These AP 8th Class Telugu Important Questions 3rd Lesson శతకసౌరభం will help students prepare well for the exams.
శతకసౌరభం AP Board 8th Class Telugu 3rd Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
పద్య పూరణలు – భావాలు
1. జననీ జనకులు నినుఁగని
పెనిచిన దేవతలటంచు పెనుపగు భక్తిం
గనుగొని యనిశము వారిం
దనుపుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి!
భావం: విద్యార్థి నీకు జన్మనిచ్చి, పెంచిన తల్లి దండ్రులే దేవతలు. వీరిని మిక్కిలి భక్తితో ఎల్లప్పుడు సేవించాలి. ఇలా చేయడం వలన నీకు సర్వసుఖాలు లభిస్తాయి.
2. దానముఁ జేయనేరని యధార్మికు సంపదలుండి యుండినన్
దానె పలాయనంబగుట తథ్యము, బూరుగు మ్రానుఁ గాచినన్
దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా!
భావం: ఓ భాస్కరా! బూరుగు చెట్ల కాయలు తినుటకు పనికిరాక ఎండిపోయి గాలి వలన రాలి వృథాగా అడవిలో పడిపోతాయి. అట్లే దానము చేయని మనుష్యుని సంపద ఎవ్వరికీ ఉపయోగపడక నశించిపోతుంది.
3. పిన్నల పెద్దల యెద గడు
మన్ననచే మెలగు సుజన మార్గంబులనీ
వెన్ను కొని తిరుగుచుండిన
నన్ని యెడల నెన్న బడదువన్న కుమారా!
భావం: ఓ కుమారా! చిన్నవారైనా, పెద్దవారైనా వారితో నీవు మర్యాదగా ప్రవర్తించు. మంచివారు నడిచే మార్గంలో నీవు కూడా నడు. నాయనా నీవు అలా నడుచుకుంటే లోకంలో కీర్తి పొందుతావు. అందరూ మెచ్చుకుంటారు.
4. గంటకాలము గడిచిన గతమనంద్రు
గతము గతమె కానది యెట్లు కలిసిరాదు
గంటకాలము వృథగాగ గడపకీవు
విద్యనేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు.
భావం: కాలం గడిచిపోతే దానిని గతం అంటారు. గడిచిన కాలం తిరిగిరాదు. కాలం విలువైంది. వృథా చేయరాదు. కాలానుగుణంగా విలువైన విద్యను నేర్చుకోవాలి. అప్పుడే జీవితం పరిపూర్ణమౌతుంది.
5. కనకవిశాలచేల! భవకానన శాతకుఠారధార! స
జ్ఞాన పరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కొండ, కాందసం
జనిత పరాక్రమ! క్రమ విశారద! శారదకందకుంద చం
దన ఘనసార సారయశ! దాశరథీ! కరుణాపయోనిధీ! (SA-1:2022-23)
భావం: దయకు సముద్రుడవైన రామా! బంగారంతో వేసిన విశాలమైన వస్త్రాలను ధరించావు. పదునైన గొడ్డలి అంచుతో సంసారమనే అడవిని నాశనంచేసి, సజ్జనులను రక్షించావు. దేవతలు స్తుతించే గుణాలను కలిగి, అగ్నివంటి శౌర్య పరాక్రమాలతో నిండి శరత్తులోని మేఘమాలికవలె అలరినావు. నీవు మంచి మల్లెలవలె, గంధంవలె పరిమళాన్ని కల్గి, పచ్చకర్పూరం వంటి కీర్తితో మెరుస్తున్నావు.
6. నిందువిస్తరాకు నిశ్చలంబుగనుండు
ఏమిలేని విస్తరెగిరిపడును
వినయియగు వివేకి, విఱ్ఱవీగు జడుండు
మాచిరాజుమాట మణులమూట
భావం : వడ్డించిన విస్తరి నిండుగా, నిశ్చలంగా ఉంటుంది. వడ్డించని విస్తరాకు గాలికి ఎగిరిపోతుంది. అలాగే వివేకి వినయంతో ఒప్పారుతాడు. అవివేకి మిడిమిడి జ్ఞానంతో పతనం అవుతాడు. పెద్దల మాటలు మణుల మూటలుగా భావించి, జీవించాలి.
7. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
సతిశాంతత్వము చిత్తశుద్ధికరము స్నధ్యాత్మయున్ ధ్యానమున్
దృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబుఁ గాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాథ! నారాయణా!
భావం: లక్ష్మీపతివైన నారాయణా! ఎల్లప్పుడు సదా చారాన్ని పాటించడం, సత్యాన్ని పలకడం, భూతదయ కలిగి ఉండడం, చక్కని నడవడిక, వినయం, శాంతం, చిత్తశుద్ధినిచ్చే ఆత్మజ్ఞానం, ధ్యానం, ధైర్యం, ధర్మాచరణం, సర్వజీవులకు మేలు చేయడం మొదలైన సద్గుణాలు వదలకుండా ఉండే ప్రజ్ఞా వంతునికి నీ సన్నిధి లభిస్తుంది.
8. మధురభాషితములు మాణిక్యముల వోలె
శ్రుతినలంకరించి మతివసించు
మంజులములుగాని మాటలు నిలువవు
విశ్వహితచరిత్ర వినరమిత్ర!.
భావం : లోక క్షేమం కోరే మిత్రమా! మంచి మాటలు మధురమైనవి. అవి మాణిక్యాలవంటివి. చెవులకింపుగా ఉండే మాటలు మనస్సులో శాశ్వతంగా ఉంటాయి. కాని చెడు మాటలు నిలువక నశించిపోతాయి.
అపరిచిత పద్యాలు – ప్రశ్నలు
అ) కింది అపరిచిత పద్యాలు చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. “ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలదు దానవాగ్రణి వింటే”
ప్రశ్నలు:
ప్రశ్న 1.
సర్వోపగతుండెవరు?
జవాబు:
సర్వోపగతుండు ‘చక్రి’. చక్రి అనగా చక్రమును ధరించే శ్రీమహావిష్ణువు.
ప్రశ్న 2.
చక్రి ఎక్కదున్నాడు?
జవాబు:
చక్రి అన్ని చోట్లా ఉంటాడు.
ప్రశ్న 3.
ఈ పద్యం ఎవరిని సంబోధిస్తుంది?
జవాబు:
ఈ పద్యం, దానవాగ్రణిని అంటే రాక్షసరాజు హిరణ్యకశివుని సంబోధిస్తుంది.
ప్రశ్న 4.
ఈ పద్యం ఏ గ్రంథంలోనిది? (రామాయణం, భారతం, భాగవతం)
జవాబు:
ఈ పద్యం భాగవతం లోనిది.
2. “కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ
ప్రశ్నలు:
ప్రశ్న 1.
కమలములు ఎపుడు వాడిపోతాయి?
జవాబు:
కమలములు నీటిలో నుండి బయటకు వస్తే సూర్యుని కాంతి తాకి వాడిపోతాయి.
ప్రశ్న 2.
మిత్రులు శత్రువులు ఎపుడు అవుతారు?
జవాబు:
తమ తమ స్థానాలను కోల్పోతే మిత్రులు శత్రువులు అవుతారు.
ప్రశ్న 3.
ఈ పద్యానికి మకుటమేది?
జవాబు:
సుమతీ
ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
రశ్మి అనగా ఏమిటి?
3. అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ! వినురవేమ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు:
అంటూ ఉంటే అతిశయిల్లేది రాగము.
ప్రశ్న 2.
తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే తీయనయ్యేది వేము.
ప్రశ్న 3.
సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనమున పనులు సమకూరు ధరలోన
ప్రశ్న 4.
ఈ పద్యానికి మకుటం ఏమిటి?
జవాబు:
విశ్వదాభిరామ! వినురవేమ!
4. చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తినుడువడేని
దయయుసత్యంబులోనుగా దలపడేని
కలుగనేటికి తల్లులు కడుపుచేటు
ప్రశ్నలు:
1. “కదుపుచేటు” అనే మాటకు అర్థం (బి)
ఎ) చెడ్డకడుపు
బి) పుట్టుక దండగ
సి) తల్లులకు బాధ
జవాబు:
బి) పుట్టుక దండగ
2. శివపూజ ఎలా చేయమంటున్నాడు కవి? (సి)
ఎ) ఆరు చేతులతో
బి) చేతులు నొప్పి పుట్టేటట్లు
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
జవాబు:
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
3. దయను, సత్యాన్ని రెండింటిలో మనిషి వేటిని తలచాలి? (సి)
ఎ) దయను మాత్రమే
బి) సత్యాన్ని మాత్రమే
సి) దయను, సత్యాన్ని రెండింటిని
జవాబు:
సి) దయను, సత్యాన్ని రెండింటిని
4. నోరారా హరి కీర్తిని……….. (బి)
ఎ) పిలవాలి
బి) పలకాలి
సి) అరవాలి
జవాబు:
బి) పలకాలి
5. చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరమైనయట్లు పామరుదుదగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
చీమలు పెట్టిన పుట్టలు వేటికి స్థానమవుతాయి?
జవాబు:
పాములకు
ప్రశ్న 2.
పై పద్యంలో కవి పామరుడిని ఎవరితో పోల్చాడు?
జవాబు:
చీమలతో
ప్రశ్న 3.
‘బంగారం’ అనే అర్థం వచ్చే పదం పై పద్యంలో ఉంది. గుర్తించి రాయండి.
జవాబు:
హేమము
ప్రశ్న 4.
ఈ పద్యానికి మకుటం ఏమిటి?
జవాబు:
‘భూమీశుడు’ అనగా ఎవరు?
6. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ! వినురవేమ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
అల్పుని మాటలు ఎలా ఉంటాయి?
జవాబు:
ఆడంబరంగా
ప్రశ్న 2.
ఆహ్లాదకరంగా మాట్లాడువారు ఎవరు?
జవాబు:
సజ్జనుడు
ప్రశ్న 3.
కవి ఈ పద్యంలో ఏ రెండు లోహాలను పోల్చారు?
జవాబు:
కంచు, బంగారం
ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
దీనిలోని మకుటం ఏది?
7. ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొరనింద సేయ బోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువ బోకుమయ్య! కుమారా!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఒంటరిగా చేయకూడనిది ఏది?
జవాబు:
కార్యాలోచనము.
ప్రశ్న 2.
వేటిని విడిచి పెట్టకూడదు?
జవాబు:
ఆచారములు.
ప్రశ్న 3.
“తనని పోషించిన యజమానిని నిందించరాదు” అనే భావం వచ్చే పద్యపాదాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
బ్రోచిన దొర నింద సేయబోకుము.
ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పద్యానికి మకుటం ఏమిటి? (లేదా) ఈ పద్యాన్ని రాసినది ఎవరు?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
మారద వెంకయ్య అధార్మికుని సంపద గురించి ఏమని చెప్పాడు?
జవాబు:
దానము చేయని అధార్మికుని సంపద ఉన్నా ప్రయోజనం లేదు. కొన్నాళ్ళకు ఆ సంపద దానంతట అదే పోతుంది. ఎలాగంటే అడవిలోని బూరుగు చెట్టు కాయలు తినడానికి పనికిరావు. అవి ఎండిపోయి గాలికి వృథాగా రాలిపోతాయి.
ప్రశ్న 2.
శ్రీరాముని కంచర్ల గోపన్న ఎలా స్తుతించాడు?
జవాబు:
శ్రీరాముని కంచర్ల గోపన్న దయాసముద్రుడా! దశరథ కుమారా! బంగారు వస్త్రమును ధరించినవాడా! జన్మమనే అడవిని నరికే గొడ్డలి పదును వంటి వాడా! సజ్జన పరిపాలక! దేవతల చేత స్తుతింప పడినవాడా! సుగుణాల సమూహమా! అగ్ని వంటి పరాక్రమశాలి, శరదృతువు, తెలిమబ్బు, మొల్లలు కర్పూరము, చందనముల సారము వలె సుగంధ భరితమైన తెల్లని కీర్తి కలవాడా! అని స్తుతించాడు.
ప్రశ్న 3.
మాచిరాజు కవి ఏం చెప్పాడు?
జవాబు:
అన్నీ వడ్డించిన విస్తరి నిశ్చలంగా అణిగిమణిగి ఉంటుంది. ఏమీలేని విస్తరి ఎగిరి ఎగిరి పడుతుంది. అలాగే వివేకి వినయంతో ఉంటాడు. మూర్ఖుడు అహంకారంతో విర్రవీగుతాడు అని మణులమూట వంటి మాటలను మాచిరాజు కవిగారు చెప్పారు.
ప్రశ్న 4.
కవి మనిషికి నిజమైన ఆభరణాలుగా వేటిని పేర్కొన్నారు?
జవాబు:
చేతులకు నిత్యం దానం చేయడం అనేది అలంకారం, ముఖానికి అలంకారం సత్యం పలకడం, శిరస్సుకు అలంకారం గురువుల పాదాలకు నమస్కరించడం, బహువులకు బలం, హృదయానికి మంచి ప్రవర్తన, చెవులకు మంచి విద్య వినడం అనేవి అలంకారాలుగా కవి పేర్కొన్నాడు.
ఆ) క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
బమ్మెర పోతన ఎవరికి వైకుంఠప్రాప్తి కలగాలని కోరుకున్నాడు?
జవాబు:
సదాచారము గలవానికి వైకుంఠప్రాప్తి కలగాలని పోతన లక్ష్మీనారాయణులను ప్రార్ధించాడు. అలాగే సత్యము చెప్పేవారికి కూడా కలగాలన్నాడు. దయ గలవారిని కూడా రక్షించాలన్నాడు. మంచి స్వభావము కలవారిని కాపాడాలన్నారు. అతి శాంతపరులను కూడా తమ సమీపానికి చేర్చుకోవాలన్నాడు. చిత్తశుద్ధి కలవారిని దూరము చేయవద్దన్నాడు. ఆధ్యాత్మికత దైవధ్యానము కలవారిని కూడా రక్షించాలన్నాడు. ధైర్యవంతులను, ధర్మ పరాయణులను విడువవద్దన్నాడు. సర్వజీవుల హితమును కోరేవారిని కూడా తమ సన్నిధిలోని సుఖమునకు దూరము చేయవద్దని లక్ష్మీనారాయణులను ప్రార్థించాడు.
ప్రశ్న 2.
శతకాలు చదవటం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మిత్రునకు లేఖ వ్రాయండి.
జవాబు:
కర్నూలు, X X X X. ప్రియమైన మిహిరకు, ఇక్కడ మా పాఠశాలలో శతక మధురిమ పాఠం చెప్పారు. ఎనిమిదిమంది కవులు రచించిన పద్యాలను బోధించారు. పద్యాలన్నీ చాలా బాగున్నాయి. తల్లిదండ్రులను సేవించాలని చెప్పారు. సత్యం పలకాలని, దానం చెయ్యాలని గురువులకు నమస్కరించాలని సమయం వృథా చేయకూడదని గర్వం పనికిరాదని ఇతరులను బాధించకూడదని ఇలా అనేక నీతులను పద్యాల ద్వారా బోధించారు. నేను విద్యార్థి శతకం, భాస్కర శతకం, దాశరథీ శతకం కొనుక్కున్నాను. చదువుతున్నాను. నువ్వు కూడా శతకాలు చదువుకుని కొనుక్కో అర్థం కానివి తెలుగు ఉపాధ్యాయులను అడుగు. ఇక ఉంటాను. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 3.
మానవసేవే మాధవసేవని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఇతరులపై శతృత్వం పాటించకపోతే ప్రతీరోజూ ఉపవాసం ఉండి దేవతలకు సంతోషం కలిగించినట్లే. ఇతరుల మనసులకు బాధ కలిగేలా మాట్లాడకపోతే వేదపఠనం చేసినట్లే, ఇతరుల సొమ్మును ఆశించకపోతే అన్ని ధర్మాలు తెలుసుకున్నట్లే. వారూ వీరని శతృత్వం పాటించకపోతే తీర్థయాత్రలు చేసినట్లే. ఒకరిపై ఒకరికి తంపులు చెప్పకపోతే గుడులు కట్టించినట్లే. అందుచేత తోటివారిని బాధ పెట్టకపోతే వారికి సేవ చేసినట్లే, భగవంతునికి సేవ చేసినట్లే
భాషాంశాలు
బహుళైచ్ఛిక ప్రశ్నలు
అర్థాలు: గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
1. మాట మంజులముగా ఉండాలి. (ఎ)
ఎ) లలితము
బి) తియ్యన
సి) మధురము
డి) ఆకర్షణీయం
జవాబు:
ఎ) లలితము
2. మిత్రుడు రహస్యాలను కాపాడాలి. (సి)
ఎ) శత్రువు
బి) పరిచితుడు
సి) స్నేహితుడు
డి) అపరిచితుడు
జవాబు:
సి) స్నేహితుడు
3. రోజూ ఒకసారైనా గుడికి వెళ్లాలి. (బి)
ఎ) బడి
బి) దేవాలయం
సి) గ్రంథాలయం
డి) ఉద్యానవనం
జవాబు:
బి) దేవాలయం
4. ఇతరుల సొమ్ము ఆశించకూడదు. (డి)
ఎ) పశువులు
బి) కారు
సి) భవనము
డి) ధనము
జవాబు:
డి) ధనము
5. చాడీలు చెప్పకూడదు. (బి)
ఎ) చెప్పుట
బి) చెప్పుడు మాటలు
సి) మాటలు
డి) కబుర్లు
జవాబు:
బి) చెప్పుడు మాటలు
6. ఒక దివ్య క్షేత్రము చూశాను. (ఎ)
ఎ) శ్రేష్ఠమైన
బి) పవిత్ర
సి) పురాతన
డి) నవీన
జవాబు:
ఎ) శ్రేష్ఠమైన
7. నిత్యము చదువుకోవాలి. (సి)
ఎ) అప్పుడు
బి) ఇప్పుడు
సి) రోజూ
డి) అప్పుడప్పుడు
జవాబు:
సి) రోజూ
8. భగవంతుని నన్ను ప్రోవుము అని ప్రార్ధించాలి. (డి)
ఎ) ధనమియ్యి
బి) శక్తిని
సి) సంపదలీయ్యి
డి) కాపాడు
జవాబు:
డి) కాపాడు
9. వీరులకు సాహసము ఉంటుంది. (సి)
ఎ) వేగం
బి) పౌరుషము
సి) తెగువ
డి) బలం
జవాబు:
సి) తెగువ
10. నా వాళ్లు పరులు అని భావించకూడదు. (బి)
ఎ) వీళ్లు
బి) ఇతరులు
సి) మిత్రులు
డి) బంధువులు
జవాబు:
బి) ఇతరులు
11. పురములలో అమలాపురం అందమైనది. (సి)
ఎ) రాజధాని
బి) కోనసీమ
సి) పట్టణము
డి) గోదావరి
జవాబు:
సి) పట్టణము
12. సమాజ హితము కోరాలి. (ఎ)
ఎ) మేలు
బి) గొప్ప
సి) మనుగడ
డి) ఆస్తి
జవాబు:
ఎ) మేలు
13. సర్వ శాస్త్రాలూ తెలుసుకోవాలి. (డి)
ఎ) గొప్ప
బి) కొన్ని
సి) తెలుగు
డి) అన్ని
జవాబు:
డి) అన్ని
14. దృతిని విడువకూడదు. (సి)
ఎ) ఆస్తి
బి) ధనము
సి) ధైర్యము
డి) మనదేశం
జవాబు:
సి) ధైర్యము
15. అమ్మకు చేరువలో కష్టాలుండవు. (బి)
ఎ) ఇల్లు
బి) సమీపం
సి) జీవిత
డి) జీవనం
జవాబు:
బి) సమీపం
16. జడుడుగా ఉండకూడదు. (ఎ)
ఎ) మందుడు
బి) వివేకి
సి) జ్ఞాని
డి) పిరికివాడు
జవాబు:
ఎ) మందుడు
పర్యాయపదాలు : గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
17. మన మిత్రుడు మన ఆస్తి. (బి)
ఎ) శత్రువు, సఖుడు
బి) సఖుడు, స్నేహితుడు
సి) సఖుడు, సూర్యుడు
డి) సూర్యుడు, రాజు
జవాబు:
బి) సఖుడు, స్నేహితుడు
18. నిత్యము చదువుకోవాలి. (ఎ)
ఎ) సదా, ఎల్లప్పుడు
బి) ఎల్లప్పుడు, రోజూ
సి) రోజూ, రోకలి
డి) కువిశము, అశని
జవాబు:
ఎ) సదా, ఎల్లప్పుడు
19. సూర్యుని రుచిరము ఎక్కువ. (డి)
ఎ) వేడి, కాంతి
బి) కాంతి, ఉష్ణము
సి) దూరము, కిరణము
డి) వెలుగు, ప్రకాశము
జవాబు:
డి) వెలుగు, ప్రకాశము
20. మా కు నమస్కారాలు. (సి)
ఎ) పార్వతి, సరస్వతి
బి) మాకు, నాకు
సి) లక్ష్మీదేవి రమ
డి) ఆమె, ఈమె
జవాబు:
సి) లక్ష్మీదేవి రమ
21. మంచి వర్తస అలవరచుకోవాలి. (ఎ)
ఎ) ప్రవర్తన, నడవడి
బి) చదువు, విద్య
సి) సంస్కారం, గౌరవం
డి) గౌరవం, మర్యాద
జవాబు:
ఎ) ప్రవర్తన, నడవడి
22. ప్రాణుల పట్ల కరుణతో ఉండాలి. (సి)
ఎ) బాధ్యత, హక్కు
బి) రక్షణ, కాపాడడం
సి) దయ, కృప
డి) ప్రేమ, ద్వేషం
జవాబు:
సి) దయ, కృప
23. గురుచరణములను ఆశ్రయించాలి. (ఎ)
ఎ) పాదము, అంఘ్ర
బి) ఇల్లు, గృహము
సి) పట్టణము, నగరము
డి) బడి, పాఠశాల
జవాబు:
ఎ) పాదము, అంఘ్ర
24. మతితో ఆలోచించాలి. (సి)
ఎ) సఖుడు, స్నేహితుడు
బి) సతి, చెలి
సి) మది, బుద్ధి
డి) గురువు, ఉపాధ్యాయుడు
జవాబు:
సి) మది, బుద్ధి
25. మన కరములతో మంచిపనులే చేయాలి. (బి)
ఎ) డబ్బు, ధనము
బి) చేయి, హస్తము
సి) పదవీ, హెూదా
డీ) అధికారం, అవకాశం
జవాబు:
బి) చేయి, హస్తము
26. మన శ్రుతి మంచి మాటలు వినడానికి ఉంది. (డి)
ఎ) కన్ను, నయనము
బి) నోరు, ముఖము
సి) జిహ్వ, నాలుక
డి) చెవి, కర్ణము
జవాబు:
డి) చెవి, కర్ణము
27. వనితను గౌరవించాలి. (ఎ)
ఎ) స్త్రీ, పడతి
బి) తల్లి, మాత
సి) చెల్లి, సోదరి
డి) అక్క అమ్మ
జవాబు:
ఎ) స్త్రీ, పడతి
28. ఈవు మంచిగా ఉండు. (సి)
ఎ) వారు, అతడు
బి) ఇతడు, ఈమె
సి) నీవు, నువ్వు
డి) ఈమె, ఆమె
జవాబు:
సి) నీవు, నువ్వు
29. మా అక్క కనకము వంటిది. (ఎ)
ఎ) బంగారము, పసిడి
బి) వెండి, రజితము
సి) అందము, సొగసు
డి) లలితము, కోమలము
జవాబు:
ఎ) బంగారము, పసిడి
30. లోక రక్షకుడు నారాయణుడు. (బి)
ఎ) హరుడు, శివుడు
బి) హరి, విష్ణువు
సి) బ్రహ్మ, విరించి
డి) నారదుడు, బ్రహ్మర్షి
జవాబు:
బి) హరి, విష్ణువు
31. ఒరులు మన వలన ఇబ్బంది పడకూడదు. (సి)
ఎ) మిత్రులు, సఖులు
బి) బంధువులు, చుట్టాలు
సి) ఇతరులు, పరులు
డి) నా వాళ్లు, నీ వాళ్లు
జవాబు:
సి) ఇతరులు, పరులు
నానార్థాలు : గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
32. మా మిత్రుడు ఉదయమే వస్తాడు. (సి)
ఎ) సూర్యుడు, ఆదిత్యుడు
బి) స్నేహితుడు, సఖుడు
సి) మిత్రుడు, రవి
డి) చంద్రుడు, శని
జవాబు:
సి) మిత్రుడు, రవి
33. అనవసరమైన భూషణము బాగుండదు. (బి)
ఎ) నగ, నట్ర
బి) అలంకరణము, స్తుతి
సి) నగదు, నగ
డి) అలంకారం, అందం
జవాబు:
బి) అలంకరణము, స్తుతి
34. మంచి పలుకు కావాలి. (డి)
ఎ) మాట, వాణి
బి) ముక్క ఖండం
సి) ఖండం, ఖండనం
డి) మాట, ముక్క
జవాబు:
డి) మాట, ముక్క
35. శ్రుతి కాపాడుకోవాలి. (ఎ)
ఎ) వేదము, చెవి
బి) వేదము, మంత్రము
సి) ఆచారం, సంప్రదాయం
డి) సంస్కృతి, తెలుగు
జవాబు:
ఎ) వేదము, చెవి
36. ఏదైనా సాధించడానికి ఓపిక కావాలి. (సి)
ఎ) శక్తి, బలం
బి) ఓర్పు, క్షమ
సి) శక్తి, క్షమ
డి) అవసరం, క్షమ
జవాబు:
సి) శక్తి, క్షమ
37. దివ్యము ఐనది కొనాలి. (బి)
ఎ) శ్రేష్ఠము, మేలు
బి) శ్రేష్టము, లవంగము
సి) కర్పూరము, ఘనసారము
డి) వెల, ధర
జవాబు:
బి) శ్రేష్టము, లవంగము
38. ఇల్లు శుద్ధిగా ఉండాలి. (ఎ)
ఎ) నిర్మలత్వము, కాంతి
బి) వెలుగు, కాంతి
సి) స్వచ్ఛము, నిర్మలము
డి) పెద్దది, విశాలం
జవాబు:
ఎ) నిర్మలత్వము, కాంతి
39. వేదము మానవులకు అవసరం. (డి)
ఎ) చదువు, విద్య
బి) ధర్మం, న్యాయం
సి) పుణ్యం, పాపం
డి) తొలి చదువు, జ్ఞానము
జవాబు:
డి) తొలి చదువు, జ్ఞానము
40. తీర్థమును రక్షించాలి. (బి)
ఎ) నది, స్రవంతి
బి) పుణ్యనది యజ్ఞము
సి) యజ్ఞము, యాగము
డి) జలము, నీరు
జవాబు:
బి) పుణ్యనది యజ్ఞము
41. దృత్తిని విడువకూడదు. (ఎ)
ఎ) ధైర్యము, సంతోషము
బి) సంతోషము, సంతసము
సి) పంతము, పట్టుదల
డి) భూమి, పంతం
జవాబు:
ఎ) ధైర్యము, సంతోషము
42. శీలము మార్చుకోకూడదు. (సి)
ఎ) నడవడి, నడత
బి) చరిత్ర, నక
సి) స్వభావము, మంచీ నడవడి
డి) నీతి, నిజాయితీ
జవాబు:
సి) స్వభావము, మంచీ నడవడి
43. మన చిత్తము దైవం వంటిది. (బి)
ఎ) మనసు, మనస్సు
బి) మనసు, దయ
సి) దయ, కృప
డి) గుండె, గుండెకాయ
జవాబు:
బి) మనసు, దయ
44. హరి సతి మా (డి)
ఎ) లక్ష్మి, రమ
బి) పార్వతి, సరస్వతి
సి) నాది నీది
డి) లక్ష్మీదేవి, మిక్కిలి
జవాబు:
బి) పార్వతి, సరస్వతి
45. చందనము వాడితే మంచిది. (ఎ)
ఎ) గంధము, కుంకుమ పువ్వు
బి) పసుపు, పసుపు కొమ్ము
సి) ఉప్పు, లవణము
డి) గంధము, గంధకము
జవాబు:
ఎ) గంధము, కుంకుమ పువ్వు
46. ఘనసారము ఇట్టే అయిపోతుంది. (సి)
ఎ) ఉప్పు, కర్పూరము
బి) కర్పూరము, గంధము
సి) కర్పూరము, వానాకాలం
డి) వాన, వర్షం
జవాబు:
సి) కర్పూరము, వానాకాలం
47. కుందము పూలు బాగుంటాయి. (డి)
ఎ) మొల్ల, మల్లె
బి) మల్లె, కనకాంబరం
సి) కనకాంబరం, మొల్ల
డి) మొల్ల, గన్నేరు
జవాబు:
డి) మొల్ల, గన్నేరు
48. మా తెలుగు పండితుడు విశారదుడు. (బి)
ఎ) పండితుడు, విద్వాంసుడు
బి) నేర్పరి, విద్వాంసుడు
సి) మేథావి, పండితుడు
డి) గురువు, జ్ఞాని
జవాబు:
బి) నేర్పరి, విద్వాంసుడు
ప్రకృతి – వికృతులు : గీత గీసిన పదానికి ప్రకృతులు / వికృతులు గుర్తించండి.
49. దేవ నన్ను రక్షించు. (డి)
ఎ) దేవి
బి) దేవా
సి) దేవుడ
డి) వర
జవాబు:
డి) వర
50. నిచ్చలు చదవాలి. (ఎ)
ఎ) నిత్యము
బి) నిశితమ
సి) నికరము
డి) నిరసన
జవాబు:
ఎ) నిత్యము
51. శూరుడు వెనుదిరగడు. (సి)
ఎ) శౌర్యుడు
బి) శౌచి
సి) చురకరి
డి) చూరు
జవాబు:
సి) చురకరి
52. నిశ్చలముగా ఉండాలి. (బి)
ఎ) నిశ్చయం
బి) నిచ్చయము
సి) అచలము
డి) ఆచరణ
జవాబు:
బి) నిచ్చయము
53. మంచి గొనము అలవరచుకోవాలి. (ఎ)
ఎ) గుణము
బి) గుణ్యము
సి) గణము
డి) గణితము
జవాబు:
ఎ) గుణము
54. మన బాము కమనం బాధ్యులం కాము. (ఎ)
ఎ) భవము
బి) భవనము
సి) భావం
డి) భజన
జవాబు:
ఎ) భవము
55. చెట్టు కాడ బలమైనది. (సి)
ఎ) ములక్కాడ
బి) తోటకూర కాడ
సి) కాండము
డి) బచ్చలి కాడ
జవాబు:
సి) కాండము
56. కుఠారము పదునైనది. (బి)
ఎ) కత్తి
బి) గొడ్డలి
సి) గుడారము
డి) గుడి
జవాబు:
బి) గొడ్డలి
57. దేశ భక్తి కలిగి ఉండాలి. (ఎ)
ఎ) బత్తి
బి) బకితి
సి) భకితి
డి) బత
జవాబు:
ఎ) బత్తి
58. సత్తెము పలకాలి. (డి)
ఎ) సతియము
బి) సత్తియము
సి) సతి
డి) సత్యము
జవాబు:
డి) సత్యము
59. ధర్మము తప్పకూడదు. (సి)
ఎ) ధరమం
బి) ధర
సి) దమ్మము
డి) ధర్మం
జవాబు:
సి) దమ్మము
60. గడ్డ కూర బాగుంటుంది. (ఎ)
ఎ) కంద
బి) ఉల్లి
సి) రెల్లు
డి) బంగాళాదుంప
జవాబు:
ఎ) కంద
61. మిన్నకు కాంతి ఎక్కువ. (సి)
ఎ) మిన్ను
బి) మన్ను
సి) మణి
డి) మీనా
జవాబు:
సి) మణి
62. బూడిదలో పన్నీరు పోయడం వృథా. (ఎ)
ఎ) వితా
బి) విధము
సి) విధానం
డి) కల్ల
జవాబు:
ఎ) వితా
63. విద్య నేర్చుకోవాలి. (బి)
ఎ) విదియ
బి) విద్దె
సి) విధి
డి) విధియ
జవాబు:
బి) విద్దె
వ్యుత్పత్యర్థములు : గీత గీసిన పదాలకు వ్యుత్పత్త్వర్థాన్ని గుర్తించండి.
64. వంద సంఖ్య గలది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) శతకము
బి) దశకము
సి) నవకము
డి) తారి
జవాబు:
ఎ) శతకము
65. సత్యము పలకాలి. (సి)
ఎ) నిజము
బి) పలికేది
సి) సత్పురుషుల యందు పుట్టినది
డి) జన్మించినది.
జవాబు:
సి) సత్పురుషుల యందు పుట్టినది
66. భూషణము బాగుంది. (బి)
ఎ) నగ
బి) అలంకరించుట
సి) అందగించు
డి) తొడగుట
జవాబు:
బి) అలంకరించుట
67. కనకము ఖరీదైనది. (డి)
ఎ) ఖరీదైన
బి) వెలకలది
సి) అమూల్యం
డి) ప్రకాశించునది
జవాబు:
డి) ప్రకాశించునది
68. స్వర్గము నందు పుట్టినవారు వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) దివిజులు
బి) వేల్పులు
సి) సురలు
డి) దేవతలు
జవాబు:
ఎ) దివిజులు
69. దీనిచేత ధర్మాధర్మములు వినబడును – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) కర్ణము
బి) వీను
సి) స్రవంతి
డి) శ్రుతి
జవాబు:
డి) శ్రుతి
70. చరణమునకు బొప్పి తగిలింది. (సి)
ఎ) పాదము
బి) నడిచేది
సి) దీనిచేత సంచరిస్తారు
డి) తిరుగుతారు
జవాబు:
సి) దీనిచేత సంచరిస్తారు
71. దాశరథి రావణ వైరి. (ఎ)
ఎ) దశరథుని కుమారుడు
బి) రాముడు
సి) రాఘవుడు
డి) రఘు వంశానికి చెందినవాడు
జవాబు:
ఎ) దశరథుని కుమారుడు
72. భూమిని ప్రక్కలించునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) కుందము
బి) నాగలి
సి) గునపము
డి) కుఠారము
జవాబు:
ఎ) కుందము
73. విషయముల చేత హరింపబడునది. వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) మనసు
బి) మనస్సు
సి) గుండె
డి) హృదయము
జవాబు:
డి) హృదయము
74. మతితో ఆలోచించాలి. (సి)
ఎ) ఆలోచించుట
బి) తెలుసుకొనుట
సి) దీనిచేత ఎరుగబడును
డి) తెలుసుకోవాలి
జవాబు:
సి) దీనిచేత ఎరుగబడును
75. కట్టుకొనబడినది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) చేలము
బి) బట్ట
సి) భార్య
డి) పదవి
జవాబు:
ఎ) చేలము
76. శాంతముగా జీవించాలి. (సి)
ఎ) ఓర్పు కలది
బి) క్షమతో నిండినది
సి) శమింపబడినది
డి) ఆవేశము లేనిది
జవాబు:
సి) శమింపబడినది
77. పయోనిధి లోలోతుకు వెళ్లకూడదు. (బి)
ఎ) నీరు కలది
బి) నీటికి నిలయము
సి) నీటి నిచ్చేది
డి) నీటిని తీసుకొనేది
జవాబు:
బి) నీటికి నిలయము
78. వృక్షములను పొందునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) కుఠారము
బి) కొమ్మ
సి) శాఖ
డి) గొడ్డలి
జవాబు:
ఎ) కుఠారము
సంధులు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
79. వాదన మకుంఠితము – సంధిని విడదీసి రాయండి. (డి)
ఎ) వాన్ + తనము కుంఠితము
బి) వాదన + అకుంఠితము
సి) వాదనం + అకుంఠితము
డి) వాదనము + అకుంఠితము
జవాబు:
డి) వాదనము + అకుంఠితము
80. అట + అంచు కలిపి రాయండి. (సి)
ఎ) అటనుచు
బి) అంటుచు
సి) అటంచు
డి) అటని
జవాబు:
సి) అటంచు
81. క్రిందివానిలో ఇత్వసంధి రూపం గుర్తించండి. (బి)
ఎ) అటండ్రు
బి) అనండ్రు
సి) ఏమేమి
డి) ఊరూరు
జవాబు:
బి) అనండ్రు
82. భక్తిన్ + కనుగొని – కలిపి రాయండి. (ఎ)
ఎ) భక్తింగనుగొని
బి) భక్తిం కనుగొని
సి) భక్తిని కనుగొని
డి) భక్తిని గనుగొని
జవాబు:
ఎ) భక్తింగనుగొని
83. అనియెట్లు పలికెను – సంధి పేరు? (డి)
ఎ) అత్వసంధి
బి) త్వసంధి
సి) సంధి
డి) యడాగమం
జవాబు:
డి) యడాగమం
84. మాణిక్యములు వోలె – సంధి పేరు గుర్తించండి. (బి)
ఎ) లులనల సంధి
బి) గసడదవాదేశ సంధి
సి) సరళాదేశ సంధి
డి) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి
85. సతతాచారము – సంధి పేరు గుర్తించండి. (ఎ)
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) లులనల సంధి
డి) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
ఎ) గుణసంధి
86. వినయి + అగు – కలిపి రాయండి. (ఎ)
ఎ) వినయియగు
బి) వినయి అగు
సి) వినయమగు
డి) వనయయాగు
జవాబు:
ఎ) వినయియగు
87. మంజులములు గాని – సంధి పేరు? (సి)
ఎ) లులనల సంధి
బి) సరళాదేశ సంధి
సి) గసడదవాదేశ సంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) గసడదవాదేశ సంధి
88. క్రిందివానిలో అత్వసంధి పదం గుర్తించండి. (ఎ)
ఎ) పెట్టకుండిన
బి) పెట్టలేని
సి) పెట్టుబడి
డి) పెట్టుపోత
జవాబు:
ఎ) పెట్టకుండిన
89. మ్రానుఁగాచినన్ – సంధి పేరు గుర్తించండి. (డి)
ఎ) గసడదవాదేశ సంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) మువర్ణలోప సంధి
డి) సరళాదేశ సంధి
జవాబు:
డి) సరళాదేశ సంధి
90. ఉండి + ఉండినన్ – సంధి కలిసిన రూపం (బి)
ఎ) ఉండకుండినన్
బి) ఉండియుండినన్
సి) ఉండుండినన్
డి) ఉండినుండినన్
జవాబు:
బి) ఉండియుండినన్
91. చరణము + అభివాదనము – సంధి కలిపి రాయండి. (ఎ)
ఎ) చరణాభివాదనము
బి) చరణ్యభివాదనము
సి) చరణ్యాభివాదనము
డి) చరణా అభివాదనము
జవాబు:
ఎ) చరణాభివాదనము
92. వారిందనుపుట – సంధి విడదీసి రాయండి. (సి)
ఎ) వారిని + తనుపుట
బి) వారినిన్ + తనుపుట
సి) వారిన్ + తనుపుట
డి) వారినన్ + తనుపుట
జవాబు:
సి) వారిన్ + తనుపుట
93. దానముఁజేయు – సంధి పేరు (బి)
ఎ) గసడదవాదేశ సంధి
బి) సరళాదేశ సంధి
సి) లులనల సంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
బి) సరళాదేశ సంధి
సమాసాలు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
94. శ్రీరాముడు సద్గుణకాండ – సమాసం పేరు గుర్తించండి. (బి)
ఎ) ప్రథమా తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) సప్తమీ తత్పురుష
డి) పంచమీ తత్పురుష
జవాబు:
బి) షష్ఠీ తత్పురుష
95. క్రిందివానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదం గుర్తించండి. (ఎ)
ఎ) విశాలదేల
బి) మానాథుడు
సి) పరుల మనసు
డి) చెరువు నీరు
జవాబు:
ఎ) విశాలదేల
96. విద్యార్థి విగ్రహవాక్యం గుర్తించండి. (డి)
ఎ) విద్య యొక్క అర్థి
బి) విద్య యందు అర్థి
సి) విద్య చేత అర్థి
డి) విద్యను అర్థించువాడు
జవాబు:
డి) విద్యను అర్థించువాడు
97. కుంఠితము కానిది – సమాస పదం (సి)
ఎ) నాకుంఠితము
బి) కుకుంఠితము
సి) అకుంఠితము
డి) కంఠము
జవాబు:
సి) అకుంఠితము
98. పాపనాశన జలపాతం పుణ్యతీర్థం – విగ్రహవాక్యం (ఎ)
ఎ) పుణ్యమైన తీర్థం
బి) పుణ్యము యొక్క తీర్ధం
సి) తీర్థము యొక్క పుణ్యము
డి) తీర్ధము వలన పుణ్యం
జవాబు:
ఎ) పుణ్యమైన తీర్థం
99. కనకముతో విశాల చేల – సమాస పదం (సి)
ఎ) విశాల కనక చేల
బి) చేల కనక విశాల
సి) కనక విశాల చేల
డి) విశాల చేల కనక
జవాబు:
సి) కనక విశాల చేల
100. సురుచి – సమాసం పేరు (బి)
ఎ) షష్ఠీ తత్పురుష
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) పంచమీ తత్పురుష
డి) ద్వితీయా తత్పురుష
జవాబు:
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
101. విశ్వమునకు హితము – సమాస పదం (డి)
ఎ) హిత విశ్వం
బి) హితమైన విశ్వం
సి) విశ్వం హితం
డి) విశ్వహితం
జవాబు:
డి) విశ్వహితం
102. మీ నివాసం పరమ పవిత్రంగా ముల్లోకాలలో మంచి గృహం – ఈ వాక్యంలోని షష్ఠీ తత్పురుష సమాసపదం గుర్తించండి. (ఎ)
ఎ) మీ నివాసం
బి) పరమపవిత్రం
సి) ముల్లోకాలు
డి) మంచి గృహం
జవాబు:
ఎ) మీ నివాసం
103. సూనృత వాణి – విగ్రహవాక్యం (బి)
ఎ) సూనృతము యొక్క వాణి
బి) సూనృతమైన వాణి
సి) వాణి యొక్క సూనృతము
డి) సూనృతముతో వాణి
జవాబు:
బి) సూనృతమైన వాణి
104. జీవహితము కోరాలి – సమాసం పేరు (ఎ)
ఎ) షష్ఠీ తత్పురుష
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) పంచమీ తత్పురుష
డి) ద్వితీయా తత్పురుష
జవాబు:
ఎ) షష్ఠీ తత్పురుష
105. గంటకాలము కూడా వృథా చేయకు – సమాసం పేరు. (డి)
ఎ) షష్ఠీ తత్పురుష
బి) సప్తమీ తత్పురుష
సి) ద్విగువు
డి) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
డి) విశేషణ పూర్వపద కర్మధారయం
106. ఆభోజ్యము భుజించకూడదు సమాసం పేరు (బి)
ఎ) షష్ఠీ తత్పురుష
బి) నఞ్ తత్పురుష
సి) తృతీయా తత్పురుష
డి) ద్విగువు
జవాబు:
బి) నఞ్ తత్పురుష
107. జననీజనకులు దైవ స్వరూపులు – సమాసం పేరు (సి)
ఎ) షష్ఠీ తత్పురుష
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) ద్వంద్వ సమాసం
డి) నఞ్ తత్పురుష
జవాబు:
సి) ద్వంద్వ సమాసం
108. మధురభాషితము అలవరచుకోవాలి – సమాసం పేరు (ఎ)
ఎ) విశేషణ పూర్వపద కర్మధారయం
బి) షష్ఠీ తత్పురుష
సి) పంచమీ తత్పురుష
డి) సమాస పదం కాదు
జవాబు:
ఎ) విశేషణ పూర్వపద కర్మధారయం
ఛందస్సు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
109. భాషితం గణం గుర్తించండి. (ఎ)
ఎ) భ గణం
బి) ర గణం
సి) య గణం
డి) మ గణం
జవాబు:
ఎ) భ గణం
110. ముహుర్ముః – గణం గుర్తించండి. (సి)
ఎ) భ గణం
బి) ర గణం
సి) య గణం
డి) స గణం
జవాబు:
సి) య గణం
111. రెండు గురువుల మధ్య లఘువు ఉండే గణమేది? (బి)
ఎ) య గణం
బి) ర గణం
సి) త గణం
డి) జ గణం
జవాబు:
బి) ర గణం
112. రెండు గురువులు మాత్రమే ఉండే గణమేది? (డి)
ఎ) గల
బి) హగణం
సి) లగ
డి) గా
జవాబు:
డి) గా
113. ఒక లఘువు, గురువు ఉండే గణమేది? (ఎ)
ఎ) వ గణం
బి) హ గణం
సి) గా
డి) గల
జవాబు:
ఎ) వ గణం
వాక్య రకాలు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
114. నీవు వెళ్ళవచ్చు – వాక్య రకం గుర్తించండి. (ఎ)
ఎ) అనుమత్యర్థకం
బి) విద్యర్థకం
సి) నిషేధార్ధకం
డి) సంశ్లిష్టం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం
115. నీవు వెళ్లి కూర్చో – వాక్య రకం గుర్తించండి. (సి)
ఎ) సంయుక్తం
బి) ప్రార్థనార్థకం
సి) సంశ్లిష్టం
డి) విధ్యర్థకం
జవాబు:
సి) సంశ్లిష్టం
116. నీవు అతను ఆమె చదువుకోండి – వాక్య రకం గుర్తించండి. (బి)
ఎ) సందేహార్ధకం
బి) సంయుక్తం
సి) సంశ్లిష్టం
డి) ప్రార్ధనార్థకం
జవాబు:
బి) సంయుక్తం
117. దయచేసి చదువుపై శ్రద్ధ పెట్టండి – వాక్య రకం గుర్తించండి. (డి)
ఎ) అనుమత్యర్థకం
బి) విధ్యర్థకం
సి) సందేహార్థకం
డి) ప్రార్ధనార్థకం
జవాబు:
డి) ప్రార్ధనార్థకం
118. చదువుతావా? – వాక్య రకం గుర్తించండి. (ఎ)
ఎ) ప్రశ్నార్థకం
బి) సందేహార్థకం
సి) విధ్యర్థకం
డి) ప్రార్థనార్థకం
జవాబు:
ఎ) ప్రశ్నార్థకం
Previous Bits
1. కాలం కనకం కంటే విలువైనది. అర్ధం గుర్తించండి. (డి)
ఎ) ముత్య
బి) వర్షం
సి) కంచు
డి) బంగారం
జవాబు:
డి) బంగారం
2. క్రింది వాక్యములో గీతగీసిన పదమునకు అర్ధమును గుర్తించండి.
కంచెర్ల గోపన్న దాశరథి శతక పద్యాలు రచించాడు. (డి)
ఎ) నిరంతర పద్యాలు
బి) పదహారు వేల పద్యాలు
సి) వెయ్యికి పైగా పద్యాలు
డి) వందకు పైగా పద్యాలు
జవాబు:
డి) వందకు పైగా పద్యాలు
3. జనం మంచి కార్యం చేయాలి. పర్యాయపదాలు (డి)
ఎ) చెరువు, కొలను
బి) దినము, రోజు
సి) పూలు, పండ్లు
డి) కృత్యము, పని
జవాబు:
డి) కృత్యము, పని
4. సూర్యోదయం చాలా అందంగా కనిపిస్తుంది. విడదీసి రాయండి. (బి)
ఎ) సూర్యో + దయం
బి) సూర్య + ఉదయం
సి) సూర్యో + ఉదయం
డి) సూర్య + దయం
జవాబు:
బి) సూర్య + ఉదయం
5. క్రమశిక్షణ విద్యార్థికి ఉండవలసిన గొప్ప లక్షణం. – సంధి నామం గుర్తించండి. (బి)
ఎ) గుణసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) అత్వ సంధి
డి) ఉత్వ సంధి
జవాబు:
బి) సవర్ణదీర్ఘ సంధి
6. గిరిధర్ – పదానికి గురులఘువులు గుర్తించండి. (ఎ)
ఎ) IIU
బి) IIIU
సి) IIII
డి) UII
జవాబు:
ఎ) IIU
7. సుమతీ శతకకర్త బద్దెన. (బి)
ఎ) ర గణం
బి) స గణం
సి) భ గణం
డి) మ గణ
జవాబు:
బి) స గణం
8. క్రింద వాక్యంలో గీతగీసిన పదమునకు వికృతి పదమును రాయండి.
వేసవిలో మిట్ట మధ్యాహ్నము వేళ సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. (సి)
ఎ) ఆదిత్యుడు
బి) భాస్కరుడు
సి) సూరీడు
డి) భానుడు
జవాబు:
సి) సూరీడు
9. క్రింది పద్యపాదము యొక్క సరైన గణవిభజనను గుర్తించండి. (ఎ)
గని, లయ తాళ సంగతుల గాన కళాపరిపూర్ణ మానస
ఎ) III IUI UII IUI IUI IUI UIU
బి) IUI UUU IUI III UUU III IUI
సి) UUU III UIU IIU UUI III IUI
డి) UUU IUI III UIU IIU UUI IUI
జవాబు:
ఎ) III IUI UII IUI IUI IUI UIU
10. చిత్తశుద్ధి : ఏ పని చేసినా చిత్తశుద్ధితో చెయ్యాలి.
11. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పర్యావరణానికి హితము. (అర్థాన్ని గుర్తించండి) (ఎ)
ఎ) మేలు
బి) అహితము
సి) కీడు
డి) ప్రమాదం
జవాబు:
ఎ) మేలు
12. “నేను రామకార్యంతో నిమగ్నమై ఉన్నాను” అని హనుమంతుడు అన్నాడు. (పర్యాయ పదాలు గుర్తించండి) (ఎ)
ఎ) పని, కతము
బి) కృత్యం, దాస్యము
సి) వ్యాపారం, వ్యవధి
డి) సేవ హితము
జవాబు:
ఎ) పని, కతము
13. నేను సత్యమునే పలుకుచున్నాను. (ఎ)
ఎ) మాట, ఖండము, నింద
బి) బుద్ధి, తలుపు, ఇచ్చ
సి) పుణ్యం, యాగం, న్యాయం
డి) తరువు, చెరువు
జవాబు:
ఎ) మాట, ఖండము, నింద
14. పద్యంలో నాలుగు పాదములు ఉంటాయి. (నానార్థాలు రాయండి)
జవాబు:
చరణం, పద్యపాదం, వేరు, కులం
15. అమ్మ చెప్పిన కత బాగుంది. (ప్రకృతి పదాన్ని గుర్తించండి) (సి)
ఎ) కద
బి) కవిత
సి) కథ
డి) కావ్యం
జవాబు:
సి) కథ
16. చెట్టుకొమ్మ విరిగిపడింది. (సరైన విగ్రహవాక్యం గుర్తించండి.) (ఎ)
ఎ) చెట్టు యొక్క కొమ్మ
బి) చెట్టు కొరకు కొమ్మ
సి) చెట్టు మరియు కొమ్మ
డి) చెట్టు వలన కొమ్మ
జవాబు:
ఎ) చెట్టు యొక్క కొమ్మ
17. క్రింది వానిలో ‘స’ గణానికి సంబంధించిన పదాన్ని గుర్తించండి. (డి)
ఎ) శూరులు
బి) భాస్కరా
సి) సౌందర్యం
డి) సుమతీ
జవాబు:
డి) సుమతీ
18. కాలం చాలా విలువైంది. గీత గీసిన పదానికి నానార్ధం గుర్తించండి. (బి)
ఎ) సమయం, యుగం
బి) సమయం, నలుపు
సి) సమయం, సంపద
డి) ధనం, విద్య
జవాబు:
బి) సమయం, నలుపు
19. ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్మీనార్ను చూశాం. గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్ధం గుర్తించండి. (సి)
ఎ) పెద్ద పట్టణం.
బి) దైవం వెలసిన ప్రదేశం.
సి) ఉదకమును ధరించునది.
డి) కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది.
జవాబు:
సి) ఉదకమును ధరించునది.
20. కింది పద్య పాదమునకు సరైన గణవిభజనను గుర్తించండి. (ఎ)
జనిత పరాక్రమ క్రమ విశారద ! శారద కంద కుంద చం
ఎ) III IUI UII IUI IUI IUI UIU
సి) III III UII IUI IUI III UIU
బి) III IUI UI III IUI III UIU
డి) HI IUI UII III IUI IUI UII
జవాబు:
ఎ) III IUI UII IUI IUI IUI UIU