These AP 8th Class Telugu Important Questions 10th Lesson నాటి చదువు will help students prepare well for the exams.
నాటి చదువు AP Board 8th Class Telugu 10th Lesson Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గద్యాలు – ప్రశ్నలు
1. క్రింది పరిచిత గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలు తయారు చేయండి.
మాది నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని పురిణి గ్రామం. దీనిని పెద్దగ్రామంగా పరిగణించవచ్చును. మా తండ్రి వెంకటేశాచార్యులు. తల్లి నరసమ్మ, సర్వధారి సంవత్సర పుష్య శుద్ధ సప్తమి (1889 జనవరి 8) నా జన్మదినం. నా బాల్యం సాఫీగానే నడిచిపోయింది. నా గ్రామస్థులు నేను వారికి గౌరవపాత్రులైన వెంకటేశమయ్య కుమారుడనని, నా పట్ల ప్రేమాభిమానములు కలవారయ్యారు. నాకు అయిదవ ఏట అక్షరాభ్యాసం చేసి, గ్రామంలోని వీధి బడిలో చేర్చారు. నాకు ‘శిరోభూషణం రాఘవాచార్యులుగారు’ అయ్యవారు. పెద్దబాలశిక్ష మాకు పాఠ్యగ్రంథం. మా బడిలో 15, 20 మంది కంటే ఎక్కువగా పిల్లలుండేవారు. ఆడపిల్లలు ఎవరూ ఆ రోజులలో బడికి వచ్చి చదువుకొనేవారు కాదు.
ప్రశ్నలు:
1. ఆనాటి కాలంలో పాఠ్యగ్రంథం ఏది?
2. అప్పట్లో బడికి రానివారెవరు?
3. వీధి బడిలో అయ్యవారు ఎవరు?
4. కవి పుట్టిన తెలుగు సంవత్సరం ఏది?
2. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
బడిపిల్లలందరూ దసరాకు ముందు ఇరవై రోజులు దసరా పద్యాలను ఒప్పగించడానికి నేర్చుకొనేవారు. ఈ పద్యాలను గుండ్రంగా కత్తిరించిన తాటాకులలో రాసి వాటినన్నింటిని కలిపి ఒక పుస్తకంలా కుట్టి ఉంచేవారు. దీనిని చేతిలో పెట్టుకుని పిల్లలు అయ్యవారితో కూడా గ్రామంలోని కొందరి ఇండ్లకు వెళ్ళి, పద్యాలను ఒప్పగించేవారు. ఇంటి యజమానులు పిల్లలకు పప్పుēల్లాలను, అయ్యవారికి అర్ధ, పావలా డబ్బులను ఇచ్చి పంపివేయడం మామూలు. దసరాలో పిల్లలందరు మంచి దుస్తులను ధరించి, చేతిలో విల్లంబులను గాని, కోతికొమ్మంచిని గాని పెట్టుకొని దసరా పద్యాలను చదువుటకు వెళ్లేవారు. నా పినతల్లి వెంకమ్మ తిరుపతి నుండి నాకు ఒక చల్లడం (పంట్లాం), ఒక చొక్కాయ, ఒక టోపీని తెచ్చి ఇచ్చింది. ఈ దుస్తులను వేసుకొని, చేతిలో కోతికొమ్మంచిని పెట్టుకొని దసరా కార్యక్రమంలో నేను పాల్గొనేవాడను.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
దసరా పద్యాలను విద్యార్థులు దేనిపై రాశారు?
జవాబు:
దసరా పద్యాలను విద్యార్థులు, తాటాకుపై రాశారు.
ప్రశ్న 2.
‘అయ్యవారు’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
అయ్యవారు అంటే ఉపాధ్యాయుడు, గురువు.
ప్రశ్న 3.
పై పేరాలో డబ్బుకు సంబంధించిన పదాలేవి?
జవాబు:
డబ్బుకు సంబంధించిన పదాలు అర్ధ, పావలా
ప్రశ్న 4.
‘పంటాం’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
పంట్లాం అంటే పేంటు / పొడుగులాగు
అపరిచిత గద్యాలు – ప్రశ్నలు
1. కింది గద్యభాగాన్ని చదవండి. కింద ఇచ్చిన నాలుగు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి, బ్రాకెట్లలో రాయండి. అంతరించిపోతున్న తెలుగుభాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.
వాక్యాలు
1. కందుకూరి పూర్తిపేరు వీరేశలింగం పంతులు. (ఒప్పు)
2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం. (తప్పు)
3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన. (తప్పు)
4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త. (ఒప్పు)
2. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాళాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్, ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వంద మైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టిల్ ఫ్రెర్, ఆసియాలో మొట్టమొదట తపాలాబిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సిండే డాక్ అనేవారు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు.
ప్రశ్న 2.
సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.
ప్రశ్న 3.
అణా అంటే ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు
ప్రశ్న 4.
సిండే డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్లోని కాపర్ టికెట్.
3. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అప్పటికి 200 సంవత్సరాల నుంచి ఆంగ్లేయుల కారణంగాను, అంతకు ముందు ఏడెనిమిది వందల ఏళ్ళ నుంచి తురుష్కుల కారణంగాను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసత్వంలో మగ్గుతున్న భారతజాతి దైన్యస్థితి నుంచి మేల్కొని 1857లో వీరోచితంగా ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని సాగించింది. కానీ ఆ చైతన్యాన్ని సైనికుల తిరుగుబాటు అంటూ తక్కువగా అంచనావేసి, ఆంగ్ల ప్రభుత్వం అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుని భారతదేశాన్ని పాలించడం. మొదలు పెట్టింది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
సుమారు ఏ సంవత్సరములో ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించారు?
జవాబు:
క్రీ.శ. 1600లో
ప్రశ్న 2.
తురుష్కులు భారతదేశాన్ని పాలించడం ఎప్పుడు మొదలుపెట్టారు?
జవాబు:
సుమారు క్రీ.శ 800లు లేక 900 సంవత్సరాల నుండి
ప్రశ్న 3.
సైనికుల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు:
క్రీ.శ. 1857
ప్రశ్న 4.
భారతదేశం ఆంగ్లేయుల పాలనలోకి పూర్తిగా ఎప్పటి నుంచి వెళ్ళింది?
జవాబు:
1857
4. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఉప్పు సత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి, ‘దేవరంపాడు’ శిబిరానికి ప్రాతినిధ్యం వహించేది. ఈ శిబిరం బాగా పనిచేసిందని ప్రశంసలు పొందింది. వివిధ గ్రామాల నుండి వందలమంది సత్యాగ్రహులు ఈ శిబిరానికి వచ్చేవారు. వారిని పోలీసులు అరెస్టు చేసేవారు. అయినా స్త్రీలు భయపడక ధైర్యంగా వారినెదుర్కొన్నారు. మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోని స్త్రీలు జంకలేదు. సత్యాగ్రహం మానలేదు.
శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులోను, దుర్గాబాయమ్మ చెన్నపూరిలోను, రుక్మిణమ్మ వేదారణ్యంలోనూ మరికొందరు స్త్రీలు భిన్న ప్రాంతాలలోనూ చూపిన సాహనోత్సాహములు, ఆంధ్రుల ప్రతిష్టను విస్తరింపజేశాయి అని ఆంధ్రపత్రిక 1932లో వీరిని ప్రశంసించింది.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
లక్ష్మీబాయమ్మ ఉప్పు సత్యాగ్రహంలో ఏ శిబిరానికి నాయకత్వం వహించింది?
జవాబు:
లక్ష్మీబాయమ్మ ‘దేవరంపాడు’ శిబిరానికి నాయకత్వం వహించింది.
ప్రశ్న 2.
సత్యాగ్రహులు శిబిరానికి ఎక్కడ నుండి వచ్చేవారు?
జవాబు:
సత్యాగ్రహులు వివిధ గ్రామాల నుండి శిబిరానికి వచ్చేవారు.
ప్రశ్న 3.
ఎన్నిసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు?
జవాబు:
మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
ప్రశ్న 4.
గుంటూరు ఉప్పు సత్యాగ్రహానికి నాయకురాలు ఎవరు?
జవాబు:
శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులో నాయకత్వం వహించింది.
5. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సమాజం ఎలా ఉండాలో తెలిపేది భారతం. సామాజిక జీవన విధానం ఎలా ఉండాలో కూడా భారతం తెలుపుతుంది. భారతంలో ఉన్నన్ని పాత్రలు ప్రపంచంలోని ఏ గ్రంథంలోనూ లేవు. భారతంలో కొన్ని వేల శ్లోకాలుంటాయి. కొన్నివేల పాత్రలుంటాయి. కొన్ని వేల సంఘటనలుంటాయి. కొన్ని వందల ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఎన్నిసార్లు చదివినా, మళ్లీ చదివి తెలుసుకోవలసినవి చాలా ఉంటాయి. ఒకటి రెండు సార్లు చదివితే అన్నీ తెలియవు.
ప్రశ్నలు:
ప్రశ్న 1.
మన జీవన విధానం తెలిపే గ్రంథమేది?
జవాబు:
మన జీవన విధానం భారతం తెల్పుతుంది.
ప్రశ్న 2.
భారతం ఎన్నిసార్లు చదవాలి?
జవాబు:
భారతం చాలాసార్లు చదవాలి.
ప్రశ్న 3.
భారతంలో శ్లోకాలెన్ని?
జవాబు:
భారతంలో కొన్నివేల శ్లోకాలున్నాయి.
ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
భారతంలో ఉపాఖ్యానాలెన్ని?
6. క్రింది పేరాను చదివి నాలుగు అర్థవంతమైన ప్రశ్నలు రాయండి. (SA-2: 2022-23)
ఒక పత్రికా నివేదిక ప్రకారము ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల మరణాలు సంభవించడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వైకల్యం చెందిన వారి పరిస్థితి దయనీయంగా మారుతోందని తెలిపారు. ప్రజల రక్షణ కోసమే పోలీసు శాఖ రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. 2016లో కారు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 1.50 లక్షలు కాగా, 2017లో ఆ సంఖ్య 1.47 లక్షలకు తగ్గింది. మరుసటి సంవత్సరం 2018లో ఇది పెరిగింది. భారతీయ రాష్ట్రాల్లో రహదారి భద్రతను మెరుగుపరచడానికి, కేంద్ర ప్రభుత్వం 2019లో మోటారు వాహనాల సవరణ బిల్లును ప్రారంభించింది.
1. 2016లో కారు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య ఎంత?
2. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల సవరణ బిల్లును ఎప్పుడు ప్రారంభించింది.
3. నిత్యం ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?
4. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ఏమి జరుగుతుంది?
7. కథను చదివి కింది ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి. (SA-2: 2023-24)
రఘుపతి రావు గారు చిన్నతనంలోనే తన విద్యార్జన, ధన సంపాదన పెద్ద పదవుల కోసమే కాకుండా నిరక్షరాస్యులైన ఇతరులకు పంచడానికి కూడా అని నిర్ణయించుకున్నాడు. అతని చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన తప్పక తెలుసుకోదగినది. ఈ సంఘటనలో అతను ఇప్పుడు మనం చెప్పుకున్న భావాన్ని తెలిపాడు. ఒకరోజు రఘుపతి బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు అతని తల్లి, “నాయనా, ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు? పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇంకా నీవు చదవడం, వ్రాయడం ప్రారంభించలేదా?” అని అడిగింది. “అమ్మా, నేను నా తోటి విద్యార్ధి, ప్రకాశ్ ఇంటికి వెళ్లి వచ్చాను. అతనికి గణితం సరిగా రాదు, కనుక గణితం నేర్పిస్తూ ఉన్నాను” అన్నాడు. “అరే, నువ్వు పెద్దవాడివైనావు, కానీ ఇప్పటి వరకు చదువు గురించి నీకు ఎటువంటి ఆలోచన లేదు.
నీ పరీక్షలకు సిద్ధపడకుండా, ఇతరుల పని చేస్తూ ఉన్నావు. ఎవరికైనా పాఠం చెప్పడానికి పరుగెత్తుకొని పోతావు. ఎవరికోసమైనా జాబు రాయడానికి తయారౌతావు. ఎవరికైనా మని ఆర్డర్ చెయ్యడానికి వెళ్తావు, నిరక్షరాస్యులకు చదువు చెప్పడానికి తయారౌతావు. ఇలా చేస్తూ పోతే, నువ్వు పరీక్షల్లో తప్పుతావు.” అని అంది. దానికి ప్రతిస్పందనగా, “అమ్మా! నన్ను పాఠశాలకు ఎందుకు పంపుతున్నారు?” అని తల్లిని అడిగాడు. అప్పుడు తల్లి “నువ్వు చదువుకోవడం వలన ఒక పెద్ద అధికారివి కావచ్చు. మంచి వేతనాన్ని పొందవచ్చు మరియు ఉత్తమంగా జీవించవచ్చు. వీటన్నింటి కొరకు నిన్ను బడికి పంపుతున్నాము” అన్నది.
రఘుపతి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. “కానీ అమ్మా, నిరక్షరాస్యులైన ప్రజలు కూడా తమ జీవితాన్ని గడుపుతున్నారు అప్పుడు నాకు మరియు నిరక్షరాస్యులకు మధ్య తేడా ఏమిటి ? “నాకు తెలియదు, నీవే చెప్పు” అని అమ్మ అంది. రఘుపతి ఈ విధంగా తల్లికి వివరించాడు” అమ్మా, చదువుకునే వారికి మాత్రమే ఉపయోగపడే చదువుకు అర్థం లేదు. చదువు చదువుకున్న వారితో పాటుగా ఇతరులకు కూడా ఉపయోగపడినప్పుడే దానికి సార్ధకత. తనకు లభించిన చదువు ద్వారా ఎవరైతే అతి పెద్ద సంఖ్యలో ప్రజలకు మేలుచేస్తారో అప్పుడే వారి చదువు సార్ధకమౌతుంది.” ఆయనవి ఎంత ఉన్నతమైన భావాలు, విద్య దాని నిజమైన ప్రాముఖ్యత మీద ఎంత గొప్ప వివరణ.
1. రఘుపతిరావు చిన్నతనంలోనే ఏమి నిర్ణయించుకున్నాడు? (బి)
ఎ) పెద్ద పదవులు పొందాలని
బి) నిరక్షరాస్యులకు సహాయపడాలని
సి) ఎక్కువ ధనం సంపాదించాలని
డి) తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని
జవాబు:
బి) నిరక్షరాస్యులకు సహాయపడాలని
2. రఘుపతిరావు తన చదువును వదలి ఇతరులకు సహాయపడడం చూసి తల్లి ఏమన్నది? (బి)
ఎ) చాలా మంచి పని చేస్తున్నావు.
బి) ఇలా చేస్తే నువ్వు పరీక్షలో తప్పుతావు.
సి) ఇలా చేస్తే నీకు మంచి మార్కులు వస్తాయి.
డి) ఇలా చేయడం కొరకే నిన్ను బడికి పంపుతున్నాను.
జవాబు:
బి) ఇలా చేస్తే నువ్వు పరీక్షలో తప్పుతావు.
3. రఘుపతిరావు దృష్టిలో చదువు ఎప్పుడు సార్ధకమౌతుంది? (సి)
ఎ) పెద్ద పదవులు పొందినప్పుడు.
బి) చదువుకున్న వారికి మాత్రమే ఉపయోగపడినప్పుడు.
సి) తన చదువు ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు మేలు చేసినప్పుడు.
డి) ఎక్కువ ధనం సంపాదించినప్పుడు.
జవాబు:
సి) తన చదువు ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు మేలు చేసినప్పుడు.
వ్యక్తీకరణ-సృజనాత్మకత
అ) క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఆనాటి బడి ఎలా ఉండేది?
జవాబు:
రచయిత చిన్నతనంలో బడి- అంటే వీధి ఐడియే. ఉపాధ్యాయుని గడ్డి యింటి ముందరి ఖాళీ స్థలమే వీధిబడి. కనీసం వీధికి దానికి మధ్య గోడ కూడా లేదు, బడిలో పిల్లలు గోచీలతో వచ్చేవారు. నేలపై కూర్చొనేవారు. నేలపైనే అక్షరాలు వ్రాసుకొని నేర్చుకొనేవారు. కొంతమంది చిన్నచిన్న తాటాకు చాపలను తెచ్చుకొని కూర్చొనేవారు ఆ రోజులలో బెంచీలు వాడుకలో లేవు.
ప్రశ్న 2.
ఆ రోజులలో బడివేళలు ఎలా ఉండేవి?
జవాబు:
ఆ రోజులలో బడిపిల్లలు సూర్యోదయానికి ముందే బడికి వచ్చేవారు మొదట వచ్చిన వారి చేతిలో సిరీ అని ఉపాధ్యాయులు పెట్టేవారు. తర్వాత వచ్చిన వారి చేతిలో చుక్క పెట్టేవారు. 8 గంటలకు ఇళ్లకు వెళ్లేవారు. మజ్జిగన్నం తిని వచ్చేవారు. మధ్యాహ్నం 11 గంటల వరకు చదువుకొనేవారు. 11 గంటల నుండి రెండు గంటల వరకు భోజన విరామం. 2 గంటల నుండి సూర్యాస్తమయం వరకు చదువుకొని ఇంటికి వెళ్లేవారు.
ప్రశ్న 3.
ఆ రోజులలో ఏమేమి చదువుకొనేవారు?
జవాబు:
ఆ రోజులలో నేల మీద అక్షరాలు వ్రాసి నేర్చుకోవడంతో చదువు ప్రారంభమయ్యేది. క్రమక్రమంగా పలక మీద అక్షరాలు, గుణింతాలు వ్రాయడం నేర్చుకొనేవారు. తర్వాత బాల శిక్షలోని చిన్న చిన్న మాటలను వ్రాసేవారు. ఈ విధంగా మొదటి సంవత్సరం వ్రాతను, బాలశిక్షను చదవడం నేర్చుకొనేవారు. ఉదయం, సాయంత్రం ఎక్కాలను చదివేవారు. రెండవ సంవత్సరంలో భిన్నాలు, గణిత భావనలు, కూడికలు, తీసివేతలు, గుణకార, భాగహారాలు, వడ్డీ లెక్కలు నేర్చుకొనేవారు. భారతం (లేదా) భాస్కర రామాయణం చదివేవారు. సుమతీ శతకం, వేమన శతకం, రుక్మిణీ కళ్యాణంలలో ‘ పద్యాలు చదివేవారు.
ప్రశ్న 4.
మీ తరగతిలో నీకు ఇష్టమైన స్నేహితులు ఎవరు ? వారితో కలిసి ఆడుకున్న ఆటలు, తిరిగిన ప్రదేశాల గురించి 4 వాక్యాలు రాయండి.
జవాబు:
మీ తరగతిలో నీకు ఇష్టమైన స్నేహితులు …………., …………., …………., …………. వారితో కలిసి నేను కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మొదలైన ఆటలు ఆడుకున్నాను. మా ఊరిలో దేవాలయాలు, మార్కెట్ ప్రదేశాలు తిరిగాము, అప్పుడప్పుడు సినిమాలకు కలిసి వెళతాము.
ప్రశ్న 5.
దేశ అభివృద్ధికి విద్య ఆవశ్యకతను గురించి 4 వాక్యాలు రాయండి.
జవాబు:
- విద్య వలన జ్ఞానం పెరుగుతుంది. ఏది మంచో, ఏది చెడో తెలుసుకొనే విచక్షణ కలుగుతుంది. వివేకం పెరుగుతుంది.
- విచక్షణ, వివేకం పెరిగిన దేశ పౌరుల వలన దేశం అభివృద్ధి చెందుతుంది.
- విద్య వలన దేశ పౌరులకు ఉద్యోగం వస్తుంది. సంపాదన పెరుగుతుంది.
- పౌరులందరూ సంపాదన పరులైతే దేశము ఆర్ధికముగా ముందంజలో ఉంటుంది. తద్వారా దేశము అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తుంది.
ప్రశ్న 6.
కింది చిత్రాన్ని గురించి రెండు వాక్యాలు రాయండి.
జవాబు:
- చిత్రంలో ఇద్దరు బాలురు దుంగమీద గుండా కాలువను దాటుతున్నారు.
- వారు పడిపోకుండా నిలకడగా ఉండటానికి చేతులను ఊపుకుంటూ నడుస్తున్నారు.
ఆ) క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఆ రోజులలో విద్యార్థుల ఉత్తీర్ణత ఎలా ఉండేది?
జవాబు:
ఆ రోజులలో విద్యార్థులకు బాలశిక్షయే పాఠ్యగ్రంథం, మొదటి రెండు సంవత్సరాలలో బాలశిక్షనే నేర్చుకొనేవారు.
ప్రతి సంవత్సరం పాఠశాల తనిఖీకి జనస్పెక్టరుగారు వచ్చేవారు. ఆయనే పిల్లలను ప్రశ్నించేవారు. ఆయన సంతృప్తి చెందితే ఉత్తీర్ణులను చేసేవారు. పిల్లల సమాధానాలు ఆయనకు సంతృప్తికరంగా లేకపోతే మరుసటి సంవత్సరం కూడా విద్యార్ధి అదే తరగతి చదవాలి. వ్రాత పరీక్ష లుండేవికావు. మౌలిక పరీక్షనే పెట్టేవారు. ప్రతి విద్యార్థిని ఇనస్పెక్టరుగాలే పరీక్షించేవారు. అందుచేత కాపీలకు అవకాశం లేదు. సామూహిక వ్రాత పరీక్షలు లేవు, అందుచేత చదువు సరిగ్గారాని విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేవారు కాదు. ఎటువంటి పక్షపాతానికి, కాపీలకు అవకాశం లేదు. అందుచేత ఉత్తీర్ణత కచ్చితంగా, పారదర్శకంగా ఉండేది. ఉత్తీర్ణులు ఐనవారంతా నిజంగా యోగ్యులే ఉండేవారు.
ప్రశ్న 2.
నాడు, నేడు విద్యావ్యవస్థలో ఉపాధ్యాయుల గౌరవాన్ని గురించి విశ్లేషించండి.
జవాబు:
నాటి విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులకు చాలా గౌరవం ఉండేది. ఉపాధ్యాయుని ఆదేశాలను ఎవ్వరూ అతిక్రమించేవారు కాదు. అన్యధా భావించేవారు కాదు. ఉపాధ్యాయుడు చెప్పినట్లు విని, చదువుకొంటేనే ఉత్తీర్ణులయ్యేవారు. సరిగ్గా చదువుకోకపోతే అదే తరగతిలో ఉండాలి. అందుకే విద్యార్థులు ఉపాధ్యాయుని పట్ల భయభక్తులతో గౌరవంతో ఉండేవారు. విద్యార్థులు రోజంతా ఉపాధ్యాయుని దగ్గరే గడిపేవారు. అన్ని సబ్జెక్టులకూ ఒకరే ఉపాధ్యాయులు.
రకరకాల కారణాల వలన నేటి విద్యావ్యవస్థలో ఉపాధ్యాయునకు తగినంత గౌరవం లభించడం లేదు. చదువు నేర్చుకొందుకు వచ్చే విద్యార్థులలో ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య భావం పెరిగిపోతోంది. ఉపాధ్యాయుని గురువుగా కాకుండా ఒక ఉద్యోగిగా భావిస్తున్నారు. పొరపాటున ఉపాధ్యాయుడు మందలించే ప్రయత్నం చేసినా అనేక ప్రమాదాల నెదుర్కోవాలి. ఇవన్నీ గమనిస్తున్న సామాన్య విద్యార్థికి కూడా ఉపాధ్యాయుని గౌరవించక పోయినా ఏమీ చేయలేడు. కనుక గౌరవించనవసరం లేదనే భావన ఎక్కువైపోతోంది.
ఈ ధోరణి మంచిది కాదు తల్లిని, తండ్రిని, ఉపాధ్యాయుని అందరూ గౌరవించాలి.
ప్రశ్న 3.
నేటి కొందరు విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంటే బాగుంటుంది?
జవాబు:
కొందరు విద్యార్థులు చదువు కంటే టీ.వి.కె. సెల్ఫోన్లకి ప్రాధాన్యతనిస్తున్నారు. అంది మంచిది కాదు. విద్యావిషయకంగా క్రొత్తవాటిని తెలుసుకొందుకు సెల్ఫోను ఉపయోగించడం తప్పుకాదు వీడియోగేమ్స్ ఆడటానికి, గేములు ఆడడానికి వినియోగించడం తప్పు. దాని వలన చాలామంది డబ్బును కూడా నష్టపోతున్నారు.
కొందరు విద్యార్థులు తరగతి గదిలో కూడా నిర్లక్ష్యధోరణితో ఉంటారు. పాఠం వినరు. నోట్సు వ్రాయరు. అల్లరి మానరు. ఈ ధోరణి మంచిది కాదు. ఉపాధ్యాయులకు సమాధానాలు నిర్లక్ష్యంగా చెబుతారు. ఇది పద్ధతి కాదు. విద్యార్థి దశలోనే వినయం, మంచి ప్రవర్తన, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ఆటలపై కంటే చదువుపై శ్రద్ధ పెంచుకోవాలి. సెల్ఫోనన్ను అవసరమైన మేరకే వినియోగించుకోవాలి. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను గౌరవించాలి. వారికి వినయంగా సమాధానం చెప్పాలి. ఉపాధ్యాయుల అభిమానాన్ని సంపాదిస్తే ఎన్ని విషయాలైనా నేర్చుకోవచ్చు. ఎంత జ్ఞానం ఐనా సంపాదించవచ్చు. ఎంతో ఉన్నత స్థితికి వెళ్లవచ్చు.
ప్రశ్న 4.
నువ్వు నీ చదువు గురించి, అలాగే మీ నాన్నగారు తన చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్న విధానం గురించి ముచ్చటించుకుంటున్నారు. మీ మధ్య నడిచిన సంభాషణను (8-10) వాక్యాలు మించకుండా వివరించండి. (SA-2:2022-23)
జవాబు:
కొడుకు : నాన్నా! మీ చిన్నప్పుడు డిజిటల్ క్లాస్ట్రూమ్స్ ఉండేవా?
తండ్రి : డిజిటల్ క్లాస్ట్రూమ్స్ ఏమిట్రా? అసలు క్లాస్ట్రూమ్స్ ఉండేవి కావు.
కొడుకు : మరెక్కడ చదువుకునేవారు?
తండ్రి : మా ఊరి కరణంగారి వీధి అరుగే మా బడి.
కొడుకు : మరి మీకు బెంచీలు ఉండేవా?
తండ్రి : అందరం నేలమీదే కూర్చుండేవాళ్ళం.
కొడుకు : మీకు ప్రతీ సబ్జెక్టు ఒక మేష్టారు ఉండేవారా?
తండ్రి : మాకు అన్ని సబ్జెక్ట్ కు ఒకే మేష్టారు.
కొడుకు : మీకు సిలబస్ ఏముండేది?
తండ్రి : మాకు పెద్ద బాలశిక్ష చదివించేవారు.
కొడుకు : పెద్ద బాలశిక్షా! అది చదివితే ఏమొస్తుంది?
తండ్రి : ఓహో! అత్యుత్సాహము ఏ సంధి?
కొడుకు : సంధి పేరు గుర్తులేదు?
తండ్రి : ఇదే మీకు మాకూ తేడా, మా కాలంలో రెండవ తరగతి విద్యార్థులకే అది యణాదేశ సంధి అని తెలుసు. మీకు సౌకర్యాలు పెరిగాయి తప్ప చదువుపై శ్రద్ధ, గురుభక్తి తగ్గింది.
కొడుకు : లేదు. నాన్నా బాగా చదువుకొంటాను.
తండ్రి : శభాష్! బాగా చదువుకునే మంచి మార్కులు తెచ్చుకోవాలి.
భాషాంశాలు
బహుళైచ్ఛిక ప్రశ్నలు
పదజాలం
అర్థాలు : గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
1. గోరింటాకు పెట్టినపుడు చేతిలో చుక్కలు పెడతారు. (ఎ)
ఎ) బిందువు
బి) సిరా
సి) అందం
డి) ముద్ర
జవాబు:
ఎ) బిందువు
2. మా అయ్యవారు తెలుగు బాగా చెబుతారు. (సి)
ఎ) యజమాని
బి) గొప్పవారు
సి) ఉపాధ్యాయులు
డి) సర్పంచ్
జవాబు:
సి) ఉపాధ్యాయులు
3. చల్లన్నం ఒంటికి మంచిది. (బి)
ఎ) చద్దన్నం
బి) మజ్జిగ అన్నం
సి) చల్లారిన అన్నం
డి) వేడన్నం
జవాబు:
బి) మజ్జిగ అన్నం
4. పనిని ప్రారంభం చేస్తే పూర్తి చేయాలి. (డి)
ఎ) ముగింపు
బి) కొనసాగింపు
సి) అంద
డి) మొదలు
జవాబు:
డి) మొదలు
5. హనుమంతుడు సునాయాసంగా సముద్రం దాటెను. (బి)
ఎ) కష్టంగా
బి) సులభంగా
సి) ఆయాసంతో
డి) తొందరగా
జవాబు:
బి) సులభంగా
6. ఎక్కాలను వల్లించడం మంచిది. (ఎ)
ఎ) చదవటం
బి) వ్రాయటం
సి) వేయడం
డి) నేర్పడం
జవాబు:
ఎ) చదవటం
7. పూర్వం గోచీతో పనులలోకి వచ్చేవారు.(డి)
ఎ) లుంగీ
బి) నిక్కరు
సి) తువ్వాలు
డి) కౌపీనం
జవాబు:
డి) కౌపీనం
8. మంచి దుస్తులు ధరించాలి. (సి)
ఎ) చొక్కాలు
బి) బూట్లు
సి) బట్టలు
డి) చెట్టులు
జవాబు:
సి) బట్టలు
9. ఎవరి విధానం వారిది. (బి)
ఎ) సంపాదన
బి) పద్ధతి
సి) ఉద్యోగం
డి) గౌరవం
జవాబు:
బి) పద్ధతి
10. ఈ కంప్యూటరు యుగంలో పేనాతో కూడా పనిలేదు. (సి)
ఎ) విద్యుత్
బి) పుస్తక
సి) కలము
డి) నల్లబల్ల
జవాబు:
సి) కలము
11. పిల్లలకు మావులు నేర్పాలి. (బి)
ఎ) కూడికలు
బి) గణిత ప్రమాణాలు
సి) లెక్కలు
డి) తీసివేతలు
జవాబు:
బి) గణిత ప్రమాణాలు
12. పూర్వం దసరాకు విద్యార్థులచే కోతికొమ్మంచి పట్టించేవారు. (ఎ)
ఎ) గిలక
బి) పద్యం
సి) బాణాలు
డి) పాటలు
జవాబు:
ఎ) గిలక
13. ఇప్పుడు పావలాలు లేవు. (డి)
ఎ) పావురం
బి) పిచిక
సి) కాసు
డి) 25 పైసల నాణెం
జవాబు:
డి) 25 పైసల నాణెం
14. దసరాకు పిల్లలు విల్లంబులతో తిరిగేవారు. (ఎ)
ఎ) ధనుస్సు, బాణాలు
బి) పుస్తకాలు
సి) పెన్నులు
డి) ఆనందం
జవాబు:
ఎ) ధనుస్సు, బాణాలు
15. నేడు విద్యావ్యవస్థలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. (సి)
ఎ) స్వరూపాలు
బి) స్వభావాలు
సి) మార్పులు
డి) చేర్చులు
జవాబు:
సి) మార్పులు
నానార్థాలు : గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
16.. ఏ యుగం ధర్మం ఆ యుగానిదే. (సి)
ఎ) సంధి, సంధికాలం
బి) కృతయుగం, త్రేతాయుగం
సి) జత, కాల పరిణామ విశేషం
డి) జత, జంట
జవాబు:
సి) జత, కాల పరిణామ విశేషం
17. మంచి పద్ధతి అలవరచుకోవాలి. (ఎ)
ఎ) బాట, విధానం
బి) బాట, మార్గం
సి) విధానం, విధం
డి) విధం, వితం
జవాబు:
ఎ) బాట, విధానం
18. ప్రతి ఉదయం ఆనందాన్నిస్తుంది. (బి)
ఎ) ప్రొద్దున, ప్రాతఃకాలం
బి) పుట్టుక, ప్రాతఃకాలం
సి) పుట్టుక, జన్మ
డి) ఒకటి, రెండు
జవాబు:
బి) పుట్టుక, ప్రాతఃకాలం
19. విద్యకు సాటి బన ధనం లేదు.(డి)
ఎ) చదువు, అధ్యయనం
బి) బడి, పాఠశాల
సి) గురువు, పండితుడు
డి) చదువు, జ్ఞానం
జవాబు:
డి) చదువు, జ్ఞానం
20. ప్రతి ఇంట కల్యాణం జరగాలి. (ఎ)
ఎ) పెండ్లి, శుభం
బి) పెండ్లి, వివాహం
సి) విందు, వినోదం
డి) వినోదం, ఆనందం
జవాబు:
ఎ) పెండ్లి, శుభం
21. ఎవ్వరైనా ప్రభుత్వం మాట వినాలి. (సి)
ఎ) రాజు, రేడు
బి) రాచరికం, రాజ్యం
సి) రాచరికం, అధికారం
డి) అధికారం, ఆజ్ఞ
జవాబు:
సి) రాచరికం, అధికారం
22. యజమాని అన్నిటికీ బాధ్యుడు. (డి)
ఎ) యజ్ఞం, యజ్ఞకర్త
బి) మగడు, పతి
సి) గృహస్తు, ఇంటివాడు
డి) యజ్ఞకర్త, ఇంటిపెద్ద
జవాబు:
డి) యజ్ఞకర్త, ఇంటిపెద్ద
23. ఎప్పటికైనా బదులు తీర్చాలి. (ఎ)
ఎ) మారు, అప్పు
బి) అప్పు, ఋణం
సి) మారు, వేమారు
డి) మాదిరి, మావి
జవాబు:
ఎ) మారు, అప్పు
24. ప్రతీదీ దీర్ఘంగా ఆలోచించకూడదు. (సి)
ఎ) పొడుగు, పొడగరి
బి) హ్రస్వం, దీర్ఘం
సి) విడుద, దూరమైనది
డి) దగ్గర, దూరం
జవాబు:
సి) విడుద, దూరమైనది
25. చిన్నతనంలో పలక అంటే ఇష్టం. (బి)
ఎ) పలక, బలపం
బి) వ్రాయదగిన సాధనం, బల్ల
సి) బల్ల, చిత్రం
డి) చిన్నపలక, ప్లేట్
జవాబు:
బి) వ్రాయదగిన సాధనం, బల్ల
ప్రకృతి – వికృతులు గీత గీసిన పదానికి అడిగిన విధంగా గుర్తించండి.
26. అన్నివిధములా ఆలోచించాలి – గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) వితము
బి) వితానం
సి) విధానం
డి) విధి
జవాబు:
ఎ) వితము
27. బోనము మితంగా తినాలి- గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి. (డి)
ఎ) తిండి
బి) బూరెలు
సి) భుక్తి
డి) భోజనము
జవాబు:
డి) భోజనము
28. ఎవరి ప్రాంతము వారికిష్టం – గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి. (బి)
ఎ) ప్రాంతం
బి) పొంత
సి) బొంత
డి) పంతం
జవాబు:
బి) సొంత
29. అసలు కంటె వడ్డీ ముద్దు – గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి. (సి)
ఎ) డబ్బు
బి) వడ్డీ డబ్బు
సి) వృద్ధి
డి) ఒద్దే
జవాబు:
సి) వృద్ధి
30. శుక్రుడు రాక్షస గురువు – గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) చుక్క
బి) సుక్క
సి) శుక్క
డి) చొక్క
జవాబు:
ఎ) చుక్క
31. సిరి గలవాడేమైనా చేస్తాడు – గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి. (సి)
ఎ) సిరీ
బి) శ్రీలు
సి) శ్రీ
డి) ధనం
జవాబు:
సి) శ్రీ
32. ఒక లక్ష్యం కోసం బ్రతకాలి – గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి. (బి)
ఎ) లచ్చ
బి) లెక్క
సి) లక్ష్య
డి) లచ్చనం
జవాబు:
బి) లెక్క
33. పొత్తము పాడుచేయకూడదు – గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి. (డి)
ఎ) పుట్ట
బి) పొత్రము
సి) పాత్ర
డి) పుస్తకము
జవాబు:
డి) పుస్తకము
34. అమావాస్య పవిత్రమైన రోజు – గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి. (డి)
ఎ) మమావాశ్య
బి) అమ్మావాస
సి) అమవ్యాస
డి) అమవస
జవాబు:
డి) అమవస
35. మంచి మదిలో దైవం ఉంటాడు – గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి. (ఎ)
ఎ) మతి
బి) మతం
సి) మంత్రం
డి) మధిర
జవాబు:
ఎ) మతి
36. విదియ మంచి తిథి – గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి. (సి)
ఎ) పాడ్యమి
బి) ఏకాదశి
సి) ద్వితీయ
డి) దశమి
జవాబు:
సి) ద్వితీయ
37. విజ్ఞానం ఎక్కువ సంపాదించాలి – గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి. (బి)
ఎ) విజ్ఞత
బి) విన్నాణము
సి) జ్ఞానం
డి) తెలివి
జవాబు:
బి) విన్నాణము
38. యజమాని విశ్వాసం సేవకుడు పొందాలి – గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి. (డి)
ఎ) విశ్వసము
బి) శ్వసము
సి) విశ్వము
డి) విసువాసము
జవాబు:
డి) విసువాసము
39. ఎప్పుడూ హర్షముతో ఉండాలి – గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి. (ఎ)
ఎ) అరసము
బి) అరిసెము
సి) అరుసము
డి) అరిగె
జవాబు:
ఎ) అరసము
40. ఉపాధ్యాయుడు గౌరవార్హుడు – గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి. (సి)
ఎ) బొజ్జ
బి) ఉజ్జ
సి) ఒజ్జ
డి) ఊర్థము
జవాబు:
సి) ఒజ్జ
వ్యుత్పత్త్యర్థాలు: : గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
41. ప్రతి సంవత్సరము ఏవో సమస్యలు వస్తాయి.
ఎ) నెలలు ఉండును
బి) వారాలు ఉండును
సి) ఋతువులు దీనియందు వశించును
డి) రోజులు దీనియందుండును
జవాబు:
సి) ఋతువులు దీనియందు వశించును
42. జనించుటయే – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) పుట్టుక
బి) జన్మ
సి) ఉద్బవం
డి) ఉదయం
జవాబు:
బి) జన్మ
43. ప్రతి దినము హుషారుగా గడపాలి. (డి)
ఎ) రోజు
బి) దివసము
సి) సూర్యుడు కలది
డి) అంధకారమును ఖండించునది
జవాబు:
డి) అంధకారమును ఖండించునది
44. ప్రియము యొక్క భావము – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) ప్రేమ
బి) ప్రియుడు
సి) ప్రియ
డి) ఇష్టం
జవాబు:
ఎ) ప్రేమ
45. రామాయణము పారాయణ గ్రంథము. (సి)
ఎ) పద్యాలు గలది
బి) కథ గలది
సి) గ్రంథి కలది
డి) వచనం కలది
జవాబు:
సి) గ్రంథి కలది
46. నాశనం లేనిది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) క్షరము
బి) అక్షరము
సి) ధ్వక్షరము
డి) త్ర్యక్షరము
జవాబు:
ఎ) క్షరము
47. పాదముల చేత కొట్టబడినది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (డి)
ఎ) పదం
బి) శబ్దం
సి) కావ్య
డి) పద్ధతి
జవాబు:
డి) పద్ధతి
48. వ్యాపారముల యందు ప్రేరేపించువాడు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (సి)
ఎ) వ్యాపారి
బి) పాలకుడు
సి) సూర్యుడు
డి) చంద్రుడు
జవాబు:
సి) సూర్యుడు
49. సూర్యుని అస్తమయంతో చీకటి వచ్చింది. (సి)
ఎ) అంతరించుట
బి) కనిపించుట
సి) గ్రహనక్షత్రాలకు అప్రకాశం కలిగించును
డి) లేకుండుట
జవాబు:
సి) గ్రహనక్షత్రాలకు అప్రకాశం కలిగించును
50. దీనియందు సూర్యాదులు, ఉదయింతురు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) తూర్పు
బి) ఉదయం
సి) జన్మ
డి) ప్రొద్దున
జవాబు:
బి) ఉదయం
51. సుఖమును పొందించునది – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) కల్యాణము
బి) వివాహం
సి) పర్వం
డి) పండుగు
జవాబు:
ఎ) కల్యాణము
52. మన సంప్రదాయము విడువకూడదు. (డి)
ఎ) ఆచారం
బి) చేయదగినది
సి) తెలుసుకోదగినది
డి) లెస్సగా శిష్యులకుపదేశింపబడునది
జవాబు:
డి) లెస్సగా శిష్యులకుపదేశింపబడునది
53. దీనిచేత ఊరడిల్లుదురు – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (బి)
ఎ) ప్రేమ
బి) విశ్వాసము
సి) అనురాగం
డి) ఆప్యాయత
జవాబు:
బి) విశ్వాసము
54. దీనిచేత శిక్షించబడును – వ్యుత్పత్తి పదం గుర్తించండి. (ఎ)
ఎ) శాస్త్రం
బి) చట్ట
సి) న్యాయం
డి) ధర్మం
జవాబు:
ఎ) శాస్త్రం
55. రాత్రి బయట తిరగడం మంచిది కాదు. (సి)
ఎ) చీకటి కలది
బి) వెన్నెల కలది
సి) సుఖమును ఇచ్చునది
డి) భయం కల్గించేది
జవాబు:
సి) సుఖమును ఇచ్చునది
వ్యాకరణాంశాలు
సంధులు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
56. రాఘవాచార్యులు మంచి గురువు – సంధి పేరు గుర్తించండి. (సి)
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) సవర్ణదీర్ఘసంధి
డి) ఇత్వసంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘసంధి
57. వేంకటేశం కన్యాశుల్కంలో ఒక పాత్ర – విడదీసి రాయండి. (ఎ)
ఎ) వేంకట + ఈశం
బి) వేంక + టేశం
సి) వి + ఏంకటేశం
డి) వేంకటే + ఈశం
జవాబు:
ఎ) వేంకట + ఈశం
58. కుమారుడని అతిగారం చేయకూడదు – గీతగీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (బి)
ఎ) సవర్ణదీర్ఘసంధి
బి) ఉత్వసంధి
సి) అత్వసంధి
డి) ఇత్వసంధి
జవాబు:
బి) ఉత్వసంధి
59. క్రింది వానిలో లు,ల,న,ల సంధి పదం గుర్తించండి. (డి)
ఎ) రాజ్యాధికారం
బి) చింతాకు
సి) నవ్వులాట
డి) కాగితాలు
జవాబు:
డి) కాగితాలు
60. తాటాకు పందిరి చల్లగా ఉంటుంది – సంధి పేరు గుర్తించండి. (బి)
ఎ) అత్వసంధి
బి) ఇత్వసంధి
సి) ఉత్వసంధి
డి) సంధి లేదు
జవాబు:
బి) ఇత్వసంధి
61. అప్పుడప్పుడు ఆడుకోవాలి – సంధి పేరు గుర్తించండి. (సి)
ఎ) అత్వసంధి
బి) ఇత్వసంధి
సి) ఆమ్రేడితసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
సి) ఆమ్రేడితసంధి
62. ముందు + అడుగు – సంధి కలిపి వ్రాయండి. (డి)
ఎ) ముందుడుగు
బి) ముందాడుగు
సి) ముందు అడుగు
డి) ముందడుగు
జవాబు:
డి) ముందడుగు
63. కృతార్థుడు సంధి విడదీసిన రూపం గుర్తించండి. (బి)
ఎ) కృతా + అర్థుడు
బి) కృత + అర్హుడు
సి) కృతి + అర్థుడు
డి) కృతే + అర్థుడు
జవాబు:
బి) కృత + అర్హుడు
64. క్రింది వానిలో రెండు సంధులు కల పదం గుర్తించండి. (డి)
ఎ) పిల్లలందరు
బి) మొదలైన
సి) వారంతా
డి) కృతార్థులైనారు
జవాబు:
డి) కృతార్థులైనారు
65. అక్షరాల – సంధి విడదీసిన రూపం గుర్తించండి. (ఎ)
ఎ) అక్షరము + ల
బి) అక్ష + రాల
సి) అక్షర + ఆల
డి) అక్షర + ల
జవాబు:
ఎ) అక్షరము + ల
66. ప్రారంభము + అయ్యేదిసంధి కలిపిన రూపం గుర్తించండి. (సి)
ఎ) ప్రారంభం ఏది
బి) ప్రారంభమేది
సి) ప్రారంభమయ్యేది
డి) ప్రారంభేది
జవాబు:
సి) ప్రారంభమయ్యేది
67. ప్రారంభం సంధి విడదీసిన రూపం గుర్తించండి. (డి)
ఎ) ప్రా + ఆరంభం
బి) ప్రారం + భం
సి) ఇది సంధిపదం కాదు
డి) ప్ర+ ఆరంభం
జవాబు:
డి) ప్ర+ ఆరంభం
68. క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధి పదం గుర్తించండి. (బి)
ఎ) శ్రీరామ
బి) విద్యార్థి
సి) పాఠశాల
డి) చింతాకు
జవాబు:
బి) విద్యార్థి
69. భాగహారాలు నేర్వాలి సంధి విడదీయండి. (ఎ)
ఎ) భాగహారము + లు
బి) భాగా + హారములు
సి) భాగహ + ఆరములు
డి) భాగహార + ములు
జవాబు:
ఎ) భాగహారము + లు
70. క్రింది వానిలో లు, ల, న, ల సంధి పదం గుర్తించండి. (సి)
ఎ) భారతార్థం
బి) భాగవతం
సి) పద్యాలు
డి) విద్యులు
జవాబు:
సి) పద్యాలు
సమాసాలు: కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
71. ప్రథమా తత్పురుష సమాసమునకు ఉదాహరణలు గుర్తించండి. (బి)
ఎ) సాంఘిక శాస్త్రం
బి) మధ్యాహ్నం
సి) సాయంత్రం
డి) ఉదయకాలం
జవాబు:
బి) మధ్యాహ్నం
72. జన్మదినం ఏ తత్పురుష సమాసం? (ఎ)
ఎ) ద్వితీయ
బి) తృతీయ
సి) చతుర్థీ
డి) షష్ఠీ
జవాబు:
ఎ) ద్వితీయ
73. పూరిల్లు – విగ్రహవాక్యం గుర్తించండి. (సి)
ఎ) పూరి యొక్క ఇల్లు
బి) పూరి వలన ఇల్లు
సి) పూరితో ఇల్లు
డి) పూరియైన ఇల్లు
జవాబు:
సి) పూరితో ఇల్లు
74. సూర్యుని యొక్క ఆస్తమయం సమాస పదం గుర్తించండి. (డి)
ఎ) సూర్యస్తమయం
బి) అస్తమయ సూర్యుడు
సి) సూర్యోస్తమయం
డి) సూర్యాస్తమయం
జవాబు:
డి) సూర్యాస్తమయం
75. క్రింది వానిలో సప్తమీ తత్పురుష సమాసపడం గుర్తించండి. (ఎ)
ఎ) వీధిబడి
బి) ఉన్నత విద్య
సి) నాటి చదువు
డి) విద్యార్థి
జవాబు:
ఎ) వీధిబడి
76. క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాస పదం గుర్తించండి. (సి)
ఎ) నెల్లూరు
బి) జిల్లా
సి) నెల్లూరు జిల్లా
డి) గ్రామం
జవాబు:
సి) నెల్లూరు జిల్లా
77. నల్లనైన బల్ల – సమాసపదం గుర్తించండి. (బి)
ఎ) బల్ల నలుపు
బి) నల్లబల్ల
సి) నలుపే బల్ల
డి) నలుపైన బల్ల
జవాబు:
బి) నల్లబల్ల
78. ప్రతి ఒక్కరు చదువుకోవాలి – విగ్రహవాక్యం గుర్తించండి. (డి)
ఎ) ప్రతియైన ఒక్కరు
బి) ఒక్కరైన ప్రతి
సి) ప్రతీది ఒక్కరే
డి) ఒక్కరు ఒక్కరు
జవాబు:
డి) ఒక్కరు ఒక్కరు
79. బస్సులో 8 గంటలు కూర్చొన్నాను – సమాసం పేరు గుర్తించండి. (ఎ)
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వం
సి) బహువ్రీహి
డి) బహుపద ద్వంద్వం
జవాబు:
ఎ) ద్విగు సమాసం
80. ప్రేమయును, అభిమానమును సమాస పదం గుర్తించండి. (సి)
ఎ) ప్రేమ అభిమానం
బి) ప్రేమతో అభిమానం
సి) ప్రేమాభిమానాలు
డి) అభిమానం ప్రేమ
జవాబు:
సి) ప్రేమాభిమానాలు
81. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదం గుర్తించండి. (బి)
ఎ) మాబడి
బి) పినతల్లి
సి) రెండు గంటలు
డి) పురిణి గ్రామం
జవాబు:
బి) పినతల్లి
82. అనాదిగా ధర్మం గెలిచింది సమాసం పేరు గుర్తించండి. (డి)
ఎ) బహువ్రీహి
బి) ద్విగువు
సి) సమాసం కాదు
డి) నఞ్ తత్పురుష సమాసం
జవాబు:
డి) నఞ్ తత్పురుష సమాసం
83. విద్యార్థి విగ్రహవాక్యం గుర్తించండి. (సి)
ఎ) విద్య చేత అర్థి
బి) విద్య యొక్క అర్థి
సి) విద్యను అర్థించువాడు
డి) విద్య వలన ఆర్థి
జవాబు:
సి) విద్యను అర్థించువాడు
84. దినచర్య – ఏ తత్పురుష సమాసం? (బి)
ఎ) షష్ఠీ
బి) సప్తమీ
సి) పంచమీ
డి) చతుర్థీ
జవాబు:
బి) సప్తమీ
85. దసరా పద్యాలు – విగ్రహవాక్యం గుర్తించండి. (డి)
ఎ) దసరా వలన పద్యాలు
బి) దసరా యొక్క పద్యాలు
సి) దసరా చేత పద్యాలు
డి) దసరా కొలుకు పద్యాలు
జవాబు:
డి) దసరా కొలుకు పద్యాలు
ఛందస్సు కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
86. మనోజ్ఞం – గణం గుర్తించండి. (బి)
ఎ) భ గణం
బి) య గణం
సి) ర గణం
డి) త గణం
జవాబు:
బి) య గణం
87. బలపం గణం గుర్తించండి. (ఎ)
ఎ) స గణం
బి) జ గణం
సి) ర గణం
డి) య గణం
జవాబు:
ఎ) స గణం
88. మధ్యలో మాత్రమే గురువు కలది ఏ గణం? (డి)
ఎ) మ గణం
బి) ర గణం
సి) త గణం
డి) జ గణం
జవాబు:
డి) జ గణం
89. రాజ్యం – ఏ గణం గుర్తించండి. (ఎ)
ఎ) గగ
బి) లల
సి) గల
డి) లగ
జవాబు:
ఎ) గగ
90. కలుపు ఏ గణం గుర్తించండి? (సి)
ఎ) మ గణం
బి) జ గణం
సి) న గణం
డి) ర గణం
జవాబు:
సి) న గణం
వాక్య రకాలు : కింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
91. మీరు ఆదుకోవచ్చు – వాక్యపు రకం గుర్తించండి. (ఎ)
ఎ) అనుమత్యర్థకం
బి) అప్యర్థకం
సి) ఆశీరర్థకం
డి) విధ్యర్ధకం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం
92. అన్నం తిని చదువుకొన్నాను – వాక్యపు రకం గుర్తించండి. (బి)
ఎ) సంయుక్తం
బి) సంశ్లిష్టం
సి) విధ్యర్థకం
డి) ఆశీరర్ధకం
జవాబు:
బి) సంశ్లిష్టం
93. దయచేసి ఖాళీ చేయండి – వాక్యపు రకం గుర్తించండి. (బి)
ఎ) అప్యర్థకం
బి) ప్రార్థనార్థకం
సి) అనుమత్యర్థకం
ఎ) ఆశ్చర్యార్థకం
జవాబు:
బి) ప్రార్థనార్థకం
94. అబ్బ! నీ రాత ఎంత బాగుందో! – వాక్యపు రకం గుర్తించండి. (ఎ)
ఎ) ఆశ్చర్యార్థకం
బి) విధ్యర్థకం
సి) ప్రార్ధనార్థకం
డి) ప్రశ్నార్థకం
జవాబు:
ఎ) ఆశ్చర్యార్థకం
95. ఆ పని చేయవద్దు – వాక్యపు రకం గుర్తించండి. (సి)
ఎ) విధ్యర్థకం
బి) సంశ్లిష్టం
సి) నిషేధార్థకం
డి) సంయుక్తం
జవాబు:
సి) నిషేధార్థకం
Previous Bits
1. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. గీత గీసిన పదానికి వికృతి పదం (FA-4:2022-23) (సి)
ఎ) సురయుడు
బి) సీరదు
సి) సూరీడు
డి) మిత్రుడు
జవాబు:
సి) సూరీడు
2. ‘సూర్యోదయం’ పదం విడదీసిన రూపం గుర్తించండి. (FA-4:2022-23) (ఎ)
ఎ) సూర్య + ఉదయం
బి) సుర + ఉదయం
సి) సూర్యో + దయం
డి) సూర్యు + దయం
జవాబు:
ఎ) సూర్య + ఉదయం
3. రెండు దిక్కులు ఏ సమాసం గుర్తించండి. (FA-4:2022-23) (బి)
ఎ) ద్వంద్వ సమాసం
బి) ద్విగు సమాసం
సి) బహువ్రీహి సమాసం
డి) ద్వితీయా తత్పురుష సమాసం
జవాబు:
బి) ద్విగు సమాసం
4. కింది వాక్యాలలో ఉత్తమపురుష వాక్యాన్ని గుర్తించండి. (SA-2: CBA-2:2023-24) (బి)
ఎ) వాల్మీకి రామాయణం రచించాడు.
బి) నేను ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తాను.
సి) ఆ గ్రామంలో రామప్ప పెద్ద రైతు.
డి) మీరు ఈ పని పూర్తిచేయండి.
జవాబు:
బి) నేను ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తాను.
5. నేడు ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్ళుట సర్వ సాధారణ విషయం. గీతగీసిన పదానికి విగ్రహవాక్యమును గుర్తించండి. (SA-2:2023-24) (బి)
ఎ) ఉన్నతి కోసము విద్య
బి) ఉన్నతమైన విద్య
సి) ఉన్నతి యొక్క విద్య
డి) ఉన్నతికి విద్య
జవాబు:
బి) ఉన్నతమైన విద్య
6. శరత్ పాఠం చదువుతూ నిద్రపోయాడు. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (SA-2-2023-24) (డి)
ఎ) కార్లకం
బి) అప్యర్థకం
సి) చేదర్థకం
డి) శత్రర్థకం
జవాబు:
డి) శత్రర్థకం