AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

ఆ) క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రామప్పగారు, ఆయన ఇంటి గురించి వ్రాయండి.
జవాబు:
రామప్పగారు 60 సంవత్సరాల మనిషి చాలా మంచివాడు. కరువు ప్రాంతం నుండి వచ్చిన వారికి ఆశ్రయం కల్పిస్తాడు. పనులు చూపిస్తాడు. ఆయన భూస్వామి, గర్వం లేదు, పొట్టిగా ఉంటాడు. ముతక బనీను, ముతక పందె ధరిస్తాడు. అతి సామాన్యునిలా ఉంటాడు,
వారిది రెండతస్తుల భవనం. భవనం చుట్టూ ప్రహరీ గోడ, దానికి పెద్ద ఇనుపగేటు, లోపల విశాలమైన భవనం, పెద్ద పెద్ద గడ్డివాములున్నాయి. రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. నౌకర్లు ఉన్నారు.

ప్రశ్న 2.
వెంకట స్వామి గారి గురించి వ్రాయండి.
జవాబు:
వెంకట స్వామి గారు పాపం పల్లెలో పెద్ద రైతు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరూ పెద్ద ఉద్యోగులే. పట్టణంలో వ్యాపారాలు, భవనాలు ఉన్నాయి. సహాయం చేసే స్వభావం కలవారు, డబ్బులేని వారికి వేంకట స్వామి గారు ధన సహాయం చేస్తారు.
ఆయనే గంగన్నకు సలహా ఇచ్చారు. కాగితం రాసి ఇచ్చారు. తన బంధువుల ఇంటికి కర్ణాటకకు పంపారు. ఆ కుటుంబాన్ని ఆదుకొన్నారు. వారికి దారి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చారు.

ప్రశ్న 3.
పన్నెండెకరాల రైతు కదా గంగన్న, వారి కుటుంబం కూలి పనికోసం వలస వెళ్లడం తగినదేనా? వివరించండి.
జవాబు:
పన్నెండెకరాలు భూమి కలవాడంటే భూస్వామి. కానీ పంటలు పండడం లేదు. వానలు లేక పంటలు లేవు. బోర్లు కూడా పనిచేయడం లేదు. ఇంట్లో ఆరుగురు తినాలి. అవసరాలు గడవాలి. అక్కడికీ పశువులను అమ్మేశాడు. ఐనా పరిస్థితి బాగుపడలేదు. అప్పుడు కూడా అక్కడే ఉంటే, ఏటా రెండెకరాలు అమ్మనిదే రోజులు వెళ్లవు. తర్వాత వర్షాలు పడినా భూమి ఉండదు. దరిద్రం శాశ్వతం ఔతుంది. అందుకే కొంతకాలం వలస వెళ్లాలనే మంచి నిర్ణయం తీసుకొన్నాడు. కొంతకాలం వలస వెళితే కూలిపనులు చేసుకొని తమను తాము పోషించుకొంటారు. తర్వాత వర్షాలు పడితే హాయిగా తిరిగి వచ్చేస్తారు. అందుచేత వలస నిర్ణయం మంచిదే.

ప్రశ్న 4.
కరువు పరిస్థితిలో రైతులు ఎదుర్కొనే సమస్యల గురించి మరియు ఇటువంటి పరిస్థితిలో వారు ఎందుకు ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వలస వెళతారో కారణాలు రాయండి.
జవాబు:
కరువు పరిస్థితులలో రైతులు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. కరువు పరిస్థితులలో వర్షాలు కురవవు, పొలానికి నీరు ఉండదు. దుక్కిదున్ని విత్తనాలు వేసినా వాటికి సరిపడ నీటిని రైతు సమకూర్చుకోలేదు. కళ్ళెదురుగుండానే నారు ఎండిపోతుంటే చూస్తూ కూర్చోలేదు. ఏమీ చేయలేదు. ఇవి ప్రకృతిసిద్ధమైన కరువు పరిస్థితులు. ఒక్కొక్కసారి పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు విపరీతంగా కురవటం వల్ల పంటంతా నీటి పాలవుతుంది. కొన్నిసార్లు మిడతల దండులు దాడులు చేస్తాయి.

వాటివల్ల కూడా పంట నష్టం జరిగి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఏనుగుల మందల వంటి మృగాల దాడుల వలన పంటనష్టం జరుగుతుంది. అప్పుడు కూడా కరువు పరిస్థితులు ఏర్పడతాయి. కరువు పరిస్థితులు ఏర్పడి నపుడు రైతు కృంగిపోతాడు. పంట చేతికి రాదు. అప్పులు తీరవు. కొత్త అప్పు పుట్టదు. ఇల్లు గడిచే విధానం కనపడదు.

ఈ పరిస్థితులలో ఏం చేయాలో తెలియక పనులు లేక రైతులు పంటలు పండే ప్రాంతాలకు కూలీలుగా వలసపోతారు. అక్కడ పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటూ కడుపులు మాడ్చుకుని కొంత దాచుకుంటూ అరకొర జీవితం గడుపుతారు.

భాషాంశాలు

బహుళైచ్ఛిక ప్రశ్నలు

పదజాలం

అర్థాలు : గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.

1. నెత్తిమీద బరువుతో నడవటం కష్టము. (ఎ)
ఎ) తల
బి) భుజము
సి) వీపు
డి) మెడ
జవాబు:
ఎ) తల

2. వర్షాల వలన పొదలు గుబురుగా పెరిగాయి. (బి)
ఎ) గట్టిగా
బి) దట్టంగా
సి) పచ్చగా
డి) లావుగా
జవాబు:
బి) దట్టంగా

3. గొణగడం పిరికివారి లక్షణం. (సి)
ఎ) తిట్టడం
బి) ఏడవడం
సి) సణగడం
డి) శపించడ
జవాబు:
సి) సణగడం

4. కుమారుని మాటలకు తల్లి మురిసింది. (ఎ)
ఎ) ఆనందించింది
బి) ఆలోచించింది
సి) బాధపడింది
డి) నవ్వింది
జవాబు:
ఎ) ఆనందించింది

5. వాక్యము పూర్తయ్యాక చుక్క పెట్టాలి. (డి)
ఎ) కామ
బి) ప్రశ్నార్ధకం
సి) ఆశ్చర్యార్థకం
డి) బిందువు
జవాబు:
డి) బిందువు

6. ఈ రోజుల్లో ఎవరూ జాబు వ్రాయడం లేదు. (డి)
ఎ) పరీక్ష
బి) కథ
సి) నవల
డి) ఉత్తరం
జవాబు:
డి) ఉత్తరం

7. వాన లేకపోతే కరువు వస్తుంది. (ఎ)
ఎ) క్షామం
బి) క్షేమం
సి) నామం
డి) సుభిక్షం
జవాబు:
ఎ) క్షామం

8. అందరికి బ్రతుకు తెరువు దొరకాలి. (సి)
ఎ) తెరవు
బి) చెరువు
సి) మార్గం
డి) ఉద్యోగం
జవాబు:
సి) మార్గం

9. వృద్ధులకు పిల్లలే ఆదరువు కావాలి. (ఎ)
ఎ) ఆధారము
బి) ఆధేయము
సి) విధేయము
డి) చోటు
జవాబు:
ఎ) ఆధారము

10. విద్యతో బాటు వినయము రావాలి. (బి)
ఎ) క్రమశిక్షణ
బి) నమ్రత
సి) గౌరవం
డి) మర్యాద
జవాబు:
బి) నమ్రత

11. అతని విజ్ఞానానికి అందరికి విస్తు కలిగింది. (సి)
ఎ) ఆనందం
బి) సంతోషం
సి) ఆశ్చర్యం
డి) భయం
జవాబు:
సి) ఆశ్చర్యం

12. మన ఊహ అభివృద్ధికి మూలం. (బి)
ఎ) కృషి
బి) ఆలోచన
సి) ప్రయత్నం
డి) కష్టం
జవాబు:
బి) ఆలోచన

13. గిత్తలు గెంతులు వేస్తాయి. (సి)
ఎ) ఎద్దులు
బి) ఆవులు
సి) కోడెదూడలు
డి) దూడలు
జవాబు:
సి) కోడెదూడలు

14. దేనికీ యదారు పెట్టుకోకూడదు. (ఎ)
ఎ) బెంగ
బి) భయం
సి) కోపం
డి) ద్వేషం
జవాబు:
ఎ) బెంగ

AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

15. పాఠం చెబుతుంటే సవ్వడి చేయకూడదు. (బి)
ఎ) అలజడి
బి) శబ్దము
సి) అల్లరి
డి) కోపం
జవాబు:
బి) శబ్దము

పర్యాయపదాలు : గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

16. మన ధర్మము అతి ప్రాచీనము. (ఎ)
ఎ) పురాతనము, ప్రాత
బి) నవీనము, నూతనం
సి) కొత్త, కొంగొత్త
డి) పురాతనము, నవీనము
జవాబు:
ఎ) పురాతనము, ప్రాత

17. నోరు మంచిదైతే ఊరు మంచిది. (సి)
ఎ) ముఖము, తల
బి) తల, మస్తకము
సి) వక్త్రము, వదన గహ్వరము
డి) గుహ, గొబ
జవాబు:
సి) వక్త్రము, వదన గహ్వరము

18. మంచి తెరువులో నడవాలి. (డి)
ఎ) గుర్తు, జ్ఞాపకం
బి) బోధన, ఉపదేశం
సి) ఉత్తర్వు, మాట
డి) మార్గం, దారి
జవాబు:
డి) మార్గం, దారి

19. పులిని చూస్తే భయము కల్గుతుంది. (ఎ)
ఎ) భీతి, బెదురు
బి) జంకు, గొంకు
సి) ఆట, పాట
డి) రసము, చారు
జవాబు:
ఎ) భీతి, బెదురు

20. మన శరీరమునకు ఎక్కడ నొప్పి వచ్చినా భరించలేము. (డి)
ఎ) దేహము, సందేహము
బి) కాయము, ఖాయము
సి) దిశ, దెస
డి) దేహము, కాయము
జవాబు:
డి) దేహము, కాయము

21. మంచి గాలి పీల్చాలి. (బి)
ఎ) వాయువు, ప్రాణము
బి) వాయువు, పవనము
సి) వనము, వనజము
డి) జలజము, గాలి
జవాబు:
బి) వాయువు, పవనము

22. కడుపు నిండా తినాలి. (ఎ)
ఎ) ఉదరము, పొట్ట
బి) హృదయము, గుండె
సి) తల, మస్తకము
డి) పావు, వెన్ను
జవాబు:
ఎ) ఉదరము, పొట్ట

23. దశరథుని కొడుకు శ్రీరాముడు. (సి)
ఎ) ఆత్మ, ఆత్మజుడు
బి) తనువు, తనూజుడు
సి) ఆత్మజుడు, తనూజుడు
డి) ఆత్మ, తనువు
జవాబు:
సి) ఆత్మజుడు, తనూజుడు

24. దారము ప్రత్తి నుండి వస్తుంది. (బి)
ఎ) దూది, గింజ
బి) దూది, తూలము
సి) తల్పము, పాన్పు
డి) వస్త్రము, ఖాదీ
జవాబు:
బి) దూది, తూలము

25. గాలి మందంగా వీస్తోంది. (ఎ)
ఎ) నెమ్మదిగా, మెల్లగా
బి) వేగంగా, గబగబా
సి) చల్లగా, శీతలంగా
డి) వెచ్చగా, వేడిగా
జవాబు:
ఎ) నెమ్మదిగా, మెల్లగా

26. శివుని భార్య పార్వతీదేవి. (డి)
ఎ) పతి, సతి
బి) భర్త, పత్ని
సి) స్త్రీ, వనిత
డి) పత్ని, కళత్రము
జవాబు:
డి) పత్ని, కళత్రము

27. చేయి చేయి కలిపి స్నేహం చేయాలి. (సి)
ఎ) కాలు, పాదము
బి) పదము, పాదము
సి) హస్తము, కరము
డి) నయనము, నేత్రము
జవాబు:
సి) హస్తము, కరము

28. రైతులు పొలమును దున్ని నీరు పెడతారు. (డి)
ఎ) భూమి, నీరు
బి) వనము, క్షేత్రము
సి) క్షేత్రము, పైరు
డి) క్షేత్రము, కేదారము
జవాబు:
డి) క్షేత్రము, కేదారము

29. మేడ కంటే పాక చల్లగా ఉంటుంది. (ఎ)
ఎ) హర్యము, సౌధము
బి) శాల, కొట్టము
సి) పెంకుటిపాక, పెంకుటిల్లు
డి) భవనము, గుడిశె
జవాబు:
ఎ) హర్యము, సౌధము

30. పశువులు గడ్డి తిని పాలిస్తాయి. (బి)
ఎ) చిట్టు, తవుడు
బి) కసవు, తృణము
సి) పచ్చిక, కంకణము
డి) పచ్చదనం, పచ్చిక
జవాబు:
బి) కసవు, తృణము

నానార్థాలు : గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.

31. అర్థమును అర్థవంతంగా వినియోగించాలి. (ఎ)
ఎ) భావము, ధనము
బి) డబ్బు, ధనము
సి) భావము, ప్రభావము
డి) అర్థము, అనర్థము
జవాబు:
ఎ) భావము, ధనము

32. మంచి వస్త్రముపై కన్ను పడింది. (ఎ)
ఎ) నయనము, నేత్రము
బి) రంధ్రము, కలుగు
సి) నయనము, రంధ్రము
డి) మురికి, మరక
జవాబు:
ఎ) నయనము, నేత్రము

33. ధనవంతులు మేడను కట్టిస్తారు. (బి)
ఎ) మిద్దె, సౌధము
బి) సౌధము, గుడి
సి) గుడి, దేవాలయము
డి) బడి, పాఠశాల
జవాబు:
బి) సౌధము, గుడి

34. వర్షము పడితే పొలము ఫలిస్తుంది. (సి)
ఎ) అడవి, కాన
బి) చేను, క్షేత్రము
సి) అడవి, క్షేత్రము
డి) సముద్రము, పయోనిథి
జవాబు:
సి) అడవి, క్షేత్రము

35. తండ్రిని గౌరవించాలి. (డి)
ఎ) జనకుడు, పిత
బి) పితామహుడు, తాత
సి) తాత, అయ్య
డి) జనకుడు, తాత
జవాబు:
డి) జనకుడు, తాత

36. స్వామిని మంచి చేసుకోవాలి. (ఎ)
ఎ) దేవుడు, అధికారి
బి) దేవుడు, దైవము
సి) అధికారి, పాలకులు
డి) పాలకుడు, పరిపాలకుడు
జవాబు:
ఎ) దేవుడు, అధికారి

37. వాతము సోకితే తగ్గించుకోవాలి. (డి)
ఎ) గాలి, వాయువు
బి) రోగము, జబ్బు
సి) ఆకలి, క్షుద
డి) గాలి, ఒక జబ్బు
జవాబు:
డి) గాలి, ఒక జబ్బు

38. గాంధీజీ మోసం చేయుటకు విరుద్ధము. (సి)
ఎ) విరోధము, వైరము
బి) కుదరనిది, పొసగనిది
సి) విరోధము కలది, పొసగనిది
డి) నచ్చనిది, అసహ్యము
జవాబు:
సి) విరోధము కలది, పొసగనిది

39. మూల మంచిది. (ఎ)
ఎ) ఒక నక్షత్రం, కోణము
బి) చుక్క బిందువు
సి) బిందువు, బంధము
డి) కోణము, దృక్కోణము
జవాబు:
ఎ) ఒక నక్షత్రం, కోణము

40. దేశానికి సాగు ఉపయోగకరం. (బి)
ఎ) వ్యవసాయము, సస్యము
బి) వ్యవసాయము, సేద్యము
సి) కృషి, ప్రయత్నము
డి) వ్యవసాయము, జరుగు
జవాబు:
బి) వ్యవసాయము, సేద్యము

41. ఈ వర్షము వర్షములు ఎక్కువ. (బి)
ఎ) వాన, జల్లు.
బి) సంవత్సరము, వాన
సి) సంవత్సరము, వత్సరము
డి) వసంతము, వాన
జవాబు:
బి) సంవత్సరము, వాన

42. అప్పు ప్రగతికి గుర్తు. (ఎ)
ఎ) నీరు, ఋణము
బి) ఋణము, ఋణార్ణము
సి) నీరు, జలము
డి) జలజము, కమలము
జవాబు:
ఎ) నీరు, ఋణము

43. ఈ నెల బాగుంది. (సి)
ఎ) మాసము, ముప్ఫై రోజులు
బి) చంద్రుడు, శశి
సి) చంద్రుడు, ముప్పై రోజులు
డి) వంక, డొంక
జవాబు:
సి) చంద్రుడు, ముప్పై రోజులు

AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

44. ఏ వ్యాపారము లేకుండా ఉండకూడదు. (డి)
ఎ) పని, క్రియ
బి) వర్తకము, వాణిజ్యము
సి) వాణిజ్యము, ఎగుమతి
డి) పని, వర్తకము
జవాబు:
డి) పని, వర్తకము

45. గట్టు మీద దేవాలయం ఉంది.(ఎ)
ఎ) తీరము, కొండ
బి) మిట్ట, గుట్ట
సి) సాగరము, మిట్ట
డి) వాగు, కొండ
జవాబు:
ఎ) తీరము, కొండ

ప్రకృతి – వికృతులు : గీత గీసిన పదానికి ప్రకృతులు / వికృతులు గుర్తించండి.

46. పయనములో తక్కువ తినాలి – ప్రకృతిని గుర్తించండి. (ఎ)
ఎ) ప్రయాణము
బి) పణయము
సి) పయనం
డి) పని
జవాబు:
ఎ) ప్రయాణము

47. ఆర్య పనియేమి? – వికృతిని గుర్తించండి. (సి)
ఎ) అమ్మ
బి) ఏనుండీ
సి) అయ్య
డి) రాజా
జవాబు:
సి) అయ్య

48. మృదువుగా మాట్లాడాలి – వికృతిని గుర్తించండి. (డి)
ఎ) మృదుత్వం
బి) మెత్తగా
సి) చక్కగా
డి) మెదక
జవాబు:
డి) మెదక

49. లచ్చి హరి సతి – ప్రకృతిని గుర్తించండి. (ఎ)
ఎ) లక్ష్మి
బి) లక్కిమి
సి) లక్కీ
డి) లక్క
జవాబు:
ఎ) లక్ష్మి

50. ఇతరుల కస్తిని తీర్చాలి – ప్రకృతిని గుర్తించండి. (బి)
ఎ) కసి
బి) కష్టము
సి) కశి
డి) కస్సు
జవాబు:
బి) కష్టము

51. పెద్దల మాట వినాలి ప్రకృతిని గుర్తించండి. (ఎ)
ఎ) వృద్ధు
బి) అన్న
సి) అయ్య
డి) గురువు
జవాబు:
ఎ) వృద్ధు

52. భృంగారము విలువైనది – వికృతిని గుర్తించండి. (సి)
ఎ) భృంగము
బి) బొంగరము
సి) బంగారము
డి) బంగళా
జవాబు:
సి) బంగారము

53. పెట్టెలో నగలున్నాయి – ప్రకృతిని గుర్తించండి. (డి)
ఎ) పేటి
బి) పెటయ
సి) పెటుక
డి) పేటిక
జవాబు:
డి) పేటిక

54. గట్టుపై ఉండాలి, నీటిలో దిగకు – ప్రకృతిని గుర్తించండి. (బి)
ఎ) గటిక
బి) ఘట్టము
సి) ఘటిక
డి) గుటిక
జవాబు:
బి) ఘట్టము

55. కాకలపై వ్రాయాలి – వికృతిని గుర్తించండి. (సి)
ఎ) పుస్తకము
బి) కలము
సి) కాగితము
డి) బల్ల
జవాబు:
సి) కాగితము

56. బ్రద్నకు వికృతి గుర్తించండి. (ఎ)
ఎ) ప్రొద్దు
బి) సూర్యుడు
సి) ప్రొద్దుటే
డి) ఉదయం
జవాబు:
ఎ) ప్రొద్దు

57. మన పొంతలో తెలుగే మాట్లాడతారు – వికృతిని గుర్తించండి. (బి)
ఎ) ఆంధ్ర
బి) ప్రాంతము
సి) గ్రామం
డి) ఊరు
జవాబు:
బి) ప్రాంతము

58. గోడపై ఏమీ వ్రాయకూడదు – ప్రకృతిని గుర్తించండి. (సి)
ఎ) కడము
బి) కద్యము
సి) కుడ్యము
డి) కోడ
జవాబు:
సి) కుడ్యము

59. వంశమునకు పేరు తేవాలి – వికృతిని గుర్తించండి. (డి)
ఎ) వంసము
బి) వశము
సి) వనశము
డి) వంగడము
జవాబు:
డి) వంగడము

60. అందరి క్షేమమును కోరాలి – వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) సేమము
బి) క్షామము
సి) క్షయము
డి) భిక్షము
జవాబు:
ఎ) సేమము

వ్యుత్పత్త్యర్థాలు : గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.

61. ఋతువులు దీని యందు వసించును – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) భూమి
బి) కాలము
సి) నెల
డి) సంవత్సరము
జవాబు:
డి) సంవత్సరము

62. బాలురు దీని యందు పుట్టెదరు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) భవనము
బి) ఇల్లు
సి) గుడిసె
డి) పాక
జవాబు:
ఎ) భవనము

63. మను సంబంధమైనవాడు. (బి)
ఎ) నరుడు
బి) మనిషి
సి) ఆత్మజుడు
డి) సుతుడు
జవాబు:
బి) మనిషి

AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

64. ఆస్వాదించుటకు యోగ్యమైనది – వ్యత్పత్తి పదం గుర్తించండి. (సి)
ఎ) వినోదం
బి) ఆనందం
సి) ఆశ్చర్యము
డి) భోజనము
జవాబు:
సి) ఆశ్చర్యము

65. ఆశ ఎక్కువైతే దురాశ ఔతుంది. (ఎ)
ఎ) ఎక్కువైన ఆపేక్ష
బి) ప్రేమ కలది
సి) ప్రియమైనది
డి) విరక్తి కలది
జవాబు:
ఎ) ఎక్కువైన ఆపేక్ష

వ్యాకరణాంశాలు

సంధులు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

66. ఏదో వస్తుందని ఆశించకు – సంధి పేరు గుర్తించండి. (సి)
ఎ) అత్వసంధి
బి) ఉత్వ సంధి
సి) ఇత్వసంధి
డి) ఆమ్రేడితం
జవాబు:
సి) ఇత్వసంధి

67. చెట్టు పడిందంట విడదీసిన రూపం గుర్తించండి. (ఎ)
ఎ) పడింది + అంట
బి) పడింద అంట
సి) పడిందే + అంట
డి) పడిందు + అంట
జవాబు:
ఎ) పడింది + అంట

68. వస్తుంది + అని కలిపి రాయండి. (డి)
ఎ) వస్తుందేని
బి) వస్తుందా
సి) వస్తుదాని
డి) వస్తుందని
జవాబు:
డి) వస్తుందని

69. భూమి నిస్సారమై ఉండకూడదు – సంధి పేరు (బి)
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) ఉత్వసంధి
సి) అత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) ఉత్వసంధి

70. వీస్తు + ఉన్న – కలిపి రాయండి. (సి)
ఎ) వీస్తన్న
బి) వీస్తోన్న
సి) వీస్తున్న
డి) వీస్తుంది.
జవాబు:
సి) వీస్తున్న

71. కాలమంతా మంచిదే – విడదీసి రాయండి. (డి)
ఎ) కాలం + అంతా
బి) కాలమే + అంతా
సి) కాల + అంతా
డి) కాలము + అంతా
జవాబు:
డి) కాలము + అంతా

72. గంగన్న చాలా కష్టాలు పడ్డాడు సంధి పేరు (ఎ)
ఎ) అత్వసంధి
బి) ఉత్వసంధి
సి) త్వసంధి
డి) సంధికాదు
జవాబు:
ఎ) అత్వసంధి

73. నరసమ్మ ధైర్యం కలది విడదీసి రాయండి. (బి)
ఎ) నరసా + అమ్మ
బి) నరస + అమ్మ
సి) నరసి + అమ్మ
డి) నరసో + అమ్మ
జవాబు:
బి) నరస + అమ్మ

74. రామ + అప్ప – కలిపి రాయండి. (డి)
ఎ) రామయ్య
బి) రామన్న
సి) రామక్క
డి) రామప్ప
జవాబు:
డి) రామప్ప

75. గతయేభై ఏండ్ల నుండీ అభివృద్ధి ఎక్కువ – సంధి పేరు (సి)
ఎ) అత్వసంధి
బి) ఉత్వసంధి
సి) యడాగమం
డి) యణాదేశ సంధి
జవాబు:
సి) యడాగమం

76. అప్పుడప్పుడు నష్టం రావచ్చు – సంధి పేరు (ఎ)
ఎ) ఆమ్రేడిత సంధి
బి) ఉత్వ సంధి
సి) అత్వ సంధి
డి) ఇత్వ సంధి
జవాబు:
ఎ) ఆమ్రేడిత సంధి

77. కోనసీమ పొలాలలో బంగారం పండుతుంది – సంధి పేరు (బి)
ఎ) అత్వసంధి
బి) లు,ల,న,ల సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) గుణసంధి
జవాబు:
బి) లు,ల,న,ల సంధి

78. వర్షాభావము సంధి పేరు గుర్తించండి. (డి)
ఎ) అత్వసంధి
బి) గుణసంధి
సి) ఇత్వసంధి
డి) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
డి) సవర్ణదీర్ఘ సంధి

79. అన్ని రకాలు తినాలి – విడదీసి రాయండి. (ఎ)
ఎ) రకము + లు
బి) రక + అలు
సి) రకా + లు
డి) రకం + లు
జవాబు:
ఎ) రకము + లు

80. సంవత్సరము + లు – కలిపి రాయండి. (బి)
ఎ) సంవత్సరలు
బి) సంవత్సరాలు
సి) వత్సరం
డి) సంవత్సరంలు
జవాబు:
బి) సంవత్సరాలు

సమాసాలు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

81. గంగన్న మనసు మంచిది – సమాసం పేరు (ఎ)
ఎ) షష్ఠీ తత్పురుష
బి) తృతీయా తత్పురుష
సి) పంచమీ తత్పురుష
డి) చతుర్థీ తత్పురుష
జవాబు:
ఎ) షష్ఠీ తత్పురుష

82. మన ఊరు పేరు నిలపాలి- విగ్రహవాక్యం (సి)
ఎ) మన వలన ఊరు
బి) మన చేత ఊరు
సి) మన యొక్క ఊరు
డి) మన యందు ఊరు
జవాబు:
సి) మన యొక్క ఊరు

83. ఊరిలో దృశ్యాలు – సమాస పదం (డి)
ఎ) దృశ్యాల ఊరు
బి) దృశ్యం ఊరు
సి) ఊర దృశ్యం
డి) ఊరి దృశ్యాలు
జవాబు:
డి) ఊరి దృశ్యాలు

84. గంగన్న పెళ్లాం పిల్లలు అతనికి సహకరించారు. సమాసం పేరు (బి)
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) షష్ఠీ తత్పురుష
డి) సప్తమీ తత్పురుష
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

85. పాడియును, పంటయును – సమాస పదం (బి)
ఎ) పంటపాడి
బి) పాడిపంటలు
సి) పాడిపంట
డి) పంటపాడులు
జవాబు:
బి) పాడిపంటలు

86. బట్టల మూట సర్దుకోవాలి – సమాసం పేరు (ఎ)
ఎ) తృతీయా తత్పురుష
బి) చతుర్థీ తత్పురుష
సి) షష్ఠీ తత్పురుష
డి) నజ్ తత్పురుష
జవాబు:
ఎ) తృతీయా తత్పురుష

87. ఇనుముతో గేటు – సమాస పదం (సి)
ఎ) ఇనుంగేట
బి) గేటు ఇనుము
సి) ఇనుపగేటు
డి) గేటు ఇనుపది
జవాబు:
సి) ఇనుపగేటు

88. గడ్డివాము – విగ్రహవాక్యం (డి)
ఎ) గడ్డి వలన వాము
బి) గడ్డి యొక్క ము
సి) గడ్డి కొఱకు వాము
డి) గడ్డితో వాము
జవాబు:
డి) గడ్డితో వాము

89. తిండిగింజలు కోసమే కష్టపడాలి – సమాసం పేరు (ఎ)
ఎ) చతుర్థీ తత్పురుష
బి) తృతీయ తత్పురుష
సి) షష్ఠీ తత్పురుష
డి) సప్తమీ తత్పురుష
జవాబు:
ఎ) చతుర్థీ తత్పురుష

90. పరాయిచోట గొప్పలు చెప్పకూడదు – సమాసం పేరు (సి)
ఎ) విశేషణ ఉత్తరపద కర్మధారయం
బి) షష్ఠీ తత్పురుష
సి) విశేషణ పూర్వపద కర్మధారయం
డి) చతుర్థీ తత్పురుష
జవాబు:
సి) విశేషణ పూర్వపద కర్మధారయం

91. అందరికీ సొంత ఇల్లు ఉండాలి – విగ్రహవాక్యం (బి)
ఎ) సొంత యొక్క ఇల్లు
బి) సొంతయైన ఇల్లు
సి) సొంత వలన ఇల్లు
డి) సొంత వారి ఇల్లు
జవాబు:
బి) సొంతయైన ఇల్లు

92. ఈ విశ్వం అనంతము ఐనది – విగ్రహవాక్యం (ఎ)
ఎ) అంతము లేనిది
బి) అంతము ఉన్నది
సి) అంతమే ముఖ్యము
డి) నకారము యొక్క అంతము
జవాబు:
ఎ) అంతము లేనిది

93. కొందరు 60 ఏళ్లు వచ్చినా దృఢంగా ఉంటారు. సమాసం పేరు (డి)
ఎ) ద్వంద్వ సమాసం
బి) షష్ఠీ తత్పురుష
సి) బహువ్రీహి సమాసం
డి) ద్విగు సమాసం
జవాబు:
డి) ద్విగు సమాసం

AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

94. ఈ ఏడు ప్రత్తిపంట బాగుంది సమాసం పేరు (బి)
ఎ) షష్ఠీ తత్పురుష
బి) సంభావనా పూర్వపద కర్మధారయం
సి) సప్తమీ తత్పురుష
డి) చతుర్థీ తత్పురుష
జవాబు:
బి) సంభావనా పూర్వపద కర్మధారయం

95. శనగపంట – విగ్రహవాక్యం (సి)
ఎ) శనగ యొక్క పంట
బి) శనగతో పంట
సి) శనగ వలన పంట
డి) శనగ అను పేరు గల పంట
జవాబు:
సి) శనగ వలన పంట

ఛందస్సు : ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

96. గంగన్న – గణం గుర్తించండి. (బి)
ఎ) య గణం
బి) త గణం
సి) ర గణం
డి) మ గణం
జవాబు:
బి) త గణం

97. నరసమ్మగణం గుర్తించండి. (ఎ)
ఎ) సల
బి) నల
సి) నగ
డి) జల
జవాబు:
ఎ) సల

98. ఆనందం – గణం గుర్తించండి. (సి)
ఎ) ర గణం
బి) న గణం
సి) మ గణం
డి) జ గణం
జవాబు:
సి) మ గణం

99. గురువు, లఘువు గల గణము పేరేమి? (డి)
ఎ) లగ
బి) వ గణం
సి) జ గణం
డి) హ గణం
జవాబు:
డి) హ గణం

100. నాలుగు లఘువులున్న గణం పేరేమి? (ఎ)
ఎ) నల
బి) నగ
సి) సల
డి) జల
జవాబు:
ఎ) నల

వాక్యాలు రకాలు : ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

101. గంగన్న కష్టపడుతూ పని చేయిస్తాడు. (ఎ)
ఎ) సంక్లిష్టం
బి) సంయుక్తం
సి) శత్రర్ధకం
డి) క్వార్థకం
జవాబు:
ఎ) సంక్లిష్టం

102. గంగన్న, భార్య, కొడుకు, కోడలు, శిశువు వలస వెళ్లారు. (సి)
ఎ) సంక్లిష్టం
బి) విధ్యర్థకం
సి) సంయుక్తం
డి) ప్రార్థనార్థకం
జవాబు:
సి) సంయుక్తం

103. గంగన్నా పెంకుటిపాకలో ఉండవచ్చు. (బి)
ఎ) విధ్యర్థకం
బి) అనుమత్యర్థకం
సి) ప్రార్థనార్థకం
డి) ఆశ్చర్యార్థకం
జవాబు:
బి) అనుమత్యర్థకం

104. గంగన్న కుటుంబం ఎలాగైనా బ్రతకగలదు. (డి)
ఎ) విధ్యర్థకం
బి) సందేహార్థకం
సి) ప్రశ్నార్థకం
డి) సామర్థ్యార్థకం
జవాబు:
డి) సామర్థ్యార్థకం

105. రైతులు పాడి పంటలతో వర్ధిల్లుదురు గాక! (ఎ)
ఎ) ఆశీరర్థకం
బి) విధ్యర్థకం
సి) సందేహార్థకం
డి) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఎ) ఆశీరర్థకం

Previous Bits

1. రజియా అన్నం తిని బడికి వెళ్లింది. ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (SA-1-2022-23) (సి)
ఎ) సంయుక్త వాక్యం
బి) సంశ్లిష్ట వాక్యం
సి) చేదర్థకం
డి) ప్రశ్నార్థకం
జవాబు:
సి) చేదర్థకం

2. తాజ్మహల్ సుందరమైనది. విశాలమైనది. ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (SA-1,2022-23) (సి)
ఎ) సంశ్లిష్ట వాక్యం
బి) ప్రేరణార్థకం
సి) సంయుక్త వాక్యం
డి) క్త్వార్థకం
జవాబు:
సి) సంయుక్త వాక్యం

3. క్రింది వాటిలో చేదర్థక వాక్యం ఏమిటి? (SA-2-2022-23) (సి)
ఎ) గంగన్న కుటుంబం వలస వెళ్లి, జీవితాన్ని గడిపింది.
బి) గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడ్డాడు.
సి) వానలు కురిస్తే పంటలు పండుతాయి.
డి) రమ్య అన్నం తిని, బడికి వెళ్లింది.
జవాబు:
సి) వానలు కురిస్తే పంటలు పండుతాయి.

4. “నగరవీధులు” అనే సమాసపదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి. (SA-2-2022-23) (ఎ)
ఎ) నగరమందలి వీధులు
సి) నగరం గూర్చి వీధులు
బి) నగరం చేత వీధులు
డి) నగరం వలన వీధులు
జవాబు:
ఎ) నగరమందలి వీధులు

AP 8th Class Telugu 6th Lesson Important Questions పయనం

5. మా పాఠశాలలో పరిమళాలు వెదజల్లే పూల మొక్కలు ఉన్నాయి. (అర్థాన్ని గుర్తించండి.) (SA-1:2023-24) (ఎ)
ఎ) సువాసనలు
బి) దుర్గంధం
సి) రంగుల
డి) సౌందర్యము
జవాబు:
ఎ) సువాసనలు

6. మదర్ థెరిస్సా తన జీవితమంతా దీనుల సేవలోనే గడిపింది. (సంధినామం గుర్తించండి.) (SA-1-2023-24) (సి)
ఎ) అత్వసంధి
బి) ఇత్వసంధి
సి) ఉత్వసంధి
డి) సవర్ణదీర్ఘసంధి
జవాబు:
సి) ఉత్వసంధి

7. ఆకాంక్ష : పిల్లలకు సినిమాకు వెళ్ళాలని కోరిక కలిగింది. (SA-2-2023-24)

Leave a Comment