AP 8th Class Telugu 11th Lesson Important Questions సమద్రుష్టి

These AP 8th Class Telugu Important Questions 11th Lesson సమద్రుష్టి will help students prepare well for the exams.

సమద్రుష్టి AP Board 8th Class Telugu 11th Lesson Important Questions and Answers

అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గేయాలు- భావాలు

1. కన్నాకటే నలుపు కంటిచూపు నలుపు కాదు.
చెట్టొకటే నలుపు – చెట్టు కాపు నలుపు కాదు

భావం : కన్ను అంటే కంటిలోని నల్లగుడ్డు నల్లగా ఉంటుంది. మన కంటిచూపుకు ఆ నల్లగుడ్డ ప్రధానం. కానీ దాని ద్వారా చూసే చూపు నలుపు కాదు. అంటే మన కంటిచూపులో జాలి, సహాయం చేసే గుణం ఓదార్పు కనబడాలి. చెట్టు కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండటం వల్ల దూరానికి నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ చెట్టు కాయలు, పూలు, పండ్లు ఆ రకరకాల రంగులలో కన్పిస్తూ చూసేవారికి ఆనందం కలిగిస్తాయి.

2. చినుకు స్పర్శతే కదా నేలకదుపు పండేది
మబ్బొకటే నలుపు – మబ్బు చినుకు నలుపు కాదు.

భావం: వాన చినుకు తాకితేనే నేలకు కడుపు పండుతుంది. కడుపు పండడం అంటే సంతానం కలగటం. నేలకు కడుపు పండడం అంటే నేలమీద ఉన్న విత్తనాలు మొలకెత్తడం, పంటలు పండడం, నేలంతా సస్యశ్యామలం కావడం. దీనికంతటికి కారణమైన వాన చినుకులను ఇచ్చేది మాత్రం నల్లని మేఘం. మేఘం యొక్క రంగు నలుపు రంగు అయినా అది లోకానికి చేసే మేలు అపారమయినది.

3. చరుపు తగిలితే కదా నిదుర మత్తు వొదిలేది
అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు.

భావం : నిద్రమత్తు అజ్ఞానానికి సంకేతం, బద్ధకానికి గుర్తు. బద్ధకం, అజ్ఞానం వదలాలంటే ఎదురుదెబ్బ తగలాలి. ఎదురుదెబ్బ చెళ్ళున తగిలితే బద్దకం, అజ్ఞానం వదులుతాయి. బద్ధకాన్ని, అజ్ఞానాన్ని వదిలించే జ్ఞానాన్నిచ్చేది చదువు మాత్రమే. పుస్తకంలో అక్షరాలు నల్లగా ఉంటాయి. కానీ, చదువు మాత్రం నల్లగా ఉండదు. జ్ఞానం, దానివలన వచ్చే కీర్తి ప్రకాశవంతంగా ఉంటాయి. మనకు చదువు ప్రధానం కానీ అది నేర్పే గురువుగారి శారీరక నిర్మాణంతో పనిలేదు.

4. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు
గొంతొకటే నలుపు – దాని అరుపు నలుపు కాదు

భావం: తూర్పు తలుపు తెరుచుకోవడం అంటే చీకటి పటాపంచలు కావడం. చీకటి అంటే మోసం, అజ్ఞానం, దోపిడీ మొదలైనవి. ఇవన్నీ పోవాలంటే గొంతెత్తాలి, నినాదాలు చేయాలి. హక్కులు సాధించుకోవాలి. ఇవన్నీ చేయవలసినది కష్టపడి పనిచేసేవారు. ఎండనక, వాననక పని చేసేవారు సాధారణంగా నల్లగానే ఉంటారు. నినాదాలు చేసేవారి గొంతు రంగు నలుపు కాని, వారు సాధించే హక్కులు అనే సూర్యోదయం తెలుపే కదా!

AP 8th Class Telugu 11th Lesson Important Questions సమద్రుష్టి

5. కలలే కదా అందమైన భవితకు పునాదులు
రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు

భావం : కలలు అంటే ఊహలు అది సాధించాలి, ఇది సాధించాలి అనే ఆలోచనలే కలలు ఆ కలలే భవిష్యత్తుకు పునాదులు. రేపు ఒక గొప్పదానిని సాధించాలి అంటే ఈ రోజు దాని గురించి బలమైన కల కనాలి. రాత్రి నిద్రలో కూడా కలలు వస్తాయి. పగలు మెలకువగా ఉన్నప్పుడేవి సాధించాలని ఊహిస్తామో అవే కలలుగా వస్తాయి. కలలు తెచ్చే రాత్రి నలుపు కాని కలలు నలుపు కావు.

6. ఎదురీతకు దిగావో నదికోతలు తప్పవు
ఈత ఒకటే నలుపు – ఈత గెలుపు నలుపు కాదు

భావం: నదీ ప్రవాహానికి ఎదురీదడం చాలా కష్టం. ప్రవాహవేగం బలంగా వెనుకకు నెడుతుంటే, దానిని ఎదిరించి బలంగా ముందుకు వెళ్లాలి. ఈత నలుపు అంటే ఈత ఒకటే భరించడం కష్టం, కానీ గెలుపులో ఆనందం ఉంటుంది.

7. పరుగుతోనే బతుకు వెలితి పూర్చగలవు మిత్రుడా
కులమొకటే నలుపు – నీ పరుగు నలుపు కాదు

భావం: స్నేహితుడా! పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలం. అంటే అభివృద్ధికి ప్రయత్నిస్తేనే బ్రతుకులోని లోటును పూడ్చుకోగలం. నాది ఆ కులం, నీది ఈ కులం అనే భావనతో ఉంటే అభివృద్ధి జరగదు. కులం అనే భావన నలుపు కానీ అభివృద్ధికి చేసే ప్రయత్నం నలుపు కాదు.

పరిచిత గేయాలు – ప్రశ్నలు

అ) కింది పరిచిత గేయాలను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కన్నొకటే నలుపు- కంటిచూపు నలుపు కాదు.
చెట్టొకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు
చినుకు స్పర్శకే కదా నేలకడుపు పండేది.
మబ్బొకటే నలుపు – మబ్బు చినుకు నలుపు కాదు.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
కన్ను నలుపే కాని …………. కాదు.
జవాబు:
కన్ను నలుపే కాని కంటిచూపు నలుపు కాదు.

ప్రశ్న 2.
“చెట్టు కాపు” అంటే ఏమిటి?
జవాబు:
చెట్టు కాపు అంటే చెట్టు కాయలు, పళ్ళు.

ప్రశ్న 3.
“స్పర్శ” అనే పదానికి అర్థం రాయండి.
జవాబు:
స్పర్శ అంటే తాకిడి, తాకుట.

ప్రశ్న 4.
మబ్బు చినుకు ఎటువంటిది?
జవాబు:
మబ్బు చినుకు నలుపు కాదు. అనగా మెరుస్తుంది అని అర్థం.

2. కలలే కదా అందమైన భవితకు పునాదులు
రేయి ఒకటి నలుపు – రేయి కలలు నలుపు కాదు
ఎదురీతకు దిగావో నదికోతలు తప్పవు
ఈత ఒకటే నలుపు – ఈత గెలుపు నలుపు కాదు

ప్రశ్నలు:

ప్రశ్న 1.
అందమైన భవితకు పునాదులు ఏవి?
జవాబు:
అందమైన భవిష్యత్తుకు కలలు పునాదులు.

ప్రశ్న 2.
గొంతు అరుపు ఏ రంగు కాదు?
జవాబు:
గొంతు అరుపు నలుపురంగు కాదు.

ప్రశ్న 3.
ఎదురీత అంటే ఏమిటి?
జవాబు:
ఎదురీత అంటే సాధన, ప్రయత్నం.

ప్రశ్న 4.
ఈత గెలుపు నలుపు కాదు అంటే ఏమిటి?
జవాబు:
ప్రయత్న ఫలం విజయం లేదా జయం.

అపరిచిత పద్యాలు – ప్రశ్యలు

ఆ) కింది అపరిచిత పద్యాలు చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. చరవాణులఁ చేబూనియు
కొరగానివి చూడఁ జూడ క్రూరముబెరుగున్
చెరచును జీవిత లక్ష్యము
సరిగాదని యెంచి నీవు చదువుము నెపుడున్

ప్రశ్నలు:

ప్రశ్న 1.
చేతిలో ఏమి పట్టుకుంటున్నారు?
జవాబు:
చేతిలో చరవాణి పట్టుకుంటున్నారు.

ప్రశ్న 2.
చరవాణిలో పనికిరానివి చూస్తే ఏమవుతుంది?
జవాబు:
చరవాణిలో పనికిరానివి చూస్తే క్రూరత్వం పెరుగుతుంది.

ప్రశ్న 3.
చరవాణి దేనిని పాడుచేస్తుంది?
జవాబు:
చరవాణి జీవితలక్ష్యాన్ని పాడు చేస్తుంది.

ప్రశ్న 4.
చరవాణి చూడటం మంచిది కాదని ఏమి చేయాలి?
జవాబు:
చరవాణి చూడటం మాని చదువుకోవాలి.

AP 8th Class Telugu 11th Lesson Important Questions సమద్రుష్టి

2. శ్రమ లేకను సోమరియగు
శ్రమ లేకను జీవరహిత శవమైదోచున్
శ్రమ లేకను నిర్దేతియగు
శ్రమ లేకను సకలజీవి స్థంభించునిలన్

ప్రశ్నలు:

ప్రశ్న 1.
సోమరితనం దేనివల్ల వస్తుంది?
జవాబు:
సోమరితనం శ్రమ లేకపోవడం వల్ల వస్తుంది.

ప్రశ్న 2.
శ్రమ లేకపోతే జీవము ఏమవుతుంది?
జవాబు:
శ్రమ లేకపోతే జీవము శవములాగా జీవరహితంగా ఉంటుంది.

ప్రశ్న 3.
నిర్గతి దేనివల్ల వస్తుంది?
జవాబు:
నిర్దేతి శ్రమ లేకపోవడం వల్ల వస్తుంది.

ప్రశ్న 4.
శ్రమ లేకపోతే సకల జీవి ఏమవుతుంది?
జవాబు:
శ్రమ లేకపోతే సకలజీవులు స్తంభించిపోతాయి.

3. కసకసలు కాయగూరలు
బుసబుసలగు ఱంపనుండు బుడతలయందున్
రుసరుసలు కోపియందును
గుసగుసలు రహస్యమందు గువ్వల చెన్నా!

ప్రశ్నలు:

ప్రశ్న 1.
కాయగూరలు ఎలా ఉంటాయి?
జవాబు:
కాయగూరలు కసకసమంటూ ఉంటాయి.

ప్రశ్న 2.
బుడతడు తొంప పట్టినప్పుడు ఎలా తుమ్ముతాడు?
జవాబు:
బుడతడు ఖొంప పట్టినప్పుడు బుస్ బుస్ అంటాడు.

ప్రశ్న 3.
కోపించిన మనిషికి ఉండేది ఏమిటి?
జవాబు:
కోపించిన మనిషికి రుసరుసలు ఉంటాయి.

ప్రశ్న 4.
రహస్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది?
జవాబు:
రహస్యంగా చెప్పేటప్పుడు గుసగుసలు ఉంటాయి.

4. ఓర్పులేని భార్యయున్న ఫలంటేమి ?
బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి ?
సద్గుణంబులు లేని చదువది యేలరా ?
విశ్వదాభిరామ వినురవేమ!

ప్రశ్నలు:

ప్రశ్న 1.
భార్యకు ఏమి ఉండాలి?
జవాబు:
భార్యకు ఓర్పు ఉండాలి.

ప్రశ్న 2.
బిడ్డకు ఏమి ఉండాలి?
జవాబు:
బిడ్డకు బుద్ధి ఉండాలి.

ప్రశ్న 3.
చదువుకున్నవాడికి ఏముండాలి?
జవాబు:
చదువుకున్న వాడికి సద్గుణాలుండాలి.

ప్రశ్న 4.
ఇది ఏ శతక పద్యం?
జవాబు:
ఇది వేమన శతక పద్యం.

5. మధుర మధురమైన మన భాష కంటెను
చక్కనైన భాష జగతి లేదు
తల్లిపాల కంటె తనయునకే పాలు
బలము నీయ గలవు? తెలుగుబిడ్డ

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పై పద్యాన్ని ఎవరు రచించారు?
జవాబు:
నార్ల చిరంజీవి

ప్రశ్న 2.
బిడ్డకు ఎవరి పాలు బలమునిస్తాయి?
జవాబు:
తల్లిపాలు

ప్రశ్న 3.
మన భాష ఎటువంటిది?
జవాబు:
మధురమైనది

ప్రశ్న 4.
పై పద్యం చదివి ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
చక్కనైన భాష ఏది?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అక్షరమే నలుపు – దాని చదువు నలుపుకాదు వివరించండి.
జవాబు:
వ్రాత పుస్తకంలో నల్లసిరాతో వ్రాయబడిన అక్షరాలు నల్లగా ఉంటాయి. కాని, ఆ అక్షరాలను కూడబలుక్కొని చదవడం, వాటి సారాన్ని గ్రహించడం చదువు. చదువు వలన మనకు తెలివి పెరుగుతుంది. జ్ఞానం పెరుగుతుంది. మంచి, చెడులను గ్రహించగల విచక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగం దొరుకుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. జీవితంలో చదువువలన కాంతి పెరుగుతుంది. నల్లని అక్షరాలు ఇచ్చిన చదువు వలన మన జీవితం కాంతివంతంగా మారుతుందని భావం.

ప్రశ్న 2.
కన్నొకటే నలుపు – కంటిచూపు నలుపు కాదు – దీనిని విశ్లేషించండి.
జవాబు:
కన్ను అంటే కంటిలోని నల్లగుడ్డు నల్లగా ఉంటుంది. దీనివలననే మనకు చూపు అనుతుంది. పచ్చని చెట్లను చూడగలం. ప్రకృతిని చూడగలం. పక్షులను, జంతువులను, మానవులను అన్నిటినీ చూడగలం. ఆస్వాదించగలం. ఆనందించగలం. చదువుకోగలం. వ్రాయగలం. ఇన్ని ప్రయోజనాలను కలిగించే కనుగుడ్డు మాత్రం నల్లగానే ఉంటుంది అని భావం.

ప్రశ్న 3.
చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది- దీనిని వ్యాఖ్యానించండి.
జవాబు:
వర్షపు చినుకు తగలగానే భూమిపై విత్తనాలు మొలకెత్తుతాయి. చెట్లు చిగురిస్తాయి. భూమి పచ్చగా కలకలలాడుతుంది. కంటికింపుగా కనిపిస్తుంది. భూమి మీద ఉన్న మానవులకు, శాఖాహార జంతువులకు సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తుంది. ఇంత సంపదను భూమికి ఇచ్చే వర్షపు చినుకును ఇచ్చేది మాత్రం నల్లని మేఘమే. మేఘం రంగు నలుపైనా దాని నుండి వచ్చిన వర్షపు చినుకు భూమిపై ఆనందపు వెలుగులను విరజిమ్ముతుంది.

AP 8th Class Telugu 11th Lesson Important Questions సమద్రుష్టి

ఆ) క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో జీవాబులు రాయండి.

ప్రశ్న 1.
కవిగారు నలుపు రంగు గురించి ఎందుకు ఎలా ప్రస్తావించారో వివరించండి.
జవాబు:
సాధారణంగా నలుపురంగును అశుభానికి సంకేతంగా వాడతాము. నల్లని దుస్తులు ధరించినా దానిని శోకానికి గుర్తుగా భావిస్తారు. తెలుపురంగును, పసుపురంగును శుభాలకు సంకేతాలుగా వాడతారు. కష్టనష్టాలకు ప్రతీకగా కూడా నలుపురంగును భావిస్తారు. చాలామంది నలుపు రంగును ఇష్టపడరు.

కానీ మనం అందమైన ప్రపంచాన్ని చూడటానికి ఉపయోగించే కంటిగ్రుడ్డు నల్లగానే ఉంటుంది. నల్లని కనుగుడ్డు తెల్లబడితే ఏమీ కనిపించక తెల్లమోహం వేయాలి. అలాగే ప్రపంచాన్ని సస్యశ్యామలం చేసే వర్షపు చినుకులు ఇచ్చే మేఘం కూడా నల్లగానే ఉంటుంది. నల్లని మేఘం లేకపోతే మనకు తిండిలేదు. మనకు విజ్ఞానాన్ని ప్రసాదించే చదువునిచ్చే అక్షరాలు కూడా నల్లగానే ఉంటాయి. అక్షరాలు లేకపోతే ప్రపంచం అజ్ఞానంతో నిండిపోతుంది. అందమైన కలలుగనే నిద్రనిచ్చే రాత్రి కూడా నల్లగానే ఉంటుంది. నదికి ఎదురీదే కష్టతరమైన ఈత కూడా నల్లగానే ఉంటుందని కవిగారు పేర్కొన్నారు. మనలో అహంకారాన్ని ప్రేరేపించే కులం రంగు కూడా నలుపని కవిగారు పేర్కొన్నారు.

ప్రశ్న 2.
రంగులపై నీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
రంగులన్నీ సమానమే ఏ రంగు గొప్పదీకాదు, తక్కువదీకాదు. తెల్లని వెలుగు లేకపోతే నల్లని చీకటిలో మన కంటికేవీ కనబడవు. అందుచేత తెలుపురంగు గొప్పది. “నల్లని మేఘం లేకపోతే వర్షాలు కురియవు. పంటలు పండవు. తిండి ఉండదు. కనుక నలుపురంగూ గొప్పడే పచ్చని చెట్లూ పంటపొలాలు లేకపోతే భూమిపై జంతువులు, మానవులూ జీవించటం కష్టం. అందుచేత పచ్చని రంగూ గొప్పదే. ‘ ఎర్రని నిప్పు లేకపోతే వంట వండుకోలేం. లోహాలతో వస్తువులేవీ తయారవవు. అందుచేత ఎరుక్కరంగూ గొప్పదే. అందుచేత జీవుల లాగానే దేని గొప్పతనం దానిదే. సృష్టిలో ఏదీ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు.

ప్రశ్న 3.
మీకిష్టమైన కవిత వ్రాయండి.
జవాబు:
అమ్మ చేతి గోరుముద్దలంటే ఇష్టం,
నాన్నతో నడవటమంటే నాకిష్టం,
తాత చెప్పే కథలంటే చాలా ఇష్టం,
మామ్మ పాడే పాటలంటే బాగా ఇష్టం,
పచ్చపచ్చని చెట్టులు అంటే ఇష్టం,
కిలకిలలాడే పక్షులంటే ఇష్టం,
అన్నీ ఇష్టం నాకన్నీ ఇష్టం.

భాషాంశాలు

బహుళైచ్ఛిక ప్రశ్నలు

పదజాలం

అర్థాలు : గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.

1. కన్ను అన్నిటి కంటే ప్రధానం. (సి)
ఎ) కాలు
బి) నిత్యం
సి) నేత్రము
డి) పత్రము
జవాబు:
సి) నేత్రము

2. 60 సంవత్సరాలు వస్తే కంటిచూపు తగ్గుతుంది. (ఎ)
ఎ) దృష్టి
బి) సృష్టి
సి) పుష్టి
డి) నష్టి
జవాబు:
ఎ) దృష్టి

3. చెట్టులు కొట్టకూడదు. (డి)
ఎ) పక్షము
బి) శిక్షము
సి) లక్ష
డి) వృక్షము
జవాబు:
డి) వృక్షము

4. తల్లి వెచ్చని స్పర్శ ఆనందాన్నిస్తుంది. (బి)
ఎ) మాట
బి) తాకిడి
సి) రాపిడి
డి) దెబ్బ
జవాబు:
బి) తాకిడి

5. నేల పచ్చగా ఉంటే తిండికి లోటుండదు. (బి)
ఎ) అబ్రకం
బి) భూమి
సి) అభ్రము
డి) డెంగీ
జవాబు:
బి) భూమి

6. కడుపు నిండితే కబుర్లు వస్తాయి. (సి)
ఎ) సోదరుడు
బి) సోదరి
సి) ఉదరము
డి) చదరము
జవాబు:
సి) ఉదరము

7. ఆకాశంలో మబ్బు నీటిదిబ్బ. (ఎ)
ఎ) మేఘం
బి) నక్షత్రం
సి) సూర్యుడు
డి) చంద్రుడు
జవాబు:
ఎ) మేఘం

8. పిల్లలపై చరుపులు వేయకూడదు. (డి)
ఎ) అరుపు
బి) నింద
సి) తిట్టు
డి) దెబ్బ
జవాబు:
డి) దెబ్బ

9. మంచి నిదుర ఆరోగ్యం. (సి)
ఎ) కల
బి) గురక
సి) విద్ర
డి) పలవరింత
జవాబు:
సి) విద్ర

10. ఎప్పుడూ మత్తులో ఉండేవాడు ఏదీ సాధించలేదు. (ఎ)
ఎ) మైకం
బి) నిద్ర
సి) బద్ధకం
డి) రోగ
జవాబు:
ఎ) మైకం

11. అనవసరమైన అరుపులు మంచిది కాదు. (బి)
ఎ) చరుపులు
బి) కేకలు
సి) మరుపులు
డి) కురుపులు
జవాబు:
బి) కేకలు

12. ఎవరి పిలుపును నిర్లక్ష్యం చేయకూడదు. (ఎ)
ఎ) ఆహ్వానం
బి) కేక
సి) భోజనం
డి) ఆట
జవాబు:
ఎ) ఆహ్వానం

13. తూర్పున సూర్యుడు ఉదయించును. (బి)
ఎ) మలిదిక్కు
బి) తొలిదిక్కు
సి) ఒకదిక్కు
డి) దిక్కు
జవాబు:
బి) తొలిదిక్కు

AP 8th Class Telugu 11th Lesson Important Questions సమద్రుష్టి

14. రాత్రి తలుపు మూయాలి. (సి)
ఎ) కిటికి
బి) గుమ్మం
సి) కవాటం
డి) వాకిలి
జవాబు:
సి) కవాటం

15. కోకిల గొంతు మధురంగా ఉంటుంది. (డి)
ఎ) పాట
బి) గీతం
సి) రంగు
డి) కంఠం
జవాబు:
డి) కంఠం

పర్యాయపదాలు : గీత గీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించండి.

16. కన్ను మిన్ను కానక సంచరించకూడదు. (బి)
ఎ) నేత్రము, వేత్రము
బి) నయనము, నేత్రము
సి) కక్షి, అక్షి
డి) అక్షము, రక్షణము
జవాబు:
బి) నయనము, నేత్రము

17. బొగ్గు నలుపు రంగులో ఉంటుంది. (ఎ)
ఎ) నీలము, కాలము
బి) నీలము, నీరు
సి) కాలము, కాళిక
డి) కాళిక, పార్వతి
జవాబు:
ఎ) నీలము, కాలము

18. కంటిచూపు కావలసిన పిల్లలకు సహాయం చేయాలి. (డి)
ఎ) నల్లగుడ్లు, తెల్లగుడ్డు
బి) కన్ను, కాలు
సి) చూపు, చూపుట
డి) దృష్టి, ఈక్షణము
జవాబు:
డి) దృష్టి, ఈక్షణము

19. చెట్టుపై కోతికొమ్మచ్చి ఆడతాం. (సి)
ఎ) తరువు, తరళము
బి) వృక్షము, పక్షము
సి) తరువు, వృక్షము
డి) నగము, నగజ
జవాబు:
సి) తరువు, వృక్షము

20. నేలను సారవంతం చేయాలి. (ఎ)
ఎ) అవని, భూమి
బి) నీరు, జలము
సి) గాలి, వాయువు
డి) పరిసరాలు, వాకిలి
జవాబు:
ఎ) అవని, భూమి

21. కడుపు నిండేదాకా తినాలి. (బి)
ఎ) ఆకలి, క్షుత్తు
బి) ఉదరము, గర్భము
సి) అన్నము, ఆహారము
డి) కంచము, పళ్ళెము
జవాబు:
బి) ఉదరము, గర్భము

22. మబ్బు చూస్తే నెమలి నాట్యం చేస్తుంది. (బి)
ఎ) నక్షత్రము, చుక్క
బి) మేఘము, పయోధరము
సి) చంద్రుడు, శశి
డి) వెన్నెల, కౌముది
జవాబు:
బి) మేఘము, పయోధరము

23. హనుమంతుని చరుపుకు అడవి దున్నలు పారిపోయాయి. (డి)
ఎ) తన్ను, తావు
బి) గుద్దు, ఘాతము
సి) కేక, అరుపు
డి) దెబ్బ, ఆఘాతము
జవాబు:
డి) దెబ్బ, ఆఘాతము

24. భీముని అరుపుకు కొండ గుహలు ప్రతిధ్వనించాయి. (ఎ)
ఎ) కేక, బొబ్బ
బి) నవ్వు, హాసము
సి) తుమ్ము, క్షుతము
డి) దగ్గు, ఆవులింత
జవాబు:
ఎ) కేక, బొబ్బ

25. తూర్పు తిరిగి దండం పెట్టాలి. (సి)
ఎ) దిశ, దిక్కు
బి) అటు, ఇటు
సి) తూరుపు, తొలిదిక్కు
డి) మలిదిక్కు, మరోదిక్కు
జవాబు:
సి) తూరుపు, తొలిదిక్కు

26. అక్షరము నేర్చుకో భవిత మార్చుకో. (ఎ)
ఎ) అక్కరము, వర్ణము
బి) వర్ణము, రంగు
సి) చదువు, విద్య
డి) వ్రాత, వ్రాయడం
జవాబు:
ఎ) అక్కరము, వర్ణము

27. కష్టపడితే బ్రతుకు బాగుంటుంది. (డి)
ఎ) జీతము, పని
బి) ఉద్యోగం, ఉపాధి
సి) సమయం, కాలం
డి) బ్రతుకు జీవితం
జవాబు:
డి) బ్రతుకు జీవితం

28. మిత్రుడు ఆపదలో ఆదుకుంటాడు. (బి)
ఎ) వైరి, సఖుడు
బి) సఖుడు, స్నేహితుడు
సి) స్నేహితుడు, సూర్యుడు
డి) సూర్యుడు, రవి
జవాబు:
బి) సఖుడు, స్నేహితుడు

29. ఎవరి కులము వారికి గొప్పది. (ఎ)
ఎ) అన్వయము, గోత్రము
బి) గోత్రము, పోత్రము
సి) పదవి, హోదా
డి) ఇల్లు, గృహము
జవాబు:
ఎ) అన్వయము, గోత్రము

30. మంచి కల కనాలి. (సి)
ఎ) నిద్ర, నిదుర
బి) అందం, చందం
సి) స్వప్నము, స్వాపము
డి) రాత్రి, రేయి
జవాబు:
సి) స్వప్నము, స్వాపము

నానార్థాలు : గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.

31. కన్నును జాగ్రత్తగా చూసుకోవాలి. (ఎ)
ఎ) నయనము, రంధ్రము
బి) నయనము, నేత్రము
సి) అక్షి, అక్షము
డి) దృష్టి, దిష్టి
జవాబు:
ఎ) నయనము, రంధ్రము

32. మన దృష్టి మంచిది కావాలి. (సి)
ఎ) దృష్టి, కంటిచూపు
బి) దృష్టి, దిష్టి
సి) కంటిచూపు, అభిప్రాయము
డి) మనసు, ఆలోచన
జవాబు:
సి) కంటిచూపు, అభిప్రాయము

33. నలుపు దాచుకోకూడదు. (డి)
ఎ) నీలము, నల్లని
బి) దోషము, తప్పు
సి) తప్పు, ఒప్పు
డి) నీలము, దోషము
జవాబు:
డి) నీలము, దోషము

34. చెట్టు భూమికి సంపద. (ఎ)
ఎ) వృక్షము, గుల్మము
బి) వృక్షము, తరువు
సి) గుల్మము, పొద
డి) పాడి, పంట
జవాబు:
ఎ) వృక్షము, గుల్మము

35. చినుకు మీద పడితే బాగుంటుంది. (సి)
ఎ) తుంపర, జల్లు
బి) జల్ల వాన
సి) వర్షపు చినుకు, నీటిబిందువు
డి) వాన, వరం
జవాబు:
సి) వర్షపు చినుకు, నీటిబిందువు

36. స్పర్శ ఆనందంగా ఉంటుంది. (ఎ)
ఎ) తాకుట, వాయువు
బి) తాకుట, ముట్టుకొనుట
సి) గాలి, పవనము
డి) వనము, వనజము
జవాబు:
ఎ) తాకుట, వాయువు

37. నేలను పంటలకు వినియోగించాలి. (బి)
ఎ) దేశము, ప్రదేశము
బి) భూమి ప్రదేశము
సి) భూమి, అవని
డి) అవని, వని
జవాబు:
బి) భూమి ప్రదేశము

AP 8th Class Telugu 11th Lesson Important Questions సమద్రుష్టి

38. మబ్బు వలన ఆనందం వస్తుంది. (డి)
ఎ) మేఘము, జలధరము
బి) అజ్ఞానము, అవిద్య
సి) విజ్ఞానము, జ్ఞానము
డి) మేఘము, అజ్ఞానము
జవాబు:
డి) మేఘము, అజ్ఞానము

39. అక్షరము రక్షిస్తుంది. (ఎ)
ఎ) వర్ణము, పరబ్రహ్మము
బి) వర్ణము, రంగు
సి) పరబ్రహ్మము, బ్రహ్మము
డి) చదువు, విద్య
జవాబు:
ఎ) వర్ణము, పరబ్రహ్మము

40. చదువు గంభీరంగా ఉండాలి. (బి)
ఎ) విద్య, అధ్యయనము
బి) విద్య, పలుకు
సి) పలుకు, మాట
డి) వాణి, వీణ
జవాబు:
బి) విద్య, పలుకు

41. మిత్రుడు సహాయం చేస్తాడు. (ఎ)
ఎ) సూర్యుడు, స్నేహితుడు
బి) సూర్యుడు, రవి
సి) స్నేహితుడు, సఖుడు
డి) స్నేహితుడు, చంద్రుడు
జవాబు:
ఎ) సూర్యుడు, స్నేహితుడు

42. పునాది గట్టిగా ఉండాలి. (సి)
ఎ) గోయి, గొయ్యి
బి) గోడ, కుడ్యము
సి) మూలబంధము, ఆధారము
డి) ఆధారము, ఆధేయము
జవాబు:
సి) మూలబంధము, ఆధారము

43. పరుగు అన్నివేళలా మంచిది కాదు. (ఎ)
ఎ) తీవ్రగమనము, ప్లుతము
బి) ప్లుతము, మూడు మాత్రల కాలము
సి) వేగము, రయము
డి) ఆయాసము, ఆవేసము
జవాబు:
ఎ) తీవ్రగమనము, ప్లుతము

44. కల అందంగా ఉంటుంది. (బి)
ఎ) అందం, సొగసు
బి) స్వప్నము, లావణ్యము
సి) స్వప్నము, స్వాపము
డి) నిద్ర, నిదుర
జవాబు:
బి) స్వప్నము, లావణ్యము

45. కొందరి గొంతు బాగుంటుంది. (సి)
ఎ) కంఠము, మెడ
బి) కంఠము, కంటువు
సి) కంఠధ్వని, కంఠము
డి) అందము, సొగసు
జవాబు:
సి) కంఠధ్వని, కంఠము

ప్రకృతి – వికృతులు గీత గీసిన పదానికి ప్రకృతులు/వికృతులు గుర్తించండి.

46. ఎవరి దృష్టిని అనుమానించకూడదు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి. (బి)
ఎ) చూపు
బి) దిష్టి
సి) దేష్ట
డి) దృష్టి
జవాబు:
బి) దిష్టి

47. ఎక్కువ నిదుర మంచిది కాదు – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి. (సి)
ఎ) నిద్దర
బి) నీద్ర
సి) నిద్ర
డి) నిద్రా
జవాబు:
సి) నిద్ర

48. అక్షరము శుద్ధిగా నేర్చుకో – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) అక్కరము
బి) ఆకారము
సి) అరకము
డి) అఖరము
జవాబు:
ఎ) అక్కరము

49. రాతిరి చీకటిగా ఉంటుంది – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి. (డి)
ఎ) రాత్రిరి
బి) రత్తిరి
సి) రత్తి
డి) రాత్రి
జవాబు:
డి) రాత్రి

50. మభత్ను చూసి వానను అంచనా వేయలేము – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) మబ్బు
బి) మబ్బ
సి) మభ
డి) మత్తు
జవాబు:
ఎ) మబ్బు

వ్యుత్పత్త్యర్థాలు: క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

51. దీనిచేత చూచుదురు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) దృష్టి
బి) దిష్టి
సి) కన్ను
డి) నేత్రము
జవాబు:
ఎ) దృష్టి

52. స్పర్శ వ్యుత్పత్యర్థం గుర్తించండి. (సి)
ఎ) స్పర్ధ కలది
బి) వైరం కలది
సి) స్పృశించబడునది
డి) వినబడునది
జవాబు:
సి) స్పృశించబడునది

53. అక్షరమే జ్ఞానదీపం – గీతగీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి. (సి)
ఎ) చదువునిచ్చేది
బి) జ్ఞానమిచ్చేది
సి) నాశనం లేనిది
డి) అజ్ఞానాన్ని నాశనం చేసేది.
జవాబు:
సి) నాశనం లేనిది

54. స్నేహించువాడు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (సి)
ఎ) మిత్రుడు
బి) చెలికాడు
సి) చెలి
డి) సఖుడు
జవాబు:
సి) చెలి

వ్యాకరణాంశాలు

సంధులు: గీత గీసిన పదాన్ని కోరిన విధంగా గుర్తించండి.

55. మాతృస్పర్శకే ఆనందం కలుగుతుంది – గీత గీసిన పదానికి సంధి విడదీసిన రూపం గుర్తించండి. (సి)
ఎ) స్పర్శకి + ఏ
బి) స్పర్శ + కే
సి) స్పర్శకు + ఏ
డి) స్పర్శకు + కే
జవాబు:
సి) స్పర్శకు + ఏ

56. నేను చెట్టొకటి పెంచాను – గీత గీసిన పదానికి సంధిపేరు గుర్తించండి. (ఎ)
ఎ) ఉత్వసంధి
బి) ఇత్వసంధి
సి) అత్వసంధి
డి) సంధి పదం కాదు
జవాబు:
ఎ) ఉత్వసంధి

సమాసాలు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

57. సమదృష్టితో జీవించాలి. విగ్రహవాక్యం గుర్తించండి. (బి)
ఎ) సమము యొక్క దృష్టి
బి) దృష్టి యొక్క దృష్టి
సి) సమమైన దృష్టి
డి) సమత్వమే దృష్టి
జవాబు:
బి) దృష్టి యొక్క దృష్టి

58. నిదుర వలన మత్తు – సమాస పదం గుర్తించండి. (ఎ)
ఎ) నిదుర మత్తు
బి) మత్తు నిదుర
సి) నిదురే మత్తు
డి) మత్తే నిదుర
జవాబు:
ఎ) నిదుర మత్తు

59. నదికోత పెరిగింది – గీత గీసిన పదానికి సమాసం పేరు (సి)
ఎ) షష్ఠీ తత్పురుష
బి) చతుర్థీ తత్పురుష
సి) పంచమీ తత్పురుష
డి) సప్తమీ తత్పురుష
జవాబు:
సి) పంచమీ తత్పురుష

60. కంటి చూపు విగ్రహవాక్యం గుర్తించండి. (డి)
ఎ) చూపు యొక్క కన్ను
బి) కంటి యొక్క చూపు
సి) కంటి వలన చూపు
డి) కన్ను యొక్క చూపు
జవాబు:
డి) కన్ను యొక్క చూపు

61. క్రింది వానిలో షష్ఠీ తత్పురుష సమాస పదం గుర్తించండి. (ఎ)
ఎ) నేల కడుపు
బి) కడుపుల
సి) సమదృష్టి
డి) దృష్టి దీపం
జవాబు:
ఎ) నేల కడుపు

ఛందస్సు:

62. రాజాజ్ఞ గణం గుర్తించండి. (బి)
ఎ) భ గణం
బి) త గణం
సి) జ గణం
డి) ర గణం
జవాబు:
బి) త గణం

AP 8th Class Telugu 11th Lesson Important Questions సమద్రుష్టి

63. క్రింది వానిలో మ గణం గుర్తించండి. (డి)
ఎ) నాకొక
బి) నాకొక్క
సి) నేనొక
డి) నేనున్నా
జవాబు:
డి) నేనున్నా

64. క్షీరము – గణం గుర్తించండి. (ఎ)
ఎ) భ గణం
బి) ర గణం
సి) న గణం
డి) త గణం
జవాబు:
ఎ) భ గణం

65. మూడు లఘువులు గల గణం గుర్తించండి. (సి)
ఎ) ర గణం
బి) మ గణం
సి) వ గణం
డి) జ గణం
జవాబు:
సి) వ గణం

66. రెండు మాత్రల కాలం ఉచ్చరింపబడేది? (బి)
ఎ) లఘువు
బి) గురువు
సి) ప్యుతము
డి) గణము
జవాబు:
బి) గురువు

వాక్య రకాలు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

67. మీరు చదవండి. (వాక్యపు రకం గుర్తించండి) (సి)
ఎ) సందేహార్ధకం
బి) అప్యర్థకం
సి) విధ్యర్థకం
డి) నిషేధార్థకం
జవాబు:
సి) విధ్యర్థకం

68. మీరు ఆడుకోవచ్చు. (వాక్యపు రకం గుర్తించండి) (ఎ)
ఎ) అనుమత్యర్ధకం
బి) సందేహార్ధకం
సి) విధ్యర్థకం
డి) ఆశ్చర్యార్థకం
జవాబు:
ఎ) అనుమత్యర్ధకం

69. క్రింది వానిలో ఆశ్చర్యార్థక వాక్యం గుర్తించండి. (బి)
ఎ) నీవు రావద్దు
బి) ఆహా! ఎంత బాగున్నావు
సి) బాగుందా?
డి) బాగుందో! లేదో!
జవాబు:
బి) ఆహా! ఎంత బాగున్నావు

70. నేను వెళ్లను వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి. (డి)
ఎ) నేను వెళ్ళను
బి) నేను వెడుతున్నాను
సి) నేను వెళ్ళలేను
డి) నేను వెడతాను
జవాబు:
డి) నేను వెడతాను

71. వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి. (సి)
ఎ) చూచి
బి) చూస్తూ
సి) చూడక
డి) చూచుట
జవాబు:
సి) చూడక

Previous Bits

1. తొలకరి చినుకులు వర్ష ఋతువుకు సంకేతం. (FA-4:2022-23) (ఎ)
ఎ) గుర్తు
బి) సందడి
సి) దారి
డి) సంశయం
జవాబు:
ఎ) గుర్తు

2. అక్షరం అనగా క్షరం కానిది (గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి.) (FA-4:2022-23)
జవాబు:
అక్షరం – అక్కరము

3. కరములు = హస్తాలు (SA-2:2023-24)
సొంతవాక్యం దుర్గాదేవి అభయ హస్తాలతో భక్తుల కోర్కెలను తీరుస్తుంది.

4. మార్గం = దారి (SA-2-2023-24)
సొంతవాక్యం మేము తిరుపతి మెట్లదారిలో వెళ్ళాము.

Leave a Comment