These AP 8th Class Telugu Important Questions 13th Lesson ఆతిథ్యం will help students prepare well for the exams.
ఆతిథ్యం AP Board 8th Class Telugu 13th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
పరిచిత పద్యాలు – పూరణలు – భావాలు
ఈ కింది పద్యాన్ని పూరించి భావం రాయండి.
1. శరణము సొచ్చినం దగఁ బ్రసన్నతఁ గైకొని రక్షణంబు సా
దరముగఁ జేయు టత్యధిక ధర్మముగా బుధకోటి సెప్పు; నీ
వరసి మహార్తు వీని శరణాగతు నోపినభంగి నాపదం
బొరయక యుందఁజేయుము ప్రభూతపు సీతునఁ గొంకు వోయెడున్.
భావం : శరణని వచ్చిన వారిని దయతో ఆదరించి రక్షించడం గొప్పదైన ధర్మంగా పండితులు చెబుతారు. చలికి బాధపడుతూ శరణాగతి పొందిన నీవు చేయ గల్గినంత సహాయం చెయ్యి, వేటగానికి నీవాలోచించి వాడికి కష్టం కలగకుండా కాపాడు, దట్టమైన చలితో వాని శరీరం కొంకర్లు పోతోంది అని తన భర్తతో పావురం అన్నది.
2. అనవుడు నుల్ల మెంతయుఁ బ్రియంబు వహింపఁగఁ బక్షివైరి ‘సీ
తున సకలాంగకంబులుఁ బ్రతున్నము లయ్యెడుఁ దీనిఁ బాపమే!’
యనిన విహంగమంబు రయమారఁగ నచ్చటి పుల్లలెల్ల ము
క్కువగొని తెచ్చి ప్రోవిడి యకుంఠిత మైన దయాగుణంబున్.
భావం: మగ పావురం మాట్లాడిన తర్వాత, వేటగాని మనసంతా సంతోషంతో నిండింది. చలితో అవయవాలు అన్నీ చాలా బాధపడుతున్నాయి. ఈ చలిని నివారించు అని వేటగాడు అనగానే, ఆ పావురం జాలితో వేగంగా వెళ్లి, అక్కడి పుల్లలన్నీ తెచ్చింది. పోగు పెట్టింది.
3. ‘కలదే యిమ్మెయి పౌరుషంబు జగతం గారుణ్య మేపార ని
ప్పులుఁ గిట్లిచ్చునె మేను ? నాదు చరితంబుల్ నిందకుఁ బట్టులై
తలఁపన్ వచ్చిన నింత కీ డగునె యేతత్రూరతా ఘోర చే
ల మానం గలవాండఁ; బక్షి గురువై సంధించే సద్బోధమున్’.
భావం : లోకంలో ఇటువంటి సాహసం పురుష ధర్మం ఎక్కడైనా ఉంటుందా! బాగా జాలిపడి ఈ పక్షి తన శరీరాన్నిచ్చింది. ఇలా శరీరం ఇవ్వడం ఎక్కడైనా ఉంటుందా! నా ప్రవర్తన ఈ లోకంలో నిందల పాలయింది. ఆలోచించగా నా నడవడి ఇంతటి ఆపదకు కారణమయ్యిందా! ఇక ఇటువంటి క్రూరమైన పనులు మానివేస్తాను. ఈ పక్షి నాకు గురువై మంచి ఉపదేశమును చేసింది.
పరిచిత పద్యాలు – ప్రశ్నలు
అ) కింది పరిచిత పద్యాలు చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. పతి మదికి నింత యెక్కిన
యతివ గదా పుణ్యవతి ప్రియాలాపము లీ
గతి వినఁ గాంచిఁ జన్మము
గృతకృత్యం బయ్యె నాకు గెలిచితి జమునిన్.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎవరు పుణ్యవతులు?
జవాబు:
ప్రతి మనసును పొందిన భార్య ఎంతో పుణ్యాత్మురాలు.
ప్రశ్న 2.
క్రియాలాపము అంటే ఏమిటి?
జవాబు:
క్రియాలాపము = ఇష్టమైన మాటలు
ప్రశ్న 3.
ఎవరి జన్మ కృతకృత్యము అయ్యింది?
జవాబు:
ఆడ పావురము జన్మ కృతకృత్యము అయ్యింది.
ప్రశ్న 4.
ఆడ పావురము ఎవరిని గెలిచింది?
జవాబు:
ఆడ పావురము జమునిని గెలిచింది.
2. ‘ఓ యన్న! డస్సినాఁడవు
మా యింటికి నతిథి వైతి మసలక నీకుం
జేయవలయు నాతిథ్యం;
బేయది భవదీప్సితార్థ మెఱిఁ గింపు తగన్’.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
పావురము వేటగాడిని ఏమని పిలిచింది?
జవాబు:
పావురము వేటగాడిని అన్న అని పిలిచింది.
ప్రశ్న 2.
పావురము మా ఇంటికి ఎలా వచ్చావు అంది?
జవాబు:
పావురము మా ఇంటికి అతిథిగా వచ్చావు అంది.
ప్రశ్న 3.
పావురము వేటగానికి ఏమి చేయాలంది?
జవాబు:
పావురము వేటగానికి ఆతిథ్యం చేయాలంది.
ప్రశ్న 4.
పావురము వేటగానికి ఎలా అతిథ్యం ఇవ్వాలనుకుంది?
జవాబు:
పావురము వేటగానికి కోరినది ఇచ్చి ఆతిథ్యం చేయాలనుకుంది.
3. ఖగములకు జీవనం బనఁ గలదె సంగ్ర
హించినట్టిది యాఁకలి కేమియైన
మాకు దొరకొన్నఁ దిందుముగాక ! యైన
నీవు డస్సితి వాతిథ్యనియతి వలయు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఖగములు అంటే ఏమిటి?
జవాబు:
ఖగములనగా పక్షులు
ప్రశ్న 2.
పక్షులకు దాచిపెట్టినది ఉంటుందా?
జవాబు:
పక్షులకు దాచిపెట్టినది ఉండదు.
ప్రశ్న 3.
పక్షులు ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాయి?
జవాబు:
పక్షులు ఆకలి వేసినపుడు దొరికినది తింటాయి.
ప్రశ్న 4.
వేటగాడు ఎలా వున్నాడు?
జవాబు:
వేటగాడు అలసిపోయి ఉన్నాడు.
4. అని పలికి యగ్ని వలగొని
తన దేహము దానిలోనఁ దడయక యిడినం
గని బోయ విస్మయంబున
మనమూనఁగఁ గొంతసేపు మ్రాన్పడియుంచెన్
ప్రశ్నలు:
ప్రశ్న 1.
దేహము అంటే ఏమిటి?
జవాబు:
దేహము = శరీరము
ప్రశ్న 2.
పావురము అప్పుడు ఏమి చేసింది?
జవాబు:
పావురము మంటలు చుట్టూ తిరుగుతూ మంటల్లో పడిపోయింది.
ప్రశ్న 3.
బోయవాడు పావురం చేసిన పనికి ఏమి చెందాడు?
జవాబు:
బోయవాడు పావురం చేసిన పనికి విస్మయం చెందాడు.
ప్రశ్న 4.
బోయవాడు పావురం చేసిన పనికి ఎలా ఉండిపోయాడు?
జవాబు:
బోయవాడు పావురం చేసిన పనికి కొయ్యబారి ఉండిపోయాడు.
అపరిచిత పద్యాలు – ప్రశ్నలు
అ) కింది అపరిచిత పద్యాలు చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. తోక వెనకాలనుండును
టీకప్పున నుండు మండుటెండలనుండున్
మోకాలు ముందు నుండును
ఆకాశము పైన నుండు అద్దిరభన్నా
ప్రశ్నలు:
ప్రశ్న 1.
తోక ఎక్కడ ఉంటుంది?
జవాబు:
తోక వెనకాల ఉంటుంది.
ప్రశ్న 2.
టీ ఎక్కడ ఉంటుంది?
జవాబు:
టీ కప్పులో ఉంటుంది.
ప్రశ్న 3.
మోకాలు ఎక్కడ ఉంటుంది?
జవాబు:
మోకాలు ముందు ఉంటుంది.
ప్రశ్న 4.
ఆకాశము ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఆకాశము పైన ఉంటుంది.
2. భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు
ధనము నాది యన్న ధనము నవ్వు
కదన భీతు జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
భూమి ఎందుకు నవ్వుతుంది?
జవాబు:
భూమి నాది అంటే భూమి నవ్వింది.
ప్రశ్న 2.
ధనము ఎందుకు నవ్వింది?
జవాబు:
ధనము నాది అంటే నవ్వింది.
ప్రశ్న 3.
కాలుడు ఎందుకు నవ్వాడు?
జవాబు:
కాలుడు యుద్ధభయము ఉన్నవాడిని చూసి నవ్వాడు.
ప్రశ్న 4.
పై పద్యం ఏ శతకములోనిది?
జవాబు:
పై పద్యం వేమన శతకంలోనిది.
3. తిరుగకు దుర్మార్గులతో
నరుగకు గహనాంతరస్థలాదులు కొంటాన్
జరుగకు శత్రుల మోల
న్మరువకు మేల్ హితుల యెడల మదిని కుమారా!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఎవరితో తిరుగకూడదు?
జవాబు:
దుర్మార్గులతో తిరుగకూడదు.
ప్రశ్న 2.
ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు?
జవాబు:
అడవిలోకి ఒంటరిగా వెళ్ళకూడదు.
ప్రశ్న 3.
ఎవరి దగ్గరకు వెళ్ళకూడదు?
జవాబు:
శత్రువుల దగ్గరకు వెళ్ళకూడదు.
ప్రశ్న 4.
ఎవరిని మరువకూడదు?
జవాబు:
ఉపకారం చేసిన మిత్రులను మరువకూడదు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
తన భార్య గురించి మగపావురం ఏమనుకొన్నది?
జవాబు:
గాలి వానలో తన భార్య మేతకు వెళ్లి ఏమయిపోయిందో అని కంగారు పడింది. ఎప్పుడూ తనను విడిచి ఇంతసేపు ఎక్కడికీ వెళ్లదే అని అనేక విధాల ఆలోచించింది. భార్య లేకుంటే తన దేహసంద వృద్ధా అని బాధపడింది. అధిక ప్రేమతో కూడిన’ భార్య మంచి గుణాల వలననే భర్తకు ఈ లోక పరలోక సుఖాలుంటాయని అనుకొన్నది. తన భార్య మరణించిందేమో అని బాధపడింది, భార్య లేక తన ఇల్లు పాడై పోతోందని బాధపడింది.
ప్రశ్న 2.
ఆడపావురం ఎక్కడున్నది? ఎందుకానందించింది?
జవాబు:
ఆడపావురం వేటగాని వలలో ఉన్నది. భర్త మాటలు విని చాలా ఆనందించింది. తన జన్మ ధన్యమైందని భావించింది. తన భర్త మనసులో తను సంపాదించిన స్థానానికి చాలా ఆనందించింది. తను యముని కూడా గెలిచినట్లు భావించింది.
ప్రశ్న 3.
ఆడపావురం తన భర్తతో ఏమన్నది?
జవాబు:
శరణుకోరిన వారిని రక్షించడం ఉత్తమ ధర్మమని పండితులు చెబుతారన్నది. సాదరంగా రక్షించాలన్నది. వేటగాడు చాలా బాధలో ఉన్నాడు. శరణాగతుడు అతనిని కష్టాలనుండి కాపాడమన్నది. చలికి కొంకర పోతున్నాడని తన భర్తకు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పింది.
ఆ) క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఆతిథ్యం పాఠం ఆధారంగా మగ పావురం మనస్తత్వం విశ్లేషించండి.
జవాబు:
మగ పావురానికి తన భార్యంటే చాలా ఇష్టం, తన భార్య గాలివానలో బయటకు వెళ్లింది. రాకపోతే చాలా భాదపడింది, అది మరణించిందేమోనని ఆందోళన పడింది.
వేటగాని వలలో ఉన్న పావురమే తన భార్య అని తెలిసిన తర్వాత ఆమె మాటను వేదవాక్కుగా భావించింది. శోకం విడిచింది. ఆ క్రూరుడైన వేటగానిని తమ అతిథిగా భావించింది. పుల్లల మంట వేసి అతని చలి పోగొట్టింది. అతనికి వెచ్చదనాన్ని చేకూర్చింది. అతను ఆహారం కావాలన్నాడు. అతని ఆకలి నివారించడానికి ఆహారంగా ఏమివ్వాలో తెలియలేదు. తన శరీరాన్ని ఆహారంగా ఇవ్వాలనుకొంది. మంటలలో పడిపోయింది. దీనికంతటికీ కారణం తన భార్య ఉపదేశము.
ప్రశ్న 2.
పావురం జంటపై మీ అభిప్రాయం వ్రాయండి.
జవాబు:
పావురాల జంట ఆదర్శదంపతులు. భార్యాభర్తలిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఆడపావురం గాలివానలో మేతకు వెళ్లి రాకపోతే మగపావురం చాలా కంగారుపడింది. భయపడింది, బాధపడింది. తన భార్య రాక ఆలస్యం కావడానికి రకరకాల కారణాలు ఊహించింది. మరణించిందేమోనని ఆందోళన పడింది. తన దగ్గరలోనే ఉన్న వేటగాని వలలోనే తన భార్య ఉందని తెలిసింది. భార్య భర్తను ఓదార్చింది. వేటగాడు మన “అతిథి అని చెప్పింది. అతనికి భార్యమాట వేదవాక్కు, వేటగానిని అతని కష్టం గురించి, అడిగింది. చలిమంట వేసి చలిని నివారించింది. ఆకలిగా ఉంది అంటాడు. ఆకలిని నివారించడానికి తను మంటలలో పడింది. తన శరీరాన్ని ఆహారంగా సమర్పించుకొంది.
ఆ పావురాల జంట తమ ప్రవర్తనతో తమ శత్రువు క్రూరుడు అయిన వేటగాని మనసును మార్చాయి. జీవితంలో వేటాడనని ప్రతిజ్ఞ చేయించింది. పావురాలకు ఉన్న ఆతిథ్యగుణం, ఆదరణ, త్యాగం, దయ ఇవన్నీ మనం నేర్చుకోవలసిన మంచి లక్షణాలు.
ప్రశ్న 3.
పక్షులను, జంతువులను కాపాడమని కోరుతూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:
రక్షించండి సోదరులారా! సోదరీమణులారా! నెల్లూరు ఇట్లు, |
భాషాంశాలు
బహుళైచ్ఛిక ప్రశ్నలు
పదజాలం
అర్థాలు : గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
1. ఖగములను రక్షించాలి. (సి)
ఎ) జంతువు
బి) పులి
సి) పక్షి
డి) పిచ్చుక
జవాబు:
సి) పక్షి
2. అనలముతో చెలగాటం ప్రమాదం. (ఎ)
ఎ) అగ్ని
బి) గాలి
సి) నీరు
డి) సముద్రం
జవాబు:
ఎ) అగ్ని
3. ప్రమాదం జరిగితే పదంపడి వైద్యుని వద్దకు వెళ్లాలి. (బి)
ఎ) అంబులెన్స్
బి)వెంటనే
సి) ఫోన్ చేసి
డి) చెప్పి
జవాబు:
బి)వెంటనే
4. అనఘుడు తప్పు చేయడు. (డి)
ఎ) పాపాత్ముడు
బి) తెలివైనవాడు
సి) జిత్తులమారి
డి) పాపరహితుడు
జవాబు:
డి) పాపరహితుడు
5. ప్రతిరోజు మేను శుభ్రం చేసుకోవాలి. (ఎ)
ఎ) శరీరం
బి) ముఖం
సి) తల
డి) కాళ్లు
జవాబు:
ఎ) శరీరం
6. పొగడ్తకు అలరుట మంచిదికాదు. (సి)
ఎ) బాధపడుట
బి) ఏడ్చుట
సి) సంతోషించుట
డి) నవ్వుట
జవాబు:
సి) సంతోషించుట
7. గువ్వను చూసి ఆనందించాలి. (బి)
ఎ) జంతువు
బి) పక్షి
సి) నెమలి
డి) చిలుక
జవాబు:
బి) పక్షి
8. ఈ రోజు సూర్యుని తళుకు ఎక్కువగా ఉంది. (ఎ)
ఎ) ప్రకాశం
బి) వేడి
సి) కిరణం
డి) ఎండ
జవాబు:
ఎ) ప్రకాశం
9. మన నెమ్మి మన ఆరోగ్యం. (డి)
ఎ) వ్యాయామం
బి) తిండి
సి) శుభ్రత
డి) సంతోషం
జవాబు:
డి) సంతోషం
10. నియతిని అతిక్రమించకూడదు. (సి)
ఎ) ఆజ్ఞ
బి) చదువు
సి) నియమం
డి) సమయం
జవాబు:
సి) నియమం
11. పరీక్షలకు తడయక వెళ్లాలి. (బి)
ఎ) మరువక
బి) ఆలస్యం చేయక
సి) వదలక
డి) విడువక
జవాబు:
బి) ఆలస్యం చేయక
12. అనవసరంగా నింద వేయకూడదు. (ఎ)
ఎ) దూషణ
బి) పొగడ్త
సి) దూత
డి) దొంగ
జవాబు:
ఎ) దూషణ
13. ఎవరి మెయి వారిది. (డి)
ఎ) ద్వేషం
బి) పగ
సి) చిరాకు
డి) విధము
జవాబు:
డి) విధము
14. ఎవ్వరికీ కీడు తలపెట్టకూడదు. (ఎ)
ఎ) ఆపద
బి) ధనం
సి) రోగం
డి) ఇల్లు
జవాబు:
ఎ) ఆపద
15. ఘోరం చూస్తే భయం వేస్తుంది. (బి)
ఎ) యుద్ధం
బి) భయంకరమైనది
సి) సముద్రం
డి) సినిమా
జవాబు:
బి) భయంకరమైనది
పర్యాయపదాలు : గీత గీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించండి.
16. మంచివాని భంగి నటించకు. (ఎ)
ఎ) విధము, పద్ధతి
బి) కొఱకు, కై
సి) వలన, కంటె
డి) చేత, తోడ
జవాబు:
ఎ) విధము, పద్ధతి
17. వర్ష ప్రతున్నములు పల్లెటూళ్ళు. (సి)
ఎ) వరద, జల్ల
బి) ప్రవాహం, నీరు
సి) బాధ పెట్టబడినవి, పీడింపబడినవి.
డి) తడిసినవి, నానినవి
జవాబు:
సి) బాధ పెట్టబడినవి, పీడింపబడినవి.
18. చదవకుండా పరీక్ష వ్రాయడం నిరర్థకం. (డి)
ఎ) లాభం, ఉపయోగం
బి) అశాశ్వతం, క్షణికం
సి) స్థిరం, సుస్థిరం
డి) వృథా, నిష్ప్రయోజనం
జవాబు:
డి) వృథా, నిష్ప్రయోజనం
19. శీతాకాలం ప్రొద్దు ఎండలో వేడి ఉండదు. (బి)
ఎ) సాయంత్రం, రాత్రి
బి) సమయం, కాలం
సి) ఉష్ణం, కవోష్ణం
డి) మధ్యాహ్నం, మిట్టమధ్యాహ్నం
జవాబు:
బి) సమయం, కాలం
20. మన తప్సితము మంచిదైతే తీరుతుంది. (సి)
ఎ) యత్నం, ప్రయత్నం
బి) ఆలోచన, యోచన
సి) కోరిక, కాంక్ష
డి) జవాబు, ఉత్తరము
జవాబు:
సి) కోరిక, కాంక్ష
21. మన అలాపము బాగుంటే మెచ్చుకొంటారు. (ఎ)
ఎ) మాట, పలుకు
బి) పుస్తకం వ్రాత
సి) చదువు, విద్య
డి) ధర్మం, న్యాయము
జవాబు:
ఎ) మాట, పలుకు
22. పుల్లలు లేనిదే పొయ్యపై వంట ఎలా? (బి)
ఎ) దుంగలు, కర్రలు
బి) చిదుకులు, పుడకలు
సి) చెట్లు, తరువులు
డి) కలప, మ్రాను
జవాబు:
బి) చిదుకులు, పుడకలు
23. జ్ఞానము ప్రోవు పెట్టుకోవాలి. (డి)
ఎ) చాలా, ఎక్కు
బి) మక్కువ, ఇష్టం
సి) కొండ, గుట్ట
డి) ప్రోగు, గుట్ట
జవాబు:
డి) ప్రోగు, గుట్ట
24. పర్వత శిఖపై గుడి వుంది. (ఎ)
ఎ) తుద, కొన
బి) మొదలు, ప్రారంభం
సి) మధ్య, నడుమ
డి) మీద, క్రింద
జవాబు:
ఎ) తుద, కొన
25. అందరికి ఒంటిగంటకు ఆకలి వేస్తుంది. (బి)
ఎ) బాధ, ఆర్తి
బి) క్షుత్తు, అంగద
సి) చెమట, శ్వేదము
డి) బాధ, దుఃఖం
జవాబు:
బి) క్షుత్తు, అంగద
26. అన్నిటికీ విస్మయము చెందకు. (సి)
ఎ) ఆనందం, హర్షం
బి) బాధ, ఏడుపు
సి) ఆశ్చర్యము, చోద్యము
డి) నింద, తిట్లు
జవాబు:
సి) ఆశ్చర్యము, చోద్యము
27. అన్ని జీవులపట్ల దయ కలిగి ఉండాలి. (ఎ)
ఎ) జాలి, కృప
బి) ప్రేమ, అనురాగము
సి) బాధ్యత, హక్కు
డి) ఆదరణము, సాదరము
జవాబు:
ఎ) జాలి, కృప
28. మన తలంపు మంచిదైతే తీరుతుంది. (డి)
ఎ) పుణ్యం, ధర్మం
బి) ప్రయాణం, పయనం
సి) కోరిక, కాంక్ష
డి) ఆలోచన, యోచన
జవాబు:
డి) ఆలోచన, యోచన
29. గురువును గౌరవించాలి. (ఎ)
ఎ) ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు
బి) స్నేహితుడు
సి)మంత్రి, అమాత్యుడు
డి) బృహస్పతి, ఉపాధ్యాయుడు.
జవాబు:
ఎ) ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు
30. గురువుగారి పొంత ఉంటే జ్ఞానం పెరుగుతుంది. (బి)
ఎ) దూరము, దవ్వు
బి) సమీపము, దగ్గర
సి) వింత, విదూరము
డి) చేత, వలన
జవాబు:
బి) సమీపము, దగ్గర
నానార్థాలు : గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
31. మబ్బును చూస్తే నెమ్మికి నెమ్మి కలుగుతుంది. (ఎ)
ఎ) నెమలి, సంతోషం
బి) నెమలి, మయూరము
సి) సంతోషం, ఆనందం
డి) హంస, అంచ
జవాబు:
ఎ) నెమలి, సంతోషం
32. సాధారణంగా శరణు కోరకూడదు. (బి)
ఎ) రక్షణ, అభయము
బి) నమస్కారము, రక్షణ
సి) నమస్కారము, నతి
డి) రక్షణ, శిక్షణ
జవాబు:
బి) నమస్కారము, రక్షణ
33. దేనికైనా ఉపాయముతో సాధించాలి. (సి)
ఎ) అపాయము, సదుపాయము
బి) ఆలోచన, యోచన
సి) ఎత్తుగడ, యుక్తి
డి) యుక్తి, ముక్తి
జవాబు:
సి) ఎత్తుగడ, యుక్తి
34. అనలమును భక్తిగా చూడాలి. (ఎ)
ఎ) అగ్ని, పరమాత్మ
బి) అగ్ని, వహ్ని
సి) పరమాత్మ, ఆత్మ
డి) దేవుడు, దైవము
జవాబు:
ఎ) అగ్ని, పరమాత్మ
35. రయము వలన ప్రమాదాలు జరుగుతాయి. (బి)
ఎ) వేగము, వడి
బి) వేగము, ప్రవాహము
సి) ఉత్తర్వు, అడ్డ
డి) ఝరి, ప్రవాహం
జవాబు:
బి) వేగము, ప్రవాహము
36. తలపు మంచిదైతే తల మంచిది. (బి)
ఎ) తల, శిరస్సు
బి) తల, మొదలు
సి) మొదలు, ప్రారంభము
డి) మధ్య, నడుమ
జవాబు:
బి) తల, మొదలు
37. అర్థము మంచిది కావాలి శబ్దార్ధము. (ఎ)
ఎ) ధనము, భావము
బి) ధనము, డబ్బు
సి) భావం, జాలం
డి) జాలము, నీలము
జవాబు:
ఎ) ధనము, భావము
38. అనఘుడు నమస్కరింపతగినవాడు. (సి)
ఎ) అఘుడు, షాపి
బి) పాపి, దురితుడు
సి) పాపరహితుడు, విష్ణువు
డి) హరి, విష్ణువు
జవాబు:
సి) పాపరహితుడు, విష్ణువు
39. తళుకును పక్షులు చూడడం కష్టం. (డి)
ఎ) గ్రద్ద, డేగ
బి) ప్రకాశం, వెలుగు
సి) వెలుగు, వేడి
డి) ప్రకాశము, ఒక జాతి వేగ
జవాబు:
డి) ప్రకాశము, ఒక జాతి వేగ
40. మంచి ఆహారము తినాలి. (ఎ)
ఎ) భోజనము, అపహరణము
బి) తిండి, భోజనము
సి) ఆకలి, తిండి
డి) అపహరణము, తస్కరము
జవాబు:
ఎ) భోజనము, అపహరణము
41. నియతిని పాటించాలి. (బి)
ఎ) నియమము, అజ్ఞ
బి) నియమము, దుర్గాదేవి
సి) దుర్గాదేవి, పార్వతి
డి) ఆజ్ఞ, ఉత్తర్వు
జవాబు:
బి) నియమము, దుర్గాదేవి
42. అంగములు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. (సి)
ఎ) అవయవము, అంగకము
బి) శరీరము, కాయము
సి) అవయవము శరీరము
డి) కాయ, కాయజము
జవాబు:
సి) అవయవము శరీరము
43. బుధుడు గౌరవనీయుడు. (ఎ)
ఎ) పండితుడు, ఒక గ్రహము
బి) గ్రహము, గాము
సి) పండితుడు, విద్వాంసుడు
డి) హరి, హరుడు
జవాబు:
ఎ) పండితుడు, ఒక గ్రహము
44. ఉల్లము మంచిది కావాలి. (సి)
ఎ) మనసు, మనము
బి) హృదయము, ఎద
సి) మనసు, హృదయము
డి) గుండె, ఎండ్రి
జవాబు:
సి) మనసు, హృదయము
45. జాతినిబట్టి గౌరవం రాదు. (ఎ)
ఎ) కులము, శ్రేష్టము
బి) మేలు, మేలిమి
సి) కులము, కొలము
డి) శ్రేష్ఠము, విశిష్టత
జవాబు:
ఎ) కులము, శ్రేష్టము
ప్రకృతి – వికృతులు : గీత గీసిన పదానికి వికృతికి ప్రకృతిని, ప్రకృతికి వికృతి పదాలను గుర్తించండి.
46. పక్కిని వేటాడకూడదు. (సి)
ఎ) పక్షము
బి) వక్షము
సి) పక్షి
డి) వృక్షము
జవాబు:
సి) పక్షి
47. ప్రొద్దును వృథా చేయకూడదు. (ఎ)
ఎ) బ్రధ్న
బి) సూర్యుడు
సి) కాలము
డి) సమయము
జవాబు:
ఎ) బ్రధ్న
48. పనికి సాధనము అవసరము. (డి)
ఎ) సాధకుడు
బి) సాధ్యము
సి) సాధికారము
డి) సాధనము
జవాబు:
డి) సాధనము
49. యముడు ధర్మం తప్పడు. (బి)
ఎ) యమి
బి) జముడు
సి) జమున
డి) జమ్ము
జవాబు:
బి) జముడు
50. స్పష్టమైన భాష మాట్లాడాలి. (డి)
ఎ) భాషణము
బి) భాషితము
సి) భాషా
డి) బాస
జవాబు:
డి) బాస
51. మంచి ఎద కలిగి ఉండాలి. (బి)
ఎ) డెందము
బి) హృదయము
సి) గుండె
డి) ఎదురు
జవాబు:
బి) హృదయము
52. ఆహారము శుచిగా, రుచిగా ఉండాలి. (FA-3:2022-23) (SA-2:2022-23) (ఎ)
ఎ) ఓగిరము
బి) అన్నము
సి) తిండి
డి) భోజనము
జవాబు:
ఎ) ఓగిరము
53. మన చేతలు మంచివి కావాలి. (సి)
ఎ) రేట
బి) చైతన్యం
సి) చేష్ట
డి) చేటు
జవాబు:
సి) చేష్ట
54. కొన్ని ఘోరములు మరచిపోలేము. (బి)
ఎ) గీర
బి) గోరము
సి) గోరాలు
డి) ఘృతము
జవాబు:
బి) గోరము
55. మన పుణ్యము మనను కాపాడుతుంది.
ఎ) పున్నెము
బి) పుణెము
సి) పుణ్ణియమ
డి) మనోమి
జవాబు:
ఎ) పున్నెము
56. ఒక అమ్మాయి తెలివి చూసి నాకు విసుమానము కల్గింది. (డి)
ఎ) విశేషము
బి) విశ్వాసము
సి) విసుమము
డి) విస్మయము
జవాబు:
డి) విస్మయము
57. ధర్మము విడువకూడదు. (బి)
ఎ) దరమము
బి) దమ్మము
సి) శౌర్యము
డి) దమనము
జవాబు:
బి) దమ్మము
58. మంచి గుణములు కల్గి ఉండాలి. (సి)
ఎ) గుణ్యము
బి) కోణము
సి) గొనము
డి) గోణము
జవాబు:
సి) గొనము
59. సుఖముగా జీవించాలి. (ఎ)
ఎ) సుగము
బి) సౌఖ్యము
సి) స్వగత
డి) స్వయము
జవాబు:
ఎ) సుగము
60. సంతసమును విడవకూడదు. (బి)
ఎ) తోషము
బి) సంతోషము
సి) త్రాసము
డి) త్రాసు
జవాబు:
బి) సంతోషము
వ్యుత్పత్త్యర్థాలు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
61. పక్షములు కలది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (సి)
ఎ) పక్షము
బి) పక్కి
సి) పక్షి
డి) పక్షము
జవాబు:
సి) పక్షి
62. లుబ్ధకుడు పక్షులకు విరోధి – వ్యుత్పత్యర్ధ్యం గుర్తించండి. (ఎ)
ఎ) మృగములయందశ గలవాడు
బి) ఆశాజీవి
సి) మాంసము తిననివాడు
డి) అడవిలో తిరుగువాడు
జవాబు:
ఎ) మృగములయందశ గలవాడు
63. విశేషముగా నవ్వించునది – వ్యుత్పత్తిపదం గుర్తించండి. (బి)
ఎ) ఆశ్చర్యము
బి) విస్మయము
సి) అక్కజము
డి) అచ్చెరువు
జవాబు:
బి) విస్మయము
64. ఆకాశంలో పోవునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) పక్షి
బి) పులుగు
సి) పిట్ట
డి) ఖగము
జవాబు:
డి) ఖగము
65. దేహమును కాపాడుకోవాలి గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి.
ఎ) అన్నపానాదులచేత వృద్ధి పొందింపబడునది
బి) బరువైనది
సి) వాసనవేయునది
డి) దేహి అనునది
జవాబు:
ఎ) అన్నపానాదులచేత వృద్ధి పొందింపబడునది
66. ఊర్ధ్వముగా గాని, కుటిలముగా గాని జ్వలించునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) మంట
బి) వహ్ని
సి) అగ్గి
డి) అగ్ని
జవాబు:
డి) అగ్ని
67. విహంగములలో చిలుక అందమైనది. (ఎ)
ఎ) ఆకాశంలో పోవునది
బి) ఎగిరి వెళ్ళేది.
సి) గ్రుడ్లు పెట్టునది.
డి) ఈకలు కలది
జవాబు:
ఎ) ఆకాశంలో పోవునది
68. దర్శన మాత్రము చేత పాపములను పోగొట్టునది. (బి)
ఎ) స్త్రీ
బి) సతి
సి) పత్ని
డి) దేవత
జవాబు:
బి) సతి
69. ఘోరముగా ప్రవర్తిస్తారు కొందరు. (సి)
ఎ) ఘోరం
బి) భయం
సి) వెరపు కలిగించేది
డి) అసహ్యం కలిగించేది
జవాబు:
సి) వెరపు కలిగించేది
70. అన్నిటిని ఎరిగినవాడు – మ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) బుధుడు
బి) ఉపాధ్యాయుడు
సి) గురువు
డి) గౌరవం
జవాబు:
ఎ) బుధుడు
71. పతి సతికి ప్రాణం. (సి)
ఎ) భర్త
బి) పోషించువాడు
సి) రక్షించువాడు
డి) ప్రియమైనవాడు
జవాబు:
సి) రక్షించువాడు
72. దీనియందు నిద్రింతురు, సుఖింతురు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) ఇల్లు
బి) మందిరము
సి) మంచములు
డి) గది
జవాబు:
బి) మందిరము
73. వేగముచేత వాయువు కొదమవలె ఉండునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) పక్షి
బి) గువ్వ
సి) పావురము
డి) కపోతము
జవాబు:
డి) కపోతము
74. మంచి పుస్తకం చదివిన తర్వాత శయనము మంచిది. (ఎ)
ఎ) నిద్రించుట
బి) నిద్ర
సి) మంచము
డి) స్వప్నము
జవాబు:
ఎ) నిద్రించుట
75. విశ్వమును ధరించునది – వ్యుత్పత్తిపదం గుర్తించండి. (సి)
ఎ) న్యాయము
బి) పుణ్యము
సి) ధర్మము
డి) ప్రపంచము
జవాబు:
సి) ధర్మము
వ్యాకరణాంశాలు
సంధులు: గీత గీసిన పదం ఏ సంధి గుర్తించండి.
76. కవి పలికిన అప్పలుకులు అమృతంలా ఉంటాయి – గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (బి)
ఎ) లు, ల, నల సంధి
బి) త్రిక సంధి
సి) గుణసంధి
డి) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
బి) త్రిక సంధి
77. ప్రాపించి యుండునది – సంధి విడదీసిన రూపం గుర్తించండి. (ఎ)
ఎ) ప్రాపించి + ఉండునది
బి) ప్రాపించి + యుండునది
సి) ప్రాపించియున్ + డునది
డి) ప్రాపించి యుండు + నది
జవాబు:
ఎ) ప్రాపించి + ఉండునది
78. క్రింది వానిలో ఉత్వసంధి పదం గుర్తించండి. (ఎ)
ఎ) కృత్యంబయ్యె
బి) పుస్తకాలు
సి) దేవాలయం
డి) మహోన్నతం
జవాబు:
ఎ) కృత్యంబయ్యె
79. వినఁగాంచి సంధిపేరు గుర్తించండి. (సి)
ఎ) గసడదవాదేశ సంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) సరళాదేశ సంధి
డి) అత్వ సంధి
జవాబు:
సి) సరళాదేశ సంధి
80. ఆకలికేమి తింటావు? – గీతగీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (బి)
ఎ) అత్వ సంధి
బి) ఇత్వ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) గుణసంధి
జవాబు:
బి) ఇత్వ సంధి
81. అతివగదా గౌరవింపతగినది – సంధి విడదీసిన రూపం గుర్తించండి. (డి)
ఎ) అతివన్ + కదా
బి) అతివ + గదా
సి) అతివ + కాద
డి) అతి + కదా
జవాబు:
డి) అతి + కదా
82. ప్రియాలాపములు మధురంగా ఉంటాయి – గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (ఎ)
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) అత్వ సంధి
సి) ఉత్వ సంధి
డి) లు,ల, నల సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి
83. అధికానురాగము – సంధి విడదీసిన రూపం గుర్తించండి. (సి)
ఎ) అధి + కానురాగము
బి) అధికా + అనురాగము
సి) అధిక + అనురాగము
డి) అధికాను + రాగము
జవాబు:
సి) అధిక + అనురాగము
84. విహగము గరుణన్ వేటగానిని కాపాడింది – గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (బి)
ఎ) సరళాదేశ సంధి
బి) గసడదవాదేశ సంధి
సి) ద్రుత ప్రకృతిక సంధి
డి) ఉత్వ సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి
85. క్రిందివానిలో త్రిక సంధికి ఉదాహరణ గుర్తించండి. (డి)
ఎ) ఆమేను
బి) పక్షీంద్రుడు
సి) రాజేంద్రుడు
డి) ఇమ్మేను
జవాబు:
డి) ఇమ్మేను
86. యుక్తయగు ఆలోచన చేయాలి – గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (ఎ)
ఎ) యడాగమ సంధి
బి) యణాదేశ సంధి
సి) అత్వ సంధి
డి) ఇత్వ సంధి
జవాబు:
ఎ) యడాగమ సంధి
87. క్రింది వానిలో సరళాదేశ సంధి పదం గుర్తించండి. (సి)
ఎ) ఉజ్వలాంగి
బి) మగ్నంబుగాగ
సి) సీతునఁగొంకు
డి) కాదు
జవాబు:
సి) సీతునఁగొంకు
88. క్రిందివానిలో ఉత్వ సంధి పదం గుర్తించండి. (బి)
ఎ) ఏయైన
బి) పుల్లలెల్ల
సి) పతికిందన
డి) ఊరూరు
జవాబు:
బి) పుల్లలెల్ల
89. క్రిందివానిలో యడాగమం గుర్తించండి. (సి)
ఎ) ఉన్నదొక
బి) ఏమేమి
సి) ఉన్నదియొక
డి) అత్యంత
జవాబు:
సి) ఉన్నదియొక
90. ఇడినన్ + కని – సంధి కలిపిన రూపం గుర్తించండి. (ఎ)
ఎ) ఇడినఁగని
బి) ఇడినగని
సి) ఇడినకని
డి) ఇడినకాని
జవాబు:
ఎ) ఇడినఁగని
సమాసాలు : గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
91. క్రిందివానిలో షష్ఠీ తత్పురుష సమాసపదం గుర్తించండి. (ఎ)
ఎ) బుధకోటి
బి) ఐహికాముష్మికములు
సి) ఆతిథ్యం
డి) అధికానురాగం
జవాబు:
ఎ) బుధకోటి
92. బలహీనులను ఆదుకొనుట అత్యధిక ధర్మము – సమాసం పేరు గుర్తించండి. (ఎ)
ఎ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
బి) విశేషణ ఉత్తరపదకర్మధారయ సమాసము
సి) ద్విగు సమాసము
డి) బహువ్రీహి సమాసము
జవాబు:
ఎ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
93. ఐహికాముష్మికములు – విగ్రహ వాక్యం గుర్తించండి. (సి)
ఎ) ఐహికమైన ఆముష్మికము
బి) ఆముష్మికమైన ఐహికము
సి) ఐహికమును, ఆముష్మికము
డి) ఐహికము యొక్క ఆముష్మికము
జవాబు:
సి) ఐహికమును, ఆముష్మికము
94. దయాగుణము కలిగి ఉండాలి – సమాసం పేరు గుర్తించండి. (డి)
ఎ) ప్రథమా తత్పురుష
బి) ద్వితీయ తత్పురుష
సి) చతుర్థీ తత్పురుష
డి) తృతీయా తత్పురుష
జవాబు:
డి) తృతీయా తత్పురుష
95. సుఖము కొఱకు సాధనములు – సమాస పదం గుర్తించండి. (బి)
ఎ) సాధన సుఖము
బి) సుఖసాధనములు
సి) సుఖములే సాధనములు
డి) సాధనా సుఖము
జవాబు:
బి) సుఖసాధనములు
96. గుడిలో అనఘాత్ముడు ఉంటాడు – విగ్రహవాక్యం గుర్తించండి. (సి)
ఎ) అనఘమును ఆత్మయును
బి) అనఘమైన ఆత్మ
సి) అనఘమైన ఆత్మ కలవాడు
డి) ఆత్మయొక్క అనఘము
జవాబు:
సి) అనఘమైన ఆత్మ కలవాడు
97. క్రింది వానిలో తృతీయా తత్పురుష సమాస పదం గుర్తించండి. (బి)
ఎ) సంతోషాధిక్యము
బి) సంతోష పూరము
సి) గంగానది
డి) బోయవల
జవాబు:
బి) సంతోష పూరము
98. సతి యొక్క గుణములు – సమాసపదం గుర్తించండి. (ఎ)
ఎ) సతి గుణములు
బి) గుణసతి
సి) సతిగుణి
డి) గుణిసతి
జవాబు:
ఎ) సతి గుణములు
99. పక్షి ధ్వంసకుడు ఆదరింపబడ్డాడు. – సమాసం పేరు గుర్తించండి. (డి)
ఎ) షష్ఠీ తత్పురుష
బి) సప్తమీ తత్పురుష
సి) తృతీయా తత్పురుష
డి) ద్వితీయా తత్పురుష
జవాబు:
డి) ద్వితీయా తత్పురుష
100. మహార్తుడు – సమాసం పేరు గుర్తించండి. (బి)
ఎ) విశేషణ పూర్వపద కర్మధారయం
బి) బహువ్రీహి సమాసం
సి) షష్ఠీ తత్పురుష
డి) ద్వితీయ తత్పురుష
జవాబు:
బి) బహువ్రీహి సమాసం
101. ఘోరమైన చేష్ట – సమాస పదం గుర్తించండి. (ఎ)
ఎ) ఘోరచేష్ట
బి) చేష్ట ఘోరము
సి) ఘోరమైనది
డి) చేష్టితం
జవాబు:
ఎ) ఘోరచేష్ట
102. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదం గుర్తించండి. (సి)
ఎ) పతిమది
బి) సతిగుణములు
సి) సద్బోధము
డి) అనఘాత్ముడు
జవాబు:
డి) అనఘాత్ముడు
103. ఉజ్జ్వలమైన అంగములు కలది – సమాస పదం గుర్తించండి. (డి)
ఎ) అంగముల ఉజ్జ్వలమ్లు
బి) ఉజ్జ్వలాంగుడు
సి) ఉజ్జ్వలము
డి) ఉజ్జ్వలాంగి
జవాబు:
డి) ఉజ్జ్వలాంగి
104. తన అంతరంగములు మంచిదని అనుకోవాలి – సమాసం పేరు గుర్తించండి. (సి)
ఎ) సప్తమీ తత్పురుష
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) షష్ఠీ తత్పురుష
డి) సంభావన పూర్వపద కర్మధారయం
జవాబు:
సి) షష్ఠీ తత్పురుష
105. అనురాగయుక్తకు ప్రపంచమే తన ఇల్లు – సమాసం పేరు గుర్తించండి. (ఎ)
ఎ) తృతీయ తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) చతుర్థీ తత్పురుష
డి) పంచమీ తత్పురుష
జవాబు:
ఎ) తృతీయ తత్పురుష
ఛందస్సు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
106. రామాజ్ఞ – గణం గుర్తించండి. (డి)
ఎ) మ గణం
బి) య గణం
సి) ర గణం
డి) త గణం
జవాబు:
డి) త గణం
107. క్రింది వానిలో జ గణం గుర్తించండి. (ఎ)
ఎ) మహార్తు
బి) మహాత్మా
సి) మాహాత్మ్యం
డి) కలము
జవాబు:
ఎ) మహార్తు
108. అది ప్రమాదము – గీత గీసిన పదం గణం గుర్తించండి. (బి)
ఎ) జ గణం
బి) న గణం
సి) ర గణం
డి) త గణం
జవాబు:
బి) న గణం
109. చక్రమ – గణం గుర్తించండి. (సి)
ఎ) మ గణం
బి) జ గణం
సి) భ గణం
డి) ర గణం
జవాబు:
బి) జ గణం
110. రాదుస్వప్నము – గణం గుర్తించండి. (ఎ)
ఎ) ర గణం
బి) య గణం
సి) భ గణం
డి) జ గణం
జవాబు:
ఎ) ర గణం
వాక్య రకాలు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
111. వర్షం వచ్చినా పంట పండలేదు – (వాక్య పూరకం గుర్తించండి) (బి)
ఎ) హేత్వర్థకం
బి) అప్యర్థకం
సి) సామర్ధ్యార్థకం
డి) సంశ్లిష్టం
జవాబు:
బి) అప్యర్థకం
112. వర్షం వచ్చింది కాని పంట పండలేదు. (సి)
ఎ) సంశ్లిష్టం
బి) సామర్థ్యార్థకం
సి) సంయుక్తం
డి) అనుమత్త్యర్థకం
జవాబు:
సి) సంయుక్తం
113. వర్షం వస్తుందా? (సి)
ఎ) అప్యర్థకం
బి) విధ్వర్థకం
సి) ప్రశ్నార్థకం
డి) ఆశీరార్థకం
జవాబు:
సి) ప్రశ్నార్థకం
114. వర్షం వస్తుందో? రాదో? (బి)
ఎ) ప్రశ్నార్థకం
బి) సందేహార్థకం
సి) అప్యర్థకం
డి) సంశ్లిష్టం
జవాబు:
బి) సందేహార్థకం
115. వర్షం వచ్చి, మొక్కలను బ్రతికించింది. (ఎ)
ఎ) సంశ్లిష్టం
బి) సంయుక్తం
సి) ఆశీరార్థకం
డి) అనుమత్యర్థకం
జవాబు:
ఎ) సంశ్లిష్టం