AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

These AP 8th Class Social Important Questions 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 6th Lesson Important Questions and Answers ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 1.
ఈ క్రింది పేరాను చదివి, దిగువనిచ్చిన ఖాళీలను పూరించుము.

కొన్ని ముఖ్యమైన ఖనిజాలు, వాటి వినియోగాలు

ఇనుప ఖనిజం, ఇసుక, ముడిచమురు, సున్నపురాయి, బొగ్గు మొదలైన ఖనిజాల ఉపయోగాలు మీకు తెలిసే ఉంటుంది. ఆధునిక పరిశ్రమలలో అనేక రకాల ఖనిజాలను ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ ఖనిజాలు మన జీవితాల్లో చాలా ముఖ్యభాగం అయ్యాయి. కొన్ని ముఖ్యమైన ఖనిజాల ఉపయోగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మీరు | గ్రంథాలయం, లేదా ఇంటర్నెట్ లో చూసి వీటి గురించి మరింత సమాచారం సేకరించవచ్చు.

ఇనుప ధాతువు (మడి ఇనుము) :
హెమటైట్ మరియు మాగ్నటైట్ ఇనుపధాతు నిల్వలు మన రాష్ట్రంలో లభిస్తున్నాయి. వీటిని ముఖ్యంగా ఉక్కు, ఫెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. దీనిని ముఖ్యంగా జపాను ఎగుమతి చేస్తున్నారు.

మైకా (అభ్రకం) :
ఇది మెరిసే ఖనిజం. విద్యుత్తు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. దీనికి ఉపయోగపడే అనేక గుణాలు ఉన్నాయి. ఇది సన్నటి పొరలలో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకం.

సున్నపురాయి :
‘సిమెంట్, కార్బెడ్, ఇనుము ఉక్కు, సోడాయాష్ (బట్టల సోడ), రసాయనాలు, కాగితం, ఎరువులు గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

గ్రానైట్ :
దీనిని కోత (కటింగ్) మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకరణకు, స్మారక కట్టడాలలో, నేలను నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తారు.

మాంగనీస్ :
దీనిని పొటాషియం ఫర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాలలోనూ, ఇనుము – ఉక్కు, బాటరీలు, రసాయనాలు, పింగాణి (సిరామిక్), గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

బెరైటిస్ :
ఇది కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికితీస్తారు. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియంని ఉపయోగిస్తారు. ముడి చమురు, సహజవాయువుల కోసం చాలా లోతుగా తవ్వటానికి కూడా బెరైటిస్ ని ఉపయోగిస్తారు.

ఫెల్డ్ స్పార్ :
గాజు, సెరామిక్ వస్తువులు (వాష్ బేసిన్ వంటి) తయారు చేయటానికి ఇది ముడి సరుకుగా ఉపయోగపడుతుంది.

ఖాళీలను పూరింపుము :

1. ముడి ఇనుమును ముఖ్యంగా జపాన్‌కు ఎగుమతి చేస్తున్నారు.
2. మైకా మెరిసే ఖనిజం.
3. బట్టలసోడా పరిశ్రమలో సున్నపురాయిను ఉపయోగిస్తారు.
4. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియం ని ఉపయోగిస్తారు.
5. వాష్ బేసిన్లకు ఒక ముడి సరుకు ఫెల్ట్ స్పార్ .

ప్రశ్న 2.
ఈ క్రింది సమాచారమును చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.
2009 జూన్ 29న ప్రచురితమైన ఈ వార్తను చదవండి.

సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గుగనుల వల్ల తలెత్తిన సమస్యలు

మా ప్రతినిధి :
వరంగల్, జూన్ 28 : బొగ్గుకి ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ కాస్ట్ గని తవ్వకం చేపట్టాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 200 గ్రామాలు ప్రభావితం కావచ్చు. 20,000 మంది నిరాశ్రయులు కావచ్చు. ఈ గనుల వల్ల 3000 హెక్టార్ల అడవులు కూడా ప్రభావితం అవుతాయని అంచనా.

“భూగర్భ గనుల ద్వారా రోజుకి 1500 టన్నుల బొగ్గు తవ్వగలిగితే, ఓపెన్ కాస్ట్ ద్వారా రోజుకి పదివేల టన్నుల బొగ్గు తియ్యవచ్చు. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది,” SCCLలో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇది ఇలా ఉండగా, ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకం వల్ల వేలాది కుటుంబాలు నిర్వాసితులవుతాయి, పదుల సంఖ్యలో గ్రామాలు దెబ్బతింటాయి, స్థానికుల జీవనోపాధులు దెబ్బతింటాయి. కంపెనీ అధికారి ప్రకారం అడవులు నరికివేసినంత విసీరంలో కొత్తగా అడవులను వృద్ధి చేస్తారు. దానికి అయ్యే ఖర్చును భరిస్తారు. ఒక హెక్టారుకు 4.38 నుంచి 10.43 లక్షల రూపాయలు ఇందుకు చెల్లిస్తారని ఆ అధికారి చెప్పాడు. ఈ గనుల వల్ల తవ్విన మట్టి, రాళ్లు గుట్టలుగా ఏర్పడి వాగులు, నదుల ప్రవాహానికి ఆటంకం కల్పిస్తున్నాయని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, తాగునీటికి కూడా కొరత ఏర్పడుతోందని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

ప్రశ్నలు – జవాబులు :
1. ఈ వార్త ఎప్పుడు ప్రచురితమైంది?
జవాబు:
2009 జూన్ 29న ప్రచురితమైనది.

2. ఎస్సిసిఎల్ అంటే ఏమిటి?
జవాబు:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.

3. ఈ నిర్ణయం వల్ల ఏమి జరుగవచ్చు?
జవాబు:
ఈ నిర్ణయం వల్ల 200 గ్రామాలు ప్రభావితం కావచ్చు, 20,000 మంది నిరాశ్రయులు కావచ్చు. ఈ గనుల వల్ల 3000 హెక్టార్ల అడవులు కూడా ప్రభావితం అవుతాయని అంచనా.

4. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ – ఈ రెంటిలో ఏది కంపెనీకి లాభదాయకం?
జవాబు:
ఓపెన్కాస్ట్.

5. స్థానిక ప్రజలు ఏమని ఫిర్యాదు చేస్తున్నారు?
జవాబు:
ఈ గనుల వల్ల తవ్విన మట్టి, రాళ్లు గుట్టలుగా ఏర్పడి వాగులు, నదుల ప్రవాహానికి ఆటంకం కల్పిస్తున్నాయని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, తాగునీటికి కూడా కొరత ఏర్పడుతోందని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 3.
ఈ కింది పేరాను చదివి, దిగువ నిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తార బొగ్గు గనులు ఉన్నాయి. ఈ బొగ్గును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వెలికి తీస్తుంది. దీనిని మొదట 1886లో ఒక ప్రైవేటు బ్రిటిషు కంపెనీ నెలకొల్పింది. 1920లో దీనిని హైదరాబాదు నిజాం కొన్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసింది. ప్రస్తుతం ఎస్ సిసిఎల్ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీ. తెలంగాణాలో పైన పేర్కొన్న నాలుగు జిల్లాలలో ఈ కంపెనీ ప్రస్తుతం 15 ఓపెన్ కాస్ట్ గనులలో, 35 భూగర్భ గనులలో త్వకాలు చేపడుతోంది. ఈ కంపెనీలో 65,000 ఉద్యోగులు ఉన్నారు (2012).
ప్రశ్నలు – జవాబులు :
1) స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో గనులు ఎవరి అధీనంలో ఉండేవి?
జవాబు:
ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తుల చేతుల్లో

2) బొగ్గు గనులు ఏ ఏ జిల్లాలలో అధికం?
జవాబు:
ఖమ్మం , కరీంనగర్, అదిలాబాద్, వరంగల్

3) సింగరేణి కాలరీస్లో మొత్తం ఉద్యోగులు ఎందరు?
జవాబు:
65,000 మంది (2012 నాటికి)

ప్రశ్న 4.
గనుల తవ్వకంలో ప్రభుత్వ నియంత్రణలలో వేటితో మీరు ఏకీభవిస్తారు? ఎందుకు?
జవాబు:
గనులు కౌలుకిచ్చే విధానం కాకుండా ప్రభుత్వమే ఆధునిక, సంక్లిష్ట సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశ పెట్టి ఖనిజాలు వెలికి తీస్తే బాగుండేది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే భద్రతా చర్యలు ప్రైవేటు వారు తీసుకోకపోవచ్చు. వారి లాభాపేక్ష భావితరాలకు శూన్యాన్ని అందించవచ్చు. ప్రభుత్వానికి చేరవల్సిన రాయల్లీ పూర్తిగా చేరకపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా నిల్వలు అయిపోయిన గనులను పూర్తిగా మూసివేసే చర్యలు, ఖర్చులు ఎక్కువ అవుతుందని మూయకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ నియంత్రణనే నేను సమర్థిస్తాను.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులను ప్రశంసించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఖనిజ వనరులు :
మన రాష్ట్రంలో ఖనిజ వనరులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. భవన నిర్మాణంలో ఉపయోగించే అనేక రంగుల గ్రానైటురాయి, కడప రాయిని పెద్ద మొత్తంలో మన రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. సిమెంటు పరిశ్రమలో ఉపయోగించే సున్నపురాయి, డోలమైట్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ఉత్తర జిల్లాలలో (గోదావరి లోయలో కొత్త గూడెంలో) పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయి. కృష్ణా – గోదావరి బేసిన్లో ఖనిజనూనె, వాయువుల నిక్షేపం ఉంది. ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా వజ్రపు గనులకు ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాలు ఇక్కడే దొరికాయి. ఇవే కాకుండా ఆస్బెస్టాస్, బెరైటీస్, మైకా, ఫెల్డ్ స్పార్ వంటి ఖనిజాల విస్తార నిక్షేపాలు ఉన్నాయి.

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 6.
ఖనిజాల వెలికితీతలోని సున్నితమైన అంశాలు ఏవి?
జవాబు:
గనుల తవ్వకంలోని అనేక పద్ధతుల వల్ల ఉపరితల ప్రదేశం దెబ్బతింటుంది – అంటే అడవులను నరికి వేయటం కావచ్చు. నివాసప్రాంతాలు, వ్యవసాయ భూములుగా మార్చటం కావచ్చు లేదా పెద్ద గోతులు కావచ్చు. ఖనిజాలను కడగటానికి గనుల వద్ద పెద్ద మొత్తంలో నీళ్లు కావాలి. దీని కారణంగా దగ్గరలోని నదులు, నీటి వనరులు కలుషితం అవుతాయి. దీని వల్ల భూమిని మునుపటి ప్రయోజనాల కోసం వాడటం సాధ్యంకాదు, అక్కడ నివసించే గిరిజనులు, రైతులు ఆ భూమిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. గనుల తవ్వకం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు కూడా సమస్యలు ఎదుర్కొంటారు. అదే సమయంలో గనులు చాలా మందికి ఉద్యోగం కల్పిస్తాయి. వీళ్లకోసం చుట్టుపక్కల కొత్తగా కాలనీలు నిర్మిస్తారు. గనుల ద్వారా భారతదేశంలో సుమారు పది లక్షలమందికి, తెలంగాణలో లక్షకు పైగా మందికి ఉపాధి దొరుకుతోంది. గని కార్మికుల జీవితాలు చాలా ‘ప్రమాదకరంగా ఉంటాయి – వాళ్లు నిరంతరం ప్రమాదాల ముప్పును ఎదుర్కొంటారు, విషపూరిత వాయువులను పీల్చటం వల్ల దీర్ఘకాలంలో వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ప్రశ్న 7.
ప్రజలందరూ ఖనిజ వనరుల అసలైన యజమానులు అయితే వాళ్ళందరి మేలు కోసం వీటిని ఉపయోగించుకోవడం ఎలా?
జవాబు:
వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని రవాణా సౌకర్యాల అభివృద్ధికి, ప్రజారోగ్య వసతులకు, విద్యకు, ఇతర సబ్సిడీలకు ఉపయోగించాలి. అపుడు ప్రజలందరి మేలు కోసం ఉపయోగించినట్లవుతుంది.

ప్రశ్న 8.
బెరైటీస్ నాణ్యత గురించి రాయండి.
జవాబు:
పై పొరలలో దొరికే బెరైటీస్ నాణ్యత తక్కువగానూ, లోపలి పొరల్లో దొరికే దాని నాణ్యత ఎక్కువగాను ఉంటుంది. బెరైటీస్ రాయి పరిమాణాన్ని బట్టి దాని నాణ్యతను నిర్ణయిస్తారు.

ప్రశ్న 9.
వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
పర్యావరణవేత్తలు వనరులను రెండు రకాలుగా విభజిస్తారు. పునరుద్ధరింపబడేవి, పునరుద్ధరించడానికి వీలులేక అంతరించిపోయేవి.

పునరుద్ధరింపబడేవి :
మళ్ళీ మళ్ళీ పొందగలిగినది.
ఉదా : కలప, సూర్యరశ్మి.

అంతరించిపోయేవి లేదా పునరుద్ధరించడానికి వీలులేనివి :
తిరిగి తయారు చేయలేని వనరులు.
ఉదా : బొగ్గు, బంగారం.

ప్రశ్న 10.
S.C.C.L ఓపెన్‌కాస్ట్ మైనులపట్ల ఎందుకు ఆసక్తి చూపుతోంది?
జవాబు:
భూగర్భగనులు తవ్వడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే ఓపెన్ కాస్టు తక్కువ ఖర్చు అవుతుంది. బొగ్గును కూడా యంత్రాల ద్వారా ఎక్కువ వెలికి తీయవచ్చు. ఇందువలన S.C.C.L ఓపెన్‌కాస్ట్ మైనుల పట్ల ఆసక్తి చూపుతోంది.

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 11.
గనుల తవ్వకం మొదలుపెట్టిన చోట ఉన్న ప్రజలకు పునరావాసం ఎందుకు కల్పించాలి?
జవాబు:
ఆ ప్రజలు మొదటి నుండి ఆ ప్రాంతానికి చెందినవారు. ఆ భూములు వారికి చెంది ఉంటాయి. వారి నుంచి ఆ భూమిని సేకరిస్తున్నపుడు వారికి వేరే చోట భూమిని ఇచ్చి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న 12.
అణు ఇంధనాలకు సంబంధించిన గనుల త్రవ్వకం మొత్తం ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఎందుకు?
జవాబు:
అణు ఇంధనాలు చాలా విలువైనవి, అతి తక్కువ నిల్వలున్నవి. అంతేకాక వాటి ఉపయోగాల దృష్ట్యా అవి చాలా కీలకమైనవి.

ప్రశ్న 13.
1. కింది పటాన్ని చదివి, దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP Board 8th Class Social Solutions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 3
ఎ) ఖనిజ వనరులు లేని రెండు జిల్లాలను పేర్కొనండి.
జవాబు:
ఖనిజ వనరులు లేని రెండు జిల్లాలు,

  1. విశాఖపట్టణం
  2. తూర్పు గోదావరి

బి) ఖనిజ వనరులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పై మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
మన రాష్ట్రంలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి.

ప్రశ్న 14.
దేశంలోని ఖనిజాల తవ్వకం ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం మంచిదా? కాదా? మీ వైఖరిని వివరించండి.
జవాబు:
లాభాలు :
గనుల తవ్వకం మీద ప్రభుత్వానికి నియంత్రణాధికారం ఉంటూనే, కొంత ఆదాయం సమకూరుతోంది. అదే సమయంలో పెట్టుబడులు పెట్టి కొత్త సాంకేతిక విజ్ఞానం తీసుకుని రావడానికి ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ విధానం ఫలితంగా గత 20 సం||రాలలో గనుల తవ్వకం ఊపందుకుంది. గనుల సంఖ్య, తవ్వి తీసే ఖనిజాలు, ఉపాధి ఈ రంగంలో పెరిగాయి.

నష్టాలు :
ప్రభుత్వ అనుమతిని లెక్క చేయకుండా ప్రయివేటు కంపెనీలు అడ్డూ అదుపు లేకుండా గనులను తవ్వేస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో గనుల తవ్వకం వల్ల దీర్ఘకాల సుస్థిరతకు భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ప్రైవేటు కంపెనీలు ఖనిజాలను తరలించి వేస్తున్నాయి. నిజంగా అవి చెందాల్సిన ‘ప్రజలకు చెందటం లేదు’.

AP 8th Class Social Important Questions Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

ప్రశ్న 15.
పర్యావరణం భద్రతా అంశాలను పట్టించుకోకుండా, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకంటే ఎంతో ఎక్కువ మొత్తంలో ప్రైవేటు కంపెనీలు అడ్డూ, అదుపు లేకుండా గనులను తవ్వేస్తున్నాయి. ఇది పర్యావరణానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా హానిచేస్తుందో వ్యాఖ్యానించండి.
జవాబు:
గనుల త్రవ్వకంవలన జరిగే అనర్థాలు

  1. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. తాగునీటి కొరత ఏర్పడింది.
  2. గనుల వలన త్రవ్విన మట్టి, రాళ్ళు గుట్టలుగా ఏర్పడి, వాగులు, నదులు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి.
  3. పదుల సంఖ్యలో గ్రామాలు దెబ్బ తింటాయి. ప్రజల జీవనోపాదులు దెబ్బ తింటాయి.
  4. భూసారం మొత్తం కొట్టుకుపోతుంది. అటవీ విస్తీర్ణం తగ్గి వర్షాలు కూడా పడవు.

Leave a Comment