These AP 8th Class Telugu Important Questions 12th Lesson భువనవిజయం will help students prepare well for the exams.
భువనవిజయం AP Board 8th Class Telugu 12th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గద్యాలు – ప్రశ్నలు
క్రింది పరిచిత సంభాషణలు చదివి, ప్రశ్నలను తయారు చేయండి.
1. వ.మా. : రాజాధిరాజా! రాజమార్తాండ! సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయవారు విచ్చేయుచున్నారూ! (సాహిత్యసభలో ఉన్నవారంతా లేచి నిలబడి అభివాదం చేస్తుంటారు. రాయలవారు. ఏతెంచి, రాజ సింహాసనంపై ఆసీనులవుతారు)
రాయలు : అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పురప్రజలకు స్వాగతం. నా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభను రంజింపచేయండి. ఇక ఆంధ్రభాషామతల్లిని స్తుతిస్తూ సమస్యలను, దత్తపదులను పూరించి, ఆశుకవితా వినోదం సాగిద్దాం. (రాయల మాటలయ్యాక అందరు సుఖాసీనులవుతారు)
పెద్దన : చిత్తం రాజేంద్రా! కవిచంద్రా! మీతో నేటి భువనవిజయ సభను ప్రారంభించాలని నా అభిలాష.
సూరన: మీ ఆలోచన నిజమే పెద్దనామాత్యా! కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా, తెలుగుభాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? (అని అడిగి ఆసీనులయ్యారు.)
ప్రశ్నలు:
1. రాయల పాలనలో ఎవరు రసవంతమైన సమస్యలను పంపారు?
2. రాయల మాటలలో వచ్చిన అష్టావధానంలోని అంశాలు ఏవి?
3. రాయలను భువన విజయ సభను ప్రారంభించమని అడిగినదెవరు?
4. ‘తల్లి’ అంటే అర్థం ఏమిటి?
2. రాయలు: ముద్దుపలుకుల ముక్కుతిమ్మన కవి అందుకోండి. గాడిదయేడ్చెం గదన్న ఘనసంపన్నా! దీనిని పూరించండి. (సభలోని వారంతా ఘల్లున నవ్వుతారు)
తిమ్మన : రాజశేఖరా! అంటూ నమస్కరించి) ఇలా అన్నారు. మానవులలో ఆడిన మాటలు తప్పే వారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేం. ఐనా భారతీ కృపతో పూరించెద.
ధూర్జటి: లౌకిక జీవన గమనంలో గ్రామీనుల దూషణను, ఆడితప్పిన జనుల హీనస్వభావాన్ని మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడితప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినపుడు విశ్వాసానికి మారు పేరుగా నిల్చిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ భళా!.
ప్రశ్నలు:
1. ‘గాడిద యేడ్చెం గదన్న ఘనసంపన్నా!’ అను సమస్యను అడిగిందెవరు?
2. ఆడినమాటలు తప్పేవారెవరు?
3. ఈ సంభాషణలో విశ్వాసానికి మారుపేరుగా దేనిని చెప్పారు?
4. దృష్టాంతం’ అంటే ఏమిటి?
క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ప్రశ్నలను తయారు చేయండి.
3. భళా! శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన ధూర్జటీ! భువనవిజయ కవులను చూచిన జానపదులు. మన కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ, తాళానికి అనుకూలంగా, మిక్కిలి సంతోషంతో కూనిరాగాలను అల్లుకునే స్థితిని కళ్లకు కట్టితివి. పనిలో పాటతోపాటు పద్యాలనూ పాడుకునే వైఖరి అద్భుతం!
ప్రశ్నలు:
1. శ్రీ కాళహస్తీశ్వరుని వరప్రసాది ఎవరు?
2. జానపదులు అంటే ఎవరు?
3. ఈ పేరాలో సంగీతానికి సంబంధించిన పదాలు ఏమున్నాయి?
4. జానపదులు పనిలో పాటతో పాటు వేటిని పాడుకుంటారు?
క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ప్రశ్నలకు (✓, ✗) తప్పు ఒప్పులను గుర్తించండి.
4. మత్స్యావతారాన సోమకాసురుని చంపాడు. కూర్మమై మందరగిరిమోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహరూపంలో హిరణ్యాక్షుని చీరాదు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతంజేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధినిమార్చి శివునిచేత త్రిపురాసురుని చంపించాడు. కల్కిగా నీతిహీనులను కూల్చాడు.
ప్రశ్నలు:
1. మత్స్యావతారాన మందగిరి మోసాడు. (✗)
2. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. (✓)
3. పరశురాముడై రావణుని వధించాడు. (✗)
4. బుద్ధుడై శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. (✓)
అపరిచిత పద్యం, గద్యం – ప్రశ్నలు
1. క్రింది పద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
బలవంతుడు నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుటయేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!
ప్రశ్నలు:
ప్రశ్న 1.
తననెవ్వరూ ఏమీ చేయలేరని గర్వపడేవాడెవరు?
జవాబు:
తననెవ్వరూ ఏమీ చేయలేరని బలవంతుడు గర్వపడతాడు.
ప్రశ్న 2.
పాము వేటి చేతిలో చిక్కి మరణిస్తుంది?
జవాబు:
చలిచీమల చేతిలో చిక్కి పాము మరణిస్తుంది.
ప్రశ్న 3.
బలవంతుని ఎవరితో పోల్చారు?
జవాబు:
బలవంతుని పాముతో పోల్చారు.
ప్రశ్న 4.
పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
పై పద్యంలో విషం ఉన్నదేది?
2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
వ్యవహారిక భాషగా తెలుగు వికసించడానికి వెలుగుబాట వేసిన మహాకవి గురజాడ. సంఘసంస్కరణకు దారి చూపే రచనలు చేసిన ధీశాలి. ‘కన్యాశుల్కం’ నాటకం గురజాడ రచనలలో చాలా ప్రసిద్ధమయింది. ఆధునిక కథానికలకు గురజాడ మొదటివారు. ‘ముత్యాలసరం’ అన్న ఛందస్సులో అనేక గేయాలు రచించారు. ‘దేశభక్తి’, ‘పూర్ణమ్మ’, ‘లవణరాజు ‘కల’, ‘కన్యక’ మొదలైనవి ప్రముఖమైన వీరి గేయరచనలు. సామాన్య పాఠకులు సైతం నిఘంటువుల సహాయం లేకుండా చదువుకుని ఆనందించే సరళ రీతిలో వీరి శైలి ఉంటుంది.
ప్రశ్న 1.
‘కన్యాశుల్కం’ నాటకం రచించింది ఎవరు?
జవాబు:
గురజాడ
ప్రశ్న 2.
గురజాడ వారి గేయ రచనలు ఏవి?
జవాబు:
గురజాడ వారి గేయ రచనలు దేశభక్తి, పూర్ణమ్మ, లవణరాజు కల, కన్యక మొదలైనవి.
ప్రశ్న 3.
గురజాడ వెంకట అప్పారావు గారి రచనాశైలి ఎలా ఉంటుంది?
జవాబు:
నిఘంటువుల సహాయం లేకుండా ఆనందించే సరళరీతిలో ఉంటుంది.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఛందస్సు అంటే ఏమిటి?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
రాయలవారు తెలుగు భాష గురించి చెప్పిన పద్యం భావం వ్రాయండి.
జవాబు:
గీ„ తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స!
భావం : తెలుగు గొప్ప భాష. నాకు (రాయలుకు) తెలుగుపై మమకారం ఎక్కువ. ఎందుకంటే నేను పాలించే ప్రాంతం తెలుగు నేల. నేను తెలుగు రాజును. తెలుగు కండగల భాష. పాలకులందరూ తెలుగులో మాట్లాడుతూ కొలవడం తెలియదా! దేశభాషలలో తెలుగు గొప్ప భాష అని రాయలవారన్నారు.
ప్రశ్న 2.
పెద్దన కవి చెప్పిన పద్యం, భావం వ్రాయండి.
జవాబు:
అగ్రజానుజులై రనుజాగ్రజులుగ’ అనే సమస్యను పూరిస్తూ పెద్దన చెప్పిన పద్యం,
తే॥ | పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టిఁనాడు
మొనసి లక్ష్మణుఁ దాశ్లేష బుట్టినాడు.
భరత లక్ష్మణక్రమమిది యరసిచూడ
నగ్రజానుజులై రనుజాగ్రజులుగ
భావం : భరతుడు పుష్యమీ నక్షత్రంలో పుట్టాడు. లక్ష్మణుడు ఆశ్లేషా నక్షత్రంలో పుట్టాడు. భరత లక్ష్మణులు పుట్టిన క్రమం ఇది. ఆలోచిస్తే నిజానికి తర్వాత పుట్టిన లక్ష్మణుడు చిన్నవాడు. ముందు పుట్టిన భరతుడు పెద్దవాడు. కానీ లోకంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులంటారు. అందుచేత అన్న తమ్ముడు, తమ్ముడు అన్నయ్య అయ్యారు.
ప్రశ్న 3.
ఆడి తప్పినవానిని గాడిద కొడుకంటే గాడిద ఏడవడాన్ని మీరెలా సమర్థిస్తారు ?
జవాబు:
ఆడి తప్పడం అనేది చాలా తప్పు, అన్ని తప్పులకంటే ఎక్కువ తప్పుగా దానిని పరిగణిస్తారు. అన్ని జంతువులలో తెలివిలేని జంతువుగా గాడిదను భావిస్తారు. ఎందుకూ పనికిరాని వాళ్లను గాడిదతో పోలుస్తారు. అయినా గాడిద బాధపడదు. కాని ఆడితప్పిన వానిని తన కొడుకుగా చెబితే బాధపడింది. అంటే ఎందుకూ పనికిరాని వానికంటే ఆడితప్పిన వాడు తక్కువ వాడని దీని భావం. కాబట్టి ఆడి తప్పరాదని గ్రహించాలి.
ఆ) క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పింగళి సూరన కవితా నైపుణ్యాన్ని వివరించండి.
జవాబు:
పింగళి సూరనను శ్రీకృష్ణదేవరాయలవారు దశావతారాలను వర్ణించమని కోరారు. పింగళి సూరన ఒక సీసపద్యంలో దశావతారాలను చక్కగా ఇమిచ్చారు. శ్రీహరి సముద్రంలో మత్స్యావతారం దాల్చి సోమకాసురున్ని వధించాడు. పాలసముద్రం చిలికినప్పుడు మందర పర్వతం మునిగిపోకుండా కూర్మావతారం ఎత్తి తన వీపుపై మోసాడు. భూమిని చాపలా చుట్టే ప్రయత్నం చేసిన హిరణ్యాక్షుడుని వరాహావతారంతో మట్టుపెట్టాడు. ప్రహ్లాదుని తండ్రియైన హిరణ్యకశివుని నరసింహావతారంతో చీల్చి చంపాడు. వామనావతారంతో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కాడు. పరశురామావతారంతో క్షత్రియుల యొక్క గర్వాన్ని అణిచాడు. శ్రీరామావతారంతో రావణాసురుణ్ణి సంహరించాడు. కృష్ణావతారంతో అనేకమంది రాక్షసులను చంపాడు, బుద్ధావతారంతో త్రిపురాసుర సంహారానికి మూలకారకుడయ్యాడు. కల్కి అవతారంతో మ్లేచ్చులను అణిచాడు. అని పింగళి సూరన దశావతారాలను రసరమ్యంగా వర్ణించాడు.
ప్రశ్న 2.
ధూర్జటి అర్థరహితమైన సమస్యను అర్థవంతంగా ఎలా పూరించాడో వివరించండి.
జవాబు:
వనసన నాన నాననన నానన వాసన నాన నాననా అనే అర్థ రహితమైన సమస్యను శ్రీకృష్ణదేవరాయలవారు ధూర్జటికి ఇచ్చారు. సామాన్యమైన కవి అయితే దీనిని పూరించటం చాలా కష్టం కానీ గ్రామీణులతో వారు మాట్లాడే విధానంతో తన కావ్యంలో పరిచయం కలిగిన ధూర్జటికి అది పెద్ద సమస్యగా కనిపించలేదు. అందుకే మిమ్మల్నిందరినీ చూసి లయ తాళ సంగతుల గాన కళతో నిండిన మనసుతో ఆనందంగా పల్లెటూరివారు నననన నాన నాననన…. అంటూ కూని రాగాలు తీస్తున్నారని చక్కని భావంతో పద్యం రచించారు. ఆ పద్యం
చ॥ నిను నిను నిన్ను నిన్ను నిను నిన్నును నిన్ను నిన్నునుం
గని లయతాళ సంగతుల గానకళా పరిపూర్ణమానస
మ్మున, పలు కూనిరాగముల మోదమునల్లుచు పల్కు నిట్టులున్
నననన నాన నాన నన నానన నానన నాన నాననా!
ప్రశ్న 3.
తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఒక కరపత్రాన్ని రూపొందించండి.
జవాబు:
భాషాంశాలు
బహుళైచ్ఛిక ప్రశ్నలు
పదజాలం
అర్థాలు : గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
1. దేనికీ భీతి చెందకూడదు. (బి)
ఎ) ప్రీతి
బి) భయం
సి) నీతి
డి) రీతి
జవాబు:
బి) భయం
2. ఎప్పుడూ మోదముతో జీవించాలి. (ఎ)
ఎ) సంతోషం
బి) తెలివి
సి) బలము
డి) సంపద
జవాబు:
ఎ) సంతోషం
3. ధూర్జటి ని ప్రార్ధిస్తే కోరికలు తీరతాయి. (డి)
ఎ) విష్ణువు
బి) గణపతి
సి) హరి
డి) శివుడు
జవాబు:
డి) శివుడు
4. బుర్రకథ ఆంధ్రుల సొత్తు. (సి)
ఎ) కీర్తి
బి) జాతి
సి) సొమ్ము
డి) ప్రగతి
జవాబు:
సి) సొమ్ము
5. మూలము బలంగా ఉండాలి. (ఎ)
ఎ) మొదలు
బి) చివర
సి) ఇల్లు
డి) శరీరం
జవాబు:
ఎ) మొదలు
6. అజ్ఞానం నిర్మూలించడానికి సమరం చేయాలి. (బి)
ఎ) వ్యాపారం
బి) యుద్ధం
సి) చదవడం
డి) బడికి వెళ్లడం
జవాబు:
బి) యుద్ధం
7. కృషితో సర్వం సాధించవచ్చు. (డి)
ఎ) ధనం
బి) సంపద
సి) విద్య
డి) సమస్తం
జవాబు:
డి) సమస్తం
8. కిటి వలన మెదడువాపు వ్యాధి వచ్చును. (సి)
ఎ) కుక్క
బి) పిల్లి
సి) పంది
డి) దోమ
జవాబు:
సి) పంది
9. కూర్మము మెల్లగా నడుస్తుంది. (బి)
ఎ) నత్తగుల్ల
బి) తాబేలు
సి) ఏనుగు
డి) అడవి పంది
జవాబు:
బి) తాబేలు
10. రావణుడొక దనుజుడు. (ఎ)
ఎ) రాక్షసుడు
బి) బ్రాహ్మణుడు
సి) పాలకుడు
డి) దుష్టుడు
జవాబు:
ఎ) రాక్షసుడు
11. అరకులో ప్రకృతి మనోహరం గా ఉంటుంది. (బి)
ఎ) ఆనందం
బి) అందం
సి) ఉల్లాసం
డి) సంతోషం
జవాబు:
బి) అందం
12. తిరుపతి గిరి పవిత్రమైనది. (సి)
ఎ) పట్టణం
బి) నగరం
సి) కొండ
డి) క్షేత్రం
జవాబు:
సి) కొండ
13. ఎవరి అభిమతము వారిది. (డి)
ఎ) దైవం
బి) మతము
సి) కులం
డి) ఉద్దేశం
జవాబు:
డి) ఉద్దేశం
14. నేతలు ధర్మబద్ధులై ఉండాలి. (బి)
ఎ) పాలకులు
బి) నాయకులు
సి) రాజులు
డి) గురువులు
జవాబు:
బి) నాయకులు
15. కొందరు చాతుర్యంగా మాట్లాడతారు. (ఎ)
ఎ) చమత్కారం
బి) నమ్మకం
సి) మధురం
డి) తియ్యగా
జవాబు:
ఎ) చమత్కారం
పర్యాయపదాలు : గీత గీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించండి.
16. ప్రజాస్వామ్యంలో పాలన ప్రజలదే. (ఎ)
ఎ) పరిపాలన, ఏలుబడి
బి) రాచరికం, రాజ్యం
సి) ప్రభుత్వం, రాజ్యం
డి) రాజ్యం, దేశం
జవాబు:
ఎ) పరిపాలన, ఏలుబడి
17. అమాత్యుడు తన తెలివితో రాజ్యం కాపాడతాడు. (సి)
ఎ) రాజు, మంత్రి.
బి) మంత్రి, మంత్రం
సి) మంత్రి, ప్రెగ్గడ
డి) రాజు, రేడు
జవాబు:
సి) మంత్రి, ప్రెగ్గడ
18. రేరాజు చంద్రుడు. (బి)
ఎ) సూర్యుడు, రవి
బి) శశి, శశాంకుడు
సి) నక్షత్రం, చుక్క
డి) ఆకాశం, గగనం
జవాబు:
బి) శశి, శశాంకుడు
19. కావ్యంతో వీనులు తరిస్తాయి. (డి)
ఎ) మది, మతి
బి) మనసు, మనము
సి) జీవితం, బ్రతుకు
డి) చెవులు, కర్ణములు
జవాబు:
డి) చెవులు, కర్ణములు
20. చిలుక అందమైన పక్షి. (ఎ)
ఎ) కీరము, శుకము
బి) పికము, కోయిల
సి) కపోతము, కపోతి
డి) పక్షి, పులుగు
జవాబు:
ఎ) కీరము, శుకము
21. హస్తి ముఖం కలవాడు గణపతి. (బి)
ఎ) హస్తము, తొండము
బి) ఏనుగు, కరి
సి) మొసలి, మకరము
డి) వ్యాఘ్రము, పుండరీకము
జవాబు:
బి) ఏనుగు, కరి
22. మన రీతి బాగుండాలి. (సి)
ఎ) నీతి, జాతి
బి) భీతి, భయం
సి) విధము, పద్ధతి
డి) భాతి, నాతి
జవాబు:
సి) విధము, పద్ధతి
23. గాడిద బరువులు మోస్తుంది. (ఎ)
ఎ) గార్దభము, ఖరము
బి) ఖగము, నగము
సి) జంతువు, మృగము
డి) అశ్వము, తురగము
జవాబు:
ఎ) గార్దభము, ఖరము
24. తల్లిదండ్రులకు పేరు తెచ్చే సంతతి కావాలి.
ఎ) కుటుంబం, సంసారం
బి) ఇల్లు, గృహం
సి) స్నేహితులు, హితులు
డి) సంతానం, పిల్లలు
జవాబు:
డి) సంతానం, పిల్లలు
25. మంచిగా చదివితే అభినందన దక్కుతుంది. (ఎ)
ఎ) పొగడ్త, నుతి
బి) నతి, అంజలి
సి) ధనం, సంపద
డి) పదవి, ఉద్యోగం
జవాబు:
ఎ) పొగడ్త, నుతి
26. మంచి కీర్తి సంపాదించాలి. (బి)
ఎ) డబ్బు, సంపద
బి) యశము, ఖ్యాతి
సి) పదవి, హోదా
డి) ఇల్లు, మేడ
జవాబు:
బి) యశము, ఖ్యాతి
27. వినాయకుని వాహనం ఎలుక. (సి)
ఎ) చిట్టెలుక, కలుగు
బి) పిలక, కీరము
సి) మూషికము, ఖనకము
డి) బిడాలము, మార్జాలము
జవాబు:
సి) మూషికము, ఖనకము
28. వర్తకులు లాభం చూసుకొంటారు. (ఎ)
ఎ) వ్యాపారులు, వణిజులు
బి) వాణిజ్యం, వర్తకం
సి) ఎగుమతి, దిగుమతి
డి) బేరము, బీహారు
జవాబు:
ఎ) వ్యాపారులు, వణిజులు
29. కత్తి ప్రమాదకరము. (బి)
ఎ) సుత్తి, ఖడ్గం
బి) ఖడ్గము, కరవాలము
సి) వాలము, వాలు
డి) యుద్ధం, రణం
జవాబు:
బి) ఖడ్గము, కరవాలము
30. విష్ణువు ఉరమున పూలదండ ఉంటుంది. (ఎ)
ఎ) రొమ్ము, వక్షము
బి) పక్షము, వైపు
సి) పొట్ట, గుట్టు
డి) చేయి, హస్తము
జవాబు:
ఎ) రొమ్ము, వక్షము
నానార్థాలు : గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
31. చదువును ముక్కున పడితే ప్రయోజనం లేదు. (ఎ)
ఎ) నాసిక, తుద
బి) నాసిక, నాసము
సి) తుద, చివర
డి) నాస్యము, సస్యము
జవాబు:
ఎ) నాసిక, తుద
32. భారతి దయ ఉంటే ఏదైనా సాధ్యం. (సి)
ఎ) బ్రహ్మ, వాణి
బి) వాణి, వీణ
సి) సరస్వతి, వాక్కు
డి) లక్ష్మి, విష్ణువు
జవాబు:
సి) సరస్వతి, వాక్కు
33. అనవసరంగా దూషణ చేయకూడదు. (బి)
ఎ) తిట్టు, త్విట్టు
బి) తప్పు, నింద
సి) దోషం, దోసం
డి) తప్పు, తప్పు
జవాబు:
బి) తప్పు, నింద
34. పేరు అందంగా ఉండాలి. (డి)
ఎ) నామము, బొట్టు
బి) బొట్టు, చుక్క
సి) నామము, ‘నీమము
డి) నామము, దండ
జవాబు:
డి) నామము, దండ
35. చేసే పని ఘనము లా ఉండాలి. (ఎ)
ఎ) గొప్పది, మేఘము
బి) మేఘము, మబ్బు
సి) నల్లనిది. తెల్లనిది
డి) పయోధరము, వయో భారము
జవాబు:
ఎ) గొప్పది, మేఘము
36. హరితో వైరము తగదు. (ఎ)
ఎ) సింహము, విష్ణువు
బీ) సింహము, సింగము
సి) విష్ణువు, మురారి
డి) శివుడు, రుద్రుడు
జవాబు:
ఎ) సింహము, విష్ణువు
37. భండనము గట్టిగా ఉండాలి. (సి)
ఎ) రక్షణ, వలయం
బి) రాజు, బీముడు
సి) యుద్ధము, కవచము
డి) రాముడు, భీముడు.
జవాబు:
సి) యుద్ధము, కవచము
38. హనుమ తోక పవిత్రమైనది. (బి)
ఎ) గీతము, భుజము
బి) వాలము, లాంగూలము
సి) వాలము, కరవాలము
డి) కరవాలము, గద
జవాబు:
బి) వాలము, లాంగూలము
39. శరీరమును కూర్మము కాపాడును. (సి)
ఎ) తాబేలు, డెక్క
బి) తాబేలు, పీత
సి) తాబేలు, వాయువు
డి) గాలి, పవనము
జవాబు:
సి) తాబేలు, వాయువు
40. సృష్టిలో పూర్ణము అపూర్వము. (ఎ)
ఎ) సమస్తము, జలము
బి) జలము, నీరు
సి) సమస్తము, సర్వము
డి) ప్రపంచము, జగతి
జవాబు:
ఎ) సమస్తము, జలము
41. పొలము బాగుంటే మనం బాగుంటాం. (డి)
ఎ) నీరు, జలము
బి) అడవి, విపినము
సి) చేను, సస్యక్షేత్రము
డి) చేను, అడవి
జవాబు:
డి) చేను, అడవి
42. రాజు వలన లోకం ఆనందించును. (ఎ)
ఎ) చంద్రుడు, ప్రభువు
బి) చంద్రుడు, శశి
సి) ప్రభువు, పాలకుడు
డి) క్షత్రియుడు, క్షేత్రజ్ఞుడు
జవాబు:
ఎ) చంద్రుడు, ప్రభువు
43. కవి గౌరవింపదగినవాడు. (సి)
ఎ) రచయిత, రచయిత్రి
బి) కవిత, కైత
సి) కైతగాడు, శుక్రుడు
డి) శుక్రుడు, శని
జవాబు:
సి) కైతగాడు, శుక్రుడు
44. మనసొత్తు మనం కాపాడుకోవాలి. (బి)
ఎ) సొమ్ము, ధనం
బి) సొమ్ము, హక్కు
సి) హక్కు, బాధ్యత
డి) బాధ్యత, బరువు
జవాబు:
బి) సొమ్ము, హక్కు
45. శ్రీ కి నానార్థాలున్నాయి. (ఎ)
ఎ) లక్ష్మి, నలుపు
బి) నలుపు, నల్లన
సి) లక్ష్మి, లచ్చి
డి) పార్వతి, గిరిజ
జవాబు:
ఎ) లక్ష్మి, నలుపు
ప్రకృతి – వికృతులు : గీత గీసిన పదానికి వికృతికి ప్రకృతిని, ప్రకృతికి వికృతి పదాలను గుర్తించండి.
46. 8వ తరగతి తెలుగు పుస్తకం అద్భుతం గా ఉంది – వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) అబ్బురం
బి) అదుబుతం
సి) అబరం
డి) అమరం
జవాబు:
ఎ) అబ్బురం
47. పెద్దవారిని గౌరవించాలి – ప్రకృతిని గుర్తించండి. (సి)
ఎ) పేద
బి) పెద
సి) వృద్ధు
డి) వృద్ధి
జవాబు:
సి) వృద్ధు
48. దేవర వారిని పూజించాలి – ప్రకృతిని గుర్తించండి. (బి)
ఎ) దైవం
బి) దేవుడు
సి) దేవత
డి) యము
జవాబు:
బి) దేవుడు
49. రంధ్రము మూయనిదే నీరు పోవడం ఆగదు – వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) రందరము
బి) రంధి
సి) రంధం
డి) క్రంత
జవాబు:
ఎ) రందరము
50. అత్తి చాలా పెద్దది – ప్రకృతిని గుర్తించండి. (ఎ)
ఎ) హస్తి
బి) అత్తము
సి) అత్తనం
డి) అదనం
జవాబు:
ఎ) హస్తి
51. దైవం యొక్క మూర్తికి నమస్కరించు – వికృతిని గుర్తించండి. (సి)
ఎ) మూర్తము
బి) మూరుతము
సి) మూరితి
డి) ముహూర్తము
జవాబు:
సి) మూరితి
52. దమ్మము తప్పకూడదు – వికృతిని గుర్తించండి. (బి)
ఎ) దమము
బి) ధర్మము
సి) దమనము
డి) దరమము
జవాబు:
బి) ధర్మము
53. సంతోషముగా జీవించాలి – వికృతిని గుర్తించండి. (డి)
ఎ) సంతాపము
బి) తోషము
సి) తోసము
డి) సంతసము
జవాబు:
డి) సంతసము
54. మంచి కబ్బము చదవాలి – వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) కావ్యము
బి) కవనము
సి) కంపరము
డి) బాలము
జవాబు:
ఎ) కావ్యము
55. చక్కగా పంక్తిలో కూర్చొని భుజించాలి – వికృతిని గుర్తించండి. (సి)
ఎ) పకితి
బి) పక్కి
సి) బంతి
డి) వరుస
జవాబు:
సి) బంతి
56. దుష్టుడు స్నేహానికి పనికిరాదు – వికృతిని గుర్తించండి. (బి)
ఎ) దుష్ట
బి) తుంటరి
సి) తులువ
డి) దురితము
జవాబు:
బి) తుంటరి
57. గౌరవనీయులను ఆర్య అనాలి – వికృతిని గుర్తించండి. (డి)
ఎ) ఆర్యమం
బి) అజ్ఞలము
సి) అరే
డి) అయ్య
జవాబు:
డి) అయ్య
58. ఇతరులకు సహాయము చేయాలి – వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) సాయము
బి) సహాయ్యము
సి) సాయ్యము
డి) సహ్యము
జవాబు:
ఎ) సాయము
59. ఇతరుల సొత్తును ఆశించకూడదు – ప్రకృతిని గుర్తించండి. (బి)
ఎ) స్వమ్ము
బి) స్వత్వము
సి) స్వయము
డి) స్వంతము
జవాబు:
బి) స్వత్వము
60. మొదలు పెట్టిన కర్ణము పూర్తి చేయాలి – ప్రకృతిని గుర్తించండి. (సి)
ఎ) కరకజ్ఞము
బి) కార్జము
సి) కార్యము
డి) కరణము
జవాబు:
సి) కార్యము
వ్యుత్పత్త్యర్థాలు : గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
61. మా తెలుగు పండితుడు పద్యం బాగా చదువుతారు. (సి)
ఎ) పాఠం చెప్పేవారు
బి) కావ్యాలు చదివినవాడు
సి) జ్ఞానము కలవాడు
డి) వ్యాకరణం తెలిసినవాడు
జవాబు:
సి) జ్ఞానము కలవాడు
62. సమరము వలన చాలా నష్టాలు కలుగుతాయి. (ఎ)
ఎ) మరణముతో కూడినది
బి) మరణం లేనిది
సి) మరలతో కూడినది
డి) మర్మముతో కూడినది
జవాబు:
ఎ) మరణముతో కూడినది
63. సమస్త భూమికి ప్రభువు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) రాజు
బి) సామంతరాజు
సి) ప్రభువు
డి) సార్వభౌముడు
జవాబు:
డి) సార్వభౌముడు
64. విశేషమైన జయము గలది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) గెలుపు
బి) విజయము
సి) జయము
డి) గెలుచుట
జవాబు:
బి) విజయము
65. నశించిన బ్రహ్మాండమును బ్రతికించువాడు – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
ఎ) రవి
బి) సూర్యుడు
సి) ఆదిత్యుడు
డి) మార్తాండుడు
జవాబు:
డి) మార్తాండుడు
66. గజము చాలా విలువైనది. (ఎ)
ఎ) మదించునది
బి) ఎత్తైనది
సి) బలమైనది
డి) పెద్దది
జవాబు:
ఎ) మదించునది
67. నియతముగా అగునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) నిక్కము
బి) నిజము
సి) నృతము
డి) యధార్ధము
జవాబు:
బి) నిజము
68. శౌరి జగద్రక్షకుడు. (సి)
ఎ) శౌర్యం కలవాడు
బి) శూరత్వం కలవాడు
సి) శూరుని మనుమడు
డి) శ్రీకృష్ణుడు
జవాబు:
సి) శూరుని మనుమడు
69. కుత్సితమైన వేగము కలది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) తాబేలు
బి) కూర్మము
సి) కుందేలు
డి) కాకము
జవాబు:
బి) కూర్మము
70. తల్లిదండ్రులను సుతుడు పోషించాలి. (ఎ)
ఎ) ఐశ్వర్యమును పొందినవాడు
బి) సూతకం కలవాడు
సి) సతితో ఉండేవాడు.
డి) స్తోత్రం చేసేవాడు
జవాబు:
ఎ) ఐశ్వర్యమును పొందినవాడు
71. శ్రేష్టమైన సస్యమును చెరచునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) పశువు
బి) జంతువు
సి) మృగము
డి) వరాహము
జవాబు:
డి) వరాహము
72. కిటి మురికిలో దొర్లుతుంది. (సి)
ఎ) మురికిలో ఉండేది
బి) కంపుతో ఉండేది
సి) కోరికతో చలించేది
డి) పెద్ద ఆకారం కలది
జవాబు:
సి) కోరికతో చలించేది
73. గాయము వలన రక్షింపబడువాడు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) గాయకుడు
బి) క్షత్రియుడు
సి) గాయని
డి) గానము
జవాబు:
బి) క్షత్రియుడు
74. శర్కరతో చేసిన పిండివంటలు బాగుంటాయి. (డి)
ఎ) తియ్యనిది
బి) మధురమైనది
సి) రుచికరమైనది
డి) కరిగిపోవునది
జవాబు:
డి) కరిగిపోవునది
75. వాయువుచే మ్రోగునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) రంధ్రము
బి) మురళి
సి) చెట్టు
డి) వాద్యము
జవాబు:
ఎ) రంధ్రము
76. హరి లోకములను కాపాడును. (ఎ)
ఎ) పాపాలను హరించువాడు
సి) లక్ష్మీదేవి భర్త
బి) ఐశ్వర్యం ఇచ్చేవాడు
డి) రక్షించేవాడు
జవాబు:
ఎ) పాపాలను హరించువాడు
వ్యాకరణాంశాలు
సంధులు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
77. మీరంతా దేశభక్తి కలిగి ఉండాలి – సంధి పేరు (బి)
ఎ) అత్వ సంధి
బి) ఉత్వ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) గుణ సంధి
జవాబు:
బి) ఉత్వ సంధి
78. హిరణ్యాక్షుడు రాక్షసుడు – విడదీసి రాయండి. (ఎ)
ఎ) హిరణ్య + అక్షుడు
బి) హిరణ్యం + అక్షుడు
సి) హిరణ్యా + అక్షుడు
డి) హిరణ్యే + అక్షుడు
జవాబు:
ఎ) హిరణ్య + అక్షుడు
79. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా బాగుంటుంది – సంధి పేరు (సి)
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) అత్వ సంధి
సి) గుణ సంధి
డి) ఉత్వ సంధి
జవాబు:
సి) గుణ సంధి
80. ఎవరికి + ఐనా – సంధి కలిసిన రూపం గుర్తించండి. (డి)
ఎ) ఎవరికేనా
బి) ఎవరికియైనా
సి) ఎవరికినైనా
డి) ఎవరికైనా
జవాబు:
డి) ఎవరికైనా
81. సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి – సంధి పేరు (బి)
ఎ) అత్వ సంధి
బి) లు,ల, నల సంధి
సి) అత్వ సంధి
డి) త్రిక సంధి
జవాబు:
బి) లు,ల, నల సంధి
82. ఆహాహా పాట ఎంత బాగుందో! – విడదీసి రాయండి. (ఎ)
ఎ) ఆహా + ఆహా
బి) ఆహా + హా
సి) ఆహా + హా
డి) అహ + ఆహా
జవాబు:
ఎ) ఆహా + ఆహా
83. పోయి + ఎలుక – యడాగమ రూపం గుర్తించండి. (సి)
ఎ) పోయెలుకు
బి) పోయి ఎలుక
సి) పోయి యెలుక
డి) పో ఎలుక
జవాబు:
సి) పోయి యెలుక
84. కవ్వపుంగొండ – విడదీసి రాయండి. (డి)
ఎ) కవ్వపు + గొండ
బి) కవ్వమున్ + కొండ
సి) కవ్వపు + గొండ
డి) కవ్వపున్ + కొండ
జవాబు:
డి) కవ్వపున్ + కొండ
85. నృపులుగొలువ తెలుగు గౌరవం పెరిగింది – సంధి పేరు (బి)
ఎ) సరళాదేశ సంధి
బి) గసడదవాదేశ సంధి
సి) లు,ల, నల సంధి
డి) ఉత్వ సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి
86. తల్లిదండ్రులు – విడదీసి రాయండి. (ఎ)
ఎ) తల్లి + తండ్రి(లు)
బి) తల్లి + దండ్రులు
సి) తల్లియును తండ్రియును
డి) తల్లి + దండ్రి
జవాబు:
ఎ) తల్లి + తండ్రి(లు)
87. దశకంఠుఁ దెగటార్చి – సంధి పేరు గుర్తించండి. (సి)
ఎ) గసడదవాదేశ సంధి
బి) లులనలసంధి
సి) సరళాదేశ సంధి
డి) సవర్ణదీర్ఘసంధి
జవాబు:
సి) సరళాదేశ సంధి
88. హరికిటియై యవతరించెను – సంధి పేరు గుర్తించండి. (బి)
ఎ) ఇత్వసంధి
బి) యడాగమ
సి) యణాదేశ
డి) ఉత్వ సంధి
జవాబు:
బి) యడాగమ
89. క్రిందివానిలో ఉత్వసంధికి ఉదాహరణ గుర్తించండి. (ఎ)
ఎ) భార్గవుడై
బి) ఏమేమి
సి) ఔనౌను
డి) ఊరూరు
జవాబు:
ఎ) భార్గవుడై
90. క్రిందివానిలో లు,ల,న,ల సంధిపదం గుర్తించండి. (డి)
ఎ) పోయిందన్న
బి) గానామృతం
సి) సింహాసనం
డి) గానాలు
జవాబు:
డి) గానాలు
91. కవులార సమాజం బాగుచేయండి – సంధి పేరు (ఎ)
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) లులనల సంధి
సి) ఉత్త్వసంధి
డి) అత్వ సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి
సమాసాలు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
92. తెలుగు భాషను ఎల్లనృపులు పోషించారు. (ఎ)
ఎ) ఎల్లరైన నృపులు
బి) ఎల్లలున్న నృపులు
సి) ఎల్లలేని నృపులు
డి) ఎల్లరకూ నృపులు
జవాబు:
ఎ) ఎల్లరైన నృపులు
93. క్రిందివానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ గుర్తించండి. (సి)
ఎ) రాజేంద్రుడు
బి) కవీంద్రుడు
సి) అద్భుతపూరణ
డి) సూరనకవి
జవాబు:
సి) అద్భుతపూరణ
94. క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ (ఎ)
ఎ) రామకృష్ణకవి
బి) రామకృష్ణుని పద్యం
సి) ప్రారంభం
డి) దత్తపది
జవాబు:
ఎ) రామకృష్ణకవి
95. క్రింది వానిలో షష్ఠీతత్పురుష సమాసానికి ఉదాహరణ గుర్తించండి (డి)
ఎ) భువన విజయం
బి) ఇచ్చిన సమస్య
సి) మంచి పద్యం
డి) మన రాజ్యం
జవాబు:
డి) మన రాజ్యం
96. అష్టదిగ్గజములు వంటి కవులు రాయల ఆస్థానంలో ఉండేవారు. (బి)
ఎ) ఆరైన దిగ్గజములు
బి) ఎనిమిది బన దిగ్గజములు
సి) దిగ్గజములైన కవులు
డి) దిక్కులలోని ఏనుగులు
జవాబు:
బి) ఎనిమిది బన దిగ్గజములు
97. కవి పండితులు చమత్కారంగా మాట్లాడతారు సమాసం పేరు (సి)
ఎ) ద్విగు సమాసం
బి) బహువ్రీహి
సి) ద్వంద్వం
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
సి) ద్వంద్వం
98. మను చరిత్రను పెద్దనామాత్యుడు రచించెను. (డి)
ఎ) పెద్దన యొక్క అమాత్యుడు
బి) అమాత్యుడైన పెద్దన
సి) అమాత్యగల పెద్దన
డి) పెద్ద అను పేరుగల అమాత్యుడు
జవాబు:
డి) పెద్ద అను పేరుగల అమాత్యుడు
99. దేశమునందలి భాషలు – సమాసపదం గుర్తించండి. (బి)
ఎ) దేశ భాష
బి) దేశభాషలు
సి) భాషల దేశం
డి) భాషాదేశం
జవాబు:
బి) దేశభాషలు
100. దేవునికి పూలదండ వేయాలి – విగ్రహవాక్యం గుర్తించండి. (ఎ)
ఎ) పూలతో దండ
బి) పూల యొక్క దండ
సి) దండ యందలి పూలు
డి) పూల వలన దండ
జవాబు:
ఎ) పూలతో దండ
101. సాహిత్య సభ ప్రతీవారం జరగాలి – సమాసం పేరు
ఎ) తృతీయా
బి) చతుర్థీ
సి) సప్తమీ
డి) ప్రథమా
జవాబు:
బి) చతుర్థీ
102. సాహిత్యమునందు ప్రియత్వము కలవారు సమాసపడం గుర్తించండి. (సి)
ఎ) ప్రియ సాహిత్యం
బి) సాహిత్యం ప్రియం
సి) సాహిత్య ప్రియులు
డి) సాహితీ ప్రేయసి
జవాబు:
సి) సాహిత్య ప్రియులు
103. శ్రీహరి భక్తి ఉండాలి – సమాసం పేరు (ఎ)
ఎ) సప్తమీ తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) చతుర్థీ తత్పురుష
డి) తృతీయ తత్పురుష
జవాబు:
ఎ) సప్తమీ తత్పురుష
104. క్రింది వానిలో షష్ఠీ తత్పురుష సమాస పదం గుర్తించండి. (ఎ)
ఎ) రామభక్తుడు
బి) రామభక్తి
సి) సమరాంగము
డి) బుద్ధిబలం
జవాబు:
ఎ) రామభక్తుడు
105. త్రిపురులను పేరు గల అసరులు సమాసం పదం గుర్తించండి. (బి)
ఎ) అసురత్రిపురులు
బి) త్రిపురాసురులు
సి) త్రిపురాసురం
డి) త్రిపురాసుర
జవాబు:
బి) త్రిపురాసురులు
106. పాండితీధనులు ఆత్మాభిమానంతో జీవిస్తారు – సమాసం పేరు (ఎ)
ఎ) ద్విగువు
బి) ద్వంద్వ
సి) బహువ్రీహి
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
ఎ) ద్విగువు
ఛందస్సు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
107. చంపకమాలలో యతి ఎన్నవ అక్షరం? (బి)
ఎ) 10
బి) 11
సి) 12
డి) 13
జవాబు:
బి) 11
108. ప్రాస అంటే ఎన్నవ అక్షరం? (ఎ)
ఎ) 2వ
బి) 3వ
సి) 4వ
డి) 10వ
జవాబు:
ఎ) 2వ
109. చంపకమాలలో భ గణం ఎన్నవ గణం?
ఎ) 8వ
బి) 6వ
సి) 5వ
డి) 3వ
జవాబు:
డి) 3వ
110. చంపకమాలలో చివరి గణమేది? (సి)
ఎ) న గణం
బి) జ గణం
సి) ర గణం
డి) భ గణం
జవాబు:
సి) ర గణం
111. చంపకమాల పద్య పాదంలో ఎన్ని జగణాలుంటాయి? (ఎ)
ఎ) 4
బి) 3
సి) 2
డి) 5
జవాబు:
ఎ) 4
వాక్య రకాలు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
112. పెద్దనగారి పద్యం, వ్యాఖ్యానం బాగున్నాయి – ఏ రకపు వాక్యమో గుర్తించండి. (బి)
ఎ) సంశ్లిష్టం
బి) సంయుక్తం
సి) విధ్యర్థకం
డి) అప్యర్థకం
జవాబు:
బి) సంయుక్తం
113. కవిత్వంలో సంధిపదాలు ఉండకూడదు – ఏ రకపు వాక్యమో గుర్తించండి. (సి)
ఎ) విధ్యర్థకం
బి) సంయుక్తం
సి) నిషేధార్థకం
డి) అప్యర్థకం
జవాబు:
సి) నిషేధార్థకం
114. మీరు కవిత్వం చెప్పవచ్చు వాక్యపు ఏ రకపు వాక్యమో గుర్తించండి. (ఎ)
ఎ) అనుమత్యర్థకం
బి) సంశ్లిష్టం
సి) సంయుక్తం
డి) విద్యర్థకం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం
115. అష్టదిగ్గజ కవులు అద్భుతమైన పద్యాలు చెప్పగలరు – ఏ రకపు వాక్యమో గుర్తించండి. (డి)
ఎ) విద్యర్థకం
బి) ప్రార్ధనార్ధకం
సి) అప్యర్థకం
డి) సామర్ధ్యార్థకం
జవాబు:
డి) సామర్ధ్యార్థకం
116. రాయలవారికి నమస్కరించి కవులు పద్యాలు చెప్పారు – ఏ రకపు వాక్యమో గుర్తించండి. (ఎ)
ఎ) సంశ్లిష్టం
బి) సంయుక్తం
సి) ఆశీరార్ధకం
డి) విద్యర్థకం
జవాబు:
ఎ) సంశ్లిష్టం
Previous Bits
1. క్రింది వాటిలో ఏ వాక్యం “వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించినదో గుర్తించండి. (SA-2-2022-28) (డి)
ఎ) సోముడు భీముడివలె బలవంతుడు.
బి) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం.
సి) దేవళం గోపురాలు ఆకాశం తాకుతున్నాయి.
డి) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా!
జవాబు:
డి) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా!
2. కింది వాక్యంలో గీతగీసిన పదం యొక్క సంధిపేరును గుర్తించండి. (SA-2-2022-28) (బి)
నిన్ను జూసి నా మనసు ఊరటపడెను.
ఎ) గసడదవాదేశ సంధి
బి) సరళాదేశసంధి
సి) వృద్ధిసంధి
డి) ద్విరుక్తటకార సంధి
జవాబు:
బి) సరళాదేశసంధి