AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

These AP 8th Class Telugu Important Questions 2nd Lesson మాతృభూమి will help students prepare well for the exams.

మాతృభూమి AP Board 8th Class Telugu 2nd Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు – ప్రశ్నలు

అ) కింది పరిచిత గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. అదే ఊరిలో చంద్రమ్మ, రోశయ్య కుటుంబం ఉంది. వారికి ఐదుగురు సంతానం. వారి పెద్ద కొడుకు వీర. వీర వాళ్లమ్మతో మాట్లాడుతూ, “నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా! మంచి జీతాలిస్తారట”, అని ఉత్సాహంగా చెప్పాడు. చంద్రమ్మ కళ్లలో ఎంతో వెలుగు “నిజమేనట్రా” అంది. “నిజంగానే! అమ్మా ఇప్పుడే అధికారి దగ్గరకు పోయి మాట్లాడొచ్చాను. ” కూడా” ఆ వివరాలన్నీ చెప్పాడు. “రేపు చాలామందిని సైన్యంలోకి తీసుకుంటారట. నేను ఎన్నికవుతానన్నాడు అధికారి. సైన్యంలో చేరితే జీతం వస్తుంది ఇక్కడికి పంపిస్తాను. ఇంటిల్లిపాదీ తినొచ్చు. నాన్నగారికి ఆసరా లభిస్తుంది. వీటన్నిటి కంటే మన దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా !” సంతోషంతో వీర ఈ మాటలన్నీ చెబుతుంటే చంద్రమ్మ మనస్సు ఆనందంలో మునిగిపోయింది. చంద్రమ్మకు చుట్టూర చిమ్మిన చీకటి తొలగిపోయినట్లయింది. భర్త రెక్కల కష్టం తొలిగిపోతుందని భావించింది. పిల్లలకు చదువులు చెప్పించవచ్చు అనుకున్నది. (SA-1:2022-23)

ప్రశ్నలు:

ప్రశ్న 1.
సైన్యంలో చేరిపోతానని చెప్పింది ఎవరు?
జవాబు:
వీర

ప్రశ్న 2.
సైన్యంలో చేరడం వలన ఎటువంటి అవకాశం లభిస్తుంది?
జవాబు:
దేశానికి సేవ చేసే అవకాశం

ప్రశ్న 3.
చంద్రమ్మ ఎందుకు ఆనందపడింది?
జవాబు:
వీరకు సైన్యంలో ఉద్యోగం వచ్చినందుకు

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పేరాలో ఉన్న ఒక జాతీయాన్ని కనుగొనండి.

2. “పస్తులుండి బాధపడటం కంటే ఉన్న నాలుగురోజులు హాయిగా బతకడం మేలు కదా! దేశం కోసం చావడం కంటే గొప్పేముంది. అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప, దాని గురించి భయపడకూడదమ్మా” అంటూ బయటకు వెళ్ళిపోయాడు వీర. ఈ మాటలు విన్న రోశయ్య మీసం మేలేస్తూ గర్వంగా నవ్వాడు. ఆడు నా కొడుకే చంద్రీ గుండె ధైర్యం చూసావా అది నాది. అచ్చరలచ్చలు చేసే మాటలన్నాడు నా బిడ్డ. వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ | చేస్తారు. యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటు పడాలి.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
“దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే గొప్ప” అన్నదెవరు?
జవాబు:
వీర

ప్రశ్న 2.
మీసం మెలేసింది ఎవరు?
జవాబు:
రోశయ్య

ప్రశ్న 3.
దేశం కోసం పాటు పడాల్సిందెవరు?
జవాబు:
యువకులు

ప్రశ్న 4.
‘వీర’ తల్లి పేరేమిటి?
జవాబు:
చంద్రమ్మ

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

3. పద్మజ, రాజారావు ఉంటున్న ఊరిలోనే చంద్రమ్మ రోశయ్య కుటుంబం ఉంది. వారికి ఐదుగురు సంతానం వారి పెద్ద కొడుకు వీర, వీర వాళ్ళమ్మతో మాట్లాడుతూ “నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా! మంచి జీతాలు ఇస్తారట! అని ఉత్సాహంగా చెప్పాడు. చంద్రమ్మ కళ్ళల్లో ఎంతో వెలుగు “నిజమేనట్రా” అంది “నిజంగానే! అమ్మా ఇప్పుడే అధికారి దగ్గరికి పోయి మాట్లాడొచ్చాను కూడా” ఆ వివరాలన్నీ చెప్పాడు. రేపు చాలా మందిని సైన్యంలోకి తీసుకుంటారట. నేను ఎన్నికవుతానన్నాడు అధికారి. సైన్యంలో చేరితే జీతం వస్తుంది ఇక్కడికి పంపిస్తాను. ఇంటిల్లిపాదీ తినొచ్చు. నాన్నగారికి ఆసరా లభిస్తుంది. వీటన్నిటికంటే మనదేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా!” సంతోషంతో వీర ఈ మాటలన్నీ చెబుతుంటే చంద్రమ్మ మనస్సు ఆనందంలో మునిగిపోయింది. (SA-1:2023-24)

ప్రశ్నలు:

ప్రశ్న 1.
వీర ఎక్కడ చేరుతానన్నాడు?
జవాబు:
వీర సైన్యంలో చేరతానన్నాడు.

ప్రశ్న 2.
చంద్రమ్మ మనసు ఎందుకు ఆనందంలో మునిగిపోయింది?
జవాబు:
సైన్యంలో మంచి జీతం ఇస్తారని తెలిసి ఆనందంతో మునిగిపోయింది.

ప్రశ్న 3.
వీర తల్లిదండ్రులు ఎవరు?
జవాబు:
చంద్రమ్మ, రోశయ్య

ప్రశ్న 4.
పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
చంద్రమ్మ, రోశయ్యలకు ఎంతమంది సంతానం?

అపరిచిత గద్యాలు – ప్రశ్నలు

ఆ) కింది అపరిచిత గద్యాలు చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. గాంధీజీ తన ప్రసంగాలలో సత్యం, అహింస అనే రెండు తరచుగా ఉపయోగించేవారు. అయితే ఈ రెంటిలో మొదటిదానికే ప్రాధాన్యమిచ్చారు. అతడు సత్యాన్వేషకుడే కాదు. సత్యాన్ని ఆరాధించిన భక్తుడు. తన జీవితాన్ని “సత్యమార్గంతో పరిశోధనలు”గా అభివర్ణించారు. ప్రారంభంలో భగవంతుడే సత్యమని ప్రకటించారు. కానీ, చివరకు “సత్యమే భగవంతుడు” అని ప్రకటించే స్థితికి వచ్చారు. “ఎందుకంటే భగవంతుని ఉనికిని నిరాకరించవచ్చు. కానీ, సత్యమును కాదనడం కష్టం”.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
గాంధీ తన ప్రసంగాలలో తరచుగా ఉయోగించేవి ఏవి?
జవాబు:
సత్యం, అహింస.

ప్రశ్న 2.
ఆయన తన జీవితాన్ని ఏమని అభివర్ణించారు?
జవాబు:
సత్యమార్గంతో పరిశోధనలు.

ప్రశ్న 3.
ప్రారంభంలో ఆయన దేనిని సత్యమని ప్రకటించారు?
జవాబు:
భగవంతుడే సత్యం.

ప్రశ్న 4.
చివరకు ఆయన దేనిని భగవంతునిగా ప్రకటించే స్థితికి వచ్చారు?
జవాబు:
సత్యమే భగవంతుడు.

2. భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష. విషయం కోసం భాష. భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటిని అధ్యయనం చెయ్యడం రెండవ రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది. ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రామాణిక) భాష, సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. కాని, దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికీ ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచన, అలవాట్లూ ఆ కాలం నాటి భాషలోనే సాగుతుంటాయి. కనుక ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
భాషను ఏయే రకాలుగా నేర్చుకొంటాము?
జవాబు:
భాషను భాష కోసం, విషయం కోసం నేర్చు కుంటాము.

ప్రశ్న 2.
భాష ఎన్ని రకాలుగా తయారయింది?
జవాబు:
భాషలో ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రామాణిక భాష అని రెండు రకాలు.

ప్రశ్న 3.
ప్రాచీన భాష ఎందుకు ఉపయోగపడుతుంది?
జవాబు:
ప్రాచీన భాష సాహిత్యంలోని తరతరాల వార సత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది.

ప్రశ్న 4.
ఆధునిక భాష ఉపయోగం ఏమిటి?
జవాబు:
ఆధునిక భాష సాహిత్యంలో తరతరాల గురించి చెప్పడానికి, రాయడానికి ఉపయోగపడుతుంది.

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

3. పరభాషల ద్వారా కాక మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుటయే సహజమైన పద్ధతి అని వాదించి వంగభాషలో బాలురకు ఉపయుక్తములుగు వాచకములను, శాస్త్ర గ్రంథములను రచించిన విద్యావేత్త ఈశ్వరచంద్రుడు.

అతనివలే ఒకవైపు సంఘ సంస్కరణ చేయుచు, మరొకవైపు భాషాసేవ చేసిన మహనీయుడు మన వీకేశలింగం పంతులు గారు. పంతులుగారికి దక్షిణదేశ విద్యాసాగరుడను బిరుదు కలదు. విద్యాసాగరుడు, పంతులుగారు పరస్పరం ఉత్తరములు రాసుకొనేవారు. ఈశ్వరచంద్రుని వలన వంగదేశము, పంతులుగారి వలన తెలుగుదేశము వాసిగాంచినవి.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
విద్యాబోధన చేయుటకు సహజమైన పద్ధతి ఏది?
జవాబు:
మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుట సహజమైన పద్ధతి.

ప్రశ్న 2.
ఈశ్వరచంద్రుడు ఏ భాషలో వాచకములను రాసెను?
జవాబు:
ఈశ్వరచంద్రుడు వంగభాషలో వాచకములను రాసెను.

ప్రశ్న 3.
పంతులుగారి బిరుదు ఏమిటి?
జవాబు:
‘దక్షిణ దేశ విద్యాసాగరుడు’ అనేది పంతులుగారికి గల బిరుదు.

ప్రశ్న 4.
ఈశ్వరచంద్రుని వలన ఏ దేశము వాసిగాంచెను?
జవాబు:
ఈశ్వరచంద్రుని వలన వంగదేశము వాసి గాంచెను.

ప్రశ్న 4.
ఈ కింది వ్యవహార రూపాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:

పెదపాడు,
X X X X X.

ప్రియమైన మిత్రుడు శ్రీకర్కు,
నీ మిత్రుడు వినయ్ రాయునది.

ఉభయకుశలోపరి. నేను బాగానే చదువుచున్నాను. నీవు బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. నేను ఒక చిన్నకథ చదివాను. గాంధీజీ జీవితానికి సంబంధించింది. నువ్వు ఆ కథ చదువుతావని ఇక్కడ రాస్తున్నాను.
మహాత్మాగాంధీ బాలునిగా ఉన్నప్పుడు ఆయనను “మోనియా” అని పిలిచేవారు. ఒకనాడాయన ఇంటి సమీపంలో దేవాలయ ప్రాంగణంలో కొందరు పిల్లలు ఆయనను కొట్టారు. ఈ విషయం తల్లికి చెప్పాడు. “నీవు వారిని తిరిగి కొట్టలేక పోయినావా?” అని ఆమె అన్నది. “అమ్మా! ఆ పని చెయ్యమని నీవేల అంటున్నావు ? నేను వారి సోదరుడను కదా!” అని మోనియా తల్లితో అన్నాడు.

ఈ చిన్న కథలో తోటి వారితో ఎలా మెలగాలో, తప్పు చేసిన వారిపట్ల ఏ భావం కలిగి ఉండాలో ఉంది కదా! ఈ కథ నీకూ నచ్చి ఉంటుందని అనుకుంటూ, దసరా సెలవులు ఎలా గడిపావో విశేషాలతో లేఖరాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, కె. వినయ్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
అమరావతి, గుంటూరు జిల్లా.

చిరునామా:
డి. శ్రీకర్
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
దేవులపల్లి, ప॥గో॥ జిల్లా.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
గాంధీజీని బాల్యంలో ఏ పేరుతో పిలిచేవారు?
జవాబు:
మోనియా

ప్రశ్న 2.
గాంధీజీ తనను కొట్టిన వారిని తిరిగి కొట్టడానికి ఎందుకు నిరాకరించాడు?
జవాబు:
వారిని సోదరులుగా భావించాడు కనుక.

ప్రశ్న 3.
ఈ కథ ద్వారా నీవేం తెలుసుకున్నావు?
జవాబు:
తోటివారితో ఎలా మెలగాలో తెలుసుకున్నా.

ప్రశ్న 4.
పైన లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పేరాలో ఎవరి కథ చెప్పబడింది?

5. మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
యథార్థమైనది ఏది?
జవాబు:
స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంత మవుతుంది.

ప్రశ్న 2.
ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 3.
రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
జవాబు:
నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచ బడ్డాయి.

ప్రశ్న 4.
వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
జవాబు:
మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

6. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు,

ప్రశ్నలు:

ప్రశ్న 1.
జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.

ప్రశ్న 2.
వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్త్వుని శిష్యుడు ఒక తొట్టెను తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోయటం ద్వారా వాటి బాధ తీరింది.

ప్రశ్న 3.
ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
అన్ని ప్రాణుల యెడల జాలి, దయ కలిగి ఉండాలనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాను.

ప్రశ్న 4.
జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
జీవులపట్ల జాలి, దయ కలిగి ఉండుటను జీవ కారుణ్యం అంటారు.

7. రామాయణం అనే మహా గ్రంథాన్ని సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి రాశారు. అందులో 6 కాండలు ఉన్నాయి. తెలుగులో గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే పేరుతో, మొల్ల రామాయణం అనే పేరుతో కవయిత్రి మొల్ల రచించారు. రామాయణంలో గురు – శిష్య, తండ్రి – కొడుకుల, అన్నదమ్ముల, భార్యభర్తల, స్నేహితుల సంబంధం బాంధవ్యాల గురించి చెప్పారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
గోనబుద్ధారెడ్డి రచించిన గ్రంథం పేరు ఏమి?
జవాబు:
రంగనాథ రామాయణం

ప్రశ్న 2.
సంస్కృత భాషలో రామాయణం రాసిన వారెవరు?
జవాబు:
వాల్మీకి

ప్రశ్న 3.
రామాయణంలో ఎన్ని కాండలున్నాయి?
జవాబు:
6 కాండలున్నాయి.

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
రామాయణం దేని గురించి చెబుతుంది?

8. పాండురాజు భార్య కుంతీదేవికి ముగ్గురు కొడుకులు. వారిలో ధర్మరాజు పెద్దవాడు. రెండోవాడైన భీముడు బలవంతుడు. మూడోవాడైన అర్జునుడు విలువిద్యలో నిపుణుడు. పాండురాజు రెండో భార్య అయిన మానికి నకుల, సహదేవులనే ఇద్దరు కుమారులు పుట్టారు. మొత్తం అందరూ కలిపి పాండురాజుకు ఐదుగురు కొడుకులున్నారు. ఈ ఐదుగుర్నీ పాండవులంటారు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పాండురాజు కొడుకులను ఏమంటారు?
జవాబు:
పాండవులు అంటారు

ప్రశ్న 2.
కుంతీదేవికి మొత్తం ఎంతమంది కొడుకులు?
జవాబు:
ముగ్గురు

ప్రశ్న 3.
భీముడి ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
బలవంతుడు

ప్రశ్న 4.
పాండవులు ఎంతమంది?
జవాబు:
ఐదుగురు

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

9. ఈ కింది గద్యాన్ని చదివి, జవాబులను గుర్తించండి. (FA-1:2022-23)

మంగళ గ్రహము (అంగారక గ్రహము) పైన జీవనము సాధ్యమా! అను విషయముపై శాస్త్రజ్ఞులు పలు ప్రయోగములు చేసి చివరకు “క్యూరియాసిటీ” అను రోవర్ను మంగళ గ్రహము పైకి పంపిరి. రోవర్ అనునది ఎటువంటి రోదసీ వాహనము అంటే అన్ని గ్రహములలో వాతావరణమును తట్టుకొని నిలబడగలదు. ఇది ఏ గ్రహము యొక్క ఉపరితలం పైనైనా నిలబడగలదు. ఈ శక్తివంతమైన రోపర్ను అమెరికా దేశమునకు చెందిన అంతరిక్ష పరిశోధనశాల అయిన ‘నాసా’ అభివృద్ధి చేసెను. 2012లో దీనిని మంగళ గ్రహము పైకి పంపిరి. “క్యూరియాసిటీ” మంగళ గ్రహము కక్ష్యలోకి సురక్షితముగా చేరి అక్కడ గ్రహము ఉపరితలంపైన ఉన్న మట్టి మరియు చిన్న చిన్న కొండలు, గుట్టల యొక్క నమూనాలను పరీక్షించెను.

దీని ఆధారముగా శాస్త్రజ్ఞులకు ఈ గ్రహము యొక్క అభివృద్ధి ఎలా జరిగినది? జీవజాలం మనుగడ సాగించుటకు ఇక్కడ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? అను ప్రశ్నలకు సమాధానములు వెదుకుచున్నారు. శాస్త్రజ్ఞులకు మంగళ గ్రహములోని రహస్యమయ విషయములు ఎప్పుడూ ఆసక్తిదాయకమే. ఆ రహస్యాలను ఛేదించుటకు ఎన్నో రోదసీ నౌకలను పంపించిరి.

పదండి మంగళ గ్రహము గురించిన కొన్ని ఆసక్తిదాయకమైన విషయములను తెలుసుకుందాము.

సౌరమండలములో రెండు రకముల గ్రహములు ఉండును. వానిలో కొన్ని వాయుభరిత గ్రహములు, అనగా అవి పూర్తిగా వాయువుతో నింపబడి ఉండును. ఇప్పుడు ఇంక రెండో రకము గ్రహాలు భూమి మాదిరిగా ఎత్తు పల్లముల నేల, మట్టి, గుట్టలతో నిండి ఉంటాయి. మంగళ గ్రహము కూడా అలాంటి కోవకు చెందినది. ఇది సౌరమండలములో ఏడవ పెద్ద గ్రహము, మరియు భూమి నుండి సుమారు 560 లక్షల కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఈ గ్రహములో అధిక మొత్తములో లోహము ఉండుట వలన ఎర్రని రంగులో కనబడును. అందుచే దీనిని ‘ఎరుపు గ్రహము’ అని కూడా అందురు.

ఇసుక, గుట్టలతో నిండిన ఈ గ్రహము యొక్క పావుభాగము చిమ్మచీకటిగా ఉండును. ఆ చీకటి భాగము ఆకుపచ్చ మరియు నీలిరంగులో కనబడును. భూమి తరహాలో దీనిలో కూడా అగ్నిపర్వతములు కలవు. ప్రఖ్యాత ‘ఒలంపస్ మాస్’ మంగళ గ్రహములోనే కలదు.

మంగళ గ్రహానికి ‘ఫోబోస్’, ‘డిమోజ్’ అను రెండు చంద్రుళ్లు కలరు. వీటి పేర్లను ప్రఖ్యాత గ్రీకు పౌరాణిక గాథలలోని పాత్రల ఆధారముగా పెట్టిరి.

ఈ గ్రహము యొక్క చుట్టుకొలత భూమి యొక్క చుట్టుకొలతలో సగము ఉండును. పైన ఇచ్చిన వ్యాసము ఆధారముగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

ప్రశ్నలు:

1. మంగళ గ్రహము పైకి పంపించిన ‘క్యూరియాసిటీ’ అను రోదసి వాహన విశేషత ఏమిటి? (డి)
ఎ) తక్కువ ఇంధనంతో ఎక్కువ గంటలు నిరంతరముగా పని చేయగలదు.
బి) తక్కువ బరువు ఉండటం వలన తేలికగా అన్ని గ్రహములలో ప్రయాణము చేయగలదు.
సి) నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రములో ఆ రోదసీ నౌక తయారు చేయబడటం.
డి) అన్ని రకాల వాతావరణములను తట్టుకొని అన్ని గ్రహముల ఉపరితలాలపై నిలబడగలదు.
జవాబు:
డి) అన్ని రకాల వాతావరణములను తట్టుకొని అన్ని గ్రహముల ఉపరితలాలపై నిలబడగలదు.

2. శాస్త్రజ్ఞులు మంగళ గ్రహము నివాస యోగ్యమైనదని నమ్ముటకు గల కారణము ఏమిటి? (డి)
ఎ) మంగళ గ్రహము సౌరమండలములో ఏడవ పెద్ద గ్రహము.
బి) ఇది ఎరుపు రంగులో లోహాలతో నిండి ఉండుట వలన
సి) మంగళ గ్రహము భూమి నుండి సుమారు 560 లక్షల కిలోమీటర్ల దూరములో భూమికి దగ్గరగా ఉన్నది.
డి) మంగళ గ్రహ ఉపరితలము భూమి మాదిరిగా ఉండి, అక్కడ నీటి ఉనికిని గమనించుట
జవాబు:
డి) మంగళ గ్రహ ఉపరితలము భూమి మాదిరిగా ఉండి, అక్కడ నీటి ఉనికిని గమనించుట

3. మంగళగ్రహానికి ‘ఫోటోస్’, ‘మోజ్’, అను రెండు చంద్రుళ్లు కలరు. ఈ వాక్యంలో ‘రెండు చంద్రుళ్లు’ పదానికి సరైన విగ్రహవాక్యమును రాయండి. (డి)
ఎ) రెండైన చంద్రుళ్లు
సి) రెండుగా ఉన్న చంద్రుళ్లు
బి) రెండుగా గల చంద్రుళ్లు
డి) రెండు సంఖ్య గల చంద్రుళ్లు
జవాబు:
డి) రెండు సంఖ్య గల చంద్రుళ్లు

4. మంగళ గ్రహము భూమి కన్నా చిన్నది అని ఎలా చెప్పగలవు? (డి)
ఎ) ఈ గ్రహము యొక్క పావు భాగము చిమ్మచీకటిగా ఉండుట వలన చిన్నది.
బి) ‘ఒలంపస్ మాస్’ వంటి అగ్ని పర్వతములతో ఆక్రమించబడి చిన్నగా ఉండును.
సి) లోహాలతో నింపబడి పరిమాణములో చిన్నగా ఉండును.
డి) భూమి చుట్టుకొలతలో ఈ గ్రహము యొక్క చుట్టుకొలత సగము ఉండును.
జవాబు:
డి) భూమి చుట్టుకొలతలో ఈ గ్రహము యొక్క చుట్టుకొలత సగము ఉండును.

5. మంగళ గ్రహముపై శాస్త్రజ్ఞులు ఏ విషయంపై తీవ్రముగా పరిశోధనలు చేశారు? (ఎ)
ఎ) జీవజాలం మనుగడకు అనుకూల పరిస్థితులు సాధ్యత గురించి
బి) అక్కడ లోహ గనుల ఉనికిని గురించి
సి) మంగళ గ్రహము నుండి వేరే గ్రహానికి దారి కనుగొనుటకు
డి) అక్కడ భవన నిర్మాణ సాధ్యత గురించి
జవాబు:
ఎ) జీవజాలం మనుగడకు అనుకూల పరిస్థితులు సాధ్యత గురించి

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు 4, 5 వాక్యాలలో జవాబులు వ్రాయండి.’

ప్రశ్న 1.
“నాపేరెందుకు సుధీర్ అని పెట్టావు?” అని తన తల్లిని సుధీర్ ప్రశ్నించడంలో ఆంతర్యమేమిటి?
జవాబు:
సుధీర్ అంటే ‘మంచి ధైర్యము కలవాడు’ అని అర్ధం. సైన్యంలో చేరతానంటే తల్లి వద్దు అంటోంది. అధైర్యం నూరిపోస్తోంది. భయపడిపోతోంది. భయపెట్టేస్తోంది. ఇంత భయపడే తన తల్లి తనకు సుధీర్ అని పేరు పెట్టడం వింతగా అనిపించింది. పేరులో కాదు ధైర్యం ఉండవలసింది, మనిషిలోనూ ఉండాలి అనేది సుధీర్ ఉద్దేశం. అందుకే అలా ప్రశ్నించాడు.

ప్రశ్న 2.
సుధీర్ కు మరోమాటకు అవకాశం ఇవ్వకుండా రాజారావు ఎందుకు బయటకు వెళ్లిపోయాడు?
జవాబు:
సుధీర్ అంటే రాజారావుకు, పద్మజకు ప్రాణం, అతను సైన్యంలో చేరడం వారికిష్టం లేదు. యుద్ధం వస్తే మరణిస్తాడేమోనని భయం. అతనిని సైన్యంలో చేరకుండా ఆపాలి అనేది వారి లక్ష్యం. రాజారావు తను చెప్పదలచుకొన్నది కొడుకుకు చెప్పాడు. సైన్యంలో చేరవద్దన్నాడు. కానీ, సుధీర్క మాట్లాడే అవకాశం ఇస్తే అతని అభిప్రాయాన్ని రాజారావు గట్టిగా కాదనలేదు. కాదనడానికి కొడుకుపై ప్రేమ, అతని వాదనాపటిమ అడ్డం కావచ్చు. అందుకే మరోమాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయాడు.

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

ప్రశ్న 3.
భర్త మాటలు విన్నాక చంద్రమ్మకు ఆనందం, దుఃఖం రెండూ ఎందుకు కలిగాయి?
జవాబు:
మరణించడానికి బాధపడకూడదని ఆనందించాలని తన కొడుకు వీర మాటలు విన్న చంద్రమ్మకు బాధ కలిగింది. మరణాన్ని కూడా తేలికగా తీసుకొనే స్వభావం గల తన కుమారుని ప్రవర్తనకు అయోమయంలో పడింది. కానీ తన భర్త రోశయ్య కొడుకు మాటలు అక్షరలక్షలు చేస్తాయని పొగడడంతో ఆనందం కలిగింది. తన భర్త మీసం మెలివేసి తన కొడుకు గొప్పతనం గురించి చెప్పాడు. తన భర్త గర్వపడేటంత మంచి కొడుకును కన్నందుకు గర్వపడింది. తన కొడుకు దేశ సేవలో మరణించడం ఆనందకరం అని ఎందుకన్నాడో అప్పుడు అర్ధమయ్యింది. వీర తప్పు చేయడం లేదని ఆనందం కల్గింది.

ప్రశ్న 4.
వీర జవానుల సేవలను కీర్తించే ఒక చక్కటి నినాదాన్ని రాయండి. (FA-1-2022-23)
జవాబు:

  1. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే ఓ వీర జవానులారా ఇదే మీకు మా హృదయ పూర్వక పాదాభివందనం.
    వీర జవానుల ఆత్మస్థైర్యం దేశ రక్షణకు వెన్నెముక.

ఆ) క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో జవాబులు వ్రాయండి.

ప్రశ్న 1.
వీర సంస్కరణ సభ జరిగిన తీరును బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
వీర సంస్కరణ సభ ఆయన స్వగ్రామంలో జరిగింది. పద్మజగారు మాట్లాడుతూ వీర తమ గ్రామానికే కాదు రాష్ట్రానికే మణిపూస అన్నారు. అంటే వీర వలన తమ గ్రామానికి ఎంతో కీర్తి వచ్చింది. తన తల్లిదండ్రులకు గ్రామానికి పేరు తెచ్చేవారే నిజమైన సంతానం అంటారు. పెద్దలు అటువంటి వీర, ఆయనను కన్నతల్లి దండ్రులు, గ్రామస్తులు ధన్యులని గ్రహించాము.

వీర తల్లిదండ్రులను చాలా మంది పెద్దలు ఓదార్చారు. పుట్టిన వారికి మరణము తప్పదు. కొంతమంది మరణిస్తే బంధుమిత్రులు బాధపడతారు. కాని వీర మరణం సామాన్యమైనది కాదు. దేశ సేవలో వీరమరణం పొందాడు. అందుకే ఎంతో మంది పెద్దలు వచ్చారు. వారిని ఓదార్చారు. ఆర్థిక సహాయం చేశారు. దీనిని బట్టి వీర తల్లిదండ్రులకే కాదు భరతమాతకు ముద్దుబిడ్డ. తన గ్రామస్తులకే కాదు భారతీయులందరికీ కావలసిన వాడని, ఆయన సంస్మరణ సభ జరిగిన తీరును బట్టి గ్రహించాము.

ప్రశ్న 2.
వీర జీవితం ద్వారా మీరు ఎలా స్పూర్తి పొందారు?
జవాబు:
వీర జీవితం నుండి మేము చాలా స్పూర్తి పొందాము. ధైర్యంగా జీవిస్తాం. తల్లిదండ్రుల పేదరికాన్ని, కష్టాలను తొలగిస్తాం. ఏ ఉద్యోగం చేసినా నిజాయితీగా బ్రతుకుతాం. మా చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, తల్లిదండ్రులకు అందరికీ బట్టలు కొంటాం. తమ్ముళ్లను, చెల్లెళ్లను బాగా చదివిస్తాం. మా ప్రవర్తనతో గ్రామానికి మంచి పేరు తెస్తాం.

మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతాం. మా అమ్మ, నాన్న గర్వపడేలా మంచి పనులు చేస్తాం. తర్వాత తరాలు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొనేటంత మంచి పనులు చేస్తాం.

ప్రశ్న 3.
మీ తల్లిదండ్రులు మీకు చేస్తున్నవి ప్రస్తావిస్తూ మీ నాన్నగారికి లేఖ వ్రాయండి.
జవాబు:

నెల్లూరు,
X X X X X.

పూజ్యులైన నాన్నగారికి నమస్కరించి మీ కుమారుడు శ్రీవాత్సవ్ వ్రాయు లేఖ

నేను బాగా చదువుకుంటున్నాను. మా హాస్టల్లో అందరం స్నేహంగా ఉంటున్నాం.

మొన్ననే మాకు మాతృభూమి పాఠం చెప్పారు. అందులో తల్లిదండ్రులకు, దేశానికి సేవ చేసిన వీర గురించి చెప్పారు. ఆ పాఠం వింటుంటే మీరు, అమ్మ గుర్తుకు వచ్చారు.

మీరు, అమ్మ నా కోసం చాలా చేస్తున్నారు. బట్టలు, పుస్తకాలు, బొమ్మలు, సైకిలు, ఇలా నాకు ఏమి కావాలన్నా కొంటున్నారు. మీరు, అమ్మ కూలిపని చేసి సంపాదిస్తున్న డబ్బులలో చాలా భాగం నాకే ఖర్చవుతోంది. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తాను. అప్పుడిక మనకు కష్టాలుండవు. ఆరోగ్యాలు జాగ్రత్త, ఉంటాను మరి.
నమస్కారములతో

మీ కుమారుడు,
వి. శ్రీవాత్సవ్.

చిరునామా :
శ్రీ వి. అఖిలేష్ గారు,
తాపీ మేస్త్రి, డోర్ నెం. 4-3-16,
పవర్పేట, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా.

భాషాంశాలు

బహుళైచ్ఛిక ప్రశ్నలు

పదజాలం

అర్థాలు : గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.

1. ఓదార్పు మాటలు బాధితులకు బలాన్నిస్తాయి. (ఎ)
ఎ) సముదాయింపు
బి) ఏడ్పించడం
సి) నవ్వించడం
డి) మంచి
జవాబు:
ఎ) సముదాయింపు

2. మంచివారిని కొనియాడు. (డి)
ఎ) రానియ్యి
బి) చేరదియ్యి
సి) ఆశ్రయించు
డి) కీర్తించు
జవాబు:
డి) కీర్తించు

3. ఊపిరి ఉన్నంతవరకు మంచి చేయాలి. (సి)
ఎ) డబ్బు
బి) పదవి
సి) శ్వాస
డి) కలిమి
జవాబు:
సి) శ్వాస

4. అనవసరమైన ఏడ్పు అనర్థం తెస్తుంది. (బి)
ఎ) పిలుపు
బి) రోదన
సి) మాట
డి) బుజ్జగింపు
జవాబు:
బి) రోదన

5. కరోనా ఆర్థికంగా దెబ్బకొట్టింది. (సి)
ఎ) అర్ధము
బి) ఆరోగ్యం
సి) డబ్బు సంబంధమైన
డి) ఉద్యోగం
జవాబు:
సి) డబ్బు సంబంధమైన

6. ప్రతిదానికీ మంకుపట్టు పట్టకూడదు. (బి)
ఎ) పట్టుదల
బి) మొండిపట్టు
సి) పట్టుబట్ట
డి) నట్లు
జవాబు:
బి) మొండిపట్టు

7. గరికపాటి వారి మాటలు అచ్చరలచ్చలు చేస్తాయి. (ఎ)
ఎ) అక్షర లక్షలు
బి) హాస్యం
సి) పద్యం
డి) ఉపన్యాసం
జవాబు:
ఎ) అక్షర లక్షలు

8. మా తెలుగు మాస్టారు అనర్గళంగా మాట్లాడతారు. (సి)
ఎ) బాగా
బి) చక్కగా
సి) ధారాళంగా
డి) మధురంగా
జవాబు:
సి) ధారాళంగా

9. తల్లిదండ్రుల ఋణము తీర్చుకోలేనిది. (బి)
ఎ) ఖర్చు
బి) అప్పు
సి) ప్రేమ
డి) అవరణ
జవాబు:
బి) అప్పు

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

10. మా మామయ్య నాకు వాచీ తెచ్చాడు. (డి)
ఎ) గణన యంత్రం
బి) గణనం
సి) బొమ్మ
డి) గడియారము
జవాబు:
డి) గడియారము

11. స్వగ్రామంలో ఉద్యోగం పొందడం అదృష్టం. (సి)
ఎ) గొప్ప, ఊరు
బి) పొరుగూరు
సి) సొంత ఊరు
డి) ప్రక్క గ్రామం
జవాబు:
సి) సొంత ఊరు

12. రాష్ట్రపతియే మన దేశ అధ్యక్షుడు. (ఎ)
ఎ) అగ్రేసరుడు
బి) అగ్రజుడు
సి) అనుజుడు
డి) ఆద్యుడు
జవాబు:
ఎ) అగ్రేసరుడు

13. సినిమాకు ఇంటిల్లిపాది వెడతాం. (సి)
ఎ) పక్కింటి వారు
బి) ఎదురింటి వారు
సి) ఇంట్లో వారంతా
డి) పిల్లలంతా
జవాబు:
సి) ఇంట్లో వారంతా

14. పిల్లలపై వాత్సల్యము చూపాలి. (డి)
ఎ) శ్రద్ధ
బి) అధికారం
సి) ఇష్టం
డి) ఆప్యాయత
జవాబు:
డి) ఆప్యాయత

15. ధృతరాష్ట్రునికి వంద మంది సంతానం. (ఎ)
ఎ) పిల్లలు
బి) కొడుకులు
సి) కూతుళ్లు
డి) బంధువులు
జవాబు:
ఎ) పిల్లలు

పర్యాయపదాలు : గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.

16. నీరు వృథా చేయకూడదు. (ఎ)
ఎ) జలము, వయస్సు
బి) పాలు, క్షీరము
సి) రక్తము, రుధిరము
డి) పెరుగు, దధి
జవాబు:
ఎ) జలము, వయస్సు

17. పల్లెల్లో చల్లని గాలి వీస్తుంది. (ఎ)
ఎ) వాయువు, పవనము
బి) నీరు, జలము
సి) ప్రాణము, ప్రాణి
డి) పాడి, పంట
జవాబు:
ఎ) వాయువు, పవనము

18. రాముని భార్య సీత. (సి)
ఎ) పతి, సతి
బి) సతి, అతివ
సి) సతి, పత్ని
డి) పడతి, స్త్రీ
జవాబు:
సి) సతి, పత్ని

19. ఆకాశంలో నల్లమబ్బులు ఉన్నాయి. (బి)
ఎ) ఆకాశం, అవకాశం
బి) నింగి, గగనము
సి) నింగి, నేల
డి) నేల, భూమి
జవాబు:
బి) నింగి, గగనము

20. కాలిలో ముల్లు గుచ్చుకొంది. (బి)
ఎ) కర్ర, కొల్లు
బి) కొట్టు, కంటకము
సి) కంటకము, కటకము
డి) ముల్లు, ముళ్లు
జవాబు:
బి) కొట్టు, కంటకము

21. ఉద్యోగికి జీతం వస్తుంది. (ఎ)
ఎ) వేతనం, భృతి
బి) వేతనం, వేదన
సి) భృతి, భృత్యము
డి) లంచం, అమ్యామ్యా
జవాబు:
ఎ) వేతనం, భృతి

22. పిల్లలు తల్లిదండ్రులకు ఆసరా అవ్వాలి. (సి)
ఎ) దగ్గర సమీపం
బి) తోడు నీడ
సి) ఆశ్రయము, అండ
డి) అండ దండ
జవాబు:
సి) ఆశ్రయము, అండ

23. అన్నీ మంచి రోజులే. (డి)
ఎ) గంట, నిమిషము
బి) కాలం, సమయం
సి) ముహూర్తం, మూరుతము
డి) దివము, దివసము
జవాబు:
డి) దివము, దివసము

24. సైనికునికి మీసము అందం. (ఎ)
ఎ) మీస, శృత్రువు
బి) స్వేదము, మీసలు
సి) గడ్డము, మీనము
డి) పౌరుషం, బలం
జవాబు:
ఎ) మీస, శృత్రువు

25. ఏ పనినీ రేపు చేద్దాం అని వాయిదా వేయకూడదు. (సి)
ఎ) నిన్న, మొన్న
బి) నేడు, నాడు
సి) రేపకడ, ఎల్లి
డి) నాడు, నిన్న
జవాబు:
సి) రేపకడ, ఎల్లి

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

26. మంచి సాధించాలనే కాంక్ష ఉండాలి. (డి)
ఎ) ఆశయం, ఆశ్రయం
బి) పట్టు, పట్టుదల
సి) ప్రయత్నం, యత్నం
డి) కోరిక, ఈప్సితము
జవాబు:
డి) కోరిక, ఈప్సితము

27. అతి నిద్ర మంచిది కాదు. (బి)
ఎ) రాత్రి, రేయి
బి) నిదుర, కునుక
సి) పగలు, రాత్రి
డి) రోజు, దినం
జవాబు:
బి) నిదుర, కునుక

28. తల్లి ఋణము తీరదు. (ఎ)
ఎ) అప్పు, బాకీ
బి) ప్రేమ, ఆప్యాయత
సి) డబ్బు, ధనం
డి) చాకిరీ, పని
జవాబు:
ఎ) అప్పు, బాకీ

29. మన చదువు బ్రతుకు ను బాగుచేస్తుంది. (సి)
ఎ) జీతం, వేతనం
బి) ఇల్లు, గృహం
సి) జీవితం, మనుగడ
డి) కష్టం, సుఖం
జవాబు:
సి) జీవితం, మనుగడ

30. ఇతరులకు సహాయం చేయాలి. (ఎ)
ఎ) సాయం, ఆదుకోవడం
బి) డబ్బు, ధనం
సి) ఓదార్పు, సముదాయింపు
డి) కష్టం, ఆపద
జవాబు:
ఎ) సాయం, ఆదుకోవడం

నానార్థాలు : గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.

31. అనుమానమే స్నేహానికి అడ్డు గోడ. (సి)
ఎ) కుడ్యము, భిత్తిక
బి) ఇటుక, ఇసుక
సి) కుడ్యము, గుఱ్ఱము
డి) అడ్డము, ఆటంకం
జవాబు:
సి) కుడ్యము, గుఱ్ఱము

32. కోనసీమ గడ్డ సారవంతమైనది. (ఎ)
ఎ) దుంప, మట్టిపెళ్ల
బి) భూమి, నీరు
సి) నీరు, గాలి
డి) గాలి, తోట
జవాబు:
ఎ) దుంప, మట్టిపెళ్ల

33. ఈ గ్రామము బాగుంది. (బి)
ఎ) పల్లె, జనపదం
బి) ఊరు, స్వరము
సి) గ్రామణి, కంఠము
డి) గ్రామకంఠము, గొంతు
జవాబు:
బి) ఊరు, స్వరము

34. ఋణమును నిల్వ ఉంచకూడదు. (డి)
ఎ) అప్పు, బాకీ
బి) అప్పు, మురికి
సి) మురికి, చెద
డి) అప్పు, నీరు
జవాబు:
డి) అప్పు, నీరు

35. గాలి లేకపోతే ఏమీ లేదు. (ఎ)
ఎ) వాయువు, ప్రాణము
బి) వాయువు, ఆస్తి
సి) పదనము, డబ్బు
డి) ఇల్లు, తెమ్మెర
జవాబు:
ఎ) వాయువు, ప్రాణము

36. ఎప్పటికైనా వీడ్కోలు తప్పదు. (డి)
ఎ) మరుపు, విడుపు
బి) విడుపు, బలుపు
సి) విడుపు, మరణం
డి) జననం, మరణం
జవాబు:
డి) జననం, మరణం

37. అవసరము తప్పక నెరవేర్చాలి. (బి)
ఎ) అవకాశము, వీలు
బి) అవకాశము, నైవేద్యము
సి) వీలు, సాలు
డి) సాలు, సాలుసరి
జవాబు:
బి) అవకాశము, నైవేద్యము

38. ఎవరి స్థితి ఎలాగైనా ఉండవచ్చు. (డి)
ఎ) పరిస్థితి, పరీస్థితి
బి) గతి, మతి
సి) మతి, మది
డి) ఉనికి, ఆస్తి
జవాబు:
డి) ఉనికి, ఆస్తి

39. పది జాగ్రత్త (ఎ)
ఎ) పాదము, దశకము
బి) దశ, దిశ
సి) దెస, దిశ
డి) పాదము, తాళము
జవాబు:
డి) పాదము, తాళము

40. కష్టము ఎవ్వరికైనా తప్పదు. (సి)
ఎ) పీడ, చీడ
బి) పీడ, బాధ
సి) పీడించేది, ప్రయత్నము
డి) ప్రయత్నము, యత్నము
జవాబు:
సి) పీడించేది, ప్రయత్నము

41. సమయము వృథా చేయకూడదు. (బి)
ఎ) కాలము, నలుపు
బి) ప్రతిజ్ఞ, కాలము
సి) ప్రతిజ్ఞ, ప్రతిన
డి) నలుపు, తెలుపు
జవాబు:
బి) ప్రతిజ్ఞ, కాలము

42. కొందరి మాట ముల్లులా ఉంటుంది. (డి)
ఎ) కంటకము, కటకము
బి) కొండి, కోడె
సి) త్రాసు, తక్కెడ
డి) కంటకము, సుముల్లు
జవాబు:
డి) కంటకము, సుముల్లు

43. కొందరు గుండె దిటవుతో ఉంటారు. (సి)
ఎ) హృదయము, ఎద
బి) ఎద, డెందము
సి) హృదయము, ధైర్యము
డి) ధైర్యం, నిర్భయం
జవాబు:
సి) హృదయము, ధైర్యము

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

44. అలసిన రెక్క నొప్పి పెడుతోంది. (ఎ)
ఎ) పక్షి రెక్క భుజము
బి) వేయి, హస్తము
సి) కరము, డెందము
డి) పక్షి రెక్క, ముక్కు
జవాబు:
ఎ) పక్షి రెక్క భుజము

45. చీకటికి భయపడకూడదు. (సి)
ఎ) తిమిరము, తమము
బి) బాధ, ఏడ్పు
సి) తమస్సు, దుఃఖము
డి) ఇరులు, విరులు
జవాబు:
సి) తమస్సు, దుఃఖము

ప్రకృతి – వికృతులు : గీత గీసిన పదానికి ప్రకృతులు / వికృతులు గుర్తించండి.

46. అక్షరము పేదవాని ఆయుధం – వికృతి పదం (బి)
ఎ) అకరము
బి) అచ్చరము
సి) ఆకారము
డి) అకారము
జవాబు:
బి) అచ్చరము

47. కండ వలన అన్నీ సాధ్యం కావు – ప్రకృతి పదం (ఎ)
ఎ) ఖండము
బి) ఖండనము
సి) కండన
డి) కండ్రిగ
జవాబు:
ఎ) ఖండము

48. ప్రజల సేవకే నేతలు – వికృతి పదం (డి)
ఎ) ప్రజా
బి) పరజ
సి) పరాజ
డి) పజ
జవాబు:
డి) పజ

49. శరీరం దృఢము గా ఉండాలి – వికృతి పదం (సి)
ఎ) బార్యము
బి) దారుడము
సి) దిటము
డి) దీటు
జవాబు:
సి) దిటము

50. గురువు గారిని ప్రశ్న వేసి తెలుసుకోవాలి – వికృతి పదం (డి)
ఎ) ప్రశ్నము
బి) పరిప్రశ్న
సి) పన్నాగము
డి) పన్నము
జవాబు:
డి) పన్నము

51. చదువు వలన జ్ఞానం వృద్ధి చెందుతుంది. – వికృతి పదం (ఎ)
ఎ) వడ్డీ
బి) అభివృద్ధి
సి) వృద్ధు
డి) ఉద్ది
జవాబు:
ఎ) వడ్డీ

52. మంచి కచ్చు ఉండాలి – ప్రకృతి పదం (సి)
ఎ) కచ్చ
బి) కచ్చి
సి) కాంక్ష
డి) కసి
జవాబు:
సి) కాంక్ష

53. గరువము పనికి రాదు – ప్రకృతి పదం (బి)
ఎ) గారుడము
బి) గర్వము
సి) ఖర్వము
డి) గురుతు
జవాబు:
బి) గర్వము

54. చదువుపై శ్రద్ధ ఉండాలి – వికృతి పదం (బి)
ఎ) శరద
బి) సడ్డ
సి) శ్రద్ధు
డి) సెడ్డ
జవాబు:
బి) సడ్డ

55. దూకలి అనారోగ్యం – ప్రకృతి పదం (ఎ)
ఎ) దుఃఖము
బి) దుక్క
సి) దుక్కి
డి) డాక్క
జవాబు:
ఎ) దుఃఖము

56. మంచి నీరు ఎక్కువ తాగాలి – ప్రకృతి పదం (డి)
ఎ) జలము
బి) నీళ్లు
సి) నీలము
డి) నీరము
జవాబు:
డి) నీరము

57. పక్షుల పై ప్రేమ ఉండాలి- వికృతి పదం (బి)
ఎ) పెరము
బి) ప్రేముడి
సి) పరము
డి) పరిమళం
జవాబు:
బి) ప్రేముడి

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

58. ఆకాశంలో మేఘాలు బాగున్నాయి- వికృతి పదం (బి)
ఎ) ఆకాసము
బి) ఆకసము
సి) కాశము
డి) కషాయం
జవాబు:
బి) ఆకసము

59. ప్రారంభించిన కర్జము వదలకూడదు – ప్రకృతి పదం (సి)
ఎ) కరుణ
బి) కరణము
సి) కార్యము
డి) కార్యక్రమం
జవాబు:
సి) కార్యము

60. సాయము చేయాలి – ప్రకృతి పదం (ఎ)
ఎ) సహాయము
బి) సహాయ్యము
సి) సాహాయము
డి) సహము
జవాబు:
ఎ) సహాయము

వ్యుత్పత్త్యర్థాలు : గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాలు గుర్తించండి.

61. తరగతిలో మౌనము గా ఉండకూడదు. (ఎ)
ఎ) ముని యొక్క భావం
బి) మాట్లాడడం
సి) చర్చించకుండా
డి) అభిప్రాయం చెప్పకుండా
జవాబు:
ఎ) ముని యొక్క భావం

62. ఆశ్రయింపబడినది వ్యుత్పత్తి పదం గుర్తించండి. (సి)
ఎ) ఆశ్రయం
బి) శ్రమ
సి) భక్తి
డి) వృక్షము
జవాబు:
సి) భక్తి

63. దీనియందంటను సూర్యాదులు ప్రకాశింతురు – ష్యత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) పగలు
బి) దివము
సి) దినము
డి) ఆకాశము
జవాబు:
డి) ఆకాశము

64. భర్తను మోసం చేయకూడదు. (బి)
ఎ) పతి
బి) భరించువాడు
సి) ప్రేమించువాడు
డి) కోపించువాడు
జవాబు:
బి) భరించువాడు

65. తెలుసుకోవాలని అడగడం – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) ఎంక్వయిరీ
బి) ప్రశ్న
సి) ఉత్తరం
డి) నిరుత్తరం
జవాబు:
బి) ప్రశ్న

66. ప్రియము యొక్క భావన – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) ప్రేమ
బి) ఇష్టం
సి) మక్కువ
డి) ఆనందం
జవాబు:
ఎ) ప్రేమ

67. ఎవరితోనూ యుద్ధము వద్దు. (సి)
ఎ) జగడం
బి) రణ
సి) పోరుట
డి) చివ్వ
జవాబు:
సి) పోరుట

68. తృప్తిగా భుజించాలి – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) తనియుట
బి) తడియుట
సి) నిండుగా
డి) ఎక్కువగా
జవాబు:
ఎ) తనియుట

69. రాత్రి బయట తిరగవద్దు. (బి)
ఎ) చీకటి
బి) సుఖమునిచ్చునది
సి) భయం వేసేది
డి) ధైర్యం చంపేది
జవాబు:
బి) సుఖమునిచ్చునది

70. దృఢము గా ఉండాలి. (డి)
ఎ) గట్టిది
బి) మెత్తనిది
సి) ఇనుము
డి) వృద్ధి పొందినది
జవాబు:
డి) వృద్ధి పొందినది

71. దీని చేత ఎఱుగబడును – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) మతి
బి) మది
సి) మెదడు
డి) ఆలోచన
జవాబు:
ఎ) మతి

72. మహిళలను గౌరవించాలి. (సి)
ఎ) భూమి
బి) భూమిపై ఉండేది
సి) ఆదరింపబడునది
డి) అందమైనది
జవాబు:
సి) ఆదరింపబడునది

73. ఉదకము వలన పుట్టునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) నేతి
బి) భూమి
సి) నిప్పు
డి) మంట
జవాబు:
బి) భూమి

74. దీని యందు ఇంద్రియములు దుష్టములౌను. (ఎ)
ఎ) దుఃఖము
బి) రోదన
సి) భయం
డి) పరవశం
జవాబు:
ఎ) దుఃఖము

75. సైన్యము దేశాన్ని రక్షిస్తుంది. (డి)
ఎ) మంత్రితో కూడినది
బి) భటులతో నిండునది
సి) బలంగా ఉండేది
డి) రాజుతో కూడినది
జవాబు:
డి) రాజుతో కూడినది

సంధులు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

76. మనకున్న దానితో తృప్తి చెందాలి – విడదీసి రాయండి. (ఎ)
ఎ) మనకు + ఉన్న
బి) మన + కున్న
సి) మనకి + ఉన్న
డి) మనకూ + ఉన్న
జవాబు:
ఎ) మనకు + ఉన్న

77. తలెత్తుకొని బ్రతకాలి – సంధి పేరు గుర్తించండి. (సి)
ఎ) ఇత్వ సంధి
బి) ఉత్వ సంధి
సి) అత్వ సంధి
డి) గుణ సంధి
జవాబు:
సి) అత్వ సంధి

78. జ్ఞానం పోతుందని భయం లేదు – సంధి పేరు గుర్తించండి. (ఎ)
ఎ) ఇత్వ సంధి
బి) అత్వ సంధి
సి) ఉత్వ సంధి
డి) గుణ సంధి
జవాబు:
ఎ) ఇత్వ సంధి

79. మంచి పని ప్రారంభమునకు ఆలోచించవద్దు – విడదీసి రాయండి. (బి)
ఎ) ప్రా + రంభము
బి) ప్ర + ఆరంభము
సి) ప్రా + ఆరంభము
డి) ప్ర + రంభము
జవాబు:
బి) ప్ర + ఆరంభము

80. సౌకర్యము + లు – సంధి కలిపిన రూపం గుర్తించండి. (డి)
ఎ) సౌకర్యము
బి) సౌకర్యంలు
సి) సౌకర్యాంలు
డి) సౌకర్యాలు
జవాబు:
డి) సౌకర్యాలు

81. తల్లి + తండ్రి – సంధి కలిపిన రూపం గుర్తించండి. (సి)
ఎ) తల్లి తండ్రి
బి) తల్లియు తండ్రియు
సి) తల్లిదండ్రులు
డి) తల్లీ తండ్రి
జవాబు:
సి) తల్లిదండ్రులు

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

82. క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధి పదం గుర్తించండి. (ఎ)
ఎ) శ్రద్ధాంజలి
బి) మాతృభూమి
సి) అన్నాచెల్లి
డి) తల్లీ తండ్రి
జవాబు:
ఎ) శ్రద్ధాంజలి

83. క్రింది వానిలో అత్వసంధి పదం గుర్తించండి. (సి)
ఎ) గొప్పోరు
బి) గొప్పులున్న
సి) గొప్పేమి
డి) గొప్పవారు
జవాబు:
సి) గొప్పేమి

84. క్రింది వానిలో ఇత్వసంధి పదం గుర్తించండి. (బి)
ఎ) ఉన్నంత
బి) పదేళ్లు
సి) వందేళ్లు
డి) మాయూరు
జవాబు:
బి) పదేళ్లు

85. క్రింది వానిలో లు,ల,న,ల సంధి పదం గుర్తించండి. (డి)
ఎ) సమాజాభివృద్ధి
బి) మరెవ్వరు
సి) ఇంకేమి
డి) భావాలు
జవాబు:
డి) భావాలు

86. వీర అమరుడవుతాడని అనుకోలేదు సంధి పేరు గుర్తించండి. (సి)
ఎ) అత్వ, ఇత్వ సంధులు
బి) ఇత్వ, ఉత్వ సంధులు
సి) ఉత్వ సంధులు
డి) అత్వ సంధులు
జవాబు:
సి) ఉత్వ సంధులు

87. క్రింది వానిలో ఉత్వసంధి కాని పదమేది? (బి)
ఎ) నీకేమి
బి) ఇదేమి
సి) చేస్తానని
డి) చేయనా
జవాబు:
బి) ఇదేమి

88. రోశయ్య మీసాలు దువ్వుతున్నాడు – దీనిలో అత్వసంధి పదం గుర్తించండి. (ఎ)
ఎ) రోశయ్య
బి) మీసాలు
సి) దువ్వుతున్నాడు
డి) లేదు
జవాబు:
ఎ) రోశయ్య

89. వారి + ఇంట్లో – కలిపి రాయండి. (సి)
ఎ) వాళ్లింట్లో
బి) వారి ఒంట్లో
సి) వారింట్లో
డి) వారుంటే
జవాబు:
సి) వారింట్లో

90. చంద్రమ్మ వీరమాత – సంధి పేరు గుర్తించండి. (ఎ)
ఎ) అత్వ సంధి
బి) ఉత్వ సంధి
సి) ఇత్వ సంధి
డి) గుణ సంధి
జవాబు:
ఎ) అత్వ సంధి

సమాసాలు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

91. వీర మాటలు అక్షర లక్షలు చేస్తాయి – సమాసం పేరు గుర్తించండి. (డి)
ఎ) ద్వితీయా తత్పురుష
బి) తృతీయా తత్పురుష
సి) చతుర్థీ తత్పురుష
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
డి) షష్ఠీ తత్పురుష

92. శ్రద్ధాంజలి – విగ్రహ వాక్యం గుర్తించండి. (బి)
ఎ) శ్రద్ధ యొక్క అంజలి
బి) శ్రద్ధతో అంజలి
సి) శ్రద్ధమైన అంజలి
డి) అంజలియందు శ్రద్ధ
జవాబు:
బి) శ్రద్ధతో అంజలి

93. వ్యాపారవేత్తకు లాభంపైనే దృష్టి ఉంటుంది – సమాసం పేరు గుర్తించండి. (బి)
ఎ) ప్రథమా తత్పురుష
బి) ద్వితీయా తత్పురుష
సి) తృతీయా తత్పురుష
డి) చతుర్థీ తత్పురుష
జవాబు:
బి) ద్వితీయా తత్పురుష

94. క్రింది వానిలో ద్విగు సమాస పదం గుర్తించండి. (ఎ)
ఎ) మూడు రోజులు
బి) మూడవ తరగతి
సి) ముక్కంటి
డి) త్రిమూర్తులు
జవాబు:
ఎ) మూడు రోజులు

95. దేశమునందు భక్తి – సమాసం పదం గుర్తించండి. (డి)
ఎ) భక్తదేశము
బి) దేశపుభక్తి
సి) భక్తి దేశము
డి) దేశభక్తి
జవాబు:
డి) దేశభక్తి

96. అర్గళము (అడ్డుగడియ) లేనిది – సమాసం పదం గుర్తించండి. (బి)
ఎ) శౌర్దళము
బి) అనర్గళము
సి) ఆరకము
డి) గళము
జవాబు:
బి) అనర్గళము

97. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదం గుర్తించండి. (ఎ)
ఎ) పెద్ద చదువు
బి) చదువుల పెద్ద
సి) నా మాట
డి) దంపతులు
జవాబు:
ఎ) పెద్ద చదువు

98. చర్చలు అనేకము జరగాలి – సమాసం పేరు గుర్తించండి. (సి)
ఎ) సప్తమీ తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) నఞ్ తత్పురుష
డి) పంచమీ తత్పురుష
జవాబు:
సి) నఞ్ తత్పురుష

99. ఐదుగురు సంతానం – విగ్రహ వాక్యం గుర్తించండి. (డి)
ఎ) సంతానం ఐదుగురు
బి) ఐదుగురే సంతానం
సి) ఐదుగురు సంతానం
డి) ఐదుగురు ఐన సంతానం
జవాబు:
డి) ఐదుగురు ఐన సంతానం

100. వంట గది ఘుమఘుమలు ఆకలి పెంచాయి – సమాసం పేరు గుర్తించండి. (బి)
ఎ) ప్రథమా తత్పురుష
బి) చతుర్థీ తత్పురుష
సి) పంచమీ తత్పురుష
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
బి) చతుర్థీ తత్పురుష

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

101. దేశప్రజలు జాతీయ సమైక్యత పాటించాలి – సమాసం పేరు గుర్తించండి. (ఎ)
ఎ) సప్తమీ తత్పురుష
బి) ద్వితీయ తత్పురుష
సి) తృతీయా తత్పురుష
డి) పంచమీ తత్పురుష
జవాబు:
ఎ) సప్తమీ తత్పురుష

102. స్వగ్రామం – విగ్రహవాక్యం గుర్తించండి. (సి)
ఎ) మంచి గ్రామం
బి) స్వ యొక్క గ్రామం
సి) నా యొక్క గ్రామం
డి) సొంతయైన గ్రామం
జవాబు:
సి) నా యొక్క గ్రామం

103. క్రింది వానిలో ద్వంద్వ సమాస పదం గుర్తించండి. (డి)
ఎ) తల్లి తండ్రి
బి) తల్లియైన తండ్రి
సి) తండ్రి తల్లి
డి) తల్లిదండ్రులు
జవాబు:
డి) తల్లిదండ్రులు

104. క్రింది వానిలో తృతీయా తత్పురుష సమాస పదం గుర్తించండి. (ఎ)
ఎ) అయోమయము
బి) మయోయము
సి) పదేళ్లు
డి) కన్నీళ్లు
జవాబు:
ఎ) అయోమయము

105. క్రింది వానిలో షష్ఠీ తత్పురుష సమాస పదం కానిదేది? (సి)
ఎ) వీరమాత
బి) మన జిల్లా
సి) ఎనిమిదేళ్లు
డి) నా వాళ్లు
జవాబు:
సి) ఎనిమిదేళ్లు

ఛందస్సు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

106. మాయమ్మ – గణం గుర్తించండి. (సి)
ఎ) య గణం
బి) ర గణం
సి) త గణం
డి) మ గణం
జవాబు:
సి) త గణం

107. వరమా – గణం గుర్తించండి. (ఎ)
ఎ) స గణం
బి) భ గణం
సి) జ గణం
డి) మ గణం
జవాబు:
ఎ) స గణం

108. రెండు లఘువులకు మధ్య గురువు ఉంటే ఏ గణం? (బి)
ఎ) ర గణం
బి) జ గణం
సి) న గణం
డి) త గణం
జవాబు:
బి) జ గణం

109. రెండు గురువుల మధ్య లఘువు ఉంటే ఏ గణం? (డి)
ఎ) జ గణం
బి) భ గణం
సి) న గణం
డి) ర గణం
జవాబు:
డి) ర గణం

110. మూడూ గురువులైతే ఏ గణం? (బి)
ఎ) న గణం
బి) మ గణ
సి) ర గణం
డి) న గణం
జవాబు:
బి) మ గణ

వాక్య రకాలు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

111. యువకులు సైన్యంలో చేరాలి – వాక్యపు రకం గుర్తించండి. (ఎ)
ఎ) విధ్యర్థం
బి) సంయుక్తం
సి) అప్యర్థకం
డి) హేత్వర్థకం
జవాబు:
ఎ) విధ్యర్థం

112. యువకులు సైన్యంలో చేరి, దేశ సేవ చేయాలి – వాక్యపు రకం గుర్తించండి. (డి)
ఎ) సంయుక్తం
బి) విధ్యర్థకం
సి) అప్యర్థకం
డి) సంశ్లిష్టం
జవాబు:
డి) సంశ్లిష్టం

113. యువతీయువకులు దేశసేవ చేయాలి – వాక్యపు రకం గుర్తించండి. (బి)
ఎ) సంక్లిష్టం
బి) సంయుక్తం
సి) అనుమత్యర్థకం
డి) విద్యర్థకం
జవాబు:
బి) సంయుక్తం

114. మీరు దేశసేవ చేస్తారా? – వాక్యపు రకం గుర్తించండి. (సి)
ఎ) సందేహార్థకం
బి) ప్రార్థనార్థకం
సి) ప్రశ్నార్థకం
డి) అప్యర్థకం
జవాబు:
సి) ప్రశ్నార్థకం

115. వృద్ధులు దేశసేవ చేయగలరో! చేయలేరో! – వాక్యపు రకం గుర్తించండి. (సి)
ఎ) ప్రశ్నార్థకం
బి) విధ్యర్థం
సి) సందేహార్థకం
డి) అనుమత్యర్థకం
జవాబు:
సి) సందేహార్థకం

Previous Bits

1. నాకు చదువంటే చాలా ఇష్టం. వ్యతిరేకార్థక పదం (డి)
ఎ) అభిరుచి
బి) అభీష్టం
సి) చేదు
డి) అయిష్టం
జవాబు:
డి) అయిష్టం

2. విద్య మనకు ఉన్నత వ్యక్తిత్వం ఇస్తుంది. (విగ్రహవాక్యం గుర్తించండి) (ఎ)
ఎ) ఉన్నతమైన వ్యక్తిత్వం
బి) ఉన్నతం యొక్క వ్యక్తిత్వం
సి) ఉన్నతం వంటి వ్యక్తిత్వం
డి) ఉన్నతమైనది, వ్యక్తిత్వమైనది.
జవాబు:
ఎ) ఉన్నతమైన వ్యక్తిత్వం

3. నీ మాటలు అమృతం వలే సంతోషాన్నిస్తున్నాయి (అలంకారం గుర్తించండి) (SA-1-2022-23) (ఎ)
ఎ) ఉపమ
బి) ఉత్ప్రేక్ష
సి) శ్లేష
డి) అతిశయోక్తి
జవాబు:
ఎ) ఉపమ

4. అనర్గళంగా : మా అన్నయ్య ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలడు.

5. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. (వికృతి పదాన్ని గుర్తించండి.) (సి)
ఎ) నింగి
బి) గాలి
సి) ఆకసం
డి) అంబరం
జవాబు:
సి) ఆకసం

6. క్రింది వానిలో ఇత్వ సంధికి చెందిన పదాన్ని గుర్తించండి. (బి)
ఎ) వచ్చుచున్నది
బి) మరొక
సి) మనమిక
డి) వారందరు
జవాబు:
బి) మరొక

AP 8th Class Telugu 2nd Lesson Important Questions మాతృభూమి

7. భారతదేశము భిన్న సంస్కృతులకు నిలయం. (విగ్రహ వాక్యం రాయండి)
జవాబు:
భరత అను పేరుగల దేశము.

8. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. (ఉపమానమును గుర్తించండి) (SA-1-2023-24) (ఎ)
ఎ) ముఖము
బి) చంద్రబింబము
సి) వలె
డి) ఉన్నది
జవాబు:
ఎ) ముఖము

9. కళింగ యుద్ధం అశోకునిలో పెనుమార్పు తెచ్చింది. (పర్యాయపదాలు గుర్తించండి.) (SAP112023-24) (ఎ)
ఎ) రణం, సంగ్రామం
బి) సంబరం, కదనం
సి) కదనం, కవనం
డి) శరణం, చరణం
జవాబు:
ఎ) రణం, సంగ్రామం

Leave a Comment