Access to the AP 8th Class Telugu Guide 2nd Lesson మాతృభూమి Questions and Answers are aligned with the curriculum standards.
మాతృభూమి AP 8th Class Telugu 2nd Lesson Questions and Answers
చదవండి – ఆలోచించి చెప్పండి
వసుధ : తాతయ్యా ! పొద్దున్నే ఎక్కడికి వెళుతున్నావు ?
తాతయ్య : ఈ రోజు జనవరి 15 జాతీయ సైనికుల దినోత్సవం కదా ! ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా !
వసుధ : తాతయ్యా ! ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ?
తాతయ్య : మన దేశాన్ని, ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేశారు. వారిని స్మరించుకోవడానికి, అభినందించడానికి, సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారమ్మా.
వసుధ : సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాతా ?
తాతయ్య : కన్న తల్లి, ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. సైనికులు మాతృభూమి కోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడరు. మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి.
వసుధ : అయితే తాతయ్య ! నేను కూడా వస్తాను. వెళ్తాం పదండి.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది ?
జవాబు:
పై సంభాషణ తాతగారు, ఆయన మనుమరాలు వసుధకు మధ్య జరిగింది.
ప్రశ్న 2.
జాతీయ సైనికుల దినోత్సవం ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు ?
జవాబు:
ప్రతి ఏటా జనవరి 15న సైనికుల జాతీయ దినోత్సవం జరుపుకొంటారు. సైనికుల త్యాగాలను, సేవలను గుర్తు చేసుకోవడానికి సైనికుల దినోత్సవం జరుపుకొంటారు.
ప్రశ్న 3.
మనం సైనికులు చూపిన బాటలో నడవాలి అంటారు. ఎందుకు ?
జవాబు:
ఊరిని, కన్నవారిని విడిచి దేశ రక్షణకు వెళ్లే సైనికుల నుండి స్ఫూర్తిని పొందడానికి వారి బాటలో నడవాలి.
ఇవి చేయండి
అవగాహన – ప్రతిస్పందన
అ) క్రింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
ప్రశ్న 1.
పాఠంలో మీకు నచ్చిన సన్నివేశం గురించి మాట్లాడండి.
జవాబు:
పాఠంలో నాకు వీర సైన్యంలో చేరితే మంచి జీతం ఇస్తారని, దేశ సేవ చేయవచ్చని అన్న సన్నివేశం బాగా నచ్చింది. వాళ్ళమ్మ గారి కళ్లలో సంతోషం, వాళ్ల నాన్నగారు మీసం మెలివేయడం ఇవి చదువుతుంటే ఆ దృశ్యం కళ్ల ముందు కనిపించి, చాలా ఆనందం కలిగింది.
ప్రశ్న 2.
పాఠంలో పాత్రల స్వభావాన్ని గురించి చెప్పండి.
జవాబు:
పాఠంలో సుధీర్ తల్లిదండ్రుల మాటను కాదనలేని స్వభావం కలవాడు. రాజారావు తన కుటుంబంపైన ఎక్కువ ప్రేమ కలవాడు. పద్మజకు కొడుకంటే చాలా ఇష్టం. సైన్యంలో ఉద్యోగమంటే భయం. రోశయ్య పౌరుషవంతుడు. చంద్రమ్మ కొడుకు మాట కాదనలేదు. వీర ధైర్య సాహసాలు, కుటుంబం, దేశం పట్ల ప్రేమ కలవాడు.
ప్రశ్న 3.
పాఠం చదవండి. కింది మాటలు ఎవరు ? ఎవరితో ? ఎందుకన్నారో రాయండి.
1. ఆ తల్లి కన్న బిడ్డ రాష్ట్రానికి మణిపూస.
జవాబు: వీర సంస్మరణ సభలో వీరనుద్దేశించి పద్మజ మాట్లాడిన వాక్యమిది.
2. చదువుకున్న యువకులు చైతన్యంతో దేశం కోసం పాటుపడాలి.
జవాబు:
సైన్యంలో వీర చేరతానన్న సందర్భంలో రోశయ్య తన భార్య చంద్రమ్మతో పలికిన మాటలివి.
ఆ) కింది పద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
దేశము మట్టిగాదనుచు దేశమటన్న మనుష్యులన్న సం
దేశమునిచ్చిపోయిన మనీషి ! మహాశయుఁడప్పరాయునా
దేశము త్యాగ మూర్తుల పవిత్ర మహాశయముల్ ఫలించుచో
దేశము మట్టిగానపుడు దేశమనంగ మనుష్యులే సుమీ ! – ఎస్.టి. జ్ఞానానంద కవి
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
పద్యంలో ఎటువంటి సందేశం ఉంది ?
జవాబు:
దేశమంటే మట్టి కాదనీ, మనుషులనీ మనీషి (గురజాడ అప్పారావుగారు) సందేశమిచ్చారు.
ప్రశ్న 2.
త్యాగమూర్తుల ఆశయమేమిటి ?
జవాబు:
దేశమంటే మనుషులనీ త్యాగమూర్తుల మహాశయం.
ప్రశ్న 3.
దేశమనగానేమి ?
జవాబు:
దేశమనగా సరిహద్దులు గల భూభాగం. అందులోని మనుషులు, జంతువులు, మొక్కలు మొదలైనవన్నీ.
ప్రశ్న 4.
ఈ పద్యం రాసిన కవి ఎవరు ?
జవాబు:
ఈ పద్యమును ఎస్.టి. జ్ఞానానంద కవి గారు రచించారు.
ఇ) కింది పేరా చదవండి నాలుగు ప్రశ్నలు తయారు చేయండి.
భారతదేశ సైన్యాధికారిగా, భారత సాయుధ దళాల మొదటి “చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్”గా పనిచేసిన సైనిక వీరుడు బిపిన్ రావత్. ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్. ఇతను 1958 మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి జిల్లాలో జన్మించారు. రావత్ భార్య మధులిక రావత్. ఈయన సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాల, కటక్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువు పూర్తి చేశారు. సైన్యంలో ప్రవేశించిన రావత్ సెకండ్ లెఫ్టినెంట్ హెూదా నుంచి జనరల్ (సిడిఎస్) హెూదా వరకు ఎదిగారు.
సైన్యాధిపతి హెూదాలో పనిచేస్తున్నప్పుడు దేశ రక్షణ కోసం అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలను ప్రవేశపెట్టారు. ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధసేవా పతకం మొదలైన వాటితోపాటు 2021 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. రావత్ 2021వ సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
జవాబు:
1. బిపిన్ రావత్ ఎవరు ?
2. రావత్ ఏ రాష్ట్రంలో జన్మించారు?
3. రావత్కు ఇప్పుడు వయసెంత ఉండి ఉండవచ్చు ?
4. రావత్కు వచ్చిన బిరుదేమిటి?
ఈ) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘మాతృభూమి’ పాఠ్యభాగ రచయిత్రి గురించి రాయండి.
జవాబు:
‘మాతృభూమి’ పాఠ్యభాగ రచయిత్రి శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు (1933 నుండి 2015). ఈమె ప్రకాశం జిల్లా ఒంగోలులో విప్పగుంట వేంకట నరసింహారావు, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. అనాథ, ఎదలో ముల్లు, వంటి కథా సంపుటాలు, శలభాలు, ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు వంటి నవలలు రాశారు. చదివినది పదో తరగతే అయినా పద్మావతి గారు చేయి తిరిగిన రచయిత్రి.
ప్రశ్న 2.
కథానిక ప్రక్రియ లక్షణాలను గురించి రాయండి.
జవాబు:
కథ, కథానిక అనేవి పర్యాయపదాలుగా వాడుతున్నాం కాని, కథ కంటే కథానిక చిన్నది. ఒక వ్యక్తి లేదా వ్యవస్థలో జరిగిన చిన్న సంఘటనను తీసుకొని, ఉత్కంఠభరితంగా వర్ణిస్తూ చెప్పేది కథానిక. క్లుప్తత దీని లక్ష్యం. పాత్రలు, నేపథ్యం, కథనం, వాస్తవిక చిత్రణ కథానికా ప్రక్రియలో ముఖ్య భాగాలు. ఉత్కంఠను రేపే ప్రారంభం, కొనసాగింపు, కొసమెరుపు కథానికకు అందాన్నిస్తాయి. ముగింపు పాఠకుల ఊహకు అందనంత వైవిధ్యంగా ఉండాలి.
ప్రశ్న 3.
‘వీర’ తన తల్లితో సైన్యంలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఏం చెప్పాడో రాయండి.
జవాబు:
సైన్యంలో చేరడం వలన మంచి జీతం ఇస్తారన్నాడు. ఆ విషయం సైన్యాధికారి చెప్పారన్నాడు. ఇంటికి డబ్బు పంపుతాను అన్నాడు. ఇంటిల్లపాదీ తినవచ్చన్నాడు. నాన్నగారికి ఆసరాగా ఉంటుందన్నాడు. దేశసేవ చేయవచ్చన్నాడు.
ప్రశ్న4.
పద్మజ సభలో ‘వీర’ గురించి మాట్లాడిన విషయాలను గురించి రాయండి.
జవాబు:
వీర అనబడే వీరారావు తమ గడ్డమీద పుట్టాడన్నది అతను జిల్లాకే కాదు రాష్ట్రానికే మణిపూస అన్నది. దేశ రక్షణలో అమరుడవుతాడని ఎప్పుడూ అనుకోలేదన్నది. అతని మరణం తనను కలచివేసిందన్నది. అతని తల్లి ఎలా భరిస్తుందో! అన్నది.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) క్రింది ప్రశ్నలకు 4 వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సుధీర్ సైన్యంలో చేరకపోవడానికి కారణమేమిటి ?
జవాబు:
సుధీర్ అంటే అతని తల్లిదండ్రులకు చాలా ప్రేమ. వాళ్ళకు వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. సైన్యంలో చేరితే యుద్ధాలలో మరణిస్తాడేమోనని ఆతని తల్లిదండ్రులకు భయం. అందుకే సైన్యంలో చేరవద్దని అనేక విధాల చెప్పారు. సుధీర్ కూడా తల్లిదండ్రుల మాటను కాదనలేకపోయాడు. అందుకే అతను సైన్యంలో చేరలేదు.
ప్రశ్న 2.
రాజారావు – రోశయ్యలలో ఎవరి వ్యక్తిత్వం గొప్పది ? ఎందుకు ?
జవాబు:
రాజారావు – రోశయ్యలిద్దరివీ విభిన్నమైన వ్యక్తిత్వాలు. తన కొడుకు తన దగ్గరే ఉండాలి. ఏ బాధలు లేకుండా హాయిగా ఉండాలి అనేది రాజారావు వ్యక్తిత్వం. తన కొడుకు దేశ సేవ చేయాలి. ప్రమాదాలను కూడా ఆనందంగా స్వీకరించగల ఉన్నత వ్యక్తిత్వం రోశయ్యది. ఇద్దరినీ పోల్చి చూస్తే రోశయ్యదే గొప్ప వ్యక్తిత్వం.
ప్రశ్న 3.
యుద్ధాల వల్ల లాభమా ? నష్టమా ? కారణాలను రాయండి.
జవాబు:
యుద్ధాల వలన ఎప్పుడూ నష్టమే. ఎందుకంటే యుద్ధాల వలన ఎంతోమంది మరణిస్తారు, గాయపడతారు. వారిని కోల్పోయిన బంధువులు, మిత్రులు చాలా బాధపడతారు, కొన్ని కోట్ల ఖరీదైన భవనాలు, కర్మాగారాలు, ఆస్తులు నష్టపోతారు. అన్నిటికీ కొరత ఏర్పడుతుంది. ఒక యుద్ధం జరిగిందంటే రెండు-మూడు తరాల వరకు శాంతి ఉండదు.
ఆ) కింది ప్రశ్నలకు 8 వాక్యాలలో సమాధానాలను రాయండి.
ప్రశ్న 1.
‘వీర’ కుటుంబానికి, దేశానికి చేసిన సేవలను గురించి రాయండి.
జవాబు:
వీర తన కుటుంబానికీ, దేశానికీ ఎనలేని సేవ చేశాడు. వీర ఇంటికి వచ్చిన ప్రతిసారీ తమ్ముళ్లకు, చెల్లెళ్లకు మంచి బట్టలు, స్వెట్టర్లు, వాచీలు తెచ్చేవాడు. తల్లిదండ్రులకు బట్టలు, రగ్గులు తెచ్చేవాడు. అతను పంపిన డబ్బుతోనే వాళ్లు ఇల్లు కట్టుకొన్నారు. వాళ్లకు అన్ని సౌకర్యాలు అమర్చాడు.
ఇంటికి వచ్చిన మూడు రోజులకే టెలిగ్రామ్ వచ్చింది. యుద్ధరంగంలోకి వెళ్లిపోయాడు. అమరుడయ్యాడు. దేశ సేవలో ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించాడు. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఎందరి పొగడ్తలతో అందుకొన్నాడు.
ప్రశ్న 2.
సుధీర్, పద్మజ లేదా వీర, చంద్రమ్మల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
సుధీర్ : అమ్మా ! నేను సైన్యంలో ఉద్యోగంలో చేరతాను.
పద్మజ : వద్దురా ! కన్నా !
సుధీర్ : ఎందుకు ? అందరూ చేరుతున్నారు కదా !
పద్మజ : నువ్వు తట్టుకోలేవురా !
సుధీర్ : తాడిచెట్టులా ఎదిగాను, కండలు పెంచాను, చక్కగా తట్టుకొంటాను.
పద్మ : యుద్ధాలు వస్తే ప్రమాదం కదరా !
సుధీర్ : పుట్టినవాడు తప్పక మరణిస్తాడు. దేశ సేవలో మరణిస్తాను.
పద్మజ : అలాంటి చెడుమాటలు మాట్లాడకు. నేను తట్టుకోలేను. (ఏడుస్తూ వెళ్లిపోతుంది) (లేదా)
వీర : అమ్మా ! రేపు నేను సైన్యంలో చేరుతున్నాను.
చంద్రమ్మ : ఎందుకురా ?
వీర : మంచి జీతం ఇస్తారు. మన కష్టాలన్నీ పోతాయి.
చంద్రమ్మ : నిజమే ! అయితే చేరిపో! కానీ,
వీర : ఏంటమ్మా ?
చంద్రమ్మ : అది కాదురా ! యుద్ధాలు వస్తే !
వీర : వస్తే రానీ, యుద్ధం చేస్తాం.
చంద్రమ్మ : ప్రాణాలకి ప్రమాదమేమో !
వీర : అమ్మా ! ఎక్కడున్నా చావు తప్పదు. దేశ సేవలో మరణిస్తే ఆనందమే కదా !
చంద్రమ్మ : అయితే మరి జాగ్రత్తరా !
ప్రశ్న 3.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గురించి ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారిలో మొదటగా స్మరించవలసిన భగత్సింగ్ అప్పటి నుండి బి. పి. రావత్ వరకు ఎంతో మంది దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అమరులయ్యారు. దేశ రక్షణ అనేది ఒక మహాయజ్ఞం. దానిలో అమరులు కావాలంటే ఎంతో ధైర్యసాహసాలుండాలి.
వారంతా ప్రశంసనీయులు. వారిని పొగడడానికి వేయి నోరులున్న ఆదిశేషువుకు కూడా శక్తి సరిపోదు. వారి పేర్లు చిరస్థాయిగా ఉండేలా వారు జన్మించిన గ్రామాలకు, లేదా వీధులకు వారి పేర్లు పెట్టాలి. దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారి శిలావిగ్రహాలు వారి పేరున్న వీధిలో పెట్టాలి. ఎన్ని చేసినా వారి త్యాగాల కంటే తక్కువే అవుతాయి.
భాషాంశాలు- పదజాలం
అ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాల అర్థాన్ని రాయండి. ఆ పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి, రాయండి.
1. కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు.
జవాబు:
అమరులయ్యారు = స్వర్గస్తులయ్యారు (మరణించారు)
సొంత వాక్యం : ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహారదీక్ష చేస్తూ పొట్టి శ్రీరాములు గారు స్వర్గస్తులయ్యారు.
2. తల్లిదండ్రుల వాత్సల్యం గొప్పది.
జవాబు:
వాత్సల్యం = ఆప్యాయత
సొంత వాక్యం : శిష్యులపై సద్గురువులు ఆప్యాయత చూపుతారు.
3. సెలవులు పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్న ‘వీర’కి మిత్రులు వీడ్కోలు పలికారు.
జవాబు:
వీడ్కోలు = విడుదల, విడుచుట
సొంత వాక్యం : పదవీ విరమణ పొందిన మా మాస్టారుకి సన్మానం చేసి వీడ్కోలు పలికాము.
4. పదేళ్ళు గిర్రున తిరిగాయి.
జవాబు:
గిర్రున = గుండ్రంగా
సొంత వాక్యం : కొంతమంది గుండ్రంగా తిరుగుతారు.
ఆ) కింది గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.
1. తల్లిదండ్రులను గౌరవించాలి.
జవాబు: తల్లి = జనని, మొదటిది
2. ఒక ఆశ తీరగానే మరొక ఆశ పుడుతుంది.
జవాబు: ఆశ = కోరిక, దిక్కు
3. కరోనా సమయంలో ప్రజలు చావు అంచులకు వెళ్ళొచ్చారు.
జవాబు: సమయం = కాలము, ప్రతిజ్ఞ
4. ‘వీర’ పేరు మారుమోగింది.
జవాబు: పేరు = నామము, కీర్తి
ఇ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలను రాయండి.
1. జీతంతో కూడిన సెలవును మంజూరు చేశారు.
జవాబు: జీతం = వేతనం, భృతి
2. దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు.
జవాబు: దేశం = జనాంతము, నాడు
3. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరు మరణించారు.
జవాబు: యుద్ధం = రణము, పోరు
4. దశరథుని కుమారులు రామలక్ష్మణులు.
జవాబు: కుమారులు = కొడుకులు, పుత్రులు
ఈ) కింది పదాలకు ప్రకృతి పదాలు రాయండి.
1. నిదుర 2. పత్తనం 3. అమ్మ 4. కొమరుడు
ప్రకృతి – వికృతి
1. నిద్ర — నిదుర
2. వృద్ధతా — పత్తనం
3. అంబ — అమ్మ
4. కుమారుడు — కొమరుడు
భాషా క్రీడ
అ) కింది పదాలలో రెండు పదాలున్నాయి. వీటిలో ఒక పదానికి అర్థం ఇవ్వబడింది. పాఠం చదివి, ఇచ్చిన ఆ అర్థం ఆధారంగా రెండవ,పదాన్ని గుర్తించి, రెండు పదాలు కలిపి రాయండి.
జవాబు:
1. కొన (వ్యవసాయం) = కొనసాగు
2. మణి (వెన్నులో ఉంటుంది) = మణిపూస
3. తల్లి (నాన్నలు) = తల్లిదండ్రులు
4. వ్యాపార (తెలిసినవాడు) = వ్యాపారవేత్త
5. తొలగి (వెళ్తుంది) = తొలిగిపోతుంది
వ్యాకరణాంశాలు
అ) కింద గీత గీసిన సంధి పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
ఉదా : పల్లెకు, పట్టణానికి మధ్యస్థంగా ఉన్న గ్రామమది.
జవాబు:
గ్రామము + అది = ఉత్త్వ సంధి
1. వారికి సమాజాభివృద్ధి కాంక్ష లేదు.
జవాబు:
సమాజ + అభివృద్ధి = సవర్ణదీర్ఘ సంధి
2. అతడు అమరుడవుతాడని మనమెవ్వరు ఊహించలేదు.
జవాబు:
మనము + ఎవ్వరు = ఉత్వ సంధి
3. ఆయన నన్ను క్షమించండని సభాముఖంగా కోరాడు.
జవాబు:
క్షమించండి + అని = ఇత్వ సంధి
4. ఏమిటమ్మా పలకవు.
జవాబు:
ఏమిటి + అమ్మా = ఇత్వ సంధి
ఆ) కింది సమాస పదాలను పరిశీలించండి.
గొప్ప పుస్తకం – గొప్పదైన పుస్తకం
ఎర్ర కలువ – ఎర్రదైన కలువ
తెల్ల పావురం – తెల్లమైన పావురం
పై ఉదాహరణలలో గొప్ప, ఎర్ర, తెల్ల అనేవి విశేషణాలు. పుస్తకం, కలువ, పావురం అన్నవి నామవాచకాలు. ఈ విధంగా నామవాచక, విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం ‘కర్మధారయ సమాసం’.
ఇ) కింది వాక్యాలలోని కర్మధారయ సమాసాలను గుర్తించి నామవాచకం, విశేషణాలను రాయండి.
1. విద్య మనకు ఉన్నత వ్యక్తిత్వాన్ని ఇస్తుంది.
జవాబు:
ఉన్నత (వి) వ్యక్తిత్వం (నా)
2. ఒక్క చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం.
జవాబు:
చిరు (వి) నవ్వు (నా)
3. వివేకానందుడు ఆదర్శభావాలు గల వ్యక్తి.
జవాబు:
ఆదర్శ (వి) భావాలు (నా)
4. దానమివ్వాలంటే దానగుణము ఉండాలి.
జవాబు:
దానం (నా) గుణం (వి)
ఉపమాలంకారం :
కింది వాక్యాన్ని పరిశీలించండి.
జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది.
పై వాక్యంలో జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. ఇక్కడ జ్ఞానం పోల్చబడే వస్తువు. కనుక జ్ఞానం “ఉపమేయం” అవుతుంది. పోలికకు తెచ్చుకున్నది దీపం కనుక దీపం ‘ఉపమానం’ అవుతుంది.
ఉపమేయం — పోల్చబడేది
ఉపమానం — పోలికకు తెచ్చుకున్నది
కింది వాక్యాల్లోని ఉపమేయ, ఉపమానాలను గుర్తించి, రాయండి.
ప్రశ్న 1.
చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి.
జవాబు:
ఉపమేయం = చినుకులు, ఉపమానం = ముత్యాలు
ప్రశ్న 2.
నీ మాటలు అమృతం వలే సంతోషాన్నిస్తున్నాయి.
జవాబు:
ఉపమేయం = మాటలు,
ఉపమానం = అమృతం
పోల్చబడేది ఉపమేయమని, పోలికకు తెచ్చుకున్నది ఉపమానం అని తెలుసుకున్నారు !
కింది వాక్యాన్ని పరిశీలించండి.
ఉదా : ఆమె ఆలోచనలు ఎదలో ముల్లు వలె కదలాడాయి..
ఉపమేయం = ఆలోచనలు (పోల్చబడే పదం)
ఉపమానం = ముల్లు (పోలిక కొరకు ఉన్న పదం)
ఉపమావాచకం = వలె (ఉపమేయ, ఉపమానాల అనుసంధాన కర్త)
సమాన ధర్మం = కదలాడాయి (ఉపమేయ, ఉపమానాలలో ఉండే సమాన ధర్మం)
పై ఉదాహరణలో ఉపమేయమైన ఆలోచనలను, ఉపమానమైన ముల్లుతో పోల్చి చెప్పడం జరిగింది. వలె అను ఉపమావాచకం ఉపమేయానికి, ఉపమానానికి అనుసంధాన కర్తగా ఉంది. ఉపమేయ ఉపమానాలలో కదలాడడం అనే సమాన ధర్మం ఉంది. ఈ విధంగా ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యమును (పోలికను) చెప్పినట్లైతే ఉపమాలంకారం అవుతుంది.
ప్రాజెక్టు పని
ప్రశ్న1.
దేశం కోసం త్యాగం చేసిన సైనికుల వివరాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
- ముస్తాక్ : పార్నెపల్లి గ్రామం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా, సియాచిన్ మంచు చరియల్లో చిక్కుకుపోయి చనిపోయిన వీర జవాన్ ముస్తాక్ అహ్మద్.
- ప్రవీణ్ కుమార్ రెడ్డి : రెడ్డివారి పల్లె, చిత్తూరు జిల్లా, జమ్ము కాశ్మీరు చొరబాటుదారుల దాడిలో మరణించిన వీర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి.
పాఠాంత పద్యం
ప్రాణిలోకంబు సంసారపతిత యగుట
వసుధ పై గిట్టి పుట్టనివాడు గలఁ డె
వాని జన్మంబు సఫల మెవ్వాని వలన
వంశమధికోన్నతి వహించి వన్నె కెక్కు — ఏనుగు లక్ష్మణకవి
తాత్పర్యం : ప్రాణులన్నీ సంసార బంధనాలలో చిక్కుకొని ఉంటాయి. భూమి మీద పుట్టి చనిపోని వాడుండడు. ఎవని వలన వంశము మిక్కిలి గొప్పదనమును పొంది ప్రసిద్ధికెక్కునో వారి జన్మ సార్థకమవుతుంది.
సూక్తి- తీసుకోవడం కాడు ఇవ్వడం నేర్చుకో. పెత్తనం కాదు సేవ అలవరచుకో – రామకృష్ణ పరమహంస
ఈ పాఠంలో నేర్చుకున్నవి :
1. నాకు నచ్చిన అంశం : ‘వీర’ వ్యక్తిత్వం, రోశయ్య. చంద్రమ్మల మంచి మనసు
2. నేను గ్రహించిన వలువ : ప్రతి వ్యక్తికి దేశభక్తి ఉండాలి.
3. సృజనాత్మక రచన : “గోడ మీడ పెలిగిపోతున్న ‘వీర’ ఫోటోను చూస్తూ నిద్రలోకి జారుకున్నది. ఈ వాక్లంలో మొదటి భాగం రచయిత్తి గొప్ప ఆలోచన రచన చేసినట్లు అనిపించింది.
4. భాషాంశాలు : “దిగాలు పడిన చంద్రమ్మకు వీర ధైర్యం చెప్పాడు. తండ్రికి కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు.” ఈ ఏ్రయోగాలు బాగున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ఇవి ఉపకరిస్తాయి.
మేటి పద్యాల
పరమదయాకర శఖకర
నరవరనుత గరుడగమన నగధరపరమ
మురహర భవహర మాధవ
ధరధరనుత ధవళనయన దశరఫతనయా॥
అమృత నిష్యంది పల్లకీ హ్లాదమునకు
రాగిణీ దివ్య సమ్మోద రాగమునకు
తేనె తేటల నవకంపు సోనలకును
సాటియగును మా తెలుగు భాషామతల్లి
అందముల చిందు తీరు తీయములు గల్గి
ముద్దు గులికెడు నుడికారములును గల్గి
లలిత జాతీయములు గల్గి యలరుచుండు
తేట తేనియ యూట మా తెనుగు మాట
తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు
వ్యాకరణం పై అదనపు సమాచారం
తల = శిరస్సు, మస్తకము
దగ్గర = సమీపము, చేరువ
నింపాదిగా = మెల్లగా, నెమ్మదిగా
అమ్మ = తల్లి, జనని
సైన్యము = సేన, దండు
చెయ్యి = హస్తము, కరము
క్షణు = లుప్త, సెకను
మతి = బుద్ధి, మది
కొడుకు = కుమారుడు, పుతుడు
ఆస్తి = కూడబెట్టిన డబ్బు, దాచిపెట్టిన ధనం
ఆశ్చర్యము = విస్మయము, అచ్చెరువు
ప్రజలు = జనము, జనులు
మహిళ = ఇంతి, వనిత
ఉత్తేజము = ఉత్సాహు, హుషారు
కోపం = ఆగ్రహం, కినుక
చిరు = చిన్న, అల్పము
నవ్వు = హాసము, దరహాసు
తమాషా = వేడుక, వినోదము
తాడిచెట్టు = తాళ్ళ వృక్షము
దృఢము = గట్టనతము, దార్ష్యము
పట్టుదల = పట్టింపు, పట్టు
కన్నీళ్ళు = అశువులు, కన్నీరు
బిడ్డ = శిశువు, సంతతి
వంట = పాకము, వండడము
వంట గది = పాకశాల, రసవతి
పాడు బుద్ధి = చెడుబుద్ధి, దుర్మతి
వ్యాపారం = వర్తకము, పణ్యము
సంబరము = ఆందము, సంతోషము
గర్జన = పెద్ద అరుపు, పొలి కేక
ఇష్టం = ప్రితి, మక్కువ
ఉద్దేశం = అభి(ప్రాయము, ఉద్దేశ్యము
నసుగుడు = సణుగుడు, గొణుగుడు
చావు = మరణము, స్వర్గస్తుడగుట
నాన్న = తండ్రి, జనకుడు
రుపు = రేపకడ, ఎల్లి
అవకాశం = అభిప్రాయము, ఉద్దేశ్యము
సమాజము = సంఘము, సమూహము
కాంక్ష = కోరిక, ఈప్సితము
మనిషి = మానవుడు, నరుడు
ట్రతుకు = జీవితము, మనుగడ
వాత్సల్యము = ఆప్యాయత, అనురాగము
ఊరు = పల్లెటూరు, గ్రామము
సంతానము = సంతతి, పిల్లలు
జీతము = వేతనము, భృతి
కళ్లు = నయనములు, నేత్రములు
వెలుగు = కాంతి, ప్రకాశము
నిజము = సత్యము, యథార్థము
అధికారి = పాలకుడు, పరిపాలకుడు
ఆసరా = ఆశ్రశయము, అండ
చీకటి = తమము, తిమిరము
ఫర్త = పతి, మగడు
గుండె = హృదయము, ఎద
ముల్లు = కంటకము, కొర్రు
పేమ = అనురాగం, రాగం
పస్తులు = ఉపవాసం,లంకణము
మేలు = మంచిది, బాగు
భయము = భీతి, పిరికితనం
మీసము = మీస, శ్ముశువు
గర్వం = మదము, బింకము
ధైర్యం = ధీరత్వము, నిర్భయము
అచ్చరము = అక్షరము, అక్కరము
లచ్చ = లక్ష, వంద వేలు
పాటుపడడం కష్టపడడం, శరమించడం
మెచ్చు = మపప్పు, పొగడ
దుఃఖం = బాధ, ఎడ్పు
మంకు పట్టు = మొండిపట్టు, ఉడుం పట్టు
అనర్గళం = ధారాళం, ఆగకుండా
డబ్బు = ధనం, విత్తము
ఇల్లు = గృహము, మందిరము
పండుగ = పర్వము, ఉత్సవము
మంచం = శయ్య తల్పము
ఆకాశం = గగనం, నింగి
మనసు = మనస్సు, మనము
ఋణము = అప్పు, బాకీ
నిద్ర = కునుకు, నిదుర
రోజు = దినము, దివసము
ప్రారంభం = మొదలు, ఆరంభం
వీడ్కోలు = విడుపు, వదలు
రైలు = పొగ బండి, ధుమ శకటం
సభ = కొలువు కూటము, సమావేశము
వంతు = అవకాశం, వాటా
భరించడం = తట్టుకోవడం, పోషించడం
మణిపూస = మాణిక్యం, రత్నం
ఓదార్పు = రడింపు, సాంత్వన
సహాయం = సాయము, ఆదుకోవడం
అభివందన = పొగడ్త, నుతి
కుమారుడు = కొడుకు, తనయుడు, అబ్బాయి
భార్య = సతి, పత్ని
తిండి = ఆహారము, భోజనము
బట్ట = వస్త్రము, అంబరము
గాలి = పవనము, వాయువు
నీరు = ఉదకము, పయస్సు
భాగస్వామి = వాటాడారు,భాగస్తుడు
బరువు = భారము, భరము
నానార్థాలు
తల = శిరస్సు, మొదలు
అర్థము = డబ్బు, భావము
తల్లి = అమ్మ, ముఖ్యము
చెయ్యి =కేలు, తొండము
క్షణము =10 విఘడియల కాలము, పండుగ
అయోమయము = తెలియశక్యము కానిది, ఇనుముది
కర్మ = దురదృష్టము, తప్పక చేయవలసినది
వ్యాపారము = వర్తకము, ప్రయము
ఆస్తి = కూడబెట్టిన ధనము, ధనము
ప్రజలు = సంతానము, జనము
ఉపన్యాసము = దేని గురించైన వివరించి చెప్పుట, దగ్గర పెట్టుట
పేరు = నామము, కీర్తి
దృఢము = గట్టిది, అధికము
అమ్మ = తల్లి, ఆశ్చర్యార్థకము
కలవరము = కలత, చింత
పాడు = చెడు, పాట పాడు
సంబరము = సంతోషము, ఉత్సవము
గర్జన = సింహనాదము, యుద్ధము
ఇష్టము = కోరిక, యజ్ఞకర్మ
ఉద్యోగము = పని, అధికారము
సమాజము = సంఘము, ఏనుగు
సాహసము = తెగువ, దండోపాయము
ఆదర్శము = అద్దము, అనుకరింపతగినట్టి గొప్పది
జీతము = వేతనము, సంబళము
కన్ను = నయనము, రంద్రంము
ఉత్సాహము = ప్రయత్నము, పట్టుదల
వివరము = రంధ్రము, విషయ విశ్లేషణ
నిజము = సత్యము, నిశ్చయము
రేపు = మరునాడు, ఉదయము
ఎన్నిక = గణనము, కీర్తి
ఆసరా = ఫ్రాపు, ఆ[శయము
ఫర్త = పతి, ప్రభువు
చీకటి = తమస్సు, దుఃఖము
రెక్క = పక్షి రెక్క, భుజము
గుండె = హృదయము, ఫైర్యము
ముల్లు = కంటకము, (తాసు ముల్లు
సమయము = ప్రతిజ్ఞ, కాలము
కష్టము = వాదచది, ప్రయత్నము
పది = పాదము, దశకము
పండుగ = పర్వము, సంతోషము
పీడ్కోలు = ఉనికి, ఆస్తి ,విడుపు, మరణము.
గ్రామము = ఊరు, స్వరము
అతిథ = కుశుని కొడుకు, ఆగంతకుడు
గడ్డ = దుంప, మట్టిపెళ్ల
గారు = వాయువు, ప్రాణము
ఋణు = అప్పు, నీరు
అవరము = అకాశము, నైవేద్యము
గోడ = కుడ్యము, గుఱ్ఱము
ప్రకృతులు – వికృతులు
భూమి – బూమి
అంబ – అమ్మ
యతి – మది
అర్థము – అద్దము
బ్రతుకు – బతుకు
ఆశ్చర్యము – అచ్చెరువు
ప్రజ – పజ
వృద్ధు – పెద్ద
ప్రశ్న – పన్నము
పట్టణము – పట్టము
ఖండము – కండ
దృఢము – దిటము
బుద్ధి – బుద్ది
ఫక్తి – బత్తీ
వృద్ధి – వడ్డ్
మనిషి – మానిసి
కాంక్ష – కచ్చు
సంతతి – సంతు
నష్టము – కస్తి
నిజము – సక్కము
జీవితము – జీతము
సంతోషము – సంతసము
హృదయము – ఎద
(పేమ – (పేముడి
గర్వము – గరువము
అక్షరము – అచ్చరము
రాత్రి – రాతిర
ప్జజ – పజ
దుఃము – దూకలి
ఆకాశము – ఆకసము
నిడ్ర – నిరుర
శ్రద్ధ – సడ్డ
కార్యము – కర్జము
సహాయము – సాయము
మఱి – మిన్న
తాగము – చాగము
నీరము – నీరు
వ్యుత్పత్యర్థాలు :
మౌనము = ముని యొక్క భావము
స్వ = తన ధన సంబంధము గలవాడు
అర్థము = కోరబడినది
సంతానము = విస్తరింపబడునది
భక్తి = శశయింపబడునది
అధికారి = కర్మ విశేషమునధికరించి చేసెడివాడు
ఆనందము = ఆనందింప చేయునది
యుద్ధము = పోరుట
భయము = భయముతో కూడినది
భర్త = భరించువాడు
కష్టము = హింసించునది
క్షణము = 30 కలలు గల కాలము
ఆకాశము = దీనియందంతటను సూర్యాదులు ప్రకాశింతురు
తృప్తి = తనియుట
రాత్రి = సుఖమునిచ్చునది
నిద్ర = దీనియందు ఇంద్రియములు నియతముగా ఉపరతములౌను
భూమి = ఉదకము వలన పుట్టునది. (పుడమి)
సైన్యము = రాజుతో కూడినది (సేన)
మతి = దీనిచేత ఎఱూగబడును (బుద్ధి)
కర్మ = చేయుట (పని)
మహిళ = ఆదరింపబడునది (స్త్రీ)
ప్రశ్న= తెలుసుకోవాలని అడగడం
దృఢము = వృద్ధి పొందినది
హృదయము = హరింపబడునది
భార్య = భరింపబడేది
సంధులు
ఉత్వ సంధి :
నువ్వంటున్నది = నువ్వు + అంటున్నది
చేసుకుంటారట = చేస్కుంటారు + అట
కలెక్టరాఫుసు = కలకక్టరు + ఆఫీసు
అర్థమయ్యేలా = అర్థము + అయ్యేలా
నీకేమైనా = నుకు + ఏమైన
మనకున్న = మనకు + ఉన్న
ఒక్కగానొక్కో = ఒక్కగాను + ఒక్క
ఉద్యోగమమ్మా = ఉద్యోగము + అమ్మా
ఉపన్యాసాలిస్తావు = ఉపన్యాసాలు + ఇస్తావు
నువ్వేనా = నువ్వు + ఏనా
పరెందుకు = పేు + ఎందుకు
కాదమ్యా = కాదు+ అమ్మ
ఉన్నాడన్న = ఉన్నాడు + అన్న
నువ్వాక్కడివే = నువ్వు + ఒక్కడివే
మేమేం కావాలి = మేము + ఏం కావాలి
నీకీదేం = నీకు + ఇదేం
చేస్తావనీ = చేస్తావు + అని
నాకిష్టం = నాకు + ఇష్టం
అదుకని = అందుకు + అని
వాళ్లంతా = వాళ్లు + అంతా
ఉద్యోగమైనా = ఉద్యోగము + ఐనా
పోతానమ్మా = పోతాను + అమ్మా
జీతాలిస్తారు = జీతాలు + ఇస్తారు
ఇస్తారట = ఇస్తారు + అట
నిజమేన = నిజము + ఏన
వివరాలన్నీ = వివరాలు + అన్నీ
తీసుకొంటారట = తీసుకొంటారు + అట
మాటలన్నీ = మాటలు + అన్నీ
పోయినట్లయింది = పోయినట్లు + అయింది
కదలాడింది = కదలు + ఆడింది
కదలాడగా = కదలు + ఆడగా
పస్తులుండి = పస్తులు + ఉండి
కూడదమ్మా = కూడదు + అమ్మా
మాటలన్నాడు = మాటలు + అన్నాడు
చేరుతున్నారు = చేరుతు + ఉన్నారు
లేకపోయాననే = లేకపోయేను + అనే
రావులిద్దరు = రావులు + ఇద్దరు
మాట్లాడుతున్నాడు = మాట్లాడుతు + ఉన్నాడు
కాబోతుంది = కాబోతు+ ఉంది
అమరుడవుతాడు = అమరుడు + అవుతాడు
మనమెవ్వరూ = మనము + ఎవ్వరూ
తండ్రులందరూ = తండ్రులు + అందరూ
వారెవరు = వారు + ఎవరు
చేద్దామంటూ = చేద్దాము + అంటూ
అత్వ సంధి :
- తలెత్తి = తల + ఎత్తి
- అటమ్మా = అట + అమ్మా
- ఎన్నికవుతాను = ఎన్నిక + అవుతాను
- చంద్రమ్మ = చంద్ర + అమ్మ
- రోశయ్య = రోశ + అయ్య
- గొప్పేమి = గొప్ప + ఏమి
- ఉన్నందుకు = ఉన్న + అందుకు
- ఇంకేమి =ఇంక + ఏమి
ఇత్వసంధి :
మరోమారు = మరి + ఓ మారు
ఏమైనా = ఏమి + ఐనా
ఏమిటమ్మా = ఏమిటి + అమ్మా
అదేమిటి = అది + ఏమిటి
ఇదేం = ఇది + ఏం
పూర్తయింది = పూర్తి + అయింది
ఏదైనా = ఏది + ఐనా
చేయాలనే చేయాలి + అనే
పోతుందని = పోతుంది + అని
ఏముంది = ఏమి + ఉంది
మరెవ్వరు = మరి + ఎవ్వరు
పదేళ్లు = పది + ఏళ్లు
వారింట్లు = వారి + ఇంట్లో
రావలసిందని = రావలసింది
ఉండాలనుకుంటే = ఉండాలి + అనుకుంటే
సవర్ణదీర్ఘ సంధి :
- సమాజాభివృద్ధి & =సమాజ + అభివృద్ధి
- స్వార్థము = స్వ + అర్థము
- ఈశ్ధాంజలి = తర్ధ + అంజలి
- సభాధ్యక్షులు = సధ + అధ్యక్షులు
- ప్రారంభము = ఏ + అరంభము
లు,ల,న,ల సంధి :
- ఉపన్యాసాలు = ఉపన్యాసము + లు
- భావాలు = భావము + లు
- వివరాలు = వివరము + లు
- సౌకర్యాలు = సౌకర్యము + లు
- జీతాలు = జీతము + లు
- సమయాన = సమయము + న
గసడదవాదేశ సంధి :
- తల్లిదండులు = తల్లి + తండ్రి (లు)
సమాసాలు
షష్తీ తత్పురుష సమాసము :
మాతృభూమి =తల్లి యొక్క భూమి
కలెక్టరాఫీసు = కలెక్టరు యొక్క అఫీసు
అమ్మ మాటలు =అమ్మ యొక్క మాటలు
నా మాట = నా యొక్క మాట
మీ నాన్న =మీ యొక్క నాన్న
సమాజాభివృద్ధి = సమాజము యొక్క అభివృద్ధి
కుటుంబ పరిస్థితి = కుటుంబము యొక్క పరిస్థిత
చంద్రమ్క కళ్లు = చంద్రమ్మ యొక్క కళ్లు
రాజారువు కుటుంబం రాజారావు యొక్క కుటుంబం
భర్త రెక్కలు = భర్త యొక్క రెక్కలు
నా కొడుకు = నా యొక్క కొడుకు
అక్షర లక్షలు = అక్షరమును లక్షలు
నా బిడ్డ = నా యొక్క బిడ్డ
వారంట్లో = వారి యొక్క ఇంట్లో
వీర మనసు = వీర యొక్క మనసు
నా వాళ్లు = నా యొక్క వాళ్లు
స్వరగ్రామం = తన యొక్క గ్రామం
మనగడ్డ = మన యొక్క గడ్డ
వీరమాత = వీరుకు మాత
మన జిల్లా =మన యొక్క జిల్లా
వీరత్యాగం = వీర యొక్క త్యాగం
మన ఋణం = మన యొక్క ఋణం
దేశ సేవ = దేశమునకు సేవ
వీరఫోటో = వీర యొక్క ఫోటో
సభాధ్యక్షులు = సభకు అధ్యక్షులు
తృతీయా తత్పురుష సమాసము :
- శ్రద్ధాంజలి = శ్రద్ధతో అంజలి
- అయోమయము = అయముతో మయము
సప్తమీ తత్పురుష సమాసము :
- కన్నీళ్లు = కళ్లయందలి నీళ్లు
- దేశ భక్తి = దేశము నందు భక్తి
- దేశ ప్రజలు = దేశము నందలి ప్రజలు
ద్వితీయాతత్పురుష సమూసము :
- వ్యాపారషేత్త = వ్యాపారమును గూర్చి తెలిసిన వాడు
నఞ్ తత్పురుష సమాసము :
- అనర్గళము = అర్రళము (అడ్డు గడియ) లేనిది
- అనేకము = ఏకం కానిది
ద్వంద్వ సమాసము :
- తల్లిదండ్రులు = తల్లియును, తండ్రియును
ద్విగు సమాసము :
- మూడు రోజులు = మూడైన రోజులు
- నాలుగు రోజులు = నాలుగైన రోజులు
- పదేళ్లు = పదియైన ఏళ్లు
- ఐదుగురు సంతానం = ఐదుగురైన సంతానం
- ఎనిమిది భాషలు = ఎనిమిదైన భాషలు
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
పెద్ద చదువు = పెద్దదైన చదువు
చిరు కోపం = చిన్నదై కోపం
చిరునవ్వు = చిన్నదైన నవ్వు
చాలా పట్టుదల = ఎక్కువైన పట్టుదల
బయట పనులు = బయవైన పనులు
పాడుబుద్ధి = పాడైన బుద్ధి
అతి తెలివి = అతిఐన తెలివి
స్వార్ధపు బ్రతుకు = స్వార్థమైన బ్రతుకు
ఆదర్శ భావాలు = ఆదర్శమైన భావాలు
పెద్దకొడుకు = పెద్దయైన కొడుకు
మంచి జీతాలు = మంవైన జీతాలు
మంచి చావు = మంచిదైన చావు
అనేక మార్పులు = అనేకమైన మార్పులు
మంకుపట్టు = మంకుదైన పట్టు
మంచి బట్టలు = మంచివైన బట్టలు
ముఖ్య అతిథి = ముఖ్యమైన అతిథి
ఆర్థక సహాయం = ఆర్థికమైన సహాయం
రచయిత్రి పరిచయం
రచయిత్రి పేరు : పవని నిర్మల ప్రభావతి
జననం : 1933 మార్చి 12న ఒంగోలులో
తల్లిదండ్రులు : విప్పగుంట సరస్వతమ్మ, వెంకట నరసింహారావు దంపతులు
చదువు : SSLC
భర్త పేరు : పవని శ్రీధరరావు
రచనలు : అనాథ, ఎదలో ముల్లు, స్త్రీ నాగరికత నవ్వుతోంది మొదలైన ఏడు కథా సంపుటాలు. శలభాలు, ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు మొదలైన 17 నవలలు రచించారు. భవానీ సౌందర్యలహరి, శివదూతీ సప్తసతి వంటి 4 ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా రచించారు. అద్దంలో ప్రతిబింబాలు, అనామిక పుస్తకం, అస్తి- నాస్తి వంటి కథలు అనేక పత్రికలలో ప్రచురించబడ్డాయి. 2015.5.27న ప్రకాశం జిల్లాలోని మొగిలిచర్లలో స్వర్గస్థురాలయ్యారు. ప్రస్తుత పాఠం ఆమె కథానిలయం నుండి గ్రహించబడింది.
ఉద్దేశం
దేశం కోసం త్యాగాలు చేసే సైనికులపై గౌరవం, దేశళక్తిని కల్గి ఉండాలనే స్ఫూర్రిని విద్యార్థులలో ,కలిగించడం. ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ
కథ, కథానిక అనేవి పర్యాయపదాలుగా వాడుతున్నాం కాని, కథ కంటే కథానిక చిన్నది. ఒక వ్యక్తి లేదా వ్యవస్థలో జరిగిన చిన్న సంఘటనను తీసుకొని, ఉత్కంఠభరితంగా వర్ణిస్తూ చెప్పేది కథానిక. క్లుప్తత దీని లక్ష్యం. పాత్రలు, నేపథ్యం, కథనం, వాస్తవిక చిత్రణ కథానికా ప్రక్రియలో ముఖ్య భాగాలు. ఉత్కంఠను రేపే ప్రారంభం, కొనసాగింపు, కొసమెరుపు కథానికకు అందాన్నిస్తాయి. ముగింపు పాఠకుల ఊహకు అందనంత వైవిధ్యంగా ఉండాలి.
కఠిన పదాలు – అర్థాలు
తల = శిరస్సు, మస్తకము
నింపాదిగా = నెమ్మదిగా
సైన్యము = సేన
కొడుకు = కుమారుడు
అయోమయం = అర్థం కాని స్థితి
మతిపోవటం = బుద్ధి పనిచేయకపోవటం
కర్మ = తప్పక చేయవలసిన పని
చెయ్యి = కేలు
వ్యాపారము = వర్తకము
ఆస్తి = కూడబెట్టిన ధనము
ఆశ్చర్యము = విస్మయము
కాపాడడం = రక్షంచడం
ఉద్యోగము = పని
ఉత్తేజము = ఉత్సాహము
కండ = సత్తువ
తెల్లబోవడం = వెలవెలబోవడం
కన్నిళ్లు = అశ్రువులు
బిడ్డ = శిశువు
నొప్పించడం = బాధపెట్టటం
చిరు కోపం = కొద్ది కోపము
చిరునవ్వు = మందహాసము
పద్మజ = కమలము
తమాషా = వేడుక
తాటిచెట్టు = తాళవృక్షము
దృఢము = ధార్యమము
దగ్గర = సమీపము
కలవరము = ఆందోళన
విషయము = సమాచారము
వంట = పాకము
మౌనము = మాట్లాడకఫోవడం
పని = కార్యము
పాడు బుద్ధీ = చెడు బుద్ధి
సంబరము = ఆనందము
గద్దించడం = గట్టిగా అరవటం
ఇష్టము = మక్కువ
నసుగుడు = సణుగుడు
ఉద్దేశం = అభిప్రాయం
చావు = మరణం
అతి = ఎక్కువ
తెలివి = బుద్ధి
అవకాశము = ఆస్కారము
థైర్యము = నిర్భయము
సాహసము = తెగింపు
స్వార్థము = తన మేలు
తప్పు = దోషము
బ్రతుకు = జీవితము
వాత్సల్యము = ఆప్యాయత
కుటుంబం = సంసారం
ఆదర్శము = మేలు బంతి
అణచివేయు = అణగగొట్టు
సంతానము = పిల్లు
జీతము = వేతనము
ఉత్సాహము = హుషారు
కళ్ళు = నేత్రములు
నిజము = సత్యము
అధికారి = పాలకుడు
ఇంటిల్లపాది = ఇంట్లో వారంతా
సేవ = శుశ్రూష
సంతోషము = ఆనందము
మనస్సు = మనసు
రెక్కల కష్టం = చేతు కష్టం
గుండె = హృదయం
గుండెలు పిండు = చాలా బాధపెట్టు
ఆలోచన = యోచన
యుద్ధము = రణము
కదలాడటం = కనిపించటం
పస్తులు = ఉపవాసాలు
బాధ = దుఃఖం
మేలు = మంచిది
భయము = ఫీతి
గర్వం = పొగరు
మీసం = శృష్రువు
నవ్వు = హాసము
అచ్చరలచ్చలు = అక్షరమునకు లక్ష
ప్రజలు = జనులు
మెచ్చుకోవటం = పొగడటం
మంకు పట్టు = మొండి పట్టుదల
సంతృప్తి = సంతుష్టి
రోజు = దినము
రైలు = పొగ బండి
స్వగ్రామం = సొంత గ్రామం
క్షణము = సెకను
అనర్గళము = ధారాళము
తమ్ముడు = కనిష్ట సోదరుడు
చెల్లెలు = కనిష్ట సోదరి
బట్టలు = వస్త్రములు
వాచీ = గఓియారము
రగ్గు = ఉన్ని కంబళి
ఇల్లు = శృహము
సెలవు విరామము
రా(తి =రేయి
మంచము =పాన్పు
ఆకాశము =గగనము
రుణము =అప్పు
నిద్ర = నిదుర
ప్రారంభము = మొదలు
శ్రద్ధాంజలి = శ్రద్ధతో నమస్కారము
అధ్యక్షుడు = అగ్రీసరులు
అమరుడు = మరణణు లేనివాడు
వీరమాత = వీరుని తల్లి
మణిపూస = మాణిక్యము
వేదిక = వేది
ఆర్థికము = డబ్బు సంబంధమైన
కొనియాడు = కీర్తించు
ఓదార్పు = సముదాయింప
ఏడ్పు = రోదన
మనిషి = మానవుడు
తిండి = ఆహారము
గాలి = వాయువు
నీరు = జలము
ఊపిరి = శ్వాస